ఇరాన్‌ ఆడకపోవడమే మంచిది.. ట్రంప్‌ వార్నింగ్‌! | Donald Trump Big Statement After Iran Wishes To Withdraw FIFA World Cup, Highlights Risks To Players Traveling To America | Sakshi
Sakshi News home page

FIFA WC 2026: ఇరాన్‌ ఆడకపోవడమే మంచిది!

Mar 13 2026 4:52 PM | Updated on Mar 13 2026 5:22 PM

Trump Big Statement After Iran Wishes Withdraw-FIFA World Cup

మరో రెండు నెలల్లో ఫుట్‌బాల్‌ సాకర్‌ ఫీవర్‌ మొదలుకానుంది. అమెరికా,మెక్సికో,కెనడా దేశాలు సంయుక్తంగా 2026 ఫిపా వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమివ్వనున్నాయి.ఈ ఏడాది జూన్‌ 11 నుంచి జూలై 19 వరకు సాకర్‌ మెగాటోర్నీ జరగనుంది. అయితే పశ్చిమాసియాలో ఇరాన్‌తో ఇజ్రాయెల్‌, అమెరికా చేస్తున్న యుద్ధం ప్రస్తుతం భీకరరూపం దాల్చింది. 

దీంతో ఇరాన్‌ జట్టు ఫిఫా వరల్డ్‌కప్ ఆడలేమని ఇప్పటికే తేల్చి చెప్పింది. అయితే మధ్యప్రాచ్యంలో యుద్ధం కొనసాగుతున్నప్పటికీ ఇరాన్‌ జట్టు ఫిపా వరల్డ్‌కప్‌ ఆడేందుకు స్వాగతిస్తామని ఫిఫా చీఫ్‌ జియాని ఇన్ఫాంటినో పేర్కొన్నారు. తాజాగా జియాని వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన సోషల్‌ మీడియా ట్రూత్‌సోషల్‌ వేదికగా స్పందించారు. 

‘ఇరాన్‌ ఫుట్‌బాల్‌ జట్టు సాకర్‌ ప్రపంచకప్‌లో ఆడడం, ఆడకపోవడమనేది వారిష్టం. యుద్ధం పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్‌ ఆటగాళ్లు అమెరికాకు వస్తే మాత్రం వారి ప్రాణాలకు, భద్రతకు మేము ఎంతమాత్రం గ్యారంటీ ఇవ్వలేం. కాబట్టి వీలైనంత వరకు ఇరాన్‌ వరల్డ్‌కప్‌కు దూరంగా ఉండడమే మంచిది’ అని సున్నితంగా హెచ్చరించారు.

2022లో ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా విజేతగా నిలిచింది. నాటి ఫైనల్లో లియోనెల్‌ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్‌లో (4-2) ఫ్రాన్స్‌ను ఓడించింది. తద్వారా 36 ఏళ్ల తర్వాత అర్జెంటీనా ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్‌ కైవసం చేసుకుంది. ఈ ఏడాది జూన్‌ 11 నుంచి మొదలుకానున్న ఫిఫా వరల్డ్‌కప్‌ జూలై 19 వరకు జరగనుంది. 

మొత్తం 48 జట్లు పాల్గొననుండగా.. నాలుగేసి జట్లు 12గ్రూపులుగా విడిపోయి మ్యాచ్‌లు ఆడనున్నాయి. మొత్తం 104 మ్యాచ్‌లు జరగనుండగా, అందులో 78 మ్యాచ్‌లు అమెరికాలో, కెనడా, మెక్సికోలు చెరో 13మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్నాయి. గ్రూప్‌-జిలో ఉన్న ఇరాన్‌.. బెల్జియం, ఈజిప్టు, న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

చదవండి: మా అన్న పెళ్లికి ధూంధాం చేస్తా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement