temple
-
Malladi Vishnu: రకరకాల వేశాలు వేయడం కాదు ఆలయాలు కూల్చి వేస్తుంటే ఏంచేస్తున్నావ్
-
దేవాలయాల్లో రావి, వేపచెట్టు ఎందుకు ఉంటాయి!
మన సంప్రదాయాలలో ప్రతి ఒకటి అద్భుతమే,ప్రతి ఒక్కటీ జీవనవిధానానికి సంబంధించినవే. అందుకే చాలా ఆలయాలలో రావిచెట్టు, వేపచెట్టు ఉంటాయి, ఎక్కువ చోట్ల రావి, వేప చెట్లు కలిపి ఉంటాయి. రావిచెట్టును విష్ణు స్వరూపంగానూ, వేపచెట్టును లక్ష్మీస్వరూపంగానూ భావించి పెళ్లిళ్లు చేయిస్తుంటారు. అలా పెళ్లి చేసిన జమిలి వృక్షానికి భక్తితో ప్రదక్షిణలు చేస్తుంటారు. ఇలా జంట వృక్షాలను పూజిస్తే దాంపత్య దోషాలు తొలగి సంసారం సజావుగా సాగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాదు, ఆ రెండు వృక్షాల మీదినుంచి వచ్చే గాలికి శారీరక, మానసిక రుగ్మతలను పారద్రోలే శక్తి ఉందని ఆధునిక పరిశోధనలు సైతం నిరూపిస్తున్నాయి. జోతిష శాస్త్రం ప్రకారం శనిదోషం పోవాలంటే ప్రతిరోజు రావిచెట్టు నీడన నిలబడటం, రావిచెట్టుకి నమస్కారం చెయ్యడం, రావిచెట్టుకు ప్రదక్షిణ చేయడం, శనివారం నాడు మాత్రం రావిచెట్టుని హత్తుకోవడం మంచిదని, ఈ విధంగా కొన్ని రోజులు చేస్తే శనిదోషం తొలుగుతుందట. రావిచెట్టు (Peepal Tree) నీడన కొంచం సేపు కూర్చుంటే రక్తపోటు సక్రమ రీతిలో ఉంటుందని, రావిచెట్టు గాలి మంచి ఆలోచనలు కలిగిస్తుందనీ చెబుతారు వైద్యులు. అదేవిధంగా వేపచెట్టుకు కూడా ఎన్నో ఔషధ గుణాలున్నాయి. వేప చెట్టు (Neem Tree) గాలికి అన్నో రోగాలను కలిగించే క్రిములు చచ్చిపోతాయి, అమ్మవార్లకు వేపాకు బాగా ఇష్టం. అందుకే జాతర్ల సమయంలో వేపాకు ఎక్కువగా వాడతారు. చదవండి: బౌద్ద వాణి.. మీకూ, నాకూ అదే తేడా ! -
Amritsar: ఆలయంపై గ్రనేడ్ విసిరిన వ్యక్తి ఎన్కౌంటర్
అమృత్సర్: పంజాబ్‌లోని అమృత్సర్(Amritsar) జిల్లాలో ఠాకుర్ద్వారా ఆలయంపై గ్రనేడ్‌తో దాడి చేసిన ఇద్దరు యువకులలో ఒకరిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. పంజాబ్ పోలీసులకు నిందితుల స్థావరానికి సంబంధించిన సమాచారం అందగానే వారు రంగంలోకి దిగారు. ఘటన జరిగిన 24 గంటల్లో ఒక నిందితుడిని ఎన్కౌంటర్లో హతమార్చారు.Acting on specific intelligence, Commissionerate Police Amritsar decisively tracked down those responsible for the attack on Thakur Dwara Mandir, #Amritsar, on March 15, 2025. An FIR has been registered at PS Chheharta under the Explosive Substances Act, and intelligence-based…— DGP Punjab Police (@DGPPunjabPolice) March 17, 2025ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వివరాలను డీజీపీ గౌరవ్ యాదవ్ మీడియాకు తెలియజేశారు. నిఘా వర్గాల(Intelligence agencies) నుంచి అందిన సమాచారం మేరకు అమృత్సర్ పోలీసులు ఘటన జరిగిన అనంతరం నిందితులను ట్రాక్ చేస్తూ వచ్చారన్నారు. ఈ నేపధ్యంలోనే వారిని గుర్తించగలిగారని, వారు రాజాసాంసీలో ప్రాంతంలో ఉన్నారని తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారని, వారిని చూడగానే నిందితులు తుపాకీతో కాల్పులు జరిపారన్నారు. ఈ ఘటనలో హెడ్ కానిస్టేబుల్ గురుప్రీత్ సింగ్‌కు గాయాలయ్యారన్నారు. ఆత్మరణక్షణకు పోలీసులు(Police) ఎదురు కాల్పులు జరిపారని ఈ నేపధ్యంలో ఒక నిందితునికి గాయాలయ్యాయని, అతనిని ఆస్పత్రికి తరలించామని, అక్కడ అతను మృతిచెందాడని గౌరవ్ యాదవ్ తెలిపారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడన్నారు. అతనిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారన్నారు.ఇది కూడా చదవండి: రాజధానిలో మహిళల రక్షణకు యాంటీ ఈవ్ టీజింగ్ స్క్వాడ్ -
ప్రముఖ ఆలయంలో స్టార్ హీరోయిన్ పూజలు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఆధ్యాత్మిక బాట పట్టారు. కర్ణాటకలోని ప్రముఖ కుక్కే శ్రీ సుబ్రమణ్య ఆలయాన్ని సందర్శించారు. ఇటీవలే కుంభమేళాలోనూ కత్రినా కైఫ్ పుణ్యస్నానమాచరించారు. తాజాగా శ్రీ సుబ్రమణ్య ప్రత్యేకమైన పూజులు చేశారు. అనంతరం అక్కడే నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్‌ను పెళ్లాడిన కత్రినా కైఫ్ స్టార్ హీరోయిన్గా పలు సినిమాల్లో నటించింది. హీరో విక్కీ కౌశల్ ప్రేమాయణం నడిపిన ముద్దుగుమ్మ 2021లో అతన్ని పెళ్లాడింది. తెలుగులో వెంకటేశ్ సరసన మల్లీశ్వరి చిత్రంలో మెరిసింది. 2023లో మేరీ క్రిస్మస్, టైగర్-3 చిత్రాలతో అభిమానులను మెప్పించిన ముద్దుగుమ్మ ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్‌లో నటించడం లేదు. ప్రస్తుతం ఆమె భర్త విక్కీ కౌశల్ నటించిన ఛావా మూవీ థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఛావాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇటీవలే తెలుగులోనూ థియేటర్లలో విడుదల చేశారు. ఇప్పటికీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సృష్టిస్తోంది.కాగా... కత్రినా కైఫ్ ఇటీవల ఐఫా అవార్డ్స్- 2025 వేడుకలో మెరిసింది. జైపూర్‌లో జరిగిన ఈ వేడుకల్లో పలువురు సినీ అగ్రతారలు పాల్గొని సందడి చేశారు. ఈ అవార్డ్స్‌లో కిరణ్ రావు తెరకెక్కించిన లపతా లేడీస్ అత్యధిక అవార్డులు సొంతం చేసుకుంది. ఈ వేడుకల్లో బాలీవుడ్ సినీతారలు షారూఖ్ ఖాన్, రవీనా టాండన్, ఆమె కుమార్తె రాషా తడాని, అభిషేక్ బెనర్జీ వంటి ప్రముఖులు కూడా పాల్గొన్నారు. -
ముఖవాలో గంగా మాత ఆలయాన్ని సందర్శించిన ప్రధాని
-
‘లివింగ్ టెంపుల్’ ఆర్ట్ షో ప్రారంభం, ముఖ్య అతిథిగా స్మితా సబర్వాల్
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘లివింగ్ టెంపుల్’ హైదరాబాద్‌లోని రాయదుర్గంలోని టి-వర్క్స్‌లో ప్రారంభమైంది. భారతదేశ ఆలయ కళ, సంస్కృతి మరియు వారసత్వాన్ని చాటుకునే ఈ ప్రదర్శనలో టెంపుల్ ఆర్ట్ స్ఫూర్తితో 30 మంది కళాకారులు వారి వారి కళారూపాలను ప్రదర్శిస్తారు. ‘లివింగ్ టెంపుల్’ పేరుతో నిర్వహిస్తున్న మూడు రోజుల పాలు జరిగే ఈ వేడుకకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (పర్యాటక, సంస్కృతి, వారసత్వం మరియు యువజన వ్యవహారాల శాఖ, తెలంగాణ) స్మితా సబర్వాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ , ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త, భారత పురావస్తు సర్వే శాఖ కెకె ముహమ్మద్ తదితరులు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా స్మితా సబర్వాల్ మాట్లాడుతూ, “ఇది యువకులు, అనుభవజ్ఞులైన కళాకారులతో జమిలిగా కలిసి వచ్చే క్యాలెండర్ కార్యక్రమంగా ఉండాలని పిలుపునిచ్చారు. దీనికి తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త కెకె ముహమ్మద్ మాట్లాడుతూ, “వివిధ రకాల వారసత్వ పర్యటనలు ఉన్నాయి కానీ,అవి ప్రజలను ఆకట్టుకునేలా వినూత్నంగా ఉండాలన్నారు. సందర్శకులకు ఈ ప్రదర్శనను ఆదరించడం ద్వారా సింగపూర్, చైనాలో లాగా ఈ స్మారక చిహ్నాలను జీవన వారసత్వంగా మార్చాలని అభిలషించారు.మన వారసత్వాన్ని, ప్రకృతిని కాపాడుకోవడం ముఖ్యమని పేర్కొన్నారు ప్రముఖ ఆర్టిస్ట్, కళా దర్శకుడు తోట తరణి తన సెట్‌ను తీసివేసినపుడు, ఈ ప్రదేశంలో ఎలాంటి శిథిలాలు లేకుండా జాగ్రత్త పడతానని వివరించారు.తెలంగాణ టూరిజం మద్దతుతో అన్నపూర్ణ మడిపడిగ క్యూరేట్ చేస్తున్న ‘లివింగ్ టెంపుల్’ దేశవ్యాప్తంగా ఉన్న 30 మందికి పైగా ప్రఖ్యాత కళాకారులు భారతీయ దేవాలయాల గొప్ప వారసత్వాన్ని ప్రదర్శిస్తారు. 100 కి పైగా అద్భుతమైన కళాకృతులతో,సాంప్రదాయ ఆలయ కళ, సమకాలీన కళాత్మక వ్యక్తీకరణల అందమైన కలయికగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అద్భుతమైన కళాఖండాల సేకరణతో పాటు - ఆర్ట్ - హెరిటేజ్ టూరిజం - ది మిస్సింగ్ లింక్ , ప్యానెల్ చర్చ, సాంస్కృతిక ప్రదర్శన ఆకట్టుకుంది. తోట తరణి, అమర్ రమేష్, ద్రధా, చరణ్ జీత్, పర్ణవి బంగర్, రాయన్న గిరిధర్ గౌడ్, సంగం వంఖడే, వినోద్ దరోజ్ లాంటి అనేక ప్రఖ్యాత కళాకారుల బృందం అద్భుతమై ప్రదర్శనివ్వబోతోంది. ఈ కార్యక్రమం పురావస్తు శాస్త్రవేత్త కెకె మొహమ్మద్, ఫోటోగ్రాఫర్ అమర్ రమేష్ , కళాకారుడు ద్రధా వ్రత వంటి నిపుణుల సహకారం తో ‘లివింగ్ టెంపుల్’ భారతీయ ఆలయ సంస్కృతి యొక్క సజీవ వారసత్వానికి ఒక వేడుక, ఒక మరపురాని అనుభవాన్ని మిగల్చినుంది అనడంలో సందేహంలేదు.ఫిబ్రవరి 28 2025 మార్చి 2 వరకు సందర్శకులకు ఆహ్వానంప్రదర్శన: ఉదయం 11:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకువేదిక : టి-వర్క్స్, శిల్ప్ గ్రామ్ క్రాఫ్ట్ విలేజ్, రాయ్ దుర్గ్, హైదరాబాద్, తెలంగాణ 500081.మరిన్ని వివరాల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెం.అన్నపూర్ణ మడిపడిగ- 9052594901 -
కొండరాళ్లలో దొరికిన అమ్మ...కొండంత అమ్మ!
కొలిచిన భక్తులకు కొంగుబంగారంగా శ్రీ కొండలమ్మ తల్లి భక్తుల నమ్మకాన్ని చూరగొంటున్నారు. తల్లి చెంతకు వచ్చి తమ కోర్కెలు కోరినంతనే ఆ కోర్కెలను తీర్చే కల్పతరువుగా ప్రసిద్ధి గాంచారు ఈ అమ్మవారు. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం కొండలమ్మ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి గాంచారు. కొండరాళ్లలో దొరకటం వలన ఆ తల్లిని కొండలమ్మ అనే పేరుతో భక్తులు పిలుస్తున్నారు.వ్యాపారం, ఉద్యోగం, సంతానం, వివాహం, రాజకీయ పదవులు, పారిశ్రామికం, సినిమా అవకాశాలు ఒకటేమిటి? ఏ రంగానికి చెందిన వారైనా భక్తితో నమ్మి అమ్మ వద్ద తలచుకుంటే చాలు వారికి వరాల జల్లు కురిపిస్తుంది కొండలమ్మ తల్లి. బిడ్డ పుట్టినా, పెళ్లి జరిగినా పిల్లాపాపలు, నూతన వధూవరులు తమ కోర్కెలు తీరాక తల్లి సన్నిధిలోనే తమతమ మొక్కుబడులను చెల్లించుకోవటం పరిపాటిగా వస్తోంది. భక్తితో కొలవటంతో తృప్తి చెందక తమ ఇంటిలో ఆ తల్లి పేరును అనుకున్నదే తడవుగా స్తుతించాలనే దృక్పథంతో కొండలమ్మను ఆ భక్తులు తలచుకుంటున్నారు. ఆ ఊరిలోనే కాదు చుట్టుపక్కల జిల్లాల్లో కూడా కొండా, కొండలమ్మ, కొండయ్య, కొండబాబు వంటి పేర్లతో ఆ దేవత పేరును తమ కడుపున పుట్టిన బిడ్డలకు పెట్టుకుంటున్నారు. ఆ తల్లి చల్లని సన్నిధిలో వివాహాలు, అన్నప్రాశన, ఊయలలో వేయటం వంటి శుభ కార్యక్రమాలను భక్తులు జరుపుకుని దీవెనలను ΄పొందుతున్నారు మహిమలతో తల్లి కీర్తి చాలా తక్కువ కాలంలోనే దశదిశలకు వ్యాపించింది. అమ్మవారి ఆలయానికి ప్రతి ఆదివారం కృష్ణాజిల్లా నుంచే గాక ఇరు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి మొక్కుబడులు చెల్లిస్తున్నారు. ఆది, గురువారాల్లో 25వేల మంది భక్తులు తల్లిని దర్శించుకుంటున్నారు. అమ్మవారు కొలువైన ప్రాంతం మచిలీపట్నం–నూజివీడు–కత్తిపాడు ప్రధాన రహదారి కావటంతో ఎవరు రోడ్డు వెంబడి వెళ్లినా ఆమె దర్శనం కొరకు నిలుస్తున్నారు. వాహనాల్లోనే గాక నడిచి వెళ్లినా రాకపోకల్లో అమ్మవారిని దర్శించుకోవాల్సిందే. కొండరాళ్లలో దొరికిన అమ్మఈ దేవాలయానికి దాదాపు దశాబ్దాల చరిత్ర ఉంది. వేమవరంలో రహదారి పక్కనే దివాన్ సాహెబ్ కోడ్డు మురుగు కాలువకు రివిట్మెంట్ కడుతున్నారు. ఆ గోడను కొండరాళ్లతో నిర్మిస్తుండగా వాటిలో ఒకరాయి అమ్మవారిని పోలినట్లుగా పనివారికి కనబడింది. ఆ రాయిని నిర్మాణంలో కలపకుండా పక్కన పెట్టారు. కొద్ది రోజులకు ఆ రాయిని రోడ్డు పక్కన నిలబెట్టి... పసుపు, కుంకుమలు చల్లి భక్తులు పూజలు చేసేవారు. అక్కడికి బాతులు పెంచుకునేవారు వచ్చారు. ఆ రాయి పక్కనే కుటీరం ఏర్పాటు చేసుకున్నారు. అమ్మవారి విగ్రహం పక్కనే ఉండటం వలన ఆ బాతులు విపరీతంగా గుడ్లు పెట్టేవని పెంపకం దారులకు నమ్మకం ఏర్పడింది. ఆ బాతుల యజమానికి విపరీతమైన లాభాలు వచ్చాయి. సీజన్ పూర్తి కావటంతో ఆ బాతుల యజమాని గుంటూరు వలస వెళ్లుటకు నిర్ణయించుకున్నాడు. బాతుల్ని లారీలో వేసుకునేటపుడు వాటితోపాటు అమ్మవారిని కూడా తీసుకెళ్లారు. గుంటూరు వెళ్లగానే అక్కడ బాతుల్ని దించారు. వాటితోపాటు అమ్మవారిని దించగా వెంటనే బాతులు మొత్తం హఠాత్తుగా మృత్యువాతపడ్డాయి. వెంటనే అతను మరలా అమ్మవారిని ఈ ప్రాంతానికి తీసుకొచ్చేశాడు. ప్రస్తుతం అమ్మవారు పూజలందుకుంటున్న స్థానంలోనే నిలి΄పాడు. ఈ నిదర్శనం చుట్టుపక్కల ప్రాంతాల్లో అనతికాలంలో మౌఖికంగా ప్రచారం జరిగింది. అప్పటి నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు విరివిగా వచ్చి పాల పొగగళ్లు సమర్పించి మొక్కుబడులు తీర్చుకుంటున్నారు.శోభాయమానంగా నవరాత్రులు...తల్లి సన్నిధిలో ఏటా దసరా నవరాత్రి మహోత్సవాలు శోభాయమానంగా జరుçగుతాయి. దుర్గాష్టమి రోజున కనకడప్పుల వాద్యాలు, బాణాసంచా, చిత్ర విచిత్ర వేషధారణలతో చుట్టుపక్కలున్న గ్రామాల్లో అమ్మవారి భారీ ఊరేగింపు సాగుతుంది. ఆ రోజు 20 వేల మంది భక్తులకు అన్నసమారాధన ఉంటుంది. నవరాత్రుల్లో భక్తుల ఉల్లాసం కొరకు సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనలు ఉంటాయి. తొలుత కొండలమ్మ మూలవిరాట్‌ను దర్శించుకునే ఆలయం చిన్నదిగా ఉండేది. ఆ తర్వాత భారీ ఆలయాన్ని దేవాదాయ శాఖ వారు నిర్మించి అభివృద్ధి చేయటం జరిగింది. అనివేటి మండపాన్ని నిర్మించారు. ఈ మండపంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆ విగ్రహానికే దసరా ఉత్సవాలకు దేవతా స్వరూపాలను అలంకరిస్తున్నాం. ఈ తల్లి మూలవిరాట్ నేల మీదనే తల వరకే దర్శనమిస్తుంది. మనసులో మాట అనుకున్నంతనే అవి తీరుస్తున్న అమ్మవారికి భక్తుల నుంచి తాకిడి నానాటికీ పెరిగి΄ోతుంది. సినీ నటులు, నిర్మాతలు, దర్శకులు, రాజకీయ నేతలు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపార వేత్తలు, రైతులు ఒక్క రంగమే కాదు అన్ని రంగాలకు చెందిన భక్తులు ఏం కోరుకుంటే అది తీరుస్తూ వారి నుంచి పూజలందుకుంటున్నారు అమ్మవారు. మొక్కుబడులు తీర్చుకునే భక్తులు కొండలమ్మకు పాల పొంగళ్లను సమర్పిస్తారు. – అయికా రాంబాబుసాక్షి, గుడ్లవల్లేరు, కృష్ణాజిల్లా -
జోగులాంబ ఆలయ ప్రధాన అర్చకుడిపై వేటు ?
జోగులాంబ గద్వాల జిల్లా: జోగులాంబ ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ పై వేటు పడే ఛాన్స్ ఉంది. అలంపూర్ నియోజకవర్గ దళిత ఎమ్మెల్యే విజయుడు ఇచ్చిన ఫిర్యాదుతో జిల్లా యంత్రాంగం కదిలింది. తన హక్కులకు భంగం కలిగించాడని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ కు ఆలంపూర్ ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. సినిమా థియేటర్‌కు భార్య, పిల్లలతో కలిసి ఎమ్మెల్యే వెళ్లగా ..పూజారి ఆనంద్ శర్మ తన ముఖానికి మాస్క్ ధరించి.. వీడియోలు, ఫొటోలు తీశారు. అది గమనించిన ఎంఎల్ఏ ఎవరు మీరు ? ఎందుకు ఫొటోలు తీస్తున్నారని ప్రశ్నించారు. తన నియోజకవర్గంలోని జోగులాంబ ఆలయం ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ తన ఫోటోలు , వీడియో లు తీసిన వ్యక్తి అని గుర్తించిన ఎంఎల్ఏ అలర్ట్ అయ్యారు.పూజారి ఆనంద్ శర్మ తనపై కుట్ర చేస్తున్నాడని గుర్తించడం తో పాటు..తన కుటుంబసభ్యుల సమాచారం సైతం ఎవరికో చెరవేస్తున్నాడని స్థానికంగా ఉన్న టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీస్ లు.. విచారణ ప్రారంభించారు. కొన్నాళ్ళుఆనంద్ శర్మ పరారయ్యాడు. తన పై , తన కుటుంభసభ్యులపై జరిగిన ఈ కుట్ర పై ఎమ్మెల్యే విజయుడు అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. విషయం క్షుణ్ణంగా పరిశీలించిన స్పీకర్ ప్రసాద్ కుమార్ పూజారి ఆనంద్ శర్మ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు .దళిత ప్రజాప్రతినిధి ఫ్యామిలితో ఉండగా పూజారి ఆనంద్ శర్మ ఇలా ఎందుకు చేశాడో సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ.. గద్వాల జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. స్పీకర్ ఆదేశాలతో విచారణ జరుపుతున్న జిల్లా కలెక్టర్ మరో రెండు , మూడు రోజుల్లో నివేదిక స్పీకర్ కార్యాలయానికి అందజేయనున్నట్లు సమాచారం . కలెక్టర్ నివేదిక ఆధారంగా స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. తప్పు చేసినట్లు తేలితే ఆనంద్ శర్మపై చర్యలు తీసుకోమని స్పీకర్ ఆదేశించే అవకాశం ఉంది. గతంలోనూ ఆలయంలో నిధుల దుర్వినియోగం, అమ్మవారి ఆభరణాల మాయం కేసుల్లో ఆనంద్ శర్మ పై ఆరోపణలు ఉన్నాయి. -
శ్రీ ముకాంబిక ఆలయంలో జైలర్ విలన్ వినాయకన్, నటుడు జయసూర్య (ఫోటోలు)
-
Madipadiga Annapurna: టెంఫుల్ హార్ట్
‘లివింగ్ టెంపుల్(Living Temple)’ అనేది మన హెరిటేజ్‌ను సెలబ్రేట్ చేయడమే! టెంపుల్ ఆర్ట్‌కి సంబంధించిన పలు కళాకారులంతా ఒకే వేదిక మీదకు వచ్చి ఒక డైలాగ్‌కు స్పేస్ ఇవ్వబోతున్నారు. ఇదిప్పుడు మనకు చాలా అవసరం. గుడి అనగానే గుర్తొచ్చేది దేవుడు, మొక్కులు, టెంకాయలు! కానీ గుడి అంటే సకల కళా నిలయం! జీవనశైలిని ఈస్తటిక్ లెన్స్‌లో చూపించే కాన్వాస్! నాడు వాస్తు, శిల్పం, చిత్రం, సంగీతం, నృత్యం అన్నిటికీ గుడే వేదిక.. వాటిని నేర్పే బడి కూడా! దాని ఆవరణలోని కొలను ఆధారంగా సాగూ సాగేది! అంటే సంస్కృతిని సంరక్షించే ఆలయంగానే కాదు సంపద పెంచే వనరుగానూ భాసిల్లింది!మారిన కాలంలో గుడికి ప్రాముఖ్యం తగ్గకపోయినా దాన్ని చూసే మన ఈస్తటిక్ లెన్సే మసకబారాయి! అయినా టెంపుల్ ఆర్ట్ (Temple Art) స్ఫూర్తితో ఆ ఘనమైన సాంస్కృతిక చరిత్రను పరిరక్షిస్తున్న కళాకారులు ఉన్నారు! దేశంలో ఎక్కడెక్కడో ఉన్న అలాంటి 31 మంది కళాకారులు అందరినీ ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి వాళ్ల కళారూపాలతో ‘లివింగ్ టెంపుల్’ పేరుతో మూడు రోజుల ఉత్సవాన్ని నిర్వహించబోతున్నారు క్యురేటర్ మడిపడిగ అన్నపూర్ణ! ఎప్పుడు... ఫిబ్రవరి 28 నుంచి మార్చి రెండు వరకు! ఎక్కడ... టీ వర్క్స్, హైదరాబాద్!అసలీ అన్నపూర్ణ ఎవరు?హైదరాబాద్‌లోనే పుట్టి, పెరిగిన అన్నపూర్ణ విజువల్ ఆర్ట్స్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేశారు. ఆమెకు స్ఫూర్తి.. తొలి గురువు తండ్రి రోహిణీ కుమార్. ఆయన వృత్తిరీత్యా పెయింటరే అయినప్పటికీ సొంతంగా అడ్వర్టయిజింగ్ ఏజెన్సీ ప్రారంభించి దాన్నే వృత్తిగా చేసుకున్నారు. దాంతో ఉగ్గుపాల నాడే అన్నపూర్ణకు టెంపుల్ ఆర్ట్‌ను పరిచయం చేశారు. కూతురు పెరుగుతున్న కొద్దీ ఆ కళ విశిష్టతను వివరిస్తూ వచ్చారు. కళలను, మనిషి జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తున్న వేదికగా గుడిని చూపించారు. ప్రతి ఆరునెలలకు ఒక పర్యాటక ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడి టెంపుల్ ఆర్ట్, జీవనశైలి మీదప్రాక్టికల్ జ్ఞానాన్నందించేవారు.ఒక్కమాటలో కూతురికి ఈస్తటిక్ లెన్స్‌లో ప్రపంచాన్ని పరిచయం చేశారని చెప్పాచ్చు. ఆ ఆసక్తితోనే అన్నపూర్ణ ఆర్ట్స్‌లో చేరారు. అయితే అకడమిక్స్‌లో నాన్న చెప్పినంత ఘనమైన స్థానం కనిపించలేదు మన ఆర్ట్, కల్చర్‌కి. పాశ్చాత్య కళానైపుణ్యంతోనే నిండిపోయి ఉంది సిలబస్ అంతా! మన కళల పట్ల నిర్లక్ష్యమో.. పెద్దగా పరిగణించకపోవడమో.. లేదంటే బ్రిటిష్ వాళ్లు నిర్ధారించిన అకడమిక్స్ అయ్యుండటమో.. కారణమేదైనా మన కళాసంస్కృతి గొప్పదనమైతే తెలియకుండా పోయింది. కాలగమనంలో చాలా గుళ్ల స్వరూప స్వభావాలూ మారిపోయాయి. వాస్తు శిల్ప చిత్రలేఖన సంపద మిగిలి ఉన్న గుళ్లల్లో సంగీతం, నాట్య కళల ఊసు లేదు. భవిష్యత్ తరాలకు అందాల్సిన ఆ సాంస్కృతిక వారసత్వ సంపద చెల్లాచెదురైంది. దాన్ని కాపాడాలి.. పరిరక్షించాలనే తపన పట్టుకుంది అన్నపూర్ణకు. చదువైపోయాక క్యురేటర్‌గా చేరినా.. ఆర్ట్ షోలు నిర్వహిస్తున్నా.. చిత్తమంతా టెంపుల్ ఆర్ట్ మీదే! ఆర్ట్ షోలు చేస్తున్న క్రమంలోనే దేశంలోని పలుప్రాంతాల్లో.. వాళ్ల వాళ్ల శైలిలో టెంపుల్ ఆర్ట్‌ను సాధన చేస్తున్న కళాకారులున్నారని తెలిసింది అన్నపూర్ణకు. అప్పుడు వచ్చింది ఆమెకు ‘లివింగ్ టెంపుల్’ ఆలోచన!రెండేళ్ల శ్రమఆ ఆలోచన వచ్చిన నాటి నుంచి టెంపుల్ ఆర్ట్ మీద పరిశోధన మొదలుపెట్టారు అన్నపూర్ణ. భారతదేశమంతా పర్యటించారు. శిథిలావస్థలోని గుళ్ల వాస్తుశిల్పాన్ని పునర్నిర్మిస్తున్న ఆర్కిటెక్ట్స్, విరిగిపోయిన విగ్రహాలను టెక్నాలజీ సహాయంతో తిరిగి చెక్కుతున్న.. రూపాలు చెదిరిన శిల్పాలను సాంకేతిక సహాయంతో తీర్చిదిద్దుతున్న శిల్పకారులు, చెదిరిపోయిన పెయింటింగ్స్ కు రంగులద్దుతూ పునరుద్ధరిస్తున్న చిత్రకారులు, గుళ్లల్లో పుట్టిన గాన.. నాట్య కళలను ఇంకా పోషిస్తున్న కళాకారుల కళారూపాలను చూశారు. వాళ్లలో విదేశీ కళాకారులూ ఉన్నారు. అందరూ సుప్రసిద్ధులే! అలాంటి 31 మంది కళాకారులను సంప్రదించారామె.వాళ్లకు తన ‘లివింగ్ టెంపుల్’ కాన్సెప్ట్‌ను వివరించారు. సంతోషంగా ఒప్పుకున్నారు. ఆ ఉత్సవానికి హైదరాబాద్‌నే వేదికగా చేయాలనుకున్నారు. టీ వర్క్స్ప్రాంగణాన్నివ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుంది. ఇప్పుడు అన్నపూర్ణ ఆ ఏర్పాట్లలోనే ఉన్నారు. ఏదో అనుకున్నామా.. చేశామా అన్నట్టు కాకుండా ఈ వేడుక ఒక స్ఫూర్తిని, ఫలితాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నారు అన్నపూర్ణ. కళాకారులు, ప్రజలు, ప్రభుత్వాలు అందరూ కలిసి టెంపుల్ ఆర్ట్ పరిరక్షణకు అడుగులు వేయాలి, ఆ సాంస్కృతిక వారసత్వ సంపదను మన భావితరాలకు అందించాలి.. ఫైన్ ఆర్ట్స్ సిలబస్‌లో మన కళలకూ సముచిత స్థానం ఉండాలన్నదే దాని ఉద్దేశం. ఆశయం! అందుకే ఈ ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం జరపాలనుకుంటున్నారు.చదవండి: రెక్కల గుర్రంపై.. విశాఖకు ఎగిరొచ్చిన జల కన్యలుఈ యజ్ఞం గురించి తెలుసుకున్న తమిళనాడు (Tamil Nadu).. వచ్చే ఏడాది తను ఆతిథ్యమివ్వడానికి ఉత్సాహపడింది. ‘లివింగ్ టెంపుల్’ అనేది మన హెరిటేజ్‌ను సెలబ్రేట్ చేయడమే! టెంపుల్ ఆర్ట్‌కి సంబంధించిన పలు కళాకారులంతా ఒకే వేదిక మీదకు వచ్చి ఒక డైలాగ్‌కు స్పేస్ ఇవ్వబోతున్నారు. ఇదిప్పుడు మనకు చాలా అవసరం. ఇంకో విషయం.. టెంపుల్ అనగానే ఇదొక మతానికి సంబంధించిన సెలబ్రేషన్‌గా అనుకోవద్దు. ఇది మన దేశ సంస్కృతికి సంబంధించినది. మన ఆలయాలు పరిరక్షించిన పర్యావరణానికి సంబంధించినది. దాన్ని మళ్లీ పునరుద్ధరించడమే ఈ సెలబ్రేషన్ ఉద్దేశం’ అంటారు అన్నపూర్ణ. ఆమె పనిని ఫుల్ హార్ట్‌తో స్వాగతిద్దామా!– సరస్వతి రమ -
శ్రీలంకలోని శంకరి దేవి శక్తిపీఠం సందర్శించిన బిగ్‌బాస్ సోనియా (ఫోటోలు)
-
ఫిబ్రవరి 4న శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో రథసప్తమి
తిరుపతి: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి పర్వదినం వైభవంగా జరుగనుంది. ఈ సందర్భంగా స్వామివారు దేవేరులతో కలిసి ఏడు వాహనాలపై ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.తెల్లవారు జామున 3 నుండి 5 గంటల వరకు శ్రీచక్రత్తాళ్వార్‌ను ఊరేగింపుగా శ్రీ కపిలేశ్వరస్వామి వారి ఆలయంలోని ఆళ్వారు తీర్థానికి వేంచేపు చేసి చక్రస్నానం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 5.30 నుండి 7.30 గంటల వరకు సూర్యప్రభ వాహనంతో శ్రీగోవిందరాజస్వామి వారి వాహన సేవలు ప్రారంభమవుతాయి.ఉదయం 8 నుండి 9 గంటల వరకు హంస వాహనం, ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు హనుమంత వాహనంపై స్వామివారు ఊరేగనున్నారు. ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పెద్దశేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 2.30 గంటల వరకు ముత్యపు పందిరి వాహనం, మధ్యాహ్నం 3 నుండి 4.30 గంటల వరకు సర్వభూపాల వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు ఊరేగుతూ భక్తులను అనుగ్రహించనున్నారు.రాత్రి 7 నుండి రాత్రి 8.30 గంటల వరకు గరుడ వాహనాన్ని అధిష్టించి శ్రీవారు దర్శనమిస్తారు. రథసప్తమి వేడుకలను అర్ధ బ్రహ్మోత్సవమని, ఒక రోజు బ్రహ్మోత్సవమని కూడా భక్తులు అంటారు. TTD: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంతిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. .శ్రీవారి దర్శనానికి రెండు కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు. శుక్రవారం అర్ధరాత్రి వరకు74,742 మంది స్వామివారిని దర్శించుకోగా 22,466 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.67 కోట్లు సమర్పించారు.దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 6 గంట ల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
మీనాక్షమ్మ గుడిలా నూకాలమ్మ ఆలయం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కొలిచిన వారికి కొంగుబంగారమై, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా.. ఉత్తరాంధ్రుల ఆరాధ్యదేవతగా విరాజిల్లుతున్న అనకాపల్లి నూకాలమ్మ ఆలయాన్ని తమిళనాడులోని మధుర మీనాక్షి దేవాలయం తరహాలో అభివృద్ది చేస్తున్నారు. మూడు వైపులా రాజగోపురాలు నిర్మించడంతో పాటు రానున్న 200 సంవత్సరాల భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ పునర్నిర్మాణ పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం ఆలయానికి తూర్పు వైపున మాత్రమే రాజగోపురం ఉండగా... మిగిలిన మూడువైపులా రాజగోపురాలను నిర్మిస్తున్నారు. అదేవిధంగా గర్భగుడిని కూడా విస్తరిస్తున్నారు. మొత్తం రూ. 8 కోట్లతో చేపడుతున్న ఆలయ పునర్నిర్మాణ పనులు వచ్చే నెలలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అన్ని పనులూ పూర్తయితే ఉగాది నుంచి భక్తులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఆలయ పునర్నిర్మాణ పనులను 2023 అక్టోబర్ నెలలో అప్పటి మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. శతాబ్దాల చరిత్ర...! అనకాపల్లిలోని నూకాంబికా అమ్మవారి ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. ఉత్తరాంధ్రలోని పురాతన దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. ఈ ఆలయంలో నూకాంబిక దేవి ఉంటుంది. ఈ ప్రాంతాన్ని పాలించిన రాజు కాకర్లపూడి అప్పలరాజు పాయకారావు ఈ ఆలయాన్ని తమ కుటుంబ దేవత అయిన కాకతాంబిక కోసం నిర్మించారు. ఆ తర్వాత ఈ దేవతను నూకాంబిక లేదా నూకలమ్మ అని పిలుస్తున్నారు. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని సందర్శించారు. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాచీన వైభవాన్ని పరిరక్షించడంలో భాగంగా గత ప్రభుత్వం ఆలయ పునర్నిర్మాణ పనులను ప్రారంభించింది. ఏటా ఉగాది అనంతరం మార్చి లేదా ఏప్రిల్ నెలలో అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా నుంచి దాదాపు 30 లక్షల నుంచి 40 లక్షల మంది భక్తులు తరలివస్తారు. ఆలయంలో నెల రోజుల పాటు జాతర జరుగుతుంది. ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో రానున్న 200 సంవత్సరాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం అభివృద్ది పనులు జరుగుతున్నాయి. అభివృద్ధి పనులు ఇలా...! గతంలో కాకతీయుల కాలంలో ఆలయ అభివృద్ది పనులు జరుగగా ఇన్నాళ్ల తరువాత గత ప్రభుత్వం ఆలయ అభివృద్ధి పనులను శ్రీకారం చుట్టింది. అమ్మవారి ఆలయం మొదటి భాగంలో గుంటూరు జిల్లా పిడుగురాళ్ల నుంచి తీసుకొచ్చిన నల్లరాయితో గర్భాలయం 14X14 అడుగుల నుంచి 17.11x17.11 అడుగులకు విస్తరించనున్నారు. అంతరాలయాన్ని సైతం భారీగా విస్తరిస్తున్నారు. చూడగానే మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం గుర్తుకు వచ్చేలా ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. -
వివాదంలో సింగర్ మధు ప్రియ.. అసలేం జరిగిందంటే?
'ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని' అనే సాంగ్‌తో గుర్తింపు తెచ్చుకున్న సింగర్ మధుప్రియ. తన మధురమైన వాయిస్‌తోనే ఫేమస్ అయ్యారు. అయితే తాజాగా ఆమె వివాదంలో చిక్కుకున్నారు. తన ప్రైవేట్ ఆల్బమ్ కోసం భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఆలయంలో మధు ప్రియ సాంగ్‌ను షూట్ చేశారు. అది కూడా ఆలయం గర్భగుడిలో కావడంతో వివాదానికి దారితీసింది. దీంతో మధు ప్రియ తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గర్భగుడిలో సింగర్ మధు ప్రియ ప్రైవేట్ ఆల్బమ్ కోసం షూటింగ్ చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. గుడి తలుపులు మూసి గర్భగుడిలో చిత్రీకరణ జరపడంపై మధుప్రియపై విమర్శలు చేస్తున్నారు. గర్భగుడిలో షూట్‌కు అనుమతి ఎవరు ఇచ్చారంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఆలయంలో మధు ప్రియ పాట పాడుతున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.సంక్రాంతికి వస్తున్నాం సాంగ్ పాడిన మధుప్రియ.. కాగా.. సింగర్ మధు ప్రియ ఇటీవల రిలీజైన సంక్రాంతికి వస్తున్నాం మూవీలో గోదారి గట్టుమీద సాంగ్‌ను ఆలపించారు. ఈ పాటకు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఈ సాంగ్ మేల్ వాయిస్‌ను రమణ గోగుల పాడగా.. ఫీమేల్ వాయిస్ మధు ప్రియ పాడారు. ఈ సంక్రాంతికి విడుదలైన వెంకటేశ్ - అనిల్ రావిపూడి చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తోంది. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఆలయం లో అపచారం.వీడియొ షూటింగ్ చేసిన సింగర్ మధు ప్రియ,ఎవరు పర్మిషన్ ఇచ్చారు అని మండి పడ్డ భక్తులు. pic.twitter.com/lbsGMllaSP— Telangana Maata (@TelanganaMaata) January 23, 2025 -
'గజేంద్ర మోక్షం' ఆధారంగా ఆలయం!
పురాతన ఆలయం, చెక్కు చెదరని శిల్పకళా సౌందర్యం, ఆహ్లాదకరమైన తుంగభద్ర (Tungabhadra) నదీతీరం.. వెరసి ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే రాజోలి (Rajoli) వైకుంఠ నారాయణస్వామి నిలయం. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలిలో ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో కల్యాణి చాళుక్య రాజు త్రిభువన మల్ల సోమేశ్వరుడు నిర్మించారని ఆధారాలు చెబుతున్నాయి. వైకుంఠ నారాయణస్వామి ఆలయం ముందు భాగంలో గరుత్మంతుని గుడి ఉంది. గుడికి ఎడమ భాగాన ధ్వజపీఠం, ఆ వెనుక బలిపీఠాలు ఉన్నాయి. వైకుంఠంలో వెలసిన శ్రీమన్నారాయణుడే రాజోలిలో కొలువైనట్లు భక్తుల విశ్వాసం. ఇక్కడున్న శ్రీమన్నారాయణుడు చతుర్భుజుడు. మూడున్నర అడుగుల దివ్య మంగళుడు. అన్నిచోట్లా దర్శనమిస్తున్నట్టు కాకుండా.. ఇక్కడ చక్ర హస్తంలో గధ, గధ హస్తంలో చక్రం ధరించి ఉంటాడు. ఇలాంటి స్వామివారి దర్శనం ఎక్కడా ప్రాచుర్యంలో లేదు. నారాయణుడికి ఇరువైపులా శ్రీదేవి, భూదేవి ఉన్నారు. స్వామి నెలకొన్న పీఠం రెండు అడుగుల ఎత్తు, అడుగున్నర వెడల్పు ఉంది. ఒకటిన్నర ఎత్తు ఉన్న అమ్మవారి విగ్రహాలు అందంగా, కళాత్మకంగా ఉన్నాయి. పక్కగుడిలోని అమ్మవారు కూర్చున్న పీఠం అడుగు కాగా, ఆమె మూర్తి ఒకటిన్నర అడుగుల ఎత్తు ఉంది. దేవాలయం బయట పురాణ, మాయణ, గవత, వైష్ణవ పురాణగాథలు, జలభూభాగాల్లోని జంతు జాలాలను అద్భుత శిల్ప కళానైపుణ్యం ఉట్టి పడేలా మలిచారు. ఈ శిల్ప కళను చూడాలంటే రెండు కళ్లు చాలవు.ఇప్పటి రాజోలి.. ఒకప్పుడు అడవి గజేంద్ర మోక్షం(Gajendra Moksham) ఆధారంగా ఆలయ నిర్మాణం జరిగిందని ఇక్కడి ప్రజల విశ్వాసం. ప్రస్తుతం రాజోలి గ్రామం ఉన్న ప్రదేశమంతా అడవి. దీనికి కొద్ది దూరంలో రాంపాడు అనే గ్రామం ఉండేది. ఈ అడవిలో ఏనుగులు విపరీతంగా సంచరిస్తుండేవి. వేసవి కాలంలో ఏనుగులు తాగునీటికి చాలా ఇబ్బంది ఉండేవి. అక్కడికి కొద్దిదూరంలో అంటే.. ప్రస్తుతం తూర్పు గార్లపాడు గ్రామం దగ్గర దేవమ్మ మడుగు ఉండేది. ఏనుగులు అక్కడికి వెళ్లి దాహం తీర్చుకునేవి. ఒకరోజు ఏనుగులు దాహం తీర్చుకోవడానికి వెళ్లగా ఆ మందకు పెద్దదిక్కైన ఒక ఏనుగును మడుగులో ఉన్న మొసలి పట్టుకుంది. ఎంతకూ అది వదలకపోవడంతో ఆ ఏనుగు నారాయణుడిని ప్రార్థించిందని.. ఆ మొర విన్న స్వామి వైకుంఠం నుంచి ఏనుగును కాపాడేందుకు వచ్చారని భక్తుల నమ్మకం. శరణు వేడుకున్న వారిని కాపాడాలనే తొందరలో శంఖు, చక్ర, గధ, పద్మధరుడైన మహా విష్ణువు, చక్ర హస్తంలో గధ, గధ హస్తంలో చక్రం ధరించి వచ్చారంటారు. ఆ విషయం అమ్మవార్లు చెప్పాక స్వామివారు గమనించారని.. శరణు కోరిన ఏనుగును చక్రంతో కాపాడారని.. దాని ఆధారంగా ఇక్కడ గుడి నిర్మాణం జరిగిందని స్థానికులు చెబుతారు.తిరుమల వెంకన్నను దర్శించినంత ఫలితం అప్పట్లో కొన్నేళ్ల క్రితం ఈ ప్రాంతీయులు, వేంకటేశ్వరస్వామి దర్శనానికి తిరుమలకు వెళ్లారు. వారిని అక్కడివారు ఎక్కడినుంచి వచ్చారని పలకరించగా.. తాము తుంగభద్ర నదీతీరంలోని రాజోలి ప్రాంతం వారిమని సమాధానమిచ్చారు. అందుకు వారు ఆశ్చర్యానికి లోనై.. సాక్షాత్తు వైకుంఠ నారాయణస్వామి కొలువైన ఆ దేవాలయాన్ని వదిలి ఇంత దూరం వచ్చారా? ఇక్కడి శ్రీనివాసుడే అక్కడి వైకుంఠ నారాయణుడని, అది సాక్షాత్తు వేంకటేశ్వరస్వామి సన్నిధిని.. కలియుగ వైకుంఠమని స్పష్టం చేసినట్టు ఒక కథనం ప్రాచుర్యంలో ఉంది. ఈ ఆలయానికి సమీపంలోనే తుంగభద్ర నదిలో రాంపాటి ఈశ్వరాలయం ఉంది.శ్రీమదలం పురీక్షేత్ర మహత్మ్యమ్ (స్థల పురాణం)లో ఒక శ్లోకం ఉంది. అందులో ‘తుంగా నారాయణస్సాక్షాత్ భద్రాదేవోమహేశ్వరః ఉభయోసంగమే యత్ర ముక్తిస్త్రత నసంశయః’.. అంటే తుంగ, భద్ర అనే రెండు నదులు పశ్చిమ కనుమల్లో వేర్వేరు చోట్ల ద్వారా ఒకచోట రెండు కలుస్తాయి. ఉంగానది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కాగా భద్రా నది పరమేశ్వరుడిగా చెబుతారు. ఈ నదులు ఎక్కడ ప్రవహిస్తాయో.. అక్కడ స్నానం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. అంతటి పవిత్రమైన వైష్ణవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది రాజోలి. ఇక్కడ వైకుంఠనారాయణ ఆలయంతో పాటు ఎడమవైపు శ్రీలక్ష్మి ఆలయం, వాయవ్య దిశలో అంజనేయ స్వామి, వేణుగోపాలస్వామి ఆలయం, నవగ్రహాలయం, ఈశ్వరాలయం, భువనేంద్రస్వామి ఆలయం ఉన్నాయి. ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది.ఇలా ఎంతో చరిత్ర కలిగిన ఈ వైకుంఠ నారాయణస్వామి ఆలయం నిరాదరణకు గురవుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవాదాయ శాఖలో విలీనమైనా.. ఆలయానికి మాన్యాలున్నా అభివృద్ధి జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆలయాన్ని వెలుగులోకి తెస్తే ముక్కోటి ఏకాదశి రోజు ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి తిరుపతి దాకా వెళ్లనవసరం లేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆలయం ఒక్క రాజోలికే కాక తెలంగాణకు, దేశానికే తలమానికమని వారు స్పష్టం చేస్తున్నారు. చదవండి: ఆ గుడిలో దేవుడు లేడు.. అయినా జనాల క్యూ!ఉమ్మడి రాష్ట్రంలో పట్టించుకోకపోయినా.. ప్రత్యేక రాష్ట్రంలోనైనా ఆలయాన్ని అభివృద్ధిలోకి తెచ్చి చరిత్రను కాపాడాలని కోరుతున్నారు. ఇప్పటికే ముక్కోటి ఏకాదశికి జిల్లా నలుమూలలతో పాటు, కర్నూల్ జిల్లా నుంచి భక్తులు వస్తుంటారు. అమావాస్య రోజు, వైకుంఠ ఏకాదశి రోజు స్థానికులు దాతల సహాయంతో వేలాది మంది భక్తులకు అన్నదానం, అల్పాహారం, తీర్థప్రసాదాలు అందజేస్తున్నారు. పుష్కరాల సమయాల్లో తుంగభద్ర నదీ పరీవాహక గ్రామాల్లో ఈ ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడితే ఆలయం మరింత అభివృద్ధిలోకి నోచుకుంటుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక దృష్టి పెట్టాలి రాజోలిలోని వైకుంఠ నారాయణస్వామి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. ప్రభుత్వం ఈ ఆలయంపై శ్రద్ధ పెట్టాలి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఇది చాలా మందికి తెలియక ఎన్నో వ్యయ ప్రయాసలతో దూరాన ఉన్న క్షేత్రాలకు వెళ్తున్నారు. ఈ ఆలయం విశిష్టత తెలిసినట్లయితే భక్తులు ఎక్కువగా దర్శించుకుని, ఆలయాభివృద్ధి జరిగే అవకాశముంది. – సురేశ్, శాంతినగర్ చరిత్ర కలిగిన ఆలయం గజేంద్ర మోక్షం ఆధారంగా నిర్మించిన వైకుంఠ నారాయణస్వామి ఆలయంలో ప్రతి ముక్కోటి ఏకాదశికి ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. చరిత్ర కలిగిన ఈ ఆలయం వివక్షకు గురవుతోంది. ప్రత్యేక రాష్ట్రంలోనైనా ఆలయం ప్రాచుర్యంలోకి తీసుకురావాలని స్థానికంగా ఎంతో కృషి చేస్తున్నాం. ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమాలు, భజనలు చేస్తూ ఆధ్యాత్మికత భావనను పెంచుతున్నాం. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ఆలయాన్ని అభివృద్ధి చేయాలి. – అంజి, రాజోలి -
విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న రేణూ దేశాయ్, యాంకర్ రవి (ఫోటోలు)
-
Rashi Singh: తిరుమల మెట్లు ఎక్కిన హీరోయిన్ (ఫోటోలు)
-
ఆ గుడిలో దేవుడు లేడు.. అయినా జనాల క్యూ!
సాక్షి, పెద్దపల్లి: గుడి ఉంటే దేవుడు ఉండాలి. దర్శనం చేసుకునేందుకు భక్తులు రావాలి. ఆలయ పరిసరాలు భక్తులతో కళకళలాడాలి. కానీ, ఈ గుడిలో దేవుడిని దర్శించుకునేందుకు భక్తులు రారు. వెడ్డింగ్ ఫొటోషూట్, షార్ట్ ఫిల్మ్ షూటింగ్‌లు, పిక్నిక్ల కోసం వచ్చే సందర్శకులు, పర్యాటకులతోనే గుడి కళకళలాడుతోంది. ఆ గుడి ఏంటి? విశేషాలు, చరిత్ర తెలుసుకోవాలంటే పెద్దపల్లి జిల్లా ముత్తారం గ్రామ పరిధిలోని ధర్మాబాద్ ప్రాంతానికి వెళ్లాల్సిందే. ఆండాలమ్మ గుడి కోసం.. 13వ శతాబ్దంలో జైనుల కాలంలో పెద్దపల్లి జిల్లా ముత్తారం గ్రామ పరిధిలోని ధర్మాబాద్.. రాఘవాపూర్ సంస్థానా«దీశుల ఆదీనంలో ఉండేది. ఆయా సంస్థానాధీశులైన ఎరబాటి లక్ష్మీనరసింహారావు, ఆయన కుమారుడు లక్ష్మీకాంతరావు గుడికి అంకుర్పారణ చేసినట్లు చరిత్రకారులు, గ్రామస్తులు చెబుతున్నారు. తొలుత రంగనాయకస్వామి ఆలయాన్ని నిర్మించారు. దీనికి అనుబంధంగా 500 అడుగుల దూరంలో ఆండాలమ్మ దేవాలయం నిర్మించారు. ఈ రెండింటి మధ్య రోప్ వే నిర్మించి, దీనిద్వారా అమ్మవారిని రంగనాయకస్వామి ఆలయానికి తీసుకొచ్చి.. కల్యాణవేడుక జరిపించాలన్న ఆలోచనతో గుడి నిర్మించారు. దాని నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి హఠాత్తుగా మృతి చెందటంతో.. ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేయలేదు. అనంతరం వారి వారసులు సైతం అమ్మవారి విగ్రహం ఏర్పాటపై అంతగా ఆసక్తి చూపకపోవడంతో.. విగ్రహం లేకుండానే గుడి మిగిలిపోయింది. ఎత్తయిన కొండల మధ్య.. అద్భుత శిల్ప కళాసౌందర్యంతో.. దట్టమైన అడవి, చుట్టూ ఎత్తయిన పచ్చని కొండల నడుమ గుడి దర్శనమిస్తోంది. ప్రధాన గోపురంలో అమ్మవారు, గర్భగుడికి ఇరువైపులా దేవతామూర్తుల కోసం ప్రత్యేక గదులు, అందమైన మండపం నిర్మించారు. గోపురంపై జీవకళ ఉట్టిపడేలా చెక్కిన శిల్పాలు ఆకట్టుకుంటాయి. మండపానికి కొద్దిదూరంలో ఆలయానికి మరింత శోభను తీసుకొచ్చేలా విశాలమైన స్వాగత తోరణం ఏర్పాటు చేశారు. అయితే, దేవత విగ్రహం లేకపోవడం, రంగనాయకుల స్వామి గుడి పరిధిలోని 439 ఎకరాల దేవాదాయ భూములు కాలక్రమంలో అన్యాక్రాంతమవడంతో.. ఈ గుడిని పట్టించుకునే వారు కరువయ్యారు. ఇటీవల పల్లె ప్రకృతివనం కార్యక్రమంలో ఆండాలమ్మ గుడిచుట్టూ ఉన్న మూడెకరాల్లో మొక్కలు నాటి పార్క్ ఏర్పాటు చేశారు. దీంతో పురాతన ఆలయాన్ని చూసేందుకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ ప్రదేశం వెడ్డింగ్, షార్ట్ ఫిల్మ్ షూటింగ్‌ల చిరునామాగా మారింది.అభివృద్ధి చేయాలిమా తాతల కాలంలో రాఘవపూర్ సంస్థానాదీశులైన ఎరబాటి లక్ష్మీనరసింహారావు ఆండాలమ్మ గుడి నిర్మించాడు. విగ్రహ ప్రతిష్ఠ సమయంలో.. ఎవరో చనిపోవడంతో అలాగే ఉండిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం గుడిని అభివృద్ధి చేస్తే బావుంటుంది.– అందె పోచమల్లు, గ్రామస్తుడుఅరకొర సౌకర్యాలు ప్రాచీన సంస్కృతి, శిల్పకళ ఉట్టిపడేలా గుడి నిర్మించారు. అనివార్య కారణాలతో ఆండాలమ్మ విగ్రహ ప్రతిష్ఠ చేయలేదు. ప్రస్తుతం అరకొర సౌకర్యాలు ఉన్నాయి. అయినా, వెడ్డింగ్, షార్ట్ ఫిల్మ్‌ల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి సందర్శకులు, దర్శకులు వస్తున్నారు. ఈ గుడితోపాటు పక్కనే ఉన్న రంగనాయకులస్వామి ఆల యం, సబ్బితం జలపాతం, రామగిరి ఖిలాతో టూరిజం సర్క్యూట్ నిర్మించి, అభివృద్ధి చేస్తే బాగుంటుంది. – నల్లగొండ కుమార్, స్థానికుడు -
తీర్థయాత్రా స్థలంగా సంభాల్.. యూపీ సర్కార్ ప్లాన్
సంభాల్: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో పురాతన శివాలయంతో పాటు మెట్లబావి మొదలైనవి బయటపడిన దరిమిలా యూపీలోని యోగీ సర్కారు సంభాల్‌ను తీర్థయాత్రా స్థలంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. ఇందుకు సంబంధించిన పనులను ముమ్మరం చేసింది.పాలరాతి నిర్మాణాలుసంభాల్లో షాహీ జామా మసీదు సర్వే సందర్భంగా జరిగిన హింసాకాండ తర్వాత పాలనా యంత్రాంగం ఇక్కడ ఒక పురాతన శివాలయాన్ని కనుగొంది. దానిని 1978లో మూసివేశారని తేలింది. తాజాగా చందౌసీలో రెవెన్యూశాఖ తవ్వకాలు జరిపినప్పుడు ఒక భారీ మెట్ల బావి బయటపడింది. ఈ సందర్భంగా సంభాల్ జిల్లా మేజిస్ట్రేట్ రాజేంద్ర పెన్సియా మాట్లాడుతూ, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ఈ సైట్లో తిరిగి సర్వే నిర్వహించే అవకాశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఈ సైట్ గతంలో చెరువుగా రిజిస్టర్ అయ్యిందన్నారు. ఇక్కడ జరిపిన తవ్వకాల్లో ఒక సొరంగంతో పాటు మెట్ల బావి బయటపడిందని, ఒక అంతస్తు ఇటుకలతో, రెండవ, మూడవ అంతస్తులు పాలరాతితో నిర్మించినట్లు స్పష్టమయ్యిందన్నారు.అత్యంత జాగ్రత్తగా తవ్వకాలుబిలారి రాజుల పూర్వీకుల కాలంలో ఈ మెట్ల బావి నిర్మితమయ్యిందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు ఇక్కడ తవ్వకాలు జరుపుతున్న అధికారులు పురాతన నిర్మాణానికి ఎటువంటి నష్టం జరగకుండా మట్టిని నెమ్మదిగా తొలగిస్తున్నారు. మరోవైపు ఈమెట్ల బావిని 1857లో నిర్మించారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రెండు జేసీబీల సాయంతో తవ్వకం పనులు కొనసాగుతున్నాయి. నిర్మాణానికి ఎలాంటి నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలతో తవ్వకాలు చేపడుతున్నారు.మెట్ల బావి అంటే ఏమిటి?మెట్ల బావి అనేది పురాతన భారతదేశంలో నీటిని సంరక్షించడానికి, నిల్వ చేయడానికి నిర్మించిన సాంప్రదాయ నీటి నిర్మాణం. మెట్ల ద్వారా బావిలోకి చేరుకుని నీటిని తోడుకోవచ్చు. భారతీయ వాస్తుశిల్పం, నీటి నిర్వహణ వ్యవస్థకు ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ. ముఖ్యంగా నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో నీటిని ఆదా చేయడానికి మెట్లబావులను నిర్మించేవారు. ఇది నీటి నిల్వ స్థలం మాత్రమే కాకుండా సామాజిక మతపరమైన కేంద్రంగా కూడా ఉండేది. మెట్ల బావి వేసవిలో చల్లదనాన్ని ఇస్తుంది. కాలక్రమేణా మెట్లబావుల వాడకం తగ్గింది. అయితే నేడు ఇది చారిత్రక వారసత్వ సంపదగా, పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. #WATCH | Uttar Pradesh | Visuals from the Chandausi area of Sambhal where excavation work was carried out yesterday at an age-old Baori by the Sambhal administration pic.twitter.com/ILqA8t3WPW— ANI (@ANI) December 23, 2024తీర్థయాత్రా స్థలంగా సంభాల్సంభాల్కు సంబంధించి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. సంభాల్‌ను తీర్థయాత్రా స్థలంగా రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక్కడి బావులు, చెరువులను పునరుద్ధరించనున్నారు. గెజిటీర్ ప్రకారం సంభాల్‌లో గతంలో 19 బావులు ఉండేవి. పూర్వకాలంలో చెరువు లేదా సరస్సును పుణ్యక్షేత్రంగా పరిగణించే వారు. సంభాల్‌లో అంత్యక్రియలు నిర్వహించిన వారికి మోక్షం లభిస్తుందని హిందువులు నమ్ముతుంటారు.పాత ఫైళ్ల వెలికితీతసంభాల్కు నలుమూలల్లో ఉన్న స్మశాన వాటికలు కూడా ప్రస్తుతం ఆక్రమణలకు గురయ్యాయి. వీటిని తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇదేవిధంగా సంభాల్‌లోని అన్ని ఆలయాలను అభివృద్ధి చేయడానికి యూపీ సర్కారు ముందుకొచ్చింది. ఒకప్పుడు సంభాల్‌లో హిందూ ఖేడా అనే హిందువుల కాలనీ ఉండేది. ఇప్పుడు దానిపై మరో వర్గంవారి ఆధిపత్యం కొసనాగుతున్నదని స్థానికులు అంటున్నారు. దీప సరాయ్ కాలనీ పరిస్థితి కూడా ఇదేనని తెలుస్తోంది. ఈ నేధ్యంలో యూపీ సర్కారు ప్రభుత్వ న్యాయవాదుల ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. 1978 నాటి అల్లర్లకు సంబంధించిన వివరాలతో కూడిన ఫైళ్లను సేకరించాలని ప్రభుత్వం వారికి సూచించింది. ఇది కూడా చదవండి: Year Ender 2024: కుటుంబం మెచ్చిన 10 అందమైన ప్రదేశాలు -
పులిహోర ప్రసాదంలో పురుగులు
-
ఆలయం బావిలో విగ్రహాలు
సంభాల్: ఉత్తరప్రదేశ్‌లో సంభాల్‌లో దాదాపు 46 ఏళ్ల తర్వాత గత వారం తెరుచుకున్న ఆలయం సమీపంలోని బావిలో దెబ్బతిన్న మూడు దేవతా విగ్రహాలు లభించాయి. నవంబర్‌లో షాహి జామా మసీదులో కోర్టు ఆదేశాల మేరకు సర్వేకు ప్రయతి్నస్తుండగా హింస చెలరేగి నలుగురు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ఆ ప్రాంతానికి కిలోమీటర్ దూరంలోని ఖగ్గూ సరాయ్లోనే శ్రీ కార్తీక్ మహదేవ్(భస్మా శంకర్)ఆలయం ఉంది. అధికారులు ఆక్రమణలను తొలగిస్తున్న సమయంలో అక్కడే 1978 నుంచి మూతబడి ఉన్న ఆలయం విషయం బయటపడింది. ఆలయంలో హనుమాన్ విగ్రహం, శివలింగం ఉండగా, పక్కనే ఉన్న బావి శిథిలావస్థకు చేరుకుంది. ఈ బావిలో సోమవారం అధికారులు పూడిక తీత మొదలుపెట్టారు. సుమారు 15 అడుగుల లోతులో దెబ్బతిన్న స్థితిలో ఉన్న పార్వతి, గణేశ్, లక్ష్మీ దేవతా విగ్రహాలు లభించాయని అధికారులు చెప్పారు. ఆలయం ప్రాచీనతను కాపాడే లక్ష్యంతో పనులు చేపట్టామని చెప్పారు. ఈ విగ్రహాలను ఎవరు, ఎందుకు ధ్వంసం చేసి ఉంటారనే విషయపై వివరాలను సేకరిస్తున్నామని అక్కడే ఉండి పనులను పర్యవేక్షిస్తున్న సంభాల్ జిల్లా మేజిస్ట్రేట్ రాజేందర్ పెన్సియా చెప్పారు. ఆలయం చుట్టూ ఆక్రమణల తొలగింపు కూడా జరుగుతోందన్నారు. కార్బన్ డేటింగ్ పరీక్షతో ఆలయంతోపాటు బావి ప్రాచీనతను నిర్థారించాలని కోరుతూ పురావస్తు శాఖకు లేఖ రాసినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆలయం వద్దకు పెద్ద సంఖ్యలో జనం వచ్చి పూజలు చేస్తున్నారు. అధికారులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఇళయరాజాకు అవమానం? వీడియో వైరల్
దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజాకు అవమానమే ఇది. ఎందుకంటే ఈ రోజు (డిసెంబర్ 16) నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతంది. ఒక్కోచోట ఒక్కో ఆచారమున్నట్లే తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయంలో పెళ్లి కాని యువతలతో పాటు చాలామంది ప్రత్యేక పూజలు జరుపుకొంటారు. ఈ మాసం తొలిరోజున ఆండాళ్, తిరుప్పావై పట్టు వస్త్రాలు ధరించి రంగమన్నార్ స్వామితో దర్శనమిచ్చారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు)ఈ క్రమంలోనే ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా.. ఆండాళ్‌ని దర్శించుకునేందుకు వేకునజామునే ఆలయానికి వచ్చారు. స్వామివారి దర్శనం చేసుకునేందుకు ఆండాళ్ గర్భగుడి ముందున్న మండపంలోకి ప్రవేశించే సమయంలో.. అక్కడే ఉన్న జీయర్ ఈయనని అడ్డుకున్నారు. దీంతో గర్భగుడి బయటే నిలబడి ఇళయరాజా పూజా చేసుకున్నారు.అయితే శ్రీ విల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయ అర్థ మండపంలోకి ఇళయరాజాను రానివ్వకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎన్నో పాటల్లో స్వామిని కీర్తించిన సంగీత విద్వాంసుడికి దక్కిన గౌరవం ఇదేనా అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ విన్నర్‌గా నిఖిల్.. ప్రైజ్‌మనీతోపాటు ఏం సాధించాడంటే?)SHOCKING: Ilaiyaraaja denied entry✖️ to Sanctum Sanctorum and asked to get out by the priests at Srivilliputhur Andal Temple🛕 pic.twitter.com/Aii7GQPg6k— Manobala Vijayabalan (@ManobalaV) December 16, 2024 -
‘ఈవీఎంలను ఊరేగించి గుడి కట్టండి’
ముంబై: ఈవీఎంల చుట్టూ వివాదాలు నడుస్తున్న వేళ.. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయాన్ని సుప్రీం కోర్టులో తేల్చుకోవాలని ఎంవీఏ కూటమి భావిస్తోంది. ఈలోపు.. మహాయుతి ప్రభుత్వం అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలతో విరుచుకుపడుతోంది. సీఎం ఎన్నిక జాప్యంపై ఎద్దేవా చేసిన థాక్రే సేన.. ఇప్పుడు ఈవీఎంలకు గుడి కట్టండంటూ అధికార కూటమికి సలహా ఇస్తోంది.ముంబైలో కాకుండా నాగ్‌పూర్‌లో మంత్రి వర్గ విస్తరణకు మహాయుతి ఏర్పాట్లు చేసింది. ఈ పరిణామంపై థాక్రే శివసేన నేత సంజయ్‌రౌత్ స్పందించారు. ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయం ముందు ఈవీఎంలకు గుడి కట్టుకోండంటూ సలహా ఇచ్చారాయన.‘‘సీఎం ఉరేగింపు కంటే ముందు.. వాళ్లు ఈవీఎంలను ఊరేగిస్తే బాగుంటుంది. ఆపై నాగ్‌పూర్‌లోని ఆరెస్సెస్ కార్యాలయం ఎదుట ఈవీఎంలకు వాళ్లు గుడి కట్టుకుంటే బాగుంటుంది. ఈ మేరకు కేబినెట్ తొలిభేటీలో నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా’’ అంటూ సెటైర్లు వేశారు. #WATCH | Mumbai: Shiv Sena (UBT) MP Sanjay Raut says, "...First of all, the procession of the Chief Minister will be taken out there (in Nagpur). I think that before taking out the procession of the CM, they should take out a procession of EVMs and in the first cabinet they… pic.twitter.com/0ue8Labe5v— ANI (@ANI) December 14, 2024 ‘‘ప్రభుత్వం ఏర్పడి దగ్గర దగ్గర నెలకావొస్తోంది. ఇప్పటికీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొలువు దీరలేకపోయింది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది. అయినా కొత్త ప్రభుత్వానికి పట్టనట్లు ఉంది. కనీసం సీఎం అయినా దీనికి సమాధానం ఇస్తారేమో’’ అని రౌత్ అన్నారు.1991 తర్వాత నాగ్‌పూర్‌లో మహా కేబినెట్ విస్తరణ జరుగుతుండడం ఇదే. ఆ టైంలో రాజకీయ సంక్షోభం ఏర్పడ్డ తర్వాత.. డిసెంబర్లో ఛగన్ భుజ్‌బల్, మరికొందరితో గవర్నర్ సుబ్రహ్మణ్యం మంత్రులుగా ప్రమాణం చేయించారు.ఇదీ చదవండి: బ్యాలెట్ కోసం చైతన్యం.. వారిని వణికిస్తోందిగా! -
ప్రపంచంలో అత్యంత ఎత్తయిన శివలింగం దగ్గర 'కేజీఎఫ్' హీరోయిన్ (ఫొటోలు)
-
భక్తుల కొంగు బంగారం.. సుందరమైన సూగూరేశ్వర ఆలయం (ఫొటోలు)
-
ద్వారకా తిరుమల ఆలయంలో డ్రోన్ కెమెరా కలకలం
సాక్షి, ఏలూరు జిల్లా: ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో డ్రోన్ కెమెరా కలకలం సృష్టించింది. సోషల్ మీడియాలో శ్రీవారి క్షేత్ర డ్రోన్ విజువల్స్ హల్చల్ చేశాయి. ఆలయ భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల ఒక యూట్యూబర్ పట్టపగలు క్షేత్రంపై డ్రోన్ ఎగురవేశారు. విజువల్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.నిషేధిత ప్రాంతంలో డ్రోన్ ఎగురవేస్తుంటే అధికారులు, సిబ్బంది ఏం చేస్తున్నారంటూ భక్తులు మండిపడుతున్నారు. ఇది ముమ్మాటికీ ఆలయ భద్రతా వైఫల్యమేనని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రోన్ ఎగరవేసిన యూట్యూబర్ పై, ఇంత జరుగుతున్నా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. -
Sambhal Controversy: ‘అది మసీదు కాదు.. హరిహరుల ఆలయం’
మొరాదాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లోని జామా మసీదు సర్వే వివాదం హింసాత్మకంగా మారింది. ఈ ఘర్షణల్లో నలుగురు మృతిచెందగా, 20 మంది గాయపడ్డారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి, బాష్పవాయువును ప్రయోగించాల్సి వచ్చింది. అయితే ఇంతకుముందు ఈ మసీదు ప్రాంతంలో ఒక దేవాలయం ఉండేదని, దానిని కూల్చివేసి మసీదు నిర్మించారనే వాదన వినిపిస్తోంది.సీనియర్ చరిత్రకారుడు డా. అజయ్ అనుపమ్‌తో మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని హరిహర దేవాలయం గురించి పలు మత గ్రంథాలలో ప్రస్తావన ఉంది. సంభాల్ పౌరాణిక చరిత కలిగిన ప్రదేశమని అన్నారు. పురాణాల్లో పేర్కొన్న విషయాలను మనం కాదనలేమని, మత్స్య పురాణం, శ్రీమద్ భగవతం, స్కంద పురాణాలలో సంభాల్ ప్రస్తావన ఉందన్నారు.పురాణాలలోని వివరాల ప్రకారం రాజు నహుష కుమారుడు యయాతి ఈ సంభల్ నగరాన్ని స్థాపించాడు. అలాగే ఇక్కడ హరిహర ఆలయాన్ని నిర్మించాడు. హరి అంటే విష్ణువు. హరుడు అంటే శంకరుడు. యయాతి తన పూజల కోసం ఈ ఆలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోందన్నారు.ఇది కూడా చదవండి: అట్టుడుకుతున్న పాక్.. ఐదుగురు సెక్యూరిటీ సిబ్బంది మృతి -
తిరుమల శ్రీవారి దర్శనం: చాలా సంతోషం అంటున్న బిగ్‌బాస్ బ్యూటీ
-
ధర్మపురిని దర్శిస్తే... యమపురి ఉండదట !
ధర్మపురి: ధర్మపురిని దర్శిస్తే యమపురి ఉండదని పురాణాలు చెబుతున్నాయి. జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయం ప్రాంగణంలోనే యమధర్మరాజు ఆలయం ఉంది. ఇక్కడి యమధర్మరాజు విగ్రహం దేశంలోనే అరుదైనదిగా చెబుతుంటారు. భక్తులు ముందుగా యమధర్మరాజును దర్శించుకున్న తర్వాతే శ్రీలక్ష్మీనృసింహ, వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ. యమధర్మరాజు భరణి జన్మనక్షత్రం సందర్భంగా ప్రతి నెలా ఆలయ ప్రాంగణంలో ఆయుష్షు హోమం, హారతి, మంత్రపుష్పం తదితర పూజలు చేస్తారు. ఏటా దీపావళి పర్వదినం సందర్భంగా యమ ద్వితీయ వేడుకలు నిర్వహిస్తారు. యమ ద్వితీయ రోజు యమధర్మరాజు నరక ద్వారాలను మూసివేసి తన సోదరి అయిన యమి ఇంటికి వెళ్లి ఆమె ఆతిథ్యాన్ని స్వీకరిస్తారని పురాణాలు చెబుతున్నాయి. నరక ద్వారాలు మూసిన సందర్భంగా ఆరోజు మృతిచెందిన వారికి స్వర్గలోక ప్రాప్తి లభిస్తుందని నమ్మకం. దీంతో వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు స్వామివారి దర్శనం కోసం తరలి వస్తుంటారు. యమధర్మరాజు ఆలయంలో ఆయుష్షు హోమం ఇదీ ఆలయ ప్రాశస్త్యం పూర్వం యముడు తాను చేసిన పాపాన్ని తొలగించుకోవాలనుకున్నాడు. మనస్సుకు శాంతి కావాలని అనేక పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నాడు. చివరగా నృసింహస్వామిని దర్శించుకునేందుకు ధర్మపురికి చేరుకున్నాడు. పవిత్ర గోదావరి నదిలో స్నానం ఆచరించి.. నృసింహుడిని శరణు వేడుకుంటాడు. స్వామి అనుగ్రహం లభించి పాప విముక్తుడయ్యాడు. నృసింహుని కృపతో ఆలయంలో దక్షిణ దిశలో వెలిశాడు. ముందు భక్తులు తనను దర్శించుకున్న తర్వాతే నృసింహుడిని దర్శించుకునేలా వరం పొందినట్టు పురాణాలు చెబుతున్నాయి. కాగా యముడు గోదావరి నదిలో స్నానం ఆచరించిన చోట యమగుండాలు అనే పేరు వచ్చింది. క్రీ.శ 850– 928 నాటి ఆలయం ధర్మవర్మ అనే రాజు పాలించినందుకు ధర్మపురికి ఆ పేరు వచ్చింది. ఈ క్షేత్రం క్రీ.శ. 850– 928 నాటి కంటే ముందునుంచే ఉన్నా.. క్రీ.శ. 1422–1436 కాలంలో బహమనీ సుల్తానుల దండయాత్రలో ధ్వంసమైంది. అనంతరం 17వ శతాబ్దంలో నృసింహ ఆలయాన్ని పునరుద్ధరించినట్టు చరిత్ర చెబుతోంది.మా ఇలవేల్పు లక్ష్మీనృసింహుడు ధర్మపురి లక్ష్మీనృసింహుడు మా ఇంటి ఇలవేల్పు. స్వామివారి దర్శనం కోసం వస్తూనే ఉంటాం. ఇక్కడున్న యమ ధర్మరాజును దర్శించుకుంటే సకల పాపాలు తొలగుతాయని మా నమ్మకం. – భారతి, భక్తురాలు, కరీంనగర్యముని దర్శనం కోసం వస్తాం ధర్మపురిలోని యమ ధర్మరాజు దర్శనం కోసం వస్తుంటాం. దేశంలో ఇలాంటి ఆలయం ఎక్కడా లేదని అంటుంటారు. అందుకే ఏటా యమున్ని దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా పిల్లాపాపలతో వస్తాం. – సాహితి, భక్తురాలు, మంచిర్యాలఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు ధర్మపురిలోని యమధర్మరాజు ఆలయాన్ని దేశంలోనే అరుదైనదిగా భావిస్తారు. అందుకే యముడు, లక్ష్మీనృసింహుని దర్శనం కోసం మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. ధర్మపురిని దర్శిస్తే యమపురి ఉండదని పురాణాలు చెబుతున్నాయి. – శ్రీనివాస్, ధర్మపురి ఆలయ ఈవో -
కందినంది : అరుదైన నక్షత్రాకారపు కట్టడం, తనివి తీరని అద్భుతం
అతి పురాతనమైన పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నంది కంది గ్రామంలో ఉంది. స్వయంగా శ్రీరాముడు ఈ రామలింగేశ్వర లింగాన్ని ప్రతిష్టించినట్లు చెప్పుకుంటారు. తర్వాత 11వ శతాబ్దంలో కళ్యాణి చాళుక్యులు ఈ మహాలింగాన్ని గుర్తించి రామలింగేశ్వర ఆలయంగా నక్షత్ర ఆకారంలో గుడిని కట్టడం మరో విశిష్టత. ఇక్కడ 6 శాసనాలు ఉన్నాయి. ఒక్కొక్క శాసనం ఒక్కొక్క విశిష్టత. ఈ ఆరు శాసనాలలో ఆరు రంధ్రాలు ఉండడం విశేషం. ఈ 6 రంధ్రాల నుండి సూర్యుని కిరణాలు రామలింగేశ్వరునిపై పడడం మరో విశిష్టత. రెండవది, ఈ గుడి గర్భగుడి ఆకారం నక్షత్రం ఆకారంలో ఉండడం మరో విశేషం. ఇక్కడ గజ స్తంభాలు కళ్యాణ చాళుక్యుల శిల్ప కళకు నిదర్శనం. ప్రతి శ్రావణ, కార్తీక, మాఘ మాసాలలోరామలింగేశ్వరునికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. సంగారెడ్డి నుంచి 15 కి.మీ., మెదక్ నుండి 60 కి.మీ ల దూరంలో ఉన్న నంది కంది ఒక చిన్న గ్రామం నక్షత్ర ఆకారంలో ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయానికి ప్రసిద్ధి చెందింది.11వ శతాబ్దంలో వీర చాళుక్యుల ఆధ్వర్యంలో నిర్మించబడిన నందికందిలోని రామలింగేశ్వర దేవాలయం ప్రత్యేకించి దాని ప్రత్యేక ఆకృతికి ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ప్రతి స్తంభం అద్భుతమైన శిల్పకళతో కనువిందు చేస్తుంది. సెంట్రల్ హాల్ లేదా నవరంగలోని నాలుగు అలంకార స్తంభాలు దాని అత్యుత్తమ నమూనాలలో ఒకటి. బ్రహ్మ, విష్ణు, శివ, నరసింహ, వరాహ, నటరాజ, దేవి మహిషాసుర మర్దిని, సరస్వతి, గజలక్ష్మి వంటి దేవతల రూపాలు స్తంభాల ముఖభాగం, పక్క గోడలను అలంకరించాయి.గర్భగృహంలో ఆలయ ప్రధాన దైవాలైన రామలింగేశ్వర స్వామి లింగరూపం లో కొలువై ఉండగా,పార్వతీ దేవి విగ్రహం అందమైన నల్ల రాతిపై చెక్కబడి ఉంటుంది. ఇతర శిల్పాలలో అప్సరసలు, దిక్పాలకులు, రాక్షసులు, మాతృమూర్తి, దర్పణ యోధుల శిల్పాలు ఉన్నాయి. ఆలయంలో రామలింగేశ్వరునికి అభిముఖంగా నల్లరాతితో చెక్కి ఉన్న భారీ నంది విగ్రహం మూల విరాట్టులతో పోటీ పడుతున్నదా అన్నంత అందంగా... అద్భుతంగా... ఆకర్షణీయంగా ఉంటుంది. రామలింగేశ్వర దేవాలయం శిల్పకళా వైభవానికి ఒక ప్రత్యేక నమూనా. దాని అద్భుతమైన శిల్పం చాళుక్యుల శకం నాటి హస్తకళల గురించి చెబుతుంది. చాళుక్య రాజుల నుంచి సంక్రమించిన సంస్కృతి, వారసత్వాన్ని అనుభవించాలనుకుంటే ఈ ఆలయాన్ని మిస్ చేయకూడదు.సుసంపన్నమైన చారిత్రిక ప్రాముఖ్యత, అద్భుతమైన చెక్కడం వల్ల రామలింగేశ్వర దేవాలయం తెలంగాణలోని పురాతన దేవాలయాల జాబితాలో ఉండాలి.ఆలయ వేళలు..ఉదయం 5:30 నుంచి సాయంత్రం 7:00 వరకుఎక్కడ బస చేయాలి?∙సంగారెడ్డి, సమీప పట్టణం, కొన్ని మంచి వసతి ఎంపికలను అందిస్తుంది. శ్రీ చంద్ర ఫార్మ్స్ – రిసార్ట్స్ న్యూ గ్రాండ్ హోటల్ లాడ్జ్ కొన్ని ప్రసిద్ధ ఎంపికలు.∙అంతేకాకుండా, హైదరాబాద్‌కు చాలా దగ్గరగా ఉండటంతో, పర్యాటకులు హైదరాబాద్ నుంచి డే ట్రిప్‌లలో సంగారెడ్డికి కూడా ప్రయాణించవచ్చు.ఇంకా ఏమేం చూడవచ్చంటే..?మెదక్ కోట, పోచారం ఆనకట్ట రిజర్వాయర్, పోచారం వన్య ప్రాణుల అభయారణ్యం, కోటిలింగేశ్వర ఆలయం, లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, పురావస్తు మ్యూజియం, కొండాపూర్. కళ్యాణి చాళుక్యుల నిర్మాణ శైలికి నిదర్శనం నంది కంది ఆలయం. ఇది క్రీ.శ 1014లో విక్రమాదిత్యుని హయాంలో నిర్మించబడి ఉండవచ్చని చరిత్రకారులు చెబుతున్నారు. ఆలయం విలక్షణమైన లక్షణాలలో ఒకటి దాని ప్రవేశ తోరణం, తోరణం అని పిలువబడే ఏడు విలోమ తామర నమూనాలతో అలంకృతమై ఉంటుంది. కమలాల మధ్య ఉన్న ఈ ఖాళీలు ఉదయపు సూర్యకాంతిని పరావర్తనం చెందిస్తాయి. లోపలి గర్భగుడిలోని శివలింగాన్ని ప్రకాశవంతం చేస్తాయి, ప్రతి అంతరం ఒక ఋతువును సూచిస్తుంది. ఈ ఆలయం బ్రహ్మ, విష్ణు, శివుడు, నరసింహ వంటి హిందూ దేవతలతో ΄ాటు వరాహ, నటరాజ, దేవి మహిషాసురమర్దిని, సరస్వతి, గజలక్ష్మితో సహా క్లిష్టమైన శిల్పాలతో అలంకరించబడింది. ఈ బొమ్మలు నాలుగు కేంద్ర స్తంభాలలో చెక్కబడ్డాయి, ఇవి ఆలయ మండపం లేదా నవరంగాన్ని ఏర్పరుస్తాయి. అదనంగా, ఈ ఆలయంలో దిశాత్మక సంరక్షకులు, సొగసైన బొమ్మలు, పౌరాణిక జీవుల శిల్పాలు ఉన్నాయి. గర్భగుడి నక్షత్రం ఆకారంలో...శిఖరం పద్మాకారంలో రూ పొందించడబడి ఉంటాయి. ఈ నిర్మాణ అంశాలు, కళాకృతుల కలయిక పురాతన హస్తకళ మతపరమైన కళలపై ఆసక్తి ఉన్నవారికి అపూర్వమైన, అనిర్వచనీయమైన అనుభూతినిస్తుంది. -
Canada: హింసాత్మక ఘర్షణలు.. ఆలయంలో ఇండియన్ కాన్సులేట్ కార్యక్రమం రద్దు
ఒట్టావా: కెనడాలోని హిందూ దేవాలయంలో హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్న దరిమిలా బ్రాంప్టన్ త్రివేణి కమ్యూనిటీ సెంటర్ నవంబర్ 17న ఇండియన్ కాన్సులేట్ నిర్వహించాల్సిన లైఫ్ సర్టిఫికేట్ పంపిణీ కార్యక్రమాన్ని రద్దు చేసింది. ఖలిస్థానీ బెదిరింపులపై ఆందోళన వ్యక్తం చేస్తూ కమ్యూనిటీ సెంటర్ ఈ నిర్ణయం తీసుకుంది. భారతీయ సంతతికి చెందిన హిందువులు, సిక్కులకు లైఫ్ సర్టిఫికేట్ పునరుద్ధరణ కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.బ్రాంప్టన్ త్రివేణి ఆలయానికి బెదిరింపుల నుంచి రక్షణ కల్పించాలని, హిందూ సమాజానికి భద్రత కల్పించాలని కమ్యూనిటీ సెంటర్ పీల్ పోలీసులకు విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం రద్దు చేసినందుకు సభ్యులకు క్షమాపణలు చెబుతున్నామని, కెనడియన్లు ఇక్కడి దేవాలయాలను సందర్శించడం అసురక్షితమని భావిస్తున్నామని పేర్కొన్నారు. కెనడాలోని హిందువులకు తగిన భద్రత కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశామని తెలిపారు. Chief of Police with the Peel Regional Police in Canada, Nishan Duraiappah writes to Brampton Triveni Mandir & Community Centre, requesting them to consider rescheduling the upcoming Consular Camp at the Brampton Triveni Mandir & Community Centre on November 17, 2024."We…— ANI (@ANI) November 12, 2024నవంబర్ 3న బ్రాంప్టన్‌లోని హిందూ సభ ఆలయంలోని కాన్సులర్ క్యాంపుపై ఖలిస్తానీ మద్దతుదారులు దాడికి దిగారు. ఇది హింసకు దారితీసింది. ఈ ఉదంతంపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనను ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. ఇది భారత దౌత్యవేత్తలను బెదిరించే పిరికిపంద చర్య అని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా త్వరితగతిన చర్యలు చేపట్టాలని కెనడా అధికారులకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రభుత్వం ఆరోపించిన దరిమిలా గత ఏడాది రెండు దేశాల సంబంధాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.ఇది కూడా చదవండి: అమెరికా వ్యాప్తంగా... జాత్యహంకార మెసేజ్‌లు -
KPHB: ఆలయంలో విషాదం
కేపీహెచ్‌బీకాలనీ: గుడిలో ప్రదక్షిణలు చేయటానికి వెళ్లిన ఓ వ్యక్తి గుండెనొప్పితో మృతి చెందిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కేపీహెచ్‌బీ రోడ్డు నెంబర్ 1లో అమ్మ హాస్టల్లో కానంపల్లి విష్ణువర్ధన్(31) ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అతడు ప్రతిరోజు ఉదయం ఆలయానికి వెళ్తుంటాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 7 గంటలకు కేపీహెచ్‌బీ టెంపుల్ బస్‌స్టాప్ వద్ద ఉన్న ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లాడు. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయి, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఇతర భక్తులు సీపీఆర్ చేసి ఆసుపత్రికి తరలిస్తుండగా అంతలోనే మృతి చెందాడు. విషయాన్ని ఆయన సోదరి హేమలతకి ఫోన్ ద్వారా తెలియచేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
యాదాద్రి పేరు మార్పు..రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
-
‘ట్రంప్ కృష్ణ’ : తెలంగాణాలో ట్రంప్ ఆలయంలో పూజలు, సంబరాలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయ ఢంకా మోగించారు. రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడపై భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు అనేక దేశాధినేతలు ట్రంప్‌కు అభినందనలు తెలియజేశారు. అయితే తెలంగాణాలోని ఒక పల్లె ప్రజలు మాత్రం ఇంకో అడుగు ముందుకేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన కొంతమంది ట్రంప్ అభిమానులు ట్రంప్ గుడిలో ఏకంగా పూజలు చేశారు. ట్రంప్‌కు గుడి ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా. అదే మరి విశేషం. 2020లోనే ట్రంప్ కోసం గుడి కట్టి విగ్రహం నెలకొల్పాడో వీరాభిమాని. ఆయనే కొన్నె గ్రామానికి బుస్స కృష్ణ. రాములు, సావిత్రి దంపతుల కుమారుడు కృష్ణ. ట్రంప్‌ను మరోసారి అధ్యక్షుడిగా చూడాలని కలలు గనేవాడట. ట్రంప్ కోసం ఏకంగా ఉపవాస దీక్షలు చేసేవాడట. అయితే గత ఎన్నికల్లో ఓడిపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన కృష్ణ, 2020 అక్టోబరు 11న కన్నుమూశాడు.అంతేకాదు 2019లో కృష్ణ పెట్టిన ట్వీట్‌కు ట్రంప్ స్పందించడం మరో విశేషం.‘‘మీరంటే ఇష్టం.. మిమ్మల్ని కలవాలని ఉంది.. అని కృష్ణ ఎక్స్‌లో పోస్ట్ పెట్టాడు. ఆ పోస్టుకు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. దీంతో కృష్ణ చాలా సంబరపడి పోయాడట. ట్రంప్ టీ షర్టులనే ధరించేవాడట. అలాగే తన ఇంటి నిండా అమెరికా అధ్యక్షుడి పోస్టర్లు, స్టిక్కర్లు అతికించి పెట్టుకునేవాడు. అందుకు కృష్ణ గ్రామస్తుల హృదయాల్లో ‘ట్రంప్ కృష్ణ’గా ముద్ర వేసుకున్నాడు.Villagers in Telangana Celebrate Trump’s Re-Election by Worshipping His Statue in a Temple built for himIn a unique celebration, villagers in Konne, Jangaon district in Telangana, marked Donald Trump’s re-election as U.S. president by honoring Bussa Krishna’s devotion to the… pic.twitter.com/k1sS5bOPAQ— Sudhakar Udumula (@sudhakarudumula) November 7, 2024 తాజా ఎన్నికల్లో ట్రంప్ అధ్యక్షుడుగా విజయం సాధించడంతో గ్రామస్తులు తమ ‘ట్రంప్ కృష్ణ’ను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. అంతటితో ఆగిపోలేదు. కృష్ణ బతికి ఉంటే ఎంతో సంతోషించేవాడు కదా అని భావించారు. ఆయన లేని లోటు తీర్చేందుకా అన్నట్టుగా కృష్ణ మిత్రులు కొంతమంది బుధవారం ట్రంప్ విగ్రహం వద్ద పూలమాల వేసి సంబరాలు నిర్వహించారు. కొబ్బరికాయలు, ధూప దీప నైవేద్యాలు, సమర్పించి వేడుక నిర్వహించారు. ఈ వేడుకలకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. -
తీర్థాన్ని ఎలా తీసుకోవాలి? ఇతర నియమాలు
గుడికి వెళ్తే ప్రసాదం తీసుకున్నా లేకున్నా తీర్థం తప్పకుండా తీసుకుంటాం. పూజారిగారు మరేదో వ్యాపకంలో ఉన్నా అడిగి మరీ తీసుకుంటాం. తీర్థం అంత అమూల్యమైంది, శ్రేష్ఠమైంది.తీర్థం తీసుకునేటప్పుడు కుడిచేతిని గోకర్ణంలా (ఆవు చెవి ఆకృతి) పెట్టాలి. అంటే చేతిని డిప్పలా ముడిచి, చూపుడు వేలును బొటనవేలుకు ఆనించాలి. అంతే తప్ప ఒక చేయి, లేదా రెండు చేతులను దోసిళ్ళలా పట్టకూడదు.ఉద్ధరణితో మూడుసార్లు తీర్థం పోసిన తర్వాత కళ్ళకు అద్దుకుని తాగాలి. తీర్థం తాగేటప్పుడు నిలబడకూడదు. కూర్చుని మాత్రమే సేవించాలి. తీర్థం తీసుకునేటప్పుడు జుర్రిన శబ్దం రాకూడదు.మనసులో దేవుని స్మరించుకుంటూ నిశ్శబ్దంగా సేవించాలి.కొన్ని ఎప్పటికీ ఆచరించవలసిన నియమాలుఅన్నం తింటున్నప్పుడు అన్నాన్ని, ఆ అన్నం పెట్టువారిని తిట్టటం, దుర్భాషలాడటం చేయరాదు. ఏడుస్తూ తినడం, గిన్నె / ఆకు మొత్తం ఊడ్చుకొని తినడం పనికిరాదుఒడిలో కంచం, పళ్ళెం పెట్టుకుని అన్నం తినరాదు. భోజనసమయంలో నవ్వులాట, తగువులాట, తిట్టుకొనటం, గేలిచేయటం నష్టదాయకం. భోజనానంతరం ఎంగిలి ఆకులు / కంచాలు ఎత్తేవారికి వచ్చే పుణ్యం, అన్నదాతకు కూడా రాదు. -
కెనడాలో ఆలయంపై దాడి.. భారత్ తీవ్ర ఆందోళన
ఢిల్లీ: కెనడాలో ఆలయంపై దాడి జరిగిన నేపథ్యంలో అక్కడి భారతీయుల భద్రత గురించి కేంద్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కెనడాలో భారతీయుల భద్రతపై తీవ్ర ఆందోళన చెందుతున్నామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. కెనడాలోని అంటారియో ప్రావిన్స్‌లోని బ్రాంప్టన్‌లోని ఒక హిందూ దేవాలయంలో జరిగిన సంఘటనపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు.‘‘ఉగ్రవాదులు, వేర్పాటువాదులు చేస్తున్న హింసాత్మక చర్యలను ఖండిస్తున్నాం. అన్ని ప్రార్థనా స్థలాలకు తగినంత రక్షణ ఉండేలా చూడాలని కెనడాకు పిలుపునిచ్చింది. హింసకు పాల్పడే వారిపై విచారణ జరుగుతుందని కూడా మేం భావిస్తున్నాం. భారత ప్రభుత్వం.. కెనడా దేశంలో భారత పౌరుల భద్రత, భద్రత గురించి తీవ్ర ఆందోళనగా ఉంది. భారతీయ, కెనడియన్ పౌరులకు కాన్సులర్ సేవలను అందించే చర్యలు కొనసాగుతున్నాయి. ఆలయం లోపల సహాయక చర్యలకు శిబిరం నిర్వహించాం’’అని తెలిపారు.చదవండి: హిందూ ఆలయంపై ఖలిస్తానీ మద్దతుదారుల దాడి -
రేపటి నుంచి కేదార్నాథ్ ఆలయం మూసివేత
చార్‌ధామ్‌గా ప్రసిద్ది చెందిన హిందూ పుణ్యక్షేత్రాలైన గంగోత్రి, యుమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల తలుపులు మూతపడనున్నాయి. చలికాలం రావడంతో అక్కడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నాలుగు ఆలయాలను ఆరు నెలలపాటు మూసివేయానున్నారు. ఆ తర్వాత మళ్లీ వేసవికాలంలో చార్ధామ్ యాత్ర కొనసాగుతుంది.కాగా ఈ ఏడాది మే 10వ తేదీన ప్రారంభం అయిన చార్ధామ్ యాత్ర ముగింపు దశకు చేరుకోగా.. ఈ నాలుగు ధామాలలో ఒకటైన గంగోత్రి ధామ్ తలుపులను శనివారం మధ్యాహ్నం 12.14 గంటలకు మూసివేశారు. చార్‌ధామ్‌లో కీలకమైన కేదార్నాథ్ ఆలయాన్ని ఈ నెల 3వ తేదీన ఉదయం 8.30 గంటలకు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు యమునోత్రి ధామ్ తలుపులు మూసివేసేందుకు కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇక విష్ణువు కొలువైన బద్రీనాథ్ ధామ్‌ను నవంబర్ 17వ తేదీన రాత్రి 9.07 గంటలకు మూసివేయనున్నారు. -
ఆలయానికి పోటెత్తిన భక్తులు.. కొండపై నుంచి జారిపడటంతో
బెంగళూరు: కర్ణాటకలోని ఓ ఆలయంలో జరిగిన ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. దీపావళి పండుగ సందర్భంగా.. చిక్కమగళూరులోని దేవీరమ్మ కొండపై ఉన్న ఆలయానికి భక్తులు పోటెత్తడంతో తోపులాట జరిగింది. వేలాది సంఖ్యలో భక్తులు ఒక్కసారిగా రావడంతో, కొండలపై జారి పడి పలువురికి గాయాలయ్యాయి. మల్లెనహళ్లిలోని దేవీరమ్మ కొండపై ఉన్న గుడి వద్ద గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.అయితే గత రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలే ఇందుకు కారణమని అధికారులు పేర్కొన్నారు. సందర్శకుల భద్రత కోసం జిల్లా యంత్రాంగం, పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టినప్పటికీ.. భారీ వర్షాల కారణంగా కొండలు తడిగా మారాయని వెల్లడించారు. ఆలయం నుంచి తిరిగి వస్తుండగా పడిపోవడంతో దాదాపు 12మంది భక్తులు స్వల్పంగా గాయపడ్డారని, వారందరూ క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు.కాగా దీపావళి సందర్భంగా ఏడాదిలో కేవలం ఒక్కరోజు మాత్రమే భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శించేందుకు అనుమతిస్తారు. ఇది దేవిరమ్మ అనే కొండపై మూడు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. బాబాబుడంగిరిలోని మాణిక్యధార, అరిసినగుప్పె మీదుగా భక్తులు ఆలయానికి చేరుకుంటారు. నరక చతుర్దశికి ముందు దేవీరమ్మ అమ్మవారి దర్శనం చేసుకుంటారు. -
కేరళ నీలేశ్వరం ఆలయం సమీపంలో బాణాసంచా పేలుడు..
-
గుడిలో బాణసంచా ప్రమాదం.. 150 మందికి గాయాలు
తిరువనంతపురం:కేరళలోని ఓ గుడిలో వేడుకల సందర్భంగా బాణసంచాకు ప్రమాదవశాత్తు మంటలంటుకున్నాయి. కాసర్గోడ్ నీలేశ్వరంలోని వీరర్కవు గుడిలో కాళియట్లం ఉత్సవాల్లో సోమవారం(అక్టోబర్ 28) అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 150 మంది దాకా గాయపడ్డారు. వీరిలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.గాయపడ్డవారిని కాసర్గోడ్, కన్నూర్, మంగళూరులలోని ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్సనందిస్తున్నారు. గుడిలో బాణసంచా నిల్వ చేసిన గదికి మంటలంటుకోవడం భారీ అగ్ని ప్రమాదానికి కారణమైందని పోలీసులు తెలిపారు.జిల్లా కలెక్టర్, ఎస్పీ ప్రమాదస్థలాన్ని సందర్శించారు. బాణసంచా నిల్వ ఉన్న ప్రాంతానికి కనీసం 100 మీటర్ల దూరంలోనే వాటిని కాల్చాలన్న నిబంధనను పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని కలెక్టర్ చెప్పారు. #Kasargod Firecracker room caught fire at veerakaav temple https://t.co/3tqCteOJXf pic.twitter.com/4TU0dkLZOb— 𝖆𝖓𝖚𝖕 (@anupr3) October 28, 2024 ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ సీఎం -
దేశంలోని ప్రముఖ మహాలక్ష్మి ఆలయాలు
దీపావళి నాడు మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ రోజున భక్తులు మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని ఘనంగా పూజలు నిర్వహిస్తుంటారు. మన దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రముఖ మహాలక్ష్మీదేవి ఆలయాలున్నాయి. వాటిలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గోల్డెన్ టెంపుల్ (తమిళనాడు)తమిళనాడులోని వెల్లూరు జిల్లాలోని మహాలక్ష్మి ఆలయాన్ని దక్షిణ భారతదేశంలోని ‘గోల్డెన్ టెంపుల్’ అని పిలుస్తారు. ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోని ప్రముఖ దేవాలయాలలో ఒకటిగా పేరొందింది. 100 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఆలయం చెన్నైకి 145 కిలోమీటర్ల దూరంలో పాలార్ నది ఒడ్డున ఉంది. ప్రతి సంవత్సరం దీపావళి నాడు వేలాది మంది భక్తులు ఈ ఆలయంలో అమ్మవారి దర్శనానికి తరలివస్తుంటారు.మహాలక్ష్మి ఆలయం (ముంబై)ఈ ఆలయం మహారాష్ట్రలోని ముంబైలో గల బి. దేశాయ్ మార్గ్‌లో ఉంది. ముంబై మహాలక్ష్మి దేవాలయంగా ఈ ఆలయం పేరొందింది. బ్రిటీష్ కాలంలోనే ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. ఛత్రపతి శివాజీకి కలలో లక్ష్మీదేవి కనిపించి, ఈ ఆలయాన్ని నిర్మింపజేసిందని చెబుతారు. ఈ మహాలక్ష్మి ఆలయ గర్భగుడిలో మహాలక్ష్మి, మహాకాళి మహాసరస్వతి విగ్రహాలు కనిపిస్తాయి.మహాలక్ష్మి ఆలయం (కొల్హాపూర్)మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో గల మహాలక్ష్మి ఆలయానికి దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. ఈ ఆలయాన్ని ఏడవ శతాబ్దంలో చాళుక్య పాలకుడు కర్ణదేవుడు నిర్మించాడు. షిల్హర్ యాదవ్ దీనిని తొమ్మదవ శతాబ్దంలో ఆలయాన్ని పునర్నిర్మించాడు. ఆలయ ప్రధాన గర్భగుడిలో నాలుగు అడుగుల ఎత్తయిన మహాలక్ష్మి దేవి విగ్రహం దర్శనమిస్తుంది. ఇది దాదాపు 40 కిలోల బరువు ఉంటుంది. ఈ లక్ష్మీదేవి విగ్రహం సుమారు 7 వేల సంవత్సరాల క్రితం నాటిదని చెబుతారు.లక్ష్మీనారాయణ దేవాలయం (ఢిల్లీ)ఢిల్లీలోని ప్రధాన దేవాలయాలలో లక్ష్మీనారాయణ దేవాలయం ఒకటి. ఈ ఆలయాన్ని 1622లో వీర్‌సింగ్ దేవ్ నిర్మించాడు. 1793లో పృథ్వీ సింగ్ ఆలయాన్ని పునరుద్ధరించాడు. అనంతరం బిర్లా కుటుంబం ఈ ఆలయాన్ని 1938లో విస్తరించి, పునరుద్ధరించింది. అందుకే ఈ ఆలయాన్ని బిర్లా టెంపుల్ అని పిలుస్తారు.మహాలక్ష్మి ఆలయం (ఇండోర్)మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో గల మహాలక్ష్మి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని ఇండోర్ నడిబొడ్డున ఉన్న రాజ్వాడలో నిర్మించారు. ఈ ఆలయాన్ని 1832లో మల్హర్రావు (II) నిర్మించాడని చెబుతారు. ఈ ఆలయంలో మూడు అంతస్తులు ఉన్నాయి. అయితే 1933లో అగ్నిప్రమాదం కారణంగా ఆలయం ధ్వంసమైంది. 1942లో ఈ ఆలయాన్ని తిరిగి పునరుద్ధరించారు. దేశంలోని నలుమూలల నుండి భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించేందుకు తరలివస్తుంటారు.అష్టలక్ష్మి దేవాలయం (చెన్నై)తమిళానడులోని చెన్నైలోని ఇలియట్ బీచ్ సమీపంలో అష్టలక్ష్మి ఆలయం ఉంది. ఈ ఆలయం నాలుగు అంతస్తులలో నిర్మితమయ్యింది. లక్ష్మీదేవి ఎనిమిది రూపాల విగ్రహాలను ఈ ఆలయంలో సందర్శించవచ్చు. ఆలయంలోని రెండవ అంతస్తులో లక్ష్మీ దేవి, విష్ణువు విగ్రహాలు ప్రతిష్ఠితమయ్యాయి.ఇది కూడా చదవండి: దీపావళికి ముందే గ్యాస్ ఛాంబర్లా రాజధాని -
Dream Wedding Destination ఇక్కడ పెళ్లి జరగాలంటే అదృష్టం ఉండాలి!
హరహర మహదేవ శంభో అంటూ చార్ధామ్ యాత్రలో పరవశించిపోతారు భక్తులు. ఈ మార్గంలో చాలా తక్కువ మందికి తెలిసిన మరో విశిష్టమైన ఆలయం కూడా ఉంది. అదే త్రియుగినారాయణ దేవాలయం. ఇది చాలామందికి డ్రీమ్ వెడ్డింగ్ డెస్టినేషన్ కూడా. దీని గురించి విశేషాలు తెలుసుకుందాం రండి.ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉంది సుందరమైన గ్రామంలో కొలువు తీర ఉన్నది త్రియుగినారాయణ ఆలయం.దీని విష్ణువు అని భావిస్తున్నారు. ఇది ఎత్తు సముద్ర మట్టానికి 1,980 మీటర్లు (6,500 అడుగుల ఎత్తులో ప్రకృతి రమణీయ దృశ్యాలతో చూడముచ్చటగా ఉండే పవిత్ర వైష్ణవ దేవాలయం. చార్ధామ్ ప్రదేశాలలో ఒకటైన బద్రీనాథ్ ఆలయాన్ని పోలి ఉంటుంది ఇది కూడా. ఈ ఆలయంలో స్వామివారి నుండి ఆశీర్వాదం తీసుకోవడంతో పాటు, గర్వాల్ హిమాలయాల ఉత్కంఠ భరితమైన దృశ్యాలను వీక్షించవచ్చు. త్రియుగినారాయణ ఆలయం వెనుకున్న కథ ఏమిటి?మూడు యుగాలుగా లేదా "త్రియుగం"గా ఉన్న వైష్ణవ పుణ్యక్షేత్రం ఇది. పార్వతి దేవి , శివుడు వివాహం చేసుకున్న ప్రదేశంగా ఇది ప్రతీతి. ఇక్కడ విష్ణువు ముందు శివపార్వతుల కళ్యాణం జరిగిందట. అందుకే వారి గౌరవార్థం త్రియుగి నారాయణ్ ఆలయం నిర్మించారని చెబుతారు.శ్రీ మహావిష్ణువు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కూడా ప్రజలు విశ్వసిస్తారు. పార్వతీ దేవికి సోదరుడిగా, తల్లిగా విష్ణుమూర్తి వ్యవహరిస్తే, బ్రహ్మ దేవుడు వివాహంలో పూజారి పాత్రను పోషించాడట. హోమగుండం, బ్రహ్మశిలపార్వతీ పరమేశ్వరుల పెళ్లి సమయంలో వెలిగించిన హోమగుండం మూడు యుగాలుగా నిర్విరామంగా వెలుగుతోంది. ఈ ఆలయం ముందు పవిత్రమైన అగ్ని అనంతంగా వెలుగుతూ ఉంటుంది. అందుకే ఈ ఆలయాన్ని అఖండ ధుని ఆలయం అని కూడా పిలుస్తారు పెళ్లి చేసుకునే జంటలు ఏడడుగులు వేసి (సాత్ ఫేర్)పవిత్ర బంధంతో ఏకమవ్వాలని ఎదురు చూస్తారు. పెళ్లి కావాల్సిన అమ్మాయిలు, అబ్బాయిలు పెళ్లి కావాలని మొక్కుకుంటారట. ఇక్కడ కలపను నైవేద్యంగా సమర్పించి, విభూతిని ప్రసాదంగా స్వీకరిస్తారు. త్రియుగినారాయణ ఆలయంలో బ్రహ్మ శిల ఒక ప్రత్యేక ఆకర్షణ. ఇదే శివపార్వతుల కళ్యాణానికి వేదిక. దేవాలంయంలోకి అడుగు పెట్టగానే విష్ణువు, లక్ష్మీదేవి, సరస్వతి దేవి వెండి విగ్రహాలను ఇక్కడ చూడవచ్చు.దేవతలు వివాహం చేసుకున్నటువంటి పవిత్రమైన,గౌరవప్రదమైన ప్రదేశంలో వివాహం చేసుకోవాలని ఎవరు కోరుకోరు? దేశ విదేశాలకు చెందిన జంటలు ఇక్కడ ఏడు అడుగులువేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతారు. అలాగే కొత్త జంటలు, వేలాదిమంది భక్తులు, పర్యాటకులు త్రియుగినారాయణ ఆలయాన్ని సందర్శించి విష్ణువు ఆశీర్వాదం పొందుతారు. కేదార్‌నాథ్‌కు సుమారు 25 కి.మీ.దూరం. అలాగే రుద్రప్రయాగ నుండి 70 కిలోమీటర్ల దూరం. ఈ ప్రాంతం ట్రెక్కింగ్‌కు కూడా చాలా ప్రసిద్ధి చెందింది.ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 4-8 గంటల వరకు త్రియుగినారాయణ ఆలయాన్ని సందర్శించుకోవచ్చు. -
కేదారేశ్వరుని సేవలో కన్నప్ప టీమ్.. వీడియో వైరల్!
టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప సినిమాను తెరకెక్కించడంలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీని షూటింగ్‌ను విదేశాల్లో చిత్రీకరించారు. కన్నప్పలో ప్రభాస్‌తో పాటు పలువురు స్టార్ నటులు కనిపించనున్నారు. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ ఏడాది డిసెంబర్లో పాన్ ఇండియాలో విడుదల చేయడానికి కన్నప్ప టీమ్ సన్నాహాలు చేస్తోంది.తాజాగా కన్నప్ప టీమ్ ఆలయాల సందర్శనకు బయలుదేరింది. మంచువిష్ణు, మోహన్ బాబుతో సహా పలువురు చిత్రబృంద సభ్యులు బద్రినాథ్, కేదార్నాథ్ ఆలయాలను దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శివుని భక్తుడైన కన్నప్ప మూవీ సక్సెస్ కావాలని కేదారాశ్వరుని ఆశీస్సులు తీసుకున్నట్లు తెలుస్తోంది.కాగా.. ఇప్పటికే కన్నప్ప టీజర్ రిలీజ్ కాగా.. అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన కొన్ని గంటల్లోనే అత్యధి వ్యూస్ సాధించింది. విష్ణు మంచు యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలు, అక్షయ్ కుమార్, ప్రభాస్ క్లోజప్ షాట్స్, హై ప్రొడక్షన్ వ్యాల్యూస్, స్టన్నింగ్ విజువల్స్, అదిరిపోయే పర్ఫార్మెన్స్ లతో ప్రేక్షకులని అలరించింది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నారు.Seeking blessings for an epic tale! @ivishnumanchu and team #Kannappa’s sacred journey to #Kedarnathॐ and #Badrinathॐ. #HarHarMahadevॐ@themohanbabu @mukeshvachan @arpitranka_30 @24FramesFactory @avaentofficial @KannappaMovie #TeluguFilmNagar pic.twitter.com/nHwehDTfO7— Telugu FilmNagar (@telugufilmnagar) October 25, 2024 -
సీఎం రేవంత్‌కు ఎంపీ ఈటల హెచ్చరిక
సాక్షి,హైదరాబాద్:సర్వేజన సుఖీనోభవ అన్నది తమ సిద్ధాంతమని,తమ సంస్థల పట్ల సీఎం రేవంత్ ద్వేషబావంతో ఉన్నారని బీజేపీ సీనియర్‌నేత, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. మంగళవారం(అక్టోబర్22) ఈటల మీడియాతో మాట్లాడారు.‘కాంగ్రెస్ పార్టీ లౌకిక వాదం పేరుతో మతోన్మాదులకు షెల్టర్ ఇస్తున్నారు.కాంగ్రెస్ పార్టీది నీచమైన కల్చర్. సీఎంను దించడానికి మత కల్లోలాలు సృష్టించడం కాంగ్రెస్‌కు అలవాటు. మర్రి చెన్నారెడ్డిని దించడానికి,కోట్ల విజయభాస్కర్ రెడ్డిని దించడానికి మతకల్లోల్లాలు సృష్టించారు.శవాల మీద రాజకీయాలు చేసే చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మతకల్లోలాలు జరిగిన ఘటనలు అనేకం ఉన్నాయి. గుడిపై దాడిచేసిన వారిని పట్టుకునే దమ్ములేక ఓట్ల రాజకీయం కోసం శాంతియుత ర్యాలీ చేస్తున్న వారిని అరెస్ట్ చేస్తున్నారు. స్లీపర్ సెల్స్ ఉన్నాయని,రోహింగ్యాలు ఉన్నారని కేంద్రం హెచ్చరికలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నివారించలేకపోతోంది.టెర్రరిస్టులు ఎవరు ? రెచ్చగొట్టేవారు ఎవరు ? సంఘ విద్రోహ శక్తులు ఎవరో తేల్చాలి.హిందువుల ఆత్మగౌరవాన్ని కాపాడటంలో రేవంత్ విఫలమయ్యారు.శాంతిభద్రతల పరిరక్షణ కోసమే బీజేపీ పనిచేస్తోంది. హిందూ కార్యకర్తల అరెస్టులను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తున్న.చేతులు ముడుచుకొని కూర్చోవడానికి సిద్ధంగా లేము’అని ఈటల హెచ్చరించారు.ఇదీ చదవండి: కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్ -
సికింద్రాబాద్‌లో టెన్షన్.. టెన్షన్
రాంగోపాల్‌పేట్: కుమ్మరిగూడ ముత్యాలమ్మ దేవా లయంలో అమ్మవారి విగ్రహ ధ్వంసాన్ని నిరసిస్తూ శనివారం పలు హిందూ సంఘాలు ఇచ్చిన సికింద్రాబాద్ బంద్ పిలుపు ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకారులు రెచ్చిపోయి పోలీసులపైకి చెప్పు లు, రాళ్లు, కుర్చీలు విసిరారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో నలుగురు యువ కులకు తలలు పగిలి గాయాలు కాగా ఓ యువకుడి చేయి విరిగింది. అలాగే ఆందోళనకారులు విసిరిన రాళ్లతో కొంత మంది పోలీసులకు స్వల్ప గాయా లయ్యాయి. ఈ నెల 14న కుమ్మరిగూడ ముత్యా లమ్మ దేవాలయంలో ఓ వ్యక్తి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. దీన్ని నిరసిస్తూ శనివారం సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి దేవా లయం వద్ద నుంచి వేలాది మంది హిందువులు ర్యాలీగా బయలుదేరారు. ఎంపీ ఈటల రాజేందర్ ఆందోళనకారులతో కలిసి మహంకాళి దేవాలయం వద్ద బైఠాయించి హనుమాన్ చాలీసా చదివి ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో ఆందోళనకా రులు నినాదాలతో హోరెత్తించారు. కొంతమంది మోండా మార్కెట్ వైపు, మరికొంత మంది కవాడిగూడ వైపు ర్యాలీగా వెళ్లారు. మోండా, ఆల్ఫా హోటల్ మీదుగా ముత్యాలమ్మ దేవాలయం వద్దకు ఆందోళన కారు లు చేరుకున్నారు. వేలాదిమంది ర్యాలీలో పాల్గొ నడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. దేవాల యం పక్కనే మరో వర్గానికి చెందిన ప్రార్థన మందిరం కూడా ఉంది. ఆందోళనకారులు ఆ వైపు వెళ్లేందుకు వస్తుండటంతో పోలీసులు వారిని అడ్డుకు న్నారు. దీంతో ఆందోళనకారులు రెచ్చిపోయి చెప్పులు, రాళ్లు, వాటర్ బాటిళ్లు విసరడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. ఆలయాల రక్షణలో కాంగ్రెస్ విఫలం: ఛుగ్సాక్షి, న్యూఢిల్లీ: హిందూ దేవాలయాలను రక్షించడంలో, భక్తుల మనోభావాలను గౌరవించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ ఛుగ్ మండిపడ్డారు. శనివారం సికింద్రాబాద్‌లోని శ్రీ ముత్యాలమ్మ దేవి ఆలయం వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై లాఠీచార్జి చేయడాన్ని ఖండించారు.కేంద్ర మంత్రుల పరామర్శ కంటోన్మెంట్: లాఠీచార్జిలో గాయపడిన పికెట్‌కు చెందిన గుడిపల్లి వెంకట్‌ను కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించేందుకు వెంటనే కిమ్స్ ఆసుపత్రికి తరలించాలని స్థానిక బీజేపీ నేతలకు సూచించారు. -
జగేశ్వర్ ధామ్‌లో మృణాల్ ఠాకుర్ పూజలు (ఫొటోలు)
-
ముత్యాలమ్మ గుడి ఘటన.. కేటీఆర్ కీలక ట్వీట్
సాక్షి,హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ ఆలయంపై జరిగిన దాడి తీవ్ర కలకలం రేపుతోందని, దాడికి పాల్పడ్డ అక్రమార్కులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం(అక్టోబర్ 14) కేటీఆర్ ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు.‘ఇలాంటి తెలివితక్కువ చర్యలు మన నగరం యొక్క సహనశీలతకు మచ్చ. గడిచిన నెలరోజులుగా శాంతిభద్రతలు దిగజారుతున్నాయని,దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కేటీఆర్ హెచ్చరించారు.ఇదీ చదవండి: సికింద్రాబాద్ కుమ్మరిగూడలో ఉద్రిక్తత -
విహంగ విహారం : నైనితాల్ కేబుల్ కారు, బోట్ షికారు!
నైనితాల్... ఎనభైల నాటి సినిమాల్లో చూసిన ప్రదేశం. కథానుగుణంగా కొన్ని సీన్లను ఇక్కడ చిత్రీకరించేవారు. పాత్రలన్నీ మంకీ క్యాప్, ఉలెన్ స్వెటర్, ఫుల్ షూస్, షాల్‌తో ఇక్కడ చల్లగా ఉంటుందని చెప్పకనే చెప్పే దృశ్యాలుండేవి. ఈ ప్రదేశం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఢిల్లీ నుంచి మూడు వందల కిలోమీటర్లు ఉంటుంది. ఆధ్యాత్మికతకు, అడ్వెంచర్‌కి, ప్రశాంతంగా గడపడానికి, నేచర్‌ను ప్రేమించేవారికి అందరికీ, అన్ని వయసుల వారికీ అనువైన టూరిస్ట్ ప్రదేశం ఇది. అయితే పెద్దవాళ్లు మార్చి నుంచి జూన్ మధ్యలో వెళ్లడం బాగుంటుంది. హనీమూన్ కపుల్‌కి ఈ నెల మంచి సమయం. రెండు వేల మీటర్ల ఎత్తులో కుమావ్ పర్వత శ్రేణుల్లో ఉంది నైనితాల్. చుట్టూ హిమాలయ పర్వతాలు, దట్టమైన పచ్చని వృక్షాల మధ్య ఓ సరస్సు. పచ్చదనం మధ్యలో ఉండడం వల్లనేమో నీరు కూడా పచ్చలరాశిని తలపిస్తుంది. పౌరాణిక కథల ప్రకారం సతీదేవి కన్ను పడిన ప్రదేశం ఇదని చెబుతారు. ఈ సరస్సు పరిసరాల్లో ఉండే భీమ్తాల్, సాత్తాల్, నౌకుచియాల్తాల్లకు కూడా పౌరాణిక కథనాలున్నాయి. మనదేశంలో హిల్ స్టేషన్లను ఎక్స్ప్లోర్ చేసింది బ్రిటిషర్లే. చల్లని ప్రదేశాలను వేసవి విడుదులుగా డెవలప్ చేశారు వాళ్లు. దాంతో ఇక్కడ బ్రిటిష్ బంగ్లాల మధ్య విహరిస్తుంటే యూరప్‌ను తలపిస్తుంది. నైనితాల్‌లో బోట్ షికార్‌తో΄పాటు యాచింగ్, పెడలింగ్ చేయవచ్చు. ఇంకా గుడారాల్లో క్యాంపింగ్, పర్వతాల మీదకు ట్రెకింగ్, రాక్ క్లైంబింగ్, పారా గ్లైడింగ్ చేయవచ్చు. ఏ అడ్వెంచర్ చేసినా చేయకపోయినా కేబుల్ కార్ మాత్రం ఎక్కాల్సిందే. కేబుల్ కార్లో వెళ్తూ తెల్లటి మంచు శిఖరాలను పై నుంచి చూడవచ్చు. -
Bangladesh: ప్రధాని మోదీ గిఫ్ట్‌గా ఇచ్చిన కాళీమాత కిరీటం చోరీ
బంగ్లాదేశ్‌లోని అమ్మవారి ఆలయంలో కాళీదేవి కిరీటం చోరికి గురవ్వడం కలకలం రేపుతోంది. సత్కిరాలోని జెషోరేశ్వరి ఆలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా చోరికి గురైన ఆ కాళేదేవి కిరీటాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బహుమతిగా ఇచ్చారు. 2021 మార్చిలో బంగ్లాదేశ్‌లో పర్యటించిన ప్రధాని మోదీ.. కాళీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ సమయంలో ఆలయంలోని కాళీమాతకు బంగారు కిరీటాన్ని గిఫ్ట్‌గా అందించారు. ఈ కిరీటాన్ని వెండితో తయారు చేయగా.. బంగారు పూత పూశారు. అయితే ఇప్పుడు ఆ కిరీటం దుర్గాపూజ నవరాత్రోత్సవాల సందర్భంలో దొంగతనం చేయడం ప్రస్తుతం దుమారం రేపుతోంది.గురువారం రాత్రి ఆలయ పూజారి పూజలు ముగించుకుని వెళ్లిన తర్వాత ఈ చోరీ జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది క్లీనింగ్ చేస్తున్న సమయంలో కిరీటం పోయినట్లుగా గుర్తించారు.ఈ ఘటన ఆలయంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. అందులో ఓ యువకుడు బంగారు కిరీటం తీసుకెళ్తున్న దృశ్యాలు కనిస్తున్నాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.స్పందించిన భారత్ఈ పరిణామంపై భారత్ స్పందించింది. ఆలయంలో కాళీమాత కిరీటం దొంగతనంపై ఆందోళనను వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తు చేసి, దొంగిలించిన కిరీటాన్ని తిరిగి పొందాలని, నిందితులపై చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఢాకాలోని భారత హైకమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. -
ఆలయంలోనికి చెప్పులతో వచ్చిన అధికారి సస్పెండ్
మీర్జాపూర్: యూపీలోని మీర్జాపూర్ జిల్లాలో ఆలయ నిబంధనలు విస్మరించిన ఒక అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. ఇక్కడి వింధ్యవాసిని ఆలయంలోనికి పాదరక్షలు ధరించి వచ్చిన అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ (వ్యవసాయం)ను జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేశారు.ఆలయంలో పాదరక్షలు ధరించిన ఏడీఓను చూసిన భక్తులు నిరసన వ్యక్తం చేశారు. అలాగే ఆలయంలో ఏడీఓ బూట్లు ధరించి ఉండడం చూసిన ఎమ్మెల్యే రత్నాకర్ మిశ్రా అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా మెజిస్ట్రేట్ సదరు ఏడీఓను వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. రాష్ట్ర సమాచార శాఖ విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలోని వివరాల ప్రకారం విద్యవాసిని ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి.ఆలయంలో అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన ఏడీఏ ప్రతీక్ కుమార్ సింగ్ షూష్‌తో సహా ఆలయంలోనికి ప్రవేశించారు. ఇది కలకలం సృష్టించింది. జిల్లా మేజిస్ట్రేట్ ప్రియాంక నిరంజన్ ఆదేశాల మేరకు ప్రతీక్ కుమార్ సింగ్‌ను తక్షణమే సస్పెండ్ చేసినట్లు సంబంధిత అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యే రత్నాకర్ మిశ్రా మాట్లాడుతూ చెప్పులు ధరించి, గుడి మెట్లు ఎక్కుతున్న అధికారిని చూసి, తాను ఆలయంలో నుంచి బయటకు పంపించివేశానని తెలిపారు. ఇది కూడా చదవండి: దేశంలోని ఐదు ప్రముఖ కాళీమాత మందిరాలు -
ఘనంగా రేణుకామాత నవరాత్రి వేడుకలు
బుర్హాన్పూర్: మధ్యప్రదేశ్‌లోని చారిత్రక నగరం బుర్హాన్పూర్. ఇక్కడ వెయ్యేళ్ల పురాతన రేణుకామాత ఆలయం ఉంది. శరదానవరాత్రులు, చైత్ర నవరాత్రులలో ఇక్కడ ఘనంగా వేడుకలు నిర్వహిస్తుంటారు.శరన్నవరాత్రులలో రేణుకా మాత ఆలయ సమీపంలో ప్రతీయేటా జాతర నిర్వహిస్తారు. ఈ జాతర 9 రోజుల పాటు ప్రతీరోజూ ఉదయం 5:00 గంటల నుంచే ప్రారంభమవుతుంది. ఆలయంలో అమ్మవారికి మూడుసార్లు హారతి నిర్వహిస్తారు. నవరాత్రులలో తెల్లవారుజాము నుంచే భక్తుల రాక మొదలువుతుంది. రేణుకా మాత ఆలయ పూజారి జై శుక్లా మాట్లాడుతూ తమ కుటుంబం ఏడు తరాలుగా ఇక్కడ సేవలు అందిస్తున్నదన్నారు. ఈ ఆలయం సుమారు వెయ్యేళ్లనాటిదని, పెళ్లికానివారు రేణుకామాతను దర్శించుకుంటే వారికి త్వరగా వివాహమవుతుందనే నమ్మకం స్థానికుల్లో ఉన్నదన్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలోని పలు జిల్లాల నుంచి ఇక్కడికి భక్తులు తరలివస్తారు. ఉదయం 5:00 గంటల నుండి రాత్రి 11:00 గంటల వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకోవచ్చు. నవరాత్రుల సందర్భంగా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.ఇది కూడా చదవండి: అగ్ని స్నానమాచరించే అమ్మవారు..! సైన్సుకే అంతు చిక్కని మిస్టరీ! -
పురాతన శైలపుత్రి ఆలయానికి భక్తుల క్యూ
వారణాసి: దేశవ్యాప్తంగా దసరా శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ రోజుల్లో అమ్మవారి తొమ్మిది రూపాలకు పూజలు నిర్వహిస్తారు. నవరాత్రులలో తొలి రోజున శైలపుత్రి రూపాన్ని పూజిస్తారు.శివుని నగరంగా పేర్కొనే వారణాసిలో శైలపుత్రి అమ్మవారి పురాతన ఆలయం ఉంది. నవరాత్రుల తొలిరోజున ఈ ఆలయంలో ఎంతో ఘనంగా పూజలు జరుగుతాయి. ఈ నేపధ్యంలో నేటి తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఈ పురాతన ఆలయం వారణాసి సిటీ స్టేషన్‌కు కొద్ది దూరంలో ఉంది. ఈ శైలపుత్రి ఆలయాన్ని ఎవరు నిర్మించారనేది ఇప్పటికీ స్పష్టం కాలేదు.ఆలయ పూజారి మీడియాకు ఈ ఆలయానికి సంబంధించిన పురాణ కథను తెలిపారు. శైలపుత్రి అమ్మవారు శైలరాజు ఇంట్లో జన్మించారు. ఆ సమయంలో నారదుడు అక్కడికి వచ్చి, శైలపుత్రి ఎంతో ప్రతిభావంతురాలవుతుందని తెలిపారట. శైలపుత్రికి చిన్నప్పటి నుంచే మహాశివునిపై ఇష్టం ఏర్పడింది. ఆమె పెరిగి పెద్దయ్యాక కాశీకి చేరుకుని, శివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు తపస్సు చేసింది. కుమార్తె కోసం వెదుకుతూ కాశీ చేరుకున్న శైలరాజు కూడా తపస్సు ప్రారంభించాడని చెబుతారు. అనంతర కాలంలో ఈ ప్రాంతంలో శైలపుత్రితో పాటు ఆమె తండ్రి శైలరాజు ఆలయాలు నిర్మితమయ్యాయి. శైలపుత్రి ఆలయంలో మహాశివుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు.ఇది కూడా చదవండి: శోభాయమానంగా ఇంద్రకీలాద్రి -
శరన్నవరాత్రులకు వజ్రేశ్వరి దేవి ముస్తాబు
థానే: దేశవ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 3 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దేశంలోని ప్రముఖ అమ్మవారి ఆలయాలలో వజ్రేశ్వరి దేవి ఆలయం ఒకటి. నవరాత్రులలో ఈ అమ్మవారిని దర్శించుకుంటే సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయని భక్తులు నమ్ముతారు. వజ్రేశ్వరి దేవి ఆలయం మహారాష్ట్రలోని వజ్రేశ్వరిలో ఉంది. ఈ నగరం ముంబైకి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని చిమాజీ అప్పా పేష్వా నిర్మించాడని చెబుతారు. ఈ ఆలయాన్ని పోర్చుగీస్ వారు ధ్వంసం చేశారని చరిత్రకారులు అంటుంటారు. పిడుగుపాటు నుండి మాతా వజ్రేశ్వరి దేవి ప్రత్యక్షమై పలువురు రాక్షసులను అంతం చేసిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయంలో వజ్రేశ్వరి దేవితో పాటు రేణుకా మాత, కాళికా మాత, మహాలక్ష్మి అమ్మవార్ల విగ్రహాలు ఉన్నాయి.వజ్రేశ్వరి దేవి ఆలయ ప్రాంగణంలో ఒక వేడి నీటి చెరువు ఉంది. దీనిలో స్నానం చేస్తే అనేక వ్యాధులు నయమవుతాయని స్థానికులు చెబుతుంటారు. నవరాత్రులలో ఇక్కడికి వచ్చే భక్తులు ఈ చెరువులో స్నానం చేసి, అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ ఆలయ సౌందర్యం నవరాత్రులలో మరింత శోభాయమానంగా మారుతుంది. వజ్రేశ్వరిదేవి ఆలయానికి చేరుకోవాలంటే 52 మెట్లు ఎక్కాలి. నవరాత్రుల సమయంలో ఈ మెట్లను వేల రకాల పూలు, దీపాలతో అందంగా అలంకరిస్తారు.నవరాత్రులలో ప్రతిరోజూ వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివస్తుంటారు. సాయంత్రం హారతి సమయంలో ప్రాంగణం అత్యంత రద్దీగా మారుతుంది. వజ్రేశ్వరి దేవి ఆలయాన్ని దర్శించుకోవాలంటే ముందుగా ముంబైకి చేరుకుని, అక్కడి నుంచి టాక్సీ సాయంతో ఆలయానికి రావచ్చు. మహారాష్ట్రలోని థానే నగరం నుండి కూడా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఇది కూడా చదవండి: గయతో పాటు ఈ ప్రాంతాల్లోనూ పిండ ప్రదానాలు -
పూజారిని చంపిన చిరుత.. 10 రోజుల్లో ఆరో ఘటన
ఉదయపూర్: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లాలో చిరుతపులి భీభత్సం కొనసాగుతోంది. తాజాగా గోగుండాలో ఒక పూజారిపై చిరుతపులి దాడి చేసింది. ఈ దాడిలో పూజారి మృతిచెందాడు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఆ చిరుతపులి ఆలయంలోని పూజారిని నోట కరుచుకుని లాక్కుపోయింది.కొద్దిసేపటికి ఆలయానికి కొంత దూరంలో పూజారి మృతదేహం స్థానికులకు కనిపించింది. నిత్యం చిరుతపులి దాడులతో గ్రామస్తులు భయాందోళనలకు లోనవుతున్నారు. గడచిన 10 రోజుల్లో చిరుత ఆరుగురిపై దాడి చేసింది. ఇదేవిధంగా గోగుండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చిరుతపులి దాడిలో ఒక వృద్ధురాలు మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గట్టు బాయి(65) ఇంట్లో ఒంటరిగా ఉంది. భర్త సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఆమె కనిపించలేదు. స్థానికులు అడవిలో గట్టు బాయి మృతదేహం కనిపించింది.మరోవైపు గోగుండ అడవుల్లో ఒక చిరుతపులి అటవీశాఖ అధికారులకు పట్టుబడింది. గోగుండ పోలీస్ స్టేషన్ పరిధిలో చిరుతపులి దాడుల్లో ఐదుగురు మృతిచెందారు. ఇటీవల ఐదేళ్ల బాలిక చిరుతపులి దాడిలో మృతి చెందింది. సూరజ్ (5) అనే బాలికను చిరుత నోట కరచుకుని, పొలాల్లోకి తీసుకెళ్లి చంపేసింది. గ్రామస్తులు ఆ బాలిక కోసం వెతకగా, ఆ చిన్నారి మృతదేహం వారికి లభ్యమైంది.ఇది కూడా చదవండి: AP: ఇంట్లో పేలిన డిటోనేటర్లు.. వీఆర్ఏ మృతి -
లడ్డూ పాపం చంద్రబాబుదే
-
చంద్రబాబు పాపానికి ప్రక్షాళనగా YSRCP నేతల ప్రత్యేక పూజలు
-
మహాకాళేశ్వరం గోడ కూలి ఇద్దరు మృతి
ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి మహాకాళేశ్వరం ప్రహరీ గోడ కూలి ఇద్దరు మృతిచెందారు. ఆలయానికున్న గేట్ నంబర్ నాలుగుకు ముందు మహాకాళ్ లోక్ ఫేజ్ టూ సమయంలో నిర్మించిన గోడపై మరొక గోడను నిర్మిస్తున్నారు. భారీ వర్షానికి ఈ గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారని, గోడలోని కొంత భాగం కూలిపోగా, దాని కింద నలుగురు సమాధి అయ్యారని ఉజ్జయిని కలెక్టర్ నీరజ్ కుమార్ సింగ్ తెలిపారు. వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించి, బాధితులను శిథిలాల నుంచి రక్షించి జిల్లా ఆస్పత్రికి తరలించారన్నారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం ఇండోర్‌కు తరలించారని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు చొప్పున, క్షతగాత్రులకు చికిత్స నిమిత్తం రూ.50 వేలు చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. మృతులను ఫర్హీన్ (22), అజయ్ యోగి (27)గా గుర్తించినట్లు సీఎంహెచ్వో ఏకే పటేల్ తెలిపారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ సంతాపం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. నిర్మాణ పనుల్లో జరిగిన అవకతవకలపై విచారణకు ఆదేశించారు.ఇది కూడా చదవండి: ‘కేజ్రీవాల్ జైల్లో ఎందుకు రాజీనామా చేయలేదు?’ -
హిందూ ధర్మ ద్రోహి.. 'నారా'సురుడు
-
పునీత్‌కు గుడి కట్టిన వీరాభిమాని
హుబ్లీ: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కన్నడ వెండి తెరపై విరాజిల్లడంతో పాటు తన ఎనలేని సామాజిక సేవతో రాష్ట్ర ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్నారు. ఆ అభిమానంతోనే హావేరి జిల్లాలో ఆయన పేరిట నిలువెత్తు విగ్రహంతో కూడిన ఆలయాన్ని గురువారం ఆయన సతీమణి అశ్విని ప్రారంభించారు. హావేరి జిల్లాలోని యలగట్టి గ్రామంలో పునీత్ వీరాభిమాని నిర్మించిన ఈ ఆలయంలో గురువారం నుంచి పూజలు ప్రారంభంఅయ్యాయి. ప్రకాష్ అనే అభిమాని తన ఇంటి ఎదురుగా ఈ ఆలయాన్ని నిర్మించారు. జనం మెచ్చిన పునీత్‌లాంటి నటులతో తమ పిల్లల నామకరణం చేయడం ఆనవాయితీ. పునీత్‌ను కన్నడిగులు అప్పు అని ముద్దుగా పిలుచుకుంటారు. ఈ క్రమంలో అభిమాని ప్రకాష్, ఆయన భార్య దీపాల బిడ్డకు అపేక్ష అనే పేరుని అశ్విని పెట్టారు. అప్పు సేవలను సహధర్మచారిణి అశ్విని ఎంతో ఆసక్తిగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే తమ అభిమాని ప్రకాష్ ఆశయాన్ని కూడా నెరవేర్చారు.ఇలాంటి అభిమాని ఉండటం మా పుణ్యంఈ సందర్భంగా అశ్విని మీడియాతో మాట్లాడుతూ అభిమానులకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. ప్రకాష్ అనే అభిమాని సొంత స్థలంలో అప్పు ఆలయాన్ని నిర్మించారు. ఇలాంటి అభిమాని ఉండటం తమ పుణ్యం, ఇది తనకు ఎంతో సంతోషం కలిగించిందని ఆమె భావోగ్వేగానికి గురయ్యారు. అభిమాని సొంత డబ్బులతో సుమారు రూ.10 లక్షలు వ్యయం చేసి ఆలయాన్ని నిర్మించారు. పూజల ప్రారంభం సందర్భంగా వివిధ కళా బృందాలు, కుంభమేళా తదితర విశేష కార్యక్రమాలు జరిగాయి. విశేషంగా పునీత్ అభిమానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో శ్రద్ధగా నెరవేర్చి తమ అభిమాన నటుడిని స్మరించుకున్నారు. అనంతరం స్కూల్ మైదానంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. పలువురు సినీ నటులు, రాజకీయ నాయకులు, మఠాధిపతులు పాల్గొన్నారు. కాగా చివరి విశేషంగా అన్నదానం కూడా నెరవేర్చారు. -
తిరుమల పవిత్రత రక్షణకు వైఎస్ జగన్ పిలుపు
-
నేడు హనుమాన్ ఆలయానికి సీఎం కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఆయన జైలు నుంచి బయటకు రాగానే ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, నేతలు, మద్దతుదారులలో ఉత్సాహం కనిపించింది. వర్షంలో తడుస్తూనే వారంతా కేజ్రీవాల్‌కు స్వాగతం పలికారు.సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు (శనివారం) మధ్యాహ్నం 12 గంటలకు హనుమాన్ ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆయనతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఇతర నేతలు కూడా హాజరుకానున్నారు. సీఎం హనుమాన్ ఆలయంలో స్వామివారిని దర్శించుకుని, పూజలు చేయనున్నారు.శుక్రవారం భారీ వర్షం కురుస్తున్నప్పటికీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు స్వాగతం పలికేందుకు తీహార్ జైలు వెలుపల అభిమానులు గుమిగూడారు. కేజ్రీవాల్‌కు ఆప్ కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. డప్పుల దరువులు, నృత్యాలు, కేజ్రీవాల్‌కు మద్దతుగా పలికే నినాదాల మధ్య ఆ ప్రాంతమంతా ఉత్సాహంతో నిండిపోయింది. కేజ్రీవాల్‌కు మద్దతుగా పలు నినాదాలతో కూడిన పోస్టర్లు, బ్యానర్లను అభిమానులు ప్రదర్శించారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో సహా పార్టీ సీనియర్ నేతలు తదితరులు సీఎం కేజ్రీవాల్‌కు స్వాగతం పలికినవారిలో ఉన్నారు.ఇది కూడా చదవండి: ఆ కూడలికి భగత్ సింగ్ పేరు పెట్టండి: పాక్ కోర్టు -
‘హాథీరాం బావాజీ’ ప్రాంగణంలో బీభత్సం
తిరుపతి రూరల్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామితో పాచికలు ఆడిన హాథీరాం బావాజీకి ప్రపంచంలోనే ప్రప్రథమంగా తిరుపతిలో నిర్మిస్తున్న ఆలయం ప్రాంగణంలో గురువారం తెల్లవారుజామున మఠం అధికారులు బీభత్సం సృష్టించారు. చీకట్లో జేసీబీలతో వచ్చి ఆలయానికి చెందిన కట్టడాలను ధ్వంసం చేశారు. కూల్చివేతలను అడ్డుకొనకుండా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నాయకుడు శివనాయక్‌ను బుధవారం అర్ధరాత్రి పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. ఆ తర్వాత కాసేపటికే కూల్చివేతలు ప్రారంభించారు. మఠం ఏఏఓ శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో మఠం సిబ్బంది పోలీసులతో వచ్చి బావాజీ ఆలయం ప్రాంగణంలోని వసతి సముదాయం, విజ్ఞాన మందిరం, పోటు, పూజా సామగ్రి గదులను కూల్చేశారు. ఆలయ కమిటీ సభ్యులు, బంజారా జాతి ప్రజలు ఈ కూల్చివేతలను అడ్డుకున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, కోర్టు ఇంజెంక్షన్ ఆర్డర్ ఉన్నా ఆస్తులను ఎలా ధ్వంసం చేస్తారని నిలదీశారు. అయినా మఠం సిబ్బంది దౌర్జన్యంగా నిర్మాణాలను కూల్చేశారు. బంజారాలు పూజించే హా«థీరాం బావాజీకి ఇప్పటివరకు ఆలయం లేదు. దీంతో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అధ్యక్షుడు శివనాయక్ ఆలయ ధర్మకర్తగా బంజారా జాతి ప్రజలు ఆలయం నిర్మాణానికి పూనుకొన్నారు. తిరుపతికి సమీపంలోని వేదాంతపురం పంచాయతీ పరిధిలో హాథీరాంజీ మఠం భూముల్లో ప్రపంచంలోనే ప్రప్రథమంగా బావాజీ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆలయాన్ని నిర్మిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న బంజారా జాతి ప్రముఖులు సొంత నిధులతో ఈ ఆలయాన్ని, వసతి గృహాలను నిర్మిస్తున్నారు. బంజారాల విజ్ఞప్తి మేరకు గతంలో హాథీరాంజీ మఠం మహంతుగా పనిచేసిన అర్జునదాస్ కేటాయించిన భూమిలోనే ఆలయాన్ని నిర్మిస్తున్నామని, అవినీతికి సహకరించలేదనే కక్షతో కొందరు మఠం అధికారులు ఆలయాన్ని, వసతి గృహాలను తొలగించేందుకు ప్రయత్నిస్తే అడ్డుకున్నట్లు గతంలో పలుమార్లు తెలిపారు. అధికారుల బెదిరింపులతో కోర్టుకు వెళ్లి ఇంజెంక్షన్ ఆర్డర్ పొందినట్లు తెలిపారు.అయితే, అవన్నీ అక్రమ నిర్మాణాలని మఠం ఏఏఓ శ్రీనివాసులు రెడ్డి చెప్పారు. మఠం భూములకు, శివనాయక్‌కు సంబంధం లేదన్నారు. ఆలయం పేరుతో మఠం భూములను కబ్జా చేస్తున్నందునే అక్రమ నిర్మాణాలన్నింటినీ దేవదాయ శాఖ, రెవెన్యూ, పోలీసు శాఖలతో కలిసి తొలగించామని చెప్పారు. ఆలయాన్ని నిర్మించడమే తప్పా వేల కోట్ల ఆస్తులు ఉన్నా కూడా హాథీరాంజీ మఠం అధికారులు హాథీరాం బావాజీకి ఇంత వరకు ఆలయాన్ని నిర్మించలేదు. బంజారాలు ఆరాధించే బావాజీకి ప్రపంచంలోనే ప్రప్రథమంగా తిరుపతిలో ఆలయాన్ని నిర్మించేందుకు బంజారా సేవా సంఘం పలుమార్లు మహంతు అర్జునదాస్కు విన్నవించాం. ఆయన స్థలం కేటాయించడంతో బంజారాలం అందరం చందాలు వేసుకుని మరీ ఆలయాన్ని నిర్మిస్తున్నాం. ఇప్పుడు కూల్చివేయడం అన్యాయం. అక్రమం. – శివనాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అధ్యక్షుడు -
పురాతన ఆలయంలో ఎన్టీఆర్ దంపతుల పూజలు.. వీడియో వైరల్!
యంగ్ టైగర్ జూనియర ఎన్టీఆర్ ప్రస్తుతం కర్ణాటకలో బిజీగా ఉన్నారు. తన ఫ్యామిలీతో కలిసి ప్రముఖ ఆలయాలను సందర్శిస్తున్నారు. ఇటీవల అమ్మతో కలిసి ప్రముఖ శ్రీకృష్ణుని ఆలయాన్ని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సైతం తన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ పర్యటనలో తన తల్లి షాలిని, భార్య లక్ష్మిప్రణతీ కూడా వెంట ఉన్నారు. ఈ ఆలయం దర్శనంతో తన తల్లి కల నెరవేరిందని జూనియర్ వెల్లడించారు.తాజాగా తన కుటుంబంతో కలిసి మరో ప్రముఖ ఆలయాన్ని దర్శించుకున్నారు. కాంతార రిషబ్ శెట్టి, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్‌నీల్ దంపతులతో కలిసి ఎన్టీఆర్, ప్రణతీ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అడవుల్లోని ఉన్న గుహల్లో ఉన్న మూడగల్లులోని కేశవనాథేశ్వర ఆలయాన్ని సందర్శించటారు. అక్కడే ఉన్న ఆలయ గుహల్లో ఎన్టీఆర్ నడుచుకుంటూ వెళ్తున్న వీడియోను రిషబ్ శెట్టి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.తండ్రి జయంతిని స్మరించుకుంటూ..ఇవాళ నందమూరి హరికృష్ణ 68వ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తన తండ్రిని స్మరించుకున్నారు. ఆయన ఫోటోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న థియేటర్లలో సందడి చేయనుంది. మీ 68వ జయంతి న మిమ్మల్ని స్మరించుకుంటూ... pic.twitter.com/yIi5pgFMQI— Jr NTR (@tarak9999) September 2, 2024 ಮೂಡುಗಲ್ಲು ಕೇಶವನಾಥೇಶ್ವರನ ದರ್ಶನ ಪಡೆದಾಗ.. ✨🙏🏼A blessed journey to Keshavanatheshwara Temple Moodagallu ✨🙏🏼@tarak9999 #PrashanthNeel pic.twitter.com/SWfP2TAWrk— Rishab Shetty (@shetty_rishab) September 2, 2024 -
ఉడుపిలో ఎన్టీఆర్ ఫ్యామిలీ.. ఈ ట్రిప్ చాలా స్పెషల్ (ఫొటోలు)
-
గుడి గంట కాలుష్యం.. పీసీబీ నుంచి నోటీసు
ఆలయంలోని గంటను మోగిస్తే దుష్టశక్తులు దూరమవుతాయని చెబుతుంటారు. అయితే ఇప్పుడు కోర్టు నోటీసులు వస్తున్నాయి. ఇటువంటి ఉదంతం ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలోని ఒక సొసైటీలోగల ఆలయానికి ఉత్తరప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి(యూపీపీసీబీ) నుంచి నోటీసు వచ్చింది. ఆలయంలోని గంటలు మోగించడం వలన శబ్ధ కాలుష్యం ఏర్పడుతున్నదంటూ యూపీపీసీబీ సదరు సొసైటీకి నోటీసు పంపింది. ఇప్పుడు ఈ నోటీసు కాపీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఉదంతం గౌర్ సౌందర్య సొసైటీలో చోటుచేసుకుంది. సొసైటీలో గల గుడిలో గంటలు మోగించడం వలన శబ్ద కాలుష్యం ఏర్పడుతున్నదని అక్కడ నివాసం ఉంటున్న ఓ వ్యక్తి కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేశారు. దీనిని స్పందించిన యూపీపీసీబీ సొసైటీకి నోటీసులు పంపింది.సొసైటీలో నివసిస్తున్న ముదిత్ బన్సల్ జూలై 30న ఈ-మెయిల్ ద్వారా యూపీపీసీబీకి ఫిర్యాదు చేశారు. ఆగస్టు 5న యూపీపీసీబీ అధికారులు ఆలయ గంట కారణంగా కలుగుతున్న శబ్ద కాలుష్యాన్ని తనిఖీ చేశారు. ఆ గంట నుంచి 70 డెసిబుల్స్ శబ్ధం వస్తున్నదని గుర్తించారు. సొసైటీకి జారీ చేసిన నోటీసులో యూపీపీసీబీ.. శబ్ద కాలుష్య నివారణ నిబంధనలను పాటించాలని, స్థానికులు ఇబ్బందులు పడకుండా చూడాలని సొసైటీని సూచించింది. ఈ నోటీసుపై సమాధానం కూడా కోరింది. కాగా కొందరు ఈ నోటీసుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిని ఉపసంహరించుకోవాలని యూపీపీసీబీని కోరుతున్నారు. -
Bihar: వెలుగులోకి తొక్కిసలాట వీడియో
బీహార్‌లోని జెహనాబాద్‌లోని బాబా సిద్ధేశ్వర్ నాథ్ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు మృతిచెందారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ ఫుటేజీలో ఆలయం చుట్టూ భక్తుల రద్దీ కనిపిస్తుంది. ఇరుకైన మార్గంలో తోపులాట జరగడాన్ని ఆ వీడియోలో చూడవచ్చు. అలాగే పలువులు భయాందోళనలతో పరుగులు తీయడం కూడా వీడియోలో కనిపిస్తుంది.శ్రావణమాసంలో శివలింగాన్ని అభిషేకించేందుకు ఆలయానికి సుమారు 60 వేల మంది భక్తులు చేరుకున్నారు. పూల విక్రయదారునితో కొందరు భక్తులకు గొడవ జరిగిన దరిమిలా అక్కడి వాలంటీర్లు లాఠీచార్జి చేయడంతో తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షి తెలిపారు.ఈ కేసులో ఒక పూల విక్రయదారుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ ఈ ఘటనలో ప్రమేయమున్న మరో ముగ్గురు పూల విక్రయదారుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారన్నారు. కాగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మృతులు ఒక్కొక్కరికి రూ.4 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. जहानाबाद: सिद्धेश्वर नाथ मंदिर में भगदड़ का VIDEO आया सामनेबिहार के जहानाबाद में बाबा सिदेश्वरनाथ मंदिर के भगदड़ का वीडियो आया सामने आया है, जहां अचानक मची भगदड़ की चपेट में आकर 7 लोगों की मौत हो गई थी.#bihar | #jehanabad | #jehanabadstampede | #video pic.twitter.com/dTB9wukSkP— NDTV India (@ndtvindia) August 13, 2024 -
శివనామస్మరణతో మారుమోగిన ఆలయాలు
ఉత్తరాదిన ఈరోజు శ్రావణమాసంలోని నాల్గవ సోమవారం. ఈ సందర్భంగా భక్తులు శివాలయాలకు చేరుకుని పూజలు చేస్తున్నారు. దీంతో ఆలయాలలో భక్తుల రద్దీ కనిపిస్తోంది. ఈ నేపధ్యంలోనే ఉజ్జయిని మహాకాళీశ్వరునికి ఘనంగా భస్మహారతి నిర్వహించారు. దీనిని తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. #WATCH | Ujjain, Madhya Pradesh: Bhasma Aarti performed at Mahakaleshwar Temple on the fourth Monday of the holy month of 'Sawan'. pic.twitter.com/8da9zfvocK— ANI (@ANI) August 11, 2024ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో భక్తులు గంగా నదిలో పవిత్ర స్నానాలు ఆచరించారు.#WATCH | Deoghar, Jharkhand: Devotees gather in huge numbers to offer prayers, on the fourth Monday of 'Sawan' month. pic.twitter.com/4zGvX14YB5— ANI (@ANI) August 11, 2024జార్ఖండ్‌లోని డియోఘర్‌లో శివాలయాయాలలో పూజలు నిర్వహించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.#WATCH | Uttar Pradesh: Devotees gather in huge numbers to offer prayers, on the fourth Monday of 'Sawan' month, at Shri Mankameshwar Mahadev Mandir in Prayagraj pic.twitter.com/qd3iu6iBPL— ANI (@ANI) August 12, 2024ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని మంకమేశ్వర్ మహాదేవ్ ఆలయానికి భక్తులు పోటెత్తారు.ఢిల్లీలోని గౌరీ శంకర్ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. #WATCH | Devotees gather in huge numbers to offer prayers, on the fourth Monday of 'Sawan' month, at Shri Gauri Shankar Mandir in Delhi pic.twitter.com/JXKpEOSO8t— ANI (@ANI) August 12, 2024 -
దండం పెట్టాడు - దొంగతనం చేశాడు
-
Maharashtra: నీట మునిగిన పురాతన ఆలయాలు
మహారాష్ట్రలోని పలు జిల్లాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రాజధాని ముంబైలోని పలు రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. పూణే, నాసిక్, సాంగ్లీ, కొల్హాపూర్‌లలోని నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. థానే, లోనావాలా, మహాబలేశ్వర్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా నాసిక్‌లోని పలు ఆలయాలు నీట మునిగాయి. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎన్డిఆర్ఎఫ్, ఆర్మీ బృందాలను సమాయత్తమయ్యాయి.నాసిక్‌లో కొన్ని గంటల పాటు కురిసిన భారీ వర్షాలకు గంగాపూర్ డ్యామ్ పొంగిపొర్లుతోంది. గోదావరి నది ఉప్పొంగడంతో గోదా ఘాట్ వద్దనున్న పలు చారిత్రక ఆలయాలు నీట మునిగాయి. వరదల దృష్ట్యా నది ఒడ్డున నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్లాలని స్థానిక యంత్రాంగం సూచించింది. ముందుజాగ్రత్త చర్యగా గోదా ఘాట్‌లోని దుకాణాలను మూసివేశారు. #WATCH | Maharashtra: Various temples were inundated under the Godavari river in Nashik, following incessant rainfall in the region. pic.twitter.com/oHjGYbTvDs— ANI (@ANI) August 5, 2024 -
విషాదం.. దేవాలయంలో గోడకూలి 9 మంది చిన్నారుల మృతి
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం సాగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ దేవాలయం గోడ కూలిన ఘటనలో మృతి చెందిన పిల్లల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఆదివారం ఉదయం సాగర్ జిల్లాలోని షాపూర్ అనే ప్రాంతంలో హర్దౌల్ బాబా (Hardaul Baba) ఆలయంలో మతపరమైన వేడుకలు జరిగే సమయంలో గోడ కూలి తొమ్మిది మంది మరణించారు. శిధిలాల కింద చిక్కుకున్న భక్తుల ప్రాణాలు కాపాడారు. ఈ దుర్ఘటనలో గాయపడ్డ క్షత గాత్రుల్ని అత్యవసర చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. Madhya Pradesh | 9 children died after being buried under the debris of a wall in Sagar. Some children are injured, and they are under treatment. All the debris has been removed from the site of the incident: Deepak Arya, Collector, Sagar(Source - DIPR) pic.twitter.com/saKV2RKADv— ANI (@ANI) August 4, 2024దేవాలయంలో జరిగిన ఈ విషాదంపై సమాచారం అందుకున్న సాగర్ జిల్లా కలెక్టర్ దీపక్ ఆర్య సందర్శించారు. గాయపడ్డ బాధితుల్ని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. బాధితులకు వెంటనే వైద్యం అందేలా ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. -
ఇదేందయ్యా ఇది.. ఏలియన్ కే గుడి కట్టేశాడు
-
Mathura: రూ. ఒక కోటి 9 లక్షలతో పూజారి పరార్
ఉత్తరప్రదేశ్‌లోని మథురలోని ఒక ఆలయంలో కలకలం రేపే ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి గోవర్ధన్‌లో గల ముకుట్ ముఖారవింద్ ఆలయంలో భారీ చోరీ జరిగింది. పూజారే స్వయంగా ఈ దొంగతనానికి పాల్పడటం ఈ ప్రాంతంలో సంచలనంగా మారింది.మీడియాకు అందిన సమాచారం ప్రకారం ముకుట్ ముఖారవింద్ ఆలయ పూజారి దినేష్ చంద్ రూ. ఒక కోటి 9 లక్షల రూపాయలతో పరారయ్యాడు. దినేష్ చంద్ ఈ సొమ్మును బ్యాంకులో జమ చేసేందుకు వెళ్లాడు. అయితే ఆ తరువాత ఆలయానికి తిరిగి రాలేదు. పూజారి ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో ఈ ఉదంతంపై ఆలయ మేనేజర్ చంద్ర వినోద్ కౌశిక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న గోవర్ధన్ పోలీసులు నిందితుని కోసం గాలింపు మొదలుపెట్టారు.ఈ ఘటన గురించి ఆలయ మేనేజర్ చంద్ర వినోద్ కౌశిక్ మాట్లాడుతూ ఆలయ పూజారి దినేష్ చంద్ ఆలయానికి సంబంధించిన సొమ్ములో సుమారు రూ. ఒక కోటి 9 లక్షలను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జమ చేసేందుకు వెళ్లినట్లు తెలిపారు. కాగా ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు దస్వీసా నివాసి అయిన నిందితుడు, పూజారి దినేష్ చంద్ ఇంటిలో నుంచి పోలీసులు రూ. 71 లక్షల 92 వేలు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన సొమ్ము గురించి ఆరా తీస్తున్నారు. ఆ పూజారి భార్య స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి, ఆలయానికి సంబంధించిన సొమ్మును అప్పగించింది. పరారీలో ఉన్న నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
హైదరాబాద్ : అమ్మవారి రంగం ఊరేగింపుల్లో హోరెత్తిన భక్తులు (ఫొటోలు)
-
భస్మహారతికి పోటెత్తిన భక్త జనం
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోగల మహాకాళేశ్వరుని ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రావణమాసం(ఉత్తరాదిన)లోని రెండవ సోమవారం(నేడు) సందర్భంగా భక్తులు మహాకాళేశ్వరుని దర్శనం కోసం తరలివస్తున్నారు.ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు మహాకాళేశ్వరునికి భస్మ హారతి అందించారు. అనంతరం స్వామివారిని అందంగా అలంకరించారు. శ్రావణమాసంలో మహాకాళేశ్వరుని దర్శనం కోసం విదేశాల నుంచి కూడా భక్తులు ఉజ్జయినికి తరలివస్తుంటారు. భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు పలు ఏర్పాట్లు చేశారు. శ్రావణమాసం రాకకు ముందే ఆలయ ప్రాంగణం అంతటా రంగులు వేశారు. ఈ మాసంలో ఆలయంలో నిర్వహించే మహాశివుని ఊరేగింపు వైభవంగా జరుగుతుంటుంది. దీనిని చూసేందుకు భక్తజనం అమితమైన ఆసక్తి చూపిస్తారు. Ujjain, MP: "Thousands of devotees are at Baba Mahakal's court, eager to catch a glimpse of him. This will continue from morning until evening," says Ashish (Priest) pic.twitter.com/sFW0U2Tquo— IANS (@ians_india) July 29, 2024 -
కౌరవుల ఆలయాల గురించి విన్నారా? ప్రసాదంగా కల్లు, పొగాకు..!
పంచమహా వేదంగా పిలిచే మహాభారతం గురించి కథకథలుగా చదువుకున్నాం. అదీగాక వింటే భారతం వినాలి తింటే గారెలు తినాలి అన్న నానుడి కూడా ఉంది. ఎందుకంటే భారతం వింటూంటే రసవత్తరంగా ఉంటుంది. కథలో ఏం జరిగింతుందో.. అని చివరి వరకు ఉత్కంఠ రేకెత్తిస్తుంది. పలు ట్విస్ట్‌లు, భావోద్వేగాలు, సంఘర్షణలు,కుటుంబ విలువలతో మిళితమైన గొప్ప పురాణ గ్రంథం. అయితే ఈ పురాణ కథలోని కృష్ణుడికి, పాండవులకు దేవాలయాలు ఉన్నాయి. కానీ కౌరవులకు కూడా దేవాలున్నాయన్న విషయం తెలుసా..!. మొత్తం నూరుగురి కౌరవులకు దేవాలయాలు ఉన్నాయట. ఈ మూర్తులకు పెట్టే ప్రసాదంలో కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటంటే..కేరళలోని కొల్లాంలో కౌరవుల యువరాజు దుర్యోధునుడి ఆలయం ఉందంట. ఏటా లక్షలాదిమంది ఈ ఆలయాన్ని దర్శించి పూజలు చేస్తుంటారట. అక్కడ ప్రజలు దుర్యోధనుడుని శక్తిమంతమైన దేవత అని, తమ కోరికలను తప్పక నెరవేరుస్తుందని నమ్మకంగా చెబుతున్నారు. ఇక్కడ కేవలం దుర్యోధనుడి ఆలయమే కాదు అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో వందమంది కౌరవులకు, కర్ణుడుకి ఆలయాలు ఉన్నాయట. కేరళలోని కురవ వంశ ప్రజలు కౌరవులను తమ పూర్వీకులుగా భావించి పూజిస్తారట. ఈ కౌరవుల ఆలయాలన్ని కొండల మీదే ఉండటం విశేషం. శుక్రవారమే విడిచిపెట్టడంతో..శుక్రవారంలో మరీ ప్రత్యేక పూజలు చేస్తుంటారట. ఎందుకంటే వనవాసం చేసిన పాండవులును వెంబడిస్తూ అలసిపోయి దాహంతో ఉన్న దుర్యోధనుడు తన వందమంది సోదరులతో కలిసి మలనాడ ప్రాంతానికి చేరుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. అప్పుడు ఒక వృద్ధ మహిళ దుర్యోధనుడికి కల్లు (పామ్ వైన్) ఇచ్చి అతడి దాహాన్ని తీర్చిందట. పైగా అక్కడి గ్రామస్తుల ఆతిథ్యానికి ముగ్ధుడయ్యాడు" పైగా దురోధనుడు శుక్రవారమే ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టాడట. అక్కడి ప్రజలకు మళ్లీ శుక్రవారం ఇక్కడకు వస్తానని హామీ కూడా ఇచ్చాడట. ఒకవేళ రాని పక్షంలో గ్రామస్థులు తాను చనిపోయాడని భావించి అంత్యక్రియలు చేయాలి అని దుర్యోధనుడు చెప్పాడని అక్కడి ప్రజలు చెబుతున్నారు. అయితే దుర్యోధనుడు తిరిగిరాలేదు. కానీ గ్రామస్థులు అతని ఆత్మ అక్కడికి తిరిగి వచ్చి పరబ్రహ్మను ఆరాధించిందని నమ్ముతారట. అందుకే అక్కడి ప్రజలు ఆయన పేరు మీద ఆలయాన్నికట్టి మరీ పూజలు నిర్వహిస్తున్నారు. అంతేగాదు ఈ ఆలయం పేరు మీదుగా చాలా భూములు కూడా ఉన్నాయట. ఒక్క దుర్యోధనునికే కాదు శకుని, దుస్సల, కర్ణునికి కూడా దేవాలయాలు ఉన్నాయట. పవిత్రేశ్వరంలో మలనాడ మహాదేవ శకుని ఆలయం ఉంది. ఈ ఆలయం దుర్యోధన ఆలయానికి 14 కి.మీ దూరం. ఈ పవిత్రేశ్వరంలోననే శకుని, ఇతర కౌరవులు కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించిన తమ ఆయుధాగారాన్ని సిద్ధం చేసుకున్నారని స్థానికులు చెబుతున్నారు. వారు తమ బాణాల కొనను పదును పెట్టడానికి ఉపయోగించే ఒక ప్రత్యేకమైన రాయి ఇప్పటికీ ఈ ఆలయం సమీపంలో ఉందంట. అంతేగాదు శకుని మోక్షం కోసం శివుడిని ప్రార్థించిన ప్రదేశంలో ఇప్పటికీ..ఒక నల్లని ఉందని చెబుతారు. మోసపూరిత శకుని ఇక్కడ శుద్ధి పొంది మోక్షాన్ని పొందాడు కాబట్టి ఇది పవిత్రమైన ప్రదేశం అని అక్కడి ప్రజల నమ్మకం. ఇక కున్నతుర్లోని శకుని ఆలయం నుంచి 30 నిమిషాల ప్రయాణంలో ఒక ప్రత్యేకమైన కర్ణ దేవాలయం ఉంది.కర్ణుడు కౌరవుల కోసం పోరాడాడు, దుర్యోధనుని అత్యంత మిత్రుడుగా పేరుగాంచినవాడు.పైగా పాండవులలో పెద్దవాడు. అలాగేశూరనాద్లో, 100 మంది కౌరవ సోదరుల ఏకైక సోదరి అయిన దుస్సలకి కూడా ఆలయం ఉంది. కురుక్షేత్ర యుద్ధం తరువాత, దుస్సల ఇక్కడ ఒక వరి పొలానికి చేరుకుందనిని స్థానికులు నమ్ముతారు. నీటి అవసరం ఉండడంతో తాగునీరు దొరక్క కర్రతో పొలంలో తవ్వి ఆ కర్రను అక్కడే పూడ్చిపెట్టిందని కథలు కథలుగా చెబుతున్నారు. ఈ పొలం నుంచి వచ్చిన వరి ఇప్పటికీ ఈ ఆలయంలో పూజల కోసం ఉపయోగించడం విశేషం. ఇక ఈ దక్షిణ కేరళ అంతటా శకుని, కర్ణుడు కాకుండా 101 మంది కౌరవులకు ఆలయాలు ఉన్నాయట. వాటిలో కొన్నింటి జాడ తెలియాల్సి ఉందని వివరించారు స్థానికులు.ప్రసాదం కూడా ప్రత్యేకమే..దేవాలయాల ప్రత్యేకత మాత్రమే కాదు, పూజా విధానం, నైవేద్యాలు కూడా ప్రత్యేకమైనవి. కేరళలోని కురవలు దుర్యోధనుడు లేదా శకుని వంటి దేవతలను అప్పోప్పన్ (పూర్వీకుడు) గా భావించి పూజిస్తారు.ఇక్కడి ప్రజలు తమ రక్షణ కోసం, మంచి పంటలు కోసం ఈ దేవతలను ప్రార్థిస్తారు.ఇక్కడ ప్రధాన నైవేద్యం కల్లు, పొగాకు ఆకులతో పాటు కోడి, మేక, ఎద్దు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు.2019లో ఇక్కడ ప్రసాదంగా పెట్టిన 101 ఓల్డ్ మాంక్ రమ్ సీసాలు హైలెట్‌గా నిలిచాయి.అంతేగాదు భక్తులకు కూడా ఆ కల్లునే తీర్థంగా పంపిణీ చేయడం మరింత విశేషం. ఈ దేవాలయాలు భారతదేశ విశ్వాసాల వైవిధ్యానికి మరియు భారతీయ సంస్కృతిలో కథల శక్తికి కూడా నిదర్శనం. ఇది ఒక వేద వ్యాసుని మహాభారతమే అయినా.. ఇక్కడ వంద మంది కౌరవులకు మాదిరిగా వారికి సంబంధించిన ఆలయాలు గురించి వంద కథనాలు ఉన్నాయి.(చదవండి: వాల్నట్స్ తింటున్నారా..?ఐతే అలాంటివాళ్లు మాత్రం..!) -
మరోమారు తెరుచుకున్న రత్న భాండాగారం
12వ శతాబ్దానికి చెందిన పూరీ జగన్నాథ దేవాలయంలోని రత్న భాండాగారం నేడు (గురువారం) మరోమారు తెరిచారు. ఈ ప్రక్రియలో ఎటువంటి ఆటంకాలు ఏర్పడకుండా ఉండేందుకు ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని నిషేధించారు. రత్న భాండాగారంలోని విలువైన ఆభరణాలను లోపలి ఛాంబర్ నుండి తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్‌నకు తరలించనున్న నేపధ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.జగన్నాథ ఆలయ అడ్మినిస్ట్రేషన్ (ఎస్జేటీఏ) చీఫ్ అరబింద పాధి మీడియాతో మాట్లాడుతూ ఈరోజు ఉదయం 8 గంటల తర్వాత ఎవరినీ లోనికి అనుమతించడం లేదన్నారు. ఆలయ సింహద్వారం మాత్రమే తెరిచివుంచి, మిగతా తలుపులన్నీ మూసి వేశామని తెలిపారు. గత కొన్నేళ్లుగా భక్తులు స్వామివారికి సమర్పించిన విలువైన వస్తువులను ఆలయ సముదాయంలోని తాత్కాలిక స్ట్రాంగ్‌రూమ్‌లోనికి తరలించనున్నట్లు అరబింద పాధి తెలిపారు.ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక స్టోర్‌హౌస్‌కు ఆభరణాలను తరలించేందుకుగాను రత్న భండాగారం లోపలి గదిని ఆలయ పరిపాలనా యంత్రాంగం (ఎస్జేటీఏ) తిరిగి తెరిచింది. ఎస్జేటీఏ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అరబింద పాధి, జస్టిస్ విశ్వనాథ్ రథ్ (రత్నాల భాండాగారాన్ని పర్యవేక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పర్యవేక్షక కమిటీ చైర్మన్), పూరీ కలెక్టర్ సిద్ధార్థ్ శంకర్ స్వైన్, ఇతర అధికారుల సమక్షంలో రత్న భాండాగారం లోపలి గదిని తెరిచారు. ఉదయం 9:51 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు అధికారులు రత్న భాండాగారంలో ఉండనున్నారు. ఇక్కడి విలువైన వస్తువులను తాత్కాలిక స్టోర్‌హౌస్‌కి తరలించనున్నారు.ఈ తతంగాన్నంతా వీడియో తీస్తున్నారు. -
ప్రముఖ ఆలయంలో అతియా శెట్టి- కేఎల్ రాహుల్.. వీడియో వైరల్!
బాలీవుడ్ భామ అతియా శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురిగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. 2015లో హీరో మూవీతో అరంగేట్రం చేసింది ముద్దుగుమ్మ. ఆ తర్వాత ముబాకరన్, నవాబ్జాదే, మోతీచూర్ చక్నాచూర్ చిత్రాల్లో మెరిసింది. అయితే కొన్నేళ్లపాటు టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్‌తో డేటింగ్ కొనసాగించిన భామ.. గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టింది.తాజాగా ఈ జంట కర్ణాటకలోని ఓ ఆలయాన్ని సందర్శించారు. మంగళూరులోని కుట్టారు కొరగజ్జ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీరితో పాటు అతియా సోదరుడు అహన్ శెట్టి కూడా ఉన్నారు. అంతేకాకుండా ఇటీవల బాలీవుడ్ నటి కత్రినాకైఫ్ సైతం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కాగా.. అతియా శెట్టి తండ్రి సునీల్ శెట్టికి కర్ణాటకలోని తులునాడు మూలాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. అంతకుముందే మంగళూరులోని శ్రీ దుర్గా పరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని కూడా దర్శించుకున్నారు. కాగా.. ఇటీవల ముంబైలో జరిగిన అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహానికి కత్రినా, అథియా, అహన్ శెట్టి, కేఎల్ రాహుల్ హాజరయ్యారు. View this post on Instagram A post shared by Mangalore Meri Jaan (@mangaloremerijaanofficial)VIDEO | Indian cricketer KL Rahul (@klrahul) offers prayers at Bappanadu Sri Durga Parameshwari Temple in Karnataka's Mangaluru. (Source: Third Party) pic.twitter.com/zKer47NiQ2— Press Trust of India (@PTI_News) July 14, 2024 -
జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది.
-
30 ఏళ్లకు తెరుచుకున్న ఉమా భగవతి ఆలయం
జమ్ముకశ్మీర్‌లోని ఉమా భగవతి దేవి ఆలయాన్ని 30 ఏళ్ల తరువాత తెరిచారు. కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ సమక్షంలో ఆలయాన్ని తెరవడంతో పాటు పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో గల షాంగస్ ప్రాంతంలో ఈ పురాతన ఆలయం ఉంది.మూడు దశాబ్దాల తర్వాత ఆలయంలోకి భక్తులు ప్రవేశించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజస్థాన్ నుంచి తీసుకువచ్చిన ఉమా దేవి విగ్రహాన్ని వేదమంత్రాల నడుమ గర్భగుడిలో ప్రతిష్ఠించారు. ఆలయ పునరుద్ధరణపై స్థానిక కశ్మీరీ పండిట్లు, ముస్లింలు సంతోషం వ్యక్తం చేశారు. స్థానికుడు గుల్జార్ అహ్మద్ మాట్లాడుతూ ‘మా పండిట్ సోదరులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం’ అని అన్నారు. ఇన్నాళ్ల తర్వాత ఆలయంలో పూజలు చేయడం సంతోషంగా ఉందన్నారు.కశ్మీరీ పండిట్లు తెలిపిన వివరాల ప్రకారం 1990లో ఈ ఆలయం ధ్వంసమైంది. దీని వెనుక పలు కారణాలున్నాయి. 1990లలో ఉగ్రవాదులు అలజడి కారణంగా కశ్మీరీ పండిట్లు ఈ ప్రాంతం నుండి పారిపోయారు. 2019 తర్వాత కశ్మీర్లో ఉగ్రవాదుల అలజడులు తగ్గాయి. ఈ నేపధ్యంలో గతంలో తీత్వాల్ వద్దనున్న మాతా శారదా ఆలయాన్ని తిరిగి ప్రారంభించారు. యూటీ అడ్మినిస్ట్రేషన్ స్మార్ట్ సిటీ మిషన్ కింద శ్రీనగర్‌లోని పలు దేవాలయాలతో సహా మతపరమైన ప్రదేశాలను ప్రభుత్వం పునరుద్ధరిస్తోంది. -
పూరీ: రత్నభాండాగారంలో ఆభరణాల లెక్కింపు నిలిపివేత
👉 పూరీ రత్నభాండగారంలో ఆభరణాల లెక్కింపును అధికారులు నిలిపివేశారు.👉 ఇవాళ చీకటి పడటంతో లెక్కింపును నిలిపివేసినట్లు తెలిపారు. 👉 రేపు (సోమవారం) తిరిగి ఆభరణాలను అధికారులు లెక్కించనున్నారు. 👉 ‘‘ రత్నభాండాగారం రహస్య గది తాళాలు పగలగొట్టి లోపలి వెళ్లాము. బయటి రత్నభాండాగారంలోని ఆభరణాలను మార్చేశాము. లోపలి భాండాగారంలోని ఆభరణాలను మార్చుతున్నామని అధికారులు తెలిపారు. ఆభరణాల లెక్కింపుకు ఇవాళ సమయం మించిపోయింది. ఆభరణాల లెక్కింపు ప్రక్రియను రేపు(సోమవారం) చేపట్టాలని నిర్ణయించుకున్నాం’’ అనిశ్రీ జగన్నాథ ఆలయ అడ్మినిస్ట్రేషన్ (SJTA)చీఫ్ అరబింద పాధీ మీడియాకు తెలిపారు. Puri, Odisha: The Ratna Bhandar of the Shri Jagannath Temple opened today.Sri Jagannath Temple Administration (SJTA) Chief Arabinda Padhee says, "All the ornaments of outer Ratna Bhandar have been shifted; the inner Ratna Bhandar was opened after breaking the locks. The… pic.twitter.com/R0TandjiG3— ANI (@ANI) July 14, 2024 👉 ఈసారి లెక్కింపు తర్వాతే ఆభరణాల విలువపై అంచనాకు వచ్చే అవకాశం ఉంది. సంపదను మరోచోటుకు తరలించి పటిష్టమైన భద్రత మధ్య లెక్కించే అవకాశం ఉంది. వివరాల నమోదును డిజిటలైజేషన్ చేస్తామని ఒడిశా ప్రభుత్వంలో చెబుతోంది.👉రత్న భాండాగారం రహస్య గది లోపలికి 11 మంది కమిటీ సభ్యులు వెళ్లారు. రత్న భాండాగారంలో ఉన్న ఆభరణాలను పెట్టెల్లో కమిటీ సభ్యులు భద్రపర్చనున్నారు.👉 బంగారం నాణ్యతను ఆర్బీఐ ప్రతినిధులు పరిశీలించనున్నారు. తాము అధికారంలోకి వస్తే భాండాగారం తెరిపిస్తామని ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.👉 పూరీ జగన్నాథ్ ఆలయ రత్న భాండాగారం రహస్య గదిని అధికారులు తెరిచారు. ఈ మేరకు రహస్య గది తలుపులు తెరిచినట్లు సీఎంవో అధికారికంగా ప్రకటించింది. 👉 46 ఏళ్ల రత్న భాండాగారం రహస్య గదిని అధికారులు ఓపెన్ చేశారు. చివరగా 1978లో రహస్య గదిని అధికారులు తెరిచారు. 👉కాగా, ప్రస్తుతం పూరీలో రథయాత్ర జరుగుతోంది. ఈనెల 19వ తేదీ వరకు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు ఆలయం వెలుపల ఉంటారు. ఈ నేపథ్యంలో అధికారులు చేపట్టనున్న లెక్కింపునకు ఎన్ని రోజులు పడుతుంది?అనే విషయాలు తెలియాల్సి ఉంది.👉ఇక, రత్న భాండాగారం తెరిచిన సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందుగానే ఏర్పాట్లు చేశారు. రత్న భాండాగారంలోని ఆభరణాల లెక్కింపు తదితర ప్రక్రియంతా డిజిటలైజేషన్ చేయనున్నారు. 👉 మరోవైపు.. నిధిని తెరిచి అందులోని వస్తువులను తరలించేందుకు ఆరు పెట్టెలను అధికారులు సిద్ధం చేశారు. #WATCH | Odisha | Ratna Bhandar of Sri Jagannath Temple in Puri re-opened today after 46 years.Visuals from outside Shri Jagannath Temple. pic.twitter.com/BzK3tfJgcA— ANI (@ANI) July 14, 2024 👉 ఇక, అంతకుముందు పూరీ జగన్నాథ్ ఆలయ రత్నభాండాగరాన్ని తెరిచే ప్రయత్నాల్లో తాళం చెవి తెరిచే ప్రక్రియలో అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. కానీ, కాసేపటికే విజయవంతంగా తెరిచారు. 👉 నిధి ఉన్న గదికి చేరుకున్న ఆలయ కమిటీ సభ్యులు 👉జగన్నాథుని సేవలకు అంతరాయం కలగకుండా తెరిచేందుకు ఏర్పాట్లు చేశారు.👉రత్నభాండాగరాన్ని తెరించే ప్రారంభమైన ప్రయత్నాలు👉పాములుంటాయన్న భయంతో స్నేక్ క్యాచర్స్‌ను సిద్ధంగా ఉంచిన అధికారులు👉ఉదయం 11 గంటల నుంచే భక్తులకు దర్శనాలు నిలిపివేసిన అధికారులు👉అంతరాయలంలోకి ప్రత్యేక కమిటీ ఛైర్మన్ విశ్వనాథ్ రథ్, కమిటీ సభ్యులు 👉ఇప్పటికే ఆలయంలోకి 15 కమిటీ సభ్యులు,నిపుణులు, ఆలయ అర్చుకులు ప్రవేశించారు.👉గజపతి రాజుల చేతిలో ఉన్న ఒకతాళం, జిల్లా మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలోని ఖజానా శాఖ వద్ద ఒక తాళం, ఆలయం ప్రధాన అధికారి వద్ద ఉన్న మూడో తాళం.. ఈ మూడు తాళాలు ఒకేసారి తెరుచుకోవాలి. అయితే అందులో ఒకతాళం లేకపోవడం, ఆతాళానికి సంబంధించిన తలుపుల్ని బద్దలు కొట్టేందుకు ఆయల కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. పూరి జగన్నాథ్ ఆయలయంలో ట్రస్ట్ బోర్డ్ సమావేశం ముగిసింది. ఈ సమావేశం అనంతరం రత్నభాంఢాగారాన్ని మధ్యాహ్నం 1.28గంటలకు తెరవాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. 46 ఏళ్ల తర్వాత రత్నభాండాగారాన్ని ఆలయ అధికారులు, ట్రస్ట్ కమిటీలు,నిపుణుల పర్యవేక్షణలో తెరుచ్చుకోనున్నాయి.ఇందులో భాగంగా ఎన్ఆర్ఆర్ఎఫ్ బృందాలు పూరీ ఆలయానికి చేరుకున్నాయి. భాండాగారం గది తలుపులు తెరుచుకోకపోతే భారీ సెర్చ్ లైట్స్, ఎక్విప్మెంట్ తీసుకొచ్చాయి. -
కుంభమేళా నుంచి హత్రాస్ వరకు.. మహా విషాదాలు
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన సత్సంగ్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 116 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. దేశంలో ఇలాంటి విషాదాలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. 2005లో మహారాష్ట్రలోని మంధరాదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 340 మంది మృతి చెందారు. 2008లో రాజస్థాన్‌లోని చాముండా దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 250 మంది మృత్యువాత పడ్డారు. 2008లో హిమాచల్ ప్రదేశ్‌లోని నైనా దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 162 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటుచేసుకున్న ఈ తరహా విషాదాలు..2023, మార్చి 31: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో శ్రీరామ నవమి వేళ ఒక ఆలయం స్లాబ్ కూలిపోవడంతో 36 మంది మృతి చెందారు.2022, జనవరి 1 : జమ్ముకశ్మీర్‌లోని మాతా వైష్ణో దేవి ఆలయంలో భక్తుల రద్దీ కారణంగా జరిగిన తొక్కిసలాటలో 12 మంది కన్నుమూశారు.2015, జూలై 14: ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో పుష్కరాల మొదటి రోజున గోదావరి నది ఒడ్డున జరిగిన తొక్కిసలాటలో 27 మంది మృతి చెందారు. 20 మంది గాయపడ్డారు.2014, అక్టోబర్ 3: బీహార్‌లోని పట్నాలో దసరా వేడుకల సందర్భంగా గాంధీ మైదాన్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 32 మంది మృతి చెందారు. 26 మంది గాయపడ్డారు.2013, అక్టోబరు 13: మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాలోని రతన్‌ఘర్ దేవాలయం సమీపంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 115 మంది మృతి చెందారు. 100 మందికి పైగా జనం గాయపడ్డారు.2012, నవంబర్ 19: బీహార్‌లోని పట్నాలో గంగా నది ఒడ్డున అదాలత్ ఘాట్ వద్ద ఛత్ పూజలు నిర్వహిస్తుండగా తాత్కాలిక వంతెన కూలిపోవడంతో తొక్కిసలాట జరిగి 20 మంది మరణించారు.2011, నవంబర్ 8: హరిద్వార్‌లోని గంగా నది ఒడ్డున హర్కీ పైడి ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 20 మంది మృతి చెందారు.2011, జనవరి 14 : కేరళలోని ఇడుక్కి జిల్లాలోని పులమేడు వద్ద విషాదం చోటుచేసుకుంది. శబరిమల ఆలయాన్ని సందర్శించి వస్తున్న భక్తుల మధ్య జరిగిన తొక్కిసలాటలో 104 మంది మృతి చెందారు. 40 మంది గాయపడ్డారు.2010, మార్చి 4: ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో కృపాలు మహారాజ్ రామ్ జానకి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 63 మంది మరణించారు.2008, సెప్టెంబరు 30 : రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో గల చాముండా దేవి ఆలయంలో బాంబు పేలుడు వదంతుల కారణంగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో 250 మంది కన్నుమూశారు. 60 మందికి పైగా జనం గాయపడ్డారు.2008, ఆగస్ట్ 3: హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్పూర్ జిల్లాలోని నైనా దేవి ఆలయంలో కొండ చరియలు విరిగి పడ్డాయనే వదంతులు రావడంతో జరిగిన తొక్కిసలాటలో 162 మంది మృతి చెందారు. 47 మంది గాయపడ్డారు.2005, జనవరి 25: మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని మంధరాదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 340 మంది మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు.2003, ఆగష్టు 27: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో సింహస్థ కుంభమేళా పవిత్ర స్నానాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 39 మంది మృతి చెందారు. 140 మంది గాయపడ్డారు. -
ఆక్రమణ నుంచి ‘అమరా’కు విముక్తి
పెదకాకాని: దేవదాయ శాఖ 17ఏళ్ల పాటు చేసిన న్యాయపోరాటం ఎట్టకేలకు ఫలించింది. సుమారు రూ.3 కోట్ల విలువైన 20 సెంట్ల స్థలాన్ని అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా అమరా వారి సత్రం పెదకాకాని శివాలయం దేవస్థానానిదే అని హైకోర్టు తీర్పు వెలువరించడంతో ఆలయ అధికారులు మంగళవారం దానిని స్వాదీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఆలయ ఉప కమిషనర్ దాసర శ్రీరామ వరప్రసాదరావు తెలిపిన వివరాల ప్రకారం.. 1942లో గుంటూరుకు చెందిన అమరా వెంకటేశ్వర్లు, మువ్వల వెంకట సుబ్బారావులు గుంటూరు జిల్లా పెదకాకాని శివాలయం ఎదురుగా ఉన్న 20 సెంట్లు భూమిని కొనుగోలు చేశారు. ఆ భూమిలో భక్తుల సౌకర్యార్థం సత్రం నిర్మించారు. వారి అనుమతితో 1968లో దేవదాయ శాఖ ఆ«దీనంలోకి తీసుకుని కొంతకాలం గడిచిన తరువాత సత్రం యజమానుల నుంచి కంట్రిబ్యూషన్ వసూలుచేశారు. సత్రం నిర్వాహకులు ఆ సత్రంలో పనులకు యండ్రప్రగడ సీతారామయ్య, వెంకటరత్నం (భార్యభర్తలను)లను నియమించి వారికి నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. 2006లో అప్పటి ఆలయ ఈఓ బీహెచ్ వీరారెడ్డిని ఆ సత్రానికి సింగిల్ ట్రస్టీగా దేవదాయ శాఖ అధికారులు నియమించారు. ఆ తర్వాత కొంతకాలానికి సత్రంలో ఉంటున్న యండ్రప్రగడ సీతారామయ్య సత్రం తనదేనంటూ భార్య వెంకటరత్నంకు వీలునామా రాయడం.. వెంకటరత్నం తన కుమారుల్లో ఒకరైన సాంబశివరావుకు రిజి్రస్టేషన్ చేశారు. ఆ తర్వాత 2005లో సత్రాన్ని ఖాళీ చేయాలని ఆలయ అధికారులు కోరడంతో అందులో ఉంటున్న యండ్రప్రగడ కుటుంబం సత్రం తమదేనంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.సత్రం పూర్తి హక్కులు శివాలయానికి.. జిల్లా న్యాయస్థానం నుంచి ఈ కేసు వ్యవహారం 2008లో ట్రిబ్యునల్‌కు చేరడంతో 2011లో సత్రం ఆలయానికి చెందినదేనని తీర్పు వచ్చింది. అప్పటికే సత్రంలో పని కల్పిస్తే సత్రాన్ని స్వాధీనం చేసుకున్నారని భావించిన సత్రం యజమానులు అమరా వెంకటేశ్వర్లు, మువ్వల వెంకటసుబ్బారావు కుటుంబ సభ్యులు 2008లో ఆ సత్రం పూర్తి హక్కులు శివాలయానికి కల్పిస్తూ రిజి్రస్టేషన్ చేశారు. సత్రాన్ని స్వాధీనం చేసుకోవడంలో కొందరు అధికారుల ఉదాశీన వైఖరితో ఆక్రమణదారులు హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి గ్రామపెద్ద ఆలపాటి రామస్వామి కూడా అమరా వారి సత్రం ఆలయానికి చెందినదేనంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో.. గత నెల 21న అమరా వారి సత్రం సంపూర్ణ హక్కులు పెదకాకాని శివాలయానికి చెందినవేనని హైకోర్టు తీర్పు ఇచి్చంది. దీంతో సత్రంలో ఉంటున్న యండ్రప్రగడ వెంకటరత్నంకు పదిరోజుల పాటు ఆలయ శివ సదనంలో ఒక రూంలో ఉండేందుకు అనుమతించి మంగళవారం సత్రాన్ని ఖాళీ చేయించారు. అనంతరం శిథిలావస్థకు చేరిన సత్రాన్ని కూలి్చవేశారు. ఈ భూమి శివాలయానికి చెందినదని.. ఎవరైనా ఆక్రమిస్తే చట్టపరంగా శిక్షార్హులని ఆలయ ఉప కమిషనర్ దాసర శ్రీరామ వరప్రసాదరావు హెచ్చరించారు. -
అనంత్ అంబానీ వాచ్..వామ్మో..! అంత ఖరీదా?
రిలయన్స్ ఇండస్ట్రీస్ దిగ్గజం ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం ఈ నెల 12న జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వారి ఇంట జరిగే చివరి వివాహం కావడంతో అత్యంత విలాసవంతంగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగాయి. ఆ ఈవెంట్లో ఆ కుటుంబ సభ్యులు ధరించిన ఆభరణాలు, కాస్ట్యూమ్స్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి కూడా. తాజాగా అలానే అనంత్ ధరించిన లగ్జరియస్ వాచ్ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. రాధిక మర్చంతో వివాహ నేపథ్యంలో అనంత్ ప్రముఖ దేవాలయాలను దర్శిస్తున్నారు. ఆ క్రమంలోనే మహారాష్ట్రలోని నేరల్‌లోని కృష్ణ కాళీ దేవాలయాన్ని దర్శించారు కాబోయే వరుడు అనంత్ అంబానీ. అమ్మవారి ఆశీర్వాదాన్ని కోరుతూ ఆలయంలో హవన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అనంత్ ధరించిన గడియారం అందరి దృష్టిని తెగ ఆకర్షించింది. దాని ధర తెలిస్తే కంగుతింటారు.అత్యంత అరుదైన వాచ్..అనంత్ అంబానీకి అద్భుతమైన వాచీలను సేకరించే అలవాటు ఉంది. వాటిలో ఖరీదైన పాటెక్ ఫిలిప్, రిచర్డ్ మిల్లే నుండి అరుదైన వాచీలు ఉన్నాయి. కృష్ణ కాళీ ఆలయ సందర్శన సమయంలో, అనంత్ రిచర్డ్ మిల్లే వాచీని పెట్టుకున్నారు. ఎరుపు రంగు కార్బన్ రిచర్డ్ మిల్లే వాచ్ (ఆర్ఎం 12-01 టూర్‌బిల్లాన్)ను ఆయన పెట్టుకున్నారు. దీని ధర ఏకంగా రూ. 6.91 కోట్లు. ఈ బ్రాండ్‌కి సంబంధించిన వాచ్‌లు చాలా పరిమితి పరిధిలోనే అందుబాటులో ఉంటాయి. ఇప్పటి వరకు ఈ బ్రాండ్‌కు సంబంధించినవి 18 వాచ్‌లు మాత్రమే రూపొందించారు. మన దేశంలో కొన్ని కుటుంబాలు కేవలం నెలకు ఆరు వేల రూపాయలతో జీవిస్తున్నారు. అనంత్ అంబానీ వాచీ ఖరీదు ఆరుకోట్ల 91 లక్షల రూపాయలు. అంటే మనదేశంలోని దారిద్య్రరేఖకు దిగువున ఉన్న రెండు గ్రామాలను అభివృద్ధి చెయ్యొచ్చు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) (చదవండి: పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొననున్న టీమ్ ఇండియా దుస్తులను డిజైన్ చేసేదేవరంటే..!) -
కల్కి సినిమాలో ఓల్డ్ టెంపుల్.. ఏపీలో ఎక్కడ ఉందో తెలుసా? (ఫొటోలు)
-
తిరుమలలో కొత్త గెటప్‌లో టాలీవుడ్ నటి హేమ (ఫోటోలు)
-
‘బ్లాక్ బుక్’లో మంత్రి పొన్నం పేరు: పాడి కౌశిక్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్: తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఫిలింనగర్‌లోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి బుధవారం(జూన్ 26) ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవినీతికి పాల్పడలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా వచ్చి తనతో పాటు ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. ‘మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఫిలింనగర్‌లోని వేంకటేశ్వర ఆలయంలో ప్రమాణం చేయాలని డిమాండ్ చేశా. ఫ్లైయాష్ స్కామ్ చేయలేదని ప్రమాణం చేయాలని కోరాను. నువ్వు నీతి మంతుడివి అయితే ఎందుకు రాలేదు. నాపై తప్పుడు ఆరోపణలు చేశారు పొన్నం. తడి బట్టలతో హుజురాబాద్‌లో హనుమాన్ విగ్రహం సాక్షిగా ప్రమాణం చేశాను.నీ నిజాయితీ ఎందుకు నిరూపించుకోవడం లేదు పొన్నం ప్రభాకర్. వే బ్రిడ్జిలో కొలతలు తక్కువ వచ్చాయి. దీనికి ప్రూఫ్ ఉంది. వే బిల్ సరిగా లేదు. రవాణా శాఖ మంత్రిగా మీకు బాధ్యత లేదా? రోడ్లు నాశనం చేస్తున్నారు. ఫ్లైయాష్ వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రజల శవాల మీద పైసలు ఏరుకుంటున్నాడు’అని కౌశిక్‌రెడ్డి మండిపడ్డారు. ప్రమాణం సందర్భంగా బ్లాక్ బుక్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ పేరును కౌశిక్‌రెడ్డి రాశారు. తాము అధికారంలోకి వచ్చాక పొన్నంపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, ప్రమాణం చేసేందుకుగాను బుధవారం ఉదయం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌కు చేరుకున్న కౌశిక్‌రెడ్డి అక్కడి నుంచి వెంకటేశ్వరస్వామి గుడికి బయలుదేరారు. -
త్వరలో కొడుకు పెళ్లి.. కాశీలో సందడి చేసిన 'నీతా అంబానీ' (ఫొటోలు)
-
అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ చేసిన ఆచార్య లక్షీకాంత్ కన్నుమూత
అయోధ్యలోని రామాలయంలో బాల రాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించిన ఆచార్య లక్షీకాంత్ దీక్షిత్ (90) వారణాసిలో కన్నుమూశారు. నేడు(శనివారం) మణికర్ణికా ఘాట్‌లో ఆచార్య లక్ష్మీకాంత్ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.ఆచార్య లక్ష్మీకాంత్ మృతి చెందారనే వార్త తెలియగానే కాశీ, అయోధ్యలలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఏడాది జనవరిలో అయోధ్యలో జరిగిన బాలరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో లక్ష్మీకాంత్ దీక్షిత్ కీలక పాత్ర పోషించారు. ఆయన ఆధ్వర్యంలో పూజాదికాలు జరిగాయి. ఆయన కుటుంబం తరతరాలుగా కాశీలో ఉంటోంది.లక్ష్మీకాంత్ వారణాసిలోని సంగ్వేద కళాశాలలో సీనియర్ ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఈ కళాశాలను కాశీ రాజు స్థాపించారు. లక్ష్మీకాంత్ దీక్షిత్ ప్రముఖ యజుర్వేద పండితులలో ఒకనిగా పేరుగాంచారు. హిందువులు ఆచరించే పూజా విధానాలపై ఆయనకు లోతైన అవగాహన ఉంది. తన మేనమామ గణేష్ దీక్షిత్ దగ్గర లక్ష్మీకాంత్ వేదాలు అభ్యసించారు. -
ఆ గ్రామంలో శునకాలే దైవంగా పూజలు..ఏకంగా ఏడాదికి ఒకసారి..!
మన దేశం ఆధ్యాత్మికత నెలవు. ఇక్కడ దేవుళ్లకు మాత్రమే కాదు, పాములకు, అభిమాన నటులకు, రాజకీయనాయకులకు గుడి కట్టించి మరీ పూజలు చేస్తుంటారు ప్రజలు. సాధారణంగా అందరం దేవుడికి గుడి కట్టడం, పూజలు చేయడం వంటివి చేస్తాం. కానీ ఆ గ్రామంలో మాత్రం కుక్కలకు గుడికట్టి మరీ పూజలు చేస్తున్నారు. పైగా ఏడాదికి ఒకసారి భారీ ఎత్తున ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. అయితే ఎక్కడా లేని విధంగా ఇక్కడ శునకాలను పూజించడానికి ఒక ప్రత్యేక కారణం కూడా ఉంది. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉందంటే..కర్ణాటకలోని చన్నపట్న నగరంలో అగ్రహార వలగెరెహళ్లి అనే చిన్న గ్రామం ఉంది. ఈ నగరం చెక్క బొమ్మలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దీనిని 'బొమ్మల పట్టణం' అని పిలుస్తారు. బెంగళూరు నగరానికి దాదాపు 60 కి.మీ దూరంలో ఉన్న ఈ దేవాలయం గురించి చాలా మందికి తెలియదు. ఈ ఆలయాన్ని 2010 సంవత్సరంలో ధనవంతుడైన వ్యాపారి రమేష్ నిర్మించాడు. ఇలా కుక్కల కోసం ఆలయం కట్టడానికి గల కారణం..ఆలయం వెనుక చరిత్ర..గ్రామంలో ఎప్పుడూ తిరిగే రెండు శునకాలు ఒక్కసారిగా మాయమయ్యాయి. అయితే ఇవి చనిపోయాయని గ్రామస్థులు అనుకున్నారు. అయితే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కలలో ఓ దేవత కనిపించి గ్రామస్థుల రక్షణ కోసం తప్పిపోయిన కుక్కల కోసం ఓ ఆలయాన్ని నిర్మించాలని తెలిపింది. ఆ గ్రామం కులదేవత కెంపమ్మ. ఆ దేవతే స్వయంగా కలలో కనిపించి గ్రామస్తుల రక్షణ కోసం కనిపించకుండా పోయిన కుక్కల కోసం దేవాలయాన్ని నిర్మించమని చెప్పింది. దీంతో వెంటనే గ్రామస్తులు ఇలా ఆ రెండు కుక్కలకు ఆలయాన్ని నిర్మించి పూజలు చేయడం ప్రారంభించారు. అంతేగాదు ఈ ఆలయంలో ప్రతీ ఏడాది భారీ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఆలయంలో తప్పిపోయిన ఆ రెండు కుక్కల విగ్రహాలు ఉంటాయి. ఇవి గ్రామంలోకి ప్రతికూల శక్తి రాకుండా కాపాడతాయని అక్కడి గ్రామస్తులు నమ్మకం. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఆలయానికి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తుండటం.(చదవండి: చేపను పోలిన భవనం..ఎక్కడుందంటే..?) -
సాగర తీరంలో ఆకట్టుకుంటున్న మొగ దారమ్మ ఆలయ శిల్ప సౌందర్యం
భారతదేశ సంస్కృతి... ప్రకృతి సౌందర్యం...ఆధ్యాత్మిక శోభ ఉట్టి పడుతూ నిర్మితమైన ఆలయంఒకవైపు పచ్చని కొండలు మరోవైపు నీలి సముద్రం... మధ్య ప్రశాంత వాతావరణంలో ఆలయం. కేవలం ఆధ్యాత్మిక చింతన మాత్రమే కాక ఆలయంలో అడుగు పెడితే మానవ జీవనశైలి... హైందవ ధర్మం... కాలచక్రం అన్ని స్పష్టంగా కనిపిస్తాయి. వందల ఏళ్లుగా పూజలు అందుకుంటున్న ఎండాడ గ్రామ దేవత ఆలయం ఇప్పుడు కొత్తగా ఆకర్షణీయంగా నిర్మితమైంది. ఆలయ చరిత్ర..ఒకప్పుడు విశాఖ నగర శివారు ప్రాంతమైన గొల్లల ఎండాడ ..ముసలయ్య పేట... సాగర్ నగర్ పరిసర ప్రాంత ప్రజలకు మొగ దారమ్మ తల్లి గ్రామ దేవతగా కొనసాగారు. అప్పట్లో పరిసర దాదాపు పది గ్రామాల ప్రజలు ఏ కష్టసుఖాల్లోనైనా అమ్మవారిని తొలి గా పూజించేవారు. ఆ రోజుల్లో అమ్మవారు ప్రతికగా ఓ చలువ పందిరి కింద పూజలు చేశారు. అయితే 1988 ప్రాంతంలో సత్య ప్రసాద్ అనే వ్యక్తి సాగర్ నగర్ పరిసరాల్లో రియల్ వ్యాపారం నిర్వహించారు. ఆతనకు కొంత కలిసి వచ్చింది. దీంతో స్థానికులు అతన్ని అక్కడ ఆలయం అభివృద్ధి చేయాలని కోరారు. ఆమేరకు ఆయన ఆలయ నిర్మాణం చేపట్టారు. అయితే ఆలయాన్ని మొక్కుబడిగా కాక ఆధ్యాత్మిక త ఉట్టిపడే రీతిన నిర్మాణం చేపట్టారు దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన శిల్పుల సహకారంతో ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో అడుగడుగునా సంస్కృతి సాంప్రదాయం కనిపిస్తుంది.వైకాశన విధానంలో ఆలయ నిర్మాణంఇక్కడ శ్రీమత్ వైకాసన విధానంలో ఆలయ నిర్మాణం జరిగింది.. ఆలయం ప్రాంగణంలో మొగ ధారమ్మ ప్రధాన దేవత ఆలయం నిర్మించారు. కుడి ఎడమల వైపు దుర్గాలమ్మ ..నూకాలమ్మ అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేశారు.ఆలయంలో ఎటు చూసినా ఆధ్యాత్మికత తో పాటు శిల్పకళా సౌందర్యం కనిపిస్తుంది. మానవ జీవితంపై ప్రభావం చూపించే గ్రహాలు వాటి అధిపతుల శిల్పాలను కూడా ఇక్కడ పొందుపరిచారు. నవ గ్రహాలు . వాటి అధిపతుల తో పాటు భారతదేశంలోని మొత్తం 12 జీవనదుల దేవతల విగ్రహాలను కూడా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. శ్రావ్యమైన సంగీతానికి అద్దం పట్టే డోలు డమరుకం..వివిధ రకాల ఫలాలను కూడా శిల్ప కలలో పొందుపరిచారు. ముఖ్యంగా 16 నాలుగు స్తంభాలపై నాలుగు రకాల వృక్షాలను చిత్రీ కరించారు.ఇక్కడ స్తంభాలపై చెక్కిన శిల్పాలు ఒక్కో రకమైన ఆలోచన స్పూర్తింపజేస్తాయి. కేరళ కర్ణాటక తమిళనాడు ప్రాంతాల్లో మాదిరిగా ఆలయాలపై ఏనుగుల దృశ్యాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. అందులో ఇక్కడ ఆలయం వద్ద వుండే పెంపుడు ఏనుగులు.. అడవి ఏనుగులు... రాజుల కోటల వద్ద ఉండే ఏనుగుల శిల్పాలు చిత్రీకరించారు.ఏనుగు తొండం పై మానవ జీవన విధానంఆలయ ప్రధాన ద్వారానికి అటు ఇటుగా కనిపించే రెండు ఏనుగు తొండాలు పై మానవ జీవన విధానంలో మార్పులు గోచరిస్తున్నాయి. రాతి యుగంలో మానవుడు.. ఆధునిక యుగంలో మానవుడు.. గ్రామాల్లో దశలవారీగా మారిన మానవ మనుగడ పనిముట్లు తదితర అంశాలన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా పురాతన మానవ జీవితం అడవి సంపద అన్ని రకాల ప్రాణుల చిత్రాలను కూడా శిల్పాల్లో పొందుపరిచారు.ఆది దైవంగా విశ్వక్సేనుడుఆది దైవంగా గణేష్ విగ్రహానికి బదులు విశ్వక్సేనుడు విగ్రహం ఇక్కడ కనిపిస్తుంది. ఆలయ ప్రకారం ప్రాకారం స్వస్తిక్.. కమలం... కలశం గోడలపై స్పష్టంగా కనిపిస్తాయి.సంతాన దేవతలు విగ్రహాలపై శ్రీకృష్ణుడు బ్రహ్మ జంటగా ఇక్కడ శిల్పాలను చిత్రీకరించారు. ధర్మార్థ కామ్య మోక్షాలకు ప్రతీక గా శేషశయన మూర్తి... దశావతారాలు వటపత్ర సాయి విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. ప్రధాన ఆలయం ఒకరకంగా కనిపిస్తే ఉప ఆలయాలు కోణార్క్ దేవాలయం తరహాలో రథచక్రాలతో కనిపిస్తున్నాయి.మహాలక్ష్మి దుర్గాదేవి సరస్వతి రూపాల్లో గ్రామదేవతలుఇక్కడ ప్రధాన దేవత మోగ ధారమ్మ ను మహాలక్ష్మి దేవిగా... దుర్గా దేవిని దుర్గి దేవిగా .. నూకాలమ్మను సరస్వతి దేవిగా పూజలు చేస్తుంటారు. ఇంత అందమైన ఆలయాన్ని సాగర తీరాన కొత్తగా నిర్మించడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఇక్కడ శిల్ప కళా సౌందర్యం తో పాటు ప్రశాంత వాతావరణం కనిపిస్తుంది అని భక్తులు అంటున్నారు.ఆలయం చూసేందుకు వస్తున్న పాత తరం జనం..వాస్తవానికి మొగధారమ్మ పరిసర గ్రామాలకు గ్రామ దేవతగా కొనసాగారు. ఈ దశలో చిన్నతనంలో ఏమాత్రం మౌలిక సదుపాయాలు లేని స్థితిలో ఉన్న ఆలయం సమూలంగా మారడంతో చాలామంది భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆలయాన్ని అత్యంత అద్భుతంగా నిర్మించిన వ్యక్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ కొత్త శిల్ప సౌందర్యంతో ఆలయాన్ని చూసేందుకు పాతతరం జనం వస్తున్నారు ప్రధానంగా వృద్ధులు ఒక్కసారిగా ఆలయం మారిన తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.విశాఖ నుంచి ఋషికొండ వెళ్లే మార్గంలో సాగర్ నగర్ వద్ద ఉన్న ఈ ఆలయం పర్యాటకులను కూడా ఆకట్టుకుంటుంది. నిత్యం ప్రసాదంతో పాటు ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. ఈ పురాతన గ్రామదేవత ఆలయం ఇప్పుడు ఈ ప్రాంతానికి మరింత ప్రాధాన్యత పెంచిందని ఈ వార్డు కార్పొరేటర్ లోడగల అప్పారావు పేర్కొన్నారు.ఆలయ దర్శన వేళలుఉదయం 5:30 నుంచి 10:30 సాయంత్రం 5:30 నుంచి 8 గంటల మధ్య అమ్మవార్ల దర్శనాలు లభిస్తున్నాయి.విశాఖ నుంచి భీమిలి వెళ్లే మార్గంలో సాగర్ నగర్ పక్కన ఈ ఆలయం ఉంటుంది. ఈ మార్గంలో 24 గంటలు వాహనాలతో పాటు బస్సులు అందుబాటులో ఉంటాయి.-రావులవలస రామచంద్ర రావు, సాక్షి -
గుడి కోసం టీడీపీ–జనసేన కుమ్ములాట
పిఠాపురం/సాక్షి, అమరావతి : కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో రెండ్రోజుల క్రితం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ కారుపై జనసేన శ్రేణుల దాడి ఘటన మరువక ముందే.. అదే మండలం తాటిపర్తి గ్రామంలోని అపర్ణాదేవి ఆలయ నిర్వహణ విషయంలో రెండు పార్టీలు ఆదివారం మళ్లీ కుమ్ములాడుకున్నాయి. ఆలయ నిర్వహణ బాధ్యతలు తమదేనని టీడీపీ నేతలు.. కాదు తమదేనంటూ జనసేన నేతలు రచ్చకెక్కారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం ఈ ఘటన వివరాలివీ..తాటిపర్తి అపర్ణాదేవి ఆలయ నిర్వహణ విషయంలో గ్రామంలో పూర్వం నుంచీ ఒక ఆనవాయితీ ఉంది. నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యేగా నెగ్గితే ఆ పార్టీకి చెందిన నేతలు ఐదేళ్లూ ఆలయ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటారు. వారి ఆధ్వర్యంలోనే ఉత్సవాల వంటి అన్ని కార్యక్రమాలూ నిర్వహిస్తారు. ఇప్పటివరకూ వైఎస్సార్సీపీ అధికారంలో ఉండటంతో ఆ పార్టీకి చెందిన నాయకులు ఆలయ బాధ్యతలు చూసేవారు. ఇటీవల టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో ఆలయ బాధ్యతలు అప్పగించేస్తామంటూ వైఎస్సార్సీపీ నేతలు టీడీపీ, జనసేన నాయకులకు సమాచారం ఇచ్చారు. ఆలయం వద్దకు వస్తే అందరి సమక్షంలో ఆలయ తాళాలు ఇచ్చేస్తామని చెప్పారు. దీంతో కూటమి నేతలు ఆదివారం ఉదయం ఆలయం వద్దకు వచ్చారు. పిఠాపురంలో జనసేన నెగ్గడంతో ఆ పార్టీకి చెందిన నేతలకు వైఎస్సార్సీపీ నాయకులు అందరి సమక్షంలో ఆలయ తాళాలు అందజేశారు. దీనికి గ్రామస్తులందరూ ఆమోదం తెలిపారు.సంయమనం పాటించాలి : నాగబాబుమరోవైపు.. ఈ ఘటనపై జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు స్పందిస్తూ.. కూటమి సభ్యుల్లో ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో జరిగిన ఘటన వివరాలు సేకరిస్తున్నామని, ఇందులో తమ పార్టీ వారు ఉంటే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తాటిపర్తిలో ఆదివారం చోటుచేసుకున్న ఘటనపై కూడా నాయకులు చర్చించి నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. పదిరోజుల్లో పవన్ పిఠాపురం వస్తారని చెప్పారు.వివాదానికి టీడీపీ ఆజ్యం..అయితే, ఈ విషయం టీడీపీ నియోజకవర్గ నేతకు తెలిసింది. జనసేనను ముందు నుంచీ వ్యతిరేకిస్తున్న ఆ నేత టీడీపీ వారికే ఆలయ పెత్తనం ఇచ్చేలా పట్టుబట్టాలని ఆదేశాలిచ్చినట్టు సమాచారం. దీంతో అప్పటివరకూ అన్నింటికీ అంగీకారం తెలిపిన టీడీపీ నేతలు.. ఒక్కసారిగా వివాదానికి తెరలేపారని స్థానికులు చెబుతున్నారు. ఎన్నికల్లో నెగ్గింది జనసేన అయినా గెలిపించింది తామేనని.. అందుకే తమకే ఆలయ తాళాలు అప్పగించాలని టీడీపీ నాయకులు ఆలయం వద్ద ఆందోళనకు దిగారు. దీంతో జనసేన–టీడీపీ వర్గాల మధ్య ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది.ఇరువర్గాలూ బాహాబాహీకి దిగడంతో ఒక దశలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న కాకినాడ డీఎస్పీ హనుమంతరావు నేతృత్వంలో పిఠాపురం సీఐ శ్రీనివాస్ తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని, ఇరువర్గాలనూ చెదరగొట్టారు. అయినప్పటికీ తాళాలిచ్చే వరకూ కదిలేదిలేదని టీడీపీ నేతలు ఆలయం వద్ద బైఠాయించారు. ఇరువర్గాలతో చర్చించిన పోలీసులు వివాదం తేలేవరకు ఆలయ తాళాలు అధికారుల వద్ద ఉండేలా ఒప్పించారు. అనంతరం తాళాలను స్థానిక వీఆర్ఓకు అప్పగించారు. తమకు ఎలాగూ ఆలయం దక్కేదిలేదని గ్రహించిన టీడీపీ నేతలు ఆలయాన్ని దేవదాయ శాఖకు అప్పగించాలనే డిమాండును తెరపైకి తీసుకువచ్చారనే ప్రచారం గ్రామంలో జోరుగా జరుగుతోంది. అపర్ణాదేవి ఆలయం దేశంలోనే పేరొందింది. ఇక్కడకు ఇతర రాష్ట్రాల నుంచి సైతం అనేకమంది భక్తులు, వీఐపీలు వస్తూంటారు. ఆదాయం కూడా అంతలా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆలయంపై పెత్తనం తమకు దక్కకపోతే.. జనసేనకూ దక్కకూడదని భావించిన టీడీపీ నేతలు.. ఈ ఆలయాన్ని ప్రభుత్వానికి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. -
యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి..9 మంది మృతి
జమ్ము-కశ్మీర్ రియాసి జిల్లాలో ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. జమ్మూలోని రాయసి జిల్లాలో ఉన్న శివఖోడి గుహను సందర్శించేందుకు వెళ్తున్న యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో 9మంది యాత్రికులు మరణించారు. 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎంతమందికి బుల్లెట్ గాయాలు అయ్యాయో ఇంకా తెలియరాలేదని రియాసి జిల్లా మేజిస్ట్రేట్ విశేష్ మహాజన్ తెలిపారుఉగ్రవాదుల దాడిపై సమాచారం అందుకున్న పోలీసులు,భద్రతా బలగాలు బాధితుల్ని రక్షించేందుకు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రమాదంలో గాయపడ్డ బాధితుల్ని రక్షించేందుకు స్థానికులు సహాయక చర్యల్ని ముమ్మరం చేస్తున్నాయి. -
దేవుడైతే గుడి కడతాం... ప్రధానిపై ‘దీదీ’ సెటైర్లు
కోల్‌కతా: చివరి దశ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత, వెస్ట్‌బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సెటైర్లు వేశారు. తనను దేవుడు పంపాడని ప్రధాని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలపై చురకలంటించారు. ‘ఒకరేమో దేవుళ్లకే దేవుడినని అంటారు. మరో నేతేమో పూరి జగన్నాథుడే ఆయన భక్తుడంటారు.దేవుడయితే మేం ఆయనకు గుడి కడతాం. పూలు,పండ్లు, స్వీట్లు, ప్రసాదం పెడతాం. ఆయన కావాలనుంటే గుజరాతీ వంటకం ఢోక్లా కూడా పెడతాం’అని మమత ఎద్దేవా చేశారు. దేవుడైతే రాజకీయాల్లో ఉండకూడదని, అల్లర్లు రెచ్చగొట్టొద్దని సూచించారు. కాగా, ప్రధాని మోదీ ఇటీవల ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మా అమ్మ బతికున్నంతవరకు నేను అందరిలాగే పుట్టాననుకున్నాను. కానీ ఆమె చనిపోయిన తర్వాత నన్ను దేవుడు పంపించాడేమో అనిపిస్తోంది. ఈ శక్తి నాకు శరీరం నుంచి రావడం లేదు. దేవుడిస్తున్నాడు. నేననేది ఏమీ లేదు. నేను దేవుని సాధానాన్ని మాత్రమే’అని ప్రధాని ఇంటర్వ్యూలో చెప్పడంపై ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు. -
శ్రీదేవికి ఇష్టమైన ఆలయంలో జాన్వీ కపూర్.. ఫోటోలు వైరల్!
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మహీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా పాల్గొన్నారు. ఈ సినిమాలో రాజ్ కుమార్ రావు సరసన నటిస్తోంది. ఈ సినిమాలో మహిమ అనే పాత్రలో జాన్వీ కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 31న థియేటర్లలో సందడి చేయనుంది.అయితే ప్రమోషన్లతో బిజీగా ఉన్న ఒక్కసారిలో చెన్నైలో వాలిపోయింది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు హాజరై కేకేఆర్‌కు మద్దతుగా సందడి చేసింది. ప్రస్తుతం చెన్నైలో ఉన్న జాన్వీ కపూర్ ప్రముఖ ముప్పాతమ్మన్ ఆలయాన్ని మొదటిసారి దర్శించుకుంది. శ్రీదేవి సిస్టర్ మహేశ్వరితో కలిసి ఆలయానికి వెళ్లింది. అమ్మ ఎంతగానో ఇష్టపడే ఆలయాన్ని మొదటిసారి సందర్శించానని జాన్వీ కపూర్ తన ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా.. జాన్వీ కపూర్ టాలీవుడ్లో దేవర చిత్రంలో నటిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతోంది. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
‘ప్రమాద సొరంగం’ వెలుపల ఆలయ నిర్మాణం
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో సిల్క్యారా టన్నెల్ వెలుపల బాబా బౌఖ్‌నాగ్ దేవత ఆలయ నిర్మాణాన్ని నవయుగ కంపెనీ ప్రారంభించింది. నాడు సిల్క్యారా సొరంగంలో కార్మికులు చిక్కుకున్న నేపధ్యంలో రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న బృందం బౌఖ్‌నాగ్ దేవతను వేడుకున్నారట.గత ఏడాది నవంబర్‌లో సిల్క్యారా టన్నెల్లో కొండచరియలు విరిగిపడటంతో 42 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు. వీరిని రక్షించడానికి సుమారు మూడు వారాల పాటు రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. జిల్లా యంత్రాంగంతోపాటు పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, విదేశీ సంస్థల నిపుణులు ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారు.దీని తరువాత కార్మికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం నాడు బౌఖ్‌నాగ్ దేవత పూజారి సొరంగం వెలుపల ఆలయాన్ని నిర్మించాలని రెస్క్యూ టీమ్‌ని కోరాడు. ఈ నేపధ్యంలో తాజాగా నవయుగ కంపెనీ బౌఖ్‌నాగ్ దేవత ఆలయ నిర్మాణాన్ని చేపట్టింది. ఈ విషయాన్ని కంపెనీ పీఆర్వో జీఎల్ నాథ్ తెలిపారు. ప్రస్తుతం ఆలయ నిర్మాణానికి సంబంధించి పునాదితోపాటు పిల్లర్ పనులు జరుగుతున్నాయి. ఆలయ నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సంస్థ నిర్ణయించింది. -
దొంగగా మారిన ఆలయ వాచ్‌మ్యాన్.. 12 తులాల బంగారంతో పరార్
మహారాష్ట్రలో వింత చోరీ ఘటన చోటుచేసుకుంది. ఆలయానికి కాపలాగా నియమించిన వాచ్‌మ్యాన్ దొంగగా మారి, విలువైన ఆభరణాలు కొల్లగొట్టాడు.వివరాల్లోకి వెళితే ఠాణే జిల్లాలోని కల్యాణ్‌ను ఆనుకునివున్న ఉల్లాస్‌నగర్ కాళీమాత ఆలయంలో వాచ్‌మ్యాన్‌గా పనిచేస్తున్న వ్యక్తి దొంగతనానికి పాల్పడ్డాడు. ఆలయ వాచ్‌మ్యాన్ రమేష్ రావల్ తన స్నేహితునితో కలిసి 12 తులాల బంగారం దొంగిలించి పరారయ్యాడు. ఈ నేరం నుంచి తప్పించుకునేందుకు రమేష్రావత్ తనతో పాటు ఆలయంలోని సీసీటీవీని కూడా ఎత్తుకెళ్లిపోయాడు. ఈ ఘటనపై కళ్యాణ్‌లోని విఠల్వాడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీసు అధికారి అనిల్ పడ్వాల్ ప్రత్యేక బృందాన్ని నియమించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఆలయంలో బంగారం చోరీ కావడం స్థానికులను కలవరానికి గురిచేసింది. చోరీకి పాల్పడిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.కాగా రమేష్ రావల్ మూడు రోజుల క్రితమే ఆలయ కాపలాదారుగా చేరాడు. ఆలయ ధర్మకర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ కాళీమాత ఆలయం 65 ఏళ్ల నాటిదని ఆలయ పూజారి తెలిపారు. ఆలయ ప్రధాన కార్యదర్శి సూర్జిత్ బర్మన్ మాట్లాడుతూ నిందితులను వీలైనంత త్వరగా అరెస్టు చేయాలన్నదే తమ డిమాండ్ అని తెలిపారు. -
Rajinikanth: అబుదాబిలో అతిపెద్ద హిందూ దేవాలయాన్ని దర్శించుకున్న రజినీకాంత్ (ఫొటోలు)
-
ఏకశిలపై సీతారామలక్ష్మణులు.. సినిమా టెంపుల్.. అమ్మపల్లి గుడిని చూశారా? (ఫొటోలు)
-
కూతురితో కలిసి ప్రముఖ ఆలయాన్ని సందర్శించిన స్టార్ హీరోయిన్!
బాలీవుడ్ భామ, సీనియర్ నటి రవీనా టాండన్ ఆధ్యాత్మిక బాటపట్టారు. తాజాగా తన కుమార్తె రషా తడానితో కలిసి పూణెలోని భీమశంకర్ జ్యోతిర్లింగ ఆలయాన్ని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజల చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను రవీనా తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. అంతకుముందే మహారాష్ట్ర నాసిక్‌లోని త్రయంబకేశ్వర్ శివాలయాన్ని రవీనా సందర్శించారు.సినిమాల విషయానికొస్తే రవీనా టాండన్ ఇటీవల డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న 'పట్నా శుక్లాలో నటించారు. ఈ చిత్రంలో సతీష్ కౌశిక్, మానవ్ విజ్ కలిసి నటించారు. అర్బాజ్ ఖాన్ నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ బుడకోటి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం రవీనా 'వెల్కమ్ -3' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, సంజయ్ దత్, అర్షద్ వార్సీ, దిశా పటానీ, లారా దత్తా, పరేష్ రావల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by Raveena Tandon (@officialraveenatandon) -
హైదరాబాద్‌లోనే కోల్కత్తా కాళీ మందిర్.. స్వర్ణశిల్పి టెంపుల్ ప్రత్యేక (ఫొటోలు)
-
అయోధ్య అణువణువు రామమయం!
అయోధ్యలోని నూతన రామాలయంలో తొలి శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ శ్రీరామ నవమి అయోధ్యకు చారిత్రకమైనదికానుంది. నేడు శ్రీరాముడు సూర్య తిలకం ధరించనున్నాడు. #WATCH | Uttar Pradesh: Devotees throng Ram temple in Ayodhya, on the occasion of #RamNavami pic.twitter.com/H2n0sQi4AP — ANI (@ANI) April 17, 2024 శ్రీరామ నవమి సందర్భంగా రామ్‌లల్లా దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే రామభక్తులు సరయూలో స్నానాలు చేసి, ఆలయానికి తరలివస్తున్నారు. #WATCH | Uttar Pradesh: Devotees throng Hanuman Garhi temple in Ayodhya, on the occasion of #RamNavami pic.twitter.com/ErvcKxzjae — ANI (@ANI) April 17, 2024 శ్రీరాముని దర్శనానికి వచ్చిన భక్తులు ముందుగా హనుమాన్ గర్హిని దర్శించుకుంటున్నారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు కనిపిస్తున్నారు. #WATCH | UP: On security arrangements in Ayodhya on #RamNavami, Praveen Kumar, IG, Ayodhya Range says, " Arrangements have been done since earlier, we have divided the areas into two sectors...at 3:30 am, 'Darshan' have started at Ram temple..." pic.twitter.com/oH617ByA9D — ANI (@ANI) April 17, 2024 అయోధ్యలో భద్రతా ఏర్పాట్ల గురించి అయోధ్య రేంజ్ ఐజీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ అయోధ్యలోని రామాలయ పరిసరాలను రెండు సెక్టార్లుగా విభజించి, నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. #WATCH | Uttar Pradesh: Devotees take holy dip in Saryu River as they arrive at Ram temple in Ayodhya, on the occasion of #RamNavami pic.twitter.com/ET582pvoT6 — ANI (@ANI) April 16, 2024 తెల్లవారుజామున 3:30 గంటల నుంచి బాలరాముని దర్శనం ప్రారంభమైంది. రామాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన బంగారు రామాయణాన్ని భక్తులు తిలకిస్తున్నారు. ఈ ప్రత్యేక రామాయణాన్ని మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ సుబ్రమణ్యం లక్ష్మీనారాయణన్ దంపతులు ట్రస్ట్‌కు అందించారు. #WATCH | UP: Devotees arrive in large numbers, early in the morning at Ayodhya Ram temple, on the occasion of #RamNavami pic.twitter.com/H7TOalsMMM — ANI (@ANI) April 16, 2024 -
తల్లి కోసం గుడి కట్టిన స్టార్.. సందర్శించిన లారెన్స్ (ఫోటోలు)
-
శ్రీవారి ఆలయంలో వేడుకగా ఉగాది ఆస్థానం
తిరుమల/ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ)/కాణిపాకం(చిత్తూరు రూరల్)/శ్రీశైలం టెంపుల్: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం వేడుకగా జరిగింది. ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, విష్వక్సేనుల వారికి అర్చకులు విశేష సమర్పణ చేశారు. విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోకి ప్రవేశించారు. శ్రీవారి ఉత్సవర్లను బంగారు వాకిలిలో గరుడాళ్వారుకు అభిముఖంగా సర్వభూపాల వాహనంపై, ఉత్సవర్ల పక్కనే మరో పీఠంపై శ్రీ విష్వక్సేనుల వారిని వేంచేపు చేశారు. శ్రీవారి మూలవిరాట్‌కు, ఉత్సవమూర్తులకు నూతన వ్రస్తాలను ధరింపజేశారు. అనంతరం పంచాంగ శ్రవణం జరిగింది. బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు ఉగాది ఆస్థానం నిర్వహించారు. ఆలయంలో టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో 10 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 60 వేల కట్ ఫ్లవర్స్‌తో ఏర్పాటు చేసిన ఫల–పుష్ప అలంకరణలు ఆకట్టుకున్నాయి. అయోధ్య రామాలయం, బాలరాముడి సెట్టింగ్, నవధాన్యాలతో రూపొందించిన మత్స్య అవతారము మైమరిపించింది. టీటీడీ గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన 150 మంది పుష్పాలంకరణ కళాకారులు, 100 మంది టీటీడీ గార్డెన్ సిబ్బంది 2 రోజులు శ్రమించి ఈ ఆకృతులను రూపొందించారు. వైభవంగా దుర్గమ్మకు పుష్పార్చన.. ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవి ఈ నెల 18 వరకు జరుగుతాయి. మంగళవారం తెల్లవారుజామున అంతరాలయంలో మూలవిరాట్‌కు స్నపనాభిషేకం నిర్వహించారు. దేవస్థానం రూపొందించిన పంచాంగాన్ని దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఆవిష్కరించారు. అమ్మవారి ప్రధానాలయం, ఉపాలయాలను పుష్పాలతో అలంకరించారు. దుర్గమ్మకు విశేష పుష్పార్చన చేపట్టారు. ఉగాది సందర్భంగా ధర్మపథం వేదికపై కప్పగంతుల సోమయాజుల సిద్ధాంతి పంచాంగ శ్రవణం చేశారు. సాయంత్రం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు వెండి రథంపై నగరోత్సవాన్ని నిర్వహించారు. కాణిపాకంలో అంగరంగ వైభవంగా.. కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో ఉగాది వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయాన్ని పలు రకాల పుష్పాలు, మామిడి తోరణాలు, అరటి బోదెలతో శోభాయమానంగా అలంకరించారు. వేకువజామున స్వామికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈవో వెంకటేశు స్వామి వారికి పట్టువ్రస్తాలను సమరి్పంచారు. శివకుమార్ శర్మ రచించిన కాణిపాక దేవస్థానం పంచాంగాన్ని ఆవిష్కరించారు. పురోహితులు మోహన్, రామలింగం పంచాంగ శ్రవణం చేశారు. భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. రాత్రి సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామి ఉత్సవ విగ్రహాలను కాణిపాకం పురవీధుల్లో వైభవంగా ఊరేగించారు. శ్రీశైలంలో వేడుకగా రథోత్సవం... శ్రీశైలంలో మల్లన్న రథోత్సవం వైభవంగా సాగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో ఆశీనులను చేయించి ఊరేగింపుగా రథశాల వద్దకు తోడ్కొనివచ్చి రథంపై అధిష్టింపజేశారు. అర్చకులు ఉత్సవమూర్తులకు ప్రత్యేక హారతులిచ్చి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ రథోత్సవం గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు సాగింది. అమ్మవారి ఉత్సవమూర్తిని రమావాణీ సేవిత రాజరాజేశ్వరీ అలంకారంలో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ ఏడాది దేశం పారిశ్రామికరంగంలో అభివృద్ధి చెందుతుందని శ్రీశైలం దేవస్థాన ఆస్థాన సిద్దాంతి పండిత బుట్టే దైవజ్ఞ తెలిపారు. ఉగాది సందర్భంగా ఆయన ఆలయ ప్రాంగణంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. -
హిందూ ఆలయాలపై దాడులు.. నివేదిక కోరిన యూఎస్ కాంగ్రెస్ సభ్యులు!
అమెరికాలో ఇటీవలి కాలంలో హిందూ ఆలయాలపై పెరిగిన దాడులపై జరిగిన విచారణపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఐదుగురు యూఎస్ కాంగ్రెస్ సభ్యులు అమెరికా న్యాయ శాఖకు లేఖ రాశారు. దేశవ్యాప్తంగా ప్రార్ధన స్థలాల వద్ద విధ్వంసకర చర్యల పెరుగుదల ఆందోళన కలిగిస్తున్నదని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను యూఎస్ కాంగ్రెస్ సభ్యులు ప్రమీలా జయపాల్, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి, శ్రీతానేదార్, అమీ బేరాలు రాశారు. దేవాలయాలపై దాడుల ఘటనలు హిందూ అమెరికన్ల ఆవేదనకు కారణమవుతున్నాయని, న్యూయార్క్ నుంచి కాలిఫోర్నియా వరకు పలు మందిరాలపై జరుగుతున్న దాడులపై విచారణ ఏ స్థితిలో ఉందో తెలియజేయాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. దేవాలయాలపై దాడులకు పాల్పడుతున్న అనుమానితులకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడం విచారకరమన్నారు. దాడుల నేపథ్యంలో చాలామంది హిందువులు భయం, బెదిరింపుల మధ్య జీవించాల్సి వస్తోందని వారు వివరించారు. చట్ట ప్రకారం అందరికీ సమాన రక్షణను కల్పించడానికి తగిన ఫెడరల్ పర్యవేక్షణ ఉందా? అని వారు ఆ లేఖలో ప్రశ్నించారు. జనవరిలో కాలిఫోర్నియాలోని హేవార్డ్లోని ఒక ఆలయంపై దాడులకు పాల్పడిన దుండగులు ఖలిస్తాన్ అనుకూల నినాదాలు రాశారన్నారు. ఇలాంటి ఉదంతమే నెవార్క్‌లోని మరొక దేవాలయంలో కూడా జరిగిందన్నారు. యునైటెడ్ స్టేట్స్లో హిందువులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ ద్వేషపూరిత దాడుల నివారణకు ప్రభుత్వం ఏమిచేస్తున్నదని వారు ప్రశ్నించారు. దీనిపై సంబంధిత విభాగం తమకు గురువారంలోగా నివేదిక అందించాలని యూఎస్ కాంగ్రెస్ సభ్యులు ఆ లేఖలో కోరారు. -
లండన్‌లో శ్రీ వేంకటేశ్వర బాలాజీ దేవాలయ ప్రారంభోత్సవ వేడుకలు (ఫోటోలు)
-
ఆలయ కార్యదర్శిపై అమానుష దాడి
ఏలూరు టౌన్ : ఏలూరు కండ్రికగూడెం ప్రాంతంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో దేవుని సొమ్మును కాజేశారని ప్రశ్నించిన ఆలయ కార్యదర్శిపై పాత ఆలయ కమిటీ సభ్యుడు, టీడీపీ కార్యకర్త రెడ్డి నాగరాజు అమానుష దాడికి తెగబడ్డాడు. నూతన ఆలయ కార్యదర్శి అచ్యుతకుమారిపై రాడ్డుతో దాడిచేసి, ఆమెను వివస్త్రను చేసేందుకు ప్రయత్నించడంతో బాధితురాలు తీవ్ర గాయాలపాలైంది. ప్రస్తుతం ఆమె ఏలూరు జీజీహెచ్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఏలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ళ నాని బాధితురాలిని బుధవారం ఆస్పత్రిలో పరామర్శించారు. దాడి వివరాలు తెలుసుకుని వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు. బాధితుల కథనం మేరకు.. ఏలూరు 27వ డివిజన్ కండ్రికగూడెం ప్రాంతంలో శ్రీ వేంకటేశ్వరస్వామి గుడికి ఇటీవలే కొత్త కార్యవర్గం ఏర్పాటైంది. రాజరాజేశ్వరినగర్‌కు చెందిన సావన్ అచ్యుతకుమారి ఆలయ నూతన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఆలయానికి సంబంధించి నిధులు భారీఎత్తున గోల్మాల్ అయ్యాయని ఆమె గుర్తించారు. సుమారు రూ.40 లక్షలు పక్కదారి పట్టినట్లు తెలుసుకుని పాత కార్యవర్గ సభ్యులను ఆమె ప్రశ్నించారు. దీంతో పాత, కొత్త కార్యవర్గాల మధ్య వివాదం మొదలైంది. ఇదిలా ఉంటే.. శ్రీవారి కళ్యాణ మహోత్సవాలను ఆచ్యుతకుమారి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తుండడంతో పాత కార్యవర్గ సభ్యుడు రెడ్డి నాగరాజు అతని భార్య ఇద్దరూ కలిసి ఆలయ ప్రాంగణంలో పుస్తక వ్యాపారం చేసుకునేందుకు అవకాశమివ్వాలని అచ్యుతకుమారిని కోరారు. ఆలయంలో వ్యాపారం చేయడానికి వీల్లేదని, అవసరమైతే ఉచితంగా పుస్తకాల పంపిణీకి అనుమతి ఉంటుందని ఆమె స్పష్టంచేశారు. ఈ విషయంలో వివాదం చెలరేగడంతో రెడ్డి నాగరాజు అచ్యుతకుమారిపై దాడికి తెగబడ్డాడు. రాడ్డు తీసుకుని ఆమెను తలపైన తీవ్రంగా కొట్టడంతో పాటు ఆమె చీరను లాగేసి వివస్త్రను చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో.. అక్కడున్న వారు అతనిని అడ్డుకున్నారు. తీవ్ర గాయాలతో అచ్యుతకుమారి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆమెను ఏలూరు జీజీహెచ్‌కు తరలించారు. నిధుల గోల్‌మాల్‌పై నిలదీయడంతో.. రెడ్డి నాగరాజుతో పాటు ఉమామహేశ్వరరావు, ప్రసాద్‌బాబు తదితరుల ఆధ్వర్యంలో ఆలయ నిధులను పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఉన్నాయని ఆస్పత్రిలో ఆమె చెప్పారు. లక్షలాది రూపాయల నిధులకు లెక్కలు లేకపోవడంతో వారిని నిలదీయగా.. రెడ్డి నాగరాజు సమయం కోసం వేచిచూసి దాడిచేశారన్నారు. -
దుబాయ్ శ్రీకృష్ణ మందిరంలో హోలీ వేడుకలు!
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో గల శ్రీకృష్ణ దేవాలయంలో భక్తులు హోలీ వేడుకలను ఘనంగా చేసుకుంటున్నారు. యూఏఈలోని భారతీయులు సామరస్య పూర్వకంగా హోలీని జరుపుకుంటున్నారని ప్రముఖ వ్యాపారవేత్త చంద్రశేఖర్ భాటియా మీడియాకు తెలిపారు. భారత రాయబారి సంజయ్ సుధీర్ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రంజాన్ మాసంలో మత సామరస్యం ఉట్టిపడేలా వసంతోత్సవాలు చేసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. దుబాయ్‌లోని పలు దేవాలయాలలో హోలీ సందర్భంగా భజనలతో పాటు హోలికా దహనాన్ని నిర్వహించారు. దుబాయ్‌లోని భారతీయ కమ్యూనిటీకి చెందిన సభ్యులు పలువురికి స్వీట్లు పంచి, హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. #यूएई ♦दुबई के कृष्ण मंदिर में श्रद्धालुओं ने मनाई होली#Holi #Dubai #KrishnaTemple pic.twitter.com/8YojdmjkFL — Knews (@Knewsindia) March 25, 2024 -
గుడిలో గంటను ఎందుకు కొడతారు?
కదిరి: గుడిలో గంటకు ఎంతో ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా దేవాలయానికి వెళ్లినపుడు అక్కడ గంటను కొట్టిన తర్వాతనే దేవుడి దర్శించుకుని వస్తుంటారు. ఆలయం చిన్నదైనా, పెద్దదైనా గంట మాత్రం తప్పకుండా ఏర్పాటు చేస్తారు. అయితే అసలు గంటను ఎందుకు కొడతారు? గంట కొట్టడం వల్ల ప్రయోజనమేంటి అనే సందేహం అందరికీ కలుగుతుంది. ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహోత్సవాల సందర్భంగా గంట ప్రాముఖ్యత, ఆలయ నియమాలను ప్రధాన అర్చకుడు నరసింహాచార్యలు వెల్లడించారు. అవేంటో చూద్దాం.... ● ఆలయంలోకే కాదు.. ఆలయ ప్రాంగణంలోకి కూడా పాదరక్షలతో ప్రవేశించకూడదు. ● దేవాలయంలోకి ప్రవేశించి భక్తితో రోదించకూడదు. రోధిస్తూ దేవుని ప్రార్థించకూడదు. ● గుడికి వెళ్లేటప్పుడు సంప్రదాయ దుస్తులనే ధరించాలి. ●రిక్త హస్తాలతో దేవుడి చెంతకు వెళ్లడం మంచిది కాదు. ● గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత గుడిలోకి వెళ్లి స్వామిని దర్శించుకోవాలి. ● గడియారపు ముల్లు తిరిగే విధంగా ప్రదక్షిణ చేయాలి. వ్యతిరేక దిశలో చేయకూడదు. ● గుడి ప్రదక్షిణలు చేసేటప్పుడు గర్భగుడి వెనుక భాగాన గోడకు తల ఆనించడం.. చేతులతో తాకడం మంచిది కాదు. అక్కడ రాక్షసులు ఉంటారు. వారిని నిద్రలేపి వెంట తీసుకెళ్లిన వారవుతారు. గుడి చుట్టూ ఏర్పాటు చేసిన బలి పీఠాలను కూడా తాకరాదు. ● స్వామిని దర్శించుకునేటప్పుడు దేవుడికి ఎదురుగా నిల్చోకూడదు. ఎడమ లేదా కుడి వైపున నిల్చొని దర్శించుకోవాలి. ఎందుకంటే ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్టించేటప్పుడు ఎన్నో శక్తులను ఆపాదించి ఉంటారు. ఆ శక్తి తరంగాలు నేరుగా మన దేహంపై ప్రభావం చూపుతాయి. ● స్వామి దర్శనానంతరం కాసేపు ప్రశాంతంగా కూర్చోవాలి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ● దేవాలయాలు శక్తికి కేంద్రకాలు. మంత్రోచ్చారణల్లోని శబ్ధ తరంగాల వల్ల మనసు చెడు ఆలోచనల వైపు మరలదు. సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆలయంలోని దేవుడి మహిమ, మంత్రోఛ్చారణలు మాత్రమే కాదు.. ప్రత్యేకమైన నిర్మాణశైలి కూడా మనశ్శాంతికి కారణమవుతాయి. ●ప్రదక్షిణలు చేసేటప్పుడు తప్పా.. ఇంకెప్పుడూ దేవాలయం, ధ్వజస్తంభం, ప్రాకారం నీడను దాటకూడదు. ● చంచలమైన మనస్సుతో స్వామిని దర్శించరాదు. క్యూలైన్లో తోటి భక్తులతో, ఆలయ సిబ్బందితో గొడవ పడరాదు. ● దేవాలయంలో మూలవిరాట్‌కు వీపు భాగం చూపిస్తూ కూర్చోరాదు. గర్భగుడి ఎదురుగా సాష్టాంగ నమస్కారం చేయరాదు. ● మొదట ధ్వజ స్తంభాన్ని దర్శించి అనంతరం గుడిలోకి వెళ్లాలి. ఆలయ ప్రాంగణంలో గోమాత ఉంటే పశుగ్రాసం ఇచ్చిన తర్వాతనే దైవ దర్శనానికి వెళ్లాలి. ● ఏ ఆలయంలోనూ మూలవిరాట్‌ను తాకడం మంచిది కాదు. ● వీలున్నప్పుడల్లా గుడికి వెళ్లడం మంచిది. అక్కడ మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. గుడిలోకి ప్రవేశించగానే గంట మోగిస్తే ‘స్వామీ..నేను వచ్చాను’ అని చెప్పడం. అంతేకాదు ‘ స్వామీ..నేను రావచ్చా..’ అని అనుమతి తీసుకున్నట్లుగానూ ఉంటుంది. గంట శబ్ధం చెడు శక్తులను దూరం చేసి, శరీరంతో పాటు మనసునూ శుద్ధి చేస్తుంది. -
ఒక్క నిమ్మకాయ రూ.35వేలు!
తమిళనాడులోని ఓ ఆలయంలో నిర్వహించిన వేలంలో ఒక్క నిమ్మకాయ రూ.35,000 పలికింది. శివరాత్రి సందర్భంగా ఆ మహా శివుడికి సమర్పించిన నిమ్మకాయను ఆలయ అధికారులు వేలం వేయగా ఓ భక్తుడు అత్యధిక మొత్తానికి దక్కించుకున్నారు. తమిళనాడులోని ఈరోడ్‌కి 35 కిలోమీటర్ల దూరంలోని శివగిరి గ్రామ సమీపంలోని పాతపూసయ్య ఆలయంలో శుక్రవారం రాత్రి మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా శివుడికి సమర్పించిన నిమ్మకాయ, పండ్లతోపాటు ఇతర వస్తువులను ఆచారం ప్రకారం వేలం వేశారు. ఈ వేలంలో 15 మంది భక్తులు పాల్గొనగా, ఈరోడ్‌కు చెందిన ఒక భక్తుడు రూ. 35,000కు నిమ్మకాయను దక్కించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వేలం వేసిన నిమ్మకాయను ఆలయ పూజారి స్వామివారి ముందు ఉంచి పూజ చేసి వందలాది మంది భక్తుల సమక్షంలో వేలం దక్కించుకున్న భక్తుడికి అందజేశారు. స్వామివారికి సమర్పించిన నిమ్మకాయను పొందడం అదృష్టంగా భక్తులు భావిస్తారు. తమకు అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు లభిస్తాయని నమ్ముతారు. -
భక్తులతో కిటకిటలాడుతున్న శ్రీకాళహస్తీశ్వరుని ఆలయం
-
ఆధ్యాత్మిక బాటలో రకుల్ ప్రీత్ సింగ్.. పెళ్లి తర్వాత తొలిసారిగా!
టాలీవుడ్ హీరోయిన రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలే వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. నటుడు, నిర్మాత అయిన తన ప్రియుడు జాకీ భగ్నానీతో ఏడడుగులు వేసింది. గోవాలో జరిగిన వీరి పెళ్లికి పలువురు సినీ తారలు కూడా హాజరయ్యారు. ఫిబ్రవరి 21 వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆనంద్ కరాజ్ అనే పంజాబీ సాంప్రదాయ పద్ధతిలో వీరి పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. వరుడి సాంప్రదాయం ప్రకారం సింధి పద్ధతిలోనూ ముచ్చటగా పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి తర్వాత రకుల్, భగ్నానీ జంట బిజీగా మారిపోయింది. తన భర్తతో కలిసి ఆధ్యాత్మిక బాట పట్టింది. కుటుంబసభ్యులతో పాటు దేవుళ్ల ఆశీర్వాదాలు తీసుకుంటోంది. తాజాగా అస్సాం గువహటిలోని కామాఖ్య దేవి అమ్మవారిని రకుల్ దర్శించుకున్నారు. కొత్త జీవితం ప్రారంభించిన నూతన దంపతులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
8 నెలలు మాయమై.. శివరాత్రికి కనిపించే ఆలయం!
దేశంలో శివరాత్రి ఉత్సాహం నెలకొంది. శుక్రవారం జరిగే శివరాత్రి పూజలకు భక్తులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే రాజస్థాన్‌లోని బన్స్వారా జిల్లాకు చెందిన లక్షలాది మంది భక్తులకు శివరాత్రి ఎంతో ప్రత్యేకమైన పండుగ. ఎందుకంటే ఇక్కడ కొలువైన శివుడు ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే దర్శనమిచ్చి అదృశ్యమవుతాడు. దీనివెనుకగల ఆసక్తికర కథనాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. బన్స్వారా జిల్లాలో మహి, అనస్ నదుల సంగమం వద్ద 200 ఏళ్ల చరిత్ర కలిగిన అద్భుత శివాలయం ఉంది. సంవత్సరంలో ఏడెనిమిది నెలల పాటు ఈ ఆలయం కనుమరుగువుతుంది. ఈ ఆలయం నాలుగు అడుగుల నీటిలో మునిగి ఉంటుంది. ఏళ్ల తరబడి ఇలా జరుగుతున్నా ఆలయానికి ఎటువంటి నష్టం వాటిల్లకపోవడం విశేషం. ఈ ఆలయం ఇలా మునిగిపోవడానికి గల కారణం గుజరాత్‌లోని కడనా డ్యామ్‌లోకి చేరిన నీరు ఈ ఆలయ ప్రాంతంలో నిలిచిపోవడం. ఇటుక, రాయి, సున్నంతో నిర్మితమైన ఈ ఆలయం సంగమేశ్వర్ మహాదేవ్ ఆలయంగా పేరొందింది. ఈ ఆలయం బన్స్వారాకు 70 కి.మీ. దూరంలో ఉంది. ఫిబ్రవరి, మార్చిలలో ఈ ప్రాంతంలో నీటి మట్టం తగ్గినప్పుడు ఆలయం కనిపిస్తుంది. శివరాత్రి సమయంలో భక్తులు కాలినడకన ఆలయానికి చేరుకుని, శివుణ్ణి దర్శించుకుంటారు. నదుల సంగమ తీరం కావడంతో ఈ ఆలయానికి సంగమేశ్వర్ మహాదేవ్ ఆలయం అనే పేరు వచ్చింది. -
91 ఏళ్లుగా మహాశివరాత్రి మేళా
దేశ వ్యాప్తంగా మార్చి 8న మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో 91 ఏళ్లుగా మహాశివరాత్రి మేళా అత్యంత వైభవంగా జరిగే ప్రాంతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ పరిధిలోని చటీడీహ్ శివాలయంలో ఈ ఏడాది మార్చి 8 నుంచి 12 వరకు 5 రోజుల పాటు మేళా జరగనుంది. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు దయాశంకర్ సోని మీడియాతో మాట్లాడుతూ ఈ ఆలయం సుమారు 91 సంవత్సరాల క్రితం నాటిదని, చార్ ధామ్ యాత్రకు వెళ్లి వచ్చాక తన తాత మంగ్లీ ప్రసాద్ సోనీ ఈ ఆలయాన్ని నిర్మించారని తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 91 ఏళ్లుగా మహాశివరాత్రి మేళా నిర్వహిస్తున్నమన్నారు. ఈ ఏడాది కూడా మేళాలో దుకాణాలు ఏర్పాటు చేసేందుకు వ్యాపారులు రావాలని కోరామన్నారు. ప్రస్తుతం మంగ్లీ ప్రసాద్ సోనీ వారసులు ఆలయాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ ఆలయంలో ధ్వజారోహణం చేసే సంప్రదాయం కూడా ఉంది. ఈ ఆలయానికి వచ్చే భక్తుల కోర్కెలు నెరవేరుతాయని స్థానికులు చెబుతుంటారు. శివరాత్రి సందర్భంగా ఊరేగింపు కూడా నిర్వహించనున్నారు. -
వారణాసిలో 26 మాంసం దుకాణాలు సీల్!
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో గల కాశీ విశ్వనాథ ఆలయానికి రెండు కిలోమీటర్ల పరిధిలోగల 26 మాంసం దుకాణాలను అధికారులు సీజ్ చేశారు. న్యూ రోడ్, బెనియాబాగ్ ప్రాంతంలో మాంసం, చికెన్ దుకాణాలను అధికారులు మూసివేయించారు. కాశీ విశ్వనాథ ఆలయానికి రెండు కిలోమీటర్ల పరిధిలోని మాంసం, చికెన్ దుకాణాలను మూసివేయాలని ఆదేశిస్తూ మున్సిపల్ కార్పొరేషన్ హౌస్ గత నెలలో తీర్మానం చేసింది. ఈ నేపధ్యంలో వెటర్నరీ అధికారి డాక్టర్ అజయ్ ప్రతాప్ సింగ్ ఇటీవల బెనియాబాగ్, న్యూ రోడ్లో గల మాంసం, చికెన్ దుకాణాలను తనిఖీ చేశారు. వీటిలో 26 దుకాణదారులు ఆహార భద్రతా విభాగం, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎటువంటి అనుమతి తీసుకోలేదని తేలింది. ఈ తనిఖీల తర్వాత, ఆయా దుకాణాలను మూసివేయాలని వెటర్నరీ అధికారి గత వారం నోటీసులు జారీ చేశారు. అయితే ఇప్పటికీ దుకాణాలు యధాతథంగా కొనసాగుతున్నాయి. దీంతో ఈరోజు(శనివారం) వెటర్నరీ అధికారి నేతృత్వంలో ఎన్ఫోర్స్మెంట్ బృందం బెనియాబాగ్, కొత్తరోడ్డు ప్రాంతంలోని 26 దుకాణాలను సీజ్ చేసింది. -
అబూదాబి హిందూ ఆలయంలో సామాన్య భక్తుల సందడి!
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో రాతితో నిర్మించిన మొదటి హిందూ దేవాలయాన్ని సామాన్యుల కోసం తెరిచారు. దీంతో ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. అబుదాబిలోని ఈ హిందూ దేవాలయాన్ని ఫిబ్రవరి 14న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దుబాయ్-అబుదాబి షేక్ జాయెద్ హైవేపై అల్ రహ్బా సమీపంలో 27 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.700 కోట్లతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయం కోసం భూమిని యూఏఈ ప్రభుత్వం విరాళంగా ఇచ్చింది. అబుదాబిలోని ఈ తొలి హిందూ దేవాలయం నాగర్ శైలిలో నిర్మితమయ్యింది. ఇదే శైలిలో అయోధ్యలోని రామాలయాన్ని నిర్మించారు. అబూదాబి ఆలయ వాలంటీర్ ఉమేష్ రాజా తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్‌లో 20 వేల టన్నులకు పైగా సున్నపురాళ్లను 700 కంటైనర్లలో అబుదాబికి తీసుకువచ్చారు. అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ (బీఏపీఎస్)తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో.. ‘నిరీక్షణ ముగిసింది! అబుదాబి ఆలయం ఇప్పుడు సందర్శకులు , సామాన్య భక్తుల కోసం తెరిచారు. సోమవారం మినహా అన్ని రోజుల్లో ఈ ఆలయం ఉదయం 9 నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుందని’ పేర్కొంది. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ‘ఆలయంలో శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడానికి, ఈ ప్రాంగణాన్ని క్రమబద్ధంగా నిర్వహించడానికి భక్తులు ఆలయ మార్గదర్శకాలను పాటించడం అవసరం’ అని పేర్కొన్నారు. -
ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో రాజమౌళి దంపతులు!
టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దంపతులు ఆలయంలో పూజలు నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారిలోని శ్రీ అమృతేశ్వరా ఆలయంలో నిర్వహించిన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి ప్రాజెక్ట్ కోసం టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తదుపరి చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. దీంతో వీరిద్దరి కాంబోపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. SSMB29గా తెరకెక్కించనున్న ఈ మూవీ కోసం మహేశ్ బాబు జిమ్‌లో కసరత్తులు ప్రారంభించారు. ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. ఈ ఏడాదిలో షూటింగ్ ప్రారంభం అవుతుందని గతంలో రాజమౌళి ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ చిత్రం కోసం హాలీవుడ్ నటీనటులను రాజమౌళి తీసుకొస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇండోనేషియా నటి అయిన చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్‌తో పాటు థోర్ సినిమాతో పాపులర్ అయిన క్రిస్ హెమ్స్‌వర్త్ SSMB29 ప్రాజెక్ట్‌లో భాగం కానున్నారని టాక్ వినిపించింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'మహారాజా' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు ఇండస్ట్రీలో ఒక వార్త అప్పట్లో తెగ వైరలైంది. Legendary Director @ssrajamouli garu at #SreeAmrutheswaraTemple in Bellary for the Prana Prathishta ceremony.@SriAmruteshwara @VaaraahiCC @SaiKorrapati_ pic.twitter.com/IH2wEYI6IM — Vaaraahi Chalana Chitram (@VaaraahiCC) February 29, 2024 -
సహనం, సహజీవనం బాటలో...
యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ ఇచ్చిన 27 ఎకరాల స్థలంలో స్వామినారాయణ సంస్థ అక్కడ భారీ హిందూ దేవాలయాన్ని నిర్మించింది. ముస్లిమేతర విశ్వాసాలను బహిరంగంగా పాటించడానికి కూడా ఒకప్పుడు అనుమతి లేని ఆ దేశంలో ఇది చాలా పెద్ద మార్పు. స్పష్టంగా, బిన్ జాయెద్ ఇస్లాం శాంతి మతం మాత్రమే కాదు, అది ఇతర ఆధ్యాత్మిక అన్వేషణలను అంగీకరిస్తుందని చూపించాలనుకుంటున్నారు. దీనిపై సంప్రదాయ ఉలేమానుండి వచ్చివుండిన వ్యతిరేకతను కూడా ఆయన అధిగమించగలిగారు. యూఏఈ పూర్తి స్థాయి సహనం, సహజీవన మంత్రిత్వ శాఖను కలిగివుంది. ముల్లా ఒమర్ తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించిన మూడు దేశాలలో యూఏఈ ఒకటనే వెలుగులో చూస్తే వారి ఈ ప్రయాణం అద్భుతమైనది. ఫిబ్రవరి 13–14 తేదీలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పర్యటన సందర్భంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అబూ ధాబీలో, బోచాసన్ వాసీ అక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ(బాప్స్) సంస్థ నిర్మించిన హిందూ దేవాలయాన్ని ప్రారంభించారు. యూఏఈ అధ్యక్షుడు, అబూ ధాబీ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నాహ్ యాన్ (ఎంబీజెడ్) ఇచ్చిన 27 ఎకరాల స్థలంలో ఈ ఆలయాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, స్వామి నారాయణ్ సంస్థ దివంగత అధినేత ప్రముఖ్ స్వామి మహారాజ్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తమ సంబంధం ‘తండ్రీ కొడుకుల మాదిరిగానే ఉండేది’ అని చెప్పారు. ‘ప్రముఖ్ స్వామి మహారాజ్ కలను సాకారం చేయడంలో నేను సహాయపడినందుకు ఎంతో గౌరవంగా భావిస్తున్నాను’ అన్నారు. ప్రముఖ్ స్వామి మహా రాజ్ 1997లో యూఏఈని సందర్శించినప్పుడు అబూ ధాబీలో ఒక ఆలయాన్ని నిర్మించాలని కోరుకున్నారు. షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ సహనం, విభిన్న విశ్వాసాల మధ్య అవగాహన, సహజీవనం వంటి ధర్మాలకు కట్టుబడి ఉన్నారు. దుబాయ్‌లోని జెబెల్ అలీ ప్రాంతంలో పెద్ద హిందూ దేవాలయం, గురుద్వారా నిర్మాణానికి అనుమతించిన దేశ ఉపాధ్యక్షుడు, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా బిన్ జాయెద్ అభిప్రాయాలను గణనీయమైన స్థాయిలో పంచుకుంటు న్నారు. యూఏఈ ప్రభుత్వం పూర్తి స్థాయి సహనం, సహజీవన మంత్రిత్వ శాఖను కలిగి ఉంది. దీనికి జ్ఞానవంతుడైన షేక్ నాహ్ యాన్ బిన్ ముబారక్ అల్ నాహ్యాన్ నేతృత్వం వహిస్తున్నారు. తమ సాంప్రదాయిక సమాజంలో అబ్రహామిక్ విశ్వాసాల ప్రార్థనా స్థలాలను మాత్రమే కాకుండా ఇప్పుడు హిందూ, సిక్కు, బౌద్ధమతాల ప్రార్థనాలయాలను స్థాపించడానికి అనుమతించడంలోనూ ఈ నాయకులు మార్గదర్శకులుగా నిలిచారు. నేను 1979–82 ప్రాంతంలో అబూ ధాబీలోని భారత రాయబార కార్యాలయంలో పనిచేశాను. ఆ సమయంలో, దుబాయ్‌లో హిందువులు, సిక్కుల ఆరాధనకు సంబంధించి ఒక చిన్న స్థలం ఉండేది. అయితే, బయటి నుండి దానిని గుర్తించలేరు. హిందువులు, సిక్కులు బహిరంగంగా గుర్తించే విధంగా తమ ప్రార్థనలను, కీర్తనలను చేయకూడదనే అవ గాహనతో అప్పటి దుబాయ్ పాలకుడు షేక్ రషీద్ బిన్ సయీద్ అల్ మక్తూమ్ దీనిని అనుమతించారు. ఆ రోజుల్లో, ప్రార్థనా స్థలాల నిర్మా ణానికి కాదు కదా, ముస్లిమేతర విశ్వాసాలను బహిరంగంగా పాటించుకోవడానికి కూడా యూఏఈ అనుమతించడం అనేది ఊహకందని విషయం. నిజానికి, ఇప్పుడు కూడా, యూఏఈ ఉదాహరణను ఇతర అరబ్ దేశాలు పూర్తిగా అనుసరించలేదు. సౌదీ అరేబియా యువ రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ మహిళల బహిరంగ కార్యకలాపాలపై ఇచ్చిన సామాజిక సడలింపులు పూర్తి భిన్నమైన కోవలోకి వస్తాయి. యూఏఈ 1971 డిసెంబరులో ఏడు ఎమి రేట్లతో కలిసి ఒక దేశంగా ఆవిర్భవిం చింది. అవి: అబూ ధాబీ, దుబాయ్, షార్జా, రస్ అల్ ఖైమా, ఉమ్ అల్ క్వైన్, అజ్మాన్, ఫుజైరా. అప్పటివరకు బ్రిటిష్ రక్షిత ప్రాంతా లుగా ఉంటూవచ్చిన అవి ఒక సమాఖ్యను ఏర్పాటు చేసుకున్నాయి. 1962లో అబూ ధాబీలో భారీ పరిమాణంలో చమురును కను గొన్నారు. కానీ దుబాయ్‌లో తక్కువ నిల్వలు ఉండేవి. షార్జాలో ఇంకా తక్కువ. మిగతా ఎమి రేట్స్‌లో అవీ లేవు. 1970వ దశకంలో చమురు ధరల పెరుగుదల యూఏఈ రూపు రేఖలను మార్చింది. అబూ ధాబీ తాను అభివృద్ధి చెందడమే కాకుండా, ఇతరులతో తన ఔదార్యాన్ని పంచుకోవడానికి సిద్ధపడింది. దీంతో భారీ నిర్మాణ కార్యకలాపాలు ప్రారంభ మయ్యాయి. ఇది భారతదేశంతో సహా అనేక దేశాల నుండి ప్రజలను తీసుకువచ్చింది. వారు వివిధ విశ్వాసాలకు చెందినవారు. అప్పటి దుబాయ్ పాలకుడైన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ తన ఎమిరేట్‌ను వ్యాపారం, షిప్పింగ్, ఫైనాన్స్ కోసం ఒక గొప్ప వాణిజ్య కేంద్రంగా నిర్మించడం ప్రారంభించారు. దీని కోసం, ఆయన పెద్ద సంఖ్యలో విదేశీయుల రాకను ప్రోత్సహించవలసి వచ్చింది. బిన్ రషీద్ దార్శనికతను దుబాయ్ ప్రస్తుత పాలకుడు ముందుకు తీసు కెళ్లారు. పర్యాటకాన్ని ప్రోత్సహించడం ప్రారంభించారు. పర్యాటకా నికి మహిళలు, ఆహారం, పానీయాలకు సంబంధించిన పాత, కఠిన మైన సామాజిక ఆచారాల సడలింపులు అవసరమయ్యాయి. అయితే, అధికారులు దుబాయ్‌లో నివసించడానికీ, పని చేయడానికీ వచ్చిన వారి రాజకీయ కార్యకలాపాలను మాత్రం అనుమతించలేదు. అబూ ధాబీ మినహా కొన్ని ఇతర ఎమిరేట్లు దీనిని అనుసరించాయి. ముస్లి మేతర మత కార్యకలాపాలను బహిరంగంగా వ్యక్తీకరించడాన్ని, పర్యవేక్షించడం మరొక అంశం. ఏమైనా విశ్వాసాల విషయంలో వహాబీ, సలాఫీ ఇస్లాం సిద్ధాంతాలు కచ్చితంగా అమలయ్యాయి. ఇక్కడే యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ సహనం, సహజీవనాలను ప్రచారం చేయడంలో చాలా ముందుకు వెళ్లిపోయారు. ఇవి ఇస్లామిక్ విశ్వాసంపై అత్యంత కఠినమైన వ్యాఖ్యానం, అభ్యాసం కోసం పట్టుబట్టే ఇబ్న్ వహాబ్ సాంప్రదాయ బోధనలకు భిన్నమైన పరాయి ఆలోచనలు. సౌదీ రాజకుటుంబం వహాబిజంతో ఒప్పందాన్ని కలిగి ఉంది. అరేబియా ద్వీపకల్పంలోని ఇతర గిరిజన పెద్దలు కూడా దానిని అనుసరించారు. ఇస్లాంకు ఇతర వ్యాఖ్యానాల చెల్లుబాటు తిరస్కరించబడింది. వాస్తవానికి, ఇతర మతాలను, ముఖ్యంగా అబ్రహామిక్ కానివాటిని అంగీకరించే ప్రశ్నే లేదు. ఇక విగ్రహారాధనకు అయితే పెద్ద వ్యతిరేకత ఉంటుంది. స్పష్టంగా, మొహమ్మద్ బిన్ జాయెద్ ఇస్లాం శాంతికి సంబంధించిన మతం మాత్రమే కాదు, అది గౌరవప్రదమైనదనీ, ఇతర ఆధ్యా త్మిక అన్వేషణలను అంగీకరిస్తుందనీ చూపించాలనుకుంటున్నారు. అది ఉదారవాద, జ్ఞానోదయమైన విధానం. తీవ్రవాదం, హింసలను ఇస్లాం ప్రబోధిస్తుందనే అభిప్రాయాన్ని కూడా ఇది తిరస్కరించడానికి ప్రయత్నిస్తుంది. అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్, లష్కర్ ఎ తొయ్యబా, అఫ్గాన్ తాలిబాన్ వంటి గ్రూపులు ఆచరిస్తున్న భావజాలాలు, హింస కారణంగా చాలా ముస్లిమేతర ప్రాంతాలలో ఈ అభిప్రాయం ఏర్పడింది. 1990లలో ముల్లా ఒమర్ తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించిన మూడు దేశాలలో యూఏఈ ఒకటి. మిగిలిన రెండూ సౌదీ అరేబియా. పాకిస్తాన్. ఈ వెలుగులో చూస్తే మొహమ్మద్ బిన్ జాయెద్ పాలనలో సహనం, సహజీవనాలకు చెందిన విధానం, దాని అభ్యాసం అద్భుతమైనవి. అబూ ధాబీలో బోచాసన్వాసీ అక్షర్ పురుషోత్తమ్ స్వామి నారాయణ దేవాలయం వంటి ఇస్లామేతర ప్రార్థనా స్థలాలను అనుమతించడంపై సంప్రదాయ వహాబీ ఉలేమా నుండి కచ్చితంగా వచ్చివుండిన వ్యతిరేకతను బిన్ జాయెద్ అధిగమించగలిగారు. ‘వహాబీ మజబ్’లోనే మార్పు వస్తున్నదని ఇది సూచిస్తున్నదో లేదో అంచనా వేయడం తొందరపాటే అవుతుంది. బిన్ జాయెద్ నిస్సందే హంగా ఇతర దేశాల సంప్రదాయ ఉలేమాల ఆగ్రహాన్ని కూడా ఎదుర్కొంటారు. అయితే సహనం, సహజీవనం పట్ల తన నిబద్ధతను స్పష్టంగా వ్యక్తీకరించడానికి అటువంటి ఒత్తిళ్లను తట్టుకునే సామ ర్థ్యాన్ని ఆయన కలిగివున్నారు. కానీ అది ఎడారి గిరిజనుల స్పృహలోకి ఎంత లోతుగా ప్రవేశించిందో కాలమే చెబుతుంది. - వ్యాసకర్త, విదేశాంగ మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) - వివేక్ కాట్జూ -
నేడు కల్కిధామ్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన
ప్రధాని నరేంద్రమోదీ ఈరోజు (సోమవారం) యూపీలోని సంభాల్ జిల్లాలోని ఐంచోడ కాంబోహ్‌లో నిర్మితం కానున్న కల్కి ధామ్‌కు శంకుస్థాపన చేయనున్నారు. సోమవారం ఉదయం 7:30 గంటల నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయని కల్కి ధామ్ పీఠాధీశ్వరులు ఆచార్య ప్రమోద్ కృష్ణం తెలిపారు. 10:30 గంటలకు కల్కి ధామ్‌కు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. కల్కి ఆలయ నమూనాను కూడా ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పలువురు మంత్రులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని ప్రమోద్ కృష్ణం తెలిపారు. కల్కిధామ్ వేడుకలకు ప్రధాని హాజరు కానున్నారని తెలియగానే ఆచార్య ప్రమోద్ కృష్ణంను కాంగ్రెస్ పార్టీ ఆరేళ్ల పాటు బహిష్కరించింది. కాంగ్రెస్ సభ్యుడు ఆచార్య ప్రమోద్ కృష్ణం ఫిబ్రవరి ఒకటిన ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీకి కల్కిధామ్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాలంటూ ఆహ్వాన పత్రిక అందించారు. ఈ ఆహ్వానంపై ప్రధాని సానుకూల వైఖరి ప్రదర్శించారు. ఈ నేపధ్యంలోనే ప్రమోద్ కృష్ణంపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు కాంగ్రెస్ ఒక లేఖలో తెలియజేసింది. -
మాఘ పౌర్ణమి వేళ.. వారణాసికి మోదీ
ఫిబ్రవరి 24న మాఘ పౌర్ణమి.. ఆరోజున ప్రధాని నరేంద్ర మోదీ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించనున్నారు. అలాగే గోవర్ధన్‌లో సంత్ రివిదాస్ విగ్రహాన్ని ఆవిష్కరించడంతోపాటు ఆలయ అభివృద్ధి, సుందరీకరణ కోసం రూ.50 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఆలయ నిర్వాహకులు ప్రధాని మోదీకి ఆహ్వానం పంపారు. మోదీ పర్యటన ఇంకా ఖరారు కానప్పటికీ ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈసారి కాశీకి రానున్న ప్రధాని నరేంద్ర మోదీ పంచగంగా ఘాట్ వద్దనున్న బిందుమాధవ్ ఆలయాన్ని దర్శించే అవకాశాలున్నాయి. శైవ-వైష్ణవ ఐక్యతకు పునాదిగా నిలిచే ఈ ఆలయం విస్తరణ, అభివృద్ధి దిశగా ప్రధాని యోచిస్తున్నారని సమాచారం. -
అయోధ్యలో మరో 13 నూతన ఆలయాలు
అయోధ్యలోని శ్రీరాముని ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. బాలరాముని దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు క్యూ కడుతున్నారు. అయోధ్యను ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశంగా మార్చేందుకు కేంద్ర, యూపీ రాష్ట్ర ప్రభుత్వాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయోధ్యను ప్రపంచ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందుతున్నాయి. దీనిలో భాగంగా 13 నూతన ఆలయాలను నిర్మించనున్నారు. వీటిలోని ఆరు ఆలయాలు ప్రధాన మందిర సముదాయం లోపల, ఏడు ఆలయాలు వెలుపల నిర్మితం కానున్నాయి. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి స్వామి గురుదేవ్ గిరీజీ ఈ ప్రణాళిక గురించి తెలియజేశారు. ప్రధాన ఆలయాన్ని పూర్తి చేసే పనులతో సహా అన్ని ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని అన్నారు. ప్రధాన ఆలయంలో మొదటి అంతస్తు వరకూ మాత్రమే నిర్మాణం పూర్తయ్యిందని, రెండో అంతస్తు పనులు జరుగుతున్నాయని, అనంతరం శిఖరం, మధ్య గోపురం పనులు జరగాల్సి ఉందని గిరీజీ వివరించారు. రాముని కుటుంబానికి చెందిన ఐదు ప్రధాన ఆలయాల పనులు కొనసాగుతున్నాయని, రాముడు స్వయంగా విష్ణువు అవతారం అయినందున గణపతి, శివుడు, సూర్య దేవుడు, జగదంబ ఆలయాలు కూడా నిర్మితం కానున్నాయని తెలిపారు. ప్రధాన ఆలయానికి నలు మూలల్లో ఈ ఆలయాలు ఉండనున్నాయి. హనుమంతునికి ప్రత్యేక ఆలయం కూడా నిర్మితం కానుంది. ఇప్పటికే ఈ ఆలయాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. సీతా రసోయి సమీపంలో అన్నపూర్ణ దేవి ఆలయం నిర్మితం కానుంది. ఆలయ సముదాయం వెలుపల వాల్మీకి, వశిష్ఠ, విశ్వామిత్ర, శబరి, జటాయువు తదితర ఆలయాలు నిర్మించనున్నారు. -
గండిక్షేత్ర అభివృద్ధికి పాలక మండలి శ్రమించాలి: వైఎస్ అవినాష్ రెడ్డి
చక్రాయపేట: గండి క్షేత్రాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసి సర్వ హంగులు దిద్దుకున్నాక జాతికి అంకితం చేస్తామని కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు.సోమవారం గండి నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి మండల ఇన్చార్జి వైఎస్ కొండారెడ్డి,వేంపల్లె జెడ్పీటీసీ సభ్యుడు రవికుమార్ రెడ్డిలతో కలసి హాజరయ్యారు. ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో గండి క్షేత్రం అభివృద్ధి చెందిందని చెప్పారు.అప్పట్లోనే టూరిజం రెస్టారెంట్,భక్తులు,అర్చకుల వసతి గృహాలు,సిమెంట్ రోడ్లు, పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం వంటి పనులు జరిగాయని చెప్పారు.ఆయన మరణానంతరం వచ్చిన ప్రభుత్వాలు గండిపై శీతకన్ను వేశాయన్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఆలయం పునర్నిర్మాణానికి రు.16 కోట్లు నిధులు మంజూరు చేశారని తెలిపారు.అలాగే రాజగోపురం,ప్రహారి నిర్మాణానికి కూడా మరో రు.6కోట్ల మేర నిధులు మంజూరు చేశారన్నారు. మళ్లీ అధికారం లోకి రాగానే రెండు విడతల్లో గండిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు.మొదటి విడతలో భక్తుల సౌలభ్యం కోసం వంద గదుల నిర్మాణాం,రెండో దశలో గండిలోని టూరిజం రెస్టారెంట్‌ను పూర్తి చేస్తామని వివరించారు. గండి క్షేత్రంలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన పథకానికి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రూ.23 లక్షలు విరాళంగా అందజేశారు.గండి అభివృద్ధికి నూతన పాలక మండలి శ్రమించాలని ఎంపీ అన్నారు. అంతకుముందు ఎంపీ గండి వీరాంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ముకుందారెడ్డి, అర్చకులు పూ ర్ణకుంభ స్వాగతం పలికారు.ప్రత్యేక పూజలు చేయించారు. కుడా చైర్మన్ గురుమోహన్,ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ ప్రసాదరావు, చక్రాయపేట,వేంపల్లె ఎంపీపీలు మాధవీబాలకృష్ణ,గాయత్రి,వేంపల్లె మండల కన్వీనర్ చంద్ర ఓబుళరెడ్డి,మండల సమన్వయకర్త ఓబుళరెడ్డి,కందుల నాని పాల్గొన్నారు. అభివృద్ధికి పాటుపడుతాం చక్రాయపేట : గండి క్షేత్రం అభివృద్ధికి పాటు పడతామని ఆలయ నూతన చైర్మన్ కావలి కృష్ణతేజ, పాలక మండలి సభ్యులు అన్నారు.సోమవారం గండి పాలక మండలి సభ్యులు ఆలయ సహాయ కమిషనర్ ముకుందారెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మండల ఇన్చార్జి వైఎస్ కొండారెడ్డి, రవికుమార్ రెడ్డిల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తున్న గండి పాలకమండలి చైర్మన్, సభ్యులు చైర్మన్‌గా కృష్ణతేజ, పాలకమండలి సభ్యులుగా సుబ్బిరెడ్డిగారి జయమ్మ,కొప్పల మునీశ్వరి,ముద్ది కుమారి,బుక్కే లలితమ్మ, కలమల సోమాకళావతి,బండ్రెడ్డి చక్రపాణిరెడ్డి,పబ్బతి బిందుసాగర్,రాసినేని మధు,బోరెడ్డిగారి వెంకట రామిరెడ్డి,నారుబోయిన సుగుణమ్మ, ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ప్రధాన అర్చకుడు కేసరి ప్రమాణ స్వీకారం చేశారు.మారెళ్లమడక సర్పంచ్ నరసింహులు,ఎంపీటీసీ సభ్యురాలు శాంతమ్మ,పులివెందుల నియోజకవర్గ సర్పంచుల సంఘం అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి,ఆలయ మాజీ చైర్మన్ రాఘవేంద్రప్రసాద్, జేసీఎస్ కన్వీనర్ రామాంజులరెడ్డి, మండల యూత్ కన్వీనర్ రామాంజనేయరెడ్డి పాల్గొన్నారు. -
నేనేం నేరం చేశా: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీకి భారత్ జోడో న్యాయ్ యాత్రలో వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ట ఆహ్వానాన్ని కాంగ్రెస్ పార్టీ తిరస్కరించిన సంగతి తెలిసిందే. మరోవైపు అసోం ముఖ్యమంత్రిపైనా రాహుల్ తీవ్ర అవినీతి విమర్శలు చేశారు. ఈ క్రమంలో ఆదివారం బీజేపీ శ్రేణుల నుంచి రాహుల్‌కు ప్రతిఘటన ఎదురైంది. ఇక తాజాగా.. ఆలయంలో రాహుల్ గాంధీకి దర్శనానికి అనుమతి నిరాకరించారు. సోమవారం ఉదయం బటాద్రవ థాన్(సత్రం) ఆలయ దర్శనానికి వెళ్లిన రాహుల్ గాంధీని.. అక్కడి అధికారులు లోపలికి అనుమతించలేదు. దీంతో ఆయన వాగ్వాదానికి దిగారు. ‘‘మేం ఆలయాన్ని దర్శించుకోవాలనుకుంటున్నాం. నేనేం నేరం చేశా? ఎందుకు ఆలయంలోకి అనుమతించడం లేదు?.. మేం సమస్యల్ని సృష్టించడానికి రాలేదు. కేవలం పూజలు చేసి వెళ్తాం. ఆలయంలో ఎవరు ప్రవేశించాలో కూడా ప్రధాని మోదీనే నిర్ణయిస్తారా ఏంటి? అంటూ అధికారులను నిలదీశారాయన. ఆ ఘటన తర్వాత నాగోవ్‌లో స్థానిక నేతలు, కార్యకర్తలతో బైఠాయింపు నిరసన చేపట్టారాయన. మరోవైపు.. అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అయిపోయాక మధ్యాహ్నాం 3.గంటల తర్వాతే ఆలయంలోకి రాహుల్ గాంధీని అనుమతిస్తామని ఆలయ నిర్వాహకులు కరాఖండిగా చెబుతున్నారు. అయితే.. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలకు మాత్రమే ఇవాళ ప్రాణప్రతిష్ట వేళ అనుమతి ఉంటుందని ఆదివారమే ఒక స్పష్టమైన ప్రకటన చేసింది ఆలయ కమిటీ. బటాద్రవ థాన్ ఆలయం 15వ శతాబ్దపు సన్యాసి.. అసోం సంఘసంస్కర్త అయిన శ్రీమంత శంకర్దేవ్కు జన్మస్థలం. అయితే ఆలయ దర్శనం కోసం ఆదివారం దాకా నిర్వాహకులు రాహుల్ ఆలయ దర్శనానికి సానుకూలంగా స్పందించారని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే ఇప్పుడు నిరాకరిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. బటాద్రవ థాన్‌కు రాహుల్ గాంధీ వెళ్తున్న క్రమంలో.. ఆదివారం అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ స్వయంగా ఒక ప్రకటన చేశారు. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట నేపథ్యంలో.. జోడో యాత్ర మార్గాన్ని మార్చుకోవాలని.. ఇది అసోంకు ఎంతమాత్రం మంచిది కాదని.. రూట్ మార్చుకోవడం ద్వారా ఉద్రిక్తతలను నిలువరించాలని రాహుల్‌ని కోరారు. మరోవైపు అసోంలో.. ఆదివారం రాహుల్ గాంధీ జోడో యాత్ర బీజేపీ శ్రేణులు జరిపిన దాడి ఉద్దేశపూర్వకమైందని ఆరోపిస్తూ ఇవాళ సాయంత్రం దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు ఇచ్చింది. -
ఆలయంలో ప్రముఖ నటుడి కూతురి పెళ్లి..
-
అయోధ్య: ఆ రెండు విగ్రహాలను ఏం చేయనున్నారు?
అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో రామ్‌లల్లా నేడు(బుధవారం) ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించనున్నారు. ముందుగా రామ్‌లల్లా విగ్రహాన్ని రామజన్మభూమి కాంప్లెక్స్‌కు తీసుకువెళతారు. అనంతరం గర్భగుడిని శుద్ధి చేసి, గురువారం శ్రీరాముని విగ్రహాన్ని గర్భగుడిలోనికి తీసుకువస్తారు. రామాలయంలో ప్రతిష్ఠించేందుకు తొలుత మూడు బాలరాముని విగ్రహాలను రూపొందించగా, అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠాపనకు ఎంపిక చేశారు. దీంతో మిగిలిన రెండు విగ్రహాలను ఏమిచేయనున్నారనే ప్రశ్న అందరి మదిలో మెదలాడింది. దీనికి సమాధానాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మీడియాకు వెల్లడించారు. అయోధ్య ఆలయంలో ప్రతిష్ఠించేందుకు మూడు విగ్రహాలు తయారు చేయించామని, దానిలో ఒక విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించేందుకు ఎంపిక చేశామని, మిగిలిన రెండు విగ్రహాలను ఆలయంలోని మొదటి, రెండో అంతస్తుల్లో ఏర్పాటు చేస్తామని చంపత్ రాయ్ తెలిపారు. రామ మందిరం మొదటి అంతస్తు సిద్ధమైన వెంటనే రెండు రామ్‌లల్లా విగ్రహాలలో ఒకదానిని వైదిక ఆచారాలతో అక్కడ ప్రతిష్ఠించనున్నట్లు ఆయన తెలిపారు. డిసెంబర్ 2025 నాటికి ఆలయ నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత, మిగిలిన రెండవ విగ్రహాన్ని రెండవ లేదా చివరి అంతస్తులో ప్రతిష్ఠించనున్నామన్నారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి రామాలయం గర్భగుడిలో ఏర్పాటు చేసేందుకు కర్ణాటక శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన నల్లరాతి విగ్రహాన్ని ఆలయ ట్రస్ట్ ఎంపిక చేసింది. మిగిలిన రెండు విగ్రహాలలో ఒకటి కర్నాటకకు చెందిన గణేష్ భట్ నల్లరాతితో తీర్చిదిద్దారు. ఇంకొక విగ్రహాన్ని రాజస్థాన్‌కు చెందిన సత్య నారాయణ పాండే తెల్లని మక్రానా పాలరాతితో రూపొందించారు. ఈ మూడు విగ్రహాలూ 51 అంగుళాల ఎత్తులో ఉన్నాయి. ఇది కూడా చదవండి: 2,100 కిలోల గంట.. 108 అడుగుల అగరుబత్తి -
అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట: ఆలయాలు శుభ్రం చేస్తున్న ప్రముఖులు (ఫొటోలు)
-
తిరుమలేశునికి భారీ ‘వెండి’ అందజేత (ఫొటోలు)
-
ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏమిటి? ఎందుకంత విశిష్టత?
సనాతన ధర్మాన్ని విశ్వసించే హిందువులకు ఈ జనవరి చాలా ప్రత్యేకమైనది. ఈ నెల చారిత్రాత్మకం కానుంది. ఈ నెలలో అయోధ్యలోని నూతన రామాలయంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. హిందూధర్మంలోని ఆచారాల ప్రకారం ఏదైనా దేవాలయంలో దేవుని విగ్రహ ప్రతిష్ఠకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్టించకుంటే దేవుని ఆరాధన అసంపూర్ణమవుతుందని అంటారు. అయోధ్యలోని నూతన రామాలయంలో జనవరి 22న రామ్‌లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. అందుకే ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏమిటి? ఇందులోని విశిష్టత ఏమిటనేది ఇప్పుడు తెలుసుకుందాం. సనాతన ధర్మంలో ప్రాణ ప్రతిష్టకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. విగ్రహ ప్రతిష్ఠాపన సమయంలో ప్రాణ ప్రతిష్ఠ తప్పనిసరిగా జరుగుతుంది. ఏదైనా విగ్రహ ప్రతిష్ఠాపన సమయంలో ఆ విగ్రహానికి జీవం పోసే విధానాన్నే ప్రాణ ప్రతిష్ఠ అంటారు. ‘ప్రాణ్’ అనే పదానికి ప్రాణశక్తి అని, ‘ప్రతిష్ఠ’ అంటే స్థాపన అని అర్థం. మొత్తంగా చూసుకుంటే ప్రాణ ప్రతిష్ఠ అంటే విగ్రహంలో ప్రాణశక్తిని స్థాపించడం లేదా దేవతను విగ్రహంలోకి ఆహ్వానించడం అని అర్థం. ప్రాణ ప్రతిష్టకు ముందు ఏ విగ్రహం కూడా పూజకు అర్హమైనదిగా పరిగణించరు. ప్రాణప్రతిష్ఠ ద్వారా విగ్రహంలోనికి ప్రాణశక్తిని ప్రవేశపెట్టి, దానిని ఆరాధనీయ దేవతా స్వరూపంగా మారుస్తారు. అప్పుడే ఆ విగ్రహం పూజకు అర్హమైనదవుతుంది. ప్రాణ ప్రతిష్ఠ అనంతరం విగ్రహ రూపంలో ఉన్న దేవతామూర్తులను ఆచార వ్యవహారాలతో మంత్రాలు జపిస్తూ పూజలు చేస్తారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ప్రతిష్ఠాపన తర్వాత భగవంతుడే ఆ విగ్రహంలో కొలువయ్యాడని చెబుతారు. అయితే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి శుభ సమయం అనేది నిర్ణయిస్తారు. శుభ ముహూర్తాలు లేకుండా మొక్కుబడిగా ప్రాణ ప్రతిష్ఠ చేయడం తగదని పండితులు చెబుతుంటారు. ప్రాణప్రతిష్ఠ చేయడానికి ముందు ఆ విగ్రహానికి గంగాజలం లేదా వివిధ పవిత్ర నదుల నీటితో స్నానం చేయిస్తారు. ఆ తర్వాత విగ్రహాన్ని శుభ్రమైన వస్త్రంతో తుడిచి, నూతన వస్త్రాలు ధరింపజేస్తారు. అనంతరం ఆ విగ్రహాన్ని స్వచ్ఛమైన, శుభ్రమైన ప్రదేశంలో ఉంచి గంధంపూస్తారు. తరువాత బీజాక్షర మంత్రాలు పఠిస్తూ ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠగావిస్తారు. ఈ సమయంలో పంచోపచారాలు నిర్వహిస్తూ, పూజలు చేస్తారు. చివరిగా ఆ దేవతా స్వరూపానికి హారతి ఇస్తారు. ఇదే సమయంలో భగవంతునికి నైవేద్యం సమర్పిస్తారు. ఈ కార్యక్రమం పూర్తయ్యాక భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తారు. ఇది కూడా చదవండి: రామాలయం.. 1528 నుంచి నేటి వరకూ.. -
రామాలయం.. 1528 నుంచి నేటి వరకూ..
అయోధ్యలోని శ్రీరాముని జన్మస్థలంలో నూతన రామమందిరాన్ని నిర్మించారు. శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం 2024, జనవరి 22న జరగనుంది. అత్యంత వైభవంగా జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రపంచం మొత్తం వీక్షించనుంది. శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రత్యేక అతిథులు అయోధ్యకు తరలిరానున్నారు. ఈ కార్యక్రమం పూర్తయిన తరువాత సామాన్య భక్తులు కూడా చారిత్రాత్మక రామాలయాన్ని సందర్శించుకోగలుగుతారు. అయితే అయోధ్య రామాలయం నిర్మాణం వెనుకున్న పలు సంఘటనలు ఒకసారి గుర్తు చేసుకుందాం. అది.. 1528వ సంవత్సరం బాబ్రీ మసీదును మొఘల్ చక్రవర్తి కమాండర్ మీర్ బాకీ నిర్మించారు. మీర్ బాకీ ఈ మసీదుకు బాబ్రీ అని పేరు పెట్టారు. 1885 అయోధ్య రామజన్మభూమి వ్యవహారం తొలిసారిగా కోర్టుకు చేరింది. బాబ్రీ మసీదు పక్కనే రామ మందిరాన్ని నిర్మించేందుకు అనుమతి ఇవ్వాలని మహంత్ రఘువర్‌దాస్ ఫైజాబాద్ కోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. 1949 వివాదాస్పద నిర్మాణంలోని మధ్య గోపురం కింద రామ్ లల్లా విగ్రహం కనిపించింది. ఆ తర్వాత స్థానికులు ఆ ప్రదేశంలో పూజలు చేయడం ప్రారంభించారు. 1950 గోపాల్ సింగ్ విశారద్ అనే పండితుడు ఇక్కడ పూజలు చేసే హక్కును డిమాండ్ చేస్తూ ఫైజాబాద్ కోర్టులో కేసు వేశారు. ఈ కేసు నేపధ్యంలో హిందువులు ఆలయంలో పూజించే హక్కును పొందారు. 1950 పరమహంస రామచంద్ర దాస్ ఆ ప్రాంతంలో విగ్రహాలను ఉంచి, పూజించేందుకు అనుమతించాంటూ ఫైజాబాద్ కోర్టులో కేసు వేశారు. ఇదే రామ మందిర ఉద్యమానికి నాంది పలికింది. 1959 వివాదాస్పద స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు నిర్మోహి అఖారా కోర్టు మెట్లు ఎక్కింది. 1981 యూపీ సున్నీ వక్ఫ్ బోర్డు ఆ ప్రాంతం స్వాధీనంపై కేసు వేసింది. 1986 ఫిబ్రవరి ఒకటిన హిందువులు పూజించేందుకు ఈ స్థలాన్ని తెరవాలని స్థానిక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 1989 హైకోర్టు నుంచి కూడా హిందువులకు ఉపశమనం లభించింది. ఆగస్టు 14న ఈ కేసులో యథాతథ స్థితిని కొనసాగించాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. 1992 డిసెంబర్ 6న ఈ వివాదాస్పద కట్టడం కూల్చివేతకు గురయ్యింది. దీంతో రామమందిరం కోసం ఉద్యమం మరింత ఊపందుకుంది. 2002 ఈ వ్యవహారం అలహాబాద్ హైకోర్టుకు చేరింది. వివాదాస్పద స్థలం యాజమాన్య హక్కులపై అలహాబాద్ హైకోర్టు విచారణ ప్రారంభించింది. 2010 అలహాబాద్ హైకోర్టు సెప్టెంబరు 30న తీర్పు వెలువరించింది. వివాదాస్పద స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖారా, రామ్ లల్లాకు మూడు సమాన భాగాలుగా విభజించాలని హైకోర్టు తీర్పు చెప్పింది. 2011 మే 9న అలహాబాద్ హైకోర్టు ఈ ప్రాంతాన్ని మూడు సమాన భాగాలుగా విభజించాలన్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు నిలిపివేసింది. 2018 ఫిబ్రవరి 8న సివిల్ అప్పీళ్లపై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది. 2019 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటయ్యింది. 2019 ఆగస్టు 6న అయోధ్య కేసుపై సుప్రీంకోర్టులో రోజువారీ విచారణ ప్రారంభమైంది. 2019, ఆగస్టు 16న విచారణ పూర్తయిన తర్వాత ధర్మాసనం నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టుకు చెందిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం శ్రీరామ జన్మభూమికి అనుకూలంగా తీర్పునిచ్చింది. హిందూ పక్షం 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని దక్కించుకుంది. మసీదు కోసం ప్రత్యేకంగా ఐదు ఎకరాల స్థలాన్ని ముస్లిం వర్గానికి అందించాలని నాడు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ తీర్పు తదనంతరం అయోధ్య రామాలయ నిర్మాణం ప్రారంభమయ్యింది. -
సెంటిమెంట్ దేవత.. పర్వతాపూర్ మైసమ్మ
నవాబుపేట: మండలంలోని కాకర్లపహాడ్ గ్రామపంచాయతీ పరిధిలోని పర్వతాపూర్ మైసమ్మ ఆలయం ఇటు జిల్లాకేంద్రానికి, అటు మండల కేంద్రానికి మధ్యలో 9 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఉంటుంది. కొత్త వాహనాలకు పూజలు చేయించడం ఆనవాయితీగా వస్తోంది. ఎన్నికల సమయంలోనూ వివిధ పార్టీల అభ్యర్థులు ఇక్కడి నుంచే ప్రచారం ప్రారంభిస్తారు. ఈ ఆలయం కూడా కొత్త సంవత్సరం వేళ రద్దీగా ఉంటుంది. కృష్ణాతీరంలో.. కొల్లాపూర్:జనవరి ఒకటో తేదీన నియోజకవర్గంలోని కృష్ణా తీర ప్రాంతాలు, నదీతీర ఆలయాలను దర్శించుకునేందుకు ప్రజలు అధికసంఖ్యలో తరలివస్తుంటారు. సోమశిల సమీపంలోని కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటారు. అనంతరం ఏపీ సరిహద్దు ప్రాంతంలోని సంగమేశ్వర ఆలయానికి వెళ్తుంటారు. సోమశిలలోని ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయం కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ఆయా ఆలయాల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. సింగోటం లక్ష్మీనర్సింహ్మస్వామి, మంచాలకట్ట రామలింగేశ్వరస్వామి, కొల్లాపూర్ రామ మందిరం, శివాలయం, వరిదెల హనుమాన్, మాధవస్వామి ఆలయాలకు కూడా భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. సోమశిల, అమరగిరి సమీపంలోని కృష్ణానదిలో విహరించేందుకు బోట్లు అందుబాటులో ఉంటాయి. జటప్రోల్ సమీ పంలోని కత్వ వాటర్ ఫాల్స్‌ను తిలకించేందుకు పర్యాటకులు ఆసక్తి కనబరుస్తారు. -
మైసూర్లో శ్రీహరి సన్నిధి ప్రతిష్టించిన దత్త పీఠాధిపతి
మైసూర్లో ప్రపంచంలోని అరుదైన రెండు వేల సాలగ్రామాలతో శ్రీహరి సన్నిధి ప్రతిష్టా కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. అవధూత దత్త పీఠాధిపతి పరమ పూజ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ, ఉత్తరాధిపతి శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామిజీ ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది. సాధారణంగా 100 సాలిగ్రామాలు ఉంటే ఆలయం నిర్మించాలని శాస్త్ర వచనం చెబుతుంది. తాజాగా రెండు వేల సాలిగ్రామాలతో శ్రీహరి సన్నిధి ఆలయం అత్యంత శోభాయ మానంగా భక్తులను అనుగ్రహిస్తుంది. ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి స్వర్ణ యంత్ర ప్రతిష్ట చేసి, శిఖరానికి కుంభాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులు అమ్మవారిని,శ్రీహరి సన్నిధిని దర్శించుకొని మొక్కుల చెల్లించుకున్నారు. -
కెనడాలో హిందూ వ్యాపారవేత్త ఇంటిపై కాల్పులు
ఒట్టావా: కెనడాలో హిందూ లక్షిత దాడులు మరోసారి జరిగాయి. సర్రేలో హిందూ వ్యాపారవేత్త ఇంటిపై దుండగులు కాల్పులు జరిపారు. తుపాకులతో ఇంటిపై 11 బుల్లెట్లు పేల్చినట్లు పోలీసులు గుర్తించారు. డిసెంబర్ 27 ఉదయం 14900 బ్లాక్ 80 అవెన్యూలో కాల్పుల ఘటన జరిగింది. కాల్పులు జరిపిన నివాసం సర్రేలోని లక్ష్మీ నారాయణ మందిర్ అధ్యక్షుడు సతీష్ కుమార్ పెద్ద కుమారుడికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. కెనడాలో కొద్ది రోజులుగా హిందూ లక్షిత దాడులు జరుగుతున్నాయి. దేవాలయాలే లక్ష్యంగా దుండగులు దాడులు చేస్తున్నారు. ఇటీవల సర్రేలోని లక్ష్మీ నారాయణ్ ఆలయంపై ఇటీవల దాడులు జరిగాయి. సర్రేలో ఖలిస్థానీల మద్దతుతో ర్యాలీలు కూడా వెలుగు చూశాయి. నిజ్జర్ హత్య కేసు తర్వాత ఈ దాడులు ఎక్కువయ్యాయి. ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్‌ను సర్రేలోనే దుండగులు హత్య చేసిన విషయం తెలిసిందే. గురుద్వాలో ఉన్న నిజ్జర్‌పై జులై 18న కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ హత్యలో భారత దౌత్యవేత్తల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. ఇది కాస్త కెనడా- భారత్ మధ్య వివాదంగా మారింది. ఇదీ చదవండి: ఖతార్‌లో 8 మంది భారతీయులకు మరణ శిక్ష రద్దు -
Karnataka Temple: ఆలయంలో విషాహారం
బెంగళూరు: బెంగళూరు శివారులోని హోస్కోటే ప్రాంతంలో ఒక ఆలయంలో ప్రసాదం తిని ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. 70 మంది ఆస్పత్రి పాలయ్యారు. ఆలయంలో విషాహారం ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం వెంటనే దర్యాప్తునకు ఆదేశించింది. ఆదివారం ఒక ఆలయంలో అక్కడి భక్తులు ప్రసాదం తిన్నాక వాంతులు, విరేచనాలతో ఇబ్బందులు పడుతూ వేర్వేరు ఆస్పత్రుల్లో చేరారు. ఆరోగ్యం పూర్తిగా విషమించి ఒక మహిళ సోమవారం ఆస్పత్రిలో కన్నుమూసింది. ఫుడ్ పాయిజన్‌కు కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఒక ఆస్పత్రిలో ఒక ఫ్లోర్ మొత్తం ఐసీయూ పేషెంట్ల కోసం కేటాయించి చికిత్స చేస్తోంది. ప్రసాదం తినడం వల్లే తమ ఆరోగ్యం చెడిపోయిందని కొందరు చెప్పగా, ప్రసాదం తినకపోయినా ఆరోగ్య సమస్యలు తలెత్తాయని ఇంకొందరు చెప్పారు! దీనిపై నుంచి నివేదిక రావాల్సి ఉందని పోలీసులన్నారు. -
America: గుడి గోడలపై ఖలిస్తానీ నినాదాలు
కాలిఫోర్నియా : అమెరికాలోని స్వామినారాయణ్ గుడి గోడలపై విద్వేష రాతలు వెలిశాయి. ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ మద్దతు నినాదాలతో గుడి గోడలను నింపేశారు. కాలిఫోర్నియాలోని నెవార్క్ పట్టణంలో ఉన్న ఈ స్వామినారాయణ్ మందిర్ గోడలపై ఖలిస్తానీ అనుకూల నినాదాలతో పాటు ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా గ్రాఫిటీ చేసినట్లు హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేసింది. ‘గుడి గోడలపై ఖలిస్తానీ ఉగ్రవాది జర్నెయిల్ సింగ్ బింద్రాన్‌వాలే పేరు రాశారు. ఇది గుడికి వచ్చే వారిని భయాందోళనలకు గురి చేయడమే. ఇది హేట్ క్రైమ్ కిందకే వస్తుంది. ఈ రాతలపై పోలీసులు దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం’అని హిందూ అమెరికన్ ఫౌండేషన్ ట్వీట్లో కోరింది. హిందై అమెరికన్ ఫౌండేషన్ విజ్ఞప్తిపై నెవార్క్ పోలీసులు సానుకూలంగా స్పందించారు. గుడి గోడలపై విద్వేష పూరిత రాతలు రాసిన ఘటనపై విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. అమెరికా, కెనడాలో ఇలాంటి విద్వేష నేరాలు తరచూ రికార్డవుతున్నాయి. జీ 20 సదస్సు సమయంలో ఢిల్లీలోని మెట్రో స్టేషన్లపైనా ఖలిస్తానీ అనుకూల రాతలు వెలిశాయి. #Breaking: Swaminarayan Mandir Vasana Sanstha in Newark, California was defaced with pro-#Khalistan slogans.@NewarkCA_Police and @CivilRights have been informed and full investigation will follow. We are insisting that this should be investigated as a hate crime. pic.twitter.com/QHeEVWrkDj — Hindu American Foundation (@HinduAmerican) December 22, 2023 ఇదీచదవండి..హిట్లర్‌పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు -
దేశంలోనే తొలి '3డీ ప్రింటెడ్ ఆలయం'.. ఎక్కడో తెలుసా!
సాక్షి, సిద్దిపేట: ఏదైనా నిర్మాణం చేపట్టాలంటే ఎంతో వ్యయ ప్రయాసాలు తప్పవు.. సామగ్రి, కూలీలు అన్నీ ఇన్నీ కావు.. ఒకవేళ అందుబాటులో ఉన్నా నిర్మాణం పూర్తి కావాలంటే నెలలు గడవాల్సిందే. ఈ కష్టాలన్నింటికీ చెక్ పెడుతూ .. స్వల్ప వ్యవధిలోనే నిర్మాణాలు పూర్తి చేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే మొట్టమొదటి త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ (రోబో)తో ఆధ్యాత్మిక శ్రీపాద కార్యసిద్దేశ్వరస్వామి దేవాలయాన్ని సిద్దిపేటలోని బూరుగుపల్లి సమీపంలో నిర్మించారు. నెలరోజులపాటు 3డీ ప్రిటింగ్తో 30 గంటల్లో దేవాలయ నిర్మాణం పూర్తి చేసి ఔరా అనిపించారు. ఈ త్రీడీ దేవాలయాన్ని 3,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో 30 అడుగుల ఎత్తులో నిర్మించారు. దేశంలోనే తొలి దేవాలయం! త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ(రోబో) మిషన్‌ను ఏబీబీ అనే యూరోపియన్ నుంచి తీసుకొచ్చారు. దీనిలో ఉండే ఇంటర్నల్ సిస్టమ్, దీని కోసం వినియోగించే సాఫ్ట్‌వేర్‌ను భారతదేశంలోనే తయారు చేశారు. ప్రపంచంలోనే తొలిసారిగా 2022లో 3డీ ప్రిటింగ్ విధానంలో కాలిఫోర్నియాలోని టెహమా కౌంటీలో చర్చి నిర్మించారు. సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ ఈ ఏడాది మార్చిలో ఐఐటీ హైదరాబాద్‌తో కలిసి దేశంలోనే తొలి త్రీడీ ప్రింటెడ్ నమూనా వంతెనను నిర్మించింది. దేశంలోనే తొలిసారిగా మిషనరీతో సిద్దిపేటలో దేవాలయం నిర్మించారు. కంప్యూటర్లో రూపొందించి.. కంప్యూటర్లో ముందుగా దేవాలయం డిజైన్ పొందుపర్చి కాంక్రీట్ త్రీడీ మిషన్ ద్వారా నిర్మించారు. అప్సూజ కంపెనీ నిర్మాణ బాధ్యతలను తీసుకొని సింప్లీ పోర్జ్ అనే త్రీడీ టెక్నాలజీ కంపెనీకి అప్పగించింది. మోదక్, దీర్ఘచతురస్రాకారం, కమలం మొగ్గ ఆకారాల్లోని గర్భ గుడీలతోపాటు ఆలయ గోపురాలను కంప్యూటర్లో తొలుత 3డీలో డిజైన్ చేసి ఆపై యంత్రాల ద్వారా నిర్మించారు. దీంతో ఆలయం భక్తులకు కనువిందు చేస్తోంది. ఇటీవల ప్రారంభం.. సిద్దిపేటలో త్రీడీ టెక్నాలజీతో నిర్మించిన శ్రీపాద కార్యసిద్దేశ్వరస్వామి దేవాలయం ఇటీవల ప్రారంభించారు. వారం రోజులపాటు విగ్రహప్రతిష్ట మహోత్సవాలను నిర్వహించారు. నిత్యం విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు దేవాలయం నిర్మించిన తీరును అడిగి తెలు సుకుంటున్నారు. త్వరగా నిర్మాణం పూర్తికావడంతో ఇతర ప్రాంతాల నుంచి సైతం ఇంజినీర్లు, పలు నిర్మాణ సంస్థలు వచ్చి నిర్మాణంను పరిశీలిస్తున్నారు. ఒక్కో గర్భగుడికి ఒక్కో ప్రత్యేకత! దేవాయలంలో గర్భగుడీలు ఒక్కొక్కటి ఒక్కో ఆకారంలో నిర్మించారు. హేరంబ గణపతి కోసం మోదకం ఆకారంలో గర్భగుడిని నిర్మించారు. ఇది 11 ఫీట్ల ఎత్తు, 8 ఫీట్ల వెడల్పు ఉంది. వీటి నిర్మాణం వారం రోజులపాటు 7 గంటలు ప్రింటింగ్‌తో నిర్మాణం పూర్తి చేశారు. అలాగే భువనేశ్వరి అమ్మవారి కోసం కమలం మొగ్గ ఆకారంలో గర్భగుడిని నిర్మించారు. ఎత్తు 11 ఫీట్లు , వెడల్పు 8.5 ఫీట్లు ఉంది. ఈ ఆకారం నిర్మాణం కోసం వారం రోజులపాటు ప్రింటింగ్ 8 గంటలు పట్టింది. దత్తాత్రేయ స్వామితోపాటు స్పటికలింగానికి గర్భగుడి దీర్ఘచతురస్రాకారంలో నిర్మించారు. 10 రోజులపాటు 15 నుంచి 16 గంటల సమయం పట్టింది. కూలీల పని తప్పింది 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ(రోబో) మిషన్‌ను ఏబీబీ అనే యూరోపియన్ నుంచి తీసుకొచ్చాం. దీనికి సంబంధించి మొత్తం సాఫ్ట్‌వేర్‌ను మన దేశంలోనే తయారు చేసి నిర్మాణం చేపట్టాం. కూలీల వ్యయప్రయాసలు తప్పాయి. – హరికృష్ణ, సీఈఓ ఇవి చదవండి: కోవిడ్.. అలర్ట్! 'జేఎన్–1 వేరియంట్' రూపంలో ముప్పు! -
350 ఏళ్లుగా ఈ ఆలయంలో ప్రసాదం దోపిడీ.. కారణమిదే!
భారతదేశంలో ఎన్నో ప్రసిద్ధిచెందిన దేవాలయాలు ఉన్నాయి. కొన్ని ఆలయాల్లో ఆచారాలు వింతగా ఉంటాయి. సాధారణంగా పుణ్యక్షేత్రాలు, ఆలయాలు సందర్శించినప్పుడు అక్కడ భక్తులకు తీర్థ, ప్రసాదాలు అందిస్తుంటారు. కానీ ఈ ఆలయంలో మాత్రం దేవుడి ప్రసాదాన్ని అక్కడి భక్తులు దొంగతనం చేయడం ఆనవాయితీగా వస్తుందట. ఆలయల్లో ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు,పూజలు అయ్యాక దేవుడికి నైవేద్యంగా సమర్పించిన అనంతరం భక్తులకు ప్రసాదాలు పంచుతారు. కానీ రాజస్థాన్‌లోని రాజసమంద్ని శ్రీనాథ్జీ ఆలయంలో మాత్రం దేవుడికి సమర్పించే ప్రసాదాన్ని గిరిజనులు లూటీ చేయడం ఆచారంగా వస్తోంది. దాదాపు 350 ఏళ్లుగా ఈ తంతు కొనసాగుతుంది. ప్రసాదాన్ని దొంగిలించడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు ఈ ఆలయానికి చేరుకుంటారు. ఈ నైవేద్యాలను లూటీ చేసి తింటే సమస్త రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. స్వామివారి వద్ద నుంచి దొంగిలించే బియ్యాన్ని భక్తులు తమతమ ఇళ్లలో భద్రంగా దాచుకుంటారు. దీనివల్ల తమ కష్టాలు, దోషాలు తగ్గుతాయని విశ్వసిస్తారు. అందుకే ఇక్కడికి తండోపతండాలుగా భక్తులు వచ్చి పోతుంటారు. ఈ లూటీని ఎవరూ అడ్డుకోరు. ఆదివాసీ భక్తులు ఇలా ప్రసాదాన్ని లూటీ చేయటమే శ్రీనాథ్జీ స్వామివారికి ఇష్టమట. ఇలా చేయకపోతే అన్నకూట్ మహోత్సవం పూర్తికాదని అంటారు. చాలా ఏళ్లుగా గిరిజనులు ఆలయం నుంచి ప్రసాదం లూటీ చేసి ఎత్తుకెళ్లడం ఆచారంగా వస్తోంది. ఈ ఏడాది కూడా ఇటీవలె మమోత్సవం జరగగ్గా అన్నకూటాన్ని కొల్లగొట్టే సంప్రదాయాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి చేరుకున్నారు. -
పాపం పోయినట్లు సర్టిఫికేట్ ఇచ్చే ఆలయం! ఎక్కడుందంటే..?
ఎన్నో రకాల ఆలయాలు వాటి విశేషాల గురించి విని ఉన్నాం. కానీ ఇలాంటి ఆలయం గురించి వినే ఉండే అవకాశమే లేదు. ఇలాంటివి కూడా ఉన్నాయా?.. అని షాకింగ్ అనిపిస్తుంటుంది కూడా. పాపం పోగొట్టుకోవాలని దేవాలయాలకు వెళ్తాం. అలాగే సిద్ధాంతులు చెప్పే పరిహారాలను కోసం తెగ డబ్బు వెచ్చిస్తాం కూడా. కొన్ని రకాల దానాలతో కూడా పాపాలు పోగొట్టుకునే యత్నం కూడా చేస్తాం. కానీ అవేమీ అక్కర్లేకుండా నేరుగా ఈ ఆలయానికి వెళ్లి పాపం పోగొట్టుకోవడమే కాకుండా పోయినట్లు ఓ ధ్రువీకరణ పత్రం కూడా తెచ్చేసుకోవచ్చు. అది కూడా చాలా తక్కువ ఖర్చుతోనే. ఆ ఆలయం ఎక్కడుందంటే.. అలాంటి ఆలయం రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌లో ఉంది. శతాబ్దాలుగా తీర్థయాత్రలకు ప్రసిద్ధిగాంచిన ఆలయం. దీనిని గిరిజనుల హరిద్వార్ అని కూడా పిలుస్తారు. ఆ ఆలయంలో ఎన్నో ఏళ్లుగా పాపం పోయినట్లు ధ్రువీకరణ పత్రాలను ఇచ్చే ఆచారం ఉంది. దీన్ని గౌతమేశ్వర్ మహాదేవ్ పాపమోచన తీర్థంగా పిలుస్తారు. ఇక్కడ మందాకిని పాప మోచిని గంగా కుండ్ అనే రిజర్వాయర్ ఉంది. దీనిలో స్నానం చేస్తే సర్వపాపాలు పోతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ గుడిలో కేవలం రూ. 12/-లు చెల్లించి వాటర్ ట్యాంక్‌లో స్నానం చేస్తే పాపవిమోచన పత్రం ఇస్తారు. ఈ మేరకు ఆలయ పూజారి మాట్లాడుతూ..చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి గ్రామస్తులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వస్తుంటారు. వారందరికీ పాప విమోచర ధృవీకరణ పత్రం కూడా ఇస్తామని తెలిపారు. హృదయంలో పాపం చేశామన్నా భావమే ఆయా భక్తులను ఇక్కడకు రప్పిస్తుంటుందని అక్కడి గ్రామస్తులు చెబుతున్నారు. వ్యవసాయం చేస్తున్నప్పుడూ తెలిసో తెలియక మనవల్ల కొన్ని రకాల సరీసృపాలు, కీటకాలు చనిపోతాయి. దీని వల్ల కూడా ఒక జీవిని బాధించిన పాపం మనలని వెంటాడుతుంది. అందుకే చాలామంది రైతులు ఇక్కడకు వచ్చి స్వామిని దర్శించుకుని ఈ గంగా కుండ్‌లో స్నానాలు ఆచరించి సర్టిఫికేట్‌ని తీసుకుంటారని చెబుతున్నారు ప్రజలు. ప్రతి ఏడాది ఈ గౌతమేశ్వరాలయంలో దాదాపు 250 నుంచి 300 దాక పాప విమోచన ధృవీకరణ పత్రాలు ఇవ్వడం జరగుతుందని ఆలయ పూజారి తెలిపారు. ఈ ఆచారం దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కొనసాగుతున్నట్లు అక్కడి దేవాలయ అధికారులు చెబుతున్నారు. ప్రతి ఏడాది వేలాదిగా భక్తులు తరలి వస్తుంటారని, కేవలం పాపం పోగొట్టుకోవడం కోసమే గాక పూజలు కూడా నిర్వహిస్తుంటారని అన్నారు. (చదవండి: ఆరేళ్లక్రితం తప్పిపోయిన బాలుడిని 'ఆ ఫేస్బుక్ సందేశం'.. కుటుంబం చెంతకు చేర్చింది!) -
చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న రామ్ చరణ్, రాహుల్ ద్రావిడ్ (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ
-
శంకర నేత్రాలయ వ్యవస్థాపకుడు బద్రీనాథ్ కన్నుమూత
సాక్షి, చెన్నై: కంటి చికిత్స లతో ఎందరో పేదల జీవితాల్లో వెలుగులు నింపిన శంకర నేత్రాలయ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎస్.ఎస్.బద్రీనాథ్(83) వయోభారంతో చెన్నైలో మంగళవారం కన్ను మూశారు. 1978లో శంకర నేత్రాలయ పేరిట స్వచ్ఛంద సంస్థను ఆయన ఏర్పాటు చేశారు. చెన్నై నుంగంబాక్కం కేంద్రంగా శంకర నేత్రాలయ ద్వారా అనేక బ్రాంచీలతో ఉచితంగా పేదలకు సేవలు అందించారు. రోజుకు కనీసం తన బృందం ద్వారా 1,200 మందికి చికిత్సలు, వంద మందికి ఆపరేషన్లు చేసే వారు. ఆయన సేవలకు గుర్తింపుగా 1996లో పద్మభూషణ్‌తో కేంద్రం సత్క రించింది. అలాగే బీసీ రాయ్ అవార్డుతో పాటు అనేక పురస్కారాలు ఆయనను వరించాయి. చెన్నై ట్రిప్లికేన్‌లో 1940 ఫిబ్రవరి 24న బద్రీనాథ్ జన్మించారు. 1962లో మద్రాస్ వైద్యకళాశా లలో వైద్య కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఆమెరి కాలో ఉన్నత విద్య ను అభ్యసించారు. 1970లో చెన్నై అడయార్‌లో వాలంటరీ హెల్త్ సర్వీస్ పేరిట సేవా కార్య క్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆయన మృతి నేత్ర వైద్య వర్గాల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. తమిళనాడు సీఎం స్టాలిన్‌తో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. -
అద్భుతం.. 3డీ ప్రింటెడ్ ఆలయం
సిద్దిపేట అర్బన్: వాస్తుశిల్ప సౌందర్యం, సాంకేతిక పరి/జ్ఞనం మేళవింపుతో అసాధారణమైన రీతిలో నిర్మించిన ఆధ్యాత్మిక అద్భుతం.. ప్రపంచంలోనే మొట్టమొదటి 3డీ ప్రింటెడ్ హిందూ దేవాలయం సిద్ధపేటలో ఆవిష్కృతమైంది. సింప్లిఫోర్జ్ క్రియేషన్‌తో కలిసి అప్సుజా ఇన్ఫ్రాటెక్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం బూరుగుపల్లి శివారులోని చర్విత మెడోస్‌లో నిర్మించిన 3డీ ప్రింటెడ్ దేవాలయానికి శ్రీపాద కార్య సిద్ధేశ్వర స్వామి దేవస్థానంగా నామకరణం చేశారు. వేద పండితుల ఆధ్వర్యంలో మంగళవారం మొదలైన ప్రతిష్టాపన మహోత్సవ పూజలు మరో రెండు రోజులు జరగనుండగా.. 24 నుంచి ఆలయాన్ని భక్తులు దర్శించుకునేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఐకానిక్ టెంపుల్ సాంస్కృతిక వారసత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని అప్సుజా ఇన్ఫ్రాటెక్ మేనేజింగ్ డైరెక్టర్ హరికృష్ణ జీడిపల్లి వ్యాఖ్యానించారు. 4వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 35.5 అడుగుల పొడవు, 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయ నిర్మాణం అద్భుతంగా ఉందని హరికృష్ణ తెలిపారు. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అమిత్ ఘూలే మాట్లాడుతూ.. ఆలయం భూకంపాలకు దెబ్బతినకుండా నిర్మించినట్టు తెలిపారు. చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ వసీం చౌదరి మాట్లాడుతూ గర్భగుడిలో వేదమంత్రాల ప్రతిధ్వనులతో భక్తులను మంత్రముగ్ధులను చేసేలా నిర్మాణం జరిగిందన్నారు. పూరీ జగన్నాథ ఆలయం శైలిలో గోపురం డిజైన్ చేసినట్లు వెల్లడించారు. ఆలయ నిర్మాణ పనులు 70 రోజుల్లో పూర్తయ్యాయి. -
దెయ్యాలు కట్టిన గుడి!..అక్కడ ప్రతి అంగుళం ఓ మిస్టరీ..!
మనిషిని నడిపించే శక్తికైనా, యుక్తికైనా.. పాజిటివ్, నెగెటివ్ రెండూ ఉంటాయన్నది కాదనలేని నిజం. దేవుడంటే భక్తి, దెయ్యమంటే భయం. పసివయసు నుంచి దేవుడి పటాన్ని చూపించి.. ‘దండం పెట్టుకో..’ అన్నంత సాధారణంగా దెయ్యాన్ని పరిచయం చేయరు ఎవ్వరూ! గొంతు బొంగురుగా చేసి.. ‘హో..’ అనే ఓ విచిత్రమైన శబ్దంతో ‘అదిగో వస్తుంది’ అనే ఓ అబద్ధంతో బెదరగొడతారు. అలాంటి భయం నుంచి అల్లుకునే కథలకు స్పష్టమైన ఆధారాలుండవు.. అంతుచిక్కని ప్రశ్నలు తప్ప. కాకన్మఠ్ టెంపుల్ మిస్టరీ కూడా అలాంటిదే. మధ్యప్రదేశ్, మురైనాలోని శిథిలమైన ఈ శివాలయం ఎన్నో రహస్యాలకు నిలయంగా మారింది. గ్వాలియర్ నుంచి సుమారు 70 కి.మీ దూరంలో ఉన్న ఈ దేవాలయం ఆసక్తికరమైన సందర్శన స్థలంగా నిలిచింది. కేవలం రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చి, నిర్మించిన ఈ కట్టడం.. చూడటానికి ఎంతో కళాత్మకంగా కనిపిస్తుంది. ఏ నిర్మాణమైనా దృఢంగా ఉండాలంటే సిమెంట్ లేదా సున్నం అవసరం. కానీ ఈ గుడి నిర్మాణంలో ఎలాంటి బైడింగ్ మెటీరియల్ (జిగట పదార్థం) వాడకుండా.. పెద్ద రాళ్లు, చిన్న రాళ్లను నిలువుగా పేర్చి గోపురాన్ని మలచడం ఓ అద్భుతమనే చెప్పుకోవాలి. ట్విస్ట్ ఏంటంటే.. రాత్రికి రాత్రే దెయ్యాలు, ప్రేతాత్మలు కలసి ఈ గుడిని నిర్మించాయని చెబుతుంటారు. అందుకే ఇక్కడికి వెళ్లే సందర్శకులంతా.. అదే భయంతో మెసులుకుంటారు. దీన్ని 9వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం మధ్య నిర్మించారనేది పురావస్తు పరిశోధకుల అంచనా. 115 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయం.. నేటికీ చెక్కుచెదరలేదు. అయితే ఈ కట్టడంలో కొంత నిర్మాణం ఆగిపోయినట్లుగా ఒకవైపు కర్రలు కట్టి ఉంటాయి. ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు.. ఆ చుట్టూ ఉండే చాలా పురాతన ఆలయాలను నేలమట్టం చేశాయి. కానీ ఈ టెంపుల్లో ఒక్క రాయిని కూడా కదిలించలేకపోయాయి. ఆలయం మధ్యలో శివలింగం ఉంటుంది. ఈ గుడికి పూజారి లేడు. వాచ్‌మన్ కూడా లేడు. కొందరు హోమ్ గార్డ్స్ మాత్రం.. ఈ గుడికి కాస్త దూరంగా.. రాత్రిపూట ఎవరూ అటువైపు పోకుండా కాపలా కాస్తూంటారు. ఏదో అతీతమైన శక్తి.. ఈ గుడిని కూలిపోకుండా కాపాడుతుందనేది అక్కడివారి నమ్మకం. అయితే ఈ గుడి కట్టడం అసంపూర్ణంగా ఆగిపోవడానికి ఓ కారణం ఉందని చెబుతారు స్థానికులు. ఆ రాత్రి దెయ్యాలు ఆలయాన్ని కడుతుంటే.. ఓ వ్యక్తి ఆ శబ్దాలను విని, అక్కడికి వెళ్లి చూసి.. ప్రేతాత్మలకు భయపడి పెద్దగా అరవడంతో అవి మాయం అయిపోయాయని, దాంతో నిర్మాణం ఆగిపోయిందని చెబుతారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఆర్కియాలిజిస్ట్‌లు ఈ ఆలయంపై స్టడీ చేయడానికి వస్తారు. చుట్టుపక్కల పరిశోధనలు చేస్తారు కానీ, ఈ ఆలయాన్ని మాత్రం టచ్ చేసే సాహసం చేయరు. అయితే నేటికీ ఈ ఆలయం చుట్టూ.. ఈ కట్టడానికి ఉపయోగించిన కొన్ని రాళ్లు చెల్లాచెదురుగా పడి ఉంటాయి. అవన్నీ గుడి నిర్మాణంలో వాడాల్సిన రాళ్లేనని, నిర్మాణం మధ్యలో ప్రేతాత్మలు గుడిని వదిలిపోవడంతో అవి అక్కడపడి ఉన్నాయని కొంతమంది నమ్మకం. కానీ కొందరు దాన్ని కొట్టిపారేస్తారు. అవన్నీ కొన్ని శత్రుమూకలు ఈ ఆలయంపై దాడి చేసి, కూల్చిన రాళ్లేనని వాదిస్తారు. అయితే ఈ రాళ్లను తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే ప్రమాదమని.. కిందున్న ఏ రాయిని కదిలించినా, గుడి మొత్తం కదులుతున్నట్లుగా ఒకరకమైన శబ్దం వస్తుందనే పుకార్లూ విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ చిన్న రాయి కూడా మోయలేనంత బరువుగా ఉంటుందంటూ తమకు తెలిసింది చెప్పి భయాన్ని పుట్టిస్తూంటారు చాలామంది. నిజాన్ని నిరూపించే సాహసమైతే ఎవరూ చేయలేదు. దాంతో ఈ ఆలయనిర్మాణం నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. సంహిత నిమ్మన (చదవండి: వందల సంఖ్యల్లో రాతి బంతులు..అవి ఏంటన్నది నేటికి అంతుచిక్కని మిస్టరీ!) -
‘అమ్మా..గంగమ్మ తల్లీ.. భారత్‌ను గెలిపించమ్మా’
ప్రపంచకప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం(ఈరోజు) భారత్, ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్‌లో జరగనుంది. ఇందుకోసం దేశప్రజలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులంతా భారత్ విజయం కోసం ప్రార్థనలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్‌లో భారత జట్టు అభిమానులు ముక్తేశ్వర్ ధామ్‌లోని గంగా ఘాట్ వద్ద భారీగా పూజలు నిర్వహించి ‘అమ్మా..గంగమ్మ తల్లీ.. భారత్‌ను గెలిపించమ్మా’ అని వేడుకున్నారు. గంగామాత ఆశీర్వాదాలు భారత టీమ్‌కు ఉంటాయని వారు అంటున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక క్రికెట్ అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరూ ఒకే స్వరంతో ‘ఆల్ ది బెస్ట్ ఇండియా’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి సారధ్యం వహించిన జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ సభ్యుడు చందేశ్వర్ ప్రసాద్ సిన్హా అలియాస్ బోడి సిన్హా మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో దేశం విజయం సాధించేందుకు పూజా కార్యక్రమాలు నిర్వహించి, మన టీమ్ విజయం కోసం ప్రార్థనలు చేశామన్నారు. క్రికెట్ అభిమాని రంజిత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ ‘ఈసారి ప్రపంచకప్ క్రికెట్లో భారత జట్టు తప్పకుండా మన జెండాను ఎగురవేస్తుందని’ అన్నారు. ప్రపంచకప్ 2023లో బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ ఇరు జట్లకు ఆదివారం చివరి మ్యాచ్ జరగనుంది. ఇది కూడా చదవండి: మ్యాచ్ అహ్మదాబాద్‌లో.. ‘రెట్టించిన ఉత్సాహం’ ఢిల్లీలో.. -
డోంగర్‌ఘఢ్‌కు ప్రధాని మోదీ.. బమ్లేశ్వరి ఆలయంలో పూజలు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు(ఆదివారం) ఛత్తీస్‌ఘఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా ఆయన ఇప్పటికే డోంగర్‌ఘఢ్ చేరుకున్నారు. కొద్దిసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ చంద్రగిరిలో ఆచార్య విద్యాసాగర్ మహరాజ్‌తో సమావేశమై, పలు అంశాలపై చర్చించనున్నారు. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ముందుగా బమ్లేశ్వరి ఆలయంలో పూజలు చేశారు. ఛత్తీస్‌ఘఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి డోంగర్‌ఘడ్ స్థానం కీలకంగా మారింది. జైన మతానికి చెందిన ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాని మోదీ ఇక్కడ పర్యటన చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో స్థానికంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. ఆచార్య విద్యాసాగర్ మహరాజ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: కుండల తయారీలో కామర్స్ గ్రాడ్యుయేట్.. -
దేశంలోనే అత్యంత పురాతన దేవాలయం!
ఇది మన దేశంలోనే అత్యంత పురాతన దేవాలయం. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ గ్రామంలో సోన్ నదీ తీరానికి చేరువలో పౌంరా పహాడ్ కొండ మీద కొలువై ఉన్న ఈ దేవాలయం క్రీస్తుశకం 108 సంవత్సరం నాటిది. ఇది శాక్తేయ ఆలయం. ఇందులో కొలువై ఉన్న దుర్గాదేవిని ముండేశ్వరీదేవిగా పిలుస్తారు. అందువల్ల ఈ ఆలయం ముండేశ్వరీ ఆలయంగా ప్రసిద్ధి పొందింది. ఇదే ఆలయంలో శివుడు మండలేశ్వరుడిగా కొలువై పూజలందుకుంటున్నాడు. అసలు ఇక్కడి ముండేశ్వరి మొదటి పేరు మండలేశ్వరి అని, ముండుడు అనే రాక్షసుణ్ణి సంహరించడం వల్ల ముండేశ్వరి అనే పేరువచ్చిందని చెబుతారు. ఈ పురాతన ఆలయాన్ని 1915 సంవత్సరం నుంచి భారత పురాతత్త్వ శాఖ పరిరక్షిస్తూ వస్తోంది. ఈ ఆలయంలో ఏటా మహాశివరాత్రి, వసంత నవరాత్రులు, శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతాయి. (చదవండి: ఓ మహిళ 'మానవ పిల్లి'లా..అందుకోసం ఏకంగా శరీరాన్ని 20కి పైగా మార్పులు..) -
KCR: కోనాయిపల్లి వెంకన్న సన్నిధిలో నామినేషన్ పత్రాలపై సంతకాలు
సాక్షి, సిద్ధిపేట: కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సీఎం కేసీఆర్ శనివారం దర్శించుకున్నారు. ఆలయంలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయాన్ని కేసీఆర్ సెంటిమెంట్‌గా భావిస్తారు. ఆయన ఏ పని చేపట్టినా మొదట ఇక్కడి వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి, ఆశీస్సులు తీసుకున్నాకే మొదలుపెడతారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గజ్వేల్, కామారెడ్డిల నుంచి పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్, సిద్దిపేట నుంచి పోటీ చేస్తున్న హరీశ్‌రావు ఇద్దరూ తమ నామినేషన్ పత్రాలతో శనివారం ఈ ఆలయానికి చేరుకుని పూజలు చేశారు. అనంతరం వాటిపై సంతకాలు చేశారు. నవంబర్ 9వ తేదీన రెండుచోట్ల ఆయన నామినేషన్లు వేయనున్నారు. వెంకన్న ఆశీస్సులతోనే ఉద్యమంలోకి.. 2001లో డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కేసీఆర్ టీడీపీతోపాటు అన్ని పదవులకు రాజీనామా చేసి, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోకి దిగారు. ఆ సమయంలోనూ కోనాయిపల్లి ఆలయంలో పూజలు చేశారు. హైదరాబాద్‌లోని జలదృశ్యంలో టీఆర్ఎస్ని స్థాపిస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రం ఏర్పడేదాకా పార్టీ చేపట్టే కార్యక్రమాలను ఇక్కడి నుంచీ ప్రారంభించారు. 1985 నుంచీ సంప్రదాయంగా.. కేసీఆర్ 1985 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే సమయంలో కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశా రు. ఆ ఎన్నికల్లో గెలవడంతో కోనాయిపల్లి ఆల యం ఆయనకు సెంటిమెంట్‌గా మారింది. 1989, 1994, 1999, 2004, 2009, 2014, 2018.. ఇలా ప్రతి ఎన్నికలో ఆయన ఈ ఆలయంలో పూజలు చేశాకే నామినేషన్ వేస్తూ వచ్చారు. మంత్రి టి.హరీశ్‌రావు నామినేషన్‌కు ముందు కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు చేశాకే నామినేషన్ వేస్తున్నారు. చదవండి: ఆసక్తికరంగా ‘అలంపూర్’ రాజకీయం.. బీఫాం ఎవరికో? -
ఇదు శ్రీలంక: బుద్ధుని దంతాలయం!
శ్రీలంక దీవి హిందూ మహా సముద్రంలో చిన్న భూభాగం. ఇందులో సముద్ర మట్టానికి పదహారు వందల అడుగుల ఎత్తులో ఉంది కాండీ నగరం. ఈ నగరంలో ప్రధానంగా చూడాల్సిన ప్రదేశం బుద్ధుడి దంత అవశిష్టంతో నిర్మించిన ఆలయం. ఈ ఆలయాన్ని టూత్ రిలిక్ టెంపుల్ గా వ్యవహారిస్తారు. ఈ ఆలయం కంటే ముందు ఇక్కడ ఉన్న నేషనల్ మ్యూజియాన్ని తప్పక చూడాలి. రిలిక్ టెంపుల్ చుట్టూ ప్రాచీన రాజకుటుంబాల ప్యాలెస్‌లున్నాయి. ఆలయంతోపాటు రాజప్రాసాదాలు కూడా ఏటవాలు పై కప్పుతో మనదేశంలో కేరళలోని నిర్మాణాలను తలపిస్తాయి. శ్రీలంకలో తరచూ వర్షాలు కురుస్తుంటాయి, కాబట్టి నీరు సులువుగా జారిపోవడానికి ఒకప్పుడు ఎర్రటి బంగ్లా పెంకు కప్పే వాళ్లు. ఇప్పుడు ఆకుపచ్చ రంగు రేకులు కప్పుతున్నారు. ఇక ఈ నగరంలో మరో విశిష్ఠత ఏమిటంటే... పోర్చుగీసు, బ్రిటిష్ పరిపాలనలో ఉండడంతో కొన్ని ప్రదేశాలు కలోనియల్ కాలనీలను తలపిస్తున్నాయి. యూరప్ నిర్మాణశైలిలో ఉన్న క్వీన్స్ హోటల్‌ను చూసి తీరాలి. ఇక బ్రిటిష్ వాళ్లు హిల్ స్టేషన్లను ఎంత చక్కగా వేసవి విడుదులుగా మలుచుకున్నారో చెప్పడానికి కాండీ నగరం ఒక నిదర్శనం. నిర్మాణ పరంగా, చారిత్రక ప్రాధాన్యతలెన్ని ఉన్నప్పటికీ ఈ నగరానికి ఇంతటి పర్యాటక ప్రాముఖ్యత ఏర్పడడానికి కారణం బుద్ధుడి అవశిష్టమే. బౌద్ధమే ప్రధానం.. బుద్ధుడి దంతాన్ని ప్రతిష్ఠించి ఆ ఆలయాన్ని నిర్మించారు. ఆ దంత అవశిష్టం మన భారతదేశం నుంచి శ్రీలంక చేరడం కూడా రసవత్తరమైన నాటకీయతను తలపిస్తుంది. బుద్ధుడు మహా పరినిర్వాణం చెందిన తర్వాత ఎముకలు, దంతాలు ఇలా ఒక్కొక్క దేహభాగాలను ఒక్కొక్క ప్రదేశంలో ప్రతిష్ఠించి ఆలయాలను నిర్మించారు. అలా ఈ దంతాన్ని కళింగ రాజులు సొంతం చేసుకున్నారు. ఈ దంతం ఎక్కడ ఉంటే ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందనే విశ్వాసం అప్పట్లో ఉండేది. యువరాణి హేమమాలిని, యువరాజు దంత ఈ దంతాన్ని రహస్యంగా లంకాపట్టణానికి తెచ్చారు. హేమమాలిని తల మీద శిఖలో దాచి తెచ్చిందని చెబుతారు. ఆ దంతాన్ని అనూరాధపురను పాలించిన రాజు సిరిమేఘవన్నకు ఇచ్చింది హేమమాలిని. మొదట ఆ దంతాన్ని మేఘగిరి విహార (ఇసురు మునియ) లో భద్రపరిచారు. క్రమంగా రాజుల్లో ఈ దంతాన్ని కలిగి ఉండడం ఆధిక్యతకు చిహ్నంగా భావించారు. శ్రీలంకలో రాజులు ఆ దంతం తమ రాజ్యంలో ఉండడం తమకు గొప్ప అన్నట్లు భావించేవారు. దాంతో ఎవరికి వారు ఆ దంతం తమ రాజ్యంలోనే ఉండాలని ఒకింత పోటీ పడేవారు కూడా. ఆలయ సౌందర్యం! ఆనాటి రాజులు బౌద్ధ స్థూపాలు, ఆలయాల నిర్మాణానికి తమవంతుగా సమృద్ధిగా నిధులు కేటాయించేవారు. కాండీలోని ఆలయనిర్మాణం అత్యంత సుందరంగా, అంతకు మించిన సంపన్నతతో ఉంది. ఆలయం ఆర్కిటెక్చర్ గొప్పతనానికి చేతులెత్తి మొక్కాల్సిందే. ఈ తలుపులను ఒకరు తెరవడం సాధ్యం కాదు. తిరుమల వేంకటేశ్వర ఆలయం మహాద్వారం తలుపుల్లాగ భారీగా ఉంటాయి. ఉలి నైపుణ్యం గోడలు, స్తంభాల్లోనే కాదు తలుపు గడియల్లో కూడా చూడవచ్చు. నెమలి పింఛం ఆకారంలో ఉన్న గడియ కనీసం రెండు కిలోల బరువుంటుంది. సరదాపడి పైకి తీద్దామన్నా ఒక చేతితో కదిలించలేం. మనకు ఆలయాల్లో ప్రవేశద్వారాలే తెలుసు, కానీ ఇక్కడ ప్రవేశ భవనమే ఉంది. తొలి భవనంలో అడుగు పెట్టగానే గర్భగుడి కోసం చూస్తాం. కానీ అదంతా ప్రవేశ మార్గమే. అసలు ఆలయంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి బుద్ధభగవానుడి దర్శనం చేసుకునే వరకు మనల్ని మనం మరిచిపోతాం. ఇప్పటి వరకు మనం చూడని మరోలోకంలో ఉన్న భావన కలుగుతుంది. ఆలయం పై కప్పు జామెట్రికల్ డిజైన్లు కూడా తేలికరంగులతో కంటికి హాయినిస్తూ నిర్మాణకౌశలానికి అద్దం పడుతుంటాయి. ప్రకృతి మనకు కలువలను ఎన్ని షేడ్లలో ఇస్తోందో ఈ ఆలయంలో చూడాల్సిందే. ఆలయ అలంకరణలో తెల్లని పూలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తారు. బౌద్ధావలంబకులు కూడా (భిక్కులు కాదు) బుద్ధుని దర్శనానికి శ్వేత వస్త్రాలు ధరించి వస్తారు. చంటిబిడ్డలకు కూడా తెల్లని వస్త్రాలే వేస్తారు. వర్షం పడినా చలి ఉండదు! కాండీ నగరం మొత్తం కనిపించే వ్యూ పాయింట్స్ ఉంటాయి. అక్కడ ఆగి నగరసౌందర్యాన్ని వీక్షించవచ్చు. ఇక్కడ ఒక సరస్సును, ఒడ్డున ధవళ బుద్ధుడిని మిస్ కాకూడదు. కాండీ నగరంలోని సరస్సు... మనదేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ముసోరి సరస్సును తలపిస్తుంది. కాండీ రిలిక్ టెంపుల్ నిర్మాణం దక్షిణ భారత ఆలయ నిర్మాణశైలిని తలపిస్తుంది. ఇక్కడ వర్షం సీజన్‌తో పని లేకుండా రోజూ ఏదో ఒక సమయంలో చిరుజల్లయినా పడుతుంది. అందుకే గొడుగు దగ్గర ఉండడం అవసరం. ఇక్కడ మనకు ఒకింత ఆశ్చర్యకలిగించే విషయం ఏమిటంటే వర్షం కురుస్తుంది, కానీ చలి ఉండదు. వర్షం జల్లు ఆగిన వెంటనే ఉక్కపోత కూడా ఉంటుంది. మొత్తానికి శ్రీలంకలో ఉన్నది ఎండాకాలం, వర్షాకాలం రెండు సీజన్లేనని అక్కడికి వెళ్లిన తర్వాత తెలిసింది. – వాకా మంజులారెడ్డి (చదవండి: ఇదు శ్రీలంక: సీతా ఎలియా) -
రేపు కోనాయిపల్లికి సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రేపు సిద్ధిపేటకు వెళ్లనున్నారు. అక్కడి కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఎన్నికల్లో నామినేషన్లు వేసే ముందు ప్రతిసారి కేసీఆర్ ఈ ఆలయంలో పూజలు చేస్తూ వస్తున్నారు. అయితే.. ఈసారి వరుస బీఆర్ఎస్ సభలు.. మధ్యలో యాగం, సమయాభావ పరిస్థితులు, పైగా రేపు శనివారం కావడంతో ఈసారి ముందుగానే ఈ ఆలయంలో పూజలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల9వ తేదీన గజ్వేల్‌తో పాటు కామారెడ్డి లోనూ కేసీఆర్ నామినేషన్లు వేయనున్నారు. అదే రోజు సాయంత్రం కామారెడ్డి బీఆర్ఎస్ ఆశీర్వాద బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం లోని కోనాయిపల్లి గ్రామంలో వేంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. కేసీఆర్‌కు ఇది సెంటిమెంట్ దేవాలయం. ఏ ఎన్నికలు వచ్చినా ఇక్కడ పూజలు చేసిన తర్వాతే నామినేషన్ వేస్తారు. 1985లో మొదటిసారి సిద్ధిపేట ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుంచి 1989, 1994, 1999, 2001, 2004, 2009, 2014, 2018లలో జరిగిన ఎన్నికల సమయంలో.. ఈ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో నామినేషన్ పత్రాలకు పూజలు నిర్వహించి, నామినేషన్ వేశారు. అన్ని సందర్భాల్లో ఆయన విజయం సాధించారు. మరో విశేషం ఏంటంటే.. 2001లో టీడీపీకి, శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి, ఆపై ఈ ఆలయంలోనే పూజలు చేసి టీఆర్ఎస్(ప్రస్తుతం బీఆర్ఎస్) పార్టీ ప్రకటన చేశారాయన. -
పురాతన ఆలయం కోతులకు ఆవాసం!
రాజస్థాన్ రాజధాని జైపూర్ నగరానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘గల్తాజీ’ పీఠం మర్కట మందిరంగా పేరుమోసింది. ప్రతిరోజూ ఇక్కడ మనుషుల కంటే మర్కటాలే ఎక్కువగా కనిపిస్తాయి. చుట్టూ కొండలు, ఆ కొండల నుంచి జలధారలు, ఆ జలధారలతో ఏర్పడిన జలకుండాలు ఈ ఆలయ ప్రత్యేకతలు. ఆరావళి పర్వతాల నడుమ వెలసిన విలక్షణ ఆలయం ఇది. ఆరావళి కొండల నుంచి వెలువడే జలధారలతో ఏర్పడిన నీటికుండాలు ఈ ఆలయ ప్రత్యేకతలు. విశిష్టాద్వైత స్థాపకుడైన రామానుజాచార్యుల పరంపరకు చెందిన గల్తాజీ ఇక్కడ పదిహేనో శతాబ్దిలో రామానుజ సంప్రదాయం ప్రకారం వైష్ణవ పీఠాన్ని నెలకొల్పారు. ఉత్తర భారతదేశంలో రామానుజ సంప్రదాయంలో ఏర్పడిన తొలి పీఠం ఇదే! ప్రధాన ఆలయంలో సీతారాములు కొలువుదీరగా, ఈ ప్రాంగణంలోనే సూర్యాలయం కూడా ఉంది. ఇక్కడ కనిపించే మర్కట సమూహాలు ఆనాటి వానర సేనల వారసులేనని భక్తులు నమ్ముతారు. (చదవండి: తల్లి ప్రేమకు సరిహద్దులు లేవు) -
ద్వారకాధీశ్ దేవాలయంలో అంబానీ పూజలు
దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ, ఆయన కుమారుడు అనంత్ అంబానీ మంగళవారం గుజరాత్ రాష్ట్రంలోని దేవ్‌భూమి ద్వారకా జిల్లాకు చెందిన ద్వారకాధీశ్ దేవాలయాన్ని సందర్శించారు. స్వామివారి పాదాలకు నమస్కరించి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఇద్దరిని శాలువాలతో సత్కరించారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సమాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారుతుంది. #WATCH | Gujarat | Reliance Industries Chairman, Mukesh Ambani and his son Anant Ambani offered prayers at Dwarkadhish Temple in Devbhumi Dwarka district yesterday, on 24th October. pic.twitter.com/6efbOI2zNj — ANI (@ANI) October 25, 2023 -
ఘనంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు..