వ్యభిచార కేంద్రాలపై పోలీసుల దాడి | Police Caught Prostitution Gang | Sakshi
Sakshi News home page

వ్యభిచార కేంద్రాలపై పోలీసుల దాడి

Mar 7 2026 9:48 AM | Updated on Mar 7 2026 11:53 AM

Police Caught Prostitution Gang

హైదరాబాద్: వేరు వేరు ప్రాంతాలలో వ్యభిచార కేంద్రాలపై దాడి చేసి పలువురిని అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కూకట్‌పల్లి సుమిత్రానగర్‌లోని ఓ అపార్టుమెంట్‌లో వ్యభిచార కేంద్రంపై గురువారం సాయంత్రం పోలీసులు దాడులు చేశారు. 

నిర్వాహకురాలు (40), విటుడు రవికుమార్‌ (47), మరో మహిళ(47)ను అరెస్టు చేశారు. మహిళను రెస్క్యూ హోంకు తరలించి, నిర్వాహకురాలు, రవికుమార్‌లను రిమాండ్‌కు తరలించారు. అదే విధంగా అదే కాలనీలోని మరో అపార్టుమెంట్‌లో వ్యభిచార గృహంపై దాడి చేశారు. నిర్వాహకురాలు (46), విటుడు శ్రీవేంద్ర వర్మ (30)లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో మహిళను (32) హోంకు తరలించారు. 

Advertisement
 
Advertisement
Advertisement