అమెరికాలో భూకంపం.. ఎయిర్‌పోర్టులో కలకలం! | Earthquake in us California | Sakshi
Sakshi News home page

అమెరికాలో భూకంపం.. ఎయిర్‌పోర్టులో కలకలం!

Nov 29 2026 7:56 AM | Updated on Nov 29 2026 7:56 AM

Earthquake in us California

కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియాలో భూకంపం కలకలం సృష్టించింది. రిక్టర్ స్కేలుపై 5.0 తీవ్రతతో భూమి కంపించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ప్రకంపనల ప్రభావం భూకంప కేంద్రానికి సుమారు 43 కిలోమీటర్ల దూరంలోని పసడీనాలోనూ కనిపించింది. భవనాల పైకప్పులపై ఉన్న టైల్స్ కదలడంతో పాటు దుకాణాల్లో వస్తువులు కిందపడినట్లు సమాచారం. భూకంపం ప్రభావంతో విమానాశ్రయంలోనూ పరిస్థితులు మారిపోయాయి. ల్యాండింగ్‌కు సిద్ధమైన విమానాలను వెనక్కి పంపాల్సి వచ్చింది.

విమానాశ్రయం సమీపంలో రిఫైనరీ మంటలు
భూకంపం సంభవించిన కొద్దిసేపటికే లాస్‌ఏంజెలిస్ విమానాశ్రయం సమీపంలోని షెవ్రాన్‌కు చెందిన ఎల్ సెగుండో రిఫైనరీ నుంచి మంటలు ఎగసిపడటం కలకలం రేపింది. అయితే ఈ మంటలకు భూకంపం కారణం కాదని అధికారులు స్పష్టం చేశారు. రిఫైనరీలో భద్రతా చర్యల్లో భాగంగా అదనపు వాయువును నియంత్రిత పద్ధతిలో దహనం చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. భూకంపం వంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ప్లాంట్‌లోని పరికరాలు ఆటోమేటిక్‌గా నిలిచిపోయి, అదనపు వాయువును ఇలా దహనం చేస్తాయని వివరించింది.

ఇంధన సరఫరాలో కీలకమైన రిఫైనరీ
దక్షిణ కాలిఫోర్నియా ఇంధన అవసరాల్లో ఎల్ సెగుండో రిఫైనరీ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ప్రాంతంలోని వాహనాలకు అవసరమైన ఇంధనంలో సుమారు 20 శాతం, విమాన ఇంధనంలో 40 శాతం ఈ రిఫైనరీ నుంచే సరఫరా అవుతున్నట్లు సమాచారం. 2025 అక్టోబర్‌లోనూ ఇక్కడ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భూకంపం వల్ల జరిగిన నష్టంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇదీ  చదవండి: Jharkhand: ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది దుర్మరణం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement