చేనేత.. అమల పలకరింత | amala akkineni launches handmade handloom expo in hyderabad | Sakshi
Sakshi News home page

చేనేత.. అమల పలకరింత

Mar 7 2026 9:26 AM | Updated on Mar 7 2026 11:54 AM

amala akkineni launches handmade handloom expo in hyderabad

హైటెక్‌ సిటీ సమీపంలోని ఇందిరా మహిళా శక్తి బజార్‌లో ఇండియా హ్యాండ్‌ మేడ్‌ కలెక్టివ్‌ (ఐహెచ్‌ఎంసీ), గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం (సెర్ప్‌) సంయుక్తాధ్వర్యంలో శుక్రవారం హస్తకళల ప్రత్యేక ప్రదర్శనను సినీనటి, జంతు హక్కుల కార్యకర్త అమల అక్కినేని ప్రారంభించారు. ఈ సందర్భంగా చరఖాపై నూలు వడుకుతున్న ఓ మహిళతో ఆమె సరదాగా మాట్లాడారు.  

అర్పిత.. స్ఫూర్తి మంత్ర
చిన్న వయసులో జరిగిన ప్రమాదం ఆమె జీవితాన్ని అల్లకల్లోలం చేసింది. ఆ దుర్ఘటనలో రెండు కాళ్లనూ కోల్పోయినా భయపడలేదు.. ఇంతలో దెబ్బ మీద దెబ్బ అన్నట్లు తల్లిదండ్రులు కాలం చేశారు.. కానీ, బెదరలేదు.. విధిని ఎదిరించి స్ఫూర్తిగా నిలుస్తోంది కోల్‌కతాకు చెందిన అర్పితా రాయ్‌.. ఉద్యోగిగా..  యోగా శిక్షకురాలిగా రాణిస్తోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎఫ్‌టీసీసీఐ నిర్వహించిన కార్యక్రమంలో ప్రేరణాత్మక ప్రసంగం చేశారు అర్పితా రాయ్‌..

కమలం.. వికసిత కాంత 
మహిళా శక్తి తోడ్పాటు లేనిదే వికసిత భారత్‌ సంకల్పం అసాధ్యం. వనితల తోడిదే అవని అని వక్తలు కొనియాడారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం సోమాజిగూడలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాలను  నిర్వహించారు.   

Advertisement
 
Advertisement
Advertisement