యంగ్‌ హీరో తేజ సజ్జా అరుదైన ఘనత | Teja Sajja Rare Record On His Cinema Career | Sakshi
Sakshi News home page

యంగ్‌ హీరో తేజ సజ్జా అరుదైన ఘనత

Jun 19 2025 5:43 PM | Updated on Jun 19 2025 6:18 PM

Teja Sajja Rare Record On His Cinema Career

యంగ్‌ హీరో తేజ సజ్జా తన సినీ ప్రస్థానంలో అరుదైన ఘనతను సాధించారు.  బాల నటుడిగా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన తేజ..  చూడాలని వుంది, రాజకుమారుడు, కలిసుందాం రా, ఇంద్ర వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో తన నటనతో గుర్తింపు పొందారు. 2005లో వచ్చిన బోన్సాయ్ చిత్రానికి ఉత్తమ బాల నటుడిగా నంది అవార్డు అందుకుని తన టాలెంట్‌ను నిరూపించుకున్నారు.

ఇప్పుడు హీరోగా కూడా అదే స్థాయిలో విశేష గుర్తింపు పొందుతున్నారు. హనుమాన్ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో అభిమానాన్ని సంపాదించిన తేజ సజ్జా, మరో ప్రతిష్టాత్మక అవార్డు తన ఖాతాలో వేసుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 నుండి 2024 మధ్య విడుదలైన సినిమాలకు గద్దర్ సినీ పురస్కారాలను ప్రదానం చేసింది. అందులో భాగంగా, 2023కి గాను ఉత్తమ ద్వితీయ చిత్రం (బెస్ట్ సెకండ్ ఫిల్మ్) విభాగంలో తేజసజ్జా హనుమాన్ చిత్రం అవార్డును గెలుచుకుంది.

బాల నటుడిగా నంది అవార్డు, హీరోగా గద్దర్ పురస్కారం అందుకొని అరుదైన రికార్డు సాధించిన నటుడిగా నిలిచారు. ప్రస్తుతం తేజ మరో సూపర్ హీరో మూవీ మిరాయ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు అద్భుత స్పందన లభిస్తోంది. హనుమాన్ తరువాత తేజ నుంచి వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement