గురుకులాలకు ఆదరణ | - | Sakshi
Sakshi News home page

గురుకులాలకు ఆదరణ

Feb 13 2026 3:49 AM | Updated on Feb 13 2026 3:49 AM

గురుక

గురుకులాలకు ఆదరణ

గురుకులాలకు ఆదరణ ● మైనార్టీ పాఠశాలల్లో దరఖాస్తుల స్వీకరణ ● ఈ నెల 28 వరకు అవకాశం

● మైనార్టీ పాఠశాలల్లో దరఖాస్తుల స్వీకరణ ● ఈ నెల 28 వరకు అవకాశం

కరీంనగర్‌రూరల్‌: మైనార్టీ గురుకులాలకు ఆదరణ పెరుగుతోంది. విద్యార్థులకు క్రమశిక్షణతోపాటు చక్కటి విద్యాబోధన చేస్తుండడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించేందుకు ముందుకొస్తున్నారు. జిల్లాలోని బొమ్మకల్‌లో బాలుర–1,2, ఇరుకుల్లలో 3, రేకుర్తిలో బాలిక–1,గణేశ్‌నగర్‌–2, చొప్పదండి, జమ్మికుంటలో బాలికల పాఠశాలలు ఉన్నాయి. ప్రస్తుతం 2026–27 విద్యాసంవత్సరానికి మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ నెల 28 వరకు ప్రక్రి య కొనసాగుతుంది. 5వ తరగతిలో మైనా ర్టీలకు 60 సీట్లు, బీసీలకు 10, ఎస్సీలకు 5, ఎస్టీలకు 3, ఓసీలకు 2సీట్లు ఉండగా మిగితా 6,7,8 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రవేశాల్లో 75శాతం మైనార్టీలకు, 25శాతం ఇతరులకు కేటాయించారు. మైనార్టీకోటాలో ముస్లింలకు 64శాతం, క్రిస్టియన్లకు 7, జైన, పార్శి, బౌద్ధ, సిక్కులకు 4శాతం కేటాయించగా నాన్‌ మైనార్టీ కోటాలో ఎస్సీలకు 6శాతం, ఎస్టీలకు 4, బీసీలకు 12, ఓసీలకు 3శాతం సీట్లు ఉన్నా యి. దరఖాస్తులను సంబంధిత పాఠశాలల ప్రిన్సిపాల్స్‌కు లేదా ఆన్‌లైన్‌లో సమర్పించాల ని బొమ్మకల్‌ బాలుర పాఠశాల ప్రిన్సిపాల్‌ వీర్ల మహేశ్‌ తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ ముగిసిన అనంతరం మెరిట్‌ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారని వివరించారు.

యూరియా నో స్టాక్‌

కరీంనగర్‌రూరల్‌: జిల్లాలోని యూరియా విక్ర య కేంద్రాల్లో నో స్టాక్‌ చూపించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గురువారం ఉదయం 10గంటలకు పలువురు రైతులు యూరియా బుకింగ్‌ కోసం ప్రయత్నించగా స్టాక్‌ జీరోగా చూపించడంతో ఆందోళన చెందారు. చామనపల్లిలోని విక్రయ కేంద్రంలో బుధవారం యూరియా బుక్‌ చేసుకున్న రైతులకే పంపిణీ చేశారు. పలువురు రైతులకు స్మార్ట్‌ఫోన్‌ లేకపోవడంతో యూరియా బుకింగ్‌ చేసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారం రోజుల నుంచి ఏఈవోలకు మున్సిపల్‌ ఎన్నికల విధులను అప్పగించడంతో కేంద్రాలకు రావడంలేదు. దీంతో రైతులకు యూరియా అందడం లేదు.

ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు

కొత్తపల్లి: కొత్తపల్లి తహసీల్‌ కార్యాలయ పరిధి లోని రేకుర్తి సర్వే నంబర్‌ 55 ప్రభుత్వ భూమి లో అక్రమ నిర్మాణాలు మళ్లీ జోరందుకున్నా యి. ఎన్నికల సమయాన్ని అదునుగా చూసుకొని అక్రమ నిర్మాణాలకు తెరలేపారు. రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉండటంతో గురువారం అక్రమ నిర్మాణాలు కొనసాగాయి. స్థానికుల ఫిర్యాదు మేరకు గ్రామ పాలనాధికారి అంజనేయ ప్రసాద్‌ నిర్మాణాలను ఆపాలని ఆదేశించారు. ఓ మహిళ తనకు అన్ని అనుమతులున్నాయని, రాచకొండ నరేశ్‌ అనే వ్యక్తి తనకు విక్రయించాడని ఆ గ్రామ పరిపాలన అధికారి తో వాగ్వివాదానికి దిగింది. ఈ విషయమై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు కొత్తపల్లి తహసీల్దార్‌, ఆర్‌ఐను ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నిస్తే అందుబాటులోకి రాలేదు.

కాంగ్రెస్‌ అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలి

కరీంనగర్‌ కార్పొరేషన్‌: ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని ఆ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌ రావు ఒక ప్రకటనలో సూచించారు. ప్రతి రౌండ్‌ను జాగ్రత్తగా పరిశీలిస్తూ, ఎటువంటి సందేహాలు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకుపోవాలన్నారు. అభ్యర్థులు, ఏజెంట్లు గుర్తింపు కార్డులు తీసుకువెళ్లాలన్నారు.

గురుకులాలకు ఆదరణ1
1/2

గురుకులాలకు ఆదరణ

గురుకులాలకు ఆదరణ2
2/2

గురుకులాలకు ఆదరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement