బీచ్‌లో ప్రపోజ్ చేసేటప్పడు జరభద్రం అని హెచ్చిరిస్తోంది ఈ ఘటన. చాలామటుకు లవర్స్, కాబోయే దంపతులు తమ భాగస్వామికి ప్రపోజల్ చేయడానికి అందమైన రెస్టారెంట్‌కి లేదా బీచ్‌కో వెళ్తారు సరదాగా. అది కామన్ కానీ..ఏమరపాటు మాత్రం తగదు. ఎందుకంటే ఏ క్షణంలో ఏం జరుగును ఎవరు ఊహించలేరు కదా. ఇదంతా ఎందుకంటే..పాపం ఒక వ్యక్తి తన ప్రియురాలికి బీచ్‌లో రొమాంటిక్‌గా ప్రపోజ్ చేస్తుండగా చేదు అనుభవం ఎదురైంది. మధుర జ్ఞాపకంగా మిగలాల్సిన ఆ క్షణాలు..తలుచుకుంటే బాధ కలిగించేలా చేదు అనుభవాన్ని ఎదుర్కొనాల్సి వచ్చింది.
అసలేం జరిగిందంటే..బీచ్‌లో కాలిఫోర్నియా జంటకు రొమాంటిక్ ప్రపోజల తీపీ చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. నవంబర్ 15(ఆదివారం) సూర్యస్తమయం సమయంలో శాన్‌క్లైమెంటెలోని కలాఫియా స్టేట్ బీచ్‌లో జేస్ హారిక్ తన ప్రియురాలు జోయీ మాటిన్సన్‌కు ప్రపోజ్ చేయడానికి మోకాలిపై కూర్చున్నప్పుడు ఒక శక్తిమంతమైన ల వచ్చి అతని చేతిలో ఉన్న నాలుగు క్యారెట్ల వజ్రపు ఉంగరాన్ని లాగేసింది.
దిగ్విజయంగా ప్రపోజ్ చేసి హారిక్ తన కాబోయే భాగస్వామి మాటిన్సన్‌ను తన చేతుల్లోకి ఎత్తకుందామని చూస్తుండగా..ఒక పెద్ద అల వారి ఆనందాన్ని పాడు చేసింది. ఈ మేరకు అందుకు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ..తన జీవితంలోని అత్యం బాధకరమైన క్షణంగా మారాయి ఆ రొమాంటిక్ క్షణాలు. ప్రకృతి మాతా, దయచేసి మా ఉంగరాన్ని మాకు ఇచ్చేయ్..స్కూబాలు వస్తున్నాయి అని క్యాప్షన్ జోడించి మరి ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ వీడియోని పంచుకున్నాడు. నిజానికి తాను అల బలంగా ఉందని గ్రహించే తన కాబోయే భార్యను ఎత్తుకున్నానని వెల్లడించారు.
అయితే జేబులో తమిద్దరి ఫోనులు, ఇంటి తాళాలు ఉండటంతో చేతితో ఆ ఉంగరపు బాక్స్‌ని పట్టుకున్నానని చెప్పారు. ఎల్‌నినో ప్రభావం ఉంది కాబట్టి ఆమె ఎక్కడ కొట్టుకుపోతుందోనని జాగ్రత్తపడితే..అనూహ్యంగా చేతలి ఉన్న ఉంగంర చేజారిపోయిందని తెలిపాడు. కానీ ఆ ఉంగరం కోసం తమతోపాటు అక్కడున్న ప్రజలు కూడా వెతికే పెట్టే సాయం చేశారని, ఆఖరికి మెటల్ డిటెక్టర్లు సాయం తీసుకున్నా..ఫలితం లేకుండా పోయిందని అన్నారు.
ఉంగరాన్ని కోల్పోవడం బాధకరమే అయినా..తన భాగస్వామి క్షేమంగా ఉన్నందకు కృతజ్ఞతతో ఉన్నాని హర్దిక్ అన్నారు. చిరగా హర్దిక్ అయిన మన నియంత్రణలేని వాటిని మనం ఎన్నటికి నియంత్రించలేమని తాను విశ్వాసిస్తానని, ఆమె క్షేమంగా ఉంది అదే చాలు అని పోస్ట్‌లో పేర్కొన్నాడు హార్దిక్. ఎంగేజ్‌మెంట్ ఉంగరాల తయారీలో ప్రత్యేకత కలిగిన న్యూయార్క్ ఆధారిత షాపు ఆ జంట కోసం ఆ ఉంగరాన్ని తిరిగి తయారు చేస్తామని ముందుకురావడం విశేషం.
ఇదీ చదవండి: బాలీవుడ్ పాటకు స్టూడెంట్స్‌తో కలిసి టీచరమ్మ స్టెప్పులు..!


