ఇప్పుడే పెళ్లొద్దమ్మా.. నేను ఇంకా చదువుకుంటా | Young Woman Ends Life In Jagtial | Sakshi
Sakshi News home page

ఇప్పుడే పెళ్లొద్దమ్మా.. నేను ఇంకా చదువుకుంటా

Mar 3 2026 8:21 AM | Updated on Mar 3 2026 11:30 AM

Young Woman Ends Life In Jagtial

జగిత్యాలక్రైం: పెళ్లి ఇష్టంలేక మనస్తాపానికి గురైన ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల పట్టణంలోని పోచమ్మవాడలో చోటుచేసుకుంది. స్థానికుల కథ నం ప్రకారం.. పోచమ్మవాడకు చెందిన ములస్తం గణేశ్, పుష్పలత దంపతులకు కూతురు, ఇద్దరు కుమారులున్నారు. కూతురు ప్రణవి (25) వరంగల్‌లో గతేడాది ఇంజినీరింగ్‌ పూర్తిచేసింది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. కానీ.. కుటుంబసభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈనెల 5న పెళ్లిచూపులు ఉన్నాయని తెలిపారు. తల్లిదండ్రులు గోదావరిలో స్నానానికని సోమవారం ధర్మపురి వెళ్లారు. 

తిరిగి వచ్చేసరికి ప్రణవి తన స్టడీ రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. కుటుంబసభ్యులు కొనఊపిరితో ఉన్న ఆమెను కిందకు దింపారు. 108కు సమాచారం అందించగా.. వారు స్పందించలేదు. కారులో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రి సిబ్బంది స్ట్రెచర్‌ తీసుకురావడంలో ఆలస్యం చేశారు. బంధువులే ఆమెను చేతులపై ఎత్తుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటికే పరిస్థితి విషమించి మృతిచెందింది. 108 సిబ్బంది, ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతోనే ప్రణవి మృతిచెందిందని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతురాలి తండ్రి గణేశ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై సదాకర్‌ తెలిపారు.   

 

 

Advertisement
 
Advertisement
Advertisement