కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన కందునూ రి రాజకుమార్(32) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వెంకటేశ్ తెలిపారు. కొంతకాలంగా భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపానికి గురై మద్యానికి బానిసయ్యాడు. ఈక్రమంలో ఆదివారం రాత్రి మద్యం తాగి వచ్చి ఇంట్లోకి వెళ్లాడు. తల్లి మల్లీ శ్వరి సోమవారం చూసేసరికి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయి కనిపించాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు.
చెంజర్లలో యువకుడు..
మానకొండూర్: చెంజర్లలో ఓ కంపెనీలో పని చేస్తున్న బిహార్ రాష్ట్రానికి చెందిన వలస కా ర్మికుడు రవీంద్రకుమార్ ఆత్మహత్య చేసుకున్న ట్లు ఎస్సై సాయికృష్ణ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. రవీంద్రకుమార్(30) ఇటీవల బిహార్‌లో పెళ్లయింది. అప్పులయ్యాయి. అప్పు తీర్చేందుకు కొద్ది రోజులుగా చెంజర్లలోని నేషనల్ హైవే కంపెనీలో పని చేస్తున్నాడు. ఇంటికొస్తానని కుటుంబ సభ్యులకు తెలపగా.. అప్పులు బాగా ఉన్నాయి.. కొద్ది రోజులు పని చేసిన తర్వాత రావాలని కుటుంబ సభ్యులన్నారు. దీంతో మనస్తాపానికి గురై చెట్టుకు ఉరేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఆస్పత్రికి వచ్చి బస్టాండ్‌లో గుండెపోటుతో మృతి
జగిత్యాలక్రైం: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్య క్తి ఆస్పత్రిలో చికిత్స చే యించుకుని ఇంటికెళ్లే క్ర మంలో ఆర్టీసీ బస్టాండ్‌లో నే గుండెపోటుతో మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లాకేంద్రంలో చోటుచేసుకుంది. మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన కాశవత్తుల గంగారాం (58) సోమవారం ఉద యం తన భార్యతో కలిసి వైద్య పరీక్షల కోసం జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వచ్చాడు. చికిత్స పూర్తయిన తర్వాత ఇంటికెళ్లేందుకు తి రిగి బస్టాండ్‌కు చేరుకున్నాడు. బస్సు కోసం వేచి చూస్తూనే గుండెపోటుకు గురయ్యాడు. అతని భార్య గమనించి ఆర్టీసీ సిబ్బందికి చెప్పడంతో వారు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. 108 సిబ్బంది చేరుకుని మృతిచెందినట్లు నిర్ధారించారు. కళ్లముందే భర్త మృతిచెందడంతో అతని భార్య రోధించిన తీరు ప్రయాణికులను కలిచివేసింది. గంగారాం మృతదేహాన్ని మల్లాపూర్‌కు తరలించారు.
కాలువలో మహిళ శవం
జూలపల్లి(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలోని శ్రీరాంసాగర్ డీ–83 కాకతీయ ప్రధాన కాలువలో సోమవారం మహిళ శవం కొట్టుకు వచ్చింది. ఎస్సై సనత్‌కుమార్ కథనం ప్రకారం.. కుమ్మరికుంట సమీప డీ–83 ప్రధా న కాలువలో 9వ మైల్ వద్ద గలజల విద్యుత్‌కేంద్రం సమీపంలో మహిళశవం కనిపించిందని పంచాయతీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్సై.. మృతురాలి వయసు దాదాపు 38ఏళ్ల వరకు ఉంటుందని, ఒంటిపై ఎరుపు రంగు జాకెట్ ఉందని, కాళ్లకు పట్టీలు ధరించి ఉన్నాయని వివరించారు. బంధువులు ఎవరైనా ఉంటే పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్సై సూచించారు.


