టీ20 వరల్డ్‌కప్-2026లో సంచలన ప్రదర్శన కనబరిచిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్.. ఇప్పుడు ఐపీఎల్‌లో సత్తాచాటేందుకు సిద్దమవుతున్నాడు. తన అరంగేట్రం నుంచి గత సీజన్ వరకు రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సంజూ, ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడనున్నాడు.
ఐపీఎల్-2026 సీజన్‌కు ముందు సీఎస్‌కే ఫ్రాంచైజీ సంజూను రాజస్తాన్ నుంచి ట్రేడ్ చేసుకుంది. అందుకోసం చెన్నై ఏకంగా స్టార్ ప్లేయర్లు రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్‌లను వదులుకుంది. ఈ నేపథ్యంలో శాంసన్‌పై భారత మాజీ క్రికెటర్ సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. శాంసన్ రాకతో సీఎస్‌కేలో మరో కొత్త శకం మొదలవుతుందని అతడు అభిప్రాయపడ్డాడు.
"సీఎస్‌కే ఒక పెద్ద ఫ్రాంచైజీ. ఇప్పటికే ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు రాజస్తాన్ నుంచి ట్రేడ్ చేసుకున్న సంజూ శాంసన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సీఎస్‌కేలో ఇక శాంసన్ శకం మొదలు కానుంది. అతడు ఆ జట్టుకు వెన్నెముకలా మారబోతున్నాడు. దీర్ఘకాలిక ప్రణాళికలలో భాగంగా సంజూను సీఎస్‌కే జట్టులోకి తీసుకుంది.
అతడు భవిష్యత్తులో కెప్టెన్ అయ్యే అవకాశముంది. అయితే అందుకు ఇంకా చాలా సమయం ఉందని" బద్రీనాథ్ తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. సీఎస్‌కే తమ తొలి మ్యాచ్‌లో మార్చి 29న గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది. చెన్నై కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ వ్యవహరించనున్నాడు.
చదవండి: సన్‌రైజర్స్‌లోకి పాక్ ఆటగాడు.. బీసీసీఐ స్పందన ఇదే


