ఇరాన్‌ సంచలన ప్రకటన.. | US Warship USS Abraham Lincoln Damaged | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ సంచలన ప్రకటన..

Mar 13 2026 11:07 AM | Updated on Mar 13 2026 11:57 AM

US Warship USS Abraham Lincoln Damaged

టెహ్రాన్‌: అమెరికా- ఇరాన్‌ యుద్ధంలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ సంచలన ప్రకటన చేశాయి. అమెరికా ప్రధాన యుద్ధ నౌక అబ్రహం లింకన్‌పై దాడి చేసినట్లు ప్రకటించాయి. అయితే, ఈ దాడిని అమెరికా ఖండించింది. అబ్రహం లింకన్‌పై ఏటువంటి దాడి జరగలేదని, ఇరాన్‌ చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. 

పశ్చిమాసియా యుద్ధంతో ఇరాన్ వెనక్కితగ్గడం లేదు. ఏక కాలంలో గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తూనే ఇటు యుఎస్, ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అతిపెద్ద యుద్ధనౌకగా పిలిచే అబ్రహం లింకన్‌పై బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ దాడిలో ఎయిర్‌క్రాఫ్ట్ పెద్దఎత్తున దెబ్బతిన్నట్లు పేర్కొంది.

ఇరాన్‌ ప్రకటనపై అమెరికా స్పందించింది. అబ్రహం లింకన్‌పై ఎటువంటి దాడి జరగలేదని అది అమెరికా విజయంలో కీలకపాత్ర పోషిస్తుందని తెలిపింది. ఆపరేషన్ ఎపిక్ ప్యూరీని విజయవంతం చేయడంలో అమెరికాకు అండగా నిలుస్తోందని చెప్పింది. అబ్రహం లింకన్‌పై దాడి చేయడానికి ఇరాన్ నౌకలు ప్రయత్నించగా అమెరికా బలగాలు వాటిని ధ్వంసం చేశాయని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. 

గత నెలలో ప్రారంభమైన ఇరాన్‌పై అమెరికా-ఉక్రెయిన్‌ సంయుక్త దాడులకు ముందే అబ్రహం లింకన్ చాలా పాపులర్‌ అయ్యింది. ఇరాన్‌తో అణుచర్చలు విఫలమైతే ఆ దేశంపై దాడి చేస్తామనే సంకేతంతో అరేబియా సముద్రంలో అమెరికా ఈ క్షిపణిని మోహరించింది. దీనితో మరో రెండు యుద్ధనౌకలను సముద్రంలో నిలిపింది. కాగా అబ్రహం లింకన్‌ యుఎస్‌ అతిపెద్ద యుద్ధనౌక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement