ఆక్రమణదారుల రక్తం పారిస్తాం | Invading our islands will make Gulf run with blood: Iran Parliament speaker | Sakshi
Sakshi News home page

ఆక్రమణదారుల రక్తం పారిస్తాం

Mar 13 2026 5:08 AM | Updated on Mar 13 2026 5:08 AM

Invading our islands will make Gulf run with blood: Iran Parliament speaker

ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ హెచ్చరిక

దుబాయ్‌: ఇరాన్‌కు చెందిన ద్వీపాలను ఆక్రమించాలని చూస్తే ఆయా దురాక్రమణదారుల రక్తంతో పర్షియన్‌ గల్ఫ్‌ను నింపేస్తామని ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మొహమ్మద్‌ బఘీర్‌ ఖాలీబాఫ్‌ హెచ్చరించారు.

1971లో యునైటెట్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ను స్థాపించడానికంటే ముందే ఆ ప్రాంతం నుంచి ఇరాన్‌ మూడు ద్వీపాలను తన వశం చేసుకుంది. ఇరాన్‌ కీలక చమురు టెర్మినల్‌ ఉన్న ఖార్గ్‌ ద్వీపాన్ని అమెరికా లక్ష్యంగా చేసుకోవచ్చన్న వార్తల నడుమ బఘీర్‌ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement