ఆలస్యంగా తల్లికావడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు నేటితరం మహిళలు. కెరీర్‌కే తొలి ప్రాధాన్యత ఇవ్వడమే దీనికి కారణం. ఇంటి ఖర్చులు, పిల్లల పెంపకం, చదువుల కోసం అయ్యే ఖర్చులను భరించే సామర్థ్యం వచ్చాకే మాతృత్వం వైపు అడుగులు వేస్తున్నారు.
2024లో 37 శాతం మంది తల్లులు 25–29 ఏళ్ల మధ్య వయసువారే. మాతృత్వానికి ఇదే సరైన వయస్సుగా నేటి మహిళలు భావిస్తున్నారు.
19 ఏళ్ల లోపు తక్కువ వయస్సులో తల్లులయ్యే వారి సంఖ్య అభివృద్ధి చెందిన దేశాలలో గణనీయంగా తగ్గింది. అయితే కొన్ని వర్గాలలో గతంలోలాగే ఉంది.
30–34 ఏళ్ల వయస్సులో తల్లులయ్యే వారి సంఖ్య 2.5 రెట్లు పెరిగింది. 2005లో 9.9 శాతం ఉండగా 2024లో 24.6 శాతానికి చేరుకుంది.
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళల్లో 34.8 శాతం మందికి ఒక్కరే సంతానం, 31.4 శాతం మందికి ఇద్దరు పిల్లలు, 15.9 శాతం మందికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. విద్యావంతులైన మహిళలు చిన్న కుటుంబాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు.
2005లో 25 ఏళ్ల లోపు తల్లులు 48.9 శాతం ఉన్నారు. ప్రస్తుతం 29.7 శాతం ఉన్నారు. 30 ఏళ్ల పైబడిన మహిళల్లో తల్లులు అయినవారు గతంలో 21.6 శాతం, ఇప్పుడు 33 శాతం ఉన్నారు. ఇప్పుడు ప్రతి ముగ్గురు తల్లులలో ఒకరు 30 ఏళ్లు పైబడిన వారే.
ఈ రెండు దశాబ్దాల కాలంలో 20–24 ఏళ్ల వయస్సులో తల్లులయిన వారి సంఖ్య 46.6 శాతం నుండి 27.1 శాతానికి తగ్గింది.
(చదవండి: పార్లమెంట్ సమావేశాల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా కంగానా..!)


