breaking news
Spain
-
ఫ్రాన్స్,స్పెయిన్‌లను దహిస్తోన్న కార్చిచ్చు
పారిస్: ఫ్రాన్స్,స్పెయిన్ సరిహద్దు ప్రాంతాల్లో భీకర కార్చిచ్చు దహించివేస్తోంది. ఇప్పటి వరకు రెండు దేశాల్లో 3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆదివారం గిరాండ్‌లో సుమారు 42వేల హెక్టార్ల మేర అడవి కాలిపోయింది. సమీప 240 ఇళ్లు కాలిపోయాయి. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించిన 75 మంది సిబ్బంది గాయపడ్డారు. 18 విమానాలు, హెలికాప్టర్లతో 2,500కి పైగా అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. బోర్డో నగర ప్రధాన రహదారిని పాక్షికంగా మూసేశారు. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ చుట్టుపక్కల కార్చిచ్చు వ్యాపించింది. స్పెయిన్‌లో 76వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వాలెన్సియా శివారు ప్రాంతం మనిసెస్లో కార్చిచ్చులో ఒకరు మరణించారు.ఓరెగాన్‌లో వ్యాపిస్తున్న కార్చిచ్చుఅమెరికాలోని ఓరెగాన్ రాష్ట్రం వార్మ్ స్ప్రింగ్స్ సమీపంలో బెంచ్ఫైర్ కార్చిచ్చు వేగంగా విస్తరిస్తోంది. దీంతో, ఆ ప్రాంత జెఫెర్సన్ కౌంటీ నివాసితులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలంటూ అధికారులు హెచ్చరికలు చేశారు. వార్మ్ స్ప్రింగ్స్ సమీపంలోని 26వ నంబర్ రహదారిని అధికారులు మూసివేశారు. -
ఫ్రాన్స్, స్పెయిన్‌లను చుట్టేసిన కార్చిచ్చు
ఆర్కకాన్ (ఫ్రాన్స్): యూరోపియన్ దేశాలు ఫ్రాన్స్, స్పెయిన్లు కార్చిచ్చుల సమస్యతో అట్టుడికిపోతున్నాయి. రెండు దేశాల్లోనూ కనీసం రెండు లక్షల అరవై వేల మందిని మంటల నుంచి రక్షించాల్సి రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మంటలను అదుపు చేయడం కష్టమైన నేపథ్యంలో శుక్రవారం ఫ్రాన్స్‌లోని బోర్డాక్స్, స్పెయిన్‌లోని మాడ్రిడ్ నగరాల పరిసరాల్లో గ్రామాలకు గ్రామాలు ఖాళీ అయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతోపాటు వాతావరణంలో వస్తున్న దీర్ఘకాలిక మార్పుల కారణంగా కార్చిచ్చులు చెలరేగిపోతున్నాయి. మంటలార్పేందుకు చేస్తున్న అన్ని ప్రయత్నాలు దాని తీవ్రత ముందు నెరవేరడం లేదని స్పెయిన్ అగ్నిమాపక దళ సిబ్బందికి చెందిన కొందరు అధికారులు వాపోయారు. అట్లాంటిక్ సముద్రతీర ప్రాంతంలోని పర్యాటక ప్రాంతంలో కార్చిచ్చుల నుంచి తప్పించుకునేందుకు పడవలు ఉపయోగించారని, గిరోండే, లాండెస్ ప్రాంతాల్లోనే సుమారు 1.97 లక్షల మంది ఇళ్లు వదిలి వెళ్లిపోయారని, స్పెయిన్ మధ్యప్రాంతంలో ఈ సంఖ్య అరవై వేల వరకూ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కార్చిచ్చులను అడ్డుకునే ప్రయత్నంలో పలువురు అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారని, అదృష్టవశాత్తూ ప్రాణనష్టమేదీ జరగలేదని ఫ్రాన్స్ అధికారులు తెలిపారు. ఫ్రాన్స్ నైరుతి దిక్కున కార్చిచ్చులు విశాలమైన ప్రదేశాన్ని సర్వనాశనం చేశాయని, ప్రస్తుతం అవి గిరోండి ప్రాంతంలోని బోర్డాక్స్ నగరం వైపు వెళుతున్నాయని ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి లారెంట్ నునేజ్ తెలిపారు. ఒక రోజు ముందు ఈ కార్చిచ్చు ఫెరెట్ ద్వీపకల్ప ప్రాంతంలో సుమారు 140 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి వ్యాపించిందని, ఫలితంగా గిరోండే ప్రాంతంలో లక్ష పదివేల మంది ఇళ్లు వదిలి వెళ్లిపోయారని వివరించారు. ఈ అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు సైనికులను రంగంలోకి దించాలని, పౌరులకు అన్ని రకాల సహాయ, సహకారాలు అందేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ ప్రధాని సెబాస్టియన్ లెకోర్నోను ఆదేశించారు. సహాయక చర్యలకు సాయపడాల్సిందిగా యూరోపియన్ దేశాలను అరి్థంచామని, క్రొయేíÙయా, పోర్చుగీస్లు మంటలార్పేందుకు పనికొచ్చే విమానాలను పంపుతున్నాయని మాక్రాన్ వివరించారు. చెక్ రిపబ్లిక్, స్లొవాకియాలు రెంఉడ బ్లాక్‌హాక్ హెలీకాప్టర్లను పంపుతున్నట్లు తెలిపారు. రంగంలో స్పెయిన్ సైనికులు... స్పెయిన్‌లో కార్చిచ్చులను అదుపులోకి తెచ్చేందుకు వేల మంది సైనికులు ప్రయత్నిస్తున్నట్లు ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి ఫెర్నాండో గ్రాండే మార్లస్కా తెలిపారు. దేశంలో ఇప్పటికే ఎమర్జెన్సీ ప్రకటించామని చెప్పారు. స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ కార్చిచ్చులతో నాశనమైన ప్రాంతాలను, కమాండ్ సెంటర్‌ను శనివారం సందర్శించారు. గత దశాబ్దకాలంలో ఏటా సుమారు లక్ష ఎకరాల ప్రాంతం కార్చిచ్చులకు బలవుతుంటే ఈ ఏడాది అది మరో 30 వేల ఎకరాలు ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు. రెండు వేర్వేరు ప్రాంతాల్లోని కార్చిచ్చులు మాడ్రిడ్ ప్రాంతంలో కలిసిపోవడంతో అక్కడ మంటల తీవ్రత పెరిగిందని, సుమారు 30 చదరపు కిలోమీటర్ల మేర ప్రాంతం ప్రభావితమైందని స్థానిక అధికారి ఇసబెల్ డియాజ్ అయుసో తెలిపారు. ఈ ఒక్క ఏడాదిలోనే స్పెయిన్‌లో కార్చిచ్చుల కారణంగా సుమారు 130000 హెక్టార్ల విస్తీర్ణంలోని ప్రదేశం నాశనమైంది. -
ఫీఫా ట్రోఫీ నెత్తుకున్న యువరాణి, ఎవరీ మనోహరి : ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
స్పెయిన్ చరిత్రలో ఆసక్తికర పరిణామం కొత్త చరితను లిఖించనుంది. దాదాపు 150 సంవత్సరాల విరామం తర్వాత అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. 20 ఏళ్ల లియోనోర్ డి టోడోస్ లాస్ శాంటోస్ డి బోర్బోన్ వై ఓర్టిజ్ ఆ దేశ సింహాసనాన్ని అధిష్టించనున్న తొలి మహిళగా చరిత్ర సృష్టించనున్నారు. 150 ఏళ్లకు పైగా కాలంలో స్పెయిన్‌ను పాలించబోతున్న తొలి మహారాణి ఈమే కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోన్న ఈ పరిణామం గురించి తెలుసుకుందామా. 2026 ఫీఫా ప్రపంచ కప్ పోరులో అర్జెంటీనాతో జరిగిన ఫైనల్ ఫుట్‌బాల్ తర్వాత స్పెయిన్‌కు చెందిన లామిన్ యమాల్‌తో కలిసి స్పెయిన్ యువరాణి లియోనోర్ , యువరాణి సోఫియా ఫీఫా ప్రపంచ కప్ ట్రోఫీని ఎత్తుకున్నారు. దీంతో యువరాణిపై మరింత ఆసక్తి పెరిగింది. స్పెయిన్ అస్టూరియాస్ రాజకుమారి (Princess of Asturias) ఓర్తిజ్ వేల్స్‌లోని యూడబ్ల్యూసీ అట్లాంటిక్ కాలేజ్ నుండి ఇంటర్నేషనల్ బాకలారియేట్ పట్టా పొందారు. స్పెయిన్ సాయుధ దళాలలోని మూడు విభాగాలలోనూ మూడేళ్ల సైనిక శిక్షణను ఆమె ఇప్పుడే పూర్తి చేశారు. ఇటీవల స్పెయిన్‌కు చెందిన మూడు రక్షణ దళాలలో (ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్) మూడేళ్ల సైనిక శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఎనిమిది భాషల్లో ఆమెమాట్లాడగలదు.వారసత్వ చట్టం, రాజకుమారిస్పెయిన్ 1978 రాజ్యాంగంలోని ఆర్టికల్ 57 ప్రకారం, వారసత్వంలో మగపిల్లలకు ప్రాధాన్యం ఉంటుంది. దీని ప్రకారం పెద్ద సంతానం వారసత్వంగా పొందుతారు. అలా ప్రస్తుత రాజు ఫెలిపే VI, తన కంటే పెద్దవారైన ఇద్దరు అక్కలను కాదని రాజు అయ్యారు.2005లో లియోనోర్, 2007లో ఇన్ఫాంటా సోఫియా జన్మించారు. అయితే వారసత్వ చట్టం ప్రకారం ఒకవేళ లియోనోర్‌కు తమ్ముడు పుట్టి ఉంటే, ఈమె స్థానాన్ని ఆ తమ్ముడు ఆక్రమించేవాడు. ఈ నేపథ్యంలోనే లియోనోర్ వారసత్వ స్థానాన్ని కాపాడటానికే రాజు దంపతులు మూడో సంతానం వైపు వెళ్ళలేదని అంచనాలు కూడా ఉన్నాయి.ప్రస్తుతం రాజు ఫెలిపే VI, రాణి లెటిజియా దంపతుల పెద్ద కుమార్తె యువరాణి లియోనోర్ భవిష్యత్ రాణిగా సిద్ధమవుతోంది. ఆమె సింహాస నారోహణతో, స్పానిష్ రాజవంశంలో కొత్త అధ్యాయం మొదలుకానుంది. అరుదైన సైనిక శిక్షణ2023 అక్టోబర్‌లో తన 18వ పుట్టినరోజున పార్లమెంట్ ఎదుట రాజ్యాంగానికి విధేయురాలిగా ఉంటానని ప్రమాణం చేశారు. తండ్రి బాటలోనే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో కఠిన శిక్షణ పొందారు. యుద్ధ విమానాలు నడపడం నేర్చుకున్నారు. అంతేకాదు పారాచ్యూట్ కోర్సు పూర్తి చేసిన ఏకైక రాజకుటుంబ సభ్యురాలిగా నిలిచారు. 2026 జూలై నాటికి ఈ శిక్షణను పూర్తి చేసుకుని 'గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఏరోనాటికల్ మెరిట్' పురస్కారాన్ని పొందారు.సెప్టెంబర్ నుండిమాడ్రిడ్లోని 'కార్లోస్ III విశ్వవిద్యాలయం'లో నాలుగేళ్ల పొలిటికల్ సైన్స్ డిగ్రీని ప్రారంభించ నున్నారు. రాజవంశ బాధ్యతలు నిర్వహిస్తూనే ఈమె చదువును కొనసాగించనున్నారు. ఇదే కోర్సును ఆమె సోదరి సోఫియా కూడా అభ్యసిస్తోంది. ఇక స్పెయిన్‌ను చివరిగా పాలించిన మహిళ రాణి ఇసాబెల్లా II. ఆమె పాలన 1868లో ముగిసింది. ఆమె తర్వాత మళ్లీ స్పెయిన్ సింహాసనాన్ని అధిష్టించబోతున్న మహిళా పాలకురాలు రాజకుమారి లియోనోర్ కావడం విశేషం.ఇదీ చదవండి: ఒకే కాన్పులో నలుగురు అమ్మాయిలు : 10 సీటర్ కారు కావాలియువరాణి లియోనోర్ సైనిక శిక్షణలో ఇప్పటికే పలు చారిత్రక మైలురాళ్లను అధిగమించారు. నావికా శిక్షణలో భాగంగా జువాన్ సెబాస్టియన్ డి ఎల్కానో నౌక సిబ్బందితో కలిసి అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా సుమారు 17 వేల మైళ్ళ ప్రయాణం చేశారు. అంతేకాదు, బ్లాస్ డిలెజో అనే యుద్ధనౌకపై కూడా సేవలందించారు. ఇక విమానయాన శిక్షణలోనూ ప్రత్యేక రికార్డులు ఆమె సొంతం. 2025లో పిలాటస్ PC-21 విమానాన్ని ఒంటరిగా నడిపిన తొలి స్పానిష్ యువరాణిగా చరిత్రలో నిలిచారు. అలాగే రాబోయే కొన్నేళ్లలో రాజ్యాంగపరమైన బాధ్యతలను స్వీకరిస్తుందని భావిస్తున్నారు. దీంతో స్పెయిన్‌కు శక్తివంతమైన రాణిగా, సింహాసనారోహణ కోసం ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.ఇదీ చదవండి: రూ. 5 లక్షల వెండి పాత్ర పొరపాటున చెత్తలో.. చివరికి -
FIFA World Cup 2026 : స్పెయిన్ యువ సంచలనం లమీన్ యమాల్ (ఫొటోలు)
-
ఎనిమిదో వింత.. ఫిఫా కప్పుతో వస్తే టమాటలతో సత్కారమా!
ఒక దేశం తరఫున క్రీడాకారులు లేదా జట్లు ఏదైనా చాంపియన్‌షిప్ లేదా ట్రోఫీలు కొల్లగొడితే సత్కారాలు, సన్మానాలతో హడావిడి చేస్తుంటారు. మన భారత్ కూడా ఇందుకు అతీతమేమి కాదు. కానీ స్పెయిన్‌లోని ఒక ప్రావిన్స్‌లో మాత్రం అక్కడి నుంచి ఏ ఆటగాడు ఎంత పెద్ద ఘనత సాధించినా పూలతో స్వాగతాలు, శాలువాలతో సన్మానాలు గట్రా చేయరు. దీనికి బదులుగా అక్కడి సంప్రదాయం ప్రకారం ఆటగాళ్ల బరువుకు సమానంగా టమాటలను ఇచ్చి సత్కరించడం ఆనవాయితీగా వస్తోంది. తాజాగా ఫిఫా గెలిచిన స్పెయిన్ జట్టులో సభ్యులైన మిడ్ఫీల్డర్స్ గావీ, పాబియానా రూయిజ్లను ఇదే తరహాలో సత్కరించడంతో వినూత్న సంప్రదాయం వెలుగులోకి వచ్చింది.ఫిఫా ప్రపంచకప్ చాంపియన్‌గా నిలిచిన స్పెయిన్ స్వదేశంలో ఘనస్వాగతం లభించింది. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో 20 లక్షలకు పైగా అభిమానులు ఒక్కచోట చేరి స్పెయిన్ విజయోత్సవాల్లో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. 16 ఏళ్ల తర్వాత రెండో ఫిఫా టైటిల్ సాధించిన స్పెయిన్ జట్టు ఆటగాళ్లకు అభిమానులు నీరాజనాలు పట్టారు. దీనికి సంబంధించిన సెలబ్రేషన్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరలయ్యాయి. అయితే స్పెయిన్ మిడ్ ఫీల్డర్స్ ఫాబియన్ రూయిజ్, పాబ్లో గవీరా (గవీ)లకు తమ ఫ్రావిన్స్ అయిన లాస్ పలాసియోస్ వై విల్లాఫ్రాంకా పాలకమండలి కూడా వినూత్నరీతిలో స్వాగతం పలికింది. ఆటగాళ్ల బరువుకు సమానంగా టమాటాలను వారికి అందించడం వైరల్‌గా మారింది.పురాతన సంప్రదాయం..కాగా ఈ ప్రావిన్స్‌లో టమాట పంట అధికంగా ఉంటుందట. అందుకే ఆ ప్రావిన్స్ నుంచి ఎవరు ఎలాంటి గొప్ప పనులు లేదా ప్రావిన్స్‌కు గౌరవం తెచ్చే పనులు చేస్తే టమాటాలను గిఫ్ట్‌గా అందిస్తారట. ఇలా చేస్తే వారి వ్యాపారం బాగుంటుందని వారి నమ్మకం. తాజాగా ఫిఫా ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యులుగా ఉన్న రూయిజ్, గావీలను ఇలా సత్కరించారు. అంతేకాదు వీరి ప్రావిన్స్‌లోని నగ2రంలో ఉన్న రెండు ఫుట్‌బాల్ మైదానాలకు వీరిద్దరు పేర్లు పెట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆ స్టేడియాలకు మారిస్మస్, సాన్ సెబాస్టియన్ అనే పేర్లు ఉన్నాయి. ఫాబియానా రూయిజ్ లాస్ పాలాసియోస్ తరఫున ఫుట్‌బాల్ కెరీర్‌ను ప్రారంభించగా, ఆరేళ్ల వయసులోనే గావి లాలి లైయరా బాలోంపె తరఫున ఫుట్‌బాల్ ఆడడం ప్రారంభించాడు. ఇక ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ 1-0 తేడాతో అర్జెంటీనాపై విజయాన్ని సాధించి రెండోసారి ఫిఫా టైటిల్‌ను అందుకుంది. ▶️Esto ya es tradicional en Los Palacios y Villafranca🍅Gavi y Fabián Ruiz reciben su peso en tomates📹@AlvarooSVQ @ZonaMixta__ pic.twitter.com/PyPKDOk99U— BeSoccer (@besoccer_ES) July 21, 2026 Read: అచ్చొచ్చిన గేమ్స్ తొలగింపు.. కామన్వెల్త్లో భారత్ షెడ్యూల్ ఇదే -
చిరిగిన బూట్లతో మొదలై.. పేదరికం నుంచి ప్రపంచ ఛాంపియన్ గా
-
‘నిజమే సైకోలా ప్రవర్తించాడు కానీ శిక్షించొద్దు’
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత స్పెయిన్, అర్జెంటీనా ఆటగాళ్లు తన్నుకున్న సంగతి తెలిసిందే. అర్జెంటీనా ఆటగాడు లియాండ్రో పరేడెస్ స్పెయిన్ ఆటగాళ్ల మీదకు కోపంతో దూసుకొచ్చాడు. తన ఎదురుగా ఉన్న ఎరిక్ గార్సియాపై పిడిగుద్దులు కురిపించాడు. అడ్డువచ్చిన మరో ప్లేయర్ గావి గొంతు పట్టుకొని అతడిని నేలపై పడేశాడు. విచక్షణ కోల్పోయి పశువులా ప్రవర్తించిన లియాండ్రో పరేడెస్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. లియాండ్రోపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తులు కూడా వచ్చాయి. అయితే లియాండ్రోపై ఎలాంటి చర్యలు తీసుకుంటామన్నది ఫిఫా ఇంకా తెలపనప్పటికీ స్పెయిన్ స్టార్ గావి మాత్రం లియాండ్రోను శిక్షించవద్దని పేర్కొనడం ఆసక్తి కలిగించింది. ‘లియాండ్రో ఓటమి నైరాశ్యంలో సైకోలా మారిపోయి మాపై దాడి చేశాడు. కానీ ఫుట్‌బాల్ ఆటలో ఇలాంటి గొడవలు సహజమని, ఓటమి బాధలో ఒక్కోసారి ఆటగాళ్లు లయతప్పి తాము ఏం చేస్తున్నామో కూడా మరిచిపోతారు. అందుకే లియాండ్రోను కఠినంగా శిక్షించవద్దని కోరుతున్నా. అంతగా శిక్ష వేయాలనుకుంటే అతడు భవిష్యత్తులో ఆడబోయే మ్యాచ్‌ల్లో ఆట మధ్యలో మైదానం నుంచి తొలగిస్తే సరిపోతుంది.’ అని తెలిపాడు. నిజానికి పరేడెస్ హింసాత్మక చర్యకు పాల్పడడం వల్ల అతడు కనీసం మూడు మ్యాచ్‌లు నిషేధం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.ఇక మ్యాచ్ విషయానికొస్తే ఫైనల్లో ఆట అదనపు సమయం 106వ నిమిషంలో ఫెర్రాన్ టోర్రెస్ కొట్టిన గోల్‌తో, డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై స్పెయిన్ 1-0 తేడాతో నాటకీయ విజయాన్ని అందుకుంది. 16 ఏళ్ల తర్వాత స్పెయిన్ రెండో ఫిఫా టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. ఫిఫా చాంపియన్స్‌గా నిలిచిన తర్వాత స్వదేశంలో అడుగుపెట్టిన స్పెయిన్‌కు ఘన స్వాగతం లభించింది. 20 లక్షల మంది అభిమానుల సమక్షంలో స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో విజయోత్సవ సంబరాలు జరిగాయి. 💣🇦🇷 GAVI SOBRE LA AGRESIÓN QUE RECIBIÓ DE PAREDES EN LA FINAL ESPAÑA-ARGENTINA:💥 “No creo que deba ser suspendido. Lo lógico hubiese sido expulsarle en el partido”👊🏼 “No es una imagen para los niños pero creo que hay esa parte de fútbol que es un poco más violenta”📹… pic.twitter.com/ZaSrjPUmQm— Zona Mixta (@ZonaMixta__) July 21, 2026Read: హండ్రెడ్ లీగ్‌లో ముంబై, సన్‌రైజర్స్ అరుదైన ఫీట్! -
స్పెయిన్ నంబర్‌వన్.. ర్యాంకింగ్స్‌లో మొరాకో, నార్వే సంచలనం
ఫిఫా ప్రపంచకప్ 2026 టైటిల్ గెలుచుకున్న స్పెయిన్ జట్టు మరోసారి నంబర్‌వన్ ర్యాంకును అందుకుంది. ఫైనల్ మ్యాచ్ తర్వాత ఫిఫా అధికారికంగా ర్యాంకులను విడుదల చేసింది. చాంపియన్‌గా నిలిచిన స్పెయిన్ నంబర్‌వన్ స్థానానికి చేరుకోగా, రన్నరప్‌గా నిలిచిన అర్జెంటీనా రెండో స్థానానికి పడిపోయింది. Photo Credit: FIFA Twitterర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పులు లేనప్పటికీ, ఈసారి ఫిఫాలో క్వార్టర్ ఫైనల్ వరకు చేరుకున్న మొరాకో, నార్వే జట్లు మాత్రం సంచలనం సృష్టించాయి. ఫిఫా చరిత్రలోనే మొరాకో తొలిసారి టాప్-10లో చోటు దక్కించుకుంది. క్వార్టర్స్‌లో ఓడిన మొరాకో ఆరో స్థానంలో నిలిచింది. ఎర్లింగ్ హాలండ్ సారథ్యంలోని నార్వే కూడా ర్యాంకింగ్స్‌లో సత్తా చాటింది. ఈ ఫిఫాలో క్వార్టర్స్ చేరుకొని చరిత్ర సృష్టించిన నార్వే 12 స్థానాలు ఎగబాకి 19వ స్థానం (టాప్-20)లో నిలిచింది.Photo Credit: FIFA Twitterఇక కాంస్యం గెలిచిన ఇంగ్లండ్ మూడో స్థానంలో, ఫ్రాన్స్ నాలుగో స్థానంలో ఉన్నాయి. ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటిబాట పట్టిన పోర్చుగల్ రెండు స్థానాలు దిగజారి ఏడో స్థానానికి పడిపోగా, అదే సమయంలో బ్రెజిల్ ఐదో స్థానానికి చేరుకుంది. ఇక బెల్జింయం, నెదర్లాండ్స్, మెక్సికో వరుసగా ఎనిమిది, తొమ్మిది, పది స్థానాలు దక్కించుకున్నాయి. ఫిఫా 2026లో పేలవ ప్రదర్శన కనబరిచిన మాజీ చాంపియన్ జర్మనీ మాత్రం టాప్-10లో చోటు కోల్పోయి 12వ స్థానంలో నిలవగా, క్రొయేషియా 13వ స్థానంలో ఉంది. ఇక ఈసారి ఫిఫాలో సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్న అనామక జట్టు కేప్‌వెర్డె 8 స్థానాలు ఎగబాకి 64వ స్థానంలో నిలిచింది. ఈ ఫిఫాలో కేప్‌వెర్డె ప్రిక్వార్టర్స్ వరకు చేరుకున్న సంగతి తెలిసిందే.చదవండి: అర్జెంటీనా ఓటమి.. మెస్సీ భావోద్వేగ లేఖ -
అర్జెంటీనా ఓటమి.. మెస్సీ భావోద్వేగ లేఖ
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో స్పెయిన్ చేతిలో ఓటమి తర్వాత అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ తొలిసారి స్పందించాడు. వరుసగా రెండోసారి ఫిఫా గెలవాలనుకున్న అతడి కలలను స్పెయిన్ ఆవిరి చేయడంతో మైదానంలోనే చిన్న పిల్లాడిలా మారిపోయి వెక్కివెక్కి ఏడ్చాడు. ఇది చూసిన అభిమానులు కూడా కన్నీటిపర్యంతమయ్యారు. అయితే ఫైనల్ ముగిసిన ఒకరోజు తర్వాత మెస్సీ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా భావోద్వేగ లేఖను పంచుకున్నాడు. 'ఫలితం చూసిన తర్వాత చాలా బాధేసింది. ఈ గాయం మానడానికి సమయం పడుతుంది. కానీ ఏదైనా అంతా మంచే జరగాలనే దానికే నేను కట్టుబడి ఉంటాను.' అని మెస్సీ ఎమోషనల్‌గా రాసుకొచ్చాడు.'ప్రతీ మ్యాచ్‌లో ప్రాణం పెట్టి ఆడామనే అనుకుంటున్నాం. ఈ ఫిఫా టోర్నీలో మా దేశ ప్రజలు ప్రతీ విషయంలో మాకు అండగా నిలవడంతో వారి మద్దుతుతోనే కష్టపడ్డాం. ఫైనల్ దాకా చేరుకున్నాం. జట్టు కృషి, ప్రయత్నం కలగలిసి అర్జెంటీనాను ప్రపంచంలోనే అత్యుత్తమ జట్లలో ఒకటిగా నిలబెట్టిందని బలంగా చెప్పగలను. ఇవాళ ఓటమితో మనం సాధించిన విజయాన్ని చెప్పుకోవడం కష్టమే. కానీ వరుసగా రెండు ఫిఫా ప్రపంచకప్పుల్లో అర్జెంటీనా ఫైనల్ చేరిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మాకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి (అర్జెంటీనాతో పాటు మిగతా దేశాలు) పేరు పేరునా ధన్యవాదాలు చెబుతున్నా. మనమంతా ఎప్పటికీ ఇలానే ఐక్యంగా ఉంటూ అర్జెంటీనా ఖ్యాతిని కాపాడుకుందాం. ఇక చాంపియన్‌గా నిలిచిన స్పెయిన్‌కు కూడా నా ప్రత్యేక అభినందనలు' తెలుపుతూ లేఖను ముగించాడు.2026 ఫిఫా ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన అర్జెంటీనాను మెస్సీనే మరోసారి అన్నీ తానై నడిపించాడు. ఆడిన ప్రతీ మ్యాచ్‌లో (ప్రి-క్వార్టర్ ఫైనల్ వరకు) కనీసం ఒక్క గోల్ అయినా కొట్టిన మెస్సీ గోల్డెన్ బూట్ రేసులోను దూసుకెళ్లాడు. 9 మ్యాచ్‌ల్లో 8 గోల్స్, 4 అసిస్ట్‌లతో సిల్వర్ బూట్‌ను కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో దుర్భేద్యమైన స్పెయిన్ ఫార్వార్డ్ ప్లేయర్లను అడ్డుకోవడమే సరిపోవడంతో మెస్సీ కూడా ఏం చేయలేకపోయాడు. ఒకవేళ ఈసారి అర్జెంటీనా ఫిఫా టైటిల్‌ను గెలిచి ఉంటే, ఆ మరుక్షణమే మెస్సీ ఆటకు వీడ్కోలు పలికేవాడేమో. ప్రస్తుతం తన రిటైర్మెంట్పై మౌనమే వహించినప్పటికీ 2030 ఫిఫాలో మెస్సీ ఆడడం అనుమానమే. కాబట్టి ఫుట్‌బాల్‌లో ఒక శకం దాదాపు ముగిసినట్లే. 🚨🚨📲 Leo Messi on IG: "The pain is immense, and it will take time for this wound to heal. "But I also choose to hold on to all the good things, the matches we turned around by giving everything, moments that will remain in our memories forever and the support of an entire… pic.twitter.com/3ZL4yFKhmA— All About Argentina 🛎🇦🇷 (@AlbicelesteTalk) July 20, 2026 ESTE ULTÚIMO TANGO Una de las cosas más hermosas del fútbol es tener a Lionel Andrés Messi y su participación en todos los Mundiales. Gracias por todo lo que has logrado con la selección: récords, logros y campeonatos Gracias por cada momento de alegría que compartimos con la… pic.twitter.com/6GYfKBKpnz— AR (@ionlylei) July 20, 2026Lionel Messi, Arjantin taraftarlarının tezahüratıyla duygulanıyor. pic.twitter.com/FkN2VjlUSm— Messi Anıları (@messianilari) July 19, 2026చదవండి: బుడ్డోడా మజాకా.. సవతి సోదరుడైనా తమ్ముడంటే ప్రాణం! -
కిక్ ఎక్కించింది...
ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన ఫుట్‌బాల్ క్రీడ మెగా ఈవెంట్ సూపర్ సక్సెస్ అయింది. అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన 23వ ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీకి భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున తెరపడింది. 39 రోజులపాటు 48 జట్ల మధ్య 104 మ్యాచ్‌లు జరిగాయి. స్పెయిన్, అర్జెంటీనా జట్ల మధ్య న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఫైనల్ ఏకపక్షంగా ముగిసినా... మ్యాచ్ విరామ సమయంలో జరిగిన కార్యక్రమాలు కట్టిపడేశాయి. షకీరా, మడోన్నా, బీటీఎస్, స్పీడ్, జస్టిన్ బీబెర్లాంటి స్టార్స్‌తో కార్యక్రమం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ టోర్నీలోని మ్యాచ్‌లను ఏకంగా 68,10,966 ప్రేక్షకులు మైదానంలోకి వచ్చి ప్రత్యక్షంగా వీక్షించడం ఓ కొత్త రికార్డు. నాలుగేళ్ల తర్వాత జరిగే 24వ ప్రపంచకప్ టోర్నీకి 2030లో స్పెయిన్, పోర్చుగల్, మొరాకో దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. 2030లో ప్రపంచకప్ టోర్నీకి 100 ఏళ్లు పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో తొలి ప్రపంచకప్ టోర్నీకి ఆతిథ్యమిచ్చిన ఉరుగ్వే, రన్నరప్‌గా నిలిచిన అర్జెంటీనా, పరాగ్వే మూడు సెంటీనరీ మ్యాచ్‌లకు వేదికగా నిలుస్తాయి. ఫలితంగా స్పెయిన్, పోర్చుగల్, మొరాకో, ఉరుగ్వే, పరాగ్వే, అర్జెంటీనా దేశాలు 2030 ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత సాధించాయి. 2030 ప్రపంచకప్‌ను 64 దేశాలతో నిర్వహించాలని అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) భావిస్తోంది. దీనిపై తుది నిర్ణయం రాబోయే రోజుల్లో తీసుకుంటారు. -
సాహోరే స్పెయిన్
అంచనాలకు మించి మెరిపించిన స్పెయిన్ జట్టు రెండోసారి జగజ్జేతగా నిలిచింది. తుది సమరంలో ఆద్యంతం పక్కా ప్రణాళికతో ఆడుతూ డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా జట్టు ఆట కట్టించింది. సగర్వంగా ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఒక్కొక్కరు కాదు జట్టుగా ఆడితే ప్రపంచాన్ని జయించవచ్చని స్పెయిన్ నిరూపించింది. మొదట్లో వెనుకబడినా చివర్లో చెలరేగిపోతూ విజయాన్ని లాగేసుకుంటున్న అర్జెంటీనాకు తుది పోరులో స్పెయిన్ ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. నిర్ణిత 90 నిమిషాల్లో గోల్ చేయలేకపోయినా... అదనపు సమయంలో స్పెయిన్ సక్సెస్ సాధించింది. 106వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్ ఫెరాన్ టోరెస్ గోల్‌తో స్పెయిన్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత కూడా తమ జోరును కొనసాగించి అర్జెంటీనాకు నిరాశను మిగిల్చింది. 16 ఏళ్ల తర్వాత స్పెయిన్ విశ్వవిజేత కావడంతో ఆ దేశం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. సోమవారం స్వదేశానికి వచ్చిన ప్రపంచకప్ వీరులకు ఆ దేశం బ్రహ్మరథం పట్టింది. తిరుగులేని ఆధిక్యం... ఫైనల్లో అర్జెంటీనాపై స్పెయిన్ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. ఆట ఆరంభమైన దగ్గరి నుంచి దాదాపు మ్యాచ్ ముగిసే వరకు బంతి స్పెయిన్ నియంత్రణలోనే ఉంది. ఈజిప్‌్ట, ఇంగ్లండ్‌లతో మ్యాచ్‌ల తరహాలో అర్జెంటీనా ఆఖర్లో కోలుకుంటుందని అందరూ భావించినా... స్పెయిన్ అసలు అలాంటి అవకాశమే ఇవ్వలేదు. తుది పోరులో జట్టు సభ్యులు ఒకరికొరకు ఏకంగా 853 పాస్‌లు ఇచ్చుకున్నారంటే, ప్రత్యర్థికంటే కనీసం 400 సార్లు ఎక్కువగా బంతిని ‘టచ్’ చేశారంటేనే స్పెయిన్ ఎలా బంతిపై పట్టు నిలబెట్టుకుందో అర్థమవుతుంది. ముఖ్యంగా ముగ్గురు ప్లేయర్లు కుబార్సి, లాపోర్ట్, రోడ్రి మధ్యనే బంతి తిరుగాడింది. ఇద్దరు డిఫెండర్లు, మిడ్‌ఫీల్డర్ కలిపి ఫైనల్లో 359 సార్లు బంతిని ‘టచ్’తో తమ మధ్యే ఉంచుకున్నారు. టోర్నీ మొత్తంలో ఒకే ఒక గోల్ ఇవ్వడం జట్టు ఆధిపత్యాన్ని సూచిస్తోంది. టీమ్ మొత్తం 20 షాట్లు ఆడగా... 12 నేరుగా లక్ష్యంవైపే వెళ్లాయి. ఫైనల్ స్కోర్ 1–0తో చూస్తే మ్యాచ్ హోరాహోరీగా సాగిందేమో అనిపిస్తుంది. కానీ ఇది పూర్తిగా వాస్తవ విరుద్ధం. ఒక జట్టు మాత్రమే పూర్తి ఏకపక్షంగా మ్యాచ్‌లో నిలిచింది. ఏకైక గోల్ సాధించిన ఫెరాన్ టోరెస్‌తో పాటు ఈ గోల్లో అతనికి సహకరించిన పెడ్రో పొరోస్, నికో విలియమ్స్... ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించిన మికెల్ మెరీనో, కెపె్టన్ రోడ్రి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. ఇక గోల్‌కీపర్ యునై సైమన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏడు మ్యాచ్‌లలో ‘క్లీన్ షీట్’తో అతను జట్టును కాపాడిన తీరు నిజంగా సూపర్.వరుస టైటిల్స్ జోరు... రెండేళ్ల క్రితం బెర్లిన్‌లో యూరోపియన్ చాంపియన్‌షిప్ గెలుచుకున్న స్పెయిన్ ఇప్పుడు ప్రపంచకప్ విజేతగా నిలిచింది. 2008లో కూడా సరిగ్గా ఇదే తరహాలో యూరోప్ విజేతగా నిలిచిన రెండేళ్లకు ప్రపంచ కప్‌ను సొంతం చేసుకుంది. నేషన్స్ లీగ్, అండర్–23 ఒలింపిక్ స్వర్ణం, అండర్–19 యూరోపియన్ చాంపియన్‌షిప్‌లతో కలిపితే గత ఐదేళ్లలో స్పెయిన్ పురుషుల జట్టు 5 పెద్ద టోరీ్నల్లో విజేతగా నిలవడం విశేషం. వీటికి తోడు 2023లో మహిళల ఫుట్‌బాల్ వరల్డ్ కప్ కూడా సాధించిన స్పెయిన్...రెండు విభాగాల్లో ఒకే సారి ప్రపంచ కప్‌ను తమ వద్ద ఉంచుకున్న తొలి జట్టుగా నిలిచింది. దీనిని బట్టి చూస్తే ఫుట్‌బాల్‌లో స్పెయిన్ ఎంత నిలకడగా, ఘనంగా రాణిస్తుందో అర్థమవుతుంది. చేతులెత్తేసిన అర్జెంటీనా... వరల్డ్ కప్ చరిత్రలో ఫైనల్ మ్యాచ్‌లో నిర్ణీత సమయం 90 నిమిషాల వరకు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై ఒక్క షాట్ కూడా ప్రయత్నించని మొదటి జట్టుగా అర్జెంటీనా నిలిచింది! 117వ నిమిషంలో గానీ తొలి షాట్ కొట్టని జట్టు వరల్డ్ కప్ గెలుస్తుందని ఆశించగలమా! స్పెయిన్‌తో తుది పోరులో అర్జెంటీనా పరిస్థితి ఇలాగే కనిపించింది. అసలు ఇలాంటి ఆటను అభిమానులెవరూ ఊహించలేదు. మెస్సీపైనే అందరి దృష్టీ ఉండగా... ఇతర ఆటగాళ్లెవరూ జట్టు కోచ్ స్కలోని అంచనాలు నిలబెట్టలేకపోయారు. మ్యాక్ అలిస్టర్, రోడ్రిగో డి పాల్, లియాండ్రో పెరేడ్స్ ఫైనల్లో పూర్తిగా విఫలమయ్యారు. అసలు సమరంలో మెస్సీని నిలువరించడంలో స్పెయిన్ పూర్తిగా సఫలమైంది. మ్యాచ్ ముగియడానికి నాలుగు నిమిషాల ముందు మెస్సీ కొట్టిన కార్నర్ కిక్‌ను సబ్‌స్టిట్యూట్ గ్విలియోనా సిమోన్ క్రాస్ బార్ మీదుగా పంపించి వృథా చేయడం జట్టు పరిస్థితికి అద్దం పట్టింది. ఎంజో ఫెర్నాండెజ్ రెడ్ కార్డుతో మైదానం నుంచి ని్రష్కమించడంతో చివర్లో 10 మందితోనే ఆడటం కూడా అర్జెంటీనా జట్టుకు చేటు చేసింది. నిజానికి స్పెయిన్ విజయం మ్యాచ్ ఆరంభంలోనే ఖాయమయ్యేది! అయితే అర్జెంటీనా గోల్ కీపర్ ఎమిలియానో మార్జినెజ్ అసాధారణ ప్రదర్శనతో గెలుపు ఆలస్యమైంది. ఫైనల్లో రికార్డు స్థాయిలో 12 షాట్లను అతను అడ్డుకోగలిగాడు.భవిష్యత్తు కూడా వారిదే...ఎనిమిది మ్యాచ్‌లలో ఒకే ఒక్క గోల్ ఇవ్వడం... దాదాపు లోపాలు లేని ఆట... ఇద్దరు 19 ఏళ్ల కుర్రాళ్లను సమర్థంగా వాడుకోవడంతో పాటు వారి చుట్టూ సీనియర్లతో కలిపి జట్టును సన్నద్ధం చేయడం... టోర్నీ ఆరంభానికి ముందే తాము అనుకున్న ప్రణాళికకు పూర్తి కట్టుబడి దానినే అమలు పర్చడం... స్పెయిన్‌ను రెండోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిపాయి. ఈ జట్టు ఎలాంటి థ్రిల్లర్ సినిమాను తలపించే అనూహ్య మలుపుల తరహా ఆట ఆడలేదు. కానీ ఏం చేయాలనే దానిపై జట్టుకు చాలా స్పష్టత ఉంది. మిడ్‌ఫీల్డర్లు సత్తా చాటి దూసుకుపోగా, డిఫెండర్లు అయిన అద్భుత ఆటను ప్రదర్శించారు. ప్రతీ మ్యాచ్‌లో ఒక్కో హీరో జట్టు నుంచి వచ్చాడు. ఏడుగురు ప్లేయర్లు గోల్ స్కోరర్లు కావడం విశేషం కాగా క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్), డిబ్రూయిన్ (బెల్జియం), ఎంబాపె (ఫ్రాన్స్), మెస్సీల వంటి స్టార్లను స్పెయిన్ డిఫెన్స్ సమర్థంగా అడ్డుకుంది. టోర్నీ మొత్తంలో కలిపి ప్రత్యర్థులకు 43 సార్లు మాత్రమే షాట్లకు అవకాశం చిక్కింది. స్పెయిన్ గెలుపు ఇక్కడితోనే ఆగిపోదు. వచ్చే దశాబ్దంలో ఫుట్‌బాల్‌ను శాసించగల సామర్థ్యం టీమ్‌లో ఉంది. 19 ఏళ్ల ఇద్దరు కుర్రాళ్లు భవిష్యత్తులో టీమ్‌ను ముందుకు తీసుకెళ్లగలరు. ‘యంగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ కుబార్సి అద్భుతంగా ఆడుతుండగా... లమీన్ యామల్ విలువేమిటో ప్రపంచం ఇప్పటికే చూసింది. ఈ వయసులోనే వీరిద్దరు వరల్డ్ కప్ నెగ్గిన బృందంలో సభ్యులుగా ఉన్నారు.2026 ప్రపంచకప్ అవార్డులుగోల్డెన్ బూట్ (టోర్నీ టాప్ స్కోరర్): కిలియన్ ఎంబాపె (ఫ్రాన్స్; 10 గోల్స్). 2022 ప్రపంచకప్‌లోనూ ఎంబాపెకే గోల్డెన్ బూట్ అవార్డు లభించింది. వరుసగా రెండు ప్రపంచకప్‌లలో గోల్డెన్ బూట్ గెల్చుకున్న ఏకైక ప్లేయర్ ఎంబాపెనే. గోల్డెన్ బాల్ (టోర్నీ బెస్ట్‌ప్లేయర్): స్పెయిన్ కెప్టెన్ రోడ్రి. గోల్డెన్ గ్లౌవ్ (టోర్నీ బెస్ట్ గోల్‌కీపర్): స్పెయిన్ గోల్‌కీపర్ సిమోన్. మొత్తం ఎనిమిది మ్యాచ్‌ల్లో సిమోన్ ఒక్క గోల్ మాత్రమే సమరి్పంచుకున్నాడు. బెస్ట్ యంగ్ ప్లేయర్: కుబార్సి (స్పెయిన్). ఫెయిర్‌ప్లే అవార్డు: నెదర్లాండ్స్ – సాక్షి క్రీడా విభాగం -
స్పానియార్డ్స్ జయకేతనం
ఆటపై అంకితభావం... అవతలి జట్టుపై గెలవటానికి పక్కా వ్యూహం... తిరుగులేని క్రమశిక్షణ... అన్నిటికీ మించి జట్టు మొత్తం ఒక వ్యవస్థగా పనిచేయటం సోమవారం వేకువజామున న్యూజెర్సీ వేదికగా ఒక అద్భుతాన్ని ఆవిష్కరించింది. సాకర్ ప్రపంచ కప్ సంరంభంలో మొదట్లో ఎవరికీ పెద్దగా అంచనాలు లేని స్పెయిన్ జట్టు అందరినీ అధిగమించి విశ్వవిజేతగా నిలిచింది. క్రీడాభిమానుల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. ఇలాంటి ఘట్టాలు సాకర్ చరిత్రలో బహుశా అరుదుగా నమోదైవుంటాయి. అలాగని స్పెయిన్ తక్కువేం కాదు. అది తొలిసారిగా 2010లో దక్షిణాఫ్రికాలో ప్రపంచకప్ సాధించింది. అంతక్రితం సాకర్ యూరో కప్‌ను మూడుసార్లు – 1964, 2008, 2012లలో గెలుచుకుంది. ఒకరకంగా 2008 నుంచి 2012 వరకూ అది ప్రపంచ ఫుట్‌బాల్‌ను శాసించిందని చెప్పాలి. కానీ అనంతరకాలంలో దాదాపు కనుమరుగయ్యే స్థితికి చేరింది. మొదట్లో స్పెయిన్‌కు విజయపరంపర అందించిన ‘టికి–టాకా’ వ్యూహం (ఆటగాళ్లు బంతిని పాస్‌లు ఇచ్చుకుంటూ తమమధ్యే ఉంచుకోవటం), గోల్ పోస్ట్ వైపు వెళ్లే చొరవ తగ్గటానికి దారితీసింది. ప్రత్యర్థులు సులభంగా అంచనావేసే స్థితి ఏర్పడింది. దిగ్గజా లనదగ్గ జావి, ఇనియెస్టా, కార్లెస్, సెర్గియో రామోస్ వంటి ఆటగాళ్లు వరసగా నిష్క్రమించినప్పుడు ఆ ఖాళీలను భర్తీ చేయటంలో బోర్డు విఫలమైంది. కొత్తగా వచ్చినవారికి అంతర్జాతీయ టోర్నీల ఒత్తిడిని తట్టుకునే అనుభవం లేకపోయింది. అయితే కాలం మారింది. లామిన్ యామాల్ వంటి యువ సంచలనం, ఫెర్రాన్ టోరెస్ వంటి సమర్థుడు చరిత్ర తిరగరాశారు. అటు అర్జెంటీనా అసామాన్యమైనది. నిన్న మొన్నటివరకూ దానివైపు తలెత్తి చూడటానికి కూడా ప్రత్యర్థులు సాహసించనంతటి అరివీరభయంకర జట్టు. మారడోనా, మెస్సీ వంటి సార్వకాలిక మహా దిగ్గజాలను ప్రపంచానికందించిన ఆ దేశం ఎప్పుడూ ఫుట్‌బాల్‌లో తిరుగులేని శక్తిగానే ఉంది. 1978, 1986, 2022లలో అర్జెంటీనా ఆటగాళ్లు మహాద్భుతాలను ప్రదర్శించి దేశాన్ని విశ్వవిజేతగా నిలిపారు. దక్షిణమెరికా ఖండంలో అత్యున్నత టోర్నమెంటు అయిన ‘కోపా అమెరికా’లో ఏకంగా 16 సార్లు ఆ టైటిల్‌ను గెలిచిన చరిత్ర అర్జెంటీనా ఆటగాళ్లది. మెస్సీది అద్భుతమైన నైపుణ్యం. చెప్పాలంటే అతనిది భావోద్వేగంతో ముడిపడివుండే మాయాజాలం. అది ఇన్నాళ్లూ రాణించింది. ప్రత్యర్థులు దరిదాపుల్లోకి రావటం కూడా అసాధ్యమనిపించే రీతిలో పనిచేసింది. కానీ భారమంతా మెస్సీపైనే పడటం ఆ జట్టుకు పెద్ద మైనస్ అయికూర్చుంది. అవతల స్పెయిన్ ఆటగాళ్లు ఉక్కు క్రమశిక్షణతో, అంకితభావంతో ఆడి మ్యాచ్‌పై పూర్తి నియంత్రణ సాధించిన తీరు అర్జెంటీనాను కోలుకోలేని దెబ్బతీసింది. ఒలింపిక్స్ అయినా, సాకర్ వంటివైనా ప్రపంచ దేశాలమధ్య సద్భావనను పెంపొందించే సందర్భాలు. నిన్న మొన్నటివరకూ కలహాలతో చెలరేగిపోయిన దేశాల ఆటగాళ్లు ఆ యుద్ధంరేపిన గాయాలు మరిచి పరస్పరం చేతులు కలపడం గుర్తుంచుకోదగిన క్షణాలవుతాయి. ఈసారి ఆతిథ్య దేశాల్లో ఒకటైన అమెరికా ప్రపంచ దేశాలను అష్ట కష్టాలు పెడుతూ పగబట్టినట్టు ప్రవర్తిస్తూ వచ్చింది. ఆఖరికి సాకర్ సాగుతున్న దశలో కూడా అది ఇరాన్‌పై క్షిపణిదాడులతో చెలరేగిపోయింది. ఆ చీడను ఇరాన్ ఆటగాళ్లకూ పులిమింది. ప్రాక్టీసింగ్ మ్యాచ్‌లు ఇక్కడ కుదరదంటూ విమానాశ్రయంనుంచే వెనక్కి పంపింది. చివరకు వారు మెక్సికోలో బసచేసి, అక్కడే ప్రాక్టీస్ చేసుకోవాల్సి వచ్చింది. ఆట ముగిసీ ముగియగానే మెక్సికో వెళ్లటానికి విమానాశ్రయానికి తరలించేది. అన్ని అవమానాలనూ దిగమింగుకుంటూనే అమెరికా క్రీడాభిమానులుసహా ప్రపంచమంత టినీ ఇరాన్ జట్టు అలరించింది. మొత్తానికి అమెరికా అగ్రరాజ్య దురహంకారానికి కొత్తగా వచ్చిచేరిన జాత్యహంకారం ఈ సాకర్‌లో కొన్ని చేదు అనుభవాలు మిగిల్చింది. పట్టనట్టున్న ఫిఫా దానికి లొంగి స్వీయ ప్రతిష్ఠను కోల్పోయింది. మైదానంలో రిఫరీదే తుది నిర్ణయంకాగా, ట్రంప్ జోక్యంతో దాన్ని మార్చటం ఫిఫా బలహీనతకు చిహ్నం. మొత్తానికి ఫుట్‌బాల్ అందం దాని దిగ్గజాలు ప్రదర్శించే క్రీడా నైపుణ్యంలో ఉంటుంది. భిన్నమైన ఆట శైలులుగల మెస్సీ, రొనాల్డో, ఎర్లింగ్ హాలండ్ వంటివారు అభిమానులకు శాశ్వతంగా మిగిలే ఆనందకర క్షణాలను అందించారు. -
బుడ్డోడా మజాకా.. సవతి సోదరుడైనా తమ్ముడంటే ప్రాణం!
ఫిఫా ప్రపంచకప్ విజేతగా స్పెయిన్ నిలవడంతో ఆ జట్టు సంబరాలు మాములుగా లేవు. 16 ఏళ్ల తర్వాత రెండోసారి ఫిఫా టైటిల్ గెలవడంతో స్పెయిన్‌లో సంబురాలు అంబరాన్ని అంటాయి. ఇక స్పెయిన్ ఆటగాళ్ల ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. అయితే ఈ ఫిఫా టోర్నీలో ఒక బుడ్డోడు మాత్రం యమా క్రేజ్ సంపాదించాడు. ఆ బుడ్డోడు ఎవరో కాదు స్పెయిన్ స్టార్ లామినె యమాల్ చిన్న తమ్ముడు కీన్. సవతి తల్లికి పుట్టినోడయినప్పటికీ కీన్‌ను యమాల్ సొంత తమ్ముడిలా, కొడుకులా భావిస్తుంటాడు. మూడేళ్ల వయసున్న కీన్ 2026 ఫిఫా ప్రపంచకప్‌లో స్పెయిన్ ఆడిన ప్రతీ మ్యాచ్‌కు తన తల్లితో కలిసి హాజరయ్యాడు. ప్రతీ మ్యాచ్‌ను స్టాండ్స్ నుంచి వీక్షించిన కీన్ తన అన్న ఆటను తెగ ఎంజాయ్ చేసేవాడు. Photo Credit: FIFA Twitterఅంతేకాదు స్పెయిన్ తాము ఆడిన ప్రతీ మ్యాచ్‌లో విజయం సాధించిన తర్వాత యమాల్ తన సోదరుడిని ఒడిలో తీసుకొని ఆడుకోవడం ఆనవాయితీగా చేసుకున్నాడు. ఫైనల్ మ్యాచ్ తర్వాత కూడా యమాల్ దీనిని కంటిన్యూ చేశాడు. తన అన్న కప్ గెలవడంతో తమ్ముడికి సంతోషం ఆగలేదు. గ్రౌండ్ అంతా తనదే అన్నట్లుగా మైదానం నలుమూలలా పరిగెడుతూ సందడి చేశాడు. Photo Credit: FIFA Twitterఈ సందర్భంగా అన్న లామినె యమాల్‌ను కూడా కాసేపు ఆట పట్టించాడు. ట్రోఫీ సెలబ్రేషన్స్ అనంతరం కప్పు తన చేతిలోకి తీసుకున్న యమాల్ తన కుటుంబం దగ్గరకు వచ్చి తమ్ముడితో కలిసి ఫొటోలుకు ఫోజివ్వడం వైరల్‌గా మారింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఫిఫా పైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ 1-0 తేడాతో అర్జెంటీనాపై విజయం సాధించి ట్రోఫీని అందుకుంది. Lamine Yamal ve kardeşi. pic.twitter.com/gpcwLCiKvz— Pusholder (@pusholder) July 20, 2026 Lamine Yamal celebrating with his brother 🤗 pic.twitter.com/sd8Jg8smgZ— B/R Football (@brfootball) July 19, 2026 It's Keyne's world and we're just living in it 🤣 pic.twitter.com/Qk4I9BAuX4— B/R Football (@brfootball) July 19, 2026చదవండి: దేశవాళీ టోర్నీ.. సూర్యకుమార్‌కు మరో అవమానం! -
మెస్సీ అలా.. లామినే ఇలా; చివరికి!
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ ముగిసిన తర్వాత ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఓటమి బాధను తట్టుకోలేక అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ లియాండ్రో పరెడెస్ స్పెయిన్ ఆటగాళ్లతో తగాదా పెట్టుకున్నాడు. చిలికి చిలికి గాలి వానలా మారిన గొడవ తన్నుకునేంత వరకు వెళ్లింది. అయితే ఇంత గొడవ జరుగుతున్నప్పటికీ ఒకవైపు మెస్సీ.. మరోవైపు లామినె యమాల్ మాత్రం తమకేం సంబంధం లేదన్నట్లుగా ఉండిపోయారు. ఓటమి షాక్ నుంచి తేరుకోని మెస్సీ మైదానంలోనే నిరాశతో కూర్చుండిపోయాడు. తనలో తాను కుమిలిపోతు కన్నీటిపర్యంతమయ్యాడు. Photo Credit: FIFA Twitterమరోపక్క యమాల్ కూడా తన పక్కనే అంత పెద్ద గొడవ జరుగుతున్నప్పటికీ తన దేశం గెలిచిందన్న సంతోషంతో అతను ప్రార్థనల్లో మునిగిపోయిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. చుట్టూ ఏం జరుగుతుందో కూడా గ్రహించకుండా యమాల్ తన పనిలో నిమగ్నమై ఉండడం చూస్తే అతడి ఆత్మవిశ్వాసం ఎలాంటిదో అర్థమవుతోంది. ఇంత గొడవలో కూడా మెస్సీ, యమాల్ మధ్య జరిగిన ఒక భావోద్వేగ ఘటన ఆసక్తిగా మారింది.MIENTRAS LAMINE YAMAL REZABA... 😳 pic.twitter.com/9SPl4s4Gep— Diario Olé (@DiarioOle) July 20, 2026Photo Credit: FIFA Twitterఒకరినొకరు ఆలింగనం..లామినే యమాల్ తన ప్రార్థన పూర్తి చేసుకొని లేచిన తర్వాత తన ఎదురుగా పెద్ద గొడవ జరుగుతున్న దృష్ట్యాలను చూశాడు. కానీ దానిని పట్టించుకోకుండా యమాల్ నేరుగా మెస్సీ వద్దకు వచ్చాడు. అప్పటికే నిరాశలో కూరుకుపోయిన మెస్పీని ఓదార్చి పైకి లేపాడు. ఆ తర్వాత ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం కనిపించింది. ఇది చూసిన అభిమానులు.. 'క్యా సీన్‌హై' అనకుండా ఉండలేకపోయారు. వీరిద్దరు ఆలింగనం చేసుకున్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి. 'నిజమైన క్రీడా స్ఫూర్తికి మెస్సీ, యమాల్ అర్థం చెప్పారంటూ' కామెంట్లు చేశారు.అసలేం జరిగింది?ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత స్పెయిన్ ఆటగాళ్లు సంబరాలు మొదలుపెట్టారు. ఇదే సమయంలో ఓటమి బాధలో ఉన్న అర్జెంటీనా ఆటగాళ్లవైపు చూస్తూ స్పెయిన్ ఆటగాళ్లు సెలబ్రేట్ చేసుకోవడం వారికి కంటికి ఇంపుగా అనిపించలేదు. దీంతో అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ లియాండ్రో పరెడెస్ ఒక్కసారిగా స్పెయిన్ ఆటగాళ్లవైపు దూసుకొచ్చాడు. Thank you, Leo. Legends are remembered, but you will never be forgotten. 🐐https://t.co/K8dqX5Tvlo— ketansusuw ✿ (@tansuuuw) July 20, 2026ఈ ఘర్షణలో అర్జెంటీనా మిడ్ ఫీల్డర్ లియాండ్రో పరేడెస్.. స్పెయిన్ ఆటగాళ్లు గావీ, ఎరిక్ గార్సియాలతో వాగ్వాదానికి దిగినట్లు వీడియోలో కనిపించింది. ఆ సమయంలో పరేడెస్ ప్రత్యర్థి ఆటగాడిని తోసివేయడంతో పాటు చేయి చేసుకున్న దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో అర్జెంటీనా హెడ్ కోచ్‌తో పాటు సపోర్ట్ స్టాఫ్ మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చారు. ఆటగాళ్లను విడదీసి పరిస్థితిని శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ చాలాసేపు ఉద్రిక్తత కొనసాగింది. Read: మరో ఫిఫా ఆడకపోవచ్చు.. మెస్సీ శకం ముగిసినట్లే! -
FIFA World Cup 2026 : ఫిఫా 2026 విశ్వవిజేత స్పెయిన్ (ఫొటోలు)
-
కొట్టుకున్న అర్జెంటీనా, స్పెయిన్ ఆటగాళ్లు.. ఏం జరిగింది?
ఫిఫా ప్రపంచకప్ 2026 విజేతగా స్పెయిన్ అవతరించింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో స్పెయిన్ 1-0 తేడాతో అర్జెంటీనాపై విజయం సాధించి రెండోసారి ఫిఫా విశ్వవిజేతగా నిలిచింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఓటమి షాక్‌లో ఉన్న అర్జెంటీనా ఆటగాళ్లు సహనం కోల్పోయి స్పెయిన్ ఆటగాళ్లతో గొడవకు దిగారు. చిలికి చిలికి గాలి వానలా మారిన గొడవ తన్నుకునేంత వరకు వెళ్లింది. దీంతో అప్పటివరకు రణరంగంలా కనిపించిన మైదానం యుద్ధభూమిని తలపించింది. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో అర్జెంటీనా హెడ్ కోచ్‌తో పాటు సపోర్ట్ స్టాఫ్ మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చారు. ఆటగాళ్లను విడదీసి పరిస్థితిని శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ చాలాసేపు ఉద్రిక్తత కొనసాగింది. ఈ ఘర్షణలో అర్జెంటీనా మిడ్ ఫీల్డర్ లియాండ్రో పరేడెస్.. స్పెయిన్ ఆటగాళ్లు గావీ, ఎరిక్ గార్సియాలతో వాగ్వాదానికి దిగినట్లు వీడియోలో కనిపించింది. ఆ సమయంలో పరేడెస్ ప్రత్యర్థి ఆటగాడిని తోసివేయడంతో పాటు చేయి చేసుకున్న దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ గొడవను ఫిఫా తీవ్రంగా పరిగణించింది. ఘర్షణకు కారణమైన లియాండ్రో పరెడేస్పై రెడ్ కార్డు చూపించి క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. దీంతో ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్లో రెడ్ కార్డు అందుకున్న రెండో ఆటగాడిగా పరేడెస్ నిలిచాడు. అంతకుముందు మ్యాచ్ జరుగుతున్న సమయంలో అర్జెంటీనా స్టార్ మిడ్‌ఫీల్డర్ ఎంజో ఫెర్నాండెజ్ కూడా రెడ్ కార్డు అందుకున్నాడు. ఈసారి ఫిఫా ప్రపంచకప్‌లో ఆఖరి అంకం దాకా హీరోగా నిలిచిన అర్జెంటీనా ఈ ఒక్క ఘటనతో విలన్‌గా మారిపోయింది. 🚨🥊 Full scenes after final whistle.@MickyJnr__ 🎥 pic.twitter.com/ZXCvAFkHwy— Fabrizio Romano (@FabrizioRomano) July 20, 2026Read: అర్జెంటీనా గెలవదని 14 కోట్లు పందెం.. డ్రేక్ శాపం ఫలిస్తుందా? -
సైలెంట్‌గానే.. చరిత్ర సృష్టించాడు!
స్పెయిన్ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ రోడ్రి అరుదైన ఘనత సాధించాడు. ‘కంప్లీట్ ఫుట్‌బాల్’ వీరుల జాబితాలో 30 ఏళ్ల ఈ మిడ్‌ఫీల్డర్ చేరిపోయాడు. కాగా న్యూయార్క్ వేదికగా భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున జరిగిన ఫిఫా వరల్డ్‌కప్-2026 ఫైనల్లో స్పెయిన్ అర్జెంటీనాపై 1-0 గోల్ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. చరిత్ర సృష్టించాడు!ఈ క్రమంలో రోడ్రి ఖాతాలో తొలిసారి వరల్డ్‌కప్ టైటిల్ చేరింది. ఇంతకు ముందు అతడు UEFA చాంపియన్స్ లీగ్, బాలన్ డి ఓర్ అవార్డులు కూడా గెలిచాడు. ఫుట్‌బాల్‌లో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ మూడు అవార్డులను గెలిచిన పదకొండో ప్లేయర్‌గా రోడ్రి చరిత్రకెక్కాడు.ఈ జాబితాలో సర్ బాబీ చార్ల్టన్, ఫ్రాంజ్ బెకెన్బ్యూయర్, గెడ్ ముల్లర్, పవోలో రోసి, జినెదైన్ జిదానే, రివాల్డో, రొనాల్డినో, కకా, లియోనల్ మెస్సీ, డెంబెలె రోడ్రి కంటే ముందు వరుసలో ఉన్నారు.గోల్డెన్ బాల్అదే విధంగా.. బాలన్ డి ఓర్, వరల్డ్‌కప్, చాంపియన్స్ లీగ్‌లతో పాటు గోల్డెన్ బాల్ గెలిచిన నాలుగో ఆటగాడిగానూ రోడ్రి నిలిచాడు. వరల్డ్‌కప్ ఫైనల్లో రోడ్రి గోల్ కొట్టలేకపోవచ్చు. కానీ సహచరులు గోల్ కొట్టేలా అవకాశాలు కల్పించాడు. టోర్నీ ఆసాంతం అత్యుత్తమంగా రాణించి జట్టు విజయంలో కీలకంగా మారాడు. దీంతో అతడిని గోల్డెన్ బాల్ వరించింది.ఈ అవార్డు అందుకున్న తొలి స్పెయిన్ ఆటగాడు కూడా రోడ్రి కావడం విశేషం. కాగా 2015లో జాతీయ జట్టులోకి వచ్చిన రోడ్రి.. 2022లోనే తొలిసారి వరల్డ్‌కప్ ఆడాడు. ఇక ఈసారి ఏకంగా కెప్టెన్‌గా స్పెయిన్‌కు టైటిల్ అందించాడు. పోర్చుగల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో, అర్జెంటీనా లెజెండ్ లియోనల్ మెస్సి వంటి సారథులు ఎక్కువగా గోల్స్ చేస్తూ వార్తల్లో ఉంటారు. అత్యుత్తమ మిడ్ ఫీల్డర్కానీ రోడ్రి ఆట మాత్రం ఇందుకు భిన్నం. ఆరు అడుగులకుపైగా ఎత్తు ఉండే అతడు.. తీవ్రమైన ఒత్తిడి నెలకొన్న సమయంలోనూ బంతిని పాస్ చేయడంలో దిట్ట. సహచరులు గోల్స్ కొట్టేలా అవకాశాలు సృష్టించే రోడ్రి ప్రపంచంలోని అత్యుత్తమ మిడ్ ఫీల్డర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. ఈసారి ఫిఫా వరల్డ్‌కప్ టోర్నీలో రోడ్రి ఏకంగా 790 పాస్‌లు అందించాడు. తద్వారా ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పాస్‌లు ఇచ్చిన ఆటగాడిగా తన పేరిట ఉన్న రికార్డును తానే బద్దలు కొట్టాడు. అర్జెంటీనాతో ఫైనల్లో రోడ్రి 101 పాస్‌లు కంప్లీట్ చేయడం విశేషం. చదవండి: స్పెయిన్ 20.. అర్జెంటీనా0: తెర వెనుక హీరో అతడే! -
స్పెయిన్ 20.. అర్జెంటీనా 0: తెర వెనుక హీరో అతడే!
స్పెయిన్.. 2008- 2021 మధ్య ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఏలడమే కాదు. ఆట తీరును కూడా మార్చివేసింది. 1988- 96 మధ్య బార్సిలోనా జట్టు ప్రాచుర్యంలోకి తెచ్చిన ‘టికీ-టాకా’ అస్త్రాన్ని పూర్తిగా వాడుకోవడంలో స్పెయిన్ సఫలమైంది.ఇందులో భాగంగా షార్ట్, క్విక్ పాసులతో పాదరసంలా కదులుతూ ఆటగాళ్లు ఎక్కువసేపు బంతిని తమ ఆధీనంలోనే ఉంచుకుంటూ.. ప్రత్యర్థిని పూర్తిగా అలసిపోయేలా చేస్తారు. ఆ తర్వాత గోల్స్ వేట మొదలుపెడతారు.చిన్న, వేగవంతమైన పాసులతో బంతిని కదిలించడం.. నిర్దిష్ట జోన్లలో నిలిచి ఎల్లప్పుడూ పాసింగ్ ఆప్షన్లు కల్పించడం, ఆటగాళ్లు త్రిభుజాకారంలో నిలిచి తక్కువ దూరంలోనే బంతిని పాస్ చేసుకోవడం ఇందులోని ముఖ్య వ్యూహాలు.ఆ తర్వాత అందుకే విఫలంయూరో 2008, ఫిఫా వరల్డ్‌కప్-2010, యూరో 2012 టైటిళ్లను స్పెయిన్ టికీ-టాకా వ్యూహంతోనే దక్కించుకుంది. తమ ప్రత్యేక శైలితో ఆట తీరును మరో స్థాయికి తీసుకువెళ్లిన స్పెయిన్.. ఆ తర్వాత ప్రత్యర్థుల చేతిలో భంగపడింది. ఎల్లప్పుడూ ఎక్కువగా పాస్లపైనే దృష్టి పెట్టి గోల్స్ కొట్టడంలో విఫలమై 2018, 2022 వరల్డ్‌కప్ టోర్నీ నుంచి నిరాశగా వెనుదిరిగింది. ప్రత్యర్థి జట్లు తమ డిఫెన్స్‌ను మరింత బలోపేతం చేసుకుని స్పెయిన్ వ్యూహానికి ఇలా చెక్ పెట్టాయి.ఫూయెంటె రాకతో..దీంతో ఒకప్పుడు బలంగా భావించిన ‘టికీ- టాకా’ అస్త్రం.. ఆ తర్వాత ప్రత్యర్థుల అప్రమత్తతో వారి బలహీనతగా మారిపోయింది. అయితే, లూయీస్ డి లా ఫూయెంటె (Luis de la Fuente) స్పెయిన్ కోచ్‌గా వచ్చిన తర్వాత మరోసారి ఈ వ్యూహాన్ని బలోపేతం చేసే దిశగా కసరత్తు చేశాడు. సరికొత్త హంగులతో టికీ-టాకా 2.0ను తీసుకువచ్చాడు.ఇందులో భాగంగా కేవలం బంతిని నియంత్రణలో ఉంచుకోవడమే కాకుండా.. వేగంగా ఫార్వర్డ్ చేసి గోల్స్ సాధించే శక్తివంతమైన జట్టుగా మారింది స్పెయిన్. కేవలం బంతిని పాస్ చేయడమే కాకుండా.. ప్రత్యర్థి మోహరింపుల్లోని గ్యాప్‌లను గుర్తించి అటాక్ చేయడంపై దృష్టి పెట్టింది. ఇందుకోసం లమీన్ యమాల్, విలియమ్స్ వంటి యువ ఆటగాళ్ల సేవలను వాడుకుంది.తద్వారా కేవలం బంతిని కంట్రోల్ చేయడమే కాకుండా.. కౌంటర్ అటాక్‌లు చేయడంలో సఫలమై.. తమ అమ్ములపొదిలోని టికీ-టాకా అస్త్రానికి మరింత పదునుపెట్టింది. ముఖ్యంగా సెమీ ఫైనల్లో ఫ్రాన్స్‌పై ఈ వ్యూహాన్ని సమర్థవంతంగా ఉపయోగించి అనుకున్న ఫలితాన్ని రాబట్టింది స్పెయిన్. ఆ మ్యాచ్‌లో పెడ్రో పోరో సాధించిన గోల్ ఆధునిక టికీ-టాకా వ్యూహానికి నిదర్శనం.స్పెయిన్ 20.. అర్జెంటీనా 0ఈ టోర్నీలో స్పెయిన్ మొత్తంగా పద్నాలుగు గోల్స్ సాధించగా.. ప్రత్యర్థి ఒకే ఒక గోల్ కొట్టే అవకాశం ఇచ్చింది. దీనిని బట్టి స్పెయిన్ సత్తా ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇక వరల్డ్‌కప్-2026 ఫైనల్లో స్పెయిన్ గోల్ కోసం ప్రయత్నించే క్రమంలో 20 షాట్లు కొట్టింది. ఇందులో 12 గోల్ పోస్ట్ దిశగా వెళ్లాయి. మొత్తంగా 817 పాస్‌లు ఇచ్చుకున్నారు ఆటగాళ్లు. అదే సమయంలో అర్జెంటీనా మాత్రం గోల్ పోస్ట్ దిశగా ఒక్క షాట్ కూడా కొట్టలేకపోయింది. రోడ్రి వరల్డ్ రికార్డుఇక మైదానంలో పక్కాగా వ్యూహాలను అమలు చేసిన స్పెయిన సారథి రోడ్రి.. ఈ సీజన్లో ఏకంగా 790 పాస్‌లు ఇచ్చాడు. తద్వారా ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక పాస్‌లు ఇచ్చిన ఆటగాడిగా తన పేరిట ఉన్న రికార్డును తానే బద్దలు కొట్టాడు. ఇక స్పెయిన్ డిఫెండర్లు క్యూబార్సి 668, లాఫోర్టే 618 పాసులు చేశారు. ఓవరాల్‌గా జట్టుగా స్పెయిన్ 4945 సార్లు బంతిని పాస్ చేసింది. తెర వెనుక హీరో అతడే!దీనిని బట్టి స్పెయిన్ ఈ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం కనబరిచిందన్న విషయం సుస్పష్టం. ఏదేమైనా ఫూయెంటె టికా-టాకాకు పునర్వైభవం తెచ్చి జట్టు రెండోసారి వరల్డ్‌కప్ ట్రోఫీ గెలిచేలా చేశాడు. తెర ముందు గోల్ కొట్టి ఫెరాన్ టోరెస్ హీరో కాగా.. తెర వెనుక తన పదునైన వ్యూహాలతో ఫూయెంటె హీరోగా నిలిచాడు.చదవండి: మెస్సీ చేయలేనిది... రొనాల్డో సాధించాడు!Spain 🤝 Mexico City #FIFAFanFestival #FIFAWorldCup pic.twitter.com/PxkGAyW6tC— FIFA World Cup (@FIFAWorldCup) July 20, 2026 -
మెస్సీ చేయలేనిది.. రొనాల్డో సాధించాడు!
ఒక్క మ్యాచ్‌తో అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ కల చెదిరిపోయింది. వరుసగా రెండోసారి ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడాలన్న అతడి ఆశలు అడియాసలయ్యాయి. న్యూజెర్సీ వేదికగా జరిగిన ఫైనల్లో స్పెయిన్ చేతిలో అర్జెంటీనా 1-0 గోల్ తేడాతో ఓటమిపాలైంది. స్పెయిన్ స్టార్ టోరెస్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి అదనపు సమయంలో గోల్ కొట్టి అర్జెంటీనా హృదయం ముక్కలు చేశాడు.ఇక వరల్డ్‌కప్-2026 ఫైనల్ తన కెరీర్లో చివరి మ్యాచ్ అని మెస్సీ ఇప్పటికే సంకేతాలు ఇచ్చాడు. అయితే ఈ విషయంలో ఇంకా స్పష్టత మాత్రం రాలేదు. ఇదిలా ఉంటే.. స్పెయిన్‌తో ఫైనల్లో గోల్ కొట్టడంలో మెస్సీ విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో గోల్డెన్ బూట్ (అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్లకు ఇచ్చే అవార్డు) కూడా మెస్సీ కోల్పోయాడు. ఫ్రాన్స్ కెప్టెన్ కెలియన్ ఎంబాపె ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు.ఆసక్తికర చర్చ.. మెస్సీకి అదొక పీడకలఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర చర్చ తెరమీదకు వచ్చింది. స్పెయిన్ విషయంలో పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో సాధించింది.. మెస్సీ మాత్రం సాధించలేకపోయాడంటూ సాకర్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. నిజానికి మెస్సీ కెరీర్లో స్పెయిన్‌తో మ్యాచ్ ఓ పీడకలలా మిగిలిపోయింది. ఫైనల్లో మెస్సీతో పాటు అతడి జట్టులో ఒక్క సభ్యుడు కూడా గోల్ కొట్టలేక టైటిల్‌ను కోల్పోయారు.ఒకే ఒక్కసారిఇక మెస్సీ ఇప్పటికి నాలుగుసార్లు స్పెయిన్‌తో మ్యాచ్ ఆడాడు. తాజా వరల్డ్‌కప్ ఫైనల్ మినహాయిస్తే.. మిగిలిన మూడు ఫ్రెండ్లీ మ్యాచ్‌లు. అయితే, ఈ నాలుగు సందర్భాల్లోనూ మెస్సీ స్పెయిన్‌పై కేవలం ఒకే ఒక్క గోల్ సాధించాడు. 2009లో స్పెయిన్‌తో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో మెస్సీ గోల్ కొట్టాడు.అయితే, ఈ మ్యాచ్‌లో స్పెయిన్ 2-1 గోల్ తేడాతో గెలిచింది. ఇక ఆ తర్వాత మళ్లీ మెస్సీ స్పెయిన్‌పై గోల్ కొట్టలేదు. కీలక ప్రపంచకప్ ఫైనల్లోనూ మరోసారి అతడి ఈ బలహీనత బయటపడింది.మెస్సీ చేయలేనిది.. రొనాల్డో సాధించాడు!ఇక రొనాల్డో విషయానికొస్తే.. ఈ పోర్చుగల్ స్టార్ స్పెయిన్‌తో పదకొండుసార్లు తలపడ్డాడు. రెండు మ్యాచ్‌లలో కలిపి మొత్తంగా నాలుగు గోల్స్ సాధించాడు. వరల్డ్‌కప్-2018లో హ్యాట్రిక్‌తో మెరిసి 3-3తో మ్యాచ్ డ్రా కావడంలో కీలక పాత్ర పోషించారు. ఇక 2025 నేషన్స్ లీగ్ ఫైనల్లో స్పెయిన్- పోర్చుగల్ మ్యాచ్ 2-2తో డ్రా కాగా... రొనాల్డో పెనాల్టీ షూటౌట్లో గోల్ కొట్టి తన జట్టును గెలిపించాడు.అంతేకాదు.. ఈ మాజీ రియల్ మాడ్రిడ్, మాంచెస్టర్ యునైటెడ్ ఆటగాడు యూరో 2004, వరల్డ్‌కప్ 2010, యూరో 2012.. ఫిఫా వరల్డ్‌కప్-2026 రౌండ్ ఆఫ్ 16లో కూడా స్పెయిన్‌తో తలపడ్డాడు. అయితే, ఆయా సందర్భాల్లో గోల్ మాత్రం కొట్టలేకపోయాడు.తీరని కలఏదేమైనా.. సమకాలీన ఫుట్‌బాలర్లలో మెస్సీ- రొనాల్డో.. ఇద్దరూ ఎవరికివారే సాటి. మిగతా విషయాల్లో ఎలా ఉన్నా.. రొనాల్డో గెలవలేని వరల్డ్‌కప్ ట్రోఫీని.. మెస్సీ 2022లో సొంతం చేసుకున్నాడు. అయితే, స్పెయిన్ విషయంలో మాత్రం మెస్సీ కంటే రొనాల్డో మెరుగైన ప్రదర్శనలు ఇచ్చాడు. ఇక మెస్సీకి వరల్డ్‌కప్ మెగా ఫైనల్లోనూ స్పెయిన్ ఒక పజిల్లా మిగిలిపోయింది. గోల్ కొట్టలేక.. ఓటమి బాధతో కన్నీళ్లతో మెస్సీ మైదానాన్ని వీడాడు.చదవండి: స్పెయిన్ హీరో.. ఎవరీ టోరెస్? -
ఫిఫా వరల్డ్‌కప్ హీరో.. ముందుగా భారత్‌లోనే మెరిశాడు!
ఫిఫా ప్రపంచకప్-2026 టోర్నీలో స్పెయిన్ యువ సంచలనం లమీన్ యామల్ ఆది నుంచి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచాడు. అద్భుతమైన ప్రదర్శనతో జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు ఈ టీనేజర్.ముఖ్యంగా ఫ్రాన్స్‌తో సెమీ ఫైనల్లో కీలక సమయంలో పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచి.. అతి పిన్న వయసులోనే వరల్డ్‌కప్ నాకౌట్ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అయితే, అర్జెంటీనాతో ఫైనల్లో మాత్రం ఫెరాన్ టోరెస్ స్పెయిన్ హీరోగా అవతరించాడు.అదనపు సమయంలోని 106వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి గోల్ కొట్టి స్పెయిన్‌ను గెలిపించాడు టోరెస్. నికో విలియమ్స్ ఇచ్చిన హెడర్‌ను గోల్‌గా మలిచి అర్జెంటీనా ఆశలపై నీళ్లు చల్లాడు. తద్వారా స్పెయిన్ వరల్డ్‌కప్ చారిత్రక విజయంలో కీలక పాత్ర పోషించి చరిత్ర పుటల్లో తన పేరును లిఖించుకున్నాడు.ఎవరీ టోరెస్?26 ఏళ్ల టోరెస్ బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్లో ఫార్వర్డ్ ప్లేయర్. స్పెయిన్‌లోని ఫెయెస్లో 2000, ఫిబ్రవరి 29న జన్మించాడు. ఆరేళ్ల వయసులోనే వాలెన్షియా అకాడమీలో చేరాడు. యూత్ జట్టు తరఫున రాణించి.. 2017లో సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. వాలెన్షియా తరఫున2017- 2020 మధ్యలో 71 మ్యాచ్‌లలో ఆరు గోల్స్ సాధించాడు.మాంచెస్టర్ సిటీ తరఫున 2020-2022 మధ్య కాలంలో 28 మ్యాచ్‌లలో తొమ్మిది గోల్స్ కొట్టిన టోరెస్.. ప్రీమియర్ లీగ్, ఈఎఫ్ఎల్ కప్ గెలిచిన జట్టులు సభ్యుడు.ఇక ఆ తర్వాత అంటే 2021-22 సీజన్లో బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్లో చేరాడు టోరెస్. లా లిగా, కోపా డెల్ రెయ్, సూపర్కోపా కప్పులు గెలిచాడు. ప్రస్తుతం పారిస్ సెయింట్ జర్మేన్ జట్టుకు ఆడుతున్నాడు.భారత్‌లోనే ముందుగా మెరిశాడుస్పెయిన్ అండర్-17 జట్టు తరఫున 2017లో భారత్‌లో జరిగిన ప్రపంచకప్ టోర్నీలో టోరెస్ పాల్గొన్నాడు. స్పెయిన్ జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించిన అతడు.. ఇంగ్లండ్‌తో టైటిల్ పోరులోనూ సత్తా చాటాడు.కోల్‌కతాలో ఇంగ్లండ్- స్పెయిన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగగా.. ఇంగ్లండ్ 5-2 గోల్ తేడాతో స్పెయిన్‌పై విజయం సాధించింది. దీంతో స్పెయిన్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక ఈ టోర్నీ గ్రూప్ దశలో స్పెయిన్ మూడు విజయాలు సాధించింది. అనంతరం నాకౌట్ దశలో ఫ్రాన్స్, మాలి జట్లపై గెలిచింది.ఈ ఈవెంట్లో టోరెస్ రెండు గోల్స్ కొట్టడంతో పాటు.. రెండు అసిస్ట్‌లు ఇచ్చి తన వంతు పాత్ర పోషించాడు. కాగా టోరెస్ స్పెయిన్ తరఫున 2020లో అరంగేట్రం చేశాడు. అండర్-17, 19, 21 స్థాయిల్లో ఆడి ఈ స్థాయికి చేరుకున్నాడు. ముద్దుపేరు తెలుసా?ఇక లీప్ సంవత్సరంలో జన్మించిన టోరెస్ నాలుగేళ్లకోసారి తన పుట్టినరోజు జరుపుకొంటాడు. అతడి ముద్దుపేరు ‘ది షార్క్’. గోల్ కొట్టినపుడు అతడు షార్క్ ఫిన్ (షార్క్ వెనుక భాగంలో కనిపించే త్రికోణాకారపు రెక్క లాంటిది) సింబాలిక్‌గా సెలబ్రేట్ చేసుకోవడమే ఇందుకు కారణం. షార్క్ ఫిన్‌ను శక్తి, ప్రత్యేక గుర్తింపు, ఆధిపత్యానికి ప్రతీకగా భావిస్తారు. నీటి మీద ఫిన్ కనిపిస్తే అది ప్రమాద సూచనగా భావిస్తారు. తన ముద్దుపేరు మీదుగా టోరెస్ ఓ క్లాత్ బ్రాండ్ కూడా తీసుకువచ్చినట్లు సమాచారం.చదవండి: గోల్డెన్ బూట్, గోల్డోన్ గ్లోవ్, గోల్డెన్ బాల్.. ప్రైజ్ మనీ ఉంటుందా?Spain 🤝 Mexico City #FIFAFanFestival #FIFAWorldCup pic.twitter.com/PxkGAyW6tC— FIFA World Cup (@FIFAWorldCup) July 20, 2026 -
ఒక్క గోల్.. 12 ఏళ్ల తర్వాత అదే చరిత్ర!
ఫుట్‌బాల్‌లో ఒక గోల్ అంటే కేవలం స్కోర్ బోర్డుపై పెరిగే ఒక సంఖ్య కాదు.. కోట్లాది మంది అభిమానుల ఆశలు, భావోద్వేగాలను మార్చే క్షణం. ముఖ్యంగా ప్రపంచకప్ ఫైనల్ లాంటి అత్యున్నత వేదికపై ఒక్క గోల్ కూడా ఓ జట్టును చరిత్రలో నిలబెడుతుంది. కొన్ని ఫైనల్స్‌లో అయితే 90 నిమిషాల ఉత్కంఠకు తెరదించేది ఒకే ఒక్క గోల్. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా.. ఒకే దెబ్బతో ప్రపంచకప్ ట్రోఫీని సొంతం చేసుకున్న సందర్భాలు ఫిఫా చరిత్రలో అరుదుగా నమోదయ్యాయి.ఒక్క గోల్.. ఒక్క క్షణం.. కానీ ఆ క్షణమే ఓ జట్టును చరిత్రలో శాశ్వతంగా నిలబెడుతుంది. అందుకే ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలో 1-0 విజయాలకు ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం నాలుగుసార్లు మాత్రమే మ్యాచ్ ఫలితం 1-0తో తేలింది. ఈ ప్రతి విజయానికీ ఓ ప్రత్యేక కథ ఉంది.బ్రెహ్మే పెనాల్టీతో జర్మనీ చాంపియన్1990 ఇటలీ ప్రపంచకప్ ఫైనల్లో వెస్ట్ జర్మనీ, అర్జెంటీనా తలపడ్డాయి. అప్పటికే ఇరు జట్లు గట్టి పోరాటం సాగించడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. గోల్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు 85వ నిమిషంలో కీలక క్షణం వచ్చింది. జర్మనీకి లభించిన పెనాల్టీని ఆండ్రియాస్ బ్రెహ్మే గోల్‌గా మలిచాడు. ఆ ఒక్క గోల్‌తో వెస్ట్ జర్మనీ ప్రపంచకప్‌ను ముద్దాడింది.ఇనియెస్టా గోల్‌తో స్పెయిన్ కల సాకారం2010 దక్షిణాఫ్రికా ప్రపంచకప్ ఫైనల్లో స్పెయిన్, నెదర్లాండ్స్ జట్లు తలపడ్డాయి. నిర్ణీత 90 నిమిషాల్లో ఇరు జట్లు గోల్ చేయలేకపోవడంతో మ్యాచ్ అదనపు సమయానికి వెళ్లింది. 116వ నిమిషంలో ఆండ్రెస్ ఇనియెస్టా చేసిన అద్భుతమైన గోల్ మ్యాచ్ గమనాన్ని మార్చేసింది. అదే స్పెయిన్‌కు తొలి ప్రపంచకప్ టైటిల్‌ను అందించింది. ఒక్క గోల్.. స్పెయిన్ ఫుట్‌బాల్ చరిత్రలో స్వర్ణాక్షరాలుగా నిలిచిపోయింది.గోట్జే దెబ్బతో అర్జెంటీనాకు నిరాశ2014 బ్రెజిల్ ప్రపంచకప్ ఫైనల్లో జర్మనీ, అర్జెంటీనా మరోసారి ప్రపంచ వేదికపై తలపడ్డాయి. లియోనెల్ మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా టైటిల్‌పై కన్నేయగా.. జర్మనీ పటిష్ఠ రక్షణతో పోరాడింది. మ్యాచ్ అదనపు సమయానికి వెళ్లిన తర్వాత 113వ నిమిషంలో మారియో గోట్జే చేసిన గోల్ జర్మనీకి చిరస్మరణీయ విజయాన్ని అందించింది. ఫైనల్ ముగిసే సమయానికి స్కోర్ బోర్డుపై నిలిచింది 1-0.2026.. స్పెయిన్ మరోసారి అదే ఘనత12 ఏళ్ల తర్వాత.. ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోనూ ఇదే తరహా ఫలితం నమోదైంది. స్పెయిన్, అర్జెంటీనా మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో నిర్ణీత 90 నిమిషాల్లో గోల్స్ నమోదు కాలేదు. అదనపు సమయంలో 106వ నిమిషంలో ఫెర్రాన్ టోరెస్ చేసిన కీలక గోల్ మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది. ఆ ఒక్క గోల్‌తో స్పెయిన్ ప్రపంచకప్ ట్రోఫీని సొంతం చేసుకుంది. దీంతో ఫైనల్‌ను 1-0తో గెలిచిన అరుదైన జట్ల జాబితాలో స్పెయిన్ చేరింది.ఎందుకంత ప్రత్యేకం? ప్రపంచకప్ ఫైనల్లో జట్లు సాధారణంగా ఎంతో జాగ్రత్తగా ఆడతాయి. చిన్న తప్పిదం కూడా ట్రోఫీని దూరం చేయగలదనే ఒత్తిడి ఆటగాళ్లపై ఉంటుంది. అందుకే ఫైనల్స్‌లో భారీ స్కోర్లు చాలా అరుదుగా కనిపిస్తాయి. 1-0 విజయాల్లో గెలిచిన జట్లు కేవలం దాడిలోనే కాదు.. రక్షణలోనూ తమ సామర్థ్యాన్ని నిరూపించాయి. ప్రత్యర్థికి అవకాశాలు ఇవ్వకుండా.. వచ్చిన ఒక్క అవకాశాన్ని గోల్‌గా మార్చుకుని ప్రపంచ చాంపియన్లుగా నిలిచాయి. -
గోల్డెన్ బూట్ అతడికే!.. గోల్డెన్ బాల్, గోల్డెన్ గ్లోవ్ ఎందుకిస్తారో తెలుసా?
సాకర్ మెగా సంబరం ఫిఫా ప్రపంచకప్-2026 టోర్నమెంట్ ముగిసింది. టైటిల్ పోరులో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాను ఓడించి స్పెయిన్ విజేతగా అవతరించింది. న్యూయార్క్ వేదికగా మెస్సీ బృందాన్ని 1-0 గోల్ తేడాతో ఓడించి రెండోసారి ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడింది.అదనపు సమయంలోని 106వ నిమిషంలో స్పెయిన్ సబ్‌స్టిట్యూట్ ఫెరాన్ టోరెస్ గోల్ కొట్టడంతో స్పెయిన్ చాంపియన్‌గా నిలవగా.. అర్జెంటీనా హృదయం ముక్కలైంది. ఇదిలా ఉంటే.. ప్రపంచకప్ టోర్నీలో ఆసాంతం అద్భుత ప్రదర్శ కనబరిచిన స్పెయిన్ వ్యక్తిగత బహుమతుల జాబితాలోనూ సత్తా చాటింది.ఈసారి ప్రతిష్టాత్మక గోల్డెన్ బూట్‌ను ఫాన్స్ కెప్టెన్ కెలియన్ ఎంబాపె గెలుచుకోగా.. మిగతా అవార్డులను మాత్రం స్పెయిన్ ఆటగాళ్లు కైవసం చేసుకున్నారు. అయితే, గోల్డెన్ బూట్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. మరి గోల్డెన్ బాల్, గోల్డెన్ గ్లోవ్ అవార్డుల గురించి మీకు తెలుసా?.. విజేతలను ఎలా నిర్ణయిస్తారు?.. ప్రైజ్‌మనీ ఉంటుందా?... పూర్తి వివరాలు మీకోసం గోల్డెన్ బూట్ విజేత ఎంబాపె (Kylian Mbappe- ఫ్రాన్స్)ఫిఫా ప్రపంచకప్ టోర్నీ ఎడిషన్‌లో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాడికి దీనిని ప్రధానం చేస్తారు. ఈసారి ఎంబాపె పది గోల్స్ కొట్టడంతో పాటు నాలుగు అసిస్ట్‌లు అందించి గోల్డెన్ బూట్ గెలిచాడు. గత ప్రపంచకప్ అంటే 2022లోనూ ఎంబాపేకే ఈ అవార్డు దక్కింది.గోల్డెన్ బూట్ సుమారు కిలో మేర బరువు ఉంటుంది. దీనిని ఇత్తడి మిశ్రమ లోహంతో తయారు చేసి.. దానిపై మందపాటి బంగారు పొరను ఎలక్ట్రోప్లేటింగ్ చేస్తారు. గణాంకాల ఆధారంగానే విజేతను నిర్ణయిస్తారు. దీనిని 1930లోనే ప్రవేశపెట్టినప్పటికీ.. 1982 నుంచి భౌతికంగా అందిస్తున్నారు. ఫ్రాన్స్ ఆటగాడు జస్ట్ ఫౌంటైన్ 1958 ప్రపంచకప్ టోర్నీలో 13 గోల్స్ కొట్టగా.. ఇప్పటికీ ఆ విషయంలో ఎవరూ అతడి దరిదాపుల్లోకి రాలేదు.గోల్డెన్ బాల్ విజేత రోడ్రి (Rodri- స్పెయిన్)ప్రపంచకప్ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఫిఫా టెక్నికల్ స్టడీ గ్రూప్ (FSG)ఈ అవార్డు విజేతను నిర్ణయిస్తుంది. టోర్నీలోని ప్రతీ మ్యాచ్‌ను విశ్లేషించి.. సదరు మ్యాచ్‌లలో ప్రభావం చూపిన ఆటగాడికి దీనిని అందజేస్తారు.జట్టు తరఫున గోల్స్, అసిస్ట్స్ చేయడం.. డిఫెన్స్‌తో ఆకట్టుకుకోవడం.. నాయకత్వ బృందంలో కీలకంగా వ్యవహరించడం.. ఇలా మొత్తంగా ఏ విధంగానైనా సరే జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆటగాడికి గోల్డెన్ బాల్ దక్కుతుంది. ఇక ఈ అవార్డు విజేతను నిర్ణయించే FSGలో ఫిఫా గ్లోబల్ ఫుట్‌బాల్ డెవలప్మెంట్ చీఫ్‌తో పాటు.. మాజీ ఆటగాళ్లు, కోచ్‌లు, టెక్నికల్ డైరెక్టర్లు, సాకర్ అనలిస్టులు.. అదే విధంగా మీడియా ప్రతినిధులు కూడా భాగంగా ఉంటారు.విజేత జట్టు తరఫు ఆటగాడికేనా?అయితే, ప్రపంచకప్ విజేతగా నిలిచిన జట్టు ఆటగాడికి మాత్రమే ఈ అవార్డు లభిస్తుందనుకుంటే పొరపాటు. 2014 ప్రపంచకప్ ఫైనల్లో అర్జెంటీనా జర్మనీ చేతిలో ఓడినప్పటికీ అత్యుత్తమ ఆటగాడిగా లియోనల్ మెస్సీకి ఈ అవార్డు దక్కింది. ఇక గోల్డెన్ బాల్‌తో పాటు సిల్వర్, బ్రాంజ్ బాల్స్ విజేతలను కూడా సాంకేతిక అంశాల ఆధారంగా నిర్ణయిస్తారు.తొలుత 1986లో దీనిని ప్రవేశపెట్టగా.. అర్జెంటీనా దిగ్గజం డిగో మారడోనా గోల్డెన్ బాల్ అందుకున్నాడు. ఇక మెస్సీ ఒక్కడే 2014, 2022 టోర్నీలలో అత్యధికంగా రెండుసార్లు ఈ అవార్డు గెలిచిన ఆటగాడిగా నిలిచాడు.గోల్డెన్ గ్లోవ్ విజేత ఉనై సైమన్ (Unai Simon- స్పెయిన్)ఫిఫా ప్రపంచకప్ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన గోల్కీపర్కి ఈ అవార్డు అందజేస్తారు. టోర్నీ ఆసాంతం అద్భుతమైన నైపుణ్యాలు, నిలకడైన ఆట తీరుతో ప్రభావం చూపిన ఆటగాడిని FSG ఈ అవార్డుకు ఎంపిక చేస్తుంది.అత్యుత్తమ డిఫెన్స్‌తో ప్రత్యర్థులను అడ్డుకోవడం.. వారు గోల్స్ కొట్టకుండా ఆపడం.. జట్టు విజయంపై ఎలాంటి ప్రభావం చూపారన్న ప్రధాన అంశాలను దృష్టిలో పెట్టుకుని విజేతను నిర్ణయిస్తారు. ఈసారి ఏడు క్లీన్ షీట్స్‌తో సైమన్ గోల్డెన్ గ్లోవ్ గెలిచాడు. గోల్డెన్ గ్లోవ్‌ను తొలుత 1994లో బెల్జియం ప్లేయర్ మిచెల్ ప్రెడ్హోమ్ గెలుచుకున్నాడు.7 clean sheets. adidas Golden Glove winner. ⭐@adidasfootball pic.twitter.com/mME9QEIgNj— FIFA World Cup (@FIFAWorldCup) July 20, 2026 ప్రైజ్‌మనీ ఇస్తారా?ఈ అవార్డులన్నీ ఆటగాళ్ల గుర్తింపునకు మాత్రమే. వారి ప్రదర్శనకు ప్రతిఫలంగా ట్రోఫీలు అందజేస్తారు. వీటికి ఫిఫా నుంచి ఎలాంటి ప్రైజ్‌మనీ ఉండదు. అయితే, స్పాన్సర్ల ద్వారా ఆటగాళ్లకు లబ్ది చేకూరే అవకాశం ఉంటుంది. -
మెస్సీ ఫ్యాన్స్ కి షాక్.. ఫిఫా వరల్డ్ కప్ 2026 గెలిచిన స్పెయిన్
-
స్పెయిన్‌పై కాసుల వర్షం.. రూ. 420 కోట్ల ప్రైజ్‌మనీ!
ఫిఫా ప్రపంచకప్-2026 ఛాంపియన్స్‌గా స్పెయిన్ అవతరించింది. న్యూజెర్సీ వేదికగా జరిగిన ఫైనల్లో అర్జెంటీనాను 1-0 తేడాతో ఓడించి రెండోసారి ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని స్పెయిన్ ముద్దాడింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ తుది పోరులో నిర్ణీత 90 నిమిషాల సమయం ముగిసేసరికి ఇరు జట్లు ఎలాంటి గోల్స్ చేయలేకపోయాయి. దీంతో మ్యాచ్ ఫలితాన్ని తేల్చేందుకు 30 నిమిషాల ఎక్స్ట్రా టైమ్ కేటాయించారు. ఈ క్రమంలో 106వ నిమిషంలో స్పెయిన్ స్టార్ ఆటగాడు ఫెర్రాన్ టోర్రెస్ అద్భుతమైన గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో ప్రపంచకప్ ట్రోఫీ 2010 తర్వాత తిరిగి స్పానిష్ జట్టు సొంతమైంది.స్పెయిన్‌పై కాసుల వర్షంఇక విశ్వవిజేతగా నిలిచిన స్పెయిన్ జట్టుకు ట్రోఫీతో పాటు భారీ ప్రైజ్ మనీ దక్కింది. రోడ్రి సారథ్యంలోని స్పెయిన్‌కు దాదాపు 50 మిలియన్ డాలర్లు ( సుమారు రూ.420 కోట్లు ) నగదు బహుమతి లభించింది. అదేవిధంగా రన్నరప్ అర్జెంటీనాకు 33 మిలియన్ డాలర్లు (సుమారు రూ.రూ.277 కోట్లు) అందింది. మూడో స్థానంలో నిలిచిన ఇంగ్లండ్ జట్టుకు ప్రైజ్‌మనీగా 29 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 243 కోట్లు) సొంతం చేసుకుంది. అదేవిధంగా నాలుగో స్థానంలో నిలిచిన ఫ్రాన్స్ జట్టుకు 27 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 225 కోట్లు) ప్రైజ్‌మనీ దక్కింది. ఫిఫా ప్రపంచ కప్ 2026లో అవార్డు విజేతలు వీరేగోల్డెన్ బూట్ - కైలియన్ ఎంబాపే (ఫ్రాన్స్)గోల్డెన్ బాల్ - రోడ్రి (స్పెయిన్)గోల్డెన్ గ్లోవ్ - ఉనై సైమన్ (స్పెయిన్)బెస్ట్ యంగ్ ప్లేయర్ - పావ్ కుబార్సి (స్పెయిన్) -
FIFA World Cup 2026: జగజ్జేత స్పెయిన్
న్యూయార్క్: ఒకవైపు పటిష్టమైన డిఫెన్స్... మరోవైపు పాదరసంలాంటి కదలికలతో అటాకింగ్... వెరసి స్పెయిన్ జట్టు రెండోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున ముగిసిన ఫైనల్లో స్పెయిన్ 1–0 గోల్ తేడాతో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా జట్టును ఓడించింది. అదనపు సమయంలోని 106వ నిమిషంలో సబ్సిట్యూట్ ఫెరాన్ టోరెస్ గోల్‌తో స్పెయిన్ జట్టు విజయం అందుకుంది. పెడ్రో పోరో కుడి వైపు నుంచి కొట్టిన క్రాస్ పాస్‌ను ‘డి’ ఏరియాలో నికో విలియమ్స్ హెడర్ షాట్‌తో వెనక్కి పంపించాడు. అక్కడే ఉన్న ఫెరాన్ టోరెస్ అర్జెంటీనా గోల్కీపర్ను బోల్తా కొట్టిస్తూ బంతిని లక్ష్యానికి చేర్చాడు. దాంతో స్పెయిన్ ఖాతా తెరిచింది. ఆ తర్వాత అదనపు సమయంలో మిగిలిన క్షణాల్లో అర్జెంటీనాను నిలువరించి స్పెయిన్ ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. 2010లో స్పెయిన్ తొలిసారి ప్రపంచకప్ గెలిచింది. నెదర్లాండ్స్‌తో ఆనాడు జరిగిన ఫైనల్లోనూ స్పెయిన్ అదనపు సమయంలోని రెండో అర్ధభాగంలో ఇనియెస్టా చేసిన గోల్‌తో విజయం అందుకుంది. 16 ఏళ్ల తర్వాత అలాంటి దృశ్యమే పునరావృతమైంది. అంతకుముందు నిర్ణీత 90 నిమిషాల్లో రెండు జట్లు గోల్ చేయలేదు. 90+3వ నిమిషంలో అర్జెంటీనా ప్లేయర్ ఎంజో ఫెర్నాండెజ్ రెడ్ కార్డుకు గురయ్యాడు. దాంతో అదనపు సమయంలో 30 నిమిషాలు అర్జెంటీనా 10 మంది ఆటగాళ్లతోనే ఆడాల్సి వచ్చింది. ఈ సువర్ణావకాశాన్ని స్పెయిన్ సద్వినియోగం చేసుకుంది. పదే పదే దాడులు చేస్తూ 106వ నిమిషంలో ఫలితాన్ని సాధించింది. మ్యాచ్ మొత్తంలో అర్జెంటీనా గోల్‌కీపర్ ఎమిలియో మార్టీనెజ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 12 సార్లు స్పెయిన్ ఆటగాళ్లు గోల్‌పోస్ట్ లక్ష్యంగా కొట్టిన షాట్లను నిలువరించాడు. అయితే 13వ ప్రయత్నంలో మాత్రం మార్టీనెజ్ ఏమీ చేయలేకపోయాడు. ఫైనల్ చేరే క్రమంలో 19 గోల్స్ కొట్టిన అర్జెంటీనా తుది పోరులో పూర్తిగా నిరాశపరిచింది. స్పెయిన్ ఫార్వర్డ్ ఆటగాళ్లను అడ్డుకోవడంలోనే అర్జెంటీనాకు సరిపోయింది. -
ఫిఫా ప్రపంచకప్ విజేతగా స్పెయిన్
ఫిఫా ప్రపంచకప్-2026 విజేతగా స్పెయిన్ అవతరించింది. న్యూజెర్సీ వేదికగా జరిగిన ఫైనల్లో అర్జెంటీనాను 1-0 తేడాతో ఓడించిన స్పెయిన్.. 16 ఏళ్ల తర్వాత ఫిఫా వరల్డ్‌కప్ టైటిల్‌ను ముద్దాడింది. ఈ తుది పోరులో జట్లు కూడా నిర్ణీత 90 నిమిషాల్లో కనీసం ఒక్క గోల్ కూడా సాధించలేకపోయాయి. నిర్ణీత సమయంలో మ్యాచ్ ఫలితం తేలకపోవడంతో 30 నిమిషాలు కేటాయించారు. ఈ క్రమంలో 106వ నిమిషంలో స్పెయిన్ స్టార్ ఫెర్రాన్ టోర్రెస్ మెరుపు గోల్ కొట్టి తన జట్టుకు చారిత్రత్మక విజయాన్ని అందించాడు.ఆధిక్యంలో స్పెయిన్తుది పోరులో స్పెయిన్ ఖాతా తెరిచింది. 106 నిమిషాల తర్వాత తొలి గోల్ నమోదైంది. స్పెయిన్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. నిర్ణీత 90 నిమిషాల సమయం ముగిసినప్పటికి ఇరు జట్లు కూడా ఇంకా కనీసం ఒక్క గోల్ కూడా సాధించలేకపోయాయి. దీంతో విజేత ఎవరో తేల్చడానికి ఎక్స్ట్రా టైమ్ 30 నిమిషాలు కేటాయించారు.ఖాతా తెరవని ఇరు జట్లుసెకెండ్ హాఫ్లోనూ 75వ నిమిషం వరకు ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. స్పెయిన్ తమ జట్టులో రెండు మార్పులు చేసింది. డాని ఓల్మో, అలెక్స్ బేనా స్ధానాల్లో వింగర్ నికోలస్, మైకెల్ మెరినో జట్టులోకి వచ్చారు. కాగా ఈ తుది పోరులో రెండో హైడ్రేషన్ బ్రేక్ సమయం ముగిసే వరకు కూడా అర్జెంటీనా జట్టు ప్రత్యర్థి గోల్ పోస్ట్ లక్ష్యంగా కనీసం ఒక్క షాట్ కూడా నమోదు చేయలేకపోయింది.హోరాహోరీగా తలపడుతున్న స్పెయిన్న్యూజెర్సీ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్-2026 ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా, స్సెయిన్ జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. మ్యాచ్ ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి ఇరు జట్లు ఎటాకింగ్ గేమ్ ఆడినప్పటికి ఒక్క గోల్ కూడా నమోదు చేయలేకపోయాయి. మ్యాచ్ ప్రారంభంలోనే స్పెయిన్ సంచలన యువ ఆటగాడు లమిన్ యమల్‌కు గోల్ కొట్టే అద్భుత అవకాశం లభించింది. అయితే అర్జెంటీనా డిఫెన్స్ సమర్ధవంతంగా అడ్డుకోవడంతో అతడు తనకు లభించిన ఛాన్స్‌ను చేజార్చుకున్నాడు. అయితే ఈ తుది పోరులో అర్జెంటీనాకు భారీ షాక్ తగిలింది.స్టార్ డిఫెండర్ లిసాండ్రో మార్టినెజ్ తీవ్రమైన గాయానికి గురై మైదానాన్ని వీడాడు. ఇక ఫస్ట్ హాఫ్ ముగిసిన అనంతరం విరామ సమయంలో గ్లోబల్ పాప్ స్టార్స్ జస్టిన్ బీబర్, షకీరా తమ సంగీత ప్రదర్శనతో స్టేడియాన్ని హోరెత్తించారు. కాగా ఈ ఫైనల్ మ్యాచ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరయ్యారు. -
FIFA World Cup 2026: ఫైనల్ వేడి.. సిటీ రెడీ
ప్రపంచంలోనే అత్యంత ఆదరణ ఉన్న ఫుట్‌బాల్ వరల్డ్ కప్ ఫైనల్ అంకాన్ని తప్పకుండా చూసేందుకు సిటీ జనులు సిద్ధమయ్యారు. ఆదివారం అర్ధరాత్రి 12.30కు మొదలయ్యే అర్జెంటీనా–స్పెయిన్ జట్ల తుది సమరాన్ని వీక్షించేందుకు ఉత్సుకతతో ఉన్నారు. ప్రపంచకప్‌నకు ఆతిథ్యం ఇచ్చింది ఉత్తర అమెరికా ఖండంలోని దేశాలు కావడంతో ఆయా దేశాల టైమ్ జోన్ మేరకు ఇప్పటికే తమ అలారాల సెట్టింగ్‌ను మార్చుకుని దాదాపు 40 రోజులుగా నగరంలోని ఫుట్‌బాల్ అభిమానులు మ్యాచ్‌ల మజాను ఆస్వాదించారు.ఇప్పుడు ఫైనల్ కోసం మరింత ఉత్సుకతగా ఉన్నారు. పైగా, హైదరాబాదీల అభిమాన ఆటగాడు లయోనల్ మెస్సీ సారథ్యంలో అభిమాన జట్టు అర్జెంటీనా పోటీ పడుతుంటే ఇక తెల్లవారుజాము వరకైనా మేల్కొనేందుకు సిద్ధపడ్డారు. స్పెయిన్ కంటే అర్జెంటీనానే మనవాళ్ల ఫేవరెట్ అని.. మెజారిటీ సిటీజనుల మొగ్గు అర్జెంటీనా వైపే అని హైదరాబాద్‌లోని ఫుట్‌బాల్ కోచ్‌లు, ఆటగాళ్లు పేర్కొంటున్నారు. 2022లో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో ఫ్రాన్స్, అర్జెంటీనా తలపడగా అప్పుడూ మనవాళ్లు అర్జెంటీనాకే మద్దతు పలికిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఇక గత కొన్ని మ్యాచ్‌ల ఓపెన్ స్క్రీనింగ్స్‌లో వచ్చిన స్పందన కూడా ఇదే విషయం స్పష్టం చేస్తోంది. - సాక్షి, హైదరాబాద్మెస్సీని తలచుకుంటూ... గత ఏడాది చివర్లో మెస్సీ హైదరాబాద్‌లో పర్యటించిన సందర్భంలో విశేష ప్రజాదరణ దక్కింది. అప్పట్లో కేరళ వంటి ఫుట్‌బాల్‌కు ఆదరణ విపరీతంగా ఉండే రాష్ట్రంలో కాకుండా మెస్సీ భాగ్య నగరానికి రావడం విశేషం. దీన్నిబట్టే.. ఇప్పుడు అతడు వరుసగా రెండోసారి ప్రపంచ కప్ అందుకోవాలని హైదరాబాదీలు బలంగా కోరుకుంటున్నారు.ఈ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకునే, శనివారం అర్ధరాత్రి జరిగిన ఫ్రాన్స్–ఇంగ్లండ్ (మూడో స్థానం కోసం) మ్యాచ్, ఫైనల్ సందర్భంగా బార్లు, క్లబ్‌లు, మైక్రో బ్రూవరీలు రాత్రిళ్లు ఎక్కువసేపు తెరిచి ఉంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. కాగా, ఈ నిర్ణయాన్ని ఫుట్‌బాల్ ఫైనల్‌కు తాత్కాలిక సడలింపుగా మాత్రమే కాక నగర నైట్ లైఫ్నకు ఊపునిచ్చే దిశలో తొలి అడుగుగా ఆతిథ్య రంగం భావిస్తోంది. ఈ అనుమతులను సద్వినియోగం చేసుకుని పూర్తి స్థాయి రాత్రి వేళ వ్యాపారాలకు బాటలు వేసుకోవాలని ఆశిస్తోంది. అభివృద్ధిదాయక నైట్‌లైఫ్ నగరంలో సాధ్యమని నిరూపించడానికి ఇదొక సువర్ణావకాశమని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) అభిప్రాయపడుతోంది. అందుకని అవాంతరాలు లేకుండా గడిచేలా చూడాలని ఏఆర్ఏఐ హైదరాబాద్ చాప్టర్ తమ సభ్యులను కోరింది. ‘ప్రతి సంస్థ సొంత బ్రాండ్‌నే కాకుండా, హైదరాబాద్ ఆతిథ్య రంగం ప్రతిష్టను కూడా ఇనుమడింపజేయాలి’ అని చాప్టర్ హెడ్ సందీప్ బాలసుబ్రమణియన్ సూచించారు. -
అర్జెంటీనా గెలవదని 14 కోట్లు పందెం.. డ్రేక్ శాపం ఫలిస్తుందా?
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో అర్జెంటీనా, స్పెయిన్ తలపడుతున్న వేళ ప్రపంచవ్యాప్తంగా భారీ బెట్టింగ్‌లు నమోదవుతున్నాయి. అర్జెంటీనా టైటిల్ నిలబెట్టుకుంటుందంటూ కొంతమంది పందేలు కాస్తుంటే.. మరికొంత మంది మాత్రం ఈసారి స్పెయిన్ టైటిల్ అందుకొని 16 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతుందంటూ భారీ బెట్టింగ్‌లు కాస్తున్నారు. ఈ బెట్టింగ్‌ల విలువ కూడా కోట్ల రూపాయల్లో ఉండడం గమనార్హం. ప్రపంచం మొత్తం బెట్టింగ్‌లు వేసినప్పటికీ, కెనడియన్ రాపర్ డ్రేక్ గ్రహమ్ వేసే పందెం మాత్రం కాస్త భిన్నంగా ఉంటుంది. గతంలో డ్రేక్ మద్దతు ఇచ్చిన జట్లు లేదా ఆటగాళ్లు ఓడిపోవడం జరిగింది. తాజాగా అర్జెంటీనా ఫిఫా టైటిల్‌ను గెలవదంటూ డ్రేక్ 1.5 అమెరికన్ మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు 14.5 కోట్ల రూపాయలు) పందెం కాయడం సంచలనం కలిగించింది. మరి డ్రేక్ శాపం ఫలిస్తుందా అన్నది ఫైనల్ తర్వాత తేలనుంది.'డ్రేక్ శాపం' అంటే?👉డ్రేక్ శాపం అనేది ఒక క్రీడా మూఢనమ్మకం. దీని ప్రకారం, డ్రేక్ బహిరంగంగా మద్దతు ఇచ్చిన అథ్లెట్లు, ఫైటర్లు లేదా జట్లు తరచుగా కీలకమైన మ్యాచ్‌లలో ఓడిపోవడాన్ని అభిమానులు గమనించారు.👉చాలా సందర్భాల్లో, ఆటగాళ్లు కెనడియన్ ర్యాపర్‌తో ఫోటోలు దిగిన తర్వాత ఆయా జట్లు ఓటమిని చవిచూశాయి.👉ఈ మూఢనమ్మకం కారణంగా, చాలా మంది క్రీడాభిమానులు డ్రేక్ మద్దతును అపశకునంగా భావిస్తారు.👉ఇప్పుడు అతను అర్జెంటీనాపై తన పందెం వేయడంతో, ఈ చర్య ప్రపంచ కప్ ఫైనల్‌కు ముందు ఆ జట్టు మద్దతుదారులలో ఆందోళనను రేకెత్తించింది.లెక్కచేయని అర్జెంటీనా ఫ్యాన్స్..అయితే అర్జెంటీనా అభిమానులు మాత్రం డ్రేక్ పందేన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. 2022 ఖతార్ ప్రపంచకప్‌లోనూ ఫైనల్లో ఫ్రాన్స్ చేతిలో అర్జెంటీనా ఓడిపోతుందంటూ డ్రేక్ గ్రహమ్ ఒక మిలియన్ డాలర్లు (సుమారు రూ. 10 కోట్లు) పందెం కాసి చేతులు కాల్చుకున్నాడు. డ్రేక్ శాపానికి తిరుగుండదని బీరాలు పలికాడు. కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయింది. ఆ ప్రపంచకప్‌లో మెస్సీ సేన ఫిఫా టైటిల్ గెలవడంతో డ్రేక్ అంచనా తప్పి అపఖ్యాతి పాలయ్యాడు. అయితే తాజాగా ఫిఫా 2026 టోర్నీలో అర్జెంటీనా మరోసారి ఫైనల్ చేరిన క్రమంలో డ్రేక్ మరోసారి భారీ పందెం కాసినప్పటికీ ఈసారి కూడా అతడి అంచనా తప్పుతుందని అర్జెంటీనా అభిమానులు బల్లగుద్ది జోస్యం చెబుతున్నారు. ఈసారి కూడా మెస్సీ సేన డ్రేక్ మూడ నమ్మకాన్ని బద్దలుకొట్టి నాలుగోసారి ఫిఫా టైటిల్‌ను ఎగురేసుకుపోతుందని పేర్కొన్నారు.మెస్సీ సేనకు వ్యతిరేకంగా..ఆరంభం నుంచి ఈసారి ఫిఫా టోర్నీలో అర్జెంటీనా గెలవకూడదనే ప్రయత్నాలు కొనసాగుతూ వచ్చాయి. ఆరంభ పోటీల్లో అనామక జట్టు కేప్‌వెర్డె.. అర్జెంటీనాను ఓడిస్తుందంటూ ఒక ఆధ్యాత్మికవేత్త చేసిన ప్రకటన వైరల్‌గా మారింది. కానీ రియాల్టీకి వచ్చేసరికి అర్జెంటీనా సునాయాసంగా కేప్వెర్డెను ఓడించింది. ఈసారి ఫిఫాలో విస్తృతంగా ప్రచారం జరిగిన మరో మూడనమ్మకం ఏంటంటే.. ప్రముఖ యూట్యూబర్ ఐషో స్పీడ్ తాను మద్దతు ఇచ్చిన ప్రతీ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించడంతో, అతడికి అపశకునం అనే బిరుదు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే క్వార్టర్ ఫైనల్లో స్విట్జర్లాండ్, అర్జెంటీనా మ్యాచ్‌కు ఐషోస్పీడ్ అర్జెంటీనా జెర్సీ ధరించి వారికి మద్దతు ఇచ్చాడు. కానీ మెస్సీ సేన ఐషో స్పీడ్ అపశకునాన్ని సైతం ఛేదించి సెమీస్‌లో అడుగుపెట్టింది. అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరగనున్న ప్రతిష్టాత్మక ఫిఫా ఫైనల్ మ్యాచ్‌కు మెట్‌లైఫ్ స్టేడియం వేదిక కానుంది. భారత కాలమాన ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.30 గంటలకు ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది.Read: ఫిఫా ఫైనల్‌కు ముందు మెస్సీ చివరి సందేశం! -
ఫిఫా ఫైనల్‌కు ముందు మెస్సీ చివరి సందేశం!
ఫిఫా ప్రపంచకప్ చివరి అంకానికి చేరుకుంది. ఆదివారం జరగనున్న ప్రతిష్టాత్మక ఫిఫా ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాతో స్పెయిన్ తలపడనుంది. ఈసారి ఫిఫాలో జట్టు తరఫున అత్యధిక గోల్స్ చేసిన మెస్సీ అన్నీ తానై అర్జెంటీనాను నడిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఫైనల్‌కు ముందు అర్జెంటీనా జట్టు, సహాయక సిబ్బందితో కలిసి దిగిన గ్రూప్ ఫొటోను షేర్ చేసుకున్న మెస్సీ తన చివరి సందేశాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. ఫిఫా టోర్నీ ఆద్యంతం తనకు అండగా నిలిచిన సహచర ఆటగాళ్లకు, కోచ్, సహాయక సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్యేక లేఖను రాసుకొచ్చాడు. ఈ ఫిఫాలో ఫైనల్ చేరే క్రమంలో కేవలం విజయాలు మాత్రమే కాకుండా జట్టు ప్రయాణం కూడా తమను గొప్పదిగా నిలబెట్టిందని మెస్సీ తెలిపాడు. 'ఇన్ని సంవత్సరాల మా ప్రయాణంలో అత్యంత ఆనందకరమైన విషయం ఏంటంటే.. మేము టైటిల్స్ గెలవడమే కాదు, ఈ ప్రయాణంలో ఎన్నో అనుభూతులను పొందాము. అర్జెంటీనా జట్టులోని ఆటగాళ్లతో కలిసి రోజువారి పనులను పంచుకోవడం, కలిసి పోటీ పడడం, కష్ట సమయాల్లో అండగా నిలబడడం, ఇలా ప్రతి అడుగును మనస్ఫూర్తిగా ఆస్వాదించాం. నా ప్రయాణంలో అండగా నిలిచిన సహచర ఆటగాళ్లకు, సహాయక, సాంకేతిక సిబ్బంది, అర్జెంటీనా దేశ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఫిఫా టైటిల్ గెలుస్తామా లేదా అన్న సంగతి పక్కనబెడితే ఇప్పటికే జట్టుగా మరిచిపోలేని, చెరిగిపోని జ్ఞాపకాలను చరిత్రగా లిఖించుకున్నాం. కమాన్ అర్జెంటీనా.’ అని భావోద్వేగంతో పేర్కొన్నాడు. అర్జెంటీనా కెప్టెన్ ఇచ్చిన సందేశం ఆ జట్టు ఒక కుటుంబంలా కలిసి నడుస్తూ ధృడమైన బంధాన్ని చాటిచెబుతుంది. స్పెయిన్‌తో జరిగే ఫైనల్ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా వారసత్వం మాత్రం సురక్షితంగా ఉంటుందని మెస్సీ పరోక్షంగా పేర్కొన్నాడు.ఇక ఫిఫా ఫైనల్ మెస్సీకి చివరి అంతర్జాతీయ మ్యాచ్ అవుతుందనే ప్రచారం జరుగుతున్న వేళ మెస్సీ ఇచ్చిన తాజా సందేశం వైరల్‌గా మారింది. ఫైనల్‌కు ముందే ఇలాంటి సందేశాన్ని ఇవ్వడం వెనుక మెస్సీ తన రిటైర్మెంట్ విషయాన్ని పరోక్షంగా వెల్లడించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీలో మెస్సీ ఏడు మ్యాచ్‌ల్లో 8 గోల్స్‌తో పాటు నాలుగు అసిస్ట్‌లతో గోల్డెన్ బూట్ రేసులో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఫ్రాన్స్ సూపర్‌స్టార్ కైలియన్ ఎంబాపె 8 మ్యాచ్‌ల్లో 10 గోల్స్‌తో పాటు 4 అసిస్ట్‌లతో తొలి స్థానంలో ఉన్నాడు. భారత కాలమాన ప్రకారం అర్జెంటీనా, స్పెయిన్ మధ్య ఫైనల్ మ్యాచ్ ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటలకు మొదలుకానుంది. Excited for finals but Lionel messi will play his last match for argentina pic.twitter.com/clW43BWtQV— `mr. villa (@Luccydevil07) July 19, 2026Read: సింధుదే జపాన్ ఓపెన్.. తొలి భారత షట్లర్‌గా రికార్డు -
ఫైనల్ 'కిక్'
39 రోజులు, 103 మ్యాచ్‌ల తర్వాత ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. మెస్సీ మెరుపులతో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా తమ టైటిల్‌ను నిలబెట్టుకుంటుందా? టీనేజ్ సంచలనం లమీన్ యామల్ నైపుణ్యం 2010 విశ్వవిజేత స్పెయిన్‌కు రెండోసారి ప్రపంచకప్ అందిస్తుందా? అటాకింగ్ ఆటతీరుతో ఈ ప్రపంచకప్‌ను ఊపేసిన అర్జెంటీనా ఆటగాళ్లు అదే జోరును తుది పోరులో కొనసాగిస్తారా? అడ్డుగోడలా నిలబడుతూ ప్రత్యర్థి జట్లకు గోల్ కొట్టడమే గగనంలా చేసిన స్పెయిన్ డిఫెన్స్ తుది పోరులోనూ విజయవంతం అవుతుందా? వరుసగా రెండోసారి ప్రపంచకప్‌ను సొంతం చేసుకొని ఇటలీ, బ్రెజిల్ సరసన అర్జెంటీనా నిలుస్తుందా? అర్జెంటీనా ఆశలను వమ్ము చేసి ప్రపంచకప్‌తో స్పెయిన్ పూర్వ వైభవం సాధిస్తుందా? వీటన్నింటికి సమాధానం నేడు అర్ధరాత్రి తర్వాత లభిస్తుంది. న్యూయార్క్: ఒక్క పరాజయం లేకుండానే అంతిమ సమరానికి అర్హత సాధించిన అర్జెంటీనా, స్పెయిన్ జట్లు ప్రపంచకప్‌ను ముద్దాడేందుకు ఒక్క విజయం దూరంలో నిలిచాయి. ఆఖరి పోరులోనూ గెలిచి టోర్నీని అజేయంగా ముగించాలని రెండు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేడు జరిగే 23వ ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ ఫైనల్‌పై యావత్ క్రీడాలోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మైదానంలో ప్రత్యక్షంగా 80 వేల మంది... ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల మందికి పైగా ప్రేక్షకులు టీవీల ద్వారా ఈ తుది పోరును వీక్షించనున్నారు.2022లో ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా జట్టులోని 17 మంది ప్లేయర్లు ప్రస్తుత ప్రపంచకప్‌లోనూ ఆడుతున్నారు.ముఖ్యంగా 39 ఏళ్ల లియోనెల్ మెస్సీ నాయకత్వంలో అర్జెంటీనా ఈ టోర్నీలో అద్భుత ఆటతీరుతో అలరిస్తోంది. నాకౌట్ మ్యాచ్‌ల్లో ఓటమి అంచుల్లో నుంచి విజయకేతనం ఎగురవేస్తోంది. చివరి క్షణం ముగిసేవరకు తమను తక్కువ అంచనా వేయొద్దని.... అవకాశం దొరికితే ఏ క్షణంలోనైనా మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా తమలో ఉందని మెస్సీ బృందం నిరూపించుకుంది. ఈ నేపథ్యంలో ఫైనల్ గెలుపు కిక్ తమదే కావాలని అర్జెంటీనా పకడ్బందీ ప్రణాళికలతో బరిలోకి దిగనుంది. మరోవైపు 2010లో ఏకైకసారి ప్రపంచకప్ గెలిచిన స్పెయిన్ జట్టులోని ఆటగాళ్లెవరూ ప్రస్తుత ప్రపంచకప్‌లో లేరు. అయితే 2024లో యూరోపియన్ చాంపియన్‌షిప్ గెల్చుకున్న స్పెయిన్ జట్టులోని 16 మంది ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆడుతున్నారు. స్పెయిన్ భవిష్యత్ ఆశాకిరణం, 19 ఏళ్ల యామల్పై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. చివర్లో చెలరేగుతూ... ఫైనల్ చేరే క్రమంలో అర్జెంటీనా జట్టు 19 గోల్స్ సాధించింది. ప్రత్యర్థి జట్లకు 7 గోల్స్ సమ ర్పించుకుంది. అర్జెంటీనా చేసిన 19 గోల్స్‌లో 12 గోల్స్ మ్యాచ్‌లో 75 నిమిషాలు ముగిశాకే వచ్చాయి. ముందుగా నెమ్మదిగా ఆడటం... ప్రత్యర్థి జట్టు గోల్ చేశాక అర్జెంటీనా జోరు పెంచుతూ తమ సత్తా చాటుకుంటోంది. చివర్లో సబ్‌స్టిట్యూట్‌గా వస్తున్న ఆటగాళ్లు కూడా గోల్స్ చేస్తూ అర్జెంటీనాను గట్టెక్కిస్తున్నారు. మరోవైపు స్పెయిన్ జట్టు పూర్తి డిఫెన్స్ ఆటతీరుకు ప్రాధాన్యమిస్తోంది. అవకాశం దొరికినపుడు గోల్ చేసి ఆ తర్వాత ఆ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ విజయతీరానికి చేరుతోంది. ఈ టోర్నీలో స్పెయిన్ జట్టు 13 గోల్స్ సాధించి... ప్రత్యర్థి జట్టుకు ఒక్క గోల్ మాత్రమే సమ ర్పించుకుంది. మొత్తం ఏడు మ్యాచ్‌ల్లో స్పెయిన్ గోల్‌పోస్ట్‌పై ప్రత్యర్థి జట్లు 11 సార్లు మాత్రమే షాట్లు కొట్టడం గమనార్హం.విజేత జట్టుకు రూ. 481 కోట్లు ఈసారి ప్రపంచకప్ గెలిచిన జట్టుకు 5 కోట్ల డాలర్లు (రూ. 481 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించనుంది. రన్నరప్ జట్టుకు 3 కోట్ల 30 లక్షల డాలర్లు (రూ. 317 కోట్లు) దక్కుతాయి. మూడో స్థానం పొందిన జట్టు ఖాతాలో 2 కోట్ల 90 లక్షల డాలర్లు (రూ. 279 కోట్లు) చేరుతాయి. నాలుగో స్థానం సంపాదించిన జట్టుకు 2 కోట్ల 70 లక్షల డాలర్లు (రూ. 259 కోట్లు) లభిస్తాయి. 5 నుంచి 8 స్థానాల మధ్య నిలిచిన జట్లు 1 కోటీ 90 లక్షల డాలర్ల చొప్పున (రూ. 182 కోట్లు చొప్పున) అందుకుంటాయి. 9 నుంచి 16 స్థానాల మధ్య నిలిచిన జట్లకు 1 కోటీ 50 లక్షల డాలర్ల చొప్పున (రూ. 144 కోట్లు చొప్పున) లభిస్తాయి. 17 నుంచి 32 స్థానాల మధ్య నిలిచిన జట్లు 1 కోటీ 10 లక్షల డాలర్ల చొప్పున (రూ. 105 కోట్లు చొప్పున) అందుకుంటాయి. 33 నుంచి 48 స్థానాల్లో నిలిచిన జట్ల ఖాతాలో 90 లక్షల డాలర్ల చొప్పున (రూ. 86 కోట్లు) లభిస్తాయి. 37 ప్రపంచకప్‌లో ఫైనల్ చేరే క్రమంలో స్పెయిన్ జట్టు వరుసగా 37 మ్యాచ్‌ల్లో పరాజయం రుచి చూడలేదు. 2024 నుంచి ఇప్పటి వరకు స్పెయిన్ 27 మ్యాచ్‌ల్లో గెలిచింది. 10 మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది. నేడు జరిగే ఫైనల్లో స్పెయిన్ గెలిస్తే ఇటలీ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొడుతుంది. ఇటలీ జట్టు 2018 నుంచి 2021 వరకు వరుసగా 37 మ్యాచ్‌ల్లో ఓడిపోలేదు.3 మెస్సీ బృందం ఈసారి టైటిల్ గెలిస్తే ప్రపంచకప్‌ను అత్యధికంగా నాలుగుసార్లు గెలిచిన మూడో జట్టుగా నిలుస్తుంది. అర్జెంటీనా ఇప్పటికి మూడుసార్లు (1978, 1986, 2022) విజేతగా నిలిచింది. బ్రెజిల్ జట్టు అత్యధికంగా ఐదుసార్లు ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. ఇటలీ, జర్మనీ జట్లు నాలుగుసార్లు చొప్పున సాధించాయి. 1 ప్రపంచ ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్‌ను 1992లో ప్రవేశపెట్టాక వరల్డ్‌కప్ టైటిల్ కోసం ర్యాంకింగ్స్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు తుది పోరులో తలపడుతున్నాయి. 4 ఫైనల్లో స్పెయిన్‌పై అర్జెంటీనా గెలిస్తే ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో గెలిచి ప్రపంచకప్ టైటిల్ నెగ్గిన నాలుగో జట్టుగా గుర్తింపు పొందుతుంది. గతంలో బ్రెజిల్ (2002, 1970), ఉరుగ్వే (1930), ఇటలీ (1934) మాత్రమే ఈ ఘనత సాధించాయి.3 అర్జెంటీనా ఫైనల్లో విజయం సాధిస్తే వరుసగా రెండు ప్రపంచకప్‌లు గెలిచిన మూడో జట్టుగా గుర్తింపు పొందుతుంది. గతంలో ఇటలీ (1934, 1938), బ్రెజిల్ (1958, 1962) మాత్రమే ఈ ఘనత సాధించాయి.1 మూడు ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఒక జట్టుకు కెపె్టన్‌గా వ్యవహరించిన తొలి ప్లేయర్‌గా మెస్సీ గుర్తింపు పొందనున్నాడు. 2014 ప్రపంచకప్ ఫైనల్స్‌లో మెస్సీ కెప్టెన్సీలో అర్జెంటీనా జట్టు జర్మనీ చేతిలో ఓడిపోయింది. 2022 ప్రపంచకప్ ఫైనల్లో ఫ్రాన్స్‌పై గెలిచింది. -
ఫిఫా ఫైనల్ ఆఖరిదా?.. రిటైర్మెంట్పై మెస్సీ స్పందన!
ఫిఫా ప్రపంచకప్ 2026 తర్వాత అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలకనున్నాడా? ఆదివారం స్పెయిన్‌తో జరగనున్న ఫిఫా ఫైనల్ మెస్సీ కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ అని ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే లియోనల్ మెస్సీ తన రిటైర్మెంట్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌తో సెమీఫైనల్ ముగిసిన తర్వాత ప్రెస్‌మీట్‌కు హాజరైన మెస్సీకి తన రిటైర్మెంట్పై ఒక ప్రశ్న ఎదురైంది. అదేంటంటే.. ‘మీ జర్నీ ఒక వీడియో గేమ్‌లా ఉంది. ఫిఫా ఫైనల్ మీకు చివరిది కానుందా’ అని ప్రశ్నించారు. దీనిపై మెస్సీ స్పందిస్తూ.. ‘నేను నా చివరి మ్యాచ్‌ను గత వరల్డ్‌కప్ (ఖతార్ 2022)లోనే ఆడేశాను. అక్కడ ఫిఫా టైటిల్ గెలవడంతోనే నా కెరీర్లో అత్యున్నత శిఖరాన్ని అధిరోహించాను. ఇప్పుడు నా ఆట ముగిసిపోయింది’అని అర్ధంకాని రీతిలో జవాబివ్వడంతో రిపోర్టర్లు తలలు పట్టుకోవడం గమనార్హం. దీంతో మెస్సీ రిటైర్మెంట్పై మరోసారి గందరగోళం నెలకొంది. అయితే ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ ముగిసిన తర్వాత మెస్సీ ఆటకు వీడ్కోలు పలుకుతాడా లేదా అన్నది ఆదివారమే తేలనుంది. ఇదే విషయమై అర్జెంటీనా జట్టు కోచ్, మేనేజర్ లియోనల్ స్కలోనిని కూడా అడిగారు.ఆయన కూడా ‘నాకైతే ఏ సమాచారం లేదు. నిజాయితీగా చెప్పాలంటే మెస్సీ తన నిర్ణయంతో మమ్మల్ని సర్ప్రైజ్ చేయొచ్చు.. చేయకపోవచ్చు. రిటైర్మెంట్ అంశం పూర్తిగా అతడికే వదిలేశాం’ అని తెలివిగా సమాధానం చెప్పుకొచ్చారు. ఇక ఫిఫా ప్రపంచకప్ 2026లో మెస్సీ అత్యున్నత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఏడు మ్యాచ్‌ల్లోనే 8 గోల్స్‌తో గోల్డెన్ బూట్ రేసులో దూసుకెళ్తున్నాడు. అయితే ఫ్రాన్స్ సూపర్‌స్టార్ కైలియన్ ఎంబాపె (7 మ్యాచ్‌ల్లో 8 గోల్స్, 3 అసిస్ట్‌లు) మెస్సీతో సమానంగా ఉన్నాడు. స్పెయిన్‌తో ఫైనల్లో మెస్సీ గోల్ చేస్తే గోల్డెన్ బూట్ అతడి సొంతమవుతుంది. ఒకవేళ మెస్సీ గోల్ చేయకుంటే ఎంబాపెకు గోల్డెన్ బూట్ దక్కే అవకాశముంది. రికార్డు స్థాయిలో ఆరోసారి ఫిఫా ప్రపంచకప్ ఆడుతున్న మెస్సీ ఓవరాల్‌గా 21 గోల్స్‌తో ఫిఫాలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలోనూ నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. మెస్సీ వెనుకే ఎంబాపె (ఫ్రాన్స్, 20 గోల్స్) రెండో స్థానంలో ఉన్నాడు. 🗣️ “Your career is like a video game, you keep unlocking new levels until you reach the final”.😬🇦🇷 Leo Messi: “I already completed the game at the last World Cup in Qatar”. pic.twitter.com/CD2eZLhlv0— Fabrizio Romano (@FabrizioRomano) July 18, 2026Read: ఫిఫా ఫైనల్ మ్యాచ్.. ఒక్క టికెట్ ధర 27 లక్షలు! -
ఫిఫా ఫైనల్ మ్యాచ్.. ఒక్క టికెట్ ధర 27 లక్షలు!
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు ఒకరోజు మాత్రమే మిగిలి ఉంది. ప్రతిష్టాత్మక ఫిఫా ఫైనల్లో అర్జెంటీనా, స్పెయిన్ తలపడుతున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన అర్జెంటీనా వరుసగా రెండోసారి ఫిఫా ఫైనల్లో అడుగుపెట్టడం వల్ల భారీ క్రేజ్ నెలకొంది. అటు 16 ఏళ్ల తర్వాత ఫైనల్లో అడుగుపెట్టిన స్పెయిన్ కూడా కప్ కొట్టాలనే కసితో ఉంది. మరి కొదమసింహాల్లా లాంటి ప్రత్యర్థుల మధ్య పోటీ జరుగుతున్న వేళ టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటకుండా ఉంటాయా చెప్పండి. ఫైనల్ మ్యాచ్‌కు ముందే టికెట్ల ధరల రూపంలో ఫిఫా రికార్డులన్నీ బద్దలవుతున్నాయి. ఫిఫా ఫైనల్ మ్యాచ్‌కు సంబంధించి ఒక్క టికెట్ ధర ఏకంగా రూ.27 లక్షలు పలికింది. 96 ఏళ్ల ఫిఫా ప్రపంచ కప్ చరిత్రలోనే ఇది అత్యధిక ధర కావడం విశేషం. ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు సంబంధించిన అత్యున్నత శ్రేణి (హాస్పిటాలిటీ) టికెట్ ధర ఏకంగా రూ. 27 లక్షలు పలుకుతోంది. ఈ ప్రీమియం హాస్పిటాలిటీ ప్యాకేజీలు కేవలం మ్యాచ్ వీక్షణకే పరిమితం కావు. విదేశీ వీఐపీలు, కార్పొరేట్ దిగ్గజాలను ఆకర్షించేలా స్టేడియంలో ప్రత్యేక విలాసవంతమైన లాంజ్‌లు, ఫైన్ డైనింగ్, విభిన్న లగ్జరీ సేవలను ఫిఫా అందిస్తోంది. అయితే, ఇది కేవలం వీఐపీ ప్యాకేజీ ధర మాత్రమేనని, సామాన్య అభిమానుల కోసం అందుబాటులో ఉండే సాధారణ మ్యాచ్ టికెట్ల ధరలు దీనికంటే చాలా తక్కువగా ఉంటాయని నిర్వాహకులు స్పష్టం చేశారు.అమెరికా క్రీడా చరిత్రలో 2024లో జరిగిన ‘సూపర్‌బౌల్’ చాంపియన్‌షిప్‌లో శాన్ ఫ్రాన్సిస్కో 49ఈఆర్ఎస్ వర్సెస్ కాన్సాస్ సిటీ అత్యంత ఖరీదైన మ్యాచ్‌గా నిలిచింది. అప్పట్లో దీని సగటు టికెట్ ధర రూ. 9.6 లక్షలుగా నమోదైంది. ఇప్పుడు ఫిఫా ఫైనల్ టికెట్ ధర ఆ రికార్డును దాదాపు మూడు రెట్లు అధిగమించి సరికొత్త సంచలనం సృష్టించింది. ఇక ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ టికెట్ కనిష్ట ధర 6,943 డాలర్లు (సుమారు రూ.6 లక్షలు)గా ఉంది. యావరేజ్ టికెట్ ధర 11,327 డాలర్లు (సుమారు రూ. 10 లక్షలు)గా ఉంది. అర్జెంటీనా, ఇంగ్లండ్ మధ్య జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్ టికెట్ కనిష్ట ధర 7,200 డాలర్లు ( సుమారు రూ. 6.93 లక్షలు)గా ఉంది. సెమీస్‌తో పోలిస్తే ఫైనల్ మ్యాచ్ టికెట్ కనిష్ట ధర 93 వేలు తక్కువగా ఉండడం గమనార్హం. మొత్తం మీద ఈసారి ప్రపంచవ్యాప్తంగానూ ఫిఫా ప్రపంచకప్ వీక్షకుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో ఎన్నడూ లేనంతగా ఫిఫా చరిత్రలో టీఆర్పీ రేట్లన్నీ బద్దలయ్యాయి.Read: ఫిఫా కీలక నిర్ణయం.. 96 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి! -
ఫిఫా కీలక నిర్ణయం.. 96 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి!
ఫిఫా ప్రపంచకప్ ఆఖరి అంకానికి చేరుకుంది. ఆదివారం జరగనున్న ప్రతిష్టాత్మక ఫిఫా పైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా, స్పెయిన్ తలపడనున్నాయి. అయితే మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫిఫా టైటిల్ సొంతం చేసుకోవడంతో పాటు ఆటగాళ్లు మెడల్స్ అందుకోనున్నారు. విన్నర్ జట్టుకు లభించే ప్రైజ్‌మనీనే భారీగా ఉంటుంది. ఒక్కో ఆటగాడు భారీ మొత్తాన్ని దక్కించుకుంటారు. ఈసారి ఫిఫా ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన జట్టులోని ఆటగాళ్లకు 96 ఏళ్ల ఫుట్‌బాల్ ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారి ఫిఫా ప్రత్యేక గిఫ్ట్ అందించనుంది. ఫిఫా 2026లో చాంపియన్‌గా నిలిచిన జట్టు ఆటగాళ్లకు ఉంగరాలు ప్రదానం చేయనున్నారు. టైటిల్ గెలిచిన జట్లకు ఉంగరాలు ఇవ్వడం నార్త్ అమెరికాలో 19వ శతాబ్దం నుంచి ఒక సంప్రదాయంగా వస్తోంది.ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఫిఫా గెలిచిన జట్టులోని ఆటగాళ్లుకు 30 ప్రత్యేక ఉంగరాలను ఇప్పటికే తయారు చేయించి ఉంచారు. నార్త్ అమెరికా సంప్రదాయం ప్రకారం గెలిచిన జట్టు గుర్తింపును ప్రతిబింబించేలా ఈ ఉంగరాలను ఆటగాళ్ల వేలికి తొడగనున్నట్లు ఫిఫా తెలిపింది. అయితే ఆ ఉంగరాల ధర ఎంత ఉంటుందనేది మాత్రం ఫిఫా వెల్లడించలేదు.1893 నుంచి రింగుల ప్రదానంనార్త్ అమెరికాలో చాంపియన్లుగా నిలిచిన జట్లు లేదా వ్యక్తులకు రింగుల ప్రదాన సంప్రదాయం అనేది 1893 నుంచి కొనసాగుతోంది. ఆ సంవత్సరంలో మాంట్రియల్ హాకీ క్లబ్‌కు డొమినియన్ హాకీ ఛాలెంజ్ కప్ లభించింది. దీనినే ఇప్పుడు స్టాన్లీ కప్ అని పిలుస్తారు. ఆ జట్టు పైభాగంలో చిన్న హాకీ స్టిక్‌లు జతచేయబడిన సాధారణ పట్టీలను కూడా తయారు చేయించుకుంది.ఇక మేజర్ లీగ్ బేస్‌బాల్ జట్లు 1920ల్లో ఛాంపియన్షిప్ రింగులను ఇవ్వడం ప్రారంభించగా.. నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) ఛాంపియన్‌షిప్‌లో మాత్రం 1940 నుంచి ఆ టోర్నీలో విజేతగా నిలిచిన జట్లకు రింగులను అందిస్తూ వస్తున్నారు. 1960ల నుంచి కొనసాగుతున్న సూపర్ బౌల్ శకంలో విజేతగా నిలిచిన ఎన్ఎఫ్ఎల్ జట్లు రింగులు అందుకుంటున్నాయి. జట్లతో పాటు వివిధ క్రీడల్లో హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న దిగ్గజాలతో పాటు ప్రపంచ వేదికపై తమ దేశానికి (నార్త్ అమెరికా) ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లకు కూడా లభించే ప్రోత్సాహక ప్యాకేజీలో భాగంగా యూఎస్ ఒలింపియన్లు, పారాలింపియన్లు ఉంగరాలను అందుకోవడం ఆనవాయితీగా వస్తోంది.చదవండి: ఫిఫా ఫైనల్‌కు రిఫరీగా అతడే.. అర్జెంటీనాకు పీడకల! -
యామల్ ఒక్కడే కాదు.. ఈ ముగ్గురూ ఇప్పుడు మెస్సీకి ‘ప్రత్యర్థులే’!
ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్‌కప్-2026 ఫైనల్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. న్యూజెర్సీ వేదికగా భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అర్జెంటీనా- స్పెయిన్ మధ్య టైటిల్ పోరు జరుగనుంది. ఈ నేపథ్యంలో అందరి కళ్లు అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ, స్పెయిన్ యువ సంచలనం లమీన్ యామల్‌పైనే నిలిచాయి.లాలపోసి జోల పాడాడునిజానికి కెరీర్లో అప్పుడప్పుడే ఎదుగుతున్న ఏ ఆటగాడైనా... తన అభిమాన ప్లేయర్‌ను దగ్గర నుంచి చూడాలనో లేక అతడితో ఆటోగ్రాఫ్, ఫొటోగ్రాఫ్ తీసుకోవాలనో కోరుకుంటాడు. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి చిన్నప్పుడు ఆశిష్ నెహ్రా చేతుల మీదుగా అవార్డు తీసుకొని మురిసిపోగా... శ్రేయస్ అయ్యర్ బాల్‌బాయ్‌గా ఉన్నప్పుడు ఇర్ఫాన్ పఠాన్ మాటలతో స్ఫూర్తిపొందాడు. ఇలా ఎవరైనా ఊహ వచ్చాకే తమ అభిమాన ఆటగాళ్లతో అనుబంధం పెంచుకుంటారు. కానీ, స్పెయిన్ ఫుట్‌బాల్ యువ సంచలనం లమీన్ యామల్ అనుభవం మాత్రం దీనికి పూర్తి విరుద్ధం. ఊహ తెలియక ముందే యామల్‌ను అతడి అభిమాన ప్లేయర్ ముద్దాడాడు. ఐదు నెలల వయసులోనే లాలపోసి జోల పాడాడు. ఇదేంటీ విడ్డూరం అనుకుంటున్నారా! కాదు నిజమే. అపుడు ఐదు నెలల పసికందు.. ఇపుడు ప్రత్యర్థిదాదాపు రెండు దశాబ్దాల క్రితం ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకుంటున్న ఓ యువ ఆటగాడు... ఓ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఐదు నెలల పసికందును ఎత్తుకొని ముద్దుచేశాడు. కట్ చేస్తే... ఆ ఎత్తుకున్న వ్యక్తి ప్రస్తుతం అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సీ కాగా... ఆ ముద్దులొలికే బాబు స్పెయిన్ స్టార్ ప్లేయర్ లమీన్ యామల్. యూనిసెఫ్, బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్ ఆధ్వర్యంలో 2007లో జరిగిన ఈ కార్యక్రమంలో ఐదు నెలల యామల్‌కు మెస్సీ స్నానం చేయించాడు. ఆ రోజు మెస్సీ చేతుల్లో ఆడుకున్న ఆ చిన్నారి ఇప్పుడు పెరిగి పెద్ద వాడై అతడితోనే తలపడేందుకు సిద్ధమయ్యాడు. అమెరికా వేదికగా ఆదివారం జరగనున్న ప్రతిష్టాత్మక ‘ఫిఫా’ ప్రపంచకప్ ఫైనల్లో ఈ ఇద్దరు ప్లేయర్లు అమీతుమీ తేల్చుకోనున్న నేపథ్యంలో... 19 ఏళ్ల నాటి ఫొటో సోషల్ మీడియాను ఊపేస్తోంది.అయితే ఏఐ యుగంలో ఈ ఫోటో నకిలీ అయి ఉంటుందని ప్రచారం జరగగా... యూనిసెఫ్ ప్రతినిధులు ఈ ఫొటో వెనక ఉన్న చరిత్రను తాజాగా వెల్లడించారు. 2008 యూనిసెఫ్ క్యాలెండర్ కోసం ఈ ఫొటోషూట్ నిర్వహించినట్లు తెలిపారు. హాలీవుడ్ సినిమా స్క్రిప్ట్‌ను తలపిస్తున్న ఈ నిజజీవిత కథ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. యామల్ ఒక్కడే కాదు..ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర అంశం తెరమీదకు వచ్చింది. యామల్ ఒక్కడే కాదు.. ఫైనల్లో మెస్సీ బృందంతో తలపడనున్న స్పెయిన్ జట్టులో మరో ముగ్గురు కూడా మెస్సీతో చిన్ననాడే ఫొటోలకు ఫోజులిచ్చారు. వారు మరెవరో కాదు.. డానీ ఒల్మో (Dani Olmo), జోవాన్ గ్రేసియా (Joan Garcia), గవీ (Gavi).బార్సిలోనా మిడ్‌ఫీల్డర్ గవీకి మెస్సీ రోల్ మోడల్. ఇప్పుడు తన ఆరాధ్య ఫుట్‌బాలర్‌కు ప్రత్యర్థిగా అతడు బరిలోకి దిగనున్నాడు. ఇక స్పెయిన్ జట్టులో ఫార్వర్డ్ ప్లేయర్‌గా, సెంట్రల్ మిడ్‌ఫీల్డర్‌గా డానీ పాత్ర కీలకం. బార్సిలోనాలో చాలా ఏళ్ల క్రితమే అతడు మెస్సీతో కలిసి ఫొటో దిగాడు. ఇప్పుడు తన అనుభవాన్ని డానీ.. తన రోల్ మోడల్ మెస్సీకి వ్యతిరేకంగా ఉపయోగించబోతున్నాడు. ఇక జోవాన్ గ్రేసియా స్పెయిన్ గోల్ కీపర్. చిన్నపుడు మెస్సీతో కలిసి అతడు సందడి చేశాడు. ఇప్పుడు మెస్సీ గోల్ కొట్టకుండా ఆపే అడ్డుగోడలా నిలబడేందుకు సిద్ధమయ్యాడు. ఇది విధి రాసిన కథఈ నేపథ్యంలో.. ‘ఇది విధి రాసిన కథ.. మెస్సీ చేతుల్లో నాడు ఒదిగిపోయిన చిన్నారులు నేడు.. అతడికే ప్రత్యర్థిగా మారడం నిజంగా నమ్మలేని విషయం’ అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. కాగా యామల్ ఫొటో నిజమే అని యూనిసెఫ్ ధ్రువీకరించగా.. మిగతా ముగ్గురితో ఉన్న ఫొటోలు మాత్రం బార్సిలోనా ఇండిపెండెంట్ న్యూస్ చానెల్ బార్కా యూనివర్సల్ ఎక్స్ వేదికగా షేర్ చేయడంతో తెరమీదకు వచ్చాయి.చదవండి: రోహిత్, జైస్వాల్ కోసం నాడు గిల్ అలా చేశాడు! -
ఫిఫా ఫైనల్‌కు రిఫరీగా అతడే.. అర్జెంటీనాకు పీడకల!
అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరిగే ఫీఫా ప్రపంచ కప్ ఫైనల్‌కు రిఫరీగా స్లోవేనియాకు చెందిన స్లావో విన్సిచ్ ఎంపికయ్యాడు. తాజా నిర్ణయం అర్జెంటీనా అభిమానుల్లో ఆందోళనను రేకెత్తించింది. ఎందుకంటే, విన్సిచ్ గత రిఫరీ అనుభవాలు అర్జెంటీనాకు పీడకలను మిగిల్చింది. విషయంలోకి వెళితే.. 2022 ఖతార్ ప్రపంచ కప్‌లో అర్జెంటీనా, సౌదీ అరేబియా మధ్య జరిగిన ప్రారంభ మ్యాచ్‌కు విన్సిచ్ రిఫరీగా వ్యవహరించారు. ఎనిమిదో నిమిషంలో అర్జెంటీనాకు విన్సిచ్ పెనాల్టీని ఇచ్చ్చాడు. ఆ పెనాల్టీని మెస్సీ గోల్‌గా మలిచాడు. అంతేకాదు విన్సిచ్ సౌదీ ఆటగాళ్లకు ఆరు యెల్లోకార్డులు చూపించాడు. అయితే, రెండో అర్ధభాగంలో అర్జెంటీనా సౌదీ అరేబియా చేతిలో 1-2 తేడాతో అనూహ్య ఓటమిని చవిచూసింది. ఫిఫాలో విన్సిచ్ రిఫరీగా వ్యవహరించిన మ్యాచ్‌ల్లో అర్జెంటీనా ఓటమి చవిచూసిన ఏకైక మ్యాచ్ ఇదే కావడం గమనార్హం.స్పెయిన్‌తో అనుబంధం..అయితే విన్సిచ్కు స్పెయిన్‌తో మంచి అనుబంధముంది. స్పెయిన్ ఆడిన చాలా మ్యాచ్‌లకు విన్సిచ్ రిఫరీగా వ్యవహరించాడు. 2017లో కొలంబియాతో జరిగిన స్నేహపూర్వక మ్యాచ్‌కు, యూరో 2020లో స్వీడన్, స్పెయిన్ మధ్య జరిగిన మ్యాచ్‌కు, 2023 UEFA నేషన్స్ లీగ్ సెమీ-ఫైనల్ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించాడు. యువ ఆటగాడు లామిన్ యమాల్ జట్టులో స్థిరమైన ఆటగాడిగా మారిన తర్వాత, యూరో 2024లో ఇటలీపై స్పెయిన్ 1-0తో గెలిచిన మ్యాచ్‌తో పాటు, ఫిఫా 2026లో ఫ్రాన్స్‌తో జరిగిన సెమీ-ఫైనల్‌కు కూడా విన్సిచ్ రిఫరీగా వ్యవహరించాడు.అపఖ్యాతిఇక ప్రస్తుత ఫిఫా ప్రపంచ కప్‌లో మూడు మ్యాచ్‌లకు రిఫరీగా వ్యవహరించిన విన్సిచ్, మెక్సికో-ఈక్వెడార్ మ్యాచ్‌లో ఈక్వెడార్ ఆటగాడు పియరో హింకాపీకి రెడ్ కార్డ్ చూపించి అపఖ్యాతి పాలయ్యాడు. దీంతో ఆదివారం న్యూయార్క్ వేదికగా అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో విన్సిచ్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఎలాంటి వివాదాలకు తావు లేకుండా వీఏఆర్ ద్వారా ఫిఫా నిశితంగా పరిశీలించనుంది. -
అపశకునం ముద్ర.. ఫైనల్‌కు దూరంగా అర్జెంటీనా అధ్యక్షుడు!
ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్ ఆదివారం అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరగనుంది. ఏ టోర్నీలో అయినా తమ దేశం ఫైనల్ మ్యాచ్ ఆడుతుంటే సదరు దేశాధ్యక్షుడు లైవ్‌లో చూడాలని ఆశించడం సహజం. కానీ అర్జెంటీనా అధ్యక్షుడు జావియర్ మిలే మాత్రం దీనికి భిన్నంగా కనిపిస్తున్నారు. మూడ నమ్మకాల నెపంతో అర్జెంటీనా ఆడనున్న ఫిఫా పైనల్ మ్యాచ్‌ను లైవ్‌లో కాకుండా ఇంట్లోనే టీవీలో వీక్షించాలని నిర్ణయించుకున్నారు. గతంలో ఒక అర్జెంటీనా అధ్యక్షుడు లైవ్‌లో ఫిఫా మ్యాచ్ చూడడం వల్ల అర్జెంటీనా ఆ మ్యాచ్‌లో ఓడిపోయింది. దీంతో సదరు అధ్యక్షుడిపై ‘అపశకునం’ ముద్ర వేశారు. దీంతో ఆ సెంటిమెంట్‌కు భయపడి తాజా ఫిఫా ఫైనల్‌కు జావియర్ మిలే దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు తెలిసింది. ఇక ఫిఫా ఫైనల్‌కు జావియర్ మిలే దూరమవ్వడం వెనుక మరో బలమైన కారణం కూడా ఉంది. మూడనమ్మకమా లేదా సెంటిమెంట్.. ఇలా ఏది అనుకున్నా తాను మాత్రం ఫైనల్ మ్యాచ్‌ను మాత్రం టీవీలోనే వీక్షిస్తానని అర్జెంటీనా అధ్యక్షుడు జావియర్ మిలే అధికారులకు తెగేసి చెప్పడం ఆసక్తి కలిగిస్తోంది. మెస్సీకి వీరాభిమాని అయిన అర్జెంటీనా అధ్యక్షుడు జావియర్ మిలే ఈసారి ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా ఆడిన ఏడు మ్యాచ్‌లను తన ఇంటిలోనే వీక్షించారు. ఈ ఏడింటిలో ఒక్క ఓటమి, డ్రా కానీ చేసుకోని అర్జెంటీనా డిఫెండింగ్ చాంపియన్ హోదాలో వరుసగా రెండోసారి ఫిఫా ఫైనల్లో అడుగుపెట్టింది. మరో విశేషమేమిటంటే జావియర్ మిలే తన హెవి జాకెట్‌ను ధరించి ఈ మ్యాచ్‌లన్నింటిని వీక్షించారట. కాబట్టి ఫైనల్ మ్యాచ్‌కు కూడా అదే హెవీ జాకెట్‌ను ధరించనున్నట్లు అర్జెంటీనా అధికార యంత్రాంగం ఒక ప్రకటనలో పేర్కొంది. ఫిఫా ప్రపంచకప్‌లో మూడ నమ్మకాలు కొత్తవేమి కావు. ఇంగ్లండ్‌తో సెమీఫైనల్ సందర్భంగా అర్జెంటీనా అభిమానులు మూడ నమ్మకాల పేరిట కాబాలస్ (ప్రీజర్‌లో ప్రత్యర్థి ఆటగాళ్ల ఫొటోలు ఉంచడం) సహా చాలా మంది అభిమానులు అర్జెంటీనా గెలవాలంటూ తాము నమ్మే దైవాన్ని ప్రార్థించడం వైరల్‌గా మారింది.తాజాగా ఒక దేశాధ్యక్షుడే ఇవాళ మూడ నమ్మకం పేరుతో ఫైనల్ మ్యాచ్‌ను లైవ్‌లో కాకుండా ఇంట్లోనే చూస్తానని చెప్పడం ఆసక్తికర విషయంగా మారిపోయింది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సన్నిహితుడు కావడంతో జావియర్ మిలేకు ఫైనల్ మ్యాచ్‌కు ప్రత్యేక ఆహ్వానం కూడా వచ్చింది. 'మీ స్నేహితుడు ట్రంప్, ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినోలతో కలిసి ఆదివారం ఫిఫా పైనల్ చూసేందుకు న్యూజెర్సీ వెళ్తున్నారా' అని అడిగితే.. 'లేదు అస్సుల వెళ్లను.. ఒలివోస్లోని నా ఇంటి నుంచే ఫైనల్ మ్యాచ్ వీక్షిస్తాను' అని అర్జెంటీనా అధ్యక్షుడు బదులివ్వడం విశేషం.అధ్యక్షుడిపై అపశకునం ముద్రతమ జట్లకు దురదృష్టం వెంటాడుతుందేమోనని అర్జెంటీనా అధ్యక్షులు చాలా కాలంగా కీలకమైన ప్రపంచకప్ మ్యాచ్‌లకు హాజరయ్యే విషయంలో జాగ్రత్త వహిస్తూ వస్తున్నారు. ఈ మూఢనమ్మకం 1990 టోర్నమెంట్ నాటిది. అప్పుడు అర్జెంటీనా అధ్యక్షుడిగా ఉన్న కార్లోస్ మెనెమ్.. ఆనాటి ప్రపంచకప్‌లో కామెరూన్, అర్జెంటీనా మ్యాచ్‌కు హాజరయ్యారు. అయితే ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన అర్జెంటీనా జట్టు కామెరున్ జట్టుతో పోరులో అనూహ్యంగా ఓటమి చవిచూసింది. దీంతో అధ్యక్షుడు మెనెమ్పై “ముఫా (అపశకునం) అని ముద్ర వేశారు. అప్పటి నుంచి ఫిఫా ప్రపంచకప్ ఎక్కడ జరిగినప్పటికీ ఏ అర్జెంటీనా అధ్యక్షుడు కూడా జాతీయ జట్టు మ్యాచ్‌కు హాజరుకాకపోవడం విశేషం.చదవండి: అర్జెంటీనాతో ఫైనల్.. స్పెయిన్‌ను వణికిస్తున్న గాయం! -
ఫైనల్స్ కు అర్జెంటీనా.. సెమీస్ లో ఇంగ్లాండ్ చిత్తు..
-
గురి తప్పిన ఫ్రెంచ్ కిక్
ఒకరిద్దరి మెరుపులు ప్రతీసారి ఏ జట్టుకైనా విజయం అందించవని మరోసారి నిరూపితమైంది. పక్కా ప్రణాళికతో బరిలోకి దిగితే... అడుగడుగునా సమన్వయం ప్రదర్శిస్తూ.. సమష్టిగా ముందుకు కదిలితే... ఎంతటి మేటి ప్రత్యర్థినైనా బోల్తా కొట్టించవచ్చని మళ్లీ రుజువైంది. ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఈసారి కచ్చితంగా ఫ్రాన్స్ విజేతగా నిలుస్తుందని భావించినవారందరి అంచనాలను తారుమారు చేస్తూ స్పెయిన్ సంచలనం సృష్టించింది. కలిసికట్టుగా కళ్లు చెదిరే ఆటతీరుతో ఫ్రాన్స్ ఫైనల్ ఆశలను సెమీఫైనల్లోనే గల్లంతు చేసిన స్పెయిన్... 16 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌లో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. డాలస్: ప్రత్యర్థి స్థాయి చూసి భయపడలేదు... లయబద్దమైన ఆటతో ప్రత్యర్థినే భయపెట్టింది... ఆరంభం నుంచి అంతం వరకు మ్యాచ్‌పై నియంత్రణ కోల్పోలేదు... పకడ్బందీగా ఆడి ప్రత్యర్థినే ఆద్యంతం నియంత్రించింది... తొలి క్షణం నుంచే ప్రత్యర్థి గోల్‌పోస్ట్ దిశగా కదం తొక్కింది.... ప్రత్యర్థి ఆటగాళ్లను ఎక్కడికక్కడే కట్టడి కూడా చేసింది. వెరసి ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో స్పెయిన్ అనూహ్యంగా టైటిల్ ఫేవరెట్‌గా అవతరించింది. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున ముగిసిన తొలి సెమీఫైనల్లో స్పెయిన్ 2–0 గోల్స్ తేడాతో ఫ్రాన్స్ జట్టును బోల్తా కొట్టించింది. స్పెయిన్ తరఫున మికెల్ ఒయర్జబాల్ (22వ నిమిషంలో), పెడ్రో పోరో (58వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. ఈ గెలుపుతో స్పెయిన్ 2010 తర్వాత ఈ మెగా ఈవెంట్లో మళ్లీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. అంతేకాకుండా ఓటమి లేకుండా వరుసగా 37వ మ్యాచ్‌ను ముగించింది. ఈ క్రమంలో ఇటలీ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును స్పెయిన్ సవరించింది. ఎంబాపె తడబాటు...2018 ప్రపంచకప్‌లో టైటిల్ సాధించి... 2022లో రన్నరప్‌గా నిలిచి... ఈసారి మ్యాచ్ మ్యాచ్‌కూ రాటుదేలే ఆటతీరుతో అదరగొట్టిన ఫ్రాన్స్ కీలకమైన సమరంలో ఉసూరుమనిపించింది. ఏమాత్రం పోరాటపటిమ కనబర్చకుండా స్పెయిన్ ‘కిక్’ఎక్కించే ఆటకు సమాధానం ఇవ్వకుండా ఫ్రాన్స్ చేతులెత్తేసింది. సెమీఫైనల్ చేరే క్రమంలో ఫ్రాన్స్ కెపె్టన్ కిలియన్ ఎంబాపె 8 గోల్స్... మరో స్టార్ ఫార్వర్డ్ ఉస్మాన్ డెంబెలె 5 గోల్స్ చేసి సూపర్ ఫామ్‌లో ఉన్నారు. వీరిద్దరు సెమీఫైనల్లోనూ మెరిపిస్తారని... ఫ్రాన్స్ జట్టును ఫైనల్‌కు చేరుస్తారని అభిమానులు ఆశించారు. కానీ ఎంబాపె, డెంబెలె కీలక సమరంలో తేలిపోయారు. స్పెయిన్ డిఫెండర్లను దాటి ఆ జట్టు గోల్‌పోస్ట్ వరకు వెళ్లడంలో ఎంబాపె, డెంబెలె విఫలమయ్యారు. అడపాదడపా వచ్చిన అవకాశాలను కూడా అనుకూలంగా మల్చుకోలేకపోయారు. ఎంబాపెను నియంత్రించడంలో పూర్తిగా సఫలమైన స్పెయిన్ చివరకు మ్యాచ్ ఫలితాన్ని కూడా శాసించింది. ఆరంభం నుంచే వ్యూహాత్మకంగా ఆడిన స్పెయిన్ 22వ నిమిషంలో పెనాల్టీ కిక్‌ను సంపాదించింది. ‘డి’ ఏరియాలో లమీన్ యామల్‌ను ఫ్రాన్స్ డిఫెండర్ లుకాస్ డిగ్నె మొరటుగా అడ్డుకున్నాడు.దాంతో రిఫరీ స్పెయిన్‌కు పెనాల్టీ కిక్ ఇవ్వగా... మికెల్ ఒయర్జబాల్ బంతిని లక్ష్యానికి చేర్చి స్పెయిన్‌ను 1–0తో ఆధిక్యంలో నిలిపాడు. ఈ టోర్నీలో ఒయర్జబాల్కిది ఐదో గోల్ కావడం విశేషం. అనంతరం 58వ నిమిషంలో డానీ ఓల్మో అందించిన పాస్‌ను పెడ్రో గోల్‌గా మలచడంతో స్పెయిన్ ఆధిక్యం 2–0కు పెరిగింది. ఆలస్యంగానైనా ఫ్రాన్స్ పుంజుకుంటుందని, స్కోరును సమం చేస్తుందని అభిమానులు ఆశలు పెట్టుకున్నా... స్పెయిన్ మాత్రం ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. -
ఫిఫా ఫైనల్లో స్పెయిన్.. ఆ జట్టును మాత్రం ఓడించలేకపోయింది!
ఫిఫా ప్రపంచకప్ 2026లో స్పెయిన్ జట్టు 16 ఏళ్ల తర్వాత ఫైనల్లో అడుగుపెట్టింది. గ్రూప్ దశ నుంచి సెమీస్ దాకా తాను తలపడిన అన్ని జట్లను చిత్తు చేసిన స్పెయిన్ కేప్వెర్డెను మాత్రం ఓడించకలేకపోయింది. గ్రూప్ దశలో కేప్‌వెర్డెతో మ్యాచ్‌ను స్పెయిన్ 0-0తో డ్రా చేసుకోవడం గమనార్హం. దీంతో అనామక జట్టుగా ఫిఫాలో ఎంట్రీ ఇచ్చిన కేప్‌వెర్డె టోర్నీ నుంచి నిష్క్రమించే సమయంలో హీరోలా మారిపోయింది. తన గోల్ కీపింగ్ నైపుణ్యంతో వోజిన్హా స్పెయిన్‌ను నిలువరించడంలో కీలకపాత్ర పోషించాడు. స్పెయిన్ ఆటగాళ్లు 27 సార్లు గోల్‌పోస్టుపై దాడులు చేసినప్పటికీ వాటన్నింటిని సమర్థంగా అడ్డుకొని 40 ఏళ్ల వయసులో వోజిన్హా సూపర్‌హీరోగా నిలిచాడు.Photo Credit: FIFA Twitterతాజాగా సెమీస్‌లో ఫ్రాన్స్‌పై గెలిచిన తర్వాత స్పెయిన్ ఫుట్‌బాల్ టీం ఒక కామెంట్ చేసింది. ‘ఈ ఫిఫాలో మేము అందరిని నిలువరిస్తే.. మమ్నల్ని మాత్రం కేప్‌వెర్డె నిలువరించింది. ఫ్రాన్స్‌తో సెమీస్ మ్యాచ్ కంటే కేప్‌వెర్డెతో మ్యాచ్ మాకు చాలా కష్టమనిపించింది’ అని పేర్కొనడం ఆసక్తి కలిగించింది. తాజాగా స్పెయిన్ టీం చేసిన వ్యాఖ్యలతో కేప్‌వెర్డె మరోసారి వార్తల్లో నిలిచింది.స్పెయిన్ ప్రయాణం సాగింది ఇలా..ఫిఫా ప్రపంచకప్‌లో లీగ్ దశలో గ్రూప్-హెచ్లో స్పెయిన్ తొలి మ్యాచ్‌ను కేప్‌వెర్డెతో డ్రా చేసుకుంది. ఆ తర్వాత సౌదీ అరేబియాను 4-0తో చిత్తు చేసింది. లీగ్ దశలో చివరి మ్యాచ్‌లో ఉరుగ్వేను 0-1తో ఓడించిన స్పెయిన్ టేబుల్ టాపర్‌గా రౌండ్ ఆఫ్ 32కు అర్హత సాధించింది. రెండో రౌండ్లో ఆస్ట్రియాను 0-3తో ఓడించి స్పెయిన్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ప్రిక్వార్టర్స్‌లో పోర్చుగల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి వరకు గోల్ చేయడంలో స్పెయిన్ విఫలమైంది. అయితే సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన మైకెల్ మిరినో స్టాపేజీ టైం (91వ నిమిషం)లో గోల్ చేసి పోర్చుగల్‌కు పీడకలను మిగిల్చాడు. పోర్చుగల్‌పై 1-0తో విజయం సాధించిన స్పెయిన్ క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఇక క్వార్టర్స్‌లో స్పెయిన్ బెల్జియంతో తలపడింది. తొలి హాఫ్ ముగిసేసరికి 1-1తో సమంగా నిలిచాయి. అయితే రెండో హాఫ్‌లో బెల్జియం గోల్‌కీపర్ సన్నె లామిన్స్ చేసిన చిన్ప తప్పిదం బెల్జియం కొంపముంచింది. స్పెయిన్ ఆటగాడు కుబార్సి కొట్టిన బంతిని ఆపే ప్రయత్నంలో లామిన్స్ మిస్ చేయడం, ఇదే అదనుగా భావించిన మికెల్ మెరినో బంతిని నేరుగా గోల్‌పోస్ట్‌లోకి తరలించి మరోసారి హీరోగా నిలిచాడు. ఫలితంగా స్పెయిన్ సెమీస్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత జరిగిదంతా ఒక చరిత్రే. మంగళవారం అర్ధరాత్రి జరిగిన సెమీఫైనల్లో స్పెయిన్ 2-0 తేడాతో ఫ్రాన్స్‌ను మట్టికరిపించి తుది పోరుకు అర్హత సాధించింది. 🚨FACT: Cape Verde are the only team Spain faced at the 2026 World Cup that they DIDN’T beat pic.twitter.com/51p0mFj8ip— Polymarket Sports (@PolymarketSport) July 14, 2026Read: బుమ్రా గురించి ప్రశ్న... ఇంగ్లండ్ కెప్టెన్ అసహనం! -
ఎంబాపె అయిపోయాడు.. ఇప్పుడిక మెస్సీ వంతు!
ఫిఫా ప్రపంచకప్‌లో 16 ఏళ్ల తర్వాత స్పెయిన్ ఫైనల్లో అడుగుపెట్టింది. 2010లో చివరిసారి ఫిఫా ఫైనల్ చేరిన స్పెయిన్ ఆనాడు టోర్నీలో చాంపియన్‌గా అవతరించింది. మళ్లీ ఇన్నేళ్లకు స్పెయిన్‌కు ఫైనల్ ఆడే అవకాశం రావడం విశేషం. ఫ్రాన్స్‌తో సెమీస్‌కు ముందు స్పెయిన్ స్టార్ లామినే యమాల్ ఎంబాపెతో పాటు ఆ జట్టుకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. 'భయపడేది మేము కాదు.. వాళ్లే మాకు భయపడతారు' అని యమాల్ అన్నట్లు ఫ్రాన్స్ కీలక సెమీస్‌లో అనవసర ఒత్తిడికి లోనయ్యి స్పెయిన్ చేతిలో పరాజయం చవిచూసింది. లామినే యమాల్.. ఎంబాపెకు చెప్పి మరీ దెబ్బతీశాడు. ఫ్రాన్స్‌తో మ్యాచ్‌లో గోల్ చేయనప్పటికీ యమాల్ తన సహచర ఆటగాళ్లు గోల్ చేయడంలో తన వంతు పాత్రను సమర్థంగా పోషించాడు. సోమవారం 19వ పుట్టినరోజు జరుపుకున్న లామినే యమాల్‌కు ఫ్రాన్స్‌పై విజయంతో స్పెయిన్‌ను ఫైనల్ చేర్చి తన సహచరులు అతడికి బర్త్‌డే కానుకగా అందించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత లామినే యమాల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 'ఫిఫా వంటి ప్రతిష్టాత్మక ప్రపంచకప్‌లో మెస్సీకి ఎదురుపడితే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. అలాంటిది ఈసారి ఫైనల్లో మెస్సీ ఎదురుపడితే ఆ మజానే వేరు. దాని కోసమే ఎదురుచూస్తున్నా. అది జరుగుతుందని ఆశిస్తున్నా' అని కామెంట్ చేశాడు.ఇది విన్న స్పెయిన్ అభిమానులు.. ఎంబాపె అయిపోయాడు.. ఇప్పుడిక మెస్సీ వంతు అని కామెంట్ చేస్తున్నారు. మ్యాచ్ విషయానికొస్తే మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన సెమీఫైనల్లో స్పెయిన్ 2-0 తేడాతో ఫ్రాన్స్‌ను మట్టికరిపించింది. స్పెయిన్ తరఫున మికెల్ ఒజర్బయాల్ (22వ నిమిషం), పెడ్రో పొర్రో (58వ నిమిషం) చెరో గోల్ సాధించారు. ఈసారి ఫిఫాలో ఫ్రాన్స్ ఒక్క గోల్ చేయకపోవడం ఇదే తొలిసారి. తాము ఆడిన ప్రతీ మ్యాచ్‌లో కనీసం ఒక్క గోల్ అయినా కొట్టిన ఫ్రాన్స్ సెమీస్‌లో స్పెయిన్‌పై మాత్రం గోల్ చేయడంలో విఫలమైంది. 🚨 Lamine Yamal: “Facing Leo Messi in a World Cup final would be fantastic. I hope so!”, told DAZN. pic.twitter.com/xWsAJ2zv9d— Fabrizio Romano (@FabrizioRomano) July 14, 2026LAMINE YAMAL SHOWS OFF HIS DIAMOND CHAIN 💎💸On his birthday, the Spain star arrived at the press conference wearing this dazzling chain ahead of tomorrow’s World Cup semifinal 🔥😱#LamineYamal #Spain #WorldCup2026 #Football #PressConference pic.twitter.com/V12ZXgb87Q— MARCA in English 🇺🇸 (@MARCAinENGLISH) July 13, 2026 -
సెమీస్‌లో ఫ్రాన్స్ ఓటమి.. ఫైనల్‌కు దూసుకెళ్లిన స్పెయిన్
ఫిఫా ప్రపంచకప్ 2026లో స్పెయిన్ జైత్రయాత్ర కొనసాగుతోంది. డల్లాస్ వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో 2-0 తేడాతో పటిష్టమైన ఫ్రాన్స్‌ను స్పెయిన్ మట్టికరిపించింది. ఈ అద్భుత విజయంతో స్పెయిన్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఫిఫా చర్రితలో స్పెయిన్ ఫైనల్‌కు అర్హత సాధించడం ఇది రెండో సారి.ఒయర్జబాల్ పెనాల్టీ గోల్ఈ మ్యాచ్ 21వ నిమిషంలో స్పెయిన్ టీనేజ్ సంచలనం లామైన్ యమల్‌ను ఫ్రాన్స్ డిఫెండర్ లూకాస్ డిగ్నె బాక్స్‌లో ఫౌల్ చేయడంతో స్పెయిన్‌కు పెనాల్టీ లభించింది. ఈ సువర్ణ అవకాశాన్ని స్పెయిన్ స్టార్ ఫార్వర్డ్ మికెల్ ఒయర్జబాల్ గోల్‌గా మలిచి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. సెకెండ్ హాఫ్‌లో కూడా "లా రోజా" జట్టు తమ జోరును కొనసాగించింది. 58వ నిమిషంలో పెడ్రో పోర్రో సూపర్ స్ట్రైక్‌తో మరో గోల్ కొట్టి స్పెయిన్ విజయాన్ని ఖాయం చేశాడు. అయితే ఈ కీలక మ్యాచ్‌లో కిలియన్ ఎంబాపె సారథ్యంలోని ఫ్రాన్స్ జట్టు తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. వరుస తప్పిదాల కారణంగా ఫ్రాన్స్ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. అదేవిధంగా ఫస్ట్ హాఫ్‌లోనే ఫ్రాన్స్ స్టార్ సెంటర్-బ్యాక్ ఆటగాడు విలియం సాలిబా గాయంతో మైదానాన్ని వీడటం కూడా ఆజట్టును దెబ్బ తీసింది. ఈ టోర్నమెంట్లో ఫ్రాన్స్ జట్టు ఒక్క గోల్ కూడా చేయలేకపోవడం ఇదే మొదటిసారి. -
ఫ్రాన్స్, స్పెయిన్ మధ్య తొలి సెమీస్.. ఫైనల్ చేరేదెవరు?
ఫిఫా ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ ఫ్రాన్స్, స్పెయిన్ మధ్య తొలి సెమీఫైనల్ జరగనుంది. 16 ఏళ్ల తర్వాత ఫిఫాలో ఫైనల్ చేరాలని స్పెయిన్ భావిస్తుంటే.. మరోవైపు వరుసగా మూడో ఫిఫాలోనూ ఫైనల్ చేరాలనే పట్టుదలతో ఫ్రాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య హోరాహోరీ పోరు తప్పేలా లేదనిపిస్తోంది. భారత కాలమాన ప్రకారం మంగళవారం అర్ధరాత్రి 12.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. గతంలో జర్మనీ (1982, 1986, 1990), బ్రెజిల్ (1994, 1998, 2002) జట్ల తర్వాత వరుసగా మూడు ప్రపంచకప్ టోర్నీల్లో ఫైనల్ చేరాయి. తాజాగా వరుసగా మూడోసారి ఫిఫా ఫైనల్ చేరడం ద్వారా మూడో జట్టుగా గుర్తింపు పొందాలని ఫ్రాన్స్ ఉబలాటపడుతోంది. టైటిల్ ఫేవరెట్‌గా అడుగుపెట్టిన ఫ్రాన్స్ అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ అజేయంగా సెమీఫైనల్‌కు దూసుకొచ్చింది.కెప్టెన్ ఎంబాపె (8 గోల్స్), డెంబెలె (5 గోల్స్), బార్కోలా (2 గోల్స్), డిజైర్ డుయి (1 గోల్) అద్భుత ఆటతీరుకు ప్రత్యర్థి జట్లు ఓటమివైపు నిలవాల్సి వస్తోంది. మరోవైపు స్పెయిన్ కూడా ఓటమి లేకుండానే సెమీఫైనల్‌కు చేరుకుంది. ఫ్రాన్స్ మాదిరిగానే స్పెయిన్ ఏ ఒకరిద్దరి ఆటతీరుపైనే ఆధార పడటం లేదు. మికెల్ ఒయర్జబాల్ (4 గోల్స్), మికెల్ మెరీనో (2 గోల్స్), బయేనా (1 గోల్), రూయిజ్ (1 గోల్), పెడ్రో (1 గోల్), లమీన్ యమాల్ (1 గోల్) సమష్టి ప్రదర్శనతో స్పెయిన్ అనూహ్యంగా టైటిల్ రేసులోకి వచ్చింది. Photo Credit: FIFA Twitterముఖాముఖి పోరులో ఫ్రాన్స్‌పై స్పెయిన్‌దే పైచేయిగా ఉంది. రెండు జట్లు ఇప్పటి వరకు 38 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. 18 మ్యాచ్‌ల్లో స్పెయిన్, 13 మ్యాచ్‌ల్లో ఫ్రాన్స్ గెలిచాయి. ఏడు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. ప్రపంచకప్‌లో మాత్రం ఫ్రాన్స్, స్పెయిన్ ఒక్కసారే ప్రత్యర్థులుగా నిలిచాయి. 2006 ప్రపంచకప్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ 3–1తో స్పెయిన్‌ను ఓడించింది. చదవండి: సీఎస్కే హెడ్‌కోచ్ పదవి.. రేసులో ఊహించని పేర్లు! -
విపత్తు వస్తే ఇల్లు దాక్కుంటుంది!
ఈ మధ్య యూరోపియన్ దేశాలను కార్చిచ్చులు కాల్చిపారేస్తున్నాయి. మూడు రోజుల క్రితం స్పెయిన్‌లోని ఓ పర్యాటక ప్రదేశంలో కార్చిచ్చు కారణంగా 17 మందికిపైగా మరణించారు. కార్చిచ్చు మాత్రమే కాదు తుపాన్లు చుట్టుముట్టినా ఈ ఇంటికి ఏమీ కాదు. ఎందుకంటే ఇలాంటి ప్రమాదాలు వస్తున్నాయని తెలిస్తే చాలు ఇల్లు మొత్తం నేల కింద ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన గొయ్యిలోకి దిగిపోతుంది. అమెరికన్ ఇంజినీర్లు సృష్టించిన ఈ అద్భుతం పేరు ‘హైబర్ టెక్ హోమ్స్’. మీరు ఎక్కడున్నా ఇంటిని భూమి లోపలికి పంపించేసేందుకు యాప్ రెడీ చేశారు. యాప్‌లో బటన్ నొక్కడమే ఆలస్యం హైడ్రాలిక్ గేర్ల సాయంతో ఇల్లు.. అడుగున ఉన్న బాక్స్‌లోకి వేగంగా జారిపోతుంది. ఇంట్లోని విద్యుత్తు, గ్యాస్ కనెక్షన్లు, నీటి, మురుగునీటి వ్యవస్థలు ఆటోమెటిక్‌గా డిస్కనెక్ట్ అవుతాయి. ఇంటి చుట్టూ మంటలు ఆర్పేసే గ్యాస్ పనిచేసేందుకు రెడీ అవుతుంది. ఇల్లు మొత్తం లోపలకు దిగిపోగానే బాక్స్ పైకప్పు మొత్తం మూసుకుపోతుంది. ఈ ప్రక్రియ మొత్తం 15 నిమిషాల్లో ముగిసిపోతుందని, మొత్తం వ్యవహారం గురుత్వాకర్షణ శక్తిపై మాత్రమే ఆధారపడి ఉంటుంది కాబట్టి విద్యుత్తు అవసరం కూడా ఉండదని దీని సృష్టికర్తలు చెప్పారు. ఇంటిని ఒక బంకర్‌లా వాడుకోవడం కుదరదు. విపత్కర పరిస్థితుల్లో ఇంటిని కాపాడొచ్చుగానీ ఆ సమయంలో ఇంట్లో ఉండేందుకు వీలుండదని ఇంజినీర్లు స్పష్టంచేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సెమీస్ సమరం.. ఎవరి బలమెంత?
ఫిఫా ప్రపంచకప్‌లో సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. ఈసారి గ్రూప్ దశలో 48 జట్లు పాల్గొన్నాయి. రౌండ్ ఆఫ్ 32, ప్రిక్వార్టర్స్, క్వార్టర్ ఫైనల్స్‌లో వడపోత తర్వాత నాలుగు జట్లు మిగిలాయి. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో అర్జెంటీనా దర్జాగా సెమీస్‌లో అడుగుపెట్టగా, 2022 ఫిఫా రన్నరప్ ఫ్రాన్స్ కూడా వరుసగా మూడోసారి (2018, 2022, 2026) సెమీస్‌కు దూసుకొచ్చింది. ఇక 16 ఏళ్ల తర్వాత స్పెయిన్ (2010 విజేత) సెమీస్‌లో అడుగుపెడితే, అటు మాజీ చాంపియన్ ఇంగ్లండ్ కూడా తన దూకుడైన ఆటతీరుతో సెమీస్‌లో అడుగుపెట్టింది. ఇప్పటిదాకా తమకు ఎదురైన ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ వచ్చిన ఈ నాలుగు జట్లు నువ్వా నేనా అన్న రీతిలో సెమీస్‌లో తలపడనున్నాయి. గత ఫిఫా ప్రపంచకప్ లాగే ఈసారి ఫైనల్లో అర్జెంటీనా, ఫ్రాన్స్ పోరును చూస్తామా లేక స్పెయిన్, ఇంగ్లండ్ ఆట చూస్తామా అనేది మరో రెండు రోజుల్లో తేలిపోనుంది. ఈ నేపథ్యంలో సెమీస్‌లో ఎవరితో ఎవరు తలపడనున్నారనేది ఒకసారి పరిశీలిద్దాం. ఒస్మోన్ డెంబ్లీ, ఫ్రాన్స్ (Phot Credit: FIFA Twitter)జట్ల బలాబలాలు👉ఫ్రాన్స్ తరఫున ఎంబాపె అన్నీ తానై జట్టును నడిపిస్తున్నాడు. ఈసారి ఫిఫాలో ఆడిన 6 మ్యాచ్‌ల్లో 8 గోల్స్, మూడు అసిస్ట్‌లతో గోల్డెన్ బూట్ రేసులో నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. ఎంబాపె తర్వాత ఒస్మోన్ డెంబ్లీ కూడా ఫ్రాన్స్‌కు బలమైన ఆటగాడు. ఫార్వార్డ్ ప్లేయర్ అయిన డెంబ్లీ ఆరు మ్యాచ్‌ల్లో ఐదు గోల్స్, రెండు అసిస్ట్‌లతో గోల్డెన్ బూట్ రేసులో ఉన్నాడు.👉ఇక స్పెయిన్ తరఫున కెప్టెన్ రొడ్రితో పాటు యామినే లమాల్ కీలక ఆటగాళ్లుగా ఉన్నారు. వీరిద్దరితో పాటు మైకెల్ ఒయర్జబాల్ (ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు గోల్స్), గోల్ కీపర్ ఉనైయి సిమోన్లు కూడా తమదైన ఆటతో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.మైకెల్ ఒయర్జబాల్, స్పెయిన్ (Phot Credit: FIFA Twitter)👉ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ హ్యారీకేన్ ఈసారి ఎలాగైనా ఫిఫా ప్రపంచకప్ సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ తరఫున ఈసారి ఫిఫాలో ఆరు మ్యాచ్‌ల్లో ఆరు గోల్స్‌తో పాటు ఒక అసిస్ట్ చేసి ఆ జట్టు తరఫున గోల్డెన్ బూట్ రేసులో ఉన్నాడు. హ్యారికేన్కు తోడుగా జూడ్ బెల్లింగ్హమ్ కూడా కీలక ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. బెల్లింగ్హమ్ కూడా ఆరు గోల్స్ చేసి హ్యారికేన్తో సమానంగా ఉన్నాడు.👉డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాకు కర్త, కర్మ, క్రియ.. లియోనల్ మెస్సీ. మెస్సీ ఆరు మ్యాచ్‌ల్లో 8 గోల్స్‌తో గోల్డెన్ బూట్ రేసులో రెండో స్థానంలో ఉన్నాడు. మెస్సీతో పాటు ఎమిలో మార్టినేజ్, జులియన్ అల్వరెజ్, అలెక్సిస్ మాక్ అలిస్టర్‌లు జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు.జూడ్ బెల్లింగ్హమ్, ఇంగ్లండ్ (Phot Credit: FIFA Twitter)తొలి సెమీస్: ఫ్రాన్స్ వర్సెస్ స్పెయిన్ఫ్రాన్స్, స్పెయిన్ జట్ల మధ్య తొలి సెమీ-ఫైనల్ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం జులై 15న (బుధవారం అర్ధరాత్రి 12.30 గంటలకు) జరగనుంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు మొత్తం 38 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడగా.. స్పెయిన్‌దే పైచేయి. 38 మ్యాచ్‌ల్లో స్పెయిన్ 18 గెలవగా.. ఫ్రాన్స్ 13 గెలిచింది. 7 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. అయితే ఫిఫా ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు కేవలం ఒక్కసారి మాత్రమే తలపడ్డాయి. 2016 ప్రపంచకప్‌లో ప్రిక్వార్టర్స్‌లో ఫ్రాన్స్ 3-1 తేడాతో స్పెయిన్‌ను ఓడించింది.అలెక్సిస్ మాక్ అలిస్టర్, అర్జెంటీనా (Phot Credit: FIFA Twitter)రెండో సెమీస్: అర్జెంటీనా వర్సెస్ ఇంగ్లండ్ఫిఫాలో రెండో సెమీ-ఫైనల్లో అర్జెంటీనా, ఇంగ్లండ్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ జులై 16 (భారత కాలమాన ప్రకారం గురువారం అర్ధరాత్రి 12.30 గంటలు) అట్లాంటా వేదికగా జరగనుంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్‌ల రికార్డును పరిశీలిస్తే.. ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఐదు ఫిఫా ప్రపంచ కప్ మ్యాచ్‌లు ఆడగా.. వీటిలో ఇంగ్లండ్ మూడు, అర్జెంటీనా రెండు గెలిచాయి. 40 ఏళ్ల క్రితం (1986 ఫిఫా) ఇరుజట్ల మధ్య జరిగిన సెమీస్‌లో అర్జెంటీనా పైచేయి సాధించింది.సెమీఫైనల్ షెడ్యూల్:👉తొలి సెమీస్: ఫ్రాన్స్ వర్సెస్ స్పెయిన్, బుధవారం అర్ధరాత్రి 12.30 గంటలకు, వేదిక: అర్లింగ్టన్, టెక్సస్👉రెండో సెమీస్: అర్జెంటీనా వర్సెస్ ఇంగ్లండ్, గురువారం అర్ధరాత్రి 12.30 గంటలకు, వేదిక: అట్లాంటాSemi-final match-ups 👀#FIFAWorldCup pic.twitter.com/2WWvIw4E06— FIFA World Cup (@FIFAWorldCup) July 12, 2026చదవండి: శతకంతో ప్రపంచ రికార్డు.. తొలి మహిళా క్రికెటర్‌గా యస్తిక భాటియా -
ఈలలతో మాట్లాడే ద్వీపం గురించి విన్నారా ఎప్పుడైనా?
