బాచుపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడిన మంటలు.. | Major Fire Acciedent at Hyderaba Bachupally at Pragathi Nagar | Sakshi
Sakshi News home page

Fire Accident: బాచుపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడిన మంటలు..

Mar 4 2026 12:23 AM | Updated on Mar 4 2026 12:28 AM

Major Fire Acciedent at Hyderaba Bachupally at Pragathi Nagar

హైదరాబాద్‌లోని బాచుపల్లి పీఎస్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రగతినగర్‌లోని ఓ ఫర్నీచర్ షాపులో ఈ ఘోర అగ్నప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. అంతేకాకుండా దీంతో పుట్‌పాత్‌పై  ఉన్న షాపులకు కూడా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పేందుకు యత్నించారు. 

రోడ్డుపై భారీగా మంటలు ఎగసిపడటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.  ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది.  స్థానికులు ప్రాణభయంతో అక్కడినుంచి పరుగులు తీశారు.  అయితే షార్డ్ సర్ప్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. అక్కడే ఉన్న కమాన్ వద్ద వరుసగా ఫర్నిచర్ షాపులు ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో ఒక ఓ దుకాణంలోమంటలు ఎగిసిపడుతూ పక్కన షాపుల్లోని సామగ్రికి అంటుకుని తీవ్ర రూపం దాల్చాయి. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement