అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత ఎన్నారైలకు పెళ్లిళ్లు కాకుండా చేస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా అమెరికా అల్లుళ్లకు భారత్‌లో మంచి గిరాకీ ఉంది. తాజాగా ట్రంప్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత హెచ్1బీ వీసాలపై తీసుకువస్తున్న ఆంక్షలు, ఇమిగ్రేషన్ చట్టాలు అమెరికాలో ఉంటున్న భారత యువకులకు పెళ్లి యోగ్యతను దూరం చేస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన మ్యారేజ్ బ్యూరోల్లో ఎన్నారై సంబంధాలకు డిమాండ్ పడిపోయింది. తాజాగా తెలుగు యువకులపై అమెరికాలో జరిగిన జాతి విద్వేష దాడి ఈ పరిస్ధితిని మరింత తీవ్రం చేసే అవకాశం ఉంది.