స్పెయిన్ లోని కేనరీ దీవుల్లో ఉన్న చిన్న ద్వీపం లా గోమెరాలో ఒక వింత సాంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. ఇక్కడి ప్రజలు కొన్ని సందర్భాల్లో మాటలతో కాకుండా ఈలల ద్వారానే మాట్లాడుకుంటారు.ఈ ప్రత్యేక భాషను సిల్బో గొమెరో అని పిలుస్తారు. పర్వతాల మధ్య ఉన్న లోయలు, ఘాట్ రోడ్ల వల్ల దూరంగా ఉన్న వారికి సందేశం పంపడానికి ఈ పద్ధతి అనేక శతాబ్దాల నుంచి కొనసాగుతోంది. కొన్ని సందర్భాల్లో 5 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఈల శబ్దంతోనే సందేశాన్ని చేరవేస్తారట ఇక్కడ.ఒకానొక సమయంలో రోడ్లు, ఫోన్లు ఎక్కువ అవడంతో ఈ సంప్రదాయం అంతరిస్తుందేమో అని చాలా మంది భయపడ్డారట. కానీ లా గోమెరా అధికారులు తమ ఈల భాషను రక్షింకునేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఈ ద్వీపంలోని ప్రైమరీ, సెకండరీ స్కూల్స్‌లో సిల్బో గొమెరో అనే ఈల భాషను తప్పనిసరిగా బోధిస్తున్నారు. 2009లో యునెస్కో కూడా ఈ భాషను ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్‌గా గుర్తించి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చేసింది.కొన్ని పరిశోధనల ప్రకారం ఈ ఈల శబ్దాలు విన్నప్పుడు వాటిని వినే వారి మెదడులో సాధారణ భాషను అర్థం చేసుకునే లాంగ్వేజ్ సెంటర్లు అలాగే పని చేస్తాయట. అంటే మన మెదడు శబ్దం ఎలా ఉన్నా కూడా దానిలో ఉన్న అర్థాన్ని డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తుంది అని ఈ పరిశోధనలు చెబుతున్నాయి. ఈ సాంకేతిక యుగంలో కూడా ఈ ఈల భాష ఇంకా వాడుకలో ఉండడం అనేది నిజంగా అద్భుతం. సిల్బో గొమెరో అనేది మానవ సజనాత్మకత, సంస్కతి, ప్రకతికి అనుగుణంగా మనిషి ఎలా మారగలడో చూపించే అరుదైన ఉదాహరణగా నిలిచింది. -
ఫిఫా వరల్డ్ కప్ సెమీస్ లో స్పెయిన్
-
మొన్న పోర్చుగల్, ఇవాళ బెల్జియం.. చావుదెబ్బ కొట్టాడు
ఫిఫా ప్రపంచకప్ నుంచి బెల్జియం జట్టు నిష్క్రమించింది. శనివారం తెల్లవారుజామున జరిగిన క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ జట్టు 2-1 తేడాతో బెల్జియంను ఓడించింది. అయితే బెల్జియం ఓటమికి పరోక్ష కారణం ఆ జట్టు గోల్ కీపర్ సెన్నే లామెన్స్ అయితే, ప్రత్యక్ష కారణం మాత్రం స్పెయిన్ సంచలనం మైకెల్ మెరినో.మొన్న పోర్చుగల్‌తో జరిగిన క్వారర్ ఫైనల్ పోరులో స్టాపేజ్ టైం (90+ నిమిషాల్లో) గోల్ కొట్టి మ్యాచ్‌ను లాగేసుకున్న మెరినో.. తాజాగా బెల్జియంతో మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్ బరిలోకి దిగిన మెరినో మరోసారి మెరిసి స్పెయిన్‌కు గోల్ అందించాడు. తన లక్కీ హ్యాండ్‌తో స్పెయిన్‌కు విజయాన్ని కట్టబెట్టి 16 ఏళ్ల తర్వాత సెమీస్ చేర్చాడు.గాయం నుంచి కోలుకొనిఈసారి ఫిఫాలో స్పెయిన్‌కు లక్కీ హ్యాండ్‌గా మారిపోయిన మైకెల్ మెరినో తొలుత ప్రపంచకప్ ఆడతాడా లేదా అన్న అనుమానం ఉండేది. ఈ ఏడాది జనవరిలో అతడి పాదానికి గాయమైంది. స్ట్రెస్ ఫ్రాక్చర్‌తో రెండు నెలల పాటు పాదాన్ని కింద ఆనించడంలోనూ ఇబ్బంది పడ్డాడు. తన రెగ్యులర్ ఫుట్‌బాల్ క్లబ్ ఆర్సెనల్ తరఫున కూడా బరిలోకి దిగకపోవడంతో ఫిఫా ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ స్పెయిన్ జట్టులో చోటు సంపాదించుకోవడమే గాక, ఆ జట్టు సెమీస్ చేరడంలో కీలకపాత్ర పోషించిన మైకెల్ మెరినో స్పెయిన్ జట్టుకు గోల్డెన్ హ్యాండ్‌గా మారిపోయాడు.ఆ తప్పు చేయకపోయి ఉంటే..70వ నిమిషంలో బెల్జియం రెగ్యులర్ గోల్‌కీపర్ కోర్టోయిస్ గాయపడి గ్రౌండ్ ను వీడాడు. దీంతో ప్రపంచకప్‌లో ఇప్పటివరకు అరంగేట్రం చేయని యువ గోల్‌కీపర్ సెన్నే లామెన్స్ అత్యంత ఒత్తిడితో కూడిన పరిస్థితుల మధ్య బరిలో దిగాల్సి వచ్చింది. లామెన్స్ చేసిన ఓ చిన్న పొరపాటే చివరకు బెల్జియం పరాజయానికి దారితీసింది. పావ్ కుబార్సి కొట్టిన లాంగ్ షాట్‌ను లామెన్స్ కంట్రోల్ చేయలేకపోయాడు. అదే బంతిని మెరెనో గోల్‌పోస్ట్‌లోకి నెట్టాడు. దీంతో స్పెయిన్ జట్టు ఆనందానికి అవధుల్లేకపోయింది. ఆఖరి నిమిషాల్లో స్కోర్ సమం చేయడానికి బెల్జియం తీవ్రంగా ప్రయత్నించింది. జెరెమీ డోకు వంటి ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచినప్పటికీ స్పెయిన్ డిఫెన్స్ ను చేధించలేకపోయారు. అలెక్సిస్ సేల్మేకర్స్ అందించిన చక్కటి క్రాసు రొమేలు లుకాకు సరిగ్గా అందుకోలేకపోవడంతో బెల్జియం ఆశలు అడియాశలయ్యాయి. 🚨🚨Thibaut Courtois: "Senne Lammens is a fantastic goalkeeper with a bright future. This moment will make him STRONGER."pic.twitter.com/9wnru8QUml— 🇵🇸 TP_KATSRK (@TP_Katsrk) July 10, 2026Read: ‘ఎంబాపె కాస్కో.. 2024 సెమీస్‌ను రిపీట్ చేస్తాం’ -
‘ఎంబాపె కాస్కో.. 2024 సెమీస్‌ను రిపీట్ చేస్తాం’
ఫిఫా ప్రపంచకప్‌లో మాజీ చాంపియన్ స్పెయిన్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. శనివారం తెల్లవారుజామున జరిగిన క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ 2-1 తేడాతో బెల్జియంను చిత్తు చేసింది. మ్యాచ్‌లో స్పెయిర్ రెండు గోల్స్ చేయడంలో కీలకపాత్ర పోషించిన ఆ జట్టు స్టార్ ఆటగాడు లామినే యమాల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. 18 ఏళ్ల లామినే యమాల్ ఈ ఫిపాలో పెద్దగా గోల్స్ కొట్టకపోయినప్పటికీ కీలక సమయాల్లో తన సహచరులకు అసిస్ట్‌లు, పాస్‌లు అందిస్తూ స్పెయిన్ విజయాల్లో ముఖ్యపాత్ర వహిస్తున్నాడు. ఇక వరుసగా మూడో ఫిఫా ప్రపంచకప్‌లోనూ సెమీస్ చేరి సూపర్ ఫామ్‌లో ఉన్న ఫ్రాన్స్‌ను స్పెయిన్ ఎదుర్కోనుంది. ఈ నేపథ్యంలోనే లామినే యమాల్ ఫ్రాన్స్ జట్టుకు వార్నింగ్ ఇవ్వడం ఆసక్తి కలిగించింది. బెల్జియంతో క్వార్టర్స్ మ్యాచ్ ముగిసిన తర్వాత లామినే యమాల్ మాట్లాడాడు. ‘టోర్నీని చాలా ఉత్సాహంగా ప్రారంభించాం. మా ప్రయాణంలో సెమీస్ దశలో అడుగుపెట్టాం. ఫ్రాన్స్ అంటే మాకు భయం లేదు. నిజానికి మేము కాదు వాళ్లే మాకు భయపడతారేమో. ఎందుకంటే 2024 యూరోకప్ సెమీస్‌లో మా చేతిలోనే ఫ్రాన్స్ ఓడిపోయింది. ఆ తర్వాత మేము కప్‌ను కూడా ఎగరేసుకుపోయాం. ఇప్పుడు మళ్లీ 2024 నాటి యూరోకప్ సెమీస్నే రిపీట్ చేయబోతున్నాం. ఒత్తిడి మాకంటే ఫ్రాన్స్‌పైనే ఎక్కువ ఉంటుంది. మేము గెలుస్తామా లేదా అన్న సంగతి పక్కనబెడితే మాత్రం ఈసారి మా మధ్య జరగబోయే మ్యాచ్ మాత్రం ఫిఫా చరిత్రలో అత్యుత్తమ మ్యాచ్‌ల్లో ఒకటిగా నిలిచిపోనుంది.’ అని చెప్పుకొచ్చాడు.ఇక యూఈఎఫ్ఏ యూరో 2024 కప్‌లో సెమీస్‌లో స్పెయిన్ 2-1తో ఫ్రాన్స్‌ను ఓడించింది. అప్పటికి 16 ఏళ్ల వయసున్న లామినే యమాల్ లాంగ్ రేంజ్ స్ట్రైక్‌తో బంతిని గోల్ పోస్ట్‌లోకి తరలించడం ఇప్పటికీ రికార్డుగా నిలిచిపోయింది. ఇదే మ్యాచ్‌లో డాని ఓల్మో మరో గోల్ సాధించాడు. ఇక ఫైనల్లో ఇంగ్లండ్‌ను 1-2తో చిత్తు చేసిన స్పెయిన్ యూరో చాంపియన్స్‌గా నిలిచింది. ఫిఫా ప్రపంచకప్‌లో జూలై 14న జరగనున్న సెమీఫైనల్లో ఫ్రాన్స్, స్పెయిన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.🚨 𝐎𝐅𝐅𝐈𝐂𝐈𝐀𝐋: 𝐅𝐑𝐀𝐍𝐂𝐄 🇫🇷 𝐕𝐒 🇪🇸 𝐒𝐏𝐀𝐈𝐍 𝐈𝐍 𝐓𝐇𝐄 𝐒𝐄𝐌𝐈-𝐅𝐈𝐍𝐀𝐋𝐒 𝐎𝐅 𝐓𝐇𝐄 𝟐𝟎𝟐𝟔 𝐖𝐎𝐑𝐋𝐃 𝐂𝐔𝐏 🍿 pic.twitter.com/Ob8JJatAmd— 433 (@433) July 10, 2026 🚨⭐️ OFFICIAL: Lamine Yamal, FIFA Man of the Match for Spain-Belgium. pic.twitter.com/hbDaRMT6sn— Fabrizio Romano (@FabrizioRomano) July 10, 2026Read: సచిన్, కోహ్లి సరసన గిల్.. టీమిండియా కెప్టెన్‌గా రికార్డు -
బెల్జియం చిత్తు.. సెమీఫైనల్లో స్పెయిన్
బాస్ ఏంజిలిస్: ఫిఫా ప్రపంచకప్ టోర్నీలో స్పెయిన్ జట్టు 16 ఏళ్ల తర్వాత సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ 2-1 గోల్స్ తేడాతో బెల్జియం జట్టును ఓడించింది. స్పెయిన్ తరఫున ఫాబియన్ రూయిజ్ (30వ నిమిషంలో), సబ్ స్టిట్యూట్ మికెల్ మదీనో 88వ నిమిషంలో ఒక్కో గోల్ చేశారు. బెల్జియం జట్టుకు చార్లెస్ కెటెలార్ (41వ నిమిషం లో) ఏకైక గోల్ అందించాడు. మ్యాచ్‌లో స్పెయిన్ 16 సార్లు బెల్జియం గోల్‌పోస్టుపై దాడి చేసి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. చివరిసారి స్పెయిన్ జట్టు 2010లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఆ ఏడాదే తొలిసారి ప్రపంచకప్ టైటిల్‌ను సాధించింది. 1986 ప్రపంచకప్‌లోనూ స్పెయిన్, బెల్జియం జట్లు క్వార్టర్ ఫైనల్లో తలపడగా..పెనాల్టీ షూటౌట్'లో బెల్జియం 5- 4తో స్పెయిన్‌ను ఓడించింది. తాజా విజయంతో స్పెయిన్ 40 ఏళ్ల తర్వాత బెల్జియం చేతిలో ఎదురైన పరాజయానికి లెక్క సరి చేసింది. బుధవారం డాలస్‌లో జరిగే తొలి సెమీఫైనల్లో ఫ్రాన్స్ జట్టుతో స్పెయిన్ తలపడుతుంది. -
మన మట్టిలో పుట్టిన ఆట.. ఊగిపోతున్న స్పెయిన్!
కర్రా బిల్లా (గిల్లి-దండ) ఆట పరిచయం అక్కర్లేని పేరు. భారత్‌లో తాతల కాలం నుంచే ఈ ఆట మనకు సుప్రసిద్ధం. భారతీయ చరిత్రలో పురాతన ఆటల్లో ఒకటిగా ఉన్న కర్రా బిల్లా ఇవాళ ఒక దేశంలో పాపులర్ ఆటగా మారిపోయిందంటే నమ్ముతారా? కానీ ఇది అక్షరాల నిజం. స్పెయిన్‌లో ఇప్పుడు మన కర్రా బిల్లా ఆట 'బిల్లార్డా' పేరుతో మోస్ట్ పాపులర్ గేమ్‌గా మారిపోయింది. ఫుట్‌బాల్‌కు విపరీతమైన ఆదరణ ఉండే స్పెయిన్‌లో బిల్లార్డా (కర్రా బిల్లా) రూపంలో అక్కడి యువతకు ఇష్టమైన ఆటగా మారిందంటే అదంతా మన భారత్ చలువే అని చెప్పొచ్చు.కర్రా బిల్లా అంటే?భారత్‌లో తాతల కాలం నుంచే ప్రాచుర్యంలో ఉన్న కర్రా బిల్లా ఆటకు చాలా పేర్లే ఉన్నాయి. గోణి బిల్లా, గూటి బిల్లా, బిల్లా కర్ర, చిల్లంగోడు, కోడింబిల్లా, చిల్లగాల, బిల్లంగోడు పేర్లతో ప్రచారంలో ఉంది. సుమారు 4 అంగుళాలు ఉన్న కర్ర ముక్క, రెండు అడుగులు పొడవుగల కర్ర ఒకటి ఈ ఆటకు ఉపయోగిస్తారు. వీటిలో చిన్న దానిని ‘బిల్లా' అని, పెద్దదాన్ని ‘కర్ర’ అని పిలుస్తారు. అందుకే ఈ ఆటకు ‘కర్ర బిల్లా' అని పేరు వచ్చింది. నేలమీద చిన్న ‘కంచా‘ (గుంట) తవ్వి ఈ కంచా మీద ‘బిల్ల‘ను ఉంచి కర్రతో కొట్టే ప్రయత్నం చేస్తారు. దీనిని ‘గూటుట‘ అని పిలుస్తారు. సాధారణంగా ఈ ఆటను ఇద్దరు లేక నలుగురు ఏకకాలంలో ఆడవచ్చు. ఇక తాజాగా స్పెయిన్‌లో బిల్లార్డా గేమ్ ఆడుతున్న విధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన కొంతమంది అభిమానులు ఈ గేమ్‌ను ఒలింపిక్స్‌లో ప్రవేశపెడితే మనమంతా ఒక జట్టుగా ఏర్పడి భారత్‌కు పతకాలు తేవొచ్చు అని కామెంట్లు పట్టడం ఆసక్తి కలిగించింది. Olympics lo pedithe manam kooda podama oka team form chesukoni 😂🏃🏃@LiberatedManasu @nagakishore981 @cartick94 @chanti185627865 @atheisttindiann @ThisIsRagh @crea__ture2 @wasteyavvaralu pic.twitter.com/3dMsXrW8Ev— Bhiku Mhatrey (@BhikuMhatrey) July 9, 2026 -
స్పెయిన్‌లో అగ్నిప్రమాదం.. 12 మంది మృతి
దక్షిణ స్పెయిన్‌లోని అల్మేరియాలో సంభవించిన కార్చిచ్చు కారణంగా 12 మంది మృతిచెందినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. గురువారం మరో ఆరుగురి మృతదేహాలు లభించడంతో మరణాల సంఖ్య పెరిగినట్లు ప్రభుత్వం పేర్కొంది.కాగా దీనివల్ల జరిగిన ఆస్తి నష్టం వివరాలను ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదుకాగా "లోస్ గల్లార్డోస్" ప్రాంతంలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందనే కారణాలు ఇంకా తెలియలేదు. ఆ దేశంలో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో ఉన్న నేపథ్యంలో వాటివల్లే అడవికి నిప్పు అంటుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. . -
స్పెయిన్‌ను ఆపతరమా!
లాస్ ఏంజెలిస్: గత మూడు ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లలో ప్రిక్వార్టర్ ఫైనల్ దాటలేకపోయిన 2010 విశ్వవిజేత స్పెయిన్ తాజా ప్రపంచకప్‌లో సూపర్ ఫామ్‌లో ఉంది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట గెలిచి, ఒక మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకొని అజేయంగా కొనసాగుతోంది. అంతేకాకుండా క్వార్టర్ ఫైనల్ చేరుకున్న క్రమంలో ప్రత్యర్థి జట్లకు ఒక్క గోల్ కూడా ఇవ్వని ఒకే ఒక జట్టు స్పెయిన్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో నేడు మరో కీలకపోరుకు స్పెయిన్ సిద్ధమైంది. బెల్జియం జట్టుతో క్వార్టర్ ఫైనల్ పోరులో స్పెయిన్ తలపడనుంది. 2010లో ఏకైకసారి ప్రపంచకప్ చాంపియన్‌గా నిలిచిన స్పెయిన్... ఆ తర్వాత నిరాశపరిచింది. 2014లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది. 2018లో, 2022లో ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది. ఈసారి మాత్రం నిలకడగా రాణిస్తూ క్వార్టర్ ఫైనల్ వరకు వచ్చింది. మికెల్ ఒయర్జబాల్ నాలుగు గోల్స్‌తో స్పెయిన్ తరఫున టాప్ స్కోరర్‌గా కొనసాగుతుండగా... అలెక్స్ బేనా, మికెల్ మెరీనో, పెడ్రో పోరో, లామినె యామల్ ఒక్కో గోల్ చేశారు. వీరందరూ సమష్టిగా రాణించడంపై స్పెయిన్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. మరోవైపు నాలుగోసారి క్వార్టర్ ఫైనల్ చేరిన బెల్జియం జట్టు కూడా ఈ టోర్నీలో అజేయంగా ఉంది. గ్రూప్ దశలో ఒక మ్యాచ్‌లో గెలిచి, రెండు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకున్న బెల్జియం... నాకౌట్ తొలి రౌండ్ మ్యాచ్‌లో 3–2తో సెనెగల్ జట్టుపై... ప్రిక్వార్టర్ ఫైనల్లో 4–1తో అమెరికా జట్టుపై గెలిచింది. లుకాకు, చార్లెస్ కెటెలెర్, యురీ టిలెమాన్స్, ట్రొసార్డ్, కెవిన్ డిబ్రున్, సేల్మికర్స్, హాన్స్ వానాకెన్ బెల్జియం విజయాల్లో కీలకపాత్ర పోషించారు. -
మళ్లీ యుద్ధమా? ట్రంప్ వ్యాఖ్యలతో చమురు ధరలు భగ్గు!
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ముదిరిన ఉద్రిక్తతల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ అవగాహనా ఒప్పందం (MoU) ముగిసిందని, ఇకపై ఎలాంటి చర్చలు ఉండవంటూ ప్రకటించారు. మరొకవైపు ఇరాన్ నాయకత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఈ నేపథ్యంలో, టర్కీలోని అంకారాలో జరుగుతున్న నాటో (NATO) సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ.. తాము ఇరాన్‌కు చెందిన అత్యంత ప్రమాద కరమైన వ్యక్తులపై శక్తివంతమైన దాడులు చేశాం. వాళ్లు దుర్మార్గులు, మానసిక రోగులంటూ దుమ్మెత్తి పోశారు. అంతేకాదు ఇరాన్‌ను పూర్తిగా అణ్వాయుధ రహిత దేశంగా (Denuclearisation) మారుస్తామని ట్రంప్ హెచ్చరించారు.ఇదీ చదవండి: ఆమీర్ భార్య గౌరి బ్రైడల్ లుక్ : 'పఠానీ హార్' విశేషాలు తెలుసా?ఇది ఇలా ఉంటే ట్రంప్ వ్యాఖ్యల ప్రభావం గ్లోబల్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఇండియన్ స్టాక్ మార్కెట్లలో సెన్సెక్స్ సుమారు 1,506 పాయింట్లు, అంటే 1.93శాతం పతనమై, 76,673.86 వద్దకు చేరగా, నిఫ్టీ 50 కూడా 461 పాయింట్లు 1.89శాతం నష్టపోయి 23,937.65దిగువకు పడిపోయింది. ఫార్మా, మెటల్ రంగాలు మినహా మిగిలిన అన్ని రంగాలు నష్టాల్లో నడిచాయి.చమురుపై ప్రభావంఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ముడి చమురు ధరలు మళ్లీ ఆకాశంవైపు చూస్తున్నాయి. ముఖ్యంగా ట్రంప్ ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఒకేసారి 5 శాతానికి పైగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 5.3 శాతం ఎగిసి 78.09 డాలర్ల స్థాయిని అధిగమించగా, డబ్ల్యూటీఐ (WTI) క్రూడ్ 5.4 శాతం పెరిగి 74.23 డాలర్ల వద్దకి చేరుకుంది.ఇదీ చదవండి: రెడ్ బెనారసీ డ్రెస్‌లో పార్టీ లుక్.. తొలిసారి ఇలా అన్షులా!స్పెయిన్‌పై ట్రంప్ ఆగ్రహం.. నాటోపై అసంతృప్తిఇరాన్పై సైనిక చర్యల కోసం అమెరికాకు తమ సైనిక స్థావరాలను, వైమానిక మార్గాన్ని ఉపయోగించు కోవడానికి స్పెయిన్ నిరాకరించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్.. స్పెయిన్‌ను నాటోలో ఒక దారుణ మైన భాగస్వామిగా అభివర్ణిస్తూ, ఆ దేశంతో అన్ని రకాల వాణిజ్య సంబంధాలను నిలిపివేయాలని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్‌ను ఆదేశించారు. ఉగ్రవాదానికి పెద్ద పీట వేసే ఇరాన్ విషయంలో నాటో కూటమి తమకు మద్దతుగా నిలబడటం లేదని, గ్రీన్లాండ్ విషయంలో కూడా నాటో ప్రవర్తన తనకు నచ్చలేదని ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: యువ క్రికెటర్ బలి : ఇంత ప్రమాదమా ఈ వ్యాధి? లక్షణాలేంటి? -
పోర్చుగల్ కోచ్ సంచలన నిర్ణయం
ఫిఫా వరల్డ్‌కప్ 2026 ప్రీ క్వార్టర్లో పోర్చుగల్ స్పెయిన్ చేతిలో 0-1 గోల్స్ తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ ఓటమి అనంతరం పోర్చుగల్ ప్రధాన కోచ్ రాబర్టో మార్టినెజ్ తన పదవికి రాజీనామా చేశారు. స్పెయిన్‌పై పరాజయంతో తన ఒప్పందం ముగిసిందని, కొత్త కోచ్‌ను ఎంపిక చేసే అవకాశం పోర్చుగీస్ ఫుట్‌బాల్ సమాఖ్యకు ఉందని ఆయన తెలిపారు.మ్యాచ్ అనంతరం మార్టినెజ్ మాట్లాడుతూ.. "నేను పోర్చుగల్‌కు ప్రపంచకప్ గెలిపించాలనే లక్ష్యంతో వచ్చాను. ఆ లక్ష్యాన్ని సాధించలేకపోయిన తర్వాత పదవిలో కొనసాగడంలో అర్థం లేదు. నా ఒప్పందం ఈరోజుతో ముగుస్తోంది. ఇక కొత్త కోచ్‌ను ఎంపిక చేసే బాధ్యత సమాఖ్యదే" అని చెప్పారు.అలాగే, "ఇది జాతీయ జట్టుకు కోచ్‌గా నా చివరి మ్యాచ్. పోర్చుగల్ ప్రజలు నన్ను తమలో ఒకరిగా ఆదరించారు. ఈ జట్టుకు కోచ్‌గా పనిచేయడం గర్వకారణం, గొప్ప బాధ్యతగా భావిస్తున్నాను" అని పేర్కొన్నారు.క్రిస్టియానో రొనాల్డోపై కూడా మార్టినెజ్ ప్రశంసలు కురిపించారు. "రొనాల్డో ఆదర్శప్రాయమైన కెప్టెన్. అతని గోల్స్ మాత్రమే కాదు, అసిస్టులు కూడా జట్టుకు ఎంతో ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా ఫుట్‌బాల్ పట్ల అతని అంకితభావం ప్రతి ఆటగాడికి ఆదర్శం. అతని సేవలను ఎప్పటికీ గుర్తుంచుకోవాలి" అని అన్నారు.2023లో పోర్చుగల్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన మార్టినెజ్‌కు దేశానికి తొలి ప్రపంచకప్ టైటిల్ అందించాలనే లక్ష్యం ఉన్నప్పటికీ అది నెరవేరలేదు. బ్రూనో ఫెర్నాండెస్, బెర్నార్డో సిల్వా, విటిన్హా, రఫాయెల్ లియావో, క్రిస్టియానో రొనాల్డో వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నా, అతడు జట్టుకు తగిన గుర్తింపు తీసుకురాలేకపోయారనే విమర్శలు ఉన్నాయి.ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన తర్వాత కూడా రొనాల్డో చుట్టూనే దాడి వ్యూహాన్ని నిర్మించడం మార్టినెజ్ వైఫల్యానికి నిదర్శనమన్నది చాలామంది అభిప్రాయం. తాజాగా స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పోర్చుగల్ డిఫెన్స్ బాగనే ఉన్నా, బంతిపై ఆధిపత్యం చెలాయించలేక చివరకు మెరినో గోల్‌కు తలవంచాల్సి వచ్చింది.మ్యాచ్ విషయానికొస్తే.. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో అదనపు సమయంలో (91వ నిమిషం) మికెల్ మెరినో చేసిన ఏకైక గోల్‌తో స్పెయిన్ విజయం సాధించింది. ఈ పరాజయంతో పోర్చుగల్ ప్రపంచకప్ ప్రయాణం ముగియగా, స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోకు ఇదే చివరి ప్రపంచకప్ మ్యాచ్‌గా మిగిలిపోయే అవకాశం ఉంది. -
రొనాల్డో కథ ముగిసింది.. ప్రీ క్వార్టర్స్‌లో పోర్చుగల్ ఓటమి
ఫిఫా వరల్డ్‌కప్ 2026లో పోర్చుగల్ ప్రయాణం ముగిసింది. ఇవాళ జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్లో ఆ జట్టు స్పెయిన్ చేతిలో 0-1 గోల్స్ తేడాతో ఓడింది. తద్వారా నాకౌట్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ గెలుపుతో స్పెయిన్ క్వార్టర్ ఫైనల్‌కు అడ్వాన్స్ అయ్యింది.డల్లాస్ స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు హోరీహోరీగా పోరాడినా నిర్ణీత సమయంలో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. దీంతో మ్యాచ్ అదనపు సమయానికి వెళ్లింది. అదనపు సమయంలో(91వ నిమిషం) ప్రత్యామ్నాయ ఆటగాడిగా బరిలోకి దిగిన మికెల్ మెరినో కీలక గోల్ చేసి స్పెయిన్‌కు ఆధిక్యాన్ని అందించాడు. ఫెరాన్ టొరెస్ అందించిన అద్భుతమైన పాస్‌ను మెరినో సద్వినియోగం చేసుకొని గోల్‌గా మలిచాడు.ఆ గోల్‌తో స్పెయిన్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లగా, మిగిలిన సమయంలో పోర్చుగల్ స్కోర్‌ను సమం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించినా స్పెయిన్ రక్షణను ఛేదించలేకపోయింది.ఈ విజయంతో స్పెయిన్ ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఒక్క గోల్ కూడా ఇవ్వకుండా తన అద్భుతమైన డిఫెన్సివ్ రికార్డును కొనసాగించింది. క్వార్టర్ఫైనల్లో స్పెయిన్ అమెరికా లేదా బెల్జియంతో తలపడనుంది.రొనాల్డో వరల్డ్‌కప్ ప్రయాణానికి ముగింపుమరోవైపు, ఈ ఓటమితో పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో ప్రపంచకప్ ప్రయాణం కూడా ముగిసినట్లైంది. ప్రస్తుతం రొనాల్డో వయసు 41 సంవత్సరాలు. ఏ లెక్కన చూసుకున్న అతడు మరో ప్రపంచకప్ ఆడలేదు. దీంతో అనధికారికంగా రొనాల్డో వరల్డ్‌కప్ జర్నీ ముగిసిందనుకోవాలి. ఫుట్‌బాల్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా గుర్తింపు పొందిన రొనాల్డోకు ప్రపంచకప్ ట్రోఫీ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలింది. -
‘యాంట్’ వార్!
‘చలి చీమల చేత జిక్కి చావదే పాము’ అన్నట్లు, స్పెయిన్ లోని అందమైన విహారదీవి మెనోర్కాలో చీమల దండయాత్ర మొదలైంది. వేలాది ‘చీమలు’ రోడ్లపైకి వచ్చి పర్యాటకులపై నిరసన వ్యక్తం చేశాయి! అయితే అవి నిజమైన చీమలు కాదు, చీమల వేషాలు వేసుకున్న స్థానికులే! చేతుల్లో ‘పర్యాటకం మమ్మల్ని నలిపేస్తోంది’, ‘మా ఇళ్ల నుంచి మమ్మల్ని వెళ్లగొడుతున్నారు’ వంటి నినాదాలతో వారు ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకప్పుడు పర్యాటకులను ఆహ్వానించిన ఈ దీవి ప్రజలు ఇప్పుడు ‘చాలు బాబోయ్!’ అంటున్నారు. కారణం... ఇళ్ల అద్దెలు ఆకాశాన్నంటడం, జీవన వ్యయం పెరగడం, నీటి సమస్యలు తీవ్రమవడం, స్థానికులకు అందుబాటులో ఇళ్లు దొరకకపోవడం. పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రభుత్వం రోజుకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తుండగా, స్థానికుల సమస్యలపై మాత్రం అంతగా దృష్టి పెట్టడం లేదని వాపోతున్నారు.అయితే, ప్రపంచమంతా ‘ఇక్కడికి రండి!’ అంటూ పర్యాటకులను ఆహ్వానిస్తుంటే, మెనోర్కా ప్రజలు మాత్రం ‘ఇంకెవరూ రావద్దు!’ అంటూ నిరసనలకు దిగడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పర్యాటకం అభివృద్ధికి ఎంత అవసరమో, స్థానికుల జీవన నాణ్యత కూడా అంతే ముఖ్యమనే విషయాన్ని ఈ చీమల దండయాత్ర మరోసారి గుర్తు చేస్తోంది. -
గోల్‌కీపర్ ప్రపంచ రికార్డు.. ప్రిక్వార్టర్స్‌కు స్పెయిన్
ఫిఫా ప్రపంచకప్‌లో స్పెయిన్ ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. రౌండ్ ఆఫ్ 32లో భాగంగా లాస్ ఏంజిల్స్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో స్పెయిన్ 3-0తో ఆస్ట్రియాను చిత్తు చేసింది. స్పెయిన్ తరఫున మికెల్ ఒజర్బయాల్ (37, 89వ నిమిషం) డబుల్ గోల్స్ చేయగా, పెడ్రో పోరో (66వ నిమిషం) మరో గోల్ సాధించాడు. మ్యాచ్ విషయానికొస్తే.. స్పెయిన్ తొలి గోల్ 37వ నిమిషంలో నమోదైంది. ఎడమ వైపు నుంచి వచ్చిన లో క్రాస్‌ను బాక్స్ మధ్యలో నుంచి మికెల్ బంతిని గోల్‌పోస్టులోకి పంపించాడు. ఆ తర్వాత ఆట 89వ నిమిషంలో మరో గోల్ సాధించాడు. ఇది కూడా మొదటి గోల్‌ను పోలి ఉంటుంది. లో క్రాస్ నుంచి వచ్చిన బంతిని అందుకున్న మికెల్ నేరుగా నెట్లోకి పంపించాడు. దీంతో ఫిఫా 2026లో మికెల్ తన గోల్స్ సంఖ్యను నాలుగుకు పెంచుకున్నాడు. ఇక డిఫెండర్ పెడ్రో పోరో రైఫిల్ హెడర్ షాట్‌తో బంతిని గోల్‌పోస్టులోకి పంపించి ఆధిక్యాన్ని మూడుకు పెంచాడు. ఇక ప్రత్యర్థి ఆస్ట్రియాను స్పెయిన్ ఉక్కిరిబిక్కిరి చేసింది. పటిష్టమైన డిఫెన్స్‌తో ఆస్ట్రియాను కేవలం ఐదుషాట్స్కే పరిమితం చేశారు. మొత్తం 90 నిమిషాల ఆటలో ఆస్ట్రియా ఒక్కసారి కూడా లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైంది.ఫిఫా ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో స్పెయిన్ ఒకటి కంటే ఎక్కువ గోల్స్ సాధించడం 1994 తర్వాత ఇదే తొలిసారి. 1994 ఫిఫా వరల్డ్‌కప్‌లో స్పెయిన్ నాకౌట్ దశలో స్విట్జర్లాండ్‌పై 3-0తో గెలిచింది. లామినే యమాల్, పౌకుబార్సీ వంటి ఇద్దరు టీనేజర్లు ఉన్న ఏకైక జట్టుగా స్పెయిన్ నిలిచింది. ఈ ద్వయం గతంలో బ్రెజిల్ దిగ్గజం పీలే, జోస్ అల్టాఫిని పేరిట ఉన్న 68 ఏళ్ల ప్రపంచరికార్డును బద్దలుకొట్టింది. ఇక ప్రిక్వార్టర్స్‌లో స్పెయిన్.. క్రొయేషియా, పోర్చుగల్ మధ్య విజేతతో తలపడనుంది. స్పెయిన్ గోల్ కీపర్ గిన్నిస్ రికార్డుఈ క్రమంలో స్పెయిన్ గోల్ కీపర్ ఉనై సైమన్ ప్రపంచ రికార్డు సాధించాడు. ఫిఫా టోర్నమెంట్లో 519 నిమిషాల పాటు ఒక్క గోల్ కూడా ఇవ్వకుండా, సైమన్ తొలి గోల్ కీపర్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరును లిఖించుకున్నాడు. ఫిఫా 2026 టోర్నీ గ్రూప్ దశ నుంచి తాజాగా లాస్ ఏంజెల్స్‌లో ఆస్ట్రియాతో జరిగిన నాకౌట్ మ్యాచ్ వరకు ఉనై సైమన్ తన ప్రత్యర్థులకు ఒక్క గోల్ కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో 1990 ఫీఫా ప్రపంచ కప్ సమయంలో ఇటలీ దిగ్గజ గోల్ కీపర్ వాల్టర్ జెంగా నెలకొల్పిన 517 నిమిషాల మునుపటి రికార్డును సైమన్ బద్దలుకొట్టాడు. Unai Simón has now gone the longest time in World Cup history without conceding a goal beating Walter Zenga's record from 1990 🧤🤯🔝 pic.twitter.com/RC57OFSjCq— OneFootball (@OneFootball) July 2, 20261 - Con #España 🇪🇸, Unai Simón (519 minutos) se ha convertido en el portero con el mayor récord de imbatibilidad en la historia del #Mundial.Ha superado los 517 de Walter Zenga.Histórico. https://t.co/bq6usGgiDX— OptaJose (@OptaJose) July 2, 2026 -
చిన్న దేశం.. అతిపెద్ద విజయం.. సరికొత్త చరిత్ర
ఫిఫా ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో సంచలనం నమోదైంది. తొలిసారి ఈ మెగా ఈవెంట్‌కు అర్హత సాధించిన కేప్ వెర్డె అనూహ్య రీతిలో నాకౌట్లోనూ అడుగుపెట్టింది. అయితే, ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించకుండానే కేప్ వెర్డే తదుపరి దశకు చేరుకోవడం మరో విశేషం. అదెలా అంటారా?!గెలవలేదు.. నిలువరించిందిగ్రూప్- ‘H’లో భాగంగా స్పెయిన్, ఉరుగ్వే, సౌదీ అరేబియా జట్లతో కలిసి కేప్ వెర్డె ఫిఫా ప్రపంచకప్ బరిలో దిగింది. ఈ క్రమంలో స్పెయిన్‌తో మ్యాచ్ (0-0)ను డ్రా చేసుకుని కేప్ వెర్డె తొలుత సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఉరుగ్వే (2-2)తో మ్యాచ్‌నూ డ్రా చేసుకుంది.తాజాగా లీగ్ దశలో ఆఖరిగా సౌదీ అరేబియాతో హూస్టన్ వేదికగా తలపడ్డ కేప్ వెర్డే.. ఈ మ్యాచ్‌ను 0-0తో డ్రా చేసుకుంది. ఈ క్రమంలో కేప్ వెర్డె ఖాతాలో మూడు పాయింట్లు చేరాయి. గ్రూప్- H టాపర్‌గా స్పెయిన్ ఏడు పాయింట్లతో ఇప్పటికే నాకౌట్‌కు చేరగా.. కేప్ వెర్డే రెండో స్థానంలో నిలిచి నాకౌట్లో అడుగుపెట్టింది. అతి చిన్న దేశంమూడింట ఒక్కో మ్యాచ్ గెలిచిన ఉరుగ్వే, సౌదీ అరేబియా టోర్నీ నుంచి నిష్క్రమించాయి. కాగా నాకౌట్ దశలో కేప్ వెర్డేకు అర్జెంటీనా రూపంలో అతిపెద్ద సవాలు ఎదురుకానుంది. ఇక పశ్చిమ ఆఫ్రికాలోని ఐలాండ్ అయిన కేప్ వెర్డే.. కాబో వెర్డె పేరుతో దేశంగా గుర్తింపు పొందింది. ఇక్కడి జనాభా కేవలం 5.30 లక్షలు మాత్రమే!.. అనూహ్య రీతిలో తొలిసారి ఫిఫా ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించిన కాబో వెర్డె ఏకంగా నాకౌట్లోనూ అడుగుపెట్టి చరిత్ర సృష్టించింది. చదవండి: అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ రద్దు.. ఎందుకంటే? -
స్పెయిన్‌ను నిలువరించిన అడ్డుగోడ.. 40 ఏళ్ల వోజిన్హా విన్యాసాలు (ఫోటోలు)
-
అడ్డుగోడలా నిలబడి...
అట్లాంటా: ఒక జట్టేమో 17వసారి ప్రపంచకప్‌లో ఆడుతోంది... మరో జట్టుకేమో ఇదే తొలి ప్రపంచ కప్... అనుభవం, బలాబలాలదృష్ట్యా 17వసారి ప్రపంచకప్‌లో పోటీపడుతున్న జట్టు అలవోకగా గెలవాలి. కానీ అలా జరగలేదు. ప్రత్యర్థి జట్టు ఎంత బలంగా ఉన్నా... పట్టుదలతో పోరాడితే అద్భుతం చేయవచ్చని ప్రపంచకప్‌లో అరంగేట్రం చేసిన జట్టు నిరూపించింది. వెరసి తాజా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో గోల్స్ నమోదు కాకుండానే 0–0తో ‘డ్రా’ అయిన మ్యాచ్‌గా స్పెయిన్, కేప్ వెర్డె పోరు నిలిచింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న ప్రస్తుత యూరోపియన్ చాంపియన్ స్పెయిన్‌కు ఈ ప్రపంచకప్‌లో ఆశించిన ఆరంభం లభించలేదు. గ్రూప్ ‘హెచ్’లో భారీ విజయంతో బోణీ కొట్టాలని భావించిన స్పెయిన్‌కు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 64వ స్థానంలో ఉన్న అనామక జట్టు కేప్ వెర్డెనుంచి ఊహంచని ప్రతిఘటన ఎదురైంది. ముఖ్యంగా కేప్ వెర్డె గోల్‌కీపర్, 40 ఏళ్ల వొజిన్హా అసాధారణ ప్రతిభ కనబరిచాడు. ఏకంగా ఏడుసార్లు స్పెయిన్ ప్లేయర్లు గోల్ పోస్ట్ లక్ష్యంగా కొట్టిన షాట్లను అతను సమర్థవంతంగా అడ్డుకున్నాడు. స్పెయిన్ యువ సూపర్ స్టార్ లామినె యామల్ 71వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ మ్యాచ్‌లో స్పెయిన్ ఆటగాళ్లు బంతిని 62 శాతం తమ ఆ«దీనంలో ఉంచుకున్నా కేప్ వెర్డె గోల్కీపర్ను బోల్తా కొట్టించడంలో విఫలమయ్యారు. నెదర్లాండ్స్‌ను నిలువరించిన జపాన్ 2–2తో మ్యాచ్ ‘డ్రా’ డాలస్: ‘ఫిఫా’ ప్రపంచకప్‌లో ఆసియా జట్టు జపాన్ మరోసారి స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చింది. 2020 టోర్నీలో మాజీ చాంపియన్లు జర్మనీ, స్పెయిన్‌లను ఓడించిన జపాన్... ఈసారి మరో పటిష్ట యూరోపియన్ టీమ్ నెదర్లాండ్స్‌ను నిలువరించింది. జపాన్, నెదర్లాండ్స్ మధ్య జరిగిన గ్రూప్ ‘ఎఫ్’ మ్యాచ్ 2–2తో డ్రాగా ముగిసింది. నెదర్లాండ్స్ తరఫున వాన్ విర్జిల్ (50వ నిమిషంలో), సమ్మర్విల్లే (64వ నిమిషంలో) గోల్స్ సాధించగా... జపాన్ ఆటగాళ్లలో కీటో నకముర (57వ నిమిషంలో), కమాడా డైచీ (88వ నిమిషంలో) గోల్స్ కొట్టారు. దాదాపు మ్యాచ్ చివరి వరకు నెదర్లాండ్స్ ఆధిక్యం కొనసాగించగా... కమాడా అనూహ్య హెడర్‌తో స్కోరును సమం చేశాడు. ప్రపంచకప్‌లో మూడుసార్లు ఫైనల్‌కు చేరినా... ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయిన నెదర్లాండ్స్ తర్వాతి దశకు అర్హత సాధించే ప్రయత్నంలో గెలిచేందుకు అవకాశం ఉన్న మ్యాచ్‌ను చేజార్చుకుంది. దాంతో డచ్ ఆటగాళ్లు, అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.వెల్డన్... స్వీడన్మరో గ్రూప్ ‘ఎఫ్’ మ్యాచ్‌లో స్వీడన్ 5–1 గోల్స్ తేడాతో ట్యునీషియాను చిత్తు చేసింది. 2893 రోజుల నిరీక్షణకు తెరదించుతూ ప్రపంచకప్‌లో స్వీడన్ గోల్స్ ఖాతా తెరిచింది. 13వ సారి ప్రపంచకప్‌లో ఆడుతున్న స్వీడన్ తమ తొలి మ్యాచ్‌లోనే ఐదు గోల్స్ చేయడం ఇదే తొలిసారి. యాసిన్ అయారి (7వ, 90+6వ నిమిషంలో) రెండు గోల్స్ సాధించగా... అలెగ్జాండర్ ఇసాక్ (30వ నిమిషంలో), విక్టర్ గ్యోకర్స్ (59వ నిమిషంలో), మతియాస్ స్వాన్బెర్గ్ (84వ నిమిషంలో) ఒక్కో గోల్ కొట్టారు. ట్యునీషియా ఆటగాళ్లలో ఒమర్ రెకిక్ (43వ నిమిషంలో) ఏకైక గోల్ చేశాడు. 2018లో క్వార్టర్ ఫైనల్లో ఓడిన స్వీడన్ 2022 ప్రపంచకప్‌కు అర్హత సాధించలేదు. 19 మ్యాచ్‌ల తర్వాత... మరోవైపు ఈక్వెడార్‌తో జరిగిన గ్రూప్ ‘ఇ’ పోరులో ఐవరీకోస్ట్ 1–0తో విజయం సాధించింది. కొద్ది క్షణాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా సబ్‌స్టిట్యూట్ అమాద్ డియాలో (90వ నిమిషంలో) చేసిన ఏకైక గోల్‌తో ఐవరీకోస్ట్ అనూహ్యంగా గెలిచింది. దాంతో వరుసగా 19 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచిన ఈక్వెడార్‌కు తొలి ఓటమి ఎదురైంది. 2014లో చివరిసారి ప్రపంచకప్‌లో ఆడి ఓ మ్యాచ్‌లో గెలిచిన ఐవరీకోస్ట్... 2018, 2022 ప్రపంచకప్ టోరీ్నలకు అర్హత పొందలేదు. -
ఫిఫా ప్రపంచకప్‌లో సంచలనం.. స్పెయిన్‌కు షాక్
ఫిఫా ప్రపంచకప్ 2026లో సంచలనం నమోదైంది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన స్పెయిన్ జట్టుకు వరల్డ్‌కప్‌లో తొలిసారి అడుగుపెట్టిన 'కేప్ వెర్డే' జట్టు గోల్రహిత డ్రాతో (0-0) నిలువరించి, ఊహించని షాకిచ్చింది. అమెరికాలోని అట్లాంటా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ (గ్రూప్-హెచ్) ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత గొప్ప అప్సెట్లలో ఒకటిగా నిలిచింది.కేవలం ఆరు లక్షల జనాభా కలిగిన అట్లాంటిక్ ద్వీప దేశం కేప్ వెర్డే, ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజాల్లో ఒకటైన స్పెయిన్‌ను అడ్డుకోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. మ్యాచ్ మొత్తం స్పెయిన్ ఆధిపత్యం చెలాయించినప్పటికీ గోల్ మాత్రం సాధించలేకపోయింది.స్పెయిన్ 24 షాట్లు కొట్టినా కేప్ వెర్డే రక్షణ గోడను దాటలేకపోయింది. ముఖ్యంగా 40 ఏళ్ల గోల్‌కీపర్ జోసిమర్ డయాస్ అద్భుత ప్రదర్శనతో స్పెయిన్ దాడులను తిప్పికొట్టాడు. ఫెర్రన్ టోర్రెస్, మిఖెల్ ఒయార్జబాల్, అమెరిక్ లాంపోర్టే ప్రయత్నాలను వరుసగా అడ్డుకుని హీరోగా నిలిచాడు.మ్యాచ్ చివరి నిమిషాల్లో కేప్ వెర్డే ఫుట్‌బాల్ చరిత్రలోనే అతి పెద్ద సంచలనం నమోదు చేసే దిశగా వెళ్లింది. పసికూన చేతిలో స్పెయిన్‌కు పరాభవం తప్పదని అంతా అనుకున్నారు. 90వ నిమిషంలో డినే బోర్జస్ హెడ్డర్‌ను స్పెయిన్ గోల్‌కీపర్ ఉనయ్ సైమన్ అద్భుతంగా అడ్డుకున్నాడు. అనంతరం ర్యాన్ మెండెస్కు కూడా గెలుపు గోల్ చేసే అవకాశం లభించినా అది ఫలించలేదు. -
FIFA WC 2026:యువ జోరు...
నాలుగేళ్లకోసారి జరిగే ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో సత్తా చాటుకొని విశ్వవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాలని ఆయా జట్ల క్రీడాకారులు తాపత్రయపడుతుంటారు. ప్రతీ ప్రపంచకప్ కొందరిని హీరోలుగా చేస్తుంది. మరికొందరిని జీరోలుగా చేస్తుంది. ప్రపంచకప్ రూపంలో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని రాత్రికి రాత్రే తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఎందరో యువ ఆటగాళ్లు సిద్ధంగా ఉంటారు. ప్రస్తుతం సూపర్ స్టార్స్‌గా మారిన మెస్సీ, రొనాల్డో, నెమార్, ఎంబాపె, మోడ్రిచ్ తదితరులు ఈ దశను దాటి వచ్చినవాళ్లే. రేపటి నుంచి అమెరికా, కెనడా, మెక్సికోలలో మొదలయ్యే 23వ ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలోనూ పలువురు యువ ఆటగాళ్లు తమ విన్యాసాలతో అలరించేందుకు సై అంటున్నారు. ఈ జాబితాలో ముందువరుసలో ఉన్నాడు స్పెయిన్‌కు చెందిన 18 ఏళ్ల లామినె యామల్. రెండేళ్ల క్రితం యూరో టోర్నీలో స్పెయిన్‌కు నాలుగోసారి టైటిల్ దక్కడంలో యామల్ కీలకపాత్ర పోషించాడు. తాజా ప్రపంచకప్‌లో యామల్ మెరిపిస్తే స్పెయిన్ టైటిల్ ఫేవరెట్‌గా మారుతుందనడంలో సందేహం లేదు. డిఫెండర్లను బోల్తా కొట్టించడంలో... సహచరులకు సమయస్ఫూర్తితో పాస్‌లు అందించడంలో... సుదూరం నుంచి గోల్‌పోస్ట్ లక్ష్యంగా కళ్లు చెదిరే కిక్‌లు కొట్టడంలో యామల్‌కు తిరుగులేదు. ఐదుసార్లు విజేత బ్రెజిల్ జట్టు తరఫున స్టార్ నెమార్ చివరిసారి ప్రపంచకప్‌లో ఆడుతుండగా... అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు సిద్ధమయ్యాడు 18 ఏళ్ల ఎస్టవో విలియన్. అభిమానులు ఇప్పటి నుంచే విలియన్ను ‘న్యూ నెమార్’గా పిలుస్తున్నారు. డిఫెన్స్‌ను ఛేదించి గోల్స్ కొట్టడంలో విలియన్‌కు మంచి పేరుంది. అర్జెంటీనా జట్టు కెప్టెన్ మెస్సీ రిటైరైనా ఆ జట్టు భవిష్యత్‌కు ఢోకా లేదని 18 ఏళ్ల ఫ్రాంకో మస్తాంటువానో తన ఆటతీరుతో భరోసా కల్పిస్తున్నాడు. వరుసగా రెండోసారి అర్జెంటీనా ప్రపంచకప్ టైటిల్ నెగ్గాలంటే మెస్సీతోపాటు ఫ్రాంకో ఆటతీరు కూడా కీలకం కానుంది. వరుసగా మూడోసారి ఫ్రాన్స్ జట్టు టైటిల్ పోరుకు అర్హత సాధించే అవకాశాలు సీనియర్ స్టార్స్ ఎంబాపె, డెంబెలె, 19 ఏళ్ల డిసిర్ డుయు ఆటతీరుపై ఆధారపడి ఉంది. ఇటీవల యూరో చాంపియన్స్ లీగ్ టైటిల్ నిలబెట్టుకున్న పీఎస్జీ జట్టుకు డిసిర్ డుయు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. వీరితోపాటు గిల్బెర్టో మోరా (మెక్సికో), ఇబ్రహీం ఎంబాయె (సెనెగల్), నికో పాజ్ (అర్జెంటీనా), అర్దా లెర్ (టర్కీ), పౌ కుబార్స్ (స్పెయిన్), యాన్ డియోమండె (ఐవరీకోస్ట్), ఆండ్రీ సాంతోస్ (బ్రెజిల్), ఎండ్రిక్ (బ్రెజిల్), ఆంటోనియో నూసా (నార్వే) కూడా సంచలన ప్రదర్శనతో మెరిపించే అవకాశాలు ఉన్నాయి. – సాక్షి క్రీడా విభాగం -
ఇంటి అద్దెలు భరించలేక ఆగ్రహం కట్టలు తెంచుకుని..
మాడ్రిడ్: మన దేశంలోని పలు నగరాల్లో ఇంటి అద్దెలు ఎంతగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. అంతెందుకు హైదరాబాద్‌లో అద్దెకు ఉండి ఉద్యోగాలు చేసుకునే చాలా మంది .. తమ జీతం అద్దెలు కట్టుకోవడానికే సరిపోతుందంటూ వాపోతుంటారు. అయితే, అద్దెల బాధల వల్ల వేలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపిన వార్తను ఎప్పుడైనా విన్నారా? స్పెయిన్‌లో ఆదివారం అదే జరిగింది.మాడ్రిడ్, బార్సెలోనా లాంటి నగరాల్లో పెరుగుతున్న ఇంటి అద్దె ఖర్చులు చాలా మందికి ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. మరోవైపు, కొంత డబ్బు కూడబెట్టుకున్న వారు ఇళ్లు కొందామన్నా అందుబాటు ధరల్లో ఉండడం లేదని నిరసనకారులు చెప్పారు. స్పెయిన్ ప్రజలను ఇళ్ల మార్కెట్‌కు దూరం చేస్తున్నాయంటూ మాడ్రిడ్‌లో నిరసన చేపట్టారు.స్పెయిన్‌లో హౌసింగ్ క్రిసిస్, సోషలిస్టు ప్రధాని పెర్డో సాంచెజ్కు తలనొప్పిగా మారింది. 2027 ఎన్నికలకు ముందు ఇది అతిపెద్ద సవాలు. ఆ దేశంలో సొంత ఇల్లు ఉండాలన్న సంప్రదాయం బలంగా ఉంది. పర్యాటకం, వలసలతో పెరిగిన జనాభా కారణంగా డిమాండ్ పెరగడంతో ఇళ్ల అద్దెలు భారీగా పెరిగాయని విశ్లేషకులు చెబుతున్నారు.నిరసనకారులు నినాదాలు చేస్తూ ఇంటి హక్కును గుర్తు చేస్తూ బ్యానర్లు ప్రదర్శించారు. “మాకు పర్యాటకులు కాదు, నేబర్స్ కావాలి” అని ఒక బ్యానర్లో రాసి ఉంది.ఓ ర్యాలీని మరవకముందే మరొకటిస్పెయిన్లో శనివారం కూడా ఓ ర్యాలీ జరిగింది. సాంచెజ్కు వ్యతిరేకంగా మాడ్రిడ్‌లో వేలాది మంది నిరసన చేపట్టారు. అవినీతి ఆరోపణలు, ప్రభుత్వంపై అసంతృప్తితో రాజకీయ ఉద్రిక్తతలు, విమర్శలు పెరిగాయి. దీంతో స్పెయిన్‌లో ఉద్రిక్తతలు పెరిగాయి.ఆ ర్యాలీ మరవకముందే ఆదివారం మరో ర్యాలీ జరగడం గమనార్హం. స్పెయిన్‌లో ఇల్లు కొనడం చాలా మందికి భారంగా మారింది. మార్కెట్ ఒత్తిళ్లు, ఊహాగానాలు ధరలను పెంచుతున్నాయి. ముఖ్యంగా పెద్ద నగరాలు, తీర ప్రాంతాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది.గత నెలలో స్పెయిన్ ప్రభుత్వం 7 బిలియన్ యూరోల ($8.23 బిలియన్) విలువైన భారీ ప్రణాళికను ఆమోదించింది. వచ్చే నాలుగేళ్లలో మరిన్ని ప్రభుత్వ గృహాలు నిర్మించడం, అధిక అద్దెలు, ఇళ్ల ధరలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న వారికి సాయం చేయడం ఈ ప్రణాళిక లక్ష్యం.గత కొన్ని ఏళ్లుగా స్పెయిన్ ప్రజలు దేశవ్యాప్తంగా అనేక నిరసనల్లో పాల్గొంటున్నారు. అధిక అద్దెలు, ఇళ్ల ధరలకు వ్యతిరేకంగా రోడ్లపైకి వస్తున్నారు. గత ఏడాది రికార్డు స్థాయిలో 97 మిలియన్ అంతర్జాతీయ పర్యాటకులు స్పెయిన్‌ను సందర్శించారు. నగర కేంద్రాల్లో విస్తరించిన పర్యాటక అద్దె ఇళ్లపై ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాన డిమాండ్‌గా ఉంది. 2025 చివర్లో ఇళ్లకు సంబంధించిన ఖర్చులు ఏడాది ప్రాతిపదికన దాదాపు 13 శాతం పెరిగాయని యూరోపియన్ యూనియన్ గణాంక సంస్థ యూరోస్టాట్ తెలిపింది. బ్యాంక్ ఆఫ్ స్పెయిన్ అంచనా ప్రకారం.. 50 మిలియన్ జనాభా ఉన్న స్పెయిన్‌లో 7,00,000 ఇళ్ల కొరత ఉంది. డిమాండ్‌తో పోల్చితే కొత్త నిర్మాణాల వేగం తక్కువగా ఉంది. -
ఫేక్ అయితేనేం... ఫేమ్ అయ్యింది!
సమాజం సవ్యంగా ఉండాలంటే కుటుంబాలు బాగుండాలి. ఆ కుటుంబాల కోసం పిల్లల పెంపకం నుంచి ఇంటిపనుల వరకు మహిళలు ఎంతో శ్రమిస్తారు. తల్లుల కష్టమే కుటుంబ రథానికి ఇంధనం అవుతుంది. అయితే వారి శ్రమ ఎప్పుడూ నిర్లక్ష్యానికి గురవుతుంటుంది. పైగా... ‘పురుషులు బయటకి వెళ్లి కష్టపడతారు. స్త్రీలు ఇల్లు కదలకుండా సుఖంగా ఉంటారు’ అనే ప్రచారం ఒకటి. వారి శ్రమకు వెల కట్టేవారు లేరు. వారి శ్రమ కనిపించని శ్రమ అయింది. తాజా విషయానికి వస్తే.,...‘ఏమీ చేయని స్త్రీ’ అని పేరు పెట్టిన ఒక శిల్పం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. తల్లుల కనబడని శ్రమకు గౌరవసూచకంగా రూపొందించిన ఈ శిల్పం స్పెయిన్‌లో ఉందని చెబుతుంటారు.‘ఇంటికి పరిమితమైన మహిళలు ఏమీ చేయరు’ అనే పురుషాధిక్య భావజాలాన్ని బద్దలు కొట్టే శిల్పం ఇది. జోస్ లూయిస్ ఫెర్నాండేజ్ రూపొందించారని చెబుతున్న ఈ శిల్పంలో... ఒకవైపు పిల్లలను చేతిలో పట్టుకొని, మరోవైపు... చీపురు, వాషింగ్ మెషిన్, బకెట్‌లాంటి ఇంటిబరువును వీపున మోస్తున్న స్త్రీ కనిపిస్తుంది. ముగ్గురు పిల్లలను, ఇంటి పనులను వీపుపై మోస్తున్న ఈ స్త్రీ శిల్పం సోషల్ మీడియాలో విపరీతమైన ప్రజాదరణ పొందింది. అసలు విషయం ఏమింటే, ఇలాంటి శిల్పం నిజంగా లేదు. పూర్తిగా కల్పితం. అయినప్పటికీ ఈ కల్పిత శిల్పం విపరీతంగా వైరల్ అయింది. లక్షలాది వ్యూస్‌ను సొంతం చేసుకొని ‘వైరల్ స్టాచ్యూ’ గా పేరు తెచ్చుకుంది. ‘ఏమీ చేయని స్త్రీ’ అని పేరు పెట్టిన ఒక శిల్పం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. తల్లుల కనబడని శ్రమకు గౌరవసూచకంగా రూపొందించిన ఈ శిల్పం స్పెయిన్‌లో ఉందట! ‘ఇంటికి పరిమితమైన మహిళలు ఏమీ చేయరు’ అనే పురుషాధిక్య భావజాలాన్నిబద్దలు కొట్టే శిల్పం ఇది. -
స్పెయిన్‌లో ఉద్యోగం.. ఇల్లు కూడా ఫ్రీ!
ఉన్న ఊరిలో లేదా నగరంలో కాకుండా.. ఎక్కడైనా ఉద్యోగం చేయాలంటే?, తప్పకుండా నివాసం (ఇల్లు) వెతుక్కోవాల్సిందే. బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో అయితే.. ఇంటి అద్దెలకు వేలరూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి. అంటే.. వచ్చే జీతంలో ఇంటికోసం కొంత వెచ్చించాల్సి వస్తుంది. కానీ స్పెయిన్ దేశంలో ఒక చిన్న గ్రామం అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది.ఉద్యోగం ఇవ్వడమే కాకుండా.. ఉచితంగా ఇల్లు కూడా ఇస్తామంటోంది స్పెయిన్‌లోని అరెనిల్లాస్. ఈ గ్రామం స్పెయిన్‌లోని సొరియా ప్రాంతంలో ఉంది. ఇక్కడ ప్రస్తుతం 40 మంది మాత్రమే శాశ్వత నివాసం ఉంటున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా గ్రామాల నుంచి పట్టణాలకు ప్రజలు వలస వెళ్తుండటంతో, ఈ ప్రాంతం 'ఎంప్టీ స్పెయిన్' అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ పరిస్థితిని మార్చడానికి ఈ ప్రత్యేక ఆఫర్ అందిస్తోంది.షరతులుఈ ఆఫర్ ప్రకారం, ఒక కుటుంబానికి పూర్తిగా పునరుద్ధరించిన ఇల్లు ఉచితంగా లభిస్తుంది. అంతేకాకుండా వారికి ఒక స్థిరమైన ఉద్యోగం కూడా కల్పిస్తారు. గ్రామంలో శాశ్వతంగా నివసించే అవకాశం కూడా ఉంటుంది. అయితే.. ఈ అవకాశానికి కొన్ని ముఖ్యమైన నిబంధనలు ఉన్నాయి. ఆ కుటుంబానికి పాఠశాల వయస్సు ఉన్న పిల్లలు ఉండాలి. వారు గ్రామంలో పూర్తిగా నివసిస్తూ, గ్రామంలోని బార్‌ను నిర్వహించాలి. అదేవిధంగా భవనాల నిర్వహణ వంటి మున్సిపల్ పనులు కూడా చేయాలి.100 కంటే ఎక్కువ దరఖాస్తులు!నిజానికి ఎక్కడైనా ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఇల్లు కూడా ఇవ్వడం అనేది చాలా అరుదు. కానీ ఇలాంటి ఆఫర్ అరెనిల్లాస్ అందించడం చాలా ప్రత్యేకమైన విషయం. ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చాక.. ఇప్పటివరకు 100కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.అరెనిల్లాస్ గ్రామం పర్వత ప్రాంతంలో ఉండటం వల్ల ప్రకృతి అందాలు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. వసంత కాలంలో సుమారు 24°C వరకు ఉష్ణోగ్రతలు ఉండటం వల్ల ఇది ఒక అందమైన ప్రదేశంలా కనిపిస్తుంది.ఇబ్బందులూ ఉంటాయ్!ఇక్కడ జనాభా చాలా తక్కువగా ఉండటం, నిశ్శబ్దంగా ఉండటం వల్ల ఒంటరితనం అనిపించవచ్చు. శీతాకాలంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ప్రజా రవాణా సదుపాయాలు తక్కువగా ఉండటంతో, సొంత వాహనం అవసరం అవుతుంది. సమీప పాఠశాల సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, అయితే పిల్లలకు ఉచిత రవాణా ఉంటుంది. ఆరోగ్య సేవలు కూడా ప్రాథమిక స్థాయిలో మాత్రమే ఉంటాయి.ఇదీ చదవండి: WFH అడిగిన ఉద్యోగి.. జాబ్ నుంచి తొలగించిన బాస్ -
యువతి కారుణ్య మరణం, చివరి కోరిక తెలిస్తే కన్నీళ్లాగవు
ఘజియాబాద్‌కు హరీష్ రాణా దేశంలోనే తొలి కారుణ్య మరణం పొందిన వ్యక్తిగా నిలిచారు. 13 ఏళ్ల పాటు మంచానికే పరిమితమై జీవచ్ఛవంలా బతికిన ఆయనకు సుప్రీంకోర్టు అనుమతితో ఎయిమ్స్ వైద్యులు చికిత్స నిలిపివేయగా, ఇటీవల తుదిశ్వాస విడిచారు. దాదాపు ఇలాగే చట్ట అనుమతితో కారుణ్య మరణం పొందిన స్పానిష్ యువతి గురించి తెలుసా? వేదన భరించలేక కారుణ్య మరణం ఎంచుకున్న అత్యాచార బాధితురాలి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.స్పానిష్ యువతి నోలియా కాస్టిల్లో (Noelia Castillo) ఉదంతం చాలా హృదయవిదారకమైన గాథ. మృత్యువు అంచుల వద్ద కూడా ఎలాగైనా బతకాలనే కోరుకుంటారు ఎవరైనా. కానీ కోరి కోరి మృత్యువును ఎంచుకోవడం అంటే ఆ నరకయాతన, మానసిక క్షోభను, కుటుంబం భావోద్వేగ పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. నోలియా కాస్టిల్లో కారుణ్య మరణంస్పానిష్ ప్రభుత్వ ప్రసార సంస్థ TVE , ఇతర స్థానిక మీడియా నివేదికల ప్రకారం, బార్సిలోనాకు చెందిన 25 ఏళ్ల నోలియా కాస్టిల్లో, కాటలోనియాలోని శాంట్ పెరె డి రిబ్స్లోని ఒక ఆసుపత్రిలో గురువారం సాయంత్రం ఈ ప్రక్రియ పూర్తి అయింది. దీన్ని ఎలాగైనా ఆపాలని ఆమె తండ్రి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరికి స్పెయిన్, యూరప్‌లోని న్యాయస్థానాల అనుమతితో మూడు రకాల మందుల మిశ్రమంతో చేసే ఇంజెక్షన్ ద్వారా 15 నిమిషాల చికిత్సా ప్రక్రియలో ఆమె ఈ లోకం నుంచి శాశ్వతంగా సెలవు తీసుకుంది. నోలియా మరణం స్పెయిన్‌లో కారుణ్య మరణంపై మళ్ళీ చర్చను లేవనెత్తింది. మతసంస్థలు, సంప్రదాయ వాదులు ఇది వైద్య వ్యవస్థ వైఫల్యమని విమర్శించారు. అయితే స్వచ్ఛంద మరణం కోసం పోరాడే సంఘాలు, గౌరవప్రదమైన మరణాన్ని ఎంచుకునే హక్కు అంటూ ఈ ప్రక్రియను సమర్థించాయి.భరించలేని హింస , బాధ2022లో ఒక ప్రభుత్వ సంరక్షణ కేంద్రంలో ముగ్గురు వ్యక్తులు నోలియాపై దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆమె తీవ్రమైన డిప్రెషన్లోకి జారిపోయింది. ఆపై తాను ఉంటున్న భవనంలోని ఐదో అంతస్తు నుండి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. తృటిలో ప్రాణాలతో బయటపడింది కానీ పక్షవాతానికి గురైంది. ఇక అప్పటినుంచి మంచానికే పరిమితమై నరకయాతన అనుభవించిన నోలియా, సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత తానుకున్నట్టుగానే మనశ్శాంతిగా కన్నుమూసింది. ఆ గాయం నుండి కోలుకోలేక ఆమె ఐదో అంతస్తు నుండి దూకి ఆత్మహత్యా యత్నం చేశారు. ప్రాణాలతో బయటపడినప్పటికీ, నడుము కింది భాగం పక్షవాతానికి గురైంది. అప్పటి నుండి, ఆమె వీల్‌చైర్‌కే పరిమితమై, శారీరక , మానసిక వేదనతో కుమిలిపోయింది.శారీరక వేదనతోపాటు,అత్యాచారం తాలూకూ చేదు జ్ఞాపకాలు ఆమెను నిరంతరం వెంటాడేవి. "నేను ఏమీ చేయలేకపోతున్నాను, కనీసం నిద్రపోవడం కూడా కష్టంగా ఉంది. తన బాధ కేవలం శారీరకమైనది మాత్రమే కాదని, తీవ్రమైన భావోద్వేగపరమైంది అందుకే ఈ నరకం నుంచి విముక్తి కావాలి. ఇక ఈ బాధ భరించలేను, నేను అనుభవించిన ప్రతీ బాధను మననం చేసుకుంటూ జీవించడం నావల్లకాదు ఇక వెళ్లిపోవాలను కుంటున్నాను, నాకు విముక్తి కావాలి శాంతి కావాలి” అని ఆమె మరణానికి ముందు రోజు ప్రసారమైన మరో ఇంటర్వ్యూలో చెప్పింది.తండ్రి అభ్యంతరంఏప్రిల్ 2024లో నోలియా దీని కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆమె పరిస్థితిని గమనించిన ఆరోగ్య బోర్డు అందుకు అనుమతించింది. కానీ నోలియా తండ్రి దీనిని ఎప్పటికప్పుడు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆమె మానసిక స్థితి సరిగా లేదని, ఇది సరైన నిర్ణయం కాదని, చనిపోవడం సమస్యకు పరిష్కారం కాదంటూ కోర్టులను ఆశ్రయించారు. ఈ పోరాటంలో సుప్రీంకోర్టు నుండి ఐరోపా మానవ హక్కుల కోర్టు వరకు వెళ్లినా, ఆయన విజ్ఞప్తి తిరస్కరణకు గురైంది.తల్లి యోలాండా రామోస్ నిస్సహాయత: "నేను ఆమె నిర్ణయంతో ఏకీభవించడం లేదు, కానీ నా బిడ్డ పడుతున్న బాధను చూడలేను. చివరి వరకు ఆమె పక్కనే ఉంటాను" అని భావోద్వేగంగా చెప్పారు.చివరి కోరిక"నేను అందంగా కనిపిస్తూ మరణించాలని అనుకుంటున్నాను. నాకిష్టమైన డ్రెస్ వేసుకుని, మేకప్ వేసుకుని ప్రశాంతంగా వెళ్ళిపోతాను" అని ఆమె తన చివరి కోరికను వెల్లడించారు. ఆమె కోరుకున్నట్టుగా, చట్ట నియమాల మేరకు ఆమె తనువు చాలించారు.స్పెయిన్ 2021లో కారుణ్య మరణాన్ని (Euthanasia) చట్టబద్ధం చేసింది. దీని ప్రకారం నయం చేయలేని వ్యాధులు లేదా దీర్ఘకాలిక అశక్తత ఉన్నవారు మరణాన్ని కోరుకోవచ్చు. -
విద్వేష ప్రసంగాలకు చెక్ పెట్టే ‘హోడియో’!
సోషల్ మీడియా వేదికలపై విచ్చలవిడిగా సాగుతున్న విద్వేషపూరిత ప్రసంగాలకు (హేట్ స్పీచ్) అడ్డుకట్ట వేసేలా స్పెయిన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను నడిపే టెక్ దిగ్గజాలను జవాబుదారీలుగా చేసే దిశగా స్పెయిన్ సంచలన నిర్ణయం తీసుకుంది. డిజిటల్ వేదికలపై ఏ స్థాయిలో ఈ ప్రసంగాలు విస్తరిస్తున్నాయో లెక్కగట్టేందుకు ‘హోడియో’ (Hodio) అనే టెక్నాలజీ టూల్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రధాని పెడ్రో సాంచెజ్ ప్రకటించారు. మాడ్రిడ్‌లో జరిగిన ఒక ప్రత్యేక ఫోరమ్‌లో ఆయన మాట్లాడుతూ, టెక్ సంస్థల యజమానుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.ఏమిటీ ‘హోడియో’?డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల్లో ద్వేషపూరిత కంటెంట్ ఉనికిని, అది వ్యాపిస్తున్న తీరును, దాని ప్రభావ పరిధిని శాస్త్రీయంగా కొలవడానికి ఈ సాధనం ఉపయోగపడుతుంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ టూల్ సమగ్ర నివేదికను రూపొందిస్తుంది. ‘స్పానిష్ అబ్జర్వేటరీ ఆఫ్ రేసిజం అండ్ జెనోఫోబియా’ ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తుంది. ఏ సంస్థ ద్వేషాన్ని ఆపుతోంది, ఏ సంస్థ ప్రేక్షక పాత్ర వహిస్తోంది, ఈ వ్యవహారం ద్వారా ఎవరు వ్యాపారం చేస్తున్నారో ప్రపంచానికి తెలియజేస్తామని సాంచెజ్ స్పష్టం చేశారు.గత దశాబ్ద కాలంలో స్పెయిన్‌లో ద్వేషపూరిత నేరాలు 41% పెరగడంపై పెడ్రో సాంచెజ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఇప్పటి నుంచి సోషల్ మీడియా సంస్థలు తాము అనుమతించే ప్రతి విద్వేషపూరిత అంశానికి బహిరంగంగా సమాధానం చెప్పుకోవాల్సిందే’ అని తెలిపారు.మస్క్, దురోవ్‌లతో ఢీ!స్పెయిన్ ప్రభుత్వం తీసుకుంటున్న వరుస నిర్ణయాలు గ్లోబల్ టెక్ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించే ప్రణాళికను ఫిబ్రవరిలోనే ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం ఎక్స్ (గతంలో ట్విట్టర్) యజమాని ఎలాన్ మస్క్, టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్‌లతో వాగ్వివాదానికి దారితీసింది. ఏఐ సృష్టించిన చైల్డ్ పోర్నోగ్రఫీని నిరోధించడంలో విఫలమైనందుకు ఎక్స్, మెటా, టిక్‌టాక్‌లపై దర్యాప్తు చేయాలని స్పెయిన్ ఇప్పటికే ప్రాసిక్యూటర్ కార్యాలయాన్ని కోరింది.యూరోపియన్ యూనియన్‌లో డిజిటల్ సేవల చట్టం (డీఎస్ఏ) ఇప్పటికే అమలులో ఉన్నప్పటికీ స్పెయిన్ సొంతంగా ‘హోడియో’ వంటి సాధనాన్ని తీసుకురావడం గమనార్హం. ఇది కేవలం నియంత్రణ మాత్రమే కాదు, టెక్ కంపెనీల వ్యాపార నమూనాలను సైతం సవాలు చేసే వ్యూహంలా కనిపిస్తోందని కొందరు భావిస్తున్నారు.ఇదీ చదవండి: దిగొస్తున్న పసిడి ధరలు.. వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే.. -
లొంగే ప్రసక్తే లేదు
మాడ్రిడ్: ఇరాన్‌పై దాడుల కోసం మీ వైమానిక స్థావరాలను ఉపయోగించుకునేందుకు అనుమతించాలని లేదంటే వాణిజ్య బంధం తెంచుకుంటానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలను స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో సాన్చెజ్ బేఖాతరు చేశారు. బెదిరింపులకు లొంగే ప్రసక్తేలేదని తెగేసి చెప్పారు. అర్ధంలేని యుద్ధంలో భాగస్వాములం కాబోమని స్పష్టంచేశారు. వాణిజ్య బంధాన్ని వదులుకుంటామని ట్రంప్ చేసిన హెచ్చరికలపై పెడ్రో దీటుగా స్పందించారు. బుధవారం టెలివిజన్‌లో దేశ ప్రజలనుద్దేశించి పెడ్రో ప్రసంగించారు. ‘‘ప్ర పంచానికి అశుభంగా దాపురించిన పశ్చి మాసియా యుద్ధంలోకి మేం దిగదల్చు కోలేదు. ఈ సమరం అనేది మా దేశ విలు వలు, స్వ ప్రయోజనాలకు పూర్తి విరుద్ధం. ట్రంప్ హెచ్చరికలకు బెదిరిపోయే వాళ్లు ఎవరూ లేరిక్కడ. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ అన్యాయంగా దాడులు చేస్తున్నాయి. ఇతర దేశాల వ్యవహారల్లోకి సైనిక జోక్యం చేసుకోవడం అనేది అత్యంత ప్రమాదకరం. ఇరాన్‌పై దాడులతో పశ్చిమాసియాలో అత్యంత భీకరమైన యుద్ధం సుదీర్ఘంగా కొనసాగే పెను ప్రమాదం పొంచి ఉంది’’అని ఆయన అన్నారు.బుల్లెట్ ఎప్పుడు పేలుతుందో తెలీదు..‘‘ఇరాక్, అఫ్గానిస్తాన్ విషయాల్లో అమెరికా జోక్యం చేసుకున్నప్పుడూ ప్రపంచం దారుణ విపరిణామాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్ధంలో భాగస్వాములుకావడం అంటే నిప్పుతో చెలగాటం ఆడినట్లే. రివాల్వర్‌లో ఒక బుల్లెట్ పెట్టి బుల్లెట్ చాంబర్ గిరగిరా తిప్పి కాల్చడం లాంటిది. బుల్లెట్ ఎప్పుడు పేలుతుందో ఎవరికీ తెలీదు. ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో, ఏ దారుణ దిశగా వెళ్తుందో, ఎలాంటి విషాదాలను మిగుల్చుతుందో ఎవరూ ఊహించలేరు. తాజా పరిణామాలపై స్పెయిన్ ప్రభుత్వ వైఖరిని నాలుగు ముక్కల్లో చెప్పాలంటే మేం యుద్ధం అస్సలు చేయదల్చుకోలేదు’’ అని ఆయన స్పష్టంచేశారు. దక్షిణ స్పెయిన్‌లోని రోటా, మొరాన్ స్థావరాలను ఎప్పుడంటే అప్పుడు మేం వినియోగించుకోగలమని మంగళవారం ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘‘ ఈ స్థావరాలను ఉపయోగించకూడదు అని మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరు’’ అని ట్రంప్ అన్నారు. యుద్ధంలో భాగస్వాములు కాకపోతే అత్యధిక టారిఫ్‌ల మోత, పరస్పర వాణిజ్యంపై ఆంక్షలు విధించడం వంటి చర్యలు తప్పవని ట్రంప్ హెచ్చరించడం తెల్సిందే. ట్రంప్ వ్యాఖ్యలపై స్పెయిన్ ఆర్థిక మంత్రి కార్లోస్ క్యూయెర్పో స్పందించారు. ‘‘ ప్రశాంతంగా ఉండాలని ట్రంప్‌కు సందేశం పంపిస్తా. ట్రంప్ బెదిరింపులకు దిగుతారుగానీ ఆచరణలో ఏమీ ఉండదు’’ అని కార్లోస్ ఎద్దేవాచేశారు. అమెరికాతో స్పెయిన్ ఎగుమతి, దిగుమతుల విలువ దేశ జీడీపీలో కేవలం 4.4 శాతానికి సమానం. స్పెయిన్‌కు ఆరో అతిపెద్ద ఎగుమతి మార్కెట్‌గా అమెరికా కొనసాగుతోంది. నాటో దేశాలు తమ జీడీపీలో 5 శాతానికి సమానమైన నిధులను రక్షణ బడ్జెట్ కోసం కేటాయించాలంటూ గతంలో అమెరికా చేసిన ప్రతిపాదననూ స్పెయిన్ ఆనాడే తీవ్రంగా తప్పుబట్టింది. బడ్జెట్ కేటాయింపులు ఏ మేరకు ఉండాలనేది తమ సొంత విషయమని తెగేసి చెప్పింది. దీంతో అధిక టారిఫ్‌లు విధిస్తానని ట్రంప్ ఆనాడే స్పెయిన్‌ను బెదిరించారు. -
మరోసారి ‘షూటౌట్’లో...
హోబర్ట్: ప్రొ హాకీ లీగ్‌లో భారత పురుషుల హాకీ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. మొదటి ఐదు మ్యాచ్‌ల్లో నిర్ణీత సమయంలో ఓటమి పాలైన టీమిండియా... తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో ‘షూటౌట్’లో ఓడిపోయింది. రెండో అంచె పోటీల్లో భాగంగా మంగళవారం స్పెయిన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ సింగ్ బృందం ‘షూటౌట్’లో 3–4 గోల్స్ తేడాతో ఓటమి చవిచూసింది. స్పెయిన్‌కు రెండు పాయింట్లు, భారత్‌కు ఒక పాయింట్ లభించింది. నిర్ణీత సమయంలో 59 నిమిషాల వరకు 1–0తో ఆధిక్యంలో నిలిచిన భారత జట్టు... 59వ నిమిషంలో గోల్ సమర్పించుకుంది. దాంతో స్పెయిన్ 1–1తో స్కోరును సమం చేసింది. ఆట 19వ నిమిషంలో మణీందర్ సింగ్ గోల్‌తో భారత్ ఖాతా తెరిచింది. అనంతరం ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని తొలి విజయం దిశగా సాగింది. మరో రెండు నిమిషాలు పూర్తయితే భారత్‌కు తొలి గెలుపు ఖాయమయ్యే స్థితిలో స్పెయిన్ ప్లేయర్ బ్రూనో ఫాంట్ గోల్ చేశాడు. చివరి 13 సెకన్లలో స్పెయిన్‌కు ఏకంగా మూడు పెనాల్టీ కార్నర్లను సమర్పించుకున్న భారత్ వాటిని నిలువరించింది. దాంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ను నిర్వహించారు. ‘షూటౌట్’లో స్పెయిన్ ఆటగాళ్లు తొలి నాలుగు అవకాశాలను సద్వినియోగం చేసుకోగా... భారత్ తరఫున అభిషేక్, కెప్టెన్ హార్దిక్ సింగ్ గురి తప్పడంతో టీమిండియా మూల్యం చెల్లించుకుంది. మ్యాచ్‌లో స్పెయిన్‌కు ఎనిమిది పెనాల్టీ కార్నర్లు, భారత్‌కు నాలుగు పెనాల్టీ కార్నర్లు లభించాయి. అయితే రెండు జట్లు అన్నింటిని వృథా చేశాయి. నేడు జరిగే రెండో అంచె చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో భారత్ ఆడుతుంది. తొమ్మిది జట్లు పోటీపడుతున్న ప్రొ లీగ్‌లో ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న భారత జట్టు రెండు పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. -
రూ.125 కోట్ల డీల్.. ఇక్సిగోకి మెజారిటీ వాటాలు
స్పెయిన్‌కి చెందిన ట్రెయిన్ బుకింగ్ ప్లాట్‌ఫాం అయిన ఆన్లైన్ ట్రావెల్ సొల్యూషన్స్ (ట్రెనెస్)లో మెజారిటీ వాటాలను ట్రావెల్ అగ్రిగేటర్ ఇక్సిగో కొనుగోలు చేయనుంది. 60 శాతం వాటాల కొనుగోలు ప్రతిపాదనకు సంస్థ బోర్డు ఆమోదముద్ర వేసింది. ఈ డీల్ విలువ సుమారు రూ. 125 కోట్లుగా (11.70 మిలియన్ యూరోలు) ఉంటుంది.యూరోపియన్ ఓటీఏ మార్కెట్లో స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. మరోవైపు స్క్వాడ్ యాజ్ సరీ్వస్ అనే ఇంకో స్పానిష్ సంస్థలో కూడా 45.02 శాతం వాటాలను కొనుగోలు చేసే ప్రతిపాదనకు కూడా ఇక్సిగో బోర్డు ఆమోదం తెలిపింది. దీని విలువ రూ. 4.83 కోట్లుగా ఉంటుంది. ఎస్‌క్యూఏఏఎస్ సంస్థ ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ సంబంధ సేవలను అందిస్తోంది. -
మిషన్ ‘బోరో’!
ఒకవైపు మృతదేహాల గుట్టలు.. మరోవైపు క్షతగాత్రుల ఆర్తనాదాలు.. ఆదివారం రాత్రి స్పెయిన్‌లో జరిగిన రైలు ప్రమాదం దేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైంది. 42 మంది ప్రాణాలు కోల్పోయారు.. 150 మందికి పైగా రక్తగాయాలయ్యాయి. కానీ, ఆ రక్త ధారల మధ్య ఒక యువతి కన్నీటి రోదన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుండెలను పిండేస్తోంది. ఆమె అడుగుతోంది తన ప్రాణాల కోసం కాదు.. తన ప్రాణం కంటే మిన్నగా ప్రేమిస్తున్న శునకం ‘బోరో’గురించి.. క్షణంలో మారిన దృశ్యం అనా గార్సియా తన గర్భిణి సోదరితో కలిసి ఆదివారం సాయంత్రం మాలాగా నుంచి మాడ్రిడ్‌కు హైస్పీడ్ రైలులో వెళ్తోంది. రాత్రి 7.45 గంటల సమయంలో రైలు పట్టాలు తప్పి ఎదురుగా వస్తున్న మరో రైలును బలంగా ఢీకొట్టింది. దీంతో బోగీలు తునాతునకలయ్యాయి. కిటికీల గుండా ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న భీభత్స దృశ్యాలు.. ఆ గందరగోళంలో, అనా గార్సియా కళ్లముందే తన శునకం బోరో భయంతో పారిపోవడం చూసింది. నా ప్రాణాన్ని తెచి్చవ్వండి శరీరమంతా గాయాలు, బుగ్గపై బ్యాండేజ్, కళ్లలో నీళ్లు.. నడవడానికి కూడా శక్తి లేక కుంటుతున్నా అనా గార్సియా మీడియా ముందుకు వచ్చి ఒకటే విజ్ఞప్తి చేసింది.. ‘దయచేసి ఆ మూగజీవాలను వెతకడానికి సహాయం చేయండి. బోరో కేవలం కుక్క కాదు.. మా కుటుంబ సభ్యుడు. వాడు ఎక్కడున్నాడో నాకు తెలియాలి’.. అంటూ ప్రాధేయపడింది. ప్రపంచాన్ని కదిలించిన ఫొటో కుంటుతూనే తన ప్రాణ స్నేహితుడి కోసం ఆమె మళ్లీ ప్రమాద స్థలికి బయల్దేరిన తీరు చూసి స్పెయిన్ మొత్తం కదిలింది. నల్లటి రంగు, తెల్లటి కను»ొమ్మలతో ఉన్న బోరో ఫొటో నిమిషాల్లో ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. వేలాది మంది నెటిజన్లు ఫోన్ నంబర్లను షేర్ చేస్తూ బోరో కోసం గాలింపు మొదలుపెట్టారు. ఇలా కనిపించి.. అదృశ్యం సోమవారం మధ్యాహ్నం టీవీ చానల్ (టీవీఈ) ప్రమాద స్థలాన్ని డ్రోన్‌తో చిత్రీకరిస్తున్నప్పుడు ఒక ఆశ చిగురించింది. పొలాల్లో బోరోను పోలిన ఒక కుక్క పరుగెడుతూ కెమెరాకు చిక్కింది. కానీ, అది ఇన్వెస్టిగేషన్ జోన్ కావడంతో ఎవరూ లోపలికి వెళ్లలేకపోయారు. ఆ గాలింపు ఇంకా కొనసాగుతూనే ఉంది, ప్రమాదం జరిగిన ప్రాంతం దర్యాప్తు సంస్థల ఆ«దీనంలో ఉండటంతో సాధారణ ప్రజలకు ప్రవేశం లేదు. అయితే, బోరో కోసం స్పెయిన్ జంతు హక్కుల పార్టీ ప్రత్యేక అనుమతి పొందింది. ప్రభుత్వ అనుమతితో జంతు సహాయక బృందాలు బుధవారం రంగంలోకి దిగాయి. ‘మేము బోరోను వెతికి తీరుతాం.. ఆ కుటుంబానికి మళ్లీ ఆనందాన్ని ఇస్తాం’.. అని యానిమల్ రైట్స్ పార్టీ ప్రకటించింది. బోరో.. క్షేమంగా తిరిగి రా! చనిపోయిన 42 మంది కుటుంబాల్లో విషాదం ఒకవైపు తాండవిస్తుంటే.. ప్రాణాలతో బయటపడి కూడా తన ప్రియమైన మూగజీవం కోసం ఎదురుచూస్తున్న అనా గార్సియా పోరాటం ఇప్పుడు స్పెయిన్ అంతటా ఉత్కంఠకు గురిచేస్తోంది. బోరో దొరుకుతుందా? అనా తన ప్రాణ స్నేహితుడిని మళ్లీ హత్తుకుంటుందా?.. బోరో క్షేమంగా తిరిగి రావాలని కోరుకుందాం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
స్పెయిన్‌లో రెండు హైస్పీడ్ రైళ్లు ఢీ
మాడ్రిడ్: స్పెయిన్‌లో సోమవారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు హైస్పీడ్ రైళ్లు ఢీకొనడంతో 39 మంది మృతి చెందారు. దాదాపు వందమందికి పైగా గాయపడ్డారు. వారిలో 30 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆదివారం సాయంత్రం మలగా నుంచి మాడ్రిడ్‌కు వెళ్తున్న ఒక హైస్పీడ్ రైలుకు ఆడమూజ్ సమీపంలో ప్రమాదం జరిగింది. మొదటి రైలు వెనుక భాగం పట్టాలు తప్పి.. పక్కనే మరో రైలు ట్రాక్‌పై పడింది. ఎదురుగా వస్తున్న రెండో రైలును ఢీకొట్టింది. దీంతో రెండో రైలులోని మొదటి రెండు బోగీలు ట్రాక్‌పై నుంచి 4 మీటర్ల కిందకి పడి´ యాయి. ఈ రైలు ముందు భాగానికి అత్యంత తీవ్రమైన నష్టం వాటిల్లింది. కొన్ని బోగీలు నాలుగు మీటర్ల కట్ట కిందకు పడిపోయాయి. కొన్ని మెలి తిరిగిపోయాయి. ప్రమాద సమయంలో రెండు రైళ్లలో కలిపి దాదాపు 400 మంది ప్రయాణికులున్నారు. కొందరు ప్రయాణికులు ఎమర్జెన్సీ సుత్తులు ఉపయోగించి కిటికీలను పగలగొట్టుకుని బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన అత్యవసర సేవా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇంకా వందల మంది ప్రయాణికులు శిథిలాల కింద ఉన్నారు. వారిని వెలికితీసే పనులు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం కారణంగా మాడ్రిడ్, అండలూసియన్ నగరాలైన కార్డోబా, సెవిల్లె, మలగా, హుయెల్వా మధ్య హై–స్పీడ్ సర్వీసులను సోమవారం నిలిపివేశారు. రైలు పట్టాలు తప్పినప్పుడు గంటకు 179 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ‘ఒక క్షణం భూకంపం వచ్చినట్లు అనిపించిందని, రైలు పట్టాలు తప్పింది’ అని పట్టాలు తప్పిన రైలులో ఉన్న జర్నలిస్ట్ సాల్వడార్ జిమెనెజ్ తెలిపారు. మొదట పట్టాలు తప్పిన రైలు ప్రైవేట్ కంపెనీ ఇర్యోకు చెందినది. తీవ్రంగా నష్టపోయిన రెండో రైలు స్పెయిన్ ప్రభుత్వ రైలు కంపెనీ రెన్ఫేకు చెందినది. హైస్పీడ్ రైలు నెట్వర్క్.. స్పెయిన్ యూరప్‌లో అతిపెద్ద హై–స్పీడ్ రైలు నెట్‌వర్క్‌ను కలిగి ఉన్న దేశం. మాడ్రిడ్, బార్సిలోనా, సెవిల్లె, వాలెన్సియా, మలగా తో సహా ప్రధాన నగరాలను కలుపు తూ 3,000 కిలోమీటర్లకు పైగా ప్రత్యేక ట్రాక్‌లు న్నాయి. -
ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి..
-
స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం
స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. పట్టాలు తప్పిన ఓ హైస్పీడ్ రైలు.. మరో రైలును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 21 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో వంద మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన తీరుపై స్పెయిన్ ప్రభుత్వం ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండడం గమనార్హం.సౌత్ స్పెయిన్‌లోని అడముజ్ సమీపంలోని ఆండలూసియా వద్ద ఆదివారం సాయంత్రం ఈ ఘోరం చోటు చేసుకుంది. మాలాగా–మాడ్రిడ్ మధ్య నడిచే హైస్పీడ్ రైలు పట్టాలు తప్పి.. ఎదురుగా వస్తున్న మరో రైలును ఢీకొట్టింది. ఆ ధాటికి బోగీలు గాల్లోకి ఎగిరి కింద పడ్డాయి. ఘటన జరిగిన వెంటనే అధికార యంత్రాంగం రంగంలోకి దిగి.. సైనికుల సాయంతో గాయపడ్డ వారిని బయటకు తీసి సమీప స్టేషన్లు మాడ్రిడ్, సెవిల్లే, కార్డోబా, మాలాగా, హువెల్వా స్టేషన్లలో ఏర్పాటు చేసిన సహాయక కేంద్రాలకు తరలించింది. గాయపడ్డ వాళ్లలో 30 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.ప్రమాద సమయంలో హైస్పీడ్ రైలులో 300 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతుల సంఖ్య పెరగొచ్చని ఎమర్జెన్సీ వింగ్ ఆఫీసర్ ఆంటోనియో సాంజ్ తెలిపారు. ఘటనపై ప్రధాని పెడ్రో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది దేశానికి బాధాకరమైన రాత్రి అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ఘటనపై రాజు ఫిలిప్ VI, రాణి లెటిజియా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.విచిత్రమైన రైలు ప్రమాదంప్రత్యక్ష సాక్షులు ఈ రైలు ప్రమాదాన్ని.. హారర్ సినిమాను తలపించిందని చెబుతున్నారు. రైలు ఒక్కసారిగా ఆగిపోయింది. చుట్టూ అంతా చీకటి. ఈలోపు మరో రైలు ఢీ కొట్టింది. గాజు ముక్కలు గుచ్చుకునే చాలామంది గాయపడ్డారు అని గాయపడ్డ పలువురు తెలిపారు.ఈ రైలు ప్రమాదాన్ని అత్యంత విచిత్రమైన ప్రమాదంగా స్పెయిన్ ప్రభుత్వం ప్రకటించింది. రైల్వే ట్రాక్‌పై ఎక్కడా పట్టాలు దెబ్బ తినలేదు. పైగా అది సూటి మార్గం కూడా. అలాగే ప్రయాణించిన రైలు కూడా కొత్తదే. అయినా ప్రమాదం జరగడం ఆశ్చర్యం కలిగిస్తోందని అంటోంది. ‘‘సాధారణంగా ట్రాక్‌ల్లో మలుపు ఉండడం, రైలు పాతది కావడం లేదంటో నిర్వహణ లోపాల వల్ల ప్రమాదాలు జరుగుతాయి. అందుకే ఈ ప్రమాదం ఆశ్చర్యం కలిగిస్తోంది. కుట్ర కోణం ఏదైనా ఉందా? అనేది సమగ్ర దర్యాప్తు తర్వాతే వెల్లడిస్తాం’’ అని స్పెయిన్ రవాణా శాఖ మంత్రి ఆస్కార్ పుయెంటే అన్నారు.యూరప్లోకెళ్లా అతిపెద్ద హైస్పీడ్ రైలు నెట్వర్క్ కలిగిన దేశం స్పెయిన్. దాదాపు 3,000 కిలోమీటర్లకు పైగా ఈ నెట్వర్క్ విస్తరించింది ఉంది. 1944లో స్పెయిన్‌లో జరిగిన టోర్రే డెల్ బియెర్జో (Torre del Bierzo) ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఆ తర్వాత 2013లో సాంటియాగో డి కంపోస్టెలా వద్ద జరిగిన ప్రమాదంలో 80 మంది మృతి చెందారు. -
ముగ్గురు రాజుల జాతర ముచ్చట
క్రిస్మస్ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా జరుపుకొంటారు. చాలా ప్రాంతాల్లో చర్చిలను రంగు రంగుల నక్షత్రాలతో అలంకరించి, కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు జరపడం మామూలే! కొన్ని చోట్ల మాత్రం ప్రత్యేక సంప్రదాయాలతో క్రిస్మస్ వేడుకలను జరుపుకొంటారు. కొన్ని చోట్ల ఈ వేడుకలు న్యూఇయర్ వరకు, ఆ తర్వాత కొన్ని రోజుల వరకు కూడా ఏకబిగిన కొనసాగుతాయి. అలాంటి అరుదైన వేడుకే ముగ్గురు రాజుల జాతర. దీనినే ‘త్రీ కింగ్స్ పరేడ్’ అంటారు. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ నగరం సహా స్పెయిన్‌లోని వివిధ నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఏటా క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఈ ‘త్రీ కింగ్స్ పరేడ్’ కూడా జరుగుతుంది. దీనినే ‘కావల్కేడ్ మాగి’ అని, ‘త్రీ మాగి పరేడ్’ అని కూడా అంటారు. ఈ పరేడ్ ఏటా జనవరి 5న జరుగుతుంది. ‘త్రీ కింగ్స్ పరేడ్’ జరిగే రోజున స్పెయిన్‌లోని ప్రతి ఊరూ ఒక బహిరంగ రంగస్థలంలా మారిపోతుంది. బైబిల్లో ప్రస్తావించిన ముగ్గురు జ్ఞానుల వేషధారులను వాహనాలపై నిలిపి, అంగరంగ వైభవంగా ఊరేగింపు జరుపుతారు. ఊరూరా జరిగే ఈ ఊరేగింపుల్లో పెద్దసంఖ్యలో జనాలు పాల్గొంటారు. ముఖ్యంగా మాడ్రిడ్‌లో జరిగే ఈ ‘త్రీ కింగ్స్ పరేడ్’ను తిలకించడానికి విదేశాల నుంచి కూడా పర్యాటకులు పెద్దసంఖ్యలో వస్తుంటారు.ఏసుక్రీస్తు జన్మించినప్పుడు తూర్పు వైపు నుంచి ముగ్గురు జ్ఞానులు ఒంటెలపై వచ్చినట్లు బైబిల్ కథనం. వీరు క్రీస్తును వెదుకులాడుతూ ఇల్లిల్లూ గాలిస్తూ, పిల్లలు ఉన్న ఇళ్లలో రకరకాల కానుకలను విడిచి వెళ్లారట! బైబిల్లో ప్రస్తావించిన ఈ గాథను స్పానిష్ ప్రజలు బలంగా విశ్వసిస్తారు. అందువల్ల క్రిస్మస్ రోజుల్లో ఇళ్లలోని పిల్లలు క్రిస్మస్ చెట్ల పక్కనే, శుభ్రం చేసిన పాదరక్షలను ఉంచి, త్వరగానే నిద్రపోవడానికి పక్కల మీదకు చేరుకుంటారు.త్వరగా నిద్రపోతే తాము నిద్రపోతున్నప్పుడు ఇళ్లకు వచ్చే జ్ఞానులు తమ కోసం కానుకలను విడిచిపెట్టి వెళతారని స్పానిష్ పిల్లల నమ్మకం. స్పెయిన్‌లో జరిగే ‘త్రీ కింగ్స్ పరేడ్’లో జ్ఞానుల వేషాలు ధరించి పాల్గొనేవారు పిల్లలకు మిఠాయిలు, ఆటబొమ్మలు వంటివి కానుకలుగా పంచిపెడతారు. ఊరంతా కోలాహలం ఆటపాటలతో సాగే ఈ ఊరేగింపు జనవరి 5న సాయంత్రానికి ముందు మొదలై, జనవరి 6 వేకువజామున ముగుస్తుంది. స్పెయిన్‌లో ఈ ఊరేగింపు జరిపే సంప్రదాయం పంతొమ్మిదో శతాబ్ది ద్వితీయార్ధం నుంచి కొనసాగుతోంది. -
శెభాష్ అనాల్సింది పోయి… ఇంటికి పంపేశారు!
సమయానికి ఆఫీసుకు రాకుంటే శాలరీలో కోతో.. ఉద్యోగం నుంచి తీసేయడమో చూస్తుంటాం. కానీ సమయానికంటే ముందుగానే ఆపీసుకు వస్తే.. శెభాష్ అనాలిగా.. కాస్త ఇంక్రిమెంట్ ఎక్కువేయాలిగా.. కానీ ఆ కంపెనీ అలా చేయలేదు. ఆఫీసు టైముకంటే ముందుగానే వస్తున్న యువతిని ఇంటికి సాగనంపింది. స్పెయిన్‌లోని ఆలకాంటేలో ఓ డెలివరీ కంపెనీలో పనిచేసే యువతి ప్రతిరోజూ ఉదయం 6.45 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఆఫీసుకు వచ్చేది. వాస్తవానికి ఆమె షిఫ్ట్ ఉదయం 7.30 గంటలకు మొదలవుతుంది. కానీ ఆమె అరగంట ముందే రావడం కంపెనీ యజమానికి నచ్చలేదు. 2023లోనే దీనిపై అతడు ఆమెను హెచ్చరించాడు. అయినా ఆమె తన అలావాటు మార్చుకోలేదు. దీంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. దీనిని ఆమె కోర్టులో సవాల్ చేసింది. ఆశ్చర్యకరంగా కోర్టు కూడా యాజమాని పక్షానే నిలిచింది. యజమాని వద్దంటున్నా ముందు రావడం క్రమశిక్షణ ఉల్లంఘన కిందకే వస్తుందని స్పష్టంచేసింది. ఇక్కడ ఉద్యోగి ప్రవర్తన నమ్మకం, విధేయతపై ప్రభావం చూపిందని పేర్కొంది. సో.. ఆఫీసుకు ముందుగా వెళ్లినా ముప్పే.. సమయానికి వెళ్తే చాలు.. ఏమంటారు? -
భారత్‌కు పదో స్థానం
సాంటియాగో (చిలీ): మహిళల జూనియర్ ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో భారత జట్టు పదో స్థానంతో ముగించింది. శుక్రవారం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో జ్యోతి సింగ్ సారథ్యంలోని భారత జట్టు 1–2 గోల్స్ తేడాతో స్పెయిన్ చేతిలో పరాజయం పాలైంది. భారత్ తరఫున కనిక సివాచ్ (41వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించగా... స్పెయిన్ తరఫున నటాలియా విలనోవా (16వ నిమిషంలో), ఎస్తెర్ కనాలెస్ (36వ నిమిషంలో) చెరో గోల్ కొట్టారు. మ్యాచ్ తొలి క్వార్టర్లో ఇరు జట్ల ప్లేయర్లు హోరాహోరీగా పోరాడినా... ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. రెండో క్వార్టర్ ఆరంభంలోనే నటాలియా గోల్ చేయడంతో స్పెయిన్ జట్టు ఆధిక్యంలోకి వెళ్లింది. భారత జట్టు నుంచి కొన్ని చక్కటి ప్రయత్నాలు కనిపించినా... ఫినిషింగ్ లోపం కారణంగా అవి గోల్స్‌గా మారలేకపోయాయి. మూడో క్వార్టర్లో సోనమ్ చక్కటి గోల్ సాధించినా... స్పెయిన్ వీడియో రిఫరల్ ద్వారా ఆ గోల్ నిబంధనలకు విరుద్ధమని తేల్చింది. ఈ క్రమంలోనే స్పెయిన్ మరో గోల్‌తో ఆధిక్యాన్ని మరింత పెంచుకోగా... కాసేపటికి కనిక పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి భారత్ ఖాతా తెరిచింది. ఇక ఆఖరి క్వార్టర్లో స్పెయిన్ ఆధిక్యాన్ని కాపాడుకోగా... భారత జట్టు మరో గోల్ సాధించలేక ఓటమి వైపు నిలిచింది. -
రాబందుల గూళ్లలో 750 ఏళ్ల నాటి పురాతన చెప్పులు..!
పురావస్తు శాస్త్రవేత్తల పరిశోధనలు ఎన్నో కొంగొత్త విషయాలకు లేదా పురాతన చరిత్రకు ఆలవాలం. మధ్యయుగ కాలంలో మనుషులు ఇలా ఉండేవారని వాటి ఆనవాళ్లు, గుర్తులు ఉపయోగించిన పరికరాలతో అంచానా వచ్చేవాళ్లం. కానీ ఆ విలువైన వస్తువులను జాగ్రత్తగా భద్రపరిచి మన పరిశోధకులుకు అందించి విస్మయపరిచాయి ఈ రాబందుల గూళ్లు. అవన్ని ఎలా పాడవ్వకుండా చెక్కుచెదరకుండా ఉన్నాయన్నది పరిశోధకులకు ఊహకందని మిస్టరీలా మారింది.దక్షిణ స్పెయిన్‌లో ఒక గుహలో శతాబ్దాల నాటి రాబందుల గూళ్లు పరిశోధకులకు ఆసక్తిని రేకెత్తించాయి. ఆ పర్వత గుహల్లో రాబందులు లోతైన భారీగూళ్లను నిర్మించడమే ఇందుకు కారణం. నిజానికి ఇవి మనం చూసే రాబందులుకు కాస్త భిన్నంగా గడ్డంతో ఉంటాయి. అలాగే వేటాడటంలో చాలా ప్రత్యేకతను కలిగి ఉంటాయి. అంతేగాదు ఆగూళ్లు పదిలంగా ఉండేలా..తాజా కొమ్మలు, ఉన్ని, ఎముకలు, ఇతర పదార్థాలను జోడించి మరి అందంగా నిర్మించాయి. దాంతో ఆ భారీ గూళ్లలో ఏ వస్తువు దాచినా భద్రంగా ఉంటాయట. అయితే ఈ గూళ్లను పురావస్తు పరిశోధకులు 2008, 2014 మధ్య కాలంలో గుర్తించి తవ్వడం ప్రారంభించారు. ట్విస్ట్ ఏంటంటే అక్కడ ఈ జాతులు సుమారు 70-130 సంవత్సరాల క్రితం అదృశ్యమయ్యాయి. కానీ అవి వదిలి వెళ్లిన ఈ గూళ్ల కారణంగా నాటి చరిత్రకు ఆధారాలు లభించినట్లయ్యిందని చెబుతున్నారు పరిశోధకులు. అయితే ఈ గూళ్లలో వేలాది జంతువుల ఎముకల తోపాటు 200 కి పైగా మానవ నిర్మిత కళాఖండాలను పరిశోధకులు గుర్తించారు. వాటిలో శాస్త్రవేత్తలను అత్యంత అమిత ఆశ్చర్యానికి గురిచేసింది మాత్రం దాదాపు 650-750 సంవత్సరాల క్రితం తయారు చేసిన చెప్పులు. అవి ఇప్పటికీ పాడవ్వకుండా ఉండటం చాలా మిస్టరీగా అనిపించింది పరిశోధకులకు. అందులోనే పెయింటింగ్ వేసిన గొర్రె చర్మపు తోలు, గుడ్డ ముక్కలు, గడ్డితో నేసిన పనిముట్లు, మధ్యయుగ క్రాస్బౌ బోల్ట్ తదితరాలను గుర్తించారు. ఈ పక్షులకు వేటాడటంలో ప్రత్యేకతతోపాటు ఎముకలను పగలు కొట్టి వాటి మజ్జను తినడంలో స్పెషలిస్ట్లట. ఈ గూళ్లను చూస్తే సహజ మ్యూజియంలా అనిపిస్తున్నాయని చెబుతున్నారు పరిశోధకులు. ఎందుకంటే..మధ్యయుగం నాటి పర్యావరణ వ్యవస్థలు, పక్షి ఆహారం, అలాగే ఆ కాలంలోని మానవ కార్యకలాపాలపై అసామాన్యమైన అంతర్దృష్టిని అందించాయని చెప్పారు. ప్రస్తుతం దక్షిణ స్పెయిన్‌లో రాబందులు కనుమరుగైనప్పటికీ..వాటి గూళ్లు పరిశోధనలకు, అలాగే పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాలకు గొప్ప మార్గాన్ని అందించాయని అన్నారు. ఈ గడ్డం రాబందులు ఈ వస్తువులన్నింటిని ఎత్తుకెళ్లి..ఒకరకంగా నాటి మానవజీవితంపై ఒక ఆలోచనను అందించాయని అన్నారు. కాగా, ఈ పరిశోధన ఇటీవల ఎకాలజీ జర్నల్‌లో ప్రచురితమైంది.(చదవండి: రూ.1.3 కోట్ల ఉద్యోగ ఆఫర్..! కానీ ట్విస్ట్ ఏంటంటే..ఏకంగా ఆరు నెలలు..) -
ఆమె టైమ్ బాలేదు!
సాధారణంగా ఉద్యోగులు ఆలస్యంగా ఆఫీసుకు వస్తేనే కంపెనీలు కఠిన చర్యలు తీసుకుంటాయి. కానీ, స్పెయిన్‌లో ఒక మహిళ.. చాలా ముందుగా ఆఫీసుకు వస్తోందన్న కారణంతో ఆమెను ఉద్యోగం నుంచి పీకేశారు. మీరు చదివింది నిజమే.. స్పెయిన్‌లో రూల్ అంటే రూలే మరి. మేనేజర్ల ఆదేశాలుబేఖాతర్.. స్పెయిన్‌కు చెందిన 22 ఏళ్ల ఒక ఉద్యోగిని అధికారికంగా ఉద యం 7.30 గంటలకు పని ప్రారంభించాలి. కానీ, ఆమె అలవాటు ప్రకారం రోజూ దాదాపు 6.45 గంటలకే కార్యాలయానికి చేరుకునేది. ఒకరోజు, రెండు రోజులు కాదు.. ఏకంగా ఏడాదికి పైగా ఇదే పద్ధతిని పాటించింది. ఈ విషయంలో కంపెనీ ఆమెకు చాలాసార్లు హెచ్చరికలు జారీ చేసింది. ఆ సమయంలో ఆమెకు కేటాయించిన పనులేవీ లేవని, ముందే రాకూడదని స్పష్టంగా చెప్పినా.. ఆమె వినిపించుకోలేదు.ఎందుకుముందే వచ్చావ్! కంపెనీ యాజమాన్యానికి సహనం నశించింది. ఆదేశాలను ఉద్యోగిని పట్టించుకోకపోవడం, నియమాలను ఉల్లంఘించడం తీవ్రమైన దు్రష్పవర్తనగా భావించింది. ‘ఇది కేవలం ఉత్సాహం కాదు, కంపెనీ ఆదేశాలను పదేపదే ధిక్కరించడమే’.. అని మేనేజర్లు స్పష్టం చేశారు. ఆ సమయంలో చేయగలిగిన ముఖ్యమైన పనులేవీ లేనప్పటికీ, కావాలనే పదేపదే ఆదేశాలను బేఖాతర్ చేయడంతో ఆమెను ఉద్యోగం నుండి తొలగించారు.న్యాయస్థానంలో నూచుక్కెదురుకంపెనీ నిర్ణయంతో ఆగ్రహించిన ఆ మహిళ.. తన తొలగింపు అన్యాయమని వాదిస్తూ అలికెంట్ సోషల్ కోర్టులో సవాలు చేసింది. అయితే, కోర్టులో విచారణ సందర్భంగా.. సంస్థ ఎన్ని హెచ్చరికలు చేసినా ఆమె అదే అలవాటును కొనసాగించిందని తేలింది. కొన్నిసార్లు, ఆమె ఆఫీసుకు రాకముందే కంపెనీ యాప్‌లో లాగిన్ కావడానికి కూడా ప్రయతి్నంచినట్లు కోర్టు దృష్టికి వచి్చంది.రూల్ అంటే రూలే మరి..న్యాయమూర్తి.. ఉద్యోగం నుండి తొలగించడానికి కారణం ‘ముందే ఆఫీస్‌కు రావడం’కాదని, పనిచేసే చోట నియమాలను పాటించడానికి నిరాకరించడమే ప్రధాన కారణమని తన తీర్పులో స్పష్టం చేశారు. ఉద్యోగుల చట్టం ఆర్టికల్ 54 ప్రకారం ఇది నిబంధనల ఉల్లంఘనే అని తేలి్చ, కంపెనీ తొలగింపు నిర్ణయాన్ని కోర్టు సమరి్థంచింది. ప్రస్తుతానికి తీర్పు మారకపోయినా, ఆమె ఇంకా వాలెన్సియా సుప్రీంకోర్టుకు వెళ్లడానికి అవకాశం ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పునర్జన్మ పొందిన 'గిల్లీ దండ'.. ఇప్పుడు లీగ్‌గా..!
స్పెయిన్‌లోని గలీషియా గ్రామాలు, పట్టణాల్లో శతాబ్దాల నాటి ప్రాచీణ ఆట మళ్లీ ప్రాచుర్యం పొందుతోంది. బిల్లార్డా (గిల్లీ దండ) అనే ఈ ఆట ఇప్పుడు 'లీగా గలేగా డి బిల్లార్డా' అనే లీగ్ రూపంలో అక్కడి ప్రజల ముందుకు రానుంది. ఈ ఆట సాంప్రదాయ వారసత్వాన్ని ఆధునిక క్రీడాస్ఫూర్తితో కలిపి ముందుకు తీసుకెళ్తోంది. బిల్లార్డా అంటే ఏమిటి..?ఈ ఆటలో రెండు కర్రలు ఉపయోగిస్తారు. చిన్న కర్ర (బిల్లార్డా) నేలపై ఉంచుతారు. పెద్ద కర్రతో దానిని కొట్టి గాల్లోకి ఎగరేస్తారు. లక్ష్యం.. బిల్లార్డాను దూరంగా కొట్టి, దశలవారీగా గోల్ లైన్ దాటించడం. ఈ ఆటను భారత దేశంలో గిల్లీ దండ అని పిలుస్తారు. ఈ ఆటలో నైపుణ్యం, ఖచ్చితత్వం, వ్యూహం అవసరం. గ్రామీణ వాతావరణంలో జరిగే ఈ పోటీలు ఉత్సాహభరితంగా, సామూహికంగా సాగుతాయి. సంప్రదాయ ఆటలు 21వ శతాబ్దంలో కూడా ఎలా నిలదొక్కుకుంటాయో బిల్లార్డా చూపిస్తోంది. ఇది కేవలం ఆట మాత్రమే కాదు, గ్రామీణ గుర్తింపును తిరిగి పొందే ఉద్యమని ఔత్సాహికులు అంటున్నారు. 'లీగా గలేగా డి బిల్లార్డా' ఇప్పుడు పోటీ లీగ్‌గా మారి, జానపద క్రీడలు కూడా కాలానుగుణంగా మార్పులు స్వీకరించి కొత్త తరాలను ప్రేరేపించగలవని నిరూపిస్తోంది. -
ఇటలీదే డేవిస్ కప్
బొలోగ్నా (ఇటలీ): పురుషుల టెన్నిస్ ప్రపంచకప్ టోర్నమెంట్ ‘డేవిస్ కప్’లో డిఫెండింగ్ చాంపియన్ ఇటలీ జట్టు విజేతగా నిలిచింది. స్టార్ ప్లేయర్ జానిక్ సినెర్ బరిలోకి దిగకుండగానే ఇటలీ జట్టు వరుసగా మూడో సారి డేవిస్ కప్ కైవసం చేసుకుంది. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో ఇటలీ 2–0 తేడాతో స్పెయిన్‌ను చిత్తు చేసింది. పురుషుల సింగిల్స్ మ్యాచ్‌ల్లో మాటియో బెర్టిని, ఫ్రావియో కొబొలి విజయాలు సాధించడంతో డబుల్స్ మ్యాచ్ ఆడాల్సిన అవసరం లేకుండానే ఇటలీ విజయం సాధించింది. ఇటలీ జట్టు డేవిస్ కప్ కైవసం చేసుకోవడం ఓవరాల్‌గా ఇది నాలుగోసారి కాగా... వరుసగా మూడోసారి. సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ టోర్నమెంట్లో చివరగా అమెరికా జట్టు 1968 నుంచి 1972 వరకు వరుసగా ఐదు సార్లు చాంపియన్‌గా నిలవగా... ఆ తర్వాత మరే జట్టు ‘హ్యాట్రిక్’ నమోదు చేయలేదు. గత రెండు సంవత్సరాలు ఇటలీ జట్టు డేవిస్ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన ప్రపంచ రెండో ర్యాంకర్ సినెర్ ఈ సారి బరిలోకి దిగకపోయినా... బెర్టిని, కొబొలి చక్కటి ప్రదర్శనతో ఆ జట్టు విజయం సాధించింది. తొలి సింగిల్స్ మ్యాచ్‌లో బెర్టిని 6–3, 6–4తో పాబ్లో కరెనో బుస్టా (స్పెయిన్)పై విజయం సాధించగా... రెండో సింగిల్స్ పోరులో కొబొలి 1–6, 7–6 (7/5), 7–5తో జామె మునార్ (స్పెయిన్)పై గెలిచాడు. అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో ఆ్రస్టేలియాపై 2–0తో విజయం సాధించిన ఇటలీ... సెమీఫైనల్లో బెల్జియంపై కూడా 2–0తో గెలుపొందింది. మరోవైపు ప్రపంచ నంబర్‌వన్ కార్లోస్ అల్కరాజ్ లేకుండానే స్పెయిన్ బరిలోకి దిగింది. 2019 తర్వాత తొలిసారి ఫైనల్ ఆడిన ఆరుసార్లు చాంపియన్ స్పెయిన్ జట్టు రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. -
కాంతార చాప్టర్-1.. పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ మూవీ!
రిషబ్ శెట్టి కాంతార చాప్టర్-1 (Kantara Chapter1) బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా అదిరిపోయే కలెక్షన్స్ సాధించింది. ఇప్పటికే కన్నడ సినీ ఇండస్ట్రీలో కేజీఎఫ్-2 తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డ్ సృష్టించింది. ఈ క్రమంలోనే విక్కీ కౌశల్ మూవీ ఛావాను అధిగమించింది. ఇప్పటికే రూ.800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ ప్రీక్వెల్.. ఈ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మొదటి సినిమాగా నిలిచింది.అయితే ఈ మూవీని కేవలం ఇండియన్ భాషల్లో మాత్రమే కాకుండా ఇంగ్లీష్‌లోనూ రిలీజ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తాజాగా మరో దేశానికి చెందిన భాషల్లో కాంతార చాప్టర్-1ను విడుదల చేస్తున్నారు. స్పానిష్ భాషలోనూ ఈ మూవీ రిలీజ్ చేయనున్నారు. తాజాగా స్పానిష్ భాషలో కాంతార చాప్టర్-1 ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈనెల 31న కాంతార చాప్టర్-1 థియేటర్లలో సందడి చేయనుందని ట్విటర్లో పోస్ట్ చేశారు మేకర్స్. Una saga divina que comenzó en la India… ahora conquista el mundo. Estreno el 31 de octubre en cines de todo el mundo, en español. 🇪🇸❤️🔥 #KantaraChapter1 Spanish (Española) Trailer out now.▶️ https://t.co/AMQ74XYxpf#Kantara @hombalefilms @KantaraFilm @shetty_rishab… pic.twitter.com/Ww5F82BNxF— Hombale Films (@hombalefilms) October 30, 2025 -
ఇండియన్ బైక్స్: ఇప్పుడు స్పెయిన్, పోర్చుగల్‌లో..
బెంగళూరు బేస్డ్ కంపెనీ 'అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్'.. F77 పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను ఇండియన్ మార్కెట్లో మాత్రమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లకు కూడా విస్తరిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు స్పెయిన్, పోర్చుగల్‌లో తన బైకులను లాంచ్ చేసింది.అల్ట్రావయోలెట్ బైకులు ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్‌తో సహా అనేక యూరోపియన్ మార్కెట్లలో విజయవంతమైన అమ్ముఅడవుతున్నాయి. ప్రపంచ వేదికపై భారతీయ ఇంజనీరింగ్‌ను ప్రదర్శించడం.. యూరప్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈవీ రంగంలో మన ఉనికిని చాటుకోవడమే లక్ష్యంగా కంపెనీ అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ మొత్తం 12 దేశాల్లో తమ ఉత్పత్తులను విక్రయిస్తోంది.అల్ట్రావయోలెట్ F77 MACH 2 & F77 సూపర్స్ట్రీట్అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్ లాంచ్ చేసిన F77 MACH 2 అనేది ప్రత్యేకంగా రైడింగ్ చేసేవారికోసం రూపొందించగా.. ఎఫ్77 సూపర్‌స్ట్రీట్ రోజువారీ నియోగాన్ని లక్ష్యంగా పెట్టుకుని లాంచ్ చేసింది. అయితే ఈ రెండు మోడల్స్ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ ఒకే విధంగా ఉన్నప్పటికీ.. డిజైన్, ఫీచర్స్ విషయంలో కొంత వ్యత్యాసం కనిపిస్తుంది.ఇదీ చదవండి: 1200 మందికే ఈ బైక్: ధర తెలిస్తే షాకవుతారు!ఇవి 10.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ద్వారా.. 40 హార్స్ పవర్, 100 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 155 కిమీ/గం వేగంతో వెళ్లే ఈ బైక్ అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. ఇందులో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, రీజనరేవటివ్ బ్రేకింగ్, ట్రాక్షన్ కంట్రోల్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. -
సరదా కొట్లాట..! అక్కడ వాటితో కొట్టుకోవడం ఆట..
సాధారణంగా టమాటోలు మీదకు విసిరితే అదో అవమానం అన్నట్లుగా అనిపిస్తుంది. కాని, స్పెయిన్‌లో టమాటాలతో కొట్టుకోవడమే అహ్లాదకరమైన ఆట! వారికి అదో పండుగ! ‘లా టమాటినా’ అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ ఉత్సవం స్పెయిన్‌లోని బునోల్ పట్టణంలో ప్రతి ఏటా ఆగస్టు చివరి బుధవారం నిర్వహిస్తారు. ఆ ప్రకారం, ఈ ఏడాది అది ఆగస్టు 27న రానుంది. ఈ ఉత్సవంలో పాల్గొనేవారు టన్నుల కొద్దీ టమాటోలను ఒకరిపై ఒకరు విసురుకుంటూ ఆనందిస్తారు. అక్కడ ప్రతి సంవత్సరం సుమారుగా 120 నుంచి 150 టన్నుల వరకూ టమాటోలను ఉపయోగిస్తున్నారు.ఈ టమాటో ఉత్సవం 1945లో అనుకోకుండా ప్రారంభమైందని అక్కడివారు చెబుతారు. ఆ ఏడాది జరిగిన ఒక పండుగ ఊరేగింపులో, కొందరు యువకులు ఒకరిపై ఒకరు టమాటోలు విసురుకున్నారట. ఈ ఘటన తరువాత ప్రతి సంవత్సరం టమాటోలతో సరదాగా ఈ పోరాటం చేసేవారట. క్రమంగా దీనిని అధికారిక ఉత్సవంగా ప్రకటించారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఈ వేడుకను ప్రత్యేక ఆకర్షణగా మార్చింది స్పెయిన్ ప్రభుత్వం!ఈ వేడుక ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. సుమారు గంటపాటు జరిగే ఈ టమాటో పోరాటంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటారు. తర్వాత, పట్టణ వీధులను శుభ్రం చేస్తారు. ఈ పండుగలో సుమారు 20 వేల మందికి అనుమతి లభిస్తుంది. అందుకు ముందుగానే టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది ఈ వేడుక.ఈ ఫెస్టివల్ స్ఫూర్తితో ప్రస్తుతం ప్రపంచవాప్తంగా పలు చోట్ల నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే గత మార్చి 11న మన హైదరాబాద్‌లోని ఎక్స్పీరియం ఎకో పార్క్‌లో ఈ వేడుకను ‘టోమా టెర్రా’ అనే పేరుతో ఘనంగా నిర్వహించారు. అయితే అమ్మకానికి పనికిరాని, మిగిలిపోయిన టమాటోలను నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసి ఈ వేడుక చేశారు. దీనితో రైతులకు ఆర్థికంగా లబ్ధి చేకూరడంతో పాటు ఈ ఫెస్టివల్లో ఉపయోగించిన టమాటో వ్యర్థాలను వృథా కాకుండా సేంద్రియ ఎరువుగా మార్చి, ఆ పార్క్ మొక్కలకే వాడారట. దీనితో ఈ గ్లోబల్ ట్రెండీ ఫెస్టివల్ ‘జీరో–వేస్ట్’ ఈవెంట్‌గా మారింది.ద్వీపాల్లోనే రాజా!పశ్చిమ న్యూ గినీకి తూర్పునున్న ఇండోనేషియాలోని పశ్చిమ పాపువా ప్రావిన్స్‌లో ఉన్న ఒక ద్వీపసమూహమే ఈ రాజా ఆంపత్. దీన్ని ‘ఫోర్ కింగ్స్’ అని కూడా పిలుస్తారు. ఈ పేరు అక్కడి నాలుగు ప్రధాన దీవులైన వాయ్గెయో, బాటంట, సాలావటి, మీసూల్ నుంచి వచ్చింది. ఈ రాజా ఆంపత్ ప్రపంచంలో అత్యంత గొప్ప సముద్ర జీవవైవిధ్యానికి కేంద్రంగా నిలిచింది. ఇక్కడ 1,500లకు పైగా చేపల జాతులు, 500లకు పైగా రకరకాల పగడపు కీటకాలతో పాటు అనేక ప్రత్యేకమైన జీవులున్నాయి. రాజా ఆంపత్లో సుమారు 1,500 చిన్న దీవులు, ద్వీపకల్పాలున్నాయి. సున్నపురాయితో ఏర్పడిన ఈ దీవులు నీలి రంగు సముద్రంలో రమ్యమైన దృశ్యాలను కళ్లకు కడతాయి. పచ్చని అడవులు, ఎత్తైన కొండలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. పియానేమో అనే వ్యూ పాయింట్ నుంచి చూస్తే నీలి సముద్రంలో అక్కడక్కడా చిన్న దీవులు తేలుతున్నట్లు కనిపిస్తాయి. అక్కడికి వెళ్తే తిరిగి రావాలనే అనిపించదట! -
కార్చిచ్చుతో స్పెయిన్ కకావికలం
మాడ్రిడ్: వాతావరణంలో మార్పులు యూరప్‌ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే తుర్కియే, పోర్చుగల్ మంటల బారిన పడగా... స్పెయిన్‌లో కార్చిచ్చు కొనసాగుతోంది. దేశం మొత్తం తీవ్ర కార్చిచ్చు ప్రమాదంలో ఉంది. మంటల్లో ఇప్పటికే 3లక్షల 90 వేల ఎకరాలు దగ్ధమయ్యాయి. శుక్రవారం దేశవ్యాప్తంగా 14 చోట్ల కార్చిచ్చులు చెలరేగగా.. ఇప్పుడు 20 ప్రాంతాలకు మంటలు విస్తరించాయి. మంటలను అదుపు చేసేందుకు మరో 500 మంది సైనికులను ప్రభుత్వం మోహరించింది. వాయువ్య గలిసియా ప్రాంతంలో మంట లను అదుపు చేయడానికి 2వేల మంది అగి్న మాపక సిబ్బంది కష్టపడుతున్నారు. వేడిగాలుల కారణంగా ఎండిపోయిన అడవులన్నీ తగలబడి పోతున్నాయి. రెండు వారాలుగా కొనసాగుతున్న వేడిగాలులతో ఇది రెండు దశాబ్దాల్లో ఇదే అత్యంత దారుణమైన వేసవిగా నమోదైందని అత్యవసర చీఫ్ వర్జీనియా బార్కోన్స్ అన్నారు. ఇళ్ళకు ఇంకా ముప్పు పొంచి ఉండటంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మంటలు అదుపు చేస్తున్న చోట వెలువడిన పొ గ, బూడిదను పీల్చకుండా ఉండటానికి ప్రజలు ఫేస్ మాస్‌్కలు ధరించాలని, ఇళ్లనుంచి బయటికి రావద్దని అధికారులు సూచించారు. ఆదివారం కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ (113 డిగ్రీల ఫారెన్‌హీట్) వరకు చేరే అవకాశం ఉందని స్పెయిన్ జాతీయ వాతావర ణ సంస్థ హెచ్చరించింది. మంగళవారం నుంచి ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని తెలిపింది. మంటలను ఎదుర్కోవడానికి స్పెయిన్‌కు ఫ్రా న్స్, ఇటలీ ఇప్పటికే సహాయం అందిస్తుండగా.. ఇతర యురోపియన్ దేశాలు కూడా సాయమందించనున్నాయి. దక్షిణ యూరప్ రెండు దశాబ్దా లలో ఎన్నడూ లేనంత దారుణమైన కార్చిచ్చు సీజన్‌ను ఎదుర్కొంటోంది. ఇందులో స్పెయిన్ అత్యంత ఎక్కువగా దెబ్బతిన్నది. కార్చిచ్చుతో గత వారంలో ముగ్గురు మరణించారు. పోర్చుగల్‌లో.. పొరుగున ఉన్న పోర్చుగల్ కూడా మంటలతో పోరాడుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 1,550 చదరపు కి.మీ (600 చదరపు మైళ్ళు) విస్తీర్ణంలో కార్చిచ్చులు అటవీ సంపదను దగ్ధం చేశాయి. ఎనిమిది పెద్ద మంటలను వేలాది మంది అగి్నమాపక సిబ్బంది అదుపు చేస్తున్నారు. పర్యాటక ప్రాంతమైన పియోడావో సమీపంలోనూ కార్చిచ్చు చెలరేగింది. ట్రాంకోసోలో కార్చిచ్చు ఎనిమిది రోజులుగా మండుతోంది. మంటలను అదుపు చేయడానికి 4వేలకు పైగా అగి్నమాపక సిబ్బంది, 1,300 వాహనాలు అలాగే 17 విమానాలను మోహరించింది. 1980ల నుంచి యూరప్ ప్రపంచ సగటు కంటే రెండు రెట్లు వేగంగా వేడెక్కుతుండటంతో తరచూ కార్చిచ్చులు చెలరేగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వేడి, పొడి వాతావరణాలు మంటల తీవ్రతను మరింత పెంచుతున్నాయి. ఈ ప్రాంతం మరిన్ని కార్చిచ్చులకు బలయ్యే అవకాశం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తుర్కియేలో.. తుర్కియే అడవుల్లోనూ కార్చిచ్చు కొనసాగుతోంది. 30 విమానాలు, 1,300 మంది అగి్నమాపక సిబ్బందితో మంటలను అదుపు చేస్తున్నామని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఫారెస్ట్రీ తెలిపింది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు, పొడి పరిస్థితులు, బలమైన గాలుల కారణంగా జూన్ చివరి నుంచే తుర్కియే వందలాది మంటలతో అతలాకుతలమైంది. ఇటీవల చెలరేగిన కార్చిచ్చుల్లో 19 మంది మృతి చెందారు. ప్రస్తుతం కొనసాగుతున్న కార్చిచ్చు కారణంగా ముందు జాగ్రత్త చర్యగా ఆరు గ్రామాలను ఖాళీ చేయించినట్లు కనక్కలే ప్రావిన్స్ గవర్నర్ ఒమర్ తోరామన్ తెలిపారు. -
ఫ్రాన్స్‌లో రగిలిన కార్చిచ్చు.. ఒకరి మృతి
పారిస్: దక్షిణ ఫ్రాన్స్‌లో కార్చిచ్చు వేగంగా వ్యాప్తి చెందుతోంది. స్పెయిన్ సరిహద్దులో అడవిలో నిప్పంటుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు. మరో తొమ్మది మంది గాయపడ్డారు. ఒకరు గల్లంతయ్యారు. ఔదీ ప్రాంతంలోని రిబాటీలో మంగళవారం మధ్యాహ్నం మొదలైన మంటలు బుధవారం మరికొన్ని ప్రాంతాలకు వ్యాపించాయి. మంటలు ఆర్పేందుకు 1,500 మంది అగి్నమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. రాజధాని పారిస్ విస్తీర్ణంతో సమానమైన ప్రాంతంలో కార్చిచ్చు రగిలినట్లు అధికారులు వెల్లడించారు. కేవలం 12 గంటల వ్యవధిలో 11,000 హెక్టార్ల భూభాగాన్ని మంటలు చుట్టుముట్టాయని తెలిపారు. ఇటీవలి కాలంలో ఇదే అతిపెద్ద కార్చిచ్చు అని స్పష్టంచేశారు. దక్షిణ యూరప్‌లో వేసవి కాలంలో కార్చిచ్చులు రగలడం గత కొన్నేళ్లుగా పరిపాటిగా మారిపోయింది. కాలుష్యం, వాతావరణ మార్పులే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. -
ఇంగ్లండ్... తగ్గేదేలే
బాసెల్: డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ మహిళల జట్టు యూరో ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో టైటిల్ నిలబెట్టుకుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన హోరాహోరీ తుది పోరులో ఇంగ్లండ్ జట్టు పెనాల్టీ షూటౌట్లో 3–1తో స్పెయిన్‌పై విజయం సాధించింది. నిర్ణీత సమయంలో ఆఖరి క్షణం దాకా పోటాపోటీగా పోరాడిన స్పెయిన్ పెనాల్టీ షూటౌట్లో అనూహ్యంగా చిత్తయ్యింది. కేవలం ఒకే ఒక్క స్ట్రయికర్ గోల్ చేయడం గమనార్హం. మరోవైపు ఇంగ్లండ్ బృందంలో ఇద్దరు బంతిని లక్ష్యాన్ని చేర్చడంలో విఫలమవగా... ముగ్గురు గోల్స్ చేశారు. అంతకుముందు నిర్ణీత సమయం ముగిసేసరికి ఇంగ్లండ్, స్పెయిన్ జట్లు 1–1 స్కోరుతో సమఉజ్జీలుగా నిలిచాయి. ముందుగా స్పెయిన్ శిబిరం నుంచి గోల్ నమోదైంది. తొలి అర్ధభాగంలోనే మరియాన కాల్డెంటే (25వ నిమిషంలో) గోల్ చేసి జట్టుకు శుభారంభాన్నిచి్చంది. 1–0తో ఆధిక్యంతోనే ప్రథమార్ధాన్ని ముగించింది. ద్వితీయార్ధం మొదలవగానే ఇంగ్లండ్ ప్లేయర్లు దాడులకు పదును పెట్టారు. ఈ క్రమంలో అలెసియా రుసో (57వ నిమిషంలో) గోల్ చేసి స్కోరును 1–1తో సమం చేసింది. తర్వాత ఇరుజట్ల ప్లేయర్లు ఎంతగా శ్రమించిన ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. నిరీ్ణత సమయంలో ఫలితం తేలకపోవడంతో అదనపు సమయం ఆడించారు. అయినా... స్కోరులో ఏ మార్పు లేకపోవడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ఇక్కడ తొలి షాట్ నుంచే ‘డ్రా’ మొదలైంది. స్పెయిన్ ఒకటే గోల్ చేసినా... ఇంగ్లండ్ గెలిచేందుకు ఆఖరి షాట్ గోల్దాకా వేచిచూడక తప్పలేదు. ఎందుకంటే మొదట కిక్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ జట్టులో బెత్ మీడ్ విఫలమైంది. స్పెయిన్ తరఫున ప్యాట్రిసియా గూజారో గోల్ కొట్టడంతో నిరీ్ణత సమయం మ్యాచ్‌లోలానే 1–0తో ‘షూటౌట్’లోనూ తొలుత పైచేయి సాధించింది. అయితే ఇంగ్లండ్ ప్లేయర్లు అలెక్స్ గ్రీన్వుడ్, నియామి చార్లెస్‌లు వరుసగా షాట్లు కొట్టడంతో రేసులో పడగా... మరోవైపు స్పెయిన్ శిబిరంలో మరియానా, ఐతాన బొన్మటి విఫలమవడంతో ఇంగ్లండ్ అనూహ్యంగా 2–1తో ఆధిక్యంలోకి దూసుకొచి్చంది. నాలుగో షాట్ లియా విలియమ్సన్ (ఇంగ్లండ్), సాల్మ పారాల్యులో (స్పెయిన్) ఎవరి వల్లా కాలేదు. 2–1తో ఇక ఆఖరి ప్రయత్నానికి సిద్ధమయ్యారు. ఒకవేళ ఇంగ్లండ్ ఐదో షాట్ విఫలమై, స్పెయిన్ చేసి ఉంటే 2–2తో సమమై విజేత కోసం డ్రామా కొనసాగేది. కానీ క్లో కెల్లీ (ఇంగ్లండ్) స్పెయిన్‌కు ఆ ఆఖరి ఛాన్స్ ఇవ్వకుండా గోల్ చేసింది. 3–1తో ఫలితం రావడంతో స్పెయిన్ ఆఖరి షాట్ తీసుకోలేదు. 2022లో జరిగిన అమ్మాయిల యూరోలోనూ ఇంగ్లండే చాంపియన్‌గా నిలిచింది. స్టేడియానికి ‘రాయల్’ కళసెయింట్ జాకబ్ పార్క్‌లో జరిగిన ఈ టైటిల్ పోరుకు ‘రాయల్’ హాజరు లభించింది. తుదిపోరును ప్రత్యక్షంగా తిలకించేందుకు బ్రిటన్ యువరాజు విలియమ్స్ (కింగ్ చార్లెస్ తనయుడు) కుమార్తె ప్రిన్సెస్ చార్లట్తో విచ్చేశారు. ప్రిన్స్ విలియమ్స్ ఇంగ్లిష్ ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. మరోవైపు స్పెయిన్ రాజవంశానికి చెందిన యువరాణి ప్రిన్సెస్ లియోనర్ తన సోదరి ఇన్ఫాంటా సోఫియాతో కలిసి టైటిల్ పోరును వీక్షించింది. సోఫియా 2023లో సిడ్నీలో జరిగిన ప్రపంచకప్ ఫైనల్‌ను తల్లి, స్పెయిన్ రాణి లెటిజియాతో కలిసి వీక్షించింది. ఆ మ్యాచ్‌లో స్పెయిన్ విజేతగా నిలిచింది. మొత్తానికి 2023 ప్రపంచకప్, 2024 యూఈఎఫ్ఏ నేషన్స్ లీగ్ టైటిళ్లతో జోరుమీదున్న స్పెయిన్ వరుసగా మూడో ఏడాది ప్రతిష్టాత్మక టైటిల్ గెలవాలనే గంపెడాశలతో బరిలోకి దిగింది. కానీ తుదిమెట్టుపై చతికిలబడింది. దీంతో ‘యూరో’ కప్ స్పెయిన్ మహిళల జట్టుకు ఇన్నేళ్లయినా అందని ద్రాక్షగానే ఉంది. -
యూరప్‌లో వడగాడ్పుల మరణ మృదంగం
లండన్: యూరప్ దేశాల్లో ఎండల తీవ్రతకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రధానమైన 12 యూరప్ నగరాల్లో కేవలం పది రోజుల వ్యవధిలోనే ఏకంగా 2,300 మరణాలు నమోదయ్యాయి. ఇందులో మూడింట రెండొంతుల మరణాలకు వాతావరణ మార్పులే కారణమని ఓ అధ్యయనం తేల్చింది. తాము వేసిన మరణాల అంచనాలు స్వతంత్ర సంస్థల నుంచి సేకరించినవని, ప్రభుత్వాల పరంగా గణాంకాలు అందేందుకు సమయం పట్టొచ్చని పరిశోధకులు తెలిపారు. జూన్ 23 నుంచి జూలై 2వ తేదీల మధ్యలో పశ్చిమ యూరప్‌తో అత్యంత తీవ్ర స్థాయిలో ఎండలు కాశాయి. స్పెయిన్‌లో ఏకంగా 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. వడగాడ్పులు తోడవ్వడంతో ఫ్రాన్స్‌లో కార్చిచ్చు చెలరేగింది. యూరప్‌లోని ప్రధాన నగరాలైన బార్సిలోనా, మాడ్రిడ్, లండన్, మిలాన్ తదితర ప్రధానమైన 12 నగరాల జనాభా 3 కోట్లకు పైమాటే. ఈ నగరాల్లో సాధారణానికి మించి నాలుగు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధ్యయనం గుర్తించింది. పది రోజుల సమయంలో ఎండలకు సంబంధించిన ఘటనలకు సంబంధించిన 2,300 మరణాల్లో కనీసం 1,500 మరణాలు అత్యంత తీవ్రమైన వడగాడ్పులు వంటి వాతావరణ మార్పుకు సంబంధించినవేనని తెలిపింది. యూకే, నెదర్లాండ్స్, డెన్మార్క్, స్విట్జర్లాండ్‌లకు చెందిన ఐదు సంస్థలు, 12మందికి పైగా పరిశోధకులు అధ్యయనంలో భాగస్వాములయ్యారు. ‘వాతావరణ మార్పుల వల్లనే సాధారణానికి మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ పరిస్థితి మన్ముందు మరింత ప్రమాదకరంగా మారనుంది’అని లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ పరిశోధకులు బెన్ క్లార్క్ చెప్పారు. అప్పుడిక మనిషి శరీరం ఆ ఉష్ణోగ్రతలను తట్టుకునే పరిస్థితి ఏమాత్రం ఉండదన్నారు. ఈ ప్రభావం వృద్ధులు, చిన్నారులు, బయట పనిచేసే సిబ్బందిపై ఎక్కువగా ఉంటుందన్నారు. మానవ ప్రేరేపిత వాతావరణ మార్పు ప్రభావమే లేకుంటే ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశముందన్నారు. రెండు నుంచి నాలుగు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగినా వేలాదిగా జనం ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని మరో పరిశోధకుడు గ్యారీఫల్లోస్ అన్నారు. వడగాడ్పులు సైలెంట్ కిల్లర్స్‌గా ఆయన అభివరి్ణంచారు. మన ఇళ్లు, ఆస్పత్రుల్లో సంభవించే ఎండలకు సంబంధించిన మరణాలను పెద్దగా ఎవరూ పట్టించుకోరని ఆయన పేర్కొన్నారు. -
వ్యక్తిని లాగేసుకున్న విమానం ఇంజిన్.. ఆ తర్వాత ఏమైందంటే?
స్పెయిన్: ఇటలీలోని మిలాన్ బెర్గామో విమానాశ్రయంలో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం(జూలై 8) ఎయిర్‌పోర్టులో విమానం ఇంజిన్ ఓ వ్యక్తిని లాగేసుకుంది. ఈ ఊహించని పరిణామంలో సదరు వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.వోలోటియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ A319 విమానం స్పెయిన్‌కు బయలుదేరేందుకు సిద్ధమవుతోంది. సరిగ్గా అదే సమయంలో ఓ వ్యక్తి విమానాశ్రయ టెర్మినల్‌లోకి రహస్యంగా ప్రవేశించాడు. తన వాహనాన్ని అక్కడే వదిలేసి విమానాల పార్కింగ్ జోన్లోకి ప్రవేశించాడు.అనంతరం,స్పెయిన్ బయలుదేరేందుకు సిద్ధమవుతున్న వోలోటియా ఎయిర్‌బస్ A319 విమానం పక్కకు వచ్చాడు. ఈ ఊహించని ఘటనలో, ఆ వ్యక్తి విమానం ఇంజిన్‌లో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఫలితంగా ఉదయం 10:20 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలు నిలిచిపోయాయి. 19 విమానాల సర్వీసుల్ని రద్దు చేసిన అధికారులు.. మరికొన్నింటిని దారి మళ్లించారు. -
వైరల్ వీడియో.. విమానం నుంచి దూకేసిన ప్రయాణికులు
విమానంలో తప్పుడు ఫైర్ అలర్ట్‌తో ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఆగి ఉన్న విమానం నుంచి కిందికి దూకే క్రమంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. స్పెయిన్‌లోని పాల్మాడి మాలొర్కా ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో 18 మంది ప్రయాణికులు గాయపడగా.. వారిలో ఆరుగురిని ఆసుపత్రికి తరలించారు. మాంచెస్టర్‌కు బయలుదేరాల్సిన విమానం టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది.స్పెయిన్‌లోని పాల్మా డి మయోర్కా విమానాశ్రయంలో ర్యాన్ ఎయిర్ బోయింగ్ 737 విమానంలోఈ గందరగోళం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్ల నుంచి బయటకు రాగా.. మరికొందరు విమానం రెక్కలపైకి ఎక్కి నేలపైకి దూకారు. ఇది తప్పుడు ఫైర్ అలర్ట్ అని తేలడంతో విమానయాన సంస్థ ప్రయాణికులకు క్షమాపణలు తెలిపింది.In Spain, the Manchester-bound plane was about to take off. Fire alert triggered an evacuation, following which the panicked passengers began jumping from the plane's wing to save themselves. At least 18 people on a Ryanair Boeing 737 aircraft were injured after a fire alert… pic.twitter.com/AYkYPhteJ5— SK Chakraborty (@sanjoychakra) July 5, 2025 -
అట్టుడుకుతున్న యూరప్
బెర్లిన్: యూరప్ దేశాల్లో వడగాడ్పుల తీవ్రత కొనసాగుతోంది. ఇప్పటివరకు స్పెయిన్‌లో నలుగురు, ఇటలీ, ఫ్రాన్స్‌లో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. కార్చిచ్చు ముప్పు పొంచి ఉండటంతో ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించాయి. స్విట్జర్లాండ్‌లోని బెజ్నౌ అణు రియాక్టర్‌ను మూసివేశారు. మరో అణు రియాక్టర్లో విద్యుదుత్పత్తిని సగానికి తగ్గించారు. స్పెయిన్‌లోని కాటలోనియా ప్రాంతంలో కార్చిచ్చుతో ఇద్దరు చనిపోయారు. ఎండల వేడిమికి తాళలేక 300 మంది ఆస్పత్రి పాలయ్యారని ఫ్రాన్స్ మంత్రి ఒకరు వివరించారు. ఇటలీ ప్రభుత్వం 18 నగరాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించింది. జర్మనీలోని అత్యధిక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటాయి. దీంతో, జనం వేడి నుంచి ఉపశమనం కోసం ఓపెన్ ఎయిర్ స్విమ్మింగ్ పూల్స్, సరస్సులను ఆశ్రయిస్తున్నారు. జర్మనీలోని చాలా ప్రాంతాల్లో స్కూళ్లను మూసివేశారు. బ్రాండెన్‌బర్గ్, సాగ్జనీల్లో పలు ప్రాంతాల్లో మొదలైన కార్చిచ్చును ఫైర్ సిబ్బంది అదుపులోకి తెచ్చారు. పర్యాటక ప్రాంతాలైన పారిస్‌లోని ఈఫిల్ టవర్‌తోపాటు బ్రస్సెల్స్‌లోని అటోమియంను మూసివేశారు. -
పెళ్లైన పదిరోజులకే ఫుట్‌బాల్ స్టార్ దుర్మరణం
లివర్‌పూల్ ఫుట్‌బాలర్, పోర్చుగీస్‌కు చెందిన డియోగో జోటా (Diogo Jota) దుర్మరణం చెందాడు. అతడు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్పెయిన్‌లోని జమోరా ప్రావిన్స్‌లో గురువారం ఈ ప్రమాదం జరిగింది. ఈ మేరకు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి.కాగా ప్రమాద సమయంలో జోటాతో పాటు అతడి సోదరుడు ఆండ్రీ కూడా కారులోనే ఉన్నాడు. అతడు కూడా ప్రొఫెషనల్ ఫుట్‌బాలరే!.. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. కారు రోడ్డును ఢీకొట్టిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో అందులోని వారు సజీవ దహనం అయ్యారని తెలుస్తోంది.కాగా 28 ఏళ్ల జోటా పదిరోజుల క్రితమే పెళ్లి బంధంలో అడుగుపెట్టాడు. తన చిరకాల ప్రేయసి, జీవిత భాగస్వామి అయిన రూటే కార్డెసోను వివాహమాడాడు. ఇంతలోనే అతడు ప్రాణాలు కోల్పోవడం విషాదం. కాగా జోటాకు భార్య రూటేతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇక ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.కీలక విజయాల్లో పాత్రపోర్టోలో జన్మించిన జోటా.. 2016లో అట్లెటికో మాడ్రిడ్ క్లబ్లో చేరాడు. ఆ తర్వాత ప్రీమియర్ లీగ్, వోల్వర్‌హాంప్టన్ వాండరర్స్ తరఫున సత్తా చాటిన జోటా.. లివర్‌పూల్‌తో జట్టు కట్టిన తర్వాత తన కెరీర్లో ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు. జర్గన్ క్లాప్ నాయకత్వంలో ఎఫ్ఏ కప్, లీగ్ కప్ టైటిల్స్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే లివర్‌పూల్ అటాకింగ్ విభాగంలో ప్రధాన ఆటగాడిగా ఎదిగాడు. ఇక 2024-25 సీజన్లో లివర్‌పూల్ ప్రీమియర్ లీగ్ గెలవడంలోనూ జోటాది కీలక పాత్ర. ఇక పోర్చుగల్ జట్టు తరఫున కూడా అతడు రాణించాడు.రొనాల్డో సంతాపంజోటా మృతిపై పోర్చుగల్ దిగ్గజ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో స్పందించాడు. నువ్వులేని లోటు ఎవరూ తీర్చలేరని.. నీ భార్యా, పిల్లలు, కుటుంబానికి ఆ దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. మరోవైపు.. లివర్‌పూల్ ఫుట్‌బాల్ క్లబ్ జోటా మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ విషాదకర విషయాన్ని నమ్మలేకపోతున్నామంటూ సంతాపం వ్యక్తం చేసింది.చదవండి: ఇకపై మళ్లీ ఆడగలనా? -
ఆండీ ముర్రే అరుదైన ఘనత
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ ఈవెంట్ మరో రెండేళ్లలో150వ వార్షికోత్సవం జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో బ్రిటన్ మేటి టెన్నిస్ ఆటగాడు ఆండీ ముర్రే విగ్రహాన్ని ఆవిష్కరించాలని ఆల్ ఇంగ్లండ్ క్లబ్ భావించింది. దీని కోసం ముర్రే సంబంధిత కళాకారులతో కలిసి పనిచేయనున్నట్లు తెలిసింది. ముర్రే చుట్టుకొలతలు, ఒద్దిక, పొడవుల్ని వారితో పంచుకోనున్నాడు. నిజానికి ‘బిగ్–త్రీ’ ఫెడరర్–నాదల్–జొకోవిచ్‌లతో ముర్రే సమకాలికుడైనప్పటికీ ఆ ముగ్గురితో పోల్చదగిన దిగ్గజమైతే కాదు. అయితే ముర్రే 2013లో వింబుల్డన్ టైటిల్‌తో 77 ఏళ్ల బ్రిటన్ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించడం ద్వారా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 1936లో ఫ్రెడ్ పెర్రీ గెలిచిన తర్వాత మరే బ్రిటన్ ప్లేయర్ వింబుల్డన్‌లో గెలుపొందలేకపోయాడు.ఏడున్నర దశాబ్దాల తర్వాత ఎట్టకేలకు ముర్రే వింబుల్డన్ టైటిల్‌తో బ్రిటన్ ముచ్చట తీర్చాడు. 2027లో జరిగే 150 ఏళ్ల వింబుల్డన్ పండగలో ముర్రేతో పాటు పెర్రీ విగ్రహాన్ని కూడా ఆవిష్కరిస్తారు. ముర్రే తన కెరీర్లో మూడు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను గెలిచాడు. 2012లో యూఎస్ ఓపెన్ గెలిచిన అతను 2013, 2016లలో వింబుల్డన్ విజేతగా నిలిచాడు. ఇక ఈ సీజన్ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఈ నెల 30 నుంచి జరుగుతుంది. ఇదీ చదవండి: క్వార్టర్స్‌లో యూకీ జోడీ మలోర్కా (స్పెయిన్): వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీకి సన్నాహాల్లో భాగంగా మలోర్కా ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో బరిలోకి దిగిన భారత స్టార్ యూకీ బాంబ్రీ శుభారంభం చేశాడు. రాబర్ట్ గాలోవే (అమెరికా)తో జత కలిసి ఈ టోర్నీలో పోటీపడుతున్న యూకీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో యూకీ–గాలోవే ద్వయం 6–3, 6–3తో గ్రెగోరి జాక్–అలెగ్జాండర్ ముల్లర్ (ఫ్రాన్స్) జోడీపై విజయం సాధించింది. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ–గాలోవే ఆరు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. తమ సర్వీస్‌ను ఒక్కసారి కూడా చేజార్చుకోని యూకీ–గాలోవే ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశారు. -
పోర్చు‘గోల్’ చేరింది
మ్యూనిక్: జగద్విఖ్యాత స్ట్రయికర్ క్రిస్టియానో రొనాల్డో నేషన్స్ లీగ్‌లో పోర్చుగల్ జట్టును విజేతగా నిలిపాడు. ఆద్యంతం ఉత్కంఠను రేపిన ఫైనల్లో రొనాల్డో నాయకత్వంలోని పోర్చుగల్ జట్టు ‘పెనాల్టీ షూటౌట్’లో 5–3తో డిఫెండింగ్ స్పెయిన్‌పై విజయం సాధించి ఈ టో ర్నీలో రెండోసారి విజేతగా నిలిచింది. 2018–2019లో తొలిసారి జరిగిన నేషన్స్ లీగ్ టోర్నీలోనూ పోర్చుగల్ జట్టుకే టైటిల్ లభించింది. నిర్ణీత సమయం, అదనపు సమయం ముగిసేవరకు పోర్చుగల్, స్పెయిన్ జట్లు 2–2 గోల్స్‌తో సమఉజ్జీగా నిలిచాయి. దీంతో ‘షూటౌట్’ అనివార్యమైంది.ఇందులో పోర్చుగల్ గోల్ కీపర్ డీగో కోస్టా కీలకపాత్ర పోషించాడు. నాలుగో పెనాల్టీకి దిగిన స్పెయిన్ స్ట్రయికర్ అల్వారో మొరాటా కిక్‌ను డీగో కోస్టా సమర్థంగా అడ్డుకోవడంతోనే పోర్చుగల్‌కు విజయం ఖాయమైంది. దీంతో మైదానంలోని రొనాల్డో అభిమానులు విజయ సంబరాల్లో మునిగితేలారు. స్పెయిన్ తరఫున మొదటి ముగ్గురు విజయవంతంగా గోల్స్ చేయగా... మొరాటా ఒక్కడే విఫలమయ్యాడు. అంతకుముందు రెగ్యులర్ టైమ్ మ్యాచ్ కూడా పోటాపోటీగా సాగింది. మ్యాచ్ తొలి అర్ధభాగంలో మార్టిన్ జుబిమెండి 21వ నిమిషంలో గోల్ చేసి స్పెయిన్‌ను 1–0తో ఆధిక్యంలో నిలిపాడు. అయితే ఐదు నిమిషాల వ్యవధిలోనే న్యూనొ మెండెస్ (26వ నిమిషంలో) గోల్ కొట్టడంతో 1–1తో స్కోరు సమమైంది. తిరిగి తొలి అర్ధభాగం ముగిసే ఆఖరి నిమిషంలో స్పెయిన్ ఆటగాడు ఒయర్లబెల్ (45వ నిమిషంలో) గోల్ చేసి 2–1తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ద్వితీయార్ధం మొదలయ్యాక పోర్చుగల్ ఈ స్కోరును సమం చేసేందుకు ఎంతగానో ప్రయత్నించినా... స్పెయిన్ రక్షణపంక్తి, గోల్ కీపర్ సమన్వయంతో ఒక్క షాట్ కూడా లక్ష్యాన్ని చేరలేదు. ఎట్టకేలకు స్టార్ స్ట్రయికర్ రొనాల్డో 61వ నిమిషంలో చేసిన గోల్ వల్లే పోర్చుగల్ మ్యాచ్‌లో నిలిచింది. దీంతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ చరిత్రలో అతని రికార్డు గోల్ స్కోరు 138కి చేరింది. అక్కడ 2–2తో సమమైన స్కోరు నిర్ణీత సమయం, అదనపు సమయం ముగిసేవరకు కొనసాగింది. విజేతను తేల్చేందుకు షూటౌట్‌ను నిర్వహించగా స్పెయిన్ తరఫున మెరినో, బెయెనా, ఇస్కో సఫలమవగా, మొరాటా నిరాశపరిచాడు. పోర్చుగల్ తరఫున రామొస్, విటిన్హా, ఫెర్నాండెజ్, మెండెస్, నివెస్ ఇలా ఐదుగురు గోల్స్ చేయడంతో ట్రోఫీ చేజిక్కించుకుంది. విజయానంతరం 40 ఏళ్ల రొనాల్డో భావోద్వేగానికి గురయ్యాడు. ‘క్లబ్‌ల తరఫున ఇదివరకు ఎన్నో టైటిల్స్ గెలిచాను. కానీ అవేవీ పోర్చుగల్ విజయానికి సాటిరావు. దేశానికి ట్రోఫీ అందించిన ఆనందం ఎప్పటికీ ప్రత్యేకం’అని ఉబికివచ్చే కంటనీరును అదుపు చేసుకుంటూ వ్యాఖ్యానించాడు. -
కుమార్తె పేరు మారింది.. తండ్రి కాస్తా తల్లయ్యాడు
పుర్రెకో బుద్ధి.. జిహ్వకోరుచి అన్నారు పెద్దలు .. అందరిలా రొటీన్ గా తినేసి తొంగుంటే మనల్ని ఎవరు చూస్తారు.. అందుకే ఏదోటి చేద్దాం.. సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలుద్దాం అని భావించేవాళ్లు కొందరు ఉంటారు. అందులోభాగంగా కొందరు కోట్లు కోట్లు ఖర్చుపెట్టి జంతువుల్లా మారేవాళ్ళు ఉండగా మరికొందరు.. రకరాలక పచ్చబొట్లు పొడిపించుకుని అందరిచేతా ఔరా అనిపించుకుంటున్నారు. కొందరు రకరకాల డ్రెస్సులు వేసుకుని .. మరికొందరు చిత్రవిచిత్రమైన హెయిర్ స్టైల్స్ వేసుకుని జనాన్ని ఆకర్షిస్తుంటారు. మరికొందరు తమ కార్లను.. ఇళ్లను రకరకాలుగా డిజైన్లు చేయించి అందరిచేతా ఔరా అనిపించుకుంటారు..అలాగే స్వీడన్ బాబాయ్ ఫ్రాన్సిస్కో పెరెజ్ కూడా ఇలాగే చిత్రమైన విధంగా ఫోటోషూట్ చేయించుకున్నారు. స్పెయిన్ కు చెందిన ఫ్రాన్సిస్కో పెరెజ్ వయసు యాభై ఒక్క ఏళ్ళు. ఆయనకు పెళ్ళి ఈడుకొచ్చిన ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఆయనకు మంచి సృజనాత్మక ఆలోచనలు ఉన్న ఫోటోగ్రాఫర్ మార్టిన్ విల్క్స్ అనే మిత్రుడు ఉన్నారు. మార్టిన్ నిత్యం రకరకాల ఫోటో షూట్లు చేస్తుంటారు. పెళ్ళిళ్లు...రిటైర్మెంట్ ఫంక్షన్లు .. పిక్నిక్కులు..ఎంగేజ్మెంట్లు . పుట్టినరోజులు..ఇలా రకరకాల ఈవెంట్లకు ఫోటో షూట్లు చేయడం ఆయనకు వృత్తి..హాబీ కూడా . అందరూ తీసేలా కాకుండా వినూత్నమైన కాన్సెప్టులతో ఫోటోషూట్లు చేస్తూ అందరి కన్నా భిన్నంగా ఫోటోలు తీస్తుంటారు. సరిగ్గా తన మిత్రుడిలోని సృజనాత్మకతకు తన అభిరుచిని జోడించిన ఫ్రాన్సిస్కో కొత్తగా ఒక ఫోటో షూట్ చేసి అందరిచేతా ఔరా అనిపించుకున్నారు.వాస్తవానికి ఫ్రాన్సిస్కో చిన్నకూతురు నోయెలియా అని ప్రభుత్వ రికార్డుల్లో నమోదు కావాల్సి ఉండగా దాన్ని అప్పట్లో ఆయన బీరు మత్తులో ఉండి నటాలియా గా నమోదు చేయించారు. అయితే దాన్ని ఇప్పుడు మార్చాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు ఆమె పేరును సరిగ్గా మార్చి దానికి సంబంధించి తన బిడ్డ మళ్ళీ పుట్టింది అంటూ సంబరం చేసుకున్నారుదీనికోసం తన మిత్రుడు అయిన ఫోటోగ్రాఫర్ సాయంతో తానే ఓ గర్భిణి అవతారం ఎత్తి పొట్ట మీద పూల డిజైన్లు..నెత్తికి పూల కిరీటం పెట్టుకుని చెట్లు..చేమలు..వాగులు వంకల వెంట గర్భిణి మాదిరి వగలు పోతూ పొట్టను నిమురుకుంటూ సిగ్గులు ఒలకబోసారు. తను తన బిడ్డకు మళ్ళీ జన్మను ఇచ్చానని చెబుతూ ఇలా ఫోటో షూట్ చేశారు... వీటిని చూసినవాళ్ళంతా ఓర్నీ అసాధ్యం పాడుగాను అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. మనలో క్రియేటివిటీ ఉండాలి కానీ ఏ సంఘటన.. సన్నివేశాన్ని అయినా ఇలా ఆనందంగా వినూత్నంగా మలుచుకోవచ్చని, అందర్నీ ఆకర్షించొచ్చు అని తెలియజెప్పుతున్నారు.:: సిమ్మాదిరప్పన్న -
అతిచిన్న అంతర్జాతీయ వారధి..!
ఇది ప్రపంచంలోనే అతి చిన్న అంతర్జాతీయ వారధి. కేవలం కొన్ని అడుగులు వేసి, ఈ వంతెనను ఇట్టే దాటేయవచ్చు. దీని మీదుగా స్పెయిన్ నుంచి పోర్చుగల్ దేశానికి వెళ్లొచ్చు. దీనిని ‘మార్కో ఇంటర్నేషనల్ బ్రిడ్జ్’ అని పిలుస్తారు. కేవలం 6 మీటర్ల పొడవు, 1.45 మీటర్ల వెడల్పుతో ఈ వంతెనను 2008లో నిర్మించారు. స్పెయిన్‌లోని ఎల్ మార్కో గ్రామం నుంచి పోర్చుగల్ గ్రామమైన వర్జియా గ్రాండ్ల మధ్య ఉండే చిన్న వాగును దాటేందుకు, వెదురు బొంగులతో దీనిని నిర్మించారు. ఈ వంతెన రెండు వేర్వేరు టైమ్జోన్ల పరిధిలో ఉంది. స్పెయిన్ వైపు సెంట్రల్ యూరోపియన్ టైమ్ (సీఈటీ) జోన్‌లోను, పోర్చుగీస్ వైపు గ్రీన్విచ్ మీన్ టైమ్ (జీఎంటీ) జోన్‌లోను ఉండటం విశేషం. దీని మీదుగా ప్రయాణిస్తే, టైమ్ ట్రావెల్ చేసిన అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. దీని మీదుగా కేవలం పాదచారులు, ద్విచక్ర వాహనాలు మాత్రమే ప్రయాణించడానికి వీలవుతుంది. పర్యాటకులకు ఇదొక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రోజూ వందలాది మంది ఈ వంతెనను దాటుతూ టైమ్ ట్రావెలింగ్ చేసిన అనుభూతిని పొందుతున్నారు. (చదవండి: krithi shetty: నీలిరంగు డ్రెస్‌లో బేబమ్మ బ్యూటీ లుక్స్..ధర తెలిస్తే షాకవ్వుతారు..!) -
వెరైటీ పండుగ: ‘లాస్ ఫల్లాస్' బొమ్మలను తయారు చేసి మరీ..!
ప్రపంచ బొమ్మల ప్రియులకు ‘లాస్ ఫల్లాస్’ పండుగ ప్రత్యేక ఆహ్వానం పలుకుతోంది. ఇది స్పెయిన్ లోని వాలెన్సియాలో జరిగే ఒక ప్రత్యేకమైన సంప్రదాయ వేడుక. ఇది ప్రతి ఏడాది మార్చి 15 నుంచి 19 వరకు జరుగుతుంది. ఈ పండుగలో ప్రధానంగా భారీ కార్టూన్లాంటి బొమ్మలను తయారు చేసి, వాటిని ప్రదర్శిస్తారు. ఆ బొమ్మలను అక్కడివారు ‘ఫల్లాస్’ అని పిలుస్తారు. పండుగ చివరిరోజున ఈ బొమ్మలను తగలబెడతారు.ఫల్లాస్ల తయారీనే ఈ పండుగలో ప్రధాన ఆకర్షణ. చెక్క, కార్డ్బోర్డ్, కాగితం, స్టెరోఫోమ్ వంటి మండే పదార్థాలతో, స్థానిక కళాకారులు ఏడాది పొడవునా శ్రమించి, వీటిని తయారు చేస్తారు. ఈ బొమ్మల్లో హాస్యం, వ్యంగ్యం, సమకాలీన సంఘటనలను ప్రతిబింబించే అంశాలు ఉంటాయి. ఈ బొమ్మల ప్రదర్శనలో పోటీలు కూడా జరుగుతాయి. ఈ ఫెస్టివల్ జరిగే ఐదురోజుల్లో మధ్యాహ్నం పూట, రాత్రి పూట కనుల విందుగా బాణసంచా కాలుస్తారు. చివరి రోజైన మార్చి 19న జరిగే బొమ్మల దహనాన్ని ముఖ్యమైన ఘట్టంగా భావిస్తారు. దాన్ని ‘లా క్రెమా’ అని పిలుస్తారు. మొదటిగా పెద్దలు తయారు చేసిన బొమ్మలు కాల్చి, తర్వాత పిల్లల బొమ్మలను కాలుస్తారు. అలా కాల్చడంతో చెడు దహనమైందని భావిస్తారు. ఈ పండుగలో సంగీత కార్యక్రమాలు, సంప్రదాయ దుస్తుల ప్రదర్శనలు, బహిరంగ భోజనాలు, వీథుల్లో పలు బృందాల కవాతులు.. అక్కడి కళా సాంస్కృతిక పరంపరకు ప్రతీకగా నిలుస్తాయి. (చదవండి: ఆ గుహ సమీపానికి వచ్చారో అంతే..! శాస్త్రవేత్తలకే అంతుపట్టని మిస్టరీ అది..) -
మన ఆటలో వేగం పెరగాలి
న్యూఢిల్లీ: అరంగేట్ర మ్యాచ్‌లోనే అనూహ్య గోల్‌తో అదరగొట్టిన భారత మహిళల హాకీ జట్టు యువ ఫార్వర్డ్ సాక్షి రాణా... అంతర్జాతీయ స్థాయిలో నిలకడ కొనసాగించేందుకు ఆటలో వేగం పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. ఇటీవల అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్ సందర్భంగా స్పెయిన్‌తో మ్యాచ్ ద్వారా 17 ఏళ్ల సాక్షి రాణా సీనియర్ స్థాయిలో అరంగేట్రం చేసింది. భువనేశ్వర్ వేదికగా ప్రపంచ ఏడో ర్యాంకర్ స్పెయిన్‌తో జరిగిన పోరులో సాక్షి తన ఆటతీరుతో ఆకట్టుకుంది. ఆ మ్యాచ్‌లో భారత్ 3–4 గోల్స్ తేడాతో స్పెయిన్ చేతిలో ఓడినప్పటికీ... సాక్షి మాత్రం చక్కటి ‘ఫీల్డ్ గోల్’తో తనదైన ముద్ర వేసింది. జూనియర్ స్థాయిలో చక్కటి ప్రదర్శనతో సీనియర్ జట్టుకు ఎంపికైన సాక్షి రాణా... మొదటి మ్యాచ్‌లోనే గోల్ చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పింది. ‘సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేసేందుకు చాన్నాళ్లుగా ఎదురుచూశా.తొలి మ్యాచ్‌లో సీనియర్ ప్లేయర్లు ఎంతగానో సహకరించారు. అంతర్జాతీయ స్థాయిలో మొదటి పోరును ఆస్వాదించమని సూచించారు. దీంతో ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడగలిగా’ అని సాక్షి వెల్లడించింది. స్పెయిన్‌తో మ్యాచ్‌లో ప్రత్యర్థి ప్లేయర్ల నుంచి సర్కిల్లో బంతి చేజిక్కించుకున్న సాక్షి దానిని గోల్‌గా మలిచింది. ‘తొలి మ్యాచ్‌లోనే గోల్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. దాని కోసం తీవ్రంగా శ్రమించా. మ్యాచ్ సమయంలో నా చేతికి బంతి దొరికినప్పుడు చుట్టుపక్కల ఎవరూ లేరని గమనించా. అదే అదునుగా షాట్ కొట్టా. దీంతో ఒక్కసారిగా అందరూ అరవడం ప్రారంభించారు. అప్పుడుగోల్ కొట్టానని అర్థమైంది’ అని సాక్షి చెప్పింది. ఎఫ్ఐహెచ్ ప్రొ హాకీ లీగ్‌లో భాగంగా స్పెయిన్, జర్మనీ జట్లపై ఆడిన సాక్షి... విదేశీ ప్లేయర్లతో పోటీపడాలంటే ఆటలో మరింత వేగం పెంపొందించుకోవాలని సాక్షి అభిప్రాయపడింది. ‘అంతర్జాతీయ స్థాయి లో రాణించాలంటే మరింత వేగం, చురుకుదనం పెంచుకోవాలని అర్థమైంది. ఫార్వర్డ్‌గా అది నాకు మరింత కీలకం. అందుకే ఇప్పుడు దానిపై దృష్టి సారించా. ప్రొ హాకీ లీగ్‌కు స్టాండ్‌బై ప్లేయర్‌గా ఎంపికయ్యా. చీఫ్ కోచ్ హరేంద్ర సింగ్ తొలి మ్యాచ్ ఆడుతున్నావు అని చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. నిన్ను మాత్రమే జట్టుకు ఎంపిక చేయలేదు... నీ ఆటను కూడా సెలెక్ట్ చేశాం... మైదానంలో విజృంభించు అని కోచ్ వెన్నుతట్టారు.దీంతో ఆత్మవిశ్వాసంతో ఆడగలిగాను’ అని సాక్షి చెప్పింది. గతేడాది జూనియర్ ఆసియా కప్‌లో పసిడి పతకం గెలిచిన భారత జట్టులో సభ్యురాలైన సాక్షి... ఈ ఏడాది చిలీ వేదికగా జరగనున్న జూనియర్ ప్రపంచకప్‌లో యువ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనుంది. -
భారత హాకీ జట్లకు నిరాశ
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో భారత పురుషుల, మహిళల జట్లకు నిరాశ ఎదురైంది. మంగళవారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో భారత పురుషుల జట్టు 1–4 గోల్స్ తేడాతో ప్రపంచ మాజీ చాంపియన్ జర్మనీ జట్టు చేతిలో... భారత మహిళల జట్టు 3–4 గోల్స్ తేడాతో స్పెయిన్ జట్టు చేతిలో ఓడిపోయాయి. జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో భారత్ తరఫున గుర్జంత్ సింగ్ (13వ నిమిషంలో) ఏకైక గోల్ చేశాడు. జర్మనీ తరఫున ఫ్లోరియన్ స్పెర్లింగ్ (7వ నిమిషంలో), థీస్ ప్రింజ్ (14వ నిమిషంలో), మైకేల్ స్ట్రుతోఫ్ (48వ నిమిషంలో), రాఫెల్ హార్ట్కోప్ (55వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు తరఫున బల్జీత్ కౌర్ (19వ నిమిషంలో), సాక్షి రాణా (38వ నిమిషంలో), రుతుజా (45వ నిమిషంలో) ఒక్కో గోల్ నమోదు చేశారు. స్పెయిన్ జట్టుకు సోఫియా (21వ నిమిషంలో), లూసియా (52వ నిమిషంలో) ఒక్కో గోల్ చేయగా... ఎస్తెల్ (25వ, 49వ నిమిషాల్లో) రెండు గోల్స్ అందించింది. -
భారత హాకీ జట్లకు మిశ్రమ ఫలితాలు
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ హాకీ లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌ల్లో భారత జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ముందుగా భారత మహిళల జట్టు ‘షూటౌట్’లో 1–2తో ఇంగ్లండ్ జట్టు చేతిలో ఓడిపోగా... అనంతరం భారత పురుషుల జట్టు 2–0 గోల్స్ తేడాతో స్పెయిన్ జట్టుపై విజయం సాధించింది. భారత జట్టు తరఫున మన్దీప్ సింగ్ (32వ నిమిషంలో), దిల్‌ప్రీత్ సింగ్ (39వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. ఇంగ్లండ్–భారత్ మహిళల జట్ల మధ్య మ్యాచ్‌లో నిర్ణీత సమయం ముగిశాక రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. భారత్ తరఫున నవ్‌నీత్ కౌర్ (53వ నిమిషంలో), రుతుజా (57వ నిమిషంలో)... ఇంగ్లండ్ తరఫున పెయిజ్ గిలోట్ (40వ నిమిషంలో), టెసా హొవార్డ్ (56వ నిమిషంలో) ఒక్కో గోల్ నమోదు చేశారు. విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ నిర్వహించారు. తొలి ఐదు షాట్లు ముగిశాక రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. ఆ తర్వాత ఆరో షాట్లో రెండు జట్ల క్రీడాకారిణులు విఫలమయ్యారు. ఏడో షాట్లో భారత ప్లేయర్ లాల్రెమ్సియామి గురి తప్పగా... ఇంగ్లండ్ ప్లేయర్ సోఫీ హామిల్టన్ బంతిని లక్ష్యానికి చేర్చడంతో భారత్‌కు ఓటమి ఖరారైంది. -
అబ్బాయిల ఓటమి...అమ్మాయిల గెలుపు
భువనేశ్వర్: ఎఫ్ఐహెచ్ పురుషుల ప్రొ లీగ్‌లో భారత జట్టు పరాజయం పాలైంది. భారత అంచె పోటీల్లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత్ 1–3 గోల్స్ తేడాతో స్పెయిన్ చేతిలో ఓడింది. 2024 పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక పోరులో భారత జట్టు చేతిలో ఎదురైన పరాజయానికి స్పెయిన్ బదులు తీర్చుకున్నట్లైంది. భారత్ తరఫున సుఖ్జీత్సింగ్ (25వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించాడు. స్పెయిన్ తరఫున బోర్జా లాకల్లె (28వ నిమిషంలో), ఇగ్నాషియా కొబొస్ (38వ ని.లో), బ్రూనో అవిలా (56వ ని.లో) తలా ఒక గోల్ చేశారు. భారత జట్టు పదే పదే దాడులు చేసినా స్పెయిన్ రక్షణ పంక్తి సమర్థవంతంగా అడ్డుకుంది. తొలి క్వార్టర్లో ఇరు జట్లు ఎంత ప్రయత్నించినా... గోల్ చేయలేకపోయాయి. రెండో క్వార్టర్‌ను ఇరు జట్లు మరింత దూకుడుగా ప్రారంభించాయి. ఈ క్రమంలో సుఖ్జీత్ సింగ్ గోల్‌తో భారత్ ఆధిక్యంలోకి వెళ్లగా... మూడు నిమిషాల వ్యవధిలోనే గోల్ కొట్టిన స్పెయన్ స్కోరు సమం చేసింది. ఆ తర్వాత వరుసగా రెండు క్వార్టర్స్‌లో ఒక్కో గోల్ బాదిన స్పెయిన్ మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. ఆదివారం మరోసారి స్పెయిన్‌తో భారత్ ఆడనుంది. హోరాహోరీ పోరులో భారత అమ్మాయిల విజయం ఎఫ్ఐహెచ్ మహిళల ప్రొ లీగ్‌లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. భారత అంచె పోటీల్లో భాగంగా శనివారం హోరాహోరీగా సాగిన తొలి పోరులో భారత్ 3–2 పాయింట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. కళింగ స్టేడియంలో జరిగిన పోరులో తమకన్నా మెరుగైన ర్యాంక్ ఉన్న ఇంగ్లండ్ జట్టుపై భారత్ స్ఫూర్తిదాయకమైన ప్రదర్శన కనబర్చింది. భారత్ తరఫున వైష్ణవి (6వ నిమిషంలో), దీపిక (25వ ని.లో) నవ్‌నీత్ కౌర్ (59వ ని.లో) తలా ఒక గోల్ చేశారు. వైష్ణవి, దీపిక పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలచగా... ఆట ఆఖరి నిమిషంలో అదిరిపోయే ఫీల్డ్‌గోల్‌తో నవ్‌నీత్ జట్టుకు విజయాన్ని అందించింది. ఇంగ్లండ్ తరఫున డార్సీ బౌర్నె (12వ నిమిషంలో), ఫియానా క్రాక్లెస్ (58వ ని.లో) చెరో గోల్ కొట్టారు. ఎఫ్ఐహెచ్ ర్యాంకింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో ఉన్న భారత్.. వైష్ణవి గోల్‌తో తొలి క్వార్టర్‌లోనే ఖాతా తెరిచింది. అయితే కాసేపటికే ఏడో ర్యాంక్‌లో ఉన్న ఇంగ్లండ్ స్కోరు సమం చేసింది. రెండో క్వార్టర్లో దీపిక గోల్‌తో ఆధిక్యంలోకి వెళ్లిన భారత్... సునాయాసంగానే మ్యాచ్ గెలిచేలా కనిపించింది. ఈ క్రమంలో గోల్‌కీపర్ సవిత పూనియా కొన్ని చక్కటి సేవ్‌లతో ప్రత్యర్థికి స్కోరు చేసే అవకాశం ఇవ్వలేదు. చివర్లో ఇంగ్లండ్ స్కోరు సమం చేసినా... నిమిషం వ్యవధిలోనే మరో గోల్ కొట్టిన భారత్ విజయం సాధించింది. ఆదివారం జరగనున్న మ్యాచ్‌లో మరోసారి ఇంగ్లండ్‌తో భారత అమ్మాయిల జట్టు తలపడుతుంది. -
‘ప్రతీ మ్యాచ్ గెలవడమే లక్ష్యం’
భువనేశ్వర్: వచ్చే ఏడాది హాకీ ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో... నేరుగా మెగా టోర్నీకి అర్హత సాధించేందుకు ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్‌లో ప్రతీ మ్యాచ్ గెలవాలనుకుంటున్నామని భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పేర్కొన్నాడు. లీగ్‌లో మంచి ప్రదర్శన కనబర్చి అగ్రస్థానంలో నిలవడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని హర్మన్‌ప్రీత్ అన్నాడు. లీగ్‌లో భాగంగా శనివారం తొలి పోరులో స్పెయిన్‌తో భారత్ తలపడుతుంది. అనంతరం ఆదివారం స్పెయిన్‌తో మరో మ్యాచ్ ఆడుతుంది. ఈ నెల 18న, 19న జర్మనీతో 21, 22న ఐర్లాండ్‌తో... 24, 25న ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లు ఆడుతుంది. ‘హాకీ ఇండియా లీగ్ నుంచి మా శిక్షణ సాగుతూనే ఉంది. ఫిట్నెస్ కాపాడుకుంటూ ప్రాక్టీస్ చేస్తున్నాం. ఆటగాళ్లంతా మంచి ఉత్సాహంగా ఉన్నారు. ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రొ లీగ్‌లో అన్నీ మ్యాచ్‌లు గెలవడమే మా ప్రధాన లక్ష్యం’ అని హర్మన్‌ప్రీత్ అన్నాడు. 2026 ఆగస్టులో బెల్జియం, నెదర్లాండ్స్ వేదికగా హాకీ వరల్డ్ కప్ జరగనుంది. ‘హాకీ ఇండియా లీగ్ ద్వారా దేశవాళీ ఆటగాళ్ల ప్రతిభ వెలుగులోకి వచ్చింది. వారిని సక్రమంగా వినియోగించుకుంటే భవిష్యత్తులో మరింత మంచి ప్లేయర్లుగా ఎదుగుతారు. స్పెయిన్ గట్టి ప్రత్యర్థి, వారిని తక్కువ అంచనా వేయడం లేదు. మా వరకు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడంపైనే దృష్టి పెడతాం’అని హర్మన్‌ప్రీత్ పేర్కొన్నాడు. -
వేధిస్తాడు.. మొరటోడు
వాషింగ్టన్: అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా విధానాలను ప్రముఖ హాలీవుడ్ నటుడు రిచర్డ్ గెరె తీవ్రంగా తప్పుబట్టారు. ఇటీవల స్పెయిన్‌లో ‘గోయా’అవార్డ్‌ల ప్రదానోత్సవంలో రిచర్డ్‌కు జీవితకాల సాఫల్యత పురస్కారం దక్కింది. ఈ సందర్భంగా రిచర్డ్ మాట్లాడుతూ ట్రంప్ విధాన నిర్ణయాలు, ట్రంప్ చుట్టూ ఉన్న నేతాగణాన్ని ప్రస్తావించారు. గిరిజనులు అడవుల్లో గిరిజనేతరుల ఆధిపత్యాన్ని కోరుకోరు అనే అర్థంలో మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడో అనాలోచిత ట్రైబలిజం అమెరికాలో మొదలవుతోంది. ఇతరులతో పోలిస్తే మేం ప్రత్యేకం అన్న ధోరణి పెరుగుతోంది. అలాంటి ఆలోచనలను తుంచేయాల్సిన ప్రజాప్రతినిధులే ఈ ఆలోచనలకు అంటుకట్టడం విషాదకరం. ఇప్పుడు అమెరికాలో చీకటిరోజులు మొదలయ్యాయి. అందర్నీ అవహేళన చేస్తూ వేధించే మొరటు మనిషి ట్రంప్ ఏలుబడిలో ఉన్నాం. ఈయన విషయంలో ఒక్క అమెరికాలో మాత్రమే కాదు యావత్ ప్రపంచదేశాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన తరుణమిది. అధికారం, పెట్టుబడిదారుల సంకర వివాహమిది. బాధ్యతారాహిత్యంతో ప్రభుత్వ ఖజానానే దోచేసే బడా పారిశ్రామికవేత్తలు, సంపన్నులు కొలువైన ప్రభుత్వమిది. ఇది మానవళికే ప్రమాదకరం. ఇతరుల పట్ల దయ లేని పరిణతి సాధించని సంపన్న మూకలు ట్రంప్ చుట్టూ చేరారు. ఇలాంటి వ్యక్తుల కలయిక ఎంతో వినాశకరం’’అని రిచర్డ్ ఆందోళన వ్యక్తంచేశారు. అమెరికాలో ఉండే రిచర్డ్ ఇటీవలే తన భార్య అలెజాండ్రా సిల్వాతో కలిసి స్పెయిన్‌కు మకాం మార్చారు. -
నేను నటినే!
కార్లా సోఫియా గాస్కాన్... ఆస్కార్ నామినేషన్స్‌లో మొట్టమొదటి ట్రాన్స్‌గా స్థానం దక్కించుకొని, చరిత్ర సృష్టించింది. మ్యూజికల్ క్రైమ్ ఫిల్మ్ ‘ఎమీలీయా పెరెజ్’ చిత్రంలో టైటిల్ క్యారెక్టర్ పోషించి, ఉత్తమ నటిగా కార్లా ఆస్కార్‌కు ఎన్నికైంది. మొత్తం ప్రపంచ చలన చిత్ర పరిశ్రమనే తనవైపు తిప్పుకున్న, కార్లా పుట్టింది స్పెయిన్‌లోని ఆల్కోబెండాస్లో. పదహారేళ్ల వయసులో నటుడిగా ఎంట్రీ ఇచ్చి, లండన్‌లో లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకొని నటిగా మారింది. హాస్య చిత్రం ‘ది నోబుల్ ఫ్యామిలీ’ విజయంతో ఇక వెనుతిరిగి చూడలేదు. వరుస సినిమాలు, సిరీస్‌లు చేస్తూ ఎప్పటికప్పుడు తన సత్తా చాటుతూనే ఉంది. 2024లో విడుదలైన ‘ఎమిలియా పెరెజ్’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలతో పాటు, ఉత్తమ నటిగా ‘కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు’, ‘యూరోపియన్ ఫిల్మ్ అవార్డు’లను సాధించింది. ఇప్పుడు ఇదే సినిమాకు ఆస్కార్ బరిలోనూ నిలిచింది. అయితే, కాలం మారినా, సమాజం మారలేదు అన్నట్లు సోషల్ మీడియాలో ‘ఆమె ‘ఉత్తమ నటి’ లేదా ‘ఉత్తమ నటుడు’గా నామినేట్ చేశారో తెలియటం లేదు’ అని ప్రశ్నించిన ఒక అభిమానికి కార్లా ‘‘మేడమ్, నేను నటిని! సినిమాల్లో రాక్షసుడిగా, కుక్కగా ఇలా ఏ పాత్రలో నటించినా, నేను ‘నటి’గానే నామినేట్ అవుతాను’’ అని స్పందించింది. -
ప్రొ లీగ్‌తో భారత హాకీ జట్ల ఆట షురూ
భువనేశ్వర్: భారత హాకీ జట్లు ఈ సీజన్‌ను అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్‌తో ప్రారంభించనున్నాయి. భారత్ అంచె పోటీలు వచ్చేనెల 15 నుంచి భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో జరుగుతాయి. ఇందులో తొలిరోజు భారత పురుషుల జట్టు స్పెయిన్‌తో పోటీపడనుండగా, మహిళల జట్టు ఇంగ్లండ్‌ను ‘ఢీ’ కొట్టనుంది. ప్రస్తుతమైతే భారత జాతీయ క్రీడాకారులంతా (మహిళలు, పురుషులు) హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)తో బిజీగా ఉన్నారు. రూర్కేలా, రాంచీలలో జరుగుతున్న ఫ్రాంచైజీ లీగ్ టోర్నీలో భారత ప్లేయర్లు ఆయా ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అనంతరం ఫిబ్రవరిలో భారత జట్ల అంతర్జాతీయ సీజన్ ఆరంభం కానుంది. వచ్చే నెల 15 నుంచి 25 వరకు జరిగే భారత్ అంచె ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ పోటీల్లో పురుషుల జట్టు స్పెయిన్, ఇంగ్లండ్, జర్మనీ ఐర్లాండ్‌లతో ముఖాముఖి పోటీల్లో తలపడుతుంది. అమ్మాయిల జట్టు ఇంగ్లండ్‌తో పాటు జర్మనీ, నెదర్లాండ్స్, స్పెయిన్లతో పోటీపడుతుంది. ఒక్కో జట్టుతో రెండేసి లీగ్ మ్యాచ్‌లు ఆడుతుంది. మ్యాచ్‌లన్నీ కళింగ స్టేడియంలోనే నిర్వహిస్తారు. భారత్ అంచెకంటే ముందు ఆస్ట్రేలియాలో ఎఫ్ఐహెచ్ తొలి అంచె మొదలవుతుంది. సిడ్నీలో ఫిబ్రవరి 4 నుంచి 9 వరకు జరిగే ఆసీస్ అంచె పోటీల్లో భారత జట్లకు మ్యాచ్ల్లేవు. ‘ఆస్ట్రేలియాలో మ్యాచ్‌లు ముగిసిన వెంటనే రోజుల వ్యవధిలోనూ భారత్ అంచె పోటీలు మొదలవుతాయి. హాకీని ఆదరించే భారత్‌లో ఈ పోటీలు రసవత్తరంగా సాగుతాయి.11 రోజుల పాటు 24 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇది ముగిసిన తర్వాత తుది అంచె పోటీలు సాంటియాగో డెల్ ఈస్టెరోలో జరుగుతాయి. దీంతో అన్ని జట్లకు ఎనిమిదేసి మ్యాచ్‌లు పూర్తవడంతో ఫైనల్స్‌కు చేరే నాకౌట్ జట్లేవే తేలిపోతాయి. గత సీజన్లో ఆస్ట్రేలియా పురుషుల జట్టు, నెదర్లాండ్స్ మహిళల జట్టు ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ టైటిల్స్ నెగ్గాయి. -
కల్లోల కడలిలో.. పడవలోనే కాన్పు
వలస బతుకుల దుర్భర దైన్యానికి దర్పణం పట్టే ఉదంతమిది. వలసదారులతో కిక్కిరిసిన పడవలో ఓ నిండు గర్భిణి పురిటి నొప్పులు పడింది. ఆఫ్రికా నుంచి స్పెయిన్‌కు వస్తుండగా ఈ ఘటన జరిగింది. కొద్దిసేపట్లో స్పెయిన్ పాలనలోని స్వయం ప్రతిపత్తి ప్రాంతం కానరీ దీవులకు చేరతారనగా నొప్పులు ఎక్కువయ్యాయి. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో పడవే ప్రసూతి గదిగా మారింది. చుట్టూ ఉత్కంఠగా వేచి చూస్తున్న వలసదారుల నడుమే పండంటి బాబు ఈ లోకంలోకి వచ్చాడు. తర్వాత పది నిమిషాలకే నేవీ బోటులో ఆ పడవను చుట్టుముట్టిన కోస్ట్ గార్డులు వలసదారుల మధ్యలో రక్తమయంగా కనిపించిన పసిగుడ్డును చూసి నిర్ఘాంతపోయారు. తల్లీబిడ్డలను హుటాహుటిన హెలికాప్టర్లో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగానే అన్నారు. వలస పడవలో నిస్త్రాణంగా పడి ఉన్న తల్లి పక్కన మరొకరి చేతిలో నవజాత శిశువును చూసిన క్షణాలను కోస్ట్ గార్డ్ సిబ్బంది కెమెరాలో బంధించారు. ఆ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. క్రైస్తవులకు పర్వదినమైన ఎపిఫనీ రోజునే ఈ ఘటన జరగడం విశేషం. ఆ రోజున ప్రధానంగా బాలలకు బోలెడన్ని కానుకలివ్వడం సంప్రదాయం. అలాంటి పండుగ రోజున వలస దంపతులకు ఏకంగా బుల్లి బాబునే దేవుడు కానుకగా ఇచ్చాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
గూగుల్ స్ట్రీట్ ఫొటోతో మర్డర్ మిస్టరీ వీడింది!
గూగుల్ మ్యాప్ ఫొటో ఓ హంతకుడిని పట్టించిన ఘటన స్పెయిన్‌లో జరిగింది. సోరియా ప్రావిన్స్‌లోని తజుకో పట్టణ వీధులను గత ఏడాది నుంచి గూగుల్ యాప్ చిత్రించడం మొదలు పెట్టింది. అందులో కనిపించిన ఒక ఫొటో చివరికి హత్య కేసు తాలూకు దోషుల్ని పట్టించింది.క్యూబాకు చెందిన జార్జి అనే 33 ఏళ్ల వ్యక్తి 2023 అక్టోబర్‌లో అదృశ్యమయ్యాడు. తానో మహిళను కలిశానని, స్పెయిన్ నుంచి వెళ్లిపోతున్నానని చివరిసారిగా బంధువుకు జార్జి ఫోన్ నుంచి మెసేజ్ వచ్చింది. తర్వాత అతడు కనబడకుండా పోవడంతో సదరు బంధువు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఒక వ్యక్తి తన కారు డిక్కీలోకి పెద్ద ప్లాస్టిక్ సంచిని లోడ్ చేస్తున్న చిత్రం ఇటీవల గూగుల్ స్ట్రీట్ వ్యూలో పోలీసుల కంట పడింది. అనుమానం వచ్చి విచారించగా ఓ మహిళ తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి జార్జిని హత్య చేసినట్లు తేలింది. దాంతో వారిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులిద్దరినీ రిమాండ్‌కు తరలించి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారని స్థానిక మీడియా వెల్లడించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ చదవండి: వింత ఆచారం.. నేలపై పాకుతూ వెళుతూ.. -
భావోద్వేగంతో‘బుల్’ గుడ్‌బై
22 గ్రాండ్‌స్లామ్‌లు... 36 మాస్టర్ సిరీస్–1000 ట్రోఫీలు... 25 ఏటీపీ–500 టైటిల్స్... 10 ఏటీపీ–250 టైటిల్స్... 2 ఒలింపిక్ స్వర్ణాలు... 209 వారాల పాటు వరల్డ్ నంబర్‌వన్...1250 రాకెట్లు...300 కిలోమీటర్ల స్ట్రింగ్...16500 మీటర్ల ఓవర్గ్రిప్... ఇదీ కోర్టులో రాఫెల్ నాదల్ టెన్నిస్ ప్రయాణం! సుదీర్ఘంగా సాగిన ఈ అద్భుత ప్రస్థానం ముగిసింది. స్వదేశంలో, సొంత అభిమానుల సమక్షంలో ‘స్పెయిన్ బుల్’ నాదల్ కెరీర్ చివరి మ్యాచ్ ఆడేశాడు. ఆఖరి పోరులో పరాజయం పలకరించినా... ఈ మ్యాచ్ తుది ఫలితంకంటే అతని నిష్క్రమణే టెన్నిస్ ప్రపంచాన్ని భావోద్వేగంలో ముంచింది... కన్నీళ్లపర్యంతమవుతూ నాదల్ అభిమాన ఆటకు గుడ్‌బై చెప్పాడు.మలాగా (స్పెయిన్): ప్రపంచ టెన్నిస్‌ను శాసించిన దిగ్గజాలలో ఒకడైన రాఫెల్ నాదల్ రెండు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. గతంలోనే ప్రకటించినట్లుగా డేవిస్‌కప్ టోర్నీలో జాతీయ జట్టుకు చివరిసారి ప్రాతినిధ్యం వహించిన తర్వాత అతను రిటైరయ్యాడు. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ 1–2తో నెదర్లాండ్స్ జట్టు చేతిలో ఓడిపోయింది. స్పెయిన్ తరఫున తొలి సింగిల్స్‌లో బరిలోకి దిగిన నాదల్‌పై 6–4, 6–4 స్కోరుతో బొటిక్ వాన్ డి జాండ్‌షుల్ప్ విజయం సాధించాడు. ఆ తర్వాత రెండో సింగిల్స్‌లో అల్కరాజ్ 7–6 (7/0), 6–3తో గ్రీక్స్పూర్ను ఓడించి 1–1తో సమం చేశాడు. నిర్ణాయక డబుల్స్ మ్యాచ్‌లో నెదర్లాండ్ జోడీ వాన్ డి జాండ్‌షుల్ప్–వెస్లీ కూల్‌హాఫ్ 7–6 (7/4), 7–6 (7/3) స్కోరుతో స్పెయిన్ ద్వయం అల్కరాజ్–మార్సెల్ గ్రానోలర్స్‌ను ఓడించింది. స్పెయిన్ నిష్క్ర మణతో నాదల్కు ఇదే చివరి పోరుగా మారింది. నాదల్ మ్యాచ్‌ను తిలకించేందుకు కుటుంబసభ్యులందరూ వచ్చారు. అంతా అతనే... మ్యాచ్ ఆరంభానికి ముందు స్పెయిన్ జాతీయగీతం ఆలపిస్తున్న సమయంలో 38 ఏళ్ల నాదల్ కన్నీళ్ల పర్యంతమయ్యాడు. సుమారు 10 వేల మంది ప్రేక్షకులతో స్టేడియం అంతా ఎరుపు వర్ణం పులుముకున్న తర్వాత అతను ఆటలోకి అడుగు పెట్టాడు. కోర్టులో ప్రతి షాట్‌కు అభిమానులు ‘రా...ఫా...రా...ఫా....’ అంటూ జేజేలు పలుకుతూ ప్రోత్సహిస్తుండగా అతను పోటీ పడ్డాడు. అయితే ఊహించినట్లుగానే గతంలోలా తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయిన అతను వరుస సెట్లలో ఓడిపోయాడు. నాదల్ కొట్టిన ఫోర్‌హ్యాండ్ నెట్‌ను తాకడంతో అతని ఓటమి ఖాయమైంది. స్పెయిన్ ఓటమి తర్వాత నాదల్ స్టేడియం అంతా కలియతిరిగాడు. ఆటగాళ్లు, కోచ్‌లను కౌగిలించుకొని భావోద్వేగభరితమైన అతను అభిమానుల చప్పట్ల హోరు మధ్య ప్రసంగం పూర్తి చేసుకొని వీడాడు.వరుసగా 19 ఏళ్ల పాటు...2024: 02023: 02022: 4 2021: 2 2020: 2 2019: 4 2018: 52017: 62016: 2 2015: 3 2014: 4 2013: 10 2012: 4 2011: 3 2010: 7 2009: 52008: 8 2007: 6 2006: 5 2005: 11 2004: 1 మొత్తం 92రాఫెల్ నాదల్ 2004లో తొలిసారి ఏటీపీ సింగిల్స్ టైటిల్ గెలిచాడు. పోలాండ్లోని సొపోట్ నగరంలో జరిగిన ఐడియా ప్రొకామ్ ఓపెన్ టోర్నీలో నాదల్ విజేతగా నిలిచాడు. ఆ ఏడాది నుంచి వరుసగా 19 ఏళ్లపాటు (2022 వరకు) నాదల్ కనీసం ఒక్క టైటిల్ అయినా సాధిస్తూ వచ్చాడు. గాయాల కారణంగా 2023లో, ఈ ఏడాది నాదల్ టైటిల్ గెలవలేకపోయాడు.అంకెల్లో నాదల్ కెరీర్1080 సింగిల్స్ విభాగంలో గెలిచిన మ్యాచ్‌లు 227 సింగిల్స్ విభాగంలో ఓడిన మ్యాచ్‌లు 910 ఏటీపీ ర్యాంకింగ్స్‌లో టాప్–10లో కొనసాగిన వారాలు 209 ప్రపంచ నంబర్‌వన్‌గా కొనసాగిన వారాలు 92 కెరీర్ మొత్తంలో నెగ్గిన సింగిల్స్ టైటిల్స్ 63 క్లే కోర్టులపై గెలిచిన సింగిల్స్ టైటిల్స్ 22 మొత్తం నెగ్గిన గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ (ఫ్రెంచ్ ఓపెన్: 14, ఆ్రస్టేలియన్ ఓపెన్: 2; వింబుల్డన్: 2, యూఎస్ ఓపెన్: 4) 2 గెలిచిన ఒలింపిక్స్ స్వర్ణాలు (2008 బీజింగ్ ఒలింపిక్స్ సింగిల్స్; 2016 రియో ఒలింపిక్స్‌లో డబుల్స్) 4 డేవిస్‌కప్ టీమ్ టైటిల్స్(2004, 2009, 2011, 2019)కెరీర్లో సంపాదించిన మొత్తం ప్రైజ్‌మనీ13,49,46,100 డాలర్లు (రూ. 1138 కోట్లు)భావోద్వేగాలను నియంత్రించుకోవడం కష్టంగా ఉంది. అయితే ప్రశాంతమైన మనసుతో వీడ్కోలు పలుకుతున్నా. నా విజయాల సంఖ్య, టైటిల్స్, రికార్డుల గురించి అందరికీ తెలుసు. అయితే ఒక చిన్న ఊరు మలొర్కా నుంచి వచ్చిన ఒక మంచి వ్యక్తిగా, తన కలలు నేర్చుకునేందుకు ఎంతో కష్టపడిన ఒక చిన్న కుర్రాడిగా నేను గుర్తుండిపోవాలని కోరుకుంటాను. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని. నా కెరీర్లో ఎంతో మంది మిత్రులను సంపాదించుకోగలిగాను. డేవిస్ కప్‌లో తొలి మ్యాచ్‌ను ఓటమితో మొదలు పెట్టిన నేను ఇప్పుడూ ఓడి ఎక్కడ మొదలు పెట్టానో అక్కడికే వచ్చాను. నా చివరి మ్యాచ్ చాలా కఠినంగా అనిపించింది. నిజానికి ఎవరూ ఇలాంటి క్షణం రావాలని కోరుకోరు. నేను టెన్నిస్ ఆడే విషయంలో అలసిపోలేదు. కానీ నా శరీరం అలసిపోయింది. ఇక ఆడటం సాధ్యం కాదని చెప్పేసింది. కాబట్టి నేను వాస్తవాన్ని అంగీకరించాలి. నిజాయితీగా చెప్పాలంటే ఒక హాబీగా మొదలు పెట్టిన ఆటలో ఇంత గొప్ప కెరీర్ నిర్మించుకోగలగడాన్ని నేను గొప్పగా భావిస్తున్నా. పైగా నేను ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువ కాలం ఆడగలిగాను. – వీడ్కోలు ప్రసంగంలో రాఫెల్ నాదల్ -
‘వరద’ వైఫల్యాలపై స్పెయిన్‌లో భారీ నిరసనలు
వరదల విషయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ స్పెయిన్‌లో లక్షలాది మంది రోడ్డెక్కారు. ముందస్తు హెచ్చరికలు జారీ చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహించారంటూ వాలెన్సియాలో శని, ఆదివారాల్లో ఆందోళనకు దిగారు. వాలెన్సియా రీజనల్ హెడ్ కార్లోస్ మజోన్ రాజీనామాకు డిమాండ్ చేశారు. దాదాపు 1,30,000 మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. వాలెన్సియా సిటీ హాల్‌ను బురదతో నింపేశారు. కురీ్చలు, వస్తువులకు నిప్పు పెట్టారు. పలుచోట్ల పోలీసులతో ఘర్షణకు దిగారు. వాలెన్సియా, పరిసర ప్రావిన్సుల్లో ఇటీవల కుండపోత వర్షాలకు వరద ముంచెత్తి 200 మందికి పైగా మరణించడం తెలిసిందే. 80 మందికి పైగా గల్లంతయ్యారు. వేలాది మంది నిర్వాసితులయ్యారు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ వీధులు బురద, శిథిలాల్లో కూరుకుపోయి ఉన్నాయి. స్పెయిన్ వాతావరణ సంస్థ అక్టోబర్ 25 నుంచే ఈ ప్రాంతానికి తుపాను హెచ్చరికలు జారీ చేసినా వరదలు మొదలయ్యే దాకా వాలెన్సియా అధికారులు ప్రజలను అప్రమత్తం చేయలేదు. వారి అలసత్వం వల్లే భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని జనం మండిపడుతున్నారు. గత వారం పైపోర్టా పట్టణాన్ని సందర్శించిన స్పెయిన్ రాజు, రాణిపైనా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. అనంతరం ప్రధాని పెడ్రో సాంచెజ్‌పై గుడ్లు తదితరాలు విసిరి నిరసన తెలిపారు. – వాలెన్సియా -
కిల్లర్స్.. గెటౌట్!
వాలెన్సియా: ఇటీవలి వరదల్లో తీవ్రంగా నష్టపోయిన వాలెన్సియా నగరంలో స్పెయిన్ రాజ దంపతులకు చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం వరద బాధిత ప్రాంతంలో పర్యటనకు వచి్చన రాజు ఫిలిప్ పైకి వరద బాధితులు బురద విసురుతూ దూషించారు. వాలెన్సియా శివారులోని పైపోరా్టకు చేరుకున్న సమయంలో రాజు వెంట ఉన్న ప్రభుత్వాధికారులు స్థానికులతో మాట్లాడుతుండగా, కొందరు బిగ్గరగా ‘గెటౌట్! గెటౌట్!, కిల్లర్స్!’అంటూ కేకలు వేశారు. రాచకుటుంబీకులు, అధికారులపైకి గుడ్లు, బురద విసిరేందుకు ప్రయతి్నంచగా రక్షక సిబ్బంది గొడుగులతో వారిని కాపాడారు. పోలీసులు నిరసనకారులను వెనక్కి నెట్టేశారు. ఈ సమయంలో కింగ్ ప్రశాంతంగా బాధితులతో సంభాíÙంచేందుకు ప్రయతి్నంచారు. ఓ వ్యక్తి ఆయన భుజంపై తల ఆనించి, రోదించారు. రాజు వెంట రాణి లెటిజియా, వాలెన్సియా ప్రాంత ప్రెసిడెంట్ కార్లో మజోన్ ఉన్నా రు. గ్లవుజులతోపాటు ముంజేతిపై పడిన బురదతోనే రాణి స్థానికులతో మాట్లాడారు. ప్రధాని పెడ్రో సాంచెజ్ రాజు వెంట ఉన్నదీ లేనిదీ తెలియరాలేదు. ఇటీవలి భీకర వరదల్లో 200మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ముందస్తు హెచ్చరికలు చేయడంలో ప్రభుత్వం విఫలమవ్వడం వల్లే ఇంతటి స్థాయిలో నష్టం జరిగిందని జనం ఆగ్రహంతో ఉన్నారు. -
ఇదేమీ రాజకీయ సభకాదు.. సాయం చేసేందుకు వచ్చిన ప్రభం‘జనం’
స్పెయిన్‌లో ఇటీవలి భారీ వర్షాలు, వరదల్లో 210 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, చాలా మంది జాడ తెలియకుండా పోయారు. ఒక్క వలెన్సియాలోనే 155 మంది చనిపోయారు. సునామీ స్థాయిలో సంభవించిన తుపాను కారణంగా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించడం తెలిసిందే. ప్రభుత్వం ఇక్కడ పెద్ద ఎత్తున సహాయక పనులకు చేపట్టింది. వేలాదిగా ఆర్మీని రంగంలోకి దించింది. వరదలతో దెబ్బతిన్న వలెన్సియా నగర వీధుల్లో పేరుకుపోయిన బురదను తొలగిస్తున్న ప్రజలు..సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటామంటూ స్వచ్ఛందంగా తరలివచ్చిన వారితో శుక్రవారం వలెన్సియాలోని సిటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కల్చరల్ కాంప్లెక్స్ ఆవరణ కిక్కిరిసిపోయిందిలా..! స్పెయిన్‌ను వణికించిన వరదలుభారీ వర్షంతో ఆకస్మికంగా సంభవించిన వరదలతో స్పెయిన్ అతలాకుతలమైంది. తూర్పు, దక్షిణ స్పెయిన్‌లో భారీ వర్షాలు పడటంతో వరదలు వచ్చాయి. తద్వారా భారీ సంఖ్యలో కుటుంబాలు వీధిన పడ్డాయి. వందల సంఖ్యలో మరణాలు చోటు చేసుకున్నాయి.ఆకస్మిక భారీ వరదలకు మృత్యువాత పడ్డ వారి సంఖ్య 210కి చేరింది. మృతదేహాలను సహాయ బృందాలు వెలికి తీయగా, శిథిలాలుగా మారిన ఇళ్లు, బురదలో మునిగిన వీధులు.. గల్లంతు అయిన వారి కోసం బంధువులు పడే ఆందోళనలతో ఎక్కడ చూసినా విషాద ఛాయలే కనిపిస్తున్నాయి. -
210కి పెరిగిన స్పెయిన్ వరద మృతులు
మాడ్రిడ్: స్పెయిన్‌లో ఆకస్మిక భారీ వరదలకు బలైన వారి సంఖ్య 210 దాటింది. చాలామంది గల్లంతయ్యారు. మృతదేహాలను సహాయ బృందాలు వెలికి తీస్తున్నాయి. శిథిలాలుగా మారిన ఇళ్లు, బురదలో మునిగిన వీధులు, నేలకూలిన చెట్లు, కూలిన విద్యుత్ లైన్లు, గల్లంతైనవారి గురించి ఆత్మీయుల ఆందోళనలు... ఇలా ఎక్కడ చూసినా ఈ విషాద దృశ్యాలే కనబడుతున్నాయి. ఆకస్మిక తుఫాను కలిగించిన భారీ నష్టం సునామీ అనంతర పరిణామాలను తలపిస్తోందని స్థానికులు వాపోతున్నారు.Rescuer rescuing a women and her pet dog from flooded area in Spain.There is severe flash floor occurred serval region in Spain. The worst affected area is Valencia which records highest rainfall in 28 years. The death toll from the flood in Valencia alone has risen to 92.… pic.twitter.com/nUOcwBM4nW— Eagle EyE (@mkh_nyn) October 31, 2024 🤯The worst flood in the last 37 years: at least 72 people died in Spain, dozens went missing, RTVE.Three days of mourning have been declared in the country. There is still no normal access to some areas. pic.twitter.com/KLQQSuniCa— Nurlan Mededov (@mededov_nurlan) October 30, 2024Catastrophic flooding in Spain.#Flood#Spain pic.twitter.com/32Vwotrv4F— Jennifer Coffindaffer (@CoffindafferFBI) October 30, 2024⚠️Devastating images aftermath flood in the Alfafar in the province of Valencia, Spain63 reported deaths so far in Spain due to catastrophic floods…#Valencia #Spain pic.twitter.com/rnsexKKI3P— Culture War (@CultureWar2020) October 30, 2024 -
స్పెయిన్‌లో వర్ష బీభత్సం
బార్సెలోనా: కుండపోత వర్షాలు, వడగళ్ల వానలతో స్పెయిన్ అతలాకుతలమవుతోంది. ఆకస్మిక వరదలు మంగళవారం దేశ దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించాయి. కనీసం 95 మందికి పైగా బలైనట్టు సమాచారం. ఒక్క వాలెన్సియా ప్రాంతంలోనే బుధవారం ఒక్క రోజే మృతుల సంఖ్య 62కు చేరినట్టు అధికారులు ధ్రువీకరించారు. ఇప్పటికే పలువురి మృతదేహాలు దొరికినట్టు తెలిపారు. ఎంతోమంది గల్లంతైనట్టు చెప్పారు. పలు ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. అక్కడ మరెంతో మంది మృత్యువాత పడ్డట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మృతుల భారీగా పెరిగేలా కనిపిస్తోంది. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో 320 మి.మీ. వర్షం పడింది! దాంతో మలగా నుంచి వాలెన్సియా దాకా ఎక్కడ చూసినా నదులుగా మారిన రోడ్లు, కూలిన గోడలు, కొట్టుకుపోతున్న కార్లతో ఎక్కడ చూసినా పరిస్థితి భీతావహంగా కనిపిస్తోంది. అపార్ట్మెంట్ల గ్రౌండ్ ఫ్లోర్లన్నీ నీట మునిగిపోయాయి. ఇళ్లలోని సామాన్లన్నీ వరద పాలై కొట్టుకుపోతున్నాయి. స్పెయిన్ ఇంతటి వరదల బారిన పడటం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. వరదలో చిక్కిన వారిని హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా కాపాడుతున్నారు. ప్రభావి త ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం అత్యవసర సైనిక బృందం నుంచి వెయ్యి మంది సిబ్బందిని నియోగించారు. ఎడతెరిపి లేని వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. గురువారం తీవ్ర వర్షసూచనలున్నాయి.This is SPAIN, most of you have been here.Demand #ClimateAction & don’t put up with #FossilFuel company misinformation.Flash floods in Spain leave at least 51 people dead.https://t.co/UEO9y7iPl3 pic.twitter.com/WqBikKltbM— Dr Jill Belch (@JillBelch) October 30, 2024రవాణా కుదేలుఆకస్మిక వరదల దెబ్బకు ఏకంగా పలు నదులపై బ్రిడ్జిలే కొట్టుకుపోయాయి. దాంతో స్పెయిన్ అంతటా రవాణా వ్యవస్థ కుదేలైంది. రైలు, విమాన సేవలు ప్రభావితమయ్యాయి. మలగా సమీపంలో 300 మంది పై చిలుకు ప్రయాణికులతో వెళ్తున్న హైస్పీడ్ ట్రెయిన్ పట్టాలు తప్పింది. దాంతో వాలెన్సియా అంతటా రెడ్ అలర్ట్ ప్రకటించారు. స్కూళ్లు, పార్కులను మూసేస్తున్నట్లు, క్రీడా కార్యక్రమాలను నిలిపేస్తున్నట్లు వాలెన్సియా సిటీ హాల్ తెలిపింది. అండలూసియాలో కొన్ని ప్రాంతాల్లో రెండో అతి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. వరదల్లో చాలా మంది గల్లంతయ్యారని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ అన్నారు. బాధితులను ఉద్దేశించి ఆయన టీవీలో మాట్లాడారు.నిన్నటిదాకా కరువు...స్పెయిన్ కొన్నేళ్లుగా తీవ్ర కరువు పరిస్థితుల బారిన పడింది. తాజాగా గత సీజన్లో కొనసాగిన కరువు దెబ్బ నుంచి ఇంకా తేరుకోనే లేదు. ఇంతలోనే ఇలా వరదలు వచ్చి పడ్డాయి. వెచ్చని మధ్యధరా జలాలపై చల్లని గాలి కారణంగా ‘కోల్డ్ డ్రాప్’తో ఏర్పడ్డ క్యుములోనింబస్ మేఘాలు ఈ ఆకస్మిక వర్షాలకు కారణమని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ మార్పుల వల్ల ఇలాంటి విపరీత సంఘటనలు తరచుగా, తీవ్రస్థాయిలో జరుగుతున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.SPAIN — The death toll from devastating flash floods in Spain’s eastern region of Valencia has risen to 51, with heavy rains submerging roads and sweeping away cars. The torrents, which followed an intense downpour, overwhelmed local infrastructure, turning town streets into… https://t.co/VwIMQh2FMq pic.twitter.com/yxHl0upKi8— News is Dead (@newsisdead) October 30, 2024క్రెడిట్స్: News is Dead Our thoughts are with Spain in the wake of the tragic flash floods. We extend our deepest condolences to those who have lost loved ones and express our gratitude to the rescuers working tirelessly to aid those affected. 🇪🇸 pic.twitter.com/c3RRSwH8OQ— EPP (@EPP) October 30, 2024 -
స్పెయిన్‌ను వణికిస్తున్న ఆకస్మిక వరదలు
మాడ్రిడ్ : భారీ వర్షానికి ఆకస్మికంగా సంభవించిన వరదలు స్పెయిన్ దేశాన్ని వణికిస్తున్నాయి. మంగళవారం తూర్పు, దక్షిణ స్పెయిన్‌లో కురిసిన భారీ వర్షం కారణంగా వరదలు సంభవించాయి. ఫలితంగా భారీ సంఖ్యలో కుటుంబాలు నిరాశ్రయిలయ్యాయి. పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి.ఓ వైపు వర్షం.. మరోవైపు వరద ధాటికి లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యాయి. వరదల్లో చిక్కుకున్న వారి జాడ కోసం బాధిత కుటుంబ సభ్యులు అన్వేషిస్తున్నారు. బురద నీరు ముంచెత్తడంతో రైలు, విమాన ప్రయాణాలకు అంతరాయం కలిగింది.దీంతో స్పెయిన్ ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రమాదంలో చిక్కుకున్న వారిని సంరక్షించేందుకు అత్యవసర సిబ్బంది రంగంలోకి దిగారు. డ్రోన్ల సాయంతో బాధితుల్ని గుర్తించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండగా.. తాజాగా, పదుల సంఖ్యలో మృతదేహాల్ని గుర్తించి బాధితుల కుటుంబాలకు సమాచారం అందించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.ఆకస్మిక వరదలపై ప్రధాన మంత్రి పెడ్రో శాంచెజ్ దేశ ప్రజల్ని అప్రమత్తం చేశారు. ప్రయాణాల్ని వాయిదా వేసుకోవాలని ఎక్స్ వేదికగా తెలిపారు. వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అత్యవసర సేవలు మినహా ఇతర అన్నీ రంగాలకు చెందిన కార్యకలాపాల్ని గురువారం వరకు మూసివేయాలని ఆదేశించారు. ఇక వరద ప్రభావాన్ని అంచనా వేసేలా కేంద్ర క్రైసిస్ కమిటీ ఉన్నతాధికారులకు ప్రధాని అప్రమత్తం చేశారు. -
ప్రతిష్టాత్మక బాలన్ డి'ఓర్ అవార్డు గెలుచుకున్న రోడ్రి
స్పానిష్ ఫుట్‌బాలర్, మాంచెస్టర్ సిటీ మిడ్ ఫీల్డర్ రోడ్రీ ప్రతిష్టాత్మక బాలన్ డి'ఓర్-2024 అవార్డు గెలుచుకున్నాడు. ఈ అవార్డు కోసం రోడ్రీతో రియల్ మాడ్రిడ్‌కు చెందిన వినిసియస్ జూనియర్, జూడ్ బెల్లింగ్హమ్తో పోటీ పడ్డారు. మాంచెస్టర్ సిటీ గత సీజన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ గెలవడంతో రోడ్రీ కీలకపాత్ర పోషించాడు. అలాగే స్పెయిన్ ఈ ఏడాది యూరో టైటిల్ గెలవడంలోనూ కీ రోల్ ప్లే చేశాడు. ఇంగ్లీష్ క్లబ్ నుంచి బాలన్ డి'ఓర్ అవార్డు గెలుచుకున్న తొలి ఫుట్‌బాలర్ రోడ్రీనే. మహిళల విషయానికొస్తే.. ఈ ఏడాది బాలన్ డి'ఓర్ అవార్డు స్పెయిన్ కే చెందిన ఐటానా బొన్మాటీకి దక్కింది. బొన్మాటీ బార్సిలోనా క్లబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తుంది. ఉత్తమ యువ ఫుట్‌బాలర్ అవార్డు విషయానికొస్తే.. ఈ అవార్డు లామిన్ యామల్‌కు దక్కింది. ఉత్తమ పురుషుల జట్టుగా రియల్ మాడ్రిడ్, ఉత్తమ మహిళల జట్టుగా బార్సిలోనా అవార్డులు దక్కించుకున్నాయి. పారిస్‌లో ఈ అవార్డుల ప్రధానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. -
రక్షణ రంగంలో కొత్త అధ్యాయం
వడోడర: భారత ప్రైవేట్ రక్షణ విమానయాన రంగంలో కొత్త అధ్యాయం ఆరంభమైంది. భారత్‌లోనే తొలి ప్రైవేట్ సైనిక, సరకు రవాణా విమానం తయారీ పనులు ప్రారంభమయ్యాయి. ఇందుకు గుజరాత్‌లోని వడోదర పట్టణంలోని టాటా ఎయిర్‌క్రాఫ్ట్ కాంప్లెక్స్ వేదికైంది. స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్‌తో కలిసి భారత ప్రధాని మోదీ సోమవారం ఈ ప్లాంట్‌లో సీ295 రకం సైనిక రవాణా విమాన తయారీని ప్రారంభించారు. అక్కడి విడిభాగాల ఎగ్జిబిషన్‌ను ఇరునేతలు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. ‘‘ భారత్, స్పెయిన్ భాగస్వామ్యం కొత్త మలుపులు తీసుకుంటోంది. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలు పటిష్టంచేయడమే కాకుండా మేకిన్ ఇండియా, మేక్ ఫర్ వరల్డ్ లక్ష్యాన్ని సాకారం చేస్తుంది. కొత్త ఫ్యాక్టరీని అందుబాటులోకి తెచి్చన ఎయిర్‌బస్, టాటా బృందాలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. భారత్‌లో విదేశీ సరకు రవాణా విమానం తయారీ కలను సాకారం చేసిన వ్యాపార జగజ్జేత రతన్ టాటాకు ఘన నివాళులు’’ అని అన్నారు. కొత్త పని సంస్కృతికి నిదర్శనం ‘‘ నూతన భారత దేశ కొత్తతరహా పని సంస్కృతికి సీ295 ఫ్యాక్టరీ ప్రతిబింబింగా నిలవనుంది. 2022 అక్టోబర్‌లో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన నాటినుంచి ఉత్పత్తిదాకా భారత వేగవంతమైన ఉత్పాదకతకు నిదర్శనం ఈ కర్మాగారం’’ అని మోదీ అన్నారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత స్పానిష్ రచయిత ఆంటోనియో మకాడో కవితలోని ‘మనం లక్ష్యం సాధించేందుకు ముందుకెళ్తుంటే మార్గం దానంతట అదే ఏర్పడుతుంది’ అనే వాక్యాన్ని మోదీ గుర్తుచేశారు. ‘‘కొత్తగా మొదలైన టాటా–ఎయిర్‌బస్ ఫ్యాక్టరీ ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయి. దేశీయంగా 18,000 విమాన విడిభాగాల తయారీని ఈ ఫ్యాక్టరీ సుసాధ్యం చేయనుంది. భవిష్యత్తులో భారత పౌరవిమానయాన రంగానికి అవసరమైన విమానాల తయారీకి ఈ ఫ్యాక్టరీ బాటలువేస్తోంది’’ అని మోదీ అన్నారు.స్పెయిన్‌లో యోగా, ఇండియాలో ఫుట్‌బాల్ ‘‘ఇరుదేశాల ప్రజల మధ్య బంధమే దేశాల మధ్య బంధాన్ని బలీయం చేస్తోంది. యోగా స్పెయిన్‌లో తెగ పాపులర్. ఇక స్పానిష్ ఫుట్‌బాల్‌ను భారతీయులూ బాగా ఇష్టపడతారు. ఆదివారం రియల్ మాడ్రిడ్‌తో మ్యాచ్ లో బార్సిలోనా బృందం సాధించిన ఘనవిజయం గురించి భారత్‌లోనూ తెగ చర్చ జరుగుతోంది. ఆహారం, సినిమా లు, ఫుట్‌బాల్.. ఇలా ప్రజల మధ్య బంధం దేశాల మధ్య పటిష్ట బంధానికి కారణం. 2026 ఏడాదిని ‘ఇండియా–స్పెయిన్ ఇయర్ ఆఫ్ కల్చర్, టూరిజం, ఏఐ’గా జరుపుకోవాలని నిర్ణయించుకోవడం సంతోషకరం’’ అని మోదీ అన్నారు.బంధం బలీయం: స్పెయిన్ అధ్యక్షుడు ‘‘1960లలోనే ప్రఖ్యాత స్పెయిన్ క్లాసిక్, జాజ్ సంగీత కళాకారుడు పాకో డిలూసియా, భారతీయ సంగీత దిగ్గజం పండిత్ రవిశంకర్ రెండు దేశాల సంగీత ప్రియులను ఒక్కటి చేశారు. పారిశ్రామిక అభివృద్ధి, స్నేహబంధాలకు ఈ ఫ్యాక్టరీ గుర్తుగా నిలుస్తుంది’ అని స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్ అన్నారు.40 విమానాల తయారీ ఇక్కడే ఎయిర్‌బస్ సీ295 రకం మధ్యశ్రేణి రవాణా విమానాన్ని తొలుత స్పెయిన్‌కు చెందిన సీఏఎస్ఏ ఏరోస్పేస్ సంస్థ డిజైన్చేసి తయారుచేసేది. ప్రస్తుతం ఇది యూరప్ బహుళజాతి ఎయిర్‌బస్ సంస్థలో భాగంగా ఉంది. యుద్ధంలో బాంబులతోపాటు అవసరమైన సందర్భాల్లో వైద్య పరికరాలు, విపత్తుల వేళ బాధితుల తరలింపునకు, తీరప్రాంతాల్లో గస్తీ, నిఘా కోసం సైతం పలురకాలుగా వినియోగించుకోవచ్చు. ఎయిర్‌బస్ సంస్థతో భారత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మొత్తంగా సీ295 రకం 56 విమానాలను సైన్యానికి అప్పగించనున్నారు. వీటిలో 16 విమానాలను స్పెయిన్‌లోని సవీలేలో తయారుచేసి ఎయిర్‌బస్ నేరుగా నాలుగేళ్లలోపు భారత్‌కు పంపనుంది. మిగిలిన 40 విమానాలను టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ వారి ఆధ్వర్యంలో వడోదరలోని తయారీయూనిట్లో తయారుచేస్తారు. -
స్పెయిన్ ప్రధానితో పీఎం మోదీ మెగా రోడ్ షో
వడోదర: స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ భారత్ పర్యటనలో ఉన్నారు. ఆయన సోమవారం గుజరాత్‌లోని వడోదర నగరానికి చేరుకున్నారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్‌లు వడోదర నగరంలో ఓపెన్ జీపులో రోడ్‌షో నిర్వహించి, రోడ్డు పక్కన నిలుచున్న ప్రజలకు అభివాదం చేశారు.వడోదర విమానాశ్రయం నుంచి నగరంలోని టాటా ఎయిర్‌క్రాఫ్ట్ కాంప్లెక్స్ వరకు 2.5 కి.మీ పొడవునా ఈ రోడ్ షో కొనసాగింది. అనంతరం ఇద్దరు ప్రధానులు టాటా ఎయిర్‌క్రాఫ్ట్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. మోదీ శాంచెజ్‌లు 'టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్' సెంటర్‌కి వెళ్లినప్పుడు కళాకారులు వారికి ఘన స్వాగతం పలికారు. ద్వైపాక్షిక సమావేశం కోసం లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌కు వెళ్లే ముందు ఇద్దరు నేతలు సంయుక్తంగా 'టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్' కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కాంప్లెక్స్‌ను సి-295 విమానాల తయారీ కోసం టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ నిర్మించింది. వడోదరలోని ఈ కాంప్లెక్స్‌లో 40 విమానాలను తయారు చేయనున్నారు. #WATCH | Vadodara, Gujarat: Prime Minister Narendra Modi, President of the Government of Spain, Pedro Sanchez hold a roadshow in VadodaraThe two leaders will inaugurate the Final Assembly Line Plant of C295 aircraft at Vadodara today(Source: ANI/DD News) pic.twitter.com/bLO4N4o0G0— ANI (@ANI) October 28, 2024భారతదేశంలో ఈ 40 విమానాలను తయారు చేసే బాధ్యత టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్‌కు అప్పగించారు. ఈ కాంప్లెక్స్ భారతదేశంలో సైనిక విమానాల కోసం మొదటి ప్రైవేట్ సెక్టార్ ఫైనల్ అసెంబ్లీ లైన్. ఇందులో విమానాల తయారీ, వాటి భాగాలను అసెంబ్లింగ్ చేయడం, వాటిని పరీక్షించడం వంటివి ఉంటాయి. అంతేకాకుండా విమానాల నిర్వహణకు అవసరమైన సౌకర్యాలు కూడా కల్పిస్తారు. కాగా లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌ను సందర్శించిన అనంతరం మోదీ అమ్రేలీకి వెళ్లనున్నారు. అక్కడ మధ్యాహ్నం 2:45 గంటలకు దుధాలలో భారత్ మాతా సరోవరాన్ని ప్రారంభించనున్నారు.ఇది కూడా చదవండి: మల్టీ-అసెట్ ఫండ్స్‌తో దీపావళి కాంతులు -
మిస్ యూనివర్స్ ట్రాన్స్ పోటీలో తెలుగు శాస్త్రవేత్త
పట్టుమని 200 కుటుంబాలు నివాసమున్న గ్రామం. నగర శివారులో ఉన్నా... కాంక్రీట్ జంగిల్ పోకడలు కనిపించవు. పదో తరగతి వరకూ గ్రామంలో బేల్దారి పనులు, నగరంలో పండ్ల విక్రయంతో తల్లిదండ్రులకు చేదోడు. చిరుప్రాయం నుంచే శారీరక మార్పులతో సహ విద్యార్థుల చిన్నచూపు. వ్యక్తి వెనుక సూటిపోటి మాటలు... అవమానకర వ్యాఖ్యలు. కట్ చేస్తే.. ప్రస్తుతం స్పెయిన్ దేశంలో ఫార్మా రంగ శాస్త్రవేత్త... ట్రాన్స్ఫ్యూజన్ శస్త్రచికిత్స తర్వాత ప్రపంచ దేశాలు గుర్తించేలా మిస్ వరల్డ్ రన్నరప్.. స్ఫూర్తిదాయక జీవనంతో పలువురికి ఆదర్శం. నవంబర్‌లో మిస్ యూనివర్స్ ట్రాన్స్ విజేత దిశగా అడుగులు. ఇది అనంతపురం జిల్లాకు చెందిన ట్రాన్స్‌జెండర్ హన్నా రాథోడ్ విజయ ప్రస్థానం. చదువుతో ఆమె సాధించిన ఒక్క గెలుపు కుటుంబాన్నే కాదు.. ఏకంగా జిల్లా కీర్తిప్రతిష్టలను పెంచింది. స్ఫూర్తిదాయకమైన ఆమె జీవనం ఆమె మాటల్లోనే... అనంతపురం రూరల్ పరిధిలోని సోములదొడ్డి గ్రామం. నాన్న మల్లేష్, అమ్మ పద్మావతికి మూడో సంతానంగా పుట్టాను. ఓ అన్న, అక్క ఉన్నారు. నాకు ఆనంద్‌బాబు అని పేరుపెట్టారు. అమ్మ, నాన్న అనంతపురం నగరంలోని తాడిపత్రి బస్టాండ్‌లో పండ్ల వ్యాపారం చేసేవారు. పేదరికం కారణంగా పస్తులతో గడిపిన రోజులెన్నో చూశా. దీంతో బడికి వెళ్లే సమయంలోనే ఏ మాత్రం వీలు చిక్కినా ఊళ్లో కూలి పనులకు, అమ్మ, నాన్నతో కలసి పండ్ల వ్యాపారం చేస్తూ వచ్చా. ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు నాలో శారీరక మార్పులు గుర్తించా. సమాజానికి తెలిస్తే బయటకు గెంటేసి హేళన చేస్తారేమోనని భయపడ్డా. దీంతో ఎవరితోనూ చెప్పుకోలేదు. చిన్న కొడుకు కావడంతో మా అమ్మ నన్ను ఎంతో గారాబంతో పెంచుతూ వచ్చింది. నా వెనుక గేలి చేసేవారు సమాజంలో ట్రాన్స్జెండర్లు ఎదుర్కొంటున్న వివక్ష నన్ను చాలా భయపెట్టేది. ఇలాంటి సమయంలో కేవలం చదువు ఒక్కటే నా సమస్యకు చక్కటి పరిష్కారమని గుర్తించాను. దీంతో పట్టుదలగా చదువుకుంటూ క్లాస్‌లో టాపర్‌గా నిలుస్తూ వచ్చా. ఇంటర్ వరకూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో తెలుగు మీడియం చదివిన నేను ఆ తర్వాత అనంతపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీ–ఫార్మసీ చేశా. అక్కడ చాలా మంది స్నేహితులు ఉండేవారు. వారిలో కొందరు నా ముందు ఏమీ అనకపోయినా... నా వెనుక చెడుగా మాట్లాడుకునేవారని తెలిసి బాధపడ్డాను. జన్యుపరమైన లోపాన్ని ఎవరూ గుర్తించలేదు. గేలి చేసినా కుంగిపోలేదు. పట్టుదలతో బీ–ఫార్మసీ, ఎం–ఫార్మసీ పూర్తి చేశా. పెళ్లి ప్రయత్నాల నుంచి బయటపడి ఎం–ఫార్మసీ పూర్తి చేసిన తర్వాత విదేశాల్లో ఎంఎస్ చేయాలని అనుకున్నా. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించలేదు. దీంతో అనంతపురంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా రెండేళ్లు పనిచేశా. అదే సమయంలో జూనియర్ ఫార్మసీ విద్యార్థులకు ట్యూషన్లు చెప్పడం ద్వారా వచ్చిన డబ్బును దాచుకుని విదేశీ విద్యావకాశాలపై అన్వేషిస్తూ వచ్చా. ఈ లోపు అనంతపురం కలెక్టరేట్లో ఉద్యోగం వచ్చింది. ఈ విషయం తెలియగానే చాలా మంది అమ్మాయిని ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అయితే పెళ్లి చేసుకుని ఆమె జీవితాన్ని నాశనం చేయకూడదని భావించిన నేను.. విదేశాలకు వెళ్లిపోతే పెళ్లి ప్రయత్నాలు వాయిదా పడతాయనుకున్నా. అదే సమయంలో విదేశీ విద్యావకాశాలపై అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీ పరీక్ష రాసి మెరుగైన ఫలితాలతో స్పెయిన్‌లో ఎంఎస్ సీటు దక్కించుకున్నా. కోర్సు పూర్తి కాగానే అక్కడే బయో ఇంజినీరింగ్ సొల్యూషన్స్‌లో శాస్త్రవేత్తగా పనిచేసే అవకాశం వచ్చింది. శాస్త్రవేత్తగా స్థిరపడిన తర్వాత 2021లో ట్రాన్స్ఫ్యూజన్ ఆపరేషన్ చేయించుకుని హన్నారాథోడ్గా పేరు మార్చుకుని ఇంట్లో వారికి విషయం చెప్పా. చదువే సెలబ్రిటీని చేసింది ట్రాన్స్జెండర్ల జీవితం ఎప్పుడూ సాఫీగా ఉండదు. మన వ్యక్తిత్వం చెదరకుండా కాపాడుకోవాలి. ఎలాంటి వ్యక్తికైనా ప్రతికూల కాలమంటూ ఉంటుంది. నిరాటంకంగా అవరోధాల్ని అధిగమించి విజయం సాధిస్తే ఈ సమాజమే గౌరవప్రదంగా చూస్తుంది. మనం కోరకుండానే వచ్చే జన్యుపరమైన లోపాలకు కుంగిపోరాదు. ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి, ధర్మాన్ని, దైవాన్ని నిందించడం కూడా పొరబాటే. అసలు ప్రతికూలతల్లో కూడా అనుకూలతను వెదికి అనుకూలంగా మలచుకునే యుక్తిని సాధించగలగాలి. అప్పుడే విజయం మన సొంతమవుతుంది. నా జీవితమే ఇందుకు నిదర్శనం. చదువే ననున్న సెలబ్రిటీని చేసింది. ఈ స్థాయికి నేను ఎదగడంలో ఎదుర్కొన్న కష్టాలు, బాధలు వివరిస్తూ తెలుగు, ఇంగ్లిష్, స్పానిష్ మూడు భాషల్లో పుస్తకం రచిస్తున్నా. త్వరలో ఈ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకువస్తా. మిస్ వరల్డ్ పోటీల్లో ప్రతిభ గతేడాది స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో మిస్ వరల్డ్ ట్రాన్స్–2023 పోటీలు జరిగాయి. అక్కడే పనిచేస్తున్న నాకు ఈ విషయం తెలిసి భారతదేశం తరఫున ప్రాతినిథ్యం వహించేందుకు దరఖాస్తు చేసుకున్నా. దీంతో నిర్వాహకులు అవకాశం ఇచ్చారు. ఈ పోటీలో ఏకంగా రన్నరప్‌గా నిలవడంతో నాలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. దీంతో సేవా కార్యక్రమాలు చేపట్టి ట్రాన్స్ సమాజంలో సమూల మార్పులు తీసుకురావాలని భావించాను. ఆ దిశగా తొలి ప్రయత్నం చేశాను. ఇందుకోసం స్పెయిన్‌లోని కొన్ని కంపెనీలతో సంప్రదింపులు కూడా జరిపాను. ట్రాన్స్ సమాజంలో దుర్భర జీవితం గడుపుతున్న వారి సంక్షేమానికి తమ వంతు సహకారం అందిస్తామని కంపెనీ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ఏడాదికి సంబంధించి నవంబర్‌లో న్యూఢిల్లీలో మిస్ యూనివర్స్ ట్రాన్స్ పోటీల్లో ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కింది. ఈ పోటీల్లో పాల్గొనడానికే ఇండియాకు వచ్చా. ఇక్కడ మా ఊరి ప్రజలు నన్ను చూసి చాలా సంతోష పడ్డారు. ప్రతి ఒక్కరూ నన్ను ఆశీర్వదించారు. ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా నేనే చీఫ్ గెస్ట్. ఇంతకంటే గౌరవం ఏమి కావాలి? -
రిటైర్మెంట్ ప్రకటించిన టెన్నిస్ దిగ్గజం
టెన్నిస్ దిగ్గజం, స్పానిష్ బుల్ రఫెల్ నదాల్ ప్రొఫెషనల్ టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పాడు. ఈ విషయాన్ని అతను సోషల్‌మీడియా ద్వారా షేర్ చేశాడు. తన కెరీర్ మొత్తంలో మద్దతుకు నిలిచిన వారికి నదాల్ కృతజ్ఞతలు తెలిపాడు. నదాల్ వచ్చే నెలలో (నవంబర్) జరుగబోయే డేవిస్ కప్‌లో చివరిసారి స్పెయిన్ తరఫున బరిలోకి దిగనున్నట్లు ప్రకటించాడు. 38 ఏళ్ల నదాల్ తన సుదీర్ఘ కెరీర్లో 22 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించాడు. నదాల్‌కు మట్టి కోర్టు వీరుడిగా పేరుంది. నదాల్ సాధించిన గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ఆస్ట్రేలియా ఓపెన్ (2009, 2022)-2ఫ్రెండ్ ఓపెన్ (2005, 2006, 2007, 2008, 2010, 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019, 2020, 2022)- 14వింబుల్డన్ (2008, 2010)-2యూఎస్ ఓపెన్ (2010, 2013, 2017, 2019)-4 -
పదకొండేళ్ల తర్వాత ప్రపంచం ముందుకు షూమాకర్!
రేసింగ్ రారాజు మైకేల్ షూమాకర్ పదకొండేళ్ల తర్వాత తొలిసారి బయట కనిపించినట్లు సమాచారం. తన కూతురు గినా పెళ్లి సందర్భంగా ఈ దిగ్గజ డ్రైవర్ ప్రపంచం ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. యూకేకు చెందిన మెట్రో సైట్ ఈ విషయాన్ని వెల్లడించింది. కాగా ఏడుసార్లు ఫార్ములా వన్ చాంపియన్‌గా నిలిచిన షూమాకర్ 2013లో ఘోర ప్రమాదానికి గురయ్యాడు.ఫ్రాన్స్‌లో ఆల్ఫ్ పర్వతాల్లో కుటుంబంతో కలిసి స్కీయింగ్ చేస్తుండగా.. పట్టుతప్పి పడిపోయాడు. ఈ క్రమంలో బండరాయికి తల బలంగా తగలడంతో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లాడు. పేరుకు బతికి ఉన్నాడే గానీ పూర్తిగా అచేతనంగా మారిపోయాడు. ఆ తర్వాత అతడి మళ్లీ పూర్తిస్థాయిలో కోలుకోనే లేదనే వార్తలు వచ్చాయి.అయితే, తాజాగా తన కుమార్తె గినా వివాహ బంధంలో అడుగుపెడుతున్న వేళ షూమాకర్ బయటకు వచ్చినట్లు కథనాలు రావడం అతడి అభిమానులకు ఊరటనిచ్చాయి. కాగా గినా అథ్లెట్. గుర్రపుస్వారీలో ఆమెకు అనుభవం ఉంది. ఇక గినా పెళ్లి విషయానికొస్తే.. తన చిరకాల స్నేహితుడు ఇయాన్ బెత్కెను ఇటీవలే వివాహమాడింది. మూడు రోజుల క్రితం ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె షేర్ చేసింది.అయితే, అందులో షూమాకర్ సహా మిగతా కుటుంబ సభ్యులెవరూ లేకపోవడం గమనార్హం. ఇక స్పెయిన్‌లోని మాలోర్కాలో గల లగ్జరీ విల్లాలో గినా వెడ్డింగ్ జరిగినట్లు తెలుస్తోంది. కాగా జర్మనీకి చెందిన 55 ఏళ్ల షూమాకర్ కుమారుడు మిక్ షూమాకర్ కూడా ఎఫ్1 రేసింగ్‌లో పాల్గొన్నాడు. -
వింత ఉద్యోగం: పెళ్లిళ్లు చెడగొట్టడమే పని, భారీ ఆదాయం కూడా!
సమాజంలో ఒకపుడు పెళ్ళిళ్ల పేరయ్యలకు, ఇపుడు మ్యారేజ్ బ్యూరోలకున్న క్రేజ్ ఏపాటిదో అందరికీ తెలిసిందే. వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలనేది మ్యారేజ్ బ్రోకర్స్ ఆచరించే కామన్ సూత్రం. ప్రస్తుతం ఇదో పెద్ద వ్యాపారంగా మారిపోయింది. కానీ డబ్బులు తీసుకొని మరీ పెళ్లిళ్లను చెడగొట్టే (మ్యారేజ్ బ్రేకింగ్) ఉద్యోగం గురించి విన్నారా? ఇలాంటి జాబ్కూడా ఒకటి ఉందా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే మీరీ కథనాన్ని చదవాల్సిందే!కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు ప్రపంచంలోని వివిధ రకాల ఉద్యోగాల గురించి విన్నాం. వీటిలో కొన్ని సాధారణ ఉద్యోగాలు మరికొన్ని విచిత్రమైనవి, గొప్పవి, గౌరవనీయమైనవి, కష్టతరమైనవి ఇలా రకరకాలు. కానీ స్పెయిన్ దేశానికి చెందిన ఎర్నెస్టో (Ernesto ) అనే వ్యక్తి ఒక వింత పనిలో బిజీగా ఉన్నాడు. అంతేకాదు ఇందుకు భారీగా డబ్బులు కూడా సంపాదిస్తున్నాడు. ఆడిటీ సెంట్రల్ వెబ్సైట్ ప్రకారం ఈ విచిత్రమైన జాబ్ గురించి ఎర్నెస్టో స్వయంగా సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. దీంతో ఇదేం చోద్యం రా బాబూ అంటూ నెటిజనులు విస్తుపోతున్నారు. దీంతో ఇతగాడు స్పెయిన్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాడు.డబ్బు కోసమే ఈ పనిచేస్తున్నా కొంతమంది పెళ్లి తరువాత సుఖంగా కాపురాలు చేసుకుంటోంటే, మరి కొంతమందికి మాత్రం అదొక పీడకలగా మారిందట. అందుకే చాలా మంది క్లయింట్లు తమ మ్యారేజ్‌ని బ్రేక్ చేయమని తనను ఆశ్రయిస్తున్నారని చెబుతున్నాడు ఎర్నెస్టో. ఇందులో తన ఖాతాదారులనుంచి కనీసం రూ. 46,135 వసూలు చేస్తాడు. పెళ్లి ఎలా చెడగొడతాడంటేఫీజు తీసుకున్న తర్వాత రోజునుంచి మనోడి పని షురూ అవుతుంది. అమ్మాయి, అబ్బాయి వివరాలు తీసుకుంటాడు. సరిగ్గా పెళ్లి జరుగుతున్న సమయానికి అక్కడ వాలిపోతాడు. అతిథులందరి ముందు అమ్మాయి లేదా అబ్బాయి ఇద్దరిలో ఒకర్ని ప్రేమిస్తున్నట్లు నటిస్తాడు. పారిపోదాం రమ్మంటూ ఆస్కార్ లెవల్లో నటిస్తూ నానా హంగామా చేస్తాడు. దెబ్బకి పెళ్లికి కేన్సిల్. క్లయింట్ ఖుష్.అదిరిపోయే ట్విస్టు కూడా ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. ఈ సమయంలోఅవతలివాళ్లు ఇతడిని కొట్టినా, చెంపదెబ్బ కొట్టినా అదనపు ఛార్జీ చెల్లించుకోవాలి. ప్రతి స్లాప్కి,4600 రూపాయలు అదనంగా తీసుకుంటాడు. అందుకే ఎక్కువ దెబ్బలు తినే ప్రయత్నం చేస్తాడట. చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు తనను ఈ పని చేయమని వేడుకుంటారని చెబుతున్నాడు ఎర్నెస్టో. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పెళ్లిళ్ల సీజన్లో మనోడి డిమాండ్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుందట.ఇదీ చదవండి : డ్రీమ్ వెడ్డింగ్: భారతీయ దుస్తులతో అమెరికాలో ఘనంగా, ఫోటోలు వైరల్ -
స్పెయిన్‌కు పరారైన... వెనిజులా విపక్ష నేత
వెనిజులాలో నికొలస్ మదురో నియంత పాలనకు ముగింపు ఖాయమని ఆశించిన ఆ దేశ ప్రజలకు మరింత నిరాశ కలిగించే పరిణామమిది. అధ్యక్ష ఎన్నికల్లో విపక్షాల సంయుక్త అభ్యరి్థగా మదురోతో తలపడ్డ ఎడ్మండో గొంజాలెజ్ తాజాగా దేశం వీడి స్పెయిన్‌లో ఆశ్రయం పొందారు. జూలైలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో వాస్తవ విజేత గొంజాలెజేనని విపక్షాలతోపాటు పలు విదేశీ ప్రభుత్వాలు కూడా పేర్కొనడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. గొంజాలెజ్‌కు ఆశ్రయం కలి్పంచేందుకు స్పెయిన్ అంగీకరించిందని వెనిజులా ఉపాధ్యక్షుడు డెల్సీ రొడ్రిగెజ్ ప్రకటించారు. దీనిపై గొంజాలెజ్ గానీ ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడో గానీ స్పందించలేదు. ఎన్నికల్లో పోటీ చేయకుండా మచాడోపై మదురో ప్రభుత్వం నిషేధం ప్రకటించడంతో ఆఖరి దశలో గొంజాలెజ్ రంగంలోకి దిగడం తెలిసిందే. అయితే, వెనిజులా వీడాలన్నది గొంజాలెజ్ నిర్ణయం మాత్రమేనని, తాము పంపిన ఎయిర్‌ఫోర్స్ విమానంలో తమ దేశం చేరుకున్నారని స్పెయిన్ ప్రభుత్వం తెలిపింది. ఆయన వినతి మేరకే ఆశ్రయం కలి్పంచామని స్పెయిన్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయెల్ అల్బారెస్ చెప్పారు. ‘వెనిజులా ప్రజల హక్కుల కాపాడటానికి కట్టుబడి ఉన్నాం. గొంజాలెజ్ వెనిజులా హీరో. ఆయన భద్రత బాధ్యతను స్పెయిన్ తీసుకుంటుంది’ అని స్పష్టం చేశారు. వెనిజులాకు రావడానికి కొద్ది రోజుల ముందే రాజధాని కారకాస్‌లోని తమ రాయబార కార్యాలయంలో గొంజాలెజ్ తలదాచుకున్నారని వెల్లడించారు. ఓటరు జాబితాను ఫోర్జరీ చేశారంటూ వచి్చన ఆరోపణలపై విచారణకు రావాలంటూ మూడు పర్యాయాలు సమన్లు పంపినా హాజరు కాలేదని దేశ అటార్నీ జనరల్ గొంజాలెజ్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. దీంతో, ఆయన స్పెయిన్ రాయబార కార్యాలయంలో తలదాచుకోవాల్సి వచి్చంది. మడురో నిరంకుశ విధానాలతో ఇప్పటికే పలువురు ప్రతిపక్ష నేతలు స్పెయిన్‌లో ఆశ్రయం పొందారు. ఈ ఏడాదిలో మొదటి ఆరు నెలల్లోనే దాదాపు 45 వేల మంది వెనిజులా నుంచి స్పెయిన్‌కు వలస వెళ్లారు. 2022 గణాంకాల ప్రకారం వెనిజులా వాసులు కనీసం 2.12 లక్షల మంది స్పెయిన్‌లో ఉంటున్నారు. – కారకాస్ -
అలనాటి అద్భుతం.. 5,600 ఏళ్ల నాటి సమాధుల దిబ్బ
కొత్త రాతియుగానికి చెందిన సమాధుల దిబ్బ ఒకటి స్పెయిన్‌లో వెలుగు చూసింది. 5,600 ఏళ్ల నాటి ఈ కట్టడంలో అత్యంత భారీ పరిమాణంలో ఉన్న 32 ఏక శిలలను ఉపయోగించడం విశేషం! అవి ఒక్కోటీ కనీసం రెండు జెంబో జెట్ విమానాలంత తూగుతాయట. కొత్త రాతియుగం నాటి అద్భుతంగా చెప్పుకునే బ్రిటన్‌లోని స్టోన్‌హెంజ్‌లో వాడిన రాళ్లకంటే ఇవి పరిమాణంలో చాలా పెద్దవి. వీటిలో అతి పెద్ద రాయి అయితే ఏకంగా 150 టన్నుల బరువుంది. ఇది అతి పెద్ద జీవి అయిన నీలి తిమింగలం బరువుతో సమానం. స్టోన్‌హెంజ్‌లోని అతి పెద్ద శిల కంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ! ఇక 32 రాళ్లూ కలిపి 1,140 టన్నులుంటాయట. ఇవి సగటున 25 మీటర్ల ఎత్తు, 5 మీటర్ల వెడల్పుతో ఉన్నాయి. ఇది దక్షిణ స్పెయిన్‌లోని మెంగా ప్రాంతంలో ఒక చిన్న గుట్టపై ఉన్న ఈ కట్టడాన్ని మెంగా డోల్మెన్గా పిలుస్తున్నారు. అంటే సమాధుల దిబ్బ అని అర్థం. అయితే ఇది సమాధి కాకపోవచ్చని, బహుశా ప్రార్థనా స్థలం కావచ్చని కూడా ఒక అభిప్రాయముంది. నిర్దిష్టమైన వరుసలో రాళ్లను నిటారుగా నిలిపి, వాటిపై రాళ్లను పరచడం ద్వారా దీన్ని నిర్మించారు. ఇంత భారీ శిలలను గుట్టపైకి తీసుకెళ్లేంతటి ఇంజనీరింగ్ పరిజ్ఞనం ఆనాటి మనుషులకు ఎలా తెలుసన్నది అంతుచిక్కడం లేదన్నారు స్పెయిన్‌లోని సెవిల్లే యూనివర్సిటీ పూర్వచరిత్ర విభాగ ప్రొఫెసర్ లియొనార్డో గ్రాకా సంజున్. దీనిపై వెలువరించిన పరిశోధన పత్రానికి ఆయన సహ రచయిత. ఈ పేపర్‌ను జర్నల్ సైన్స్‌లో తాజాగా ప్రచురించారు. ‘‘ఇది ప్రపంచంలోని పురాతన రాతి కట్టడాల్లోకెల్లా అతి గొప్ప అద్భుతం. కొత్త రాతియుగపు మానవుల శాస్త్ర సాంకేతిక ప్రజ్ఞకు అత్యుత్తమ తార్కాణం’’ అని పరిశోధన బృందం అంటోంది. ‘‘మనిషి అప్పుడప్పుడే వ్యవసాయం నేర్చుకుంటున్నాడు. అన్ని అవసరాలకూ రాతినే వాడుతున్నాడు. లోహపు పనిముట్ల కాలం ఇంకా రాలేదు. మనిషి కనీసం భాష కూడా నేర్వని కాలమది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుంటే ఈ డోల్మెన్ నిర్మాణం ఎంత గొప్ప ఘనతో అర్థమవుతుంది’’ అని చెప్పుకొచి్చంది. వారికి అప్పటికే రాళ్ల లక్షణాలు, కోణాలతో పాటు భౌతిక శాస్త్రం గురించిన అవగాహన కూడా ఉండి ఉంటుందని సైంటిస్టులు అంటున్నారు.కచ్చితమైన కొలతలు..ఈ నిర్మాణంలో చుట్టూ నిటారుగా పేర్చిన రాళ్లు లోపలివైపుకు నిర్దిష్ట కోణంలో వాలి ఉన్నాయి. దాంతో లోపలి ఖాళీ భాగం కింద విశాలంగా, పైకప్పుకు వెళ్లేకొద్దీ చిన్నగా ఉంది. వాటిపై ఐదు భారీ రాళ్లను పైకప్పుగా పరిచారు. ఎండ, వాన, చలి వంటివాటిని తట్టుకునేందుకు వీలుగా రాళ్ల మధ్య దట్టమైన మట్టి పూత పూశారు. ‘‘కొలతలన్నీ కచ్చితత్వంతో కూడుకుని ఉన్నాయి. ఇలా కట్టాలంటే సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అనేక పరికరాలు కూడా తప్పనిసరి’’ అని పరిశోధన బృందం చెప్పుకొచి్చంది. నిర్మాణంలో వాడిన రాళ్లను అక్కడికి 850 మీటర్ల దూరంలోని క్వారీ నుంచి తొలిచి తరలించినట్టు తేల్చారు. -
‘భారత్‌కు స్వదేశీ కోచ్ ఉంటేనే మేలు’
న్యూఢిల్లీ: భారత ఫుట్‌బాల్ జట్టుకు భవిష్యత్తులో స్వదేశీ కోచ్ ఉంటేనే బాగుంటుందని భారత జట్టు కొత్త హెడ్ కోచ్ మనొలొ మార్క్వెజ్ అభిప్రాయపడ్డారు. ఇగోర్ స్టిమాక్ స్థానంలో స్పెయిన్‌కు చెందిన 55 ఏళ్ల మార్క్వెజ్ను ఇటీవల హెడ్ కోచ్‌గా నియమించారు. ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘స్పెయిన్ తర్వాత ఎక్కువగా గడిపింది భారత్‌లోనే. అందుకేనేమో కొన్నేళ్ల క్రితం భారత్‌కు హెడ్ కోచ్ కావాలని గట్టిగా అనుకున్నాను. అది అప్పుడు కల. కానీ ఇప్పుడు ఆ కల నిజమైనందుకు ఆనందంగా ఉంది’ అని అన్నారు. అయితే భారత్ భిన్న రాష్ట్రాల సమ్మిళితం కాబట్టి స్వదేశీ కోచ్ ఉంటేనే బాగుంటుందని, స్థానిక భాషలు, అంశాలపై ఆయనకు పట్టు ఉంటుందని మార్క్వెజ్ వివరించారు. ‘భారత్ కోచ్‌గా జట్టు స్థాయి పెంచడమే మా లక్ష్యం. వ్యక్తిగతంగా ఆటగాళ్లు, సమష్టిగా జట్టు మెరుగయ్యేందుకు ప్రణాళికలు రచిస్తాం. ఇప్పటికిప్పుడు దీని ఫలితాలు రాకపోవచ్చు. దీనికి కొంత సమయం పడుతుంది. ప్రస్తుత లక్ష్యమైతే ఆసియా కప్–2027కు అర్హత సాధించడం. ఆసియా కప్ క్వాలిఫయర్స్‌కు ముందు భారత్ ఆరేడు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతుంది’ అని అన్నారు. -
‘బ్లీడింగ్ ఐస్’ వ్యాధి అంటే..! సోకితే అంతేనా..!
కొన్ని రకాల వ్యాధులు చాపకింద నీరులా నెమ్మదిగా వస్తాయి. మనం కూడా పెద్ద సమస్య కాదని, లైట్‌గా తీసుకుంటాం. అది కాస్త మనం చూస్తుండగానే సీరియస్‌గా మారి ప్రాణాంతకంగా మారుతుంది. అలాంటి వ్యాధి బారినపడి ఇక్కడొక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన స్పెయిన్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..స్పెయిన్‌లో 74 ఏళ్ల వ్యక్తి ప్రాణాంతకమైన క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్(సీసీహెచ్ఎఫ్) బారిన పడి మరణించాడు. దీనిని "బ్లీడింగ్ ఐస్ వ్యాధి" అని కూడా పిలుస్తారు. ఇది వైరల్ వ్యాధి. దీని కారణంగా మరణాల రేటు సుమారు 40% వరకు ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. ఆ వ్యక్తి మాడ్రిడ్‌కు నైరుతి దిశలో వంద మైళ్ల దూరంలో ఉన్న టోలెడోలో టిక్ కాటుకు గురవ్వడంతో జూలై 19న మోస్టోల్స్ ప్రాంతంలోని రే జువాన్ కార్లోస్ విశ్వవిద్యాలయ ఆస్పత్రిలో చేరాడు. అక్కడ వైద్యులు అతడి పరిస్థితిని గుర్తించిన తర్వాత హై-డిపెండెన్సీ ఐసోలేషన్ యూనిట్‌కు తరలించారు. మొదట్లో పరిస్థితి నిలకడగా ఉన్నా..తర్వాత.. తర్వాత అతడి పరిస్థితి క్షీణించి మరణించడం జరిగింది. దీన్ని క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్(సీసీహెచ్ఎఫ్) సంబంధిత మరణంగా పేర్కొన్నారు. అంతేగాదు వైద్యులు అప్రమత్తమై ఈ ప్రమాదకరమైన వైరస్ వ్యాప్తిని అరికట్టేలా తదుపరి కేసుల్లో ఈ పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేలా పలు జాగ్రత్తలు తీసుకున్నారు. వైద్యులు ఈ టిక్ బోర్న్ వ్యాధి ఎబోలా మాదిరిగా ఉంటుందని, డబ్ల్యూహెచ్ఓ జాబితా చేసిన తొమ్మిది వ్యాధికారక క్రిములకు సంబంధించినదని, అంటువ్యాధిలాంటిదని వెల్లడించారు. క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్ అంటే..క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్ (CCHF) అనేది టిక్ కాటు ద్వారా మానవులకు వ్యాపించే అరుదైన వైరల్ వ్యాధి. జంతువులను వధించిన వెంటనే, తక్షణమే వైరమిక్ జంతు కణజాలాలతో (వైరస్ రక్తప్రవాహంలోకి ప్రవేశించిన జంతు కణజాలం) సంపర్కం ద్వారా ఇది సంక్రమిస్తుంది. ఇది అంటువ్యాధులకు కారణమవుతుంది. ఈ వ్యాధి ఎక్కువగా ఆఫ్రికా, బాల్కన్లు, మధ్యప్రాచ్యం, ఆసియాలలో ఉంది.ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఈ వ్యాధిని తొలిసారిగా 1944లోక్రిమియన్ ద్వీపకల్పంలో గుర్తించారు. అందువల్లే దీనికి క్రిమియన్ హెమరేజిక్ ఫీవర్ అని వైద్యులు నామకరణం చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ వ్యాధిని 1956లో కాంగో బేసిన్లో గుర్తించడం జరిగింది. దీంతో ఈ వ్యాధికి ఈ రెండు ప్రాంతాల మీదుగా క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్ అనే పేరుని పెట్టారు నిపుణులు.ఈ వ్యాధి లక్షణాలు..తీవ్ర జ్వరంతీవ్రమైన తలనొప్పివెన్ను, కీళ్ల నొప్పులుకడుపు నొప్పి, వాంతులుఎర్రటి కళ్ళు , ఎర్రబడిన ముఖంనోటి పైకప్పు మీద ఎర్రటి మచ్చలుకామెర్లుమానసిక స్థితి, ఇంద్రియ అవగాహనలో మార్పులుఆందోళననిద్రమత్తురక్తస్రావం.సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకారం..ఆస్పత్రిలో చేరిని వారిలో దాదాపు 50% మంది మరణిస్తారని పేర్కొంది. నివారణటిక్ కాటును నివారించడానికి డీఈఈటీ కలిగిన క్రిమి వికర్షకాన్ని ఉపయోగించండి.సీసీహెచ్ఎఫ్ ఉన్న జంతువులను నిర్వహించేటప్పుడు చేతి తొడుగులు, పొడవాటి చేతులు, ప్యాంటు ధరించండి.సోకిన జంతువులు లేదా వ్యక్తుల శరీర ద్రవాలు మీపై ప్రసరించకుండా జాగ్రత్త పడండి. (చదవండి: అక్కడ భర్త జీతం అంతా భార్య చేతిలో పెట్టాల్సిందేనట..!) -
భారత ఫుట్‌బాల్ టీమ్ హెడ్ కోచ్‌గా మనోలో మార్క్వెజ్
భారత ఫుట్‌బాల్ టీమ్‌కు కొత్త కోచ్ వచ్చాడు. స్పెయిన్‌కు చెందిన మనోలో మార్క్వెజ్ను టీమ్ హెడ్ కోచ్‌గా నియమిస్తున్నట్లు అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) శనివారం ప్రకటించింది. 55 ఏళ్ల మార్క్వెజ్ ప్రస్తుతం ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) టీమ్ ఎఫ్‌సీ గోవాకు కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.అయితే 2024–25 సీజన్లో ఆయన ఇటు భారత జట్టుతో పాటు అటు ఎఫ్‌సీ గోవా కోచ్‌గా కూడా రెండు బాధ్యతలను నిర్వర్తిస్తారని ఏఐఎఫ్ఎఫ్ వెల్లడించింది. కోచ్‌గా యూఈఎఫ్ఏ ప్రొ లైసెన్స్ ఉన్న మార్క్వెజ్ పదవీకాలంపై ఫెడరేషన్ ఎలాంటి స్పష్టతనివ్వలేదు.వియత్నాం, లెబనాన్లతో వచ్చే అక్టోబరులో జరిగే మూడు దేశాల టోర్నీనుంచి కొత్త కోచ్ బాధ్యతలు స్వీకరిస్తారు. 2020 నుంచి భారత్‌లో మార్క్వెజ్ కోచింగ్ కొనసాగుతోంది. ఎఫ్‌సీ గోవాకు కోచ్‌గా మారక ముందు ఐఎస్ఎల్లో ఆయన హైదరాబాద్ ఎఫ్సీకి కోచ్‌గా పని చేశారు.మార్క్వెజ్ నేతృత్వంలోనే 2021–22లో హైదరాబాద్ ఐఎస్ఎల్ చాంపియన్‌గా నిలవడం విశేషం. స్పెయిన్‌లో కోచ్‌గా మార్క్వెజ్ అపార అనుభవం ఉంది. పలు స్థానిక క్లబ్‌లతో పాటు లా లిగా జట్టు లాస్ పామాస్కు కూడా కోచ్‌గా పని చేశారు. -
Euro Cup: ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన స్పెయిన్.. తొలి జట్టుగా
పుష్కర కాలం తర్వాత స్పెయిన్ జట్టు అంతర్జాతీయ ఫుట్‌బాల్ వేదికపై మళ్లీ మెరిసింది. ప్రతిష్టాత్మక ‘యూరో’ టోర్నీలో స్పెయిన్ రికార్డుస్థాయిలో నాలుగోసారి చాంపియన్‌గా నిలిచింది. అంతేకాదు రెండు అత్యంత అరుదైన రికార్డులు తన పేరిట లిఖించుకుంది.భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన ఫైనల్లో అల్వారో మొరాటో సారథ్యంలోని స్పెయిన్ 2–1 గోల్స్ తేడాతో ఇంగ్లండ్ జట్టును ఓడించింది. స్పెయిన్ తరఫున నికో విలియమ్స్ (47వ ని.లో), మికెల్ ఒయర్జబాల్ (86వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... ఇంగ్లండ్ జట్టుకు పాల్మెర్ (73వ ని.లో) ఏకైక గోల్ అందించాడు.ఆట 68వ నిమిషంలో కెప్టెన్ అల్వారో మొరాటో స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన ఒయర్జబాల్ సహచరుడు మార్క్ కుకురెల్లా క్రాస్ పాస్‌ను లక్ష్యానికి చేర్చి స్పెయిన్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 90వ నిమిషంలో ఇంగ్లండ్ ప్లేయర్ మార్క్ గుయెహి హెడర్ షాట్‌ను గోల్ పోస్ట్ ముందు స్పెయిన్ డిఫెండర్ డాని ఓల్మో హెడర్ షాట్‌తో అడ్డుకోవడం కొసమెరుపు.తొలి జట్టుగా చరిత్రఈ గెలుపుతో స్పెయిన్ జట్టు 66 ఏళ్ల టోర్నీ చరిత్రలో అత్యధికంగా నాలుగుసార్లు విజేతగా నిలిచిన జట్టుగా గుర్తింపు పొందింది. గతంలో స్పెయిన్ 1964, 2008, 2012లలో యూరో టైటిల్‌ను సాధించింది.జర్మనీ జట్టు మూడుసార్లు (1972, 1980, 1996) విజేతగా నిలిచింది. 1966లో ఏకైక ప్రపంచకప్ టైటిల్ నెగ్గిన తర్వాత మరో అంతర్జాతీయ టైటిల్ నెగ్గలేకపోయిన ఇంగ్లండ్ జట్టుకు వరుసగా రెండోసారి యూరో టోర్నీలో నిరాశ ఎదురైంది. 2021 యూరో ఫైనల్లో ఇటలీ చేతిలో ఓడిన ఇంగ్లండ్‌కు ఈసారి స్పెయిన్ షాక్ ఇచ్చింది.బంతిని 63 శాతం తమ ఆధీనంలో ఉంచుకొని ఇంగ్లండ్ ఆటగాళ్లను కట్టడి చేసింది. ఏకంగా 60 సార్లు ఇంగ్లండ్ గోల్‌పోస్ట్ వైపునకు వెళ్లిన స్పెయిన్ 15 సార్లు గోల్ చేసేందుకు ప్రయత్నించింది. మరోవైపు హ్యారీ కేన్ కెప్టెన్సీలో ఇంగ్లండ్ జట్టు 31 సార్లు స్పెయిన్ గోల్‌పోస్ట్ వైపునకు వెళ్లి తొమ్మిదిసార్లు గోల్ లక్ష్యంగా షాట్లు సంధించింది.విజేతకు రూ. 72 కోట్ల 89 లక్షలుస్పెయిన్ టీనేజ్ స్టార్, 17 ఏళ్ల లమీన్ యమాల్ ‘యంగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’... స్పెయిన్‌కే చెందిన రోడ్రి ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డులు గెల్చుకున్నారు. ఫైనల్ విజేత స్పెయిన్ జట్టుకు 80 లక్షల యూరోలు (రూ. 72 కోట్ల 89 లక్షలు), రన్నరప్ ఇంగ్లండ్ జట్టుకు 50 లక్షల యూరోలు (రూ. 45 కోట్ల 56 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఓవరాల్‌గా రూ. 253 కోట్ల ప్రైజ్ మనీ స్పెయిన్‌కు దక్కింది.స్పెయిన్ అరుదైన రికార్డులు ఇవే1. యూరో టోర్నీలో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ గెలుపొంది విజేతగా నిలిచిన తొలి జట్టుగా స్పెయిన్ రికార్డు నెలకొల్పింది. 2. ఒకే యూరో టోర్నీలో అత్యధిక గోల్స్ చేసిన జట్టుగా స్పెయిన్ గుర్తింపు పొందింది. ఫ్రాన్స్ (14 గోల్స్; 1984లో) పేరిట ఉన్న రికార్డును స్పెయిన్ తాజాగా తిరగరాసింది. 🔝 performance 🔝 tournament Nico Williams is the real deal 👏@Vivo_GLOBAL | #EUROPOTM pic.twitter.com/lPu38RWoX0— UEFA EURO 2024 (@EURO2024) July 14, 2024 -
యూరో కప్ విజేతకు ఘన స్వాగతం.. మాడ్రిడ్ దద్దరిల్లిపోయింది! వీడియో
యూరో కప్-2024 విజేత స్పెయిన్‌కు ఆపూర్వ స్వాగతం లభించింది. ట్రోఫీతో స్వదేశానికి చేరుకున్న స్పెయిన్ జట్టుకు అభిమానులు అడుగడుగునా నీరాజనాలు పలికారు. తమ సొంత గడ్డపై అడుగుపెట్టిన స్పెయిన్ జట్టు.. తొలుత ఆ దేశ రాజు ఫెలిపే VI, అతని కుటుంబాన్ని కలిశారు.ఆ తర్వాత రాజధాని మాడ్రిడ్‌లో ఓపెన్-టాప్ బస్ పరేడ్‌లో స్పెయిన్ ఆటగాళ్లు పాల్గోనున్నారు. తమ ఆరాధ్య జట్టుకు ఘనస్వాగతం పలికేందుకు అభిమానులు పెద్ద ఎత్తున మాడ్రిడ్‌లోని సిబిలెస్ స్క్వేర్ వద్దకు చేరుకున్నారు.అభిమానుల కేరింతల మధ్య స్పెయిన్ జట్టు బస్ విక్టరీ పరేడ్ జరిగింది. స్పెయిన్ ఆటగాళ్లు ట్రోఫీతో ఫ్యాన్స్‌కు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.కాగా ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌ను 2-1 తేడాతో ఓడించిన స్పెయిన్ యూరోకప్ ఛాంపియన్స్‌గా నిలిచింది. స్పెయిన్‌కు ఇది నాలుగో యూరో కప్ టైటిల్ కావడం గమనార్హం. 1964, 2008, 2012 యూరో కప్ టైటిల్స్‌ను స్పెయిన్ సొంతం చేసుకుంది. 🎉🇪🇦 ¡Ojo al ambientazo en Cibeles para recibir a los #C4MPEONES de la #EURO2024!📹 @ernestoasc_ pic.twitter.com/piTQDDiqKm— MARCA (@marca) July 15, 2024 -
నాలుగోసారి యూరోకప్ విజేతగా నిలిచిన స్పెయిన్ ఫుట్‌బాల్ జట్టు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
యూరో కప్ విజేతగా స్పెయిన్.. ప్రైజ్ మనీ ఎన్ని వందల కోట్లంటే?
దాదాపు నెల రోజుల పాటు ఫుట్‌బాల్ అభిమానులను ఉర్రూతలూగించిన యూరో కప్-2024కు ఎండ్ కార్డ్ పడింది. ఆదివారం రాత్రి స్పెయిన్- ఇంగ్లండ్ ఫైనల్ మ్యాచ్‌తో ఈ టోర్నీ ముగిసింది. యూరోకప్ విజేతగా స్పెయిన్ నిలిచింది.ఫైనల్లో 2-1 తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించిన స్పెయిన్.. నాలుగో సారి టైటిల్‌ను ముద్దాడింది. ఈ క్రమంలో విజేత స్పెయిన్ ప్రైజ్ మనీ ఎంత? రన్నరప్ ఇంగ్లండ్‌కు ఎంత దక్కుతుంది? ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీ ఎవరన్న ఆంశాలపై ఓ లుక్కేద్దాం.విజేత స్పెయిన్‌కు ఎన్ని కోట్లంటే?యూరో కప్ విజేత స్పెయిన్‌కు ప్రైజ్ మనీ రూపంలో మొత్తం 30.4 మిలియన్ డాలర్లు అందనుంది. అంటే భారత కరెన్సీలో సుమారుగా రూ. 253 కోట్ల ప్రైజ్ మనీ స్పెయిన్‌కు దక్కింది. అన్ని మ్యాచ్‌ల్లో గెలిచి ఛాంపియన్స్‌గా నిలిచినందుకు బోనస్+ గ్రూప్ స్టేజ్ విజయాలు+ క్వార్టర్-ఫైనల్ + సెమీ-ఫైనల్+ ఫైనల్+ టోర్నీలో పాల్గోనే రుసుము మొత్తం కలిపే రూ. 253 కోట్ల నగదు బహుమతిగా స్పెయిన్‌కు లభించనుంది.రన్నరప్ ఇంగ్లండ్‌కు ఎంతంటే?రన్నరప్ ఇంగ్లండ్‌కు ప్రైజ్ మనీ రూపంలో మొత్తం 27.25మిలియన్ డాలర్లు అందనుంది. అంటే భారత కరెన్సీలో సుమారుగా రూ.227 కోట్ల ప్రైజ్ మనీ ఇంగ్లండ్‌కు దక్కింది. గ్రూప్ స్టేజ్ విజయాలు+ క్వార్టర్-ఫైనల్ + సెమీ-ఫైనల్+ టోర్నీలో పాల్గోనే రుసుము+ రౌండ్ 16 మొత్తం ప్రైజ్‌మనీ కలిపి ఇంగ్లండ్‌కు రూ.227 కోట్ల నగదు బహుమతిగా అందనుంది. ఇక సెమీఫైనల్‌కు చేరిన ఫ్రాన్స్, నెదర్లాండ్స్‌కు చెరో రూ. 101 కోట్ల ప్రైజ్ మనీ దక్కనుంది.యంగ్ ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీ: లామిన్ యమల్ (స్పెయిన్)ఈ టోర్నీలో లామిన్ యమల్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.17 ఏళ్ల యమల్ ఒక గోల్‌తో పాటు 4 అసిస్ట్‌లు చేశాడు. ఈ యువ ప్లేయర్ కచ్చితంగా ఫ్యూచర్ స్టార్ అవుతాడనడంలో ఎటువంటి సందేహం లేదు.ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్: రోడ్రి (స్పెయిన్)స్పెయిన్ తరఫున మిడ్‌ఫీల్డ్‌లో రోడ్రి అదరగొట్టాడు. స్పెయిన్ విజేతగా నిలవడంలో రోడ్రిది కీలకపాత్ర. గోల్డెన్ బూట్ విజేతలు వీరే..యూరో కప్-2024 గోల్డన్ బూట్ విజేతలగా ఆరుగురు నిలిచారు. మొత్తం ఆరు మంది ఆటగాళ్లు సమంగా 3 గోల్స్ చేసి సంయుక్తంగా గోల్డన్ బూట్ అవార్డును తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ జాబితాలో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్, స్పెయిన్ అటాకింగ్ మిడ్‌ఫీల్డర్ డాని ఓల్మో, జార్జియా మిడ్ ఫిల్డర్ జార్జెస్ మికౌతాడ్జే, కోడి గక్పో, ఇవాన్ ష్రాంజ్,జమాల్ ముసియాలా ఉన్నారు. -
'స్పెయిన్'దే యూరో కప్.. ఇంగ్లండ్‌కు మళ్లీ నిరాశే (ఫోటోలు)
-
‘యూరో’ చాంపియన్‌గా స్పెయిన్
యూరో ఫుట్‌బాల్ కప్-2024 ఛాంపియన్స్‌గా స్పెయిన్ జట్టు నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌ను 2-1 తేడాతో ఓడించిన స్పెయిన్.. నాలుగో సారి యూరో కప్ టైటిల్‌ను ముద్దాడింది. స్పెయిన్ విజయంలో మైకెల్ ఓయర్జాబల్ కీలక పాత్ర పోషించాడు.చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో 86వ నిమిషంలో గోల్‌కొట్టిన ఓయర్జాబల్ స్పెయిన్‌కు అద్భుతమైన విజయాన్ని అందించాడు.చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో 86వ నిమిషంలో గోల్‌కొట్టిన ఓయర్జాబల్ స్పెయిన్‌కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఈ ఫైనల్ మ్యాచ్ ఫస్ట్‌హాఫ్ నీవా నేనా అన్నట్లు సాగింది. ఇరు జట్లు కూడా తొలి ఆర్ధ భాగంలో ఒక్క గోల్కూడా సాధించలేకపోయాయి. ఫస్ట్‌హాప్ ముగిసే సమయానికి ఇరు జట్లు 0-0గా నిలిచాయి. ఆ తర్వాత సెకెండ్ హాఫ్‌లో 46వ నిమిషంలో నికో విలియమ్స్ అద్భుత గోల్‌తో స్పెయిన్ ఖాతా తెరిచాడు. ఇంగ్లండ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటకి గోల్ సాధించడంలో విఫలమైంది. ఈ క్రమంలో మ్యాచ్ 60 నిమిషంలో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్ బయటకు వెళ్లిపోయాడు. అతడి స్ధానంలో సెమీఫైనల్ హీరో వాట్కిన్స్ వచ్చాడు. అతడు వచ్చిన కూడా ఫలితం మాత్రం మారలేదు. ఇంగ్లీష్ జట్టు నిరాశలో కూరుకుపోయిన వేళ మిడ్‌ఫీల్డర్ కోల్ పామర్ 73వ నిమిషంలో సంచలన గోల్‌తో తమ జట్టుకు తొలి గోల్‌ను అందించాడు.దీంతో స్కోర్లు 1-1తో సమమయ్యాయి. మళ్లీ ఇంగ్లండ్ కమ్‌బ్యాక్ ఇవ్వడంతో స్పెయిన్ కాస్త ఒత్తడికి గురైంది. అయితే సెకెండ్ హాఫ్ సమయం ముగుస్తున్నప్పటికి గోల్ మాత్రం ఇరు జట్లు సాధించలేకపోయాయి. దీంతో పెనాల్టీ షుటౌట్ తప్పదని అంతా భావించారు.కానీ మ్యాచ్ 86వ నిమిషంలో ఓయర్జాబల్ సూపర్ గోల్‌తో స్పెయిన్‌కు చారిత్రత్మక విజయాన్ని అందించాడు. స్పెయిన్‌కు ఇది నాలుగో యూరో కప్ టైటిల్ కావడం గమనార్హం. 1964, 2008, 2012 యూరో కప్ టైటిల్స్‌ను స్పెయిన్ సొంతం చేసుకుంది. 🇪🇸 Spain are champions of Europe 🏆#EURO2024 pic.twitter.com/Ch0AF0iPWl— UEFA EURO 2024 (@EURO2024) July 14, 2024 -
ఫుట్‌బాల్ జోష్
ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానులను గంటల వ్యవధిలో రెండు ఆసక్తికర సమరాలు అలరించబోతున్నాయి. జర్మనీలోని బెర్లిన్ వేదికగా జరిగే యూరో కప్ ఫైనల్లో ఇంగ్లండ్, స్పెయిన్ తలపడనున్నాయి. స్పెయిన్ గతంలో మూడు సార్లు విజేతగా నిలవగా...ఇంగ్లండ్ ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేదు. మరో వైపు అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా జరిగే కోపా అమెరికా కప్ ఫైనల్లో అర్జెంటీనాను కొలంబియా ఎదుర్కొంటుంది. ఈ టోర్నీలో అర్జెంటీనా ఏకంగా 15 సార్లు టైటిల్ నెగ్గగా...కొలంబియా ఒక సారి ట్రోఫీని సొంతం చేసుకుంది. -
EURO CUP 2024: సెమీస్‌లో ఫ్రాన్స్ ఓటమి.. ఫైనల్లో స్పెయిన్
యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీలో స్పెయిన్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఇవాళ (జులై 10) జరిగిన తొలి సెమీఫైనల్లో స్పెయిన్.. ఫ్రాన్స్‌పై 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలి అర్ద భాగంలోనే మూడు గోల్స్ నమోదయ్యాయి. 8వ నిమిషంలో రాండల్ కోలో ముఆని గోల్ సాధించి ఫ్రాన్స్‌కు ఆధిక్యాన్ని అందించాడు. అనంతరం స్పెయిన్ ఆటగాళ్లు 21వ నిమిషంలో లామిన్ యమాల్, 25వ నిమిషంలో డానీ ఓల్మో గోల్స్ సాధించారు. రెండో అర్ద భాగంలో ఫ్రాన్స్ ఎంత ప్రయత్నించినా.. స్పెయిన్ ఆధిక్యతను తగ్గించలేక పోయింది. ఫలితంగా ఓటమిపాలైంది. లామిన్ యమాల్ యూరో కప్ చరిత్రలోనే అత్యంత పిన్నవయస్కుడైన గోల్ స్కోరర్‌గా రికార్డుల్లోకెక్కాడు.ఇదిలా ఉంటే, నెదర్లాండ్స్-ఇంగ్లండ్ మధ్య రెండో సెమీఫైనల్ రేపు (జులై 11) జరుగనుంది. ఈ మ్యాచ్‌లో విజేత జులై 15న జరిగే ఫైనల్లో స్పెయిన్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. -
సెమీస్ సమరం.. స్పెయిన్‌తో ఫ్రాన్స్ ఢీ! ఫైనల్ బెర్త్ ఎవరిదో?
‘యూరో’ కప్ ఫుట్‌బాల్ టోర్నీ-2024 తొలి సెమీఫైనల్‌కు సర్వం సిద్దమైంది. మంగళవారం అలియాంజ్ ఎరీనా వేదికగా జరగనున్న సెమీఫైనల్-1లో ఫ్రాన్స్, స్పెయిన్ జట్లు తాడో పేడో తెల్చుకోనున్నాయి. ఈ సెమీస్ పోరులో గెలిచి ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకోవాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. స్పెయిన్ ఫైనల్‌కు చేరుతుందా?అయితే ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచి జోరు మీదున్న స్పెయిన్‌కు సెమీస్ ముందు గాయాలు, కార్డ్ సస్పెన్షన్ల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే కీలక మ్యాచ్‌కు ముందు రాబిన్ లే నార్మాండ్, డాని కార్వాజల్ ఇద్దరూ సస్పెండ్ అయ్యారు. మరోవైపు , యువ మిడ్‌ఫీల్డర్ పెడ్రీ టోని క్రూస్ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. ఈ క్రమంలో డిఫెన్స్‌లో రాబిన్ లే నార్మాండ్, డాని కార్వాజల్ స్ధానాలను నాచో, జీసస్ నెవాస్ భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా పెడ్రీ ప్రత్యామ్నాయంగా వచ్చిన డాని ఓల్మో ప్లేయింగ్‌లో తన స్దానాన్ని సుస్థిరం చేసుకోనున్నాడు.స్పెయిన్ జోరును ఫ్రాన్స్ అడ్డుకుంటుందా?ఇక సెమీస్‌కు ముందు ఫ్రాన్స్ టీమ్‌లో ఎటవంటి గాయాలు, కార్డ్ సస్పెన్షన్లు లేవు. జట్టు మొత్తం క్లియర్‌గా ఉంది. కానీ ఫ్రాన్స్ సెమీస్‌కు వచ్చినప్పటికి తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. గోల్స్ సాధించడంలో ఫ్రాన్స్ తమ మార్క్ చూపించలేకపోయింది. కెప్టెన్ కైలియన్ ఎంబాపే గాయం కావడం ఫ్రాన్స్‌ను కాస్త దెబ్బతీసింది. అతడు తిరిగి జట్టులోకి వచ్చినప్పటి మునపటి జోరును ప్రదర్శించలేకపోతున్నాడు. సెమీఫైనల్లోనైనా ఎంబాపే సత్తాచాటుతాడో లేదో వేచి చూడాలి. కాగా సెమీఫైనల్ చేరే క్రమంలో స్పెయిన్ 11 గోల్స్ చేయగా... ఫ్రాన్స్ కేవలం మూడు గోల్స్ మాత్రమే సాధించింది. -
యూరో కప్-2024 సెమీస్ బెర్తులు ఖరారు..
జర్మనీ వేదికగా జరుగుతున్న యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీ-2024లో సెమీఫైనల్ బెర్త్‌లు అధికారకంగా ఖరారయ్యాయి. శనివారం రాత్రి స్విట్జర్లాండ్‌తో ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో విజయం సాధించిన ఇంగ్లండ్ మూడో జట్టుగా సెమీస్‌కు అర్హత సాధించగా.. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టర్కీని ఓడించి నెదర్లాండ్స్ నాలుగో జట్టుగా సెమీస్‌లో అడుగుపెట్టింది.ఇంగ్లండ్-స్విట్జర్లాండ్ మ్యాచ్ నిర్ణీత సమయానికి 1-1తో సమమైంది. కానీ పెనాల్టీ షూటౌట్లో ఇంగ్లండ్ 5 గోల్స్ చేయగా స్విస్ జట్టు 3 గోల్స్‌కే పరిమితమై ఓటమి చవి చూసింది. మరోవైపు నాలుగో క్వార్టర్స్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 2-1తో టర్కీని ఓడించింది.కాగా యూరో కప్ సెమీఫైనల్లో నెదర్లాండ్స్ అడుగుపెట్టడం 20 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా ఇప్పటికే ఫ్రాన్స్, స్పెయిన్ తమ సెమీఫైనల్స్ బెర్త్‌లను ఖారారు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక మంగళవారం జరిగే తొలి సెమీఫైనల్లో స్పెయిన్‌తో ఫ్రాన్స్; బుధవారం జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో నెదర్లాండ్స్ తలపడతాయి. -
కారు కనిపించని ఊరు.. ఎక్కడుందో తెలుసా!?
స్పెయిన్‌లోని అతి చిన్న నగరం ‘సిటీ ఆఫ్ ఫ్రియాస్’. స్పెయిన్‌కు వచ్చే పర్యాటకులు దీనిని పెద్దగా పట్టించుకోరు గాని, ఈ ఊరికి చాలా విశేషాలే ఉన్నాయి. పదో శతాబ్దికి చెందిన ఈ నగరంలో ఆనాటి రాజు రెండో జువాన్ నిర్మించిన రాతికోట ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. మునిసిపాలిటీ నిర్వహణలో ఉన్న ఈ ఊరు సాంకేతికంగా పట్టణమే అయినా, పేరులో మాత్రం ‘సిటీ’ ఉండటంతో స్పెయిన్‌లోని అతి చిన్న నగరంగా గుర్తింపు పొందింది.చిన్నా చితకా పట్టణాల్లోనే కాదు, పల్లెల్లో కూడా కార్లు విరివిగా తిరిగే పరిస్థితులు ఉన్నా, ఈ ఊర్లో మాత్రం కార్లు కనిపించవు. ఇక్కడి ప్రజలు తమ ఊరిలో కార్లను నిషేధించారు. అందువల్ల మోటారు శబ్దాల రొద లేకుండా ఈ ఊరు ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఊరి జనాభా దాదాపు మూడువందల మంది మాత్రమే! ఈ విశేషాలు తెలిసిన కొద్దిమంది పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. ఈ ఊళ్లోని పురాతనమైన ‘ఇగ్లేషియా డి సాన్ విన్సెంటె మార్టిర్’ కేథలిక్ చర్చి, ‘ఫ్యూంటే డి లాస్ తేజాస్’ ఫౌంటెన్ ప్రత్యేక ఆకర్షణలు.ఈ ఫౌంటెన్ నుంచి నీరు కిందకు పడేటప్పుడు సంగీత స్వరాలు వినిపిస్తాయి. ఈ ఊళ్లో చిన్న చిన్న రెస్టారెంట్లు, హోటళ్లు, సెలూన్లు, మాంసం కొట్లు, ఫ్యాన్సీ దుకాణాలు, బేకరీ, ఫార్మసీ దుకాణాలు వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడి ‘హోటల్ రూరల్ ఫ్రియాస్’ పర్యాటకులకు అనుకూలంగా ఉంటుంది. పురాతన యూరోపియన్ విశేషాలను తిలకించాలనుకునే పర్యాటకులు ఇక్కడ బస చేయవచ్చు. ఈ హోటల్లో బస చేయడానికి రోజుకు 79 పౌండ్లు (రూ.8,411) చెల్లించాల్సి ఉంటుంది. సాధారణ యూరోపియన్ హోటళ్లతో పోల్చుకుంటే ఈ ధర తక్కువే!ఇవి చదవండి: అబ్బే! ప్రాణహాని ఉందని కాదు! -
Euro Cup 2024: సెల్ఫ్ గోల్‌తో ఓడిన ఇటలీ
గెల్సెన్కిర్చెన్ (జర్మనీ): యూరో కప్ ఫుట్‌బాల్ టోరీ్నలో డిఫెండింగ్ చాంపియన్ ఇటలీ జట్టుకు చుక్కెదురైంది. మాజీ విజేత స్పెయిన్‌తో శుక్రవారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో ఇటలీ 0–1 గోల్ తేడాతో ఓడిపోయింది.మరోవైపు.. వరుసగా రెండో విజయంతో స్పెయిన్ జట్టు ప్రిక్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించింది. ఆట 55వ నిమిషంలో స్పెయిన్ ఫార్వర్డ్ అల్వారో మొరాటో హెడర్ షాట్‌ను ఇటలీ గోల్‌కీపర్ గియాన్లుగి డొనారుమా నిలువరించాడు.అయితే ఇటలీ గోల్‌కీపర్ నిలువరించిన బంతి ఇటలీ డిఫెండర్ రికార్డో కాలాఫియోరి కాలికి తగిలి తిరిగి గోల్‌పోస్ట్‌లోకి వెళ్లింది. దాంతో ఇటలీ సెల్ఫ్ గోల్‌తో స్పెయిన్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లి చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంది. ఇతర మ్యాచ్‌ల్లో ఆస్ట్రియా 3–1తో పోలాండ్ జట్టుపై, ఉక్రెయిన్ 2–1తో స్లొవేకియాపై గెలిచాయి. చదవండి: T20 WC 2024: దక్షిణాఫ్రికా సూపర్... -
సింపుల్‌గా భలే అందంగా ఉంది.. మౌనీ రాయ్ సూపర్ హాట్! (ఫొటోలు)
-
స్పెయిన్‌లో భర్తతో కలిసి చిల్ అవుతున్న మౌనీ రాయ్ (ఫొటోలు)
-
French Open 2024: నాదల్కు షాక్
పారిస్: తరచూ గాయాలబారిన పడటం... పూర్తిస్థాయి ఫిట్నెస్ లేకపోవడం... వెరసి మట్టికోర్టులపై మకుటంలేని మహరాజుగా వెలుగొందిన స్పెయిన్ దిగ్గజం రాఫెల్ నాదల్కు ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోరీ్నలో ఊహించని పరాజయం ఎదురైంది. 2005 నుంచి ఈ టోర్నీలో ఆడుతూ ఏకంగా 14 సార్లు విజేతగా నిలిచిన 37 ఏళ్ల నాదల్ మొదటి రౌండ్లోనే ఇంటిదారి పట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రపంచ నాలుగో ర్యాంకర్, గత మూడేళ్లుగా ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీఫైనల్ చేరిన జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ పక్కా ప్రణాళికతో ఆడి నాదల్ ఆట కట్టించాడు. 3 గంటల 5 నిమిషాలపాటు సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో జ్వెరెవ్ 6–3, 7–6 (7/5), 6–3తో నాదల్‌ను ఓడించి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. ఈ మ్యాచ్‌లో జ్వెరెవ్ ఎనిమిది ఏస్‌లు సంధించడంతోపాటు నాదల్ సరీ్వస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. జ్వెరెవ్ సరీ్వస్‌ను కేవలం రెండుసార్లు బ్రేక్ చేసిన నాదల్ 30 అనవసర తప్పిదాలు కూడా చేశాడు. గాయం కారణంగా గత ఏడాది ఈ టోరీ్నకి దూరంగా ఉన్న నాదల్ తాజా ఓటమితో చివరిసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడినట్లు భావించాలి. సుమిత్ నగాల్ ఓటమి ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలిసారి ఆడుతున్న భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ పోరాటం మొదటి రౌండ్లోనే ముగిసింది. ప్రపంచ 18వ ర్యాంకర్ ఖచనోవ్ (రష్యా)తో జరిగిన మ్యాచ్‌లో సుమిత్ 2–6, 0–6, 6–7 (5/7)తో ఓడిపోయాడు. మరోవైపు ప్రపంచ రెండో ర్యాంకర్ యానిక్ సినెర్ (ఇటలీ) శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో సినెర్ 6–3, 6–3, 6–4తో యుబ్యాంక్స్ (అమెరికా)పై గెలిచాడు. స్వియాటెక్ ముందంజ మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) రెండో రౌండ్లోకి దూసుకెళ్లింది. తొలి రౌండ్లో స్వియాటెక్ 6–1, 6–2తో లియోలియా జీన్జీన్ (ఫ్రాన్స్)పై గెలిచింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) 6–1, 6–1తో జూలియా అవ్దీవా (రష్యా)పై, ఎనిమిదో సీడ్ ఆన్స్ జబర్ (ట్యునీíÙయా) 6–3, 6–2తో సాచియా వికెరీ (అమెరికా)పై, ఐదో సీడ్ వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్) 6–1, 6–3తో మసరోవా (స్పెయిన్)పై విజయం సాధించారు. 3: ఫ్రెంచ్ ఓపెన్ చరిత్రలో నాదల్‌ను ఓడించిన మూడో ప్లేయర్‌గా జ్వెరెవ్ నిలిచాడు. గతంలో సోడెర్లింగ్ (స్వీడన్; 2009లో ప్రిక్వార్టర్స్‌లో) ఒకసారి... జొకోవిచ్ (సెర్బియా; 2015 క్వార్టర్ ఫైనల్లో, 2021 సెమీఫైనల్లో) రెండుసార్లు ఈ టోర్నీ లో నాదల్‌ను ఓడించారు. 2016లో గాయం కారణంగా నాదల్ మూడో రౌండ్ నుంచి వైదొలిగాడు.3: గ్రాండ్‌స్లామ్ టోరీ్నలలో నాదల్ తొలి రౌండ్లో ఓడిపోవడం ఓవరాల్‌గా ఇది మూడోసారి మాత్రమే. ఇంతకుముందు నాదల్ 2016 ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో, 2013 వింబుల్డన్ టోర్నీలో తొలి రౌండ్లో ఓటమి పాలయ్యాడు. -
పాలస్తీనా స్వతంత్ర దేశం
టెల్ అవీవ్: పాలస్తీనా విషయంలో నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాయి. స్వతంత్ర పాలస్తీనా దేశాన్ని తాము గుర్తిస్తున్నామని బుధవారం ప్రకటించాయి. ఈ నెల 28న ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నాయి. నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ దేశాల తాజా ప్రకటనను పాలస్తీనియన్లు స్వాగతించారు. పాలస్తీనా దేశాన్ని ఇప్పటికే భారత్ సహా దాదాపు 140 దేశాలు అధికారికంగా గుర్తించాయి. అంటే ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం కలిగిన మొత్తం దేశాల్లో మూడింట రెండొంతుల కంటే ఎక్కువ దేశాలు పాలస్తీనాను గుర్తిస్తున్నాయి. తాజాగా మరో మూడు దేశాలు ఈ జాబితాలో చేరడం విశేషం. శాంతి, సామరస్యం కోసమే.. తూర్పు జెరూసలేం, వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్‌ను కలిపి ప్రత్యేక పాలస్తీనాను దేశంగా గుర్తించాలని లక్షలాది మంది పాలస్తీనియన్లు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. 1967లో జరిగిన మిడిల్ఈస్ట్ యుద్ధంలో ఆ మూడు ప్రాంతాలను ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. ప్రస్తుతం తూర్పు జెరూసలేం, వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ నియంత్రణ కొనసాగుతోంది. పాలస్తీనా దేశాన్ని గుర్తించకపోతే మధ్యప్రాచ్యంలో శాంతి, సామరస్యం నెలకొల్పడం సాధ్యం కాదని నార్వే ప్రధాని జోనస్ గహర్ పేర్కొన్నారు. ఐర్లాండ్‌కు, పాలస్తీనాకు ఇదొక చరిత్రాత్మకమైన, ముఖ్యమైన రోజు అని ఐర్లాండ్ ప్రధాని సైమన్ హ్యారిస్ వ్యాఖ్యానించారు. తమ నిర్ణయం ఇజ్రాయెల్‌సహా ఎవరికీ వ్యతిరేకం కాదని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ స్పష్టంచేశారు. హంతకులకు, రేపిస్టులకు బంగారు పతకాలా? పాలస్తీనాను ఒకదేశంగా గుర్తిస్తూ నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ చేసిన ప్రకటన పట్ల ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు దేశాల నుంచి తమ రాయబారులను వెనక్కి పిలిపించింది. తమ దేశంలో ఉన్న నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ దౌత్యవేత్తలకు సమన్లు జారీ చేసింది. తద్వారా తమ నిరసనను తెలియజేసింది. హమాస్ హంతకులకు, రేపిస్టులకు నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ బంగారు పతకాలు బహూరిస్తున్నాయని, ఈ పరిణామాన్ని చరిత్ర గుర్తుపెట్టుకుంటుందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కట్జ్ పేర్కొన్నారు. -
ఇజ్రాయెల్ హెచ్చరిక.. రాయబారులు వెనక్కి రండి
టెల్ అవీవ్: గాజాలో హమాస్- ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతునే ఉంది. హమాస్‌ను అంతం చేయటమే లక్ష్యంగా ఇజ్రయాల్ సైన్యం దాడులతో విరుచుకుపడుతోంది. అయితే తాజాగా ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐర్లాండ్, నార్వే దేశాలలోని తమ రాయబారులు స్వదేశానికి తిరిగి రావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు దేశాలు పాలస్తీనియన్లకు ప్రత్యేక దేశం హోదాకు గుర్తింపు ఇవ్వాలని అభిప్రాయపడిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ఈ నిర్ణయం తీసుకుంది. బుధవారం ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ మాట్లాడారు. ‘‘నిస్సందేహంగా నేను ఐర్లాండ్, నార్వే దేశాలకు స్పష్టమైన సందేశం పంపతున్నా. మా దేశ సార్వభౌమత్వానికి, భద్రతకు హాని కలిగించే పరిస్థితులపై అస్సలు మౌనంగా ఉండము. మేము సాధించే లక్ష్యాలను ఐర్లాండ్, నార్వే దేశాలు అడ్డుకోలేవు. మా దేశ పౌరులకు భద్రత పునరుద్ధరిస్తాం. హమాస్‌ను అంతం చేసి, బంధీలను ఇంటికి చేరుస్తాం, ఇంతకు మించి ఏం జరగబోదు’’ అని ఇజ్రాయెల్ కాట్జ్ స్పష్టం చేశారు.మరోవైపు స్పెయిన్ దేశాన్ని కూడా ఇజ్రాయెల్ కాట్జ్ హెచ్చరించారు. తమ దేశం కూడా పాలస్తీనాను మే 28 నుంచి ప్రత్యేక దేశంగా గుర్తిస్తుందని స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ బుధవారం వెల్లడించారు. దీంతో ఐర్లాండ్, నార్వేల వలే స్పెయిన్‌పై కూడా చర్యలు ఉంటాయని ఇజ్రాయెల్ హెచ్చరించింది.‘‘స్పానీష్ ప్రజల మెజార్టీ సెంటిమెంట్లను పరిగణలోకి తీసుకుంటున్నాం. వచ్చే మంగళవారం(మే 28). మంత్రుల కౌన్సిల్ సమావేశంలో పాలస్తీనా ప్రత్యేక దేశం గుర్తింపు విషయంలో ఆమోదం తెలుపుతాం. శాంతి, న్యాయంల కోసం ఆ నిర్ణయం మాటాలను నుంచి కార్యరూపం దాల్చుతుంది’’ అని పెడ్రో శాంచెజ్ తెలిపారు. -
ఆహా.. సూపర్ పవర్ భూమ్మీదకొచ్చిందా?.. వైరల్ వీడియోలు
ఉల్కాపాతం.. ఈ పేరు చాలామందికి తెలియంది కాదు. ఆకాశం నుంచి ప్రకాశవంతంగా దూసుకొస్తూ.. భూమ్మీద మీద పడే సమయంలో అవి మెరుస్తూ అద్భుతాన్ని తలపిస్తుంటాయి. అయితే.. తాజాగా శనివారం రాత్రి అలాంటి అనుభూతిని పొందారు స్పెయిన్, పోర్చుగల్ ప్రజలు. స్పెయిన్, పొరుగు దేశం పొర్చుగల్ ప్రజలు శనివారం రాత్రి ఆకాశంలో అరుదైన కాంతిని వీక్షించారు. నీలి రంగులో మెరుస్తూ ఉల్క ఒకటి భూమ్మీదకు రయ్‌మని దూసుకొచ్చింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వాహనాల్లో వెళ్లే వాళ్లు, పార్టీలు చేసుకునేవాళ్లు.. అనుకోకుండా ఆ దృశ్యాలను బంధించారు. Tires, Cascais, Portugal. ☄️#Tires #Cascais#Portugal #Fireball #Meteor #meteoro #meteorito #España#Spainpic.twitter.com/HDtnhQEYG7— Mr. Shaz (@Wh_So_Serious) May 19, 2024అవి చూసి భూమ్మీదకు సూపర్ పవర్ ఏదైనా దూసుకొచ్చిందా? అంటూ ఆశ్చర్యపోతున్నారు పలువురు. తోక చుక్కలు, ఉల్కాపాతంను కనివినీ ఎరుగని ఒక జనరేషన్ అయితే.. ఈ దృశ్యాల్ని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనవుతోంది. ఇది ఏలియన్ల పనేనా?.. సూపర్ పవర్ ఏదైనా భూమ్మీదకు వచ్చిందా? అంటూ తమదైన ఎగ్జయిట్‌మెంట్‌ను ప్రదర్శిస్తోంది. A meteor lit up the sky with bright light during the night in Portugal and Spain.Source: X#Meteor #Spain #Portugal #Fireball #Sky #DTNext #DTnextNews pic.twitter.com/09Ma6GO0sg— DT Next (@dt_next) May 19, 2024అయితే ఆ ఉల్క ఎక్కడ పడిందనేదానిపై ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే కొందరు మాత్రం కాస్ట్రో డెయిర్లో పడిందని, మరికొందరేమో పిన్హెయిరోలో పడిందని చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. JUST IN: Meteor spotted in the skies over Spain and Portugal.This is insane.Early reports claim that the blue flash could be seen darting through the night sky for hundreds of kilometers.At the moment, it has not been confirmed if it hit the Earth’s surface however some… pic.twitter.com/PNMs2CDkW9— Collin Rugg (@CollinRugg) May 19, 2024 రెండు వారాల కిందటే.. అక్కడి ఖగోళ శాస్త్రవేత్తలు ఉల్క పడొచ్చని అంచనా వేశారు. హెలీ తోకచుక్క నుంచి వెలువడే శకలాల కారణంగా రాబోయే రోజుల్లో ఉల్కాపాతం ఎక్కువే ఉండొచ్చని వాళ్లు అంచనా వేస్తున్నారు. -
స్పెయిన్ వరుడు, కర్ణాటక వధువు
కర్ణాటక: మనసుపడితే మూడుముళ్ల పండుగకు జాతిభేదాలతో పనేముంది. కొన్నిసార్లు దేశ సరిహద్దులు కూడా దాటి జంటలు ఒక్కటవుతాయి. ఇదే కోవలో స్పెయిన్ యువకుడు, మండ్య యువతి ప్రేమ బంధాన్ని పెళ్లితో సుస్థిరం చేసుకున్నారు. వివరాలు.. జిల్లాలోని కేఆర్ పేటె పట్టణానికి చెందిన వస్త్ర వ్యాపారి రవీంద్రనాథ కుమార్తె దీక్షిత కోయంబత్తూరులో ఈశా ఫౌండేషన్‌లో యోగా టీచర్‌గా పనిచేస్తోంది. స్పెయిన్‌లోని బార్సిలోనాకు చెందిన జాన్ వైడల్ ఆశ్రమానికి వస్తుండేవాడు. ఈ సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమ మొగ్గ తొడిగింది. పెద్దలకు చెప్పగా రెండు కుటుంబాలు పెళ్లికి సమ్మతించారు. దీంతో మంగళవారం కెఆర్ పేటెలోనే సంప్రదాయ రీతిలో వివాహ వేడుక జరిగింది. వరుని తల్లిదండ్రులు, తోబుట్టువులు సంప్రదాయ దుస్తులు ధరించి హాజరయ్యారు. -
కొడుకు కల సాకారం కోసం...ఒక టీవీ నటి సాహసం, వైరల్ స్టోరీ
అమ్మ ఎపుడైనా అమ్మే. అమ్మకు ప్రత్యామ్నాయం లేదు. మాతృత్వపువిలువ, కన్నపేగు మమకారం తెలుసు. అందుకే కేన్సర్‌తో చనిపోయిన కొడుకుకల సాకారం కోసం పెద్ద సాహసానికి పూనుకుంది. 68 ఏళ్ల వయసులో ఒక టీవీ స్టార్ కొడుకు వీర్యంతో వారసురాలికి జన్మనిచ్చిన ఘటన సంచలనంగా మారింది. సహజంగా పిల్లలకు కనే అవకాశం లేనపుడో, మరేకారణాల రీత్యానో సరోగసీని ఆశ్రయిస్తుంటారు. కానీ కొడుకు కోసం సరోగసీని ఎందుచుకుంది స్పెయిన్ దేశానికి చెందిన టీవీ నటి అనా బ్రెగాన్. ఈమెకు అలెస్ లెక్వియో అనే కొడుకు ఉండేవాడు. అయితే దురదృష్టవశాత్తూ కేన్సర్‌తో 27 ఏళ్లకే కన్నుమూశాడు. అయితే మరణానికి ముందు అలెస్‌కు తండ్రి కావాలన్న కోరిక బలంగా ఉండేది. అందుకే తన స్పెర్మ్‌ను భ్రద (ఫ్రీజ్) పర్చుకున్నాడు. ముందస్తు ప్రమాదాన్ని ఊహించాడో ఏమో, విధి ఫలితమో గానీ కొన్నాళ్లకు కేన్సర్ బారిన పడ్డాడు. తన కల నెరవేరకుండానే చనిపోయాడు. అయితే తండ్రి కావాలన్న ఆశతో అఎస్ లెక్వియో తన వీర్యాన్ని భద్రపర్చిన విషయం ఇంట్లో లభించిన రశీదు ఆధారంగా అనా ఓబ్రెగాన్ తెలుసుకుంది. అంతే తల్లి మనసు తన కొడుకు కలసాకారం కోసం ఆరాటపడింది. దీనికి సంబంధించిన 2023లో వైద్యులను సంప్రదించింది. అన్ని పరీక్షల అనంతరం సరోగసికీ ఓబ్రెగాన్ శరీరం సహకరిస్తుందని వెల్లడించారు. దీంతో ప్రాణాలకు తెగించి మరీ కొడుకు వీర్య కణాలతో గర్భం దాల్చి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పాపాయికి అనిత అని పేరుపెట్టుకుంది. ఫస్ట్ బర్త్‌డే సందర్భంగా ఈ విషయాలను స్వయంగా అనా ఇన్‌స్టాలో ఫోటోలతో సహా షేర్ చేసింది. “అనితా, నీకు ఏడాది నిండింది. అగాధమైన చీకటిలో మునిగిపోయి, విపరీతమైన బాధతో ఛిద్రమైపోయిన నా హృదయాన్ని కాంతితో నింపేశాయ్... నీ చిరునవ్వు, ముద్దు ముద్దుమాటలు, నీ బుడిబుడి అడుగులు ఇవి చాలు నాకు.. మీ నాన్న నన్ను ఎంత ప్రేమతో చూసాడో అదే ప్రేమతో నన్ను చూస్తున్నందుకు ధన్యవాదాలు. ఇప్పటివరకూ ఎవరూ నన్ను అలా చూడలేదు. ” అని పోస్ట్ చేసింది. ఇది నెటిజనుల చేత కంటతడిపెట్టిస్తోంది. View this post on Instagram A post shared by Ana_Obregon Oficial (@ana_obregon_oficial) -
స్పెయిన్‌లో శిక్షణకు జ్యోతి యర్రాజీ
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల రజత పతక విజేత, ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజీ స్పెయిన్‌లో 45 రోజుల ప్రత్యేక శిక్షణ తీసుకోనుంది. జ్యోతికి సంబంధించి విమాన ప్రయాణాలు, వసతి, శిక్షణ ఇతరత్రా ఖర్చులన్నీ మిషన్ ఒలింపిక్ సెల్ (ఎంఓసీ) భరిస్తుందని కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ ప్రకటించింది. పారిస్ ఒలింపిక్స్ సహా, ఈ సీజన్లో అత్యున్నత ప్రదర్శన కనబరిచేందుకు ఎంఓసీ పథకంలో ఆమెతో పాటు పలువురు అథ్లెట్లకు ఆర్థిక చేయూత ఇవ్వనున్నారు. వైజాగ్‌కు చెందిన 24 ఏళ్ల జ్యోతి గత ఆసియా క్రీడల్లో 100 మీటర్ల హర్డిల్స్‌లో రజత పతకం గెలిచింది. మరో తెలుగుతేజం, స్టార్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిలకు కూడా మరింత మెరుగైన శిక్షణ కోసం ఆరి్థక సాయం అందించే ప్రతిపాదనకు ఎంఓసీ ఆమోదం తెలిపింది. -
సత్తుపల్లి అమ్మాయి.. స్పెయిన్ అబ్బాయి
ఖమ్మం: వారి ప్రేమ ఖండాంతరాలు దాటి వివాహ బంధంతో ఏకమైంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన విద్యాభారతి కళాశాల డైరెక్టర్ మందడపు సత్యనారాయణ – సుజని దంపతుల కుమార్తె లావణ్య నాలుగేళ్లుగా స్పెయిన్ దేశంలోని బార్సిలోనలో ఓ కంపెనీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రంగంలో స్టాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. ఆమెకు అదే కంపెనీ సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన స్పెయిన్ దేశానికి చెందిన మార్క్ మన్సిల్లాతో మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో ఇరుపక్షాల తల్లిదండ్రులను పెళ్లికి ఒప్పించారు. సత్తుపల్లిలోని శ్రీసాయిబాలాజీ ఫంక్షన్ హాల్లో బుధవారం అర్ధరాత్రి 12.53 నిమిషా లకు ఈ ప్రేమ జంట పెళ్లితో ఒకటయ్యారు. ఇవి చదవండి: శ్రీలంక అమ్మాయి.. కరీంనగర్ అబ్బాయి ఒక్కటయ్యారు -
స్వేచ్ఛా మార్కెట్ పరిష్కారం కాదు!
గతేడాది కనీసం 65 దేశాలలో రైతులు నిరసనలు చేపట్టారు. ఖండాంతరాలలో జరిగిన ఈ నిరసనలు ప్రధానంగా పంటల ధరలు, అధిక ఉత్పత్తి వ్యయం, చౌకైన దిగుమతులు, ప్రోత్సాహకాల ఉపసంహరణ, స్థానిక సమస్యలకు వ్యతిరేకంగా సాగాయి. నిజానికి వ్యవసాయ సంక్షోభం కొనసాగడానికి స్వేచ్ఛా మార్కెట్లే కారణం. మార్కెట్లకు విజ్ఞత ఉంటే, రైతులు నష్టపోవడానికి కారణమే లేదు. ఆర్థిక వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉందో చెప్పడానికి రైతుల నిరసనలు నిదర్శనం. చట్టబద్ధమైన కనీస మద్దతు ధర అనేది భారతీయ రైతులకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాగుదారులకు కూడా అనుసరణీయ మార్గం. వ్యవసాయాన్ని ఉద్దేశపూర్వకంగా పేదరికంలో ఉంచిన ఆర్థిక రూపకల్పనను సమూలంగా సరిదిద్దడానికి ఇదే సమయం. భారతదేశంలో, ఐరోపాలోని కొన్ని ప్రాంతాల్లో రైతుల తిరగబడటాన్ని ప్రపంచం గమ నిస్తోంది. 2023 జనవరి నుండి కనీసం 65 దేశాలలో రైతులు నిరస నలు చేపట్టారు. కనీవినీ ఎరుగని నిరసనల వెల్లువ వెనుక కారణాలు వేరువేరుగా ఉన్నప్పటికీ, వాటన్నింటినీ కలిపే సాధారణ సూత్రం ఒకటే: నియంత్రణ లేని మార్కెట్ ఆర్థిక వ్యవస్థ వైఫల్యం.రైతులు తమ అసంతృప్తిని వెళ్లగక్కేందుకు ఉపయోగించే పదాలు ఒక దేశం నుండి మరొక దేశానికి భిన్నంగా ఉండవచ్చు. కానీ అంత ర్లీన సందేశం ఒకటే: వ్యవసాయ ఆదాయాన్ని పెంచడంలో మార్కెట్లు విఫలమయ్యాయి. భారతదేశ రైతులు కనీస మద్దతు ధరను చట్ట బద్ధమైన హక్కుగా కోరుకుంటుండగా, యూరోపియన్ రైతులు తమ ఉత్పత్తులకు సరైన విలువను డిమాండ్ చేస్తున్నారు. కెన్యాలో బంగా ళాదుంపల ధర పతనం, నేపాల్‌లో కూరగాయల ధరలు తక్కువగా ఉండటంతో పాటు జర్మనీ, ఫ్రాన్స్ , బెల్జియంతో సహా యూరప్‌లోని అనేక దేశాలలో ఉత్పత్తి వ్యయం పెరగడం, చౌక దిగుమతులు, ఉత్పత్తి ధరలు పడిపోవడాన్ని కూడా నిరసనలు హైలైట్ చేశాయి. స్పెయిన్ లోని రైతులు నాలుగు లక్షల లీటర్ల పాలను వీధుల్లో పారబోశారు. మలేషియా సాగుదారులు తక్కువ వరి ధరలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఫ్రాన్స్ లో, అధ్యక్షుడు మాక్రాన్ తో ఇటీవల జరిగిన సమావేశంలో చిన్న రైతుల ప్రముఖ సంస్థ అయిన ‘కాన్ఫెడరేషన్ పేసన్’... రైతులకు సామాజిక రక్షణ కల్పించడంతో సహా హామీ ఇవ్వబడిన వ్యవసాయ ధర కంటే తక్కువ ధరకు కొనుగోళ్లను అనుమతించకూడదనే వాగ్దానాన్ని కోరింది. వాణిజ్య సరళీకరణను కూడా రైతులు వ్యతిరేకించారు.జర్మనీ, ఫ్రాన్స్ , రొమేనియా, ఇటలీ, పోలాండ్లలో రైతులు ఉక్రె యిన్ నుండి వచ్చే చౌక దిగుమతులకు వ్యతిరేకంగా నిరసనలు నిర్వ హించారు. పైగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను సమీక్షించాలని కోరుతున్నారు. వారు హైవేలను అడ్డుకున్నారు, దిగుమతి చేసుకున్న వ్యవసాయ ఉత్పత్తులను తీసుకువెళుతున్న ట్రక్కులను నిలిపివేశారు, చాలా చోట్ల దిగుమతి చేసుకున్న ఆహార పదార్థాలను ధ్వంసం చేశారు. ఫ్రాన్స్ లో, చౌకైన చేపల దిగుమతులకు వ్యతిరేకంగా వేలాది మంది రైతులు, మత్స్యకారులు ఓడరేవుల వద్ద నిరసన తెలిపారు. ఇది వ్యవ సాయ జీవనోపాధిని నాశనం చేస్తుందని వారు చెప్పారు. భారతదేశం విషయానికి వస్తే, ప్రపంచ వాణిజ్య సంస్థ నుండి భారత్ వైదొలగా లని నిరసన తెలుపుతున్న రైతులు తమ డిమాండ్‌ను పునరుద్ఘాటించారు. ‘డౌన్ టు ఎర్త్’ మ్యాగజైన్ సంకలనం ప్రకారం, యూరప్‌లోని 24 దేశాలు రైతు నిరసనలను ఎదుర్కొంటుండగా, ఆఫ్రికాలో 12, ఆసియాలో 11, దక్షిణ, ఉత్తర, మధ్య అమెరికాల్లో ఎనిమిదేసి దేశాలు, ఓషియానియాలో రెండు దేశాలు గత సంవత్సరం రైతు ప్రదర్శనల వల్ల ప్రకంపించిపోయాయి. ఐరోపాలో, స్వతంత్ర పాన్–యూరోప్ మీడియా నెట్వర్క్ అయిన ‘యూరాక్టివ్’ 2024 జనవరి–ఫిబ్రవరిలో తాజా దశ నిరసనలపై చేసిన అధ్యయనం... రైతులకు న్యాయమైన, లాభదాయకమైన ధర కోసం బలమైన డిమాండ్ ఉంటోందని తెలిపింది. ప్రధానంగా ఫ్రాన్స్ , జర్మనీ, స్పెయిన్, ఇటలీ నుండి ఈడిమాండ్ వెలువడింది. బెల్జియం రైతులు ఆహార గొలుసు విధానంలో కూడా రక్షణ కోరుకుంటున్నారు. నికర సున్నా ఉద్గారాలను సాధించే ప్రయత్నంలో యూరోపియన్ కమిషన్ విధించడానికి ప్రయత్నిస్తున్న కఠినమైన పర్యావరణ నిబంధనలపై కూడా వారి కోపం నిర్దేశితమైంది. వ్యవసాయ రంగంపై వాణిజ్య ప్రభావం యూరోపియన్ యూనియన్ రైతులకు ఆందోళన కలిగిస్తోంది. జర్మన్ రైతుల ప్రద ర్శనలు... వ్యవసాయ వాహనాలకు ఇంధనంపై పన్ను మినహాయింపులను ఉపసంహరించుకోవడం గురించి సాగాయి (దీనిని జర్మనీ దశలవారీగా రద్దు చేయడానికి అంగీకరించింది); ‘నైట్రేట్ డైరెక్టివ్’ లాంటి కఠినమైన పర్యావరణ నిబంధన లతోపాటు తక్కువ ధరలను భర్తీ చేయడానికి ప్రోత్సాహకాల డిమాండ్‌పై దృష్టి సారించాయి. సారాంశంలో, ఖండాంతరాలలో జరిగిన ఈ నిరసనలలో చాలా వరకు ప్రధానంగా పంటల ధరలు, అధిక ఉత్పత్తి వ్యయం, చౌకైన దిగు మతులు, ప్రోత్సాహకాల ఉపసంహరణ, స్థానిక సమస్యలకు వ్యతి రేకంగా ఉన్నాయి. వ్యవసాయాన్ని మార్కెట్ల చేతుల్లోకి వదిలేయడం వల్ల వ్యవ సాయ రంగానికి మేలు జరగలేదు. ప్రపంచవ్యాప్తంగా రైతుల నిరస నలే ఇందుకు నిదర్శనం. ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు ఉద్దేశపూర్వ కంగా ఆహార ధరలు తక్కువగా ఉండేలా చూసుకున్న ఆధిపత్య ఆర్థిక ఆలోచనకు భారతీయ వ్యవసాయం బలయ్యింది. ఇది కాలం చెల్లిన విధానం. మారుతున్న వాస్తవాలకు అనుగుణంగా ఆర్బీఐ తన స్థూల ఆర్థిక విధానాలను పునఃసమీక్షించే సమయం ఆసన్నమైంది. 2022– 23 గృహ వ్యయ సర్వే ప్రకారం, ప్రతి కుటుంబం మీద గృహం, ఆరోగ్యం, విద్యపై నిరంతరం పెరుగుతున్న వ్యయంతో భారం పడి నప్పటికీ, ఆహారంపై ఖర్చు గణనీయంగా తగ్గింది. కఠినమైన స్థూల ఆర్థిక నియంత్రణ నుండి వ్యవసాయ ధరలకు అవసరమైన దిద్దుబాటు చర్యల ఆవశ్యకతను నొక్కిచెప్పిన క్షణం, దానికి బలమైన వ్యతిరేకత వస్తుంది. ‘ఇది అధిక ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది, తద్వారా మార్కెట్ వక్రీకరణలు జరుగుతాయని మేము హెచ్చరించాము’ అంటూ గ్యారెంటీ ధర కావాలని రైతులు పునరుద్ఘాటించినప్పుడల్లా విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ ఒక కార్పొరేట్ వైఫల్యం ఫలితంగా కోవిడ్ మహమ్మారి సంవత్సరాల్లో ద్రవ్యోల్బణం 57 శాతం పెరిగి, 2023లో 53 శాతం చుట్టూ చేరిన ప్పుడు మాత్రం అదే ఆర్థిక ఆలోచన స్పష్టంగా నిశ్శబ్దంగా ఉంది. వ్యవసాయ ధరలను స్థిరీకరించడానికి అనేక దశాబ్దాలుగా అనేక ప్రోత్సాహకాలు, దేశీయ మద్దతు యంత్రాంగాలు ప్రయత్నించిన ప్పటికీ, వాస్తవికత ఏమిటంటే వ్యవసాయ కష్టాలు ప్రపంచవ్యాప్తంగా మరింత తీవ్రమవుతున్నాయి. వ్యవసాయంలో మార్కెట్ సంస్క రణలు అరువు తెచ్చుకున్న అమెరికాలో కూడా స్వేచ్ఛా మార్కెట్ రూపకల్పన అనేది చిన్న రైతులను వ్యవసాయం నుండి ఎలా బయటకు నెట్టిందో, వారిని కష్టాల బాటలో ఎలా వదిలివేసిందో, పొలంలో విధ్వంసాన్ని ఎలా సృష్టించిందో ‘నాసా’ మాజీ శాస్త్రవేత్త వేదవ్రత పెయిన్ దర్శకత్వం వహించిన ‘డెజా వు’ డాక్యుమెంటరీ చూపిస్తుంది. కాబట్టి స్వేచ్ఛా మార్కెట్ పరిష్కారం కాదు. నిజానికి వ్యవసాయ సంక్షోభం కొనసాగడానికి ఇదే కారణం. మార్కెట్లకు విజ్ఞతఉంటే, సమర్థతకు ప్రతిఫలమివ్వగలిగితే, వ్యవసాయం నష్టపోయే ప్రతిపాదనగా ఉండటానికి కారణమే లేదు. ఆర్థిక వ్యవస్థ ఎంతలోప భూయిష్టంగా ఉందో చెప్పడానికి ప్రపంచవ్యాప్తంగా రైతుల నిరసనలు నిదర్శనం. వ్యవసాయాన్ని ఉద్దేశపూర్వకంగా పేదరికంలో ఉంచిన ఆర్థిక రూపకల్పనను సమూలంగా సరిదిద్దడానికి ఇది సమయం. చట్టబద్ధమైన కనీస మద్దతు ధర అనేది భారతీయ రైతులకు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాగుదారులుఅందరికీ వర్తించే మార్గం. మార్కెట్లు తదనుగుణంగా సర్దుబాటు అవుతాయి. - వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు , దేవీందర్ శర్మ - ఈ–మెయిల్: hunger55@gmail.com -
ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ చాంపియన్స్ అల్కరాజ్, స్వియాటెక్
ప్రతిష్టాత్మక ఇండియన్ వెల్స్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోరీ్నలో పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) టైటిల్ నిలబెట్టుకోగా... మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) రెండోసారి విజేతగా నిలిచింది. కాలిఫోరి్నయాలో జరిగిన ఫైనల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ అల్కరాజ్ 7–6 (7/5), 6–1తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)ను ఓడించగా... స్వియాటెక్ 6–4, 6–0తో మరియా సాకరి (గ్రీస్)పై గెలిచింది. 2016లో జొకోవిచ్ తర్వాత ఇండియన్ వెల్స్ టోర్నీని వరుసగా రెండేళ్లు సాధించిన ప్లేయర్‌గా అల్కరాజ్ నిలిచాడు. అల్కరాజ్ కెరీర్లో ఇది ఐదో మాస్టర్స్ సిరీస్ టైటిల్. విజేతలుగా నిలిచిన అల్కరాజ్కు 11 లక్షల డాలర్ల (రూ. 9 కోట్ల 11 లక్షలు) ప్రైజ్‌మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు... స్వియాటెక్‌కు 11 లక్షల డాలర్ల (రూ. 9 కోట్ల 11 లక్షలు) ప్రైజ్‌మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.


