టీడీపీ రౌడీల అరాచకం.. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లతో పోలీసుల ఓవరాక్షన్‌ | TDP Leaders Over Action In AP Local Body Elections | Sakshi
Sakshi News home page

టీడీపీ రౌడీల అరాచకం.. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లతో పోలీసుల ఓవరాక్షన్‌

Nov 29 2026 8:00 AM | Updated on Nov 29 2026 8:00 AM

TDP Leaders Over Action In AP Local Body Elections

సాక్షి, అనంతపురం: ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా టీడీపీ గూండాలు రెచ్చిపోతున్నారు. టీడీపీ బ్యాచ్‌కు పోలీసులు సపోర్టు ఇస్తూ వైఎస్సార్‌సీపీ నేతలు, ఏజెంట్లను అడ్టుకుంటున్నారు. దీంతో, పలు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతపురం, వైఎస్సార్, ప్రకాశం జిల్లాల్లో దాడులు, రిగ్గింగ్, పోలింగ్ ఏజెంట్ల తొలగింపు, ఓటర్లను అడ్డుకోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.

అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వర్గీయులు కొందరు పంచాయతీ ఎన్నికల సందర్భంగా దాడులకు పాల్పడ్డారు.  వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థిపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

వేంపల్లిలో రిగ్గింగ్ ఆరోపణలు.. 
వైఎస్సార్ జిల్లా వేంపల్లిలోని బాల సరస్వతి బంగ్లా పోలింగ్ బూత్‌తో పాటు బాలుర హైస్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద రిగ్గింగ్ జరుగుతోందని ఆరోపణలు వెల్లువెత్తాయి. క్యూ లైన్‌లో ఉన్న ఓటర్ల నుంచి స్లిప్పులు తీసుకుని దొంగ ఓట్లు వేస్తున్నారని టీడీపీ కార్యకర్తలు. ఓటు వేయడానికి వచ్చిన ప్రజలను వెనక్కి పంపుతున్నారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. బాలుర హైస్కూల్‌లోకి సుమారు 300 మంది టీడీపీ కార్యకర్తలు ప్రవేశించి దొంగ ఓట్లు వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే ప్రాంతంలో ఓటు వేయడానికి వచ్చిన ప్రజలను ఎస్సై రమేష్ బాబు వెనక్కి పంపుతున్నారంటూ విమర్శలు వ్యక్తమయ్యాయి.

వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను పోలీస్ స్టేషన్‌కు తరలింపు..
ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం బల్లికురవ మండలం ముక్తేశ్వరం పంచాయతీలోనూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ బూత్‌లలో విధులు నిర్వహిస్తున్న వైఎస్సార్‌సీపీకి చెందిన పది మంది ఏజెంట్లను పోలీసులు బలవంతంగా బల్లికురవ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. స్థానిక కూటమి నాయకులు వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బూత్‌ల నుంచి బయటకు పంపించారని, బల్లికురవ ఎస్సై నాగరాజు టీడీపీ కార్యకర్తలకు అనుకూలంగా వ్యవహరిస్తూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని ఆరోపణలు వ్యక్తమయ్యాయి.

ఐదు బూత్‌లలో రిగ్గింగ్..
వైఎస్సార్ జిల్లాలోని చింతలమడుగుపల్లెలో ఐదు పోలింగ్ బూత్‌ల వద్ద వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో ఐదుగురు ఏజెంట్లు గాయపడినట్లు సమాచారం. ఏజెంట్లను బూత్‌ల నుంచి బయటకు పంపించి, పోలింగ్ కేంద్రాలకు తాళాలు వేసుకుని రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. కాగా, ఎన్నికల వేళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల సందర్భంగా చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

ఇదీ చదవండి: ఓటు హక్కు కోసం కోర్టు మెట్లెక్కిన గ్రామస్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement