● చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
కరీంనగర్‌టౌన్: ఈనెల 5వ తేదీన ఆదివారం కరీంనగర్‌లో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవ న్ రావు 119 జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘనంగా జరుపుకుందామని చొప్పదండి ఎమ్మెల్యే, బాబు జగ్జీవన్ రామ్ జ యంతి ఉత్సవ కమిటీ చైర్మన్ మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. జయంతి వేడుకల పోస్టర్‌ను శుక్రవారం కరీంనగర్ ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో సీపీ గౌస్ ఆలం, అడిషనల్ కలెక్టర్ లక్ష్మి కిరణ్, ఆర్డీవో మహేశ్వర్ దళిత సంఘాల నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈనెల 5వ తేదీన కరీంనగర్ సివిల్ హాస్పిటల్ పక్కన జగ్జీవన్ రావు విగ్రహం వద్ద నిర్వహించే వేడుకలకు అధికారులు ప్రజాప్రతినిధులు దళిత సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఈనెల 14వ తేదీన భారతరత్న బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుందామని పేర్కొన్నారు.
సాయుధ పోరాట అమరుడు కొమురయ్య
కరీంనగర్ కార్పొరేషన్/కరీంనగర్: తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరవీరుడు దొడ్డి కొమురయ్య అని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం దొడ్డి కొమురయ్య 99 జయంతి వేడుకలను బీరప్ప యువజన సంఘం ఆధ్వర్యంలో నగరంలోని విద్యానగర్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథి హాజరైన ఆయన కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వెట్టిచాకిరీ విముక్తి కోసం పోరా డి తెలంగాణ ప్రజల తెగువను ప్రపంచానికి చాటి చెప్పిన వీరుడు దొడ్డి కొమురయ్య అన్నా రు. బడుగు, బలహీనవర్గాల హక్కుల కోసం చేసిన పోరాటాన్ని ప్రతి ఒక్కరు స్మరించుకోవాలని పిలుపు నిచ్చారు. అనంతరం స్థానికులకు మజ్జిగ పంపిణీ చేశారు. డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కార్పొరేటర్లు కర్రె పద్మ అనిల్, ఎన్నం లక్ష్మీ ప్రకాశ్, గాజ రమ శివరాం, నర్సింగ్, కురుమ సంఘం అధ్యక్షులు బండారి శేఖర్ పాల్గొన్నారు.
కరెంటు షాక్ పెడతానని రైతులకు లైన్‌మెన్ బెదిరింపు
సైదాపూర్: ప్రజా పాలన– గ్రామ ప్ర గతి పథం 99 రో జుల కార్యక్రమం ఓ వైపు ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టినప్పటికీ విద్యుత్‌శాఖ అధికారులు మొద్దు నిద్ర వీడడం లేదు. సైదాపూర్ మండలం ఎగ్లాస్‌పూర్‌లో వ్యవసాయ పొలాల వద్ద విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ తరచూ కాలిపోతుంద ని, ఆరు నెలల నుంచి ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు పట్టించుకోవడంలేదని, స్థానిక లైన్‌మెన్ గిద్దె రవి పొలాలకు విద్యుత్ షాక్ పెడతానని బెదిరిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సైదాపూర్ ఏఈ శ్రీనివా స్‌కు విన్నవించినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులు స్పందించి, ట్రాన్స్‌ఫార్మర్ బాగు చేయించాలని కోరుతున్నారు.
ప్రెస్ అకాడమీ చైర్మన్‌కు స్వాగతం
కరీంనగర్: కరీంనగర్ జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డికి శుక్రవారం రాత్రి ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో ఆర్డీవో కే మహేశ్వర్ స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ)నాయకులు శాలువాతో సన్మానించారు.


