
మాడ్రిడ్: స్పెయిన్‌లోని వాలెన్సియా పట్టణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రెండు 14 అంతస్తుల అపార్ట్‌మెంట్‌లలో చెలరేగిన మంటలు చెలరేగిన ఘటనలో నలుగురు మృతి చెందగా 13 మందికి గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిలో పిల్లలు, ఫైర్ సిబ్బంది ఉన్నారు. మరో 14 మంది జాడ తెలియడం లేదు. అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది క్రేన్ల సాయంతో అపార్ట్‌మెంట్‌లలో చిక్కుకున్నవారిని రక్షించారు.
తొలుత ఒక అపార్ట్‌మెంట్‌లో చెలరేగిన మంటలు క్రమంగా పక్కనే ఉన్న మరో అపార్ట్‌మెంట్‌కు వ్యాపించాయి. భారీ అగ్ని జ్వాలలు, పొగ ఎగిసిపడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. భవన నిర్మాణంలో వాడిన సామగ్రి కారణంగానే మంటలు వేగంగా వ్యాపించినట్లు స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి. స్పెయిన్ ప్రధాని పెడ్రో షాంచేజ్ అగ్ని ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
BREAKING: Entire multi-storey building on fire in Valencia, Spain pic.twitter.com/sTXMm6KY4p
— Insider Paper (@TheInsiderPaper) February 22, 2024