కరీంనగర్/కరీంనగర్‌కార్పొరేషన్: బీజేపీకి ఒక్క చా న్సిస్తే మార్పు చూపిస్తానంటూ.. మున్సిపల్ ఎన్నికల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తికి కరీంనగర్ ప్రజలు ఆ పార్టీకి మేయర్ పీఠాన్ని కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో సంజయ్ ఇచ్చిన మాటకు కట్టుబడి కరీంనగర్ కార్పొరేషన్‌లో ప్రక్షాళనకు నడుం బిగించారు. అలాగే ‘సాక్షి’లో ప్రచురితమైన ‘ప్ర‘గతి’ త ప్పిన పట్టణ ప్లానింగ్’ కథనంపై స్పందించారు. మే యర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్‌రావుతో కలిసి సోమవారం టౌన్‌ప్లానింగ్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ, ఇప్పటిదాకా ఒక లెక్క. ఇకపై మరో లెక్క అని, ఇళ్ల పర్మిషన్‌కు డబ్బులు అడిగి బాధితులను ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. పూర్తి పారదర్శకతతో పనిచేయాలని సూచించారు.
పాలకవర్గం మార్పు చూపించాలి
నెలరోజుల్లో మార్పు తీసుకువచ్చి కొత్త పాలకవర్గం మార్క్ చూపాల్సిందేనని సంజయ్ తెలిపారు. అనుమతి లేని నిర్మాణాలను ఆరంభంలోనే ఆపాలన్నారు. ఇంటి ముందు ఇసుక, కంకర కన్పిస్తే ఒకవైపు కార్పొరేటర్లు, ఇంకోవైపు టౌన్ ప్లానింగ్ అధికారులు వాలిపోయి బెదిరించి వసూళ్లు చేసేవారని, బీజేపీ కార్పొరేటర్లు అలాంటి వాటి జోలికి పోరని స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున సీఎస్సార్ ఫండ్స్ తీసుకొచ్చి ‘అటల్ క్యాంటీన్’లను ఏర్పాటు చేసి ఆసుపత్రులు, మార్కెట్ కూడళ్లలో పేదలకు పౌష్టికాహారంతో కూడిన భోజనాన్ని కడుపునిండా పెట్టేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.


