అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీపై USAలో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. తాజాగా జరిపిన సర్వేలో ఇదే అంశం వెల్లడైంది. అమెరికాను గొప్పగా చేస్తానంటూ ట్రంప్ తీసుకుంటున్న దుందుడుకు చర్యలతో ఆ దేశ ప్రజలలో ఆయన తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొవాల్సి వస్తుంది.
"మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్" అనేది అమెరికా అధ్యక్షుడి ఎన్నికల నినాదం యుఎస్‌ఎను మరోసారి స్ట్రాంగ్ చేస్తానంటూ ప్రచారం చేసిన ట్రంప్ ఎట్టకేలకు రెండోసారి అమెరికా ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. అనంతరం అమెరికా సొమ్మును వేరే దేశాల వారు దోచుకుంటున్నారంటూ హంగామా చేసి ఇష్టారీతిన ఇమిగ్రేషన్ పాలసీని మార్చి వలస కార్మికులపై కఠిన నిబంధనలు విధించారు. తాజాగా ఇప్పుడు ఆ నిబంధనలే ఆయనపై అక్కడి ప్రజల్లో వ్యతిరేకతను పెంచేలా చేశాయి.
అమెరికాలో వలస నియంత్రణ కోసం పనిచేస్తున్న ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ అధికారుల దాడులు ఇటీవల శృతిమించుతున్నాయి. గతేడాది వీరు జరిగిన దాడుల్లో 32మంది మరణించగా ఇటీవల మిన్నెసోటా రాష్ట్రంలో జరిపిన కాల్పుల్లో మరో ఇద్దరు మరణించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ వలసవిధానంపై అమెరికన్లు గుర్రుగా ఉన్నారు. కేవలం 39 శాతం ప్రజలు మాత్రమే ట్రంప్ వలస విధానంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అదే గత నెలలో ఈ సంఖ్య 41శాతంగా ఉంది. దీనిని 53 శాతం మంది వ్యతిరేకిస్తున్నట్లు తేలింది. గతేడాది ఫిబ్రవరిలో నిర్వహించిన సర్వేలో ఆయన నిర్ణయాలకు 50 శాతం మంది అనుకూలంగా ఓటేశారు. అయితే మెుత్తంగా ఆయన నిర్ణయాలకు జనవరిలో 41శాతం మంది ఆమెదం తెలుపగా ప్రస్తుతం ఆ సంఖ్య 38 శాతానికి దిగజారింది


