దినేష్ కుమార్, దివిజ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ చిత్ర ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కల్వకుంట్ల కవిత చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సినిమాకు సతీష్ ఆవాల దర్శకత్వం వహించారు.
కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు.


