టాక్సిక్‌లో బోల్డ్ రోల్.. అందుకే ఒప్పుకున్నా: కియారా | Kiara Advani Reacts To Toxic Movie Backlash, Explains Why She Choose The Controversial Role, Read Story Inside | Sakshi
Sakshi News home page

Kiara Advani: 'టాక్సిక్‌లో బోల్డ్ రోల్.. అందుకే ఒప్పుకున్నా'

Aug 1 2026 5:50 AM | Updated on Aug 1 2026 9:42 AM

Kiara Advani about her latest Movie Toxix role

యశ్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ యాక్షన్‌ మూవీ టాక్సిక్.. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం పలుసార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీకి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో యశ్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా కనిపించనుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్‌పై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. మరీ బోల్డ్‌గా సీన్స్ ఉన్నాయంటూ పలువురు విమర్శించారు.

తమ సినిమాపై విమర్శల వస్తోన్న నేపథ్యంలో తన రోల్‌పై హీరోయిన్ కియారా అద్వానీ స్పందించింది. తన పాత్రకు సంబంధించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ కథ వినగానే ఆ పాత్రకు కనెక్ట్ అయ్యానని తెలిపింది. మహిళలను కేవలం మూసధోరణి పాత్రలే కాకుండా బలంగా, మరింత సహజంగా ఉండాలని పేర్కొంది. అలాంటి అవకాశం ఈ పాత్రలో ఉన్నందుకే వెంటనే ఓకే చెప్పానని కియారా వెల్లడించింది.

ఇలాంటి పాత్ర చేయడం ప్రతి నటికీ ఓ కల అని అన్నారు. నా కెరీర్‌లో ఇలాంటి క్లిష్టమైన పాత్రను పోషించగలననే ధైర్యం కలిగిందని తెలిపారు. నయనతార, హుమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్‌లతో కలిసి పనిచేయడం నాకు చాలా కొత్త అనుభూతిని ఇచ్చిందన్నారు. ఇంతమంది ఒకే సినిమాలో కనిపించడం ప్రేక్షకులకు నచ్చుతుందని పేర్కొన్నారు. ఈ సినిమాపై నాకు ఇష్టం కలగడానికి ఇలాంటి క్షణాలే కారణమని వెల్లడించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement