రెండుసార్లు ఉద్యోగం కోల్పోయి, మాృతృత్వం కోసం ‍బ్రేక్‌ ఇచ్చి..మళ్లీ..! | Dr Priya Porwal shared restarts career at 39 after motherhood | Sakshi
Sakshi News home page

రెండుసార్లు ఉద్యోగం కోల్పోయి, మాృతృత్వం కోసం ‍బ్రేక్‌ ఇచ్చి..మళ్లీ..!

Apr 4 2026 10:22 AM | Updated on Apr 4 2026 10:43 AM

Dr Priya Porwal shared restarts career at 39 after motherhood

రెండుసార్లు ఉద్యోగం కోల్పోయి..తల్లి అయ్యాక మళ్లీ కెరీర్‌కి బ్రేక్‌ ఇస్తే..తిరిగి ఉద్యోగం సంపాదించుకోవడం అంత ఈజీ కాదు. ఉద్యోగం కోల్పోవడంతో కొంత భయం, కాన్ఫిడెన్స్‌ మాయం అవ్వడం సహజం. అందులోనూ ఓ పక్క తల్లి అవ్వడంతో పెరిగిన బాధ్యతలు నడుమ ఒక విధమైన మానసిక ఒత్తిడి ఎదురవ్వుతుంది. అవన్నీ తట్టుకుని మళ్లీ ఉద్యోగం సంపాదించుకుని తన కాళ్లపై నిలబడాలంటే చాలా ధైర్యం, ఆత్మవిశ్వాసం కావాల్సి ఉంటుంది. ఆ విషయాన్నే ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేసుకుంది 39 ఏళ్ల మహిళ.

డాక్టర్‌ ప్రియా పోర్వాల్‌ రెండుసార్లు ఉద్యోగాన్ని కోల్పోయి, తల్లి అయ్యాక కొంత కాలం కెరీర్‌కి విరామ ఇచ్చి..మళ్లీ తన ఉద్యోగ కెరీర్‌ని నిర్మించుకోవడానికి ఎంతలా పాట్లు పడిందో పంచుకున్నారు. విద్యారంగంలో ప్రారంభమైన తన ఉద్యోగ కెరీర్ ఊహించని మలుపు తీసుకునే ముందు..దశాబ్దానికి పైగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారామె. ప్రియ తాను 35 ఏళ్ల వయసులో తల్లి అయ్యానని, ఈ మైలు రాయి తన 12 ఏళ్ల కెరీర్‌కు విరామం ఇచ్చేలా చేసిందని చెప్పారు. 

అదే సమయంలో ఉద్యోగాన్ని కోల్పోయి చాలా ఏళ్లు  ఖాళీగా ఉండాల్సి వచ్చింది. ఆ అనుభవం తనను చాలా కలవరపరిచిందని అన్నారు. కోలుకోవడానికి నెలలు పట్టిందని, తన కాళ్ల కింద భూమి కదిలిపోయినట్లుగా అనిపించిందంటూ ఆ మానసిక క్షోభను గుర్తుచేసుకున్నారు. తిరిగి ఎలాగైన పుంజుకోవాలనే పట్టుదలతో ప్రియా పలు సంస్థలలో విజిటింగ్‌ ఫ్యాకల్టీ సభ్యురాలిగా అవకాశాలు అన్వేషించారు. 

ఆ తర్వాత మరో విద్యాసంబంధమైన పదవిని కూడా పొందారు. అయితే అక్కడి వాతావరణం ఆమె అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో మరోసారి అక్కడ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఎంటెక్‌, ఎంబీఏ, పీహెచ్‌డీ వంటి అర్హతలు ఉన్నప్పటికీ, తిరిగి ప్రారంభించడం అంత సులభం కాదని తేలింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆమె జీవితంలో ఒక అనూహ్యమైన మలుపు తీసుకుంది. 

37 ఏళ్ల వయసులో, ఒక చిన్న బిడ్డను పెంచుతూ, అనిశ్చితిని ఎదుర్కొంటూ..తన కెరీర్‌పై పూర్తి నియంత్రణ సాధించాలని స్ట్రాంగ్‌గా నిర్ణయించుకున్నారామె. తాను తిరిగి కెరీర్‌ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను, అదికూడా తనకు నచ్చిన విధంగా అని చెప్పుకొచ్చింది. ఆర్థిక స్వాతంత్యానికి మించిన చోదకశక్తి మరొకటి లేదని అంటోంది. 

తన సొంత వ్యాపారాన్ని నిర్మించుకోవడానికి డిజిటల్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టానని, కేవలం డబ్బుకోసం కాదు, వ్యక్తిగత ప్రాముఖ్యత రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ రోజు, ఆ నిర్ణయం ఫలించిందని, గతేడాది తాను డాలర్లలో ఐదు అంకెల జీతం కూడా సంపాదించినట్లు పేర్కొంది. ఇతర మహిళలకు ఆమె ఇచ్చే సందేశం ఏంటంటే.. “ప్రసూతి అనేది వృత్తికి ముగింపు కాదు.” అని నొక్కి చెబుతోంది. 

(చదవండి: వివాహిత మహిళలు గూగుల్‌లో ఏం సర్చ్‌ చేస్తున్నారో తెలుసా..!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement