కథలాపూర్: కథలాపూర్ మండలం కలిగోట శివారు సూరమ్మ ప్రాజెక్టు సమీపంలో పులి సంచరించినట్లు పాదముద్రలు కనిపించా యని మెట్‌పల్లి ఎఫ్‌ఆర్‌వో పద్మారావు తెలి పారు. పులి సంచరించినట్లు రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా సో మవారం ఆయా ప్రాంతాల్లో అధికారులు ప రిశీలించారు. పాదముద్రల ఆధారంగా పులేనని నిర్ధారించారు. పశువుల కాపరులు అట వీ ప్రాంతాలకు పశువులను తీసుకెళ్లవద్దన్నారు. రాత్రివేళల్లో ప్రజలు ఒంటరిగా అటవీప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు. ఎఫ్‌ఆర్‌వో వెంట డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సురేశ్‌కుమార్, సెక్షన్ ఆఫీసర్ ముస్తాక్ ఆలీ ఉన్నారు.
పాదముద్రలు గుర్తించిన అటవీశాఖ అధికారులు


