కృత్రిమంగా బీచ్‌ నిర్మాణం! | spain designs largest artificial beach in europe on outskirts of madrid | Sakshi
Sakshi News home page

కృత్రిమంగా బీచ్‌ నిర్మాణం!

Nov 15 2026 2:30 AM | Updated on Nov 15 2026 2:30 AM

spain designs largest artificial beach in europe on outskirts of madrid

సముద్ర తీరాల్లోని సువిశాల సైకత ప్రదేశాలు సహజంగా ఏర్పడతాయి. సముద్రంలోని చోట బీచ్‌ ఉండటం సాధ్యమేనా అనిపిస్తోందా? సహజంగానైతే సాధ్యం కాదు. అందుకే, స్పెయిన్‌ భారీ ఖర్చుతో సముద్ర తీరానికి దాదాపు 320 కిలోమీటర్ల దూరంలో కృత్రిమ బీచ్‌ నిర్మాణం చేపడుతోంది.

స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌ నగరానికి చేరువలో 5.2 ఎకరాల విస్తీర్ణంలో కృత్రిమ సరోవరాన్ని ఏర్పాటు చేసి, దాని చుట్టూ 16,000 చదరపు కిలోమీటర్ల మేరకు తెల్లని ఇసుక పరిచి, ‘క్రిస్టల్‌ లాగూన్స్‌’ సంస్థ ఈ బీచ్‌ నిర్మాణం చేపడుతోంది. దీని కోసం 29 మిలియన్‌ యూరోలు ఖర్చు చేస్తోంది.

ఈ బీచ్‌లో వాటర్‌ పార్క్, పిల్లలు ఈత కొట్టేందుకు ఈత కొలనులు, క్రీడా ప్రాంగణాలు వంటి నిర్మాణాలను కూడా చేపడుతోంది. ఈ బీచ్‌ను 2028లో ప్రారంభించనున్నట్లు ‘క్రిస్టల్‌ లాగూన్స్‌’ ప్రతినిధి ఫెర్నాండో ఫిష్‌మన్‌ ప్రకటించారు. ఈ బీచ్‌కు ఏటా 3.50 లక్షల మంది సందర్శకులు రావచ్చని ‘క్రిస్టల్‌ లాగూన్స్‌’ అంచనా. బీచ్‌లో ప్రవేశానికి టికెట్‌ ధరను 10 యూరోలుగా నిర్ణయించాలని అనుకుంటున్నట్లు ఫిష్‌మన్‌ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement