T20 WC: రాస్కెల్స్‌.. నిప్పుతో చెలగాటం: ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ | They are rascals they walk into fire: Brad Haddin Lauds Team India stars | Sakshi
Sakshi News home page

T20 WC: రాస్కెల్స్‌.. నిప్పుతో చెలగాటం: ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ ప్రశంసలు

Mar 13 2026 2:28 PM | Updated on Mar 13 2026 2:40 PM

They are rascals they walk into fire: Brad Haddin Lauds Team India stars

టీ20 ప్రపంచకప్‌-2026 విజేతగా నిలిచిన టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. వరుసగా రెండుసార్లు ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా.. మూడుసార్లు టీ20 వరల్డ్‌కప్‌ ట్రోఫీ గెలిచిన ఏకైక టీమ్‌గా.. సొంతగడ్డపై పొట్టి క్రికెట్‌ ప్రపంచకప్‌ టైటిల్‌ గెలిచిన మొదటి జట్టుగా ప్రపంచ రికార్డులు సాధించింది.

సెమీస్‌ దాకా వైఫల్యాలు
నిజానికి లీగ్‌ దశలో భారత్‌ అజేయంగా నిలిచినా.. ఆయా మ్యాచ్‌లలో తమ ప్రదర్శన కోచ్‌ గౌతం గంభీర్‌కు సైతం సంతృప్తినివ్వలేదని కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) స్వయంగా చెప్పాడు. ఇక భారీ అంచనాలతో తొలిసారి బరిలోకి దిగిన ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (Abhishek Sharma).. వరుసగా మూడు మ్యాచ్‌లలో డకౌట్‌ అయ్యాడు. ఆ తర్వాత కూడా సెమీస్‌ దాకా వైఫల్యాలు కొనసాగించాడు.

మరోవైపు.. సంజూ శాంసన్‌కు ఆది నుంచి తుదిజట్టులో చోటులేని పరిస్థితి. అయితే, నాకౌట్‌ మ్యాచ్‌లలో అంటే వెస్టిండీస్‌తో సూపర్‌-8లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో 97 నాటౌట్‌, ఇంగ్లండ్‌తో సెమీస్‌లో 89, న్యూజిలాండ్‌తో ఫైనల్లో 89 పరుగులతో రాణించి దుమ్ములేపాడు.

టైటిల్‌ పోరులో విధ్వంసకర అర్ద శతకం
ఇక అభిషేక్‌ శర్మ సైతం అసలైన టైటిల్‌ పోరులో విధ్వంసకర అర్ద శతకం (21 బంతుల్లో 52)తో సత్తా చాటాడు. అదే విధంగా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా జట్టులోని ప్రతి సభ్యుడూ కీలక సమయాల్లో రాణించి తమ వంతు పాత్ర పోషించారు.

ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ బ్రాడ్‌ హాడిన్‌ టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘‘గేమ్‌ను టీమిండియా బాగా అర్థం చేసుకుంది. ముఖ్యంగా ఫైనల్లో వారు అద్భుతం చేశారు. బుమ్రా ఆడిన తీరు చూస్తే.. సూపర్‌స్టార్ల నుంచి ఏ జట్టైనా కోరుకునేది ఇదే కదా అనిపిస్తుంది.

రాస్కెల్స్‌.. నిప్పుతో చెలగాటం
అభిషేక్‌ శర్మ ఆటకు నేను వీరాభిమానిని. అయితే, టోర్నీ ఆరంభంలో అతడు డకౌట్లు కావడం.. ఆ తర్వాత కూడా విఫలమై దారుణంగా నిరాశపరిచాడు. దీంతో ఒత్తిడిలోకి కూరుకుపోయాడు.

అయితే, తప్పక ఆడాల్సిన మ్యాచ్‌లో బ్యాట్‌ ఝులిపించాడు. కొంతమంది రాస్కెల్స్‌ ఉంటారు.. నిప్పుతో చెలగాటం ఆడటం వారికి సరదా! ఫైనల్లో అభిషేక్‌ శర్మ విజృ​ంభించిన తీరు చూస్తే మీకే ఇది అర్థమవుతుంది. అందరూ అతడే ఒత్తిడిలో ఉంటాడనుకుంటే.. అతడు ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టేశాడు’’ అని బ్రాడ్‌ హాడిన్‌ ప్రశంలస వర్షం కురిపించాడు. 

చదవండి: తుదిజట్టులో చోటు ఇవ్వనపుడు.. అతడికి చెప్పిందిదే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement