ఇరాన్‌పై మళ్లీ ఉరిమిన ట్రంప్‌ | Trump says Iran paying a big price as conflict moves very rapidly | Sakshi
Sakshi News home page

ఇరాన్‌పై మళ్లీ ఉరిమిన ట్రంప్‌

Mar 13 2026 7:26 AM | Updated on Mar 13 2026 7:40 AM

Trump says Iran paying a big price as conflict moves very rapidly

వాషింగ్టన్: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పట్ల మరోసారి తన కఠిన వైఖరి ప్రదర్శించారు. ఇరాన్‌తో నెలకొన్న సంఘర్షణ ‘అత్యంత వేగంగా’ క్లైమాక్స్‌కు చేరుకుంటోందని, ఆ దేశం భారీ మూల్యం చెల్లించుకుంటోందని ఆయన వ్యాఖ్యానించారు. శ్వేతసౌధంలో జరిగిన ‘ఉమెన్స్ హిస్టరీ మంత్’ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ ప్రస్తుత యుద్ధ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా సైనిక పటిమను కొనియాడారు. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు తాము చరమగీతం పాడుతున్నామని ట్రంప్‌ పేర్కొన్నారు.

అమెరికా సైనిక బలగాలు క్షేత్రస్థాయిలో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాయని ట్రంప్ ప్రశంసించారు. ‘ఇరాన్ విషయంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. మా సైనిక శక్తి అజేయమైనది. చరిత్రలో ఇలాంటి శక్తివంతమైన సైన్యాన్ని ఎవరూ చూసి ఉండరు. ప్రస్తుతం ఏం చేయాలో అదే చేస్తున్నాం’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. గడిచిన 47 ఏళ్లలో ఏ ప్రభుత్వమూ చేయలేని ధైర్యసాహసాలను తమ ప్రభుత్వం ప్రదర్శిస్తోందని, గత పాలకులు వదిలేసిన సమస్యలను తాము పరిష్కరిస్తున్నామని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.
 

ఇరాన్ పాలకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ట్రంప్, ఆ దేశాన్ని ‘విద్వేషానికి, ఉగ్రవాదానికి నిలయం’గా అభివర్ణించారు. ఆ ప్రాంతంలో అశాంతిని రేకెత్తిస్తున్న ఇరాన్ పాలక యంత్రాంగం ఇప్పుడు దాని ఫలితాన్ని అనుభవిస్తోందని వ్యాఖ్యానించారు. తన మొదటి పదవీకాలంలో అమెరికా సైన్యాన్ని ఆధునీకరించడం  కారణంగానే ఇప్పుడు ఈ స్థాయిలో విజయాలు సాధిస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు. ‘మేము సైన్యాన్ని పునర్నిర్మించాం. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాం. సైన్యాన్ని ఇంత భారీగా ఉపయోగించాల్సి వస్తుందని నేను అనుకోలేదు, కానీ ప్రస్తుత ప్రపంచ పరిణామాలు ఆ అవసరాన్ని కల్పించాయి’ అని ట్రంప్‌ పేర్కొన్నారు.  వివరించారు.

ఇది కూడా చదవండి: అమెరికాకు ఇరాన్ షాక్‌: 12 రోజుల్లో వేల కోట్ల సైనిక సంపత్తి బుగ్గి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement