కరీంనగర్‌టౌన్: గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అక్కడికి సందర్శన నిమిత్తం వెళ్లి చిక్కుకున్నవారిని స్వదేశానికి రప్పించేందుకు చొరవచూపాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని సోమవారం పీఆర్టీయూ నాయకులు కోరారు. జిల్లాకు చెందిన ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులు, సాధారణ ప్రజలను సైతం వెనక్కి రప్పించడానికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అలాగే 2010 సంవత్సరం కంటే ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు లభించేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రిని కలిసిన వారిలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గోనె శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కేతిరి తిరుపతిరెడ్డి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు చొల్లేటి శ్రీనివాస్, జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి నరకుల్ల శ్రీధర్ తదితరులు ఉన్నారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి పీఆర్టీయూ వినతి


