సన్‌గ్లాసెస్‌తో గుడిలో హీరోయిన్‌ పూజలు.. నెటిజన్స్‌ ఫైర్‌ | Bhumi Pednekar Faces Backlash For Wearing Sunglasses During Shiva Puja At Temple, Photos And Video Triggers Controversy | Sakshi
Sakshi News home page

సన్ గ్లాసెస్‌తో శివాభిషేకం.. హీరోయిన్‌పై నెటిజన్స్‌ ఫైర్‌

Aug 1 2026 9:02 AM | Updated on Aug 1 2026 9:37 AM

Bhumi Pednekar Faces Backlash For Wearing Sunglasses During Temple

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బాలీవుడ్‌ నటి భూమి పెడ్నేకర్‌..తన ఇన్‌స్టా ఖాతాలో తాజాగా పోస్ట్‌ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు..ఆమెపై ఫైర్‌ అవుతున్నారు. ఎంత పెద్ద హీరోయిన్‌ అయినా సరే ఇలా చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ భూమి పెడ్నేకర్‌ పోస్ట్‌ చేసిన వీడియో ఏంటి? అసలు ఏం జరిగింది?

విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకునే బాలీవుడ్‌ నటి భూమి..తాజాగా శివాలయానికి వెళ్లింది.  పవిత్రమైన శ్రావణ మాసం ప్రారంభం కావడంతో శివలింగానికి ప్రత్యేక పూజలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను, వీడియాలను ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ.. ‘ఈ శ్రావణ మాసంలో నా జీవితం సులభంగా మారిపోవాలని కోరుకోవడం లేదు. ఎలాంటి కష్టాలు, సవాళ్లు ఎదురైనా చిరునవ్వుతో ఎదుర్కొనే ధైర్యాన్ని, శక్తిని ప్రసాదించమని ఆ మహాదేవుడిని ప్రార్థిస్తున్నాను. హర్ హర్ మహాదేవ్’అంటూ ఎమోషనల్‌గా రాసుకొచ్చింది.

అయితే ఈ వీడియోలో భూమి కనిపించిన విధానంపై నెటిజన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. బ్లాక్‌ టీషర్ట్‌, జీన్స్‌ ధరించి ఆమె గుడిలోకి వెళ్లారు. అంతేకాదు కళ్లకు సన్‌ గ్లాసెస్‌ పెట్టుకొని శివలింగానికి అభిషేకం చేసింది. పవిత్రమైన ఆలయంలోకి వెళ్లినప్పుడు కనీసం కళ్లజోడు అయినా తీసేయాలనే సంస్కారం లేదా అని నెటిజన్స్‌ విమర్శిస్తున్నారు. ‘పూజ చేస్తున్నారా  లేదా ఫోటో షూట్‌కి పోజులు ఇస్తున్నారా?’, ‘సన్‌ గ్లాసెస్‌ పెట్టుకొని పూజ చేసినవాళ్లను ఇంతవరకు చూడలేదు​’, ‘దయచేసి ఆ కళ్లజోడులో నుంచి దేవుడివైపు చూడకండి.. సంప్రదాయాలకు కనీస గౌరవం ఇవ్వండి’ అని నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement