నేచురల్ స్టార్ హీరో నాని నిర్మాతగా, నితిన్ హీరోగా ఒక కొత్త సినిమా దాదాపు ఖరారైనట్టే సమాచారం. గత ఏడాది వచ్చిన ‘దండోరా’ చిత్ర దర్శకుడు మురళీకాంత్ చెప్పిన కథ నానికి నచ్చడంతో, తన సొంత బ్యానర్‌పై ఈ ప్రాజెక్టు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ పేరు వినిపిస్తోంది. ఇటీవల ఆమెతో ఈ చిత్రంపై చర్చలు జరిగాయి. అనంతరం రుక్మిణి నుంచి సరే చూద్దాం అన్న స్థాయిలోనే మాట ముగిసిందని సమాచారం. కానీ ఈ సినిమాలో నితిన్ సరసన రుక్మిణి వసంత్ ఫిక్స్ అయింది అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు వచ్చేశాయి.
ప్రస్తుతం నితిన్ ఓ సినిమా షూట్‌లో ఉన్నాడు. అక్టోబర్ నెల వరకు ఆయన బిజీగా ఉండే అవకాశం ఉంది. రుక్మిణి కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది. అక్టోబర్ నాటికి ఆమె తన కాల్షీట్లు సర్దుబాటు చేయగలనో లేదో అనే అనుమానం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టుపై ఇంతవరకు మాత్రమే చర్చలు జరిగాయి. అధికారికంగా దీనిపై రుక్మిణి ఎలాంటి హామీ ఇవ్వలేదు. నాని కూడా ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ షూట్‌లో ఉన్నాడు. మరో నెల రోజుల్లో ఆ సినిమా షూటింగ్ అయిపోతుంది. ఆ తర్వాతే ఈ కొత్త ప్రాజెక్టుపై స్పష్టత ఇవ్వనున్నాడు. ఆ తరువాతే రుక్మిణి వసంత్ ఈ సినిమాలో ఉంటుందో లేదో తేలిసే అవకాశం ఉంది.


