breaking news
immigration acts
-
‘మా అబ్బాయి మీ దేశానికి భారమా?’.. న్యూజిలాండ్‌లో భారతీయ కుటుంబం ఆవేదన!
వెల్లింగ్టన్: తమ నుంచి తమ ఐదేళ్ల కుమారుడిని దూరం చేయొద్దని న్యూజిలాండ్ ప్రభుత్వాన్ని ఓ భారతీయ కుటుంబం అభ్యర్థిస్తోంది. ‘ మా కుమారుడు ఆటిజంతో బాధపడుతున్నాడు. అతనికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. కానీ అతన్ని మా నుంచి దూరం చేస్తే మా కుటుంబం చిద్రమవుతుంది’ అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమారుడి వీసా విషయంలో ప్రభుత్వం మానవతా దృష్టితో చూడాలని వారు కోరుతున్నారు.న్యూజిలాండ్ ఇమ్మిగ్రేషన్ అధికారుల సమాచారం ప్రకారం.. భారత్‌కు చెందిన నితిన్ మాంకీల్, ఆయన భార్య అపర్ణ జయంధన్ గీత ఆక్లాండ్‌లో నివసిస్తున్నారు. ఇద్దరు వైద్య రంగంలో విధులు నిర్వహిస్తున్నారు. వారి కుమారుడు ఐదేళ్ల ఐదన్ నితిన్ (Aidhan Nithin). ఆటిజం సమస్యతో బాధపడుతున్నాడు. ఈ కారణంగా న్యూజిలాండ్ ప్రభుత్వం అతనికి వీసా ఇచ్చేందుకు నిరాకరించింది. వెంటనే అతన్ని భారత్‌కు పంపాలని ఆదేశాలు జారీ చేసింది.ఇప్పటికే ఐధాన్ వీసా విషయంపై న్యూజిలాండ్ అసోసియేట్ ఇమ్మిగ్రేషన్ మంత్రి హాన్ క్రిస్ పెంక్కు రెండుసార్లు అప్పీలు చేశారు. కానీ ప్రభుత్వం వారి అభ్యర్థనను తిరస్కరించింది. ఐధాన్ ఆరోగ్య పరిస్థితి దేశంలోని ఆరోగ్య, విద్యా సేవలపై అధిక భారం అవుతుందని అధికారులు భావించారు. తల్లిదండ్రులకు పర్మినెంట్ రెసిడెన్సీ ఉన్నప్పటికీ బాలుడికి వీసాను తిరస్కరించింది. వీసా విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఐదన్ నితిన్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఆర్థిక సహాయం కోరడం లేదని, ఆటిజం సమస్యతో బాధపడుతున్న తమ కుమారుడి పట్ల మానవతా కోణంలో వీసా మంజూరు చేయాలని తల్లిదండ్రులు అభ్యర్థిస్తున్నారు.ఈ ఘటన న్యూజిలాండ్‌లో వలస విధానాలపై మానవతా కోణం ఎంత ముఖ్యమో మరోసారి బయటపెట్టింది. ఆటిజం బాధిత బాలుడిని డిపోర్ట్ చేయాలన్న నిర్ణయం స్థానికులు, భారతీయ వలసదారులు, మానవ హక్కుల సంఘాలను తీవ్రంగా కలచివేసింది. ఇప్పుడు ఈ కేసు న్యూజిలాండ్ ప్రభుత్వానికి కఠిన పరీక్షగా మారింది. -
న్యూజెర్సీలో నాట్స్ ఇమ్మిగ్రేషన్ సెమినార్
న్యూ జెర్సీ: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా న్యూజెర్సీలో ఇమ్మిగ్రేషన్ సెమీనార్ నిర్వహించింది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో ఇమ్మిగ్రేషన్‌పై వస్తున్న వార్తలు ప్రవాస భారతీయులను కలవరపెడుతున్నాయి. ఈ తరుణంలో ప్రముఖ ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు భాను బి. ఇల్లింద్ర, శ్రీనివాస్ జొన్నలగడ్డలు ఈ ఇమ్మిగ్రేషన్ సెమీనార్‌కు ముఖ్యవక్తలుగా విచ్చేసి అనేక కీలకమైన విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా జన్మత:పౌరసత్వం, హెచ్ ఒన్ బీ నుంచి గ్రీన్ కార్డు వరకు అనుసరించాల్సిన మార్గాలు, అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హెచ్4 వీసా ఇలాంటి ఇమ్మిగ్రేషన్ అంశాలపై భాను ఇల్లింద్ర, శ్రీనివాస్ జొన్నలగడ్డలు పూర్తి అవగాహన కల్పించారు. ఈ సెమీనర్లో పాల్గొన్న వారి సందేహాలను కూడా నివృత్తి చేశారు. అమెరికాలో ఉండే తెలుగు వారు ఇమ్మిగ్రేషన్ విషయంలో మీడియాలో వస్తున్న వార్తలతో ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వారి ఆందోళన తగ్గించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ సెమీనార్ నిర్వహించామని నాట్స్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు శ్రీహరి మందాడి తెలిపారు. అమెరికాలో తెలుగువారికి ఏ కష్టం వచ్చినా నాట్స్ అండగా ఉంటుందని శ్రీహరి భరోసా ఇచ్చారు. ఈ సెమీనార్ నిర్వహణ కోసం నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ టీపీరావు, నాట్స్ నేషనల్ మార్కెటింగ్ కో ఆర్డినేటర్ కిరణ్ మందాడి, నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ కో ఆర్డినేటర్ మోహన్ కుమార్ వెనిగళ్ల కృషి చేశారు. తమ ఆహ్వానాన్ని మన్నించి ఈ సెమీనార్‌కు విచ్చేసిన భాను ఇల్లింద్ర, శ్రీనివాస్ జొన్నలగడ్డలకు నాట్స్ నాయకత్వం ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఈ సెమీనార్ విజయవంతం కావడంలో శ్రీకాంత్ పొనకల, వెంకటేష్ కోడూరి, రాకేష్ వేలూరు, వెంకట్ గోనుగుంట్ల, కృష్ణ సాగర్ రాపర్ల, రామకృష్ణ బోను, వర ప్రసాద్ చట్టు, జతిన్ కొల్లా, బ్రహ్మానందం పుసులూరి, ధర్మ ముమ్మడి, అపర్ణ గండవల్ల, రమేష్ నూతలపాటి, రాజేష్ బేతపూడి, సూర్య గుత్తికొండ, కృష్ణ గోపాల్ నెక్కింటి, శ్రీనివాస్ చెన్నూరు, సాయిలీల మగులూరి కీలక పాత్రలు పోషించారు. తెలుగు వారికి ఎంతో ఉపయుక్తమైన ఇమ్మిగ్రేషన్ సెమీనార్ నిర్వహించిన నాట్స్ న్యూజెర్సీ టీంను నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేకంగా అభినందించారు. -
ఎన్నారైలకు పెళ్లిళ్లు కాకుండా చేస్తున్న ట్రంప్
-
ఎన్నారైలకు పెళ్లిళ్లు కాకుండా చేస్తున్న ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత ఎన్నారైలకు పెళ్లిళ్లు కాకుండా చేస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా అమెరికా అల్లుళ్లకు భారత్‌లో మంచి గిరాకీ ఉంది. తాజాగా ట్రంప్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత హెచ్1బీ వీసాలపై తీసుకువస్తున్న ఆంక్షలు, ఇమిగ్రేషన్ చట్టాలు అమెరికాలో ఉంటున్న భారత యువకులకు పెళ్లి యోగ్యతను దూరం చేస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన మ్యారేజ్ బ్యూరోల్లో ఎన్నారై సంబంధాలకు డిమాండ్ పడిపోయింది. తాజాగా తెలుగు యువకులపై అమెరికాలో జరిగిన జాతి విద్వేష దాడి ఈ పరిస్ధితిని మరింత తీవ్రం చేసే అవకాశం ఉంది. ఏటా భారత్ నుంచి అమెరికా వెళ్తున్న వారిలో అత్యధికులు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే. ట్రంప్ నిర్ణయాల వల్ల వలస వస్తున్న భారత టెకీలు ఉద్యోగాలు ప్రమాదంలో పడటమే కాకుండా వారికి వివాహం అయ్యే అవకాశాలను కూడా తగ్గిపోయేలా చేస్తున్నాయని హైదరాబాద్‌లో మ్యారేజ్ బ్యూరోను నడుపుతున్న దయాకర్ చెప్పారు. ప్రస్తుతం అమ్మాయిల తల్లిదండ్రులు ఇండియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న అబ్బాయిల సంబంధాల వైపే మొగ్గు చూపుతున్నట్లు ఆయన తెలిపారు.


