వికారాబాద్: జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం అనంతగిరి గుట్టపై గల హరిత రిసార్ట్స్‌లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులందరూ హాజరుకానున్నట్లు తెలిసింది.
మంత్రులు రోడ్డు మార్గంలో.. సీఎం హెలీకాప్టర్‌లో చేరుకోనున్నారు. పది రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 41 మంది, తెలంగా ణకు చెందిన 36 డీసీసీ అ«ధ్యక్షులు శిక్షణ తీసుకోనున్నారు.సీఎం మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరా బాద్ నుంచి హెలీకాప్టర్‌లో బయలు దేరి 1.45గంటలకు వికారాబాద్‌లోని ఎస్‌ఏపీ కళాశాల మైదానానికి చేరుకుంటారు.
అక్కడ జిల్లా ఎమ్మెల్యేలు, నేతలు స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి రో డ్డు మార్గంలో అనంతగిరికి చేరుకుంటారు. మధ్యా హ్నం 3గంటలకు శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం హెలీకాప్టర్‌లో తిరిగి హైదరాబాద్‌కు వెళ్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం శిక్షణ తరగతుల నిర్వహణ కమిటీ చైర్మ న్, పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి, కలెక్టర్ ప్రతీక్‌జైన్, పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షించారు.


