బాక్సాఫీస్‌ని షేక్‌ చేస్తున్న ‘స్పైడర్‌మ్యాన్’.. భారత్‌లో భారీ వసూళ్లు! | Spider-Man: Brand New Day Movie Day 1 Box Office Collections Create History in India, Surpasses Avengers Endgame Opening Record | Sakshi
Sakshi News home page

బాక్సాఫీస్‌ని షేక్‌ చేస్తున్న ‘స్పైడర్‌మ్యాన్’.. భారత్‌లో భారీ వసూళ్లు!

Jul 31 2026 12:13 PM | Updated on Jul 31 2026 12:35 PM

Spider Man: Brand New Day Box Office Collection Day 1

హాలీవుడ్ సూపర్ హీరో చిత్రం 'స్పైడర్‌మ్యాన్: బ్రాండ్ న్యూ డే' భారత బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి ఓపెనింగ్ సాధించింది. టామ్ హాలండ్, జెండయా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం విడుదలైన తొలి రోజే దేశవ్యాప్తంగా రూ.60.60 కోట్ల నెట్, రూ.72.44 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు చేసి కొత్త చరిత్ర సృష్టించింది.

ఈ చిత్రంతో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) చరిత్రలో భారత్‌లో అత్యధిక తొలి రోజు నెట్ వసూళ్లు సాధించిన సినిమాగా 'స్పైడర్‌మ్యాన్: బ్రాండ్ న్యూ డే' నిలిచింది. గతంలో ఈ రికార్డు 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' పేరిట ఉండగా, ఇప్పుడు దానిని ఈ చిత్రం అధిగమించింది. అలాగే  భారత్‌లో విడుదలైన హాలీవుడ్ చిత్రాల్లోనే అత్యంత భారీ ఓపెనింగ్ సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రం దేశవ్యాప్తంగా సుమారు 17,250 షోలలో ప్రదర్శించబడగా, మొత్తం ఆక్యుపెన్సీ 72.3 శాతం నమోదైంది. ఇంగ్లీష్ వెర్షన్‌తో పాటు హిందీ, తెలుగు, తమిళ భాషల్లో కూడా సినిమాకు విశేష ఆదరణ లభించింది. ఇంగ్లీష్ వెర్షన్ అత్యధిక వసూళ్లు సాధించగా, హిందీ వెర్షన్ కూడా భారీ కలెక్షన్లు నమోదు చేసింది. తెలుగు, తమిళ వెర్షన్లు కూడా మంచి స్పందనను అందుకున్నాయి.

మార్వెల్ అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం విడుదలకు ముందే భారీ అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు చేసింది. అదే ఉత్సాహం విడుదల రోజున కూడా కొనసాగడంతో అనేక నగరాల్లో షోలు హౌస్‌ఫుల్ అయ్యాయి. ముఖ్యంగా మెట్రో నగరాల్లో రాత్రి షోల ఆక్యుపెన్సీ అత్యధికంగా నమోదైంది. దర్శకుడు డెస్టిన్ డానియల్ క్రెట్టన్ తెరకెక్కించిన ఈ చిత్రం సుమారు 225 మిలియన్ అమెరికన్ డాలర్ల (దాదాపు రూ.2,154 కోట్లు) భారీ బడ్జెట్‌తో రూపొందినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement