breaking news
carrer
-
IQ Vs EQ: ఏది మిమ్మల్ని గెలిపిస్తుంది?
మన సమాజంలో తెలివితేటలు (IQ) ఉన్నవారిని మేధావులు అని తలకెత్తుకుంటాం. కానీ, విపరీతమైన కోపంతో ఎదుటివారిని తిట్టే మేధావిని, ఒత్తిడి తట్టుకోలేక కుంగిపోయే టాపర్‌ను మనం ఏమనాలి?ఇక్కడే Emotional Intelligence (భావోద్వేగ ప్రజ్ఞ) ప్రాముఖ్యత తెలుస్తుంది. IQ అనేది మీ తల (Head) కి సంబంధించింది అయితే, EQ అనేది మీ హృదయానికి (Heart) కి సంబంధించింది.IQ, EQ మధ్య తేడా ఏంటి?IQ (Intelligence Quotient): ఇది మీ లాజిక్, మెమరీ, ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్. ఇది చాలా వరకు పుట్టుకతో వచ్చేది, పెద్దగా మార్చలేం.EQ (Emotional Quotient): ఇది మీ ఎమోషన్స్ ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఎదుటివారి ఎమోషన్స్ కి ఎలా స్పందిస్తున్నారు అనే సామర్థ్యం. ఇది నేర్చుకోగలిగే స్కిల్.చాలా మంది సక్సెస్ ఫుల్ పీపుల్ లైఫ్ లో మనం గమనించే అతి ముఖ్యమైన అంశం EQ. స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్లందరూ జీవితంలో ఫస్ట్ రాకపోవడానికి, యావరేజ్ స్టూడెంట్స్ ప్రపంచాన్ని ఏలడానికి ప్రధాన కారణం ఈ EQ.The 5 Pillars of EQడేనియల్ గోల్మన్ (Daniel Goleman) ఈ కాన్సెప్ట్‌ను ప్రాచుర్యంలోకి తెస్తూ ఒక మాట చెప్పారు: "IQ మిమ్మల్ని ఉద్యోగంలో చేర్పించవచ్చు, కానీ EQ మిమ్మల్ని ఆ ఉద్యోగంలో ఎదిగేలా చేస్తుంది."గోల్మన్ ప్రకారం, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లో ఐదు ముఖ్యాంశాలు ఉంటాయి.Self-Awareness (స్వయం స్పృహ): మీకు ఎప్పుడు కోపం వస్తుంది? ఎప్పుడు భయం వేస్తుంది? ఆ సమయంలో మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది? అని గమనించడం.Self-Regulation (స్వయం నియంత్రణ): ఎమోషన్స్ కలగడం సహజం, కానీ వాటికి బానిస అవ్వకూడదు. కోపం వచ్చినప్పుడు వెంటనే అరవకుండా, ఒక్క క్షణం ఆగి స్పందించడం.Motivation (ప్రేరణ): డబ్బు లేదా పొగడ్తల కోసం కాకుండా, మీలోని తృప్తి కోసం పని చేయడం. ఓడిపోయినా మళ్ళీ ప్రయత్నించే మొండితనం.Empathy (సహానుభూతి): ఎదుటివారి కళ్ళతో ప్రపంచాన్ని చూడటం. వారు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో వారి కోణంలో అర్థం చేసుకోవడం.Social Skills (సామాజిక నైపుణ్యం): గొడవలను పరిష్కరించడం, టీమ్ ని నడిపించడం, మనుషులతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడం.మోటివేషనల్ స్పీకర్ల పొరపాటుట్రైనర్స్ మనకు "కోపాన్ని అణచుకో, ఎప్పుడూ నవ్వుతూ ఉండు" అని పైపైన చిట్కాలు ఇస్తారు. కానీ సైకాలజీ ప్రకారం, ఎమోషన్ ని అణచివేయడం (Suppression) అంటే ప్రెషర్ కుక్కర్ విజిల్ ఆపేసినట్లే—అది ఎప్పుడో ఒకప్పుడు పేలుతుంది.మార్కెట్ ఎమోషన్స్ ని దాచమంటుంది.సైకాలజీ ఎమోషన్స్ ని ఛానలైజ్ (Channelize) చేయమంటుంది.EQని ఎలా పెంచుకోవాలి?Genius Matrix మోడల్ ఉపయోగించి ఈ ఎమోషనల్ స్ట్రెంత్ ని బిల్డ్ చేద్దాం.Step 1: Break (రియాక్షన్ ని బ్రేక్ చేయండి)మీరు ఒక సంఘటనకు స్పందించే లోపు ఒక 'Gap' క్రియేట్ చేయండి. ఎవరైనా మిమ్మల్ని తిట్టినప్పుడు వెంటనే తిరిగి తిట్టడం మీ పాత ప్రోగ్రామింగ్. ఆ ఆటోమేటిక్ రియాక్షన్ ని 'Break' చేసి, "నేను ఇప్పుడు ఎలా స్పందించాలి?" అని ఆలోచించండి.Step 2: Build (ఎమోషనల్ వొకాబులరీ)చాలామందికి తమకు ఏం అనిపిస్తుందో చెప్పడం రాదు. "నాకు బాధగా ఉంది" అనడానికి బదులు "నాకు కోపంగా ఉంది" అంటారు. మీ ఎమోషన్ కి సరైన పేరు పెట్టడం నేర్చుకోండి. మీ లోపల ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ ఫౌండేషన్ ని 'Build' చేయండి.Step 3: Beyond (స్టాయిక్ మైండ్‌సెట్)పరిస్థితులు ఎలా ఉన్నా, మీ ప్రశాంతతను ఎవరు చెడగొట్టలేనప్పుడు మీరు 'Beyond' స్టేజ్ లో ఉన్నట్లు. ఇతరుల ప్రవర్తన మీ మూడ్ ని శాసించకూడదు. అదే నిజమైన పర్సనాలిటీ గ్రోత్.మీ ఎమోషనల్ చెకప్ఈ రోజు ఈ ప్రశ్నలకు సమాధానం వెతకండి.గత వారంలో మీరు ఎవరిపైనైనా విపరీతంగా అరిచారా? ఆ తర్వాత బాధపడ్డారా? (అక్కడ మీ EQ తక్కువగా ఉందని అర్థం).ఒత్తిడిలో ఉన్నప్పుడు మీరు అతిగా తింటారా? లేక అందరిపై విసుక్కుంటారా?ఎదుటివారు బాధలో ఉన్నప్పుడు మీరు నిజంగా వారి బాధను ఫీలవుతున్నారా?స్మార్ట్ అవ్వడం కంటే స్ట్రాంగ్ అవ్వడం ముఖ్యం!బ్రో, IQ మిమ్మల్ని ఒక మంచి ఇంజనీర్ లేదా డాక్టర్ ని చేయవచ్చు, కానీ EQ మిమ్మల్ని ఒక మంచి లీడర్ ని, మంచి భర్తని/భార్యని, ఒక గొప్ప మనిషిని చేస్తుంది. తెలివితేటలు ఉన్నవాడు గెలుస్తాడేమో కానీ, భావోద్వేగ స్థిరత్వం ఉన్నవాడు మాత్రమే ఆ గెలుపును నిలబెట్టుకోగలడు.గుర్తుంచుకోండి, "Life is 10% what happens to you and 90% how you react to it."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: అద్దంలో కనిపించని అసలు రూపం) -
మోటివేషనల్ రీల్స్ చూస్తున్నారా..? అయినప్పటికీ..
ఈ రోజుల్లో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, కోటు వేసుకున్న ఒక వ్యక్తి స్టేజ్ మీద అరుస్తూ, "నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవు", "నీలో ఒక సింహం ఉంది", "ప్రతిరోజూ అద్దం ముందు నిలబడి నేను తోపు అని చెప్పుకో" అంటూ డైలాగులు కొడుతుంటారు. వీటిని చూసి జనం ఇన్‌స్టంట్‌గా ఉత్తేజానికి లోనవుతారు. కానీ, ఆ వీడియో ముగిసిన అరగంటకే మళ్ళీ పాత భయాలు, పాత బలహీనతలు చుట్టుముడతాయి.ఎందుకు?ఎందుకంటే, మార్కెట్ అమ్ముతున్నది 'మోటివేషనల్ డ్రగ్'. కానీ మనకు కావాల్సింది రియల్ పర్సనాలిటీ డెవలప్మెంట్.మోటివేషన్ అనేది ఒక కప్పు కాఫీ లాంటిది. తాగినప్పుడు కిక్ ఇస్తుంది, ఆ తర్వాత నీరసం వచ్చేస్తుంది. కానీ వ్యక్తిత్వ వికాసం అనేది మన మనసులోని సాఫ్ట్‌వేర్‌ను రీ-రైట్ చేసే ఒక సుదీర్ఘ ప్రక్రియ.సో-కాల్డ్ ట్రైనర్స్ చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే... అందరికీ ఒకే మందు (One size fits all) ఇవ్వాలని చూడటం."ఎప్పుడూ పాజిటివ్‌గా ఉండండి. నెగటివిటీని దరిచేరనీయకండి. అన్నీ మంచివే జరుగుతాయని నమ్మండి" అని చెప్తారు సో-కాల్డ్ ట్రైనర్స్. దీన్ని సైకాలజీలో 'Toxic Positivity' అంటారు.కోపం, భయం, అసూయ, బాధలాంటి నెగటివ్ ఎమోషన్స్ కూడా మనిషిలో ఒక భాగమే. వాటిని అణచివేస్తే అవి లోపల కుళ్ళిపోయి డిప్రెషన్ లేదా యాంగ్జైటీగా మారుతాయి.Real Personality Development అంటే నెగటివ్ ఎమోషన్స్‌ను అణచివేయడం కాదు, వాటిని అంగీకరించడం నేర్చుకోవాలి. నాకు భయం వేస్తోంది అని ఒప్పుకోవడం బలహీనత కాదు, ఆ భయాన్ని జయించడానికి అది మొదటి మెట్టు."నీకు కాన్ఫిడెన్స్ లేకపోయినా ఉన్నట్టు నటించు. అది చూసి లోకం నమ్ముతుంది, మెల్లగా నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది" అంటారు ట్రైనర్స్.కానీ, ఇది మిమ్మల్ని 'Imposter Syndrome' కి గురి చేస్తుంది. లోపల డొల్లతనం ఉండి పైన మేకప్ వేసుకుంటే, ఎక్కడో ఒకచోట ఆ ముసుగు జారిపోతుందనే భయం మిమ్మల్ని మరింత ఒత్తిడికి గురి చేస్తుంది.Real Personality Development అంటే నటించడం కాదు, 'అర్హత'ను (Competence) పెంచుకోవడం. మీరు ఒక పనిలో నిష్ణాతులు అయినప్పుడు, కాన్ఫిడెన్స్ అనేది ఒక బై-ప్రొడక్ట్‌లా దానంతట అదే వస్తుంది.సైకాలజీ ప్రకారం వ్యక్తిత్వం అంటే 'అలవాటు' కాదు, అది ఒక 'ఆర్గనైజేషన్'. వ్యక్తిత్వం అనేది కేవలం మనం నేర్చుకునే స్కిల్స్ కాదు. అది మన అనువంశికత (Heredity), పరిసరాల (Environment) సంక్లిష్టమైన కలయిక.మోటివేషనల్ స్పీకర్లు కేవలం ఈ క్షణం గురించి మాత్రమే మాట్లాడతారు. కానీ సైకాలజీ మీ 'బాల్యం' (Childhood) గురించి మాట్లాడుతుంది.మీ పర్సనాలిటీకి పునాది మీ ఐదేళ్ల వయసులోనే పడిపోయింది. ఆ పునాదిలో ఉన్న పగుళ్లను (Trauma/Negative conditioning) పూడ్చకుండా పైన అంతస్తులు కడితే, ఆ భవనం ఎప్పుడైనా కూలిపోవచ్చు.నేను డెవలప్ చేసిన నా "Genius Matrix" Break. Build. Beyond. మోడల్ ద్వారా ఈ సో-కాల్డ్ ట్రైనర్స్ ఎక్కడ విఫలమవుతున్నారో చూడండి:స్టెప్ 1: Break (పాత పునాదిని కూల్చడం)ట్రైనర్స్ డైరెక్ట్‌గా బిల్డింగ్ కట్టమంటారు. కానీ సైకాలజీ ప్రకారం, ముందు లోపల ఉన్న శిథిలాలను తొలగించాలి.చిన్నప్పుడు మీ నాన్న మిమ్మల్ని అందరిముందు తిట్టినప్పుడు "నేను దేనికీ పనికిరాను" అని మీ మనసులో పడ్డ ముద్రను చెరిపేయకుండా, పైన మీరు ఎన్ని "సక్సెస్ మంత్రాలు" చదివినా ఉపయోగం లేదు.మీ బలహీనతలు, మీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కడ మొదలయ్యాయో గుర్తించి, ఆ పాత సెల్ఫ్-ఇమేజ్ను బ్రేక్ చేయడమే అసలైన వికాసం.స్టెప్ 2: Build (లోపలి నుంచి బయటికి)ఇక్కడ మనం బాహ్య ప్రదర్శనపై కాకుండా, అంతర్గత విలువలపై దృష్టి పెడతాం.ఒక వ్యక్తి తన గురించి తాను ఏమనుకుంటున్నాడు (Real Self) అనేది కీలకం. మీరు అద్దంలో చూసుకున్నప్పుడు ఒక "సక్సెస్ ఫుల్ పర్సన్" కనిపించాల్సిన అవసరం లేదు, ఒక "నిజాయితీ గల మనిషి" కనిపిస్తే చాలు.గొడవ జరిగినప్పుడు అరవకుండా ఉండటం 'కమ్యూనికేషన్ ట్రిక్' కాదు, అది మనసును కంట్రోల్ చేసే 'మెంటల్ స్ట్రెంత్'.స్టెప్ 3: Beyond (పరిమితుల ఆవల - లెగసీ నిర్మించడం)మార్కెట్ కోరుకునేది 'సక్సెస్'. సైకాలజీ కోరుకునేది 'సాటిస్ఫాక్షన్', 'గ్రోత్'.ఎదుటివారిని ఇంప్రెస్ చేయడం మానేసి, మీరు మీ కోసం బ్రతకడం మొదలుపెట్టినప్పుడు మీరు 'Beyond' స్టేజ్‌లోకి వెళ్తారు. ఇక్కడ మీ పర్సనాలిటీలో ఒక Depth ఉంటుంది. Abraham Maslow చెప్పిన 'Self-Actualization' అంటే ఇదే.ఉదాహరణకు ఒక వ్యక్తికి స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే భయం (Stage Fear). "నువ్వు పులివి.. నువ్వు వెళ్ళి స్టేజ్ మీద ఊగిపో.. కేకలు వేయ్.. జనం చప్పట్లు కొడతారు" అంటాడు మోటివేషనల్ స్పీకర్. ఇది ఒకసారి వర్కౌట్ అవ్వొచ్చు, కానీ భయం పోదు.మరేం చేయాలి?ఆ వ్యక్తి ఎందుకు భయపడుతున్నాడు? విమర్శలు ఎదుర్కోవడానికి సిద్ధంగా లేడా? (Perfectionism). ఎదుటివారు ఏమనుకుంటారో అనే Social Anxiety ఉందా? తన దగ్గర సరైన కంటెంట్ లేదా? అనే అంశాలను పరిశీలించాలి.ముందుగా ఆ వ్యక్తి తనలోని లోపాలను అంగీకరించేలా చేయడం.చిన్న చిన్న గ్రూప్స్ ముందు మాట్లాడించి 'ఎక్స్పోజర్' ఇవ్వడం.స్టేజ్ మీద మాట్లాడటం అంటే 'తన్ను తాను నిరూపించుకోవడం' కాదు, 'సమాచారాన్ని పంచడం' అనే మైండ్‌సెట్ మార్పు తేవడం.ఇది Real Personality Development.చివరగా నేను చెప్పేది ఒక్కటే... పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఒక మోడల్లా నడవడం కాదు, ఒక నాయకుడిలా మాట్లాడటం కాదు.మీ మనసులో ప్రశాంతత ఉందా?మీరు ఇతరులతో ఆరోగ్యకరమైన సంబంధాలను కలిగి ఉన్నారా?కష్టాల్లో ఉన్నప్పుడు కుంగిపోకుండా నిలబడుతున్నారా?మీ తప్పులను మీరు ఒప్పుకోగలుగుతున్నారా?ఇవేవీ మార్కెట్లో లభించే రెండు రోజుల వర్క్‌షాప్‌లలో దొరకవు. వీటికి లోతైన ఆత్మపరిశీలన, శాస్త్రీయ దృక్పథం అవసరం.మనం ఈ Real Personality Development సిరీస్‌లో మాట్లాడబోయేది ఆ లోతైన సత్యాల గురించే.ఇక్కడ సో-కాల్డ్ మోటివేషన్ ఉండదు... కేవలం సైకలాజికల్ ట్రాన్స్ఫార్మేషన్ మాత్రమే ఉంటుంది.సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: ప్రెండ్స్..నా స్నేహితుడిలా అలాంటి పొరపాటు చెయ్యొద్దు..!) -
ఆధునిక తల్లుల వయసు..!
ఆలస్యంగా తల్లికావడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు నేటితరం మహిళలు. కెరీర్‌కే తొలి ప్రాధాన్యత ఇవ్వడమే దీనికి కారణం. ఇంటి ఖర్చులు, పిల్లల పెంపకం, చదువుల కోసం అయ్యే ఖర్చులను భరించే సామర్థ్యం వచ్చాకే మాతృత్వం వైపు అడుగులు వేస్తున్నారు.2024లో 37 శాతం మంది తల్లులు 25–29 ఏళ్ల మధ్య వయసువారే. మాతృత్వానికి ఇదే సరైన వయస్సుగా నేటి మహిళలు భావిస్తున్నారు.19 ఏళ్ల లోపు తక్కువ వయస్సులో తల్లులయ్యే వారి సంఖ్య అభివృద్ధి చెందిన దేశాలలో గణనీయంగా తగ్గింది. అయితే కొన్ని వర్గాలలో గతంలోలాగే ఉంది.30–34 ఏళ్ల వయస్సులో తల్లులయ్యే వారి సంఖ్య 2.5 రెట్లు పెరిగింది. 2005లో 9.9 శాతం ఉండగా 2024లో 24.6 శాతానికి చేరుకుంది.గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళల్లో 34.8 శాతం మందికి ఒక్కరే సంతానం, 31.4 శాతం మందికి ఇద్దరు పిల్లలు, 15.9 శాతం మందికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. విద్యావంతులైన మహిళలు చిన్న కుటుంబాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు.2005లో 25 ఏళ్ల లోపు తల్లులు 48.9 శాతం ఉన్నారు. ప్రస్తుతం 29.7 శాతం ఉన్నారు. 30 ఏళ్ల పైబడిన మహిళల్లో తల్లులు అయినవారు గతంలో 21.6 శాతం, ఇప్పుడు 33 శాతం ఉన్నారు. ఇప్పుడు ప్రతి ముగ్గురు తల్లులలో ఒకరు 30 ఏళ్లు పైబడిన వారే.ఈ రెండు దశాబ్దాల కాలంలో 20–24 ఏళ్ల వయస్సులో తల్లులయిన వారి సంఖ్య 46.6 శాతం నుండి 27.1 శాతానికి తగ్గింది.(చదవండి: పార్లమెంట్ సమావేశాల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా కంగానా..!) -
తండ్రి ఇచ్చిన సలహా ఆమె జీవితాన్నే మార్చేసింది..! ఇవాళ సీఈవోగా..
ప్రతి వ్యక్తిలో అంతర్లీనంగా ఎంతో కొంత ప్రతిభ దాగి ఉంటుంది. అయితే ఉప్పొంగేలా బయటకు రావాలంటే..బలమైన గాయం లేదా ఎదురదెబ్బ తగిలినప్పుడే కసితో బయటకు వస్తుంది. లేదా ఎవ్వరైనా..మనల్ని విమర్శిస్తూ ఇచ్చే సలహాలు జీవితాన్ని అనుహ్యంగా మలుపుతిప్పుతాయి. అలా తండ్రి కారణంగా మంచి యూటర్న్ తీసుకుంది ఆమె జీవితం. ప్రపంచం ముందు ఓ గొప్ప హోదాలో ఉన్న ప్రముఖ వ్యక్తిగా నిలిచేలా చేసింది. ఇది ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన గొప్ప పేరెంటింగ్ పాఠం కూడా. ఆమెనే యాక్సెంచర్ సీఈవో జూలీ స్వీట్. ఆమె ఏమి వారసత్వంగా కంపెనీకి సీఈవోగా అయిపోలేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఓ మారుమూల పట్టణం నుంచి క్లర్క్‌గా ఉద్యోగ జీవితం మొదలు పెట్టి తన అపారమైన ప్రతిభ పాటవాలతో ఓ ప్రముఖ కార్పొరేట్ కంపెనీకి సీఈవో అయ్యిందామె. ఈ విజయం తన తండ్రి సపోర్ట్ వల్లే వచ్చిందని చెబుతుంటారామె. కారు పెయింటర్, ఆర్మీ వ్యక్తి అయినా ఆమె తండ్రి జూలీకి డబ్బు సంపాదన గురించి తరుచుగా చెబుతుండేవాడు. ఒకరోజు ఆ తండ్రి కూతుళ్ల మధ్య జరిగిన సంభాషణ కూతురు జీవితాన్ని అనూహ్యమైన మలుపు తిప్పి అత్యున్నత స్థాయిలో నిలబెట్టింది. ఆ విషయాన్ని సీఈవో జూలీ స్వీట్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తాను ఒక డిబేట్ టోర్నమెంట్ సెమీఫైనల్లో ఓటమిని చవిచూశానని నాటి సంఘటనను గుర్తుచేసుకుందామె. ఆ డిబేట్ పోటీలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడి కుమార్తె విజేతగా నిలిచింది. దాంతో తాను తన తండ్రితో తన బాధను పంచుకున్నట్లు చెప్పుకొచ్చింది జూలీ.ఆమె లయన్స్ క్లబ్ కుమార్తె కాబట్టేగా ఫస్ట్ ఫ్రైజ్ ఇచ్చారు అంటూ తన నిరాశాసను వ్యక్తం చేసింది తండ్రి దగ్గర. దానికి అతడి తండ్రి నుంచి వచ్చిన శక్తిమంతమైన ప్రతిస్పందన జూలీ మనసుని బలంగా తాకింది. "నువ్వు ఎప్పటికీ లయన్స్ క్లబ్ కుమార్తెవి కాలేవన్నది నిజం. అంటే ఇక్కడ నువ్వు మెరుగ్గా ఉండేలి అదే నన్ను ప్రత్యేకంగా నిలబెట్టగలదు. ఈ ప్రపంచం న్యాయం గురించి మాట్లాడదు..అచంచలమైన టాలెంట్ ఉన్నవాడికి ఫిదా అవుతుంది. అదే గుర్తుపెట్టుకో ఈ క్షణం నువ్వు మెరుగ్గాలేవు అందువల్లే గెలవలేకపోయావు. విజేత కావాలనుకుంటే అనుక్షణం నిన్ను నువ్వు మెరుగుపరచుకుంటేనే వెనుకబడవు." అని తండ్రి సూచించాడు. ఆ మాటలు ఆమె మనసులో బలంగా నాటుకుపోయాయి. దాంతో ఆమె వెనుకబడటం అన్న మాట దరిచేరనీయకూడదు అని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యింది. అలా తన ప్రతిభను సానబెట్టుకుంటూ టీనేజ్ వయసులో ఒక క్లర్క్‌గా ఉద్యోగం సంపాదించుకుంది. అక్కడ నుంచి ఒక్కో మెట్టు ఎదుగుతూ..న్యాయ సంస్థ క్రావత్ స్వైన్ & మూర్ నుంచి యాక్సెంచర్ జనరల్ కౌన్సెల్ సీఈవో స్థాయికి ఎదిగేలే చేసింది. బలహీనతలను జయిస్తూ..తన చుట్టూ ఉన్న ప్రపంచం కంటే మెరుగ్గా ఉండటంపై శ్రద్ధ పెట్టింది, నేర్చుకోవడం అనేదాన్ని ఎన్నటికి వదలిపెట్టలేదు. అదే తన సక్సెస్ మంత్ర అని సగర్వంగా చెప్పింది జూలీ. ఇది నిజంగా గొప్ప పేరెంటింగ్ పాఠం. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఓటమిని నిజాయితీగా అంగీకరించేలా చేస్తూ..తనలో ఆత్మవిశ్వాసాన్ని చైతన్యవంతం చేయాలి.విజయం కోసం ఏం చేస్తే మంచిది అనేది సూటిగా చెప్పాలి. ఆ మాటలు పిల్లవాడిలో ఓటమికి చెక్ చెప్పేలా తయారయ్యేలా ఉండాలి. అంతేతప్ప ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా, ఇతరులతో పోల్చి చులకనభావం కలిగించేలా ఉండకూడదు. తల్లిదండ్రుల నోటి నుంచి వచ్చే ప్రతి మాట పిల్లవాడిపై తీవ్ర ప్రభావం చూపుతుందనేందుకు ఈ యాక్సెంచర్ సీఈవో జూలీ స్వీట్ కథే ఉదాహరణ.(చదవండి: Punita Arora: ఎవరీ పునీతా అరోరా..? సైన్యం, నేవీలలో అత్యున్నత హోదాలు..) -
బర్త్‌డే స్పెషల్: సూర్య కెరీర్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రాలివే! (ఫొటోలు)
-
'కెరీర్'.. వెరీ కేర్‌ఫుల్..!
ప్రస్తుతం నగరం చదువుల ఉత్సాహంతో ఉప్పొంగిపోతోంది. ఎక్కడ చూసినా నోటిఫికేషన్లు, ఎంట్రెన్స్ ఫలితాలు, ర్యాంకుల ఆధారంగా కాలేజీ ఎంపికలు, సీట్ల కేటాయింపులు, కౌన్సెలింగ్‌ల ప్రక్రియల చర్చలు హోరెత్తుతున్నాయి. ఈ వాతావరణంలో విద్యార్థులూ, వారి తల్లిదండ్రులూ సందేహాలు, అనుమానాలతో ముందస్తు మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ సమయంలో పలు కోర్సులపై, కాలేజీలపై, కెరీర్ అవకాశాలపై స్పష్టత లేనిదే నిర్ణయాలు తీసుకుంటే.. అది భవిష్యత్తు పట్ల ప్రమాదకరంగా మారుతుంది. ఈ నేపథ్యంలో చదువుల ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం, వివిధ కోణాల్లో విశ్లేషించడం తప్పనిసరిగా మారింది. ఇది కేవలం చదువు గురించి కాదు.. జీవితం గురించి. ఒక నిర్ణయం మీ జీవితానికి దిశ చూపుతుంది. మరి ఆ నిర్ణయం, నిజమైన సమాచారం ఆధారంగా ఉండాలి. ట్రెండ్లు చూసో, ఇష్టమైన రంగం అనో కాకుండా వాస్తవ పరిస్థితుల ఆధారంగా ముందుకు సాగడం ముఖ్యమని నిపుణుల సూచన. విద్యార్థులు ఏ కోర్సు ఎంచుకోవాలి? ఎలాంటి కాలేజీ ఏ రంగానికి బాగా అనుకూలం? జాబ్ మార్కెట్లో ఏ రంగానికి డిమాండ్ ఉంది? ఇవన్నీ తెలుసుకోవడమే మొదటి మెట్టు. సమాచారం మూడు మార్గాల్లో సులభంగా లభిస్తుంది. ముఖ్యంగా ఎంట్రన్స్ పరీక్షల తేదీలు, అప్లికేషన్లు, కౌన్సెలింగ్, సరి్టఫికెట్ వెరిఫికేషన్ తదితర తేదీలను ఎప్పటికప్పుడు అధికారిక వెబ్సైట్లలో తెలుసుకుంటుండాలి. ప్రభుత్వ వెబ్సైట్లు (తప్పనిసరిగా చూడాల్సినవి): టీజీ ఈఏపీసీఈటీ, నీట్, సీయూఈటీ వంటి పరీక్షల అధికారిక వెబ్సైట్లు, ఏఐసీటీఈ, యూజీసీ వంటి ప్రభుత్వ శిక్షణ సంస్థల వెబ్సైట్లు.నిపుణుల సలహాలు: కెరీర్ కౌన్సెలర్లు, సబ్జెక్ట్ నిపుణులు, సైకాలజిస్టులు విద్యార్థుల ప్రొఫైల్ ఆధారంగా సరైన మార్గదర్శనం అందించగలరు. ఉదాహరణకు ‘యూనివర్సిటీ, కెరీర్ ల్యాబ్స్, బైజూస్ కెరీర్ కౌన్సెలింగ్, టీసీఎస్ ఐఆన్’ వంటి ప్లాట్‌ఫాంలు ఉపయుక్తం.పూర్వ విద్యార్థుల అనుభవాలు: ఆయా కాలేజీల పూర్వ విద్యార్థులను సంప్రదించడం వల్ల కాలేజీ రియాలిటీ, ఫ్యాకల్టీ, ప్లేస్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి విషయాల్లో స్పష్టత వస్తుంది. తల్లిదండ్రుల పాత్ర.. పిల్లల కలలు మీ కోరికలు కావొద్దు. పిల్లల ఆసక్తులు, సామర్థ్యాలు, నైపుణ్యాలు, వ్యక్తిత్వ లక్షణాల ఆధారంగా గైడెన్స్ ఇవ్వాలి. ఎదుటివారి పిల్లలు చేసినట్లు చేయాలని అనడం ద్వారా పిల్లలపై ఒత్తిడి తీసుకురావద్దు. ఎవరి మాట నమ్మాలి..? ఫేక్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్లు: వీరి మాటలు చాలాసార్లు మోసం చేస్తాయి. వారి చెప్పినంతగా స్కాలర్ షిప్స్, సీట్లు ఉండవు. సోషల్ మీడియాలో డైరెక్ట్ యాడ్స్: వీరిని నమ్మొద్దు.. గుర్తింపు లేని సంస్థల్లో అవకతవకలు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ టోల్ ఫ్రీ నంబర్లలో సమాచారం ఉత్తమం. కార్యాచరణ సూచనలు.. నాకు ఏవైనా ఆసక్తులు ఉన్నాయా? నేనేం బాగా చేయగలను? అనే స్వీయ విశ్లేషణ అవసరం. స్కూల్, కాలేజీ కౌన్సెలర్లు/సీనియర్ల ప్రాథమిక గైడెన్స్ తీసుకోవడం ఆన్లైన్లో సర్టిఫైడ్ కౌన్సెలింగ్ పొందడం. చివరి ఎంపికకు ముందు కనీసం ఇద్దరు–ముగ్గురు నిపుణులను సంప్రదించండి. తప్పక తెలుసుకోవాల్సిన కోర్సులు.. ఇంజినీరింగ్ (బీ.టెక్): సీఎస్సీ, ఈసీఈ, ఏఐఎమ్ఎల్, సైబర్ సెక్యూరిటీ వంటి కొత్త స్పెషలైజేషన్లు డిమాండ్‌లో ఉన్నాయి. జేఎన్టీయూ, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, సీబీఐటీ, వీఎన్ఆర్ వంటి కాలేజీలు మంచి పేరు తెచ్చుకున్నాయి. మెడిసిన్ (ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎమ్ఎస్, బీహెచ్ఎమ్ఎస్): నీట్ ఆధారంగా అఖిల భారత, రాష్ట్రస్థాయి కోటాలో సీట్లు లభిస్తాయి. ప్రైవేట్ కాలేజీలు ఫీజులు చాలా ఎక్కువ. ప్రభుత్వ కాలేజీలు అయితే అత్యుత్తమమైనవి. లిబరల్ ఆర్ట్స్, మాస్ కమ్యూనికేషన్, డిజైన్: ఎన్ఐడీ, నిఫ్ట్, ఎఫ్ఎల్ఏఎమ్ఈ యూనివర్సిటీ వంటి సంస్థలు ఆర్ట్స్‌కి ప్రాధాన్యతనిచ్చే విద్యార్థులకు అనుకూలం. వృత్తి విద్యా కోర్సులు(డిప్లొమా, ఐటీఐ, పారామెడికల్): తక్కువ ఖర్చుతో, త్వరగా ఉపాధి అవకాశాలు ఇవ్వగలిగే కోర్సులు కావాలంటే ఇవి బెస్ట్. రాష్ట్ర ప్రభుత్వాల మేనేజ్డ్ ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యా సంస్థలు ఈ కోణంలో మంచి పనితీరు కనబరుస్తున్నాయి. డిగ్రీ (అండర్ గ్రాడ్యుయేషన్–యూజీ): ఇది విద్యార్థి కెరీర్‌కు బేసిక్‌గా పనిచేసే దశ. మూడేళ్ల (బీఏ, బీఎస్సీ, బీకాం) నుంచి నాలుగేళ్ల (బీటెక్, బీ.ఫార్మా) వరకు కోర్సులు ఉన్నాయి. యూజీలో ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న బీఎస్సీ డేటా సైన్స్, న్యూట్రీషన్, ఫోరెన్సిక్ సైన్స్.. బీకాం ఫిన్‌టెక్, బిజినెస్ అనలైటిక్స్.. బీఏ సైకాలజీ, మాస్ కమ్యూనికేషన్స్ వంటి రంగాలపై దృష్టి పెట్టాలి. డిగ్రీలో నేర్చుకున్న ఫౌండేషన్ బలంగా ఉంటే పీజీలో విశ్లేషణాత్మక విద్యనూ, పరిశోధనాత్మక దృక్పథాన్నీ పొందొచ్చు. పీజీ (పోస్ట్‌గ్రాడ్యుయేషన్): పీజీ అనేది యూజీలో పొందిన జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకునే దశ. ఇది రెండు సంవత్సరాల కోర్సు. ఉద్యోగ అవకాశాలు మెరుగుపర్చుకోవడానికి లేదా అధ్యాపక వృత్తిలోకి రావడానికి పీజీ ఉపయోగపడుతుంది. కొన్ని కోర్సులకు ప్రత్యేక ఎంట్రెన్స్ అవసరం: క్యాట్–ఎంబీఏ, సీయూఈటీ పీజీ లేదా టీజీ సీపీజీఈటీ–ఎమ్ఏ, ఎమ్మెస్సీ, ఎమ్‌కాం, గేట్–ఎమ్‌టెక్, నీట్ పీజీ–మెడికల్ పీజీ కోర్సులు. పీహెచ్డీ (డాక్టరల్ రీసెర్చ్): పరిశోధన రంగం అంటే సీరియస్‌గా గమనించాల్సిన అంశం. పీహెచ్డీ విద్యార్థి కొంత కాలం లోతుగా ఒక సబ్జెక్ట్ మీద పరిశోధన చేస్తూ సొంత థీసిస్ అందజేసే దశ. అభ్యాసం, పరిశోధన మీద ఆసక్తి ఉన్నవారికి మాత్రమే పీహెచ్డీ సరైన మార్గం. యూజీసీ–నెట్, సీఎస్ఐఆర్–నెట్, గేట్, జేఆర్ఎఫ్ వంటి పరీక్షల ద్వారా స్కాలర్‌షిప్‌తో చేరొచ్చు. హై–ఎండ్ కార్పొరేట్ ఆర్అండ్డీ, యూనివర్సి టీలలో ప్రొఫెసర్ ఉద్యోగాలు సాధించాలంటే పీహెచ్డీ అవసరం. (చదవండి: 114 ఏళ్ల వయసులోనూ హుషారుగా.. ఆయన ఫిట్నెస్ సీక్రెట్ ఇదే!.. కానీ..) -
ఇంటర్ తర్వాత వాట్ నెక్స్ట్..? టెన్షన్ వద్దు..
ఇంటర్మీడియట్ పూర్తవగానే విద్యార్థి జీవితంలో మొదలయ్యే అసలైన టెన్షన్– ‘ఇప్పుడేం చేయాలి?’ పేరెంట్స్, టీచర్స్, బంధువులు, ఫ్రెండ్స్ రకరకాల సలహాలిస్తుంటారు. ‘‘ఇంజినీరింగ్ చెయ్, ఫ్యూచర్ బాగుంటుంది.’’‘‘నీట్ రాయి, ఎంబీబీఎస్ అయిపోతే జీవితం సెట్ అవుతుంది.’’‘‘బీకామ్ తీసుకుని సీఏ చెయ్యి, ఉద్యోగం కోసం వెతుక్కోవాల్సిన అవసరమే ఉండదు.’’ఈ సలహాలు విని గుడ్డిగా ఒకదాన్ని ఎంచుకోవడం కాదు. మీకు సరిపోయే దారి కనిపెట్టడమే అసలైన విజయం.మీ మనసేం చెప్తోంది? ఇంటర్ తర్వాత ఏం చేయాలో ఇంకా అర్థం కాలేదంటే అది మీ తప్పు కాదు. ఎవరూ సరైన ప్రశ్నలు అడగలేదని మాత్రమే. అందుకే మీ మనసేం చెప్తుందో అడగండి. ఇది నిజంగా నా దారేనా? నేను నేనుగా ఉండే దారేది? నాలోని విజేతను వెలికితీసే కోర్సు ఏది? నాలో నిద్రిస్తున్న టాలెంట్‌ను తట్టి లేపే దిశ ఏది? వీటికి సమాధానం దొరకలేదా, కెరీర్ కౌన్సెలింగ్ మీకు సహాయపడుతుంది. మిమ్మల్ని మెప్పించే దారి కాకుండా, మీరు గర్వపడే దారిని చూపిస్తుంది. కొత్త దారిలో నడవండి...ఇంటర్ తర్వాత అనేక ప్రవేశపరీక్షలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. వాటిలో జయాపజయాలు మీ జీవితాన్ని నిర్ణయించలేవు. పరీక్షలు ఆటల్లాంటివి. మీ గెలుపు ఆటలో కాకుండా, మీ ఆట మీరే రాసుకున్నప్పుడు వస్తుందని గుర్తించండి. ఇంటర్మీడియట్ తర్వాత ఇంజినీరింగ్, మెడిసిన్, సీఏ తీసుకోకుంటే జీవితం వృథా అనే సలహాలు మిమ్మల్ని తప్పుదారి పట్టించేవిగా ఉంటాయి. సంప్రదాయ కోర్సులు కాకుండా, కొత్త దారిలో నడిచేందుకు ధైర్యం చేయండి. బైపీసీ తర్వాత మెడిసిన్ తప్ప మరేం చేసినా వేస్ట్. బైపీసీ తర్వాత మెడిసిన్ ఒక మార్గం మాత్రమే. మెడిసిన్ సీటు రాకుంటే జీవితం ఆగిపోయినట్లేం కాదు. న్యూట్రిషన్, ఫోరెన్సిక్ సైన్స్, జెనెటిక్స్, బయో ఇన్ఫర్మాటిక్స్, అగ్రిటెక్లాంటి రంగాలు మంచి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఎంపీసీ అంటే బీటెక్, లెక్కలే!ఎంపీసీ తర్వాత ఐఐటీలోనో, ఎన్ఐటీలోనో సీటు రాకపోతే కొంపలేం మునిగిపోవు. ఆర్కిటెక్చర్, డేటాసైన్స్, డిఫెన్స్ (ఎన్డీఏ), రోబోటిక్స్, ఏఐ వంటి మోడర్న్, ఫ్యూచరిస్టిక్ రంగాల్లో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కామర్స్ అంటే సీఏ తప్ప దారిలేదుకామర్స్ స్ట్రీమ్‌లో సీఏ ఒక్కటే కాదు. మరెన్నో కోర్సులు, అవకాశాలు ఉన్నాయి. ఫిన్ టెక్, బిజినెస్ అనలిటిక్స్, ఈవెంట్ మేనేజ్మెంట్, డిజిటల్ బ్రాండింగ్, క్రిప్టో స్ట్రాటజీ వంటి అధునాతన కెరీర్స్ ఇప్పుడు కామర్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారిని అంతర్జాతీయ స్థాయిలో నిలుపుతున్నాయి. ఆర్ట్స్ తీసుకుంటే స్కోప్ ఉండదు.. ఇది ఒక పెద్ద అపోహ. ఏ స్ట్రీమ్ చదువుతున్నామనే దానికంటే అందులో ఏ స్థాయిలో చదువుతున్నామనేది ముఖ్యం. సైకాలజీ, పబ్లిక్ పాలసీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్, మీడియా, కాగ్నిటివ్ సైన్స్ లాంటి సృజనాత్మత, మేధా రంగాలు కొత్త దారులు చూపిస్తున్నాయి. దారి చూపించే మూడు ప్రశ్నలు...ముఖ్యమైన విషయమేమిటంటే, నిజానికి ఇది కోర్సు ఎంచుకునే దశ కాదు. ఇది జీవితాన్ని డిజైన్ చేసుకునే దశ. వందల కోర్సులు ఉన్నా, మీకు సూటయ్యే కోర్సు ఒక్కటే. అది మీకు ప్యాషన్ కలిగించాలి.అది మీకు పర్పస్ నేర్పించాలి.అది మీకు అవకాశాలను తెచ్చిపెట్టాలి.అందుకే ఈ దశలో సమాజం చూపించే మార్గాల కన్నా, మీ లోపల ఉన్న ఓపిక, ఊహ, ఉత్సాహం ఏ దిశ చూపుతుందో వినాలి. ఆ మార్గాన్ని ఎంచుకోవాలి. అందుకోసం మీరు మూడు ప్రశ్నలు వేసుకోవాలి. నాకు నచ్చేది ఏంటి? ఏ పని చేస్తుంటే కాలం తెలియకుండానే గడిచిపోతుంది? అదే మీ ఫ్యాషన్. నాకు బాగా వచ్చేది ఏంటి? ఇంకొకరికి వదలకుండా చేయగలిగే పని ఏది? అదే మీ బలం. నాకు ఎలాంటి జీవితం కావాలి? స్వేచ్ఛా? గౌరవమా? సృజనాత్మకతా? ప్రభావమా? అదే మీ విజన్. ఈ మూడు సమాధానాలు కలిసి మీలోని గందరగోళాన్ని తుడిచేసి స్పష్టమైన వ్యూహంగా మార్చుతాయి. సెల్ఫ్ అండ్ అవేర్నెస్ + స్కిల్ అండ్ మ్యాపింగ్ + ఫ్యూచర్ విజన్= రైట్ కెరీర్. ఈ ఫార్ములాతో నడిస్తే కోర్సు మాత్రమే కాదు, జీవితం మారుతుంది. డిగ్రీ కాకుండా డైరెక్షన్ వస్తుంది. కేవలం ఉద్యోగం కాకుండా ఊపిరిలాంటి పని వస్తుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్!సైకాలజిస్ట్ విశేష్www.psyvisesh.com(చదవండి: జస్ట్ వాడిపడేసిన వాటితో అద్భుతమైన తోట..! మరింత అందంగా ఇల్లు..) -
‘అదే నన్ను సాధారణ ఉద్యోగి నుంచి మైక్రోసాఫ్ట్ సీఈవోని చేసింది’
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్‌కు నాయకత్వం వహిస్తానని ఊహించలేదని అన్నారు. 1992లో మైక్రోసాఫ్ట్‌లో యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా అడుగుపెట్టిన తాను కంపెనీ సీఈవో అవుతానన్న ఆలోచన కూడా లేదంటూ లింక్డిన్ సీఈవో ర్యాన్ రోస్లాన్స్కీ నిర్వహించిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా ‘1992లో 22 ఏళ్ల వయసులో మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగంలో చేరాక, ఈ ప్రపంచంలోనే గొప్ప ఉద్యోగం చేస్తున్నానని అనుకునేవాణ్ని. నేను చేస్తున్న పని గొప్పదనే భావనతో ఉండేవాణ్ని. మరో చోటికి వెళ్లి ఉద్యోగం చేయాలనే ఆలోచన నాకు ఉండేది కాదు’ అని అన్నారు. చేస్తున్న ఉద్యోగంలో ఎదుగుదల లేదని, వేరే ఆఫీస్‌లో చేరదాం అనే ఆలోచనతో కాకుండా.. ప్రస్తుతం ఆఫీస్‌లో మీరు చేస్తున్న పాత్రని విజయవంతంగా పోషించండి. మైక్రోసాఫ్ట్‌లో నేను నేర్చుకున్న పాఠం ఇదే. మీరు బాగా పనిచేసేందుకు మరో ఉద్యోగం కోసం ఎదురుచూడొద్దు. మొత్తం 30 ఏళ్ల మైక్రోసాఫ్ట్ కెరియర్లో నేను చేస్తున్న ఉద్యోగం గురించి ఎప్పుడూ ఆలోచించిన సందర్భం లేదు. నేను అక్కడ చేస్తున్న ఉద్యోగం చాలా ముఖ్యమైన విషయంగా భావించినట్లు వివరించారు. మీ ప్రస్తుత ఉద్యోగాన్ని మీ కెరీర్ లక్ష్యాలను చేరుకోవడానికి అడ్డంకిగా భావించడానికి బదులుగా ఆసక్తిని, అంకితభావాన్ని, నేర్చుకోవడాన్ని ఓ అవకాశంగా భావించాలి. ఈ మనస్తత్వాన్ని అవలంబించడం ద్వారా మీరు అనుకున్న లక్ష్యాల్ని అంటే ప్రమోషన్లు లేదా శాలరీల పెంపును వేగంగా పొందగలుగుతారని అన్నారు. చేస్తున్న పని వల్ల ఎదుగుదల ఉండడం లేదని అనిపిస్తే మీరు ఎప్పటికీ ఎదగలేరని సూచించారు. ఇప్పటికీ చాలా మంది కెరీర్‌కు సంబంధించి మంచి సలహా ఇవ్వమని అడుగుతుంటారు. వారికి నేను చెప్పేదొక్కటే.. మీరు బాగా పనిచేసేందుకు మరో ఉద్యోగం కోసం ఎదురుచూడొద్దని చెబుతాను. నేను సీఈవో అయ్యే ముందు రోజు వరకు నాకు అలాంటి ఆలోచనేలేదు అని లింక్డిన్ సీఈవో ర్యాన్ రోస్లాన్స్కీ నిర్వహించిన ఇంటర్వ్యూలో సత్యనాదెళ్ల తన మనసులో మాటని బయటపెట్టారు. చదవండి👉 కోడింగ్ రానక్కర్లేదు.. మైక్రోసాఫ్ట్ మరో సంచలనం! -
ఆ హీరోలతో నటించినప్పుడు చాలా ఒత్తిడికి గురయ్యా : అమలాపాల్
విభిన్నమైన పాత్రలతో తనకంటూ దక్షిణాదిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ అమలాపాల్. మైనా చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ భామ ఆ తర్వాత తెలుగు, తమిళ ఇండస్ట్రీలో పలు హిట్ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. సినీ ఇండస్ట్రీకి అమలాపాల్ పరిచయమై 12 ఏళ్లు అవుతుంది. ఈ సందర్బంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. 'కెరీర్ ఆరంభంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నా. నా కన్నా పెద్ద వయసులో ఉన్న హీరోలతో నటించాను. ఆ సమయంలో చాలా ఒత్తిడికి గురయ్యాను. కానీ నటిగా వాళ్లనుంచి ఎంతో నేర్చుకున్నా. జీవితంలో ఒకానొక సందర్భంలో చాలా క్లిష్ట పరిస్థితులు ఫేస్ చేశాను. సక్సెస్ కోసం పాకులాడినట్లు అనిపించింది. నిజానికి దూరంగా బతుకుతున్నట్లు ఫీలయ్యా. ఆ సమయంలో ఎంతో మదనపడ్డాను. సినిమాలకు గుడ్‌బై చెప్పాలనుకున్నా. మా నాన్ని చనిపోయిన సందర్భంలో ఎన్నో భయాలు వెంటాడాయి. కోలుకోవడానికి సమయం పట్టింది. కానీ పోరాడి నిలబడగలిగాను' అంటూ చెప్పుకొచ్చింది. చదవండి: షాకింగ్: స్టార్ డైరెక్టర్‌కు 6నెలల జైలు శిక్ష.. ఎందుకంటే -
మీరు చాలా అదృష్టవంతులు!
మా రోజులతో పోలిస్తే ఈరోజుల్లో యువతకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. విస్తృతమైన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. యువత తమ లక్ష్యాన్ని చేరువకావడానికి ఒక సులువైన దారి ఏర్పడి ఉంది. అందుకే అంటున్నాను...మీరు అదృష్టవంతులని. మా నాన్నగారు నాకో మంచి సలహా ఇచ్చారు: ‘‘నువ్వు ఏదైనా కోరుకుంటే- ఆ కోరుకున్నది లభిస్తే... మంచిది. నువ్వు కోరుకున్నది లభించకపోతే- ఇంకా మంచిది! ఎందుకంటే ఒకటి జరగడం, జరగకపోవడం అనేది నీ కృషితో పాటు భగవంతుడి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. మనకు చెడు చేయాలని ఆయన అనుకోడు కదా!’’కోరుకున్నది దొరకనంత మాత్రాన నిత్య అసంతృప్తితో జీవితాన్ని వృథా చేసుకోవద్దని, చేస్తున్న పనికి చిత్తశుద్ధితో న్యాయం చేయాలనీ అనేవారు ఆయన. ఇక జయాపజయాల గురించి వస్తే, విజయం ఒక్కసారిగా వచ్చి మన ముందు నిల్చోదు. పరాజయాలు మన ఓపికను పరీక్షిస్తాయి. నా విషయానికి వస్తే, కెరీర్ మొదట్లో రకరకాల అవమానాలు ఎదుర్కొన్నాను. ‘ఒకరితో మాట పడడం ఎందుకు?’ అని అని నేను అనుకొని ఉంటే, హీరోను అయ్యేవాడిని కాదు. నలుగురికీ తెలిసేవాడిని కాదు. లక్ష్యాన్ని చేరుకుంటామా? లేదా? అనేది వేరే విషయం...ముందు ఒక లక్ష్యం అంటూ ఏర్పరుచుకోవడం అనేది చాలా ముఖ్యం. మరి మీరు? -
కెరీర్.. ప్రేమ.. పెళ్లి..
రెండు మనసులను ఒక గూటికి చేర్చే మహత్తర మంత్రం ప్రేమ. కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు, దేశాలు... అన్ని హద్దులు చెరిపేసి కలుసుకునేలా చేసే ఓ అద్భుతశక్తి. ప్రేమకు ఓ రోజుంటే అదే ప్రేమికుల దినోత్సవం. ఆ రోజున పార్కుల్లో సందడి, సినిమాలు, షికార్లు, నవ్వుల పువ్వులు, గ్రీటింగ్ కార్డులతో ప్రేమపక్షుల హుషారే వేరు. కానీ, పరిస్థితులు మారాయి. యువత మదిలో ఇపుడు మోగుతోంది ప్రేమ మంత్రం కాదు. వారి చూపంతా లక్ష్యసాధనవైపే. కెరీర్ తర్వాతే ప్రేమ అంటోంది. - న్యూస్‌లైన్, కరీంనగర్ బిజినెస్ కరీంనగర్ బిజినెస్, న్యూస్‌లైన్ : గతంతో పోలిస్తే ప్రేమ వివాహాలు చాలా తగ్గాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విడాకులు తీసుకుంటున్న జంటలను పరిశీలిస్తే నూటికి 63 శాతం జంటలు ప్రేమ వివాహం చేసుకున్నవారే. మన జిల్లాలో నూటికి 86 శాతం పెద్దలు కుదిర్చిన పెళ్లిలే జరుగుతున్నాయి. యువత ధ్యాసంతా జీవితంలో స్థిరపడాలనే లక్ష్యసాధనపైనే. కెరీర్ తర్వాతే ప్రేమంటున్న యువత 90 శాతంపైనే. మిగతావారు కెరీర్‌తోపాటు ప్రేమ కూడా ముఖ్యమే అంటున్నారు. కొందరు ప్రేమనే నమ్ముకుంటున్నా రెండు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నవారే ఎక్కువ. ఇళ్లలో తెలియకుండా పెళ్లి చేసుకునే సవాలే లేదంటున్నారు. ఇంతకుముందు ప్రేమికులు హంగు ఆర్భాటాలు లేకుండా దేవాలయాల్లో, ఆర్యసమాజ్ వంటి సంస్థల్లో పెళ్లి చేసుకున్న యువత ఇప్పుడు సంప్రదాయ వివాహాలకు పెద్దపీట వేస్తోంది. తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు అందరి సమక్షంలో సంప్రదాయ పద్ధతిలోనే పెళ్లి జరగాలని కోరుకుంటోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేమ, ప్రేమ వివాహాలపై పలువురు ఇలా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆత్మీయులను దూరం చేస్తుంది చాలా మంది కాలేజీ రోజుల్లోనే ప్రేమలో పడుతుంటారు. ప్రస్తుతం నేను ఎంటెక్ చేస్తున్నాను. నాకు ఇంతవరకు అటువంటి ఆలోచన కూడా కలగలేదు. నేను పెద్దలు కుదిర్చిన సంబంధాన్నే చేసుకుంటాను. ప్రేమ వివాహాలతో కుటుంబసభ్యులు, బంధువులు, ఆత్మీయులు దూరమవుతారని నా గట్టి అభిప్రాయం. నేను ఇంతవరకు గమనించిన ప్రేమ జంటలన్నీ కూడా ఇబ్బందుల పాలవుతున్నాయి. - ప్రియా, ఎంటెక్ తల్లిదండ్రులే ముఖ్యం మన జీవితంలో సంతోషం వచ్చినా, బాధ వచ్చినా తలచుకునేది మన తల్లిదండ్రులనే. పెంచి పెద్దచేసిన తల్లిదండ్రుల మాటనే శిరసావహించి వాళ్లు చూసిన సంబంధాన్ని మేము చేసుకున్నాం. ప్రేమ వివాహం అంటే మాకు ఇష్టం లేదు. చాలా మంది యువతీయువకులు సెల్ఫోన్లతో, ఫేస్బుక్, చాటింగ్‌ల కారణంగా అనుకోకుండా దగ్గరైపోతున్నారు. ఆకర్షణనే ప్రేమనుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. - స్వప్న-రాందర్శేందర్రెడ్డి దంపతులు పెద్దల సమక్షంలో జరగాలి పెళ్లంటే నూరేళ్ల పంట. మానవ జీవితంలో మరువలేని మధురానుభూతి. ఈ శుభకార్యం తప్పకుండా తల్లిదండ్రులు, పెద్దల సమక్షంలోనే జరగాలని నా అభిప్రాయం. ప్రేమించినా రెండు వైపులా పెద్దలకు తెలియజేసి, వారిని ఒప్పించుకుని ఎలాంటి ఇబ్బంది లేకుండా పెళ్లి చేసుకుంటే ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఒక వేళ వచ్చినా పెద్దలు వాటిని ముందుండి పరిష్కరిస్తారు. - ఎస్.రమణ, ఎంటెక్ జీవితం ఆనందమయం ప్రేమ వివాహాలతో జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు. పెళ్లికి ముందుగా ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుని ఎదుటి వారి అభిరుచులు, ఆలోచనలు అన్నీ తెలుసుకునే అవకాశం ఉంటుంది కావున వారికి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఎలాంటి సమస్యలు లేకుండా జీవితం ప్రశాంతంగా సాగుతుంది. ప్రేమించినా... ఇంట్లో పెద్దలను ఒప్పించి, వారి సమక్షంలో పెళ్లి చేసుకున్నవాళ్లు ఎంతో ఆనందంగా ఉంటారు. - ఎం.సుజిత్, బీటెక్ మన సంస్కృతి కాదు ప్రేమికుల రోజు నిర్వహించడ ం మన సంస్కృతి కాదు. నేడు ప్రేమ పెళ్లిలు 10 బాగుంటే.. 90 చెడిపోతున్నాయి. పెద్దలు చేసిన పెళ్లిలు బాగుంటున్నాయి. మన ఇతిహాసాలలో, పురాణాలలో ప్రేమ అనేది ఉంది. కృష్ణుడు ప్రేమకు ప్రథముడు. కానీ, వాటిపై ప్రచారాలు లేవు. కేవలం వ్యాపారాలు అధికం చేయడానికి విదేశీ సంస్కృతి యువతకు అంటించడం వినాశనానికి నాందిగా చెప్పవచ్చు. - డాక్టర్ రమణాచారి, ఆర్ఎస్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ మెప్పించి ఒప్పించాం మా ప్రేమకు కేంద్రం వేములవాడ. అక్కడ టీచర్‌గా పని చేస్తున్నప్పుడు 1992లో ప్రేమలో పడ్డాం. మా కులాలు వేరు. ఇద్దరం కలిసి జీవించాలనుకున్నాం... ఇంట్లో వారందరనీ ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. మా ఇద్దరు పిల్లలు ఉన్నత చదువులు చదువుతున్నారు. కుటుంబావసరాల రీత్యా ఒకరం ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా.. మరొకరం ప్రైవేట్ టీచర్‌గా పనిచేస్తూ హ్యాపీగా లైఫ్‌ను లీడ్ చేస్తున్నాం. నేడు చాలా మంది స్థిరత్వం లేకుండా... ఆకర్షణనే ప్రేమ అనుకుని ముందుకు సాగుతున్నారు. ఈ విధానం మారాలి. - బహుద్దూర్ రఘుకిశోర్- శ్రీదేవి (గెజిటెడ్ హెచ్ఎం, వడ్కాపూర్) -
పునరాగగనమే!
ఒక క్రికెటర్ గొప్పగా పునరాగమనం ఎలా చేయొచ్చో చెప్పడానికి ఉదాహరణగా యువరాజ్ గురించి చెప్పుకున్నాం. క్యాన్సర్‌ను జయించి తిరిగి భారత జట్టులోకి వచ్చి నాణ్యమైన ఇన్నింగ్స్‌తో వహ్వా అనిపించాడు. కానీ ఇది మూణ్నాళ్ల ముచ్చటే అయింది. వరుస వైఫల్యాలతో మళ్లీ జట్టులో స్థానం కోల్పోయాడు. మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది. తానేంటో నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాక్షి క్రీడావిభాగం డాషింగ్ క్రికెటర్ యువరాజ్ సింగ్ కెరీర్ మళ్లీ డోలాయమానంలో పడింది. త్వరలో జరిగే న్యూజిలాండ్ పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో యువరాజ్‌కు స్థానం లభించకపోవడంతో అతని కెరీర్ ఇంకెన్నాళ్లు కొనసాగుతుందో అనే చర్చ మొదలైంది. వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, గౌతమ్ గంభీర్‌లాంటి అగ్రశ్రేణి ఆటగాళ్ల తరహాలోనే యువరాజ్ కూడా కష్టకాలం ఎదుర్కొంటున్నాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది టోర్నీ’గా నిలిచిన 32 ఏళ్ల ఈ పంజాబ్ క్రికెటర్ విన్యాసాలు వచ్చే ఏడాది ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌లలో జరిగే వన్డే ప్రపంచ కప్‌లో కనిపించే అవకాశాలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. టెస్టుల్లో అవకాశం లేనట్లే దిగ్గజ క్రికెటర్ల నీడలోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న యువరాజ్ కెరీర్‌కు తాజా పరిణామం పెద్ద దెబ్బలాంటిదే. రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్లతో టెస్టు జట్టులోని మిడిల్ ఆర్డర్లో ఏర్పడిన ఖాళీలోనూ ఈ స్టార్ బ్యాట్స్‌మన్ భర్తీకాలేకపోయాడు. ఇటీవల కాలంలో చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, అజింక్యా రహానేలాంటి యువ క్రికెటర్లు రాణిస్తున్నతీరు చూస్తోంటే యువరాజ్‌కు టెస్టు ద్వారాలు మూసుకుపోయినట్టే. కలిసొచ్చిన ఫార్మాట్లలో వైఫల్యం కళ్ల చెదిరే బ్యాటింగ్, సమయోచిత స్పిన్ బౌలింగ్, మెరుపు ఫీల్డింగ్‌తో వన్డే, టి20 క్రికెట్లో యువరాజ్ ఒక శక్తిగా ఎదిగాడు. క్యాన్సర్ బారిన పడటంతో యువరాజ్ కెరీర్ ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. పట్టుదలతో పోరాడి క్యాన్సర్‌ను జయించిన అతను జాతీయ జట్టులోకి పునరాగమనం చేశాడు. అయితే అతని ఆటతీరులో ఒకప్పటి పదును లోపించింది. 2012 డిసెంబరు నుంచి 2013 డిసెంబరు మధ్యకాలంలో యువరాజ్ తాను ఆడిన 19 వన్డేల్లో కేవలం రెండు అర్ధసెంచరీలు మాత్రమే చేశాడు. స్వదేశంలో పాకిస్థాన్‌తో, ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లలో వైఫల్యం అతనికి చాంపియన్స్ ట్రోఫీలో స్థానం లేకుండా చేసింది. యువరాజ్ గైర్హాజరీలో భారత్ చాంపియన్స్ ట్రోఫీని గెల్చుకోవడంతో అతను జట్టులో స్థానం కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చోటు పోయిందనే బాధను పక్కనపెట్టి శారీరక, మానసిక ధృడత్వం కోసం యువరాజ్ ఫ్రాన్స్‌కు వెళ్లాడు. అక్కడ ఆరువారాలపాటు కఠోర సాధన చేసి రీచార్జ్ అయి వచ్చాడు. సెప్టెంబరులో వెస్టిండీస్ ‘ఎ’తో జరిగిన సిరీస్‌లో రాణించి ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ఎంపికయ్యాడు. అయితే బ్యాటింగ్ ఆర్డర్లో ఐదో స్థానంలో వచ్చిన అతను వరుసగా 7, 0, 0, 12 స్కోర్లతో నిరాశపరిచాడు. ఆ తర్వాత వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో నాలుగో స్థానంలోకి వచ్చిన యువరాజ్ 16 నాటౌట్, 28, 55 స్కోర్లతో ఫర్వాలేదనిపించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో ఆడిన తొలి బంతికే అవుటైన యువరాజ్ రెండో వన్డేలో బరిలోకి దిగలేదు. మూడో వన్డే రద్దు కావడంతో అతనికి బ్యాటింగ్ అవకాశం రాలేదు. మొత్తానికి ఆస్ట్రేలియా సిరీస్‌తో పునరాగమనం చేసిన యువరాజ్ ఎనిమిది ఇన్నింగ్స్‌లో 16.85 సగటుతో కేవలం 118 పరుగులే చేశాడు. ఇందులో మూడుసార్లు ‘డకౌట్’ అయ్యాడు. ఈ వైఫల్యాల నేపథ్యంలో సందీప్ పాటిల్ నేతృత్వంలోని జాతీయ సెలక్షన్ కమిటీ న్యూజిలాండ్ పర్యటనకు యువరాజ్‌ను తప్పించింది. కిం కర్తవ్యం... వచ్చే ప్రపంచకప్‌కు మరో ఏడాది సమయముంది. ఈ మధ్యలో ఆసియా, టి20 ప్రపంచకప్, ఐపీఎల్, ఇంగ్లండ్ పర్యటన, దేశవాళీ వన్డే క్రికెట్ల రూపంలో యువరాజ్ ముంగిట పునరాగమనం కోసం ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వచ్చే రెండు నెలల్లో అవకాశాలు రాకపోయినా... ఐపీఎల్ రూపంలో ఓ అవకాశం మాత్రం సిద్ధంగా ఉంటుంది. దానిని బాగా వినియోగించుకుంటే తప్ప ప్రస్తుత పోటీలో మళ్లీ యువీ రాలేడు. అయితే ఈ స్టార్ ఆల్రౌండర్లో ఆ మునుపటి కసి ఉందా లేదా అన్నదే సందేహం. -
ఒత్తిడి పెంచకూడదు
పుల్లెల గోపీచంద్ ఆటలంటే ఇష్టంలేని పిల్లలు ఎవరూ ఉండరు. ఎవరైనా తొలుత సరదా కోసమే ఆడతారు. అంతే గానీ ప్రపంచ చాంపియన్ కావాలనే కోరికతో అడుగుపెట్టరు. ఇలాంటి వారి నుంచి చాంపియన్లు వస్తారు. అయితే పిల్లాడి ఇష్టాయిష్టాలతో పాటు తల్లిదండ్రులు, కోచ్ కీలకం. పిల్లలందరి మనస్తత్వం ఒకేలా ఉండదు. సాధారణంగా చాలామంది గెలవాలని పిల్లలపై ఒత్తిడి తెస్తారు. అతడు పడుతున్న కష్టాన్ని విస్మరిస్తారు. ఇది చాలా తప్పు. కష్టపడమని వెంటపడొచ్చుగానీ... నైరాశ్యంలో వెళ్లే స్థాయిలో ఒత్తిడి పెంచకూడదు. ఓడిపోయినా కష్టపడ్డప్పుడు అభినందించాలి. సమతుల్యత పాటిస్తేనే ఈతరం పిల్లలు మంచి ఫలితాలు సాధిస్తారు. కోచ్‌గా చాలాకాలంగా అనేక విషయాలు పరిశీలించాను. సాధారణంగా కుర్రాళ్లలో కొంత మంది ఒక్క మాటలో చెబితే వినేస్తారు. మరొకరికి గట్టిగా మందలించాల్సి ఉంటుంది. ఇంకొందరికి సుదీర్ఘ ప్రసంగం ఇస్తే గానీ అర్థం కాదు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుంటూ మందు వేయాల్సి ఉంటుంది. లేదంటే చక్కటి ప్రతిభ వృథా అయ్యే ప్రమాదం ఉంది. అండర్-14 లేదా అండర్-16 కేటగిరీలలో మంచి విజయాలు సాధిస్తున్న ఆటగాళ్లు ఆ తర్వాత వెనుకబడిపోతున్నారు. సీనియర్ స్థాయిలో గెలవడం తన వల్ల కాదేమోననే భయం వారిలో పెరుగుతోంది. పెద్ద ఆటగాళ్లతో పోటీ పడాలన్న పట్టుదల, చిన్న ఆటగాళ్లను గౌరవించే వారికే విజయాలు దక్కుతాయి. గెలిస్తే నా అంతటోడు లేడని తలెగరేసే వాళ్లు, ఓడితే కుంగిపోయే వాళ్లు కెరీర్లో ఎప్పటికీ ముందుకు వెళ్లలేరు. క్రీడాకారుడిగా ఎదగడంలో ఎంతో శ్రమ, కష్టం ఉంటుంది. కానీ ఒక్కసారి దేశానికి ఆడిన తర్వాత కలిగే గర్వానికి ఏదీ సాటిరాదు. ఎప్పుడూ సాధారణ చదువులకన్నా, కొంత మందైనా తమ పిల్లలను ఆటగాళ్లుగా మార్చాలని భావిస్తే భారత్‌లో క్రీడలకు ఉండే విలువ ఎప్పటికీ తగ్గదు. -
నేడు జాతీయ క్రీడా దినోత్సవం
దేశంలో నేడు ఆటలకు పండుగ రోజు. ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నాం. దేశంలో క్రమంగా క్రీడా సంస్కృతి పెరుగుతోంది. కెరీర్‌గా ఎంచుకుంటేనే క్రీడల వైపు చూసే పరిస్థితి నుంచి... ‘ఆట ఆరోగ్యం కోసం’ అనే భావన క్రమంగా పెరుగుతోంది. ఒక్క క్రికెట్లోనే కాకుండా అంతర్జాతీయ యవనికపై భారత్‌కు అన్ని క్రీడల్లోనూ విజయాలు పెరుగుతున్నాయి. క్రీడా దినోత్సవం, ఆటల ప్రాధాన్యత, మార్గదర్శనం, భవిష్యత్... ఇలా అనేక అంశాలపై ముగ్గురు ఆంధ్రప్రదేశ్ క్రీడా దిగ్గజాలు ‘సాక్షి’కి ప్రత్యేకంగా రాసిన వ్యాసాలు... -
పాపం బర్తోలీ
సిన్సినాటి: టెన్నిస్ చరిత్రలో వింబుల్డన్ టైటిల్‌కున్న ప్రతిష్ట అంతా ఇంతా కాదు. జీవితంలో ఒక్కసారైనా ఆ టోర్నీని సాధించాలని ఆటగాళ్లు కలలు కంటారు. ఫ్రాన్స్‌కు చెందిన టెన్నిస్ స్టార్ మరియన్ బర్తోలి కూడా దీనికి అతీతురాలేం కాదు. కేవలం కలల దగ్గరే ఆగిపోకుండా ఈ ఏడాది జరిగిన వింబుల్డన్‌లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బర్తోలీ ఏకంగా టైటిల్ నెగ్గింది. ఇంకేముంది కెరీర్ తారాజువ్వలాగా దూసుకెళుతుందని అందరూ భావించారు. అయితే ఎవరూ ఊహించని రీతిలో 28 ఏళ్ల బర్తోలి ఆటకు గుడ్‌బై చెప్పింది. వింబుల్డన్ గెలిచిన కేవలం ఆరు వారాల్లోనే ఈ నిర్ణయం తీసుకోవడంతో అభిమానులతో పాటు క్రీడాలోకం కూడా షాక్‌కు గురైంది. ప్రపంచ ఏడో ర్యాంకర్ బర్తోలి సిన్సినాటి మాస్టర్స్ టోర్నీ రెండో రౌండ్లో సిమోన హెలెప్ చేతిలో 6-3, 4-6, 1-6 తేడాతో ఓడింది. దీంతో టెన్నిస్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. ఈనిర్ణయానికి నిరంతరం వేధిస్తున్న గాయాలే కారణమని తెలిపింది. మరో రెండు వారాల్లో తను యూఎస్ ఓపెన్ ఆడాల్సి ఉంది. ‘రిటైర్ కావడానికి ఇదే సరైన సమయం. చాలాకాలంగా టెన్నిస్ ఆడుతున్నాను. గ్రాండ్‌స్లామ్ గెలవాలనే కల వింబుల్డన్ ద్వారా తీరింది. నా కెరీర్లో అత్యంత గొప్ప విజయం అది. ఈ ఏడాది ఆరంభం నుంచి గాయాలు వేధిస్తున్నాయి. నా శరీరంలో మిగిలి ఉన్న శక్తినంతా ధారపోశాను. వింబుల్డన్ ఎప్పటికీ నాతోనే ఉండిపోతుంది. ఇక నేను పోటీపడలేను’ అని బర్తోలీ వెల్లడించింది. 2000లో ప్రొఫెషనల్‌గా మారిన బర్తోలీ కెరీర్లో ఏడు డబ్ల్యూటీఏ టైటిళ్లను సాధించింది.


