పుతిన్‌కు ట్రంప్‌ ఫోన్‌.. ఉక్రెయిన్‌ వార్‌పై కీలక నిర్ణయం? | Trump and Putin Hold Crucial 90-Minute Phone Call on Ukraine War | Sakshi
Sakshi News home page

పుతిన్‌కు ట్రంప్‌ ఫోన్‌.. ఉక్రెయిన్‌ వార్‌పై కీలక నిర్ణయం?

Jul 5 2026 8:40 AM | Updated on Jul 5 2026 8:40 AM

Trump and Putin Hold Crucial 90-Minute Phone Call on Ukraine War

వాషింగ్టన్/మాస్కో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య శనివారం రాత్రి దాదాపు 90 నిమిషాల పాటు సుదీర్ఘ టెలిఫోన్ సంభాషణ జరిగింది. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు ఉద్దేశించిన ఈ చర్చలు అత్యంత స్పష్టంగా, సూటిగా సాగాయని క్రెమ్లిన్ వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే జరగనున్న ‘నాటో’ సదస్సుకు ముందే ట్రంప్ ఈ కీలక అడుగు వేయడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పుతిన్‌తో మాట్లాడటానికి ముందే ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడు  జెలెన్స్కీతోనూ సంప్రదింపులు జరిపారు.

ఉక్రెయిన్ సంక్షోభానికి త్వరితగతిన ఒక శాశ్వత పరిష్కారాన్ని కనుగొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఈ విషయంలో అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని రష్యా అధినేతకు ట్రంప్ ప్రతిపాదించినట్లు క్రెమ్లిన్ సహాయకుడు యూరి ఉషాకోవ్ ఆదివారం ఉదయం ప్రకటించారు. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ముందడుగు పడటంతో, గత కొన్నేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి త్వరలోనే తెరపడనుందనే ఆశలు చిగురిస్తున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో నాటో కూటమి దేశాలు కూడా ఈ చర్చలపై తీవ్రంగా దృష్టి సారించాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement