టేకు దుంగల పట్టివేత | - | Sakshi
Sakshi News home page

టేకు దుంగల పట్టివేత

Mar 3 2026 7:30 AM | Updated on Mar 3 2026 7:30 AM

కొడిమ్యాల: కొడిమ్యాల ఫారెస్ట్‌ రేంజ్‌ పరిధిలో టేకు చెట్లను నరికి అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిపై అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. ఒడ్యాడ్‌ ఫారెస్ట్‌ బీట్‌లో ఇద్దరు వ్యక్తులు రెండు బైక్‌లపై వచ్చి టేకు చెట్లను నరికి 8 దుంగలను తరలించేందుకు సిద్ధమయ్యారు. ఫారెస్ట్‌ అధికారులు తనిఖీలు చేస్తుండగా తారసపడ్డారు. స్వామి అనే వ్యక్తిని పట్టుకున్నాడు. మరో వ్యక్తి పరారయ్యాడు. రెండు బైక్‌లు, టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. సోమవారం కేసు నమోదు చేసినట్లు ఫారెస్ట్‌ అధికారులు తెలిపారు. నిందితుల తరఫున స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా పెద్ద మొత్తంలో బేరసారాలు జరిగినట్లు సమాచారం. కుదరకపోవడంతోనే కేసు నమోదు చేసినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై ఎఫ్‌ఆర్వోను వివరణ కోరగా చట్టప్రకారం చర్యలు తీసుకున్నామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement