breaking news
Mirai Movie
-
అంబిక... చాలా పవర్ఫుల్
‘హను–మాన్’ చిత్రంతో పాన్ ఇండియా హిట్ అందుకున్న తేజ సజ్జా హీరోగా నటించిన తాజా చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్గా నటించారు. మనోజ్ మంచు, జగపతిబాబు, శ్రియ శరణ్, జయరామ్ కీలక పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది.ఈ సినిమాలో శ్రియ శరణ్ పోషించిన అంబిక పాత్రని పరిచయం చేస్తూ ఒక ప్రత్యేక పోస్టర్‌ను మంగళవారం విడుదల చేసింది యూనిట్. ‘‘మిరాయ్’లో సూపర్ యోధ పాత్రలో అలరించబోతున్నారు తేజ సజ్జా. ఈ సినిమాలో తేజ తల్లి పాత్రలో పవర్ఫుల్ క్యారెక్టర్లో నటించారు శ్రియ. ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ మూవీలో ఆమె పాత్ర చాలా స్ట్రాంగ్ ఎమోషన్‌తో ఉంటుంది’’ అని మేకర్స్ తెలిపారు.మిరాయ్ ట్రైలర్ బాగుంది – రజనీకాంత్ ‘‘మిరాయ్’ సినిమా ట్రైలర్ చాలా బాగుంది’’ అని హీరో రజనీకాంత్ పేర్కొన్నారు. తేజ సజ్జా, రితికా నాయక్ జంటగా నటించిన ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ పాత్ర పోషించారు. సోమవారం ఈ సినిమా ప్రెస్‌మీట్‌ని చెన్నైలో నిర్వహించారు. ఈ సందర్భంగా రజనీకాంత్‌ని కలిసి, ‘మిరాయ్’ ట్రైలర్ చూపించారు మనోజ్. ‘‘మిరాయ్’ ట్రైలర్ చూస్తుంటే సినిమాని గ్రాండ్ స్కేల్లో నిర్మించారని తెలుస్తోంది. మనోజ్ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉందని అర్థం అవుతోంది. ఈ చిత్రం మంచి విజయం సాధించాలి... యూనిట్‌కి అభినందనలు’’ అని రజనీకాంత్ పేర్కొన్నారు. ‘‘మిరాయ్’ మూవీతో రజనీకాంత్‌గారి ఆశీర్వాదాలు నాకు దక్కడం హ్యాపీగా ఉంది’’ అన్నారు మంచు మనోజ్. -
మంచు మనోజ్‌కు రజనీకాంత్ అభినందనలు
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కీలక పాత్రలో నటించిన సినిమా 'మిరాయ్'. ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ ట్రైలర్ ను సూపర్ స్టార్ రజనీకాంత్ చూసి చాలా బాగుందంటూ అప్రిషియేట్ చేశారు. గ్రాండ్ స్కేల్ లో మూవీ మేకింగ్ తో పాటు మనోజ్ క్యారెక్టర్ పవర్ ఫుల్ గా ఉందంటూ రజనీకాంత్ అభినందించారు. 'మిరాయ్' మూవీతో సూపర్ స్టార్ రజనీకాంత్ బ్లెస్సింగ్స్ తనకు దక్కడం పట్ల రాకింగ్ స్టార్ మంచు మనోజ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.'మిరాయ్' సినిమాతో మనోజ్ తన కెరీర్ లో మరో కొత్త ప్రయత్నం చేస్తున్నారు. తేజ సజ్జా హీరోగా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రితికా నాయక్, శ్రియ శరణ్, జయరామ్, జగపతి బాబు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. భారీ పాన్ ఇండియా చిత్రంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జి.విశ్వప్రసాద్ నిర్మించిన మిరాయ్ మూవీ ఈ నెల 12న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. -
మిరాయ్ చిత్రంలో మహేశ్ బాబు.. తేజా సజ్జా క్లారిటీ!
హనుమాన్ మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్న హీరో తేజా సజ్జా. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం తేజా సజ్జా మరో విజువల్ వండర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తేజా సజ్జా లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం మిరాయ్. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. విజువల్స్‌కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. మరో బ్లాక్‌బస్టర్ ఖాయమంటూ కామెంట్స్ చేస్తున్నారు.అయితే ఈ ట్రైలర్లో చివర్లో రాముడి పాత్రను చూపించారు. ఆ రోల్ చేసింది ఎవరనేదానిపై టాలీవుడ్లో చర్చ మొదలైంది. రాముడి పాత్రలో ఉన్నది ప్రిన్స్ మహేశ్‌బాబు అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. అయితే ఈ సీన్లో ఉన్నది ఎవవనేది మాత్రం చిత్ర బృందం క్లారిటీ ఇవ్వలేదు.ప్రస్తుతం మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న తేజ సజ్జాకు దీనిపై ప్రశ్న ఎదురైంది. రాముడి పాత్రలో ఉన్నది మహేశ్ బాబేనా అని అడిగారు. దానికి ఆయన కాదని తేజ సజ్జా సమాధానమిచ్చాడు. దీంతో రూమర్స్‌కు చెక్ పడింది. కాగా.. రాముడి పాత్రలో స్టార్ హీరో ఉన్నారని.. ఏఐ సాయంతో ఆ క్యారెక్టర్ రూపొందించారని మొదట రూమర్లు వినిపించాయి. మరి రాముడి పాత్రలో ఉన్నది ఎవరో తెలియాలంటే మాత్రం థియేటర్లలో చూడాల్సిందే. కాగా.. ఈ సినిమాకు కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. టాలీవుడ్ హీరో మంచు మనోజ్ విలన్ పాత్ర్లో మెప్పించనున్నారు. -
మిరాయ్.. ఓ అద్భుతం!
ఈ మధ్య కాలంలో వందల కోట్ల బడ్జెట్‌తో చేస్తున్న సినిమాలు సైతం గ్రాఫిక్స్ విషయంలో ప్రేక్షకులను మెప్పించలేక ట్రోలింగ్ బారిన పడుతున్నాయి. కానీ యంగ్ హీరో తేజ సజ్జా మాత్రం పరిమిత బడ్జెట్లో వావ్ ఫ్యాక్టర్ అనేలా విజువల్ బేస్డ్ మూవీస్‌తో సూపర్ హీరోగా దూసుకుపోతున్నాడు. హనుమాన్ తర్వాత ఏది పడితే అది చేయకుండా జాగ్రత్తగా సినిమాలు చేస్తున్న తేజ.. ఈసారి యూనివర్సల్ కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో అదరగొట్టిన ఈ కుర్ర హీరో.. ఇప్పుడు మిరాయ్ అంటూ అద్భుతం చేయడానికి వస్తున్నాడు. సినిమాటోగ్రఫర్ కమ్ దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని తీసిన ఈ సినిమాకు సంబంధించి.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది మాత్రం మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. ఈ మూవీ ఒక విజువల్ వండర్ అని.. జస్ట్ మూడు నిమిషాల ట్రైలర్‌తో అంచనాలను పెంచేశారు మేకర్స్. ఈ మధ్య కాలంలో వచ్చిన విఎఫ్ఎక్స్ బేస్డ్ సినిమాల్లో.. ది బెస్ట్ అవుట్ పుట్ ఇదే అనేలా మిరాయ్ ట్రైలర్ ఓ రేంజ్లో ఉంది. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు.. ప్రతీ ఫ్రేమ్ గూస్బంప్స్ ఇచ్చేలా ఉంది. ఈ మధ్య కాలంలో ఇంత యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన ట్రైలర్ మరోటి రాలేదనే చెప్పాలి. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలివే) ప్రామిసింగ్‌గా సాగిన ఈ ట్రైలర్.. తేజ సజ్జాకు మరో పాన్ ఇండియా హిట్ ఇచ్చేలా ఉంది. ముఖ్యమైన ఓ తొమ్మిది శక్తివంతమైన గ్రంథాలు.. వాటి కోసం వెతికే విలన్.. దాన్ని అడ్డుకునేందుకు హీరో చేసే పోరాటంతో విజువల్ గ్రాండియర్‌గా ట్రైలర్ సాగింది. హీరో చేసిన యాక్షన్ స్టంట్స్, అడ్వెంచర్ ఎలిమెంట్స్ అదిరిపోయాయనే చెప్పాలి. యోధుడిగా కనిపించబోతున్న తేజ.. మరోసారి సూపర్ హీరోగా ట్రైలర్‌తో సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా.. ట్రైలర్ చివర్లో వచ్చే శ్రీరాముడు షాట్ మాత్రం పీక్స్ అనే చెప్పాలి. ఇలాంటి అద్భుతమైన ట్రైలర్ ఇచ్చి, విజువల్ వండర్ సినిమా ఇవ్వబోతున్న నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా మీడియా ఫ్యాక్టరీ పై విఎఫ్ఎక్స్ విషయంలో సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.ఈ సినిమాలో డైనమిక్ హీరో మంచు మనోజ్, సీనియర్ హీరోయిన్ శ్రియ కీలక పాత్రలో నటిస్తున్నారు. మొత్తంగా.. ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ పై పాన్ ఇండియా లెవల్లో ఒక్కసారిగా అంచనాలు పెరగడంతో పాటు.. భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో బడా బడా బ్యానర్లు రిలీజ్ చేస్తున్నాయి. దీంతో.. సెప్టెంబర్ 12న మిరాయ్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది.(ఇదీ చదవండి: దీనస్థితిలో 'కేజీఎఫ్' నటుడు.. సాయం చేయాలని వేడుకోలు) -
అవెంజర్స్ రేంజ్ లో మిరాయ్ మూవీ..?
-
ఆలస్యమైనా... అలరిస్తాం
చిత్ర పరిశ్రమలో సినిమాల రిలీజ్లు వాయిదా పడటం సాధారణమే. కానీ రిలీజ్లు దగ్గర పడుతున్న తరుణంలో విడుదల వాయిదా పడుతున్న సినిమాల సంఖ్య ఇటీవలి కాలంలో టాలీవుడ్లో పెరిగింది. ఆగస్టు నెలలో సినీ కార్మికుల సమ్మె ఓ కారణమైతే, భారీ చిత్రాల వీఎఫ్ఎక్స్ వర్క్స్‌కి ఎక్కువ టైమ్ పట్టడం మరో కారణం... ఇలా పలు కారణాల వల్ల సినిమా రిలీజ్లు వాయిదా పడుతున్నాయి. కానీ అందరు మేకర్స్ చెబుతున్న మాట ఒకటే...‘ఆలస్యమైనా... అలరిస్తాం’ అని. అలా లేట్ అయినా లేటెస్ట్గా వస్తామంటున్న కొన్ని చిత్రాల గురించి ఓ లుక్ వేద్దాం.వేసవిలో విశ్వంభర విశ్వంభర చిత్రం ఈ ఏడాది థియేటర్స్‌లోకి రావడం లేదు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవికి వాయిదా పడింది. సంక్రాంతి రిలీజ్ వాయిదా పడిన తర్వాత ‘విశ్వంభర’ చిత్రం ఈ ఏడాది చివర్లో అయినా రిలీజ్ అవుతుందని మెగా ఫ్యాన్స్ ఆశించారు. కానీ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యేది లేదంటూ ‘విశ్వంభర’ చిత్రం రిలీజ్‌ను వచ్చే వేసవికి వాయిదా వేశారు. వచ్చే ఏప్రిల్‌లో ‘విశ్వంభర’ చిత్రం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రానికి ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహించారు.త్రిష హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ చిత్రంలో ఆంజనేయస్వామి భక్తుడు భీమవరం దొరబాబు పాత్రలో చిరంజీవి కనిపిస్తారని, సురభి, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి.. చిరంజీవి సిస్టర్స్‌గా కనిపిస్తారని, త్రిష ద్వి పాత్రాభినయం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది.అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ నటి మౌనీ రాయ్ ఓ స్పెషల్ సాంగ్ చేశారు. పధ్నాలుగు లోకాలు దాటి హీరో సత్యలోకానికి ఎలా చేరుకున్నాడు? అక్కడ హీరోయిన్ను ఎలా కలుసుకున్నాడు? అనే అంశాల నేపథ్యంలో ‘విశ్వంభర’ సినిమా కథనం సాగుతుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ చిత్రదర్శకుడు వశిష్ఠ పేర్కొన్నాడు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మించారు.దసరా బరిలో లేదుహీరో బాలకృష్ణ, దర్శకుడు బోయ పాటి శీను కాంబినేషన్లో రూ పొందుతున్న సినిమా ‘అఖండ 2: తాండవం’. ఈ సినిమాను ఈ దసరా ఫెస్టివల్ సందర్భంగా సెప్టెంబరు 25న రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. కానీ దసరా బరి నుంచి ‘అఖండ 2’ చిత్రం తప్పుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ గురువారం అధికారికంగా ప్రకటించారు.వీఎఫ్ఎక్స్ పనులు, రీ–రికార్డింగ్ పనులతో పాటు మొత్తం పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్‌కు మరింత సమయం పడుతుందని ఈ కారణంగా ‘అఖండ 2’ సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నామని, ఈ సినిమా ఎప్పుడొచ్చినా ఓ సెలబ్రేషన్‌లా ఉంటుందని చెబుతూ, ‘అఖండ 2’ సినిమా రిలీజ్ వాయిదాను గురువారం కన్ఫార్మ్ చేశారు మేకర్స్. కాగా ఈ చిత్రం డిసెంబరులో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. బాలకృష్ణ, బోయ పాటి కాంబినేషన్లో రూ పొందిన ‘అఖండ’ సినిమాకు సీక్వెల్‌గా ‘అఖండ 2’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.సంక్రాంతి బరిలో... వచ్చే సంక్రాంతి బరిలో ‘ది రాజాసాబ్’ చిత్రం నిలిచింది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ ఫ్యాంటసీ హారర్ కామెడీ యాక్షన్ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మాళవికా మోహనన్, నిధీ అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించగా, సంజయ్ దత్, వీటీవీ గణేశ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. తొలుత ‘ది రాజాసాబ్’ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. కానీ ఆ తర్వాత డిసెంబరు 5న రిలీజ్ చేస్తామంటూ ప్రకటించారు. తాజాగా ‘ది రాజాసాబ్’ సినిమాను 2026 జనవరి 9న రిలీజ్ చేస్తున్నట్లుగా ఈ చిత్రనిర్మాత టీజీ విశ్వప్రసాద్ కన్ఫార్మ్ చేశారు.దీంతో డిసెంబరు 5 నుంచి జనవరి 9కి ‘ది రాజాసాబ్’ సినిమా వాయిదా పడినట్లు, అధికారిక సమాచారం వెల్లడైంది. ఇక తాత–మనవడు నేపథ్యంలో ఈ సినిమా ప్రధాన కథనం సాగుతుందని, ఇటీవల ఓ సందర్భంలో ఈ చిత్రదర్శకుడు మారుతి స్పష్టం చేశారు. ఈ చిత్రంలో సంజయ్‌దత్– ప్రభాస్ తాత–మనవడు పాత్రల్లో కనిపిస్తారని, ‘రాజా డీలక్స్’ అనే ఓ భవనం నేపథ్యంలో ఈ సినిమా మేజర్ కథనం సాగుతుందని తెలిసింది.ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ హైదరాబాద్ షూటింగ్ షెడ్యూల్ పూర్తి కాగానే, సెప్టెంబరులో కేరళ వెళుతుంది చిత్ర యూనిట్. అక్కడ ప్రభాస్ పాత్ర తాలూకు ఇంట్రడక్షన్ సాంగ్ తీస్తారట. ఆ నెక్ట్స్ విదేశాల్లో హీరో – హీరోయిన్లపై చిత్రీకరించే డ్యూయెట్ సాంగ్‌లతో ‘ది రాజాసాబ్’ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తవుతుందని తెలిసింది. ఫ్యాంటసీ హారర్ కామెడీ సినిమా కనుక, వీఎఫ్ఎక్స్–΄ోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్‌పై స్పెషల్ కేర్ తీసుకుంటోందట చిత్రయూనిట్. టీజీ విశ్వప్రసాద్, కృతీప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మాస్ జాతర రవితేజ కెరీర్‌లోని 75వ చిత్రం ‘మాస్ జాతర’. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాతో భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ‘ధమాకా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీల ఈ సినిమా కోసం మరోసారి జోడీ కట్టారు. అలాగే ఈ సినిమాలో మరోసారి తనకు అచ్చొచ్చిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు రవితేజ. ఇందులో రవితేజ లక్ష్మణ్ భేరి అనే రైల్వే పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు.షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి కావొచ్చింది. అయితే ఈ వినాయక చవితి ఫెస్టివల్ సందర్భంగా రిలీజ్ కావాల్సిన ‘మాస్ జాతర’ చిత్రం వాయిదా పడింది. ఇటీవల ఇండస్ట్రీలో జరిగిన సమ్మె పరిస్థితులు, కొన్ని ఊహించని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్‌ను ఈ ఆగస్టు 27న రిలీజ్ చేయడం లేదని, త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ తెలి పారు. అయితే ‘మాస్ జాతర’ సినిమా రిలీజ్ వాయిదా పడటం ఇదేం తొలిసారి కాదు.నిజానికి ఈ సినిమాను తొలుత 2025 సంక్రాంతి రిలీజ్‌కి ప్లాన్ చేశారు. ఆ తర్వాత మే 9కి, ఆ నెక్ట్స్ ఆగస్టు 27కి రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ ఈ తేదీల్లో రిలీజ్ కుదర్లేదు. ఈ క్రమంలో ఈ ఏడాది అక్టోబరు చివర్లో లేదా నవంబరు ప్రారంభంలో ‘మాస్ జాతర’ చిత్రం విడుదల కావొచ్చనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో నవీన్ చంద్ర విలన్‌గా చేస్తున్నారని తెలిసింది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.హీరో వర్సెస్ డైరెక్టర్ ఒకరినొకరు ఎంతగానో అభిమానించుకునే ఓ హీరో, ఓ డైరెక్టర్ మధ్య ఎందుకు విభేదాలు ఏర్పడ్డాయి? అసలు వీరి మధ్య ఏం జరిగింది? అన్న అంశాలతో రూ పొందిన పీరియాడికల్ చిత్రం ‘కాంత’. ఈ సినిమాలో సూపర్‌స్టార్ చంద్రన్ పాత్రలో దుల్కర్ సల్మాన్, లెజెండరీ డైరెక్టర్ అయ్యా పాత్రలో సముద్ర ఖని నటించారు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో భాగ్యశ్రీ బోర్సే నటించారు.ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. సెప్టెంబరు 12న రిలీజ్ అంటూ రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు మేకర్స్. కానీ 1950 మద్రాస్ నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్ సినిమా సెప్టెంబరు 12న రిలీజ్ కావడం లేదని ఫిల్మ్‌నగర్ సమాచారం. త్వరలోనే ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటించనున్నారు మేకర్స్. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోయ్ వర్గీస్ ఈ సినిమాను నిర్మించారు.తొమ్మిది గ్రంథాల నేపథ్యంలో... ‘హను–మాన్’ వంటి బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ తర్వాత తేజ సజ్జా హీరోగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘మిరాయ్’. ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్గా నటించగా, మంచు మనోజ్ విలన్ రోల్ చేశారు. జగపతిబాబు, శ్రియా శరణ్, జయరామ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతీప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో సూపర్ యోధ పాత్రలో తేజ సజ్జా, బ్లాక్స్వార్డ్ పాత్రలో మంచు మనోజ్ నటించారు.ఈ సినిమాను తొలుత ఆగస్టు 1న రిలీజ్ చేయాలనుకున్నారు. ఆ తర్వాత సెప్టెంబరు 5న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. కానీ తాజాగా వారం రోజులు ఆలస్యంగా... అంటే సెప్టెంబరు 12న రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. గురువారం ఈ సినిమా ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అండ్ మైథలాజికల్ అడ్వెంచరస్ చిత్రం ప్రధానంగా తొమ్మిది గ్రంథాలు, ఓ మ్యాజికల్ స్టిక్ నేపథ్యంలో సాగుతుందని ట్రైలర్ స్పష్టం చేస్తోంది.ప్రేమలో సంఘర్షణ రష్మికా మందన్నా లీడ్ రోల్లో నటించిన తొలి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘ది గర్ల్‌ఫ్రెండ్’. ఈ లవ్‌స్టోరీ చిత్రంలో దీక్షిత్ శెట్టి మరో లీడ్ రోల్లో నటించారు. రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి ఈ సినిమా నిర్మించారు. ఆల్రెడీ ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. అయితే ఈ సినిమాను సెప్టెంబరు 5న రిలీజ్‌కు రెడీ చేశారు మేకర్స్. కానీ ఈ సెప్టెంబరు 5న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రం విడుదల కావడం లేదని, త్వరలోనే మేకర్స్ నుంచి కొత్త విడుదల తేదీ వస్తుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. ప్రేమలో ఓ యువతి పడే సంఘర్షణ తాలూకు అంశాలతో ఈ చిత్రకథనం సాగుతుందని తెలిసింది. సంబరాలు ఎప్పుడు? రాయలసీమ నేపథ్యంలో రూ పొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ‘సంబరాల ఏటిగట్టు’. ఈ చిత్రంలో సాయి దుర్గాతేజ్ హీరోగా నటిస్తున్నారు. రోహిత్ కేపీని దర్శకుడిగా పరిచయం చేస్తూ, కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాను గతంలో సెప్టెంబరు 25న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటంచారు. కానీ ఆ తర్వాత ఈ సినిమా రిలీజ్ గురించి, మరో అప్డేట్ లేక΄ోవడంతో ఈ మూవీ సెప్టెంబరు 25న రిలీజ్ కావడం లేదని తెలుస్తోంది. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ 75 శాతం పూర్తయిందని ఓ సందర్భంలో మేకర్స్ తెలి పారు. ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, సాయి కుమార్, అనన్య నాగళ్ల ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుందనే టాక్ వినిపిస్తోంది.కోచింగ్ సెంటర్ల నేపథ్యంలో... చాలా సినిమాల రిలీజ్లు పోస్ట్΄ోన్ అవుతుంటే చిన్న చిత్రం ‘లిటిల్ హార్ట్స్’ రిలీజ్ మాత్రం ప్రీ పోన్ అయ్యింది. ‘90స్ మిడిల్ క్లాస్ బయోపిక్‘ వెబ్‌సిరీస్ ఫేమ్ మౌళి తనుజ్, శివానీ నాగరం లీడ్ రోల్స్‌లో నటించిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ మూవీ ‘లిటిల్ హార్ట్స్’. ‘90స్ మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ ఈ సినిమాను నిర్మించారు. సాయి మార్తాండ్ దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమాను తొలుత సెప్టెంబరు 12న రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. కానీ సెప్టెంబరు 5కి ఈ సినిమాను ప్రీ పోన్ చేశారు. ఈ సినిమాను నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నంది పాటి థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. టీనేజ్ పిల్లల చదువు, లవ్‌స్టోరీ, కోచించ్ సెంటర్లు.. వంటి అంశాల నేపథ్యంలో ఈ ‘లిటిల్ హార్ట్స్’ చిత్రం సాగుతుందని తెలుస్తోంది. ఈ తరహాలో రిలీజ్ వాయిదా పడిన సినిమాలు, కొత్త రిలీజ్ డేట్లను కన్ఫార్మ్ చేసుకున్న సినిమాలు మరికొన్ని ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు -
అది బోనస్: తేజ సజ్జా
‘‘మన తెలుగు ప్రేక్షకుల స పోర్ట్ వల్లే ఈరోజు ఇక్కడ ఉన్నాను. నా సినిమా ఇతర భాషల వారికి నచ్చితే అది బోనస్’’ అని తేజ సజ్జా చెప్పారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా, రితికా నాయక్ జంటగా నటించిన చిత్రం ‘మిరాయ్’. మనోజ్ మంచు, జగపతిబాబు, శ్రియా శరణ్ ఇతరపాత్రలు పోషించారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 12న విడుదల కానుంది.ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో తేజ సజ్జా మాట్లాడుతూ– ‘‘మిరాయ్’ కోసం వంద శాతం ఎఫర్ట్ పెట్టాను. చాలా క్లీన్ ఫిలిం. పిల్లలు, కుటుంబమంతా కలిసి చూడొచ్చు’’ అని తెలి పారు. మనోజ్ మంచు మాట్లాడుతూ– ‘‘మిరాయ్’లో నాది బలమైనపాత్ర.ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి’’ అని చె ప్పారు. ‘‘మా సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు కృతీ ప్రసాద్. ‘‘చాలా సిన్సియర్‌గా తీసిన సినిమా ఇది’’ అని కార్తీక్ ఘట్టమనేని పేర్కొన్నారు. ‘‘తెలుగు సినిమా పరిశ్రమ గర్వపడేలా చేస్తుంది ‘మిరాయ్’’ అని టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. -
హీరోయిన్ శ్రియాకు క్షమాపణలు చెప్పిన మంచు మనోజ్.. ఎందుకంటే?
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ప్రస్తుతం మిరాయి మూవీలో కీలక పాత్రలో కనిపించనున్నారు. హనుమాన్ హీరో తేజా సజ్జా లీడ్ రోల్లో నటించిన సైంటిఫిక్ థ్రిల్లర్ మిరాయ్లో విలన్‌గా మెప్పించనున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో జరిగిన ఈవెంట్‌కు మంచు మనోజ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మనోజ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్‌ను ఉద్దేశించి మంచు మనోజ్ మాట్లాడారు. మేమిద్దరం గతంలో కలిసి పనిచేద్దామని అనుకున్నామని అన్నారు. ఆమె నా ఫేవరేట్.. చివరికీ ఈ సినిమాలో మా ఇద్దరికీ కుదిరిందన్నారు. అలాగే సినిమాలో జరిగిన సంఘటనలకు సారీ చెప్తున్నా అంటూ నవ్వుతూ మాట్లాడారు. ఈ మాటలు విన్న శ్రియా వేదికపైనే చిరునవ్వులు చిందించారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.అంతేకాకుండా మిరాయ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌పై మంచు మనోజ్ ప్రశంసలు కురిపించారు. కింగ్ ఆఫ్ కంటెంట్ అంటే ఆయనే అని అన్నారు. ప్రస్తుత రోజుల్లో ఇండస్ట్రీలో బ్రతకడం చాలా కష్టమని తెలిపారు. జీరో సపోర్ట్‌తో ఇండస్ట్రీకి వచ్చారని.. వంద సినిమాలు తీయాలనే ఆశయంతో అడుగుపెట్టారని కొనియాడారు. ఇలాంటి నిర్మాతను తాను ఎప్పుడు చూడలేదని అన్నారు. మహా మొండి అయితే ఇలా ఉండగలరని ప్రశంసలు కురిపించారు. ఇండస్ట్రీలో పెద్ద పెద్ద తిమింగళాలు ఉంటాయని.. ఇక్కడ నిలదొక్కుకోవటం మీలాంటి వారికే సాధ్యమన్నారు మంచు మనోజ్. -
తేజ సజ్జా 'మిరాయ్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫోటోలు)
-
'మిరాయ్' మూవీ ట్రైలర్ విడుదల
-
అంచనాలు పెంచేసిన 'మిరాయ్' ట్రైలర్..
యంగ్ హీరో తేజ సజ్జా (Teja Sajja) హీరోగా నటించిన 'మిరాయ్' ట్రైలర్ వచ్చేసింది. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. పాన్ ఇండియా రేంజ్లో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో రితికా నాయక్ హీరోయిన్గా, మంచు మనోజ్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రియా శరణ్, జయరాం, జగపతిబాబు ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. -
'మిరాయ్' విడుదలకు చేతులు కలిపిన టాప్ బ్యానర్స్
హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో తేజ సజ్జా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా సూపర్ యోధాగా ఆయన నటించిన చిత్రం ‘మిరాయ్’. సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రితికా నాయక్ హీరోయిన్గా, మంచు మనోజ్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రియా శరణ్, జయరాం, జగపతిబాబు ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో దేశంలోనే టాప్ నిర్మాణ సంస్థలు మిరాయ్ డిస్ట్రిబ్యూట్ హక్కులను పొందాయి.మిరాయ్ దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని టాప్ బ్యానర్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. హిందీలో ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ నుంచి కరణ్ జోహార్ విడుదల చేస్తున్నారు. కర్ణాటకలో హోంబాలే ఫిల్మ్స్, తమిళనాడులో AGS ఎంటర్టైన్మెంట్, మలయాళంలో శ్రీ గోకులం మూవీస్ వారు మిరాయ్ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇవన్నీ కూడా దేశంలోనే టాప్‌లో ఉన్న చిత్ర నిర్మాణ సంస్థలు కావడం విశేషం. తెలుగులో మాత్రం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు విడుదల చేస్తున్నారు.టాప్ బ్యానర్స్ నుంచి మిరాయ్ సినిమా విడుదల కావడం అనేది ఖచ్చితంగా ఈ సినిమాకి మరింత బలాన్ని ఇచ్చినట్లు అయింది. దీంతో మిరాయ్ జాతీయ స్థాయిలో తప్పకుండా అద్భుతాలను సృష్టించగలదను అంచనాలు ఉన్నాయి. సినిమా బాగుందని టాక్ వస్తే రూ. 300 కోట్లకు పైగా మార్క్‌ను సులువుగా అందుకోవచ్చిన అంచనాలు ఉన్నాయి. -
తేజా సజ్జా 'మిరాయ్'.. వారం లేటుగా థియేటర్లలోకి
బాలనటుడిగా కెరీర్ మొదలుపెట్టి.. హీరోగా 'హనుమాన్'తో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న తేజా సజ్జా.. ఇప్పుడు 'మిరాయ్'తో రాబోతున్నాడు. ఇది సూపర్ హీరో తరహా సినిమానే. చాన్నాళ్లుగా వాయిదాలు పడుతూ వచ్చింది. ఫైనల్‌గా సెప్టెంబరు తొలివారం రిలీజ్ పెట్టుకున్నారు. ఇప్పుడు మరోసారి వాయిదా పడిందని చెబుతూ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లోకి మరో కన్నడ నటి.. హిట్ సీరియల్‌తో గుర్తింపు)తేజా సజ్జా హీరోగా నటిస్తుండగా.. మంచు మనోజ్ విలన్‌గా చేస్తున్నాడు. రితికా నాయక్ హీరోయిన్. కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. పీపుల్స్ మీడియా సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ చిత్రాన్ని తొలుత సెప్టెంబరు 5న రిలీజ్ చేయాలనుకున్నారు. మరి ఏమైందో ఏమో గానీ వారం ఆలస్యంగా అంటే సెప్టెంబరు 12న థియేటర్లలో తీసుకురానున్నట్లు ఇప్పుడు కొత్త పోస్టర్ వదిలారు.అలానే ఈనెల 28న ట్రైలర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ సినిమా విడుదలకు ముందే పీపుల్స్ మీడియా సంస్థలో తేజా సజ్జా మరో చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. రీసెంట్‌గానే ఆ ప్రకటన కూడా వచ్చింది. అయితే అది 'జాంబీరెడ్డి' సీక్వెల్ అని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.(ఇదీ చదవండి: కన్నడ స్టార్ హీరోకి క్షమాపణ చెప్పిన నటుడు)From the ethos of Itihasas, born a battle for the future ⚔️#MiraiTrailer drops on 28th August 🔥Get ready to witness India’s most ambitious Action-Adventure Saga 🥷❤️🔥#MIRAI GRAND RELEASE WORLDWIDE ON 12th SEPTEMBER💥Rocking Star @HeroManoj1 @Karthik_gatta @RitikaNayak_… pic.twitter.com/8orFDK7EkN— Teja Sajja (@tejasajja123) August 26, 2025 -
సూపర్ యోధ పోరాటం
తేజ సజ్జా హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మిరాయ్’. రితికా నాయక్ హీరోయిన్గా, మంచు మనోజ్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రియా శరణ్, జయరాం, జగపతిబాబు ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శనివారం (ఆగస్టు 23) తేజ సజ్జా బర్త్ డే. ఈ సందర్భంగా ‘మిరాయ్’ సినిమా నుంచి తేజ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. కూలిపోతున్న వంతెనపై కేవలం ఒక స్టిక్‌తో నిలబడి ఓ సూపర్ యోధాలా హీరో పోరాటం చేస్తున్నట్లుగా ఈ పోస్టర్ స్పష్టం చేస్తోంది.‘‘ఈ చిత్రంలో ఓ సూపర్ యోధ అవతార్‌లో తేజ కనిపిస్తారు. అతనిపాత్రలో పట్టుదల, ధైర్యం కనిపిస్తాయి. ఆల్రెడీ విడుదలైన టీజర్, ఫస్ట్ వైబ్ సాంగ్‌లకు మంచి స్పందన వచ్చింది. అలాగే నార్త్‌లో ‘మిరాయ్’ సినిమా హక్కులను కరణ్ జోహార్ దక్కించుకున్నారు. ఈ సినిమాను 2డీ, 3డీ ఫార్మాట్స్‌లో ఎనిమిది భాషల్లో సెప్టెంబరు 5న విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: గౌర హరి. ఫ్రమ్ రాయలసీమ: ‘మిరాయ్’ సినిమా తర్వాత తేజ సజ్జా హీరోగా టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ మరో సినిమాను నిర్మిస్తున్నారు. శనివారం తేజ సజ్జా పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించి, కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. అలాగే ఈ చిత్రాన్నిపాన్–ఇండియా స్థాయిలో 2027 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ తెలిపారు. ‘ఫ్రమ్ రాయలసీమ టు ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్’ అనే ట్యాగ్‌లైన్ ఈ కాన్సెప్ట్ పోస్టర్‌పై ఉంది. -
సూపర్ సెప్టెంబర్
సెప్టెంబర్ నెల సినిమా లవర్స్‌కి సూపర్ అనే చెప్పాలి. ఎందుకంటే చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. ప్రతి నెలా విడుదలవుతాయి కానీ పెద్ద సినిమాలు రెండో మూడో ఉంటాయి. అయితే సెప్టెంబర్‌లో విడుదలయ్యేవాటిలో పెద్ద సినిమాల సంఖ్య మెండుగానే ఉంది. ఆ సినిమాల గురించి తెలుసుకుందాం.యాక్షన్ డ్రామా... ‘అరుంధతి, పంచాక్షరి, భాగమతి, నిశ్శబ్దం’ వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాల తర్వాత అనుష్క లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘ఘాటీ’. ‘వేదం’ (2010) వంటి హిట్ మూవీ తర్వాత అనుష్క, డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్లో రూపొందిన ద్వితీయ చిత్రమిది. విక్రమ్ ప్రభు, జగపతిబాబు, చైతన్యా రావు, రవీంద్రన్ విజయ్ ఇతర పాత్రలుపోషించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు.పలుమార్లు విడుదల వాయిదా పడిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 5న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ‘‘మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామాగా రూపొందిన చిత్రం ‘ఘాటీ’. ఒక బలహీన మహిళ క్రిమినల్‌గా, ఆ తర్వాత లెజెండ్‌గా మారే పాత్రలో అనుష్క నటన అద్భుతంగా ఉంటుంది. అధిక బడ్జెట్‌తో, అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో మా సినిమా రూపొందింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ మా మూవీపై అంచనాలు పెంచింది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. సూపర్ యోధ... ‘హనుమాన్’ (2024) చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో హిట్ అందుకున్న తేజ సజ్జా హీరోగా నటించిన తాజా చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రితికా నాయక్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ పాత్ర పోషించారు. జగపతిబాబు, శ్రియ శరణ్, జయరామ్ ఇతర పాత్రలుపోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా 2డీ, 3డీ ఫార్మాట్లలో 8 భాషల్లో విడుదల కానుంది.ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో తేజ సూపర్ యోధగా కనిపించనున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైనపోస్టర్స్, వీడియో గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. గౌర హరి సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇటీవల విడుదల చేసిన ‘వైబ్ ఉంది బేబీ..’ పాట ట్రెండింగ్‌గా మారింది. ‘హనుమాన్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత తేజ సజ్జా నటించిన ‘మిరాయ్’ పై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇక ఈ సినిమా హిందీ థియేట్రికల్ హక్కులను కరణ్ జోహార్ దక్కించుకున్నారు.అందమైన ప్రేమకథ ఓ వైపు హీరోయిన్గా బిజీ బిజీగా వరుస ప్రాజెక్టులతో దూసుకెళుతూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలకీ సై అంటున్నారు రష్మికా మందన్న. ఆమె ప్రధాన పాత్రలో రూపొందిన తాజా చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి లీడ్ రోల్లో నటించారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ‘‘అందమైన ప్రేమకథగా ఈ చిత్రం రూపొందింది.మనసుని ఆకట్టుకునే అంశాలతో రాహుల్ రవీంద్రన్ అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో రష్మిక నటన సరికొత్తగా ఉంటుంది. యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా మా మూవీ ఉంటుంది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను హీరో విజయ్ దేవరకొండ తన వాయిస్ ఓవర్‌తో రిలీజ్ చేయగా, అద్భుతమైన స్పందన వచ్చింది. అలాగే హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ‘నదివే...’ అంటూ సాగే తొలి పాట కూడా ఆకట్టుకుంది.కిష్కిందపురిలో... ‘భైరవం’ సినిమాతో ఇటీవల ప్రేక్షకులను అలరించారు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఆయన నటించిన తాజా చిత్రం ‘కిష్కిందపురి’. ‘రాక్షసుడు’ (2019) వంటి హిట్ మూవీ తర్వాత సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జోడీగా నటించిన ద్వితీయ చిత్రమిది. కౌశిక్ పెగల్లపాటి రచన, దర్శకత్వంలో అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఈ సినిమాని సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ‘‘హారర్ మిస్టరీగా రూపొందిన చిత్రం ‘కిష్కిందపురి’.సాయి శ్రీనివాస్ కెరీర్లో హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ఇది. ఈ చిత్రం ప్రేక్షకులకు అద్భుతమైన హారర్, మిస్టరీ ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తుంది. కౌశిక్ పెగల్లపాటి గ్రిప్పింగ్ కథనం, చిన్మయ్ సలాస్కర్ కెమెరా వర్క్, సామ్ సీఎస్ సంగీతం ఆకట్టుకుంటాయి. సాహు గారపాటి గ్రాండ్‌గా నిర్మించిన ఈ చిత్రం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ నచ్చుతుంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్‌పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రం నుంచి ‘ఉండి పోవే నాతోనే...’ అంటూ సాగే తొలి పాటని విడుదల చేయగా, అద్భుతమైన స్పందన వచ్చింది. యాక్షన్ భద్రకాళి సంగీత దర్శకుడు, నటుడు, నిర్మాత, దర్శకుడు... ఇలా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు విజయ్ ఆంటోని. ఆయన నటించిన 25వ చిత్రం ‘భద్రకాళి’. అరుణ్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలానీ, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, మాస్టర్ కేశవ్ ఇతర పాత్రలుపోషించారు. మీరా విజయ్ ఆంటోని సమర్పణలో విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్‌పై విజయ్ ఆంటోని నిర్మించారు. ఈ సినిమాని తొలుత సెప్టెంబర్ 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.అయితే ఆ తేదీకి కాకుండా 19వ తేదీ రిలీజ్ చేయనున్నట్లు లేటెస్ట్గా అనౌన్స్ చేశారు. ఈ సినిమాని తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ సంస్థ విడు దల చేస్తోంది. ఈ చిత్రంలో కిట్టు పాత్రలో విజయ్ ఆంటోని నటించారు. సుమారు 200 కోట్ల రూపాయల కుంభకోణం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. గత చిత్రాల కంటే స్టైలిష్‌గా, యాక్షన్ హీరోగా కనిపించనున్నారు విజయ్. వెండితెరపై తాండవం... హీరో బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీనులది హిట్ కాంబినేషన్. వారి కలయికలో వచ్చిన ‘సింహా (2010), లెజెండ్ (2014), అఖండ’ (2021) సినిమాలు మంచి విజయం అందుకున్నాయి. హ్యాట్రిక్ హిట్స్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘అఖండ 2: తాండవం’. ‘అఖండ’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఎం. తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమాని సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. గ్యాంగ్‌స్టర్ పాత్రలో... పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓజీ’. ‘రన్ రాజా రన్, సాహో’ చిత్రాల ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, ప్రకాశ్‌రాజ్, శ్రియా రెడ్డి కీలక పాత్రలుపోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ‘‘ఓజీ’ చిత్రంలో పవన్ కల్యాణ్ భీకరమైన గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. యాక్షన్ ఫ్యాక్డ్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’, ‘బ్రో’ వంటి హిట్ సినిమాల తర్వాత సాయిదుర్గా తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల యేటిగట్టు). ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి కథానాయికగా నటిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై ‘హనుమాన్’ (2024) వంటి పాన్ ఇండియన్ ఫిల్మ్ నిర్మించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ‘‘యాక్షన్ ఫ్యాక్డ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల యేటిగట్టు). ఈ చిత్రంలో మునుపెన్నడూ చూడని పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు సాయిదుర్గా తేజ్. ఆయనపోరాట సన్నివేశాలు సరికొత్తగా ఉంటూ ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేస్తాయి. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి.నవ్వులే నవ్వులు ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ మూవీ ఫేమ్ శివానీ నగరం, ‘90స్ ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ మౌళి తనుజ్ జంటగా నటించిన చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. సాయి మార్తాండ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాజీవ్ కనకాల, ఎస్ఎస్ కాంచీ, అనిత చౌదరి, సత్య కృష్ణన్ ఇతర పాత్రలుపోషించారు. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రోడక్షన్ బ్యానర్‌పై ఆదిత్య హాసన్ నిర్మించారు.ఈ సినిమాని నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నందిపాటి సెప్టెంబర్ 12న విడుదల చేస్తున్నారు. ‘‘పూర్తి స్థాయి వినోదాత్మకంగా రూపొందిన చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. సినిమా చూస్తున్నంత సేపు థియేటర్లలో ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటారు. 2 గంటల పాటు మా చిత్రం ఆడియన్స్‌కి నవ్వులు పంచుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. కాగా సింజిత్ యెర్రమల్లి సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘రాజా గాడికి...’ అంటూ సాగే పాటని విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. పైన పేర్కొన్న సినిమాలే కాదు.. మరికొన్ని చిత్రాలు కూడా సెప్టెంబరులో విడుదలకు ముస్తాబవుతున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
‘మిరాయ్’ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. ‘వైబ్’ అదిరింది
హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత తేజ సజ్జ నటిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మంచు మనోజ్ విలన్‌గా నటిస్తున్నాడు. రితికా నాయక్ హీరోయిన్. సెప్టెంబర్ 5న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 8 భాషల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ని విడుదల చేశారు మేకర్స్. ‘వైబ్ ఉంది బేబీ’ అంటూ సాగే ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా, అర్మాన్ మాలిక్ ఆలపించారు. తేజ సజ్జా అదిరిపోయే స్టెప్పులేసి ఆకట్టుకున్నాడు. -
యంగ్ హీరో తేజ సజ్జా అరుదైన ఘనత
యంగ్ హీరో తేజ సజ్జా తన సినీ ప్రస్థానంలో అరుదైన ఘనతను సాధించారు. బాల నటుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తేజ.. చూడాలని వుంది, రాజకుమారుడు, కలిసుందాం రా, ఇంద్ర వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో తన నటనతో గుర్తింపు పొందారు. 2005లో వచ్చిన బోన్సాయ్ చిత్రానికి ఉత్తమ బాల నటుడిగా నంది అవార్డు అందుకుని తన టాలెంట్‌ను నిరూపించుకున్నారు.ఇప్పుడు హీరోగా కూడా అదే స్థాయిలో విశేష గుర్తింపు పొందుతున్నారు. హనుమాన్ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో అభిమానాన్ని సంపాదించిన తేజ సజ్జా, మరో ప్రతిష్టాత్మక అవార్డు తన ఖాతాలో వేసుకున్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 నుండి 2024 మధ్య విడుదలైన సినిమాలకు గద్దర్ సినీ పురస్కారాలను ప్రదానం చేసింది. అందులో భాగంగా, 2023కి గాను ఉత్తమ ద్వితీయ చిత్రం (బెస్ట్ సెకండ్ ఫిల్మ్) విభాగంలో తేజసజ్జా హనుమాన్ చిత్రం అవార్డును గెలుచుకుంది.బాల నటుడిగా నంది అవార్డు, హీరోగా గద్దర్ పురస్కారం అందుకొని అరుదైన రికార్డు సాధించిన నటుడిగా నిలిచారు. ప్రస్తుతం తేజ మరో సూపర్ హీరో మూవీ మిరాయ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు అద్భుత స్పందన లభిస్తోంది. హనుమాన్ తరువాత తేజ నుంచి వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. -
తేజ సజ్జా మిరాయ్ మూవీ టీజర్ రిలీజ్
-
ఆకట్టుకునేలా తేజ సజ్జా 'మిరాయ్' టీజర్
'హనుమాన్' సినిమాతో పాన్ ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా.. ఇప్పుడు మరోసారి సూపర్ హీరోగా అలరించేందుకు సిద్ధమైపోయాడు. 'మిరాయ్' మూవీతో రాబోతున్నాడు. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. అలానే మూవీ కొత్త రిలీజ్ తేదీని కూడా ప్రకటించారు.(ఇదీ చదవండి: సందీప్ వంగాకు దీపిక ఇన్ డైరెక్ట్ కౌంటర్?)తేజ సజ్జా హీరోగా నటిస్తున్న 'మిరాయ్'లో పవర్ఫుల్ విలన్‌గా మంచు మనోజ్ కనిపించబోతున్నాడు. టీజర్ అయితే బందోబస్తుగా ఉంది. ప్రభాస్ 'కల్కి' తరహాలో త్రేతా యుగం, కలియుగం మధ్య ఏదో లింక్ ఉన్నట్లు చూపించారు. విజువల్స్ మాత్రం టాప్ నాచ్ ఉన్నాయి. అలానే లొకేషన్స్ కూడా అదిరిపోయాయి.కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. తొలుత అనుకున్నట్లు ఆగస్టు 1న కాకుండా సెప్టెంబరు 5న ఏడు భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మరి తేజ సజ్జా ఈసారి హిట్ కొడితే.. పాన్ ఇండియా వైడ్ హీరోగా సెటిలైపోవచ్చు. విలన్‌గా మనోజ్ కూడా అంచనాలు పెంచేలా కనిపించాడు. చివర్లో రాముడి ఎంట్రీ ఉందన్నట్లు చూపించి ఆసక్తి పెంచారనే చెప్పొచ్చు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ బ్లాక్ బస్టర్ 'టూరిస్ట్ ఫ్యామిలీ' మూవీ) -
ముంబైలో మిరాయ్
ముంబై గుహల్లో తేజా సజ్జా సాహసాలు చేస్తున్నారు. ఎందుకంటే యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ ‘మిరాయ్’ కోసం. తేజా సజ్జా, రితికా నాయక్ జంటగా, మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్న సినిమా ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టులో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో సూపర్యోధగా తేజ కనిపిస్తారు.తాజాగా ‘మిరాయ్’ కొత్త షెడ్యూల్ షూటింగ్ చిత్రీకరణ ముంబైలోని చారిత్రక గుహల్లో ప్రారంభమైంది. తేజ , ఇతర ప్రధాన పాత్రధారులు ఈ షూటింగ్లో పాల్గొంటున్నారని మేకర్స్ తెలిపారు.‘‘మిరాయ్’ కోసం తేజా సజ్జ పూర్తీగా మేకోవర్ అయ్యారు. 2డీ, 3డీ ఫార్మాట్స్‌లో ఎనిమిది భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: గౌరహరి, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, క్రియేటివ్ప్రోడ్యూసర్: కృతీ ప్రసాద్. -
'మిరాయ్' ది సూపర్ యోధ విడుదలపై ప్రకటన
గత ఏడాదిలో విడుదలైన 'హనుమాన్' సినిమాతో హీరో తేజ సజ్జా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన తర్వాతి సినిమా 'మిరాయ్' పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ ప్రేక్షకులను మెప్పించాయి. దీంతో ఈ సినిమా విడుదల తేదీ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు మేకర్స్ గుడ్‌న్యూస్ చెప్పారు. ఈ క్రమంలో మిరాయ్ విడుదల తేదీని వారు ప్రకటించారు.'మిరాయ్' ది సూపర్ యోధ అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తేజ సజ్జా యోధుడిగా కనిపించనున్నారు. కార్తిక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్ణు నిర్మిస్తోంది. తెలుగుతోపాటు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, మరాఠీ భాషల్లో 2025 ఆగష్టు 1న 2D, 3D ఫార్మెట్లో ఈ మూవీని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రక్షా బంధన్, ఇండిపెండెన్స్ డేను టార్గెట్ చేస్తూ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.ఇందులో రితిక నాయక్ హీరోయిన్గా నటిస్తుండగా.. మంచు మనోజ్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండనుంది. మిరాయ్ అనేది అశోకుని కాలంలో రహస్యమైన ఓ శాసనం అని గతంలో డైరెక్టర్ కార్తిక్ చెప్పారు. దీని గురించి సినిమా విడుదల తర్వాత పూర్తిగా అందరికీ అర్థమవుతుందని ఆయన పేర్కొన్నారు. -
హనుమాన్ హీరో యాక్షన్ అడ్వెంచర్.. రిలీజ్ డేట్ ఇదే!
హనుమాన్ మూవీతో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్న హీరో తేజ సజ్జా. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలతో పోటీపడి బాక్సాఫీస్ వద్ద రాణించింది. అయితే తేజ సజ్జా ప్రస్తుతం మరో యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో నటిస్తున్నారు. ఆయన హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం మిరాయి. ఇవాళ తేజ బర్త్ డే కావడంతో మేకర్స్ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అంతేకాకుండా మూవీ విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఈ పాన్ ఇండియా చిత్రానికి ఘట్టంనేని కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే మిరాయి గ్లింప్స్ రిలీజ్ చేయగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. కాగా.. ఈ మూవీని ఎనిమిది భాషల్లో ఏప్రిల్ 18, 2025న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా.. ఈ చిత్రానికి గౌరహరి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో మంచు మనోజ్, రితికా నాయక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. Strap in for an adrenaline ride 😎The #SuperYodha is born 🥷⚡Team #MIRAI ⚔️ wishes the SUPER HERO, @tejasajja123 a very splendid birthday ❤️🔥Get ready to experience the Action-Adventure in cinemas on 18th APRIL 2025 ~ 2D & 3D🔥#HBDTejaSajja @HeroManoj1 @Karthik_gatta… pic.twitter.com/DXvScUy0DP— People Media Factory (@peoplemediafcy) August 23, 2024 -
‘మిరాయ్’ ది సూపర్ యోధ మూవీ ప్రెస్ మీట్ (ఫోటోలు)
-
యోధుడిగా మంచు మనోజ్.. 'మిరాయ్' గ్లింప్స్ విడుదల
తేజ సజ్జా యోధుడిగా నటిస్తున్న చిత్రం 'మిరాయ్' ది సూపర్ యోధ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ మూవీ తెరకెక్కుతుంది. కార్తిక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి 'ది బ్లాక్ స్వాడ్' గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతుంది.పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి మంచు మనోజ్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. బాలీవుడ్ హీరోకు ఏమాత్రం తగ్గకుండా ఇందులో ఆయన కనిపిస్తున్నారు. అసలుసిసలైన యోధుడిగా కత్తితో చేస్తున్న పోరాట సన్నివేశాన్ని చూపించారు. తెలుగుతోపాటు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, మరాఠీ భాషల్లో 2025 ఏప్రిల్ 18న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.మిరాయ్ అనేది అశోకుని కాలంలో రహస్యమైన ఓ శాసనం అని గతంలో డైరెక్టర్ కార్తిక్ చెప్పారు. దీని గురించి సినిమా విడుదల తర్వాత పూర్తిగా అందరికీ అర్థమవుతుందని ఆయన పేర్కొన్నారు.