క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఐపీఎల్-2026 సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. బీసీసీఐ తొలి విడతగా కేవలం 20 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మాత్రమే రిలీజ్ చేసింది. తొలి మ్యాచ్‌లో చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.
ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్ కోసం ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయింగ్ ఎలెవన్‌ను భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఎంపిక చేశాడు. అతడు ఎంపిక చేసిన తుది జట్టు అందరిని ఆశ్చర్యపరుస్తోంది. గత సీజన్ మాదిరిగానే ఓపెనర్లగా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌లను అతడు ఎంపిక చేశాడు. అదేవిధంగా మూడో స్ధానంలో పాకెట్ డైనమెట్ ఇషాన్ కిషన్‌కు అవకాశమిచ్చాడు.
ఆ తర్వాత వరుసగా నాలుగు ఐదు స్దానాల్లో క్లాసెన్,నితీష్ కుమార్ రెడ్డిలకు ఛాన్స్ ఇచ్చాడు. అయితే ఐపీఎల్ వేలంలో భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసిన ఎస్‌ఆర్‌హెచ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్‌కు ప్రధాన ఆల్‌రౌండర్‌గా చోప్రా చోటు కల్పించాడు. ఏడో స్థానంలో అనికేత్ వర్మను ఫినిషర్‌గా అతడు తీసుకున్నాడు.
కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్‌కు వస్తాడని చోప్రా అంచనా వేశాడు. పేస్ బౌలింగ్ విభాగంలో కమ్మిన్స్‌తో పాటు జయదేవ్ ఉనద్కత్ ,శివమ్ మావిలకు చోటు దక్కింది. ఇక స్పిన్నర్‌గా జీషన్ అన్సారీని అతడు ఎంపిక చేశాడు. అయితే రూ.8 కోట్లతో ఎస్‌ఆర్‌హెచ్ రిటైన్ చేసుకున్న హర్షల్ పటేల్‌ను ఆకాష్ చోప్రా పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం.
ఆకాష్ చోప్రా ఎంపిక చేసిన ఎస్ఆర్‌హెచ్ తుది జట్టు ఇదే
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, లియామ్ లివింగ్‌స్టోన్, అనికేత్ వర్మ, పాట్ కమిన్స్, జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, శివమ్ మావి
చదవండి: IPL 2026: 'ధోని, రుతురాజ్ కాదు.. అతడే సీఎస్‌కే బ్యాక్ బోన్'


