Karimnagar District News
-
జిల్లా జడ్జికి ప్రాసిక్యూటర్ల శుభాకాంక్షలు
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ జిల్లా జడ్జిగా బాధ్యతలు చేపట్టిన ఎస్.శివకుమార్‌ను పబ్లిక్ ప్రాసిక్యూటర్లు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.శరత్ ఆధ్వర్యంలో పుష్పగుచ్ఛం అందించారు. జిల్లా జడ్జి ప్రాసిక్యూటర్లకు సంబంధించిన సమస్యలు, వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసుల పెండెన్సి తగ్గించేందుకు ప్రాసిక్యూటర్లు ముందుండాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రాసిక్యూటర్లు వారి సమస్యలను జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు లక్ష్మిప్రసాద్, జూలూరి శ్రీరాములు, కుమారస్వామి, గౌరు రాజిరెడ్డి, గడ్డం లక్ష్మణ్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రంజిత్, వీరస్వామి పాల్గొన్నారు. నీట్ ప్రవేశ పరీక్షను పకడ్బందీగా నిర్వహించండి కరీంనగర్ అర్బన్/కరీంనగర్: వైద్య కళాశాలల్లో ప్రవేశాల నిమిత్తం మే 4న జరిగే నీట్ యూజీ ప్రవేశ పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహణపై సమావేశం నిర్వహించారు. మే 4న జరిగే నీట్ ప్రవేశ పరీక్ష రాసే 2,975 మంది విద్యార్థుల కోసం ఏడు పరీక్షకేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరీక్షకు ఒక రోజు ముందే కేంద్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ఎక్కడా ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కాకుండా జాగ్రత్తలు వహించాలని, సీసీ టీవీ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసి పరీక్షను క్షుణ్ణంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో నీట్ పరీక్ష జిల్లా కోఆర్డినేటర్ పంకజ్ కుమార్, జిల్లా మైనారిటీ అభివృద్ధి అధికారి పవన్‌కుమార్, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, ఎన్పీడీసీఎల్ ఏడీఈ లావణ్య, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, ఏసీపీ మాధవి, జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. నేడు ఇస్కాన్ టెంపుల్ ప్రథమ వార్షికోత్సవం కరీంనగర్ కల్చరల్: ఇస్కాన్ ఆధ్వర్యంలో ఉజ్వలపార్క్ సమీపంలో ఇస్కాన్ టెంపుల్ ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా బుధవారం సాయంత్రం 5:30 గంటల నుంచి పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మందిర బాధ్యుడు నరహరి ప్రభుదాస్ తెలిపారు. మంగళవారం ఆలయంలో మాట్లాడుతూ.. సాయంత్రం అభిషేకం, మహానివేదన, హారతిసేవ ఉంటాయని, 6:30 గంటల నుంచి 8గంటల వరకు అలకాపురి కాలనీలో రాధాగోవిందుల పల్లకీసేవ, ప్రవచనం, కీర్తన, భజన ఉంటాయని పేర్కొన్నారు. ప్రజలు వార్షి కోత్సవంలో పాల్గొని జగన్నాథుని కృపకు కావాలని పిలుపునిచ్చారు. కన్నకృష్ణ, డాక్టర్ ఎల్.రాజభాసర్రెడ్డి, తుమ్మల రమేశ్‌రెడ్డి, సత్యనారాయణం, నగేశ్‌రెడ్డి, శ్రీనివాసరావు పాల్గొన్నారు. రెండు, నాలుగో సెమిస్టర్ల ఫీజు గడువు కరీంనగర్‌సిటీ: శాతవాహన విశ్వ విద్యాలయ పరీక్షల నియంత్రణ విభాగంలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (హానర్స్) కోర్సులో రెండు, నాలుగో సెమిస్టర్ పరీక్షల రుసుము నిర్ధారించడం జరిగిందని పరీక్షల నియంత్రణ అధికారి సురేశ్‌కుమార్ తెలిపారు. అభ్యర్థులు వారివారి కళాశాలల్లో ఫీజు చెల్లించాలన్నారు. పరీక్షలు మే నెలలో జరుగుతాయని తెలిపారు. ఎటువంటి అపరాధ రుసుము లేకుండా మే 6వ తేదీ వరకు, రూ.300 అపరాధ రుసుముతో మే9వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని సూచించారు. -
ఇంటికి దారేది?
● నగరంలో పలుచోట్ల ఇళ్ల ఎదుట తవ్వకాలు ● గత ప్రభుత్వంలో డ్రైనేజీ, రోడ్ల పనులు ప్రారంభం ● అలాగే వదిలేసి ఏడాదిన్నర ● పట్టించుకోని ప్రస్తుత పాలకులు ● ఇబ్బంది పడుతున్న ప్రజలునగర శివారు ఉన్న అలకాపురికాలనీ ఇది. స్మార్ట్‌సిటీలో భాగంగా నగరం అద్దంలా మెరిసిపోతుండగా.. ఈ ప్రాంతం రోడ్డు, డ్రైనేజీ లేక వెలవెలబోతోంది. రోడ్డు, డ్రైనేజీ వేస్తామన్న గత పాలకులు పనులు ప్రారంభించగా.. తరువాత జరిగిన పరిణామాలతో వదిలేశారు. దీంతో ఈ కాలనీవాసులు తమ ఇండ్లకు దారిలేక ఇబ్బంది పడుతున్నారు. డ్రైనేజీ లేక ఇళ్లలోని మురుగునీరు రోడ్డుపైకి చేరుతోందని చెబుతున్నారు. ఇంట్లోకి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు ఇలా తడకలు వేసుకున్నారు. డ్రైనేజీ రోడ్డుపై పారుతోంది. ఈ చిత్రం నగరంలోని జ్యోతినగర్‌లోని. నిత్యం రద్దీ ఉండే ప్రాంతం ఇది. నగరంలోని ప్రముఖ ప్రాంతాల్లో ఒకటైన ఈ ఏరియాలో రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థను విస్తరిస్తామని గత పాలకులు పనులు ప్రారంభించారు. కొద్దిరోజులకే ఎన్నికలు రావడంతో డ్రైనేజీ తవ్వి వదలేదశారు. కొంతదూరం పనులు పూర్తి చేశారు. రోడ్డు పనులు మరిచారు. దీంతో ఏడాదిన్నర కాలంగా ఇళ్లలోకి వెళ్లేందుకు ఇలా తడకలు వేసుకుని కాలనీవాసులు ఇబ్బంది పడుతున్నారు. కొందరు వృద్ధులు అయితే ఇంట్లోంచి బయటికి వెళ్లేందుకు భయపడుతున్నారు.నగరంలోని కోతిరాంపూర్‌లో ఉన్న కాలనీ ఇది. ఇక్కడ రోడ్డు, డ్రైనేజీ వేస్తామని గత ప్రభుత్వ హయాంలో పాలకులు పనులు ప్రారంభించారు. ఇళ్ల ఎదుట రోడ్లు తవ్వారు. కంకర పోశారు. డ్రైనేజీ కోసం కందకం తవ్వారు. ఇంతలో సర్కారు మారడంలో అలాగే వదిలేశారు. రెండేళ్లుగా తవ్విన రోడ్డుపైనే కాలనీవాసులు నడుస్తున్నారు. ఇళ్లలోకి వెళ్లేందుకు దారిలేక చెక్కలు వేసుకుని సర్కస్‌ఫీట్లు వేస్తున్నారు. బండ్లు బయట పెడుతుంటే.. చోరీకి గురవుతున్నాయని చెబుతున్నారు.కరీంనగర్ కార్పొరేషన్: కొత్త రోడ్లు వేస్తున్నామని పాతరోడ్లు తవ్వేశారు. డ్రైనేజీల కోసం ఇండ్ల ఎదుట కాలువలు తవ్వారు. ఇక కొత్త డ్రైనేజీలు, రోడ్లతో సమస్యలు తీరుతున్నాయని అంతా మురిసిపోయారు. కానీ జరిగిన పరిణామాలతో తవ్విన పనులు తవ్వినట్లే నిలిపివేసి ఏడాదిన్నర దాటింది. ప్రభుత్వ మారినా పనుల్లో కదలికలేదు. దీంతో నగరంలోని ఆయా కాలనీవాసుల పరిస్థితి పేనం మీదినుంచి పొయ్యిలో పడ్డట్లయింది. గత ప్రభుత్వ హయాంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి హామీ పథకం (సీఎంఏ) కింద అంతర్గత రోడ్లతో పాటు, డ్రైనేజీల పనులు చేపట్టారు. రోడ్లు, డ్రైనేజీల కోసం ఇండ్ల ఎదుట తవ్వడం పనులు జరుగుతుండగానే రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది. ఆ వెంటనే కాంట్రాక్టర్ ఎక్కడి పనులు అక్కడే వదిలేశారు. 2023 డిసెంబర్లో నిలిపివేసిన పనుల్లో ఇప్పటివరకు కదలిక లేకుండా పోయింది. ఇండ్ల ఎదుట కాలువలు డ్రైనేజీ నిర్మాణాల కోసం ఇండ్ల ఎదుట కాలువలు తవ్వి వదిలివేయడంతో ఇండ్లల్లోకి వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది. దీంతో చాలా మంది తాత్కాలికంగా పాత తలుపులు, చెక్కలు కాలువలపై వేసుకొని రాకపోకలు సాగిస్తున్నారు. ఏడాదిన్నరగా ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్లు గడుస్తుండడంతో మరికొంతమంది కాలువలను పూడ్చి వేసి తాత్కాలికంగా రాకపోకలకు దారి వేసుకున్నారు. మురుగునీరంతా అక్కడే నిలిచిపోవడంతో మరో సమస్య ఎదుర్కోవాల్సి వస్తోంది. తాత్కాలిక ఏర్పాట్లైనా చేయాలి పనులు అసంపూర్తిగా నిలిపివేయడంతో కోతిరాంపూర్, అలకాపురికాలనీ, జ్యోతినగర్, ఆరెపల్లి, సీతారాంపూర్, తీగలగుట్టపల్లి, కిసాన్‌నగర్, లక్ష్మినగర్, పోచమ్మవాడ తదితర ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏళ్లు గడుస్తున్నా కనీసం పట్టించుకొనేవాళ్లు లేకపోవడంపై మండిపడుతున్నారు. ఇండ్లకు వెళ్లేందుకు, మురుగునీళ్లు నిలవకుండా నగరపాలకసంస్థ అధికారులు తాత్కాలిక ఏర్పాట్లైనా చేయాలని కోరుతున్నారు.ఈ బాధలు ఇంకెన్ని రోజులు? డ్రైనేజీ కడుతామని మా ఇంటి ముందు కాలువ తవ్వి రెండేళ్లవుతోంది. ఇప్పటివరకు పనులు కొనసాగించడం లేదు. కాలువ పైనుంచి పాత తలుపు చెక్కలు వేసుకుని నడుస్తున్నాం. కాలువను పూడ్చివేద్దామంటే పైనుంచి వచ్చే మురుగునీళ్లు మా ఇంటి వద్దే నిలిచిపోతోంది. ఇంటినుంచి బయటకు రావడానికి, పోవడానికి బాధలు తప్పడం లేదు. రాత్రుళ్లు అయితే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటోంది. – సంగని పద్మ, మొగిలయ్య, అలకాపురి -
డీఎంహెచ్‌వోను బెదిరించిన వారిపై చర్య తీసుకోవాలి
పెద్దపల్లిరూరల్: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అన్న ప్రసన్న కుమారి విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా చంపేస్తామంటూ బెదిరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్, జిల్లా వైద్య ఉద్యోగులు, జేసీ నాయకులు కోరారు. ఈమేరకు మంగళవారం కలెక్టర్ శ్రీహర్షను కలిసి వినతిపత్రం అందించారు. విధుల్లో భాగంగా గోదావరిఖనిలోని శ్రీమమత హాస్పిటల్లో తనిఖీలు చేస్తే అనుమతి తీసుకోకుండానే స్కానింగ్ చేస్తున్నట్లు గుర్తించిన డీఎంహెచ్‌వో.. మిషన్ సీజ్ చేసి చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమయ్యారని తెలిపారు. అయితే, తమ బండారం బయటపడుతుందనే భయంతో ఆస్పత్రి రిసెప్షనిస్ట్ ఆనంద్‌తో డీఎంహెచ్‌వోపై తప్పుడు కేసు నమోదు చేయించారని పేర్కొన్నారు. తన విధులకు ఆటంకం కలిగించి, చంపుతామని బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్ నాగిరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, స్వాతిని సస్పెండ్ చేయాలని, మరో వైద్యుడు అనిల్‌కుమార్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని బోర్డుకు సిఫారసు చేయాలని, మహంకాళి స్వామి, ఆనంద్‌పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో డాక్టర్ వాణిశ్రీ, శ్రీరాములు, కిరణ్‌కుమార్, శ్రీనివాస్, ఉమామహేశ్వర్, దేవీసింగ్, రమేశ్, రాజేశ్, సాలమ్మ, దయామణి తదితరులు ఉన్నారు. కలెక్టర్‌కు టీఎన్జీవో వినతి -
అమ్మమ్మ, తాతయ్యకు బాలుడి అప్పగింత
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లాకేంద్రంలోని తులసీనగర్‌కు చెందిన రమ అనే మహిళ తన నాలుగేళ్ల కుమారుడిని విచక్షణారహితంగా దాడిచేయగా.. సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెల్సిందే. సఖీ కేంద్రం నిర్వాహకులు బాలుడిని చేరదీశారు. రమకు మంగళవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆమెకు మతిస్థిమితం సరిగా ఉండటం లేదని, గతంలో కూడా మానసిక వైద్యులకు చూపించుకుందని విచారణలో వెల్లడైంది. దీంతో బాలుడిని రాయికల్‌కు చెందిన అమ్మమ్మ, తాతయ్యకు అప్పగించారు. తల్లికి కౌన్సెలింగ్ ఇచ్చిన సఖీ కేంద్రం నిర్వాహకులు -
శిక్షణతో సైబర్ నేరాలకు చెక్
సిరిసిల్లక్రైం: సైబర్ నేరాల ఛేదనకు ప్రత్యేక శిక్షణ తరగతులు ఎంతో దోహదపడుతాయని రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేశ్ బీ గీతే అన్నారు. నేరాల పరిశోధనలో ఉపయోగించాల్సిన అంశాలపై కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట జిల్లాల సిబ్బంది, అధికారులకు మంగళవారం సైబర్ నిపుణులతో సిరిసిల్ల జిల్లా పోలీసు కార్యాలయంలో రెండురోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. సైబర్ నిందితులకు శిక్ష పడటంలో డిజిటల్ సాక్ష్యాధారాల సేకరణ కీలకమన్నారు. సాంకేతికత ఆధారంగా అధికారులు, సిబ్బంది వృత్తి నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని సూచించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది నిత్య విద్యార్థిగా ఉంటూ ఎప్పటికప్పుడు సమాజంలో జరిగే మోసాలపై అవగాహన పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రజలు ఎక్కువగా సైబర్ నేరాల బారిన పడుతున్న నేపథ్యంలో సిబ్బంది, అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ నేరాలకు అడ్డుకట్ట వేయాలని వివరించారు. సైబర్ నేరం జరిగినప్పుడు ఫిర్యాదు నమోదు నుంచి డిజిటల్ ఆధారాల సేకరణ, విశ్లేషణ మొదలగు అంశాలపై నిపుణులు ఇచ్చిన శిక్షణ సద్వినియోగం చేసుకొని నిందితులకు శిక్షలు పడేలా కృషి చేయాలన్నారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదు చేసేలా ఆయా పోలీస్ స్టేషన్లలో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీ చంద్రయ్య, రాజుకుమార్, కోర్స్ కో ఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేశ్ బీ. గీతే -
గుట్టల్లో సర్వే
గట్టుసింగారం పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం గట్టుసింగారం (సబ్బితం) గుట్టల్లో మంగళవారం పురావస్తు శాఖ అధికారులు ఎపిగ్రాఫికల్ సర్వే నిర్వహించారు. గట్టుసింగారం పరిసరాల్లోని సీతమ్మలొద్ది ప్రాంతంలో ఓ శిలపై చెక్కిన శాసనాలను ఎపిగ్రఫి డైరెక్టర్ మునిరత్నంరెడ్డి, పురావస్తు శాఖ అధికారులు పరిశీలించారు. క్రీ.శ. 1వ శతాబ్దం నుంచి క్రీ.పూ. ఆరో శతాబ్దం వరకు ఉన్న ఈ శాసనాలు దక్కన్ ప్రాంతం ప్రారంభ చరిత్ర, సాంస్కృతిక పరిమాణం తదితర అంశాల గురించి తెలియజేస్తాయని వారు అన్నారు. ఇందుకు సంబంధించి 11 శాసనాలకు సంబంధించిన ఆధారాలను సేకరించినట్లు వారు పేర్కొన్నారు. ఈ శాసనాల్లో కొన్ని శాతవాహన కాలం నాటివిగా తెలుస్తున్నాయని వివరించారు. శాతవాహన రాజవంశానికి చెందిన కుమార ఆకుసిరి శాసనాలు తొలిసారిగా గుర్తించినట్లు తెలిపారు. రాక్‌ఆర్ట్ పెయింటింగ్ స్పెషలిస్ట్ బీఎం రెడ్డి, ఫారెస్టు రేంజర్ నాయక్, ఫొటో జర్నలిస్ట్ రవీందర్‌రెడ్డి ఉన్నారు. ● ఆధారాలు సేకరించిన పురావస్తు శాఖ -
లింగనిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు
● డీఎంహెచ్‌వో వెంకటరమణ కరీంనగర్‌టౌన్: స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు లింగనిర్ధారణకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరో గ్యశాఖ అధికారి వెంకటరమణ పేర్కొన్నారు. మంగళవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో డిస్ట్రిక్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు గర్భంలోని పిండం ఆడ లేదా మగ అని తెలియపరచడం వంటి చర్యలకు పాల్పడితే నేరుగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో తెలియజేయాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సూపర్వైజర్లతో సమావేశం నిర్వహించి మొదటి కాన్పులు సాధారణంగా అయ్యేలా గర్భిణులు, వారి కుటుంబసభ్యులకు అవగాహన కల్పించాలని సూచించారు. సిజేరియన్ డెలివరీల పర్సంటేజ్ తగ్గించి నార్మల్ డెలివరీల పర్సంటేజీ పెంచాలని తెలిపారు. వైద్యాధికారులు సనా జవేరియా, ఉమాశ్రీ, వేణు, వసంతకుమార్, రాజగోపాల్, కై క, స్వామి పాల్గొన్నారు. -
సీఐలు పోలీస్స్టేషన్లను సందర్శించాలి
కరీంనగర్‌క్రైం: సీఐలు తమ పరిధిలోని పోలీస్స్టేషన్లను తరచూ సందర్శిస్తూ సిబ్బంది పనితీరును పర్యవేక్షించాలని సీపీ గౌస్ ఆలం సూచించారు. పోలీస్ కమిషనరేట్ కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం నెలవారీ నేరసమీక్ష నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ.. పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను సరైన పద్ధతిలో అమలు చేయాలని ఆదేశించారు. డివిజన్ల వారీగా ఏసీపీలు సమీక్షలు నిర్వహించాలన్నారు. రికార్డు నిర్వహణ, రిసెప్షన్, కోర్టుడ్యూటీ, డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలు, బీట్, పెట్రోలింగ్, పాయింట్బుక్ల ఏర్పాటు, సమన్ల జారీ వంటి విధులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అడిషనల్ డీసీపీ ఎ.లక్ష్మీనారాయణ, రూరల్ ఏసీపీ శుభం ప్రకాశ్, ట్రైనీ ఐపీఎస్ వసుంధర, అడిషనల్ ఎస్పీ నరేందర్, ఏసీపీలు వెంకటస్వామి, శ్రీనివాస్, యాదగిరిస్వామి, శ్రీనివాస్, మాధవి, వేణుగోపాల్, కాశయ్య, సీఐలు పాల్గొన్నారు.● సీపీ గౌస్ ఆలం -
లారీ పైనుంచి పడి హమాలీ మృతి
ధర్మారం(ధర్మపురి): స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో పనిచేస్తున్న హమాలీ మెడవేని రాజేశం(57) సోమవారం రాత్రి లారీ పైనుంచి పడి మరణించినట్లు ఎస్సై లక్ష్మణ్ తెలిపారు. లారీలో ధాన్యం లోడ్ చేస్తుండగా డ్రైవర్ గుర్రాల మల్లేశం నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లాడు. దీంతో రాజేశం లారీ కిందపడి తీవ్రగాయాలకు గురయ్యాడు. వెంటనే కరీంనగర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య రాజేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. పోస్టుమార్టం తర్వాత మంగళవారం ధర్మారంలోని రాజేశం ఇంటికి తీసుకు రాగా ప్రభుత్వ విప్ లక్ష్మణ్‌కుమార్ కుటుంబసభ్యులను పరామర్శించారు. దహనసంస్కారాల కోసం రూ.20వేలు సాయం చేశారు. అదేవిధంగా మృతుడి కుటుంబానికి పరిహారం అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్షను ఫోన్లో కోరారు. అదేవిధంగా సింగిల్‌విండో ద్వారా రూ.5లక్షలు, మార్కెట్ కమిటీ ద్వారా మరో రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇప్పించాలని ఆయన కలెక్టర్‌కు విన్నవించారు. కుటుంబసభ్యులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని లక్ష్మణ్‌కుమార్ హామీ ఇచ్చారు. మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లానాయక్, వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొత్త నర్సింహం, మాజీ వైస్ చైర్మన్ కాడే సూర్యనారాయణ, నాయకులు చింతల ప్రదీప్‌రెడ్డి, దేవి జనార్దన్, ఓరం చిరంజీవి, కాసాని ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
హత్య కేసులో భార్యాభర్తల అరెస్ట్
● వివరాలు వెల్లడించిన ఏసీపీ కృష్ణ పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో సోమవారం పొలం కుమార్‌ను హతమార్చిన కేసులో నిందితులు వేల్పుల సంతోష్, వేల్పుల శైలజను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. విలేకరుల సమావేశంలో వివరాలను ఏసీపీ గజ్జి కృష్ణ వెల్లడించారు. కొన్నిరోజులుగా కుమార్‌తో శైలజ సన్నిహితంగా ఉండడాన్ని చూసి వివాహేతర ఉందని సంతోష్ అనుమానించాడు. పద్ధతి మార్చుకోవాలని శైలజను మందలించాడు. అయితే తన వెంటపడుతూ ఇబ్బంది పెడుతున్నాడని ఆమె చెప్పడంతో కుమార్‌పై సంతోష్ కోపం పెంచుకున్నాడు. అయితే బంధువుల వద్ద శైలజతో సంబంధం ఉందని కుమార్ చెబుతున్నాడు. శైలజకు కూడా ఫోన్లు చేస్తుండడంతో కుమార్‌ను చంపాలనే నిర్ణయానికి వచ్చాడు. ఈక్రమంలో సోమవారం మాట్లాడుకుందాం రమ్మని కుమార్‌కు ఫోన్‌చేసి చెప్పడంతో వ్యవసాయమార్కెట్‌కు కారులో చేరుకున్నాడు. ఈలోగా పెద్దపల్లికి వచ్చిన సంతోష్.. జెండా వద్ద ఓ కత్తిని కొనుగోలు చేసి భార్య శైలజకు కుమార్‌ను చంపుదామనే విషయాన్ని చెప్పాడు. శైలజ దొంగతుర్తి నుంచి బస్సులో పెద్దపల్లికి చేరుకోగా.. ఆమెను బైక్‌పై తీసుకుని మార్కెట్ యార్డుకు చేరుకున్నారు. అక్కడ కొద్దిసేపు కుమార్, సంతోష్ గొడవపడ్డారు. ఆ సమయంలోనే తన వద్ద ఉన్న కత్తి తీసి మెడ, చాతి, ముఖంపై పొడిచి చంపారు. కుమార్ చనిపోయాడని నిర్ధారించుకుని నిందితులు పరారయ్యారు. ఈమేరకు నిందితులైన భార్యాభర్తలు సంతోష్, శైలజు దొంగతుర్తిలో ఉన్నారనే సమాచారంతో అక్కడకు వెళ్లి పోలీసులు అరెస్టు చేశారు. సమావేశంలో సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై మల్లేశ్ పాల్గొన్నారు. స్టేట్ రిసోర్స్‌పర్సన్‌గా రాజుఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): స్టేట్ రిసోర్స్ పర్సన్‌గా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌కు చెందిన ఇంగ్లిష్ టీచర్ లింగాల రాజు ఎంపికయ్యాడు. రాష్ట్ర వ్యాప్తంగా పది మంది ఉపాధ్యాయులు ఎంపికవగా వారిలో రాజు ఒకరు. ఏటా వేసవి సెలవుల్లో విద్యాబోధనలో మెలకువలు, నూతన సిలబస్‌పై ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా జిల్లా రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇచ్చేందుకు ఒక్కో సబ్జెక్టుకు రాష్ట్ర వ్యాప్తంగా పది మంది ఉపాధ్యాయుల చొప్పున ఎంపిక చేశారు. వీరు జిల్లా రిసోర్స్ పర్సన్స్‌కు శిక్షణ ఇవ్వనున్నారు. రాజు ఎంపికవడంపై పలువురు అభినందనలు తెలిపారు. -
పాకిస్తాన్ జెండాను కాళ్లతో తొక్కిన మైనార్టీలు
రాయికల్: జమ్ముకశ్మీర్‌లోని పహెల్గమ్లో యాత్రికులపై ఉగ్రవాదుల దాడికి నిరసనగా మంగళవారం జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని మైనార్టీలు, యువజన సంఘం సభ్యులు స్థానిక పాతబస్టాండ్‌లో పాకిస్తాన్ జాతీయ జెండాను చించివేసి కాళ్లతో తొక్కారు. మైనార్టీలు మాట్లాడుతూ.. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను వెంటనే అంతమొందించి దేశాన్ని కాపాడాలని కోరారు. దేశంలో మైనార్టీలు, హిందువులంతా ఒక్కటేనని పిలుపునిచ్చారు. గుండెపోటుతో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మృతిజగిత్యాలరూరల్: జగిత్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన గడ్డం దశరథరెడ్డి (75) మంగళవారం గుండెపోటుతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన మృతిపట్ల వివిధ పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. మామిడి చెట్టుపై నుంచి పడి కూలీ..జగిత్యాలక్రైం: జగిత్యాలరూరల్ మండలం అంతర్గాం శివారులో మామిడికాయలు తెంపుతుండగా.. ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడి సీతారాం సాయక్కర్ (57) మృతిచెందాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రం బృహంపూర్ జిల్లా నవాలా గ్రామానికి చెందిన సాయక్కర్ కొన్నాళ్ల క్రితం పట్టణానికి వచ్చి దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. మామిడికాయలు తెంపేందుకు కూలికి వెళ్లి చెట్టు కొమ్మ విరిగి కింద పడటంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. మృతుడి బంధువు పరిమళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలుఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ శివారులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అల్మాస్‌పూర్‌కు చెందిన ఆటోడ్రైవర్ నీరంక శంకర్ తీవ్రంగా గాయపడ్డాడు. సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఘటన స్థలం నుంచి క్షతగాత్రుడిని 108 వాహనంలో సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. వివరాలు.. శంకర్ తన తల్లి ఏడాది క్రితం మృతిచెందడంతో సంవత్సరీకం చేయడానికి సరుకులు తీసుకొచ్చేందుకు వెంకటాపూర్ వెళ్తున్నాడు. అదే సమయంలో సిరిసిల్ల నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న కారు వెంకటాపూర్ శివారులో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శంకర్ కుడికాలు విరిగింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పెంపుడు కుక్కకు అంత్యక్రియలుమెట్పల్లిరూరల్: అల్లారుముద్దుగా పెంచుకున్న శునకం మృతి చెందడంతో దిగులు చెందిన యజమాని అంతిమ సంస్కారాలు నిర్వహించిన ఘటన మెట్పల్లి మండలం బండలింగాపూర్‌లో జరిగింది. గ్రామానికి చెందిన కై ర రవి మూడేళ్ల క్రితం బెంగళూర్‌లో జర్మన్షేప్ శునకాన్ని రూ.16 వేలకు కొన్నాడు. దానికి లీయో అనే పేరు పెట్టి పెంచుకుంటున్నాడు. ఆది మంగళవారం ఉదయం అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయింది. దాని మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు పోస్ట్‌మార్టం కోసం కోరుట్ల పశువైద్య కళాశాల వైద్యులను సంపద్రించాడు. హైదరాబాద్‌లో పోస్ట్‌మార్టం చేయిస్తే కారణం తెలుస్తుందని వారు చెప్పడంతో తన ప్రయత్నాన్ని విరమించుకుని సంప్రదాయబద్ధంగా అంతిమ సంస్కారాలు నిర్వహించాడు. -
మహిళా వ్యవసాయ కళాశాల తరలింపు..?
జగిత్యాల: జగిత్యాల జిల్లా కోరుట్లలో కొనసాగుతున్న సాంఘిక సంక్షేమ గురుకులం మహిళా వ్యవసాయ డిగ్రీ కళాశాలను మానకొండూర్ నియోజకవర్గంలోని బెజ్జంకికి తరలిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాకు ఈ కళాశాల మంజూరు కాగా.. అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచనల మేరకు కోరుట్లలోని ఓ ప్రభుత్వ భవనంలో ప్రారంభించారు. అప్పటినుంచి అదే భవనంలో కొనసాగుతోంది. కళాశాలకు శాశ్వత భవనం కోసం అప్పటి మంత్రి సూచనల మేరకు వెల్గటూర్ మండలం స్తంభంపల్లిలో దాదాపు 50 ఎకరాల భూమి కేటాయించారు. అప్పటికే స్తంభంపల్లిలో ఏర్పాటు చేయదలిచిన ఇథనాల్ ఫ్యాక్టరీకి స్థలం కేటాయించగా.. ఆ ఫ్యాక్టరీ రద్దు కావడంతో సదరు స్థలాన్ని ఈ కళాశాలకు కేటాయించాలని అధికారులు నిర్ణయించారు. అయితే కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడింది. మరోవైపు ఇటీవలే వ్యవసాయ కళాశాలకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీగాను గుర్తింపు వచ్చింది. దీంతో అందులో చదువుతున్న విద్యార్థులకు ఎంతో వెసులుబాటు కలిగింది. మొదట 2023–24 విద్యా సంవత్సరంలో ఈ కళాశాలను సిద్దిపేటలో నాలుగేళ్ల బీఎస్సీ అగ్రికల్చర్ కళాశాలగా కొనసాగించారు. అక్కడ మరో కళాశాల మంజూరు కావడంతో దానిని సాంఘిక సంక్షేమ కళాశాలగా మార్చుతూ జగిత్యాలకు తరలించారు. జిల్లాకేంద్రంలో భవనం అందుబాటులో లేకపోవడంతో అప్పటి మంత్రి ఈశ్వర్ సూచనల మేరకు కోరుట్లలో ఏర్పాటు చేశారు. ఆ సమయంలో అగ్రికల్చర్ కోర్సుకు సంబంధించి వర్సిటి గుర్తింపు రాలేదు. ఫలితంగా కోర్సులో చేరిన విద్యార్థులు సందిగ్ధంలో పడిపోయారు. మొదటి సంవత్సరం పూర్తయిన విద్యార్థులు ఏ వర్సిటీ అటనామస్ కింద పరీక్షలు రాయాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ విషయం ఇటీవల ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో దానికి జయశంకర్ యూనివర్సిటీ గుర్తింపు ఇచ్చారు. దీంతో విద్యార్థులకు సమస్య లేకుండా పోయింది. ఇలాంటి తరుణంలో కళాశాలను బెజ్జంకికి తరలిస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కళాశాలకు బెజ్జంకిలో 75ఎకరాలు కేటాయించేందుకు అధికారుల బృందం పర్యటిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ విషయమై సంబంధిత ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా.. తమకు గైడ్‌లైన్స్ రాలేదని పేర్కొన్నారు. కోరుట్ల నుంచి బెజ్జంకికి తరలిస్తున్నట్లు సమాచారం -
ప్రైవేట్ ఆస్పత్రుల ఇష్టారాజ్యం
● నిబంధనలకు విరుద్ధంగా స్కానింగ్ సెంటర్లు ● జిల్లాలో యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు ● తనిఖీ అధికారులను బెదిరిస్తున్న యాజమాన్యాలు జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రిలో ఇటీవల లింగనిర్ధారణ పరీక్షలు చేశారు. ఆ తర్వాత అబార్షన్ చేస్తున్నారనే ఫిర్యాదు మేరకు డీఎంహెచ్‌వో ఆకస్మికంగా ఆస్పత్రి తనిఖీ చేశారు. సమాచారం అందుకున్న వైద్య సిబ్బంది పేషెంట్‌ను అక్కడే వదిలిపెట్టి పరారయ్యారు. ధర్మారంలోని ఓ ఆస్పత్రి యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారనే ఫిర్యాదుతో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఇటీవల తనిఖీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తున్నట్లు తేలడంతో యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. స్కానింగ్ యంత్రాన్ని సీజ్ చేశారు. గోదావరిఖనిలోని శ్రీమమత ఆస్పత్రిలో డీఎంహెచ్‌వో అన్న ప్రసన్నకుమారి సోమవారం తనిఖీలు చేశారు. అనుమతి లేనిస్కానింగ్ యంత్రాన్ని గుర్తించి సీజ్ చేశారు. అయితే, తనిఖీ కోసం ఉదయం ఆస్పత్రికి చేరుకున్న డీఎంహెచ్‌వోకు వివిధ విభాగాలను చూపించాల్సిన నిర్వాహకులు.. అటూఇటూ తిప్పుతూ కాలయాపన చేశారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఇరువర్గాలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నాయి. దీంతో పోలీసులు ఇరువర్గాలపై కేసు నమోదు చేశారు. -
డంపు.. కంపు.. నిప్పు
● సబ్‌స్టేషన్‌కు పొంచి ఉన్న ప్రమాదం ● ఆందోళనలో విద్యుత్ సిబ్బందికొత్తపల్లి: కరీంనగర్ హౌజింగ్‌బోర్డు కాలనీలోని 33/11 కె.వీ.సబ్‌స్టేషన్‌కు ప్రమాదం పొంచి ఉంది. సబ్‌స్టేషన్ ప్రహరీని ఆనుకొని మున్సిపల్ డంపింగ్ యార్డు ఉండటం విద్యుత్ సిబ్బందికి ఇబ్బందిగా మారింది. డంపింగ్ యార్డులోని చెత్తకు నిప్పు పెడుతుండటంతో సబ్‌స్టేషన్‌లోని ఆపరేటర్లు దుర్వాసన, పొగతో ఇబ్బంది పడుతున్నారు. డంపింగ్ యార్డులోని మంటలతో సబ్‌స్టేషన్‌కు ప్రమాదం పొంచి ఉంది. వేసవికాలం గాలులు వీస్తుండటంతో ప్రమాదవశాత్తు సబ్‌స్టేషన్‌లోని ట్రాన్స్ఫార్మర్లు, పవర్ ట్రాన్స్ఫార్మర్తపై పడితే, అందులోని ఆయిల్‌కు అంటుకుంటే ప్రమాదం తీవ్రంగా ఉండనుందన్న ఆందోళన సిబ్బందిలో నెలకొంది. మంగళవారం డంపింగ్ యార్డు వద్ద ముక్కుకు రుమాలు కట్టుకొని విద్యుత్ సిబ్బంది నిరసన వ్యక్తం చేసారు. అనేక మార్లు మున్సిపల్ అధికారులకు విన్నవించినప్పటికీ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దుర్వాసనతో కూడిన పొగ వల్ల స్థానికులతో పాటు తాము అనారోగ్యాల పాలవుతున్నామని, అక్కడ విధులు నిర్వర్తించడం కష్టంగా ఉందన్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి డంపింగ్ యార్డును ఎత్తేయాలని విజ్ఞప్తి చేశారు. -
గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్
కమాన్‌పూర్(మంథని): కమాన్‌పూర్ మండలం గుండారం గ్రామం రాజేంద్రనగర్ శివారులో సోమవారం మధ్యాహ్నం గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు గోదావరిఖని ఏసీపీ రమేశ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం తులసిపాక గ్రామానికి చెందిన సవలం మల్లేశ్ చింతూరు ప్రాంతం నుంచి గంజాయి తీసుకువచ్చి జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గొడిసెలపేట గ్రామానికి చెందిన అలక సందీప్, మద్దెల హరీశ్‌కు అందజేశాడు. ముగ్గురు కలిసి ద్విచక్రవాహనంపై గంజాయిని గోదావరిఖని ప్రాంతానికి తరలిస్తుండగా, పక్కా సమాచారంతో కమాన్‌పూర్ ఎస్సై ప్రసాద్ సిబ్బందితో దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. రెండు కిలోల గంజాయి, ద్విచక్రవాహనం, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. కాగా, నిందితులను పట్టుకున్న ఎస్సై ప్రసాద్, సిబ్బందిని ఏసీపీ, గోదావరిఖని టూటౌన్ సీఐ ప్రసాదరావు అభినందించారు. -
మామిడి మార్కెట్లో మాయాజాలం
● వ్యాపారులదే రాజ్యం.. నామమాత్రమైన అధికారులు ● దోపిడీపై మార్కెటింగ్ శాఖకు ఫిర్యాదులుజగిత్యాలఅగ్రికల్చర్: జగిత్యాల(చల్గల్) మామిడి మార్కెట్లో ప్రైవేట్ వ్యాపారుల ఇష్టారాజ్యం నడుస్తోంది. మార్కెట్‌కు మామిడి కాయలు తెచ్చే రైతులు, లీజుదారులను అడుగడుగునా దోచుకుంటున్నారు. ధర విషయంలో రైతులు అన్యాయానికి గురువుతున్నా.. పట్టించుకునే నాథుడే కరువయ్యారు. మామిడి మార్కెట్లో జరుగుతున్న దోపిడీ గురించి మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, రైతు సంఘం నాయకులు మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా.. మార్కెట్లో దోపిడీ మాత్రం ఆగడం లేదు. కలెక్టర్ సత్యప్రసాద్ గురువారం రాత్రి మామిడి మార్కెట్‌ను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. నోటీసులిచ్చినా అంతంతే.. మామిడి మార్కెట్లో మార్కెట్ నిబంధనల మేరకు ఓపెన్ యాక్షన్ పెట్టాలని వ్యాపారులకు నోటీసులిచ్చినా స్పందన శూన్యం. ప్రస్తుతం ఒక్కరిద్దరు వ్యాపారులు ఓపెన్ మార్కెట్లో కొనుగోలు చేస్తుండగా.. చాలామంది వ్యాపారులు కమీషన్ పద్ధతిలో కొనుగోలు చేస్తున్నారు. ఓవైపు రైతులకు సరైన ధర రాక, మరోవైపు మార్కెట్‌కు సరైన ఆదాయం లేక రెంటికి చెడ్డ రేవడిలా మామిడి మార్కెట్ మారింది. వ్యాపారులు ఇష్టారాజ్యంగా రైతులను దోచుకుంటున్నా.. అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, కలెక్టర్‌కు వినతిపత్రమిచ్చారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. లోకల్ మార్కెట్‌గా.. చల్గల్లోని రూ.కోట్ల విలువైన వాలంతరీ స్థలాన్ని మామిడి మార్కెట్‌కు కేటాయిస్తే రోజురోజుకు అభివృద్ధి చెంది ఉత్తర తెలంగాణకు ప్రతిష్టాత్మకంగా మారాల్సింది పోయి.. చివరకు లోకల్ మార్కెట్‌గా మారి ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. మామిడి మార్కెట్లో ఓపెన్ మార్కెట్ నిర్వహిస్తే.. ఢిల్లీ, నాగ్‌పూర్ తదితర ప్రాంతాల నుంచి బడా వ్యాపారులతోపాటు ఇతర దేశాలకు ఎగుమతి చేసే వ్యాపారులు వస్తారని, తద్వారా వ్యాపారుల్లో పోటీతత్వం పెరిగి ధర పెరుగుతుందని రైతులు ఆశ పడ్డారు. కాని చాలామంది లోకల్ వ్యాపారులు ఓపెన్ మార్కెట్‌ను వ్యతిరేకిస్తున్నారు. లోకల్ వ్యాపారులు రైతుల నుంచి మామిడి కాయలు కొనుగోలు చేసి కిలోకు రూ.2–5 కమీషన్‌పై ఢిల్లీ, నాగ్‌పూర్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఢిల్లీ వ్యాపారులతో ఏదో ఓ ధర మాట్లాడుకొని లోకల్ వ్యాపారులు కాయను నేరుగా పంపిస్తున్నారు. కటింగ్ల పేరిట దోపిడీ వ్యాపారులు ఆ కటింగ్, ఈ కటింగ్ అంటూ రైతులను దోపిడీ చేస్తున్నారు. కాయకు ధర నిర్ణయించిన తర్వాత ప్రైవేట్ ఎలక్ట్రానిక్ కాంటాపై తూకం వేసి వ్యాపారికి సంబంధించిన షెడ్లో కాయలు పోయమంటారు. తూకం వేయించిన కాగితం వెనక వైపునే లెక్కలు వేసి ఇచ్చి డబ్బుల కోసం తర్వాత రమ్మంటారు. కటింగ్ల పేరిట వ్యాపారులు రెండు పద్ధతులు అవలంబిస్తున్నారు. మొదటి పద్ధతిలో మార్కెట్ ధరకు రూ.3–4 తగ్గించి టన్నుకు క్వింటాల్ కాయలను తరుగు పేరిట తీసేస్తున్నారు. రెండో పద్ధతిలో రాటన్ పేరిట రైతులు తీసుకొచ్చిన కాయలను గ్రేడింగ్ చేసి చిన్న కాయ అంటూ సగానికి సగం ఏరేస్తున్నారు. సగం కాయలకు మంచి ధర, మరో సగం కాయలకు రూ.7–8 ధర నిర్ణయిస్తున్నారు. సూట్ పేరిట టన్నుకు 50 కిలోలు తీసేస్తున్నారు. ఇక కమీషన్ పేరిట 4 శాతం కటింగ్.. ఇలా ఎంత వీలైంతే అంతమేరకు దోచుకునే పనిలో వ్యాపారులున్నారు. రైతులతో ఆడుకుంటున్న వ్యాపారులు కోర్రీలు పెడుతూ మామిడి రైతులతో వ్యాపారులు ఆడుకుంటున్నారు. కమీషన్ పద్ధతిలో కొనుగోలు చేస్తుండటంతో.. రైతులు కాయలు తెంపే ముందు ఒకటి, రెండు రోజుల ముందు నాలుగైదు శాంపిల్ కాయలను తీసుకొచ్చి వ్యాపారులకు చూపిస్తారు. ఓ ధర చెప్పి మార్కెట్‌కు రెండు రోజుల తర్వాత తీసుకరమ్మంటారు. చివరకు రైతులు కాయలను మార్కెట్‌కు తీసుకొచ్చిన తర్వాత కాయలు నాణ్యతగా లేవు.. మాట్లాడుకున్న ధర ఇవ్వం.. మరో ధర ఇస్తామంటూ పేచీలు పెడుతున్నారు. కాయలు చెడిపోతాయనే ఉద్దేశంతో గత్యంతరం లేక ఏదో ఓ ధరకు వ్యాపారులకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ధర తగ్గిస్తున్న వ్యాపారులు ప్రస్తుతం కొంతమేర మామిడి కాయలు మార్కెట్‌కు వస్తుండటంతో ధర తగ్గిస్తున్నారు. ప్రస్తుతం బెంగినపల్లికి ధర కిలో రూ.25–55, దశేరి రకం కిలో రూ.53–70, హిమాయత్ రకం రూ.80–110 వరకు పలుకుతోంది. ఈసారి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో.. మామిడి కాయ అంతంతమాత్రంగానే మార్కెట్కొస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌కు 1,500–2,000 క్వింటాళ్ల వరకే వచ్చింది. పట్టించుకోవడం లేదు ఉత్తర తెలంగాణలో మామిడి మార్కెట్‌గా ప్రసిద్ధి గాంచిన చల్గల్ మామిడి మార్కెట్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదు. ధరలు, కటింగ్ల విషయంలో వ్యాపారుల ఇష్టారాజ్యమే నడుస్తోంది. రైతులను పట్టించుకోవడమే మానేశారు. వ్యాపారుల దోపిడీతో తోటలను ఏదో ఓ ధరకు లీజుకివ్వాల్సిన పరిస్థితి దాపురించింది. – నక్కల తిరుపతిరెడ్డి, తొంబరావుపేట, మేడిపల్లిపరిస్థితులను చక్కదిద్దుతున్నాం మామిడి మార్కెట్ పరిస్థితులను చక్కదిద్దుతున్నాం. ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే మా దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తాం. ఓపెన్ మార్కెట్‌ను పెద్దఎత్తున నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఓపెన్ మార్కెట్ నిర్వహించిన వ్యాపారులకు నోటీసులిచ్చాం. – రాజశేఖర్, మార్కెట్ కార్యదర్శి, జగిత్యాల -
మారుమోగిన శివనామస్మరణ
వేములవాడ: ఎండలను సైతం లెక్కచేయకుండా భక్తులు రాజన్న దర్శనానికి తరలివస్తున్నారు. సోమవారం 50వేల మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తుల రద్దీని గమనించిన ఆలయ అధికారులు క్యూలైన్లను కట్టడి చేశారు. భక్తుల ద్వారా రూ.55లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. శంకర జయంతి వేడుకలు ప్రారంభం రాజన్న సన్నిధిలో ఐదు రోజులపాటు జరిగే శంకర జయంతి వేడుకలు సోమవారం అద్దాల మంటపంలో ఇన్చార్జి స్థానాచార్యులు ఉమేశ్‌శర్మ ఆధ్వర్యంలో ఆరంభమయ్యాయి. స్వామి వారికి అభిషేకం నిర్వహించారు. శంకరాచార్య సహస్ర నామ పారాయణం, శివగీత–శివసహస్ర నామ పారాయణం జరిపించారు.● దర్శించుకున్న 50 వేల మంది భక్తులు -
భర్తను సరిగా చూసుకోలేకపోతున్నానని..
● మానేరుడ్యాంలో దూకి వృద్ధురాలి ఆత్మహత్యతిమ్మాపూర్(మానకొండూర్): అనారోగ్యంతో మంచం పట్టిన భర్తకు సేవ చేయలేనని, తాను కూడా అనారోగ్యానికి గురవుతున్నానని మనస్తాపం చెందిన భార్య మానేరు జలాశయంలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఎల్ఎండీ పోలీసుల వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా గుగ్గిళ్లకు చెందిన నర్సమ్మ(60) భర్తకు గుండెపోటు రావడంతో మంచానికే పరిమితం అయ్యాడు. కొడుకులు ఇద్దరు హైదరాబాద్‌లో ఉంటున్నారు. భర్తతో పాటు నర్సమ్మ కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. తన భర్తను సమర్థవంతంగా చూసుకోలేకపోతున్నానని మనస్తాపానికి గురైంది. కొడుకులు సైతం దూరంగా ఉండడంతో ఆమె మానసిక ఒత్తిడిని మరింత పెంచింది. ఏప్రిల్ 27న సాయంత్రం 4 గంటల సమయంలో నర్సమ్మ శ్రీకరీంనగర్ వెళ్లి వస్తాన్ఙు అని భర్తకు చెప్పి బయటకు వెళ్లి తిరిగి ఇల్లు చేరలేదు. దీంతో ఆందోళన చెందిన భర్త కొడుకులకు ఫోన్లో సమాచారం ఇచ్చాడు. సోమవారం మానేరు డ్యాంలో ఆమె మృతదేహం తేలింది. మృతురాలి చిన్న కొడుకు శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదుతో ఎల్ఎండీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మాట్లాడుకుందామని.. మట్టుబెట్టాడు
పెద్దపల్లిరూరల్: అక్రమసంబంధం నేపథ్యంలో అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. తన భార్యతో సన్నిహితంగా మెలగడాన్ని జీర్ణించుకోలేక.. ఈ విషయమై కొంతకాలంగా సదరు యువకుడితో గొడవ జరుగుతున్నా.. అతడిలో మార్పు రాకపోవడం.. తను కాదంటున్న వెంట పడుతున్నాడంటూ భార్య చెప్పడంతో రగిలిపోయిన భర్త.. మాట్లాడుకుందాం రా.. అని పిలిచి కిరాతకంగా చంపేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన పొలం కుమార్(35) తన భార్య అనిత, ముగ్గురు పిల్లలతో పెద్దపల్లిలోనే నివాసముంటూ ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అలాగే ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామానికి చెందిన వేల్పుల సంతోష్‌కుమార్‌కు కుమార్ భార్య అనిత పినతల్లి కూతురు శైలజతో పెళ్లయింది. వరసకు మరదలు అయ్యే శైలజతో కుమార్ చనువుగా మెదలుతుండడాన్ని సంతోష్ తట్టుకోలేక పోయాడు. ఈ విషయమై కుమార్‌తో గొడవకు దిగాడు. కొంతకాలంగా గొడవలు జరుగుతున్నా కుమార్ ప్రవర్తనలో తేడా కనిపించలేదు. తన భార్య శైలజను నిలదీయడంతో తను కాదంటున్న వెంటపడుతూ వేధిస్తున్నాడంటూ చెప్పడంతో సంతోష్‌లో కోపం ఉగ్రస్థాయికి చేరింది. ఈక్రమంలో సోమవారం సంతోష్ ‘మాట్లాడుకుందాం రా’ అని కుమార్‌ను పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు పిలిచాడు. మార్కెట్ యార్డు ఆవరణలో తన భార్య, అక్కడున్నవారు చూస్తుండగానే కుమార్‌ను సంతోష్ కత్తితో నరికిచంపాడు. ఘటన స్థలాన్ని డీసీపీ కరుణాకర్, సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సైలు లక్ష్మణ్‌రావు, మల్లేశ్ పరిశీలించారు. రమ్మని పిలిచి చంపేశారు.. పొలం కుమార్ ఇంట్లో ఉండగా సంతోష్‌కుమార్, శైలజ నుంచి ఫోన్ వచ్చిందని మృతుడి భార్య అనిత తెలిపింది. వెంటనే బయటకు వెళ్తుండగా ఎక్కడికి అని అడిగితే ‘సంతోష్, శైలజ తనతో మాట్లాడుతారట. వ్యవసాయ మార్కెట్‌యార్డుకు రమ్మంటున్నారు’. అని బయటకు వెళ్లి ఇలా ప్రాణాలు కోల్పోయాడని రోదించింది. శైలజ తన భర్తతో చనువుగా ఉంటూ తన తప్పును కప్పి పుచ్చుకునేందుకు వెంట పడుతున్నాడంటూ చెప్పి కోపం పెరిగేలా చేసిందని పేర్కొంది. అక్రమసంబంధం ఉందనే అనుమానంతో తన భర్తను దారుణంగా చంపారని విలపించింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు విచారణ జరుపుతున్నట్లు సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం అందరూ చూస్తుండగానే అఘాయిత్యం కొంతకాలంగా ఇరువురి మధ్య గొడవలు మృతుడు, హంతకుడు సమీప బంధువులే -
వేములవాడలో ఆధునిక అన్నదాన సత్రం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ: రాజన్నను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు నిరంతరం అన్నదానం అందించేందుకు రూ.35కోట్లతో అన్నదాన సత్రాన్ని అత్యాధునిక పద్ధతుల్లో నిర్మించనున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. శృంగేరి పర్యటనలో ఉన్న అధికా రుల బృందం అక్కడి కొల్లూరు మూకాంబిక అమ్మవారిని సోమవారం దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలోని నిత్యాన్నదాన సత్రాన్ని పరిశీలించారు. వేములవాడలో అత్యాధునిక పద్ధతుల్లో అన్నదాన సత్రం నిర్మించేందుకు టెండర్లు పిలువనున్నట్లు తెలిపారు. ఆలయ ఈవో కొప్పుల వినోద్‌రెడ్డి, ఆర్కిటెక్ట్ సూర్యనారాయణమూర్తి, అర్చకులు చంద్రగిరి శరత్‌శర్మ, సురేష్‌శర్మ, ఏఈ రాంకిషన్‌రావు తదితరులు ఉన్నారు. జాతీయపోటీలకు ఎంపికకరీంనగర్స్పోర్ట్స్: హైదరాబాద్‌లో ఫిబ్రవరిలో జ రిగిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ స్కేటింగ్ పోటీల్లో పా ల్గొన్న జిల్లాకు చెందిన శ్రీహాన్సి రెండు బంగారు పతకాలు సాధించి, ఈనెల 30నుంచి ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి ఎస్జీఎఫ్ పోటీలకు ఎంపికై నట్లు ఎస్జీఎఫ్ కార్యదర్శి వేణుగోపాల్ తెలిపారు. శ్రీహన్సిని జిల్లా విద్యాధికారి సీహెచ్ జనార్దన్‌రావు సోమవారం అభినందించారు. జాతీయ పోటీల్లో రాణించి బంగారు పతకం సాధించాలని సూచించారు. సెక్టోరియల్ అధికారి కర్ర అశోక్‌రెడ్డి, కోచ్ నరహరి పాల్గొన్నారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
జగిత్యాలక్రైం: జగిత్యాలరూరల్ మండలం సోమన్పల్లికి చెందిన రైతు కొరండ్ల సంతోష్‌రెడ్డి (35) అప్పుల బాధతో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై కథనం ప్రకారం.. సంతోష్‌రెడ్డికి మూడెకరాల భూమి ఉంది. అనారోగ్యం, ఇతర సమస్యలతో అప్పులు పెరిగాయి. అతనికున్న భూమిలో రెండెకరాలు విక్రయించి అప్పు చెల్లించినా తీరకపోవడంతో మనస్తాపానికి గురై ఆదివారం క్రిమిసంహారక మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. మృతుడి భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు. సంతోష్‌రెడ్డికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. మనోవేదనతో వృద్ధుడు..గోదావరిఖని(రామగుండం): స్థానిక విఠల్‌నగర్‌కు చెందిన సింగరేణి రిటైర్డ్ కార్మికుడు జంగ మల్లయ్య(80) సోమవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వన్‌టౌన్ ఎస్సై రమేశ్ కథనం ప్రకారం.. మల్లయ్య భార్య కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. అప్పటినుంచి మల్లయ్య పిల్లల వద్దకు వెళ్లకుండా ఇంట్లో ఒక్కడే ఉంటూ మానసికంగా బాధపడేవాడు. ఈక్రమంలో తీవ్ర మనో వేధనకు గురై ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కూతురు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతికరీంనగర్క్రైం: నగరంలోని కోతిరాంపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. గన్నేరువరం మండలం ఖాసీంపేట గ్రామానికి చెందిన తిప్పర్తి రాజమౌళి కుమారుడు హరికృష్ణ(38) కరీంనగర్‌లోని లక్ష్మినగర్‌లో నివాసం ఉంటూ గోల్డ్‌స్మిత్‌గా పనిచేస్తున్నాడు. హరికృష్ణ, మరోవ్యక్తి పరిపూర్ణచారి కలిసి బైక్‌పై కోతిరాంపూర్ వద్ద యూటర్న్ తీసుకుంటుండగా హైదరాబాద్ నుంచి వస్తున్న కారు ఢీ కొట్టింది. హరికృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. పరిపూర్ణచారికి తీవ్రగాయాలయ్యాయి. వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. లారీ ఢీకొని ఒకరు..మల్యాల: లారీ ఢీకొని ఓ యువకుడు దుర్మరణం పాలైన ఘటన మల్యాల మండలం రాజారాం శివారులో చోటుచేసుకుంది. ఇదే ఘటనలో మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన అల్లెపు బాలయ్య, శారద కుమారుడు అల్లెపు నరేశ్(18) జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తిచేశాడు. సోమవారం తన బంధువు బోదాసు రాజ్‌కుమార్‌తో కలిసి జగిత్యాల వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వస్తుండగా రాజారం శివారుకు రాగానే జగిత్యాల నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న లారీ బైక్‌ను వెనుక నుంచి ఢీకొంది. ఈ సంఘటనలో యువకులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు బాఽధితులను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు నరేశ్ అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. రాజ్‌కుమార్ చికిత్స పొందుతున్నాడు. నరేశ్ బంధువుల ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేశ్‌కుమార్ తెలిపారు. ద్విచక్రవాహనం పైనుంచి పడి మహిళ..మెట్‌పల్లిరూరల్: ద్విచక్రవాహనంపై నుంచి కింద పడి ఓ మహిళ మృతి చెందిన ఘటన మెట్పల్లి మండలం జగ్గాసాగర్‌లో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామంలోని ఒడ్డెర కాలనీకి చెందిన దండుగుల లస్మవ్వ (44) భర్త నర్సయ్యతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తోంది. గ్రామ శివారులోకి చేరగానే ద్విచక్రవాహనంపై కింద పడిపోయింది. గాయపడిన లస్మవ్వను చికిత్స నిమిత్తం మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. లస్మవ్వకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. రూ.50లక్షలతో బోర్డు తిప్పేసిన వ్యాపారి?తంగళ్లపల్లి(సిరిసిల్ల): నమ్మిన వారిని మోసం చేసి రూ.50 లక్షలతో బోర్డు తిప్పేసిన వ్యాపారి ఉదంతం తంగళ్లపల్లి మండలం పద్మనగర్‌లో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యాపారి ప్రధాన రహదారి పక్కన షెట్టర్ అద్దెకు తీసుకుని కొన్నేళ్లుగా బట్టలు, పండ్లు, కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. అందరితో కలివిడిగా ఉండి పద్మనగర్‌లో సొంతిల్లు ఉంది. అదే అదునుగా అందినకాడికి అప్పులుచేసి రాత్రికి రాత్రే బిచాన ఎత్తేశాడని గ్రామస్తులు గగ్గోలు పెడుతున్నారు. ఒకరికి తెలియకుండా మరొకరు సుమారు రూ.50లక్షల వరకు ముట్టజెప్పినట్లు తెలిసింది. కానీ ఎవరూ ఫిర్యాదు చేయడానికి ముందుకు రాకపోవడం శోచనీయం. ఈ ఘటనపై తంగళ్లపల్లి ఎస్సై బి.రామ్మోహన్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా ఫిర్యాదు రాలేదని తెలిపారు. -
హత్యకేసు భయంతో వ్యక్తి బలవన్మరణం
పాలకుర్తి(రామగుండం): వివాహిత హత్య ఘటనలో నిందితుడిగా కేసు నమోదైన నేపథ్యంలో ఓ వ్యక్తి భయంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం బసంత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై స్వామి తెలిపిన వివరాలు.. మంథని మండలం లక్కెపూర్ గ్రామానికి చెందిన పండుగ మొగిలి(45) గ్రామంలో వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా మొగిలి మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన ఓ వివాహితతో తరచూ ఫోన్లో మాట్లాడుతుండేవాడు. ఈ విషయమై కుటుంబసభ్యులు పలుమార్లు హెచ్చరించినా అతడిలో మార్పు రాలేదు. ఈక్రమంలో ఈనెల 25న సదరు వివాహిత లక్కేపూర్‌లో హత్యకు గురైంది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు మొగిలిపై మంథని పోలీసులు కేసు నమోదు చేశారు. అదే రోజు మొగిలి మంచిర్యాలలోని తన అన్నకూతురు ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని ఆమెకు తెలిపి పోలీసులకు లొంగిపోతానని చెప్పాడు. సోమవారం పాలకుర్తి మండలం కొత్తపల్లి శివారులోని మామిడితోటలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం గ్రామస్తులు గమనించి పోలీసులకు సమచారమిచ్చారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
నాణ్యతలో తిరుగులేని భారతి సిమెంట్
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): సిమెంట్ వ్యాపారరంగంలో తిరుగులేని ఏకై క సంస్థగా భారతి సిమెంట్ నాణ్యత, మన్నికలో వినియోగదారుల అభిమానాన్ని చూరగొంటుందని ఆ సంస్థ టెక్నికల్ ఇంజినీర్ సాగర్‌రెడ్డి అన్నారు. భారతి సిమెంట్ నేతృత్వంలో సోమవారం మండలకేంద్రంలో తాపీమేసీ్త్రలకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సాగర్‌రెడ్డి మాట్లాడుతూ, భారతి సిమెంట్ వేరే సిమెంట్ కన్నా మూడురెట్లు మెరుగైనదని బిల్డర్స్, వినియోగదారులు, తాపీమేసీ్త్రలు చెప్పడం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుందన్నారు. వినియోగదారులకు ఉచిత సాంకేతిక సాయం, సలహాలు అందజేస్తూ ప్రత్యక్ష సంబంధాలు ఏర్పాటు చేసుకుందని వివరించారు. అనంతరం 50 మంది తాపీమేసీ్త్రలకు రూ.లక్ష ఉచిత ప్రమాద బీమా బాండ్లు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక డీలర్ కానుగంటి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
‘తోట’ సిగలో ‘యుధ్వీర్’ అవార్డు
బోయినపల్లి(చొప్పదండి): అంతర్జాతీయ చిత్ర కళాకారుడు తోట వైకుంఠం మరో ప్రతిష్టాత్మక అవార్డు అందుకోబోతున్నారు. తాజాగా 32వ యుద్వీర్ ఫౌండేషన్ స్మారక అవార్డుకు ఎంపికయ్యారు. చిత్రకళలో చేసిన సేవలకు అవార్డు ప్రదానం చేయనున్నట్లు ఫౌండేషన్ వారు తెలిపారు. ఈనెల 30న హైదరాబాద్ రెడ్‌హిల్స్‌లోని ఎఫ్‌టీసీసీఐలో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ చేతుల మీదుగా అవార్డు, రూ.లక్షల నగదు బహుమతి అందించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. 1942లో బూర్గుపల్లి గ్రామంలో జన్మించిన తోట వైకుంఠం చిత్రకారుడిగా అంచెలంచెలుగా ఎదిగి అంతర్జాతీయ చిత్రకళా రంగంలో తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసి జిల్లా గర్వించదగ్గ వ్యక్తిగా నిలిచారు. సెప్టెంబర్ 2023లో ముంబై కేంద్రంగా పని చేసే అస్తాగురు అక్షన్ హౌస్ మోడరన్ ట్రేజర్స్ వేలం పాటలో తోట వైకుంఠం గీసిన కళాఖండానికి సుమారు రూ.కోటిన్నర ధర పలికింది. అపుడు వేలం పాటలో ఆయన గీసిన ఏడేళ్ల నాటి చిత్రం ఏకంగా రూ.1,41,35,220 ధర పలికింది. యాక్రిలిక్–ఆన్–కాన్వస్ వర్క్ ఆయన అత్యున్నత చిత్రకళా నైపుణ్యానికి నగదు ప్రోత్సాహం అందింది. చిన్నతనం నుంచే చిత్రకారుడు కావాలన్న బలీయమైన కోరిక ఆయనను గొప్ప చిత్రకారుడిగా తీర్చిదిద్దింది. సంప్రదాయ దుస్తులు, రంగుల చీరలతో ఉన్న ఆయన గీసిన మహిళల చిత్రాలు చూస్తే.. మహిళల చర్మ సౌందర్యం ప్రతిబింబిస్తుంది. డ్రెస్సింగ్‌తో మగవారి చిత్రాలు, డస్కీ స్కిన్‌తో మహిళల చిత్రాలు గీయడం వైకుంఠం ప్రత్యేకత. అమ్మ వంట గది వస్తువులతో.. చిత్రకారుడిగా గుర్తింపు పొందడానికి అమ్మ, తెలంగాణ మహిళలే స్ఫూర్తని వైకుంఠం అన్నారు. అమ్మ వంట గదిలో ఉండే వస్తువులన్నీ తన చిత్రకళకు ఉపయోగపడ్డాయని చెప్పారు. రాముడు, కృష్ణుడు, రావణుడు, హనుమంతుడు, సీత, సత్యభామ లాంటి వేషాలకు తానే మేకప్ వేసి రంగులు దిద్దేవాడిన న్నారు. బూర్గుపల్లిలో విద్యాభ్యాసం బూర్గుపల్లిలో పోశెట్టి సారు దగ్గర అమ్మ అక్షరాలు నేర్పించింది. బోయినపల్లి, శాత్రాజ్పల్లి, వేములవాడ, సిరిసిల్లలో చదివి చివరకు హైదరాబాద్‌లోని కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో చిత్రలేఖనం నేర్చుకున్నారు. మహారాజ సయాజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడాలో కేజీ సుబ్రమణియన్ దగ్గర శిష్యరికం చేశారు. చిత్రాల తోట.. వైకుంఠం గీసిన చిత్రాలు మన దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం ప్రదర్శింపబడ్డాయి. ఆయన గీసిన చిత్రాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ చిత్రాలు కొనుగోలు చేయడానికి పోటీ పడతారు. అనేక అవార్డులు.. భోపాల్ రాష్ట్రంలో రెండేళ్లకోసారి ఇచ్చే భారత్‌భవన్ అవార్డుతోపాటు భారత ప్రభుత్వం ఓసారి జాతీ య అవార్డు, ఉమ్మడి రాష్ట్రంలో హంస అవార్డు ఇచ్చి ఆయనను సత్కరించింది. తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ చిత్ర కళాకారుడి అవార్డు లభించింది. ఆయన దాసి, మాభూమి చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేయగా.. దాసి చిత్రానికి ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్‌గా జాతీయ అవార్డు రావడం మరచిపోలేని అను భూతిగా ఆయన పేర్కొంటారు. రంగుల్లో ఎర్ర, ఆకుపచ్చ, నీలం రంగులు తనకు ఇష్టంగా పేర్కొంటారు. రంగులు కలిపి చిత్రాలు గీయడం ఆయనకు ఇష్టముండదు. వైకుంఠంపై పలువురు డాక్యుమెంటరీ చిత్రాలు తీశారు. బూర్గుపల్లిలో పాఠశాల అభివృద్ధికి గతంలో విరాళాలందించారు. ఎన్నో అవార్డులు.. మరెన్నో రివార్డులు గతంలో వేలం పాటలో రూ.కోటికి పైగా పలికిన చిత్రం తెలంగాణకే తలమానికం.. మన బూర్గుపల్లి వైకుంఠం -
సభ సక్సెస్.. మంత్రుల్లో భయం
● సమ్మక్క జాతరను తలపించిన రజతోత్సవం ● బీఆర్ఎస్, కేసీఆర్‌ను విమర్శిస్తే సహించేది లేదు ● మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్కరీంనగర్: బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ పార్టీ మంత్రుల్లో భయం పట్టుకుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. సోమవారం కమలాకర్ నివాసంలో మాట్లాడుతూ.. రజతోత్సవ సభను చూసి ప్రభుత్వం ఉలిక్కిపాటుకు గురైందన్నారు. ప్రైవే టు పాఠశాలల యజమాన్యానికి ఆర్టీఏ ద్వారా మెసేజ్‌లు పంపి, సభకు బస్సులు పంపకుండా ప్రభుత్వం అడ్డుకుందన్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వానికి భయపడకుండా బస్సులు పంపారని కృతజ్ఞతలు తెలిపా రు. తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రి పొంగులేటి వైఎస్సార్సీపీలో ఉన్నారని, సీతక్క టీడీపీలో ఉన్నారని గుర్తుచేశారు. హామీలు నెరవేర్చటంలో కాంగ్రెస్ విఫలమైందని విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలో సబ్బండ వర్గాలు ఏకమై చేసిన పోరాటంతోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి రజతోత్సవ వేడుకలకు భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, పార్టీ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్, కరీంనగర్ ఫ్యాక్స్ చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్‌రెడ్డి, అనిల్ కుమార్ గౌడ్, ఏనుగు రవీందర్‌రెడ్డి, రుద్రరాజు పాల్గొన్నారు. -
బైపాస్ పనులకు బ్రేక్!
● పెద్దపల్లి రైల్వే బైపాస్ లైన్లో అనూహ్య మలుపు! ● తొలుత మే నెలాఖరుకు ప్రారంభిస్తారని ప్రచారం ● పనులు జరుగుతున్న తీరుపై అధికారుల అసంతృప్తి? ● పూర్తి అయ్యేందుకు మరింత సమయం ● ఐఆర్సీటీసీలో కానరాని కరీంనగర్– తిరుపతి రైలు ● నిజామాబాద్ వరకు పొడిగింపుపై ఉత్కంఠసాక్షిప్రతినిధి,కరీంనగర్: జగిత్యాల– పెద్దపల్లి సెక్షన్‌లోని బైపాస్ రైల్వేలైన్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఇటీవల పనులు వేగంగా సాగాయి. కానీ.. అకస్మాత్తుగా పెద్దపల్లి బైపాస్‌లో పనులు నిలిచిపోయాయని సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పెద్దపల్లి బైపాస్ పనులు నిబంధనల మేరకు జరగడం లేదని, పనుల్లో నాణ్యతపై ఉన్నతాధికారులు అసంతృప్తిగా ఉన్నారని, తదుపరి ఆదేశాలు వచ్చేసరికి పనులు నిలిపివేయాలని ఆదేశించినట్లు తెలిసింది. దీంతో వచ్చే నెలాఖరును ప్రారంభం కావాల్సిన రైల్వేలైన్ మరికాస్త ఆలస్యం కానుందని సమాచా రం. వాస్తవానికి మార్చి ఆఖరునాటికి బైపాస్ పనులు పూర్తయ్యాయని ప్రచారం జరిగింది. మార్చి 28 నుంచి ఇంటర్‌లాకింగ్ పనులు మొదలవుతాయని, ఉగాది కల్లా పనులు పూర్తవుతాయని, ఉన్నతాధికారులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశాక.. మే నెలాఖరునాటికి బైపాస్ లైన్‌ను అందుబాటులోకి తీసుకువస్తారని అనుకున్నారంతా. కానీ, అనూహ్యంగా ఇటీవల ఇంటర్‌లాకింగ్ పను ల పరిశీలనకు వచ్చిన రైల్వే ఉన్నతాధికారులు పనులు నిబంధనల ప్రకారం జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిసింది. మొత్తం 1.78 కిమీ పొడవున్న రైల్వేలైన్‌లో 500 మీటర్ల వరకు కొన్ని మార్పులు చేయాలని సూచించినట్లు సమాచారం. దీంతో బైపాస్ రైల్వేలైన్ ప్రారంభం మరింత ఆలస్యం కానుంది. జూన్ నుంచి కానరాని కరీంనగర్– తిరుపతి రైలు కరీంనగర్ నుంచి పెద్దపల్లి మీదుగా తిరుపతివెళ్లే కరీంనగర్– తిరుపతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు మొన్నటి వరకు మే 29 తేదీ నుంచి పెద్దపల్లిలో ఆగకుండా నేరుగా బైపాస్ మీదుగా వెళ్తుందని ప్రచారం జరిగింది. దీన్ని బలపరుస్తూ ఐఆర్సీటీసీ పోర్టర్‌లోనూ మే 29 తరువాత పెద్దపల్లి రైల్వేస్టేషన్ కనిపించలేదు. జూన్ 1 నుంచి కరీంనగర్–తిరుపతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఐఆర్సీటీసీ పోర్టర్లో కానరావడం లేదు. దీనికి కారణాలు అంతుచిక్కడం లేదు. ప్రస్తుతం బైవీక్లీగా ఉన్న ఈ సర్వీసు కరీంనగర్‌కు ఉదయం 8.15 గంటలకు వస్తుంది. ఆ తరువాత సాయంత్రం 7.15 గంటలకు తిరిగి తిరుపతి బయల్దేరుతుంది. ఈనేపథ్యంలో ఈ రైలును నిజామాబాద్ వరకు పొడగిస్తారని ప్రచారం సాగుతోంది. మొత్తానికి ఈ రైలును పొడిగిస్తారా? లేదా సర్వీసును వారానికి ఐదురోజుల పెంచుతారా? అన్నది ఉత్కంఠ రేపుతోంది. పెద్దపల్లి రైల్వేబైపాస్లో స్టేషన్ కట్టాల్సిందే అదే సమయంలో బైపాస్ రైల్వే లైన్ వద్ద హాల్టింగ్ లేకుండా ప్రారంభమైతే.. తాము తిరుపతి వెళ్లేందుకు అవకాశం కోల్పోతామని పెద్దపల్లిలో రైలెక్కే మంచిర్యాల, రామగుండం, బెల్లంపల్లి, లక్షెట్టిపేట, సిర్పూర్ కాగజ్‌నగర్, చెన్నూరు, ధర్మారం, ఆసిఫాబాద్ భక్తులు ఆందోళన చెందుతున్నారు. లేకపోతే గతంలోలా తామంతా కాజీపేట వరకు ప్రయాణం చేసి పద్మావతి లాంటి రైళ్లను అందుకోవాల్సి వస్తుందని, ఇది దూరాభారంతోపాటు తమకు సమయం కూడా వృథా అవుతుందని వాపోతున్నారు. దీనికి పరిష్కారంగా పెద్దపల్లి బైపాస్ క్యాబిన్ వద్ద రైల్వేస్టేషన్ నిర్మించి, తిరుపతి–కరీంనగర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుకు హాల్టింగ్ ఇవ్వాలని కోరుతున్నారు. -
‘పద్మ’గ్రహీతలకు అభినందనలు
కరీంనగర్ టౌన్: రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ చేతుల మీదుగా పద్మ అవార్డులు అందుకున్న తెలుగు ప్రముఖులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం రాత్రి న్యూఢిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో జరిగిన అవార్డుల కార్యక్రమానికి హాజరయ్యారు. పద్మ విభూషణ్ అందుకున్న దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి, పద్మ భూషణ్ అందుకున్న బాలకృష్ణ, పద్మశ్రీ అవార్డు అందుకున్న మాడుగుల నాగఫణి శర్మను అభినందించారు. ఇది తెలుగు ప్రజలకు దక్కిన గౌరవం అని హర్షం వ్యక్తం చేశారు. బస్టాండ్‌లో ఔట్పోస్టుకరీంనగర్క్రైం: కరీంనగర్ బస్టాండ్‌లో పోలీసు ఔట్ పోస్టును సోమవారం సీపీ గౌస్ ఆలం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. బస్టాండ్‌లో దొంగతనాల నియంత్రణకు అవుట్‌పోస్ట్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపా రు. 24గంటల పాటు పోలీసుసిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. టౌన్ ఏసీపీ వెంకట స్వామి, వన్‌టౌన్ సీఐ బిల్లా కోటేశ్వర్, ఎస్సై రాజన్న, ఆర్టీసీ అధికారులు ఎస్.భూపతిరెడ్డి, విజయమాధురి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మనిషికి ఆధార్.. కమతానికి భూధార్
వీణవంక/మానకొండూర్: మనిషికి ఆధార్‌కార్డు మాదిరిగా కమతానికి భూధార్ సంఖ్య కేటాయించడం జరుగుతుందని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. భూ భారతి చట్టంతో సాదాబైనామా దరఖాస్తులకు పరిష్కారం లభిస్తుందని సూచించారు. ఈ మేరకు వీణవంక మండలం చల్లూరు రైతువేదికలో భూభారతి చట్టంపై సోమవారం అవగాహన కల్పించారు. ధరణిలో పొరపాట్లను సవరించేందుకు కలెక్టర్లకు మినహా ఏ అధికారికి అవకాశం లేదని, భూ భారతితో తహసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు మార్పులు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. అనంతరం గ్రామంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడారు. ధాన్యం సకాలంలో తూకం వేసి మిల్లులకు పంపాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మందులు సరిపడా ఉన్నాయా అని సిబ్బందిని అడిగారు. రోగులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఆర్డీవో రమేశ్‌బాబు, ఏడీఏ సుజాత, తహసీల్దార్ గుర్రం శ్రీనివాస్, ఎంపీడీవో శ్రీధర్, ఏవో గణేశ్, రైతులు పాల్గొన్నారు. ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక వేగవంతం చేయాలి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. సోమవారం మానకొండూరులో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పరిశీలించారు. లబ్ధిదారుల ఎంపికలో పొరపాట్లు ఉండొదన్నారు. దరఖాస్తుల్లో అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. జాబితా సిద్ధం చేసి, ఇందిరమ్మ కమిటీలతో సమావేశం నిర్వహించాలన్నారు. కమిటీ ఆమోదించిన లబ్ధిదారుల ఇండ్ల నిర్మాణానికి ముందుగా ఎంపీడీవో, ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శి సంయుక్తంగా మరోసారి ఫీల్డ్ వెరిఫికేషన్ చేయాలని సూచించారు. అనర్హులు ఉంటే జాబితా నుంచి తొలగించాలన్నారు. తహసీల్దార్ రాజేశ్వరీ, ఎంపీడీవో వరలక్ష్మి, కార్యదర్శి రేవంత్‌రెడ్డి, ప్రత్యేకాధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు. భూ భారతితో సాదాబైనామాల సమస్య పరిష్కారం చల్లూరు అవగాహన సదస్సులో కలెక్టర్ పమేలా సత్పతి -
నిగ్గు తేలేనా.. పాత కథేనా?
● పత్తి కొనుగోళ్ల అవకతవకలపై సాగుతున్న విచారణ ● టీఆర్ వివరాలు ఇవ్వడానికి మల్లగుల్లాలు ● 2004– 07 అక్రమాలు అటకెక్కినట్టేనా?కరీంనగర్ అర్బన్: పత్తి కొనుగోళ్లలో భారీగా అక్రమాలు జరిగాయని ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పదిమందికి పైగా మార్కెట్ కార్యదర్శులతో పాటు డీఎంవోలను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. పక్షం రోజులకు పైగా గడిచినా నామమాత్రపు వివరాలతో సరిపుచ్చారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో మళ్లీ విచారణ సాగుతుండగా పాత కథనే మరిపిస్తారా.. నిజాలను నిగ్గు తేలుస్తారా అనేది త్వరలోనే తేలనుంది. 2004–07 సంవత్సరాల్లో ఇదే తరహాలో అక్రమాలు జరగ్గా సీబీఐ రంగంలోకి దిగినా రాజకీయ పలుకుబడితో ఎవరిపై చర్యలు లేకపోగా విచారణ అటకెక్కిందనే ఆరోపణలున్నాయి. జిల్లాలోని అధికారులకు మెమోలు? జిల్లాలోని మార్కెట్ అధికారులకు, కార్యదర్శులకు విజిలెన్స్ అధికారులు మెమోలు జారీ చేసినట్లు సమాచారం. టీఆర్ (తాత్కాలిక రిజిస్ట్రేషన్)ల జారీ లో ఎక్కడ అవకతవకలు జరిగాయో పూర్తి వివరా లు పక్షం రోజుల్లో ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశా రు. సంబంధిత అధికారులు వివరాలు ఇవ్వడానికి మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. గత నెలలోనే సీసీఐ కొనుగోళ్లు నిలిపివేయడంతో సంబంధిత వెబ్సైట్ సైతం మూతపడింది. వ్యవసాయ మార్కెట్లలో పత్తి కొనుగోళ్లు, రైతుల సంఖ్య, టీఆర్ జారీ, అందుకు సంబంధించిన కొనుగోళ్ల వివరా లు, కావాలని ఒకవేళ అవకతవకలు జరిగితే ఎక్క డో చెప్పాలని స్పష్టం చేశారు. వీరు పంపిన నివేదికతోపాటు, ఇదివరకే విజిలెన్స్ అధికారులు విచారణ అంశాలను బేరీజు వేసి, అక్రమాలని తేలిన చోట, తప్పుల తడకగా వివరాలు ఇచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారని తెలుస్తోంది. పుస్తకాలు ఇవ్వడంలో మీనమేషాలు టీఆర్ తాత్కాలిక పుస్తకాలు ఏవోల దగ్గరే ఉన్నాయి. మార్కెటింగ్ అధికారులకు వెంటనే తిరిగి ఇచ్చేయాల్సిన వ్యవసాయ అధికారులు ఇంకా వారి దగ్గరే ఉంచుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 200–250 టీఆర్ పుస్తకాలను మార్కెట్ అధికారులు, వ్యవసాయ అధికారులకు ఇచ్చారు. ఒక అసలు ధ్రువీకరణ పత్రం రైతుకు జారీ చేయగా, మరొకటి నకలు తీసుకుంటారు. వీటిని మార్కెట్ అధికారులకు ఇవ్వాలి. జిల్లాలో ఏడువేల టీఆర్‌లు జారీ అయినట్లు తెలుస్తోంది. అసలు ఆవినీతి అంతా ఇక్కడే జరిగింది. కరీంనగర్, జమ్మికుంట, గంగాధర, చొప్పదండి, తదితర మార్కెట్లలో టీఆర్‌లు జారీ కాగా లోతుగా దర్యాప్తు సాగాల్సిన అవసరముంది. పాత కథేనా.. తేలుస్తారా..! ఉమ్మడి జిల్లా పరిధిలో 2004 నుంచి 2007 సంవత్సరాల మధ్య భారత పత్తి సంస్థ(సీసీఐ) కొనుగోలు కేంద్రాలు తెరచి పెద్ద మొత్తంలో పత్తి కొనుగోలు చేసింది. రైతులు మార్కెట్‌కు వెళ్లినప్పుడు ధరలు పెట్టకుండా.. నానా రకాల కొర్రీలతో కొనుగోళ్లు చేయని సీసీఐ ఏటా చివరలో రైతుల నుంచి భారీ మొత్తంలో కొనుగోలు చేసినట్లు ప్రకటనలు చేసింది. దీనిపై రైతులు, రైతు సంఘాలు, పలు స్వచ్ఛంద సంస్థలు ఆందోళనలు చేశాయి. సీసీఐ కేంద్రాల నిర్వాహకులు, జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు ఒకటై దోపిడీక పాల్పడ్డారని ఆరోపించాయి. దిగివచ్చిన ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వం విజిలెన్స్, సీబీసీఐడి విచారణకు ఆదేశించింది. విచారణ నామమాత్రంగా సాగుతుండడం. సీసీఐ, జిన్నింగ్ మిల్లుల యజమానులకు అనుకూలంగా విజిలెన్స్, సీబీసీఐడీ అధికారులు వ్యవహరిస్తున్నారని గ్రహించిన కురుక్షేత్ర అనే స్వచ్ఛంద సంస్థ, రైతు సాధికారక సంస్థ సీబీఐతో విచారణ చేయించాలని హైకోర్టును ఆశ్రయించాయి. ఫలితంగా సీబీఐ ఆధికారులు రంగంలోకి దిగారు, ఆ మూడేళ్లలో సీసీఐ తెరిచిన కేంద్రాలు.. కొనుగోలు చేసిన పత్తి పరిమాణం.. ఏ కేంద్రాల్లో.. ఏఏ రైతుల నుంచి ఎంత మొత్తం కొనుగోలు చేశారు. ధరలు ఏ విధదంగా పెట్టారనే దానిపై దర్యాప్త ప్రారంభించారు. దర్యాప్తు తీరు చూసి న్యాయం జరుగుతుందని.. అక్రమాలు బట్టబయలవుతాయని అంతా ఆశించారు. కానీ దశాబ్దాలు గడిచినా విచారణ నామమాత్రమే. అక్రమాల్లో భాగస్వాములైనవారు ఉన్నత హోదాల్లో ఉండటం గమనార్హం. -
యువ వికాసం అర్జీలు వేగంగా పరిశీలించండి
కరీంనగర్ అర్బన్: రాజీవ్ యువ వికాసం పథకం కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మండల ప్రత్యేక అధి కారులు, ఎంపీడీవోలు, బ్యాంకర్లతో సమావే శం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం పథకం కోసం జిల్లాలో 57,763 దరఖాస్తులు వచ్చాయని తెలి పారు. దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు. ప్రత్యేక అధికారులు దరఖాస్తుల విచారణను వేగవంతం చేయాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ కోటాలో నిర్దిష్ట లక్ష్యాన్ని ఎంపీడీవోలకు, మున్సిపల్ కమిషనర్లకు ఇదివరకే పంపించామని తెలిపారు. బ్యాంకుల నుండి ఏవైనా సమస్యలు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. డీఆర్వో వెంకటేశ్వర్లు, జిల్లా గిరిజన అభివృద్ధిశాఖ అధికారి పవన్ కుమార్ పాల్గొన్నారు. దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలి కరీంనగర్ కార్పొరేషన్: రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ ఆదేశించారు. కళాభారతిలో జరుగుతున్న రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీ లన ప్రక్రియను సోమవారం పరిశీలించారు. నగర వ్యాప్తంగా దాదాపు 15 వేల మంది దరఖాస్తు చేసుకొన్నారని, దరఖాస్తులను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల వారీగా పరిశీలన చేస్తున్నట్లు వివరించారు. 15 రోజుల్లో రైల్వేస్టేషన్ ప్రారంభం కరీంనగర్‌రూరల్: కరీంనగర్ రైల్వేస్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను దక్షిణ మధ్య రైల్వే చీఫ్ ప్రాజెక్టు మేనేజర్ రమేశ్‌రెడ్డి శనివా రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరికొత్త హంగులతో కరీంనగర్ రైల్వే స్టేషన్ రూపుదిద్దుకుని ప్రారంభోత్సవాని కి సిద్ధమవుతోందని తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీం కింద రూ.26.64కోట్ల వ్యయంతో రెండేళ్ల క్రితం చేపట్టిన స్టేషన్ రెనోవేషన్ పనులు చివరి దశకు చేరాయని తెలిపారు. రెండు వారాల్లో పనులు పూర్తిచేసి, ప్రధాన మంత్రి నరేంద్రమోడీ చేతుల మీదుగా ప్రారంభోత్సం జరిపిస్తామని పేర్కొన్నారు. ఆయన వెంట దక్షిణ మధ్య రైల్వేశాఖ అధికారి సుబ్రహ్మణ్యం, స్టేషన్ మేనేజర్ ఉన్నారు. బాధిత మహిళలకు సత్వరమే సఖి సేవలు కరీంనగర్: మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ పరిధిలోని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ సఖి కేంద్రాన్ని ఆశ్రయించిన బాధిత మహిళలకు సత్వరమే సేవలు అందించాలని జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి తెలిపా రు. సప్తగిరికాలనీలోని సఖి కేంద్రంలో సోమ వారం జిల్లా మహిళా సాధికారత కేంద్రం, శక్తి సదన్, సఖి కోఆర్డినేటర్లతో సమన్వయ సమావేశం నిర్వహించారు. డీడబ్ల్యూవో సరస్వతి మాట్లాడుతూ.. బాధిత మహిళలు సఖి కేంద్రాన్ని ఆశ్రయించినప్పుడు ఉచిత న్యాయ, వైద్య, ఆశ్రయ, పోలీసుసేవలను సత్వరమే అందించాలన్నారు. అంగన్వాడీ, వైద్య సిబ్బంది సహకారం తీసుకోవాలని సూచించారు. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. సఖి అడ్మిన్ లక్ష్మి, డిహెచ్ఈడబ్ల్యూ కో– ఆర్డినేటర్ శ్రీలత పాల్గొన్నారు. -
నాగంపేటలో దొంగల హల్చల్
గంభీరావుపేట(సిరిసిల్ల): నాగంపేటలో దొంగలు హల్చల్ చేశారు. ఒకేరోజు పదిళ్లలో దొంగతనానికి పాల్పడి పోలీసులకు సవాల్ విసిరారు. నాగంపేటలో శనివారం అర్ధరాత్రి తాళాలు వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడ్డారు. గురుక లక్ష్మి, పొల్తూరి అంజయ్యకు చెందిన ఇళ్లలోని బీరువాలను పగలగొట్టి 6 తులాల బంగారం, 50 తులాల వెండి ఆభరణాలను అపహరించుకుపోయారు. రూ.30వేల నగదు పలువురి ఇళ్ల నుంచి ఎత్తుకెళ్లారు. ల్యాప్‌టాప్, ఇతర వస్తువులను చోరీ చేశారు. సమాచారమందుకున్న ఎస్సై ప్రేమానందం విచారణ చేపట్టారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేవాలయాల్లో దొంగతనం కథలాపూర్: తాండ్య్రాల గ్రామంలోని రేణుక ఎల్లమ్మ, దుర్గామాతా దేవాలయాల్లో ఆదివారం వేకువజామున దొంగతనం జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. రేణుక ఎల్లమ్మ దేవాలయంలో తలుపులు ధ్వంసం చేసి వస్తువులను చిందరవందర చేశారు. దుర్గామాతా దేవాలయంలో హుండీని ధ్వంసం చేసి డబ్బులు ఎత్తుకెళ్లారు. ఆలయాల సమీపంలో ఉన్న టేలాలను ధ్వంసం చేసి వస్తువులను ఎత్తుకెళ్లారు. రూ.20వేలు నష్టపోయినట్లు బాధితులు పేర్కొన్నారు. సంఘటనపై వివరాలు సేకరించినట్లు ఎస్సై నవీన్‌కుమార్ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పదిర గ్రామ శివారులో ఆదివారం కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు జిల్లాకు చెందిన కుంచాల మధు(18).. అతడి స్నేహితుడు తన్నీరు మహేశ్‌బాబు(25)తో కలిసి ఎల్లారెడ్డిపేట నుంచి సిరిసిల్లకు ద్విచక్ర వాహనంపై కొత్త దుస్తులు కొనడానికి వెళ్తుండగా.. సిరిసిల్ల నుంచి ఎల్లారెడ్డిపేటకు ఎదురుగా వస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంపై నుంచి ఎగిరిపడ్డ వారు తలలు పగిలి రోడ్డుపై విగతజీవులుగా పడిపోయారు. మధు తండ్రి శివ కొంతకాలంగా స్థానికంగా మేసీ్త్రగా భవన నిర్మాణ పనులు చేస్తున్నాడు. సరిగ్గా 28 రోజుల క్రితం రంజాన్‌కు ఒక్కరోజు ముందు నారాయణపూర్‌కు చెందిన ముస్లిం యువకులు అఫ్రోజ్, అవీజ్ అనే ఇద్దరు యువకులు కొత్త దుస్తుల కోసం బైక్‌పై సిరిసిల్లకు వెళ్తూ ఇదే రోడ్డుపై కొద్ది దూరంలో ప్రమాదానికి గురై మరణించారు. ప్రమాదానికి కారణమైన కారు కామారెడ్డి జిల్లాకు చెందినది కాగా.. కారు నడుపుతున్న వ్యక్తికి గాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు. ఎస్సై రమాకాంత్ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను సిరిసిల్ల ఏరియాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కారు ఢీకొని ఒకరు.. మెట్పల్లి: పట్టణ పరిధిలోని ఆరపేట శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దొడ్డి గంగాధర్(59) అనే వ్యక్తి మృతిచెందినట్లు ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మేడిపల్లి మండలం మాచాపూర్‌కు చెందిన గంగాధర్ పట్టణంలోని తిరుమల అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. సాయంత్రం సమయంలో ద్విచక్ర వాహనంపై ఆరపేట వైపు వెళ్తుండగా.. ఎదురుగా కారు ఢీకొట్టింది. తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్ జగిలం శేఖర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
బైక్‌లు ఢీ.. ఇద్దరికి గాయాలు
మేడిపల్లి: కొండాపూర్ గ్రామ శివారు పాక్స్ గోడౌన్ మలుపు వద్ద ఆదివారం ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయలయ్యాయి. మన్నేగూడెం గ్రామానికి చెందిన సుందరగిరి శంఖర్గౌడ్ తలకు గాయం కాగా.. రాజలింగంపేట వాసి కొండ అశోక్ ధర్మతేజ కాలు విరిగినట్లు స్థానికులు తెలిపారు. ఇరువురిని జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు నమోదు చేసుకున్నారు. మేడిపల్లి నుంచి దేశాయిపేట రోడ్డు ఇంతకుముందు సింగిల్ రోడ్డుగా ఉండేది. రెండు సంవత్సరాల క్రితం డబుల్ రోడ్డు కావడంతో.. ఆ రోడ్డు గుండా రవాణా పెరిగింది. వాహనాలు వేగంగా వెళ్లడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల ఓ కారు రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. -
ఆదర్శం.. ఆటోలక్ష్మి
● చిన్నతనంలోనే తండ్రి.. పిల్లలు చిన్న వయసులో భర్త మృతి ● ఆటోలో ఊరూరా తిరుగుతూ కూరగాయల విక్రయం ● ఆ కుటుంబానికి ఆమె ఆధారం కోనరావుపేట(వేములవాడ): ఆ కుటుంబానికి ఆమెనే పెద్ద దిక్కు. చిన్నతనంలో తండ్రి మృతి.. పిల్లలు పుట్టాక భర్త మరణంతో ఆ కుటంబం రోడ్డున పడింది. అయితే తన పిల్లల బాధ్యతను లక్ష్మి భుజాన వేసుకుంది. ధైర్యంతో ముందడుగు వేసింది. ఆటోలో కూరగాయలు విక్రయిస్తూ తన కుటుంబానికి ఆసరాగా నిలుస్తోంది. తన పిల్లలు, కన్నతల్లిని పోషించుకుంటోన్న కోనరావుపేట మండలం నిమ్మపల్లికి చెందిన ఎర్ర లక్ష్మిపై ప్రత్యేక కథనం. భర్త మృతితో మళ్లీ మొదటికి.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లికి చెందిన అనుముల యాదవ్వ–మల్లయ్య దంపతులకు నలుగురు కూతుళ్లు. చిన్న కూతురు లక్ష్మికి కరీంనగర్ సమీపంలోని గోపాలపురం గ్రామానికి చెందిన ఎర్ర అంజయ్యతో వివాహమైంది. 2013లో అంజయ్య సౌదీఅరేబియా వెళ్లి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అప్పటికే కూతురు, కుమారుడు సంతానం. అత్తగారింటి వద్ద వ్యవసాయ భూమి, సరైన ఇల్లు కూడా లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పుట్టినింటికి చేరింది. తండ్రి చిన్నప్పుడే మృతిచెందడం, అక్కలు పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోవడంతో ఒంటరైన తల్లి, కుమారుడు, కూతుళ్ల పోషణభారం నెత్తికెత్తుకుంది. ఐదేళ్ల క్రితం కూరగాయల వ్యాపారం మొదలుపెట్టింది. ఆటోలో ఊరూరా తిరుగుతూ.. నిమ్మపల్లిలో ప్రతి శుక్రవారం జరిగే వారసంతలో కూరగాయలు అమ్ముకుంటూ మిగతా రోజుల్లో గ్రామంలో తిరుగుతూ విక్రయించేది. వచ్చిన డబ్బులు కుటుంబపోషణకు సరిపోకపోవడం, అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి, కుమారునికి వైద్య ఖర్చులకు ఇబ్బంది కావడంతో రూ.60వేలు అప్పు చేసి ఓ ఆటో కొనుగోలు చేసింది. ఆటోలో కూరగాయలు విక్రయించేందుకు మరిమడ్ల, అహ్మద్హుస్సేన్పల్లి, నిజామాబాద్ జిల్లా తాటిపల్లి, సిరికొండ వరకు ఆటో వెళ్లి కూరగాయలు విక్రయిస్తోంది. వర్షం పడినా, ఎండ తీవ్రత ఎక్కువున్నా కూరగాయలు మాత్రం విక్రయిస్తూనే ఉంటుంది. కూతురు నిహారిక ప్రస్తుతం ఎనిమిదో తరగతి, కుమారుడు మణికృష్ణ ఆరో తరగతి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఇంట్లో మగదిక్కు లేకున్నా ధైర్యంతో ఆ కుటుంబానికి ఆధారమైంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు.. ఎలాంటి ఆధారం లేకున్నా ఆత్మశ్వాసాన్ని కోల్పోకుండా నా ఇద్దరు పిల్లల చదువు, తల్లిని పోషిస్తున్నాను. కుటుంబాన్ని పోషించుకునేందుకు ఆటో కొని, అందులోనే కూరగాయలు విక్రయిస్తున్నాను. నా వ్యాపారం అభివృద్ధి చేసుకునేందుకు ప్రభుత్వం సహకారం అందించి, ఆదుకోవాలి. – ఎర్ర లక్ష్మి, నిమ్మపల్లి -
ఇదో సువర్ణావకాశం
క్రీడలంటే ఇష్టమున్నవారికి, జాతీయ, రాష్ట్రస్థాయి లాంటి పోటీల్లో పాల్గొని సత్తా చాటాలనుకునేవారికి ఈ సమ్మర్ క్యాంపులు సువర్ణావకాశం. నెల రోజులపాటు పకడ్బందీగా కోచ్‌ల పర్యవేక్షణలో జరుగుతాయి. ఉన్నతమైన ప్రమాణా లతో కూడిన శిక్షణను ఈ నెల రోజులపాటు కోచ్‌లు అందిస్తారు. – గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి, తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి సద్వినియోగం చేసుకోవాలి క్రీడాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే శిబిరాలను చిన్నారులందరూ సద్వినియోగం చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో శిబిరాలను ఏర్పాటు చేశాం. ఇక్కడ శిక్షణ తీసుకున్నవారు భవిష్యత్‌లో క్రీడల్లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. శిక్షణతో మేటి క్రీడాకారులుగా ఎదిగే అవకాశముంటుంది. – వి.శ్రీనివాస్‌గౌడ్, డీవైఎస్వో, కరీంనగర్ పేరు నమోదు చేసుకోవాలి పెద్దపల్లి జిల్లావ్యాప్తంగా 10 గ్రామీణ ప్రాంతాలు, 5 అర్బన్ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న శిబిరాలను చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలి. అర్బన్ ప్రాంతాల్లో శిక్షణ తీసుకోవాలనే చిన్నారులు ముందస్తుగా క్రీడాశాఖ వెబ్సైట్లో తమ పేరును నమోదు చేసుకోవాలి. – ఎ.సురేశ్, డీవైఎస్వో, పెద్దపల్లి మంచి అవకాశం శిబిరాల్లో చిన్నారులకు మంచి శిక్షణ దొరుకుతుంది. నా ణ్యమైన ప్రమాణాలతో శిక్ష ణ కార్యక్రమాలు జరుగుతా యి. చిన్నారులకు మంచి అ వకాశం. తల్లిదండ్రులు సై తం పిల్లల ఆసక్తిని గ్రహించి శిబిరాల్లో చేర్పించాలి. సమ్మర్ క్యాంపులను ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. – తుమ్మల రమేశ్‌రెడ్డి, రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడు -
వడదెబ్బతో మహిళ మృతి
ధర్మారం: పత్తిపాక గ్రామానికి చెందిన చెక్కపల్లి లక్ష్మి (60) అనే మహిళ వడదెబ్బతో ఆదివారం మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మూడు రోజుల క్రితం వడదెబ్బతో అస్వస్థతకు గురి కాగా.. గ్రామంలోనే చికిత్స తీసుకుందన్నారు. పరిస్థితి విషమించటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించగా.. చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిపారు. మృతురాలికి భర్త అంజయ్యతోపాటు ముగ్గురు కుమారులున్నారు. గుర్తుతెలియని వ్యక్తి.. చొప్పదండి: జ్యోతినగర్ సమీపంలోని వేబ్రిడ్జిపై గుర్తుతెలియని వ్యక్తి ఆదివారం మృతిచెందాడు. వడదెబ్బ తగలడంతో స్పృహ తప్పి పడిపోయి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని స్థానికుల సాయంతో 108 వాహనంలో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడిని గుర్తించినవారు 8712670766 నంబర్‌కు సమాచారమందించాలని ఎస్ఐ మామిడాల సుదర్శన్ తెలిపారు. పెగడపల్లి ఎస్సై సస్పెన్షన్ జగిత్యాల క్రైమ్: పెగడపల్లి ఎస్సై రవికిరణ్‌ను సస్పెండ్ చేస్తూ ఆదివారం మల్టిజోన్–1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల పోలీస్ స్టేషన్లో ఓ కేసు నమోదు కాగా.. కేసు విచారణలో జాప్యం చేయడంతోపాటు నిర్లక్ష్యం వహించారని ఉన్నతాధికారులు నివేదిక సమర్పించారు. దీంతో రవికిరణ్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఫొటోలు షేర్ చేస్తామని బెదిరింపులు ● నలుగురి అరెస్ట్ బోయినపల్లి(చొప్పదండి): బోయినపల్లి మండల కేంద్రానికి చెందిన సందరగిరి రాకేశ్ అనే యువకుడి వ్యక్తిగత ఫొటోలు షేర్ చేస్తామని బెదిరించి అతడు ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన ఇదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై దూలం పృథ్వీధర్‌గౌడ్ ఆదివారం తెలిపారు. ఆయన వివ రాల ప్రకారం.. సందరగిరి రాకేశ్ ఇటీవల అనుమానాస్పదంగా మృతిచెందాడు. అతడి మరణ వాంగ్మూలంలో రాసిన నలుగురు వ్యక్తులను పిలిచి విచారించారు. రాకేశ్ వ్యక్తిగత ఫొటోలు గూగుల్‌లో షేర్ ద్వారా నలుగురు వ్యక్తులు షేర్ చేసుకున్నారు. ఫొటోలు బయటపెడతామని బెది రించారు. తన వ్యక్తిగత ఫొటోలు బయటపెడితే పరువు పోతుందని భావించిన రాకేశ్.. మర్లపేట గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకున్నాడు. నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. మెడలోని పుస్తెల తాడు చోరీ యైటింక్లయిన్‌కాలనీ: గోదావరిఖని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధి యైటింక్లయిన్‌కాలనీ రాజీవ్‌నగర్ లంబాడితండాకు చెందిన ఇస్లావత్ బుల్లి మెడలోని పుస్తెల తాడు ఆదివారం తెల్లవారుజామున చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఇస్లావత్ బుల్లి తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి ఆవరణలో నిద్రపోయింది. తెల్లవారుజామున నిద్ర లేచి చూసుకునేసరికి తన మెడలోని పుస్తెల తాడు కనిపించలేదు. ఇంటి చుట్టు పరిసరాల్లో వెతికినా దొరకలేదు. గుర్తుతెలియని వ్యక్తులు తన మెడ లోని రెండున్నర తులాల బంగారు పుస్తెల తాడు దొంగిలించినట్లు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ రుద్రంగి: వేసవి సెలవుల్లో బంధువుల ఇళ్లకు వెళ్లేవారు, వారి ఇళ్లో దొంగలు పడే అవకాశమున్నందున పోలీస్ సిబ్బందికి సమాచారమందించాలని ఎస్సై సిరిసిల్ల అశోక్ సూచించారు. మండల కేంద్రానికి చెందిన ఎల్ల దేవవ్వ అనే మహిళ ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లొచ్చేసరికి దొంగలు పడి అర తులం బంగారం, రూ.5వేల నగదు ఎత్తుకెళ్లారు. ఆదివారం ఎస్సై పరిశీలించి వివరాలు సేకరించారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు. 60 దేశీకోళ్లు చోరీ మల్యాల: నూకపల్లి శివారులో నాటుకోళ్ల్ల షెడ్డు లోని 60 నాటుకోళ్లను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. రామన్నపేటకు చెందిన నర్సయ్య అనే వ్యక్తి నూకపల్లి వరద కాలువ శివారులోని తన షెడ్డులో దేశీకోళ్లు పెంచుతున్నారు. శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు షెడ్డులోని 60 దేశీకోళ్లను ఎత్తుకెళ్లినట్లు ఆదివారం గుర్తించిన నర్సయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
విద్యుదాఘాతంతో ఫర్నిచర్, నగదు దగ్ధం
పెగడపల్లి: నర్సింహునిపేట గ్రామానికి చెందిన ఆరెల్లి దుర్గయ్య ఇంట్లో శనివారం రాత్రి విద్యుదాఘాతం జరిగింది. ఇంట్లో ఉన్న ఫర్నిచర్, దుస్తులతోపాటు ఇతర సామగ్రి, రూ.40వేల నగదు దగ్ధమైందని బాధితుడు పేర్కొన్నాడు. ఆరై శ్రీనివాస్ సంఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాదానికి గల కారణాలడిగి తెలసుకొని పంచనామా నిర్వహించారు. సుమారు రూ.లక్ష వరకు ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. బాధిత కుటుంబాన్ని కాంగ్రెస్ మండల నాయకులు ఆదివారం పరామర్శించారు. రూ.10వేల నగదుతోపాటు బియ్యం, ఇతర నిత్యావసరాలు అందజేశారు. రాములుగౌడ్, సత్తిరెడ్డి, శ్రీనివాస్, సంది మల్లారెడ్డి తదితరులున్నారు. నిప్పంటుకొని హార్వెస్టర్.. మేడిపల్లి: రేడియేటర్లో వేడిమి కారణంగా ప్రమాదవశాత్తు మంటలంటుకొని భీమారం మండలం మన్నేగూడెం గ్రామానికి చెందిన పెడిమల్ల గంగాధర్ హార్వెస్టర్ ఆదివారం దగ్ధమైంది. అదే గ్రామానికి చెందిన ఓ రైతు వరిని కోస్తుండగా.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రెవర్ చాకచక్యంగా హార్వెస్టర్‌పై నుంచి దూకడంతో ప్రాణలతో బయటపడ్డాడు. స్థానికులు ఫైరింజన్‌కు సమాచారమివ్వడంతో వచ్చి మంటలార్పారు. -
యశోదలో అరుదైన కాంప్లెక్స్ కరోనరీ స్టెంటింగ్
కరీంనగర్‌టౌన్: సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో బైపాస్ సర్జరీ బదులుగా అత్యంత అరుదైన కాంప్లెక్స్ కరోనరీ స్టెంటింగ్ ద్వారా మహిళకు విజయవంతంగా మూడు స్టంట్లు వేసినట్లు యశోద హాస్పిటల్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ వైద్యులు డాక్టర్ జగదీశ్ మాదిరెడ్డి తెలిపారు. ఆదివారం నగరంలోని యశోద హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కరీంనగర్‌కు చెందిన విజయ వృద్ధాప్యం, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో ఆమెకు గుండె సమస్య రావడంతో యశోద ఆసుపత్రికి వచ్చారన్నారు. వెంటనే అంజియోగ్రామ్ చేయగా.. మూడు వాల్వ్‌లు బ్లాకు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆమెకు బైపాస్ సర్జరీ చేయడం హైరిస్క్‌తో కూడుకోవడం వల్ల అత్యాధునిక కాంప్లెక్స్ కరోనరీ స్టెంటింగ్ ద్వారా విజయవంతంగా చికిత్స అందించినట్లు తెలిపారు. దీనికోసం ఆధునిక వైద్య పరికరాలైన ఆర్బిటల్ అథెరెక్టమీ, ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రఫీ(ఓసిటీ)లను ఉపయోగించినట్లు తెలిపారు. ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో సాంకేతికత వృద్ధి చెందుతూ అనేక మందికి జీవితాలపై ఆశను కలిగిస్తోందని తెలిపారు. హైరిస్క్ కార్డియాక్ కేసుల చికిత్సలో యశోద హాస్పిటల్ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశం నలుమూలల నుంచి విదేశాల నుంచి సైతం హైదరాబాద్‌కు వచ్చి వైద్యం చేయించుకుంటున్నారని, ఇక్కడ ప్రపంచస్థాయి వైద్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. ముందస్తు స్క్రీనింగ్ పరీక్షలు చేసుకోవడం వల్ల తీవ్రమైన సమస్యలకు సైతం పెద్ద శస్త్ర చికిత్సలు అవసరం లేకుండా పరిష్కరించుకునే వీలుంటుందని అన్నారు. పేషెంట్ విజయ మాట్లాడుతూ.. తనకు బైపాస్ సర్జరీ అవసరమైనా తన వయస్సును దృష్టిలో పెట్టుకొని అత్యాధునిక చికిత్స అందించిన యశోద వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. -
సమ్మర్ క్యాంపుల సందడి
● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా క్రీడాశాఖ ఆధ్వర్యంలో నిర్వహణ ● నెల రోజులపాటు శిక్షణ శిబిరాలు ● గ్రామీణ ప్రాంతాల్లో ఉచితంగా.. ● అర్బన్ ఏరియాలో పే అండ్ ప్లే.. కరీంనగర్ స్పోర్ట్స్: పాఠశాలలకు వేసవి సెలవులిచ్చారు. సమ్మర్లో చిన్నారులు ఎండలో అటూఇటూ తిరగకుండా ఉండేందుకు కొన్ని సంస్థలు, కళాసంస్థలు, సమ్మర్ క్యాంపులను నిర్వహించి వారికి శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. తెలంగాణ రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వేసవిలో క్రీడాశిక్షణ శిబిరాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ సంవత్సరం కూడా కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో జిల్లాకు 10 కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వేసవి క్రీడాశిక్షణ శిబిరాలను మే 1 నుంచి 31 వరకు నిర్వహిస్తున్నారు. కేటాయించిన కేంద్రాల్లో అక్కడి పీడీ, పీఈటీ, సీనీయర్ క్రీడాకారుడు ఇలా ఒకరు శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏ జిల్లాలో ఏ క్రీడలో శిబిరం జరుగుతుంది.. ఏ గ్రామంలో నిర్వహిస్తున్నారు.. కోచ్ ఎవరు తదితర విషయాలపై సాక్షి ప్రత్యేక కథనం. గ్రామీణ ప్రాంతాల్లో ఉచితంగా.. గ్రామీణ ప్రాంతాల్లో మెరికల్లాంటి ఎందరో క్రీడాకారులున్నారని, వారికి నాణ్యమైన శిక్షణ అందించి వెలుగులోకి తీసుకొచ్చి తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో కొన్ని సంవత్సరాల నుంచి గ్రామీణ ప్రాంతాల్లోనే వేసవి శిబిరాలను క్రీడాశాఖ నిర్వహించడం మొదలుపెట్టింది. గ్రామీణ క్రీడలుగా పేరొందిన ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్‌తోపాటు ఈసారి మరికొన్ని క్రీడలను చేర్చి శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశారు. నెల రోజుల శిక్షణ కాలానికి గౌరవ వేతనం కింద రూ.5వేలు క్రీడాశాఖ కోచ్‌లకు ఇవ్వనున్నారు. 14 సంవత్సరాల్లోపు బాలబాలికలు తర్పీదు పొందే అవకాశముంది. అర్బన్ ఏరియాలో.. జిల్లాల్లోని అర్బన్ ఏరియాలో పే అండ్ ప్లే కింద శిబిరాలను ఆయా జిల్లాల క్రీడాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు క్రీడాశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆసక్తి ఉన్న కోచ్‌ల నుంచి క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు కోరుతున్నారు. అర్బన్ ఏరియాలో శిక్షణ తీసుకోవాలనుకునే చిన్నారులు క్రీడాశాఖ ఇచ్చిన వెబ్సైట్లో https://satgasc-te langana.gov.in దరఖాస్తులు చేసుకోవాలి. ఇప్పటికే పెద్దపల్లి జిల్లాలో అర్బన్ ఏరియాలో సమ్మర్ క్యాంపులను నిర్వహించేందుకు వేదికలు ఖరారు చేయగా.. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల జిల్లాలో వేదికలు ఖరారు చేసే పనిలో పడ్డారు క్రీడాశాఖ అధికారులు. కరీంనగర్ జిల్లా.. క్రీడ వేదిక(గ్రామం) కోచ్ నంబర్ వాలీబాల్ రామడుగు ఎస్.ఆశాలు 9908528205 వాలీబాల్ వెదిర కరుణాకర్‌రెడ్డి 9502760690 వాలీబాల్ చింతకుంట ఎ.శ్రీనివాస్ 9700517852 వాలీబాల్ గంగాధర ఎల్.నరేశ్ 9441700892 వాలీబాల్ మల్లారెడ్డిపల్లె కె.నర్సయ్య 9989139012 కబడ్డీ రాంపూర్ కె.రాజ్‌కుమార్ 9666563882 హ్యాండ్‌బాల్ రామడుగు ఎ.సాయికృష్ణ 7660892907 నెట్‌బాల్ నగునూర్ ఎం.అంజన్సాయి 6281774073 హాకీ ఆర్నకొండ ఎం.చంద్రశేఖర్ 9490530300 జూడో నెదునూర్ ఎ.శ్రీనివాస్ 9000190331 పెద్దపల్లి జిల్లా.. గ్రామీణ ప్రాంతాల్లో.. ఫుట్‌బాల్ అంతర్గాం టి.శోభ 9866573416 ఫుట్‌బాల్ దొంగతుర్తి ఎన్.శ్రీనివాస్ 9398295492 వాలీబాల్ నందిమేడారం ఎం.కొమురయ్య 9848130522 వాలీబాల్ జూలపల్లి కె.రాకేశ్ 8978755521 వాలీబాల్ గర్రెపల్లి బి.నవీన్ 9703399149 బాక్సింగ్ కనగర్తి జె.శ్రీవిష్ణు 8555929662 అథ్లెటిక్స్ వెన్నంపల్లి ఎ.దుర్గాప్రసాద్ 9177964751 ఖోఖో నిట్టూర్ పి.భాస్కర్ 9177992471 తైకై ్వండో తెలుకుంట ఎన్.సతీశ్‌కుమార్ 9989143163 హ్యాండ్‌బాల్ అప్పన్నపేట వి.సురేందర్ 8008816932 అర్బన్ ఏరియాలో.. ఖోఖో 8ఇంక్లయిన్‌కాలనీ పి.ఓదెలుయాదవ్ 9849484631 ఖోఖో పెద్దపల్లి ఎండీ షఫీయొద్దీన్ 9949757572 ఫుట్‌బాల్ 8ఇంక్లయిన్‌కాలనీ కె.సత్యనారాయణ 9849340610 లాన్‌టెన్నీస్ మంథని ఎస్.జగదీశ్వర్ వాలీబాల్ సుల్తానాబాద్ ఎం.శ్రావణ్ 7702360978 రాజన్న సిరిసిల్ల జిల్లా.. కబడ్డీ కోనరావుపేట బి.వేణు 9492504013 అథ్లెటిక్స్ తంగళ్లపల్లి కె.శ్రీనివాస్ 9392880231 కరాటే పెద్దలింగాపూర్ బి.బాలరాజు హ్యాండ్‌బాల్ కొత్తపల్లి బి.భాను 9885598502 వాలీబాల్ రుద్రంగి ఎ.దేవయ్య 9866824012 వాలీబాల్ బోయిన్పల్లి పి.ప్రభాకర్ 8008494801 వాలీబాల్ కొదురుపాక ఎన్.శ్రీనివాస్‌రెడ్డి 7997182244 వాలీబాల్ ఎల్లారెడ్డిపేట బి.బాపురెడ్డి 9492390821 వాలీబాల్ ముస్తాబాద్ బి.అనిల్‌గౌడ్ 9989227229 వాలీబాల్ ఇల్లంతకుంట డి.శివరాం 9985796519 జగిత్యాల జిల్లా.. వాలీబాల్ భూపతిపూర్ సీహెచ్ తిరుపతిరెడ్డి 9440922296 వాలీబాల్ వెల్గటూర్ కె.సతీశ్ 9059501017 వాలీబాల్ లక్ష్మీపూర్ కె కోటేశ్వర్రావు 9963159111 వాలీబాల్ గొల్లపల్లి టి.పవన్ 8186870870 వాలీబాల్ ఎండపల్లి బి.కొమురయ్య 9182406818 వాలీబాల్ ఊరిట్పల్లి ఎం.ప్రవీణ్ 9701710968 అథ్లెటిక్స్ తిప్పన్నపేట ఎల్.శ్రీకాంత్ 9550963101 అథ్లెటిక్స్ ఎండపల్లి బి.శివమణి 8367588646 హ్యాండ్‌బాల్ గుల్లకోట జి.సాయికుమార్ 7893472246 సాఫ్ట్‌బాల్ మల్లన్నపేట కె.శ్రీకాంత్ 7702294312 -
ప్రమాదవశాత్తు చెరువులో పడి ఒకరి మృతి
కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లి పట్టణంలోని చెరువులో ప్రమాదవశాత్తు ఒకరు పడి మృతిచెందారు. కొత్తపల్లి ఏఎస్సై బి.రాంమూర్తి వివరాల ప్రకారం.. కొత్తపల్లి పట్టణానికి చెందిన గుండ శ్రీధర్(41) పని లేక తాగుడుకు బానిసై మానసిక స్థితి బాగా లేక అనారోగ్య సమస్యలతో బాధపడుతుండేవాడు. కోహెడ మండలం తంగళ్లపల్లి గ్రామానికి చెందిన రాధతో వివాహం జరగగా.. వారికి 11 ఏళ్ల కుమారుడున్నాడు. శ్రీధర్ తాగుడుకు బానిసై తరచూ భార్యను ఇబ్బంది పెట్టడంతో.. కొడుకుతో కలిసి మూడేళ్లుగా తల్లిగారింటి వద్ద ఉంటోంది. కొత్తపల్లిలోని తన ఇంటి నుంచి శుక్రవారం సాయంత్రం బయలుదేరిన శ్రీధర్.. శనివారం కొత్తపల్లి చెరువులో శవమై తేలాడు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు చెరువు వద్దకెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి ఊపిరాడక చనిపోయినట్లు భావిస్తున్నట్లు రాధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై పేర్కొన్నారు. కాంక్రీట్ మిల్లర్ కింద పడి వ్యక్తి..జగిత్యాలక్రైం జగిత్యాల రూరల్‌మండలం నర్సింగాపూర్ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా జలగం ఎల్లయ్య (33) అనే వ్యక్తి మిల్లర్ కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. జనగామ జిల్లా దర్దెపల్లి గ్రామానికి చెందిన జలగం ఎల్లయ్య జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామంలో సీసీరోడ్డు నిర్మాణ పనులకు వచ్చాడు. మిల్లర్ వాహనం డ్రైవర్ వొల్లపు రాములు అజాగ్రత్తగా నడపడంతో ఎల్లయ్యపై టైరు ఎక్కి తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. నర్సింగాపూర్ చెందిన గడ్డం మల్లారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు. బావిలో పడి వృద్ధురాలు..ముస్తాబాద్: మామిడి కాయల కోసం వెళ్లిన వృద్ధురాలు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందింది. పోలీసుల కథనం ప్రకారం.. పోతుగల్‌కు చెందిన మ్యాకల బాల్‌లక్ష్మి(75) మామిడి కాయల కోసం ఇంటి నుంచి వెళ్లింది. గ్రామ శివారులోని బావిలో ప్రమాదవశాత్తు పడిపోయింది. బాల్‌లక్ష్మి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించారు. బావిలో బాల్‌లక్ష్మి పడ్డట్లు గుర్తించి ఆమెను బయటకు తీశారు. అప్పటికే మృతిచెందింది. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై గణేశ్ తెలిపారు. ఇద్దరు బలవన్మరణం తంగళ్లపల్లి(సిరిసిల్ల): తంగళ్లపల్లి మండలంలో వేరువేరు కారణాలతో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. చీర్లవంచ గ్రామానికి చెందిన మ్యాక కొమురయ్య(43) ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య కారణాలతో శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగాడు. అంకుషాపూర్ గ్రామానికి చెందిన యువకుడు కాసాని వేణు(26) మూడేళ్లుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. గతంలో అపెండిక్స్ కడుపులో బ్లాస్ట్ అవగా.. చికిత్స చేయించారు. పది రోజుల క్రితం మళ్లీ కడుపు నొప్పి రావడంతో భరించలేక పొలం వద్దకెళ్లి పురుగుల మందు తాగాడు. కొమురయ్య భార్య మ్యాక రేణుక, వేణు తల్లి కాసాని ఎల్లవ్వ ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తంగళ్లపల్లి ఎస్సై బి.రామ్మోహన్ తెలిపారు. -
బ్యాంకులో చోరీకి యత్నం
మానకొండూర్: శుక్రవారం అర్ధరాత్రి ఓ దొంగ కొండపల్కల గ్రామంలోని తెలంగాణ గ్రామీ ణ బ్యాంకు తాళం పగలగొట్టి చోరీకి యత్నించాడు. గ్రామ స్తుల వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి ఓ దొంగ టీషర్టు ధరించి బ్యాంకు ఆవరణలోకి చొరబడ్డాడు. ముందుగా బ్యాంకు షట్టర్‌ను తెరిచేందుకు ఓ తాళాన్ని పగలగొట్టాడు. మరో తాళం తీసే క్రమంలో శబ్ద కావడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు అక్కడికి చేరుకొని పోలీసులకు తెలిపారు. ఘటనా స్థలాన్ని సీఐ బి.సంజీవ్ పరిశీలించి సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ప్రభుత్వ ఫార్మసిస్టులు.. ఇక ఫార్మసీ ఆఫీసర్స్ ● ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం కరీంనగర్‌టౌన్: ప్రభుత్వ ఫార్మసిస్టులను ఫార్మసీ ఆఫీసర్స్‌గా పేరు మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగం జీవోఎంఎస్ నం.71 ద్వారా శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ చేసినందుకు ప్రభుత్వ ఫార్మసిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.రామారావు ఒక ప్రకటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి, హెల్త్ సెక్రటరీ, హెల్త్ కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్, టీవీవీపీకి కృతజ్ఞతలు తెలిపారు. పోలీసుల అదుపులో గంజాయి సేవిస్తున్న వ్యక్తులు..?జగిత్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని కృష్ణానగర్‌లో శనివారం సాయంత్రం ముగ్గురు వ్యక్తులు గంజాయి సేవిస్తుండగా.. స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు అక్కడికెళ్లి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా.. మరో వ్యక్తి పరారయ్యారు. అదుపులో ఉన్న వ్యక్తులను పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. అంత్యక్రియల్లో మరో విషాదం ● స్నేహితుడి కుమారుడి అంతిమ యాత్రకొచ్చిన వ్యక్తి మృతి హుజూరాబాద్: స్నేహితుడి కుమారుడు మృతిచెందాడని అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చిన ఓ వ్యక్తి మృతిచెందడం హుజూరాబాద్‌లో కలచివేసింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన ముద్రవేన రాజశేఖర్(18) ఈనెల 19న తోకలపల్లి గ్రామ సమీపంలో రోడ్డు డివైడర్‌ను ద్విచక్ర వాహనంతో ఢీకొట్టాడు. రాజశేఖర్, హరిచరణ్ ఇద్దరు గాయపడ్డారు. రాజశేఖర్‌ను మెరుగైన చికిత్స కోసం హన్మకొండకు తరలించగా, హరిచరణ్‌ను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. రాజశేఖర్ శుక్రవారం రాత్రి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాజశేఖర్ తండ్రి, హుస్నాబాద్‌కు చెందిన ఇస్లావత్ వెంకట్(40) స్నేహితులు కాగా.. రాజశేఖర్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెంకట్ శనివారం హాజరయ్యారు. మృతుడి ఇంటి సమీపంలోని మురుగు కాలువలో వెంకట్ హఠాత్తుగా కుప్పకూలి పడిపోయాడు. స్థానికులు గమనించి 108 వాహనం ద్వారా ఆసుపత్రికి తరలించేలోగా మార్గమధ్యలో మరణించాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. -
అర్ధంతరంగా తనువు చాలించిన టేకేదారు
ముస్తాబాద్/కరీంనగర్‌క్రైం: కుటుంబాన్ని పోషించుకునేందుకు దారి తప్పిన ఓ యువకుడు అర్ధంతరంగా తనువు చాలించాడు. గ్రామస్తులు, మృతుల బంధువుల కథనం ప్రకారం.. ముస్తాబాద్‌కు చెందిన మహ్మద్ షాదుల్లా(29) కరీంనగర్ జైలులో అస్వస్థతకు గురై మృతిచెందాడు. ఈనెల 18న ట్రాక్టర్ చోరీ సంఘటనలో షాదుల్లా, నరేందర్‌రెడ్డి, సమీర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ జైలుకు ముగ్గురిని తరలించారు. అయితే షాదుల్లా శుక్రవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. గుండెపోటుతో మృతిచెందినట్లు జైలు అధికారులు సమాచారమందించారు. అయితే షాదుల్లా తండ్రి శర్పోద్దీన్ ఆరు నెలల క్రితం అనారోగ్యానికి గురై మృతిచెందాడు. అప్పటి నుంచి తండ్రి నిర్వహించే బీడీ కంపెనీలో టేకేదారుగా షాదుల్లా పని చేస్తున్నాడు. ఈజీ మనీ కోసం స్నేహితుల సహవాసంతో ఐకేపీలో ట్రాక్టర్‌ను అపహరించిన ఘటనలో షాదుల్లాను పోలీసులు జైలుకు తరలించారు. షాదుల్లా బెయిల్ కోసం తల్లి ఫర్వీన్, భార్య ప్రయత్నిస్తున్నారు. బయటకు వస్తాడని భావిస్తున్న తరుణంలోనే మృతిచెందడంతో వారు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆరు నెలల క్రితమే శర్పోద్దీన్ మృతిచెందగా.. ఇప్పుడు అన్ని తానై ఆదుకుంటాడనుకున్న షాదుల్లా మృతిచెందడంతో తల్లి ఫర్వీన్, భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కరీంనగర్ జైలులో ముస్తాబాద్ వాసి మృతి ఆరు నెలల క్రితం అనారోగ్యంతో తండ్రి.. -
లక్కేపూర్ శివారులో మహిళ హత్య
మంథని: లక్కేపూర్ గ్రామ శివారులో శనివారం ఓ మహిళ హత్యకు గురైంది. మంథని సీఐ రాజు వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన మాసు రమాదేవి(36) అనే వివాహిత శుక్రవారం మధ్యాహ్నం శెట్టిపల్లి గ్రామానికి వెళ్లి వస్తానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లింది. రాత్రి వరకు రమాదేవి ఇంటికి రాలేదు. శనివారం మంథని మండలం లక్కేపూర్ శివారులో గుర్తుతెలియని మహిళ మృతదేహం కన్పించింది. మృతురాలి కుటుంబ సభ్యులు ఫొటో ఆధారంగా రమాదేవిగా గుర్తించారు. మృతురాలి భర్త మాసు సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకొని తన భార్యకు పరిచయమున్న లక్కేపూర్ గ్రామానికి చెందిన పండుగు మొగిలిపై అనుమానముందని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
వివాదాస్పదమైన డీఎంహెచ్‌వో ఆసుపత్రి తనిఖీ
గోదావరిఖని: నిబంధనలకు విరుద్ధంగా స్కానింగ్ మిషన్ కలిగి ఉన్న స్థానిక లక్ష్మినగర్‌లోని శ్రీమమత ఆసుపత్రిపై శనివారం కేసు నమోదు చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జి.అన్నాప్రసన్నకుమారి తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆసుపత్రిలో తనిఖీ నిర్వహించామన్నారు. అల్ట్రాసోమ్ స్కాన్ మెషిన్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఆర్జే స్వాతి చాంబర్లో గుర్తించినట్లు పేర్కొన్నారు. మిషన్‌కు పీసీపీఎన్డీటీ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ లేదన్నారు. స్థానిక రెవెన్యూ సిబ్బంది, పోలీస్ శాఖ ద్వారా సంయుక్తంగా పరిశీలించారని, రిజిస్ట్రేషన్ లేకుండా చట్టవిరుద్ధంగా 2023 నుంచి నడుపుతున్నట్టు గుర్తించామని అన్నారు. డీఎంహెచ్‌వో రిసెప్షనిస్టు కాలర్ పట్టుకొని తీసుకెళ్లడం, బూతులు తిట్టడం దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డవడంతో.. తనిఖీ అంశం వివాదాస్పదంగా మారింది. డీఎంహెచ్‌వోపై కేసు ఆసుపత్రి రిసెప్షన్‌గా పని చేస్తున్న చెప్పకుర్తి ఆనందం ఫిర్యాదు మేరకు డీఎంహెచ్‌వోపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆసుపత్రికొచ్చి స్కానింగ్ మిషన్ ఏ గదిలో ఉందో చూపించాలని దుర్భాషలాడారన్నారు. కాలర్ పట్టుకొని లాక్కెళ్లి గది తాళాలు పగలగొట్టి బూతులు తిడుతూ డాక్టర్‌ను పిలవమని చెప్పారని అన్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
వీరివీరి గుమ్మడి పండు..
ఒకప్పుడు గ్రామాల్లో సందడి చేసిన ఆటలు కనుమరుగవుతున్నాయి. కాలం మారింది.. బాల్యం ఇంటర్‘నెట్’లో చిక్కుకుంది. ఉదయం లేచింది మొదలు చేతిలో సెల్ఫోన్ల సందడే. ఆన్లైన్ గేమ్స్.. రీల్స్.. షార్ట్స్.. ఫేస్బుక్.. షేర్‌చాట్.. స్నాప్‌చాట్.. ఇలా చెప్పుకుంటూ పోతే శారీరక శ్రమ లేని అనేక అంశాలతో కాలం గడిచిపోతోంది. చిన్న వయసులోనే పనికి రాని వాటికి బానిసవుతూ భవిష్యత్‌ను అంధకారంలోకి నెడుతున్నారు. ఒకప్పుడు ఆనందం.. ఆహ్లాదం.. విజ్ఞానం పంచిన ఆటలు ఇప్పుడు మచ్చుకై నా కనిపించడం లేదు. పట్నంలో ఎప్పుడో మాయమయ్యాయి.. గ్రామాలకు దూరమయ్యాయి. సెలవులు ప్రారంభమయ్యాయి.. అక్కడక్కడ పిల్లలు కొన్ని ఆటలు ఆడుతుండగా.. ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్స్ పెద్దపల్లి/రాజన్న సిరిసిల్ల టగ్ ఆఫ్ వార్: టగ్ ఆఫ్ వార్.. మనిషి శారీకర శక్తిని తెలియపరిచే ఆట. కొంతమంది రెండు గ్రూపులుగా విడిపోయి.. ఇలా బలాబలాలను ప్రదర్శిస్తుంటారు. జూలపల్లి మండలం వడ్కాపూర్‌లో కొంతమంది చిన్నారులు ఇలా టగ్ ఆఫ్ వార్ ఆడుతూ కనిపించారు. ● పల్లీ: ఈ ఆట ఏకాగ్రతను పెంచుతుంది. చురుకుదనం ఉంటుంది. పెద్దపల్లిలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో చిన్నారులు పల్లీ ఆడుతూ కనిపించారు. -
ఇందిరమ్మ నమూనా ఇల్లు
కరీంనగర్ అర్బన్: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఇప్పటికే నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం నమూనా ఇళ్లు నిర్మించాలని ఆదేశించింది. కలెక్టరేట్ ఆవరణలో నిర్మాణం పూర్తవుతుండగా తాజాగా ఆర్డీవో కార్యాలయాల ఆవరణలో మోడల్ హౌస్ నిర్మాణాలకు చర్యలు చేపట్టారు. కరీంనగర్, హుజూరాబాద్ ఆర్డీవో కార్యాలయాల ప్రాంగణాల్లో ఈ మోడల్ హౌస్‌ను నిర్మిస్తున్నారు. వివిధ పనుల నిమిత్తం ప్రజలు కార్యాలయాలకు వస్తుండగా ప్రభుత్వమిచ్చే రూ.5లక్షలతో ఎలా నిర్మించవచ్చో ప్రాక్టికల్‌గా చూపించనున్నారు. సమస్యలు పరిష్కరించాలి కరీంనగర్‌సిటీ: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ ఎదుట కాంట్రాక్ట్ అధ్యాపకులు చేపట్టిన సమ్మె నాలుగో రోజు కొనసాగింది. వీరికి వర్సిటీ బోధనేతర సిబ్బంది సంఘీభావం తెలిపారు. బోధనేతర సిబ్బంది సంఘం ప్రధాన కార్యదర్శి పి.ప్రసాద్ మాట్లాడుతూ.. కాంట్రాక్టు అధ్యాపకులను త్వరగా క్రమబద్ధ్దీకరించాలని, వారి సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. జీవో 21ను సవరించాలని, పార్ట్‌టైం అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సంతోష్, శ్రీకాంత్, మారుతి, భీమయ్య, ప్రకాశ్‌రావు పాల్గొన్నారు. విద్యార్థులకు కరిక్యులం రూపొందించాం కరీంనగర్‌సిటీ: విద్యార్థులకు అవసరమైన కరిక్యులం రూపొందించి, అమలు చేస్తున్నామని ఎస్సారార్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామకృష్ణ పేర్కొన్నారు. కళాశాలలో మూడో అకడమిక్ కౌన్సిల్ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రామకృష్ణ మాట్లాడుతూ.. అటానమస్ హోదా ఎస్ఆర్ఆర్ కళాశాలకు 2022–23లో వచ్చిందన్నారు. 2025లో మూడో సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని, విద్యార్థులకు అవసరమైన కరికులం రూపొందించడం జరిగిందన్నారు. అటానమస్ కో–ఆర్డినేటర్ డాక్టర్ వంగల శ్రీనివాస్ అకాడమీ కౌన్సిల్ రిపోర్టును ప్రవేశపెట్టారు. ప్రముఖ వైద్యులు ఎడవల్లి రాజభాస్కర్‌రెడ్డి, శాతవాహన యూనివర్సిటీ నుంచి డాక్టర్ సరసిజ, సురేశ్, పద్మావతి, డాక్టర్ కడారు సురేందర్‌రెడ్డి , వైస్ ప్రిన్సిపాల్ పి.నితిన్, టి.రాజయ్య కౌన్సిల్ సభ్యులు రేళ్ల సంజీవ్, ఎం.రాజేశ్, కిరణ్మయి, రాజేశం, శ్రీనివాసులు, సత్య ప్రకాశ్ పాల్గొన్నారు. రచయితల శాంతి ర్యాలీకరీంనగర్కల్చరల్: ఉగ్రవాదుల దాడికి నిరసనగా తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం శాంతి ర్యాలీ నిర్వహించారు. తెరవే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూర్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కవులు, రచయితలు ప్లకార్డులతో నినాదాలు చేశారు. రచయితల వేదిక బాధ్యులు అన్నవరం దేవేందర్, సీవీ.కుమార్, కందుకూరు అంజయ్య, కుకట్ల తిరుపతి, బుర్ర తిరుపతి, నడిమెట్ల రామయ్య, నసీరుద్దీన్, విలాసాగరం రవీందర్, పెనుగొండ బసవేశ్వర్, కాసనగొట్టి స్వప్న కష్ణ, జనగాని యుగంధర్, ఎండీ.ఖాలీద్ పాల్గొన్నారు. చాంపియన్ కరీంనగర్కరీంనగర్స్పోర్ట్స్: తెలంగాణ ఏడో స్టేట్‌లెవల్ టాలెంట్ హంట్ హ్యాండ్‌బాల్ బాలుర చాంపియన్‌గా ఉమ్మడి జిల్లా బాలుర జట్టు నిలిచింది. హన్మకొండలో ఈ నెల 24 నుంచి 26 వరకు జరిగిన పోటీల్లో జట్టు చాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకుంది. -
రైతు సంక్షేమానికే ‘భూభారతి’
కొత్తపల్లి(కరీంనగర్)/కరీంనగర్‌కల్చరల్/కరీంనగర్‌స్పోర్ట్స్: రైతుల భూ సమస్యల పరిష్కారం కోసమే రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చిందని కలెక్టర్ పమేలా సత్పతి స్పష్టం చేశారు. కరీంనగర్ రూరల్ మండలం దుర్శేడ్, కొత్తపల్లిలోని రైతువేదికల్లో శనివారం భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులకు ముఖ్యఅతిథిగా హాజరైన మాట్లాడారు. భూభారతితో సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ధరణిలో ఉన్న 33 మాడ్యూల్స్‌తో రైతులు తమ భూ సమస్య దేని పరిధిలోకి వస్తుందో తెలి యక కోర్టులు, కలెక్టరేట్ చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడేవారన్నారు. నూతన చట్టంలో మాత్రం రెండంచెల అప్పీలు వ్యవస్థ తీసుకొచ్చారని చెప్పారు. ఆధార్ మాదిరి భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ప్రతీ కమతానికి భూధార్ సంఖ్య కేటాయించినట్లు తెలిపారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని, అందరి దరఖాస్తులను పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం రైతులకు చుట్టంలా వ్యవహరిస్తుందని సుడా చైర్మన్ కె.నరేందర్ రెడ్డి అన్నారు. డిప్యూటీ సీఈఓ పవన్‌కుమార్, తహసీల్దార్లు రాజు, రాజేశ్, ఏడీఏ రణదీర్‌రెడ్డి, ఏవో కృష్ణ, కరీంనగర్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇన్చార్జి పురమల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. భవిత సెంటర్లను తీర్చిదిద్దండి భవిత సెంటర్లను ఆధునీకరించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. కరీంనగర్‌లోని ముకరాంపురంలో ఉన్న భవిత సెంటర్‌ను శనివారం అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్‌తో కలిసి సందర్శించారు. జిల్లాలో 16 భవిత సెంటర్లను ఆధునీకరిస్తున్నామని తెలిపారు. ప్రతీ సెంటర్ గ్రాండ్ లుక్ ఉండేలా తీర్చిదిద్దాలని సూచించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అన్ని రంగాల్లో రాణించేలా భవిత సెంటర్లు దోహదపడాలని అన్నారు. అనంతరం రీజినల్ స్పోర్ట్స్ స్కూల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. స్కూల్ చుట్టూ ఏర్పాటు చేస్తున్న పెన్సింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని, స్కూల్లో క్రీడాకారులను ఆకట్టుకునేలా మొక్కలు నాటాలని, ఫౌంటెన్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. స్విమ్మింగ్ పూల్ దగ్గర మొక్కలు నాటించాలని సూచించారు. జిల్లా క్రీడాశాఖ అధికారి వి.శ్రీనివాస్‌గౌడ్, నెహ్రూ యువకేంద్ర కోఆర్డినేటర్ రాంబాబు, పీఆర్డీఈ జనార్దన్ పాల్గొన్నారు. చట్టంతో సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం సర్వే, విచారణ అనంతరమే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు గ్రామాల వారీగా రికార్డుల నిర్వహణ అవగాహన సదస్సుల్లో కలెక్టర్ పమేలా సత్పతి -
వీరివీరి గుమ్మడి పండు..
వీరివీరి గుమ్మడి పండు.. వీరిపేరేమి.. దాగుడుమూతలు దండాకోల్! చికుబుకు రైలు వస్తోంది.. పక్కకు పక్కకు జరగండి కోతికొమ్మచ్చి.. పట్టుకోండి చూద్దాం పులిమేక.. ఎవరు గెలుస్తరో ఏమో అష్టాచెమ్మా..గడులు దాటాలి.. నేనే గెలవాలి వైకుంఠపాళి.. నిచ్చెన ఎక్కితే సరి.. పాము మింగితే బలి గోటీలాట.. సూటి చూసి కొట్టాలి.. గోటీలు గెలవాలి చిర్రగోనె.. అందుకుంటే ఔట్.. లేదంటే గుడ్షాట్ వంగుడు.. దుంకుడు.. ఒక్కొక్కరు ఎగిరి దూకాలి.. తాకితే అంతే మరి ఆడుదామా కచ్చకాయ.. ఎగిరేస్తా చూడు రాయి.. పట్టుకుంటా మళ్లీ..కొనుగోళ్ల వెంటే రవాణా.. అంటూ చేతిలో సెల్‌ఫోన్ లేని కాలంలో చిన్నారులు ఎక్కువగా ఆడిన ఆటలు ఇవీ.. పొద్దున లేస్తే గల్లీ పోరగాళ్లు అందరూ ఒక్కచోట చేరి పొద్దుపోయే దాక ఆడి.. అలిసిపోయి ఇల్లు చేరేవారు. అలనాడు ఆడిన ఆటలతో వ్యాయామంతో పాటు.. విజ్ఞానం పెరిగేది. శరీరం ఉల్లాసంగా ఉండేది.. ఆరోగ్యానికి బాసటగా నిలిచేది. కాలం మారుతోంది.. శారీరక వ్యాయామం తగ్గిపోతోంది. చిన్నారులు సెల్ఫోన్లకు బానిసలుగా మారుతున్నారు. కాళ్లు, చేతులు కదపకుండా.. కళ్లతోనే ఆడుతున్నారు. బద్ధ్దకంతో ఆన్లైన్ ఆటలకు బందీలుగా మారి.. బరువు పెరిగిపోతున్నారు. పట్టణాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుండగా.. పల్లెల్లో అక్కడక్కడా.. అలనాటి ఆటలు ఆడుతూ.. ‘సాక్షి’ కెమెరాలకు చిన్నారులు కనిపించారు. ఈ సందర్భంగా అలనాటి ఆటలు.. వాటితో లాభాల గురించి కథనం.. – సాక్షి ఫొటోగ్రాఫర్స్, పెద్దపల్లి/రాజన్న సిరిసిల్ల– వివరాలు... IIలోuకరీంనగర్ అర్బన్: కొనుగోలు కేంద్రాల్లో సమస్యల్లేకుండా చర్యలు చేపట్టామని, కొనుగోళ్ల వెంటే రైస్‌మిల్లులకు ధాన్యం రవాణా చేస్తున్నామని పౌరసరఫరాల సంస్థ డీఎం మంగాళరపు రజనీ కాంత్ స్పష్టం చేశారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి గింజ కొనుగోలు చేస్తామని వెల్లడించారు. నిబంధనల ప్రకారం ధాన్యాన్ని సేకరిస్తామని, అన్నదాతలు నాణ్యతా ప్రమాణాలు పాటించి ధాన్యం తీసుకురావాలని సూచించారు. జిల్లాలో మొత్తం 347 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇప్పటివరకు 32వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామ ని, టార్పాలిన్లు, సౌకర్యాలకు కొరత లేదని వివరించారు. కేంద్రాల్లో సౌకర్యాలు, మద్దతు ధర కల్పన, దళారుల దోపిడీకి అడ్డుకట్ట వంటి అంశాలపై శనివారం ‘సాక్షి’ ఇటర్వ్యూలో వివరించారు. జిల్లా అంతటా కొనుగోళ్లు ఈ సీజన్లో వరి కోతలు కొంత ఆలస్యమయ్యా యి. 5.86 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వ స్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో వ్యక్తిగత, ఇతర అవసరాలు పోనూ ఎంత వస్తుందన్నది త్వరలోనే తేలనుంది. జిల్లావ్యాప్తంగా దొడ్డు రకం ధాన్యం, సన్న రకం ధాన్యం కొనుగోళ్లకు వేర్వేరుగా కేంద్రాలను ఏర్పాటు చేశాం. జిల్లావ్యాప్తంగా అన్ని కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఇప్పటివరకు 32వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. పక్కా కార్యాచరణతో కొనుగోళ్లు కొనుగోలు కేంద్రంలో తాగునీరు, టెంట్, కూలీల కోసం షెడ్లు, వోఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని సూచించాం. కోటి గన్నీ సంచులు అవసరమవుతాయి. అవసరానికి తగినట్టుగా గన్నీ సంచులను అందుబాటులో ఉంచాం. రోజూ లక్ష నుంచి రెండు లక్షల వరకు సంచుల్లో ధాన్యం నింపుతున్నారు. టార్పాలిన్లు, ధాన్యం రవాణాకు లారీలు అందుబాటులో ఉన్నాయి. కేంద్రాల నుంచి తీసుకెళ్లిన ధాన్యాన్ని 24 గంటల్లో దించాలని మిల్లర్లకు సూచించాం. ఇబ్బందులు తలెత్తితే రైతులకు ఇబ్బందులు తలెత్తినా, ఏవైనా ఫిర్యాదులున్నా కంట్రోల్ రూం టోల్ ఫ్రీ నంబర్ 9154249727 సంప్రదించాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు సిబ్బంది అందుబాటులో ఉంటారు. నిబంధనల ప్రకారమే తూకం ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగానే ధాన్యం తూకం వేయాలని నిర్వాహకులకు, మిల్లర్లకు ఆదేశాలు జారీ చేశాం. తాలు లేకుండా శుభ్రమైన ధాన్యం తీసుకువచ్చి రైతులు సహకరించాలి. తేమ 17 శాతం మించరాదు. గన్ని సంచిలో 40.580 కిలోలు తూకం వేయాలి. తరుగు పేరుతో అదనంగా తూకం వేయరాదు. ఆటోమేటిక్ ధాన్యం శుభ్రం చేసే యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఎప్పటికప్పుడు నగదు జమ ధాన్యం విక్రయించిన రైతులకు ప్రభుత్వం నిర్దేశిత సమయంలో నగదు జమయ్యేలా చర్యలు చేపడుతున్నాం. ట్యాబ్ నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేలా కేంద్రాల్లో సిబ్బందిని నియమించాలని సూచించాం. వానాకాలం సీజన్లో 72 గంటల్లో ఖాతాల్లో నగదు జమ చేశారు. ప్రస్తుతం అదే ప్రక్రియ కొనసాగనుంది. ధాన్యం తీసుకోవడానికి 96 మిల్లులు సంసిద్ధతను తెలియజేశాయి. చాలామట్టుకు మిల్లులు బ్యాంక్ గ్యారంటీ అందజేశాయి. ఇంకా బ్యాంక్ గ్యారంటీ అందజేస్తున్న వారికి ధాన్యం కేటాయిస్తున్నాం. జిల్లాలో మొత్తం సాగువిస్తీర్ణం 2,90,000సాగైన వరి: 2,66,896ఎకరాలు రానున్న దిగుబడి: 5,86,723మెట్రిక్ టన్నులు ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యం: 32,541మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాలు: 347రైస్‌మిల్లులు: 96ధాన్యం మద్దతు ధర: ఏ గ్రేడ్: రూ.2,320సాధారణ రకం: రూ.2,300 -
పోటీ పరీక్షల్లో రాణించాలి
చొప్పదండి: విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలని, రానున్న ఎన్డీఏ రాత పరీక్షలో అర్హత సాధించాలని సంఘిక సంక్షేమ గురుకులాల సంస్థ కార్యదర్శి అలుగు వర్షిణి అన్నారు. మండలంలోని రుక్మాపూర్ శివారు సైనిక శిక్షణ పాఠశాలలో ఆమె రాత్రి బస కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గురుకులంలో అమలు అవుతున్న శిక్షణ కార్యక్రమాలు, హాస్టల్ నిర్వహణ, పరిసరాలు, క్రీడలను పరిశీలించారు. బాక్సింగ్, ట్రెక్కింగ్ కార్యకలాపాలలో స్వయంగా విద్యార్థులతో పాటు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. అజిమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయానికి సైనిక పాఠశాల నుంచి అత్యధికంగా 22 మంది కెడెట్లు ప్రవేశం పొందడం గర్వకారణమన్నారు. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్, ఐటీ, ఇంజినీరింగ్ విభాగాలలో అందుబాటులో ఉన్న ఇతర ప్రభుత్వ సేవల్లో కూడా ప్రవేశం పొందాలని కోరారు. ఎల్లప్పుడు బ్యాకప్, ఆకస్మిక ప్రణాళిక ప్రత్యామ్నాయ ఎంపికలను కలిగి ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా పాఠశాలలో పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలని ఉపాధ్యాయులు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జోనల్ అధికారి ఎం భీమయ్య, శర్మ, కిశోర్, డైరెక్టర్ కల్నల్ కేసీ రావు, ప్రిన్సిపాల్ జి.కాళహస్తి, తదితరులు పాల్గొన్నారు. -
చలో ఎల్కతుర్తి
● బీఆర్ఎస్ రజతోత్సవానికి గులాబీదండు రెడీ ● లక్ష మందిని తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి ● వందలాది బస్సుల్లో పంపేందుకు సిద్ధం సాక్షిప్రతినిధి,కరీంనగర్: బీఆర్ఎస్ పార్టీ 25వ వార్షికోత్సవం సందర్భంగా ఎల్కతుర్తిలో నిర్వహించ తలపెట్టిన రజో త్సవ సభకు జనసమీకరణ దాదాపుగా పూర్తయింది. సమీకరించిన జనాలు, కార్యకర్తలతో బీఆర్ఎస్ నాయకులు ఆదివారం ఉదయమే తరలేలా వందలాదిగా ఆర్టీసీ, ప్రైవేటు, స్కూల్ బస్సులను అందుబాటులో ఉంచారు. ఇవి కాకుండా పార్టీకి చెందిన నాయకుల కార్లను కూడా సిద్ధం చేశారు. కరీంనగర్ నుంచి 15 వేలు, చొప్పదండి, మానకొండూరు నియోజకవర్గాల నుంచి 10వేల మంది చొప్పున జనసమీకరణ జరిగిందని పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు వెల్లడించారు. హుస్నాబాద్, హుజూరాబాద్ నుంచి లక్ష మందిని తరలిస్తున్నామన్నారు. కరీంనగర్లో ప్రతీ డివిజన్ నుంచి 3 బస్సులు బయల్దేరనున్నాయి. ఈ మేరకు బస్సులు, పోస్ట ర్లు, బ్యానర్లు, సిద్ధమయ్యాయి. మధ్యాహ్నం 12.30 గంటల తరువాత బస్సులు నియోజకవర్గాల నుంచి బయల్దేరనున్నాయి. ప్రతీ బస్సుకు కో– ఆర్డినేటర్లు ఉంటారు. వీరే బస్సులో వస్తున్న నాయకులకు ఆహారం, నీరు, ఇతర అవసరాలు, పార్కింగ్ తదితర విషయాల్లో మార్గనిర్దేశనం చేయనున్నారు. నాడు.. నేడు ఉమ్మడి జిల్లానే 2001 ఏప్రిల్ 27వ తేదీన కరీంనగర్లో సింహగర్జన పేరిట నిర్వహించిన సభ ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను చాటింది. ఆ తరువాత 2004లో కాంగ్రెస్‌తో సంకీర్ణంలో చేరింది. 2009 నుంచి మలిదశ పోరాటం ఉధృతం చేసింది. 2014లో రాష్ట్రం సిద్ధించింది. 2014, 2018లో రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. 2023 నుంచి తిరిగి ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. అధినేత కేసీఆర్ కాళేశ్వరం, రైతుబంధు, దళితబందు వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు ఉమ్మడి జిల్లాలోనే శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం 25 ఏళ్ల రజతోత్సవ సభ జరుగుతున్న ఎల్కతుర్తి కూడా 2016 వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అంతర్భాగం కావడం గమనార్హం. నాడు తొలి ఆవిర్భావ సభ, ఇప్పుడు 25వ ఆవిర్భావ సభలు రెండూ ఉమ్మడి జిల్లాలోనే జరుగుతుండటం విశేషం. -
21 రోజుల్లో ముగ్గురి మృతి
● రాచర్లబొప్పాపూర్‌లోని ఆ కుటుంబంలో తీవ్ర విషాదం ● ఒంటరివారైన తల్లీకొడుకులుఎల్లారెడ్డిపేట(ఎల్లారెడ్డిపేట): ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్‌లో ఆ కుటుంబంలో 21 రోజులుగా విషాదచాయలు వీడడం లేదు. ఒకరి తర్వాత ఒకరిగా ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు గడ్డి నర్సయ్య, ఆయన కుమారుడు నరేందర్, తల్లి ఎల్లవ్వ మరణాలతో నర్సయ్య భార్య, కొడుకు ఒంటరివారయ్యారు. మూడు వారాల్లోనే ముగ్గురు రాచర్లబొప్పాపూర్‌కు చెందిన గడ్డి నర్సయ్య(55) తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. అయితే ఏప్రిల్ 3వ తేదీన అనారోగ్యంతో మరణించాడు. అతని చిన్న కొడుకు నరేందర్(23) ఓ మహిళతో ప్రేమలో పడి, 45 రోజులు జైలు జీవితం గడిపాడు. తండ్రి చనిపోవడంతో బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయితే తన తండ్రి మృతికి సదరు మహిళే కారణమంటూ ఆమె ఇంటికి వెళ్లి గొడవపడి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ ఈనెల 22న ప్రాణాలు కోల్పోయాడు. తన కళ్ల ముందే కన్నకొడుకు, మనుమడు మృతిచెందడంతో నర్సయ్య తల్లి గడ్డి ఎల్లవ్వ(80) తీవ్ర మనోవేదనకు గురైంది. గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచింది. వారి కుటుంబంలో 21 రోజుల వ్యవధిలోనే ముగ్గురు మరణించడం కలచివేసింది. ప్రస్తుతం వారి కుటుంబంలో నర్సయ్య భార్య, కొడుకు ఒంట రివారయ్యారు. వారి వేదన వర్ణనాతీతంగా ఉంది. -
కళాసిల్క్ చేనేత హస్తకళ మేళాకు ఆదరణ
కరీంనగర్‌కల్చరల్: కరీంనగర్‌లోని శ్రీరాజరాజేశ్వర కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కళాసిల్క్ చేనేత హస్తకళ మేళాకు విశేష ఆదరణ లభిస్తోంది. మేళాలో పట్టు, ఫ్యాన్సీ డిజైనర్, పోచంపల్లి చీరలు, డ్రస్ మెటీరియల్స్, చుడీదార్స్, సూటింగ్స్ షర్టింగ్స్, జ్యువెల్లరీ, బెడ్ షీట్స్ అందుబాటులో ఉన్నాయని నిర్వాహకుడు వినోద్ నేగి తెలిపారు. అలాగే ధర్మవరం, వెంకటగిరి, మంగళగిరి, కలంకారి, ఉప్పాడల్లో ప్రఖ్యాతి పొందిన చీరలు అందుబాటులో ఉన్నాయన్నారు. హర్యానా బెడ్, కుషన్ కవర్లు, లక్నో కుర్తీస్, డ్రెస్ మెటీరియల్స్, డోర్ కార్టన్స్, స్టోన్ జ్యువెల్లరీ, పెరల్స్, క్రాఫ్ట్స్, బంజారా, కోల్ కత్తా బ్యాగులు, ఒడిస్సా పెయింటింగ్స్ , మధ్యప్రదేశ్ చందేరి, మహేశ్వరి, రాజస్తాన్ కోటా బాందేజన్, బ్లాక్ప్రింట్స్, సంగ్నరి ప్రింట్స్, డ్రెస్ మెటీరియల్స్, ఉత్తరప్రదేశ్ జామ్దాని, బనారస్ లక్నొవి డ్రెస్ మెటీరియల్స్ పాటు పలు రకాల వస్తువులు సరసమైన ధరలకు లభిస్తాయని తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు మేళా అందుబాటులో ఉంటుందని, ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. -
‘ఆరోగ్య మహిళ’ వరం
ఆరోగ్య మహిళ కార్యక్రమంలో అన్నివ్యాధులకు నిర్ధారణపరీక్షలతోపాటు ముఖ్యంగా కేన్సర్ స్క్రీనింగ్‌పై దృష్టి పెడుతున్నాం. మహిళలకు బ్రెస్ట్, సర్వికల్, గర్భాశయ, ఇతర కేన్సర్లు ఉంటే మేం చేసే పరీక్షల్లో ముందుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీంతో చికిత్స సులభమవడమే కాకుండా కేన్సర్ నిర్మూలన ఫలితం మెరుగ్గా ఉంటుంది. – డాక్టర్ వెంకటరమణ, జిల్లా వైద్యాధికారి, కరీంనగర్ తొలిదశలో గుర్తిస్తే నయం చేయవచ్చు కేన్సర్‌ను తొలిదశలో గుర్తిస్తే నయం చేయొచ్చు. మగవారు ఎక్కువగా ఊపిరితిత్తుల కేన్సర్‌కు గురవుతున్నారు. స్మోకింగ్, నాన్ స్మోకింగ్ టొబాకో, రెడ్‌మీట్, ఆయిల్స్, జంక్ఫుడ్స్ మానేయాలి. మద్యపానం నియంత్రించాలి. నిర్దేశిత బరువు మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నిత్యం అర్ధగంటపాటు వాకింగ్, వ్యాయామం చేయాలి. భోజనంలో ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. – డాక్టర్ రవీంద్రచారి, పల్మనాలజిస్టు -
అనుమానాస్పద స్థితిలో నర్స్ మృతి
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ సిటీలోని జ్యోతినగర్‌లో నివసిస్తున్న ఓ నర్స్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. టూటౌన్ పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా పాలితం గ్రామానికి చెందిన బాసిల్లి ఝాన్సీ(23) స్థానికంగా ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తోంది. ఇద్దరు స్నేహితులతో కలసి జ్యోతినగర్‌లోని ఓ గదిలో కిరాయికి ఉంటుంది. గురువారం రాత్రి భోజనం చేసిన తర్వాత గదిలోపల ఝాన్సీ ఉండగా ఆమె స్నేహితులు బిల్డింగ్‌పై పడుకోవడానికి వెళ్లారు. అదే సమయంలో వీరికి పరిచయం ఉన్న అజయ్ అనే వ్యక్తి ఫోన్ చేసి ఝాన్సీకి ఫోన్‌చేస్తే లిఫ్ట్ చేయడం లేదని తెలిపాడు. వెంటే స్నేహితులు కిందికి వచ్చి చూడగా ఝాన్సీ అపస్మారక స్థితిలో ఉంది. పక్కనే ఓ ఇంజెక్షన్ ఉండడంతో దానిని ఫొటోతీసి అజయ్‌కు పంపించారు. దీంతో అజెయ్ వెంటనే తన మిత్రుడికి సమాచారం ఇచ్చి స్నేహితులతో ఝాన్సీని ఆసుపత్రికి తరలించేలోపే మృతిచెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉరేసుకుని ఆర్ఎంపీ ఆత్మహత్యమేడిపల్లి: మేడిపల్లి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ సాంబారు జగదీశ్(44) శుక్రవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జగదీశ్ మూడేళ్లనుంచి తీవ్రమైన మెడ నొప్పితో బాధపడుతున్నాడు. నాలుగు నెలల క్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకున్నాడు. అయిన మెడ నొప్పి తగ్గ్గలేదు. ఆపరేషన్ కోసం రూ.5లక్షల వరకు అప్పు చేశాడు. ఆర్థిక పరిస్థితి, అనారోగ్య సమస్యలతో జీవితంపై విరక్తి చెందాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని చనిపోయాడు. జగదీశ్‌కు భార్య రూప, కొడుకు, కూతురు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
‘ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అథారిటీ’ పర్యటన
రామగుండం: అంతర్గాం మండల కేంద్రంలోని టెక్స్టైల్ భూములను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అథారిటీ ఉన్నతాధికారులు శుక్రవారం పర్యటించారు. ఎయిర్‌పోర్టు ప్రతిపాదిత స్థలాన్ని వారు సందర్శించారు. గతంలో సమర్పించిన భూ రికార్డుల ఆధారంగా ఆ స్థలాన్ని పరిశీలించారు. సమీపంలోని రైల్వేట్రాక్, రాజీవ్ రోడ్డు కనెక్టివిటీ, ఇరువైపులా పట్టణాలు తదితర అంశాలపై రెవెన్యూ అధికారులతో చర్చించారు. అక్కడి నుంచి బసంత్‌నగర్ ఎయిర్‌పోర్టు భూములు పరిశీలించారు. అయితే, ఎయిర్‌పోర్టు నిర్మాణం ఎంతోఅవసరం కాగా, అంతర్గాం, బసంత్‌నగర్ కేంద్రాల్లో దానిని ఎక్కడ నిర్మిస్తారనే విషయంపై స్పష్టత రాలేదు. భూములను పరిశీలించిన వారిలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అథారిటీ ప్రతినిధులతోపాటు రాష్ట్ర ల్యాండ్ రికార్డ్స్ ఏడీఈ శ్రీనివాస్, పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య, అంతర్గాం తహసీల్దార్ రవీందర్‌పటేల్ తదితరులు ఉన్నారు. -
సలుపుతున్న రాచపుండు!
సాక్షి,పెద్దపల్లి/కరీంనగర్‌టౌన్: ఉమ్మడి జిల్లాలో క్యాన్సర్ మహమ్మారి అంతకంతకూ పెరుగుతోంది. ఒకప్పుడు 50 ఏళ్లు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించే ఇది ఇప్పుడు చిన్నవయసు వారిని సైతం బలితీసుకుంటుంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. 40 శాతం కేసులు టొబాకో రిలేటెడ్ కేన్సర్(టీఆర్సీ).. అంటే పొగాకు వినియోగించే వారివని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం 20–25 ఏళ్ల యువతనూ పట్టిపీడిస్తోందంటున్నారు. పొగాకు తీసుకోవడం ప్రారంభించిన 10–20 ఏళ్ల తర్వాత కేన్సర్ బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ప్రతీ ముగ్గురిలో ఇద్దరికి వ్యాధి ముదిరిన తర్వాతే నిర్ధారణ అవుతోందని, దీంతో బతికే అవకాశాలు తగ్గుతున్నాయని పేర్కొంటున్నారు. -
ఆ ఇంట్లో... అసలేం జరిగింది?
-
వేర్వేరు ఘటనల్లో ఇద్దరు దొంగల అరెస్టు
కరీంనగర్‌క్రైం: రెండు వేర్వేరు దొంగతనం ఘటనల్లో నిందితులను కరీంనగర్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేయగా.. వారి నుంచి 250 గ్రాముల బంగారం, రూ.10లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో సీపీ గౌస్ ఆలం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రెండు ఘటనల్లో నిందితుల వివరాలు వెల్లడించారు. కరీంనగర్ వన్‌టౌన్ పరిధిలోని బస్టాండులో చిగురుమామిడి మండలం నవాబ్‌పేటకు చెందిన కంది సంపత్‌రెడ్డి(48) ఫిబ్రవరి 14న ఒక మహిళ బ్యాగు నుంచి 16.5 తులాల బంగారం, ఫిబ్రవరి 24న కరీంనగర్ బస్టాండుకు వచ్చి ఒక మహిళ బ్యాగు నుంచి 47 గ్రాముల బంగారం, ఏప్రిల్ 8న ఒక వృద్ధుడి బ్యాగు నుంచి రూ.13లక్షలు దొంగిలించాడు. ఈ మూడు ఘటనలపై కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు సంపత్‌రెడ్డిని కమాన్ చౌరస్తా వద్ద సీఐ కోటేశ్వర్ బృందం పట్టుకొని అరెస్టు చేశారు. అతడి వద్ద నుండి 150 గ్రాముల బంగారం, రూ.10లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో కరీంనగర్ టూటౌన్ పరిధిలో ఈనెల 13న సప్తగిరికాలనీలో ఒక ఇంట్లోకి వరంగల్ జిల్లా నర్సంపేట మండలం అశోక్నగర్క్ చెందిన సూర రవి(35) అనే నిందితుడు చొరబడి 175 గ్రాముల బంగారు ఆభరణాలతోపాటు రూ.35వేల నగదు అపహరించుకుపోయాడు. ఈ విషయంపై కేసు నమోదు చేసిన టూటౌన్ పోలీసులు రవిని పద్మనగర్ చౌరస్తా వద్ద శుక్రవారం అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 100 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ టౌన్ ఏసీపీ వెంకటస్వామి, సీఐలు బిల్ల కోటేశ్వర్, సృజన్‌రెడ్డి, సీసీఎస్ సీఐ బొల్లం రమేశ్ పాల్గొన్నారు. సిబ్బంది కుమార్, అనిల్‌రెడ్డి, సురేందర్‌పాల్, మల్లయ్య, సాయికుమార్‌తోపాటు పలువురిని ప్రత్యేకంగా అభినందించి రివార్డులు అందించారు. -
రెవెన్యూలోనే భూ సమస్యకు పరిష్కారం
● ‘భూ భారతి’తో రైతులకు మేలు ● కోర్టు మెట్లెక్కాల్సిన అవసరం లేదు ● సీసీఎల్ఏ వరకు అప్పీల్‌కు అవకాశం ● త్వరలో అసైన్మెంట్ కమిటీల ఏర్పాటు సాక్షి ఫోన్ఇన్లో ఆర్డీవో కుందారపు మహేశ్వర్సాక్షిప్రతినిధి,కరీంనగర్/కరీంనగర్ అర్బన్: ‘భూ భారతి’ రైతులకు వరం. భూ సమస్యలకు పరిష్కార వేదిక’ అని కరీంనగర్ ఆర్డీవో కుందారపు మహేశ్వర్ తెలిపారు. ధరణి స్థానంలో వచ్చిన భూభారతితో కోర్టు మెట్లెక్కాల్సిన అవసరం లేదన్నారు. రెవెన్యూ అధికారుల స్థాయిలోనే పరిష్కారం లభిస్తుందన్నారు. ‘భూ భారతి’ సందేహాల నివృత్తి కోసం శుక్రవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ఇన్లో రైతులు అడిగిన పలు ప్రశ్నలకు ఆర్డీవో సమాధానాలు ఇచ్చారు. జూన్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా భూ భారతి అమలవుతుందని, వచ్చేనెల ఒకటి నుంచి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఒక మండలంలో అమలు చేస్తామన్నారు. -
లక్కీ కాంట్రాక్టర్!
● పనులు ప్రారంభించకముందే చెక్కు రెడీ ● బొమ్మకల్ ఫ్లైఓవర్ పెయింటింగ్‌కు రూ.40 లక్షలు కరీంనగర్ కార్పొరేషన్: చేసిన పనులకు బిల్లుల కోసం ఏళ్లతరబడి నగరపాలకసంస్థ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న కాంట్రాక్టర్లు ఎంతోమంది. నానా తిప్పలు పడితే వాయిదాల లెక్కన బిల్లులు వచ్చేది ఎప్పుడో. కాని ఈ కాంట్రాక్టర్ మాత్రం చాలా అదృష్టవంతుడు?..పనులు మొదలు పెట్టకముందే బిల్లు రెడీగా ఉంది. ఆయన పనులు చేయడమే ఆలస్యం...ఖాతాలో పడడం ఖాయం. విచిత్రమో...అదృష్టమో...అధికారుల మాయో తెలియదు కాని...అక్షరాల రూ.40 లక్షల చెక్కు, పనికి ముందే ఆ కాంట్రాక్టర్ పేరిట రెడీ అయిపోయింది. రూ.40లక్షల పని.. నగరంలోని బొమ్మకల్ ఫ్లై ఓవర్‌కు సుందరీకరణలో భాగంగా పెయింటింగ్ వేసేందుకు నగరపాలకసంస్థ నిర్ణయించింది. స్పర్స్ ఐఈసీ నిధులతో చారిత్రాత్మక చిత్రాలు, స్వచ్ఛతపై అవగాహన కల్పించే చిత్రాలను ఈ ఫ్లై ఓవర్‌పై వేయాల్సి ఉంటుంది. రూ.40 లక్షల విలువైన పనికి సంబంధించి రూ.5 లక్షల చొప్పున ఎనిమిది బిట్లుగా విభజించి నామినేషన్ పద్ధతిన కాంట్రాక్ట్ అప్పగించినట్లు సమాచారం. కాగా సదరు కాంట్రాక్టర్ పెయింటింగ్ పనులు మొదలు పెట్టకముందే ఆయన చేసిన(చేయని) పనికి బిల్లు కూడా రెడీ అయిపోయింది. రూ.40 లక్షల విలువైన చెక్కు జారీ అయింది. అది నగదుగా మారడమే మిగిలింది. నిధులు ల్యాప్స్ అవుతాయట.. స్పర్స్ ఐఈసీ నిధులతో రూ.40 లక్షల విలువైన పెయింటింగ్ పనులు చేపట్టారు. ఈ నిధులు గత ఆర్థిక సంవత్సరంలోనే వినియోగించాల్సి ఉంది. దీంతో మార్చి 31వ తేదీ తరువాత ల్యాప్స్ అయిపోతాయానే ఉద్దేశంతో కాంట్రాక్టర్ పేరిట ముందే చెక్ రెడీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మార్చి 31వ తేదీలోపు ఈ నిధులను వినియోగించాల్సి ఉన్నప్పుడు, అందుకు తగినట్లుగా ముందే ఎందుకు పనులు పూర్తి చేయలేకపోయారో అధికారులు చెప్పలేకపోతున్నారు. నిధుల గడువు ముగిసిపోతుందని హడావుడిగా నామినేషన్ పద్ధతిన కాంట్రాక్ట్ అప్పగించడం, పనులు మొదలు పెట్టకముందే బిల్లు సిద్ధం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఒకవేళ పనులు అనుకున్న రీతిలో చేయకపోయినా బిల్లు మాత్రం చెల్లించే పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా పనులు మొదలు పెట్టకున్నా చెక్కు రెడీ కావడం పట్ల బల్దియా వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. పనులు పూర్తయ్యాకే బిల్లు ఇస్తాం బొమ్మకల్ ఫ్లై ఓవర్ పెయింటింగ్ పనికి సంబంధించిన బిల్లు కాంట్రాక్టర్‌కు చెల్లించలేదు. నిధుల గడువు మార్చి 31వ తేదీతో ముగుస్తున్నందున ఆ డబ్బులు విడుదల చేయాల్సి వ చ్చింది. చెక్ మాత్రమే రెడీ చేశాం. డబ్బులు నగరపాలకసంస్థ వద్దనే ఉన్నాయి. పనులు పూ ర్తయ్యాకే బిల్లు చెల్లిస్తాం. – చాహత్ బాజ్‌పేయ్, కమిషనర్ నగరపాలకసంస్థ -
విద్యార్థులూ.. సెల్ఫోన్లను పక్కన పెట్టండి
● సమ్మర్ క్యాంపును సద్వినియోగం చేసుకోండి ● జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్: కరీంనగర్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పలు అంశాలపై ఉచిత వేసవి శిక్షణ కార్యక్రమాన్ని 20 రోజులపాటు నిర్వహించనున్నామని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఈనెల 28 నుంచి ప్రారంభం కానున్న వేసవి శిక్షణ తరగతులపై శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రైవేట్ విద్యాసంస్థల కరస్పాండెంట్లు, ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థులు చదువుతోపాటు వివిధ క్రీడల్లో చక్కగా రాణించాలని సూచించారు. వేసవి శిక్షణ శిబిరాలకు సంబంధించి పలు అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు. సోమవారం నుంచి కరీంనగర్‌లోని నాలుగు ప్రభుత్వ పాఠశాలలతోపాటు ఎంపిక చేసిన 10 ప్రైవేటు పాఠశాలల్లో 20 అంశాలపై ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్‌లోని బాలభవన్, అంబేడ్కర్ స్టేడియం, సప్తగిరికాలనీలోని కేజీబీవీ స్కూల్, మంకమ్మతోటలోని గర్ల్స్ హైస్కూల్‌తోపాటు ఎంపిక చేసిన పది ప్రైవేటు పాఠశాలల్లో సమ్మర్ క్యాంపులు జరుగుతాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సమ్మర్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని, సెల్ఫోన్లకు దూరంగా ఉండాలని, వాటి బారిన పడి ఇబ్బందులు తెచ్చుకోవద్దని సూచించారు. స్విమ్మింగ్, స్పెల్ బి, క్రియేటివ్ రైటింగ్, అబాకస్, వాలీబాల్, బుక్ రివ్యూ, యాక్టింగ్, పెయింటింగు, క్విజ్, డ్యాన్సు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, చెస్, బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అండ్ ఫొటోషాప్, వివిధ అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. డీఆర్వో వెంకటేశ్వర్లు, డీఈవో జనార్దన్‌రావు, క్వాలిటీ కోఆర్డినేటర్ కర్ర అశోక్‌రెడ్డి, ప్రైవేట్ విద్యాసంస్థల ప్రతినిధులు శేఖర్‌రావు, రామారావు, హనుమంతరావు, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
లైంగిక వేధింపులు ఉంటే తెలియజేయాలి
కరీంనగర్‌క్రైం: విద్యార్థిదశలో లైంగిక వేధింపులకు గురైతే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా మిత్రులకు తెలియజేయాలని లేదంటే భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కొవాల్సి వ స్తుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.వెంకటేశ్ సూచించారు. శుక్రవారం కరీంనగర్ సిటీలోని ప్రభుత్వ వృద్ధులు, వికలాంగుల ఆశ్రమాలు, స్వధార్ హోమ్‌ను పరిశీలించారు. ఆహార పదార్థాలు నిలువచేసే గదులను తనిఖీ చేశారు. పరిశుభ్రత పాటించాలని నిర్వాహకులకు జడ్జి సూచించారు. ఎలాంటి న్యాయపరమైన సహాయం, న్యాయసేవలు అవసరమున్నా..తమను సంప్రదించాలన్నారు.విజిబుల్ పోలీసింగ్‌పై దృష్టి సారించాలి ● సీపీ గౌస్ ఆలం గంగాధర: విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, సిబ్బంది తమ పరిధిలో ఉన్న గ్రామాలను క్రమం తప్పకుండా సందర్శించి ప్రజలతో మమేకం కావాలని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం సూచించారు. గంగాధర పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం సాయంత్రం తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లో పెండింగ్‌లో ఉన్న కేసులపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌కు సంబంధించిన వివరాలను సిబ్బందినడిగి తెలుసుకున్నారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేకంగా నిఘా ఉంచాలని, వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలన్నారు. ఎస్సై వంశీకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. రేషన్‌కార్డుల జారీ వేగవంతం చేయాలి● నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ కరీంనగర్‌కార్పొరేషన్: రేషన్‌కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ ఆదేశించారు. శుక్రవారం నగరపాలకసంస్థ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వార్డు అధికారులతో సమావేశం నిర్వహించారు. రేషన్‌కార్డులను త్వరగా లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నూతన రేషన్‌కార్డులు, పేర్ల నమోదుకు చేసుకున్న దరఖాస్తుల పరిశీలన చేపట్టాలన్నారు. డివిజన్లవారీగా దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలన్నారు. ఐదుశాతం రాయితీతో ఆస్తి పన్ను చెల్లింపులపై దృష్టి సారించాలని, గడువులోగా కనీసం 25శాతం లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. అండర్ అసెస్మెంట్లను గుర్తించి రివైజ్డ్ చేయాలని సూచించారు. అన్ అసెస్మెంట్లు ఉంటే అసెస్మెంట్ పరిధిలోకి తీసుకురావాలన్నారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్లు స్వరూపరాణి, ఖాదర్ మొహియొద్దీన్, పౌరసరఫరాలశాఖ అధికారి నర్సింహరావు, రెవెన్యూఅధికారి శ్రీనివాస్, నగరపాలకసంస్థ ఆర్వో భూమానందం పాల్గొన్నారు.సుఖ ప్రసవాల సంఖ్య పెంచాలి● డీఎంహెచ్‌వో వెంకటరమణ హుజూరాబాద్/ఇల్లందకుంట: సాధారణ ప్రసవాలకు ప్రోత్సహించాలని డీఎంహెచ్‌వో వెంకటరమణ వైద్య సిబ్బందిని ఆదేశించారు. హుజూరాబాద్ మండలంలోని చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, వావిలాల పీహెచ్‌సీని శుక్రవారం తనిఖీ చేశారు. సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వద్దన్నారు. అనంతరం వావిలాల పీహెచ్సీ ఆద్వర్యంలో గ్రామంలో మలేరియా దినోత్సవం ర్యాలీ నిర్వహించారు. చెల్పూరు వైద్యాధికారి మధు, డిస్ట్రిక్ట్ హెల్త్ ఎడ్యుకేటర్ ప్రతాప్ వావిలాల వైద్యాధికారి రాజేశ్, డాక్టర్లు చందన, హిమబిందు, సంధ్యారాణి, సఽంధ్యా, ఫర్హానుద్దీన్, కార్తీక్, విజయ్ పాల్గొన్నారు. -
ఉగ్ర దాడి మృతులకు ఉపాధ్యాయుల నివాళి
విద్యానగర్(కరీంనగర్): కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడిలో మృతిచెందిన వారికి గురువారం కరీంనగర్‌లోని తెలంగాణచౌక్‌లో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాలి అర్పించారు. కార్యక్రమంలో డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.రాజిరెడ్డి, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె. నారాయణరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చకినాల రామ్మోహన్, యూటీఎఫ్, ఎస్టీయూ, పీఆర్టీయూ, టీపీటీఎఫ్, పీఆర్టీయూటీజీ, ఎస్సీ, ఎస్టీ సంఘం, ఎస్జీటీయూ సంఘాల బాధ్యులు ముల్కల కుమార్, ఎస్.రవీంద్రచారి, పీఆర్ శ్రీనివాస్, మర్రి జైపాల్‌రెడ్డి, అర్కాల శ్రీనివాస్, జె.రాంచంద్రారెడ్డి, గోనె శ్రీనివాస్, నాగరాజు, మీసాల మల్లిక్, కె.మహిపాల్‌రెడ్డి, విజేందర్‌రెడ్డి, బి.రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రేషన్ డీలర్ల పరీక్ష ప్రశాంతం
కరీంనగర్ అర్బన్: రేషన్ డీలర్ల పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. కరీంనగర్ రెవెన్యూ డివిజన్లో తొలి విడత 68 రేషన్ దుకాణాలకు గానూ ప్రకటన వెలువడగా 415 మంది దరఖాస్తు చేసుకున్నారు. గురువారం జ్యోతినగర్‌లోని సెయింట్ జాన్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్లో పరీక్ష నిర్వహించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరగగా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సౌకర్యాలు కల్పించారు. ఆర్డీవో కె.మహేశ్వర్ ప్రత్యేకంగా పర్యవేక్షించారు. 415 మంది అభ్యర్థులకు గానూ 391 మంది పరీక్షకు హాజరైనట్లు అధికారులు వివరించారు. కాగా భానుడి ప్రతాపానికి అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. దశాబ్దాల తర్వాత రేషన్ డీలర్ల నియామకానికి ప్రకటన వెలువడటంతో పోటాపోటీ నెలకొంది. కాగా, పరీక్ష రాసినవారిలో రాజకీయ పార్టీల నేతల కుటుంబ సభ్యులు, రేషన్ డీలర్ల బంధువులు, రెవెన్యూ ఉద్యోగులు, అధికారుల బంధువులే ఎక్కువగా కనిపించారు. కరీంనగర్ రూరల్, గంగాధర, మానకొండూరు, చొప్పదండి, రామడుగు, తిమ్మాపూర్, చిగురుమామిడి, గన్నేరువరం, కొత్తపల్లి, కరీంనగర్ అర్బన్ మండలాల్లోని రేషన్ దుకాణాల అభ్యర్థులందరికీ ఇదే స్కూల్‌ను పరీక్షా కేంద్రంగా ఏర్పాటు చేశారు. రెవెన్యూ ఉద్యోగులు, అధికా రులు ఇన్విజిలేటర్లుగా వ్యవహరించారు. వక్ఫ్ సవరణ చట్టంతో పేద ముస్లింలకు మేలు ● బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కిశోర్రెడ్డికరీంనగర్టౌన్: వక్ఫ్ నిబంధనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని మెరుగుపరచడానికి, పేద, మధ్యతరగతి ముస్లింల ప్రయోజనాలు, సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం వక్ఫ్‌పై సవరణలు చేపట్టిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిశోర్‌రెడ్డి తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అధ్యక్షతన గురువారం కరీంనగర్లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. వక్ఫ్ అనేది ఇస్లామిక్ చట్ట ప్రకారం ఇవ్వబడిన, తిరిగి ఇవ్వలేని దాతృత్వ నిధి అన్నారు. 2018 కేంద్రీయ వక్ఫ్ పరిషత్ నివేదిక ప్రకారం మన దేశంలో 10 లక్షల కోట్లకు పైగా అంచనా విలువ కలిగిన ఎనిమిది లక్షల ఎకరాలకు పైగా వక్ఫ్ ఆస్తులు ఉన్నాయన్నారు. అయితే వక్ఫ్ పాలన వ్యవస్థ బలహీనంగా ఉండి, బోర్డులో ఎవరు ఎవరికి జవాబు దారీగా ఉండడం లేదని, దీంతో మోదీ ప్రభుత్వం వక్ఫ్ వ్యవస్థను క్రమబద్ధీకరించడానికి వీలుగా సవరణ చట్టం ప్రవేశపెట్టిందన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఓవైసీ ముస్లిం సమాజాన్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. నాయకులు యాదగిరి సునీల్‌రావు, సుంకర మౌనిక, నిర్మలాదేవి, గుగ్గిలపు రమేశ్, కోమల ఆంజనేయులు, కన్నబోయిన ఓదెలు, వాసాల రమేశ్, ప్రవీణ్‌రావు, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, మాడ వెంకటరెడ్డి, సాయిని మల్లేశం, ఎండీ ముజీబ్, సోమిడి వేణుప్రసాద్, చొప్పరి జయశ్రీ, మోహన్‌రెడ్డి, పుప్పాల రఘు, ఎన్నం ప్రకాష్, బల్బీర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ కరీంనగర్ –2 డిపోకు అవార్డులు కరీంనగర్: హైదరాబాద్‌లోని మారియట్ హోటల్లో ఇటీవల నిర్వహించిన టెక్నికల్ సెమినార్లో కరీంనగర్లో 2 డిపో పలు అవార్డులు అందుకుంది. బీఎస్ 6బస్సులలో హెచ్ఏ కేఎంపీఎల్ సాధించినందుకు, అశోక్ లీలాండ్ ఇంజిన్‌లో హై మైలేజ్ 20.40లక్షలు కిలోమీటర్లు సాధించినందుకు ఆర్టీసీ సీఎండీ సజ్జనార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీవీ మునిశేఖర్, కరీంనగర్ జోన్ ఈడీ సోలమన్, హైదరాబాద్ గ్రేటర్ జోన్ ఈడీ ఖుస్రో షా ఖాన్, ఈడీ (ఇంజినీరింగ్) వెంకన్న చేతులమీదుగా ఆర్ఎం. బి.రాజు, డిపో మేనేజర్ శ్రీనివాస్, గతంలో డిపో మేనేజర్‌గా పనిచేసిన వి. మల్లయ్య రాష్ట్రస్థాయిలో అవార్డులు అందుకున్నారు. -
భూ భారతితో సమస్యలు పరిష్కారం
శంకరపట్నం(మానకొండర్): ధరణితో భూ సమస్యలు పరిష్కరించలేక కలెక్టర్లం ఇబ్బందులు పడ్డామని, భూభారతితో సమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శంకరపట్నం మండలం కేశవపట్నం శివారులోని పంక్షన్హాల్లో గురువారం భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. 1971లో ఆర్ఓఆర్ చట్టం వచ్చిందని, అమలు అయ్యేందుకు కొన్నేళ్లు పట్టినా పకడ్బందీగా అమలు అయ్యాయన్నారు. ధరణి చట్టం తీసుకురావడానికి రాత్రికిరాత్రే కంప్యూటరీకరణ చేయడంతో రైతులకు భూసమస్యలు ఏర్పడినట్లు పేర్కొన్నారు. భూభారతిలో రెండంచెల అప్పీలు వ్యవస్థ రూపొందించడంతో భూ సమస్యలు తహసీల్దార్, ఆర్టీవో స్థాయిలోనే పరిష్కారం అవుతాయన్నారు. గతంలో భూ ఆక్రమణలు జరిగాయని, వాటికి అడ్డుకట్ట పడుతుందన్నారు. పట్టాదారు పాసుపుస్తకాల్లో భూమి పటం పొందిపర్చి భూధార్ అమలు చేస్తున్నట్లు వివరించారు. అంతకుముందు జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడిలో పర్యాటకులు చనిపోగా సంతాపంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. సదస్సులో అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్డీవో రమేశ్, తహసీల్దార్ భాస్కర్, ఎంపీడీవో కృష్ణప్రసాద్, ఏవో వెంకటేశ్, రైతులు పాల్గొన్నారు. ● కలెక్టర్ పమేలా సత్పతి -
చేతులెత్తేశారా..?
● సమ్మర్ క్యాంపులు ఉన్నట్టా.. లేనట్టా.. ● 2017 నుంచి నిర్వహిస్తున్న నగరపాలక సంస్థ ● ప్రస్తుతం శిక్షణ శిబిరాల ఊసెత్తని బల్దియా ● ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు, చిన్నారులుకరీంనగర్స్పోర్ట్స్: ఏడేళ్ల వ్యవధిలో ఐదు పర్యాయాలు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించిన కరీంనగర్ బల్దియా ఈసారి క్యాంపుల నిర్వహణపై చేతులెత్తేసిందా? అనే అనుమానం నగరవాసుల నుంచి వ్యక్తమవుతోంది. గతేడాది ఎన్నికల కోడ్ పేరిట శిబిరాలకు చెక్ పెట్టగా ఈ సారి ఏ కారణం చెబుతారో అని వేచి చూస్తున్నారు తల్లిదండ్రులు, చిన్నారులు. పక్క జిల్లాలో శిబిరాల నిర్వహణపై సన్నాహాలు ప్రారంభించగా, క్రీడల కోటగా పేరుగాంచిన కరీంనగర్లో ఆ ఊసే లేకుండాపోయింది. 2017 నుంచి ఉచిత శిక్షణ వేసవి సెలవుల్లో ఇంటిపట్టునే ఉంటున్న చిన్నారులకు కరీంనగర్ నగరపాలక సంస్థ 2017 నుంచి ఉచిత క్రీడా శిక్షణ శిబిరాలు జిల్లా క్రీడాశాఖ సహకారంతో నిర్వహిస్తోంది. నగరంలోని అంబేడ్కర్ స్టేడియంలో ఆసక్తి ఉన్న క్రీడాంశాల్లో చిన్నారులు శిక్షణ పొందారు. ఈ ఏడాది వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. కానీ, నగరపాలక సంస్థ క్రీడా శిబిరాలపై ఎలాంటి ప్రకటన చేయలేదు. 2017లో శిబిరాల్లో 15 క్రీడాంశాల్లో సుమారు 1,500 మంది, 2018లో 20 క్రీడల్లో 2,500, 2019లో 22 క్రీడాంశాల్లో 3వేలు, 2022లో 27 క్రీడల్లో సుమారు 3,200, 2023లో 28 క్రీడల్లో సుమారు 3వేల మంది శిక్షణ తీసుకున్నారు. వేల మందికి తర్ఫీదు ఇచ్చిన బల్దియా ప్రస్తుతం శిబిరాల ఊసెత్తకపోవడం విడ్డూరం. ఈసారి శిబిరాలు నిర్వహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చినా లాభం లేకుండాపోయింది. ఇప్పటికే శిబిరాల కోసం రోజూ స్టేడియానికి వందల సంఖ్యలో చిన్నారులు వస్తున్నట్లు సమాచారం. గౌరవ వేతనం ఇవ్వాల్సి వస్తుందనా..? శిక్షణ శిబిరాల్లో కోచింగ్ ఇచ్చిన కోచ్‌లకు గౌరవ వేతనం ఇవ్వడం ఆనవాయితీ. 2023 మే లో 28 క్రీడాంశాల్లో సుమారు 70 మందికిపైగా కోచ్‌లు చిన్నారులకు శిక్షణ ఇచ్చారు. వీరికి ఇస్తామన్న గౌరవ వేతనం రూ.10వేలు నేటికీ ఇవ్వలేదు. ప్రస్తుతం శిబిరాల నిర్వహణపై ఎలాంటి ప్రకటన లేదు. ఒక వేళ శిబిరాలు నిర్వహిస్తే ఇది వరకు కోచ్‌లకు ఇవ్వాల్సిన గౌరవ వేతనం ఇచ్చి, మలి దశ శిబిరాలకు కూడా ఇవ్వాల్సి వస్తుందని, అదే శిబిరాల జోలికి పోకుండా ఉంటే ఏ సమస్య ఉండదన్న ఆలోచనలో నగరపాలక సంస్థ అధికారులు ఉన్నట్లు పలువురు కోచ్‌లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.శిబిరాలు నిర్వహించాలి వేసవి క్రీడా శిబిరాలతో క్రీడాకారుల సామర్థ్యాలు మెరుగుపడుతాయి. చిన్నారులు క్రీడల్లో ఉన్నతస్థాయిలో నిలవాలంటే సమ్మర్ క్యాంపులు నిర్వహించాలి. ఈసారి కూడా శిబిరాలు నిర్వహించాలి. కోచ్‌లకు గౌరవ వేతనం ఇవ్వాలి. – బత్తిని శ్రీధర్‌గౌడ్, ప్రైవేటు పీఈటీల సంఘం జిల్లా అధ్యక్షుడు -
ప్రతీ వర్షపు నీటిచుక్క ఒడిసిపట్టాలి
● అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్కరీంనగర్ కార్పొరేషన్: రానున్న వర్షాకాలంలో కురిసే ప్రతీ నీటి చుక్కను ఒడిసిపట్టుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని వర్షపు నీటి సంరక్షణకు ప్రణాళిక రూపొందించాలన్నారు. గురువారం కలెక్టరేట్లో పురపాలక, నీటిపారుదల శాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. భూగర్భ జలాలు అడుగంటి పోతున్న తరుణంలో రాబోయే వర్షాకాలంలో వర్షపు నీటి సేకరణ, సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. 200 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఇండ్లలో నీటి సంరక్షణ చర్యలపై దృష్టి పెట్టాలన్నారు. వర్షపు నీరంతా నేలలోకి ఇంకేలా, ఇంకుడు గుంతల నిర్మాణం తప్పనిసరి చేయాలని సూచించారు. భవన అనుమతుల సమయంలోనే ఇంకుడు గుంతల నిర్మాణాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. చెరువులు, కుంటల్లో పేరుకుపోయిన పూడిక తొలగింపు విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు. కొండలు, గుట్టలు ఉన్న ప్రాంతాల్లో జాలువారే వరద నీటిని భూగర్భంలోకి ఇంకేలా కందకాల తవ్వకం వంటి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్ పేయ్ మున్సిపల్ కమిషనర్లు, భూగర్భ జలశాఖ, నీటిపారుదల పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు. డివిజన్ల వారీగా బాధ్యతలు ఇంకుడు గుంతలనిర్మాణం లక్ష్యంగా శుక్రవారం నుంచి నగరంలో అధికారులు సర్వే చేపట్టనున్నారు. నగర పాలకసంస్థలోని 60 డివిజన్లతో పాటు విలీన గ్రామాల్లో సర్వే నిర్వహించేందుకు అధికారులకు బాధ్యతలు అప్పగించారు. 20, 21,22,23, 40, 41, 42, 43, 53, 57, 58, 59,60 డివిజన్లతో పాటు కొత్తపల్లి బాధ్యతలను డీఈ లచ్చిరెడ్డి, ఏఈ భీమ్వర్ధన్,టీపీబీవో సయ్యద్ ఖాదర్, ఎస్ఐ కుమారస్వామి అప్పగించారు.అలాగే 14,15,16,17, 18,19,36, 37, 38,39,54, 55,56 డివిజన్లతో పాటు చింతకుంట, మల్కాపూర్, లక్ష్మీపూర్లకు డీఈ శ్రీనివాస్, ఏఈ సల్మాన్‌ఖాన్,టీపీబీఓ నదియా ఇస్రత్, ఎస్ఐ గట్టు శ్రీనివాస్, 11,12,13,33,34,35 డివిజన్లకు డీఈ ఓంప్రకాశ్, ఏఈ గట్టు స్వామి, టీపీబీవో నవీన్‌కుమార్, ఎస్ఐ వై.శ్రీనివాస్‌లను ఇన్‌చార్జీలుగా నియమించారు. 1,2,3,4,5,24,25,26,27, 28,29,44 డివిజన్లతో పాటు, దుర్శేడ్, గోపాల్పూర్, బొమ్మకల్ బాధ్యతలు డీఈ అయ్యూబ్‌ఖాన్, ఏఈ గఫూర్, టీపీబీఓ సాయిచరన్, ఎస్ఐ మహేందర్లకు, 6,7,8,9,10, 30,31, 32, 45, 46, 47, 48, 49,50, 51,52 డివిజన్లను డీఈ వెంకటేశ్వర్లు, ఏఈ సతీష్, శ్రీధర్,నరోత్తంరెడ్డిలకు అప్పగించారు. -
రివర్ ఫ్రంట్ వెనక నేతలెవరు?
● ఆడియో రికార్డులు బయటపెడతానంటున్న కమలాకర్ ● ఆ నేత ఎవరా? అంటూ జిల్లావ్యాప్తంగా మొదలైన చర్చ ● ఆడియోల్లో ఎవరి పేరు వస్తుందా? అని పార్టీల్లో ఉత్కంఠ ● దుష్ప్రచారంపై కోర్టుకు వెళ్తానంటున్న మాజీ మంత్రిసాక్షిప్రతినిధి,కరీంనగర్●: మానేరు రివర్ ఫ్రంట్ (ఎంఆర్ఎఫ్) వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ విషయంలో తొలి నుంచి తాను చెబుతున్నదే నిజమైందని, కేవలం కమీషన్ల కోసం కక్కుర్తిపడి ఆపారన్న తన మాటలు ఎట్టకేలకు నిజమయ్యాయని, త్వరలోనే తాను ప్రెస్‌మీట్ పెట్టి ఆడియో రికార్డులు బయటపెడతానని గంగుల కమలాకర్ పునరుద్ఘాటిస్తున్నారు. దీంతో ఈ కేసు ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. నిర్మాణం మొదలైన దరిమిలా.. మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణం కారణంగా ఎల్ఎండీ డ్యాం ఉనికికి దెబ్బ వస్తుందని, పర్యావరణంగా సమస్యలు తలెత్తుతాయని, ఇక్కడి జీవావరణం ధ్వంసమవుతుందంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో వేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసిన విషయం తెలిసిందే. తీర్పు వెలువరించే సమయంలో కేసు వేసిన విషయంలో పలు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఈ తీర్పు ఆధారంగా గంగుల వేయబోయే అడుగులు రాజకీయ వేడి పుట్టించనున్నాయి. ఎవరా పెద్ద నాయకుడు? కరీంనగర్ జిల్లాకు చెందిన కీలక స్థానంలో ఉన్న ప్రజాప్రతినిధి ఈ వ్యవహారం వెనక ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై గంగుల కమలాకర్ ఆరోపణల ప్రకారం.. కేవలం రాజకీయ కక్ష, కంటగింపు ఉద్దేశంతో ప్రాజెక్టు నిర్మాణం ముందుకు సాగకుండా.. సదరు పెద్ద నాయకుడు అడుగడుగునా అడ్డుపడ్డాడని, అతని పాత్రను నిగ్గు తేల్చే నాయకుల ఆడియో సంభాషణల రికార్డులు తమ వద్ద ఉన్నాయని అవసరమైతే వాటిని బహిర్గతం చేస్తామని మాజీ మంత్రి గంగుల ఘంటాపథంగా చెబుతున్నారు. రూ.540 కోట్లు విడుదలై పనులు సాగుతున్న ప్రాజెక్టుపై ఇలా ఏమాత్రం ఆధారాల్లేని కేసు వేయడం ఏమిటని గంగుల వర్గం గుర్రుగా ఉంది. ప్రాజెక్టు పూర్తయితే తమకు, తమపార్టీకి ఎక్కడ ప్రజల్లో మంచి పేరు వస్తుందో? అన్న రాజకీయ కక్షతోనే ఈ కేసు వేయించారని, ఎన్జీటీ ధర్మాసనం కూడా ఇదే విషయాన్ని తీర్పులో ప్రస్తావించడాన్ని మాజీ మంత్రి వర్గీయులు గుర్తుచేస్తున్నారు. అదే విధంగా ఎంఆర్ఎఫ్పై దాఖలైన వ్యాజ్యాన్ని పనికిమాలిన పిటిషన్‌గా ధర్మాసనం పేర్కొనడాన్ని బీఆర్ఎస్ నాయకులు స్వాగతిస్తున్నారు. కోర్టు తీర్పుకు విరుద్ధంగా మాట్లాడుతూ.. ప్రాజెక్టు మీద చేస్తున్న దుష్ప్రచారంపై ‘కంటెంప్ట్ ఆఫ్ కోర్టు’ కేసు వేస్తామని స్పష్టం చేస్తున్నారు. అన్ని పార్టీల్లోనూ చర్చ ఎప్పుడూ లేనిది మాజీ మంత్రి ఆడియో టేపులు బయట పెడతానంటుండటంతో ఈ విషయం జిల్లావ్యాప్తంగా అన్ని పార్టీల్లోనూ జోరుగా చర్చ సాగుతోంది. వెనక ఉండి కేసులు వేయించాల్సిన అవసరం ఎవరికి ఉంది? అన్న అంశంపై ఎవరి సిద్ధాంతాలను వారు ప్రతిపాదిస్తున్నారు. ఫలానా నాయకుడే ఇది చేయించి ఉంటాడంటే.. కాదు కాదు మరో నాయకుడు చేయించి ఉంటాడని ఎవరి ఊహాగానాలు వారు చేస్తున్నారు. ఎవరి వాదనలు బలపరిచేలా వారు ఉదాహరణలు ఇచ్చుకుంటున్నారు. వాస్తవానికి ఈ విషయంలో గంగుల వద్ద ఉన్న ఆడియోటేపులు బయటికి వస్తే.. ఆ నాయకుడు ఎవరన్న విషయం బయటికి రానుంది. -
ఉరేసుకుని యువతి ఆత్మహత్య
జగిత్యాలక్రైం: జగిత్యాలలోని పోచమ్మవాడలో గంగధరి ప్రసన్నలక్ష్మీ (28) బుధవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పోచమ్మవాడకు చెందిన ఉప్పునీటి గంగాధర్ కుమార్తె ప్రసన్నలక్ష్మీని వెల్గటూర్ మండలం రాంనూర్ గ్రామానికి చెందిన గంగధరి తిరుపతికి ఇచ్చి 2023లో వివాహం చేశారు. వీరికి ఏడాది బాబు ఉన్నాడు. తిరుపతి వెళ్లేందుకని ఇటీవలే జగిత్యాలలోని పుట్టింటికి వచ్చింది. ఇంతలో ఏమైందో తెలియదుగానీ.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతికొత్తపల్లి: కొత్తపల్లి మండలం నాగులమల్యాల గ్రామానికి చెందిన మొగిలిపాలెం గంగరాజు(42)బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు కొత్తపల్లి పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు గంగాధర మండలం సర్వారెడ్డిపల్లిలో పనిచేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న నాగులమల్యాలకు చెందిన గంగారాజు ప్రతి రోజు తన ద్విచక్ర వాహనంపై వెళ్లి వస్తుంటాడు. బుధవారం సర్వారెడ్డిపల్లిలో పనిముగించుకొని తన వాహనంపై నాగులమల్యాలకు వస్తుండగా కొత్తపల్లి శివారులోని వెలిచాల ఎక్స్‌రోడ్ దగ్గర లారీ ఢీకొట్టింది. గంగారాజుకు తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అజాగ్రత్తగా లారీ నడిపి తన తండ్రి మృతికి కారణమైన లారీ డ్రైవర్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గంగరాజు కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కర్మకాండకు వెళ్లి యువకుడు గల్లంతుజగిత్యాలక్రైం: కర్మకాండకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో యువకుడు గల్లంతైన సంఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని మంచినీళ్ల బావి ప్రాంతానికి చెందిన నీలి మల్లికార్జున్ నానమ్మ ఇటీవల మృతిచెందింది. బుధవారం కర్మకాండ నిర్వహించారు. శ్మశాన వాటిక పక్కనే ఉన్న చింతకుంట చెరువులో స్నానం చేస్తుండగా మల్లికార్జున్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యాడు. గజ ఈతగాళ్లను రంగంలోకి దింపినా అతని ఆచూకీ లభ్యం కాలేదు. మల్లికార్జున్ మృతిచెంది ఉంటాడని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. -
జిల్లాకు 12 మంది హెడ్‌కానిస్టేబుళ్లు
జగిత్యాలక్రైం: మల్టీజోన్–1లో పనిచేస్తున్న 28 మంది కానిస్టేబుళ్లకు హెడ్‌కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పిస్తూ మల్టీజోన్–1 ఇన్చార్జి, మల్టీజోన్–2 ఐజీ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ఒక కానిస్టేబుల్‌కు హెడ్‌కానిస్టేబుల్‌గా పదోన్నతి రాగా.. 12 మంది ఇతర జిల్లాల్లో పదోన్నతి పొందిన వారిని జిల్లాకు కేటాయించారు. జగిత్యాలకు చెందిన వెంకటేశంకు హెడ్‌గా పదోన్నతి వచ్చింది. అలాగే ఆదిలాబాద్ నుంచి జిల్లాకు హెడ్‌కానిస్టేబుళ్లుగా పి.శివాజీ, డి.వెంకటి, ఎ.వెంకటరమణ, నిజామాబాద్ నుంచి ఎస్.వేణుగోపాల్, ఎం.శంకర్రావు, ఆర్.నారాయణ, ఎండి.మహ్మద్ అలీ, ఎ.గంగాధర్, ఎ.మనోజ్, కృష్ణకుమార్, ఎస్.హరికృష్ణ రానున్నారు. -
కట్నం వేధింపులకు యువతి బలి
జగిత్యాలక్రైం/బుగ్గారం: కొడిమ్యాల మండలకేంద్రంలో వివాహిత దుబ్బాక జమున (23) కట్నం వేధింపులకు బలైంది. స్థానికుల కథనం ప్రకారం.. బుగ్గారం మండలకేంద్రానికి చెందిన జమునను ఏడాది క్రితం కొడిమ్యాలకు చెందిన దుబ్బాక రాహుల్‌కు ఇచ్చి వివాహం చేశారు. ఆ సమయంలో కట్నకానుకలతోపాటు సామగ్రి, ఇతర లాంఛనాలు ముట్టజెప్పారు. కొద్దికాలంగా రాహుల్ అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు. వేధింపులు తాళలేక జమున క్రిమిసంహారక మందు తాగింది. అనంతరం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జమనను కట్నం కోసం వేధించి భర్తతోపాటు అత్తమామలు హత్య చేశారంటూ ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్పీ రఘుచందర్, మల్యాల సీఐ రవి, కొడిమ్యాల ఎస్సై సందీప్ ఘటన స్థలానికి చేరుకుని నిందితులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో శాంతించారు. మృతురాలి తల్లి కొమ్ము పోశవ్వ ఫిర్యాదు మేరకు జమున భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. జమున మృతదేహానికి బుగ్గారంలో దహన సంస్కారాలు నిర్వహించగా.. తల్లి పోశవ్వ తలకొరివి పెట్టింది. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ రూరల్, కొత్తపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడిన మధ్యప్రదేశ్‌కు చెందిన దొంగను పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ శుభం ప్రకాశ్ బుధవారం తన కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. గతేడాది జూలైలో గుంటూరుపల్లిలో దొంగలు తాళంవేసి ఉన్న ఇంట్లో చొరబడి రూ.2.25 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, కొత్తపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మల్కాపూర్ రోడ్డులోని రాజేంద్రప్రసాద్ ఇంటి తాళాలు పగుటగొట్టి మద్యం సీసాలు, బైక్ అపహరించారు. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాకు చెందిన ప్రదీప్, హత్రుసింగ్, జితేన్లు ఈ దొంగతనాలకు పాల్పడినట్లు తేలిందని ఏసీపీ వివరించారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు ప్రదీప్‌ను గత నెలలో రిమాండ్‌కు పంపించామని, మరో నిందితుడైన హత్రుసింగ్ను కొత్తపల్లి ఎస్సై ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్‌లో దార్ జిల్లా నరవాలిలో అదుపులో తీసుకొని బుధవారం కోర్టులో హాజరుపర్చినట్లు పేర్కొన్నారు. ఈకేసులో మరో నిందితుడు జితేన్ పరారీలో ఉన్నాడని త్వరలోనే ఆయనూ పట్టుకుంటామని ఏసీపీ వెల్లడించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి ఎస్సై సాంబమూర్తి, సిబ్బంది శ్రీనాథ్, అబ్దుల్ ఖదీర్, షరీఫ్, సాంబరెడ్డి, దేవేందర్‌ను అభినందించారు. -
26 క్రీడాంశాలు.. 889 సీట్లు
● కోచ్‌గా మారేందుకు కేరాఫ్ ఎన్ఎస్ ఎన్ఐఎస్ ● 26లోపు ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ కరీంనగర్‌స్పోర్ట్స్: దేశంలో క్రీడారంగానికి పెద్దన్న ఎన్ఐఎస్. క్రీడాకారులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన శిక్షణను అందించి ఒలింపిక్స్‌తో పాటు ప్రపంచ క్రీడావేదికల్లో భారత పతాకం రెపరెపలాడేలా తీర్చిదిద్దుతుంది. క్రీడాకారులకు ఎన్ఐఎస్ నుంచి పిలుపువచ్చిందంటే అదృష్టమే. దేశవ్యాప్తంగా కోచ్‌లను తయారు చేసేందుకు ఏటా కొన్ని క్రీడాంశాల్లో నిష్ణాతులైన క్రీడాకారులకు, అర్హులైన వారికి డిప్లొమా కోర్సుల్లో శిక్షణ ఇస్తుంది. పీఈటీలుగా మారాలనుకునే వారు పీఈసెట్ రాసి ట్రైనింగ్ చేసి డీఎస్సీ ద్వారా డ్రిల్ మాస్టర్లుగా మారుతారు. దేశవ్యాప్తంగా ఉన్న స్టేడియాల్లో కోచ్‌లుగా నియామకం కావడానికి ఈ డిప్లొమా కోర్సులు దోహదపడుతుంటాయి. 2025–26 ఏడాదికి నేతాజీ సుభాష్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ నోటిఫికేషన్ విడుదలైంది. 63వ డిప్లొమా బ్యాచ్‌కు ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈనెల 26లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. 26 క్రీడాంశాల్లో.. దేశవ్యాప్తంగా నాలుగు కేంద్రాల్లో డిప్లొమా కోచింగ్ కేంద్రాలు ఉన్నాయి. పంజాబ్‌లోని పాటియాలలో ఎన్ఎస్ ఎన్ఐఎస్ సెంటర్, బెంగళూర్‌లోని సాయ్ ఎన్ఎస్ఎస్సీ సెంటర్, కోల్‌కత్తాలోని సాయ్ ఎన్ఎస్ఈసీ సెంటర్, తిరువంతపురంలోని సాయ్ ఎల్ఎన్సీపీఈ సెంటర్లలో కోర్సుల కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 26 క్రీడాంశాల్లో శిక్షణనివ్వనున్నారు. మొత్తం 785 సీట్లతో పాటు 104 అదనపు సీట్లు (ఒలింపిక్స్, ప్రపంచస్థాలో ఆడిన వారికి) కలిపి మొత్తం 889సీట్లు అందుబాటులో ఉన్నాయి. సీట్ల వివరాలు అర్చరీ(30), అథ్లెటిక్స్(75), బ్యాడ్మింటన్(20), బాస్కెట్‌బాల్(30), బాక్సింగ్(50), కనోయింగ్–కయాకింగ్(15), సైక్లింగ్(30), ఫెన్సింగ్(30), ఫుట్‌బాల్(50), జిమ్నాస్టిక్స్(20), హ్యాండ్‌బాల్(20), హాకీ(50), జూడో(30), కబడ్డీ(30), ఖోఖో(20), రోయింగ్ (10), షూటింగ్ (20), స్విమ్మింగ్(20), టేబుల్‌టెన్నిస్(40), తైక్వాండో(20), టెన్నీస్ (20), వాలీబాల్(30), వెయిట్ లిఫ్టింగ్ (30). రెజ్లింగ్(50), ఉషూ(25), యోగాసన(20) సీట్లు ఉన్నాయి. అర్హత వివరాలు... అభ్యర్థి వయస్సు 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. ఇంటర్, డిగ్రీ అర్హతతో పాటు ఒలింపిక్స్, ప్రపంచస్థాయి, జాతీయ స్పోర్ట్స్ ఆచీవ్‌మెంట్ సర్టిఫికెట్లు ఆన్లైన్ అప్లికేషన్లో నమోదు చేయాలి. రాత, ప్రాక్టికల్, మౌఖిక పరీక్షలతోపాటు మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు. సామర్థ్య పరీక్షలు పురుష, మహిళా అభ్యర్థులకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్టులు నిర్వహిస్తారు. 30 మీటర్ల ఫ్లయింగ్ స్ప్రింట్, స్టాండింగ్ బ్రాడ్‌జంప్, షటిల్రన్, బెండ్ అండ్ రీచ్ టెస్ట్, 1600మీటర్ల పరుగు పరీక్షలు నిర్వహిస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 26 సవరణ తేదీ ఏప్రిల్ 27,28 పరీక్ష తేదీ జూన్ 6 -
జగిత్యాలకు రెడ్ అలర్ట్
బయటకు వెళ్లలేని పరిస్థితి ఉదయం 8 గంటలకే ఎండలు మండుతున్నాయి. బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. సాయంత్రం ఆరుగంటల తర్వాత కూడా వేడిగాలులు వీస్తున్నాయి. వ్యవసాయ పనులకు వెళ్లాలంటేనే భయపడుతున్నాం. ఎండలకు కూలీలు కూడా వ్యవసాయ పనులకు రావడం లేదు. – ఏలేటి స్వామిరెడ్డి, శ్రీరాములపల్లె, గొల్లపల్లి(మం)మరో నాలుగు రోజులు వాతావరణ మార్పులతో రానున్న నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు ఇలాగే ఉండే అవకాశం ఉంది. వాతావా రణ విభాగం వారు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రస్తుతం భూమిలో తేమ శాతం ఎక్కువగా లేకపోవడంతో ఉష్ణోగ్రతలకే ప్రజలు అల్లాడిపోతున్నారు. వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉంది. – శ్రీలక్ష్మి, వాతావరణ శాస్త్రవేత్త, పొలాస జగిత్యాలఅగ్రికల్చర్: కొద్దిరోజులుగా సూర్యుడు ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడు. ఏప్రిల్‌లోనే ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి. ఇక మే పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరో నాలుగైదు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండవచ్చని పొలాస వాతావరణ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఉత్తర వాయువ్య దిశ నుంచి వడగాలులు వీస్తుండటం వల్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నాలుగు రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు 44 నుంచి 45 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రతలు 28.8 డిగ్రీల సెల్సియస్‌లో కదలాడుతున్నాయి. రానున్న రెండుమూడు రోజుల్లో మరో రెండు డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అత్యవసరమైతనే బయటకు వెళ్లాలి పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రస్తుతం గంటకు 30 నుంచి40 కిలోమీటర్ల వేగంతో వడగాలులు వీస్తున్నాయి. మధ్యాహ్నం వేడితో కూడిన వడగాలులు వస్తుండటంతో ప్రజలు అతులాకుతలం అవుతున్నారు. గాలిలో తేమ శాతం తగ్గడంతో ఉక్కపోత మొదలైంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎండ తీవ్రంగా ఉంటోంది. వడదెబ్బతో విలవిల ఉష్ణోగ్రతలు పెరిగినకొద్దీ శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకు వెళ్తుంది. దీంతో నీరసం వస్తుంది. నీటి శాతం తక్కువ అయినప్పుడు వడదెబ్బకు గురయ్యే ఆస్కారం ఉంది. దీనికితోడు దురద, చెమటకాయ, పొక్కులు, నల్లటి మచ్చలు ఏర్పడతాయి. కళ్లు మంటలు మండి ఎరుపుచారలు వస్తాయి. గ్రామాల్లో లోతైన బావుల నీరు తాగినప్పుడు విరోచనాలు, వాంతులు అయ్యే అవకాశం ఉంటుంది. ఎండకు వెళ్లినప్పుడు కళ్లజోళ్లతోపాటు చర్మం పూర్తిగా కప్పేలా బట్టలు ధరించడం మంచిదంటున్నారు వైద్యులు. శరీరాన్ని చల్లగా ఉంచుకునేందుకు మజ్జిగ, పెరుగు, నిమ్మరసాలు తీసుకోవాలంటున్నారు. వాతావరణ మార్పులే కారణం వాతావరణంలో అప్పటికప్పుడు వస్తున్న మార్పులే ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కార్బన్ డైఆక్సెడ్, మిథేన్, నైట్రస్ ఆకై ్సడ్, ఇతర గ్రీన్హౌస్ వాయువుల సాంద్రత విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఫలితంగా భూమి ఉపరితల ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిపోతుండటంతో పర్యావరణంలోనూ, వాతావరణంలోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇలా.. జిల్లాలో ఈ ఏడాది గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే.. రాయికల్, ధర్మపురి మండలం నేరేళ్ల, కోరుట్ల మండలం అయిలాపూర్, గొల్లపల్లి మండలాల్లో 44.1 డిగ్రీలు, ఎండపల్లి మండలం మారెడుపల్లి, సారంగాపూర్, రాయికల్ మండలం అల్లీపూర్లో 44 డిగ్రీల సెల్సియస్ చొప్పున నమోదయ్యాయి. రానున్న నాలుగు రోజులు కూడా ఎండలు పెరిగే అవకాశం ఉండడంతో జిల్లాకు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. మరో నాలుగు రోజులూ ఎండలే రోజురోజుకూ మండుతున్న సూర్యుడు బుధవారం 45 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత -
సబ్సిడీ రుణాలకు ఇంటర్వ్యూలు
రాజన్న హుండీ ఆదాయం రూ.2.01 కోట్లువేములవాడ: రాజన్నకు భక్తుల ద్వారా 29 రోజుల్లో రూ.2.01కోట్ల ఆదాయం సమకూరింది. ఆలయంలోని ఓపెన్‌స్లాబ్‌లో బుధవారం హుండీలను లెక్కించారు. రూ.2,01,53,852 నగదు, 184 గ్రాముల బంగారం, 12.300 కిలోల వెండి సమకూరినట్లు ఆలయ ఈవో కొప్పుల వినోద్‌రెడ్డి తెలిపారు. కోల్‌సిటీ(రామగుండం): రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకున్నవారికి బుధవారం రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇంటర్వ్యూలు ప్రారంభించారు. ఈనెల 21వ తేదీ వరకు మొత్తం 11,446 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 8,195 మంది బల్దియా కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించారు. యూనిట్ల వారీగా అర్హులను గుర్తించడం కోసం ఈనెల 30వ తేదీ వరకు ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు కమిషనర్(ఎఫ్ఏసీ) అరుణశ్రీ తెలిపారు. తొలిరోజు ఎన్టీపీసీ, రామగుండం ఏరియాలకు చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ పరిధిలోని దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలను నిర్వహించారు. ఈ రెండు బ్యాంకులకు 1,050 మంది దరఖాస్తు చేసుకోగా, ఇదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఇంటర్వ్యూలను నిర్వహించారు. ఇద్దరే అధికారులు ఇంటర్వ్యూలను నిర్వహించడంతో ప్రక్రియ ఆలస్యంగా జరిగింది. డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి పర్యవేశించారు. అభ్యర్థులు ఒరిజినల్ ఆధార్, పాన్‌కార్డు, రేషన్ కార్డు/ఆదాయ ధ్రువీకరణ, కుల ధ్రువీకరణ పత్రాలను వెంట తెచ్చుకోవాలని అధికారులు సూచించారు. భారీగా తరలివచ్చిన దరఖాస్తుదారులు -
‘చీట్’ఫండ్ వ్యాపారం
జగిత్యాల పట్టణంలోని ఓ షాపు నిర్వాహకుడు రాజు కరీంనగర్రోడ్లోగల లో చిట్‌ఫండ్‌లో రూ.2 లక్షలు డిపాజిట్ చేశాడు. కాల పరిమితి ముగిసి చాలా రోజులు అవుతున్నా డబ్బులు చెల్లించకపోవడంతోపాటు తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు. ఇటీవల బాధితులు పోలీసులను ఆశ్రయించగా పోలీసులు సదరు చిట్‌ఫండ్‌పై కేసు నమోదు చేశారు. జగిత్యాల రూరల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు కరీంనగర్రోడ్లోగల ఓ చిట్‌ఫండ్‌లో రూ.5 లక్షల డిపాజిట్ చేశాడు. కాల పరిమితి ముగిసి ఏడాది కావస్తున్నా డబ్బులు చెల్లించకపోవడంతో 15 రోజుల క్రితం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సదరు చిట్‌ఫండ్‌పై కేసు నమోదు చేశారు. ● జగిత్యాల జిల్లాలో ప్రతినెలా రూ.70 కోట్ల లావాదేవీలు ● కాలపరిమితి ముగిసినా డబ్బులు చెల్లించని నిర్వాహకులు ● న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తున్న ఖాతాదారులు 19జెజిఎల్51 : రఘుచందర్, డీఎస్పీ, జగిత్యాల జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లాలో విచ్చలవిడిగా చిట్‌ఫండ్ వ్యాపారం కొనసాగుతోంది. ఇది చాలదన్నట్లు అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చే ఫైనాన్స్ కంపెనీలు ఇష్టారాజ్యంగా నడుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. జిల్లాలో దాదాపు 33 చిట్‌ఫండ్ కంపెనీలు ఉన్నాయి. వీటిలో కేవలం పదింటికి మాత్రమే లైసెన్స్ ఉంది. అలాగే జిల్లాలో 100కు పైగా ఫైనాన్స్‌లు నడుస్తున్నాయి. అనధికారికంగా మరో 150 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. చిట్ఫండ్ల వ్యాపారం రూ.80 కోట్ల వరకు.. ఫైనాన్స్ వ్యాపారం రూ.70 కోట్ల వరకు జరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఫైనాన్స్ నిర్వాహకులు అయితే తెల్ల పేపర్లపై లేకుంటే ఖాళీచెక్కులపై సంతకాలు చేయించుకుని 4 నుంచి 8 శాతం వడ్డీకి అప్పులిస్తున్నారు. పెద్ద ఎత్తున వడ్డీ వసూలు చేస్తున్నా.. నిబంధనలకు విరుద్ధంగా చిట్స్‌ఫండ్ ఫైనాన్స్ కొనసాగిస్తున్నా.. వారిపై నిఘా కరువైంది. చిట్ ఫండ్స్ మోసాలు జిల్లాలో ఉద్యోగులు, వ్యాపారులు, వైద్యులు, ఇతరత్రా వ్యక్తుల నుంచి లైసెన్స్డ్ చిట్స్‌ఫండ్ నిర్వాహకులు పెద్ద ఎత్తున చిట్టీలు వేయించుకొని కాలపరిమితి ముగిసినా డబ్బులు చెల్లించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలో ఓ చిట్‌ఫండ్ కార్యాలయంలో బాధితులు ఆందోళన చేశారు. అయినా పట్టించుకునే వారే కరువయ్యారు. చిట్‌ఫండ్స్ కంపెనీలో చిట్టీ తీసుకునే వారు ప్రభుత్వ ఉద్యోగితో ష్యూరిటీగా తీసుకొని డబ్బులు చెల్లిస్తారు. కానీ కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా సమయానికి డబ్బులు ఇవ్వకపోవడం చిట్స్‌ఫండ్ మోసాలకు దారితీస్తోంది. జిల్లాలో రిజిస్టర్ లేని చిట్టీలు కోట్ల వ్యాపారంలో కొనసాగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. కొందరు చిట్టీ నిర్వాహకులు వ్యాపారంలో నష్టాలు వచ్చాయని పారిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. తాకట్టు వ్యాపారం జిల్లాలో తాకట్టు వ్యాపారం జోరుగా సాగుతోంది. జిల్లాలో చాలామంది డబ్బులు అవసరమున్న వారు వాహనాల పేపర్లతోపాటు బంగారం, భూమి కాగితాలు పెట్టి అధిక వడ్డీకి అప్పు ఇస్తున్నారు. అప్పు తీసుకున్న వారు సకాలంలో చెల్లించకుంటే తాకట్టు పెట్టిన వస్తువులను వ్యాపారులు అమ్ముకుంటున్నారు. చాలా మంది వడ్డీ వ్యాపారులు తెల్లపేపర్లపై స్టాంప్ పేపర్లు, చెక్కులపై సంతకాలు చేయించుకుని ఇష్టారాజ్యంగా కొనసాగిస్తున్నారు. రిజిస్టర్డ్ అయిన చిట్‌ఫండ్స్ నిర్వాహకులు డిపాజిట్లు సేకరించి.. కాలపరిమితి ముగిసినా డిపాజిటర్లకు డబ్బులు చెల్లించకుండా సుమారు ఏడు కంపెనీలు తమ కార్యకలాపాలు నిలిపివేశాయి. ఫలితంగా బాధితులు పోలీస్స్టేషన్లు, కోర్టులను ఆశ్రయిస్తున్నారు. అనుమతుల్లేని ఫైనాన్స్‌లపై చర్యలు జగిత్యాల జిల్లా కేంద్రంలో అనుమతులు లేని ఫైనాన్స్‌లు, చిట్‌ఫండ్స్‌పై కఠిన చర్యలు చేపడతాం. ఎవరైనా బాధితులు ఫిర్యాదు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. మూతపడిన చిట్‌ఫండ్స్‌పై బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశాం. – రఘుచందర్, డీఎస్పీ, జగిత్యాల -
ఓ పాఠం
గెలుపు ఓటమిఆవేశంతో జీవితాలను అంతం చేసుకోవద్దు.. ఆలోచన.. ధైర్యంతో అడుగు ముందుకేస్తే ఎన్నో విజయాలు మీ సొంతం. చరిత్ర.. గతం.. వర్తమానం చూస్తే అనేక విషయాలు ఇట్టే దోహదపడుతాయి. ఎందుకు పనికిరారు అని పలువురితో ఛీత్కారాలు ఎదుర్కున్నవారు కష్టపడి విజయ తీరాలకు చేరుతున్నారు. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. గెలుపు.. ఓటమికి నాంది అనేదానిని మరవొద్దు. సచిన్ టెండూల్కర్ అంటే తెలియని వారు ఉండరు. పదోతరగతి కూడా పాస్కాలేని ఆయన బ్యాట్ ఝలిపిస్తే.. పరుగుల వర్షమే కురిసేది. క్రికెట్ ఆడితే లక్షల కళ్లు ఆయనవైపే ఉండేవి. ఎన్నో ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఆయన క్రికెట్ దిగ్గజంగా ఎదిగిన విషయం మరవొద్దు.. అంతేకాదు.. శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ మోటార్ న్యూరాన్ అనే వ్యాధి బారినపడ్డా.. మనోధైర్యం కోల్పోలేదు. ఓ దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఆయన గొప్ప పరిశోధకుడై ప్రపంచమే మెచ్చుకునే వాడయ్యాడు. ఫెయిలయ్యామని కుంగిపోవద్దు ● పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏమీలేదుఈ ఏడాది ఇంటర్, పదోతరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల సంఖ్యఇంటర్హుజూరాబాద్: ప్రతిభ కొందరికే పరిమితం కాదు. ప్రతీ మనిషిలోనూ ఒక ప్రత్యేకత ఉంటుంది. దాన్ని వెలికితీసి, కఠోర సాధన చేస్తే జీవితంలో గొప్పవ్యక్తిగా ఎదగొచ్చు. అలా కాదని నేనేం చేయలేను.. నాతో కాదు.. నేనింతే అంటూ కుంగిపోవద్దు. చదువూ అంతే.. పుస్తకాన్ని నేస్తంగా మలు చుకుని చదివితే విజయం నీ బానిస అవుతుంది. పరీక్ష నీతో స్నేహం చేస్తుంది. ఫలితం ఎప్పుడూ నీ వెంటే నడుస్తుంది. విద్యార్థులకు ‘పరీక్ష’కాలం ముగిసింది. ఫలితాల సమయం సా గుతోంది. మంగళవారం నాటి ఇంటర్ ఫలితాల్లో చాలా మంది ప్రతిభ చూపారు. కొందరు ఫెయిలయ్యా రు. త్వరలో పదోతరగతి ఫలితాలు రానున్నాయి. ఫలితాలను జీవితంలో ఒక భాగం మా త్రమే చూడాలి. ఓటమి గెలుపునకు గట్టి పునాది గా మారుతుందని గ్రహించాలి. మళ్లీ ప్రయత్నించి, తప్పులను సవరించుకుని, కన్నీళ్లు పెట్టుకు న్న చోట తలెత్తుకుని చూడాలి తప్పా.. విఫల మయ్యామని కఠినమైన నిర్ణయాలు తీసుకోవద్దు. గెలుపైనా ఓటమైనా.. ఓ పాఠంగా నేర్చుకోవాలి.కరీంనగర్పెద్దపల్లిజగిత్యాలసిరిసిల్ల -
పొరపాట్ల సవరణకు అవకాశం
చొప్పదండి: భూభారతి చట్టంతో పాసు పుస్తకాల్లో పొరపాట్ల సవరణకు అవకాశం ఉంటుందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టంపై బుధవారం పట్టణంలోని జీఆర్ఆర్ఆర్ గార్డెన్లో అవగాహన సదస్సు నిర్వహించగా, కలెక్టర్ హాజరై మాట్లాడారు. ధరణి పోర్టల్‌లో లేని అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద ఈ పథకం అమలు చేస్తున్నారని, తదుపరి భూములకు సంబంధించిన సమస్యలపై రైతులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆధారాలతో దరఖాస్తు చేస్తే పాసు పుస్తకాల్లోని తప్పులను సవరిస్తామని తెలిపారు. గతంలో కలెక్టర్ వద్దకు సమస్యలు రావడంతో వే సంఖ్యలో ఉండి పరిష్కారం కాలేదని, ఇప్పుడు తహసీల్దార్ స్థాయి అధికారులకు కూడా అధికారాలు ఇవ్వడంతో సత్వరం పరిష్కారం అవుతాయని తెలిపారు. ఆర్డీవో మహేశ్వర్, తహసీల్దార్ నవీన్ కుమార్, ఏఎంసీ చైర్మన్ కొత్తూరి మహేశ్, ప్రియదర్శిని, తిరుపతిరావు, ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, ఏవో వంశీకృష్ణ, పాల్గొన్నారు. వర్క్‌సైట్ స్కూల్ సందర్శన మండలంలోని గుమ్లాపూర్ గ్రామంలో ఇటుక బట్టీ కార్మికుల పిల్లలకు నిర్వహిస్తున్న వర్క్‌సైట్ స్కూల్‌ను కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం, యూనిఫాం, ఒరియా పుస్తకాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆంగ్ల మాధ్యమంలో బోధనపై సంతోషం వ్యక్తం చేశారు. మే నెలలో కూడా పాఠశాల నడపాలని సూచించారు. ఎంఈవో శ్రీనివాస్ దీక్షిత్, హెచ్ఎం వీరేశం, శ్రీనివాస్, రమేశ్ పాల్గొన్నారు. కలెక్టర్ పమేలా సత్పతి భూ భారతిపై చొప్పదండిలో అవగాహన -
జంక్షన్.. అటెన్షన్!
● సిటీ శివారులో ప్రమాదకరంగా మారిన చౌరస్తాలు ● నగరం విస్తరిస్తున్న కొద్దీ పెరుగుతున్న జంక్షన్లు ● తీగలవంతెన, ఎన్టీఆర్ విగ్రహం, పద్మనగర్‌లో పొంచి ఉన్న ప్రమాదం ● బ్లాక్స్పాట్లుగా సదాశివపల్లి, చింతకుంట జంక్షన్లు కరీంనగరం రోజురోజుకు విస్తరిస్తోంది. స్మార్ట్‌సిటీగా ఎంపికవడం, రూ.వందల కోట్ల నిధులు రావడంతో అద్దాల్లాంటి రోడ్లు, ఫుట్‌పాత్‌లు, ట్రాఫిక్ సిగ్నళ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలు, స్మార్ట్ టాయ్లెట్లు సమకూరాయి. అయితే, నగరంలో పెరుగుతున్న వాహనాలకు అనుగుణంగా జంక్షన్లు మాత్రం విస్తరణ, ఆధునీకరణకు నోచుకోకపోవడంతో ప్రమాదకరంగా పరిణమించాయి. జంక్షన్లు, రోడ్ల నిర్మాణంలో ఇంజినీరింగ్ లోపాలు వెరసి అక్కడక్కడ పలు ప్రమాదాలు చోటుచేసుకోగా.. కొందరు ప్రాణాలు సైతం కోల్పోయారు. ప్రజల ప్రాణాలకు ఇబ్బంది కరంగా మారిన ఆయా జంక్షన్లలో లోపాల సరిదిద్దకపోవడంతో భయంభయంగా ప్రయాణం సాగిస్తున్నారు. జిల్లా రోడ్డు సెఫ్టీ కమిటీ చైర్‌పర్సన్‌గా ఉన్న కలెక్టర్ ఈ జంక్షన్ల విస్తరణపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. –సాక్షిప్రతినిధి,కరీంనగర్ సదాశివపల్లి.. సదాశివపల్లి జంక్షన్ అత్యంత ప్రమాదకరంగా మారింది. వరంగల్ నుంచి అలుగునూరు వెళ్లే క్రమంలో సదాశివపల్లి స్టేజీ వద్ద కుడివైపు రోడ్డు చీలి తీగలవంతెనకు వెళ్తుంది. ఇక్కడే వాహనదారులు గందరగోళానికి గురవుతున్నారు. వరంగల్, అలుగునూరు, తీగలవంతెన మీద నుంచి వచ్చే వాహనాలు ఆచితూచి వెళ్లాల్సి ఉంటుంది. ఏమాత్రం ఏమరుపాటుగా ఉంటే భారీ ప్రమాదాలకు పుష్కలంగా అవకాశాలున్నాయి. మరీ ముఖ్యంగా సదాశివపల్లి గ్రామస్తులు జీబ్రాక్రాసింగ్ లేక రోడ్డు దాటేందుకు బెంబేలెత్తుతున్నారు. అత్యవసరంగా ఇక్కడ భూసేకరణ జరిపి జంక్షన్ ఐలాండ్, ట్రాఫిక్ సిగ్నల్స్, జీబ్రా క్రాసింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరముంది.చింతకుంట.. కరీంనగర్ నుంచి సిరిసిల్ల వెళ్లే దారిలో చింతకుంట ఎస్సారెస్పీ కాలువకు ముందు కుడివైపు మల్కాపూర్క రోడ్డు ఉంది. ఇక్కడ భారీ వాహనాలు మల్కాపూర్ వెళ్లేందుకు మలుపులు తీసుకుంటాయి. మరికొన్ని యూనివర్సిటీ, కొత్తపల్లి పోలీస్‌స్టేషన్ వైపు వెళ్లేందుకు యూటర్న్ తీసుకుంటాయి. ఇది కూడా అత్యంత ప్రమాదకరంగా మారింది. సిరిసిల్ల నుంచే వచ్చే వాహనదారులకు ఇక్కడ జంక్షన్ ఉందన్న విషయం తెలియదు. అదే సమయంలో యూటర్న్‌ను తప్పించుకునేందుకు చింతకుంట గ్రామస్తులు రాంగ్రూట్లో సిరిసిల్ల నుంచి వచ్చే వాహనాలకు ఎదురెళ్తున్నారు. దీనికితోడు ఈ మార్గంలో మద్యం విక్రయాలు, బెల్టుషాపులు పెరగడంతో ఈ ఏరియా బ్లాక్‌స్పాట్‌గా మారిందని స్థానికులు వాపోతున్నారు. ఇక్కడ కూడా జంక్షన్, సిగ్నలింగ్ చేపట్టాలని కోరుతున్నారు. -
బాధ్యతలు చేపట్టిన జిల్లా జడ్జి
కరీంనగర్‌క్రైం: జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఎస్.శివకుమార్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. కమర్షియల్ డిస్ప్యూట్స్ కోర్టు హైదరాబాద్ నుంచి బదిలీపై కరీంనగర్ కోర్టుకు వచ్చారు. ఇక్కడ జిల్లా జడ్జిగా పనిచేసిన బి.ప్రతిమ జనగాం జిల్లా జడ్జిగా బదిలీ అయ్యారు. కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిగా జే.విక్రమ్, ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తిగా జే.కవిత బాధ్యతలు స్వీకరించారు. పుస్తకాన్ని నమ్మినవారికి ఉజ్వల భవిష్యత్ కరీంనగర్‌కల్చరల్: పుస్తకాన్ని నమ్మినవారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని శాతవాహన యూనివర్సిటీ రిజిస్ట్రార్ రవికుమార్ తెలిపా రు. లీడ్ ఇండియా నేషనల్ క్లబ్ సౌజన్యంతో కరీంనగర్ జిల్లా గ్రంథాలయం ఆవరణలో బుఽ దవారం నిర్వహించిన ప్రపంచ పుస్తకం, కాపీరైట్ దినోత్సవ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డిజిటల్ యుగంలో యువత ఏకాగ్రతను భంగం చేసేందుకు స్మార్ట్ఫోన్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. పుస్తక పఠనానికి అధిక సమయం కేటాయించాలన్నారు. లీడ్ ఇండియా నేషనల్ క్లబ్ అధ్యక్షుడు బుర్ర మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ పుస్తకాలు మన జీవితకాల నేస్తాలని తెలిపారు. లీడ్ ఇండియా కోశాధికారి అనుముల దయాకర్, మిట్టపల్లి మహేందర్, లైబ్రేరియన్ సరిత పాల్గొన్నారు. 22 మంది టీచర్లకు కౌన్సెలింగ్ కరీంనగర్: స్పౌజ్ కేటగిరీ కింద ఇతర జిల్లాల నుంచి జిల్లాకు కేటాయింపబడ్డ 22 మంది ఉపాధ్యాయులకు బుధవారం డీఈవో కార్యాలయంలో కౌన్సెలింగ్ పూర్తి చేసినట్లు డీఈవో జనార్దన్‌రావు తెలిపారు. ఉపాధ్యాయులు రిలీవింగ్ ఆర్డర్, సర్వీసు బుక్, స్పౌజ్, ఇతర సర్టిఫికెట్లతో కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. కేటాయింపబడ్డ పాఠశాలలో రిపోర్టు చేసి, ఎంఈవో కార్యాలయంలో జాయినింగ్ రిపోర్టు సమర్పించాలని డీఈవో సూచించారు. ధాన్యం కొనుగోళ్లలో సమస్యలా?● కంట్రోల్ రూం నంబర్ 91542 49727 కరీంనగర్ అర్బన్: తేమ ఎక్కువ ఉందని, నిబంధనల ప్రకారం ఉన్నా ధాన్యం కొనుగోలు చేయడం లేదా.. అయితే ఇంకెందుకు ఆలస్యం ఫోన్ చేయండి.. పరిష్కారం పొందండి. ధాన్యం కొనుగోళ్లలో సమస్యలను పరిష్కరించేందుకు కలెక్టరేట్లోని పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూం ఫోన్ నంబర్ 9154249727 ఏర్పాటు చేయగా ప్రభుత్వ పనివేళల్లో సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. కంట్రోల్ రూంకు వచ్చిన ప్రతీ ఫిర్యాదును ప్రత్యేక రిజిష్టర్‌లో నమోదు చేసి అధికారులను అప్రమత్తం చేయనున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలున్నా రైతులు కంట్రోల్ రూం దృష్టికి తీసుకురావచ్చని జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు వివరించారు. పవర్ కట్ ప్రాంతాలు కొత్తపల్లి: విద్యుత్ లైన్ల నూతన పనులు చేపడుతున్నందున గురువారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు 11 కె.వీ.పిటిసీ ఫీడర్ పరిధిలోని సంతోష్‌నగర్, శ్రీహరినగర్, కుర్మవాడ, గణేశ్‌నగర్, పీటీసీ, పాల డెయిరీ, బుల్ స్టేషన్, కాంగ్రెస్ భవన్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. -
‘ఫోన్‌ఇన్’ సమస్యలు పరిష్కరిస్తాం
కొత్తపల్లి: ఫోన్‌ఇన్ కార్యక్రమంలో వినియోగదారులు తెలిపిన విద్యుత్ సంబంధిత సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ మేక రమేశ్‌బాబు తెలిపారు. కరీంనగర్ విద్యుత్ భవన్లో మంగళవారం నిర్వహించిన ‘ఫోన్ ఇన్’ కార్యక్రమానికి స్పందన లభించింది. కరీంనగర్ టౌన్, కరీంనగర్ రూరల్, హుజూరాబాద్ డివిజన్ల నుంచి మొత్తం 24 ఫోన్‌కాల్స్ వచ్చాయి. విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తామని ఎస్ఈ పేర్కొన్నారు. డీఈటీ కె.ఉపేందర్, డీఈ రాజం, ఎం.తిరుపతి, ఎస్ఏఓ రాజేంద్రప్రసాద్, ఏడీఈలు పాల్గొన్నారు. విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలికరీంనగర్సిటీ: విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుకు సాగి ఉన్నత శిఖరాలను అధిరో హించాలని మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వరలక్ష్మి సూచించారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీఎస్సీ తృతీయ సంవత్సరం విద్యార్థుల వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ జి.వరలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థినులు ఎంచుకున్న రంగాల్లో ముందుకు సాగాలన్నారు. క్రమశిక్షణతో అనందమైన జీవితాన్ని కొనసాగించాలన్నారు. అధ్యాపకులు శ్రీనివాస్‌రెడ్డి, రజినిదేవి, లక్ష్మణరావు, అనంతలక్ష్మి, స్రవంతి, మొగిలి, కల్పన పాల్గొన్నారు. -
‘సర్కారు’ విద్యార్థుల సత్తా
● ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు ● అభినందించిన అధికారులుసప్తగిరికాలనీ(కరీంనగర్)/మానకొండూర్/తిమ్మాపూర్/రామడుగు: ఇంటర్ ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు సత్తా చాటారు. ఫస్టియర్, సెకండియర్‌లో అత్యుత్తమ మార్కులు సాధించారు. ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను డీఐఈవో జగన్మోహన్రెడ్డి, ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు అభినందించారు. ● కరీంనగర్‌లోని బాలికల జూనియర్ కళాశాల ఫస్టియర్‌లో 63శాతం, సెకండియర్‌లో 65శాతం ప్రభుత్వ సైన్స్ కళాశాల ఫస్టియర్‌లో 38.90శా తం ఉత్తీర్ణతను నమోదు చేశాయి. జమ్మికుంట ప్రభుత్వ కళాశాల 61.50శాతం ఉత్తీర్ణతను నమోదు చేశాయి. కరీంనగర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సెకండియర్ ఎంపీసీ విద్యార్థిని గొల్లపల్లి అభినయ 982 మార్కులు, బైపీసీలో జుబియా జైన్ 973, సీఈసీలో కెకాశన్ ఉన్నిసా 944 మార్కులు సాధించారు. ఫస్టియర్ ఎంపీసీలో గంట్ల సిరిచందన 460, బైపీసీలో షిఫాఫాతిమా 429, సీఈసీలో గంగాధర జ్యోతి 471, ఒకేషనల్‌లో పాటిల్ ఆర్థి 494 మార్కులు సాధించారు. వీరిని ప్రిన్సిపాల్ నిర్మల, అధ్యాపకులు కనకయ్య, వెంకటరాజురెడ్డి, రాధాకృష్ణ అభినందించారు. ● కరీంనగర్ ఆర్ట్స్ కళాశాల విద్యార్థుల్లో దొడ్ల రిషిత బైపీసీలో 980మార్కులు సాధించింది. ఫస్టియర్ ఎంపీసీలో మహ్మద్ రియాన్ దస్తాగిర్ 467 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో రెండోస్థానంలో నిలిచాడని కళాశాల ప్రిన్సిపాల్ సత్యవర్ధన్‌రావు తెలిపారు. ప్రతిభ చూపిన విద్యార్థులను డీఐఈవో అభినందించారు. అధ్యాపకులు మధుజాన్సన్, ప్రమీల, దీప్తి, రమేశ్, జియాఉద్దీన్, రాహుల్, సంపత్ పాల్గొన్నారు. ● మానకొండూర్ మండలం దేవంపల్లి గురుకుల పాఠశాల విద్యార్థులు, పోచంపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. దేవంపల్లి గురుకుల పాఠశాలలో ఎంపీసీ ఫస్టియర్ విద్యార్థి జె.మనోజ్‌కుమార్ 465 మార్కులు సాధించాడు. బైపీసీలో బి.రాకేష్ 402 మార్కులు సాధించారు. సెకండియర్ ఎంపీసీలో కె.శివ కుమార్ 982మార్కులు, బైపీసీలో డి.సంపత్ 983 మార్కులతో సత్తా చాటారు. పో చంపల్లి మోడల్ స్కూల్లో పిల్లి అంజలి సీఈ సీలో 492, బైపీసీలో బి.రక్షిత 434మార్కులు సాధించారు. సెకండియర్ ఎంపీసీలో బూస స్పందన 941 మార్కులతో సత్తా చాటింది. ● రామడుగు మోడల్ స్కూల్ విద్యార్థిని భోగ శ్రీజ సీఈసీలో 500 మార్కులకు 494 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించినట్లు ప్రిన్సిపాల్ మనోజ్‌కుమార్ తెలిపారు. ● అలుగునూర్లోని సీవోఈ విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. బైపీసీ సెకండియర్‌లో రాజ్యలక్ష్మి, సంధ్య 991మార్కులు, ఎంపీసీలో శరణ్య 991మార్కులు సాధించినట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఫస్టియర్ ఎంపీసీలో అక్షిత, నితీష, సౌమ్య, భవిత, నందినిలు 467మార్కులు, బైపీసీలో ప్రసన్న, శ్రీనిజ 436 మార్కులు సాధించారు. -
సత్తాచాటిన ‘రెసోనెన్స్’ విద్యార్థులు
కరీంనగర్/కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్‌లోని కోట ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలోని రెసోనెన్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించారని కళాశాల చైర్మన్ డి.అంజిరెడ్డి తెలిపారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించారు. ఎంపీసీలో టి.భావన, జి.సాయిఅక్షిత్, కె.సహనశ్రీ, యూ.అహన్య, ఎన్.శ్రీఅక్షిత, పి.సంజన 467/470 మార్కులు, కె.కీర్తన, ఎం.అక్షయ, కె.అక్షయవర్దన్, బి.సహశ్రీ, టి.విజయవర్దన్, ఎం.నివ్యరెడ్డి, కె.సాత్విక్, సిహెచ్ హాస్యరెడ్డి 466/470 మార్కులు, ఏడుగురు 465, 10 మంది 464 మార్కులు సాధించారన్నారు. బైపీసీలో ఎం.శ్రీష 436, బి.సాయిత్రిపుర 435, వై.వంశిక, ఎం.సంజనా నాయక్, ఎం.తేజస్వీనిలు432 మార్కులు సాధించారని తెలిపారు. సీనియర్ ఇంటర్లో ఎం.శ్రీనిత, ఎస్.శృతిలు 987/1000 మార్కులతో పాటు ఆరుగురు 980 ఆపై మార్కులు సాధించినట్లు తెలిపారు. -
భళా.. బాలిక
● ఇంటర్ ఫలితాల్లో సత్తాచాటిన అమ్మాయిలు ● రాష్ట్రస్థాయిలో ఆరోస్థానంలో కరీంనగర్ ● సెకండియర్‌లో 73.81, ఫస్టియర్‌లో 69.84శాతం ఉత్తీర్ణతఇంటర్ ఫలితాలు ఇలాకరీంనగర్: ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. సెకండిర్లో 73.81, ఫస్టియర్‌లో 69.84శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రస్థాయిలో ఆరోస్థానంలో నిలిచారు. ఓవరాల్‌గా బాలికలే పైచేయి సాధించారు. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో గతేడాది 74.39శాతం ఉత్తీర్ణత నమోదు చేసుకుని రాష్ట్రంలో జిల్లా 4వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈసారి 73.81 శాతంతో 6వ స్థానంలో నిలిచింది. జనరల్, ఒకేషనల్ కలుపుకుని 15,187 మంది విద్యార్థులు పరీక్ష రాస్తే 11,092 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. జనరల్ విభాగంలో బాలురు 7,133 మంది పరీక్షలకు హాజరు కాగా 4,863మంది పాసయ్యారు. 68.18 ఉత్తీర్ణతశాతం నమోదైంది. బాలికల విభాగంలో 6,789మంది పరీక్ష రాయగా.. 5,413 మంది ఉత్తీర్ణత సాధించి 79.73శాతం నమోదు చేసుకున్నారు. మొత్తంగా 13,922మంది పరీక్ష కు హాజరు కాగా 10,276మంది ఉత్తీర్ణత సా ధించారు. ఒకేషనల్‌లో జిల్లావ్యాప్తంగా 1,265 మంది పరీక్షలు రాయగా.. 816 మంది ఉత్తీర్ణులయ్యారు. 64.51శాతం ఫలితాలు నమోదు చే శారు. బాలుర విభాగంలో 687మందికి 324 మంది ఉత్తీర్ణత(47.16శాతం) సాధించారు. బాలికలు 578మంది హాజరు కాగా 492 మంది ఉత్తీర్ణత(85.12శాతం) సాధించారు. ఫస్టియర్‌లో 11,358మంది ఉత్తీర్ణత ఇంటర్ ఫస్టియర్‌లో జిల్లావ్యాప్తంగా 16,264 మంది పరీక్షలకు హాజరు కాగా 11,358 మంది ఉత్తీర్ణులయ్యారు. గతేడాది 63.41 శాతంతో రాష్ట్రంలో 5వ స్థానంలో నిలవగా.. ఈసారి 69.84శాతం ఉత్తీర్ణత సాధించి 6వ స్థానంలో నిలిచింది. బాలుర విభాగంలో 8,634మంది పరీక్షలకు హాజరు కాగా 5,356మంది(62.03 శాతం)ఉత్తీర్ణత సాధించారు. బాలికల విభా గంలో 7,630మంది పరీక్షలు రాయగా 6,002 మంది (78.66) ఉత్తీర్ణత సాధించారు. బాలుర ఉత్తీర్ణత 62.03శాతం కాగా.. బాలికల ఉత్తీర్ణత 78.66శాతంగా నమోదైంది. ఒకేషన్ విద్యార్థులు 51.18శాతం ఉత్తీర్ణత నమోదు చేసుకుని రాష్ట్రంలో 25వ స్థానంలో నిలిచారు. బాలుర విభాగంలో 896మంది పరీక్షలకు హాజరుకాగా 331మంది (36.94శాతం)ఉత్తీర్ణులయ్యారు. బాలికల విభాగంలో 634మందికి 452మంది విద్యార్థినులు(71.29)ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో 1,530మంది పరీక్షలకు హాజరుకాగా 783 ది విద్యార్థులు 51.18 ఉత్తీర్ణతశాతం నమోదు చేసుకున్నారు.ఈ ఏడాది ఫస్టియర్ ఉత్తీర్ణత శాతం గతేడాది సెకండియర్ ఉత్తీర్ణత శాతం74.3969.84గతేడాది ఫస్టియర్ ఉత్తీర్ణత శాతం ఈ ఏడాది సెకండియర్ ఉత్తీర్ణత శాతం 63.4173.81మే 22 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రీవెరిఫికేషన్, రీవాల్యుయేషన్‌తో పాటు ఫెయిలైన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్‌కు పేపర్‌కు రూ.100, రీ వెరిఫికేషన్‌కు రూ.600 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. మే 22నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్, సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి. ఫెయిలైన విద్యార్థులు ఎలాంటి బెంగ లేకుండా సప్లమెంటరీ పరీక్షలకు హాజరు కావాలి. – జగన్మోహన్రెడ్డి, డీఐఈవో, కరీంనగర్ -
‘ఎస్వీజేసీ’ విజయదుందుబి
కరీంనగర్: ఇంటర్ ఫలితాల్లో ఎస్వీజేసీ విద్యార్థులు విజయదుందుబి మోగించారు. ఫస్టియర్‌లో ఎంపీసీలో సీహెచ్ రాజశేఖర్‌రెడ్డి 468, బి.వెన్నెల 466, బి.శ్రీనిత్య 466, బి.హరిణి 465, ఎన్.అరుణ్‌తేజ 464, కె.సహస్ర 463, ఎస్కే.తమన్నా 463, జె.సునీల్ 462, పి.సంజన 462, ఏ.హర్షవర్దన్ 462 మార్కులు సాధించారు. బైపీసీలో పి.సహస్ర 437, డి.శివకుమార్ 437, డి.శ్రీనిధి యాదవ్ 435, ఎం.స్పందన 434, అనికేత్ మిశ్రా 434,శ్రీవల్లి 432, బి.రుచిత 431, ఎన్.నిహారక 430 మార్కులు సాధించారు. సెకండియర్ బైపీసీలో పి.లిఖిత 992, ఎం.స్పూర్తి 992, ఎస్.రిషిక 991, టి.లిఖిత గౌడ్ 989, ఆర్.మేఘన 988, కె.కార్తీక్ 988, ఎస్.లావణ్య 987, ఎం.త్రిణిజ 987, ఎస్.రక్షిత 987 మార్కులు సాధించారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్ ఊట్కూరి మహిపాల్‌రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కాంతాల రాంరెడ్డి, వెంకట వరప్రసాద్, డైరెక్టర్లు సింహాచలం హరికృష్ణ, వంగల సంతోష్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఫుట్‌పాత్ ఆక్రమణలు తొలగింపు
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని ఫుట్‌పాత్‌లు, రోడ్లు ఆక్రమించి చేస్తు న్న వ్యాపారాలపై ఎట్టకేలకు నగరపాలకసంస్థ, ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించారు. ‘నడక దారేది?’ శీర్షికన ఈ నెల 20వ తేదీన ‘సాక్షి’లో వచ్చిన కథనానికి స్పందించిన అఽధికారులు మంగళవారం ఆక్రమణలు తొలగించారు. శనివారం అంగడి చౌరస్తా, రాజీవ్ చౌక్, టవర్‌సర్కిల్, కూరగాయల మార్కెట్ ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లు, రోడ్లను ఆక్రమించుకొని వ్యాపారం చేస్తున్న దుకాణదారుల సామగ్రిని తొలగించారు. అహ్మద్పురలో రోడ్డుపైకి వచ్చి చేపట్టిన శాశ్వత నిర్మాణాన్ని కూల్చివేశారు. షెడ్‌ను పూర్తిగా తొలగించుకోవాలని వ్యాపారులను ఆదేశించారు. ఈ సందర్భంగా దుకాణదారులు నగరపాలకసంస్థ సిబ్బందితో వాగ్వాదానికి దిగగా, పోలీసులు జోక్యం చేసుకొన్నారు. మళ్లీ ఆక్రమణలు లేకుండా చూడాలి టవర్‌సర్కిల్, రాజీవ్‌చౌక్ లాంటి అత్యంత రద్దీ ప్రాంతాల్లో రోడ్లు, ఫుట్‌పాత్‌లు ఆక్రమించి వ్యాపారాలు చేస్తుండడం సర్వసాధారణంగా మారింది. అప్పుడప్పుడు అధికారులు దాడులు చేసి ఆక్రమణలు తొలగిస్తున్నా, నాలుగైదు రోజుల్లో పరిస్థితి మళ్లీ మొదటికొస్తుంది. అలా కాకుండా ఫుట్‌పాత్, రోడ్ల ఆక్రమణలపై క్రమంతప్పకుండా చర్యలు తీసుకొని, ఆక్రమణలు లేకుండా చూడాలని నగరవాసులు కోరుతున్నారు. -
భూ భారతితో సమస్యలు పరిష్కారం
● కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ● షానగర్‌లో రైతులకు అవగాహన సదస్సురామడుగు: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టంతో భూ సమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ పమేలా సత్పతి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. రామడుగు మండలం షానగర్ గ్రామపరిధిలోని ఓ ఫంక్షన్హాల్లో మంగళవారం భూ భారతి, ఆర్వోఆర్ చట్టంపై రైతులకు అవగాహన కల్పించారు. ధరణి కన్నా సౌకర్యవంతంగా భూ భారతి చట్టం ఉంటుందని, ప్రతీ సమస్య పరిష్కారానికి అవకాశం ఉంటుందని వివరించారు. అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్, ఆర్డీవో మహేశ్వర్, మండల ప్రత్యేకాధికారి అనిల్‌ప్రకాశ్, గోపాల్రావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేని తిరుమల, కొక్కెరకుంట సింగిల్ విండో చైర్మన్ ఒంటెల మురళీకృష్ణారెడ్డి, తహసీల్దార్ వెంకటలక్ష్మి, ఎంపీడీవో రాజేశ్వరి, ట్రైనర్ మందల ప్రేమ్‌చంద్రారెడ్డి పాల్గొన్నారు. భవితకేంద్రం సందర్శన రామడుగు ప్రభుత్వ పాఠశాలలోని భవిత కేంద్రాన్ని కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. దివ్యాంగ విద్యార్థులతో మాట్లాడారు. టీచింగ్ మెటీరియల్, రికార్డులు తనిఖీ చేశారు. ప్రతీ భవిత కేంద్రంలో సిబ్బంది వివరాలు తెలియజేసే బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. దేశరాజ్‌పల్లిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. సింగిల్ విండో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సౌకర్యాలు కల్పించాలని సూచించారు. దేశరాజ్‌పల్లి పరిధిలోని ఔదర్పల్లిలో మంగళవారం నిర్వహించిన ఆరోగ్య మహిళ వైద్య శిబిరాన్ని కలెక్టర్ పమేలా సత్పతి, డీఎంహెచ్‌వో వెంకటరమణ పరిశీలించారు. హెల్త్ క్యాంపుల్లో మహిళలందరికీ.. అన్ని రకాల స్క్రీనింగ్ పరీక్షలు పూర్తి చేయాలని ఆదేశించారు. పీవోఎంహెచ్‌ఎన్ వైద్యాధికారి సనజవేరియా, రామడుగు వైద్యాధికారి రమేశ్, ఎంఎల్‌హెచ్‌పీ వైద్యాధికారి భాగ్యశ్రీ పాల్గొన్నారు. -
రామయ్య హుండీ ఆదాయం రూ.20,69,829
ఇల్లందకుంట: ఇల్లందకుంట శ్రీసీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల హుండీ ఆదాయాన్ని మంగళవారం ఇన్చార్జి ఈవో సుధాకర్, దేవాదాయ పరిశీలకుడు సత్యనారాయణ, కమిటీ చైర్మన్ ఇంగిలే రామారావు ఆధ్వర్యంలో లెక్కించారు. మొత్తంగా రూ.20,69,829 లక్షల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఇందులో బంగారం 12గ్రాములు, వెండి 305గ్రాములు, అమెరికన్ డాలర్లు 225, అరబ్ దిరమ్స్ 15, కువైట్ దినర్ 1, చైనీస్ యువాన్ 5, జపనీస్యెన్ 1000 వచ్చాయన్నారు. గతేడాది కన్నా ఈసారి సుమారు రూ.3లక్షల ఆదాయం అధికంగా సమకూరిందని ఇన్చార్జి ఈవో సుధాకర్ తెలిపారు. రెడ్డిసంఘం జిల్లా అధ్యక్షుడిగా గంగిరెడ్డి కరీంనగర్‌టౌన్: ఆల్ ఇండియా రెడ్డిసంఘం జిల్లా అధ్యక్షుడిగా గంగాధర మండలం మంగపేట గ్రామానికి చెందిన బైరి గంగిరెడ్డిని నియమిస్తూ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బీరెడ్డి కరుణాకర్‌రెడ్డి, గౌరవ అధ్యక్షుడు గుజ్జుల రవీందర్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గంగిరెడ్డి మాట్లాడుతూ... రెడ్డీల సంక్షేమం కోసం పాటుపడతానని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చిన సంఘం కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలియజేశారు. యశోద ఆస్పత్రిలో అరుదైన వాస్క్యులర్ సర్జరీ కరీంనగర్‌టౌన్: సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో అత్యంత అరుదైన వాస్క్యులర్ సర్జరీ నిర్వహించినట్లు ఆసుపత్రి వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ డి.ప్రభాకర్ తెలిపారు. మంగళవారం కరీంనగర్ యశోద మెడికల్ సెంటర్లో మాట్లాడుతూ... హన్మకొండ జిల్లా ఎల్కతుర్తికి చెందిన కృష్ణమూర్తి(52) ఎడమకాలి వాపు, నొప్పి, పాదంలో పుండు వంటి సమస్యలతో తమ వద్దకు వచ్చాడని తెలిపారు. వెంటనే సమస్యను గుర్తించి సీటీ లోయర్ లింబ్ యాంజియోగ్రఫీ ద్వారా రక్తనాళాలలో అడ్డంకులు (పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్) ఏర్పడడంతో రక్తప్రసరణ నిలిచిపోయినట్లు గుర్తించామన్నారు. యశోద ఆసుపత్రి ఉత్తమమైన వైద్యుల బృందం, సాంకేతిక పరిజ్ఞానంతో స్టెంటింగ్, యాంజియోప్లాస్టీ ద్వారా సమర్థవంతమైన శస్త్రచికిత్స చేసి తిరిగి రక్త ప్రసరణను సాధారణ స్థితికి తీసుకువచ్చామన్నారు. కాళ్లలో వాపు, నొప్పి, వేళ్లు మొద్దుబారిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని సూచించారు. -
‘ఎస్ఆర్’ ప్రభంజనం
తిమ్మాపూర్: ఇంటర్ ఫలితాల్లో కరీంనగర్ జిల్లాలోని ఎస్ఆర్ కళాశాలల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఇంటర్ సెకండియర్‌లో ఎంపీసీలో 45 మంది 990 మార్కులకుపైగా సాధించారు. బైపీసీలో నలుగురు 990కిపైగా మార్కులు సాధించారు. ఫస్టియర్ ఎంపీసీలో 63 మంది 465 మార్కులకుపైగా సాధించారు. బైపీసీలో 435 మార్కులకుపైన సాధించి ముగ్గురు విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎంపీసీ సెకండియర్‌లో కాసర్ల భవాని, అబ్దుల్ రయాన్ 994 మార్కులు, సింధూజ 993 మార్కులు సాధించగా, 992 మార్కులు 16మంది సాధించారు. బైపీసీ ద్వితీయ సంవత్సరంలో బి.సహస్ర 993మార్కులు, కదిరి స్ఫూర్తి, కొత్తపల్లి జాహ్నవి 992మార్కులు, నాదే పూజిత 991మార్కులు సాధించారు. ఎంపీసీ ఫస్టియర్‌లో బండి ప్రతిష్ట, మండలోజి వైశాలిని 468 మార్కులు, ఏడుగురు 467 మార్కులు సాధించారు. బైపీసీ ఫస్టియర్‌లో హజామా హవీన్ 436 మార్కులు, దాడి శివాని, కీర్తన, వాసవి 435మార్కులు సాధించారు. వీరిని జోనల్ ఇన్చార్జి తిరుపతి, విద్యాసంస్థలు చైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి, డీజీఎం వాసుదేవరెడ్డి అభినందించారు. -
కారు ఢీకొని యువకుడి మృతి
తిమ్మాపూర్: మండలం కొత్తపల్లి శివారులో కారు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందారు. ఎస్సై వివేక్ కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్‌కు చెందిన దొప్ప సంతోష్ కుమార్ (32) హైదరాబాద్ మేడ్చల్ జిల్లాలో మొక్కజొన్న కంకులు విక్రయించి తిరిగి వెళ్లే క్రమంలో మండలంలోని కొత్తపల్లి గ్రామంవద్ద వాహనాన్ని నిలిపాడు. అనంతరం నీరు తాగుతూ మరో వ్యక్తికోసం వేచి చూస్తూనే క్రమంలో హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వస్తున్న కారు అదుపుతప్పి ఢీకొనడంతో సంతోష్ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. ఇంటర్లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఆత్మహత్యపాలకుర్తి(రామగుండం): ఇంటర్మీడియెట్ పరీక్షలో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఘనశ్యాందాస్‌నగర్(జీడీనగర్) గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. సాపల్ల ఎల్లయ్య– గంగమ్మ దంపతుల కూతురు సాపల్ల శశిరేఖ(17) సిరిసిల్లలోని మోడల్ స్కూల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివింది. ఇటీవల ఇంటర్ పరీక్షలు రాసింది. అయితే, శశిరేఖ తలి గంగమ్మ ఉదయమే పనికోసం పెద్దపల్లికి వెళ్లింది. తండ్రి ఎల్లయ్య కన్నాల బోడగుట్ట క్వారీలో పనికి వెళ్లాడు. శశిరేఖ ఒంటరిగా ఉన్నది. మంగళవారం వెలుబడిన ఇంటర్ ఫలితాల్లో కామర్స్ సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయిన శశిరేఖ.. మనస్థాపంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు సాయంత్రం ఇంటికి వచ్చిచూసేసరికి శశిరేఖ విగతజీవిగా కనిపించడంతో బోరున విలపించారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒకకుమార్తె కాగా ఇద్దరు కుమారులలో ఒకరు ప్రస్తుతం బాసర ట్రిపుల్ ఐటీలో చదువుచున్నాడు. మరో కుమారుడికి ఇటీవలనే నేవీలో ఉద్యోగం రాగా శిక్షణ నిమిత్తం కేరళలో ఉంటున్నాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు అర్ధంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై స్వామి తెలిపారు. -
‘ట్రినిటి’ జయకేతనం
సప్తగిరికాలనీ(కరీంనగర్): ఇంటర్ ఫలితాల్లో కరీంనగర్‌లోని ట్రినిటి విద్యార్థులు జయకేతనం ఎగురవేశారు. ఫస్టియర్ ఎంపీసీలో జి.మధురిమ 468 మార్కులు, సిరివైష్ణవ్య, ఉమాదేవి, వికాశ సాహి, శశాంక, లహరిక, అనూష, వైష్ణవి, అర్చన, వైష్ణవి, హారిక, శ్రీవర్ష, శ్రీజ, రిషిక, శరణ్య, ఫబిత ఐనాయత్, రశ్మిత, నేహ, నిఖిత 467మార్కులు సాధించారు. 48మంది 466 మార్కులు, 67 మంది 465 మార్కులు సాధించారు. బైపీసీలో పి.సహస్ర, ఎల్.హేమనందిని 438 మార్కులు, 16మంది 436 మార్కులు, 21మంది 435మార్కులు సాధించారు. సీఈసీలో వైష్ణవి 494మార్కులు, రాహుల్, దీపిక 490 మార్కులు, ఎంఈసీలో భువన విజయ్ 479, శ్రావణి 467మార్కులు సాధించారు. సెకండియర్ ఎంపీసీలో వి.రశ్మిత 995 మార్కులు, అజయ్, హితేష్, బాలాజీ, సంధ్య, ప్రణతి, సాయిసంహిత 994 మార్కులు, 13మంది 993, 21మంది 992, 27మంది 991మార్కులు సాధించారు. బైపీసీలో డి.జ్యోత్స్న 996, మహతి, పల్లవి 994మార్కులు, నలుగురు 993, ఏడుగురు 992మార్కులు, 12 మంది 991 మార్కులు సాధించారు. సీఈసీలో శృతి 981, ఎంఈసీలో రిషిక 980మార్కులు సాధించారు. వీరిని విద్యాసంస్థల వ్యవస్థాపక చైర్మన్ దాసరి మనోహర్‌రెడ్డి అభినందించారు. -
ఆస్తులు పంచుకున్నారు.. అన్నం పెడ్తలేరు
ప్రజావాణి ఉందనుకుని కరీంనగర్ కలెక్టరేట్‌కు వచ్చిన వృద్ధ దంపతులకు చుక్కెదురైంది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గంగిపల్లి గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు రేగుల్ల నర్సయ్య– లక్ష్మిని కొడుకులు ఆస్తులు పంచుకుని గెంటేశారు. తమ కొడుకులు బుక్కెడు బువ్వ పెట్టడం లేదని ప్రజావాణిలో దరఖాస్తు ఇద్దామని సోమవారం కలెక్టరేట్‌కు వచ్చారు. భూ భారతి కార్యక్రమం ఉండటంతో ప్రజావాణిని అధికారులు రద్దు చేశారు. చేసేది ఏమీ లేక కలెక్టరేట్లోని చెట్లనీడ కింద కూర్చుని కన్నీటి పర్యంతమయ్యారు. కై కిలి చేసుకొని బతుకుదామన్నా.. వయస్సు సహకరిస్తాలేదంటూ కన్నీటితో వెనుదిరిగారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్ -
డిజిటల్ భవిష్యత్‌కు ఏఐ
గంభీరావుపేట(సిరిసిల్ల): డిజిటల్ భవిష్యత్ మొ త్తం ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)పైనే ఆధారపడి ఉంటుందని తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి పేర్కొన్నారు. గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఫిజికల్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)పై నేషనల్ సెమినార్ కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమానికి పలు రీసెర్చ్ సంస్థల ప్రొఫెసర్లు పాల్గొని పవర్ ప్రెజెంటేషన్లు, ప్యానల్ డిస్కషన్, పోస్టర్ ప్రజెంటేషన్ ద్వారా ఏఐ గురించి వివరించారు. సెమినార్లో ఏం చెప్పారంటే.. డిజిటల్ భవిష్యత్‌కు కృత్రిమ మేధస్సు(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) దోహదపడుతుందన్నారు. సాంకేతిక విప్లవాన్ని ముందుకు సాగించే క్రమంలో త్వరలోనే కృత్రిమ మేధ ప్రజలకు అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు. సాంకేతికత, ఆవిష్కరణలు ప్రయోగశాలలకే పరిమితం కాకుండా సాధారణ పౌరుల జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతూ వారి అభివృద్ధికి బాటలు వేయాలన్నారు. ఏఐ టెక్నాలజీని వినియోగించుకొని విద్యారంగాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. పోటీ ప్రపంచానికి అనుగుణంగా స్కిల్స్‌ను అభివృద్ధి చేసుకుంటూ విద్యార్థులు డిజిటల్ భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని సూచించారు. ఈ సదస్సులో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ విజయలక్ష్మి, ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి, రీసోర్స్ పర్సన్లు కల్యాణి, స్వాతి మాతూర్, హంట్ మెట్రిక్ సీఈవో అయూబ్ షేక్, సెమినార్ ఆర్గనైజింగ్ సెక్రటర డాక్టర్ శ్రావణ్‌కుమార్, పరిశోధకులు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. త్వరలో అందరికీ అందుబాటులోకి ‘కృత్రిమ మేధ’ గంభీరావుపేట డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో నేషనల్ సెమినార్ హాజరైన రాష్ట్ర కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి ఆకట్టుకున్న ప్రొఫెసర్ల పవర్ ప్రెజెంటేషన్లు -
జర్నలిస్టుల పరిస్థితి దుర్భరం
వేములవాడ: రాష్ట్రంలో జర్నలిస్టుల పరిస్థితి దుర్భరంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్న జర్నలిస్టులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. వేములవాడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో వస్తే జర్నలిస్టులను ఆదుకుంటామన్నారు. జర్నలిజం అనుభవం లేకున్నా యూట్యూబ్ చానళ్ల ముసుగులో బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంపై త్వరలోనే ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని పేర్కొన్నారు. ప్రెస్‌క్లబ్ భవన నిర్మాణానికి గతంలో రూ.10 లక్షల మేరకు ఎంపీ లాడ్స్ నిధులు మంజూరు చేశారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు పుట్టపాక లక్ష్మణ్ అధ్యక్షతన బండి సంజయ్‌ని సన్మానించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, నాయకులు ప్రతాప రామకృష్ణ, కుమ్మరి శంకర్, వికాస్‌రావు, ఐజేయూ జిల్లా అధ్యక్షుడు దండి సంతోష్, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు పుట్టపాక లక్ష్మణ్, కార్యదర్శి మహేశ్ పాల్గొన్నారు. ప్రసాద్ స్కీంలోకి రాజన్న గుడి వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ ఏడాది కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానన్నారు. ప్రసాద్స్కీంలో చేర్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కరీంనగర్‌టౌన్: దేశ చరిత్రలో అంబేడ్కర్ ఎదుర్కొ న్న అవమానాలు మరెవరూ ఎదుర్కోలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. తన మేధాశక్తిని అణగారిన వర్గాల అ భ్యున్నతికి ధారపోసిన మహనీయుడు అని కొని యాడారు. అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని బీజేపీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్లో నిర్వహించిన సెమినార్‌కు బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేడ్కర్‌ను దళిత జాతికే పరిమి తం చేయాలని కాంగ్రెస్ కుట్ర చేసిందన్నారు. చరిత్ర అంటే డూప్లికేట్ గాంధీ కుటుంబానిదే అన్నట్లుగా విపరీతమైన ప్రచారం చేసుకుని ఆయన్ను తక్కువ చేసిందన్నారు. కాంగ్రెస్ తీరుతో విసుగుచెంది రాజీనామా చేసి బయటకొచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తే కమ్యూనిస్టులతో కలిసిన రెండుసార్లు అంబేద్కర్‌ను ఓడించిందన్నారు. డూప్లికేట్ గాంధీ కుటుంబసభ్యులైన నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీలకు భారతరత్న ఇచ్చుకుందన్నారు. రిజర్వేషన్లను వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లు కల్పించేందుకు కుట్రలు చేసిందన్నారు. అంబేద్కర్‌కు భారతరత్న వచ్చేలా చేసిన పార్టీ బీజేపీ అని అంబేడ్కర్ జయంతి రోజు రాష్ట్రీయ సమరసత దినంగా ప్రకటించి 120దేశాల్లో ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు, మానేరు అనంతరెడ్డి, దేవేందర్ రావు, అడవి కుమార్, డాక్టర్ గంగాధర్, రాజేందర్‌రెడ్డి, సోమిడి వేణు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే అన్ని విధాలా ఆదుకుంటాం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ వ్యాఖ్యలు -
రోడ్డు దాటాలంటే భయమే..
వేములవాడఅర్బన్: కరీంనగర్–సిరిసిల్ల ప్రధాన రహదారి వాహనాలతో బిజీగా ఉంటుంది. ఈ రోడ్డును ఆనుకుని ఉన్న గ్రామాలకు చందిన వారు రోడ్డు క్రాస్ చేసేందుకు ప్రయత్నిస్తూ నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు. ఎప్పుడు.. ఎక్కడ.. ఎవరి ప్రాణం పోతుందో తెలియక భయాందోళన చెందుతున్నారు. ప్రతీ నెల దాదాపు పదికి మించి ప్రమాదాలు జరుగుతున్నాయంటే ఈ రోడ్డుపై పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మధ్యలోనే ఆగిన రోడ్డు కరీంనగర్ నుంచి కామారెడ్డికి వెళ్లాలంటే ఈ రోడ్డు ప్రధానం. మధ్యలో నాంపల్లి స్టేజీ నుంచి కుడివైపు మళ్లితే వేములవాడకు వెళ్లవచ్చు. రాజన్న భక్తులకు సైతం ఇదే ప్రధాన రహదారి. నిత్యం తిరిగే వాహనాలతోపాటు రాజన్న దర్శనానికి వచ్చే భక్తుల వాహనాలతో ఈ రోడ్డు బిజీగా మారుతోంది. కరీంనగర్ నుంచి కొదురుపాక వరకు ఫోర్‌లేన్ రోడ్డు వేశారు. సిరిసిల్ల నుంచి నందికమాన్ వరకూ ఫోర్‌లేన్ రహదారి పూర్తి చేశారు. నందికమాన్ నుంచి కొదురుపాక మిడ్‌మానేరు వంతెన వరకు దాదాపు 8 కిలోమీటర్ల దూరం మాత్రమే ఫోర్‌లేన్ రోడ్డు పూర్తి కాలేదు. ఈ 8 కిలోమీటర్ల మధ్యలోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు దాటాలంటే భయమే.. వేములవాడ నందికమాన్ నుంచి ఆరెపల్లి వరకు కరీంనగర్–సిరిసిల్ల ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న కొడుముంజ, శాభాష్‌పల్లి, శాంతినగర్, నాంపల్లి, అనుపురం, రుద్రవరం, సంకెపల్లి, అరెపల్లి గ్రామాల ఇళ్లు రోడ్డును ఆనుకుని రెండు వైపులా ఉన్నాయి. నిత్యావసరాలు, ఇతరత్ర పనుల కోసం గ్రామస్తులు ఇటు నుంచి అటు వైపు వెళ్లాలంటే రోడ్డు దాటాల్సిందే. అయితే ఈక్రమంలోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. రోజుకో ప్రమాదం.. పోతున్న ప్రాణం పూర్తికాని ఫోన్లేన్ రోడ్డు నాంపల్లిగుట్ట నుంచి కొదురుపాక వరకు ప్రమాదకరం తరచూ రోడ్డు ప్రమాదాలు గత 15 రోజుల క్రితం అనుపురం గ్రామానికి చెందిన వంశీ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా బైక్ ఢీకొట్టి తీవ్రంగా గాయపడ్డాడు. అనుపురం గ్రామానికి చెందిన రాజయ్య బైక్‌పై వెళ్తుండగా మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. రాజన్న దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో అనుపురం వద్ద ఖాజీపూర్‌కు చెందిన కుటుంబం వెంకటేశ్, రజిత, అభిరామ్‌లను కారు ఢీకొట్టడంతో గాయపడ్డారు. ఐదు రోజుల కిత్రం అనుపురం గ్రామానికి చెందిన బండారి శ్రీహరిని కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గతంలో ఆరెపల్లి శివారులో ఇద్దరు, నాంపల్లి శివారులో ఒక్కరు, అనుపురం శివారులో ఇద్దరు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. -
చెరువులో మునిగి ఒకరి మృతి
● చేపలు పట్టేందుకు వెళ్లి గల్లంతు ముస్తాబాద్(సిరిసిల్ల): చేపలు పట్టేందుకు వెళ్లి.. వ్యక్తి చెరువులో గల్లంతవగా.. మరొకరు సురక్షితంగా బయటపడ్డ సంఘటన ముస్తాబాద్ మండలం కొండాపూర్‌లో చోటుచేసుకుంది. ఎస్సై గణేశ్ తెలిపిన వివరాలు. కొండాపూర్‌కు చెందిన మహ్మద్ రషీద్(45), బాబా(30) గ్రామ శివారులోని పెద్ద చెరువులోకి చేపలు పట్టేందుకు ఆదివారం రాత్రి వెళ్లారు. ఇద్దరు వలతో చెరువులోకి దిగారు. రషీద్ చెరువులో మునిగిపోయాడు. రషీద్ కోసం బాబా ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో గ్రామంలోకి వెళ్లి విషయం తెలిపాడు. గ్రామస్తులు పెద్దచెరువులో రాత్రి ఎంత గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. సోమవారం సిరిసిల్ల నుంచి గజఈతగాళ్లను రప్పించారు. వారు రషీద్ మృతదేహాన్ని బయటకు తీసుకురావడంతో భార్య షెహనాజ్, కూతురు రేష్మ, కుమారుడు రఫీ, బంధువుల రోదనలు మిన్నంటాయి. రషీద్ ఆరు నెలల క్రితమే దుబాయ్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మూడేళ్ల క్రితం అదే చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి మహ్మద్ ఎక్రామ్ చనిపోయాడు. విద్యుత్‌షాక్‌తో రైతు..బుగ్గారం: పంటకు నీరు పెట్టడానికి వెళ్లి మోటార్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు వైరు తగిలి రైతు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన బుగ్గారం మండలం గోపులాపూర్‌లో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీధర్, బంధువుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గోవిందుల మల్లేశం(58) సోమవారం ఉదయం పెసరు, నువ్వుల పంటకు నీరు పెట్టడానికి వెళ్లాడు. స్టార్టర్ డబ్బా ఇనుపది కావడంతో సర్వీస్ వైరు మధ్యలో కొద్దిగా కట్ అయిన విషయం తెలియక మోటార్ స్టార్ట్ చేసేందుకు యత్నించాడు. డబ్బాకు అంటిన సర్వీస్ వైరుకు విద్యుత్ సరఫరా అయి రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. మల్లేశం భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఆటో.. బైక్ ఢీకొని ఒకరు..వీణవంక: మండలంలోని ఐలబాద్ గ్రామ శివారులో ఆటో, బైక్ ఢీకొని ఆటో డ్రైవర్ కర్నాల నాగరాజు(46)అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కరీంనగర్‌లోని కోతిరాంపూర్‌కు చెందిన ఆటో డ్రైవర్ నాగరాజు జమ్మికుంట నుంచి కరీంనగర్‌కు వెళ్తున్నాడు. ఐలబాద్ శివారులో కరీంనగర్ నుంచి వీణవంకకు బైక్‌పై వస్తున్న మర్రి రమేశ్ అతివేగంతో ఆటోను ఢీ కొట్టాడు. దీంతో నాగరాజు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. రమేశ్, బైక్ వెనక కూర్చున్న మల్లేశం తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కరీంనగర్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య దేవలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తోట తిరుపతి తెలిపారు. -
‘పెద్దింటి’కి అరుదైన గౌరవం
సిరిసిల్లకల్చరల్: జిల్లాకు చెందిన ప్రముఖ కథారచయిత పెద్దింటి అశోక్‌కుమార్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. ఆయన రాసిన జిగిరి, గోస, అనగనగా ఓ కోడిపెట్ట అనే కథలను వరంగల్‌లోని శ్రీవిశ్వేశ్వర సంస్కృతాంధ్ర డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులకు సిలబస్‌గా ప్రవేశపెట్టారు. ఆయా కథలను బోధించే బాధ్యతను కూడా అప్పగించారు. స్వతహాగా ఉపాధ్యాయుడైన పెద్దింటి కళాశాల విద్యార్థులకు కథలను పాఠాలుగా బోధించారు. ఎనిమిది దశాబ్దాల చరిత్ర గల కళాశాలలో రచయితే అధ్యాపకుడై బోధించడం ఇదే తొలిసారి అని ప్రిన్సిపాల్ సానబోయిన సతీశ్ తెలిపారు. తన కథలపై తానే విస్తృతోపన్యాసం ఇవ్వడం మర్చిపోలేని అనుభవంగా పెద్దింటి అభివర్ణించారు. ఈ సందర్భంగా పెద్దింటిని మానేరు రచయితల సంఘం ప్రతినిధులు, కవులు, రచయితలు అభినందించారు. -
విద్యార్థులే ‘సాగు’లో శాస్త్రవేత్తలు
● రావెప్కు కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలు ఎంపిక ● రైతులతోనే నాలుగు నెలల పాటు క్షేత్రస్థాయి పాఠాలు ● భౌగోళిక స్వరూపం, ప్రదర్శనల రూపకల్పనకరీంనగర్ అర్బన్: అవును.. విద్యార్థులే శాస్త్రవేత్తలుగా సలహాలు, సూచనలు అందించనున్నారు. అంతర్జాలం ద్వారా అందే సేవలను వివరించడంతో పాటు రైతుల జీవన ప్రమాణాలను రూపొందించనుండగా గ్రామ భౌగోళిక స్వరూపాన్ని డయాగ్రామ్ ద్వారా నివేదించనున్నారు. గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమం (రావెప్)లో భాగంగా వ్యవసాయ విద్యార్థినులు నాలుగు నెలలపాటు గ్రామాల్లోనే బస చేయనున్నారు. కరీంనగర్ ఏరువాక ఆధ్వర్యంలో కార్యాచరణను రూపొందించగా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాను ఎంపిక చేయగా ఇప్పటికే విద్యార్థులు రైతులతో మమేకమయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యవసాయ కళాశాలకు చెందిన మొత్తం 21మంది విద్యార్థులకు గానూ 4–5గురు విద్యార్థులతో బృందాలను ఏర్పాటు చేసి, మండలానికో గ్రామం ఎంపిక చేశారు. కరీంనగర్ జిల్లాలో కొత్తపల్లి మండలం నాగుల మల్యాల, జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండలం పూడూరు, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలం తడగొండ గ్రామాల్లో క్షేత్రస్థాయి అనుభవాలను గడిస్తున్నారు. జూన్ వరకు కార్యక్రమాల నిర్వహణతో పాటు అనుభవాలను పొందనున్నారని కరీంనగర్ ఏరువాక సమన్వయకర్త డా.మదన్‌మోహన్‌రెడ్డి వివరించారు. యూట్యూబ్, టోల్‌ఫ్రీ సేవలపై ప్రచారం రైతులు ఆధునిక సాగు పద్ధతులను అనుసరించేలా అంతర్జాల వివరాలపై అవగాహన కల్పించనున్నారు. రైతు వేదికలో ఎప్పకటిప్పటి సమాచారాన్ని ప్రదర్శించనున్నారు. గ్రామీణ విశ్లేషణాత్మక తులనం(పీఆర్ఏ)లో భాగంగా సోషల్ మ్యాప్ వేసి గ్రామంలో ఉన్న భౌగోళిక వివరాలు, పోస్టాఫీస్, బ్యాంకులు, ఇతరత్రా వివరాలను రూపొందించనున్నారు. యూట్యూబ్ ఛానల్ ‘పీజేటీఎస్‌ఎయూ’లో అగ్రికల్చర్ యూనివర్సిటీ వీడియోలు ఉండనుండగా అథెంటిక్‌గా రూపొందించారు. ప్రధాన శాస్త్రవేత్తలు సూచనలు, సలహాలు చూసుకోవచ్చు. రైతుల విజయగాథలు ఉండనుండగా నిర్దిష్టమైన సమాచారం ఉంటుంది. వరి, పత్తి, మొక్కజొన్న, పెసలు, మినుములు, అపరాలు, తృణధాన్యాలపై వీడియోలు ఉండనున్నాయి. కిసాన్ సారథి టోల్‌ఫ్రీ నంబర్ 14426 లేదా 18001232175 ఫోన్ చేసి రైతులు తమ సమస్యలను వివరిస్తే పరిష్కారం చూపనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సేవలందనుండగా రైతులు ఫోన్ చేస్తే ఏ జిల్లా నుంచి చేస్తున్నారో ఆ జిల్లా ఏరువాక, కేవీకే శాస్త్రవేత్తలు లైన్లోకి రానున్నారు. ఇక వ్యవసాయ యూనివర్శిటీలు రూపొందించిన విత్తనాలను రైతుల క్షేత్రాల్లో ప్రాక్టికల్‌గా పరీక్షించనున్నారు. విత్తు నుంచి కోత వరకు సేవలు ఒక్కో విద్యార్థినికి ఒక్కో రైతును అటాచ్ చేయగా వివిధ రకాల విత్తనాలు వేసిన నుంచి పంట కోత వరకు సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. విత్తన ఎంపిక, విత్తన శుద్ధితో పాటు పంటలకు ఆశించే చీడపీడల నివారణ, దిగుబడులు ఎక్కువగా వచ్చేందుకు అనుసరించిన యజమాన్య పద్ధతులను శాస్త్రవేత్తల సూచనల క్రమంలో ఫీల్డ్‌లో అమలు చేయనున్నారు. ఎరువుల యాజమాన్యం, పురుగు మందుల వినియోగం పొదుపుగా జరిగేలా సూచనలు చేయనున్నారు. అలాగే ఏ గ్రామంలో సేవలందిస్తున్నారో ఆ గ్రామ నైసర్గిక స్వరూపంతో పాటు వనరులను వివరిస్తూ డయాగ్రామ్ రూపొందించనున్నారు. నాలుగు నెలల పాటు సేవలు మాది సిద్దిపేట. సిరిసిల్ల వ్యవసాయ కళాశాలలో అగ్రి కల్చర్ లాస్ట్ ఇయర్ చదువుతున్న. వ్యవసాయ విద్యార్థులకు తరగతి బోధనలతో పాటు ప్రాక్టీకల్ అవగాహన అవసరం. అందుకే నాలుగు నెలల పాటు పంట పొలాలు, రైతుల మధ్య తిరుగుతూ నివేదికలు, మ్యాప్‌లు రూపొందించాల్సి ఉంటుంది. – పి.స్పందన, ఆగ్రికల్చర్ విద్యార్థి, సిద్దిపేట -
● జిల్లాలో మార్కెట్ యార్డుల టార్గెట్ రూ.24.47 కోట్లు ● సమకూరిన ఆదాయం రూ.25.23 కోట్లు
జమ్మికుంట(హుజూరాబాద్): రాష్ట్ర ప్రభుత్వం మార్కెటింగ్ విధానంలో మార్పు తీసుకువచ్చింది. వ్యవసాయ ఉత్పత్తులపై జీఎస్టీ తొలగించడంతో మార్కెట్ యార్డుల ఆదాయం గణనీయంగా పెరిగింది. రైతులు ఆధునిక పద్ధతులతో సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్న క్రమంలో ప్రభుత్వ రంగ సంస్థలైన మార్కెట్ యార్డుల్లో క్రయ విక్రయాలు అధికంగా సాగుతున్నాయి. దీంతో పన్ను వసూళ్లతో మార్కెటింగ్ శాఖ ఆదాయం లక్ష్యానికి మించి సమకూరుతోంది. మార్కెట్ కమిటీల ఆదాయం లక్ష్యం ● జిల్లాలో 7 వ్యవసాయ మార్కెట్ యార్డులు ఉన్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.24.47 కోట్ల లక్ష్యం నిర్దేశించుకోగా, రూ.25.23 కోట్ల ఆదాయం సమకూరింది. ● ప్రభుత్వ రంగ సంస్థలైన పీఏసీఎస్‌లు, ఐకేపీలు, మార్ఫెడ్ ద్వారా 90 శాతం వ్యవసాయ ఉత్పత్తులు వరిధాన్యం, మొక్కజొన్న, పత్తి కొనుగోలు చేస్తున్నాయి. ఆయా మార్కెట్ల పరిధిలో అధిక మొత్తంలో వ్యవసాయ ఉత్పత్తుల క్రయ విక్రయాలు జరగడంతో మార్కెట్ శాఖకు లక్ష్యానికి మంచి ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. ● అలాగే వ్యవసాయ ఉత్పత్తులపై ప్రభుత్వాలు జీఎస్టీ తొలగించడంతో వ్యాపారుల అక్రమ దందాకు తెరపడింది. నామమాత్రపు టాక్స్ చెల్లింపులతో మార్కెట్లకు పన్ను రూపంలో ఆదాయం సమకూరుతోంది. ● వరంగల్ రీజియన్‌లో 110 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సిరిసిల్ల టార్గెట్ రూ.10.32 కోట్లు కాగా రూ.14.45 కోట్లు, జగిత్యాల లక్ష్యం రూ.15.99 కోట్లు కాగా రూ.21.19 కోట్ల ఆదాయం సమకూరింది. ● కరీంనగర్ జిల్లా మార్కెట్ కమిటీల లక్ష్యం రూ.24.47 కోట్లు కాగా రూ.25.23 కోట్లు సాధించినా గతం కంటే తగ్గింది. వరంగల్ రీజియన్‌లో సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలు మొదటి, రెండో స్థానంలో ఉన్నాయి. జమ్మికుంట మార్కెట్ కార్యాలయం జిల్లాలోని మార్కెట్ల వారీగా 2024–25 వార్షిక లక్ష్యం, సమకూరిన ఆదాయం(రూ.కోట్లలో)మార్కెట్ యార్డు లక్ష్యం వచ్చిన ఆదాయం కరీంనగర్ 4.31 5.18 జమ్మికుంట 8.8 8.51 చొప్పదండి 2.30 2.30 హుజూరాబాద్ 2.87 3.35 గంగాధర 1.40 1.14 మానకొండూర్ 2.65 2.51 గోపాల్రావుపేట 2.15 1.94 సైదాపూర్ 70 లక్షలు 62.74 లక్షలుఆదాయం పెంచేందుకు కృషి వ్యవసాయ ఉత్పత్తుల క్రయ విక్రయాలతో మార్కెట్ కమిటీలకు ఆదాయం సమకూరేందుకు చర్యలు చేపడుతాం. 2025–26 ఆర్థిక సంవత్సరంలో మరింత ఆదాయం పెంచేందుకు కృషి చేస్తాం. – ఎండీ షాబోద్దిన్, జిల్లా మార్కెటింగ్ అధికారిమార్కెట్ నిబంధనలతో.. మార్కెట్ పన్ను వసూళ్లలో నిబంధనలు సరళీకృతం కావడంతో వ్యవసాయ ఉత్పత్తుల రవాణా పెరిగింది. చెక్‌పోస్టుల ద్వారా నిఘా ఏర్పాటు చేశాం. క్రయ విక్రయాల నమోదు, తద్వారా పన్ను చెల్లింపు క్రమంగా జరుగుతుంది. దీంతో మార్కెట్‌కు అధిక ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నాం. – ఆర్. మల్లేశం, ఉన్నత శ్రేణి కార్యదర్శి, జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ -
నమోదులో నిజమెంత?
● కొనసాగుతున్న యూడైస్ ప్లస్ వివరాల పరిశీలన ● ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు, సమస్యలపై ఆరాకరీంనగర్: ప్రభుత్వ పాఠశాలలకు ఏటా నిధులు కేటాయిస్తున్నా.. వసతుల లేమితో పాటు విద్యార్థుల నమోదు, సామర్థ్యాల పెంపు అంతంత మాత్రంగానే ఉంటోంది. దీంతో ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈనెల 15నుంచి విద్యాశాఖ ఆధ్వర్యంలో తొలిసారి థర్డ్‌పార్టీతో సర్వే చేపట్టింది. ఏటా పాఠశాలల యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్(యూ–డైస్ ప్లస్)లో సమగ్ర సమాచారం పొందుపరుస్తారు. ఈ అంశాలను కాంప్లెక్స్ హెచ్ఎం, ఎంఈవోలు పరిశీలించాల్సి ఉంటుంది. ఇది పారదర్శకంగా జరగడం లేదని, వాస్తవ పరిస్థితులకు నివేదికకు తేడా ఉంటుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో విద్యాశాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లావ్యాప్తంగా శిక్షణ పొందిన డైట్, సీటీఈ కళాశాల విద్యార్థులు ఈనెల 15నుంచి సర్వే చేపట్టారు. వీరి నివేదిక ఆధారంగా పాఠశాలలకు బడ్జెట్ కేటాయింపులు జరగనున్నాయి. ఒక్కొక్కరికీ 10 పాఠశాలలు జిల్లావ్యాప్తంగా 628 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా మొదటి దశలో 397 పాఠశాలల్లో 34 మంది డైట్ శిక్షణ టీచర్లతో యూడైస్ ప్లస్ వివరాల పరిశీలన చేపట్టారు. ఒక్కొక్కరికి 10 పాఠశాలలు కేటాయించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, ఖాళీల వివరాలు, వసతులు, ఆధార్ అనుసంధానం, మధ్యాహ్న భోజన పథకం, ఉచి త దుస్తుల పంపిణీ, పాఠ్య పుస్తకాల సరఫరా, క్రీడాస్థలం, అదనపు గదులు, మరుగుదొడ్లు, తాగునీరు, ఫర్నిచర్, ప్రయోగశాల, గ్రంథాల యం తదితర సదుపాయాలపై వాస్తవికత, నివేదిక వివరాలు పరిశీలిస్తారు. తప్పులుంటే సరిచేయాలని హెచ్ఎంలకు సూచిస్తారు. వీరికి స్థానిక సీఆర్పీలు సహకారం అందిస్తారు.బయటి వారితో ఎందుకంటే..? ఏటా ఆయా పాఠశాలల హెచ్ఎంలు యూడైస్ ప్లస్‌లో తమ స్కూల్ సమాచారం పొందుపరుస్తారు. ఇది పారదర్శకంగా జరగడం లేదు. కొన్ని చోట్ల సదుపాయాలున్నా లేవని, చిన్నపాటి మరమ్మతులతో వినియోగంలోకి తీసుకొచ్చే పరిస్థితి ఉన్నా.. అసలే లేవంటూ సమాచారం పొందు పరుస్తున్నారు. ఈ నేపథ్యంలో బయటి వ్యక్తులతో పరిశీలన చేయిస్తే కచ్చితమైన సమాచారం వస్తుందని విద్యాశాఖ భావి స్తోంది. హెచ్ఎంలు ఇచ్చిన నివేదికను, డైట్ విద్యార్థులు గడువులోగా పరిశీలి స్తారు. ప్రక్రియ పారదర్శకంగా కొనసాగనుందని, ఉపాధ్యాయులు సహకరించాల ని జిల్లా సమగ్ర శిక్ష ప్లానింగ్ కో–ఆర్డినేటర్ ఎం.శ్రీనివాస్ వివరించారు. -
బెట్టింగ్ బారిన పడొద్దు
● డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ కరీంనగర్ కార్పొరేషన్: బెట్టింగ్ అనేది ఒక ప్రమాదకరమైన వ్యసనమని, యువత బెట్టింగ్ బారిన పడొద్దని డీసీసీ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్టాప్ బెట్టింగ్...సేవ్ లైఫ్ నినాదంతో ఆదివా రం 2కే రన్ నిర్వహించారు. నగరంలోని మార్క్‌ఫెడ్ నుంచి తెలంగాణ చౌక్ వరకు 2కే రన్ సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెట్టింగ్‌లతో యువత ప్రాణాలు కోల్పోతుండడం బాధాకరమన్నారు. యువత బెట్టింగ్ వైపు మళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 2కే రన్లో మొదటి బహుమతి గెలుచుకున్న వినయ్‌కి రూ.10 వేలు, రెండో బహుమతి గెలు చుకున్న రణధీర్‌కు రూ.5 వేలు, మూడోవిజేత సంజీవ్‌కు రూ.3 వేల నగదు అందజేశారు. యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గుర్రం వాసు, ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి పురుమల్ల శ్రీని వాస్, నాయకులు వుట్కూరి నరేందర్‌రెడ్డి, కిమ్ ఫహద్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. జనసేనలోకి మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్?కరీంనగర్: మాజీ ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్ జనసేన పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌తో మంతనాలు జరిపినట్లు వినికిడి. సీనియర్ నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉన్న సంతోష్‌కుమార్ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా జనసేనలో చేరేందుకే ఉత్సాహంగా ఉన్నట్లు ఆయన వర్గీయులు వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలో సంతోష్‌కుమార్‌కు విస్తృతమైన సంబంధాలు ఉండటం, సౌమ్యుడిగా పేరు ఉండటం కలిసి వచ్చే అంశంగా పేర్కొనవచ్చు. సంతోష్‌కుమార్‌తో పాటు కొంత మంది మాజీ ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నాయకులు జనసేన పార్టీలోకి చేరేందుకే ఉత్సాహం చూపుతున్నట్లు వినికిడి. ఈ విషయమై సంతోష్‌కుమార్‌ను సంప్రదించగా ప్రస్తుతం తాను కాంగ్రెస్పార్టీలోనే కొనసాగుతున్నానని, జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను ఓ ఫంక్షన్లో కలిశానే తప్పా, చర్చలు అంటూ ఏం జరగలేదని వివరించారు. బొట్టుపెట్టి.. సభకు ఆహ్వానించి కరీంనగర్: బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాల్లో భాగంగా ఈనెల 27వ తేదీన హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బహిరంగసభకు తరలి రావాలని కిసాన్‌నగర్ బీఆర్ఎస్ మహిళా నా యకురాళ్లు సుల్తానా, సావనపల్లి నారాయణ మ్మ, సిరిపురం లావణ్య కోరారు. ఆదివారం ఇంటింటికీ తిరుగుతూ.. మహిళలకు బొట్టుపెట్టి సభకు రావాలని ఆహ్వానించారు. జిల్లానుంచి పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. నేటి ప్రజావాణి రద్దుకరీంనగర్ అర్బన్: కలెక్టరేట్లో నేడు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భూ భారతి కొత్త ఆర్ఓఆర్ రెవెన్యూ చట్టం అమలు నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహి స్తున్నామని, అధికారులంతా ఆ సదస్సులకు హాజరు కావలసిన ఉన్నందున ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు గమనించి సహకరించాలని సూచించారు. పవర్‌కట్ ప్రాంతాలు కొత్తపల్లి: విద్యుత్ మరమ్మత్తు పనులు చేపడుతున్నందున సోమవారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు 11 కె.వీ.గోదాంగడ్డ ఫీడర్ పరిధిలోని శ్రీనగర్ కాలనీ, భవానీకాలనీ, సప్తగిరికాలనీ, తాహెర్ మజీద్, అంజనాద్రి ఆలయం, దోబీఘాట్, గోదాం, బీఎస్ఎఫ్ క్వార్టర్లు, ఏవోస్ పార్కుకాలనీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. -
నాకు నువ్వు వద్దు!
మూడుముళ్లు.. మూణ్నాళ్ల్లే!● తెగిపోతున్న వివాహ బంధాలు ● ఏడడుగులు నడిచిన కొన్నాళ్లకే.. ● ఠాణామెట్లు ఎక్కుతున్న యువ జంటలు ● పచ్చని కాపురాల్లో చిచ్చు ● పెరుగుతున్న గృహహింస దరఖాస్తులు ● కోర్టుల్లో నడుస్తున్న విడాకుల కేసులుధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ, నాతిచరామి..! అని ప్రమాణాలు చేసుకుని ఒకటవుతున్నారు. అగ్నిహోత్రం చుట్టూ.. ఏడడుగులు నడిచి.. మూడుముళ్లతో వివాహ బంధంలో అడుగిడుతున్నారు. జీలకర్ర.. బెల్లం తలపై పెట్టుకుని ఒకరికొకరు నూరేళ్లు కలిసుంటామని బాస చేసుకుని సరికొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకుని, జీవితంలో కష్టాసుఖాలను సమానంగా పంచుకోవల్సిన పలు కొత్త జంటలు ‘ఆధిపత్య’ పోరుతో ఆదిలోనే తమ నూరేళ్ల సంసార జీవితాన్ని ముక్కలు చేసుకుంటున్నారు. మూణ్నాళ్లకే ‘నాకు నువ్వు వద్దు’ అంటూ.. పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. కోర్టుల్లో విడాకులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. జిల్లాలో రోజురోజుకు ఠాణామెట్లు ఎక్కుతున్న జంటల సంఖ్య పెరుగుతుండగా.. జిల్లా కోర్టులోనూ విడాకుల కేసుల సంఖ్య అదేస్థాయిలో కొనసాగుతోంది. – కరీంనగర్క్రైంనమోదైన కేసులు: 330చిన్న చిన్న కారణాలతో.. ● నిండు నూరేళ్లు అన్యోన్యంగా జీవించాల్సిన కొన్ని జంటలు చిన్నచిన్న కారణాలతో మూడుముళ్ల బంధాన్ని తెంచుకుంటున్నాయి. ● బతుకుపోరులో.. ఉద్యోగాల వేటలో పెళ్లయిన వెంటనే దూర ప్రాంతాల్లో జీవిస్తూ.. వేరు కాపురాలు పెడుతున్నారు. ● ఉమ్మడి కుటుంబం ఊసే లేకపోతుండగా.. దంపతుల మధ్య అహం, అపార్థం, అనుమానాలు పెరుగుతున్నాయి. ● నాలుగు గోడల మధ్య సర్దుకుపోవాల్సిన విషయాలు రోడ్డెక్కుతున్నాయి. ● ఇద్దరి మధ్య అగాథం పెరిగి, పోలీసుస్టేషన్, కోర్టు మెట్లు ఎక్కేలా చేస్తున్నాయి. ● పెద్దలు కుదిర్చినా.. ప్రేమించి పెళ్లి చేసుకు న్నా.. చాలా జంటల్లో అదే తీరు కనిపిస్తోంది.అవగాహన అవసరం ● కొత్తగా పెళ్లయిన దంపతుల మధ్య విబేధాలు వచ్చినప్పుడు ఇరువురి తల్లిదండ్రులు నచ్చజెప్పాలి. సమస్యను ఓపిగ్గా విని, పరిష్కారానికి కృషి చేయాలి. ● అలా కాకుండా చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల నే రెచ్చగొడుతుండడం బాధ కలిగించే అంశమని మహిళా పోలీసు స్టేషన్‌కు చెందిన ఓ అధికారి వెల్లడించారు. ● అనుమానం, హింస, దాంపత్య బంధం విలువ తెలియకపోవడం, ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం, హంగుఆర్భాటాలకు పోయి ఆర్థిక పరిస్థితి చితికిపోయి, చిన్న కారణాలతోనే విడాకుల వరకు వెళ్తున్నారని, ఆవేశంతో కోర్టు మెట్లు ఎక్కుతున్నారని వివరించారు. ● ప్రేమ వివాహం చేసుకున్న వారు సైతం చాలామంది కొన్నాళ్లకే ఠాణామెట్లు ఎక్కుతున్నారని తెలిపారు. ● విడాకులు తీసుకుంటున్న, పోలీసుస్టేషన్‌కు వస్తున్న జంటల్లో ఎక్కువగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వారే ఉంటున్నారని ఓ సీనియర్ కౌన్సిలర్ పేర్కొన్నారు.పెండింగ్‌లో ఉన్నవి: 1113,116కౌన్సెలింగ్‌తో పరిష్కరించినవిజిల్లాలో ఐదేళ్లుగా గృహహింస కేసులుపోలీసులకు వచ్చిన ఫిర్యాదులు3,557 ఐదేళ్లలో కరీంనగర్ కోర్టులో నడుస్తున్న విడాకుల కేసులుపరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నవారుకోర్టులో పెండింగ్‌లో ఉన్న విడాకుల కేసులు: 288580కోర్టులో కేసులతో విడాకులు తీసుకున్నవారు: 208 -
అన్నదాతపై హమాలీ భారం
వీణవంక(హుజూరాబాద్): ఆరుగాలం శ్రమించి పండించిన ఉత్పత్తులను కొనుగోలు కేంద్రాలకు తరలిస్తే హమాలీ లోడింగ్ ఖర్చు రైతులకు తడిసి మోపెడవుతుంది. కొన్ని గ్రామాల్లోని కేంద్రాల్లో హమాలీలకు ఒక్కో బస్తాకు (40కిలోలు) రూ.20 నుంచి రూ.25 రైతులు ఇస్తుండగా, మరికొన్ని ప్రాంతాలలో క్వింటాల్‌కు రూ.60 ఇస్తున్నారు. గతంలో హమాలీ చార్జి ప్రభుత్వమే చెల్లించేది. దీంతో అన్నదాతపై కొంత భారం తగ్గేది. కానీ, 2017 రబీ సీజన్ నుంచి ప్రభుత్వం చేతులెత్తేసింది. మద్దతు ధర క్వింటాల్‌కు గ్రేడ్ ఏ రూ.2,320, కామన్ రకం రూ.2,060 ఉండగా, ఇందులో హమాలీలకు రూ.60 రైతులే చెల్లిస్తుండగా, మిల్లుల వద్ద దిగుమతి చేసేందుకు క్వింటాల్‌కు రూ.2 చొప్పున ఇస్తున్నారు. ధాన్యం తరలించేందుకు టన్నుకు రూ.200 చొప్పున ప్రభుత్వం ఇస్తుంది. కానీ ట్రాక్టర్ యజమానులకు గిట్టుబాటు కాకపోవడంతో రైతుల వద్ద అదనంగా మరో రూ.100 తీసుకుంటున్నారు. ఊపందుకున్న కోతలు కరీంనగర్ జిల్లావ్యాప్తంగా వరి కోతలు ఊపందుకున్నాయి. ఈ యాసంగిలో నాట్లు వేసిన వారం నుంచి మొగిపురుగు ఆశించి రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. పంటను కాపాడుకునేందుకు రసాయన మందులు వాడారు. ఎకరాకు రూ.30వేల పెట్టుబడి పెట్టగా దిగుబడి అంతంతే వస్తుందని రైతులు వాపోతున్నారు. యాసంగిలో 2.60లక్షల ఎకరాల్లో వరి సాగులోకి వచ్చినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు 80వేల ఎకరాల్లో కోతలు కోశారు. జిల్లావ్యాప్తంగా 249 కేంద్రాలను అధికారులు కేటాయించగా కొన్ని ప్రాంతాల్లో సెంటర్లు ప్రారంభమయ్యాయి. కాగా, ఇప్పటికే హమాలీలు సమావేశాలు నిర్వహించుకొని 20శాతం ధరలు పెంచేందుకు నిర్ణయించుకున్నారు. చేతులెత్తేసిన ప్రభుత్వం గతంలో క్వింటాల్‌కు రూ.5.30 చొప్పున ప్రభుత్వం హమాలీలకు చెల్లించేది. మిగిలిన డబ్బులు రైతులు కలుపుకొని ఇచ్చేవారు. దీంతో అన్నదాతలకు కొంత ఊరట లభించేది. 2017 నుంచి ప్రభుత్వం చేతులెత్తేయగా, అప్పటి నుంచి రైతులపై భారం పడుతుంది. హమాలీలు ధాన్యం ఎత్తడం, తూకం వేయడం చేయాలి. కానీ కొన్ని గ్రామాల్లో కేవలం తూకం మాత్రమే వేస్తున్నారు. దీంతో ధాన్యం ఎత్తడం రైతులకు ఇబ్బందిగా మారింది. ధాన్యం ఎత్తడం కోసం అదనంగా బస్తాకు రూ.8 కూలీలకు ఇవ్వాల్సి వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. పెరిగిన పెట్టుబడులకు మద్దతు ధర సరిపోతలేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికై నా పౌరసరఫరాల శాఖ మంత్రి చొరవ తీసుకొని హమాలీ చార్జీలు పూర్తిగా ప్రభుత్వమే భరించేలా చూడాలని రైతులు కోరుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తడిసి మోపెడవుతున్న ఖర్చులు క్వింటాల్‌కు రూ.55 చెల్లిస్తున్న రైతులు 2017కు ముందు క్వింటాల్‌కు రూ.5.30 ఇచ్చిన ప్రభుత్వం తర్వాత చేతులెత్తేసిన సర్కార్ ప్రభుత్వమే చెల్లించాలంటున్న రైతులు ప్రభుత్వమే చెల్లించాలి రెండెకరాల్లో దొడ్డురకం వరి సాగు చేస్తే రెండురోజుల క్రితం కోత కోసిన. వాతావరణ మార్పులు, తెగుళ్లతో ఈసారి ఆశించిన దిగుబడి వచ్చేలా కనిపిస్తలేదు. ఎకరాకు రూ.25వేల పెట్టుబడి పెట్టిన. హమాలీలకు ప్రభుత్వం చెల్లిస్తే కొంత భారం తగ్గుతుంది. ప్రభుత్వం కలుగజేసుకొని భారం తగ్గించాలి. – సంపత్, రైతు, వీణవంక -
యాదాద్రి జిల్లాలో మామిడిపల్లివాసి మృతి
కోనరావుపేట(వేములవాడ): కోనరావుపేట మండలం మా మిడిపల్లి గ్రామానికి చెందిన తీపిరెడ్డి సుదర్శన్‌రెడ్డి(55) యా దాద్రి భువనగిరి జిల్లాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు తెలిసింది. మామిడిపల్లికి చెందిన తీపిరెడ్డి దేవరెడ్డి–కమలవ్వ దంపతుల కుమారుడు సుదర్శన్‌రెడ్డి కొన్నేళ్లుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉంటున్నా డు. మావోయిస్టు, మాజీ నక్సలైట్ పేరుతో సెటిల్మెంట్లు, రియల్ఎస్టేట్, పలువురిని బెదిరించిన ఘ టనలున్నాయి. కొన్నేళ్ల క్రితం గ్రామం నుంచి వెళ్లిపోయిన సుదర్శన్‌రెడ్డి హైదరాబాద్ వెళ్లి ఆత్మరక్షణ కో సం గన్ లైసెన్స్ తీసుకున్నాడు. 2000 సంవత్సరంలో హైదరాబాద్‌లో రివాల్వర్ కొనుగోలు చేసి సెటిల్మెంట్లు, రియల్ ఎస్టేట్ చేసి అప్పులపాలయ్యాడు. 2024 మే లో మావోయిస్ట్‌నని సిరిసిల్లలోని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడికి ఫోన్‌చేసి డబ్బు డిమాండ్ చేయగా బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. 2024 అక్టోబర్‌లో వనపర్తి జిల్లా రైస్‌మిల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడికి డబ్బుల కోసం ఫోన్ చేసి పోలీసులకు చిక్కాడు. వీటితో పాటు పలు రకాల కేసులు న మోదై ఉన్నాయి. మోత్కూరు మండలం పొడిచేడు గ్రామ బస్టాండ్ పక్కన మృతిచెంది ఉన్నట్లు ఆది వారం సమాచారం అందింది. మృతుడికి భార్య, కొ డుకు, కూతురు ఉన్నారు. కుమారుడు అమెరికాలో ఉండగా, కూతురు ఎంబీబీఎస్ చదువుతోంది. -
చిన్నారిని ఛిదిమేసిన కారు
● మూడేళ్ల బాలుడు మృతి ● కన్నీరుమున్నీరుగా విలపించిన తల్లిదండ్రులు గోదావరిఖని(రామగుండం): రెండోకాన్పు కోసం తల్లిగారింటికి వచ్చింది.. పండంటి పాపకు జన్మనిచ్చింది. అంతా సంతోషంగా ఉన్న సమయంలో ఆమె మొదటి సంతానం మూడేళ్ల బాలున్ని కారు రూపంలో మృత్యువు బలితీసుకుంది. గోదావరిఖని వన్‌టౌన్ ఎస్సై భూమేశ్ కథనం ప్రకారం.. స్థానిక గంగానగర్‌లో శివరాజ్‌కుమార్(3) ఆదివారం కారు ఢీకొని మృతిచెందాడు. ముత్తారం మండలం మచ్చుపేట గ్రామానికి చెందిన పులిపాక రమేశ్ కొండగట్టు జేఎన్టీయూలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడికి గంగానగర్‌కు చెందిన సంధ్యతో వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల శివరాజ్‌కుమార్ ఉండగా, సంధ్య రెండో కాన్పుకోసం తల్లిగారింటికి గంగానగర్ వచ్చింది. పాప జన్మించి మూడు నెలలు అయ్యింది. ఆదివారం కుటుంబ సభ్యులతో శివరాజ్‌కుమార్ ఆడుకుంటూ అనుకోకుండా ఒక్కసారిగా రోడ్ పైకి రాగా, మంచిర్యాల్ నుంచి గంగానగర్‌కు వెళ్తున్న కార్ ఢీకొట్టింది. ఈప్రమాదంలో శివరాజ్‌కుమార్ మెడపై భాగంలో గాయాలయ్యాయి. స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి, అక్కడ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అప్పటివరకు అందరితో ఆడుకుంటూ క్షణాల్లో మాయమైన కుమారున్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించడం అందరినీ కంటతడి పెట్టించింది. -
వ్యాధులు వచ్చే ప్రమాదం
ఒకప్పుడు అందరం విస్తరాకులు వాడేవాళ్లం. ఇప్పుడు ఏ వేడుకలోనైనా ప్లాస్టిక్ప్లేట్లు వినియోగిస్తున్నారు. వీటితో అనారోగ్యం, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. వీలైనంతలో ప్లాస్టిక్ప్లేట్లు, డిస్పోజల్ గ్లాసులకు దూరంగా ఉండడం మంచిది. ప్లాస్టిక్‌తో ఉన్న అనర్థాలను గుర్తించి ఇప్పటికై నా స్టీల్‌ప్లేట్లను వాడుతూ..అనారోగ్యాలకు దూరంగా ఉండాలి. – సత్యనారాయణస్వామి, ఎల్లారెడ్డిపేట వేసవిలో చేతినిండా పని.. ఎండాకాలం వచ్చిందంటే చేతి నిండా పని ఉండేది. ఇంటిల్లిపాదిమి అడవికి పోయి మోదుగాకులు తెంపుకొచ్చేవాళ్లం. మ ళ్లీ ఇంటి వద్ద అందరం కలిసి వి స్తరాకులు కుట్టేవాళ్లం. ఎవరైనా పండుగ చేసుకుంటే మా దగ్గరికే వచ్చి కొనుక్కొని పోయేటోళ్లు. కానీ ఇప్పుడందరూ ప్లాస్టిక్ప్లేట్లే కొంటున్నారు. విస్తరాకుల కోసం ఎవరూ రావడం లేదు. ఇంటి వరకే విస్తర్లను తయారు చేసుకుంటున్నాము. – మోతె భారతమ్మ, నారాయణపూర్ ఒకప్పుడు ఉపాధి ఉండేది గతంలో మారుమూల తండాల్లో నివసించే గిరిజనులం మోదుకు విస్తర్లు తయారు చేసి అమ్ముకొని వచ్చిన ఆదాయంతో కుటుంబాలను పోషించుకునే వాళ్లం. మార్కెట్లోకి ప్లాస్టిక్ప్లేట్లు రావడంతో ఉపాధి కోల్పోయాం. మాతరం వారంతా ఇప్పటికీ మోదుకు విస్తర్లనే కుట్టుకుంటున్నాం. ఇంట్లో జరిగే శుభకార్యాలకు మోదుగు విస్తర్లనే వాడుతున్నాం. బయట మాత్రం మోదుగు విస్తర్లు కనిపించడం లేదు. – భూక్య పీక్లీ, గుంటపల్లిచెరువు తండా -
ఆర్థిక ఇబ్బందులతో గీతకార్మికుడి ఆత్మహత్య
ఓదెల(పెద్దపల్లి): ఆర్థిక ఇబ్బందులతో శనివారం రాత్రి మండలంలోని పొత్కపల్లికి చెందిన గీతకార్మికుడు సుదగొని తిరుపతి(50) కాజీపేట్– బల్లార్షా సెక్షన్ల మధ్య సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రామగుండం జీఆర్పీఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ తెలిపిన వివరాలు.. తిరుపతి ఏడేళ్ల క్రితం హైదరాబాద్‌లోని ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేశాడు. అప్పుచేసి చిన్నకూతురు వివాహం చేశాడు. అప్పులు చెల్లించక, ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ పేర్కొన్నారు. అనారోగ్యంతో బాలుడు మృతిమెట్పల్లిరూరల్(కోరుట్ల): మెట్పల్లి మండలం అల్లూరి సీతారామరాజు తండాకు చెందిన జరుపుల హరిప్రసాద్(12) అనారోగ్యంతో మృతిచెందాడు. పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఆరో తరగతి పూర్తి చేసుకున్న హరిప్రసాద్ ఇటీవలే సెలవుల్లో భాగంగా ఇంటికి వెళ్లాడు. శనివారం అనారోగ్యంగా ఉందని కుటుంబసభ్యులకు చెప్పడంతో ఆసుపత్రిలో చూపించారు. మళ్లీ ఆదివారం కడుపులో ఆయాసంగా ఉందని చెప్పడంతో మధ్యాహ్నం మెట్పల్లి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా, కొద్దిసేపటికే బాలుడు మృతిచెందాడని వైద్యులు తెలిపారు. చికిత్సపొందుతూ అంగన్వాడీ టీచర్.. హుజూరాబాద్: పట్టణంలోని కుమ్మరివాడలో గల అంగన్వాడీ కేంద్రంలో టీచర్‌గా పనిచేస్తున్న గన్నారపు సంధ్య(33) చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. ఈ నెల 16న సంధ్య అనారోగ్యానికి గురికాగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ట్రాక్టర్ ఢీకొని రైతు.. ఓదెల(పెద్దపల్లి): మండలంలోని గుండ్లపల్లె గ్రామానికి చెందిన ఎడెల్లి రాజిరెడ్డి (80) ఆదివారం మధ్యాహ్నం ట్రాక్టర్ ఢీకొని మృతిచెందాడు. రాజిరెడ్డి పొలం కోస్తుండగా ఇదే గ్రామానికి చెందిన ట్రాక్టర్ట్రాలీ వెనుకనుంచి ఢీకొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. సుల్తానాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్లు సమాచారం. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పొత్కపల్లి ఎస్సై రమేశ్ తెలిపారు. యువకుడిపై పోక్సో కేసు?తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపట్ల సిరిసిల్ల పట్టణానికి చెందిన యువకుడు అనుచితంగా ప్రవర్తించడంతో అతడిపై తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదు అయినట్లు తెలిసింది. శనివారం యువకుడి పుట్టినరోజు సందర్భంగా స్నేహితులతో కలిసి వెళ్లి యువతి పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు సమాచారం. కాగా ఈ విషయంపై తంగళ్లపల్లి ఎస్సై రామ్మోహన్‌ను వివరణ కోరగా.. కేసు నమోదైంది వాస్తవమేనని, పోక్సో చట్టం కావడంతో వివరాలు వెళ్లడించలేమని తెలిపారు. -
కారును ఢీకొన్న లారీ.. 9 మందికి గాయాలు
జగిత్యాలక్రైం: దైవ దర్శనానికి వచ్చిన భక్తులు రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఘటన ఆదివారం జగిత్యాల రూరల్ మండలంలో జరిగింది. స్థాని కుల వివరాలు.. నిర్మల్ జిల్లా దివాల్పూర్కు చెందిన కడెం శ్రీరాం, ల్యాండ్రి మున్నా, దన్నూరి ప్రణీత్, కారెపు రుషి, కడెం విశ్వంత్, భూమేశ్, రిషికరుణ్, నిమ్మల నర్సయ్య, కారే మధు ఆదివారం కొండగట్టు దైవదర్శనానికి వచ్చారు. అక్కడి నుంచి ధర్మపురి పుణ్యక్షేత్రానికి వెళ్లారు. స్వామివారి దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న లారీ, కారును ఢీకొనడంతో కారులోని 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా, కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలించారు. రూరల్ ఎస్ఐ సదాకర్ ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. -
ఖమ్మంపల్లిలో వే బ్రిడ్జిపై కొరడా
ముత్తారం(మంథని): ఖమ్మంపల్లిలోని అసైన్డ్ భూమిలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న వే బ్రిడ్జిపై చర్యలు తీసుకోవాలనే స్థానికుల ఫిర్యాదుల మేరకు అధికారులు శనివారం స్పందించారు. ట్రాన్స్ఫార్మర్ నుంచి తీసుకున్న విద్యుత్ కనెక్షన్‌ను అధికారులు తొలిగించారు. వే బ్రిడ్జి నిర్వాహకులపై కేసు నమోదు చేస్తామని ట్రాన్సకో ఏఈ సంతోష్ రెడ్డి తెలిపారు. మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీధర్, సర్వేయర్ రాజశేఖర్ వే బ్రిడ్జిని పరిశీలించారు. అసైన్డ్భూమి అని, దీనిని లీజుకు ఇవ్వకూడదన్నారు. ఉన్నతాధికారులకు దీనిపై నివేదిస్తామని ఆర్ఐ శ్రీధర్ తెలిపారు. అనుమతిలేని వే బ్రిడ్జి నిర్వాహకులకు నోటీసులు జారీ చేశామని పంచాయతీ కార్యదర్శి బద్రు తెలిపారు. -
స్వగ్రామానికి శ్రీనివాస్ మృతదేహం
ధర్మపురి: దుబయిలో పాకిస్థానీ యువకుడి చేతిలో ఈనెల 11 హత్యకు గురైన మండలంలోని దమ్మన్నపేట గ్రామానికి చెందిన స్వర్గం శ్రీనివాస్ మృతదేహం శనివారం స్వగ్రామానికి చేరింది. శ్రీనివాస్ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి కంటతడి పెట్టారు. అంత్యక్రియల్లో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పాల్గొన్నారు. శ్రీనివాస్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆయన కుటుంబానికి ఎన్ఆర్ఐ పాలసీ కింద రూ.5లక్షలతోపాటు కుటుంబంలో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు ఇప్పించేలా చూస్తానని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి రూ.25లక్షలు ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు, గ్రామస్థులు తదితరులున్నారు. -
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ట్రినిటీ సత్తా
కరీంనగర్: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ట్రినిటీ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తాచాటారు. ఎ.రఘుపతి జాతీయస్థాయిలో 138వ ర్యాంకు, ఎ.హేమంత్ 162, డి.సాయిచరణ్కుమార్ 313, ఎస్.పరమేశ్వరరెడ్డి 344, ఎ.ఫనీందర్ 409, ఆర్.సాయికిశోర్ 587, వి.అదీప్ 751, డి.మహేశ్ 974, ఆర్.మనోజ్ 1,262, బి.సిద్ధిక 1,551 ర్యాంకు సాధించారు. కేవలం కరీంనగర్ బ్రాంచ్ నుంచి 1,000 లోపు 8 ర్యాంకులు, పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో 83 శాతం మంది ఉత్తమ ర్యాంకులతో జేఈఈ–అడ్వాన్స్ పరీక్షలకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ దాసరి మనోహర్‌రెడ్డి ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. అడ్వాన్డ్స్ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ దాసరి ప్రశాంత్‌రెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ బ్రాంచ్‌ల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. -
శ్రీచైతన్య విజయకేతనం
కరీంనగర్: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థులు జాతీయస్థాయిలో అద్భుత ర్యాంకులు సాధించారు. ఎం.రోహిత్ 17, టి.కుందన్ 814, పి.ఈశ్వర్ ముఖేశ్ 1,275, ఎం.అంజలి 2,575, బి.అక్షర 2,992, ఎం.తరుణ్ 5,949, నందిని7,464 ర్యాంకు, 20 వేల లోపు 15 మంది ర్యాంకులు సాధించారు. పరీక్షకు హాజరైన వారిలో 40 శాతం మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌కు క్వాలీపై అయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ, సంస్థ స్థాపించిన నాటి నుంచి అన్ని పోటీ పరీక్షల్లో శ్రీచైతన్య విద్యార్థులు రాణిస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపక బృందానికి అభినందనలు తెలిపారు. కళాశాల డైరెక్టర్ కర్ర నరేందర్‌రెడ్డి, డీన్ జగన్మోహన్రెడ్డి, ప్రిన్సిపాల్స్ మల్లారెడ్డి, రాధాకృష్ట, మోహన్‌రావు, ఏజీఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తిమ్మాపూర్: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఎస్ఆర్ కళాశాలల విద్యార్థులు ప్రతిభచాటారు. కళాశాలకు చెందిన 13 మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారని కళాశాలల జోనల్ ఇన్చార్జి తిరుపతి తెలిపారు. అలుగునూర్లోని ఎస్ఆర్ కళాశాల ఆవరణలో మాట్లాడారు. విద్యార్థులు వై.భరణిశంకర్ జాతీయస్థాయిలో 88వ ర్యాంకు, బి.సురేశ్ 98, ఎ.కార్తిక్ 584, లకావత్ మాధవ్చరన్ 707, లునావత్ రామ్‌చరణ్ 777, పత్తెం హృషికేశ్ 796వ ర్యాంకు సాధించగా, మరో ఏడుగురు 6 వేలలోపు ర్యాంకులు సాధించినట్లు వివరించారు. ఇంతటి విజయాన్ని అందించి, కళాశాలకు పేరు తీసుకొచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను విద్యాసంస్థల అధినేత వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి, కరీంనగర్ డీజీఎం వాసుదేవరెడ్డి, ప్రిన్సిపాల్స్ ప్రత్యేకంగా అభినందించారు. ఎస్ఆర్ ప్రభంజనం -
కలెక్టర్ కారుకు ఫైన్
గోదావరిఖని: కలెక్టర్ కారు వేగంగా వెళ్తోంది. హైవే వెంట నిర్ణీత స్పీడ్‌ను మించి ప్రయాణించడంతో పోలీసులు ఇటీవల ీస్పీడ్గన్ ద్వారా వేగాన్ని గుర్తించి నాలుగు ఫైన్లు వేశారు. ప్రధానంగా పెద్దపల్లి నుంచి కరీంనగర్‌వైపు వెళ్తుండగా, ముగ్ధుంపూర్వైవు వెళ్తుండగా మూడు ఫైన్లు విధించారు. అలాగే నుస్తులాపూర్ వద్ద హైస్పీడ్‌తో వెళ్తుండగా మరో ఫైన్ పడింది. టీఎస్ –220001 ఇన్నోవా వాహనంపై నాలుగు ఫైన్ల పేరిట రూ.4,140 ఫైన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల ఓ మీటింగ్‌కు వచ్చిన కలెక్టర్ కారును స్థానికులు ఈ – చాలన్‌లో చెక్‌చేయగా ఇవి బయపడ్డాయి.సప్తగిరి ఆస్పత్రి గుర్తింపు రద్దుజమ్మికుంట(హుజూరాబాద్): పట్టణంలోని సప్తగిరి ఆస్పత్రిలో సీఎంఆర్ఎఫ్ నకిలీ బిల్లుల సృష్టించి డబ్బులు కాజేసిన వ్యవహారంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆస్పత్రి గుర్తింపును రద్దు చేసినట్లు డిప్యూటీ డీఎంహెచ్‌వో డా.చందు తెలిపారు. శనివారం ఆస్పత్రిని పరిశీలించారు. ఆస్పత్రి నిర్వహణ చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా నకిలీ బిల్లుల వ్యవహారంపై 2023లో సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. నకిలీ బిల్లులతో డబ్బులు కాజేసినట్లు విచారణలో తేలింది. -
గ్రావిటి కాలువలో దూకి వ్యక్తి ఆత్మహత్య
రామడుగు(చొప్పదండి): రామడుగు మండలం గోపాల్రావుపేట గ్రామానికి చెందిన పురాణం సాగర్ (30) రామడుగు సమీపాన గల గాయత్రి పంపుహౌజ్ నుంచి వెళ్లే గ్రావిటి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై రాజు తెలిపిన వివరాలు.. సాగర్‌కు పురాణం పద్మతో 9 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. కాగా సాగర్ కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. వ్యాధి తీవ్రత ఎక్కువ కావడంతో శుక్రవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన సాగర్ రామడుగు సమీపాన ఉన్న గ్రావిటి కాలువలో బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దేశాయిపల్లిలో వృద్ధుడు.. బోయినపల్లి(చొప్పదండి): నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతు న్న మండలంలోని దేశాయిపల్లికి చెందిన వృద్ధుడు సంది దుర్గారెడ్డి(80) క్రిమిసంహారక మందు తాగగా.. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. ఎస్సై పృథ్వీధర్ తెలిపిన వివరాలు. దుర్గారెడ్డి కొంతకాలంగా నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఎన్ని మందులు వా డినా తగ్గలేదు. దీంతో జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఇంట్లో పురుగుల మందు సేవించాడు. కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని భార్య సంది లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కుటుంబ కలహాలతో ఒకరు.. కోరుట్లరూరల్: కోరుట్ల పట్టణంలోని సాయిరాంపుర కాలనీకి చెందిన ఎలిగేటి శ్రీహరి (36) శనివారం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడిపల్లి మండలం మన్నెగూడెం గ్రామానికి చెందిన శ్రీహరి ఉపాధి నిమిత్తం కొన్నేళ్లు గల్ఫ్ వెళ్లి వచ్చాడు. సాయిరాంపురలో ఇట్లు కట్టుకుని భార్య లాస్య, కుమారుడు హర్ష, కూతురు నేహతో కలిసి ఉంటున్నాడు. కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. శనివారం కూడా ఇద్దరూ గొడవ పడ్డారు. పిల్లలు స్కూల్‌కు వెళ్లగా.. భార్య ఇంటి బయట పనులు చేసుకుంటోంది. ఇంతలో శ్రీహరి బెడ్రూంలోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. భార్య వచ్చి చూసి పక్కింటివారిని పిలిచి చూడగా అప్పటికే మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. లాస్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
గల్లంతయిన బాలుడు శవమై..
మల్లాపూర్: మండలకేంద్రం శివారులోని లింగన్న చెరువులో గల్లంతయిన బాలుడు పుట్ట రాజేశ్ (13) శవమై కనిపించాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండలకేంద్రంలోని దుర్గమ్మకాలనీకి చెందిన పుట్ట పోశెట్టి, కవిత దంపతుల పెద్దకుమారుడు రాజేశ్ పశువులను మేపడానికి శుక్రవారం వెళ్లాడు. లింగన్న చెరువులో స్నానం చేసేందుకు దిగాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. ఎస్సై రాజు సిబ్బందితో ఘటనస్థలికి వెళ్లి గ్రామస్తులు, గజ ఈతగాళ్ల సహాయంతో గాలించారు. ఈక్రమంలో శనివారం ఉదయం చెరువులో శవమై పైకి తేలాడు. రాజేశ్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
విద్యుత్ మోటారు దొంగల అరెస్ట్
ఓదెల(పెద్దపల్లి): మద్యానికి బానిసై, బెట్టింగ్‌లకు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో విద్యుత్ పంపుసెట్లు చోరీచేస్తున్న దొంగల ముఠాను పోలీసులు పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు. పొత్కపల్లి పోలీస్‌స్టేషన్‌లో శనివారం పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, ఏసీపీ కృష్ణ వివరాలు వెల్లడించారు. ఓదెల గ్రామానికి చెందిన సిరిగిరి ప్రసాద్, అంగిడి సాయికుమార్ కొంతకాలం క్రితం మద్యానికి బానిసయ్యారు. బెట్టింగ్‌లు పెడుతున్నారు. జల్సాలకు అలవాటుడపడ్డారు. చేతిలో డబ్బు లేకపోవడంతో కరెంట్ మోటార్లు చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలోనే జూలపల్లి, కాల్వశ్రీరాంపూర్, పొత్కపల్లి, సుల్తానాబాద్ పోలీస్స్టేషన్ల పరిధిలో వ్యవసాయబావుల వద్ద ఏర్పాటు చేసుకున్న కరెంట్ మోటర్లు, సర్వీసువైర్లను దొంగిలించారు. ఇందుకోసం ఆటోలో తిరుగుతున్నారు. ఈక్రమంలో పోలీసులు 13 కేసులు నమోదు చేశారు. నిఘా తీవ్రతరం చేశారు. దీంతో శనివారం ఎస్సై రమేశ్ వాహనాలను తనిఖీ చేస్తుండగా 39 కరెంట్ మోటార్లు, సర్వీసు వైర్లు, ఆటోట్రాలీ లభించగా వాటిని స్వాధీనం చేసుకున్నారు. కాచాపూర్, కోనరావుపేట, రూపునారాయణపేట, కొలనూర్, శివపల్లి, మడిపల్లి గ్రామాల్లో వీటిని చోరీ చేసినట్లు నిందితులు తెలిపారు. ఇందుకు బాధ్యులైన సిరిగిరి ప్రసాద్, అంగిడి సాయికుమార్‌ను అరెస్టు చేసి, విద్యుత్ మోటార్లతో పాటు ఆటోట్రాలీ, సర్వీసు వైర్లు..మొత్తంగా రూ.10,67,500 విలువైన సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, పొత్కపల్లి ఎస్సై రమేశ్ పాల్గొన్నారు. కాగా, దొంగలను పట్టుకున్న ఎస్సై రమేశ్, ఏఎస్సై అశోక్, హెడ్‌కానిస్టేబుళ్లు కిషన్, ప్రవళిక, కానిస్టేబుళ్లు రాజేందర్, వెంకటేశ్, రవి, రాజు, శివశంకర్, శంకర్, రామకృష్ణ, అశోక్, సతీశ్, రజిత, దనలక్ష్మి, తేజస్వీనికి డీసీపీ, ఏసీపీ రివార్డులు అందజేశారు. 39 వ్యవసాయ పంపుసెట్లు, సర్వీసు వైర్లు స్వాధీనం పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, ఏసీపీ కృష్ణ వెల్లడి -
ఎంఆర్ఎఫ్ కేసు రాజకీయ ప్రేరేపితం
ఆదివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025● ఆధారాలు లేకుండా వేసిన పనికిమాలిన వ్యాజ్యం ● విలువైన సమయాన్ని వృథా చేసినందుకు పిటిషనర్‌కు రూ.లక్ష జరిమానా ● మానేరు రివర్‌ఫ్రంట్‌పై దాఖలైన వ్యాజ్యాన్ని కొట్టేసిన ఎన్జీటీ ● కేసు ఎవరు వేయించారో కాల్‌రికార్డ్స్ వెల్లడిస్తానన్న కమలాకర్సాక్షిప్రతినిధి,కరీంనగర్: మానేరు రివర్‌ఫ్రంట్‌తో మానేరు నదికి, డ్యామ్‌కు నష్టం వాటిల్లుతుందని, నదిలో జీవరాశులు, పర్యావరణంగా ఇబ్బంది కలుగుతుందని అభ్యంతరం తెలుపుతూ దాఖలైన వ్యాజ్యాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) కొట్టేసింది. ఈక్రమంలో పలుకీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఇది కేవలం రాజకీయ ప్రేరేపిత వ్యాజ్యంలా అనిపిస్తోంది. ఎలాంటి సహేతుకమైన ఆధారాలు లేకుండా దాఖ లు చేసిన పిటిషన్ కాబట్టి ధర్మాసనం వ్యాజ్యాన్ని కొట్టివేసింది. పనికిమాలిన పిటిషన్‌తో ధర్మాసనం సమయం వృథా చేశారు’ అని వ్యాఖ్యానించింది. పనికిమాలిన పిటిషన్ ఇది.. అకారణంగా ధర్మాసనం సమాయాన్ని వృథా చేసినందుకు రూ.లక్ష జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. తాము చేపట్టే వరద నియంత్రణ చర్యలకు ఎలాంటి పర్యావరణ అనుమతులు అవసరం లేదని ఇటీవల నీటిపారుదల శాఖ ట్రిబ్యునల్‌కు దాఖలు చేసిన అఫిడవిట్లో దాఖలు చేసింది. పర్యావరణశాఖ కూడా తాము చేపట్టే పనులకు ఎలాంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్‌లు అక్కర్లేదని స్పష్టంచేసింది. వీరితోపాటు కాంట్రాక్టర్ రాసిన లేఖను కూడా ధర్మాసనానికి అందజేశారు. నీటిపారుదల, పర్యాటకం, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) తదితర శాఖలు ధర్మాసనంలో దాఖలు చేసిన అఫిడవిట్లను, కేసు పూర్వపరాలను పరిశీలించిన ట్రిబ్యునల్ ఇది కేవలం రాజకీయ ప్రేరేపిత కేసుగా అభివర్ణించింది. ఆరోపణలకు అనుగుణంగా ఎలాంటి కారణాలు చూపించలేకపోయారని వ్యాఖ్యానించింది. విలువైన సమయాన్ని వృథా చేసినందుకు కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన ఎం. వెంకటరెడ్డికి రూ.లక్ష (ఎన్జీటీ సౌత్‌జోన్)కు చెల్లించాలని తీర్పునిచ్చింది. అందులో రూ.50 వేలు మొక్కలు నాటేందుకు, రూ.25 వేలు పర్యావరణ న్యాయసూత్రాల పుస్తకాల కొనుగోలుకు, మిగిలిన రూ.25 వేలు ఎన్జీటీకి వచ్చే లిటిగేంట్ల మౌలిక సదుపాయాల కోసం వినియోగించనున్నట్లు పేర్కొంది. త్వరలో కాల్ రికార్డ్ బయటపెడతా ఈ విషయంలో నేను మొదటినుంచి ఆరోపిస్తున్నదే నిజమైంది. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కేసు అని ఎన్జీటీ పేర్కొనడమే ఇందుకు నిదర్శనం. ఈ కేసు ఎవరు వేయించారో? కేసు వేసే ముందు, వేసిన తరువాత ఎవరు ఎవరితో మాట్లాడారో కాల్ రికార్డ్స్ బయటపెడతా. వారిని ప్రజల ముందు దోషిగా నిలబెడతా. కేవలం కమీషన్ల కోసం కక్కుర్తి పడి రూ.546 కోట్లు విడుదలైన అభివృద్ధి పనిని అడ్డుకునే యత్నం కోర్టు మొట్టికాయలు వేయడంతో బెడిసికొట్టినట్లయింది. ఎంఆర్ఎఫ్ ప్రాజెక్టు పూర్తయితే బీఆర్ఎస్ పార్టీకి, గంగుల కమలాకర్‌కు పేరు వస్తుందన్న కుట్రతో కేసు వేయించారు. ఇప్పటికై నా కళ్లు తెరిచి, అభివృద్ధికి సహకరించాలి. ఇక మానేరు రివర్ ఫ్రంట్ విషయంలో ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ నాయకులపై కోర్టులో కేసు వేస్తాం. – మాజీ మంత్రి గంగుల కమలాకర్ మానేరు రివర్‌ఫ్రంట్ నమూనా చిత్రం -
రజతోత్సవ సభకు తరలిరండి
తిమ్మాపూర్/గన్నేరువరం: హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీసంఖ్యలో తరలిరావాలని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పిలుపునిచ్చారు. తిమ్మాపూర్, గన్నేరువరంలో శనివారం రజతోత్సవ సభ పోస్టర్ ఆవిష్కరించారు. మానకొండూర్ నియోజకవర్గం నుంచి 10వేల మందికి పైగా తరలించాలన్నారు. తిమ్మాపూర్‌లో జరిగిన కా ర్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రావుల రమేశ్, కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, ఉల్లెంగుల ఏకానందం, ల్యాగల వీరారెడ్డి, మాతంగి లక్ష్మ ణ్, గన్నేరువరంలో జరిగిన కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మాడుగుల రవీందర్‌రెడ్డి, బీఆ ర్ఎస్ మండల అధ్యక్షుడు గంప వెంకన్న, అంజనేయులు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమ పార్టీ సీపీఐ చిగురుమామిడి: కార్మిక, కర్షక,బలహీన వర్గాల కోసం ఉద్యమించిన చరిత్ర సీపీఐది అని పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. చిగురుమామిడి మండలం రేకొండ, ఓగులాపూర్, రామంచ, ముదిమాణిక్యం, సుందరగిరి, చిన్నముల్కనూర్ గ్రామాల్లో శనివారం సీపీఐ గ్రామశాఖల మహాసభలు నిర్వహించారు.చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చిగురుమామిడి మండలంలో అత్యధిక సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలు గెలుచుకోవాలని పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందె స్వామి, బోయిని అశోక్, కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కాంతాల శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు అందె చిన్నస్వామి, చాడ శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు. ‘మనిషిని మార్చగల శక్తి కథకు ఉంటుంది’ కరీంనగర్‌కల్చరల్: సమాజంలో ఉన్న రుగ్మతలను తొలగించి మనిషిని మార్చగల శక్తి కథకు ఉందని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయాల జాయింట్ సెక్రటరీ జీవీ.శ్యామ్ ప్రసాద్ లాల్ పేర్కొన్నారు. జాతీయ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో ప్రముఖ కథా రచయిత కటుకోజ్వల మనోహరాచారి రచించిన ‘వారధి’ కథాసంపుటిని శనివారం భగవతి విద్యానికేతన్‌లో ఆవిష్కరించారు. ముఖ్యఅతిథిగా హాజ రైన శ్యామ్ ప్రసాద్ లాల్ మాట్లాడుతూ.. కథకు సాహిత్యంలో ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు గాజుల రవీందర్, బలగం నటుడు ఏలేశ్వరం సత్యం, భగవతి విద్యాసంస్థల అధినేత బి.రమణారావు, కవులు గండ్ర లక్ష్మణరావు, బెజ్జారపు వినోద్ కుమార్, స్తంభంకాడి గంగాధర్, అనంతోజు పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
అన్నదమ్ములే ఏటీఎం దొంగలు
● ఖాతాదారులు విత్‌డ్రా చేసిన సొమ్ము టార్గెట్ ● చాకచక్యంగా పట్టుకున్న పెద్దపల్లి పోలీసులుపెద్దపల్లిరూరల్: కస్టమర్లు డ్రా చేసుకునే సొమ్మును చాకచక్కగా చోరీ చేయడంలో నేర్పరులైన అన్నదమ్ములను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పెద్దపల్లి ఏసీపీ కార్యాలయంలో శుక్రవారం ఏసీపీ గజ్జి కృష్ణతో కలిసి డీసీపీ కరుణాకర్ వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. జల్సాలకు అలవాటుపడి సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో రాజస్థాన్‌కు చెందిన ఆరుగురు సభ్యులు ముఠాగా ఏర్పడ్డారు. ఈనెల 15న పెద్దపల్లికి చేరుకుని కూనారం రోడ్డులోని ఎస్బీఐ ఏటీఎంను తెరిచారు. డ్రా చేసుకునే సొమ్ము ఖాతాదారుల చేతికి చేరకుండా ఏటీఎంలో ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారాన్ని ముంబైలోని సెక్యూరిటీ విభాగం అధికారులు గుర్తించి ఇక్కడి బ్యాంకర్లను అప్రమత్తం చేశారు. ఏటీఎం చానల్ ఎగ్జిక్యూటివ్ రజనీకాంత్ పెద్దపల్లి చేరుకుని ఏటీఎం పరిశీలించగా, డబ్బు పోలేదని నిర్ధారించారు. సీసీ ఫుటేజీల ద్వారా నిందితుల చిత్రాలు సేకరించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై లక్ష్మణ్‌రావు కేసు నమోదు చేసి ఎటీఎంల వద్ద నిఘా పెంచారు. ఈ క్రమంలో స్థానిక శాంతినగర్‌లో నివాసం ఉండే సింగరేణి ఉద్యోగి పుట్ట శివకుమార్ ఏటీఎంలో రూ.500 డ్రా చేశారు. ఆ సొమ్ము బయటకు రాలేదు. ఆ తర్వాత రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా మల్కెర మండలం కరీడకు చెందిన అన్నదమ్ములు సిద్దిక్‌ఖాన్, ఆరీఫ్‌ఖాన్ ఏటీఎంలోకి వెళ్లి ఆ సొమ్ము తీసుకున్నారు. తర్వాత రైలులో సిర్పూర్ కాగజ్‌నగర్ వెళ్లేందుకు రైల్వేస్టేషన్ చేరుకున్నారు. అక్కడ తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నిస్తుండగా పట్టుకున్నారు. పెర్టో ఏటీఎంలు టార్గెట్.. కస్టమర్ల సౌలభ్యం కోసం బ్యాంకర్లు పెర్టో కంపెనీకి చెందిన ఏటీఎంలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిని టార్గెట్ చేసుకున్న అన్నదమ్ములు సిద్దిక్‌ఖాన్, ఆరీఫ్‌ఖాన్.. రాజస్థాన్‌కు చెందిన ఆరీఫ్ గుటారి, ఆశ్మహమ్మద్, సాహిల్, ఇమ్రాన్‌తో ముఠాగా ఏర్పడ్డారు. ఓ కారులో ఈనెల 5న బయలు దేరి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి తెలంగాణకు చేరుకున్నారు. మార్గమధ్యంలో ఉజ్జయిని, అకోలా, కండువా, తుల్జాపూర్లో చోరీలు చేశారు. చోరీల సందర్భంగా ఈ ముఠా సభ్యుల మధ్య ఈనెల 10న విభేదాలు తలెత్తాయి. దీంతో సిద్దిక్‌ఖాన్, ఆరీఫ్‌ఖాన్ కారుదిగి బస్సులో హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడ పెర్టో ఏటీఎంలు కనిపించకపోవడంతో కాజీపేటకు చేరుకున్నారు. కాజీపేట, వరంగల్‌లో కూడా అవిలేవు. దీంతో ఈనెల 14న పెద్దపల్లికి చేరుకున్నారు. కూనారం రోడ్డులోని ఎస్బీఐలో పెర్టో ఏటీఎంను గుర్తించారు. ‘టి’ ఆకారం ఉన్న కీ తో ఓపెన్ చేసి.. ఏటీఎం పరిసరాల్లో ఎవరూ లేరని నిర్ధారించుకుని టి ఆకారంలోని కీతో ఏటీఎం ముందు భాగాన్ని తెరిచి డబ్బు బయటకు వచ్చేమార్గంలో క్యాష్ డిస్పెన్సర్‌కు రేకు ముక్క అడ్డుగా ఉంచి ప్లాస్టర్ అతికించారు. ఆ తర్వాత ఏటీఎం డోర్‌ను యథాస్థానంలో ఉంచారు. మరుసటి రోజు వచ్చేసరికి డ్రాచేసిన రూ.500 మాత్రమే వారు అనుకున్న చోట ఏటీఎంలో ఆగిపోయింది. ఆ సొమ్మును తీసుకుని కాగజ్‌నగర్ వెళ్లేందుకు యత్నించి పోలీసుల చేతికి చిక్కారు. డీసీపీ మాట్లాడుతూ, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి లాడ్జిలో బసచేస్తే వారి సమాచారాన్ని కచ్చితంగా పోలీసులకు అందించాలన్నారు. అంతర్రాష్ట్ర దొంగలను చాకచక్యంగా పట్టుకున్న సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్పైలు లక్ష్మణ్‌రావు, మల్లేశం, సిబ్బంది రాజు, రఘు, రమేశ్, ప్రభాకర్, సతీశ్, అనిల్‌కుమార్‌ను డీసీపీ అభినందించారు. -
సైక్లింగ్‌తో ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం
మల్లాపూర్(కోరుట్ల): రోజూ సైక్లింగ్ చేయడంతో ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని రాష్ట్రపతి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వాల్గొట్ కిషన్ అన్నారు. శుక్రవారం సైకిల్‌పై నిర్మల్ జిల్లా ఖానాపూర్ నుంచి మల్లాపూర్ మండలం మొగిలిపేటకు చేరుకుని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. సైక్లింగ్‌తో షుగర్, రక్తపోటు, ఊబకాయాన్ని నివారించవచ్చన్నారు. ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకు తరిగిపోతున్న పెట్రోల్ నిల్వలను కాపాడుకోవచ్చన్నారు. ప్రజలందరూ నిత్యం సైక్లింగ్ చేయాలని సూచించారు. అనంతరం గ్రామంలోని గోల్కోండ రమేశ్, ఏలేటి ప్రీతంరెడ్డి, గంధం రఘు సైక్లింగ్ చేసేందుకు ముందుకు వచ్చి సభ్యత్వం తీసుకున్నారు. జాతీయ పోటీలకు ఎంపికకరీంనగర్స్పోర్ట్స్: బీహార్‌లో నేటి నుంచి ఈ నెల 23వరకు జరగనున్న 47వ జాతీయస్థాయి జూనియర్ హ్యాండ్‌బాల్ పోటీలకు ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపికై నట్లు హ్యాండ్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వడ్లూరి రాజేందర్, జిట్టబోయిన శ్రీను తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి ఎంపిక పోటీల్లో రాణించిన నాగరాజు(జగిత్యాల), కల్లేపల్లి చక్రధర్ (సిరిసిల్ల) ఎంపికై నట్లు పేర్కొన్నారు. క్రీడాకారులను మాజీ ఎంపీపీ పొనుగోటి శ్రీనివాసరావు, బొమ్మరవేని తిరుమల తిరుపతి, కలిగేటి శ్రీనివాస్, జెట్టిపెల్లి అశోక్, అనూప్‌రెడ్డి, శ్రీనివాస్, భాస్కర్ అభినందించారు. -
సాగు వివరాలు తెలుసుకుంటూ
ఇప్పటి వరకు వరి సాగు చేశాను. మిత్రుల సూచనతో ఎకరంన్నరలో పుచ్చకాయ రెండు దఫాలుగా వేశాను. ఏ సమయంలో ఏం చేయాలనే విషయాలను మిత్రులు వాట్సప్‌గ్రూప్‌లో షేర్ చేస్తారు. దాని ప్రకారం అన్ని పనులు చేయడంతో పంట మంచి దిగుబడి వచ్చింది. – మర్రిపెల్లి శ్రీనివాస్, ముత్యంపేట, మల్లాపూర్ ధర బాగుంది గత రెండు, మూడేళ్లుగా పుచ్చకాయ సాగు చేస్తు న్నా. పంటను హోల్‌సేల్‌గా విక్రయి ంచకుండా నేరుగా వినియోగదారులకు విక్రయిస్తున్నా. అందరం కలిసి విత్తనాలు కోనుగోలు చేస్తాం, ఎ క్కడ అమ్మాలనే దానిపై ఆలోచించి కంపెనీలతో ఒప్పందం చేసుకుంటాం. – మెక్కొండ రాంరెడ్డి, అలూరు, రాయికల్ -
మద్యం మత్తులో ఆత్మహత్య
ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): రామగుండం కార్పొరేషన్ 39వ డివిజన్ శాంతినగర్‌లో మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఎలక్ట్రీషియన్ బండ మోహన్(35) మద్యం మత్తులో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. గోదావరిఖని సంతోష్‌నగర్‌కు చెందిన బండ మోహన్ కొన్నిరోజులుగా శాంతినగర్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. గురువారం రాత్రి మద్యం తాగివచ్చి భార్య మహేశ్వరితో గొడవపడ్డాడు. ఆ మత్తులో గదిలోకి వెళ్లి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్యతోపాటు పిల్లలు శ్రీదీక్షిత్(12) శ్రీబృంద(11) ఉన్నారు. మృతుడి సోదరుడు బండ రవి ఫిర్యాదుతో ఎన్టీపీసీ ఎ స్సై ఉదయ్‌కిరణ్ కేసు నమోదు చేసుకొన్నారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి మెట్‌పల్లిరూరల్(కోరుట్ల): మెట్పల్లి మండలం సత్తక్కపల్లి–రాజేశ్వర్రావుపేట శివారులో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. ఇబ్రహీంపట్నం మండలం కోమటికొండాపూర్‌కు చెందిన చిట్టాపురపు రాము(33) ద్విచక్రవాహనంపై కమ్మర్పల్లి వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ఆర్డీసీ బస్సు రాము ద్విచక్రవాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో రాము అక్కడికక్కడే మృతిచెందాడు. భవనంపై నుంచి పడి ఒకరు.. జగిత్యాలక్రైం: స్థానిక పోచమ్మవాడలో ప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడి కర్నాల అరుణ్ (40) మృతిచెందాడు. మెట్‌పల్లికి చెందిన అరుణ్ గురువారం పోచమ్మవాడలో ఉన్న తన అత్తగారింటికి వచ్చాడు. ఈనెల 23న అతని బావమరిది వివాహం ఉండగా గురువారం పోచమ్మ పండగ చేశారు. రాత్రి భోజనం చేసిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి భవనంపై పడుకున్నారు. అర్ధరాత్రి భవనం దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడటంతో బలమైన గాయాలై మృతిచెందాడు. మృతుడి భార్య మనోజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై కిరణ్ తెలిపారు. నేడు స్వగ్రామానికి వసలజీవి మృతదేహంధర్మపురి: దుబాయ్‌లో హత్యకు గురైన స్వర్గం శ్రీనివాస్ మృతదేహం కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కృషితో శనివారం గ్రామానికి తీసుకురానున్నారని బీజేపీ పట్టణ అధ్యక్షుడు గాజు భాస్కర్ తెలిపారు. మండలంలోని దమ్మన్నపేట గ్రామానికి చెందిన స్వర్గం శ్రీనివాస్ ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లి అక్కడ మోడర్న్ బేకరీలో పని చేస్తున్నాడు. ఈనెల 11న పాకిస్తానీ చేతిలో శ్రీనివాస్ హత్యకు గురైన విషయం తెలిసిందే. గల్ఫ్ దేశాల్లో మృతి చెందిన మృత దేహాలు స్వదేశానికి రావడానికి నెలలు పడుతుందని, కానీ శ్రీనివాస్ మృత దేహాన్ని కేంద్ర మంత్రుల చొరవతో వారం రోజులకే శంశాబాద్ ఎయిర్‌పోర్టుకు తీసుకువస్తారని భాస్కర్ తెలిపారు. -
వినూత్న ఆలోచన.. లాభార్జన
● పుచ్చకాయ సాగులో యువ రైతులు ● వరి, మొక్కజొన్నకు ప్రత్యామ్నాయంగా పంట ● వాట్సప్‌లో షేర్ చేస్తూ.. నేరుగా విక్రయాలు జగిత్యాల అగ్రికల్చర్: సాధారణంగా యాసంగిలో చాలా మంది రైతులు వరి, మొక్కజొన్న పంటలు సాగు చేస్తుంటారు. జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన యువరైతులు వినూత్నంగా ఆలోచన చేశారు. వరిసాగును వీలైనంత తగ్గించి, పుచ్చకాయ సాగుచేస్తూ.. పొందుతున్నారు. వచ్చిన పంటను కొందరు హోల్‌సేల్‌గా విక్రయిస్తుండగా, మరికొంతమంది నేరుగా వినియోగదారులకు అందిస్తూ.. లాభాలు పొందుతున్నారు. శివరాత్రి నుంచి పంట మార్కెట్‌కు పుచ్చకాయకు మహాశివరాత్రి నుంచి మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. దీంతో నవంబర్ నుంచి విత్తనాలు నాటారు. ఫిబ్రవరి నుంచి పంట మార్కెట్‌కు వచ్చి, మే వరకు కొనసాగనుంది. కొందరు కిలోకు రూ.15వరకు హోల్‌సేల్‌గా విక్రయిస్తుండగా, మరికొందరు వినియోగదారులకు నేరుగా కిలో రూ.20 చొప్పున విక్రయిస్తున్నారు. సాధారణంగా ఎకరానికి 15–20 టన్నుల పంట రావాల్సి ఉండగా, ఈ సారి మారిన వాతావరణ పరిస్థితులతో, సస్యరక్షణ చర్యలు చేపట్టి ఎకరాకు 10–15 టన్నుల దిగుబడి తీశారు. హైదరాబాద్‌లోని మాల్స్‌తో ఒప్పందాలు జిల్లాకు చెందిన పలువురు రైతులు పంటను హైదరాబాద్‌లోని మాల్స్‌కు విక్రయించేలా ఒప్పందాలు చేసుకున్నారు. మిగిలిన కాయలను జిల్లాకేంద్రంలోని శ్రీరామ చౌరస్తా వద్ద, కోరుట్ల, మెట్పల్లిలో వినియోగదారులకు నేరుగా విక్రయిస్తున్నారు. ఎర్ర కలర్ పుచ్చకాయే కాకుండా పసుపు, గ్రీన్ రంగుల పుచ్చకాయలు సైతం విక్రయిస్తున్నారు. వాట్సప్‌లో సమాచారం.. సారంగాపూర్ మండలం పెంబట్లకు చెందిన బండారి వెంకటేశ్, మల్లాపూర్ మండలం సిరిపూర్‌కు చెందిన పోగుల నరేశ్, ముత్యంపేటకు చెందిన మర్రిపల్లి శ్రీనివాస్, రాయికల్ మండలం అల్లూరుకు చెందిన మెక్కొండ రాంరెడ్డితో పాటు పలువురు యువకులు వినూత్నంగా ఆలోచన చేస్తూ పంటలు సాగు చేస్తుంటారు. ఓ వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని, వ్యవసాయానికి సంబంధించిన విషయాలు పోస్ట్ చేస్తున్నారు. సాగు వివరాలే కాకుండా, పంటను మార్కెటింగ్ చేసుకునే విధానాన్ని షేర్ చేసుకుంటారు. ఈ క్రమంలో స్వల్పకాలంలో చేతికి వచ్చే పుచ్చకాయ పంట సాగు చేయాలని నిర్ణయించారు. ఓ పది ఎకరాల సాగుకు అవసరమైన మల్చింగ్ షీట్, నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు సైతం ఒకే కంపెనీవి కొనుగోలు చేశారు. -
అంతర్ జిల్లా దొంగ అరెస్ట్
● 48 గంటల్లో చోరీ కేసు ఛేదించిన పోలీసులు ● రెండు కేసుల్లో మూడున్నర తులాల బంగారం స్వాధీనం జమ్మికుంట: వృద్ధులకు పింఛన్ ఇప్పిస్తానని మెడలోని రెండు తులాల పుస్తెల తాడు ఎత్తుకెళ్లిన అంతర్ జిల్లా దొంగను జమ్మికుంట టౌన్ సీఐ వరంగంటి రవి ఆధ్వర్యంలో శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. హుజూరాబాద్ డివిజన్ ఏసీపీ శ్రీనివాస్‌జి వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వడ్డెరకాలనీకి చెందిన అల్లెపు కృష్ణ అనే వ్యక్తి వీణవంక మండలం కనపర్తి గ్రామానికి చెందిన అల్లెపురెడ్డి కమలమ్మ, కొమురరెడ్డి అనే వృద్ధ దంపతులకు జమ్మికుంట పట్టణంలో పింఛన్ ఇప్పిస్తానని, ఫొటో తీయాలని, మెడలో బంగారం ఉండొద్దంటూ రెండు తులాల బంగారు పుస్తెల తాడును మంగళవారం ఎత్తుకెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సీఐ రవి ఆధ్వర్యంలో విచారణ చేపట్టి 48 గంటల్లో చోరీ కేసు ఛేదించారు. వృద్ధుల రెండు తులాల బంగారం, హైదరాబాద్‌లో కృష్ణ చోరీ చేసిన మరో ఘటనలో తులంన్నర బంగారం స్వాధీనం చేసుకున్నారు. సీఐ రవి, హెడ్ కానిస్టేబుల్ మోహన్, సదయ్య, కానిస్టేబుల్ అబ్దుల్ ఖదీర్, శ్రీకాంత్‌ను ఏసీపీ అభినందించారు. పీడీ యాక్ట్.. కృష్ణ గతంలో పీడీ యాక్ట్ కింద 4 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించినా.. చోరీలకు పాల్పడడం మానుకోలేదు. అంతర్ జిల్లా చోరీలకు పాల్పడుతున్న కృష్ణపై రాష్ట్రవ్యాప్తంగా 80 కేసులున్నాయి. జమ్మికుంటలో 3, హుజూరాబాద్‌లో 3, కరీంనగర్లో 10 కేసులున్నాయని ఏసీపీ తెలిపారు. -
కారు బోల్తాపడి 9 మందికి గాయాలు
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చెప్యాల గ్రామ శివారులో బైక్‌ను తప్పించబోయి కారు అదుపుతప్పి బోల్తాపడగా 9 మందికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల వివరాలు.. హైదరాబాద్‌కు చెందిన మురళీకృష్ణ, దివ్య, బావిక, శ్రీకృష్ణ, మహరాజు, స్వీటి, బేబితో పాటు మరికొంత మంది వేములవాడలో కేశఖండనం కోసం వచ్చారు. శుక్రవారం ఉదయం కేశఖండన పూర్తికాగానే తమ కారులో కొండగట్టుకు వస్తుండగా చెప్యాల శివారులో అకస్మాత్తుగా ద్విచక్రవాహనం కారుకు అడ్డు రావడంతో తప్పించే ప్రయత్నంలో కారు అదుపుతప్పి రోడ్డు కిందకు వెళ్లి బోల్తాపడింది. కారులోని 9 మందికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108లో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. -
ఎండకు పక్షుల మృత్యువాత
కోనరావుపేట(వేములవాడ): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని గ్రామాల్లో ఎండల తీవ్రతకు పక్షులు నేలరాలుతున్నాయి. నెమళ్లు, కాకులు, పిచ్చుకలతో పాటు ఇతర పక్షులు అస్వస్థతకు గురవుతున్నాయి. మర్తనపేట శివారులోని రైస్మిల్లువద్ద ఓ నెమలి ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురికాగా గమనించిన యువకులు రక్షించి అటవీ అధికారులకు అప్పగించారు. విండో చైర్మన్ రూ.7.23 లక్షలు దుర్వినియోగం● గతేడాది డిసెంబర్లో పలువురు డైరెక్టర్ల ఫిర్యాదు సారంగాపూర్(జగిత్యాల): మండలంలోని కోనాపూర్ సింగిల్‌విండోలో విండో చైర్మన్ గుర్నాథం మల్లారెడ్డి రూ.7,23,638 నిధులు దుర్వినియోగం చేసినట్లు జిల్లా సహకార అధికారి మనోజ్‌కుమార్ వెల్లడించారు. చైర్మన్ అక్రమాలకు పాల్పడినట్లు జరిపిన విచారణ నివేదికను శుక్రవారం వెల్లడించారు. అక్రమాలపై విండో పరిధిలోని పలువురు డైరెక్టర్లు 2024 డిసెంబర్ 16న కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ సాయికుమార్‌గౌడ్ విచారణ చేపట్టారు. 2021 నుంచి 2024 వరకు చైర్మన్ రూ.7,23,638 వివిధ రూపాల్లో దుర్వినియోగం చేసినట్లు నిర్ధారించడం జరిగిందని వివరించారు. దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 21న ఉదయం 11 గంటలకు జిల్లా సహకార కార్యాలయంలో చైర్మన్ హాజరుకావాలని, లేకుంటే 18 శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రాజన్నను దర్శించుకున్న సినీ ప్రముఖులువేములవాడ: వేములవాడ రాజన్నను శుక్రవారం సినీ పరిశ్రమకు చెందిన సంపత్ నంది, దర్శకుడు అశోక్ తేజ, ప్రొడ్యూసర్ డి.మధు, వశిష్ట సింహ హీరోలు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోడె మొక్కు చెల్లించుకున్నారు. స్వామి వారి దర్శనానంతరం వేదోక్త ఆశీర్వచనం గావించారు. -
చోరీ చేశారు.. అమ్మలేక దొరికారు
● ట్రాక్టర్ దొంగల అరెస్టుముస్తాబాద్(సిరిసిల్ల): జల్సాలకు అలవాటు పడి.. ఈజీ మనీ కోసం దొంగలుగా మారిన ముగ్గురు యువకులు చోరీ చేసిన ట్రాక్టర్, ఖాజ కుట్టుమిషన్లను ఎవరికి అమ్మాలో తెలియక చివరకు పోలీసులకు దొరికారు. సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి తెలిపిన వివరాల ప్రకారం.. ముస్తాబాద్ శుభోదయ మండల సమాఖ్య కార్యాలయంలో ఉన్న ట్రాక్టర్ ఐషర్ ఇంజీన్, కాజా కుట్టు మిషన్లు గత ఫిబ్రవరి 17న అపహరణకు గురయ్యాయి. సమాఖ్య అధ్యక్షురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్సై గణేశ్ విచారణ చేపట్టారు. కాల్‌డాటా, అనుమానితుల కదలికలపై నిఘా పెట్టి ముస్తాబాద్‌కు చెందిన మహ్మద్ షాదుల్లా, దావిరెడ్డి నరేందర్‌రెడ్డి, మహ్మద్ సమీర్లు ట్రాక్టర్, కుట్టు మిషన్లను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. వారిని అరెస్టు చేసి వారి నుంచి ట్రాక్టర్, కుట్టు మిషన్‌తోపాటు ఒక కారు, బైక్, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. అయితే రెండు నెలల క్రితమే ట్రాక్టర్, మిషన్‌ను అపహరించిన నిందితులు వాటిని ఎవరికి అమ్మాలో తెలియక పొలాల మధ్య దాచిఉంచారన్నారు. రూ.7లక్షల విలువైన ట్రాక్టర్, కుట్టు కాజా మిషిన్‌ను స్వాధీనం చేసుకోవడంలో ఎస్సై గణేశ్, హెడ్‌కానిస్టేబుల్ బాలనర్సయ్య, కానిస్టేబుల్ ఖాసీంలను సీఐ అభినందించారు. -
చెరువులో బాలుడి గల్లంతు
మల్లాపూర్(కోరుట్ల): చెరువులో స్నానాకి వెళ్లి ఓ బాలుడు గల్లంతయిన ఘటన మల్లాపూర్ మండల కేంద్రం శివారులోని లింగన్న చెరువు వద్ద జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రంలోని దుర్గమ్మకాలనీకి చెందిన పుట్ట పోశేట్టి–కవిత దంపతులకు ఇద్దరు కుమారులు రాజేశ్(12), నరేశ్. రాజేశ్ మండలంలోని మొగిలిపేటలో బాబాయి వద్ద ఉంటూ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నాడు. ఇటీవలే మల్లాపూర్‌కు వచ్చి తల్లిదండ్రుల వద్ద ఉంటున్నాడు. పశువుల కాపరి అయిన తండ్రి పోశేట్టికి చేదోడుగా వెళ్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం పశువులతో శివారు ప్రాంతానికి చేరుకున్న రాజేశ్ లింగన్న చెరువులో స్నానం చేసేందుకు వెళ్లాడు. చెరువులో నీళ్లు ఎక్కువగా ఉండడంతో రాజేశ్‌కు ఈతరాక నీటిలో గల్లంతయ్యాడు. పోలీసులు ఘటనస్థలికి వెళ్లి గ్రామస్తులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లతో అర్ధరాత్రి వరకు గాలింపు చేపట్టినా రాజేశ్ ఆచూకీ లభించలేదని ఎస్సై రాజు తెలిపారు. -
తాగు, సాగునీటి కోసం ‘చలో నారాయణపూర్’
● ఎమ్మెల్యే గంగుల కమలాకర్కరీంనగర్రూరల్: సాగు, తాగునీటి కోసం త్వరలో చలో నారాయణపూర్ పేరిట పాదయాత్ర చేపట్టనున్నట్లు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలి పారు. శుక్రవారం కరీంనగర్ మండలం దుర్శేడ్, మొగ్ధుంపూర్, చెర్లభూత్కూర్, జూబ్లీనగర్, నగునూరు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ప్రభుత్వం ఎస్సారెస్పీ నీటిని సక్రమంగా విడుదల చేయకపోవడంతో పంటలు ఎండిపోయినట్లు తెలిపారు. తాగు, సాగునీటి కోసం నారాయణపూర్ రిజర్వాయర్ వరకు పాదయాత్ర చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. బొమ్మకల్‌కు రైసుమిల్లులు కేటాయించడంతో దూరమవుతుందని రైతులు చెప్పడంతో కలెక్టర్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. కరీంనగర్, దుర్శేడ్ సహకార సంఘాల అధ్యక్షులు పెండ్యాల శ్యాంసుందర్‌రెడ్డి, తోట తిరుపతి, వైస్ చైర్మన్ గోనే నర్సయ్య, ఎంపీడీవో సంజీవరావు, ఏవో సత్యం, సీఈవోలు ఎం.రమేశ్, వేణుమాధవ్, మాజీ ప్రజాప్రతినిధులు జక్కం నర్సయ్య, దబ్బెట రమణారెడ్డి పాల్గొన్నారు. -
రివర్‌ఫ్రంట్ అవినీతిపై విచారణ జరిపించాలి
● మాజీ మేయర్ వై.సునీల్రావుకరీంనగర్టౌన్: మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అక్రమాలకు కేరాఫ్‌గా మారిందని, ప్రభుత్వం స్పందించి విచారణ జరిపించాలని బీజేపీ నేత, మాజీ మేయర్ యాదగిరి సునీల్‌రావు డిమాండ్ చేశారు. మానేరు రివర్ ఫ్రంట్‌తో పాటు తీగలవంతెనను శుక్రవారం బీజేపీ శ్రేణులతో కలిసి సందర్శించారు. అనంతరం సునీల్‌రావు మాట్లాడుతూ ఎల్ఎండీ గేట్ల నుంచి 5లక్షల క్యూసెక్కుల నీటి విడుదల కెపాసిటీ ఉండగా.. కేవలం 80వేల క్యూసెక్కుల నీటి విడుదలను తట్టుకునే విధంగా రివర్‌ఫ్రంట్ పనులు చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. రూ.546 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ పనులకు శ్రీకారం చుట్టగా, ఇప్పటి వరకు రూ.226కోట్ల పనులు చేసి, బిల్లులు తీసుకుని, నాణ్యత లోపంతో నత్తనడకన పనులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అవకతవకలకు పాల్పడుతున్న ఏజెన్సీ కాంట్రాక్టర్, బా ధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. రూ.196 కోట్లతో తీగలవంతెన నిర్మాణం చేస్తే, ప్రస్తుతం అధ్వానంగా మారిందన్నారు. -
68 దుకాణాలు.. 415 దరఖాస్తులు
● రేషన్ డీలర్ పోస్టుకు డిమాండ్ ● రంగంలోకి రాజకీయ నాయకులు ● రూ.లక్షల్లో బేరసారాలు ● తాజాగా మరో 26 పోస్టులకు ప్రకటనకరీంనగర్ అర్బన్: జిల్లాలో రేషన్ దుకాణాల నిర్వహణకు పోటీ నెలకొంది. దశాబ్దాల తరువాత రేషన్ డీలర్ల నియామకానికి ప్రకటన వెలు వడటంతో వందల్లో దరఖాస్తులు వచ్చాయి. గత నెల 29న కరీంనగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో 68 రేషన్ దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానించారు. ఈ నెల 12వరకు స్వీకరించగా.. 415మంది దరఖాస్తు చేశారు. కరీంనగర్ రూరల్ మండలంలో 7, గంగాధర 6, మానకొండూరు 9, చొప్పదండి 8, రామడుగు 6, తిమ్మాపూర్ 8, చిగురుమామిడి 5 గన్నేరువరం 7, కొత్తపల్లి 2, కరీంనగర్ అర్బన్ మండలంలో 10 రేషన్ దుకాణాలు ఖాళీలుండగా రోస్టర్ పాయింట్ ప్రకారం రిజర్వేషన్లను కేటాయించారు. ఒక దుకాణానికి ఆరుగురు పోటీపడుతున్నారు. బేరసారాలు షురూ రేషన్ డీలరు పోస్టుకు పోటీ నెలకొనడంతో పలు ప్రాంతాల్లో బేరసారాలు జోరందుకున్నాయి. రూ.50వేల నుంచి రూ.2లక్షల వరకు డిమాండ్ చేస్తుండటంతో ఆశావహులు కంగుతింటున్నా రు. కరీంనగర్ రూరల్, గంగాధర, కరీంనగర్ అర్బన్, తిమ్మాపూర్, మానకొండూరు, గన్నేరువరం మండలాల్లోని పలు ఖాళీలకు ఇప్పటికే ఒప్పందం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూలో ప్రతిభ చూపినవారికే అవకాశమని ఆర్డీవో స్పష్టం చేస్తుండగా క్షేత్రస్థాయిలో విరుద్ధ పరిస్థితి. రాజకీయ పార్టీల ద్వితీయ శ్రేణి నేతలు ఇప్పటికే రంగంలో దిగగా తమ పలుకుబడితో డీలర్షిప్ ఇప్పిస్తామని, అవసరమైతే ప్రభుత్వ పెద్దలతో చెప్పిస్తామంంటున్నారని పలువురు అర్జీదారులు ‘సాక్షి’కి వివరించారు. రేషన్ దుకాణాన్ని బట్టి గతంలో ఉన్న రిజర్వేషన్ల క్రమంలో పలు దుకాణాలకు ఒక్కో దరఖాస్తు మాత్రమే వచ్చిందని తెలుస్తోంది. మరో 26 దుకాణాలకు ప్రకటన కోర్టు కేసుల్లో ఉన్న మరో 26 డీలర్ల ఖాళీలకు ఆర్డీ వో మహేశ్వర్ ప్రకటన విడుదల చేశారు. నాగిరెడ్డిపూర్ (బీసీ–బీ), గోపాల్రావుపల్లి (బీసీ–ఏ), పెద్దకుర్మపల్లి (ఓసీ–మహిళ), పోచంపల్లి (ఎస్సీ), నగునూరు (ఓసీ), ఎలబోతారం (బీసీ బీ), తిర్మలాపూర్ (ఎస్టీ మహిళ), గుండి (ఈడబ్ల్యూఎస్), దేశ్రాజ్పల్లి(ఎస్సీ), గోపాల్రావుపేట (ఓసీ–మహిళ), ఖాజీపూర్ (బీసీ–ఏ), రేకుర్తి (ఓసీ), (బీసీ–బీ మహిళ), (బీసీ–డీ), కొత్తపల్లి (ఎంఆర్), (ఎస్టీ), (ఓసీ–మహిళ), (బీసీ ఈ), మల్కాపూర్ (బీసీ–బీ), చింతకుంట (ఈడబ్ల్యూఎస్), (ఎస్సీ–మహిళ), (ఓసీ), సీతారాంపూర్(ఓసీ–మహిళ), తమిళకాలనీ(ఎస్సీ), ఆసిఫ్‌నగర్ (బీసీ–డీ), నాగుల మల్యాల(ఎస్టీ)కు కేటాయించారు. అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణులై, చౌక ధరల దుకాణ పరిధిలో నివాసముండాలి. 18–40 ఏళ్లలోపువారు అర్హులు కాగా మే 15న పరీక్ష, 28న ఇంటర్వ్యూ నిర్వహిస్తామని ఆర్డీవో వెల్లడించారు. ఎలాంటి పైరవీలకు అస్కారం లేదని, పారదర్శకంగా నియామక ప్రక్రియ ఉంటుందని వివరించారు. -
‘సీపీఐ తిరుగులేని శక్తిగా ఎదగాలి’
కరీంనగర్: నగరంలో సీపీఐ పార్టీ ఎదుగుదల కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పార్టీ జాతీ య కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి పిలు పునిచ్చారు. సీపీఐ కరీంనగర్ నగర 11వ మ హాసభ సందర్భంగా శుక్రవారం పార్టీ కార్యాలయం ఎదుట సీపీఐ పతాకాన్ని జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామితో కలిసి ఆవిష్కరించారు. అనంతరం వెంకటరెడ్డి మాట్లాడుతూ.. కరీంనగర్లో అనేక భూ పోరాటాలు చేసి వేలా ది మందికి ఇళ్లు ఇప్పిచ్చిన చరిత్ర సీపీఐదని అన్నారు. చింతకుంట, రేకుర్తి, బద్దిపల్లి గ్రామాల్లో ఎంతోమంది నిరుపేదలకు ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించడంలో క్రియాశీలక పాత్ర వహించామన్నారు. నగరంలో ప్రభుత్వ భూములు కొందరు రాజకీయ నేతలు, కార్పొరేటర్ల కనుసన్నల్లో ఉన్నాయని, వాటిని పేదలకు పంచేందుకు ఉద్యమాలకు సిద్ధం కావాలన్నారు. తీగల వంతెన, మానేరు రివర్ ఫ్రంట్‌లో రూ.కోట్ల దోపిడీ జరిగిందని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. అన్ని డివిజన్లలో పార్టీ ప్రజాసంఘాల విస్తరణకు ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలన్నారు. సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు పైడిపల్లి రాజు, కిన్నెర మల్ల మ్మ, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, పంజాల శ్రీనివాస్, నలువాల సదానందం, సాయవేణి రాయమల్లు, శారద తదితరులు పాల్గొన్నారు. దుర్శేడ్‌లో అన్నమయ్య వారసులుకరీంనగర్రూరల్: శ్రీతాళ్లపాక అన్నమయ్య 12వ తరం వారసులు తాళ్లపాక స్వామిజీ దంపతులు శుక్రవారం దుర్శేడ్‌లోని శ్రీ వేణుగోపాలస్వామి, మరకతలింగ రాజరాజేశ్వరస్వామి ఆలయాలను సందర్శించారు. శివలింగానికి రుద్రాభిషేకం నిర్వహించి భక్తులకు తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి మహత్యం, భగవద్గీతపై ఉపదేశం చేశారు. ఆలయ పూజారి ప్రశాంత్‌శర్మ, మధుసూదనాచార్యులు, మాజీ ఉపసర్పంచ్ సుంకిశాల సంపత్‌రావు, నందాల తిరుపతి, అరవింద్, పవన్ పాల్గొన్నారు. ఇన్చార్జి ఎస్ఈగా శ్రీనివాస్రావుకరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ ఇన్చార్జి సూపరింటెండెంట్ ఇంజినీర్‌గా ప్రజా రోగ్యశాఖ ఎస్ఈ ఎన్.శ్రీనివాస్‌రావు నియామకం అయ్యారు. ఇప్పటివరకు ఎస్ఈగా ఉన్న రాజ్‌కుమార్ దీర్ఘకాలిక సెలవులో వెళ్లడం తెలిసిందే. దీంతో ఆయన స్థానంలో శ్రీనివాస్‌రావుకు నగరపాలకసంస్థ ఎస్ఈగా అదనపు బాధ్యతలు అప్పగించారు. -
ముందుకు.. వెనక్కి!
● కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వేలైన్ కోసం కదులుతున్న పైళ్లు ● సిరిసిల్లలో 751 ఎకరాల సేకరణకు రూ.400 కోట్లు వెచ్చింపు ● దాచారం నుంచి బోయినపల్లి వరకు భూమిని గుర్తించిన అధికారులు ● మరో 107 ఎకరాల కోసం రూ.69కోట్లు అవసరం ● మిడ్ మానేరులో 37ఎకరాలకు బదులుగా కోనరావుపేటలో భూమి ● కరీంనగర్లోనూ 50 ఎకరాలు సేకరించిన అధికారులుకరీంనగర్లో 50 ఎకరాలకు రూట్ క్లియర్ కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వేట్రాక్ కోసం గంగాధర మండలం ఉప్పర మల్యాల రెవె న్యూ గ్రామం పరిధిలోని ఉప్పరమల్యాల, రంగారావుపల్లెలో 50.19 ఎకరాల భూసేకరణ ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ఈ భూమిలో కొత్తపల్లి– వేములవాడ మధ్య ఐదు కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌ను అధికారులు నిర్మించనున్నారు. ఈ భూమితోపాటు ఇక్కడ ఉన్న 23 ఇళ్లను ప్రభుత్వం రైల్వేశాఖకు అప్పగించడంతో పనులు మొదలు కానున్నాయి. ఇంటికి రూ.15లక్షలు, ఎకరానికి రూ.20 లక్షల చొప్పున చెల్లిస్తున్నారు. గత సెప్టెంబరులో ఈ భూమిపై అభ్యంరాలపై నోటిఫికేషన్ వేసిన ప్రభుత్వం గ్రామసభలతో కొలిక్కి తీసుకొచ్చింది. వేములవాడ నుంచి వచ్చే ఈ ట్రాక్ గంగాధర సమీపంలోని కొత్తపల్లి స్టేషన్‌కు అనుసంధానం చేయడంతో మార్గం పూర్తవుతుంది.సాక్షిప్రతినిధి, కరీంనగర్: కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వేలైన్ భూసేకరణలో అధికారులు కాస్త వేగం పెంచినట్లు కనిపిస్తోంది. ఈ పనుల్లో నెలకొన్న జాప్యాన్ని చూస్తుంటే.. ఒకడుగు ముందుకుపడితే.. రెండడుగులు వెనక్కి అన్నట్లుగా ఉంది పరిస్థితి. ప్రస్తుతమైతే ఈ పనుల కోసం ఇటు సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలో రెవెన్యూ అధికారులు దస్త్రాలను చకచకా ముందుకు కదుపుతున్నారు. ప్రస్తుతం సిరిసిల్ల జిల్లాలో పనులు కొనసాగుతున్నాయి. దాచారం నుంచి బోయినపల్లి వరకు దాదాపు 954 ఎకరాల భూమిని అధికారులు రైల్వేలైన్ కోసం గుర్తించగా ఇప్పటి వరకూ 751 ఎకరాలు సేకరించారు. భూములు కోల్పోయిన రైతులు, నిర్వాసితులకు రూ.400 కోట్ల వరకు ప్రభుత్వం చెల్లించింది. రైల్వేలైన్ కోసం దాదాపు 107ఎకరాల భూమిని ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఈ భూమికి పరిహారంగా మరో రూ.69 కోట్ల వరకు నిర్వాసితులకు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఈ నిధులు విడుదల కావాల్సి ఉంది. ఇవి వస్తే భూసేకరణ ప్రక్రియ మరింత వేగవంతమవుతుంది. మరోవైపు మిడ్‌మానేరు పరిధిలోని చింతల్మెట్, తాడూరు పరిధిలోని దాదాపు 37ఎకరాల అటవీభూమిని సేకరించారు. ఇందకోసం ప్రత్యామ్నాయంగా కోనరావుపేటలో మరో 40 ఎకరాల భూమిని అటవీ ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు అప్పగించారు. సిరిసిల్ల వరకు పనులు నత్తనడకే మనోహరాబాద్– కొత్తపల్లి వరకు దాదాపు 151 కిలోమీటర్లకు రూ.1167 కోట్లతో 2016లో ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రస్తుతం 79కిలోమీటర్ల మేర ట్రాక్ పనులు పూర్తయి.. సిద్దిపేట వరకు రైలు సర్వీసు అందుబాటులోకి వచ్చింది. సిద్దిపేట నుంచి సిరిసిల్ల వరకు జల, రోడ్ల మార్గాలు అధికంగా ఉన్న కారణంగా ఇక్కడ కల్వర్టులు, వంతెనలకు నిధుల విడుదల్లో జాప్యంతో పనులు ఆలస్యంగా నడుస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం.. 2023 మార్చిలోనే రైల్వే పనులు సిరిసిల్ల వరకు పూర్తికావాలి. సిద్దిపేట నుంచి కొత్తపల్లి వరకు ట్రాక్ పనులు పూర్తయేందుకు దాదాపు రూ.850 కోట్ల వరకు నిధులు అవసరం అవుతాయని దక్షిణమధ్య రైల్వే అంచనా వేస్తోంది. ఈ లెక్కన చూస్తే.. కొత్తపల్లి వరకు ట్రాక్ పనులు పూర్తయ్యేందుకు మరో రెండేళ్లు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మార్గం పూర్తయితే రాజధానితోపాటు జగిత్యాల మీదుగా ముంబై, పెద్దపల్లి మీదుగా ఢిల్లీ, వరంగల్‌కు మార్గం సుగమం అవుతుంది. -
‘ఇందిరమ్మ’ నిధులొచ్చాయ్
● జిల్లాలో 85 మంది లబ్ధిదారులకు రూ.85 లక్షలు మంజూరుకరీంనగర్ అర్బన్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఖాతాలకు మొదటి దశ నగదు చేరింది. కొన్నినెలల క్రితం దరఖాస్తులను స్వీకరించగా అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే. అర్హులను గుర్తించగా మొదటి దశ బేస్మెంట్ లెవల్ పూర్తయిన నిర్మాణాలకు నిధులు మంజూరు చేసింది. జిల్లాకు రూ.85 లక్షలు రాగా 85మంది లబ్ధిదారుల ఖాతాలకు జమ చేశారు. కరీంనగర్ అర్బన్ మినహా అన్ని మండలాల్లోని లబ్ధిదారులకు మొదటి విడత డబ్బులు విడుదల చేశారు. మండలాల వారీగా విడుదలైన నిధులు కరీంనగర్ రూరల్ మండలానికి రూ.8 లక్షలు, చిగురుమామిడికి రూ.8లక్షలు, చొప్పదండికి రూ.16లక్షలు, ఇల్లందకుంట, కొత్తపల్లికి రూ.లక్షచొప్పున, గంగాధరకు రూ.3 లక్షలు, గన్నేరువరానికి రూ.5లక్షలు, హుజూరాబాద్‌కు రూ.8లక్షలు, జమ్మికుంటకు రూ.4లక్షలు, మానకొండూరుకు రూ.5లక్షలు, రామడుగుకు రూ.8లక్షలు, శంకరపట్నానికి రూ.6లక్షలు, తిమ్మాపూర్‌కు రూ.2లక్షలు, సైదాపూర్‌కు రూ.7లక్షలు, వీణవంక మండలానికి రూ. 3 లక్షలు విడుదలయ్యాయి. అక్రమాలకు చెక్.. రెండంచెల్లో తనిఖీలు భౌతికంగా జరిగే నిర్మాణాలకే నిధులు విడుదల కానున్నాయి. అక్రమాలకు ఎలాంటి అస్కారం లేకపోగా ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. జియోట్యాగింగ్ ద్వారా పంచాయతీ కార్యదర్శులు ఫొటోలను అప్లోడ్ చేస్తుండగా ఏఈలు క్షేత్రస్థాయిలో పరిశీలించిన తదుపరి అప్రూవ్ చేస్తున్నారు. ఫొటో తీసే క్రమంలో గూగుల్‌ను మ్యాప్‌ను అనుసంధానిస్తున్నారు. 400 చదరపు అడుగులు ఉంటేనే బిల్లులు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేస్తోంది. స్థలంఉండి ఇల్లు కట్టుకోలేని వారు, పూరి గుడిసెల్లో నివాసముంటున్న వారు, పేద వారికి ఇళ్లను మంజూరు చేస్తున్నారు. ప్రతి లబ్ధిదారుడు 400 చదరపు అడుగులు దాటకుండా ఇల్లు నిర్మించుకోవాల్సి ఉంటుంది. అంతకుమించి నిర్మిస్తే బిల్లులు ఆన్లైన్ చేసే అవకాశం లేదని అధికారులు వివరించారు. ఇప్పటివరకు వైలెట్ ప్రాజెక్టు కింద 15 గ్రామాల్లో పనులు ఊపందుకుంటున్నాయి. నియోజకవర్గానికి 3,500 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేస్తోంది. పైలెట్ ప్రాజెక్టులో తీసుకున్న 15 గ్రామాలు కాకుండా మరో 290 గ్రామాలతోపాటు నగర, పురపాలికల్లో 146 వార్డులు, డివిజన్లలో ఇళ్లను మంజూరు చేసేందుకు ఇప్పటికే సర్వే చేశారు.జిల్లా వివరాలు ఇలా ఇందిరమ్మ ఇళ్లకు వచ్చిన దరఖాస్తులు: 2,11,467 పరిశీలించిన దరఖాస్తులు: 2,11,191 నివేదిక సమర్పించినవి: 2,10,168 నివేశన స్థలం లేనివారు: 76,927 పైలెట్ ప్రాజెక్టుతో మంజూరు: 2,027 ముగ్గుపోసి పనులు చేపట్టినవి: 702 పునాది దశ పూర్తయినవి: 85విశేష స్పందన ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేస్తున్నారు. జిల్లాలో 85 ఇళ్లకు సంబంధించి బేస్మెంట్ పూర్తవగా రూ.85 లక్షలు మంజూరయ్యాయి. వాటిని లబ్ధిదారుల ఖాతాకు చేర్చడం జరిగింది. – గంగాధర్, హౌసింగ్ పీడీ, కరీంనగర్ -
రైలు కిందపడి వృద్ధుడి ఆత్మహత్య
జమ్మికుంట : రైలు కిందప డి ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రామగుండం రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గంగారపు తి రుపతి తెలిపిన వివరాల ప్రకారం...హుజూరాబాద్ పట్టణంలోని మామిడ్లవాడకు చెందిన పొట్ట బ త్తిని సురేందర్ (69) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. పట్టణంలోని రైల్వేస్టేషన్ రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని రైలు కిందపడి గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య సావిత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు పేర్కొన్నారు. ‘పది’ ఫలితాలు రాకముందే విద్యార్థిని మృతి ● రూ.10 లక్షలు వెచ్చించినా దక్కని ప్రాణం బోయినపల్లి(చొప్పదండి): పదోతరగతి పరిక్షలు రాసి.. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థిని ఆకుల నాగచైతన్య(15) అనారోగ్యంతో గురువారం మృతిచెందింది. బోయినపల్లి మండలం మల్లాపూర్‌కు చెందిన ఆకుల చిన్న రవి–రజిత దంపతులకు ముగ్గురు కూతుళ్లు. చిన్నకూతురు నాగచైతన్య ఆటో ఇమ్యూన్ వ్యాధితో ఏడాదిగా బాధపడుతోంది. గతంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నాగచైతన్యకు రూ.2.50లక్షల మేర ఎల్వోసీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని నిమ్స్‌లో ఏడాదిగా చికిత్స పొందుతోంది. నాగచైతన్య చికిత్స కోసం తల్లిదండ్రులు దాదాపు రూ.10 లక్షల వరకు ఖర్చు చేశారు. గత మార్చిలో 10వ తరగతి పరీక్ష రాసింది. మూడు రోజుల క్రితం వ్యాధి తీవ్రం కావడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించి గురువారం మధ్యాహ్నం మృతిచెందింది. చురుకై నా విద్యార్థిని అర్ధంతరంగా ప్రాణాలు వదలడంతో ఆమె చదివిన స్కూల్ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్ట్కథలాపూర్: కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన చెరుకూరి శంకర్ విధుల్లో ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించినందుకు గురువారం అరెస్టు చేసినట్లు ఎస్సై నవీన్‌కుమార్ తెలిపారు. ఈనెల 14న సిరికొండలో గొడవ జరుగుతుందన్న సమాచారం మేరకు పోలీసులు వెళ్లారు. శంకర్‌ను గొడవ చేయవద్దని పోలీసులు చెప్పగా.. వారిపై దురుసుగా ప్రవర్తించి విధులకు ఆటంకం కలిగించాడు. శంకర్‌ను గురువారం అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించామని ఎస్సై నవీన్‌కుమార్ పేర్కొన్నారు. అగ్నిప్రమాదంలో ఈతచెట్లు దగ్ధం కథలాపూర్: కథలాపూర్ మండలం సిరికొండ గ్రామశివారులో ప్రమాదవశాత్తు నిప్పంటుకోవడంతో 400 ఈత చెట్లు కాలిపోయినట్లు గీతకార్మికులు గరువారం తెలిపారు. రోజుమాదిరిగానే బుధవారం సాయంత్రం ఈతచెట్లకు కల్లు గీసేందుకు వెళ్లి ఇంటికి వచ్చామని పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు నిప్పంటుకోవడంతో పిచ్చిమొక్కలతోపాటు 400 ఈతచెట్లు కాలిపోవడంతో తాము ఉపాధి కోల్పోయామని వాపోయారు. సంఘటన స్థలాన్ని ఆర్ఐ నాగేశ్ పరిశీలించి వివరాలు సేకరించారు. ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని తెలిపారు. -
చందుర్తిలో మూడిళ్లలో చోరీ
చందుర్తి(వేములవాడ): చందుర్తి పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోని మూడిళ్లలో బుధవారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. మండల కేంద్రంలోని రెండిళ్లలో చొరబడ్డ దొంగలు వస్తువులను చిందరవందరగా పడేశారు. సిర్రం రాజవ్వ ఇంట్లో రూ.15వేలు, వెంగళి వినోద ఇంట్లో రూ.25వేలు ఎత్తుకెళ్లారు. చర్చి పాస్టర్ ప్రశాంత్ ఇంటిలోకి ప్రవేశించి ఆరుబయట నిలిపిన బైక్‌ను ఎత్తుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై అంజయ్య దొంగతనం జరిగిన ఇళ్లలోని కుటుంబ సభ్యుల నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అంతేకాకుండా వేలిముద్రల ఆధారంగా దొంగలు పట్టుకునేందుకు క్లూస్‌టీమ్‌తో ఆధారాలను సేకరించారు. మండలకేంద్రంలోని సీసీ పుటేజీలను సేకరించి దర్యాప్తు మమ్మురం చేస్తున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు చందుర్తి ఎస్సై అంజయ్య తెలిపారు. ఠాణాకు కూతవేటు దూరంలో దొంగతనాలు -
అజ్ఞాతంలోనే నాలుగు దశాబ్దాలు
కోరుట్ల: మావోయిస్టుల్లో 1985లో చేరిన జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన పసుల వసంత (68) సుమారు 40 ఏళ్లపాటు అజ్ఞాతంలోనే గడిపారు. 2001లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా (ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా)లోని ఎల్లారెడ్డిపేట మండలం మద్దిమల్ల ఎన్కౌంటర్లో మావోయిస్టు ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కార్యదర్శిగా పనిచేస్తూ భర్త పసుల రాంరెడ్డి చనిపోయినా.. ఆమె ఉద్యమబాటను వదిలిపెట్టలేదు. ఆయన లేకున్నా.. భర్త అడుగుజాడల్లో మరో పాతికేళ్లపాటు ఉద్యమంలోనే గడిపి చివరగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఉత్తర బస్తర్ డివిజన్ కార్యదర్శిగా పనిచేశారు. వయోభారం, అనారోగ్య కారణాలతో ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లా పోలీసులకు పసుల వసంత 2025 జనవరిలో లొంగిపోయారు. రెండు రోజుల క్రితం ఆమె కోరుట్లలోని తన బంధువుల చెంతకు చేరింది. ఆధార్‌కార్డు లేనే లేదు.. ఉద్యమబాటలోనే నాలుగు దశాబ్దాలు గడిపిన వసంతకు ఆధార్ కార్డు లేదు. అజ్ఞాతంలో ఉన్న ఆమె ఏనాడూ జనజీవన స్రవంతిలోకి రాకపోవడంతో ఆమెకు ఆధార్‌కార్డు అవసరమే రాలేదు. ఇప్పుడు పరిస్థితి వేరు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే వసంత పేరిట రూ.8 లక్షల రివార్డు ప్రకటించింది. దీంతోపాటు తెలంగాణ ప్రభుత్వ పరంగా రూ.ఐదు లక్షల రివార్డు ఉన్నట్లు ఇంటలిజెన్స్ పోలీసులు వసంత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ రివార్డులు పొందాలంటే వసంతకు ప్రస్తుతం ఆధార్‌కార్డు తప్పనిసరి అయింది. ఉద్యమం నుంచి బయటకు వచ్చిన ఆమెకు కోరుట్లలో నివాస గృహం ఉంది. కోరుట్లలోని అంబేద్కర్‌నగర్‌లో ఉన్న ఇంటి ఆధారంగా రెసిడెన్స్ సర్టిఫికెట్ తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. కనికరించాలని వేడుకోలు కోరుట్లకు చెందిన వసంతకు అత్తగారింటికి చెందిన ఇల్లు తప్ప ఇతరత్రా ఆస్తులు లేవు. ఆ కాలంలో రేషన్‌కార్డు తీసుకోలేదు. భర్త పసుల రాంరెడ్డి సైతం మావోయిస్టు ఉద్యమంలోనే 2001లో చనిపోవడంతో వీరిద్దరికి దాదాపుగా ఆధార్‌కార్డు, రేషన్‌కార్డులు లేకపోవడం గమనార్హం. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కాంకేర్ జిల్లా ఎస్పీ సమక్షంలో లొంగిపోయిన సందర్భంలో అక్కడి ప్రభుత్వం రూ.8 లక్షల రివార్డు ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. ఈ సమయంలో ఛత్తీస్‌గఢ్ పోలీసులు వసంత లొంగిపోయినట్లు ఇచ్చిన ధ్రువీకరణ పత్రం ఆధారంగా ఆధార్‌కార్డును తయారు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఆమె కూతురు భవానీ జిల్లా కలెక్టర్‌ను వేడుకుంటోంది. ఆధార్ కార్డు ఇప్పించండి ఉద్యమంలోనే జీవితం గడిచిపోయింది. నాకు ఆధార్ కార్డు, రేషన్‌కార్డు వంటి ఆధారాలు ఏమీ లేవు. పోలీసులకు లొంగిపోయిన నాకు ఆరోగ్య రీత్యా చాలా సమస్యలు ఉన్నాయి. నా పేరిట ఉన్న రివార్డును పొందగలిగితే కొంతలో కొంత నా ఆరోగ్య పరిస్థితిని మెరుగుపర్చుకోవచ్చని ఆశ. ఈ విషయంలో ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నా. – పసుల వసంత, లొంగిపోయిన మావోయిస్టు ఆధార్ కార్డుకు దిక్కులేదు సర్కార్ రివార్డులు దక్కేదెలా..? కనికరించాలని కలెక్టర్‌కు వేడుకోలు మాజీ మావోయిస్టు వసంత దీనస్థితి -
గిన్నిస్‌బుక్ రికార్డులో ‘మానేరు’ విద్యార్థి
జగిత్యాల: కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలోని మానేరు ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థి సర్వీన్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని అంతర్జాతీయ హలెల్ మ్యూజిక్ స్కూల్ మేనేజ్మెంట్ బోర్డు ఈవెంట్లో గిన్నీస్ రికార్డుకు ఎంట్రీలను ఆహ్వానించింది. 2024 డిసెంబర్ 1న 1046 మందితో గంటపాటు ఆన్లైన్లో నాన్‌స్టాప్ కీబోర్డు ప్లే ఈవెంట్‌ను హలెల్ మ్యూజిక్ స్కూల్ నిర్వహించింది. 45 సెకెన్లలోనే కీబోర్డును వాయించి గిన్సీస్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఈ సందర్భంగా విద్యాసంస్థల చైర్మన్ అనంతరెడ్డి, డైరెక్టర్ సునీతరెడ్డి, ప్రిన్సిపాల్ అభినందించారు. -
న్యాయమూర్తులకు వీడ్కోలు
కరీంనగర్ క్రైం: ఇటీవల బదిలీ అయిన కరీంనగర్ జిల్లా జడ్జి బి.ప్రతిమ, ఏసీబీ జడ్జి కుమార్ వివేక్, ఫ్యామిలీ కోర్టు జడ్జి లక్ష్మీకుమారిలను గురువారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. అసోసియేషన్ అధ్యక్షుడు లింగంపల్లి నాగరాజు, ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ ల ఆధ్వర్యంలో కార్యవర్గం జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవాసదన్ భవనంలో కార్యక్రమంలో ముగ్గురు న్యాయమూర్తులను మెమొంటో, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న జిల్లా జడ్జి ప్రతిమ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాకు ఎంతో గుర్తింపుఉందని, ఇక్కడ వృత్తిపరంగా తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. న్యాయమూర్తులు వెంకటేశ్ నీరజ, శ్రీలేఖ, వాణి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వెంకటేశ్, మేజిస్ట్రేట్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఆరెల్లి రాములు, కుమార్, గౌరు రాజిరెడ్డి, ఏజీపీ రమేశ్, అసోసియేషన్ ఉపాధ్యక్షుడు చందా రమేశ్, సంయుక్త కార్యదర్శి సిరికొండ శ్రీధర్, ట్రెజరర్ ముద్దసాని సంపత్, మహిళా ప్రతినిధి రజి, సీనియర్ న్యాయవాదులు డి.మల్లయ్య, పి. సజన్‌కుమార్, కె.సంజీవరెడ్డి, కొరివి వేణుగోపాల్, బాస సత్యనారాయణ, కుసుంబ కృష్ణరావు తదితరులు పాల్గొన్నారు. -
రాజన్న ఆలయానికి ప్రత్యేక బోర్డు !
వేములవాడ: దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయ పాలనలో రూపురేఖలు మారనున్నాయి. ఆదాయానికి.. బోర్డుకు సంబంధం ఉండడంతో ఏటా రూ.100కోట్లు ఆదాయం దాటే ఆలయాలకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలనే నిబంధన రాజన్న ఆలయానికి వర్తించనుంది. దీంతో వేములవాడ శ్రీరాజరాజేశ్వస్వామి ఆలయ ప్రత్యేక బోర్డు ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. దీనికి ఐఏఎస్ అధికారిని బాధ్యులుగా నియమించే అవకాశం ఉంటుంది. గతంలో బోర్డులు ఇలా.. వేములవాడ రాజన్న ఆలయం పాలనకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 1952లో కలెక్టర్‌ను చైర్మన్‌గా, ఐదుగురు సభ్యులతో ఆలయ బోర్డు ఏర్పాటైంది. 1956, 1958, 1962 సంవత్సరాల్లో మళ్లీ ఏర్పాటు చేశారు. 1967 నుంచి ప్రతీ రెండేళ్లకు కమిటీ మారుతూ వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది నిలిచిపోయింది. ప్రత్యేక బోర్డుకు ప్రభుత్వం కసరత్తు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.100 కోట్లకుపైగా ఆదాయం గల ఆలయాలకు టీటీడీ తరహాలో ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈప్రక్రియలో వేములవాడ రాజన్న ఆలయం పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ సూత్రప్రాయంగా వెల్లడించారు. స్వయంప్రతిపత్తితో బోర్డు వేములవాడ ఆలయానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈక్రమంలో కొత్తతరం రానుంది. బోర్డుసభ్యులతో స్వయం ప్రతిపత్తి కల్పించే దిశలో చర్చలు చేపట్టనున్నారు. త్వరలోనే బోర్డు ఏర్పాటు జరగనున్నట్లు అధికార పార్టీలో చర్చ మొదలైంది. ఆలయ పాలనలో క్రియాశీలతకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఐఏఎస్ స్థాయి అధికారి నేతృత్వంలో బోర్డు ఏర్పాటు, స్వయం ప్రతిపత్తితో వ్యవస్థ తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో ఆలయ పాలనలో స్వతంత్ర అధికార దిశగా ముందడుగు వేయబోతోంది. పాలన లోపాలకు ఈ కొత్తబోర్డు కృషి చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఐఏఎస్ అధికారి నేతృత్వం, భక్తులకు పారదర్శక పాలన అందించాలన్న దిశలో ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. రూ.100కోట్లు దాటితే ఏర్పాటు ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ఐఏఎస్ అధికారిని నియమించే అవకాశం త్వరలోనే ఉత్తర్వులు రూ.100 కోట్లు దాటిన ఆలయాలకు ప్రత్యేక బోర్డు రాష్ట్రంలో రూ.100కోట్ల ఆదాయం దాటిన ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలన్న ఆలోచనల్లో ప్రభుత్వం ఉంది. యాదగిరిగుట్ట తరహాలో వేములవాడ రాజన్నకు సైతం బోర్డు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. రాజన్న ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు, ఇదే పద్ధతిలో పట్టణం అభివృద్ధిపై సైతం కృషి చేస్తాం. – ఆది శ్రీనివాస్, ప్రభుత్వవిప్ -
‘జ్యోతిష్మతి’కి ఎన్బీఏ గుర్తింపు
తిమ్మాపూర్: మండల కేంద్రంలోని జ్యోతిష్మతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సైన్స్‌కు 2028 వరకు ఎన్బీఏ అక్రిడిటేషన్ మంజూరు చేసిందని కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్‌రావు తెలిపారు. గురువారం కళాశాలలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్న్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, విభాగాలు 2022–2025 మధ్య కాలంలో గుర్తింపు పొందాయన్నారు. నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషనన్ ద్వారా పునరుద్ధరించబడిన గుర్తింపు అకాడమిక్ ఎక్స్‌లెన్స్, నాణ్యత హామీ ఫలితాల ఆధారిత విద్యతో మరోసారి పొడిగించారని, అక్రిడిటేషన్న్ సంస్థ ఆశించిన విద్యా, పరిశోధన ప్రయత్నాలను మెరుగుపరచడానికి శక్తివంతమైన ప్రేరణగా పనిచేస్తోందన్నారు. పొడిగింపు కళాశాల పటిష్టత, అధ్యాపకుల నిబద్ధత, అధునాతన మౌలిక సదుపాయాలు వివిధ కార్యక్రమాలను బలోపేతం చేస్తుందని సెక్రటరీ కరస్పాండెంట్ జె సుమిత్సాయి తెలిపారు. కొనసాగింపునకు కృషిచేసినవారికి అభినందనలు తెలిపారు. -
కరీంనగర్ ప్రభుత్వాసుపత్రిలో అరుదైన దంత శస్త్ర చికిత్స
కరీంనగర్‌టౌన్: కరీంనగర్ ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో అరుదైన దంత శస్త్రచికిత్స నిర్వహించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి తెలిపారు. మూడేళ్లుగా జీజీహెచ్‌లోని దంత విభాగం ఆరోగ్యశ్రీ సేవల్లో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలుపుకుంటుందన్నారు. ఈక్రమంలో ఆధునిక నైపుణ్యాన్ని అవసరమైన పేషంట్లకు అందించడం జరుగుతుందన్నారు. మొదటిసారిగా అనస్తీసియాలో అత్యాధునిక పద్ధతిలో రోడ్డు ప్రమాదంలో ముఖం, దౌడ, ముక్కు విరిగిన 33 ఏళ్ల శివకుమార్‌కు ఓరల్, మాక్సిలో ఫేషియల్ సర్జన్ డాక్టర్ డి.సతీశ్‌కుమార్ ఓపెన్ రిడక్షన్, ఇంటర్నల్ ఫిక్సేషన్ ద్వారా సర్జరీ నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ శస్త్రచికిత్సలో సీనియర్ ఫిజీషియన్ నవీన, సీనియర్ దంత వైద్య నిపుణులు రవిప్రవీణ్‌రెడ్డి, హఫీజ్, అనిస్తీషియా సతీశ్ కుమార్, వంశీ, సుగాత్రి, ఈఎన్టీ సందీప్‌రెడ్డి, జమున తదితరులు పాల్గొన్నారు. -
ఆవేదన జీవితాంతం
ఆవేశం అదే క్షణం● చిన్నచిన్న కారణాలకే బలవన్మరణాలు ● ఒంటరవుతున్న పిల్లలు, తల్లిదండ్రులు ● ఉమ్మడి జిల్లాలో ఆందోళన కలిగిస్తున్న ఆత్మహత్యలుసాక్షి ,పెద్దపల్లి ●: అనారోగ్యంతో కొందరు, కుటుంబ కలహాలతో మరికొందరు, అప్పుల బాధ, నిరుద్యోగం, పరీక్షల్లో ఫెయిల్, ప్రేమలో విఫలం, ఇష్టం లేని పెళ్లితో ఇంకొందరు.. వరకట్న వేధింపులు, అవమానం, ఆవేశం ఇలా కారణాలు ఎన్ని ఉన్నా మానసిక ఒత్తిడిలో బలహీనమైన క్షణంలో బలమైన నిర్ణయాలతో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆత్మహత్యలతో ఆయా కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాయి. మహిళలు ఆత్మహత్య చేసుకుంటే వారి పిల్లలు అనాథలవుతున్నారు. ప్రేమ, ఉద్యోగం, పరీక్షలు తదితర కారణాలతో యువత ఆత్మహత్యలకు పాల్పడి తల్లిదండ్రులకు కడుపుకోత మిగుల్చుతున్నారు. రోజూ ఇద్దరు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో సంవత్సరానికి 8లక్షల మందికి పైగా, అంటే ప్రతీ సెకనుకు ఒకరు ఆత్మబలిదానం చేసుకుంటున్నారు. ప్రపంచంలో జరిగే ప్రతి 4 ఆత్మహత్యల్లో ఒకటి ఇండియాలోనే నమోదవుతోంది. ఉమ్మడి జిల్లాలో గతేడాది 776 మంది సూసైడ్ చేసుకున్నారు. అంటే సగటున ప్రతీ రోజుకు ఇద్దరు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏదో కారణంతో తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. నివారిద్దాం ఇలా.. నిరాశ, నిస్పృహల్లో ఉన్నవారికి స్వాంతన కలిగించడం ద్వారా ఆత్మహత్యలను తగ్గించవచ్చు. ఆత్మహత్య ఆలోచన రావడమే తరువాయి వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా వారిని మన వైపు మళ్లించవచ్చు. వారి బాధలను వినాలి, అర్థం చేసుకోవాలి. వారి సమస్యకు ఎలా పరిష్కారం దొరుకుతుందో వారితోనే చెప్పించాలి. ఇలాంటివారిని గుర్తించగానే ఒంటరిగా ఉంచకుండా నలుగురితో కలిసేలా కుటుంబసభ్యులంతా స్నేహంగా మెలగాలి. వారు సాధారణ జీవితం గడిపేంత వరకు వారిని గమనిస్తూ ఉండాలి. సమస్య మరీ తీవ్రంగా ఉంటే మానసిక వైద్యులను కలిసి చికిత్స ఇప్పించాలి. గుర్తించడం ఇలా.. ఆత్మహత్య గురించి పదేపదే మాట్లాడుతుండటం, తనకు తాను హాని కలిగించుకునేందుకు ప్రయత్నించడం, తీవ్ర ఒత్తిడితో చికాకు పడుతుండటం, ఒంటరితనాన్ని ఇష్టపడటం, ప్రతీ విషయం గురించి ప్రతికూలంగా ఆలోచించడం, నిద్రపోకుండా ఉండటం, చేసే ప్రతి పనిపట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తుండడం.. ఇలాంటి మార్పులు ఒక వ్యక్తిలో కనిపిస్తే, వారు ఆత్మహత్య గురించి ఆలోచనలు చేస్తుండొచ్చని భావించాలి. ● ‘ఏడాదిన్నర వయసు ఉన్న బిడ్డకు ఉరివేసి, అదే తాడుకు తల్లి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇటీవల పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగింది. తాను బక్కగా ఉన్నాననే బాధతో మనస్తాపం చెంది అఘాయిత్యానికి పాల్పడింది’. ● ‘ఈనెల 11న రామగుండం కార్పొరేషన్ 14వ డివిజన్ ఎల్కలపల్లి గేట్ గ్రామానికి చెందిన వివాహిత భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. దీంతో ముగ్గురు పిల్లలు తల్లిలేని బిడ్డలయ్యారు’. ● ‘గత నెల 6న చొప్పదండి మండలానికి చెందిన ఇద్దరు ప్రేమికులు తమ ప్రేమను పెద్దలు అంగీకరించడం లేదని మనస్తాపం చెంది ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా ఓ కష్టం.. ఓ నష్టం.. ఆవేదన, ఆవేశం, ఆక్రోశం, మనిషిని తన ప్రాణం తాను తీసుకునేలా చేస్తోంది. దీంతో వారిపై ఆధారపడిన వారు ఒంటరవుతున్నారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం.. వారి కుటుంబాలను జీవితాంతం ఆవేదన మిగుల్చుతోంది. ...వీరంతా బతకాల్సిన వారే కౌన్సెలింగ్ తీసుకుంటే తప్పేంటి.. ఆత్మహత్య ఆలోచనలు వెంటాడుతున్న వారికి వీలైతే మానసిక వైద్యుడితో కౌన్సెలింగ్ ఇప్పించాలి. కానీ, మనదగ్గర మానసిక వైద్యం అంటే నామోషీ. మానసిక వైద్య చికిత్స అంటే.. అదేదో పిచ్చిపట్టినవాళ్లకు అందించే చికిత్స అనే భావన ప్రజల మెదళ్లలో నాటుకుపోవడం వల్లే ఈ సమస్య ఎక్కువ అవుతుంది. ఆత్మహత్యకు ముందు కొంతమంది ప్రదర్శించే నిర్దిష్ట లక్షణాలను అర్థం చేసుకోవడం ద్వారా చాలావరకు బలవన్మరణ కేసులను నివారించే అవకాశం ఉంటుందని మానసిక వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. -
మహిళా హక్కుల సాధనకు పోరాటాలను ఉధృతం చేస్తాం
కరీంనగర్: మహిళా హక్కుల పరిరక్షణ సాధనే లక్ష్యంగా, అంబేడ్కర్, పూలే ఆశయాల సాధన దిశగా ఐద్వా తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర సాగుతుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. మహిళా హక్కుల పరిరక్షణ యాత్ర గురువారం హన్మకొండ, హుజూరాబాద్ మీదుగా కరీంనగర్‌కు చేరుకోగా.. తెలంగాణ చౌక్‌లో ఐద్వా కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యాత్ర బృందానికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. దేశంలో మహిళలకు అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయని అన్నారు. యాత్రకు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గుడికందుల సత్యం, రైతు సంఘం అధ్యక్షుడు వర్ణ వెంకటరెడ్డి, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు సాగర్, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి.తిరుపతి, నరేశ్పటేల్ సంపూర్ణ మద్దతు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్.అరుణ జ్యోతి, రాష్ట్ర సహాయ కార్యదర్శులు కేఎన్ ఆశలత, నల్లిగంటి రత్నమాల, జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి నాగమణి, ఉపాధ్యక్షురాలు ధ్యావా అన్నపూర్ణ, పాండ్రాళ్ల దేవేంద్ర, నగర కార్యదర్శి చేనిరోజా, సహాయ కార్యదర్శి మంచినీళ్ల లావణ్య, జిల్లా కమిటీ సభ్యులు ఉప్పునూటి లక్ష్మి, మేదర నాగమణి, టి.భవాని, ఎం.రామ, గొలుసుల రజిని, పోతర్ల మానస, తారపాకల మున్న, అంజలి పాల్గొన్నారు.24 నుంచి సెమిస్టర్ పరీక్షలుకరీంనగర్సిటీ: శాతవాహన విశ్వవిద్యాలయం బీ ఫార్మసీ పరీక్షల ప్రణాళికను విడుదల చేసిందని, రెండవ, నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 24నుంచి 30వరకు నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి సురేశ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎం ఫార్మసీ మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 24నుంచి 28వరకు జరగనున్నాయన్నారు. మరిన్ని వివరాలకు ఆయా కళాశాలలో సంప్రదించాలని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మార్కింగ్ కంప్లీట్ చేయండికరీంనగర్ అర్బన్: జిల్లాలోని 15 మండలాల్లో పైలట్ గా ఎంపిక చేసిన గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల మార్కింగ్ ప్రక్రియ100 శాతంపూర్తి చేయాలని, రెండో దఫా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రివ్యూ నిర్వహించారు. పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన 15 గ్రామాలలో 2027 మందికి ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. 730 ఇండ్లకు మార్కింగ్ పూర్తయిందని తెలిపారు. 114 ఇండ్లు బేస్మెంట్ లెవెల్ కు చేరాయన్నారు. రెండోదఫా ఇండ్లను గ్రామాలు, మున్సిపల్ వార్డులవారీగా మంజూరు చేసేందుకు అలాట్మెంట్ జాబితా తయారు చేయాలన్నారు. లబ్ధిదారుల ఎంపికలో పొరపాట్లు జరగొద్దని.. వచ్చిన దరఖాస్తుల్లో నిరుపేదలకు మాత్రమే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, జెడ్పీ సీఈవో శ్రీ నివాస్, డీటీడీవో పవన్ కుమార్ పాల్గొన్నారు. అడ్మిషన్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం కరీంనగర్: 2025–26 విద్యాసంవత్సరానికి రెప్యూటెడ్ జూనియర్ కళాశాలల స్కీం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, వికలాంగులు, మైనార్టీ విద్యార్థులకు ప్రైవేట్ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు కల్పించేందుకు గాను జిల్లాలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలల నుంచి రెప్యూటెడ్ జూనియర్ కళాశాలలను నూతనంగా ఎంపిక చేసేందుకు రెసిడెన్షియల్ వసతి కలిగిన విద్యాబోధనలో ఉన్నత ప్రమాణాలు కలిగి కాంపిటేటివ్ పరీక్షల్లో ఎక్కువ సంఖ్య ఉత్తీర్ణత శాతం కలిగిన రెప్యూటెడ్ జూనియర్ కళాశాలల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి నగైలేశ్వర్ తెలిపారు. ఆసక్తి ఉన్న కళాశాలలు తమ కళాశాలల అకాడమిక్ ప్రొఫైల్‌తోపాటు ఈ–పాస్ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో తమ కళాశాలల ఈ–పాస్ యూజర్ ఐడీ పాస్ వర్డ్‌తో లాగిన్ అయి తమ కళాశాలలను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు. ఈనెల 30 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, రిజిస్ట్రేషన్‌లో వివరాలను నమోదు చేసి మే 1 సాయంత్రం 5 గంటల్లోగా ఉప సంచాలకులు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. -
భూసమస్యల పరిష్కారమే లక్ష్యం
గన్నేరువరం/తిమ్మాపూర్: భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకువచ్చిందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గురువారం గన్నేరువరం కల్యాణమండపంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్‌తో కలిసి పాల్గొన్నారు. చట్టంలోని అంశాలను రైతులు, ప్రజలకు వివరించారు. సీసీఎల్ఏకు వెళ్లే అవసరం లేకుండా ఆర్డీవో, కలెక్టర్ వద్దే భూసమస్య పరిష్కరించుకునేందుకు అవకాశాలున్నాయన్నారు. అభ్యంతరాలు ఉంటే అప్పీల్ చేసుకోవచ్చన్నారు. చిన్న సమస్యలు మండల స్థాయిలోనే త్వరితగతిన పరిష్కారమవుతాయని వివరించారు. మనిషికి ఆధారుకార్డులాగే భూమికి భూధార్ సంఖ్య కేటాయిస్తారని తెలిపారు. తప్పుల సవరణ కోసం చట్టం అమల్లోకి వచ్చిన ఏడాదిలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న సాదాబైనామాల పరిష్కారం కోసం భూభారతిలో అవకాశం కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో మహేశ్వర్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి భాగ్యలక్ష్మి, తహసీల్దార్ ఇప్ప నరేందర్, ఇన్చార్జి ఎంపీడీవో శ్రీనివాస్, ఏవో కిరణ్మయి పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఆటపాటలతో... అంగన్వాడీల్లో ఆటపాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్య బోధిస్తున్నామని, వచ్చే విద్యా సంవత్సరంలో ఆరేళ్లలోపు పిల్లలందరినీ కేంద్రాల్లో చేర్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. ఐసీడీఎస్, కరీంనగర్ రూరల్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిమ్మాపూర్ మండలంలోని ఎల్‌ఎండీకాలనీలోని దుర్గాబాయి మహిళా శిశు వికాసకేంద్రంలో గురువారం వివిధ రకాలు ప్రదర్శనలు చేపట్టారు. కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. చిన్నారుల మానసిక పరిపక్వత కోసం ప్రత్యేకంగా సిలబస్ తయారు చేసినట్లు వివరించారు. ప్రదర్శనశాలలో అంగన్వాడీ కేంద్రాల్లో బోధించే పరికరాలు, నెలవారీగా సిలబస్ వివరాలు, కిచెన్ గార్డెన్స్ ఆకట్టుకున్నాయి. అనంతరం ఈఏడాది పూర్వ ప్రాథమిక విద్య పూర్తిచేసిన చిన్నారులకు కలెక్టర్ సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సబిత, సీడీపీవో, ప్రాంగణం మేనేజర్ సుధారాణి, డీసీపీవో పర్విన్ పాల్గొన్నారు. అమల్లోకి భూ భారతి కలెక్టర్ పమేలా సత్పతి -
సిరిసిల్ల కలెక్టరేట్లో లీకువీరుడు!
ఏళ్లుగా పాతుకుపోయిన అధికారి ● ఆయన శాఖలో తరచూ లోపాలు గుర్తిస్తున్న కార్యాలయం ● అటెన్షన్ డైవర్షన్ కోసం కార్యాలయంపై దుష్ప్రచారం ● సీఎం, మంత్రుల పర్యటనల సమయంలో ఇదే తంతు ● ధరణి, లే అవుట్ల విషయంలో పలుమార్లు భంగపాటు ● ప్రభుత్వానికి నివేదిక పంపేందుకు సిద్ధమవుతున్న కలెక్టర్?సాక్షిప్రతినిధి,కరీంనగర్ ●: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కొంతకాలంగా పలుసంచలనాలు, వివాదాలకు కేంద్రంగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఓ అధికారి తీరే ఈ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోందని కార్యాలయ సిబ్బంది చర్చించుకుంటున్నారు. కొన్నినెలలుగా సిరిసిల్ల కలెక్టరేట్లో జరుగుతున్న పలు పరిణామాలను, విధాన పరమైన నిర్ణయాలను తప్పుడుగా ప్రచారం చేస్తున్న అధికారిపై కలెక్టర్ కార్యాలయ సిబ్బంది ఆగ్రహంగా ఉన్నారు. ఈ విషయంలో కలెక్టర్ సైతం అతని తీరుపై గుర్రుగా ఉన్నారని, జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వానికి నివేదిక పంపే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇపుడు ఈ విషయం సిరిసిల్ల కలెక్టరేట్లో చర్చానీయాంశంగా మారింది. ఇంతకీ ఎవరాయన? ఐదారేళ్లుగా సిరిసిల్ల జిల్లాలో పాతుకుపోయిన సదరు అధికారికి స్థానిక రాజకీయ నాయకులతో మంచి పరిచయాలు ఉన్నాయి. దీంతో వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా భూవివాదాలకు సంబంధించిన విషయాల్లో సదరు అధికారి అమితాసక్తి ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. తన శాఖలో ఏం జరుగుతుందన్న విషయం గాలికి వదిలి.. నిత్యం ధరణి, లే అవుట్ల విషయంలో తల దూరుస్తూ.. వివాదాస్పద విషయాలను కార్యాలయానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని కలెక్టరేట్ వర్గాలు గుర్తించాయి. ఆయన పనిలో ఎపుడు లోపాల్ని గుర్తించినా.. వెంటనే తనపై ఎవరూ శ్రద్ధ పెట్టకుండా.. వెంటనే కలెక్టర్ కార్యాలయంపై ఏదో తప్పుడు ప్రచారం చేసి, తనపై చర్చ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వారాంతాల్లో హైదరాబాద్‌కు వెళ్లడం, కలెక్టర్ కార్యాలయానికి లీవులపై కనీస సమాచారం ఇవ్వకపోవడం, ప్రభుత్వ సమీక్షాసమావేశాలకు తరుచుగా ఆలస్యంగా వస్తుండటంతో అతని తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో రెండుసార్లు ఎమ్మెల్సీ, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరిగినా ఆయన బదిలీ కాకపోవడం గమనార్హం. భూములంటే అమితాసక్తి.. ఇటీవల ధరణి రికార్డుల్లో మార్పులు చేర్పులు, లేఅవుట్ల విషయంలో కలెక్టరేట్లో ఆయన అత్యూత్సాహం ప్రదర్శిస్తున్నారని కార్యాలయ సిబ్బంది గుర్తించారు. ఒక సందర్భంలో ఏకంగా కలెక్టర్ అనుమతి లేకుండా ధరణిలో రికార్డులు మార్చేందుకు సదరు అధికారి సిబ్బందిపై ఒత్తిడి తెచ్చారు. కానీ.. రికార్డులు మార్చే అధికారి ముందుజాగ్రత్తగా.. కలెక్టర్‌కు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం వెలుగుచూసింది. పెద్దూరు, ఆగ్రహారంలో పలువురు ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారికి సహకరించిన విషయాన్ని కలెక్టర్ కార్యాలయ సిబ్బంది ముందస్తుగానే పసిగట్టడంతో అక్కడ ఆయన ఆటలు సాగలేదు. తన అక్రమాలు, శాఖలో లోపాలు బయటపడ్డ ప్రతీసారీ.. కలెక్టర్ కార్యాలయంలో ఏదో జరిగిపోతుందని తప్పుడు ప్రచారంచేసి ఇతరులపై దృష్టి మరల్చేలా చేస్తున్నారని సమాచారం. ఆ మధ్య సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనలో భోజన ఖర్చులపై దుమారం, ఇటీవల మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పర్యటన సందర్భంగానూ.. జరిగిన పరిణామాల వెనుక సదరు అధికారే ఉన్నారని కలెక్టర్ కార్యాలయం గుర్తించింది. తమకు తరచుగా ఆటంకాలు కలిగిస్తున్న ఆ అధికారిని సరెండర్ చేయాలని నివేదిక పంపేందుకు కలెక్టర్ సిద్ధమవుతున్నారని విశ్వసనీయ సమాచారం. -
యువవికాసం!
దరఖాస్తుల ● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనూహ్య స్పందన ● వరుస సెలవులు, సర్వర్ సమస్యలతో దరఖాస్తులకు ఇబ్బందులు ● చాలా మందికి ఇంకా అందని కులం, ఆదాయం, రేషన్ కార్డులు ● గడువు పెంచాలని దరఖాస్తుదారుల వినతులుఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులుపెద్దపల్లి: 47,470, జగిత్యాల: 31,128రాజన్నసిరిసిల్ల: 23,477, కరీంనగర్: 29,000సాక్షిప్రతినిధి, కరీంనగర్: యువత స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువవికాస పథకానికి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అనూహ్య స్పందన వచ్చింది. దరఖాస్తు ప్రక్రియలో తీవ్ర సమస్యలు ఎదురైన దరఖాస్తులు వెల్లువెత్తాయి. సర్వర్ లోపాలతో పాటు సాంకేతిక సమస్యలతో దరఖాస్తుల ప్రక్రియ మందకొడిగా సాగడంతో వేల మంది పథకం కోసం దరఖాస్తు చేసుకోకముందే గడువు ముగియటంతో నిరాశచెందుతున్నారు. ప్రభుత్వం మెరుగైన రాయితీతో రూ.4 లక్షల వరకు విలువైన యూనిట్లు మంజూరు చేయనుండటంతో యువత ఈ పథకానికి భారీగా దరఖాస్తు చేసుకోవాడానికి ఆసక్తి చూపారు. గడువు ముగిసేనాటికి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,31,075 మందికి ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. సర్వర్ సమస్యలతో కేంద్రాల వద్ద బారులు రాజీవ్ యువ వికాసం దరఖాస్తు చేయడానికి రూపొందించినటువంటి ఓబీఎంఎంఎస్ పోర్టల్‌లో సర్వర్ సమస్యలు నెలకొన్నాయి. దీంతో మీ సేవ కేంద్రాల వద్ద పడిగాపులు కాసారు. కొన్నిసార్లు అప్లికేషన్ చివరిదశకు వెళ్లిన సమయంలో సర్వర్ మొరాయించగా, దరఖాస్తు సమర్పించిన తర్వాత అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ కాకపోవడంలాంటి సమస్యలు ఎదురయ్యాయి. ఒకవేళ మళ్లీ దరఖాస్తు చేస్తే అల్రెడీ అప్లైడ్ అని రావడం, దరఖాస్తు సమయంలో తరచూ సర్వర్ ఎర్రర్ మెసేజ్ రావడమనేది పరిపాటిగా మారింది. దీంతో ఒక్కో దరఖాస్తు చేయడానికి కనీసం అరగంటకు పైగా ఎదురుచూడాల్సి వచ్చింది. ఆరేళ్ల తర్వాత.. 6 ఏళ్ల తరువాత నిరుద్యోగుల కోసం స్వయం ఉపాధి పథకాన్ని అమలు చేస్తుండటంతో యువత దీనిపైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ పథకం దరఖాస్తుల స్వీకరణ మార్చి 15వ తేదీన ప్రారంభించినప్పటికీ అప్పటికీ రుణాల పరిమితి, కేటగిరీలు, రాయితీ నిధులకు సంబంధించి స్పష్టత రాలేదు. మార్చి 25న ఈ పథకం విధివిధానాలపై సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. ఆ తరువాత ఈబీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరణ చేపట్టింది. గడవు పెంచుతూ 14 వరకు సమయం ఇచ్చింది. తాజాగా మరోసారి గడువు పెంపుపై ఆశలు పెట్టుకున్నారు. సెలవులతో అర్జీలు పెండింగ్‌లో రేషన్‌కార్డు లేకుంటే ఆదాయ ధ్రువీకరణ ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఆ సర్టిఫికెట్స్ కోసం మీసేవ కేంద్రాలకు పరుగులు తీశారు. ఐతే రాజీవ్ యువవికాసం పథకం దరఖాస్తులు స్వీకరించినప్పటి నుంచి వరుస సెలువులు సైతం దరఖాస్తుదారులను ఇబ్బందులకు గురిచేశాయి. రంజాన్, ఉగాది, జగ్జీవన్‌రామ్ జయంతి, తాజాగా రెండో శనివారం, ఆదివారం, సోమవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వ ఆఫీసులు పనిచేయలేదు. దీంతో ఆదాయం, కుల సర్టిఫికెట్స్ పెండింగ్ దరఖాస్తులు ఎలా పరిష్కారమవుతాయని దరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు మీసేవ కేంద్రాల ద్వారా రెవెన్యూ కార్యాలయాలకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా లక్షల్లో క్యాస్ట్, ఇన్‌కం ధ్రువీకరణ పత్రాలకు అర్జీలు వచ్చాయి. వీటిలో వేలల్లోనే దరఖాస్తులను మాత్రమే అధికారులు ఆమోదించారు. దీంతో ధ్రువీకరణ పత్రాలు అందని చాలామంది చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కుల ధ్రువీకరణ పత్రం లేక దరఖాస్తు తిరస్కరణ కుల ధ్రువీకరణ పత్రం కోసం వారం రోజుల క్రితం దరఖాస్తు చేసుకున్నా. తహసీల్దార్ కార్యాలయంలో సైట్ ఓపెన్ కావడం లేదని వారు దానిని అప్లోడ్ చేయలేదు. దీంతో నాకు కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ రాలేదు. దీంతో నేను దరఖాస్తు చేసుకోలేకపోయాను. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసే నంబరు వేసినప్పటికీ యువ వికాస్ పథకంలో తీసుకోవడం లేదు. దీంతో ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు వీలు లేకుండా పోయింది. – ఏదుల కిరణ్‌కుమార్, జగిత్యాల -
ప్రకృతి వైపరీత్యాలపై జాగ్రత్తగా ఉండాలి
● టీజీఎన్పీడీసీఎల్ చీఫ్ ఇంజినీర్ అశోక్ కొత్తపల్లి(కరీంనగర్): ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏర్పడే విద్యుత్ అంతరాయాలు, ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని టీఎజీఎన్పీడీసీఎల్ చీఫ్ ఇంజినీర్ (ఆపరేషన్) బి.అశోక్ సూచించారు. కరీంనగర్ విద్యుత్ భవన్‌లోని సమావేశ మందిరంలో బుధవారం డీఈలు, ఏడీఈలు, ఏఈలతో నిర్వహించిన సమావేశంలో పలు సూచనలు చేశారు. అధికారులు వారి హెడ్క్వార్టర్లలో ఉంటూ విద్యుత్‌ను పర్యవేక్షించాలని ఆదేశించారు. గాలి దుమారాలతో లైన్లు తెగడం, విద్యుత్ స్తంభాలు విరగడం వంటివి జరిగినప్పుడు తక్షణమే స్పందిస్తూ మరమ్మతు పనులు చేపట్టాలన్నారు. ఇంటర్ లింకింగ్ లైన్లను త్వరితగతిన పూర్తిచేయాలని, పవర్ ఇంట్రాక్షన్ వచ్చినప్పుడు ప్రత్యామ్నాయ లైన్ ద్వారా విద్యుత్ సరఫరా అందించాలన్నారు. ట్రాన్స్ఫార్మర్ల లోడ్, పిడుగుపాటుతో కాలిపోవడం వంటి వాటిపట్ల అప్రమత్తండా ఉండాలన్నారు. సమావేశంలో కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ మేక రమేశ్‌బాబు, డీఈలు కె.ఉపేందర్, జంపాల రాజం, ఎం.తిరుపతి, ఎస్.లక్ష్మారెడ్డి, పి.చంద్రమౌళి, కాళీదాసు, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు. సన్నబియ్యంపై అసత్య ప్రచారం చేస్తే కఠినచర్యలుకరీంనగర్ అర్బన్: ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో పంపిణీ చేస్తున్న సన్నబియ్యంపై కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటివారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు స్పష్టం చేశారు. సన్నబియ్యంలో ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయని కొందరు ఫేస్బుక్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాల్లో వీడియోలు ప్రసారం చేశారని పేర్కొన్నారు. ప్రజల్లో భయాందోళన సృష్టిస్తే సామాజిక మాధ్యమాల్లో తప్పు ప్రచారం చేస్తే సదరు అకౌంట్ హోల్డ ర్లపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాణ్యమైన సన్నబియ్యంతో కార్డుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. పవర్‌కట్ ప్రాంతాలుకొత్తపల్లి: విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులు కొనసాగుతన్నందున గురువారం ఉదయం 7 నుంచి 10 గంటల వరకు 11 కేవీ వరలక్ష్మి ఫీడర్ పరిధిలోని డీమార్ట్, వరలక్ష్మీగార్డెన్, తులసీనగర్, హెచ్‌పీ గ్యాస్ గోదాం, రెడ్డి ఫంక్షన్‌హాల్ ప్రాంతాలు, ఏబీ స్విచ్‌లు బిగిస్తున్నందున ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు 11 కేవీ కిసాన్‌నగర్ ఫీడర్ పరిధిలోని కిసాన్‌నగర్ ప్రవిష్ట, అర్బన్ హెల్త్ సెంటర్, ఖాన్పుర, హుస్సేనిపుర, దుర్గమ్మగడ్డ, రజ్వీచమన్, బొమ్మకల్ బైసాప్, సిటిజన్‌కాలనీ, విజయలక్ష్మీకాలనీ, శ్రీపురం కాలనీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–1 ఏడీఈ పి.శ్రీనివాస్ తెలిపారు. కమాన్‌పూర్‌లో.. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 33/11 కేవీ శాతవాహన వర్సిటీ సబ్‌స్టేషన్ కమాన్‌పూర్ వ్యవసాయ ఫీడర్ పరిధిలోని కమాన్‌పూర్, గ్రానైట్ పరిశ్రమలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు 11 కేవీ వరలక్ష్మి ఫీడర్ పరిధిలోని సరస్వతీనగర్, హనుమాన్‌నగర్ ఏరియాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు వివరించారు. -
● ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కొత్తపల్లి(కరీంనగర్):సాగునీరందించడంతో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అసహనం వ్యక్తంచేశారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బుధవారం మల్కాపూర్, బద్ధిపల్లి గ్రామాల్లో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం, ఎస్సారెస్పీ నీటితో చెరువులు, కుంటలు నింపి సాగునీటితో పాటు భూగర్భ జలాలు పెరిగాయని.. తద్వరా తాగునీటి సమ స్య తలెత్తేది కాదన్నారు. కరీంనగర్లో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చకముందే తగిన ఏర్పా ట్లు చేయాలని, లేదంటే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఉపాధి కోల్పోయామని కూలీలు..రైతుబంధు రాలేదని రైతులు.. సబ్సిడీ గ్యాస్ అందడం లేదని, తులం బంగారం ఇవ్వడం లేదని మహిళలు.. కౌలురైతులకు రైతు భరోసా ఇవ్వటం లేదని పలువురు ఎమ్మెల్యే ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నగర, మండలశాఖ అధ్యక్షులు చల్ల హరిశంకర్, శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీపీ పిల్లి శ్రీలత, మాజీ వైస్ ఎంపీపీ బి.తిరుపతినాయక్, మాజీ ఏఎంసీ చైర్మన్ మధు, వైస్ చైర్మన్ ఉప్పు రాజశేఖర్, జడ్పీ మాజీ కోఆప్షన్ సాబీర్ పాషా, రైతు సంఘం అధ్యక్షుడు నరహరి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. -
వాతావరణం
ఆకాశం నిర్మలంగా ఉంటుంది. అప్పుడప్పుడు మేఘావృతమవుతుంది. ఈదురుగాలులు వేగంగా వీస్తాయి. గ్రూప్–1లో అవకతవకలుగ్రూప్–1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడారు. 8లోu కరీంనగర్ పట్టణంలోని పెట్రోల్‌పంపు వద్ద రోడ్డుపైన చెట్టుకింద బస్సు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులుకూర్చునేందుకు కుర్చీ ఉండదు.. నిలబడదామంటే నీడ ఉండదు.. కనీసం తాగునీరు దొరకదు.. అత్యవసర పరిస్థితుల్లో మరుగుదొడ్లను వినియోగించుకుందామంటే ముక్కుపుటాలు అదిరే కంపు.. ఇవీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్టాండ్లలో కనిపించే పరిస్థితులు. నియోజకవర్గ కేంద్రాల్లో బస్టాండ్లు ఉన్నా సౌకర్యాలు లేకపోగా.. మండల కేంద్రాల్లో కనీసం బస్టాండ్లు కూడా కరువయ్యాయి. మరికొన్ని ప్రధాన గ్రామాల్లో ప్రయాణప్రాంగణాలు లేక ప్రయాణికులు ఎండలోనే బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేయడంతో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. వీరంతా ఎండలోనే నిల్చొని బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం.. అంటూ ప్రచారం చేసుకునే అధికారులు ప్రయాణ ప్రాంగణాలలో కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. ఉమ్మడి జిల్లాలో ప్రయాణ ప్రాంగణాలు లేక.. ఉన్నా సౌకర్యాలు కరువై ప్రయాణికులు పడుతున్న కష్టాలపై ‘సాక్షి’ ఫోకస్. – వివరాలు 8లో..నీడ లేదు.. నీరూ లేదు..!