వికారాబాద్‌ పంటపొలాల్లో ఆకాశం నుంచి పడ్డ వింత పరికరం.. వీడిన మిస్టరీ

Vikarabad: The mystery Solved behind the strange device - Sakshi

సాక్షి, వికారాబాద్‌: జిల్లాలోని మర్పల్లి మండలం మొగిలిగుండ్లలో వింత పరికరం మిస్టరీ వీడింది. అదేంటో చూసేందుకు జనం ఎగబడి పోయారు. అయితే.. ఆ పరికరం స్పెయిన్‌ దేశానికి చెందిందిగా ధృవీకరించారు సైంటిస్టులు. భారత ప్రభుత్వ సహకారంతోనే ఈ ప్రయోగం నిర్వహించినట్లు తెలుస్తోంది. స్పెయిన్‌ టూరిజంలో జనాలను తరలించే పరికరంగా దీనిని గుర్తించారు. 

టాటా కన్సల్టెన్సీ వాళ్ళు రూపొందించిన ప్రయోగం దినివల్ల  ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది పూర్తిగా భారత ప్రభుత్వం సహాకారంతో  నిర్వహించిన ప్రయోగం. ఇక్కడ ఈ ప్రయోగం విజయవంతం కావడంతో స్పేస్ దేశంలో టూరిజం లో భాగంగా జనాలను తరలించేందుకు ఉపయోగపడుతుంది. బెలున్ సహాయంతో ప్రయోగించాం. దీనిని పూర్తిగా ట్రాకింగ్ ద్వారా మానిటరింగ్ చేయడంతో జనాలు లేనివద్దనే దీగేలా చూశాం అని సైంటిస్టులు ప్రకటించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top