ప్రతిష్టాత్మక సినీ అవార్డుల వేడుకకు అంతా సిద్ధమైంది. దక్షిణాదిలో అందించే సైమా అవార్డుల పండుగ సెప్టెంబర్‌లో జరగనుంది. 2025లో రిలీజైన చిత్రాలు వివిధ కేటగిరీల్లో నామినేషన్స్ దక్కించుకున్నాయి. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాలకు సంబంధించి అత్యధిక నామినేషన్స్ దక్కించుకున్న చిత్రాల జాబితాను సైమా అవార్డుల కమిటీ ప్రకటించింది.
మిరాయ్‌కు అత్యధిక నామినేషన్స్..
టాలీవుడ్ మూవీ మిరాయ్ అత్యధికంగా 11 విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకుంది. ఆ తర్వాత అనిల్ రావిపూడి-వెంకటేశ్‌ల బ్లాక్‌బస్టర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం 10 విభాగాల్లో నామినేషన్స్ సాధించింది. నాగచైతన్య నటించిన తండేల్, బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన కోర్ట్ చిత్రాలు 9 విభాగాల్లో నామినేషన్స్ సొంతం చేసుకున్నాయి. కాగా.. ఈ సైమా అవార్డుల వేడుక సెప్టెంబరు 11, 12 తేదీల్లో గ్రాండ్‌గా జరగనుంది.


