breaking news
Jasprit Bumrah
-
IND vs ENG: గంభీర్ ఏం చేస్తున్నాడు?.. కుమార్ సంగక్కర ఫైర్
ఇంగ్లండ్‌తో రెండో టెస్టు నేపథ్యంలో టీమిండియా తీసుకున్న నిర్ణయాన్ని శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగర్కర విమర్శించాడు. సిరీస్ గెలవడం కంటే కూడా.. లార్డ్స్ టెస్టే ముఖ్యమా అంటూ భారత జట్టు నాయకత్వ తీరును ప్రశ్నించాడు. కాగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్‌కు వెళ్లిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య లీడ్స్ (Leeds Test)లోని హెడింగ్లీ మైదానంలో తొలి టెస్టు జరిగింది. ఇందులో గిల్ సేన.. స్టోక్స్ బృందం చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఫలితంగా సిరీస్‌లో 0-1తో వెనుకబడింది. ఇక టెస్టు జట్టు కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే శతక్కొట్టిన శుబ్‌మన్ గిల్‌కూ పరాజయం రూపంలో చేదు అనుభవమే మిగిలింది.విశ్రాంతి పేరిటకాగా భారత్ -ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా బుధవారం (జూలై 2) రెండో టెస్టు మొదలైంది. ఈ మ్యాచ్‌కు.. విశ్రాంతి పేరిట భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. పనిభారాన్ని తగ్గించే నిమిత్తం అతడిని ఇంగ్లండ్‌లో కేవలం మూడు టెస్టులే ఆడిస్తామన్న మేనేజ్మెంట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.ఇక టాస్ సందర్భంగా ఇదే విషయాన్ని మరోసారి పునరుద్ఘాటించిన కెప్టెన్ శుబ్‌మన్ గిల్.. లార్డ్స్‌లో జరిగే మూడో టెస్టులో బుమ్రాను ఆడిస్తామని చెప్పాడు. అక్కడి పిచ్ అనుకూలంగా ఉంటుంది కాబట్టి బుమ్రా తప్పక ఆడతాడని చెప్పాడు.విమర్శల వర్షంనిజానికి.. తొలి టెస్టుకు.. రెండో టెస్టుకు మధ్య వారం రోజుల విరామ సమయం దొరికింది. అయినప్పటికీ కీలక మ్యాచ్‌లో బుమ్రాకు విశ్రాంతినివ్వడాన్ని భారత మాజీ క్రికెటర్లు రవిశాస్త్రి, సునిల్ గావస్కర్ తదితరులు తప్పుబట్టారు. ఇక సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ అయితే.. టీమిండియా మేనేజ్మెంట్ తీరును తనదైన శైలిలో విమర్శించాడు.రొనాల్డో లేని పోర్చుగల్ మాదిరి‘‘ప్రపంచంలోని అత్యుత్తమ స్ట్రైకర్ అయిన రొనాల్డో లేకుండా పోర్చుగల్ బరిలోకి దిగితే ఎలా ఉంటుందో.. బుమ్రా లేని టీమిండియాకు కూడా అదే పరిస్థితి. నాకైతే ఏమీ అర్థం కావడం లేదు’’ అంటూ స్టెయిన్ చురకలు అంటించాడు. ఇక ఈ జాబితాలో తాజాగా.. శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార్ సంగక్కర కూడా చేరిపోయాడు.ఈ నిర్ణయం ఎవరిది?.. కోచ్ ఏం చేస్తున్నాడు?‘‘అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఎవరు తీసుకున్నారు? ఆటగాళ్లను, ఫిజియోలను సంప్రదించిన తర్వాతే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా? సిరీస్ గెలవడం కంటే లార్డ్స్ టెస్టే ముఖ్యమని మీరు భావిస్తున్నారా?బుమ్రాను మూడు టెస్టులే ఆడించాలని భావిస్తే.. 1-3-5 మాత్రమే ఎందుకు కావాలి? కావాల్సినంత విరామం దొరికింది.. విజయం కోసం జట్టు పరితపిస్తోంది. మరి అలాంటపుడు కోచ్ బుమ్రా దగ్గరకు వెళ్లి ఇదే విషయాన్ని అర్థమయ్యేట్లు చెప్పవచ్చు కదా!’’ అని కుమార్ సంగక్కర స్కై స్పోర్ట్స్‌తో వ్యాఖ్యానించాడు.కాగా ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. బుమ్రాకు రెస్ట్ ఇవ్వడంతో పాటు.. సాయి సుదర్శన్, శార్దూల్ ఠాకూర్లపై వేటు వేసింది. ఈ ముగ్గురి స్థానాలను ఆకాశ్ దీప్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్‌లతో భర్తీ చేసింది.చదవండి: Ind vs Eng: ఇదేం తీరు?.. గిల్‌పై మండిపడ్డ గావస్కర్!.. గంగూలీ విమర్శలు -
‘ఇదేం సెలక్షన్’
ప్రపంచంలో బెస్ట్ బౌలర్ మీ జట్టులో ఉన్నాడు... అప్పుడప్పుడు ఫిట్నెస్ సమస్యలు ఉన్నా రెండు టెస్టుల మధ్య ఏడు రోజుల విరామం వచ్చింది. గత మ్యాచ్‌లో ఒక వేళ ఏమైనా ఇబ్బంది కలిగినా...ఫిట్నెస్ ట్రైనర్, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్, ఫిజియోథెరపిస్ట్ అందుబాటులో ఉన్నప్పుడు కోలుకునేందుకు ఏడు రోజుల సమయం కూడా సరిపోతుంది. ఇప్పటికే తొలి టెస్టులో ఓడి జట్టు వెనుకంజలో ఉంది. ప్రత్యర్థిపై పైచేయి సాధించి సింగిల్ హ్యాండ్‌తో గెలిపించగల సత్తా అతనికి ఉంది. అయినా సరే... భారత జట్టు జస్ప్రీత్ బుమ్రాను ఈ మ్యాచ్‌లో ఆడించలేదు. పైగా తర్వాతి టెస్టులో పిచ్ అనుకూలంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఆడతాడని కెప్టెన్ గిల్ వ్యాఖ్యానించడం క్షమించరానిది! అతని స్థానంలో ఆకాశ్‌దీప్‌కు అవకాశం లభించింది. మరో వైపు మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు మళ్లీ అన్యాయం జరిగింది. రెండో స్పిన్నర్‌గా అతనికి ఈ మ్యాచ్‌లోనూ అవకాశం లభించలేదు. అటాకింగ్ బౌలర్ అయిన కుల్దీప్ గత టెస్టులో లేకపోవడం లోటుగా కనిపించింది. ఈ సారి ఇంగ్లండ్‌పై చెలరేగే అవకాశం ఉందని భావించగా ఈ సారి స్థానమే దక్కలేదు. పైగా గత మ్యాచ్‌లో లోయర్ ఆర్డర్ విఫలమైంది కాబట్టి బ్యాటింగ్ చేయగల బౌలర్ కావాలంటూ సుదర్శన్ స్థానంలో సుందర్‌ను తీసుకున్నారు. ఒక రెగ్యులర్ బౌలర్‌ను అతని బ్యాటింగ్ సామర్థ్యాన్ని బట్టి ఎంపిక చేయడం ఏమిటో అర్థం కాలేదు! శార్దుల్ ఠాకూర్‌కు బదులుగా అదే తరహా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్, ఆంధ్రకు చెందిన నితీశ్ కుమార్ రెడ్డికి చాన్స్ ఇచ్చినా అతనూ విఫలమయ్యాడు. ‘బుమ్రాను తప్పించడం నమ్మశక్యంగా లేదు. అతని పని భారం తగ్గించాలని చూస్తే ఇప్పటికే తగినంత విశ్రాంతి లభించింది. ఎంతో కీలకమైన మ్యాచ్‌కు అతను లేకపోవడం ఆశ్చర్యకరం. ఆటగాడు తన ఇష్ట్రపకారం మ్యాచ్‌ను ఎంచుకునే అవకాశం ఇవ్వరాదు. ఇక్కడ టెస్టు గెలిచి 1–1తో సిరీస్‌ను సమం చేస్తే ఆ తర్వాత విశ్రాంతి ఇచ్చుకోవచ్చు’ అని రవిశాస్త్రి దీనిపై తీవ్రంగా వ్యాఖ్యానించాడు. ఇలా బ్యాటింగ్ బలమే కావాలంటే సిరీస్ చివరకు వచ్చే సరికి బుమ్రా, మరో పది మంది బ్యాటర్లే బరిలోకి దిగుతారేమో! -
అర్ష్‌దీప్ వద్దు!.. బుమ్రా స్థానంలో అతడే సరైనోడు: ఇర్ఫాన్ పఠాన్
ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు ముందు భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ టీమిండియా నాయకత్వ బృందానికి కీలక సూచనలు చేశాడు. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) స్థానాన్ని ఆకాశ్ దీప్తో భర్తీ చేస్తే బాగుంటుందన్నాడు. మహ్మద్ షమీ (Mohammed Shami) మాదిరి ఈ బెంగాల్ పేసర్ రాణించగలడని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు.ఐదు టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్‌కు వెళ్లిన టీమిండియా.. ఓటమితో ఈ సిరీస్‌ను మొదలుపెట్టింది. లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో ఐదు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. ఇక బుమ్రాపై పనిభారం తగ్గించే నిమితం టీమిండియా మేనేజ్మెంట్ అతడిని ఇక్కడ కేవలం మూడు టెస్టుల్లో మాత్రమే ఆడించనుంది.షమీ మాదిరి ఆకట్టుకోగలడుఈ నేపథ్యంలో బర్మింగ్‌హామ్‌లో జరిగే రెండో టెస్టుకు బుమ్రాకు విశ్రాంతినిస్తారని తెలుస్తోంది. ఈ విషయంపై స్పందించిన ఇర్ఫాన్ పఠాన్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు.‘‘ఒకవేళ బుమ్రా గనుక ఈ టెస్టు ఆడకపోతే.. అతడి స్థానంలో సరైన బౌలర్ ఎవరంటే.. ఆకాశ్ దీప్. నెట్స్‌లో అతడి ప్రాక్టీస్ చూస్తుంటే.. షమీ మాదిరి ఆకట్టుకోగలడని అనిపిస్తోంది. సీమ్, స్వింగ్‌పై మరింతగా దృష్టి సారిస్తే.. కచ్చితంగా ఇంగ్లండ్ బ్యాటర్లను అతడు ఇబ్బందిపెట్టగలడు.అర్ష్‌దీప్ వద్దు!.. బుమ్రా స్థానంలో అతడే సరైనోడుఅర్ష్దీప్ కూడా రేసులో ఉన్నాడు. కానీ బుమ్రా ఒకవేళ రెండో టెస్టు ఆడకపోతే అతడి స్థానంలో ఆకాశ్ దీప్‌ను తప్పక ఎంపిక చేయాలి’’ అని ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు. ఇదిలా ఉంటే.. మంగళవారం మీడియాతో మాట్లాడిన టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్.. బుమ్రా రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడని స్పష్టం చేశాడు. అయితే, అతడిని ఆడించే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నాడు.మరోవైపు.. ఎడ్జ్‌బాస్టన్ పిచ్ పొడిగా ఉండనున్న నేపథ్యంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తుదిజట్టులోకి రావడం ఖాయమని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు అంటున్నారు. కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య జూలై 2-6 వరకు రెండో టెస్టు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది.ఇదిలా ఉంటే.. ఆకాశ్ దీప్ టీమిండియా తరఫున ఇప్పటి వరకు ఏడు టెస్టులు ఆడి పదిహేను వికెట్లు తీశాడు. మరోవైపు.. పరిమిత ఓవర్ల క్రికెట్లో దూసుకుపోతున్న అర్ష్‌దీప్.. సుదీర్ఘ ఫార్మాట్లో ఇంకా అరంగేట్రం చేయలేదు. ఇక టీమిండియాతో రెండో టెస్టుకు ఇంగ్లండ్ ఇప్పటికే తమ తుదిజట్టును ప్రకటించింది.భారత్‌తో రెండో టెస్టు కోసం ఇంగ్లండ్ తుది జట్టు ఇదేజాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్.చదవండి: చిచ్చర పిడుగులు ఇరగదీశారు.. వరల్డ్ చాంపియన్ చేతిలో జింబాబ్వే చిత్తు -
శుభవార్త చెప్పిన శుబ్‌మన్ గిల్
ఇంగ్లండ్‌తో రెండో టెస్టు (Ind vs Eng 2nd Test)కు భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) అందుబాటులో ఉంటాడా? లేడా?.. గత కొన్ని రోజులుగా క్రికెట్ వర్గాల్లో ఇదే చర్చ. ఈ విషయంపై టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) స్పందించాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్టుకు బుమ్రా అందుబాటులో ఉంటాడని స్పష్టం చేశాడు. అయితే, అతడిని ఆడించే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదంటూ ట్విస్ట్ ఇచ్చాడు.తొలి టెస్టులో ఓటమిటెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా అక్కడకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో తొలి టెస్టు జరుగగా.. గిల్ సేన స్టోక్స్ బృందం చేతిలో ఓటమిపాలైంది. ఐదో రోజు వరకు సాగిన ఆటలో ఆఖరికి ఐదు వికెట్ల తేడాతో పరాజయం చవిచూసింది.బుమ్రాపైనే భారంఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లలో బుమ్రా ఒక్కడే గొప్పగా రాణించాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో అతడు ఐదు వికెట్లు కూల్చాడు. అయితే, మిగతా బౌలర్ల నుంచి అతడికి పెద్దగా సహకారం అందలేదు. అదే విధంగా.. ఫీల్డింగ్ తప్పిదాలు కూడా టీమిండియా కొంపముంచాయి.ఇదిలా ఉంటే.. ఫిట్నెస్, పనిభారం దృష్ట్యా బుమ్రా ఇంగ్లండ్‌తో ఐదింటిలో మూడు టెస్టులు మాత్రమే ఆడతాడని మేనేజ్మెంట్ ముందే స్పష్టం చేసింది. అయితే, అవి ఏ మూడో మాత్రం చెప్పలేదు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బుమ్రా రెండో టెస్టు బరిలో దిగితేనే బాగుంటుందని విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు టీమిండియాకు సూచిస్తున్నారు.బుమ్రా అందుబాటులో ఉంటాడు.. కానీతొలి- రెండో టెస్టుకు మధ్య వారానికి పైగా విరామం దొరికింది కాబట్టి బుమ్రాను ఆడించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బుమ్రా అందుబాటులో ఉన్నాడు. అతడి వర్క్‌లోడ్ మేనేజ్మెంట్ గురించి మేము ఆలోచిస్తున్నాం.అయితే, ఈరోజు సాయంత్రానికి మేము సరైన కూర్పుతో జట్టును ఎంపిక చేసుకోగలం. అప్పుడే బుమ్రా విషయంలో నిర్ణయం తీసుకుంటాం. ఈ సిరీస్ ఎంత ముఖ్యమో మాకు తెలుసు.కనీసం మూడు మ్యాచ్‌లకైనా బుమ్రా అందుబాటులో ఉంటాడు. తను జట్టు లేకపోతే ఆ లోటు స్పష్టంగా తెలుస్తుంది. కానీ అధిక పనిభారాన్ని మోపడం కూడా సరికాదు.20 వికెట్లు కూల్చడం సహా భారీగా పరుగులు రాబట్టగలిగే జట్టు కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం. పిచ్‌ను చూసిన తర్వాతే స్పిన్నర్లలో ఎవరిని తుదిజట్టులో చేర్చుకుంటామో చెప్పగలము’’ అని పేర్కొన్నాడు. కాగా బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో బుధవారం (జూలై 2-6) నుంచి భారత్- ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు మొదలుకానుంది. చదవండి: జైస్వాల్‌పై గంభీర్ ఆగ్రహం!.. ‘వేటు’ తప్పదన్న డష్కాటే! -
బుమ్రాపై నిర్ణయం అప్పుడే.. మా దృష్టింతా దానిపైనే: టీమిండియా కోచ్
ఇంగ్లండ్ పర్యటనలో మొదటి నుంచి భారత స్టార్ పేసర్ బుమ్రా ఆడే మూడు టెస్టుల గురించే చర్చ జరుగుతూ వచ్చింది. ఇప్పుడూ అదే కొనసాగుతోంది. ఇప్పటికే బుమ్రా తొలి టెస్టు ఆడాడు. జట్టు ఇంకా ఆడాల్సిన నాలుగు టెస్టుల్లో బుమ్రా ఆడేవి రెండే మ్యాచ్‌లు. ఆ రెండు ఏవనే దానిపై చర్చంతా సాగుతోంది. తాజాగా దీనిపై భారత అసిస్టెంట్ కోచ్ టెన్ డస్కటే స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు.కానీ మ్యాచ్‌కు ముందే అతని అందుబాటుపై నిర్ణయం ఉంటుందని చెప్పాడు. ఎప్పటిలాగే అతను ట్రెయినింగ్ సెషన్లో పాల్గొంటున్నాడని, విశ్రాంతి తీసుకోవడం లేదన్నాడు. సోమవారం కూడా సహచరులతో కలిసి ప్రాక్టీస్‌లో చెమటోడ్చినట్లు చెప్పాడు. "తదుపరి మ్యాచ్‌కూ బుమ్రా అందుబాటులో ఉండే అవకాశముంది.అతను ఆడేది మూడు టెస్టులే అయినప్పటికీ గడిచిన తొలి టెస్టుకు, జరగబోయే రెండో టెస్టుకు మధ్య 8 రోజుల విశ్రాంతి లభించింది. అయితే సుదీర్ఘ ఫార్మాట్లో పనిభారాన్ని పరిశీలించాకే అతనిపై నిర్ణయం తీసుకుంటాం" అని అసిస్టెంట్ కోచ్ అన్నాడు. తొలి టెస్టులో ఆతిథ్య జట్టుకు దీటుగానే బదులిచ్చామని, రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా వికెట్లు తీయడంలో వెనుకబడినప్పటికీ గెలిచేదశలో కనిపించామని చెప్పాడు.ఇద్దరు స్పిన్నర్ల కూర్పుపై కూడా జట్టు మేనేజ్మెంట్ విశ్లేస్తోంది. బ్యాటింగ్‌ను బలోపేతం చేయాలనుకుంటే సీనియర్ స్పిన్నర్ జడేజాకు జతగా వాషింగ్టన్ సుందర్‌ను బరిలోకి దించే అంశాన్ని గట్టిగానే పరిశీలిస్తోంది. అయితే పిచ్ పరిస్థితులని బట్టే తుది నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నట్లు డస్కటే చెప్పాడు.తొలి మ్యాచ్‌లో బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన శార్దుల్ పెద్దగా రాణించలేకపోయాడు. అయితే ఒకే టెస్టుతో అతని సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయబోమని, అయితే బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అవసరమనుకుంటేనే అతన్ని మార్చే అంశాల్ని పరిశీలిస్తామన్నాడు. ఇదే జరిగితే నితీశ్ కుమార్ రెడ్డి తుది జట్టుకు ఖాయమవుతాడు.లీడ్స్‌లో సులువైన క్యాచ్‌ల్ని నేలపాలు చేయడంతో ఫీల్డింగ్‌పై ప్రధానంగా దృష్టిసారించిన జట్టు స్లిప్స్, గల్లీ వద్ద కట్టుదిట్టం చేయనుంది. జైస్వాల్‌ను గల్లీ నుంచి తప్పించడం ఖాయమైంది. నాలుగో స్లిప్, గల్లీ ప్లేస్మెంట్లను కరుణ్ నాయర్, రాహుల్, కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌లతో భర్తీ చేయనున్నట్లు డస్కటే తెలిపాడు. ఈ మేరకు ఆ ముగ్గురితో పాటు సాయి సుదర్శన్, నితీశ్ కుమార్ రెడ్డిలతో ఫీల్డింగ్ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశారు.చదవండి: నిరాశపరిచిన ఆయుశ్ మాత్రే.. మరోసారి విధ్వంసం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ -
బుమ్రా మూడు టెస్టులు ఆడితే.. షమీ కనీసం రెండు ఆడలేడా?
ఇంగ్లండ్ పర్యటనను ఓటమితో ఆరంభించిన టీమిండియా రెండో టెస్టులోనైనా సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. బర్మింగ్‌హామ్‌లో గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేసేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. అయితే, ఈ మ్యాచ్‌కు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) అందుబాటులో ఉంటాడో, లేదోనన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.కాగా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులకు జట్టును ప్రకటించిన సమయంలోనే బుమ్రా కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడతాడని యాజమాన్యం పేర్కొంది. బుమ్రాపై పనిభారం తగ్గించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) స్వయంగా వెల్లడించాడు.బుమ్రాపైనే భారంఇక ఈ టూర్‌కు పేస్ దళంలో నాయకుడు బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్, యువ ఆటగాళ్లు ప్రసిద్ కృష్ణ, ఆకాశ్ దీప్ (Akash Deep) కూడా ఎంపికయ్యారు. లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో బుమ్రా తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయగా.. సిరాజ్ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. ఇక ప్రసిద్ కృష్ణ వికెట్లు తీసినా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు.ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ 27 ఓవర్ల బౌలింగ్‌లో 122 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 14 ఓవర్ల బౌలింగ్‌లో 51 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేదు. మరోవైపు.. ప్రసిద్ కృష్ణ తొలి ఇన్నింగ్స్‌లో 20 ఓవర్ల బౌలింగ్‌లో 128 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 15 ఓవర్ల బౌలింగ్‌లో 92 రన్స్ ఇచ్చి రెండు వికెట్లు దక్కించుకోగలిగాడు.షమీ ఉంటే బాగుండేదిఅయితే, జట్టు బుమ్రాపైనే ఎక్కువగా ఆధారపడుతుండటంతో అతడిపైనే భారం పడుతోంది. ఇలాంటి తరుణంలో మహ్మద్ షమీ ఉండి ఉంటే ఉపయోగకరంగా ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పేస్ బౌలర్ 2023లో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో భాగంగా ఆస్ట్రేలియాపై చివరగా ఆడాడు.ఆ తర్వాత గాయం కారణంగా జట్టుకు చాలా కాలం దూరమైన షమీ.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో సత్తా చాటాడు. ఐదు మ్యాచ్‌లలో కలిపి ఒక ఫైఫర్ సాయంతో తొమ్మిది వికెట్లు కూల్చాడు. అయితే, ఐపీఎల్-2025లో మాత్రం రాణించలేకపోయాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడిన షమీ.. తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి కేవలం ఆరు వికెట్లే తీయగలిగాడు.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో పర్యటనకు సెలక్టర్లు షమీ పేరును పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది. ఫిట్నెస్ సమస్యలు కూడా ఇందుకు ఓ కారణం అని అగార్కర్ మాటల ద్వారా వెల్లడైంది. ఈ క్రమంలో బుమ్రాకు పనిభారం తగ్గించినట్లుగా.. షమీకి కూడా ఓ అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.బుమ్రా మూడు ఆడితే.. షమీ కనీసం రెండు ఆడలేడా?సిరాజ్ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోవడం.. ప్రసిద్ అనుభవలేమి బౌలర్ కావడంతో షమీ పేరు ప్రముఖంగా తెరమీదకు వచ్చింది. బుమ్రాను మూడు టెస్టులు ఆడిస్తే.. షమీని కనీసం రెండు టెస్టుల్లో ఆడించాల్సిందనే వాదన వినిపిస్తోంది. కాగా 34 ఏళ్ల షమీ ఇప్పటి వరకు తన టెస్టు కెరీర్లో 64 మ్యాచ్‌లలో కలిపి 229 వికెట్లు కూల్చగా.. ఇందులో ఇంగ్లండ్ గడ్డ మీద 14 మ్యాచ్‌లు ఆడి 42 వికెట్లు తీశాడు.మరోవైపు సిరాజ్.. ఇప్పటికి ఆడిన 37 టెస్టుల్లో 102 వికెట్లు పడగొట్టాడు. ఏదేమైనా ఇంగ్లండ్ టూర్లో అనుభవజ్ఞుడైన షమీ ఉంటే పేస్ బౌలింగ్ విభాగం మరింత బలపడేదని విశ్లేషకులు అంటున్నారు. కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడనుంది. లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇరుజట్ల మధ్య బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం వేదికగా రెండో టెస్టుకు జూలై 2-6 వరకు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: సౌతాఫ్రికా క్రికెట్లో సరికొత్త అధ్యాయం.. చరిత్ర సృష్టించిన కేశవ్ మహారాజ్ -
గిల్‌ను విమర్శించొద్దు!.. రెండో టెస్టులో అతడిని ఆడించండి: అజారుద్దీన్
టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కు భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహ్మద్ అజారుద్దీన్ అండగా నిలిచాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూసిన ఈ యువ ఆటగాడిని విమర్శించడం తగదని హితవు పలికాడు. అతడికి మరికాస్త సమయం ఇవ్వాలని కోరాడు.దిగ్గజాల నిష్క్రమణ తర్వాతఇంగ్లండ్ పర్యటనకు ముందు కెప్టెన్ రోహిత్‌శర్మ (Rohit Sharma), దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) టెస్టులకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అంతకు ముందే ఆస్ట్రేలియా టూర్లో స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇలాంటి తరుణంలో యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్‌కు మేనేజ్మెంట్ టెస్టు జట్టు పగ్గాలు అప్పగించింది.ఐదు వికెట్ల తేడాతో ఓటమిఈ క్రమంలో తొలుత టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy) ఆడేందుకు గిల్ సారథ్యంలోని జట్టు ఇంగ్లండ్‌కు వెళ్లింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. లీడ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఐదు శతకాలు బాదినా ఫలితం లేకుండా పోయింది.లోయర్ ఆర్డర్, బౌలింగ్ విభాగం వైఫల్యం, ఫీల్డర్ల తప్పిదాల కారణంగా గెలవాల్సిన మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో గిల్ కెప్టెన్సీపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో మహ్మద్ అజారుద్దీన్ స్పందిస్తూ అతడికి మద్దతుగా నిలిచాడు.తొందరపాటే అవుతుంది‘‘కెప్టెన్‌గా అతడికి ఇదే తొలి మ్యాచ్. ఇప్పుడే కెప్టెన్సీ గురించి ఇంత చర్చ అవసరం లేదు. అతడికి ఇంకాస్త సమయం ఇవ్వాలి. ప్రతి ఒక్కరు అతడికి అండగా నిలవాల్సిన సమయం ఇది. ప్రతిసారీ ఏదో ఒక ఫిర్యాదు చేస్తూ ఆటగాళ్లను విమర్శించడం తగదు. ఏదేమైనా తొలి టెస్టు ఆఖర్లో మన బ్యాటింగ్ విభాగం కుప్పకూలింది. ఇప్పటికైనా సరైన కూర్పుతో జట్టును ఎంపిక చేసుకోవాలి. బౌలింగ్ కూడా మారాలి’’ అని స్పోర్ట్స్‌కీడాతో అజారుద్దీన్ పేర్కొన్నాడు.కుల్దీప్ను తప్పక ఆడించండిఅదే విధంగా.. భారత బౌలింగ్ విభాగం గురించి మాట్లాడుతూ.. ‘‘ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాపైనే జట్టు అతిగా ఆధారపడుతోంది. వికెట్లు పడగొట్టడంతో పాటు పరుగులు నియంత్రించేందుకు జట్టు ప్రతిసారి అతడినే ఆశ్రయిస్తోంది.అతడు ఒక్కడే రాణిస్తే సరిపోదు. అనుభవజ్ఞులైన మరికొంత మంది బౌలర్లు కూడా తమ వంతు పాత్ర పోషించాలి. రెండో టెస్టులో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకోవాలి. తద్వారా బౌలింగ్‌లో వైవిధ్యం పెరుగుతుంది’’ అని అజారుద్దీన్ అభిప్రాయపడ్డాడు.కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య బుధవారం (జూలై 2-6)నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం ఇందుకు వేదిక. అయితే, ఇక్కడి పిచ్ పొడిగా ఉండనుండటంతో... కుల్దీప్ ప్రభావం చూపగలడని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. అజారుద్దీన్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.చదవండి: SA vs ZIM: చరిత్ర సృష్టించిన బేబీ ఏబీడీ.. అరంగేట్రంలోనే వరల్డ్ రికార్డు -
ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. టీమిండియాకు గుడ్ న్యూస్! వీడియో వైరల్
భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు జూలై 2 నుంచి బర్మింగ్‌హామ్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియాకు కాస్త ఊరట లభించింది. శనివారం జరిగిన నెట్ ప్రాక్టీస్ సెషన్లో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా పాల్గోన్నాడు.శుక్రవారం జరిగిన మొదటి ప్రాక్టీస్ సెషన్‌కు దూరంగా ఉన్న బుమ్రా.. రెండో రోజు మాత్రం దాదాపు ఆరగంట పాటు బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. రెండో టెస్టుకు బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో బుమ్రా తిరిగి మళ్లీ నెట్స్‌లో కన్పించడం ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.అయితే రెండవ టెస్ట్‌లో బుమ్రా పాల్గొనడంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో తమ రిపోర్ట్‌లో పేర్కొంది. కాగా ఈ సిరీస్‌కు ముందే బుమ్రా కేవలం మూడు మ్యాచ్‌లలో మాత్రమే ఆడతాడని టీమిండియా మెనెజ్‌మెంట్ స్పష్టం చేసింది.కానీ ఏ మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఒకవేళ రెండో టెస్టుకు బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని టీమ్ యాజమాన్యం భావిస్తే.. వారి నిర్ణయాన్ని మార్చుకునే అవకాశముంది. ఎందుకంటే తొలి టెస్టులో ఓటమి పాలైన భారత్‌కు.. బర్మింగ్‌హామ్ టెస్టు చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్ 1-1 సమమవుతోంది. అదే ఓడిపోతే 0-2తో టీమిండియా వెనకబడుతోంది. కాబట్టి రెండో టెస్టులో ఆడించి బుమ్రాకు మూడో టెస్టుకు విశ్రాంతి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు గంభీర్ అండ్ కో ఉన్నట్లు సమాచారం. బుమ్రా విషయంలో మరి ఏ నిర్ణయం తీసుకుంటారో మరో మూడు రోజులు వేచి చూడాలి.కాగా రెండో రోజు ప్రాక్టీస్‌కు టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్, యశస్వి జైశ్వాల్, రిషబ్ పంత్ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాక్టీస్‌లో మాత్రం భారత జట్టు ఫీల్డింగ్, ఫిట్నెస్ డ్రిల్స్‌పై ఎక్కువగా దృష్టిసారించింది.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. తొలి భారత ప్లేయర్‌గాBoom Time! 💣 pic.twitter.com/AhXEZg2ven— Sahil Malhotra (@Sahil_Malhotra1) June 28, 2025 -
అతడి భార్య పోటీకి వస్తుందేమో!.. నేనే నంబర్ వన్!
టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)పై భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ప్రశంసలు కురిపించాడు. అద్భుత నైపుణ్యాలు జెస్సీ సొంతమని.. బ్యాటింగ్ లెజెండ్స్ సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లి (Virat Kohli)లతో సరిసమాన గౌరవానికి అతడు అర్హుడని పేర్కొన్నాడు. బుమ్రా తన ఆట తీరుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడన్న అశూ.. అందరికంటే తానే వీరాభిమానినని తెలిపాడు.ఇంగ్లండ్ పర్యటనలోకాగా ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన బుమ్రా.. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో బిజీగా ఉన్నాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా లీడ్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో అతడు సత్తా చాటాడు.ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 24.4 ఓవర్ల బౌలింగ్‌లో 83 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు కూల్చాడు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఈ కుడిచేతివాటం పేసర్ స్థాయికి తగ్గట్లు ఆకట్టుకోలేకపోయాడు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో ఓడిపోయింది.సమాన గౌరవం దక్కాలిఇదిలా ఉంటే.. గిల్ సేన మ్యాచ్ ఓడినా.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా ప్రదర్శన పట్ల మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా తాను బుమ్రాకు వీరాభిమానినంటూ అశూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.‘‘టెండుల్కర్, కోహ్లి మాదిరే బుమ్రాకు సమాన గౌరవం దక్కాలి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సచిన్ టెండుల్కర్‌ల విషయంలో మనమేం చేశామో.. జెస్సీ విషయంలోనూ అదే చేయాలి. నిజానికి బౌలర్‌గా అతడికి అందరికంటే ఎక్కువ గౌరవమే దక్కాలి.అతడి భార్య పోటీకి వస్తుందేమో!.. నేనే నంబర్ వన్అతడికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఎంతో మంది అతడిని ప్రేమిస్తున్నారు. నేనైతే అతడి నంబర్ వన్ ఫ్యాన్‌ని. నాకు తెలిసి ఈ నంబర్ వన్ ఫ్యాన్ విషయంలో బుమ్రా భార్య నాతో పోటీకి వస్తుందేమో! కానీ నేను మాత్రం నేనే నంబర్ వన్ అని చెప్తా’’ అంటూ అశ్విన్ బుమ్రా పట్ల అభిమానాన్ని చాటుకున్నాడు.కాగా బుమ్రా సతీమణి సంజనా గణేషన్ స్పోర్ట్స్ ప్రజెంటర్ అన్న విషయం తెలిసిందే. ఐసీసీ ఈవెంట్లతో పాటు ఐపీఎల్‌లోనూ వ్యాఖ్యాతగా సత్తా చాటుతోందామె. ఈ జంటకు కుమారుడు అంగద్ బుమ్రా ఉన్నాడు.ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-1తో వెనుకబడి ఉన్న టీమిండియా.. జూలై 2-6 వరకు రెండో టెస్టు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం ఇందుకు వేదిక. ఈ మ్యాచ్‌లో బుమ్రా ఆడే అవకాశం లేదని తెలుస్తోంది. పనిభారం తగ్గించే నిమిత్తం యాజమాన్యం అతడికి రెండో టెస్టు నుంచి విశ్రాంతినిచ్చినట్లు సమాచారం.చదవండి: సచిన్ సర్ కొడుకు.. అర్జున్‌పై ఎలా అరవగలను?.. కెప్టెన్‌గా ఉన్నపుడు జరిగిందిదే! -
IND VS ENG: బుమ్రాపై వర్క్ లోడ్.. ఒక్కడు ఎంతని చేయగలడు..?
ఇటీవలికాలంలో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా ప్రస్తావన వచ్చే సరికి వర్క్ లోడ్ అన్న పదం వినిపిస్తుంది. చాలామందికి ఈ పదం చాలా సాధారణంగా అనిపించవచ్చు. క్రికెట్‌పై పెద్దగా అవగాహన లేని వారు.. ఈ ఇంత దానికే వర్క్ లోడ్ అంటే ఎలా అని అంటుంటారు. గతంలో చాలామంది పేసర్లు బుమ్రా కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడి, లెక్కలేనన్ని ఓవర్లు వేశారని గుర్తు చేస్తుంటారు.అయితే అప్పటి క్రికెట్‌కు, ఇప్పటి క్రికెట్‌కు పోల్చుకోలేని వ్యత్యాసం ఉందన్న విషయం వారికి అర్దం కాదు. అప్పట్లో పేసర్లు టెస్ట్ మ్యాచ్‌లు, అప్పుడప్పుడు వన్డేలు ఆడేవారు. అది కూడా ఏడాదిలో కొంతకాలం మాత్రమే. అయితే పొట్టి క్రికెట్ ఆగమనంతో పరిస్థితి చాలా మారింది. ఏడాది పొడవునా ఏదో ఒక ఫార్మాట్లో మ్యాచ్‌లు జరుగుతుంటాయి. మధ్యలో ప్రైవేట్ లీగ్‌లు, ఖాళీగా ఉంటే దేశవాలీ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది.ఇలాంటి పరిస్థితుల్లో పేస్ బౌలర్లపై సహజంగానే పని భారం ఉంటుంది. శరీరం పెద్దగా సహకరించదు. ఒకవేళ ధైర్యం చేసి బరిలోకి దిగినా గాయాలు తప్పవు. గాయాల బారిన పడితే కొన్ని సందర్భాల్లో అర్దంతరంగా కెరీర్లే ముగిసిపోతాయి. కెరీర్ ముగిస్తే సదరు బౌలర్ జీవితం కూడా ముగిసినట్లే. ఇవన్నీ చూసుకొనే పేసర్లు ఆచితూచి మ్యాచ్‌లు ఆడుతుంటారు. సంబంధిత క్రికెట్ బోర్డులు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొనే వారిని ఎంపిక చేస్తుంటారు. బుమ్రా సహా ప్రపంచ క్రికెట్లో పేసర్లందరి విషయంలోనూ ఇదే జరుగుతుంది. అయితే, గత ఏడాదిన్నర కాలంగా మిగతా పేసర్లతో పోలిస్తే బుమ్రాపై అదనపు పని భారం పడుతుంది. టెస్ట్‌ల్లో ప్రపంచ ప్రఖ్యాత పేసర్లు మిచెల్ స్టార్క్ (362), కగిసో రబాడ (298) వంటి వారు 2024 నుంచి గరిష్టంగా 362 ఓవర్లు వేస్తే, బుమ్రా ఏకంగా 410 ఓవర్లు వేశాడు. ఈ గణాంకాలు చేస్తే చాలు బుమ్రాపై ఎంత పని భారం పడుతుందో చెప్పడానికి.టీమిండియా బుమ్రాపై అతిగా ఆధారపడుతూ, అతనిచే సామర్థ్యానికి మించి బౌలింగ్ చేయిస్తుంది. ఇదే కొనసాగితే బుమ్రా ఎక్కువ కాలం క్రికెట్ ఆడే అవకాశం ఉండదు. వర్క్ లోడ్ ఎక్కువై గాయాల బారిన పడి, బుమ్రా కెరీర్ అర్దంతరంగా ముగిసే ప్రమాదం ఉంది. ఇది దృష్టిలో పెట్టుకొనే భారత మేనేజ్మెంట్ బుమ్రాను పరిమితంగా వినియోగించుకుంటుంది. ఇంగ్లండ్ టూర్లో కేవలం మూడు మ్యాచ్‌లే ఆడించాలని నిర్ణయించుకుంది.బుమ్రా గురించి ఆలోచిస్తే ఇది ఓకే. మరి టీమిండియా ప్రదర్శన మాటేంటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. గత కొంతకాలంగా టెస్ట్‌ల్లో బుమ్రా లేకపోతే టీమిండియా సున్నా అన్న విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇది తెలిసి కూడా బీసీసీఐ బుమ్రాకు ప్రత్యామ్నాయాన్ని తయారు చేసుకోలేకపోతుంది. బుమ్రా ఒక్కడు ఎంత వరకు చేయగలడని మాజీలు చాలాకాలంగా ప్రశ్నిస్తూనే ఉన్నారు. బుమ్రా రాణించకపోతే టీమిండియా పరిస్థితి ఏంటన్నది తాజాగా ముగిసిన లీడ్స్ టెస్ట్ సూచిస్తుంది. ఆ మ్యాచ్‌లో బుమ్రా తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసినా, రెండో ఇన్నింగ్స్‌లో ప్రభావం చూపలేకపోవడంతో టీమిండియా ఓటమిపాలైంది. ఇకనైనా భారత్ బుమ్రాపై అతిగా ఆధారపడకుండా, ప్రత్యామ్నాయాలను చూసుకోవాలి. -
ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్.. టీమిండియాకు షాకింగ్ న్యూస్..!
ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న టీమిండియా జులై 2 నుంచి బర్మింగ్హమ్ వేదికగా రెండో టెస్ట్ ఆడుతుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలినట్లు తెలుస్తుంది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్ నుంచి వైదొలిగాడని వార్తలు వినిపిస్తున్నాయి. వర్క్ లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా జట్టు యాజమాన్యమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.బుమ్రా తాజాగా ముగిసిన లీడ్స్ టెస్ట్‌లో 44 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఇది అతనిపై అదనపు భారం పడేలా చేసిందని మేనేజ్మెంట్ భావిస్తుంది. దీంతో అతనికి రెండో టెస్ట్‌లో విశ్రాంతినిచ్చి, తిరిగి మూడో టెస్ట్‌లో బరిలోకి దించే అవకాశం ఉంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందే బుమ్రా అన్ని మ్యాచ్‌లు ఆడడని బీసీసీఐ పరోక్షంగా చెప్పింది. వర్క్ లోడ్ కారణంగా స్టార్ పేసర్ కేవలం మూడు మ్యాచ్‌లే ఆడతాడని బోర్డులోని కీలక సభ్యులంతా చెప్పారు.తొలి టెస్ట్‌కు, రెండో టెస్ట్‌కు మధ్య 8 రోజుల గ్యాప్ ఉండటంతో బుమ్రా రెండో టెస్ట్‌లో ఆడతాడని అంతా అనుకున్నారు. ఒకవేళ విశ్రాంతినిచ్చినా, చివరి మూడు టెస్ట్‌ల్లో ఉంటుందని అంచనా వేశారు. అయితే తొలి టెస్ట్‌లో పడిన అదనపు భారం కారణంగా బుమ్రా విషయంలో ప్రణాళికలు మారాయని తెలుస్తుంది. బుమ్రా విషయంలో బీసీసీఐ ఎలాంటి సాహసాలు చేసేందుకు సిద్దంగా ఉండదు. జులై 10 నుంచి లార్డ్స్‌లో జరిగే మూడో టెస్ట్‌కు బుమ్రా సిద్దంగా ఉండే అవకాశం ఉంది. 16 రోజుల గ్యాప్‌లో బుమ్రా పూర్తి సన్నద్దత సాధించవచ్చు.రెండో టెస్ట్‌లో బుమ్రా ఆడకపోతే సిరాజ్ భారత పేస్ విభాగానికి నాయకత్వం వహిస్తాడు. ఇప్పటికే తొలి టెస్ట్ కోల్పోయి సిరీస్‌లో వెనుకపడిన టీమిండియాకు ఇది అంత శుభపరిణాయం కాదు. తొలి టెస్ట్‌లో బుమ్రా మినహా పేసర్లంతా తేలిపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన బుమ్రా కూడా రెండో ఇన్నింగ్స్‌లో ప్రభావం చూపించలేకపోయాడు. రెండో టెస్ట్‌లో బుమ్రా ఆడినా, ఆడకపోయిన భారత బౌలింగ్ విభాగంలో భారీ మార్పులకు ఆస్కారం ఉంది.ఒకవేళ బుమ్రా ఆడకపోతే ఆకాశ్‌దీప్, అర్షదీప్ సింగ్‌లలో ఎవరో ఒకరికి అవకాశం దక్కుతుంది. బుమ్రా ఆడకుండా, తొలి టెస్ట్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ప్రసిద్ద్ కృష్ణపై కూడా వేటు పడితే ఆకాశ్‌దీప్, అర్షదీప్ సింగ్ ఇద్దరికీ తుది జట్టులో చోటు దక్కుతుంది. తొలి టెస్ట్‌లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయిన శార్దూల్ ఠాకూర్‌పై కూడా వేటు పడే అవకాశం ఉంది. అతని స్థానంలో రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. బ్యాటింగ్ విభాగంలో భారత్ ఎలాంటి సాహసాలు చేయకపోవచ్చు.పూర్తి లైనప్‌ను యధాతథంగా కొనసాగించే అవకాశం ఉంది. తొలి టెస్ట్‌లో సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ విఫలమైన వారికి మరో ఛాన్స్ తప్పక ఉంటుంది. టీమిండియా విషయాన్ని పక్కన పెడితే ఇంగ్లండ్ రెండో టెస్ట్ కోసం జట్టును ప్రకటించింది. ప్రమాదకర పేసర్ జోఫ్రా ఆర్చర్ నాలుగేళ్ల తర్వాత టెస్ట్ ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. -
ఒకటికి రెండు సార్లు ఆలోచించండి.. లేదంటే గెలవడం కష్టమే: రవిశాస్త్రి
ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను భారత జట్టు ఓటమితో ఆరంభించింది. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో 5 వికెట్ల తేడాతో టీమిండియా పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ తొలి నాలుగు రోజులు ఆతిథ్య జట్టుపై అధిపత్యం చెలాయించిన టీమిండియా.. కీలకమైన ఆఖరి రోజు మాత్రం తేలిపోయింది.371 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత బౌలర్లు డిఫెండ్ చేసుకుపోలేకపోయారు. శార్ధూల్ ఠాకూర్, ప్రసిద్ద్ కృష్ణ తలా రెండు వికెట్లు సాధించగా.. రవీంద్ర జడేజా ఒక్క వికెట్ సాధించాడు. మిగితా బౌలర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు.అయితే సెకెండ్ ఇన్నింగ్స్‌లో బుమ్రా ఒక్క వికెట్ తీయకపోయినప్పటికి.. తొలి ఇన్నింగ్స్‌లో మాత్రం బుమ్రా ఒంటరి పోరాటం చేశాడు. ఐదు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.బుమ్రాకు విశ్రాంతి..!కాగా బుమ్రా వర్క్ లోడ్‌ను దృష్టిలో పెట్టుకుని రెండో టెస్టుకు అతడికి విశ్రాంతి ఇవ్వాలని టీమ్ మెనెజ్‌మెంట్ భావిస్తోంది. ఈ సిరీస్‌లో బుమ్రా కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడుతాడని టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గంభీర్ అండ్ కోకు భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి(Ravi Shastri) కీలక సూచనలు చేశాడు. "సెకెండ్ టెస్టుకు బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలనుకుంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి.ఎందుకంటే బుమ్రా లేకపోతే ఆ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయే అవకాశం ఉంది. అప్పుడు 2-0 తేడాతో వెనకబడితే సిరీస్ విజయం సాధించడం కష్టతరమవుతుంది.లీడ్స్ టెస్టులో ఓటమిని భారత జట్టు జీర్ణించుకోలేదు. గెలిచేందుకు అవకాశమున్న మ్యాచ్‌లో వారు ఓడిపోయారు. ఫీల్డింగ్‌లో చేసిన తప్పిదాలతో ఇంగ్లండ్‌కు గెలిచే అవకాశం కల్పించారు. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలి.అదేవిధంగా టెయిలాండర్ల నుంచి భారత్‌కు బ్యాటింగ్ సపోర్ట్ కావాలి" అని స్కై స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శాస్త్రి పేర్కొన్నాడు. ఇక ఇంగ్లండ్- భారత్ మధ్య రెండో టెస్టు వచ్చే బుధవారం నుంచి ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరగనుంది.చదవండి: ఏ ఒక్కరినో తప్పుబట్టను.. కెప్టెన్ నిర్ణయం ప్రకారమే అలా చేశాం: గంభీర్ -
‘పదేళ్లుగా అదే మాట వింటున్నా’
లీడ్స్: భారత స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్లో దాదాపు పదేళ్లుగా ఉన్నాడు. ఐపీఎల్లో పుష్కర కాలం పూర్తి చేసుకున్నాడు. అయితే కెరీర్ ఆరంభం నుంచి అతని భిన్నమైన బౌలింగ్ శైలిపై ఎన్నో చర్చలు సాగాయి. ఈ తరహా యాక్షన్‌తో ఎక్కువ కాలం కొనసాగలేడని, సుదీర్ఘ కెరీర్ సాగడం కష్టమని చాలా మంది అభిప్రాయపడ్డారు. పైగా గాయాలతో ఆటకు దూరం కాగానే ఇంతటితో కెరీర్ ముగిసినట్లే అనే విమర్శలు వినిపించాయి. కానీ బుమ్రా వాటన్నింటినీ పట్టించుకోలేదు. అద్భుత ప్రదర్శనలతో భారత్‌కు చిరస్మరణీయ విజయాలు అందించి ప్రపంచ అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా ఎదిగాడు. బరిలోకి దిగిన ప్రతీసారి కొత్త రికార్డులు తన ఖాతాలో వేసుకుంటున్నాడు. తాజాగా ఇంగ్లండ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన తర్వాత అతను ఈ విషయాలపై స్పందించాడు. ‘నేను ఎప్పుడైనా భారత్‌కు ఆడాలని బలంగా కోరుకున్నా. నాపై నాకున్న నమ్మకం వల్లే అన్ని ఫార్మాట్లలో ఆడగలిగా. కానే వేరేవాళ్లు ఎవరూ దానిని నమ్మలేదు. నువ్వు అసలు ఎప్పుడూ ఆడలేవు అని మొదట్లో అనేవారు. ఆ తర్వాత ఆరు నెలలు, ఆపై ఎనిమిది నెలలు ఆడితే గొప్ప అనేవారు. కానీ ఇప్పుడు భారత్ తరఫున దాదాపు పదేళ్లు ఆడితే ఐపీఎల్లో మరో మూడేళ్లు అదనంగా ఆడాను. ఇప్పుడు కూడా ఒక గాయం కాగానే నా పనైపోయిందని వెంటనే అనేస్తారు. ప్రతీ మూడు–నాలుగు నెలలకు ఇవే మాటలు వస్తాయి. నేను ఇవేమీ పట్టించుకోను. నా పని నేను చేస్తూ పోతా. భారత జట్టును గెలిపించేందుకు ప్రయత్నిస్తా. ఆపై దేవుడు నాకు ఏది రాసిపెట్టి ఉంటే అది జరుగుతుంది’ అని బుమ్రా వ్యాఖ్యానించాడు. బుమ్రా ఫిట్నెస్, పనిభారాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంగ్లండ్‌తో సిరీస్‌లో అతను మూడు టెస్టులే ఆడతాడని కోచ్ గంభీర్ ప్రకటించాడు. అయితే ఇదే విషయంపై బుమ్రా కాస్త భిన్నంగా స్పందించాడు. తాను మూడు టెస్టులే ఆడతానా లేదా అనేదానిపై అతను స్పష్టతనివ్వలేదు. ‘మున్ముందు ఏం జరగవచ్చనే విషయంపై ఆలోచించడం అనవసరం. ప్రస్తుతం మైదానంలో ఏం జరుగుతోంది అనే దానిపైనే నా దృష్టి ఉంది. నేను పూర్తి చేయాల్సి పని ఉంది. పిచ్ ఎలా స్పందిస్తోంది, వికెట్ ఎలా తీయాలి, ఏ బ్యాటర్‌కు ఎలా బౌలింగ్ చేయాలి అనే అంశాలపైనే నేను ఆలోచిస్తున్నాను. అంతే తప్ప ఎన్ని టెస్టులు ఆడతానని కాదు. ఒక్కసారి మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ లెక్కలన్నీ చూసుకోవచ్చు. రాత్రయ్యాక ఈ రోజు నేను నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చానని భావిస్తే ప్రశాంతంగా పడుకుంటా’ అని బుమ్రా వివరించాడు. -
బుమ్రాను అందుకు నువ్వే ఒప్పించాలమ్మా!.. పుజారా రిక్వెస్ట్
ఇంగ్లండ్ పర్యటనను టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఘనంగా ఆరంభించాడు. ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు కూల్చి.. భారత్‌కు స్వల్ప ఆధిక్యం అందించాడు. బౌలింగ్ దళ భారాన్ని మొత్తం తానే మోస్తూ.. మరోసారి తన విలువను చాటుకున్నాడు.ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు జాక్ క్రాలే (4), బెన్ డకెట్ (4).. అదే విధంగా మరో ప్రధాన బ్యాటర్ జో రూట్ (28) రూపంలో మూడు కీలక వికెట్లు కూల్చిన బుమ్రా.. క్రిస్ వోక్స్ (38), బ్రైడన్ కార్స్ (22) వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.ఇదిలా ఉంటే.. టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా భారత్ ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడనుంది. అయితే, పనిభారాన్ని తగ్గించుకునే క్రమంలో బుమ్రా అన్ని మ్యాచ్‌లు ఆడకపోవచ్చు. జట్టు ప్రకటన సందర్భంగా టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు.అందుకే కెప్టెన్సీకి కూడా దూరం అంతేకాదు.. తాను కూడా అన్ని టెస్టులు ఆడలేను కాబట్టే కెప్టెన్సీ వద్దని చెప్పానని బుమ్రా కూడా ఇటీవల పేర్కొన్నాడు. ఇక ఇంగ్లండ్‌తో ఆదివారం నాటి మూడో రోజు ఆట ముగిసిన తర్వాత కూడా భవిష్యత్ దృష్ట్యా తాను పనిభారాన్ని మేనేజ్ చేసుకునే విషయంలో ‘స్మార్ట్’గా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్, వెటరన్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల్లోనూ బుమ్రా ఆడాలని కోరుకున్న ఈ ఇద్దరు క్రికెటర్లు.. ఇందుకు అతడిని ఒప్పించాలంటూ స్పోర్ట్స్ ప్రజెంటర్‌ను కోరారు. ఆమె మరెవరో కాదు బుమ్రా సతీమణి సంజనా గణేషన్.సంజనా.. నాదో రిక్వెస్ట్..భారత్- ఇంగ్లండ్ టెస్టుల బ్రాడ్‌కాస్టర్ సోనీ నెట్వర్క్ షోలో భాగంగా.. ‘‘సంజనా.. నాదో రిక్వెస్ట్.. అన్ని మ్యాచ్‌లు ఆడేలా జస్ప్రీత్ను నువ్వు మాత్రమే ఒప్పించగలవు. ఒక్కసారి ప్రయత్నించి చూడు. నీకు మాత్రమే అది సాధ్యం’’ అని పుజారా సంజనాతో అన్నాడు.ఇంతలో గావస్కర్ కలుగజేసుకుంటూ.. ‘‘మ్యాచ్‌కి మ్యాచ్‌కి మధ్య కావాల్సినంత విరామం దొరుకుతుంది. దాదాపు ఎనిమిది రోజులు విశ్రాంతి లభిస్తుంది. తదుపరి మ్యాచ్‌కు వారానికి పైగా సమయం ఉంది. ఆ తర్వాత లార్డ్స్ టెస్టుకు.. ఆపై మాంచెస్టర్ టెస్టుకు కూడా ఇదే తరహాలో విరామం లభిస్తుంది.జట్టుకు బుమ్రా అవసరం ఉందిమాంచెస్టర్లో ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగష్టు, సెప్టెంబరు, అక్టోబర్ లేదంటే నవంబరు.. ఎప్పుడైనా బంతి బాగా స్వింగ్ అవుతుంది. ది ఓవల్‌లో ఐదు రోజులు మ్యాచ్ జరిగే అవకాశం ఉంటుంది.జట్టుకు జస్ప్రీత్ అవసరం ఎంతగానో ఉంది. అతడు ఐదు టెస్టులు ఆడాలని మేము కోరుకుంటున్నాము. దయచేసి నువ్వు అన్ని మ్యాచ్‌లు ఆడు బుమ్రా’’ అని సంజనా సమక్షంలో విజ్ఞప్తి చేశాడు. కాగా లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 465 పరుగులకు ఆలౌట్ అయింది.ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్.. నాలుగో రోజు ఆటలో భాగంగా 34 ఓవర్ల ఆట ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో శతకాలు బాదిన ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4), కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (8) ఈసారి విఫలమయ్యారు. వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ 30 పరుగులు చేయగా.. ఓపెనర్ కేఎల్ రాహుల్ 52, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ షెడ్యూల్తొలి టెస్టు: జూన్ 20-24, లీడ్స్రెండో టెస్టు: జూలై 2-6, బర్మింగ్హామ్మూడో టెస్టు: జూలై 10- 14, లార్డ్స్, లండన్నాలుగో టెస్టు: జూలై 23-27, మాంచెస్టర్ఐదో టెస్టు: జూలై 31- ఆగష్టు 4, కెన్నింగ్టన్ ఓవల్, లండన్.చదవండి: పృథ్వీ షా సంచలన నిర్ణయం.. ఇక గుడ్ బై? The People vs. Bumrah's workload management 👨⚖️This bench rules: Bumrah MUST play all 5 Tests ✅ 😅#SonySportsNetwork #GroundTumharaJeetHamari #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia | @cheteshwar1 @SanjanaGanesan @Jaspritbumrah93 pic.twitter.com/22f2LichMZ— Sony Sports Network (@SonySportsNetwk) June 23, 2025 -
అడ్డుగోడలా..: జైస్వాల్, జడ్డూలపై సచిన్ ఫైర్!.. పోస్ట్ వైరల్
ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) అదరగొడుతున్నాడు. లీడ్స్ వేదికగా ఆతిథ్య జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఈ పేస్ గుర్రం ఐదు వికెట్లతో చెలరేగాడు. తద్వారా స్టోక్స్ బృందాన్ని 465 పరుగులకు కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మరోసారి బౌలింగ్ విభాగం భారమంతా తన భుజాలపైనే వేసుకుని ముందుకు నడిపించాడు.అయితే, మిగతా బౌలర్ల నుంచి బుమ్రాకు అంతగా సహకారం లభించలేదు. మరోవైపు.. ఫీల్డర్ల తప్పిదాల కారణంగా బుమ్రా బౌలింగ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు ఇచ్చిన దాదాపు ఐదు క్యాచ్‌లు నేలపాలయ్యాయి. శనివారం నాటి రెండో రోజు ఆటలో మూడు.. ఆదివారం నాటి మూడో రోజు ఆటలో రెండు క్యాచ్‌లను భారత ఫీల్డర్లు జారవిడిచారు.క్యాచ్‌లు నేలపాలు చేసిన జైసూ, జడ్డూముఖ్యంగా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) బుమ్రా బౌలింగ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ (62), వన్‌డౌన్ బ్యాటర్, శతక వీరుడు ఓలీ పోప్ (106), మరో కీలక బ్యాటర్ హ్యారీ బ్రూక్ (99) ఇచ్చిన క్యాచ్‌లను నేలపాలు చేశాడు. మరోవైపు.. రవీంద్ర జడేజా (Ravindra Jadeja) కూడా బుమ్రా బౌలింగ్‌లో డకెట్ క్యాచ్‌ను జారవిడిచాడు. ఇదిలా ఉంటే.. బ్రూక్‌ను బుమ్రా డకౌట్ చేశాడని భావించగా.. అది నో బాల్‌గా తేలడం.. ఆ తర్వాత బ్రూక్ శతకానికి సమీపించడం జరిగాయి. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ జస్ప్రీత్ బుమ్రాను ప్రశంసిస్తూనే.. భారత ఫీల్డర్ల వైఫల్యాన్ని విమర్శిస్తూ ట్వీట్ చేశాడు. జైస్వాల్, జడ్డూలపై సచిన్ ఫైర్!‘‘బుమ్రాకు శుభాకాంక్షలు!.. ఒక నో బాల్.. మూడు జారవిడిచిన క్యాచ్‌లు నీకూ.. తొమ్మిది వికెట్లకు మధ్య అడ్డుగోడలా నిలిచాయి’’ అని పేర్కొన్నాడు.జైసూ, జడ్డూ ఫీల్డింగ్ తప్పిదాలతో, బ్రుక్కు వేసిన బంతి నో బాల్‌గా తేలనట్లయితే బుమ్రా ఖాతాలో మరో నాలుగు వికెట్లు చేరేవని.. తద్వారా అతడు తొమ్మిది వికెట్లు తీసేవాడని సచిన్ టెండుల్కర్ పరోక్షంగా వ్యాఖ్యానించాడు. ఎవరి వికెట్లు తీశాడంటే?కాగా ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో బుమ్రా 24.4 ఓవర్ల బౌలింగ్‌లో 83 పరుగులు (3.40 ఎకానమీ) ఇచ్చి ఐదు వికెట్లు కూల్చాడు. ఇందులో నాలుగు నో బాల్స్ ఉన్నాయి. ఇక ఇంగ్లండ్ బ్యాటర్లలో బుమ్రా.. జాక్ క్రాలే (4), బెన్ డకెట్ (62), జో రూట్ (28), క్రిస్ వోక్స్(38), జోష్ టంగ్ (11) వికెట్లు పడగొట్టాడు. ఇందులో డకెట్‌తో పాటు.. వోక్స్, టంగ్‌లను బుమ్రా బౌల్డ్ చేశాడు.ఇక భారత్- ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్‌ను గతంలో పటౌడీ ట్రోఫీ అని పిలిచేవారన్న విషయం తెలిసిందే. అయితే, తాజా సిరీస్ నుంచి దీనికి టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీగా నామకరణం చేసింది ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య ఐదు టెస్టులు జరుగనున్నాయి. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సైకిల్లో టీమిండియా- ఇంగ్లండ్‌కు ఇదే తొలి సిరీస్ కావడం గమనార్హం. ఇక ఈ సిరీస్‌తోనే భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ తన ప్రయాణం ఆరంభించాడు.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ తొలి టెస్టు (జూన్ 20-24)🏏వేదిక: హెడింగ్లీ, లీడ్స్🏏టాస్: ఇంగ్లండ్.. తొలుత బౌలింగ్🏏టీమిండియా తొలి ఇన్నింగ్స్: 471 ఆలౌట్ (జైస్వాల్ (101), గిల్ (147), రిషభ్ పంత్ (134) శతకాలు)🏏ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 465 ఆలౌట్ (ఓలీ పోప్ (106) శతకం)🏏ఆదివారం నాటి మూడో రోజు ఆట ముగిసేసరికి: టీమిండియా స్కోరు: 90/2 (23.5).. 96 పరుగుల ఆధిక్యం.చదవండి: అతడిపై నమ్మకం లేనపుడు.. ఎందుకు ఎంపిక చేశారు?: భారత మాజీ క్రికెటర్ Congratulations Bumrah!A no-ball and 3 missed chances stood between you and 𝙣𝙖𝙪 wickets. 🤪 pic.twitter.com/09rJNI9KP0— Sachin Tendulkar (@sachin_rt) June 22, 2025 -
అతడిపై నమ్మకం లేనపుడు.. తుదిజట్టులో ఎందుకు?: భారత మాజీ క్రికెటర్
టీమిండియా నాయకత్వ బృందం తీరుపై భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra)విమర్శలు గుప్పించాడు. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో శార్దూల్ ఠాకూర్ (Sahrdul Thakur) పట్ల యాజమాన్యం వ్యవహరించిన తీరు సరికాదన్నాడు. అతడి సేవలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోనపుడు తుది జట్టులోకి ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించాడు.మొదటి ఇన్నింగ్స్‌లో 471 పరుగులుకాగా టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీ (Tedulkar-Anderson Trophy)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య లీడ్స్ వేదికగా శుక్రవారం తొలి టెస్టు మొదలైంది. హెడింగ్లీ మైదానంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. మొదటి ఇన్నింగ్స్‌లో 471 పరుగులు చేసి ఆలౌట్ అయింది.భారత బ్యాటర్లలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101), కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (147), వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (134) శతకాలతో రాణించారు. ఈ క్రమంలో ఆతిథ్య ఇంగ్లండ్ సైతం భారత్‌కు దీటుగా బదులిచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో 465 పరుగులు సాధించింది.బుమ్రాకు ఐదు వికెట్లుఓపెనర్ బెన్ డకెట్ హాఫ్ సెంచరీ(62) చేయగా.. వన్‌డౌన్ బ్యాటర్ ఓలీ పోప్ (106) శతక్కొట్టాడు. మిగతా వాళ్లలో హ్యారీ బ్రూక్ (99) రాణించాడు. ఇక ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా 24.4 ఓవర్లు బౌల్ చేసి ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్ కృష్ణ 20 ఓవర్లు వేసి మూడు, మహ్మద్ సిరాజ్ 27 ఓవర్లు బౌల్ చేసి రెండు వికెట్లు దక్కించుకున్నారు.ఇక స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 23 ఓవర్లు బౌలింగ్ చేసినా వికెట్ తీయలేకపోయాడు. అయితే, ఈ ఇన్నింగ్స్‌లో సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కు మాత్రం కేవలం ఆరు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసే అవకాశం లభించింది. కేవలం ఆరు ఓవర్లలోనే అతడు 38 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మళీ శార్దూల్ చేతికి బంతిని ఇవ్వలేదు.నమ్మకం లేనపుడు జట్టులో ఎందుకు?ఈ విషయం గురించి మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. గిల్ తీరును ప్రశ్నించాడు. ‘‘శార్దూల్ ఠాకూర్ సేవలను పూర్తి స్థాయిలో ఎందుకు వినియోగించుకోలేదు. అతడిని తుదిజట్టుకు ఎంపిక చేశారు. కొన్ని ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం ఇచ్చారు.అయితే, అతడు ధారాళంగానే పరుగులు సమర్పించుకున్నాడు. అయినప్పటికీ అతడికి లాంగ్ స్పెల్స్ వేసే అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది. జట్టులోని ప్రతి బౌలర్ దాదాపు 20 ఓవర్లకు పైగానే బౌల్ చేశారు. కానీ శార్దూల్ మాత్రం సింగిల్ డిజిట్ వద్దే ఆగిపోయాడు.మొదటిసారి, రెండోసారి కొత్త బంతి పాతబడిన తర్వాత కూడా అతడికి ఛాన్స్ రాలేదు. నాయకత్వ బృందం అతడిపై నమ్మకం ఉంచలేదు. మరి అలాంటపుడు అతడిని ఎందుకు ఎంపిక చేసినట్లు?’’ అని ఆకాశ్ చోప్రా టీమిండియా యాజమాన్యం తీరును విమర్శించాడు.కాగా ఓవరల్‌గా 100.4 ఓవర్లు బౌలింగ్ చేసి.. మూడోరోజు ఆటలో భాగంగా 465 పరుగులకు ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేసింది. అనంతరం.. ఆరు పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన గిల్ సేన.. ఆదివారం నాటి ఆట పూర్తయ్యేసరికి 23.5 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది.ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు భారత తుదిజట్టుయశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.చదవండి: IND vs ENG: దిగ్గజ క్రికెటర్ కన్నుమూత.. నివాళులర్పించిన ఇంగ్లండ్-భారత్ ఆటగాళ్లు -
ఎప్పుడో నా కెరీర్ ముగిసిందన్నారు.. కానీ పదేళ్లు పూర్తి చేసుకున్నాను: బుమ్రా
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఫైవ్ వికెట్ల హాల్‌తో మెరిశాడు. రెండో రోజు ఆటలో మూడు వికెట్లు పడగొట్టిన బుమ్రా.. రెండో రోజు ఆటలో మరో రెండు వికెట్లను సాధించాడు.దీంతో విదేశీగడ్డపై టెస్టుల్లో అత్యధిక సార్లు ఫైవ్ వికెట్ హాల్ సాధించిన భారత బౌలర్‌గా కపిల్‌దేవ్ సరసన బుమ్రా(12) నిలిచాడు. అయితే మూడో రోజు ఆట అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన బుమ్రా.. తన ఫిట్‌నెస్‌పై విమర్శలు చేసే వారికి గట్టి కౌంటరిచ్చాడు. తన శరీరం సహకరించేంతవరకు భారత్ తరపున క్రికెట్ ఆడాలని అనుకుంటున్నానని అతడు తెలిపాడు.కాగా గత క్యాలెండర్ ఈయర్‌లో భారత్ తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన బౌలర్‌గా నిలిచిన బుమ్రా.. ఆస్ట్రేలియాతో జరిగిన 5వ టెస్ట్ సందర్భంగా వెన్ను గాయం బారిన పడ్డాడు. ఈ గాయం కారణంగా బుమ్రా దాదాపు నాలుగు నెలలు ఆటకు దూరమయ్యాడు. ఈ క్రమంలో కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీ-2025లోనూ జస్ప్రీత్ భాగం కాలేదు. ఐపీఎల్-2025తో తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ టూర్‌కు వచ్చినప్పటికి వర్క్‌లోడ్, ఫిట్నెస్ కారణంగా మొత్తం అన్ని మ్యాచ్‌లు ఆడుతాడన్న గ్యారెంటీ లేదు.రిపోర్టర్: గాయం బారిన ప్రతీసారీ మీపై వచ్చే విమర్శలకు బాధపడతారా?బమ్రా: "నా ఫిట్‌నెస్‌పై వచ్చే నెగిటివ్ కామెంట్లను పట్టించుకోను. అరంగేట్రం నుంచి నా ఫిట్‌నెస్‌పై ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. మొదటిలో కొంతమంది నేను ఎనిమిదినెలలు మాత్రమే ఆడగలనని అన్నారు. మరికొంతమంది 10 నెలల మాత్రమే అన్నారు. కానీ ఇప్పుడు నేను అంతర్జాతీయ క్రికెట్లో పదేళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకున్నాను. 12-13 సంవత్సరాలపాటు ఐపీఎల్ ఆడాను.ప్రతీ గాయం తర్వాత నా కెరీర్ ముగిసిపోయిందని, అతడు మరి తిరిగి రాడని కామెంట్స్ చేస్తుంటారు. వారి అలానే అనుకోనివ్వండి. నా పని నేను చేసుకుపోతాను. ప్రతి నాలుగు నెలలకు ఇలాంటి మాటలు వింటూనే ఉంటాము. నేను దాని గురించి ఎక్కువగా ఆలోచించను.దేవుడు రాసిపెట్టినంత కాలం భారత తరపున క్రికెట్ ఆడుతాను. అందుకు తగ్గట్టు నా శరీరాన్ని కూడా సిద్దం చేసుకుంటాను. నేను అలిసి పోయాను అనుకున్నప్పుడు క్రికెట్‌ను వదిలేస్తాను. భారత క్రికెట్ జట్టును మరింత ముందుకు తీసుకువెళ్లడమే నా లక్ష్యమంటూ" సమాధనమిచ్చాడు -
జస్ప్రీత్ బుమ్రా సరికొత్త చరిత్ర.. కపిల్ దేవ్ రికార్డు బ్రేక్
టెస్టు క్రికెట్లో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా తన హవాను కొనసాగిస్తున్నాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగాడు. రెండో రోజు ఆటలో మూడు వికెట్లు పడగొట్టిన జస్ప్రీత్.. మూడో రోజు ఆటలో మరో రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. బుమ్రాకు ఇది 14వ ఫైవ్ వికెట్ హాల్ వికెట్ కావడం గమనార్హం. ఈ క్రమంలో బుమ్ బుమ్రా పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.కపిల్ దేవ్ రికార్డు బ్రేక్..👉టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక సార్లు అత్యధిక సార్లు ఫైవ్ వికెట్ హాల్ సాధించిన భారత బౌలర్‌గా బుమ్రా రికార్డులకెక్కాడు. ఇంగ్లండ్‌లో టెస్టు మ్యాచ్ ఆడుతున్నప్పుడు బుమ్రా ఐదు వికెట్ల ఘనత సాధించడం ఇది మూడోసారి.2018లో ఇంగ్లండ్ పర్యటనలో తొలిసారి ఐదు వికెట్ల హాల్ సాధించిన బుమ్రా.. 2021లో మళ్లీ ఇంగ్లండ్ గడ్డపై రెండో సారి ఐదు వికెట్ల హాల్‌ను నమోదు చేశాడు. ఇప్పుడు తాజా పర్యటనలో ముచ్చటగా మూడో సారి ఈ ఫీట్ సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత దిగ్గజ క్రికెటర్లు లాలా అమర్ నాథ్, కపిల్ దేవ్, బి చంద్రశేఖర్, భువనేశ్వర్ కుమార్, వినూ మన్కడ్, చేతన్ శర్మ, ఇషాంత్ శర్మ, మహ్మద్ నిస్సార్ మరియు సురేంద్రనాథ్ల పేరిట ఉండేది.ఈ లెజెండరీ క్రికెటర్లు తమ కెరీర్లో రెండు సార్లు ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో ఫైవ్ వికెట్ హాల్ సాధించారు.లీడ్స్ టెస్ట్ కు ముందు బుమ్రా కూడా రెండు ఫైవ్ వికెట్ల హాల్‌తో ఈ జాబితాలో ఉండేవాడు. కానీ తాజా మ్యాచ్‌తో వీరిందని బుమ్రా అధిగమించాడు.👉అదేవిధంగా విదేశీ గడ్డపై అత్యధిక ఐదు వికెట్ల హాల్స్ సాధించిన భారత బౌలర్‌గా కపిల్ దేవ్ రికార్డును బుమ్రా సమం చేశాడు. ఈ ఇద్దరూ విదేశాల్లో చెరో 12 సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నారు.👉సెనా(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో 150 వికెట్లు తీసిన తొలి ఆసియా బౌలర్‌గా నిలిచాడు. విదేశాల్లో అత్యధిక ఫైవ్ వికెట్స్ హాల్ సాధించిన ప్లేయర్లు.. 👉జస్ప్రీత్ బుమ్రా - 12👉కపిల్ దేవ్ - 12👉అనిల్ కుంబ్లే - 10👉ఇషాంత్ శర్మ - 9👉ఆర్ అశ్విన్ - 8సేనా దేశాల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆసియా బౌలర్లు👉జస్ప్రీత్ బుమ్రా - 31 మ్యాచ్‌ల్లో 150 👉వసీం అక్రమ్ - 32 మ్యాచ్‌ల్లో 146👉అనిల్ కుంబ్లే - 35 మ్యాచ్‌ల్లో 141👉ఇషాంత్ శర్మ - 40 మ్యాచ్‌ల్లో 127👉జహీర్ ఖాన్ - 30 మ్యాచ్‌ల్లో 119నువ్వా నేనా..భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(47), శుబ్‌మన్ గిల్(6) ఉన్నారు.అంతకుముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 465 పరుగులకు ఆలౌటైంది.చదవండి: రోహిత్... ‘ప్రేమ కథా చిత్రం’𝘼 𝙢𝙖𝙨𝙩𝙚𝙧 𝙖𝙩 𝙬𝙤𝙧𝙠 🙌@Jaspritbumrah93 crafts magic with the ball once again, taking a stunning 5/83,his 14th Test 5-fer.WATCH HIS BRILLIANT PERFORMANCE 👉🏻 https://t.co/kg96V4NpFH#ENGvIND | 1st Test, Day 4 | MON, 23rd JUNE, 2:30 PM on JioHotstar pic.twitter.com/y1QUUMAVuC— Star Sports (@StarSportsIndia) June 22, 2025 -
అటా...ఇటా!
ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లతో అదరగొట్టినా... మిగిలిన వాళ్లు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో... ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు భారీ స్కోరుకు అతి చేరువగా వచ్చింది. బ్రూక్ బాదుడుకు లోయర్ ఆర్డర్ సహకారం తోడవడంతో కేవలం 6 పరుగుల వెనుకబడిన ఇంగ్లండ్ పోటీలోకి రాగా... రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ రాణించడంతో టీమిండియా మెరుగైన స్థితిలో నిలిచింది. ప్రస్తుతానికి ఇరు జట్లు సమంగానే ఉన్నా... నాలుగో రోజు భారత బ్యాటర్లు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారన్నది కీలకంగా మారింది. సొంతగడ్డపై దంచికొట్టే అలవాటు ఉన్న ఇంగ్లండ్ ముందు ఎంత లక్ష్యం నిర్దేశించినా సురక్షితం కాదనే విశ్లేషణల మధ్య... టీమిండియా సోమవారం పూర్తిగా బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది! లీడ్స్: భారత్, ఇంగ్లండ్ తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఆధిక్యం చేతులు మారుతూ సాగుతున్న పోరులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 23.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో యశస్వి జైస్వాల్ (4) త్వరగానే అవుటైనా... కేఎల్ రాహుల్ (75 బంతుల్లో 47 బ్యాటింగ్; 7 ఫోర్లు), సాయి సుదర్శన్ (48 బంతుల్లో 30; 4 ఫోర్లు) ఆకట్టుకున్నారు. చేతిలో 8 వికెట్లు ఉన్న టీమిండియా... ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 6 పరుగులు కలుపుకొని ఓవరాల్‌గా 96 పరుగుల ముందంజలో ఉంది.రాహుల్‌తో పాటు కెపె్టన్ శుబ్‌మన్ గిల్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 209/3తో ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్... చివరకు 100.4 ఓవర్లలో 465 పరుగులకు ఆలౌటైంది. ఒలీ పోప్ (137 బంతుల్లో 106; 14 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోగా... హ్యారీ బ్రూక్ (112 బంతుల్లో 99; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్క పరుగు తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు. మిగతా బ్యాటర్లు తలా కొన్ని పరుగులు చేయడంతో ఇంగ్లండ్ జట్టు... టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు 6 పరుగుల దూరంలో నిలిచింది. భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లతో అదరగొట్టగా... ప్రసిధ్ కృష్ణ 3, మొహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీశారు. జైస్వాల్ 4 పరుగులకే... తొలి ఇన్నింగ్స్‌లో చక్కటి సెంచరీ చేసిన జైస్వాల్... రెండో ఇన్నింగ్స్‌లో ఆకట్టుకోలేకపోయాడు. ఫీల్డింగ్‌లో మూడు క్యాచ్‌లు వదిలేయడంతో నెలకొన్న ఒత్తిడి అతడి ఆటతీరులో కనిపించింది. కార్స్ వేసిన నాలుగో ఓవర్లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి భారంగా పెవిలియన్‌కు వెనుదిరిగాడు. ఈ దశలో అరంగేట్ర ఆటగాడు సాయి సుదర్శన్‌తో కలిసి రాహుల్ క్లాస్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాటర్లు భారీ షాట్లతో రెచ్చిపోయిన పిచ్‌పై రాహుల్ సంయమనం పాటించాడు. రాహుల్‌తో కలిసి రెండో వికెట్‌కు 66 పరుగులు జోడించిన అనంతరం సుదర్శన్ వెనుదిరగగా... కెపె్టన్ గిల్‌తో కలిసి రాహుల్ మరో వికెట్ పడకుండా రోజును ముగించాడు. వర్షం కారణంగా ఆట నిర్ణిత సమయం కంటే ముందే ముగిసింది. ఇంగ్లండ్ బౌలర్లలో కార్స్, స్టోక్స్ చెరో వికెట్ పడగొట్టారు. బ్రూక్... పరుగు తేడాతో బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై మూడో రోజు ఇంగ్లండ్ సమష్టి ప్రదర్శనతో సత్తా చాటింది. ‘సెంచరీ హీరో’ ఓలీ పోప్ క్రితం రోజు స్కోరుకు మరో 6 పరుగులు మాత్రమే జత చేసి వెనుదిరగగా... కెపె్టన్ బెన్ స్టోక్స్ (52 బంతుల్లో 20; 3 ఫోర్లు)ను సిరాజ్ అవుట్ చేశాడు. ఇక ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎక్కువ సమయం పట్టుదు అనుకుంటే... లోయర్ ఆర్డర్‌తో కలిసి హ్యారీ బ్రూక్ చెలరేగిపోయాడు. ధనాధన్ షాట్లతో చకచకా పరుగులు రాబట్టాడు. వికెట్ కీపర్ జేమీ స్మిత్ (52 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్), క్రిస్ వోక్స్ (55 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు.తొలి సెషన్లో 28 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్ 2 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేయగా... రెండో సెషన్లో 23.4 ఓవర్లలోనే 138 పరుగులు చేసి మిగిలిన ఐదు వికెట్లు కోల్పోయింది. రెండో రోజు ఆటలో బుమ్రా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయినా... ఆ బంతి నోబాల్ కావడంతో బతికిపోయిన బ్రూక్‌కు... మూడో రోజు మరో రెండు అవకాశాలు లభించాయి. వాటిని వినియోగించుకున్న అతడు భారత్ ఆధిక్యాన్ని తగ్గించగలిగాడు. శతకానికి ఒక పరుగు దూరంలో ప్రసిధ్ కృష్ణ వేసిన షార్ట్ పిచ్ బంతికి బ్రూక్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కార్స్ (23 బంతుల్లో 22; 4 ఫోర్లు), వోక్స్, టంగ్ (18 బంతుల్లో 11; 2 ఫోర్లు) విలువైన పరుగులు చేసి టీమిండియా ఆధిక్యాన్ని 6 పరుగులకు పరిమితం చేశారు.అదే తంతు..ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డింగ్ మరీ పేలవంగా సాగింది. రెండో రోజు బుమ్రా బౌలింగ్‌లోనే మన ఫీల్డర్లు మూడు క్యాచ్‌లు జారవిడవగా... మూడో రోజు మరో రెండు క్యాచ్‌లు నేల పాలయ్యాయి. 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజా బౌలింగ్‌లో బ్రూక్ ఇచ్చిన క్యాచ్‌ను పంత్ అందుకోలేకపోగా... 82 పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్‌లో బ్రూక్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను జైస్వాల్ జారవిడిచాడు. ఒక ఎండ్‌లో బుమ్రా ఒత్తిడి పెంచుతున్నా... మరో ఎండ్ నుంచి అతడికి సరైన సహకారం దక్కలేదు.దీనిపై మాజీ ఆటగాళ్లు కూడా మండిపడగా... షార్ట్ బాల్స్‌తో వికెట్లు తీసిన ప్రసిధ్ కృష్ణ పరుగుల నియంత్రణలో పూర్తిగా విఫలమయ్యాడు. 20 ఓవర్లు వేసిన అతడు 128 పరుగులు సమరి్పంచుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ బ్యాటర్ల మీద ఒత్తిడి కొనసాగలేకపోయింది. దీనికి తోడు తొలి టెస్టులో కెపె్టన్సీ చేస్తున్న గిల్ కూడా కొన్ని తప్పుడు నిర్ణయాలతో ఇంగ్లండ్‌కు సాయపడ్డాడు.టెయిలెండర్లు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బుమ్రాను రంగంలోకి దింపి ఆధిక్యం పెంచుకోవాల్సింది పోయి... జడేజాకు బంతి అప్పగించి ఇంగ్లండ్ మరికొన్ని పరుగులు చేసే అవకాశం ఇచ్చాడు. ఎట్టకేలకు రెండో సెషన్ చివర్లో బంతి అందుకున్న బుమ్రా వరుస ఓవర్లలో వోక్స్, టంగ్‌ను క్లీన్ బౌల్డ్ చేసి ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్‌కు తెరదింపాడు. ఈ క్రమంలో అతడు టెస్టుల్లో 14వసారి 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసుకున్నాడు.స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 471; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (సి) నాయర్ (బి) బుమ్రా 4; డకెట్ (బి) బుమ్రా 62; పోప్ (సి) పంత్ (బి) ప్రసిధ్ 106; రూట్ (సి) నాయర్ (బి) బుమ్రా 28; బ్రూక్ (సి) శార్దుల్ (బి) ప్రసిధ్ 99; స్టోక్స్ (సి) పంత్ (బి) సిరాజ్ 20; జేమీ స్మిత్ (సి) సుదర్శన్ (బి) ప్రసిధ్ 40; వోక్స్ (బి) బుమ్రా 38; కార్స్ (బి) సిరాజ్ 22; టంగ్ (బి) బుమ్రా 11; బషీర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 34; మొత్తం (100.4 ఓవర్లలో ఆలౌట్) 465.వికెట్ల పతనం: 1–4, 2–126, 3–206, 4–225, 5–276, 6–349, 7–398, 8–453, 9–460, 10–465.బౌలింగ్: బుమ్రా 24.4–5–83–5; సిరాజ్ 27–0 –122–2; ప్రసిధ్ 20–0–128–3; జడేజా 23–4–68–0; శార్దుల్ 6–0–38–0. భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) స్మిత్ (బి) కార్స్ 4; రాహుల్ (బ్యాటింగ్) 47; సుదర్శన్ (సి) క్రాలీ (బి) స్టోక్స్ 30; గిల్ (బ్యాటింగ్) 6; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (23.5 ఓవర్లలో 2 వికెట్లకు) 90.వికెట్ల పతనం: 1–16, 2–82.బౌలింగ్: వోక్స్ 6–2– 18–0; కార్స్ 5–0–27–1; టంగ్ 5–0–15–0; బషీర్ 2.5–1– 11–0; స్టోక్స్ 5–1–18–1. -
భారత్‌తో టెస్టు: ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ఇలా.. !
లీడ్స్: భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 465 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆదివారం మూడో రోజు ఆటలో 100.4 ఓవర్లో ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో ఓలీ పోప్(106)సెంచరీతో మెరవగా, హారీ బ్రూక్(99) పరుగు దూరంలో సెంచరీ కోల్పోయాడు. ప్రసిద్ధ్ కిష్ణ వేసిన ఓవర్లో శార్దూల్ ఠాకూర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు బ్రూక్. పరుగు దూరంలో శతకం కోల్పోవడంతో నిరాశగా పెవిలియన్ చేరాడు బ్రూక్.అయితే అంతకుముందు ఓపెనర్ బెన్ డకెట్(62) హాఫ్ సెంచరీతో ఇంగ్లండ్‌కు మంచి ఆరంభాన్ని అందించాడు. పోప్‌తో కలిసి 122 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యాన్ని అందించాడు. ఆపై జోరూట్(28)తో కలిసి పోప్ మరో 80 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఇంగ్లండ్ పుంజుకుంది. అదే ఊపును కొనసాగించిన పోప్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది పోప్‌కు టెస్టుల్లో 9వ సెంచరీగా నిలిచింది.ఇదిలా ఉంచితే, జెమీ స్మిత్(40), క్రిస్ వోక్స్(38), బ్రైడన్ కార్స్(22)లు ఫర్వాలేదనిపించడంతో ఇంగ్లండ్ 450 పరుగుల మార్కును దాటింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఆరు పరుగుల వెనుకబడి ఉంది. బుమ్రాకు ఐదు వికెట్లుఈ మ్యాచ్‌లో భారత స్టార్ బౌలర్ బుమ్రా ఐదు వికెట్లు సాధించాడు. ఇంగ్లండ్ఓపెనర్లు క్రావ్లె, డకెట్,జో రూట్, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ వికెట్లను బుమ్రా తీశాడు. టెస్టుల్లో బుమ్రా ఐదు వికెట్ల మార్కును చేరడం ఇది 14వ సారి. ఇక బుమ్రాకు తోడుగా ప్రసిద్ధ్ మూడు వికెట్లు సాధించగా, మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లతో రాణించాడు. -
IND Vs ENG: చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. వసీం అక్రమ్ రికార్డు బద్దలు
ప్రపంచ క్రికెట్లో ప్రస్తుతం తనను మించిన బౌలర్ లేడని టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా మరోసారి నిరూపించుకున్నాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు రెండో రోజు ఆటలో బుమ్రా నిప్పలు చెరిగాడు. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ వంటి సహచర పేసర్లు తేలిపోయిన చోట.. బుమ్రా తన బౌలింగ్ స్కిల్‌తో ఆకట్టుకున్నాడు.పిచ్, పరిస్థితులతో సంబంధం లేకుండా అతడు ప్రతి బంతికి వికెట్ తీసేలా అత్యంత ప్రమాదకారిగా కనిపించాడు. భారత్ పడడొట్టిన మూడు వికెట్లు కూడా బుమ్రా తీసినవే కావడం గమనార్హం. జాక్ క్రాలీ, బెన్ డకెట్, జో రూట్ వంటి కీలక వికెట్లు పడగొట్టి భారత్‌ను గేమ్‌లో ఉంచాడు. ఈ క్రమంలో బుమ్రా ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.వసీం అక్రమ్ రికార్డు బ్రేక్..సేనా(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆసియా బౌలర్‌గా బుమ్రా చరిత్ర సృష్టించాడు. తొలి ఇన్నింగ్స్‌లో బెన్ డకెట్‌ను ఔట్ చేసిన అనంతరం ఈ రికార్డును బుమ్రా తన ఖాతాలో వేసుకున్నాడు. బుమ్రా ఇప్పటివరకు సేనా దేశాల్లో 148 వికెట్లు పడగొట్టాడు. ఈ రికార్డు గతంలో వసీం అక్రమ్(146) పేరిట ఉండేది. తాజా ఇన్నింగ్స్‌తో అక్రమ్ ఆల్‌టైమ్ రికార్డును బుమ్రా బ్రేక్ చేశాడు.సెనా దేశాల్లో బుమ్రా రికార్డుఆస్ట్రేలియా- 12 మ్యాచ్‌లు- 64 వికెట్లుఇంగ్లాండ్ 10 మ్యాచ్‌లు- 39 వికెట్లున్యూజిలాండ్- 2 మ్యాచ్‌లు- 6 వికెట్లుదక్షిణాఫ్రికా- 8 మ్యాచ్‌లు- 38 వికెట్లుసెనా దేశాల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లుజస్ప్రీత్ బుమ్రా 147వసీం అక్రమ్ 146అనిల్ కుంబ్లే 141ఇషాంత్ శర్మ 130 -
జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత.. ఫస్ట్ ఓవర్ కింగ్‌గా
టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్లో 2021 నుంచి తొలి ఓవర్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఓవర్లో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీని ఔట్ చేసిన బుమ్రా.. ఈ రేర్ ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.2021 నుంచి బుమ్రా ఇప్పటివరకు తొలి ఓవర్లో 8 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు సౌతాఫ్రికా స్పీడ్ స్టార్, ఆసీస్ ప్రీమియర్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ పేరిట సంయుక్తంగా ఉండేది. వీరిద్దరూ తొలి ఓవర్లో 7 వికెట్లు పడగొట్టారు. తాజా మ్యాచ్‌తో ఈ ఇద్దరి పేసర్లను బుమ్రా అధిగమించాడు.ఇంగ్లండ్ ఓపెనర్ మైండ్ బ్లాంక్..కాగా బుమ్రా తొలి ఓవర్లోనే క్రాలీని బోల్తా కొట్టించాడు. మొదటి ఓవర్లో ఐదో బంతిని బుమ్రా.. క్రాలీకి మిడిల్ స్టంప్‌పై అవుట్-స్వింగర్ వేశాడు. క్రాలీ ఆ బంతిని లెగ్‌సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి అవుట్‌సైడ్ ఎడ్జ్ తీసుకుని ఫస్ట్ స్లిప్‌లో కరుణ్ నాయర్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో 4 పరుగులు చేసిన ఇంగ్లండ్ ఓపెనర్ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు.ధీటుగా బదులిస్తున్న ఇంగ్లండ్..ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 471 పరుగులకు ఆలౌటైంది. 359/3 ఓవర్ నైట్‌స్కోర్‌తో రెండో రోజు ఆటను ఆరంభించిన టీమిండియా అదనంగా 112 పరుగులు జోడించి తమ ఇన్నింగ్స్‌ను ముగించింది. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్‌తో పాటు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (147, 227 బంతుల్లో 19 ఫోర్లు, 1 సిక్స్), యశస్వి జైస్వాల్ (101, 159 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో చెలరేగారు.ఇంగ్లండ్ బౌలర్లలో కెప్టెన్ బెన్‌స్టోక్స్, జోష్ టంగ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. బ్రైడాన్ కార్స్, షోయక్ బషీర్ చెరో వికెట్ సాధించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో29 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ నష్టానికి 126 పరుగులు చేసింది. రెండు వికెట్లు కూడా బుమ్రానే పడగొట్టాడు. -
IND Vs ENG: నేటి నుంచి భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ ప్రారంభం (ఫొటోలు)
-
కోహ్లి చెప్పింది నిజమే.. కానీ కుటుంబాన్నీ పోషించుకోవాలిగా!: బుమ్రా
టెస్టు క్రికెట్ గురించి టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి (Virat Kohli) చేసిన వ్యాఖ్యలపై భారత పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) స్పందించాడు. కోహ్లి మాటలతో తాను ఏకీభవిస్తానని.. అయితే, పరిస్థితులకు అనుగుణంగానే క్రికెటర్లు రెడ్ బాల్ క్రికెట్ నుంచి ఒక్కోసారి తప్పుకోవాల్సి వస్తుందని పేర్కొన్నాడు.కాగా టెస్టు క్రికెట్ (Test Cricket)లో బ్యాటర్‌గా, భారత జట్టు కెప్టెన్‌గా చిరస్మరణీయ విజయాలు సాధించిన విరాట్ కోహ్లి.. ఇటీవలే సంప్రదాయ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇక పద్దెనిమిదేళ్ల కలను నిజం చేసుకుంటూ.. ఐపీఎల్-2025 సీజన్లో కోహ్లి ట్రోఫీని ముద్దాడాడు. టెస్టు క్రికెట్‌తో పోలిస్తే ఐపీఎల్ ఐదు అంచెల కిందేక్యాష్ రిచ్ లీగ్ ఆరంభం నుంచి తాను ప్రాతినిథ్యం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు చాంపియన్‌గా నిలవడంతో ఈ రన్‌మెషీన్ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత కోహ్లి మాట్లాడుతూ.. తన జీవితంలోని గుర్తుంచుకోదగ్గ గొప్ప క్షణాల్లో ఇదొకటి అని తెలిపాడు. అయితే, తన దృష్టిలో టెస్టు క్రికెట్‌తో పోలిస్తే ఐపీఎల్ ఐదు అంచెల కిందే ఉంటుందని వ్యాఖ్యానించాడు. సంప్రదాయ ఫార్మాట్ అంటే తనకెంతో ఇష్టమని.. యువ, వర్ధమాన క్రికెటర్లు కూడా రెడ్ బాల్ క్రికెట్‌ను గౌరవించాలని సూచించాడు.టెస్టు క్రికెట్లో రాణిస్తే ప్రపంచంలో ఎక్కుడైనా ఏ ఫార్మాట్లోనైనా రాణించగలరనే ఆత్మవిశ్వాసం వస్తుందని కోహ్లి పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలపై తాజాగా బుమ్రా తనదైన శైలిలో స్పందించాడు.కోహ్లి చెప్పింది నిజమే‘‘కోహ్లి చెప్పినట్లు టెస్టు ఫార్మాట్లో ఆడటం ద్వారా ఆటగాడిగా గొప్ప గౌరవం లభిస్తుంది. నేను కూడా యువ క్రికెటర్లకు ఈ ఫార్మాట్‌ను గౌరవించమని, వీలైనంత ఎక్కువగా ఆడమనే చెప్తాను. అయితే, అందరి పరిస్థితి ఒకేలా ఉండదు. నేను కూడా చిన్నప్పటి నుంచి టెస్టు క్రికెట్‌పై ప్రేమను పెంచుకున్నాను.నా దృష్టిలో అదే అత్యుత్తమమైనది. సంప్రదాయ క్రికెట్లో ప్రదర్శన ఆధారంగానే నా స్థాయిని అంచనా వేసుకునేవాడిని. అయితే, ఇప్పటి ఆటగాళ్ల ఆలోచనా విధానం వేరుగా ఉంది. టీ20 క్రికెట్ వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి.డబ్బు సంపాదించాలి కదా!ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో టీ20 లీగ్‌లు జరుగుతున్నాయి. ఆటగాళ్ల మైండ్‌సెట్ పూర్తిగా మారిపోయింది. ఏదేమైనా ఫాస్ట్ బౌలర్లను ఈ విషయంలో మనం తప్పుబట్టలేము. టెస్టు క్రికెట్ ఆడేందుకు అందరి శరీరం సహకరించకపోవచ్చు.కెరీర్ కాపాడుకోవాలి. కుటుంబాన్ని పోషించుకోవాలంటే డబ్బు సంపాదించాలి. ఇలాంటి పరిస్థితుల్లో శరీరంపై అదనపు భారం వేసి కష్టపెట్టడం సరికాదు. అందుకే చాలా మంది ఫాస్ట్ బౌలర్లు ఈ ఫార్మాట్‌కు దూరంగా ఉంటారని అనుకుంటున్నా.టెస్టు క్రికెట్ ఆడాలనే కోరిక బలంగా ఉన్నా.. శరీరం సహకరించకపోతే వారు కూడా ఏమీ చేయలేరు కదా!’’ అని బుమ్రా చెప్పుకొచ్చాడు. కాగా వెన్నునొప్పి కారణంగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025తో పాటు ఐపీఎల్-2025లో ఆరంభ మ్యాచ్‌లకు దూరంగా ఉన్న బుమ్రా.. తర్వాత ముంబై ఇండియన్స్ తరఫున రీఎంట్రీ ఇచ్చాడు.ఇక ఇప్పుడు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా టీమిండియా తరఫున అతడు పునరాగమనం చేయబోతున్నాడు. ఇరుజట్ల మధ్య శుక్రవారం (జూన్ 20)నుంచి ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. చదవండి: ’కర్మ ఎవరినీ వదిలిపెట్టదు.. కచ్చితంగా అనుభవిస్తారు’ -
నేనే కెప్టెన్సీ వద్దన్నాను: బుమ్రా
లండన్: రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటన తర్వాత భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్‌ను ఎంపిక చేసినప్పుడు క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చ సాగింది. అనుభవజ్ఞుడు, జట్టు ప్రధాన బలమైన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను కాకుండా గిల్‌ను సారథిగా ఎంపిక చేయడంపై ఆశ్చర్యం వ్యక్తమైంది. దీనిపై ఇప్పుడు బుమ్రా స్పష్టత ఇచ్చాడు. తన గాయాలు, ఫిట్నెస్ సమస్యల కారణంగా కెప్టెన్సీవంటి అదనపు భారం మోయలేనని, నాయకుడిగా తన పేరును పరిశీలించవద్దని బీసీసీఐకి తానే చెప్పినట్లు అతను వెల్లడించాడు. ‘నన్ను కెప్టెన్‌గా ఎంపిక చేయడం వెనక ఎలాంటి ఆసక్తికర నేపథ్యం కానీ, నన్ను కావాలని తప్పించారనే వివాదం కానీ ఏమీ లేదు. రోహిత్, కోహ్లి రిటైర్మెంట్లకంటే ముందే ఇంగ్లండ్‌తో సిరీస్‌లో నా పని భారం ఎలా ఉండబోతోందో అనే విషయంపై బీసీసీఐ అధికారులతో పాటు నా వెన్ను నొప్పికి చికిత్స చేసిన వైద్యులతో కూడా మాట్లాడాను. జాగ్రత్త పాటిస్తేనే మంచిదని చెప్పారు. దాంతో నేను ఇంగ్లండ్‌లో అన్ని టెస్టులూ ఆడలేనని, సారథిగా నా పేరును పరిగణనలోకి తీసుకోవద్దని బోర్డుకు చెప్పాను. సిరీస్ మధ్యలో నేను తప్పుకొని మరొకరు కెప్టెన్సీ చేయడం సరైంది కాదు. కాబట్టి జట్టు ప్రయోజనాల కోణంలోనే నిర్ణయం తీసుకున్నా. భారత కెప్టెన్‌గా వ్యవహరించడం గొప్ప గౌరవం. కానీ కెప్టెన్గాకంటే ఒక ప్లేయర్‌గా నేను జట్టు కోసం ఉపయోగపడటం ముఖ్యమని భావించా’ అని బుమ్రా తెలిపాడు. -
డబ్ల్యూటీసీ 2023-25 అత్యుత్తమ జట్టు ఇదే.. ఛాంపియన్ జట్టు నుంచి ఒక్కరికే అవకాశం
9 జట్లతో రెండేళ్ల పాటు సాగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 సైకిల్ మే 14న ముగిసింది. ఈ సైకిల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఫైనల్స్‌కు చేరాయి. లార్డ్స్ వేదికగా జరిగిన టైటిల్ పోరులో సౌతాఫ్రికా డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు షాకిచ్చి విజేతగా అవతరించింది. తద్వారా సౌతాఫ్రికా 27 తర్వాత తొలి ఐసీసీ టైటిల్ సాధించింది. ఈ టైటిల్ సౌతాఫ్రికాకు తొలి ప్రపంచ టైటిల్. 1998లో ఆ జట్టు గ్రేమ్ స్మిత్ నేతృత్వంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గింది. తాజాగా ముగిసిన సైకిల్లో సౌతాఫ్రికా విజేతగా ఆవిర్భవించడంతో డబ్ల్యూటీసీ ప్రారంభమైన సీజన్ నుంచి వరుసగా మూడు సీజన్లలో మూడు కొత్త ఛాంపియన్ జట్లు అవతరించినట్లైంది.అరంగేట్రం ఎడిషన్ ఫైనల్లో (2019-21) న్యూజిలాండ్ భారత్‌ను ఓడించి విజేతగా నిలువగా.. రెండో ఎడిషన్ ఫైనల్లో (2021-23) ఆస్ట్రేలియా భారత్‌ను ఓడించి విజేతగా అవతరించింది. తాజాగా జరిగిన మూడో ఎడిషన్‌లో (2023-25) సౌతాఫ్రికా ఆసీస్‌ను చిత్తు చేసి టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను చేజిక్కించుకుంది. తొలి రెండు ఎడిషన్లలో ఫైనల్స్‌కు చేరిన భారత్ తాజాగా ముగిసిన సీజన్లో మూడో స్థానంతో సరిపెట్టుకుంది.వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 ముగిసిన నేపథ్యంలో ఈ ఎడిషన్ అత్యుత్తమ జట్టు ఇదే అంటూ సోషల్‌మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. గత ఎడిషన్‌లో అత్యుత్తమ ప్రదర్శలు చేసిన ఆటగాళ్లను ఈ జట్టుకు ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. డబ్ల్యూటీసీ టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్‌కు కెప్టెన్‌గా ఆసీస్ సారధి పాట్ కమిన్స్ ఎంపికయ్యాడు. ఈ జట్టులో టీమిండియా, ఆసీస్ నుంచి తలో ముగ్గురు, ఇంగ్లండ్ నుంచి ఇద్దరు, న్యూజిలాండ్, శ్రీలంక, సౌతాఫ్రికా నుంచి ఒక్కొక్కరు చోటు దక్కించుకున్నారు.ఈ జట్టు ఓపెనర్లుగా టీమిండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్, ఇంగ్లండ్ ఆటగాడు బెన్ డకెట్ ఎంపికయ్యారు. వన్‌డౌన్‌లో రూట్, నాలుగో స్థానంలో విలియమ్సన్, ఐదో ప్లేస్‌లో కమిందు మెండిస్ అవకాశాలు దక్కించుకున్నారు. వికెట్‌కీపర్‌గా అలెక్స్ క్యారీ, ఆల్‌రౌండర్ కోటాలో రవీంద్ర జడేజా, పేసర్లుగా కమిన్స్, రబాడ, బుమ్రా, స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా నాథన్ లయోన్ ఎంపికయ్యారు. ఛాంపియన్ జట్టు సౌతాఫ్రికా నుంచి ఈ జట్టుకు కేవలం ఒక్కరు మాత్రమే (రబాడ) ఎంపికయ్యారు. ఫాబ్ ఫోర్లో ముఖ్యుడైన విరాట్ కోహ్లి ఇటీవలే టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో అతనికి చోటు దక్కలేదు. ఆశ్చర్యకరంగా ఫాబ్ ఫోర్‌లోని మరో ఆటగాడు స్టీవ్ స్మిత్‌కు కూడా ఈ జట్టులో చోటు దక్కలేదు. ఈ జట్టులో చోటు దక్కని మరికొంత మంది అర్హులు కూడా ఉన్నారు. ఇంగ్లండ్‌కు చెందిన హ్యారీ బ్రూక్, ఆసీస్ స్పీడ్ గన్ మిచెల్ స్టార్క్, టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య కూడా ఈ జట్టులో చోటు దక్కించుకునేందుకు అర్హులే. డబ్ల్యూటీసీ 2023-25 టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్..యశస్వి జైస్వాల్, బెన్ డకెట్, జో రూట్, కేన్ విలియమ్సన్, కమిందు మెండిస్, అలెక్స్ క్యారీ (వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా, పాట్ కమిన్స్ (కెప్టెన్), కగిసో రబాడ, జస్ప్రీత్ బుమ్రా, నాథన్ లయోన్ -
ఇంగ్లండ్‌తో తొలి టెస్టు.. చరిత్రకు అడుగు దూరంలో బుమ్రా
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు భారత క్రికెట్ జట్టు అన్నివిధాల సన్నదమవుతోంది. ఇప్పటికే ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టిన టీమిండియా.. లార్డ్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. ఇంగ్లండ్ పర్యటనకు ముందు రోహిత్ శర్మ టెస్టులకు వీడ్కోలు పలకడంతో భారత జట్టు కొత్త టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ బాధ్యతలు చేపట్టాడు.అదేవిధంగా సాయిసుదర్శన్, అర్ష్‌దీప్ సింగ్‌లకు తొలిసారి భారత టెస్టు జట్టులో చోటు దక్కగా.. వెటరన్ కరుణ్ నాయర్ ఎనిమిదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ సిరీస్‌తో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్ ఆరంభం కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి 24 వరకు జరగనుంది. మొదటి టెస్టుకు ముందు టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాను పలు అరుదైన రికార్డు ఊరిస్తోంది.అరుదైన రికార్డుకు చేరువలో బుమ్రా..ఈ మ్యాచ్‌లో బుమ్రా రెండు వికెట్లు పడగొడితే సెనా(దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాలలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డులెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు పాకిస్తాన్ పేస్ బౌలింగ్ దిగ్గజం వసీం అక్రమ్ పేరిట ఉంది.సెనా దేశాల్లో అక్రమ్ 32 టెస్టులు ఆడి 146 వికెట్లు పడగొట్టగా.. బుమ్రా ఇప్పటివరకు 31 టెస్టులు ఆడి 145 వికెట్లు సాధించాడు. కాగా ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో బుమ్రా కేవలం మూడు మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు. వర్క్‌లోడ్ మెనెజ్‌మెంట్ కారణంగా మిగిలిన రెండు మ్యాచ్‌లకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ వెల్లడించాడు.ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు..శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్, యశస్వి జైస్వాల్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ షెడ్యూల్..జూన్ 20-24- తొలి టెస్ట్ (లీడ్స్)జులై 2-6- రెండో టెస్ట్ (బర్మింగ్హమ్)జులై 10-14- మూడో టెస్ట్ (లార్డ్స్)జులై 23-27- నాలుగో టెస్ట్ (మాంచెస్టర్)జులై 31-ఆగస్ట్ 4- ఐదో టెస్ట్ (కెన్నింగ్స్టన్ ఓవల్) -
బుమ్రా ఆడే మూడు టెస్టులేవి?
ముంబై: భారత స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా స్థానాన్ని భర్తీ చేయడం క్లిష్టమైనప్పటికీ బౌలింగ్ దళంలో నైపుణ్యమున్న బౌలర్లు అందుబాటులో ఉన్నారని టీమిండియా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఇంగ్లండ్ పర్యటనకు బయలుదేరేముందు కొత్త కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో కలిసి అతను మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మొత్తం ఐదు టెస్టుల్లో బుమ్రా ఆడబోయే మూడు టెస్టులు ఏవనే విషయాన్ని కోచ్ వెల్లడించలేదు. ‘ఐదు టెస్టుల్లో బుమ్రా ఏ ఏ టెస్టులు ఆడతాడనే నిర్ణయానికి ఇంకా రాలేదు. కాబట్టి ఆడే మూడు మ్యాచ్‌లు ఏవో ఇప్పుడే స్పష్టత ఇవ్వలేను. జట్టులో అతనొక అసాధారణ బౌలర్. అతని స్థానాన్ని భర్తీ చేయడం అంత సులభం కాదు. ఈ విషయాన్ని ఇంతకుముందే చాంపియన్స్ ట్రోఫీ సమయంలోనే చెప్పాను. అయితే ఈ సదవకాశాన్ని నైపుణ్యమున్న బౌలర్లు అందిపుచ్చుకోవాలి. ప్రస్తుతం జట్టులో ప్రతిభావంతులైన పేసర్లకు కొదవలేదు’ అని అన్నాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కోహ్లి టెస్టులకు గుడ్‌బై చెప్పడంతో కొత్తగా సారథ్యం చేపట్టిన శుబ్‌మన్ గిల్ కూడా బౌలింగ్ అటాక్‌కు వచ్చిన ఇబ్బందేమీ లేదన్నాడు. బుమ్రా పేస్ భారం తగ్గించే బౌలర్లు చాలా మంది ఉన్నారని చెప్పాడు. ఒకవేళ ఈ వెటరన్ బౌలర్ ఆడితే అది జట్టుకు మరింత బలమవుతుందని అన్నాడు. టెస్టు సిరీస్ మొదలయ్యాక ఏ మ్యాచ్‌లకు అతను అందుబాటులో ఉంటాడో తెలుసుకున్నాకే అతను ఆడే మూడు మ్యాచ్‌లపై నిర్ణయం తీసుకుంటామని గిల్ చెప్పాడు. శుక్రవారం తెల్లారేలోపే భారత జట్టు ఇంగ్లండ్‌కు బయలుదేరుతుంది. పూర్తిస్థాయి పర్యటనలో శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా ఐదు టెస్టుల ద్వైపాక్షిక సిరీస్‌లో పోటీపడుతుంది. ఈ నెల 20 నుంచి లీడ్స్‌లో ఇరు జట్ల మధ్య తొలి టెస్టుతో సిరీస్ మొదలవుతుంది. దీనికంటే ముందు భారత జట్టు... ‘ఎ’ జట్టుతో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. ఇంగ్లండ్‌లో ఉన్న భారత్ ‘ఎ’ జట్టు ఇంగ్లండ్ లయన్స్‌తో అనధికారిక టెస్టులు ఆడుతోంది.‘అండర్సన్–టెండూల్కర్’ ట్రోఫీభారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు నామకరణం న్యూఢిల్లీ: భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగే టెస్టు సిరీస్‌కు ‘అండర్సన్–టెండూల్కర్’ ట్రోఫీగా నామకరణం చేశారు. ఆటకు వన్నె తెచ్చిన ఆటగాళ్ల పేర్లను సిరీస్‌లకు పెట్టడం పరిపాటి కాగా... ఇకపై టీమిండియా, ఇంగ్లండ్ మధ్య జరిగే సిరీస్‌ను ఈ పేరుతోనే కొనసాగించాలని బీసీసీఐ, ఈసీబీ సమష్టిగా నిర్ణయించాయి. ఈ నెల 20 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా... దీంతోనే 2025–27 ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) చక్రం మొదలవుతుంది. తొలి టెస్టు ప్రారంభానికి ముందు ఈ ఇద్దరు దిగ్గజాలు ట్రోఫీని ఆవిష్కరించనున్నట్లు సమాచారం. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ టీమిండియా తరఫున 200 టెస్టు మ్యాచ్‌లు ఆడి 15,921 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు (704) తీసిన పేస్ బౌలర్ అండర్సన్ 188 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం భారత్, ఇంగ్లండ్ మధ్య ఇంగ్లండ్‌లో జరిగే సిరీస్‌ను పటౌడీ ట్రోఫీగా, భారత్‌లో జరిగే సిరీస్‌ను ఆంటోనీ డి మెల్లో ట్రోఫీగా అభివర్ణిస్తున్నారు. ఇక మీద ఇంటా బయట ఎక్కడ సిరీస్ జరిగినా దాన్ని ‘అండర్సన్–టెండూల్కర్’ ట్రోఫీగానే పిలవనున్నారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య సిరీస్‌లను ఇదే మాదిరిగా ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’గా అభివరి్ణస్తున్న విషయం తెలిసిందే. -
రిలాక్స్.. నా పని నాకు బాగా తెలుసు: కోచ్ మాట వినని బుమ్రా
ఐపీఎల్-2025 సీజన్ ఫైనల్‌కు చేరేందుకు ముంబై ఇండియన్స్ అడుగు దూరంలో నిలిచింది. శుక్రవారం జరిగిన ఎలిమినేటర్‌లో గుజరాత్ టైటాన్స్‌ను 20 పరుగుల తేడాతో ఓడించిన ముంబై.. క్వాలిఫయర్-2కు ఆర్హత సాధించింది. ఆదివారం జరగనున్న సెకెండ్ క్వాలిఫయర్‌లో పంజాబ్ కింగ్స్‌తో హార్దిక్ సేన అమీతుమీ తెల్చుకోనుంది. కాగా ఎలిమినేటర్‌లో ముంబై విజయం సాధించడంలో పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాది కీలక పాత్ర.తీవ్ర ఒత్తిడిలో కూడా బుమ్రా తన అద్భుత బౌలింగ్‌తో ముంబైను గెలుపు తీరాలకు చేర్చాడు. 229 భారీ లక్ష్య చేధనలో పవర్ ప్లేలోనే కెప్టెన్ శబ్‌మన్ గిల్, మెండిస్ వికెట్లను గుజరాత్ కోల్పోయినప్పటికి.. సాయిసుదర్శన్(80), వాషింగ్టన్ సుందర్(48) ముంబై బౌలర్లపై విరుచుపడ్డారు.వీరిద్దరూ దూకుడుగా ఆడుతూ గుజరాత్‌ను లక్ష్యానికి చేరువ చేశారు. సుందర్, సాయి విధ్వంసం ఫలితంగా టైటాన్స్ 13 ఓవర్లలో 150 పరుగుల మార్క్‌కు చేరువైంది. దీంతో ముంబై డౌగట్తో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. 14 ఓవర్ వేసేందుకు బుమ్రాను తిరిగి ఎటాక్‌లో తీసుకొచ్చాడు. కెప్టెన్ నమ్మకాన్ని బుమ్‌బుమ్ బుమ్రా వమ్ము చేయలేదు. ఆ ఓవర్లో వాషింగ్టన్ సుందర్‌ను బుమ్రా అద్బుతమైన యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు. సుందర్ ఔటైనప్పటికి, క్రీజులో ఇంకా ఇన్ఫామ్ బ్యాటర్ సుదర్శన్ ఉండడంతో ముంబై కోచింగ్ స్టాఫ్ తీవ్ర ఒత్తిడిలో కన్పించారు. బౌండరీ లైన్ వద్దకు హెడ్‌కోచ్ జయవర్ధనే, కీరన్ పొలార్డ్ వచ్చి ఫీల్డర్లకు, బౌలర్లకు పదేపదే తమ సూచనలను పంపారు.కోచ్ మాట వినని బుమ్రా..ఈ క్రమంలో జయవర్దనే బౌండరీ లైన్ దగ్గర బుమ్రాకు ఏదో చెబుతుండగా అతడు విన్పించుకోలేదు. "ప్రశాంతంగా ఉండండి, నా పని నాకు తెలుసు. నేను చూసుకుంటా అని బుమ్రా అన్నట్లు హిందీ కామెంటేటర్ జతిన్ సప్రు వ్యాఖ్యనించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది.చదవండి: ముంబై చేతిలో ఓటమి.. కన్నీరు పెట్టుకున్న గిల్ సోదరి! వీడియో వైరల్ -
కెప్టెన్‌గా బుమ్రా.. సుదర్శన్‌కు దక్కని చోటు!.. శార్దూల్‌కు ఛాన్స్!
భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్ ఎవరు?.. ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడే జట్టు ప్రకటన ఎప్పుడు?.. భారత క్రికెట్ వర్గాల్లో ఇప్పుడిదే చర్చనీయాంశం. మాజీ క్రికెటర్లలో దిగ్గజం సునిల్ గావస్కర్ సహా వసీం జాఫర్, క్రిష్ణమాచారి శ్రీకాంత్ తదితరులు జస్ప్రీత్ బుమ్రాకే పగ్గాలు అప్పగించాలని సూచిస్తున్నారు.మరోవైపు.. రవిశాస్త్రి వంటి మరికొంత మంది మాజీలు యువకుడైన శుబ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా నియమించాలని, పేస్ దళాన్ని ముందుకు నడిపిస్తున్న బుమ్రాపై అదనపు భారం వద్దని అభిప్రాయపడుతున్నారు.కాగా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత.. ఈ సిరీస్‌తో టీమిండియా టెస్టు చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. ఇద్దరు స్టార్ల నిష్క్రమణ తర్వాత తొలిసారి విదేశీ గడ్డపై రెడ్‌బాల్ క్రికెట్లో భారత జట్టు ఎలా రాణిస్తుందనే అంశంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.వసీం జాఫర్ ఎంచుకున్న జట్టు ఇదేఇక మే 24న బీసీసీఐ ఇంగ్లండ్ టూర్‌కు జట్టును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈలోపే భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ పదహారు మంది సభ్యులతో కూడిన తన జట్టును ప్రకటించాడు. ఈ జట్టుకు బుమ్రాను కెప్టెన్‌గా ఎంపిక చేసిన వసీం.. శుబ్‌మన్‌ను అతడికి డిప్యూటీగా నియమించాడు.సాయి సుదర్శన్, నితీశ్‌లకు మొండిచేయిఅయితే, మొదటి నుంచి రేసులో ఉన్న సాయి సుదర్శన్ పేరును మాత్రం వసీం జాఫర్ పరిగణనలోకి తీసుకోలేదు. ఐపీఎల్-2025లో అదరగొడుతున్న ఈ గుజరాత్ టైటాన్స్ బ్యాటర్‌ను కాదని.. టెస్టు స్పెషలిస్టు, ఇంగ్లండ్ లయన్స్‌తో తలపడే భారత్-ఎ జట్టు కెప్టెన్ అయిన అభిమన్యు ఈశ్వరన్‌కు పెద్దపీట వేశాడు.అంతేకాదు.. ఆస్ట్రేలియా పర్యటనలో సెంచరీతో ఆకట్టుకున్న ఆంధ్ర పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి కూడా వసీం జాఫర్ మొండిచేయి చూపాడు. అతడికి బదులు సీనియర్ శార్దూల్ ఠాకూర్‌వైపే మొగ్గుచూపాడు.శ్రేయస్ అయ్యర్ లేదంటే కరుణ్ నాయర్ఇక వికెట్ కీపర్ల కోటాలో రిషభ్ పంత్‌తో పాటు ధ్రువ్ జురెల్‌కు స్థానమిచ్చిన వసీం జాఫర్.. మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్ లేదంటే కరుణ్ నాయర్లకు ప్రాధాన్యం ఇస్తానని తెలిపాడు. ఇక స్పిన్ దళంలో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌తో పాటు.. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజాతో పాటు వాషింగ్టన్ సుందర్‌కు చోటిచ్చాడు ఈ మాజీ క్రికెటర్.అదే విధంగా.. ఫాస్ట్ బౌలర్ల బృందంలో బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీలకు చోటిచ్చిన వసీం జాఫర్.. నాలుగో ఆప్షన్‌గా అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, ఆకాశ్ దీప్‌లలో ఒకరిని ఎంచుకుంటానని తెలిపాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఇంగ్లండ్‌తో టెస్టులకు తన జట్టును ప్రకటించిన వసీం జాఫర్.. మరి మీ ఎంపిక ఏమిటంటూ క్రికెట్ ప్రేమికులను అడగ్గా.. మెజారిటీ మంది అతడి జట్టుతోనే ఏకీభవిస్తున్నారు. కాగా జూన్ 20 నుంచి ఇంగ్లండ్- టీమిండియా మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.ఇంగ్లండ్‌తో టెస్టులకు వసీం జాఫర్ ఎంచుకున్న భారత జట్టుయశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), శ్రేయస్ అయ్యర్/కరుణ్ నాయర్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), మహ్మద్ సిరాజ్, అభిమన్యు ఈశ్వరన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్/ప్రసిద్ కృష్ణ/ అకాశ్‌దీప్, వాషింగ్టన్ సుందర్.చదవండి: ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా ఆయుశ్, వైభవ్ సూర్యవంశీకి చోటు -
వాళ్లిద్దరి వల్లే నా పని సులువు.. అతడొక అద్భుతం: హార్దిక్ పాండ్యా
ఢిల్లీ క్యాపిటల్స్ (MI vs DC)తో కీలక పోరులో విజయం సాధించడం పట్ల ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) హర్షం వ్యక్తం చేశాడు. జట్టు ప్రదర్శన పట్ల తాను సంతృప్తిగా ఉన్నట్లు తెలిపాడు. కాగా గతేడాది హార్దిక్ సేన.. పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన విషయం తెలిసిందే.టాప్-4లో అడుగుఇక ఐపీఎల్-2025 (IPL 2025) ఆరంభంలోనూ వరుస ఓటములతో చతికిలపడ్డ ముంబై.. ఆ తర్వాత అనూహ్య రీతిలో పుంజుకుని డబుల్ హ్యాట్రిక్ విజయాలు సాధించింది. తద్వారా ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు దూసుకువచ్చిన హార్దిక్ సేన.. బుధవారం ఢిల్లీపై గెలిచి టాప్-4లో అడుగుపెట్టింది.సూర్య, నమన్ ఫటాఫట్సొంత మైదానం వాంఖడేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు సాధించింది. సూర్యకుమార్ యాదవ్ (43 బంతుల్లో 73 నాటౌట్), నమన్ ధీర్ (8 బంతుల్లో 24 నాటౌట్) వల్లే ఈ మేర స్కోరు సాధ్యమైంది.ఇక లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే ముంబై బౌలర్లు ఢిల్లీ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. పవర్ ప్లేలో వరుస విరామాల్లో వికెట్లు తీసి ఫాఫ్ బృందాన్ని కోలుకోనివ్వకుండా చేశారు. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(6)ను అవుట్ చేసి దీపక్ చహర్ శుభారంభం అందించగా.. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (11)ను బౌల్డ్ పెవిలియన్‌కు పంపాడు.సాంట్నర్, బుమ్రా అదరగొట్టారుఆ తర్వాత మిచెల్ సాంట్నర్, జస్ప్రీత్ బుమ్రా ఆకాశమే హద్దుగా చెలరేగి ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. క్రీజులో పాతుకుపోవాలని చూసిన సమీర్ రిజ్వీ (39), విప్రాజ్ నిగమ్ (20)ల రూపంలో కీలక వికెట్లు తీసిన సాంట్నర్.. మరో హిట్టర్ అశుతోష్ శర్మ (18) వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక బుమ్రా ట్రిస్టన్ స్టబ్స్ (2) రూపంలో ప్రమాదకర బ్యాటర్‌ను వెనక్కి పంపడంతో పాటు.. మాధవ్ తివారి (3), ముస్తాఫిజుర్ రహ్మమాన్ (0)లను బౌల్డ్ చేసి.. ముంబైని విజయతీరాలకు చేర్చాడు. ముంబై బౌలర్ల ధాటికి ఢిల్లీ క్యాపిటల్స్ 18.2 ఓవర్లలో 121 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ కాగా.. హార్దిక్ సేన 59 పరుగుల తేడాతో గెలిచింది. సీజన్లో ఎనిమిదో గెలుపు నమోదు చేసి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది.వాళ్లిద్దరి వల్లే నా పని సులువు.. అతడొక అద్భుతంఈ నేపథ్యంలో విజయానంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. ‘‘ఎలాంటి పరిస్థితుల్లోనైనా.. ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను సాంట్నర్, బుమ్రాలకు బంతిని ఇచ్చేందుకు వెనుకాడను. ఎందుకంటే వారిద్దరు మ్యాచ్‌ను ఆధీనంలోకి తెచ్చుకోవడంలో దిట్ట.అంతేకాదు.. ఏ పని చేసినా దాని అంతు చూసేదాకా వదిలిపెట్టరు. వాళ్లిద్దరి వల్లే నా పని సులువైంది. ఈ పిచ్‌పై 160 పరుగుల రావడమే ఎక్కువ అనుకున్నాం. అలాంటి స్థితిలో సూర్య, నమన్ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా.. నమన్.. వికెట్ కఠినంగా మారుతున్న వేళ కూడా అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు’’ అని సహచర ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించాడు. ఇక ఈ మ్యాచ్‌లో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. కేవలం మూడు పరుగులే చేశాడు. అదే విధంగా ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ వేయలేదు.చదవండి: MI Vs DC: ముందు చేతులు శుభ్రం చేసుకో బుమ్రా!.. నీతా అంబానీ చర్య వైరల్Dominant victory ✅Playoffs ✅A dream outing for #MI in their last match at Wankhede this season as they secure a 59-run win over #DC 💙👏Scorecard ▶ https://t.co/fHZXoEJVed#TATAIPL | #MIvDC | @mipaltan pic.twitter.com/mitYRgtqlZ— IndianPremierLeague (@IPL) May 21, 2025 -
MI Vs DC: ముందు చేతులు శుభ్రం చేసుకో బుమ్రా!.. నీతా అంబానీ చర్య వైరల్
గతేడాది చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న ముంబై ఇండియన్స్.. ఐపీఎల్-2025 (IPL 2025)లో మాత్రం అదరగొట్టింది. సీజన్ ఆరంభంలో తడబడ్డా.. ఆతర్వాత తిరిగి పుంజుకుని ఏకంగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. వాంఖడేలో ఢిల్లీ క్యాపిటల్స్ (MI vs DC)తో బుధవారం నాటి మ్యాచ్‌లో ఘన విజయం సాధించి.. టాప్-4కు అర్హత సాధించింది.కుమారుడితో కలిసి మ్యాచ్ వీక్షించిన నీతాఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ యజమానులు నీతా అంబానీ (Nita Ambani), ఆమె కుమారుడు ఆకాశ్ అంబానీ ఆనందంలో మునిగిపోయారు. వాంఖడేలో ప్రత్యక్ష్యంగా మ్యాచ్ వీక్షిస్తూ ఆద్యంతం తమ హావభావాలతో హైలైట్ అయ్యారు. ఆటగాళ్లతో కలిసి జట్టు విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు.ముందు చేతులు శుభ్రం చేసుకోఈ సందర్భంగా నీతా అంబానీ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆటగాళ్లతో కరచాలనం చేసే సమయంలో నీతా.. ముంబై ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఆవిడే స్వయంగా బుమ్రా చేతులపై సానిటైజర్ పోశారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కోవిడ్ కేసుల నేపథ్యంలోకాగా ఇటీవలి కాలంలో కోవిడ్-19 కేసులు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇక ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ట్రవిస్ హెడ్‌కు ఇటీవల కోవిడ్ పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా నీతా అంబానీ.. బుమ్రా చేతులను సానిటైజ్ చేయడం గమనార్హం.సెలైవాతో వైరస్ వ్యాప్తి చెందే అవకాశంకాగా ఈసారి ఐపీఎల్లో బౌలర్లు సెలైవా (ఉమ్మి)ను ఉపయోగించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అనుమతించిన విషయం తెలిసిందే. స్వింగ్ రాబట్టేందుకు పేసర్లు బంతిపై లాలాజలం ఉపయోగించే వీలు కల్పించింది. కరోనా కాలంలో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా.. విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇక బుమ్రా కూడా పేసర్ అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆరోగ్య స్పృహతో నీతా అంబానీ చేసిన పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.దంచికొట్టిన సూర్య, నమన్ఇక బుమ్రా ఒక్కడికే కాకుండా సూర్యకుమార్ యాదవ్, దీపక్ చహర్ తదితరులకు సానిటైజర్ అందించారు నీతా. అందరు ఆటగాళ్లను చేతులను శుభ్రం చేసుకోమని చెప్పారు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. సొంత మైదానంలో టాస్ ఓడిన ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో రోహిత్ శర్మ (5) విఫలం కాగా.. రియాన్ రెకెల్టన్ (25) ఫర్వాలేదనిపించాడు. విల్ జాక్స్ (13 బంతుల్లో 21) కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. తిలక్ వర్మ (27) కూడా చేతులెత్తేశాడు.ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ (43 బంతుల్లో 73 నాటౌట్), నమన్ ధిర్ (8 బంతుల్లో 24 నాటౌట్) ధనాధన్ ఇన్నింగ్స్‌తో దంచికొట్టి ముంబై శిబిరంలో ఉత్సాహం నింపారు. వీరిద్దరి కారణంగా ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.బౌలర్లు చెలరేగడంతోఇక లక్ష్య ఛేదనలో ఢిల్లీని 18.2 ఓవర్లలో 121 పరుగుల వద్ద ముంబై ఆలౌట్ చేసింది. జస్ప్రీత్ బుమ్రా, మిచెల్ సాంట్నర్ మూడేసి వికెట్లతో చెలరేగగా.. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చహర్, విల్ జాక్స్, కర్ణ్ శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇలా ముంబై బౌలర్లంతా సమిష్టిగా రాణించి జట్టు గెలుపులో భాగం పంచుకున్నారు. సూర్యకుమార్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. ఇక ఢిల్లీని 59 పరుగుల తేడాతో ఓడించిన ముంబై ప్లే ఆఫ్స్ చేరగా.. ఢిల్లీ టోర్నీ నుంచి నిష్క్రమించింది.చదవండి: Vaibhav Suryavanshi: ఫోన్ ఆన్ చేయగానే 500 మిస్స్డ్ కాల్స్ Seeing Nita Ambani, Rohit Sharma, Suryakumar and other players using sanitizer reminded me of covid-19.😂😭 pic.twitter.com/20ArDT2BXt— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) May 21, 2025 -
బాబర్ ఆజం వరల్డ్ ఎలెవన్: కోహ్లి, బుమ్రాలకు దక్కని చోటు
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ బాబర్ ఆజం (Babar Azam) టీ20 ఫార్మాట్లో తన అత్యుత్తమ జట్టును ప్రకటించాడు. తన వరల్డ్ ఎలెవన్‌లో తనతో పాటు టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli), ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)లకు మాత్రం బాబర్ చోటివ్వలేదు.టీమిండియా నుంచి ఆ ఇద్దరుఅయితే, భారత్ నుంచి మరో ఇద్దరు ఆటగాళ్లను మాత్రం బాబర్ ఆజం తన జట్టుకు ఎంపిక చేసుకున్నాడు. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో దుమ్మురేపిన రోహిత్ శర్మతో పాటు.. టీమిండియా టీ20 జట్టు ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌లకు చోటిచ్చాడు. కాగా ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్లో రోహిత్ శర్మ అత్యధిక పరుగుల వీరుడిగా ఉన్నాడు.హిట్‌మ్యాన్ ఖాతాలో 4231 పరుగులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవర్ హిట్టర్‌గా పేరొందిన రోహిత్‌ను బాబర్ ఆజం తన జట్టులో ఓపెనర్‌గా ఎంపిక చేసుకున్నాడు. అతడికి జోడీగా పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్‌కు స్థానం ఇచ్చాడు.ఇక వన్‌డౌన్‌లో పాక్‌కే చెందిన ఫఖర్ జమాన్‌ను సెలక్ట్ చేసుకున్న బాబర్.. మిడిలార్డర్లో ధనాధన్ దంచికొట్టే సూర్యకుమార్ యాదవ్‌ను నాలుగో నంబర్ బ్యాటర్‌గా ఎంచుకున్నాడు. అదే విధంగా ఇంగ్లండ్ విధ్వంసకర వీరుడు జోస్ బట్లర్, సౌతాఫ్రికా హార్డ్ హిట్టర్ డేవిడ్ మిల్లర్లను ఐదు, ఆరు స్థానాలకు ఎంపిక చేసుకున్నాడు.ఏకైక స్పిన్నర్ ఏడో స్థానంలో సౌతాఫ్రికా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మార్కో యాన్సెన్‌కు చోటు ఇచ్చిన బాబర్ ఆజం.. ఎనిమిదో స్థానానికి అఫ్గనిస్తాన్ మేటి స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను ఎంచుకున్నాడు. ఇక పేస్ దళంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో పాటు ఆసీస్‌కే చెందిన మరో ఫాస్ట్‌బౌలర్ మిచెల్ స్టార్క్‌లకు బాబర్ తన జట్టులో స్థానం ఇచ్చాడు. వీరితో పాటు ఇంగ్లండ్ పేసర్ మార్క్‌వుడ్‌ను పేస్ దళంలో చేర్చాడు.తన జట్టులో పవర్ హిట్టర్లతో పాటు విలక్షణ బౌలర్లు ఉన్నారని.. అందుకే ఈ టీమ్ సమతూకంగా ఉంటుందని బాబర్ ఆజం చెప్పుకొచ్చాడు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ అతడు ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024లో కనీసం గ్రూప్ దశను కూడా దాటకుండానే పాకిస్తాన్ నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాబర్ ఆజంను కెప్టెన్సీ నుంచి తప్పించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌ను వన్డే, టీ20 జట్ల కెప్టెన్‌గా నియమించింది. అయితే, అతడి సారథ్యంలోనూ పాక్ ఘోర పరాభవాలు చవిచూస్తోంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలలో వన్డేలు గెలవడం మినహా చెప్పుకోదగ్గ విజయాలేవీ సాధించలేదు.ఇక ఇటీవల నిర్వహించిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో రిజ్వాన్ బృందం ఒక్క గెలుపు కూడా లేకుండానే టోర్నీని ముగించింది. అయితే, ఈ రెండు సందర్భాల్లోనూ రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఐసీసీ ట్రోఫీలు గెలవడం విశేషం. కాగా టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్ విజేతగా నిలిచిన తర్వాత రోహిత్, కోహ్లి అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరూ టెస్టులకు కూడా రిటైర్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం ఐపీఎల్‌తో పాటు వన్డేలలోనూ కొనసాగుతున్నారు.బాబర్ ఆజం వరల్డ్ ఎలెవన్:రోహిత్ శర్మ, మహ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, సూర్యకుమార్ యాదవ్, జోస్ బట్లర్, డేవిడ్ మిల్లర్, మార్కో యాన్సెన్, రషీద్ ఖాన్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, మార్క్‌వుడ్.చదవండి: బుమ్రా వద్దే వద్దు!.. కెప్టెన్‌గా ఆ ఇద్దరిలో ఒకరు బెటర్: టీమిండియా మాజీ కోచ్ -
‘బుమ్రా వద్దే వద్దు!.. కెప్టెన్‌గా ఆ ఇద్దరిలో ఒకరు బెటర్’
భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్ అంశంపై టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి తన అభిప్రాయం పంచుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)ను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ సారథిగా నియమించకూడదని యాజమాన్యానికి సూచించాడు. పేస్ దళ నాయకుడికి బదులు యువ ఆటగాడికి పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందంటూ ఇద్దరు స్టార్ల పేర్లు చెప్పాడు.దిగ్గజాల వీడ్కోలుకాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) 2025-27 సీజన్ భారత్- ఇంగ్లండ్ సిరీస్‌తో మొదలుకానున్న విషయం తెలిసిందే. స్టోక్స్ బృందంతో ఐదు టెస్టుల్లో తలపడేందుకు టీమిండియా అక్కడకు వెళ్లనుంది. అయితే, ఈ కీలక పర్యటనకు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు.ఇక దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా రోహిత్ బాటలోనే సంప్రదాయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ క్రమంలో భారత జట్టు కొత్త కెప్టెన్, నాలుగో నంబర్లో బ్యాటింగ్ చేసే ఆటగాడు ఎవరన్న అంశాలు చర్చకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ రివ్యూ షోలో భాగంగా ప్రజెంటర్, బుమ్రా సతీమణి సంజనా గణేషన్‌తో రవిశాస్త్రి తన అభిప్రాయాలు పంచుకున్నాడు.బుమ్రానే ఫస్ట్ చాయిస్.. కానీ వద్దే వద్దు‘‘నా వరకైతే.. ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత కచ్చితంగా జస్ప్రీత్ బుమ్రానే కెప్టెన్‌గా ప్రథమ ప్రాధాన్యం ఇవ్వగలిగే ఆటగాడు. అయితే, నేను జస్ప్రీత్ సారథి కావాలని కోరుకోవడం లేదు. ఎందుకంటే.. కెప్టెన్‌గా ఉంటే అతడిపై అదనపు భారం పడుతుంది.బౌలర్‌గానూ బుమ్రా సేవలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. అతడు తన శరీరాన్ని మరీ ఎక్కువగా కష్టపెట్టకూడదు. తీవ్రమైన వెన్నునొప్పి తర్వాత ఇటీవలే బుమ్రా తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. ఐపీఎల్ ఆడుతున్నాడు.ఒత్తిడికి లోనయ్యే అవకాశంఅయితే, అక్కడ కేవలం నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా మాత్రమే ఉంటుంది. కానీ టెస్టుల్లో 10- 15 ఓవర్లు వేయాల్సి ఉంటుంది. ఇలా బౌలర్‌గా, కెప్టెన్‌గా అదనపు భారం పడితే అతడు తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.ఆ ఇద్దరిలో ఒకరు బెటర్ఇక యువ ఆటగాళ్లకు కెప్టెన్సీ ఇస్తే బాగుంటుందంటూ.. ‘‘కెప్టెన్‌గా శుబ్‌మన్ సరైన వాడు అనిపిస్తోంది. అతడికి అవకాశం ఇస్తే బాగుంటుంది. అతడి వయసు 25- 26 ఏళ్ల మధ్య ఉంటుంది. సారథిగా తనను తాను నిరూపించుకుంటే.. దీర్ఘకాలం కొనసాగల సత్తా అతడికి ఉంది.రిషభ్ పంత్‌ను పక్కన పెట్టే వీలు లేదు. నా దృష్టిలో టీమిండియా టెస్టు కొత్త కెప్టెన్లుగా వీరిద్దరిలో ఒకరే అత్యుత్తమ ఎంపిక. మరో దశాబ్దకాలం పాటు టీమిండియాకు ఆడగలరు.ఇప్పటికే ఇద్దరూ ఐపీఎల్లో జట్లకు కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. వారికి ఆ అనుభవం కూడా పనికివస్తుంది. అందుకే గిల్, పంత్‌లలో ఒకరికి టీమిండియా కెప్టెన్‌గా అవకాశం ఇస్తే బాగుంటుంది’’ అని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. గా జూన్ 20 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ మొదలుకానుంది.కాగా గతంలో ఇంగ్లండ్ పర్యటనలో ఓసారి భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇటీవల ఆస్ట్రేలియా టూర్లో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో పెర్త్, సిడ్నీ టెస్టుల్లో టీమిండియాకు సారథ్యం వహించాడు. ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో పెర్త్‌లో మాత్రమే గెలిచిన భారత జట్టు.. 1-3తో ట్రోఫీని చేజార్చుకుంది.చదవండి: రోహిత్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక! -
'గిల్ వద్దు.. టీమిండియా కెప్టెన్‌గా అతడే బెటర్'
ఇంగ్లండ్ పర్యటనకు ముందు టీమిండియాకు కొత్త టెస్టు కెప్టెన్ ఎంపిక చేసే పనిలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ పడింది. రోహిత్ శర్మ అనూహ్యంగా టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో కొత్త కెప్టెన్ ఎంపిక అనివార్యమైంది. పలు నివేదికల ప్రకారం టెస్టు కెప్టెన్సీ రేసులో స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. అతడితో పాటు పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా పేరు కూడా విన్పిస్తోంది. కానీ గిల్ తో పోలిస్తే బుమ్రాకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. గాయాల బెడద, వర్క్‌లోడ్ మేనేజ్మెంట్ను దృష్టిలో పెట్టుకుని బుమ్రాకు జట్టు పగ్గాలు అప్పగించకూడదని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అనుభవం లేని గిల్ వైపు బీసీసీఐ సెలక్షన్ కమిటీ మొగ్గు చూపుతుండడం క్రికెట్ వర్గాల్లో అసంతృప్తికి దారితీసినట్లు తెలుస్తోంది.చాలా మంది మాజీలు భారత టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు గిల్‌కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా కొత్త టెస్టు కెప్టెన్‌గా బుమ్రా ఉండాలని, శుబ్‌మన్ గిల్‌ను అతడి డిప్యూటీగా ఎంపిక చేయాలని జాఫర్ అభిప్రాయపడ్డాడు."భారత టెస్టు కెప్టెన్సీ రేసులో జస్ప్రీత్ బుమ్రా ముందంజలో ఉంటాడాని భావిస్తున్నాను. ఒకవేళ తనంతట తానుగా కెప్టెన్సీ ఆఫర్ తిరష్కరిస్తే తప్ప సెలక్టర్లు మరో ఆప్షన్‌ను పరిశీలించరు. అతడిని కెప్టెన్‌గా చేసి గిల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయాలి. బుమ్రాకు విశ్రాంతి అవసరమైనప్పుడల్లా గిల్ జట్టును నడిపిస్తున్నాడు. దీంతో గిల్‌కు పూర్తి స్ధాయి కెప్టెన్‌గా ఎదిగేందుకు తగినంత సమయం లభిస్తోంది" అని జాఫర్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు. కాగా గిల్‌కు కెప్టెన్‌గా అంతర్జాతీయ స్ధాయిలో పెద్దగా అనుభవం లేదు. జింబాబ్వే సిరీస్‌లో భారత జట్టు సారధిగా గిల్ వ్యవహరించాడు. ఆ తర్వాత ఎప్పుడూ భారత జట్టును నడిపించలేదు. ఐపీఎల్ మాత్రం కెప్టెన్‌గా అతడికి అనుభవం ఉంది. గుజరాత్ టైటాన్స్ సారథిగా గిల్ కొనసాగుతున్నాడు. ఇక ఇంగ్లండ్ పర్యటనకు భారత జట్టును మే 23న బీసీసీఐ ప్రకటించే అవకాశముంది.చదవండి: BCCI - IND vs ENG: టీమిండియాలో అతడికి చోటు కష్టమే! -
తుదిజట్టులో చోటే కష్టం.. అలాంటి ఆటగాడు కెప్టెనా?
టీమిండియా టెస్టు జట్టు కొత్త కెప్టెన్ ఎవరు?.. జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపించగలిగే సత్తా ఉన్న నాయకుడు ఎవరు?.. భారత క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)కు పగ్గాలు అప్పగించాలని సునిల్ గావస్కర్, అనిల్ కుంబ్లే వంటి దిగ్గజ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.మరోవైపు.. ఇప్పటికే యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ (Shubman Gill)ను సారథిగా నియమించడం లాంఛనమే అని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ గిల్‌ను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశాడు. టెస్టు తుదిజట్టులో చోటే కరువైన ఆటగాడు కెప్టెన్సీకి ఎలా అర్హుడు అవుతాడని ప్రశ్నించాడు.విదేశీ గడ్డపై గిల్ విఫలంకాగా 2020లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన గిల్.. ఇప్పటికి 32 మ్యాచ్‌లు ఆడాడు. 35.06 సగటుతో 1893 పరుగులు సాధించాడు. ఇందులో ఏడు అర్ధ శతకాలు, ఐదు సెంచరీలు ఉన్నాయి. అయితే, సొంతగడ్డపై వైట్ జెర్సీలో రాణిస్తున్న గిల్‌కు విదేశాల్లో రికార్డు అంత గొప్పగా ఏమీ లేదు.ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లో గిల్ దారుణంగా విఫలమయ్యాడు. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో మొత్తంగా 93 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అతడి చెత్త ప్రదర్శ కారణంగా మెల్బోర్న్ టెస్టులో ఆడించకుండా యాజమాన్యం వేటు వేసింది కూడా!తుదిజట్టులో చోటే కష్టం.. అలాంటి ఆటగాడు కెప్టెనా?అంతకు ముందు వెస్టిండీస్, సౌతాఫ్రికా పర్యటనల్లోనూ ఈ కుడిచేతి వాటం బ్యాటర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ గిల్ వైఫల్యాలను ఎత్తి చూపాడు. ‘‘టెస్టు క్రికెట్లో అతడు ఇంకా పూర్తిగా నిలదొక్కుకోనేలేదు.మరి ఇప్పుడే కెప్టెన్‌గా ఎందుకు? జస్ప్రీత్ బుమ్రానే సారథిని చేయాలి. ఒకవేళ అతడు ఫిట్‌గా లేకుంటే కేఎల్ రాహుల్ లేదంటే రిషభ్ పంత్‌లలో ఒకరు భారత జట్టుకు నాయకుడిగా వ్యవహరించాలి’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ హిందుస్తాన్ టైమ్స్‌తో పేర్కొన్నాడు.కేఎల్ రాహుల్ సరైనోడుఇక విరాట్ కోహ్లి రిటైర్మెంట్ నేపథ్యంలో కీలకమైన నాలుగో స్థానంలో కేఎల్ రాహుల్‌ను ఆడించాలని చిక్కా ఈ సందర్భంగా సూచించాడు. కోహ్లి వదిలి వెళ్లిన స్థానానికి రాహుల్ మాత్రమే న్యాయం చేయగలగడని అభిప్రాయపడ్డాడు. టెస్టు క్రికెట్లో భారత్‌కు అతడు విలువైన ఆటగాడని.. అతడికి జట్టులో స్థిరమైన స్థానం ఇవ్వాలని మేనేజ్మెంట్కు విజ్ఞప్తి చేశాడు.కాగా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి కూడా టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యువ రక్తంతో నిండిన జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సీజన్లో భాగంగా తొలుత ఇంగ్లండ్‌ను ఢీకొట్టనుంది. అన్నట్లు.. ఇంగ్లండ్ గడ్డ మీద శుబ్‌మన్ గిల్ మూడు టెస్టులు ఆడి 88 పరుగులు మాత్రమే చేశాడు!!చదవండి: Ind vs Eng: కుర్రాళ్లతో ఈ సిరీస్ ఆడటం కష్టం.. రహానే, పుజారా రీ ఎంట్రీ! -
కోహ్లితో టెస్టులు ఆడిన అత్యుత్తమ భారత తుదిజట్టు ఇదే!
టెస్టుల్లో పది వేల పరుగుల మైలురాయిని అందుకోకుండానే విరాట్ కోహ్లి సంప్రదాయ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. తన కెరీర్లో 123 టెస్టులాడిన ఈ దిగ్గజ బ్యాటర్.. 9230 పరుగుల వద్ద నిలిచిపోయాడు. అతడి టెస్టు కెరీర్లో 31 అర్ధశతకాలు, 30 సెంచరీలు, ఏడు డబుల్ సెంచరీలు ఉన్నాయి. ఫోర్లు 1027 కాగా.. సిక్సర్లు 30. అందుకున్న క్యాచ్‌లు 121.ఇక కెప్టెన్‌గానూ టెస్టుల్లో కోహ్లి చెరగని ముద్ర వేశాడు. సారథిగా మొత్తంగా టీమిండియాకు నలభై విజయాలు అందించి.. అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు. ఈ ప్రయాణంలో కోహ్లి కలిసి టెస్టుల్లో ఆడిన భారత అత్యుత్తమ తుదిజట్టును ఎంపిక చేయాలంటే..!ఓపెనింగ్ జోడీ.. టాపార్డర్ ఇదేవీరేందర్ సెహ్వాగ్.. కోహ్లితో కలిసి ఆడిన సమయంలో 83.79 స్ట్రైక్‌రేటుతో కనీసం 400 పరుగులు సాధించాడు. మరోవైపు.. రోహిత్ శర్మ.. కోహ్లి కెప్టెన్సీలో టాపార్డర్‌కు ప్రమోట్ అయిన హిట్‌మ్యాన్.. కోహ్లితో కలిసి దాదాపు 60 మ్యాచ్‌లు ఆడాడు.అలా రోహిత్ ఖాతాలో 3772 పరుగులు జమయ్యాయి. ఇక వన్‌డౌన్‌లో రాహుల్ ద్రవిడ్‌కే ఓటు వెయ్యవచ్చు. కోహ్లితో కలిసి ద్రవిడ్ ఎనిమిది టెస్టులు మాత్రమే ఆడాడు.ఇక ఛతేశ్వర్ పుజారా విషయానికొస్తే.. కోహ్లితో కలిసి బ్యాటింగ్ చేసి అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా చెప్పవచ్చు. 19 శతకాల సాయంతో 6664 రన్స్ సాధించాడు పుజ్జీ. అయితే, తనకంటే టెస్టు బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌లో వాల్ రాహుల్ ద్రవిడ్ ఉండటమే ఉత్తమమని గతంలో పుజారా పేర్కొన్నాడు.మిడిలార్డర్ ఇలాకాబట్టి ఈ జట్టులో అతడికి చోటు దక్కడం లేదు. ఇక నాలుగో స్థానంలో దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్. కోహ్లితో కలిసి 17 టెస్టుల్లో భాగమైన సచిన్ 835 పరుగులు చేశాడు. వీరిద్దరు కలిసి ఆడే సమయంలో సచిన్ నాలుగు, కోహ్లి ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసేవారు.ఇక్కడ అత్యుత్తమ జట్టులోనూ అదే కొనసాగిస్తే బాగుంటుంది కదా! ఇక ఆరోస్థానం విషయానికొస్తే.. మహేంద్ర సింగ్ ధోని కంటే.. రిషభ్ పంత్ ఇక్కడ బెటర్ అనిపిస్తోంది. వికెట్ కీపర్ బ్యాటర్‌గా పంత్ టెస్టుల్లో ధోనిని మించిపోయాడు. ముఖ్యంగా దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా (SENA)లో పంత్‌కు మంచి రికార్డు ఉంది. కాబట్టి ఈసారి అతడికే ఓటు వేయవచ్చు.కోహ్లితో ఆడిన సమయంలో ధోని 1587 పరుగులు చేయగా.. పంత్ మాత్రం ఏకంగా 2657 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు శతకాలు కూడా ఉండటం విశేషం.అదరగొట్టిన స్పిన్ ద్వయంకోహ్లితో టెస్టులు ఆడిన అత్యుత్తమ స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్- రవీంద్ర జడేజా అనడంలో ఎలాంటి సందేహం లేదు. అశ్విన్ కోహ్లి ఉన్న జట్టులో భాగమై ఏకంగా 475 వికెట్లు తీస్తే.. జడ్డూ 282 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. బ్యాటర్‌గా అశూ 3140 రన్స్ సాధిస్తే.. జడేజా 2920 పరుగులు చేశాడు.పేస్ దళంలో వీరేకోహ్లితో కలిసి.. భారత దిగ్గజ పేసర్ జహీర్ ఖాన్ 13 టెస్టులు ఆడి.. 38 వికెట్లు కూల్చాడు. భారత జట్టు యువ రక్తంతో నిండిపోతున్న తరుణంలోనూ తన మార్కు చూపించాడు.ఇక మహ్మద్ షమీ.. కోహ్లితో కలిసి ఆడుతూ ఈ రైటార్మ్ పేసర్ 226 వికెట్లు పడగొట్టాడు. మరి జస్ప్రీత్ బుమ్రా ఈ జట్టులో లేకపోతే ఎలా?.. కోహ్లి కెప్టెన్సీలో రాటుదేలిన బుమ్రా 176 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.కోహ్లితో టెస్టులు ఆడిన అత్యుత్తమ భారత తుదిజట్టు ఇదే..వీరేందర్ సెహ్వాగ్, రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లి (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్.చదవండి: CA: ఇష్టం లేకపోతే వెళ్లొద్దులే! -
గిల్ వద్దు.. టీమిండియా కెప్టెన్‌గా అతడే సరైనోడు!
ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం దృష్టి మొత్తం టీమిండియా మీద కేంద్రీకృతమై ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)తో పాటు దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) టెస్టులకు వీడ్కోలు పలికిన తర్వాత.. వారి స్థానాల్ని భర్తీ చేసేదెవరన్న చర్చ నడుస్తోంది. కాగా గత కొంతకాలంగా సంప్రదాయ ఫార్మాట్లో ఘోర పరాభవాలు చవిచూసిన భారత జట్టు.. తదుపరి ఇంగ్లండ్‌ను ఢీకొట్టనుంది.ఇరు జట్ల మధ్య ఈ మేర ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌తో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) 2025-27 ఆరంభం కానుంది. ఇంగ్లండ్ వేదికగా జరిగే ఈ కీలక సిరీస్‌కు టీమిండియా ఈసారి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లేకుండానే వెళ్లనుండటం ఆసక్తిగా మారింది.పనిభారం పడకుండా ఉండేందుకే?ఇక ఈ సిరీస్ నుంచి యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ టీమిండియా టెస్టు కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయమైపోయిందనే వార్తలు వస్తున్నాయి. ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై పనిభారం పడకుండా ఉండేందుకే భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.బుమ్రా కూడా ఫిట్‌నెస్‌పై దృష్టి సారించే క్రమంలో తనకు తానుగా కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకొన్నాడని మరికొన్ని వార్తలు. ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునిల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.టెస్టు కెప్టెన్‌గా బుమ్రానే సరైనోడుటీమిండియా టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్‌ను కాదని.. బుమ్రాకే పగ్గాలు అప్పగించాలని సన్నీ అభిప్రాయపడ్డాడు. ‘‘ప్రతి ఒక్కరు పనిభారం అంటూ బుమ్రా గురించి ఏదేదో మాట్లాడేస్తున్నారు. నిజానికి అతడికి మాత్రమే ఈ వర్క్‌లోడ్ గురించి పూర్తిగా తెలుస్తుంది. తన శరీరం ఒత్తిడిని తట్టుకోగలదా? లేదా ? అనేది బుమ్రాకు మాత్రమే తెలుస్తుంది.ఆ కారణంతో కెప్టెన్సీ నుంచి పక్కన పెట్టడం సరికాదు. ఎందుకంటే కెప్టెన్‌గా ఇతరులు ఎవరు ఉన్నా.. బుమ్రాతో అదనపు ఓవర్లు వేయించాలనే చూస్తారు. మరి అలాంటపుడు పనిభారం పెరగదా?జట్టులో బుమ్రా నంబర్ వన్ బౌలర్. తనే కెప్టెన్‌గా ఉంటే ఎప్పుడు విరామం తీసుకోవాలి.. ఎప్పుడు బరిలోకి దిగాలనే విషయాల్లో వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకోగలడు. అందుకే నా వరకైతే జస్ప్రీత్ బుమ్రానే తదుపరి టెస్టు కెప్టెన్‌గా నియమించాలి.పనిభారం అంటూ వచ్చే ఊహాగానాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏం చేయాలో బుమ్రాకు బాగా తెలుసు. కెప్టెన్‌గా అతడే ఉండటం అత్యుత్తమ నిర్ణయం అని నా అభిప్రాయం’’ అని గావస్కర్ స్పోర్ట్స్ టుడేతో వ్యాఖ్యానించాడు.గతంలోనూ నాయకుడిగాకాగా బుమ్రా గతంలో ఓసారి ఇంగ్లండ్ పర్యటనలో టెస్టు జట్టు నాయకుడిగా వ్యవహరించాడు. ఆ తర్వాత ఇటీవల ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా తొలుత పెర్త్‌లో.. ఆఖరిగా సిడ్నీలో ఐదో టెస్టులో కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే, సిడ్నీ టెస్టు సందర్భంగా వెన్నునొప్పి తిరగబడటంతో దాదాపు మూడు నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. ఐపీఎల్-2025తో ఇటీవలే పునరాగమనం చేశాడు. ఇదిలా ఉంటే.. జూన్ 20 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ మొదలుకానుంది. చదవండి: CA: ఇష్టం లేకపోతే వెళ్లొద్దులే! -
IND vs ENG: టీమిండియా కెప్టెన్‌గా అతడే ఉండాలి: అనిల్ కుంబ్లే
టెస్టుల్లో గత సిరీస్‌లలో వరుస పరాభవాలు చవిచూసిన టీమిండియా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC)-2025 ఫైనల్‌కు దూరమైంది. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్‌ను విజయంతో ఆరంభించాలని పట్టుదలగా ఉంది. ఇక 2025-27 సీజన్లో భాగంగా తొలుత ఇంగ్లండ్ (India vs England)తో తలపడనుంది.ఇంగ్లండ్ వేదికగా జూన్ 20 నుంచి ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. అయితే, ఈ కీలక సిరీస్‌కు రోహిత్ శర్మ (Rohit Sharma) అందుబాటులో ఉంటాడని.. అతడినే కెప్టెన్‌గా కొనసాగిస్తారని తొలుత వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా రోహిత్ బుధవారం అధికారికంగా టెస్టులకు వీడ్కోలు పలికాడు.రేసులో నలుగురు!ఈ నేపథ్యంలో టీమిండియా టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ వారసుడు ఎవరన్న అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. యువ ఆటగాళ్లు శుబ్‌మన్ గిల్, రిషభ్ పంత్ (Rishabh Pant)లకు అవకాశం ఇవ్వాలని కొంత మంది మాజీలు సూచిస్తుంటే.. మరికొంత మంది మాత్రం సీనియర్లైన కేఎల్ రాహుల్ లేదా పేస్‌దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాకు పగ్గాలు ఇవ్వాలంటున్నారు.కాగా బుమ్రా ఇటీవలి కాలంలో ఫిట్నెస్ సమస్యలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడిపై పనిభారం పడకుండా ఉండేందుకు వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా తొలగించాలని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి తరుణంలో భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే మాత్రం బుమ్రాకు మద్దతుగా నిలిచాడు.టీమిండియా కెప్టెన్‌గా అతడే ఉండాలిఇంగ్లండ్తో సిరీస్‌కు బుమ్రాను కెప్టెన్‌గా నియమించాలని బీసీసీఐకి సూచించాడు. ఈ మేరకు.. ‘‘ఫాస్ట్ బౌలర్‌గా సుదీర్ఘకాలం కొనసాగడం అంత సులువేమీ కాదు. గాయాల బెడద వేధిస్తూనే ఉంటుంది.ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత చాన్నాళ్లు విరామం తీసుకున్న అనంతరం బుమ్రా మళ్లీ ఐపీఎల్‌తో తిరిగి ఆటలో అడుగుపెట్టాడు. అతడికి ఫిట్నెస్ సమస్యలు ఉన్నాయన్న మాట వాస్తవమే.అయితే, కనీసం ఇంగ్లండ్‌తో సిరీస్‌లో మాత్రం కెప్టెన్‌గా అతడికే బాధ్యతలు అప్పగించండి. ఆ తర్వాత ఫిట్నెస్ విషయంలో సమస్యలు తలెత్తితే ఆ తర్వాత పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోండి’’ అని కుంబ్లే ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో పేర్కొన్నాడు.కాగా బుమ్రాపై పనిభారం తగ్గించే క్రమంలో ఇంగ్లండ్‌లో అత్యధికంగా మూడు మ్యాచ్‌లలో మాత్రమే అతడిని ఆడించాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. కాబట్టి ఒకవేళ అతడిని కెప్టెన్‌ను చేస్తే.. మధ్యలోనే మరొకరిని సారథిగా నియమించాల్సి వస్తుందనే కారణంతో.. బుమ్రా పేరును పరిగణనలోకి తీసుకోవడం లేదని సమాచారం.ఐదు టెస్టులూ ఆడకపోతే ఏంటి?అయితే, బుమ్రా నిజంగానే ఇంగ్లండ్‌లో ఐదు టెస్టులూ ఆడకపోవచ్చన్న కుంబ్లే.. కెప్టెన్‌గా నియమించేందుకు అదేమీ అడ్డుకాకపోవచ్చని పేర్కొన్నాడు. బుమ్రా గైర్హాజరీలో వైస్ కెప్టెన్ సారథిగా బాధ్యతలు తీసుకుంటాడని.. ఇందులో ఎలాంటి సమస్యా ఉండదని అభిప్రాయపడ్డాడు.కాగా బుమ్రా గతంలో ఇంగ్లండ్ పర్యటనలో కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇటీవల ఆస్ట్రేలియా టూర్లో భాగంగా రోహిత్ శర్మ గైర్హాజరీలో సారథిగా బాధ్యతలు నిర్వర్తించాడు. కెప్టెన్‌గా.. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్‌ను గెలిపించిన ఈ రైటార్మ్ పేసర్.. సిడ్నీ టెస్టులో మాత్రం జట్టుకు విజయం అందించలేకపోయాడు.ఇక టీమిండియా గత రెండు టెస్టు సిరీస్‌లలో ఘోర ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో కనీవినీ ఎరుగని రీతిలో 3-0తో వైట్‌వాష్‌కు గురికావడం సహా.. ఆసీస్ పర్యటనలో పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(3-1)ని చేజార్చుకుంది. ఈ రెండు సిరీస్‌లలో రోహిత్ శర్మ కెప్టెన్‌గా, ఆటగాడిగా పూర్తిగా విఫలమయ్యాడు.చదవండి: IPL 2025: ధనాధన్‌గా దూసుకొచ్చారు -
IND vs ENG: బుమ్రాకు షాక్.. వైస్ కెప్టెన్‌గానూ అవుట్!
గత కొంతకాలంగా టెస్టుల్లో పేలవ ప్రదర్శన కనబరిచిన టీమిండియా.. ఇంగ్లండ్‌లో సత్తా చాటి పూర్వ వైభవం పొందాలని పట్టుదలగా ఉంది. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సెలక్టర్లు సీనియర్ టీమ్, భారత ‘ఎ’ జట్టు కోసం కలిపి ఇప్పటికే ప్రాథమికంగా 35 మంది ప్రాబబుల్స్‌ను ఎంపిక చేశారు. ఇందులో కెప్టెన్‌గా రోహిత్ శర్మ (Rohit Sharma)పేరు దాదాపుగా ఖరారు కాగా.. వైస్ కెప్టెన్ ఎవరన్న అంశంపై సందిగ్దం నెలకొంది.నిజానికి స్వదేశంలో న్యూజిలాండ్‌తో 3-0తో క్లీన్‌స్వీప్, ఆస్ట్రేలియా పర్యటనలో 3-1తో బోర్డర్ గావస్కర్ ట్రోఫీ (BGT)ని చేజార్చుకున్న తర్వాత రోహిత్ టెస్టు భవితవ్యంపై సందేహాలు నెలకొన్నాయి. కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గానూ అతడు విఫలం కావడంతో ఇక సంప్రదాయ ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కెప్టెన్‌గానే కాదు.. వైస్ కెప్టెన్‌గానూ బుమ్రా అవుట్!ఈ నేపథ్యంలో రోహిత్ స్థానాన్ని పేస్ దళ నాయకుడు, టెస్టు జట్టు వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)తో భర్తీ చేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం రోహిత్‌నే కెప్టెన్‌గా కొనసాగించేందుకు మొగ్గు చూపిన బోర్డు.. బుమ్రా పేరును కనీసం వైస్ కెప్టెన్సీ రేసులోనూ పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘ఐదు టెస్టులకూ అందుబాటులో ఉండే ఆటగాడికే వైస్ కెప్టెన్ ఇవ్వాలని భావిస్తున్నాం.నిజానికి బుమ్రా ఈ పర్యటనలో అన్ని మ్యాచ్‌లు ఆడడు. కాబట్టి కెప్టెన్‌కు డిప్యూటీగా వేర్వేరు మ్యాచ్‌లలో వేర్వేరు ఆటగాళ్లను నియమించలేము. అందుకే ఐదు టెస్టులు ఆడే ఆటగాడినే వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేస్తాం’’ అని పేర్కొన్నాయి.గాయం తిరగబెట్టే అవకాశం!కాగా ఆస్ట్రేలియా పర్యటనలో ఐదింట రెండు టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించడంతో పాటు.. పేస్ దళం భారం మొత్తాన్ని బుమ్రానే మోశాడు. ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ 2023-25 సీజన్లో ముప్పై రెండు వికెట్లు కూల్చి సత్తా చాటాడు. కానీ ఈ సిరీస్‌లో భారత్ ఓడిపోయింది. మరోవైపు.. ఆఖరిదైన సిడ్నీ టెస్టులో బుమ్రా గాయపడ్డాడు.వెన్నునొప్పి తిరగబెట్టడంతో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 మొత్తానికి బుమ్రా అందుబాటులో లేకుండా పోయాడు. ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ ఆరంభ మ్యాచ్‌లకూ అతడు దూరమయ్యాడు. దాదాపు మూడు నెలల పాటు ఆటకు దూరంగానే న్నాడు.ఈ క్రమంలో బుమ్రా ఫిట్నెస్ దృష్ట్యా ఇంగ్లండ్‌లోనూ అతడిని వరుస మ్యాచ్‌లలో ఆడిస్తే మళ్లీ గాయం తిరగబెట్టే అవకాశం ఉందని పలువురు మాజీ క్రికెటర్లు హెచ్చరిస్తున్నారు.బుమ్రా వంటి విలువైన ఫాస్ట్ బౌలర్‌ను కాపాడుకోవాలంటే.. ఒక టెస్టు ముగిసిన తర్వాత రెండో టెస్టు కోసం అతడికి విశ్రాంతినివ్వాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుమ్రాపై పనిభారం తగ్గించే విషయంలో సెలక్టర్లు కూడా ఓ నిర్ణయానికి వచ్చారని.. అందుకే వైస్ కెప్టెన్సీ రూపంలో అదనపు బాధ్యతల నుంచి కూడా తప్పించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.రేసులో ఆ మూడు పేర్లుఒకవేళ బుమ్రాను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పిస్తే.. అతడి స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్ల ఎవరన్న చర్చ ఇప్పటికే మొదలైంది. రిషభ్ పంత్ లేదంటే.. శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్‌ల పేర్లు ఈ రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే, అసలే ఇంగ్లండ్‌తో టెస్టులు కాబట్టి యువ ఆటగాళ్ల వైపు మొగ్గుచూపకుండా.. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్‌లకు బోర్డు బాధ్యతలు అప్పగించే అవకాశం లేకపోలేదు. కాగా టీమిండియా ఆటగాళ్లంతా ప్రస్తుతం ఐపీఎల్-2025తో బిజీగా ఉన్నారు. మే 25న క్యాష్ రిచ్ లీగ్ ఫైనల్ జరుగనుండగా.. ఆ తర్వాత భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తుంది. జూన్ 20 నుంచి ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ మొదలుకానుంది.చదవండి: PBKS VS LSG: అప్పుడే అంతా అయిపోలేదు: లక్నో కెప్టెన్ పంత్ -
RR VS MI: బుమ్రా, బౌల్ట్ లాంటి హేమాహేమీల ముందు కుర్ర వైభవ్ ఆటలు సాగుతాయా..?
ఐపీఎల్ 2025లో ఇవాళ (మే 1) రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రాయల్స్ హోం గ్రౌండ్ సువాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరుగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు అందరి దృష్టి రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. ముంబై ఇండియన్స్‌పై వైభవ్ ఎలా ఆడతాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పటిష్టమైన ముంబై బౌలింగ్ లైనప్‌ను 14 ఏళ్ల కుర్ర వైభవ్ ఎలా హ్యాండిల్ చేస్తాడో అని చర్చించుకుంటున్నారు.ప్రపంచంలోనే అరివీర భయంకరులైన బుమ్రా, బౌల్ట్ ముందు నిలబడగలడా అని సందేహిస్తున్నారు. వైభవ్ జోరు చూస్తే బుమ్రా, బౌల్ట్‌కు కూడా బడిత పూజ తప్పదని అనిపిస్తుంది. ఊహకందని శతకంతో రాత్రికిరాత్రి హీరో అయిపోయిన వైభవ్ దుర్భేధ్యమైన ముంబై ఇండియన్స్ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోగలడో చూడాలి మరి.14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ రెండు రోజుల కిందట గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 బంతుల్లో సెంచరీ కొట్టి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిన విషయం తెలిసిందే. ఈ విధ్వంసకర ప్రదర్శనతో వైభవ్ ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు. అతడిపై అంచనాలు ఒక్కసారిగా ఆకాశమంత ఎత్తు పెరిగాయి. ఒక్క ఇన్నింగ్స్‌తోనే క్రికెట్ ప్రపంచం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న ఈ బేబీ బాస్.. నేడు ముంబైతో జరుగబోయే మ్యాచ్‌లో కూడా సత్తా చాటాలని కోరుకుందాం. వైభవ్ తన ఐపీఎల్ కెరీర్లో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడి 215.72 స్ట్రయిక్ రేట్‌తో 151 పరుగులు చేశాడు. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 38 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. 7 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేశాడు. అంతకుముందు ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 12 బంతుల్లో 2 సిక్సర్ల సాయంతో 16 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్‌లో (లక్నో) కూడా వైభవ్ చిన్నపాటి విధ్వంసమే సృష్టించాడు. ఆ మ్యాచ్‌లో 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 34 పరుగులు చేశాడు.ఇదిలా ఉంటే, ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ముంబై ఇండియన్స్‌పై రాయల్స్ తప్పక గెలవాలి. ఈ మ్యాచ్‌లో ఓడితే రాయల్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా గల్లంతైనట్లే. మరోవైపు ముంబై ఇండియన్స్‌కు కూడా ఈ మ్యాచ్ కీలకమే. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్ బెర్త్‌పై ఖర్చీఫ్ వేసుకోవాలని ముంబై ఇండియన్స్ భావిస్తుంది. ప్రస్తుతం ముంబై 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. రాయల్స్ 10 మ్యాచ్‌ల్లో మూడే విజయాలతో చివరి నుంచి మూడో స్థానంలో ఉంది. తుది జట్లు (అంచనా)..రాజస్థాన్ రాయల్స్: వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (c), ధృవ్ జురెల్ (wk), షిమ్రోన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ, ఆకాష్ మధ్వల్/శుభమ్ దూబేముంబై ఇండియన్స్: ర్యాన్ రికిల్టన్ (wk), రోహిత్ శర్మ (c), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా -
వాడికి ఏడాదిన్నర వయసు.. మాకు అలాంటి పిచ్చిలేదు: సంజనా ఫైర్
భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్, ముంబై ఇండియన్స్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) సతీమణి సంజనా గణేషన్ (Sanjana Ganesan) నెటిజన్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వినోదం కోసం తమ చిన్నారి కుమారుడి గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడవద్దని విజ్ఞప్తి చేశారు. తమకేమీ ప్రచార పిచ్చి లేదని.. ఇకనైనా పిచ్చి వాగుడు కట్టిపెట్టాలంటూ చురకలు అంటించారు.అసలేం జరిగిందంటే.. ఐపీఎల్-2025 (IPL 2025) లో భాగంగా ముంబై ఇండియన్స్ ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో బుమ్రా అద్బుత ప్రదర్శన కనబరిచాడు. నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు కూల్చాడు.ఐడెన్ మార్క్రమ్ (9), డేవిడ్ మిల్లర్ (24) రూపంలో రెండు కీలక వికెట్లు తీసిన బుమ్రా.. అబ్దుల్ సమద్ (2), ఆవేశ్ ఖాన్ (0)లను వచ్చీ రాగానే పెవిలియన్‌కు పంపాడు. తన పేస్ పదునుతో లక్నో బ్యాటర్లకు చుక్కలు చూపించి ముంబై విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.చిన్నారి అంగద్తోస్టేడియానికి సంజనఇదిలా ఉంటే.. ముంబై సొంత మైదానం వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్‌కు బుమ్రా భార్య, స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్ తమ కుమారుడు అంగద్తో కలిసి హాజరైంది. ఈ క్రమంలో చిన్నారి అంగద్ ఎక్స్ప్రెషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో అతడు కాస్త నీరసంగా ఉన్నట్లు కనిపించిందని.. డిప్రెషన్, ట్రామా వంటి పదాలు వాడుతూ కొంత మంది నెటిజన్లు బుమ్రా- సంజనాలను విమర్శించారు.PC: Xఈ విషయంపై సంజనా ఘాటుగా స్పందించారు. ఈ మేరకు.. ‘‘మీ వినోదం కోసం మా కుమారుడి పేరు లాగొద్దు. జస్ప్రీత్, నేను అంగద్‌ను సోషల్ మీడియాకు వీలైనంత ఎక్కువ దూరంగానే ఉంచుతాం. ఎందుకంటే.. ఇంటర్నెట్లో ఎక్కువగా విద్వేషం, విషం చిమ్మే వాళ్లే ఉంటారని తెలుసు.మాకు అలాంటి పిచ్చిలేదుచిన్నారితో కలిసి క్రికెట్ స్టేడియానికి వెళ్తే ఎలాంటి విమర్శలు వస్తాయో నాకు తెలుసు. అక్కడ కెమెరాలు ఉంటాయనీ తెలుసు. అయితే, నేను, అంగద్ కేవలం జస్ప్రీత్కు మద్దతుగా మాత్రమే అక్కడకు వచ్చాం.మా కొడుకు ఇంటర్నెట్లో వైరల్ కంటెంట్గానో.. జాతీయ వార్తగానో మారిపోవాలని మాకు ఎంతమాత్రం లేదు. కీబోర్డు వారియర్లు అయితే ఏకంగా అంగద్‌ను మూడు సెకన్ల ఫుటేజ్‌లో చూసి ఏదేదో మాట్లాడేస్తున్నారు.మా గురించి మీకేం తెలుసు?.. వాడికి ఇప్పుడు ఏడాదిన్నర వయసు మాత్రమే. కానీ మీరు ట్రామా, డిప్రెషన్ వంటివి పదాలు వాడుతూ వాడి గురించి మాట్లాడుతున్నారు. ఇది నిజంగా విచారకరం. మా కొడుకు గురించి మీకు ఏం తెలుసు?మా జీవితాల గురించి మీకెంత తెలుసు. మీ అభిప్రాయాలను మీతోనే పెట్టుకోండి. ఎదుటివారి పట్ల దయ, సహానుభూతి కలిగి ఉండటం వంటివి ఈరోజుల్లో ఎంతో ముఖ్యమైన విషయాలుగా మారిపోయాయి’’ అని సంజనా గణేషన్ తన ఇన్‌స్టా స్టోరీలో భావోద్వేగపూరిత నోట్ రాశారు. దయచేసి చిన్నపిల్లల విషయంలోనైనా కాస్త సంయమనంతో వ్యవహరించాలని కోరారు. చదవండి: కేఎల్ రాహుల్‌తో కోహ్లి వాగ్వాదం.. గట్టిగానే బదులిచ్చిన వికెట్ కీపర్! వీడియో View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
జస్ప్రీత్ బుమ్రా సరికొత్త చరిత్ర.. తొలి బౌలర్‌గా
ఐపీఎల్-2025లో వాంఖడే స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 54 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ఈ విజయంలో ముంబై స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాది కీలక పాత్ర. 4 వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి పతనాన్ని శాసించాడు. తన పేస్ బౌలింగ్‌తో లక్నో బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.బుమ్రా తన బౌలింగ్‌లో కోటాలో కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో బుమ్రా ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా జస్ప్రీత్ రికార్డులకెక్కాడు. ముంబై ఇండియన్స్ తరపున ఇప్పటివరకు 139 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా.. 174 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ లసిత్ మలింగ రికార్డు పేరిట ఉండేది. మలింగ 122 మ్యాచ్ ల్లో 170 వికెట్లు తీశాడు. ఇప్పుడు తాజా మ్యాచ్‌తో మలింగ రికార్డును బుమ్ బుమ్రా బ్రేక్ చేశాడు. అయితే ఐపీఎల్‌తో పాటు ఛాంపియన్స్ లీగ్ కూడా కలిపితే ముంబై తరపున అత్యధిక వికెట్ల వీరుడిగా మలింగ కొనసాగుతున్నాడు. ఈ శ్రీలంక దిగ్గజం రెండు లీగ్‌లు కలిపి ముంబై తరపున 195 వికెట్లు పడగొట్టాడు. మలింగ తర్వాతి స్దానంలో బుమ్రా(177) ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై బ్యాటర్లలో రికెల్టన్(58), సూర్యకుమార్ యాదవ్(54) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వీరితో పాటు నమన్ ధీర్(25), జాక్స్(29), బాష్(20) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్, అవేష్ ఖాన్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్, బిష్ణోయ్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం 216 పరుగుల భారీ లక్ష్య చేధనలో లక్నో చతకలపడింది. 20 ఓవర్లో 61 పరుగులకు ఆలౌటైంది. లక్నో బ్యాటర్లలో ఆయూష్ బదోని(35) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిచెల్ మార్ష్(34) పర్వాలేదన్పించాడు. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టగా..ట్రెంట్ బౌల్ట్ మూడు, విల్ జాక్స్ రెండు, బాష్ ఓ వికెట్ సాధించాడు. -
బుమ్ బుమ్ బుమ్రా.. లక్నోను చిత్తు చేసిన ముంబై
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం వాంఖడే వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 54 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇది ముంబైకి వరుసగా ఐదో విజయం కావడం గమనార్హం.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై బ్యాటర్లలో రికెల్టన్(58), సూర్యకుమార్ యాదవ్(54) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వీరితో పాటు నమన్ ధీర్(25), జాక్స్(29), బాష్(20) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్, అవేష్ ఖాన్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్, బిష్ణోయ్ చెరో వికెట్ పడగొట్టారు.బుమ్ బుమ్ బుమ్రా..అనంతరం 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చేరిగాడు. నాలుగు వికెట్లు పడగొట్టి లక్నోను దెబ్బ తీశాడు. బుమ్రాతో పాటు ట్రెంట్ బౌల్ట్ మూడు, విల్ జాక్స్ రెండు, బాష్ ఓ వికెట్ సాధించారు. లక్నో బ్యాటర్లలో ఆయూష్ బదోని(35) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిచెల్ మార్ష్(34) పర్వాలేదన్పించాడు. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో రెండో స్దానానికి చేరుకుంది.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. తొలి భారత ప్లేయర్‌గా -
IPL 2025: జస్ప్రీత్ బుమ్రా 'ట్రిపుల్ సెంచరీ'..
టీమిండియా పేస్ గుర్రం, ముంబై ఇండియన్స్ స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టీ20ల్లో 300 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. ఐపీఎల్-2025లో ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో హెన్రిచ్ క్లాసెన్ వికెట్‌తో బుమ్రా ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఫీట్ సాధించిన రెండో ఇండియన్ ఫాస్ట్ బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. ఈ జాబితాలో బుమ్రా కంటే ముందు టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్(318) ఉన్నాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన ఐదో భారత బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. అదేవిధంగా మరో ఘనతను బుమ్రా ఈ మ్యాచ్‌లో సాధించాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలింగ్ దిగ్గజం లసిత్ మలింగ(170) రికార్డును బుమ్రా సమం చేశాడు.మరో వికెట్ పడగొడితే మలింగను జస్ప్రీత్ అధిగమిస్తాడు. అయితే ఈ మ్యాచ్‌లో బుమ్రా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 39 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు.భారత్ తరఫున అత్యధిక టీ20 వికెట్లు తీసిన బౌలర్లు వీరే యుజ్వేంద్ర చాహల్ - 373పీయూష్ చావ్లా - 319భువనేశ్వర్ కుమార్ - 318రవిచంద్రన్ అశ్విన్ - 315జస్ప్రీత్ బుమ్రా - 300 -
జస్ప్రీత్ బుమ్రాకు అరుదైన గౌరవం.. దిగ్గజాల సరసన చోటు
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు అరుదైన గౌరవం దక్కింది. 2024 సంవత్సరానికి గానూ విజ్డెన్ మెన్స్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద వరల్డ్ అవార్డుకు ఎంపికయ్యాడు. గతేడాది ఫార్మాట్లకతీతంగా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకు గానూ బుమ్రాకు ఈ గౌరవం దక్కింది. 2024లో బుమ్రా మూడు ఫార్మాట్లలో 86 వికెట్లు (21 మ్యాచ్‌ల్లో 13 సగటున) తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. గతేడాది బుమ్రా టెస్ట్‌ల్లో విశేషంగా రాణించి అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఫలితంగా అతను ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, బీసీసీఐ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు గెలుచుకున్నాడు.గతేడాది టీ20 వరల్డ్‌కప్‌లో అద్భుతంగా రాణించిన బుమ్రా భారత్‌కు టైటిల్‌ను అందించడంలో ప్రధానపాత్ర పోషించాడు. ఈ మెగా టోర్నీలో బుమ్రా ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డుతో పాటు రెండు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు.దిగ్గజాల సరసన చోటుతాజాగా విజ్డెన్ మెన్స్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద వరల్డ్ అవార్డు గెలవడంతో బుమ్రా భారత దిగ్గజ క్రికెటర్ల సరసన చేరాడు. గతంలో విరాట్ కోహ్లి, వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ మాత్రమే ఈ అవార్డును గెలుచుకున్నారు. వీరిలో కోహ్లి అత్యధికంగా 3 సార్లు ఈ అవార్డును గెలువగా.. సెహ్వాగ్ 2, సచిన్ ఓసారి ఈ అవార్డును దక్కించుకున్నారు.విజ్డెన్ వుమెన్స్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద వరల్డ్ అవార్డు విషయానికొస్తే.. 2024 సంవత్సరానికి గానూ ఈ అవార్డును భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధన దక్కించకుంది. మంధన గతేడాది మూడు ఫార్మాట్లలో విశేషంగా రాణించి, రికార్డు స్థాయిలో 1659 పరుగులు చేసింది. మహిళల క్రికెట్లో ఓ క్యాలెండర్ ఇయర్లో ఇన్ని పరుగులు ఎవరూ చేయలేదు. గతేడాది మంధన నాలుగు వన్డే శతకాలు, ఓ టెస్ట్ సెంచరీ సాధించింది.పూరన్‌కు లీడింగ్ టీ20 ప్లేయర్ అవార్డుపొట్టి క్రికెట్లో విశేషంగా రాణిస్తున్న విండీస్ ఆటగాడు నికోలస్ పూరన్‌కు విజ్డెన్ మెన్స్ లీడింగ్ టీ20 ప్లేయర్ ఆఫ్ ద వరల్డ్ అవార్డు లభించింది. పూరన్ గతేడాది పొట్టి ఫార్మాట్లో 21 మ్యాచ్‌లు ఆడి 142.22 స్ట్రయిక్‌రేట్‌తో 464 పరుగులు చేశాడు. -
కమిన్స్, స్టార్క్ కాదు!.. అతడిని ఎదుర్కోవడమే అత్యంత కష్టం: రోహిత్
దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఆస్ట్రేలియా 2025లో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (BGT)ని గెలిచింది. టీమిండియాను 3-1తో ఓడించి సొంతగడ్డపై సత్తా చాటింది. ఇందుకు ప్రధాన కారణం ఆసీస్ పేసర్లే అని చెప్పడంలో సందేహం లేదు.బుమ్రా@32నిజానికి భారత పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఈ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఐదు మ్యాచ్‌లలో కలిపి ఏకంగా 32 వికెట్లు కూల్చాడు. తద్వారా ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. కానీ బ్యాటర్ల వైఫల్యం కారణంగా టీమిండియా ఓడిపోవడంతో బుమ్రా ప్రదర్శనకు విలువ లేకుండా పోయింది.హాజిల్‌వుడ్ స్థానంలో వచ్చిఇక.. ప్రపంచంలోని అత్యుత్తమ పేస్ త్రయంగా ఆస్ట్రేలియా పేసర్లు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins), మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్‌లకు పేరు ఉన్న విషయం తెలిసిందే. వీరిలో హాజిల్‌వుడ్ మూడు మ్యాచ్‌కు ముందు గాయపడగా.. అతడి స్థానంలో స్కాట్ బోలాండ్ వచ్చాడు. కమిన్స్, స్టార్క్‌తో కలిసి భారత్‌తో టెస్టుల్లో అతడు రాణించగా.. ఉత్తమ ఆఫ్ స్పిన్నర్లలో ఒకడైన నాథన్ లియోన్ వారికి సహకరించాడు. బ్యాటర్లు కూడా తమ పనిని చక్కగా నెరవేర్చారు.ఫలితంగా టీమిండియాపై ఆసీస్ పైచేయి సాధించడంతో పాటు.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. అంతేకాదు.. రోహిత్ సేనను డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరం చేసింది. ఈ సిరీస్ గురించి టీమిండియా సారథి రోహిత్ శర్మ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.కమిన్స్, స్టార్క్ కాదు!.. అతడిని ఎదుర్కోవడమే అత్యంత కష్టంబీజీటీలో తమను ఎక్కువగా ఇబ్బంది పెట్టిన బౌలర్ ఎవరన్న అంశంపై స్పందిస్తూ.. ‘‘స్కాట్ బోలాండ్‌ను ఎదుర్కోవడం అత్యంత కష్టమైంది. అతడి పిచ్ మ్యాప్‌ను మేము చెక్ చేస్తూనే ఉన్నాం. అతడి బౌలింగ్‌లో పరుగులు రాబట్టే విషయమై సమాలోచనలు చేశాం.ఫుల్ బాల్స్ లేవు. అంతా బంతిని వేసే కోణంలోనే ఉంది. అతడు నేరుగా పరిగెత్తుకు వస్తాడు. కాస్త జంప్ చేసి.. తన సీమ్ బౌలింగ్‌తో మ్యాజిక్ చేస్తాడు’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో బుమ్రా తొమ్మిది ఇన్నింగ్స్‌లో 32 వికెట్లు తీశాడు. ఇక ఆసీస్ సారథి పది ఇన్నింగ్స్‌లో కలిపి 25 వికెట్లు కూల్చగా.. బోలాండ్ ఆరు ఇన్నింగ్స్‌లోనే 21 వికెట్లు పడగొట్టాడు. మిగతా వాళ్లలో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ 10 ఇన్నింగ్స్‌లో 20 వికెట్లు.. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ 10 ఇన్నింగ్స్‌లో 18 వికెట్లు కూల్చారు. తదుపరి ఇంగ్లండ్తోఇదిలా ఉంటే.. టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం ఐపీఎల్-2025తో బిజీగా ఉన్నారు. ఈ టీ20 లీగ్‌కు ముందు టీమిండియా.. చాంపియన్స్ ట్రోఫీ-2025 రూపంలో ఐసీసీ టైటిల్ గెలిచింది. ఇక ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత జట్టు టెస్టు సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది.చదవండి: వికెట్ కాపాడుకోవటానికే ప్రాధాన్యం.. ఇలా అయితే కష్టం రాహుల్: పుజారా -
DC VS MI: కరుణ్ నాయర్‌తో బుమ్రా వాగ్వాదం.. సారి చెప్పినా పట్టించుకోని వైనం
ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య నిన్న (ఏప్రిల్ 13) జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఎప్పుడూ ఎవరితో గొడవ పడని ముంబై పేసర్ జస్ప్రీత్ బుమ్రా సహనాన్ని కోల్పోయాడు. ఢిల్లీ బ్యాటర్ కరుణ్ నాయర్‌తో వాగ్వాదానికి దిగాడు. కరుణ్ సారీ చెప్పినా పట్టించుకోలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.The average Delhi vs Mumbai debate in comments section 🫣Don't miss @ImRo45 's reaction at the end 😁Watch the LIVE action ➡ https://t.co/QAuja88phU#IPLonJioStar 👉 #DCvMI | LIVE NOW on Star Sports Network & JioHotstar! pic.twitter.com/FPt0XeYaqS— Star Sports (@StarSportsIndia) April 13, 2025ఇంతకీ ఏం జరిగిందంటే.. ముంబై నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదిస్తుండగా (ఇన్నింగ్స్ 6వ ఓవర్ చివరి బంతికి) కరుణ్ పరుగు తీసే క్రమంలో బౌలింగ్ చేస్తున్న బుమ్రాను పొరపాటున ఢీకొట్టాడు. దీనికి కరుణ్ వెంటనే క్షమాపణ చెప్పినా బుమ్రా పట్టించుకోలేదు. కరుణ్‌పై నోరు పారేసుకున్నాడు. హార్దిక్ కల్పించుకుని కరుణ్‌కు సర్ది చెప్పాడు. బుమ్రా-కరుణ్ మధ్య వాగ్వాదాన్ని నిశితంగా గమనిస్తున్న రోహిత్ శర్మ తనదైన శైలిలో కామెడీ చేస్తూ కనిపించాడు.పొరపాటున జరిగిన దానికి కరుణ్ సారీ చెప్పినా బుమ్రా పట్టించుకోకపోవడానికి కారణం వేరే ఉంది. ఆ ఓవర్లో, అంతకుముందు ఓవర్లో కరుణ్ బుమ్రాను చెడుగుడు ఆడుకున్నాడు. బుమ్రాను ఎదుర్కొన్న 9 బంతుల్లో కరుణ్ 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 26 పరుగులు చేశాడు. కెరీర్లో ఏ బ్యాటర్ బుమ్రాను ఇంతలా చితక్కొట్టలేదు. Nair fire against Bumrah 🔥pic.twitter.com/3D6kjyR5lx— Delhi Capitals (@DelhiCapitals) April 13, 2025బుమ్రా అత్యంత వేగంతో సంధిస్తున్న బంతులను కరుణ్ సునాయాసంగా బౌండరీలు, సిక్సర్లుగా తరలించాడు. ఇదే కోపంతో బుమ్రా కరుణ్‌పై నోరు పారేసుకున్నాడు. బుమ్రాతో వాగ్వాదం జరిగే సమయానికి కరుణ్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. రెండేళ్ల విరామం తర్వాత ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కరుణ్ కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో కరుణ్ ట్రెంట్ బౌల్ట్పై కూడా ఇదే తరహా విరుచుకుపడ్డాడు. ఆ ఓవర్లో కరుణ్ మూడు బౌండరీలు బాదాడు. కరుణ్ దెబ్బకు హార్దిక్ బౌల్ట్‌ను బౌలింగ్ నుంచి తప్పించి మళ్లీ చివర్లో బరిలోకి దించాడు. ఈ మ్యాచ్‌లో కరుణ్ కర్ణ్ శర్మ, హార్దిక్ పాండ్యాను కూడా వదిలి పెట్టలేదు. హార్దిక్ బౌలింగ్‌లో 2 సిక్సర్లు, ఓ ఫోర్.. కర్ణ్ శర్మ బౌలింగ్‌లో ఓ సిక్సర్, 2 ఫోర్లు బాదాడు.ఈ మ్యాచ్‌లో కరుణ్ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆడినా ఢిల్లీ ఓటమిపాలైంది. గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ ఒత్తిడికి లోనై చేజేతులా ఓటమిని కొని తెచ్చుకుంది. ఢిల్లీ మరో ఓవర్ మిగిలుండగానే చివరి మూడు వికెట్లు రనౌట్ల రూపంలో కోల్పోయి 12 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. సింగిల్స్ తీసుకుని స్ట్రయిక్ రొటేట్ చేసుకున్నా ఢిల్లీకి విజయాకాశాలు ఉండేవి. అయితే లోయర్ ఆర్డర్ బ్యాటర్లు లేని రెండో పరుగులకు ప్రయత్నించి వికెట్లు పారేసుకున్నారు. కరుణ్ ఔటయ్యాక (13వ ఓవర్లో) కొత్త బంతి తీసుకోవడం కూడా ముంబైకి కలిసొచ్చింది. కొత్త బంతితో కర్ణ్ శర్మ, సాంట్నర్, బౌల్ట్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు కీలకమైన స్టబ్స్, కేఎల్ రాహుల్, విప్రాజ్ నిగమ్ వికెట్లు తీశారు. ఫలితంగా చివరి రెండు ఓవర్లకు ముందు ఢిల్లీ బ్యాటర్లు ఒత్తిడికి లోనై రనౌట్ల రూపంలో వికెట్లు సమర్పించుకున్నారు. 3 వికెట్లు తీసిన కర్ణ్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్ వర్మ (59), ర్యాన్ రికెల్టన్ (41), సూర్యకుమార్ యాదవ్ (40), నమన్ ధీర్ (38) రాణించగా.. రోహిత్ శర్మ (18) మరోసారి విఫలమయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ తలో రెండు వికెట్లు తీయగా.. ముకేశ్ కుమార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.. రోహిత్ రావడం వల్ల..: హార్దిక్
ఐపీఎల్-2025 (IPL 2025)లో ముంబై ఇండియన్స్‌కు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. గత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓడిన హార్దిక్ సేన.. తాజాగా సొంత మైదానం వాంఖడేలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ముందు తలవంచింది. ఆఖరి వరకు పోరాడినా పన్నెండు పరుగుల తేడాతో ఓడిపోయి పరాభవాన్ని మూటగట్టుకుంది.ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya).. తాము తీవ్ర నిరాశకు గురైనట్లు తెలిపాడు. వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని.. కాబట్టి తాను బౌలర్లను నిందించబోనని స్పష్టం చేశాడు. గత మ్యాచ్‌లో పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడ్డ తిలక్ వర్మ ఈరోజు మాత్రం అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని హర్షం వ్యక్తం చేశాడు.జస్ప్రీత్ బుమ్రా రాకతో జట్టు మరింత పటిష్టంగా మారిందని.. అనుకున్న ఫలితాలు రాబట్టేందుకు సానుకూల దృక్పథంతో ముందుకు సాగటం ముఖ్యమని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. కాగా ఆర్సీబీతో సోమవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ చేసింది.ఆర్సీబీ బ్యాటర్లు ధనాధన్ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి (42 బంతుల్లో 67), దేవదత్ పడిక్కల్ (22 బంతుల్లో 37), కెప్టెన్ రజత్ పాటిదార్ (32 బంతుల్లో 64) దంచికొట్టగా.. వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ (19 బంతుల్లో 40 నాటౌట్)తో దుమ్ములేపాడు. ఫలితంగా ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా రెండేసి వికెట్లు తీయగా.. విఘ్నేశ్ పుతూర్‌కు ఒక వికెట్ దక్కింది. అయితే, బుమ్రా నాలుగు ఓవర్ల కోటాలో 29 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు. ఇక లక్ష్య ఛేదనలో ముంబై ఆరంభంలోనే ఓపెనర్లు రోహిత్ శర్మ (17), రియాన్ రికెల్టన్ (17) వికెట్లు కోల్పోయింది.తిలక్, హార్దిక్ పోరాటం వృథావిల్ జాక్స్ (22), సూర్యకుమార్ యాదవ్ (28) కూడా నిరాశపరచగా.. తిలక్ వర్మ (29 బంతుల్లో 56), హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో 42) అద్భుత ఇన్నింగ్స్‌తో గెలుపు ఆశలు రేకెత్తించారు. అయితే, బెంగళూరు బౌలర్ల ప్రతాపం ముందు వీరు తలవంచకతప్పలేదు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయిన ముంబై.. 209 పరుగుల వద్ద నిలిచిపోయి.. పరాజయాన్ని ఆహ్వానించింది.రోహిత్ రావడం వల్ల అతడు లోయర్ ఆర్డర్లోఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా స్పందిస్తూ.. ‘‘పరుగుల వరద పారింది. వికెట్ చాలా బాగుంది. అయితే, మేము ఇంకాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది. పిచ్‌ను చూసిన తర్వాత బౌలర్లను తప్పుపట్టడానికి ఏమీ లేదనిపించింది.ఇక బ్యాటింగ్ ఆర్డర్లో మూడో స్థానం జట్టుకు వెన్నెముక లాంటిది. గత మ్యాచ్‌కు రోహిత్ అందుబాటులో లేడు కాబట్టి నమన్ ధీర్ టాపార్డర్‌లో ఆడాడు. నమన్ బహుముఖ ప్రజ్ఞగల ఆటగాడు. అతడు ఏ స్థానంలోనైనా రాణించగలడు. రోహిత్ వచ్చాడు గనుక ఈసారి లోయర్ ఆర్డర్లో బరిలోకి దిగాడు.తిలక్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడుతిలక్ వర్మ ఈరోజు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. గత మ్యాచ్‌లో అతడిని రిటైర్డ్ అవుట్‌గా వెనక్కి పిలిపించాలన్న మా కోచ్ నిర్ణయం సరైందేనని ఇప్పటికీ నమ్ముతున్నా. ఏదేమైనా పవర్ ప్లేలో పరుగులు రాబట్టడమే అత్యంత ముఖ్యం.ఈరోజు మధ్య ఓవర్లలోనూ మేము ఒకటి, రెండు సందర్భాల్లో గట్టిగా హిట్టింగ్ చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేది. డెత్ ఓవర్లలో ప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయాం. ఇక బుమ్రా జట్టులోకి రావడం.. మా టీమ్‌ను ప్రపంచంలోనే ప్రత్యేకంగా నిలుపుతుందనడం అతిశయోక్తి కాదు.ఈరోజు తను బాగానే రాణించాడు. మా జట్టు ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతోనే ఉంటుంది. మా ఆటగాళ్లకు మేము అండగా ఉంటాం. తప్పక అనుకున్న ఫలితాలు రాబడతాం’’ అని చెప్పుకొచ్చాడు.చదవండి: గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్‌గా ఊహించని పేరు చెప్పిన కపిల్ దేవ్ A #TATAIPL Classic in every sense 🔥#RCB hold their nerves to seal a win after 1️⃣0️⃣ years against #MI at Wankhede! Scorecard ▶️ https://t.co/ArsodkwOfO#TATAIPL | #MIvRCB | @RCBTweets pic.twitter.com/uu98T8NtWE— IndianPremierLeague (@IPL) April 7, 2025 -
గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్, రోహిత్ వారసుడిగా ఊహించని పేరు
టీమిండియా మొట్టమొదటి ప్రపంచకప్ అందించిన కెప్టెన్ కపిల్ దేవ్ (Kapil Dev). ఈ దిగ్గజ ఆల్‌రౌండర్ సారథ్యంలో 1983 నాటి వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో వెస్టిండీస్‌ను ఓడించి ట్రోఫీని ముద్దాడింది. ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోని (MS Doni) నాయకత్వంలో 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్‌కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీని భారత్ సొంతం చేసుకుంది.ఈ క్రమంలో సుదీర్ఘ విరామం తర్వాత గత రెండేళ్ల కాలంలో మరో రెండు ప్రపంచకప్ టైటిళ్లను టీమిండియా తన ఖాతాలో వేసుకుంది. రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్సీలో టీ20 ప్రపంచకప్-2024.. ఇటీవల ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ట్రోఫీలను కైవసం చేసుకుంది.సూర్యకుమార్ యాదవ్‌కు పగ్గాలుఇక పొట్టి ప్రపంచకప్‌లో భారత్‌ను విజేతగా నిలిపిన తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్ వారసుడిగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) హార్దిక్ పాండ్యా పేరును ప్రకటిస్తుందనుకుంటే.. సూర్యకుమార్ యాదవ్‌కు పగ్గాలు అప్పగించింది.మరోవైపు.. వన్డేలకు, టెస్టులకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా కొనసాగుతుండగా.. ఆయా ఫార్మాట్లలో శుబ్‌మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా అతడికి డిప్యూటీలుగా వ్యవహరిస్తున్నారు. ఇక వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరుగనుండగా.. వన్డే వరల్డ్‌కప్ 2027లో జరుగనుంది.నా ఎంపిక మాత్రం హార్దిక్ పాండ్యానేఈ నేపథ్యంలో పరిమిత ఓవర్ల క్రికెట్ టీమిండియాకు సరైన కెప్టెన్ ఎవరన్న అంశంపై దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించాడు. ‘‘నా వరకు హార్దిక్ పాండ్యానే టీమిండియా వైట్‌బాల్ కెప్టెన్‌గా ఉండాలి. ఈ పదవికి చాలా మంది పోటీలో ఉన్నారని తెలుసు.అయితే, నా ఎంపిక మాత్రం హార్దిక్ పాండ్యానే. అతడు యువకుడు. వచ్చే రెండు ఐసీసీ ఈవెంట్ల కోసం అతడి చుట్టూ జట్టు నిర్మిస్తే బాగుంటుంది. నిజానికి పాండ్యా టెస్టు క్రికెట్ కూడా ఆడితే బాగుంటుంది. కానీ అతడు చాలా కాలంగా రెడ్ బాల్ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అందుకే టీమిండియాకు మూడు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్ల అవసరం ఏర్పడింది’’ అని కపిల్ దేవ్ అన్నాడు. ‘మైఖేల్’తో మాట్లాడుతూ ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నాడు.గాయాల బెడద ఎక్కువని పక్కన పెట్టారుఅయితే, హార్దిక్‌ను కాదని సూర్యను టీ20 కెప్టెన్‌గా నియమించిన సమయంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఇందుకు గల కారణాన్ని వెల్లడించాడు. పేస్‌బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన హార్దిక్‌కు గాయాల బెడద ఎక్కువని.. అతడి లాంటి అరుదైన ఆటగాడిని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే కెప్టెన్సీ భారం మోపలేదని స్పష్టం చేశాడు.కపిల్ దేవ్ మాత్రం ఇలాకానీ.. కపిల్ దేవ్ మాత్రం పరిమిత ఓవర్ల క్రికెట్లో సూర్య, శుబ్మన్లను కాదని హార్దిక్ పాండ్యా పేరును మరోసారి కెప్టెన్సీ ఆప్షన్‌గా తెరమీదకు తీసుకురావడం విశేషం. కాగా టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం ఐపీఎల్-2025తో బిజీగా ఉన్నారు. తదుపరి జూన్‌లో ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో జాతీయ జట్టు తరఫున విధుల్లో చేరనున్నారు.ఇక క్యాష్ రిచ్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా గతేడాది నియమితుడైన హార్దిక్ పాండ్యా.. వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. ఐపీఎల్-2024లో పద్నాలుగు మ్యాచ్‌లకు హార్దిక్ సేన కేవలం నాలుగే గెలిచి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడు ఓడిపోయింది. చదవండి: ట్రిపుల్ సెంచరీతో చెలరేగిన ఇంగ్లండ్ ఆటగాడు -
MI vs RCB: యార్కర్‌తో దడ పుట్టించిన బుమ్రా.. వీడియో వైరల్
ఐపీఎల్-2025 (IPL 2025)లోనూ ముంబై ఇండియన్స్ పరాజయ పరంపర కొనసాగుతోంది. గతేడాది పద్నాలుగింట.. నాలుగు మ్యాచ్‌లే గెలిచిన హార్దిక్ సేన.. ఈసారి ఓటమితో సీజన్‌ను ఆరంభించింది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడు ఓడిపోయి విమర్శలు మూటగట్టుకుంటోంది.బ్యాటర్లు, బౌలర్ల సమిష్టి వైఫల్యం ముంబైపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇలాంటి తరుణంలో ముంబై ఇండియన్స్‌కు అదిరిపోయే శుభవార్త అందింది. ఆ జట్టు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. వాంఖడేలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో సోమవారం నాటి మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు.యార్కర్‌తో దడ పుట్టించిన బుమ్రా..ఇక ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టిన ఈ పేస్ గుర్రం.. నెట్ సెషన్లో తన బౌలింగ్ మాయాజాలంతో బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. బుమ్రా వేసిన పదునైన యార్కర్ దెబ్బకు స్టంప్స్ ఎగిరిపోగా.. ఆ బంతిని ఎదుర్కొనేందుకు ప్రయత్నించిన బ్యాటర్ బ్యాలెన్స్ చేసుకోలేక కిందపడిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.రెండు నెలల విరామం తర్వాతకాగా బుమ్రా రాకతోనైనా తమ తలరాత మారుతుందని ముంబై జట్టు వేయికళ్లతో ఎదురుచూస్తోంది. ఇక ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లో అదరగొట్టిన జస్ప్రీత్ బుమ్రా.. సిడ్నీలో జరిగిన ఆఖరి టెస్టు సందర్భంగా గాయపడిన విషయం తెలిసిందే. వెన్నునొప్పితో విలవిల్లాడిన అతడు .. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత చాలా రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నాడు.అయితే, ఫిట్నెస్ సాధించని కారణంగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్‌కు కూడా బుమ్రా దూరమయ్యాడు. అదే విధంగా.. ఐపీఎల్-2025 ఆరంభ మ్యాచ్‌లకు కూడా దూరమైన ఈ రైటార్మ్ పేసర్.. రీఎంట్రీ ఇచ్చేందుకు సన్నద్ధమయ్యాడు. కాగా జనవరి తర్వాత బుమ్రా కాంపిటేటివ్ క్రికెట్ బరిలోకి దిగనుండటం ఇదే తొలిసారి.రోహిత్ కూడామరోవైపు.. గాయం వల్ల గత మ్యాచ్‌కు దూరమైన ముంబై ఇండియన్స్ స్టార్ ఓపెనర్, మాజీ సారథి రోహిత్ శర్మ కూడా తిరిగి జట్టుతో చేరాడు. వీరిద్దరి రాకతో ముంబై ఇండియన్స్ శిబిరంలో సరికొత్త ఉత్సాహం నిండింది. కాగా ఆర్సీబీపై బుమ్రాకు అద్భుతమైన రికార్డు ఉంది. ఇది బుమ్రా వర్సెస్ ఆర్సీబీఇప్పటి వరకు బెంగళూరు జట్టుతో తాను ఆడిన 19 మ్యాచ్‌లలో కలిపి బుమ్రా 29 వికెట్లు తీయడం గమనార్హం. అందుకే సోమవారం నాటి పోరును బుమ్రా వర్సెస్ ఆర్సీబీగా అభివర్ణిస్తూ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బుమ్రా ఆర్సీబీ బ్యాటర్లకు చుక్కలు చూపించడం ఖాయమని కామెంట్లు చేస్తున్నారు.ఇక ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిన ముంబై ఇండియన్స్.. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ చేతిలోనూ పరాజయం పాలైంది. అనంతరం కోల్‌కతా నైట్ రైడర్స్‌పై విజయం సాధించిన హార్దిక్ సేన.. ఆఖరిగా లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడి మరో ఓటమిని మూటగట్టుకుంది. ప్రస్తుతం కేవలం రెండు పాయింట్లతో పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.చదవండి: ఇలా వచ్చి.. అలా వెళ్లారు.. అసలేం చేస్తున్నారు? కావ్యా మారన్ రియాక్షన్ వైరల్Goodnight Paltan! 😊#MumbaiIndians #PlayLikeMumbai pic.twitter.com/UYghtBvYMN— Mumbai Indians (@mipaltan) April 6, 2025 -
బుమ్రా X బెంగళూరు
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ 18వ సీజన్లో మరో కీలక సమరానికి రంగం సిద్ధమైంది. ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు సొంతగడ్డపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో పోరుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ సాధించలేకపోయిన ఆర్సీబీ... ఈసారి ఆరంభం నుంచే మంచి ప్రదర్శన చేస్తుంటే... మరోవైపు లీగ్‌లో ఘన చరిత్ర ఉన్న ముంబై ఇండియన్స్ పడుతూ లేస్తూ సాగుతోంది. బెంగళూరు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట గెలవగా... హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క దాంట్లోనే విజయం సాధించింది. బ్యాటర్ల వైఫల్యం ముంబైని ఇబ్బంది పెడుతున్నా... స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పునరాగమనంతో జట్టు బలం రెట్టింపైంది. సోమవారం మ్యాచ్‌కు బుమ్రా అందుబాటులో ఉంటాడని ముంబై కోచ్ జయవర్ధనే వెల్లడించడంతో... ఇది బెంగళూరు బ్యాటింగ్‌కు బుమ్రా బౌలింగ్‌కు మధ్య సమరంగా మారిపోయింది. మరోవైపు తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి జోరు కనబర్చిన ఆర్సీబీ... చివరి మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో ఓడింది. తిరిగి గెలుపు బాటపట్టాలని బెంగళూరు ఎదురుచూస్తోంది. బ్యాటర్లు రాణిస్తేనే... ముంబై ఇండియన్స్ ప్రధాన బలమైన స్టార్ బ్యాటర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు. ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ప్రభావం చూపలేకపోగా... హైదరాబాద్ ఆటగాడు ఠాకూర్ తిలక్ వర్మ మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నాడు. నాలుగు మ్యాచ్‌ల్లో కలిసి ముంబై జట్టు తరఫున ఇప్పటి వరకు కేవలం రెండే అర్ధశతకాలు నమోదయ్యాయంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సూర్యకుమార్ యాదవ్, రికెల్టన్ చెరో హాఫ్ సెంచరీ చేశారు. ప్రాక్టీస్‌లో గాయం కారణంగా లక్నోతో మ్యాచ్‌లో బరిలోకి దిగని రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంది. తాజా సీజన్లో 177 పరుగులు చేసిన సూర్యకుమార్ అదే ప్రదర్శన కొనసాగించాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఫర్వాలేదనిపిస్తున్నా... బ్యాటింగ్‌లో మరింత ధాటిగా ఆడాల్సిన అవసరముంది. లక్నోతో పోరులో వికెట్లు చేతిలో ఉన్నా... భారీ షాట్లు ఆడలేక ఇబ్బంది పడిన ముంబై... ప్రాక్టీస్‌లో తమ లోపాలపై దృష్టి పెట్టింది. బౌల్ట్, పాండ్యా, అశ్వని కుమార్, దీపక్ చాహర్, విఘ్నేశ్ పుతుర్ రూపంలో ముంబైకి మెరుగైన బౌలింగ్ దళమే ఉంది. బుమ్రా రాకతో ముంబై బౌలింగ్ దళం మరింత పటిష్టమైంది. కోహ్లిపైనే భారం... ఐపీఎల్ ఆరంభం నుంచి ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్ కోహ్లిపైనే బెంగళూరు ఎక్కువగా ఆధార పడుతోంది. సీజన్ ఆరంభ పోరులో అర్ధశతకంతో ఆకట్టుకున్న విరాట్... ఆ తర్వాత అదే జోరు కొనసాగించలేకపోతున్నాడు. మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ నుంచి మరింత బాధ్యతాయుత ఇన్నింగ్స్ రావాల్సి ఉంది. మిడిలార్డర్లో కెపె్టన్ రజత్ పాటీదార్‌తో పాటు దేవదత్ పడిక్కల్ ప్రభావం చూపలేకపోతున్నారు. వీరిద్దరు నిలకడ కనబర్చాల్సిన అవసరముంది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ మంచి టచ్‌లో ఉండగా... కృనాల్ పాండ్యా అటు బంతితో, ఇటు బ్యాట్‌తో రాణించాల్సిన అవసరముంది. గతంలో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన టిమ్ డేవిడ్ ఈ మ్యాచ్‌లో కీలకం కానున్నాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే గత సీజన్లతో పోల్చుకుంటే బెంగళూరు బౌలింగ్ దళం ఈసారి బలంగా కనిపిస్తోంది. ఆ్రస్టేలియా పేసర్ హాజల్‌వుడ్‌తో పాటు ఐపీఎల్లో అపార అనుభవమున్న భువనేశ్వర్, యశ్ దయాళ్ పేస్ భారాన్ని మోయనున్నారు. లివింగ్‌స్టోన్, రసిక్ సలామ్‌తో కలిసి కృనాల్ పాండ్యా స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నాడు. -
ఆర్సీబీతో మ్యాచ్.. ముంబై ఇండియన్స్‌కు డబుల్ గుడ్‌న్యూస్
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ కీలకపోరుకు సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా సోమవారం(ఏప్రిల్ 7) వాంఖడే స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబై తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ముందు ముంబై ఇండియన్స్‌కు డబుల్ గుడ్‌న్యూస్ అందింది. తొలి నాలుగు మ్యాచ్‌లకు గాయం కారణంగా దూరంగా ఉన్న ఆ జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. పునరాగామనానికి సిద్దమయ్యాడు.ఇప్పటికే ముంబై ఇండియన్స్ జట్టులోకి చేరిన బుమ్రా, సోమవారం ఆర్సీబీతో జరగనున్న మ్యాచ్‌లో ఆడనున్నాడు. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్ మహేల జయవర్ధనే ధ్రువీకరించాడు. జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌గా ఉన్నాడని, ఆర్సీబీతో మ్యాచ్‌లో ఆడే అవకాశముందని జయవర్ధనే తెలిపాడు. ఆర్సీబీతో మ్యాచ్.. ముంబై ఇండియన్స్‌కు డబుల్ గుడ్న్యూస్మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌కు దూరమైన ముంబై ఇండియన్స్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. రోహిత్ నెట్స్‌లో ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. దీంతో రేపటి మ్యాచ్‌లో అతడు ఆడటం ఖాయమైంది. కాగా ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించింది. దీంతో ఆర్సీబీతో మ్యాచ్ ముంబైకి కీలకం కానుంది. -
RCB Vs MI: ముంబై ఇండియన్స్‌కు శుభవార్త.. సింహం గర్జించేందుకు సిద్దమైంది..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఫైవ్ టైమ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఈ సీజన్లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో మూడు పరాజయాలు ఎదుర్కొని పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో ఉంది. ముంబై ఏప్రిల్ 7న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో ఇన్ ఫామ్ ఆర్సీబీని ఢీకొంటుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఆ జట్టుకు శుభవార్త తెలిసింది. గాయం కారణంగా గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్న స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా జట్టులో చేరాడు. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ తమ అధికారిక సోషల్‌మీడియా ఖాతాల ద్వారా వెల్లడించింది. బుమ్రా ఐపీఎల్ జర్నీకి సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేసి సింహం గర్జించేందుకు సిద్దంగా ఉందని క్యాప్షన్ జోడించింది. View this post on Instagram A post shared by Mumbai Indians (@mumbaiindians)ఈ వీడియోలో బుమ్రా భార్య సంజనా తమ కొడుకు అంగద్‌కు తండ్రి ఐపీఎల్ ప్రస్తానాన్ని వివరిస్తుంది. 2013లో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన బుమ్రా నాటి నుంచి ముంబై సాధించిన అనేక విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. బుమ్రా ముంబై ఇండియన్స్ తరఫున 133 మ్యాచ్‌లు ఆడి 165 వికెట్లు తీశాడు.బుమ్రా ఈ ఏడాది ఆరంభంలో సిడ్నీలో జరిగిన చివరి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సందర్భంగా గాయపడ్డాడు (వెన్ను సమస్య). ఫలితంగా అతను భారత్ ఛాంపియన్‌గా నిలిచిన ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమ్యాడు. గాయానికి సంబంధించి శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత బుమ్రా దాదాపు రెండు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. ఇటీవలే అతను బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రిపోర్ట్ చేశాడు. కొన్ని రోజులు అక్కడ రీహ్యాబ్‌లో ఉండిన బుమ్రా.. తాజాగా ముంబై ఇండియన్స్ క్యాంప్‌లో చేరాడు. బుమ్రా జట్టులో చేరినా ఏప్రిల్ 7న ఆర్సీబీతో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉండడని తెలుస్తుంది. బుమ్రా విషయంలో రిస్క్ తీసుకోలేమని చెబుతున్న బీసీసీఐ మరికొన్ని రోజులు అతన్ని అబ్జర్వేషన్లోనే ఉంచాలని భావిస్తుంది. ఏప్రిల్ 13న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌కు బుమ్రా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. బుమ్రాను ముంబై ఇండియన్స్ ఈ సీజన్ మెగా వేలానికి ముందు రూ. 18 కోట్లకు రీటైన్ చేసుకున్న విషయం తెలిసిందే.ఈ సీజన్లో బుమ్రా లేని లోటు ముంబై ఇండియన్స్‌లో కొట్టొచ్చినట్లు కనిపించింది. యువ బౌలర్లు విజ్ఞేశ్ పుతుర్, అశ్వనీ కుమార్ సత్తా చాటినా బుమ్రా స్థాయిలో ప్రభావం చూపలేకపోయారు. సీనియర్ పేసర్లు ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్ కూడా తమ సామర్థ్యం మేరకు రాణించలేకపోయారు. నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా బంతితో సత్తా చాటినా (4-0-36-5) ముంబై ఇండియన్స్‌ను గెలిపించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో ముంబై వేగంగా పరుగులు సాధించలేక 12 పరుగుల తేడాతో ఓడింది. హర్దిక్ పాండ్యా చివరి వరకు క్రీజ్‌లో ఉన్నా ముంబైని గెలిపించలేకపోయాడు. చివరి ఓవర్లో సాంట్నర్‌కు స్ట్రయిక్ ఇవ్వకుండా హార్దిక్ ఓవరాక్షన్ చేశాడు. స్ట్రయిక్ అట్టిపెట్టుకుని అతనైనా పరుగులు రాబట్టాడా అంటే అదీ లేదు. వరుసగా రెండు డాట్ బాల్స్ చేసి ముంబై ఓటమిని ఖరారు చేశాడు. బుమ్రా రాకతోనైనా ముంబై ఫేట్ మారుతుందేమో చూడాలి. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ కూడా ఆడలేదు. గాయం కారణంగా హిట్‌మ్యాన్ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. -
బుమ్రా... మరికొన్ని రోజుల తర్వాతే...
ఐపీఎల్ తాజా సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టుకు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సేవలు లభించేందుకు మరికొన్ని రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత జనవరిలో ఆ్రస్టేలియా పర్యటన నుంచి వెన్ను నొప్పితో బాధపడుతున్న బుమ్రా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. వేగంగా కోలుకుంటున్న బుమ్రా ఐపీఎల్లో కనీసం మరో రెండు మ్యాచ్‌లు ముంబై జట్టుకు దూరంగా ఉండనున్నాడు.బుమ్రాకు పూర్తిస్థాయి ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించిన తర్వాత... బీసీసీఐ మెడికల్ టీమ్ బుమ్రా ఫిట్‌నెస్‌పై సంతృప్తి వ్యక్తం చేస్తేనే అతను ఐపీఎల్లో ఆడతాడు. పూర్తి ఫిట్నెస్ సాధించాకే మళ్లీ మైదానంలో అడుగు పెట్టాలని బుమ్రా భావిస్తున్నాడు. వచ్చే జూన్‌లో ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్‌లో భారత్ పర్యటించనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్లో బుమ్రా పునరాగమనంపై తొందరపడకూడదని బీసీసీఐ భావిస్తోంది. ముంబై తరఫున బుమ్రా ఆడలేకపోతుండటంతో... సత్యనారాయణ రాజు, విఘ్నేశ్, అశ్వని కుమార్లాంటి యువ ఆటగాళ్లకు ఐపీఎల్లో అరంగేట్రం చేసే అవకాశం లభించింది -
IPL 2025: ముంబై ఇండియన్స్‌కు కొనసాగనున్న కష్టాలు..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌ను ముంబై ఇండియన్స్ తమ ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే మొదలుపెట్టింది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడగా.. ఇందులో బుమ్రా లేని లోటు కొట్టిచ్చినట్లు కనిపించింది. ఈ మూడు మ్యాచ్‌ల్లో ముంబై తొలి రెండు మ్యాచ్‌లు ఓడి.. ఆతర్వాతి మ్యాచ్‌లో గెలిచింది.ముందుగా జరిగిన ప్రచారం ప్రకారం బుమ్రా తొలి మూడు మ్యాచ్‌ల తర్వాత అందుబాటులోకి రావాల్సి ఉండింది. అయితే బుమ్రా రాక మరింత ఆలస్యమవుతుందని తాజా నివేదికలు చెబుతున్నాయి. బుమ్రా గాయం ఊహించిన దానికంటే తీవ్రమైందని బీసీసీఐ వర్గాల సమాచారం. బుమ్రా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పటికీ.. అక్కడి వైద్యులు రిస్క్ తీసుకోదలచుకోలేదని తెలుస్తుంది. బుమ్రాపై అతిగా ఒత్తిడి తెస్తే మొదటికే మోసం రావచ్చని వారు భావిస్తున్నారట. ప్రస్తుతం వైద్యులు బుమ్రాకు స్ట్రెస్ ఫ్రాక్చర్ కాకుండా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారట. ఐపీఎల్ ఎంట్రీకి బుమ్రా కూడా తొందరపడటం లేదని తెలుస్తుంది. సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్‌లో బుమ్రా చాలా జాగ్రత్తగా ఉన్నాడని సమాచారం. ఒకవేళ బుమ్రా తొందరపడి ఐపీఎల్లో ఆడాలనుకుంటే గాయం తీవ్రతరమై దీర్ఘకాలిక నష్టం సంభవించే ప్రమాదం ఉంది. అందుకే బుమ్రా విషయంలో బీసీసీఐ రిస్క్ తీసుకోదలచుకోలేదని తెలుస్తుంది. దీన్ని బట్టి ఐపీఎల్-2025లో బుమ్రా ఎంట్రీ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. బుమ్రా తిరిగి ఎప్పుడు బరిలోకి దిగుతాడన్న విషయాన్ని బీసీసీఐ అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తే మాత్రం బుమ్రా మే నెలలోనే ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అప్పటికి ముంబై ఇండియన్స్ 10 మ్యాచ్‌లకు పైగా ఆడేసి ఉంటుంది. బుమ్రా గైర్హాజరీ ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను తప్పక ప్రభావితం చేస్తుంది. ఇప్పటికే ముంబై ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట ఓడింది. ఒకవేళ బుమ్రా మే నెలలో ఎంట్రీ ఇచ్చినా నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడే అవకాశం ఉంటుంది. ముంబై ఇండియన్స్ బుమ్రా లేకపోయినా తదుపరి మ్యాచ్‌ల్లో సత్తా చాటితే ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశం ఉంటుంది. అప్పుడు బుమ్రా సేవలను ఆ జట్టు ప్లే ఆఫ్స్‌లో వినియోగించుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితులను చూస్తే ముంబై ఇండియన్స్‌కు అంత సీన్ లేదనిపిస్తుంది. ఆ జట్టులో సమతుల్యత లోపించినట్లు కనిపిస్తుంది. బౌలింగ్‌లో బౌల్ట్ మినహా ఆ జట్టులో సీనియర్ ఎవరూ లేరు. కొత్తగా వచ్చిన బౌలర్లతో ఆ జట్టు కాలం వెల్లదీస్తుంది. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో యువ పేసర్ అశ్వనీ కుమార్ సత్తా చాటడంతో ముంబై ఇండియన్స్ సీజన్ తొలి విజయం నమోదు చేసింది. బ్యాటింగ్‌లో కూడా ఆ జట్టు అంతంతమాత్రంగానే ఉంది. రోహిత్ శర్మ పూర్తిగా ఫామ్ కోల్పోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో ముంబై ఇండియన్స్ ఏ మేరకు రాణిస్తుందో చూడాలి. కాగా, బుమ్రా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా గాయపడిన విషయం తెలిసిందే. అదే గాయం కారణంగా అతను ఛాంపియన్స్ ట్రోఫీ కూడా దూరమయ్యాడు. -
బుమ్రాతో గొడవ పడ్డ ఆటగాడికి జాక్‌పాట్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాతో గొడవ పడ్డ ఆస్ట్రేలియా యువ ఆటగాడు సామ్ కొన్‌స్టాస్‌కు జాక్‌పాట్ తగిలింది. 2025-26 సంవత్సరానికి గానూ క్రికెట్ ఆస్ట్రేలియా కొన్‌స్టాస్‌కు సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చింది. కొన్‌స్టాస్‌తో పాటు వివాదాస్పద బౌలింగ్ శైలి కలిగిన మాథ్యూ కుహ్నేమన్, ఆల్‌రౌండర్ బ్యూ వెబ్‌స్టర్ కూడా కొత్తగా క్రికెట్ ఆస్ట్రేలియా సెంట్రల్ కాంట్రాక్ట్ పొందారు. ఈ ముగ్గురి చేరికతో క్రికెట్ ఆస్ట్రేలియా సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల సంఖ్య 23కు చేరింది. కొన్‌స్టాస్, కుహ్నేమన్, వెబ్‌స్టర్ ఇటీవల ఆస్ట్రేలియా తరఫున అద్భుత ప్రదర్శనలు చేశారు. ఈ కారణంగా వారు క్రికెట్ ఆస్ట్రేలియా వార్షిక కాంట్రాక్ట్ పొందారు. కొన్‌స్టాస్, వెబ్‌స్టర్ భారత్‌తో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సత్తా చాటగా.. కుహ్నేమన్ ఇటీవల జరిగిన శ్రీలంక సిరీస్‌లో చెలరేగిపోయాడు. ఆ సిరీస్‌లో కుహ్నేమన్ 2 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీశాడు. ఫలితంగా ఆసీస్ శ్రీలంకను వారి సొంతగడ్డపైఏ 2-0 తేడాతో ఓడించింది. కొన్‌స్టాస్ విషయానికొస్తే.. ఇతగాడు తన టెస్ట్ కెరీర్‌ను ఘనంగా ప్రారంభించాడు. అరంగేట్రం ఇన్నింగ్స్‌లోనే బుమ్రా లాంటి వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్‌ను ఎదుర్కొని హాఫ్ సెంచరీ చేశాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత కొన్‌స్టాస్ చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ చేయనప్పటికీ.. బుమ్రాతో మాటల యుద్దం కారణంగా బాగా పాపులర్ అయ్యాడు.వెబ్‌స్టర్ విషయానికొస్తే.. ఇతగాడు కూడా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లోనే అరంగేట్రం చేశాడు. వెబ్‌స్టర్ కూడా తన తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతను బంతితో కూడా రాణించాడు. మిచెల్ మార్ష్, కెమారూన్ గ్రీన్ గాయపడటంతో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన వెబ్‌స్టర్ తన తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటి క్రికెట్ ఆస్ట్రేలియా సెంట్రల్ కాంట్రాక్ట్ పట్టాడు.2025-26 సంవత్సరానికి గానూ సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ఆసీస్ ఆటగాళ్లు..పాట్ కమిన్స్, స్టీవ్ స్మిత్, నాథన్ లియాన్, అలెక్స్ కారీ, సామ్ కొన్‌స్టాస్, జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్, జై రిచర్డ్సన్, స్కాట్ బోలాండ్, లాన్స్ మోరిస్, మాథ్యూ కుహ్నేమన్, ఆడమ్ జంపా, ట్రావిస్ హెడ్, మాట్ షార్ట్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మార్నస్ లబూషేన్, ఉస్మాన్ ఖవాజా, మిచెల్ మార్ష్, బ్యూ వెబ్‌స్టర్, కామెరూన్ గ్రీన్, జేవియర్ బార్ట్లెట్ -
ముంబై ఇండియన్స్‌కు గుడ్ న్యూస్.. ప్రాక్టీస్ మొదలు పెట్టిన బుమ్రా
ఐపీఎల్-2025లో వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్‌కు ఓ గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు స్టార్ పేసర్, టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమవుతున్నాడు. వెన్ను గాయంతో బాధపడుతున్న బుమ్రా ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావసం పొందుతున్నాడు.ఈ క్రమంలో జస్ప్రీత్ నెట్స్‌లో బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. తాజాగా బుమ్రా ప్రాక్టీస్‌కు సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. దీంతో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆఖరి టెస్టులో గాయపడిన బుమ్రా.. అప్పటి నుంచి ఆటకు దూరంగా ఉంటున్నాడు.ఈ క్రమంలోనే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు బుమ్రా దూరమయ్యాడు. అయితే బుమ్రా రీ ఎంట్రీపై ఇంకా క్లారిటీ లేదు. బుమ్రా ఫిట్‌నెస్‌పై తాజాగా ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ జయవర్దనే కూడా స్పందించాడు. "బుమ్రా తన రోజూ ప్రాక్టీస్ చేస్తున్నాడు. త్వరలోనే ఆ స్పీడ్ స్టార్ కోలుకుంటాడని ఆశిస్తున్నాము. ఎప్పుడొస్తాడు అనేది మాత్రం చెప్పలేము" అని జయవర్దనే పేర్కొన్నాడు. కాగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లోని వైద్యబృందం బుమ్రాకు ఈ వారంలో ఫిట్నెస్ టెస్టు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ టెస్టును బుమ్రా క్లియర్ చేసినట్లైతే త్వరలోనే ముంబై జట్టులో బుమ్రా చేరే అవకాశముంది. బుమ్రా గతేడాది అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. టీమిండియా టీ20 వరల్డ్‌కప్ గెలవడంలో బుమ్రాదే కీలక పాత్ర. ఆ తర్వాత బీజీటీని భారత్ కోల్పోయినప్పటికి బుమ్రా మాత్రం 32 వికెట్లతో లీడిగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. దీంతో అతడికి 2024 ఏడాదికి గాను ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు వరించాయి. ఇక ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది.చదవండి: RR VS CSK: చివరి ఓవర్లో ధోని ఔట్.. సీఎస్కే ఫ్యాన్ గర్ల్ రియాక్షన్ చూడండి..!Bumrah has started bowling in NCA. Don't know when he will get the clearance but feeling better after watching this clip. pic.twitter.com/FTpnuVoJoW— R A T N I S H (@LoyalSachinFan) March 30, 2025 -
ముగ్గురు టీమిండియా కెప్టెన్లు.. అది నా అదృష్టం: హార్దిక్ పాండ్యా
జట్టులో ‘ముగ్గురు కెప్టెన్ల’ను కలిగి ఉండటం తనకు అదనపు బలమని ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యా (Hardik Pandya) హర్షం వ్యక్తం చేశాడు. భిన్న ఫార్మాట్లలో టీమిండియాను ముందుకు నడిపించిన వ్యక్తుల నుంచి తాను తప్పక సలహాలు, సూచనలు తీసుకుంటానని పేర్కొన్నాడు. అంతిమంగా జట్టును విజేతగా నిలపడమే తమ లక్ష్యమని హార్దిక పాండ్యా పేర్కొన్నాడు.ఈసారి తాను రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నానన్న హార్దిక్ పాండ్యా... ఈసారి అభిమానుల నుంచి సానుకూల స్పందన మాత్రమే కోరుకుంటున్నానని తెలిపాడు. కెప్టెన్‌గా సూర్యకాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పద్దెనిమిదవ ఎడిషన్ మార్చి 22 నుంచి ఆరంభం కానున్న విషయం తెలిసిందే. కోల్‌కతా నైట్ రైడర్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుండగా.. ముంబై మార్చి 23న చెన్నై సూపర్ కింగ్స్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.అయితే, గతేడాది స్లో ఓవర్ రేటు కారణంగా హార్దిక్ పాండ్యాపై ఒక మ్యాచ్ నిషేధం పడగా.. ఐపీఎల్-2025 ఆరంభ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ ముంబై కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన పాండ్యా.. ఈ ఏడాది తాము కచ్చితంగా అనుకున్న ఫలితాన్ని రాబడతామని ధీమా వ్యక్తం చేశాడు.రోజురోజుకూ పెరుగుతుందే తప్ప తగ్గదు‘‘నేను చాలా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నా. అప్పుడు కూడా గెలుస్తామనే నేను విశ్వసించాను. అయితే, నేను ఇటీవలే చాంపియన్స్ ట్రోఫీలో ఆడాను. నా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది, కాన్ఫిడెన్స్ గురించి నన్ను అడిగితే.. రోజురోజుకూ అది పెరుగుతుందే తప్ప తగ్గదు.ముగ్గురు టీమిండియా కెప్టెన్లు.. అది నా అదృష్టంఇక మా జట్టులో నాతో పాటు మరో ముగ్గురు కెప్టెన్లు ఉండటం ఒక రకంగా నా అదృష్టం అని చెప్పాలి. నాకు అవసరమైనపుడు వారి అనుభవాన్ని ఉపయోగించుకుంటా. టీమిండియాను మూడు ఫార్మాట్లలో భిన్న రీతిలో నడిపించిన వారి అనుభవం నాకు కచ్చితంగా అదనపు బలమే.నాకు వారు ఎల్లవేళలా మద్దతుగా ఉంటారు. క్లిష్ట పరిస్థితుల్లో నా భుజం తట్టి నన్ను ముందుకు నడిపిస్తారు. మేమంతా కలిసి అనుకున్న రీతిలో జట్టును ముందుకు తీసుకువెళ్తాం’’ అని హార్దిక్ పాండ్యా బుధవారం నాటి మీడియా సమావేశంలో పేర్కొన్నాడు.కాగా టీమిండియా వన్డే, టెస్టు సారథి రోహిత్ శర్మతో పాటు.. టెస్టుల్లో రోహిత్ గైర్హాజరీలో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న జస్ప్రీత్ బుమ్రా.. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.ముంబై రంగులు తప్ప ఇంకేమీ కనిపించవద్దుఇదిలా ఉంటే.. ముంబై అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘నేను టాస్ కోసం వెళ్లినపుడు.. బ్యాటింగ్‌కి వెళ్లినపుడు నన్ను చీర్ చేయండి. సిక్సర్ బాదితే గట్టిగా అరవండి. వాంఖడే స్టేడియంలో నాకు ముంబై రంగులు తప్ప ఇంకేమీ కనిపించవద్దు’’ అని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. కాగా ఐదుసార్లు ట్రోఫీ అందించిన రోహిత్ శర్మను తప్పించి ముంబై ఫ్రాంఛైజీ గతేడాది పాండ్యాకు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.అయితే, అతడి రాకతో రోహిత్, బుమ్రా, సూర్య అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు వచ్చాయి. ముంబై గతేడాది దారుణంగా విఫలమైన నేపథ్యంలో.. ఆటగాళ్ల మధ్య సమన్వయ లోపమే ఇందుకు కారణమనే విమర్శలు వచ్చాయి. గతేడాది ముంబై పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచి పాయింట్ల పట్టికలో పదో స్థానంలో నిలిచింది. చదవండి: BCCI: విరాట్ కోహ్లి ఘాటు విమర్శలు.. స్పందించిన బీసీసీఐ -
IPL: ‘గతేడాది ముంబై గెలవాల్సింది.. ఈసారీ ఆ జట్టు సూపర్.. కానీ..’
ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఆటగాళ్లు ఐకమత్యంగా ఉంటే ఆ జట్టును ఎవరూ ఓడించలేరని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. గతం తాలుకు చేదు అనుభవాలు, భేషజాలను వదిలేసి ‘స్టార్లంతా’ ఒకటిగా ముందుడుగు వేయాలని సూచించాడు. యాజమాన్యం సైతం ఈ విషయంలో మరింత చొరవ చూపాలని భజ్జీ విజ్ఞప్తి చేశాడు.కాగా ఐపీఎల్-2024 (IPL)లో ముంబై ఇండియన్స్ అనూహ్య నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్ పాండ్యాను అందలమెక్కించింది. తమకు ఐదుసార్లు టైటిల్ అందించిన రోహిత్ శర్మ (Rohit Sharma)పై వేటు వేసి.. పాండ్యాను కెప్టెన్‌ను చేసింది. దీంతో అభిమానులు సైతం ముంబై ఓడిపోవాలని కోరుకుంటూ.. పాండ్యాను తీవ్ర స్థాయిలో ట్రోల్ చేశారు.ఇక రోహిత్‌తో పాటు టీమిండియా స్టార్లు జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ కూడా పాండ్యాకు ప్రాధాన్యం ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయారనే వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్లుగానే మైదానంలో వీరి మధ్య సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఫలితంగా పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ కేవలం నాలుగే గెలిచిన ముంబై.. పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది.విభేదాలు పక్కనపెట్టాలిఅయితే, ఈసారి విభేదాలన్నీ పక్కనపెట్టి ముంబై ఆటగాళ్లు గనుక కలిసికట్టుగా ఉంటే విజయం వారిదేనని హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘జట్టు ప్రదర్శన ఆధారంగానే కెప్టెన్ పనితీరును అంచనా వేస్తారు.అతడు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్నపుడు.. జట్టు మొత్తం రాణించింది. టైటిల్ గెలిచింది. అందుకే అతడు మంచి కెప్టెన్ అయ్యాడు. నిజానికి ముంబై జట్టు గతేడాది పటిష్టంగా ఉంది. ట్రోఫీ గెలవాల్సింది కూడా!బౌలింగ్ విభాగంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నా.. బ్యాటింగ్‌లో మాత్రం బలంగా ఉంది. అయినా దారుణంగా ఓడిపోయింది. కలిసికట్టుగా ఉన్న జట్లే విజయం సాధిస్తాయి. గతం గతః.. ఆటగాళ్లు తమ మధ్య ఉన్న విభేదాలు పక్కనపెట్టాలి. ఈసారి ముంబై జట్టు మిగతా జట్ల కంటే పటిష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా వారికి అద్భుతమైన బ్యాటర్లు ఉన్నారు. సరికొత్తగా ఈ సీజన్‌ను ఆరంభించి సమిష్టిగా రాణిస్తే జట్టుకు ఎదురే ఉండదు’’ అని భజ్జీ చెప్పుకొచ్చాడు.ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ జట్టు- వారి ధరజస్ప్రీత్ బుమ్రా (రూ. 18 కోట్లు), హార్దిక్ పాండ్యా (కెప్టెన్- రూ.16.35 కోట్లు), సూర్యకుమార్ యాదవ్ (రూ. 16.35 కోట్లు), రోహిత్ శర్మ (రూ. 16.30 కోట్లు), తిలక్ వర్మ (రూ. 8 కోట్లు) , ట్రెంట్ బౌల్ట్ (రూ.12.50 కోట్లు), దీపక్ చహర్ (రూ. 9.25 కోట్లు), నమన్ ధీర్ (రూ.5.25 కోట్లు), విల్ జాక్స్ (రూ.5.25 కోట్లు), ఘజన్ఫర్ (రూ. 4.80 కోట్లు- గాయం వల్ల దూరం- అతడి స్థానంలో ముజీబ్ ఉర్ రెహమాన్)..మిచెల్ సాంట్నర్ (రూ. 2 కోట్లు), ర్యాన్ రికెల్టన్ (రూ. 1 కోటి), రీస్ టోప్లే (రూ. 75 లక్షలు), లిజాద్ విలియమ్స్ (రూ. 75 లక్షలు), రాబిన్ మిన్జ్ (రూ.65 లక్షలు) , కరణ్ శర్మ (రూ.50 లక్షలు), అర్జున్ టెండూల్కర్ (రూ.30 లక్షలు), విఘ్నేశ్ (రూ.30 లక్షలు), సత్యనారాయణ (రూ. 30 లక్షలు), రాజ్ అంగద్ (రూ. 30 లక్షలు), శ్రీజిత్ కృష్ణన్ (రూ. 30 లక్షలు), అశ్వని కుమార్ (రూ. 30 లక్షలు), బెవాన్ జాకబ్స్ (రూ. 30 లక్షలు). చదవండి: IPL 2025: కెప్టెన్ల మార్పు.. ఎవరి జీతం ఎంత?.. అతి చవగ్గా దొరికిన సారథి అతడే! -
వాళ్లను చూస్తేనే చిరాకు.. అసలేం చేస్తున్నార్రా బాబూ!: డేల్ స్టెయిన్ ఫైర్
నవతరం ఫాస్ట్ బౌలర్ల తీరుపై సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ (Dale Steyn) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్ చేయడంలో దారుణంగా విఫలమవుతున్నారని.. ఒత్తిడిలో చిత్తైపోయి పరుగులు సమర్పించుకుంటున్నారని విమర్శించాడు. కనీసం ఒక్కసారి కూడా ఫీల్డింగ్ మార్చకుండానే ఓవర్ పూర్తి చేస్తున్నారని.. ఇదంతా చూస్తే తనకు చిర్రెత్తుకొస్తుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.అయితే, టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah), సౌతాఫ్రికా స్పీడ్‌స్టర్ కగిసో రబడ (Kagiso Rabada) మాత్రం ఇందుకు మినహాయింపు అని స్టెయిన్ పేర్కొన్నాడు. ఈ మేరకు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోలో నేటి తరం ఫాస్ట్ బౌలర్ల గురించి మాట్లాడుతూ.. ‘‘ఈరోజుల్లో అంతర్జాతీయ స్థాయి పేసర్ల తీరు నాకు నచ్చడం లేదు.వాళ్లను చూస్తేనే చిరాకు.. ఒక్కసారి కూడా ఫీల్డ్ మార్చకుండానే ఓవర్ పూర్తి చేసేసి వెళ్తున్నారు. పదేళ్లుగా కెరీర్ కొనసాగిస్తున్న వారు కూడా తమకేమీ పట్టదన్నట్లుగా చేతులు దులిపేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్లను చూసినపుడు నాకైతే జట్టు పీక్కోవాలనిపిస్తుంది. చిరాకు వస్తుంది. ఇంతకంటే గొప్ప బౌలర్లను మనం చూడలేమా? అని నా మనసు ఆవేదన చెందుతుంది’’ అని డేల్ స్టెయిన్ చెప్పుకొచ్చాడు.బుమ్రా, రబడ మాత్రం వేరుఅదే విధంగా.. ‘‘బుమ్రా మాత్రం ఇందుకు అతీతం. అతడు పరిపూర్ణమైన ప్యాకేజ్లాంటివాడు. కగిసో రబడ కూడా బుమ్రా మాదిరే పర్ఫెక్ట్. వాళ్లిద్దరు ఎలాంటి సమయంలోనైనా బౌలింగ్ చేయగలగరు. వికెట్లూ పడగొట్టగలరు. నిజంగా వాళ్లిద్దరు బంగారం. కెప్టెన్‌కు సగం పని తగ్గించేస్తారు.ఇలాంటి వారి సంఖ్య పెరిగితేనే.. ఫాస్ట్ బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా ఉంటుంది. గంటకు 155 కిలో మీటర్ల వేగంతో బౌలింగ్ చేశారా? లేదా? అన్నది ముఖ్యం కాదు. మనలో పది రకాల నైపుణ్యాలు ఉండవచ్చు. కానీ సరైన సమయంలో.. సరైన విధంగా స్పందించి కెప్టెన్ చెప్పిన పని పూర్తి చేస్తేనే దేనికైనా విలువ’’ అని స్టెయిన్ పేర్కొన్నాడు.70 శాతం మంది బౌలర్ల తీరు అలాగేఇక ఇదే షోలో స్టెయిన్‌తో గొంతు కలిపిన న్యూజిలాండ్ పేస్ దిగ్గజం షేన్ బాండ్.. ‘‘ఈరోజుల్లో 70 శాతం మంది బౌలర్లకు అసలు తామేం చేస్తున్నామో అన్న స్పృహ ఉండటం లేదు. కెప్టెన్లు మరింత చొరవ తీసుకోవాలి. వారి నుంచి ఎలాంటి ప్రదర్శన కోరుకుంటాన్నారో కచ్చితంగా చెప్పాలి. ఫీల్డింగ్ సెట్ చేసే విషయంలోనూ నిక్కచ్చిగా వ్యవహరించాలి’’ అని అభిప్రాయపడ్డాడు. బుమ్రా రీఎంట్రీ ఎప్పుడో?కాగా ఇటీవల జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి వెన్నునొప్పి కారణంగా బుమ్రా దూరమైన విషయం తెలిసిందే. అయితే, ప్రధాన పేసర్ లేకుండానే టీమిండియా ఈ మెగా వన్డే టోర్నీలో విజేతగా అవతరించింది. స్పిన్‌కు అనుకూలించే దుబాయ్ పిచ్‌పై అజేయ రికార్డుతో ట్రోఫీని ముద్దాడింది. ఇక బుమ్రా ఇప్పుడిప్పుడే గాయం నుంచి కోలుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ ఆరంభ మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉండటం లేదు. మరోవైపు.. రబడ చాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. ఈ ఈవెంట్లో సౌతాఫ్రికా న్యూజిలాండ్ చేతిలో ఓడి సెమీస్‌లోనే ఇంటిబాటపట్టింది.చదవండి: నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ అతడే.. మూడు ఫార్మాట్లలోనూ బెస్ట్: కోహ్లి -
రోహిత్, కోహ్లి, బుమ్రా లేకున్నా భారత్ గెలిచింది: టీమిండియా దిగ్గజం
పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా దూసుకుపోతోంది. తొమ్మిది నెలల వ్యవధిలో రెండు ఐసీసీ ట్రోఫీలు గెలవడమే ఇందుకు నిదర్శనం. రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్సీలో గతేడాది టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత్.. ఇటీవల ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy)ని సొంతం చేసుకుంది.ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)జట్టుతో లేకపోయినా అద్భుత ప్రదర్శనతో ఆఖరి వరకు అజేయంగా నిలిచింది. అంతకు ముందు పొట్టి వరల్డ్‌కప్ టోర్నీలో పరాజయమన్నదే లేకుండా ట్రోఫీని ముద్దాడింది. ఈ రెండు ఐసీసీ ఈవెంట్లలో వంద శాతం విజయాలతో రోహిత్ సేన తమ సత్తా చాటింది.అత్యంత పటిష్టంగాఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం, మాజీ కెప్టెన్ సునిల్ గావస్కర్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. భారత జట్టు ప్రస్తుతం అత్యంత పటిష్టంగా ఉందన్న సన్నీ.. బెంచ్ స్ట్రెంత్‌లోనూ మిగతా జట్లతో పోలిస్తే ముందు వరుసలో ఉందని పేర్కొన్నాడు. వ్యక్తులకు అతీతంగా జట్టుగా భారత్ ఎదిగిందని.. రోహిత్, కోహ్లి, బుమ్రా లాంటి వాళ్లు లేకపోయినా గెలవగల స్థాయికి చేరుకుందని అన్నాడు.రోహిత్, కోహ్లి లేకుండానేఈ మేరకు ‘మిడ్-డే’కు రాసిన కాలమ్‌లో.. ‘‘బుమ్రా లేకుండానే టీమిండియా చాంపియన్స్ ట్రోఫీలో అద్భుత విజయం సాధించిన తర్వాత.. వ్యక్తులను మించి టీమిండియా స్థాయి పెరిగిందని అర్థమవుతోంది. గతంలో కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లేకుండానే టీమిండియా చాలాసార్లు గెలిచింది.అయితే, వాళ్లిద్దరు ఉంటే జట్టు మరింత పటిష్టంగా మారినట్లు కనిపిస్తుంది. ఆస్ట్రేలియా పర్యటనలో జస్ప్రీత్ బుమ్రాపై టీమిండియా ఎక్కువగా ఆధారపడింది. ఇలాంటివి అరుదుగా జరుగుతూ ఉంటాయి.అయితే, అతడు లేకుండానే ఆస్ట్రేలియా వెలుపల స్వల్ప టార్గెట్లను కూడా టీమిండియా డిఫెండ్ చేసుకుంది. ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై టీ20, వన్డే సిరీస్‌లలో టీమిండియా పరిపూర్ణ విజయాలు సాధించింది. భారత క్రికెట్ జట్టుతో పాటు బెంచ్ కూడా ఎంత బలంగా ఉందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు’’ అంటూ గావస్కర్ టీమిండియాపై ప్రశంసల జల్లు కురిపించాడు. రోహిత్, కోహ్లి లేకుండానే యువ ఆటగాళ్లు టీ20 ఫార్మాట్లో భారత్‌కు అద్భుత విజయాలు అందిస్తున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నాడు.ఏకంగా 17 గెలిచిన సూర్య సేనకాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత రోహిత్- కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అంతకుముందు కూడా విశ్రాంతి పేరిట ఈ దిగ్గజాలు పలు మ్యాచ్‌లకు దూరమయ్యారు. ఇక రోహిత్- కోహ్లి రిటైర్మెంట్ తర్వాత టీమిండియా 20 టీ20 మ్యాచ్‌లు ఆడితే.. అందులో ఏకంగా 17 గెలవడం విశేషం. సూర్యకుమార్ సేన విజయాల శాతం 85గా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే గావస్కర్ పైవిధంగా స్పందించినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ-2025కి పాకిస్తాన్ ఆతిథ్యమివ్వగా.. రోహిత్ సేన మాత్రం ఈ వన్డే టోర్నీలో తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే ఆడింది. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లను ఓడించిన భారత్.. సెమీస్‌లో ఆస్ట్రేలియా, ఫైనల్లో న్యూజిలాండ్‌లపై గెలిచి చాంపియన్‌గా నిలిచింది. ఇక సెమీస్ మ్యాచ్‌లో కోహ్లి.. ఫైనల్లో రోహిత్ శర్మ అద్భుత అర్ధ శతకాలతో జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు.చదవండి: నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ అతడే.. మూడు ఫార్మాట్లలోనూ బెస్ట్: కోహ్లి -
టీమిండియా స్టార్లు.. హార్డ్ హిట్టర్లు, దిగ్గజ పేసర్లు.. ముంబై ఈసారైనా..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన మేటి జట్టుగా ముంబై ఇండియన్స్‌కు పేరుంది. ఈ ఘనత సాధించిన తొలి జట్టుగానూ ముంబై రికార్డు చెక్కు చెదరకుండా ఉంది. అయితే, గత కొంతకాలంగా అంబానీల ఫ్రాంఛైజీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. గతేడాది ఏకంగా పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. అయితే, మెగా వేలంలో తెలివైన కొనుగోళ్లతో మునుపటి వైభవం సాధించేలా ప్రణాళికలు రచించింది.విదేశీ, భారత్ ఆటగాళ్ల తో జట్టుని పునర్నిర్మించే ప్రయత్నం చేసింది. జస్ప్రీత్ బుమ్రాకు తోడుగా న్యూ జిలాండ్ వెటరన్ ట్రెంట్ బౌల్ట్‌ను రూ. 12.50 కోట్లకు కొనుగోలు చేసి బలమైన బౌలింగ్ ని రూపొందించే ప్రయత్నం చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆల్ రౌండర్ దీపక్ చాహర్‌ను కూడా జత చేసి తమ బౌలింగ్ యూనిట్‌ను మరింత బలోపేతం చేసుకుంది.మిచెల్ సాంట్నర్, కర్ణ్ శర్మలను చేర్చుకోవడంతో స్పిన్ విభాగం కూడా మరింత బలపడింది. ఇక విల్ జాక్స్, బెవాన్ జాకబ్స్, ర్యాన్ రికెల్టన్ లతో బ్యాటింగ్‌కు మునుపటి పదును సమకూర్చారు. అయితే భారత్ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇటీవల కాలంలో ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. విదేశీ ఆటగాళ్లతో పాటు, రాబిన్ మింజ్, విఘ్నేష్ పుత్తూర్ మరియు రాజ్ బావా వంటి వారిని కనుగోలు చేసి యువ జట్టుని నిర్మించే దిశగా పావులు కదిపింది. అందువల్ల, ఐదుసార్లు ఛాంపియన్లుగా నిలిచిన ఈ జట్టు అన్ని స్థావరాలను కవర్ చేసే ఆల్ రౌండ్ జట్టును నిర్మించడానికి తమ పర్స్‌ను సమర్థవంతంగా ఉపయోగించింది.ముంబై ఇండియన్స్‌లో ప్రధాన ఆటగాళ్లుట్రెంట్ బౌల్ట్ ఈ ఎడమచేతి వాటం సీమర్ మూడు సంవత్సరాల తర్వాత ఐపీఎల్ లో మళ్ళీ ముంబై ఇండియన్స్‌కు తిరిగి ఆడబోతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా వివిధ టీ20 లీగ్‌లలో ముంబై ఇండియన్స్‌కు చెందిన జట్ల తరపున ఆడుతూనే ఉన్నాడు. బౌల్ట్ పవర్‌ప్లేలో రాణించడంలో మంచి దిట్ట. బుమ్రాతో పాటు ముంబై బౌలింగ్ ని ప్రారంభించే అవకాశముంది.ర్యాన్ రికెల్టన్దక్షిణాఫ్రికాలో బాగా రాణిస్తున్న స్టార్లలో ఒకరు గా ఖ్యాతి గడించిన రికెల్టన్ ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ లో తన బ్యాటింగ్ తో పరుగుల వర్షం కురిపించాడు. ఈ 28 ఏళ్ల వికెట్ కీపర్ ను మరో క్వింటన్ డి కాక్ గా నిపుణులు భావిస్తున్నారు.రాబిన్ మింజ్వికెట్ కీపర్ కూడా అయినా రాబిన్ మింజ్ తన అసాధారణ స్ట్రోక్ ప్లే తో విజృభించి ఆడగలడు. దురదృష్టవశాత్తు బైక్ ప్రమాదం కారణంగా గత సీజన్‌కు దూరమైన , మింజ్ ఈ సీజన్లో మళ్ళీ తన సత్తా చూపించాలిని పట్టుదలతో ఉన్నాడు.ముజీబ్ ఉర్ రెహమాన్గాయం కారణంగా జట్టు నుంచి తప్పుకున్న తోటి ఆఫ్ఘన్ దేశస్థుడు ఎ ఎం గజన్ఫర్ స్థానంలో ఈ ఆఫ్ స్పిన్నర్‌ను జట్టులోకి తీసుకున్నారు. రెహమాన్ తన టి 20 కెరీర్లో 18.11 సగటు తో నిలకడగా బౌలింగ్ చేయగల సామర్ధ్యముంది.బెవాన్ జాకబ్స్న్యూజిలాండ్ కి చెందిన 22 ఏళ్ల హార్డ్ హిట్టింగ్ బ్యాటర్. తన అసాధారణ స్ట్రోక్ ప్లే తో ఇటీవల కాలం లో బాగా రాణిస్తున్నాడు. టీ20 కెరీర్లో 148.42 స్ట్రైక్ రేట్ తో ఉన్న జాకబ్స్ ఈ సీజన్లో అనేక మంది బౌలర్లకు తలనొప్పిగా పరిణమించే అవకాశం ఉంది.ముంబై ఇండియన్స్ జట్టుజస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, ట్రెంట్ బౌల్ట్, నమన్ ధిర్, రాబిన్ మింజ్, కర్ణ్ శర్మ, ర్యాన్ రికెల్టన్, దీపక్ చాహర్, ముజీబ్ ఉర్ రెహమాన్, విల్ జాక్స్, అశ్వనీ కుమార్, మిచెల్ సాంట్నర్, రీస్ టాప్లే, క్రిష్ణన్ శ్రీజిత్, రాజ్ అంగద్ బవా, సత్యనారాయణ రాజు, బెవాన్ జేకబ్స్ అర్జున్ టెండుల్కర్, లిజాడ్ విలియమ్స్, విఘ్నేశ్ పుత్తూరు, కార్బిన్ బాష్.చదవండి: నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ అతడే.. మూడు ఫార్మాట్లలోనూ బెస్ట్: కోహ్లి -
నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ అతడే.. అన్ని ఫార్మాట్లలోనూ బెస్ట్: కోహ్లి
భారత పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)పై టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లి (Virat Kohli) ప్రశంసలు కురిపించాడు. మూడు ఫార్మాట్లలోనూ ప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమ బౌలర్ అతడేనని కొనియాడాడు. తాను ఎదుర్కొన్న బౌలర్లలో అత్యంత కఠినమైన బౌలర్ బుమ్రానే అని కోహ్లి వెల్లడించాడు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో సత్తా చాటిన కోహ్లి.. ప్రస్తుతం ఐపీఎల్-2025 సన్నాహకాలతో బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) సోషల్ మీడియాతో మమేకమైన కోహ్లి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అత్యుత్తమ బౌలర్ ఇక మీ కెరీర్లో ఎదుర్కొన్న టఫెస్ట్ బౌలర్ ఎవరన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ప్రపంచంలో ప్రస్తుతం వన్డే, టెస్టు, టీ20 ఫార్మాట్లలో అత్యుత్తమ బౌలర్ ఎవరంటే.. జస్ప్రీత్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఐపీఎల్లో కొన్ని సందర్భాల్లో అతడు నన్ను అవుట్ చేశాడు. అయితే, ఎక్కువసార్లు నేనే అతడిపై పైచేయి సాధించాను. అయినా సరే.. మా ఇద్దరి మధ్య పోటీ అంటే ఎంతో ఆసక్తికరంగా, సరదాగా ఉంటుంది. ప్రతి బంతిని షాట్ బాదేందుకు నేను ప్రయత్నిస్తా.నన్ను ఆపేందుకు అతడూ ట్రై చేస్తాడు. ఇద్దరి మధ్య పోటీ తీవ్రస్థాయికి చేరుకున్న వేళ.. ఎవరూ కూడా తగ్గకుండా ముందుకు సాగితే మజాగా ఉంటుంది కదా!.. ఇక నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నపుడు నేను రెగ్యులర్‌గా బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొంటా. నాకు నచ్చిన, నేను ఆస్వాదించే మూమెంట్ అది. అంతేకాదు.. అదే కఠినమైన సవాల్ కూడా!’’ అని విరాట్ కోహ్లి చెప్పుకొచ్చాడు.కాగా క్యాష్ రిచ్ లీగ్ ఆరంభమైన నాటి(2008) నుంచి కోహ్లి ఆర్సీబీలో కొనసాగుతుండగా.. బుమ్రా తన కెరీర్ ఆరంభం నుంచి ముంబై ఇండియన్స్‌తో ప్రయాణిస్తున్నాడు. ఫోర్లు బాదిన కోహ్లి.. అవుట్ చేసిన బుమ్రాఇక 2013, ఏప్రిల్ 4న ముంబై తరఫున ఆర్సీబీతో మ్యాచ్‌తో బుమ్రా ఐపీఎల్లో అరంగ్రేటం చేసిన విషయం తెలిసిందే. నాడు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి.. 32 పరుగులు ఇచ్చిన బుమ్రా మూడు వికెట్లు తీశాడు.తన ఆరంభ ఓవర్లోనే కోహ్లి ఒకటి, రెండు, నాలుగో బంతుల్లో ఫోర్లు బాది చుక్కలు చూపించగా.. ఐదో బంతికి బుమ్రా విజయం సాధించాడు. నాడు 19 ఏళ్ల వయసులో ఉన్న బుమ్రా తన అద్భుత నైపుణ్యాలతో వికెట్ల ముందు కోహ్లిని దొరకబుచ్చుకుని.. తన తొలి వికెట్ సాధించాడు. ఇక ఇప్పటి వరకు 133 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న బుమ్రా 165 వికెట్లు తీశాడు. ముంబై జట్టు ఐదుసార్లు టైటిల్ గెలిచిన సందర్భాల్లోనూ అతడు జట్టులో భాగంగా ఉన్నాడు.మరోవైపు.. కోహ్లి జట్టు ఆర్సీబీ ఇంత వరకు ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేకపోయింది. ఇదిలా ఉంటే.. కోహ్లి- బుమ్రా టీమిండియాకు కలిసి ఆడుతున్న విషయం తెలిసిందే. కోహ్లి సారథ్యంలో బుమ్రా ఆడగా.. పలు సందర్భాల్లో బుమ్రా కెప్టెన్సీలో కోహ్లి ఆడటం విశేషం. చదవండి: అసలు అతడిని జట్టులోకి తీసుకుంది ఎవరు?: పాక్ మాజీ క్రికెటర్ ఆగ్రహం"𝙒𝙝𝙚𝙣𝙚𝙫𝙚𝙧 𝙄 𝙛𝙖𝙘𝙚 𝙝𝙞𝙢, 𝙞𝙩'𝙨 𝙡𝙞𝙠𝙚, '𝙊𝙠𝙖𝙮, 𝙞𝙩'𝙨 𝙜𝙤𝙣𝙣𝙖 𝙗𝙚 𝙛𝙪𝙣.'" 🗣Ever wondered who’s the toughest bowler Virat’s ever faced? 🤔 Catch him spill the tea, at the 𝗥𝗖𝗕 𝗜𝗻𝗻𝗼𝘃𝗮𝘁𝗶𝗼𝗻 𝗟𝗮𝗯 𝗜𝗻𝗱𝗶𝗮𝗻 𝗦𝗽𝗼𝗿𝘁𝘀 𝗦𝘂𝗺𝗺𝗶𝘁… pic.twitter.com/36F8d8twN6— Royal Challengers Bengaluru (@RCBTweets) March 17, 2025 -
బుమ్రా ఒక అద్బుతం.. అతడిని ఎదుర్కోవడం చాలా కష్టం: ఆసీస్ క్రికెటర్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (2024-25)ని 3-1 తేడాతో టీమిండియా కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్‌లో భారత్ ఓటమి పాలైనప్పటికి.. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మాత్రం ప్రత్యర్ధి బ్యాటర్లను బెంబేలెత్తించాడు. అతడి బౌలింగ్ ప్రదర్శనకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు సైతం ఫిదా అయిపోయారు.బుమ్రా.. ఓవరాల్‌గా 32 వికెట్లు పడగొట్టి లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. తాజాగా టీమిండియా పేస్ గుర్రంపై ఆస్ట్రేలియా యువ బ్యాటర్ నాథన్ మెక్‌స్వీని ప్రశంసల వర్షం కురిపించాడు. బుమ్రా అద్భుతమైన బౌలర్ అని అతడు కొనియాడాడు. అదేవిధంగా బుమ్రా బౌలింగ్‌లో తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి ఈ ఆసీస్ యువ క్రికెటర్ వెల్లడించాడు."బుమ్రాను ఎదుర్కొవడం చాలా కష్టం. బీజీటీలో అతడి నుంచి నాకు కఠిన సవాలు ఎదురైంది. అతడు బౌలింగ్‌ను ఆర్ధం చేసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాను. బుమ్రా ఒక వరల్డ్ క్లాస్ బౌలర్. ఈ విషయం నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతకుముందు ఎప్పుడూ అతనిని ఎదుర్కోలేదు.బహుశా నేను విఫలమవడానికి ఇదొక కారణం కావచ్చు. బుమ్రాకు అద్భుతమైన స్కిల్స్ ఉన్నాయి. బంతిని ఏ ప్రాంతంలో సంధిస్తే బ్యాటర్ ఇబ్బంది పడతాడో అతడికి బాగా తెలుసు. అందుకే అతడిని ఎదుర్కొవడం అంత సులువు కాదు. ఈ సిరీస్‌లో నేను ఒక్కడినే కాదు మా జట్టులోని ఇతర ఆటగాళ్లూ సైతం బుమ్రాపై పైచేయి సాధించలేకపోయారు. నాకు అదికాస్త ఆత్మవిశ్వాసం ఇచ్చింది అని విల్లో టాక్ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెక్‌స్వీనీ పేర్కొన్నాడు. కాగా ఈ సిరీస్‌లో మెక్‌స్వీనిని మూడు టెస్టుల్లో 4 సార్లు బుమ్రానే ఔట్ చేశాడు. ఇక ఈ సిరీస్‌లో ఆఖరి టెస్టులో బుమ్రా వెన్ను గాయం తిరగబెట్టింది. దీంతో అతడు ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు దూరమయ్యాడు. ప్రస్తుతం ఏన్సీఎలో ఉన్న జస్ప్రీత్ ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: IPL 2025: రాజస్తాన్ రాయల్స్‌కు భారీ షాక్.. సంజూ ఇంకా బెంగళూరులోనే? -
‘నువ్వుంటే నిశ్చింత.. నువ్వే నా హృదయ స్పందన’
టీమిండియా స్టార్ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)- స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్ (Sanjana Ganesan) వివాహ వార్షికోత్సవం నేడు (మార్చి 15). ఈ సందర్భంగా సంజనా భర్తపై ప్రేమను కురిపిస్తూ ఉద్వేగ పూరిత నోట్ షేర్ చేసింది. ‘‘నువ్వుంటేనే నా గుండె కొట్టుకుంటుంది.. నువ్వు నాతో ఉంటేనే నాకు శ్వాస ఆడుతుంది.. నువ్వు లేని ఇల్లు ఇల్లులా కనిపించదు.. నువ్వే నా ధైర్యం.. నువ్వుంటే నేను నిశ్చితంగా ఉంటాను.. హ్యాపీ 4 లవ్’’ అంటూ సంజనా కవితాత్మక పంక్తులతో భర్తకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. ‘మిస్టర్ అండ్ మిసెస్ మాహి’ సినిమా పాటలోని లిరిక్స్‌తో తన ప్రేమను వ్యక్తపరిచింది.హ్యాపీ యానివర్సరీఇందుకు బుమ్రాతో కలిసి ఉన్న ఫొటోను సంజనా జతచేసింది. ఈ క్రమంలో బుమ్రా దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా సాధారణ కుటుంబంలో జన్మించిన బుమ్రా.. తన అంకిత భావం, కఠిన శ్రమతో వరల్డ్‌క్లాస్ బౌలర్‌గా ఎదిగాడు. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో అతడే ముందున్నాడు.అంతేకాదు.. టీమిండియా పేస్ దళ నాయకుడిగా ఉన్న బుమ్రా.. వైస్ కెప్టెన్‌గానూ సేవలు అందిస్తున్నాడు. ఇక సంజనా విషయానికొస్తే.. బీటెక్ పూర్తి చేసిన తర్వాత మోడలింగ్‌లో ప్రవేశించిన ఆమె.. తర్వాత స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)తో పాటు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ప్రజెంటర్‌గా పనిచేస్తూ ఉన్నత స్థాయికి చేరుకుంది.ఈ క్రమంలో బుమ్రా- సంజనా మధ్య కుదిరిన స్నేహం ప్రేమగా రూపాంతరం చెందింది. ఇరు కుటుంబాల సమ్మతంతో వీరు 2021, మార్చి 15న సిక్కు సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు సెప్టెంబరు 4, 2023లో కుమారుడు జన్మించగా.. అతడికి అంగద్‌గా నామకరణం చేశారు. కోలుకుంటున్న బుమ్రాకాగా బుమ్రా ప్రస్తుతం వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. గాయం కారణంగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 మొత్తానికి దూరమైన అతడు... కోలుకుంటున్నట్లు సమాచారం. అయితే, ఐపీఎల్-2025లో ఆరంభ మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉండే పరిస్థితి లేదు.ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ వర్గాలు వెల్లడించాయి. కాగా ఐపీఎల్ ఆరంభం నుంచి ముంబైతో ప్రయాణిస్తున్న బుమ్రాను మెగా వేలానికి ముందు ఫ్రాంఛైజీ తమ మొదటి ప్రాధాన్య ప్లేయర్‌గా రిటైన్ చేసుకుంది. అతడి కోసం రూ. 18 కోట్లు ఖర్చు చేసింది.ఇక ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో 45 టెస్టులు ఆడిన బుమ్రా.. 205 వికెట్లు తీశాడు. ఇక 89 వన్డేల్లో ఈ రైటార్మ్ ఫాస్ట్ బౌలర్ 149 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ఫార్మాట్లో టీమిండియా తరఫున 89 వికెట్లు తీసిన బుమ్రా.. ఐపీఎల్లో ఇప్పటి వరకు 133 మ్యాచ్‌లు ఆడి 165 వికెట్లు పడగొట్టాడు. చదవండి: ఇంగ్లండ్‌తో టెస్టులు.. టీమిండియా కెప్టెన్‌గా అతడే! బీసీసీఐ గ్రీన్ సిగ్నల్? -
IND vs ENG: టీమిండియా కెప్టెన్‌గా అతడే! బీసీసీఐ గ్రీన్ సిగ్నల్?
టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ (Rohit Sharma) కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ పర్యటనలో అతడే భారత జట్టును ముందుకు నడిపించనున్నట్లు సమాచారం. భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) నాయకత్వ బృందం రోహిత్‌తో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.మరోసారి సూపర్ ‘హిట్’కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో రోహిత్ శర్మ టీమిండియాను విజేతగా నిలిపిన విషయం తెలిసిందే. ఈ మెగా వన్డే టోర్నీలో భారత్ ఐదింటికి ఐదూ గెలిచి అజేయంగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో ఫైనల్లో రోహిత్ శర్మ అద్భుత అర్ధ శతకం(76)తో బ్యాటర్‌గానూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.తద్వారా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచి.. ఇంత వరకు ఏ కెప్టెన్‌కూ సాధ్యం కాని ఘనతను రోహిత్ సాధించాడు. అంతకంటే ముందు ఇంగ్లండ్‌తో స్వదేశంలో వన్డే సిరీస్‌లోనూ హిట్‌మ్యాన్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. అయితే, ఈ అద్బుత ప్రదర్శన కంటే ముందు రోహిత్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాడు.అత్యంత ఘోర ఓటమి కారణంగాముఖ్యంగా సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టెస్టుల్లో రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారత్.. 3-0తో వైట్‌వాష్‌కు గురైంది. భారత టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యంత ఘోర ఓటమి. ఇక ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లోనూ టీమిండియా పరాజయం పాలైంది. ఐదు టెస్టుల సిరీస్‌లో 3-1తో ఓడి దశాబ్ద కాలం తర్వాత కంగారూలకు ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని చేజార్చుకుంది. అంతేకాదు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరకుండానే నిష్క్రమించింది.ఇక ఈ రెండు సిరీస్‌లలో కెప్టెన్‌గా.. బ్యాటర్‌గా రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. ఆ తర్వాత రంజీ బరిలో ముంబై తరఫున ఓపెనర్‌గా వచ్చి అక్కడా వైఫల్యాన్ని కొనసాగించాడు. సీన్ రివర్స్ఈ పరిణామాల నేపథ్యంలో రోహిత్ శర్మ టెస్టులకు గుడ్‌బై చెప్పాలనే డిమాండ్లు పెరిగాయి. జస్ప్రీత్ బుమ్రాకు పగ్గాలు అప్పగించాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, చాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత పరిస్థితి మారిపోయింది.రోహిత్ శర్మకు మద్దతుగా భారత మాజీ క్రికెటర్లు గళం వినిపిస్తున్నారు. కాగా ఐపీఎల్-2025 కారణంగా దాదాపు రెండు నెలలపాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉండనున్న టీమిండియా.. జూన్ ఆఖర్లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఇంగ్లిష్ జట్టుతో ఐదు టెస్టులు ఆడనుంది.ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు మాట్లాడుతూ.. ఈ సిరీస్‌లో రోహిత్‌నే కెప్టెన్‌గా కొనసాగించాలని సూచించాడు. సొంతగడ్డపై ఇంగ్లండ్‌ను ఓడించాలంటే రోహిత్ వంటి అనుభవజ్ఞుడి సేవలు అవసరమని పేర్కొన్నాడు. ఇక బీసీసీఐ సన్నిహిత వర్గాలు తాజాగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించాయి.బీసీసీఐ గ్రీన్ సిగ్నల్‘‘రోహిత్ ఏం చేయగలడో మరోసారి నిరూపితమైంది. బీసీసీఐలో భాగమైన ప్రతి ఒక్కరు ఇంగ్లండ్ పర్యటనలోనూ అతడినే కొనసాగించాలని.. అతడే సరైన సారథి అని నమ్ముతున్నారు. అటు రోహిత్ కూడా రెడ్ బాల్ క్రికెట్లో కొనసాగేందుకు ఆసక్తిగానే ఉన్నట్లు బోర్డుకు తెలిపాడు’’ అని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ మరికొంతకాలం టెస్టులు ఆడటం ఖాయమైపోయిందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.కాగా టీ20 ప్రపంచకప్-2024, చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలవడంతో మహేంద్ర సింగ్ ధోని తర్వాత భారత్‌కు అధిక ఐసీసీ టైటిళ్లు అందించిన కెప్టెన్‌గా రోహిత్ చరిత్రకెక్కిన విషయం తెలిసిందే. గతేడాది పొట్టి వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ.. ప్రస్తుతం వన్డే, టెస్టుల్లో కొనసాగుతున్నాడు. ఇక చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత మాట్లాడుతూ.. ఇప్పట్లో తనకు రిటైర్ అయ్యే ఉద్దేశం లేదని తెలిపాడు. ఇక రోహిత్ ప్రస్తుతం ఐపీఎల్-2025 సన్నాహకాలతో బిజీగా ఉన్నాడు.చదవండి: IPL 2025: హార్దిక్‌పై నిషేధం.. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా సూర్యకుమార్..? -
బుమ్రా ఇకపై మరింత తెలివిగా వ్యవహరించాలి: ఆసీస్ దిగ్గజం వార్నింగ్
టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah )ను ఉద్దేశించి ఆస్ట్రేలియా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెగ్రాత్ కీలక సూచనలు చేశాడు. గాయాలతో సావాసం చేస్తున్న ఈ రైటార్మ్ బౌలర్.. కెరీర్ పొడిగించుకోవాలంటే జిమ్‌లో మరింతగా కష్టపడాలన్నాడు. రోజురోజుకు వయసు పెరుగుతున్న కారణంగా మునుపటిలా త్వరగా కోలుకునే అవకాశాలు తక్కువ.. కాబట్టి గాయాల బారిన పడకుండా తనను తాను కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా పేస్ దళ భారం మొత్తాన్ని బుమ్రా తన భుజాలపై మోసిన విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (Border- Gavaskar Trophy)లో ఐదు టెస్టులకు గానూ.. రెండింటిలో కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. ఇటు బౌలర్‌గా.. అటు కెప్టెన్‌గా అదనపు భారం వల్ల బుమ్రాకు వెన్నునొప్పి తిరగబెట్టింది.ఐపీఎల్-2025 ఆరంభ మ్యాచ్‌లకూ దూరంఫలితంగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) మొత్తానికి బుమ్రా దూరమయ్యాడు. అయితే, ప్రధాన బౌలర్ లేకపోయిన్పటికీ.. ఈ వన్డే టోర్నీలో టీమిండియా దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడిన కారణంగా స్పిన్నర్లను ఎక్కువగా ఉపయోగించుకుని విజయవంతమైంది. ఈ మెగా ఈవెంట్లో చాంపియన్‌గా అవతరించింది.ఇదిలా ఉంటే.. బుమ్రా ఇంకా పూర్తిగా కోలుకోనేట్లు సమాచారం. ఈ క్రమంలో ఐపీఎల్-2025 ఆరంభ మ్యాచ్‌లకు అతడు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. బుమ్రా ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. స్పష్టంగా ఏ రోజు నుంచి, ఏ మ్యాచ్‌కు అతడు ఆడేది చెప్పనప్పటికీ.. ఏప్రిల్ రెండో వారంలో బుమ్రా ముంబై ఇండియన్స్ జట్టుతో కలిసే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల చివరి వారం, వచ్చే నెల మొదటి వారం రోజుల్లో జరిగే ముంబై ఇండియన్స్ ఆరంభ మ్యాచ్‌లకు బుమ్రా గైర్హాజరు కానున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో పునరావాస శిబిరంలో ఉన్న పేసర్ వెన్నుగాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడు.ఈ పరిణామాల నేపథ్యంలో ఆసీస్ దిగ్గజ పేసర్ గ్లెన్ మెగ్రాత్ మాట్లాడుతూ.. ‘‘మిగతా పేసర్లతో పోలిస్తే బుమ్రా తన శరీరాన్ని ఎక్కువగా కష్టపెడతాడు. శరీరాన్ని తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తాడు. అయితే, దానిని ఎలా మేనేజ్ చేసుకోవాలో అతడికి బాగా తెలుసు. కానీ దురదృష్టవశాత్తూ అన్నిసార్లు పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చు.ఇకపై మరింత తెలివిగా వ్యవహరించాలిగతంలో చాలాసార్లు గాయాల నుంచి అతడు బయటపడి.. సరికొత్త ఉత్సాహంతో పునరాగమనం చేశాడు. కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది.. జిమ్‌లో ఎంతగా కష్టపడాలి అనే విషయాలపై అతడికి స్పష్టత ఉంది. కానీ రోజురోజుకూ వయసు పెరుగుతున్న కారణంగా.. ఫిట్నెస్ కాపాడుకునేందుకు అతడు ఇంకాస్త కఠినంగా శ్రమించాలి.మైదానం వెలుపలా కష్టపడాలి. మరింత స్మార్ట్‌గా ఉండాలి. ఫాస్ట్ బౌలర్ నడిచే కార్ లాంటివాడైతే.. అందులో ఇంధనం ఉన్నంత వరకే ముందుకు వెళ్తుంది. నిజానికి బుమ్రాతో పోలిస్తే నా ఫ్యూయల్ ట్యాంకు పెద్దది. ఎందుకంటే.. అతడిలా నేను అతి వేగంతో బౌలింగ్ చేయను.ముందుగా చెప్పినట్లు.. బుమ్రా తన శరీరాన్ని తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తాడు కాబట్టే.. పనిభారాన్ని తగ్గించుకోవడం కూడా ముఖ్యం. అతడు లేకుంటే టీమిండియా అనుకున్న ఫలితాలు రాబట్టలేదు. కాబట్టి బుమ్రాను కాపాడుకోవాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ కూడా ఉంది’’ అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఇటీవల న్యూజిలాండ్ మాజీ పేసర్ షేన్ బాంగ్ కూడా బుమ్రా గురించి ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశాడు. -
అదే జరిగితే బుమ్రా కెరీర్ ముగిసినట్లే: కివీస్ మాజీ పేసర్ వార్నింగ్
న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ షేన్ బాండ్( Shane Bond) భారత క్రికెట్ జట్టు యాజమాన్యానికి కీలక సూచన చేశాడు. టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)పై పనిభారం తగ్గించాలని సూచించాడు. లేదంటే ప్రపంచకప్ నాటికి అతడు అందుబాటులో ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. కాగా క్రికెటర్లలో గాయాల బెడద ఎక్కువగా ఉండేది ఫాస్ట్‌బౌలర్లకే.బుమ్రా కూడా ఇందుకు అతీతం కాదు. గతంలో చాలాసార్లు అతడు వెన్నునొప్పితో బాధపడ్డాడు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2022 వంటి ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు దూరమయ్యాడు. ఏడాది పాటు జట్టు అతడి సేవలను కోల్పోయింది. అనంతరం వన్డే వరల్డ్‌కప్-2023 నాటికి తిరిగి జట్టుతో చేరిన బుమ్రా.. టీమిండియా టీ20 ప్రపంచకప్-2024 గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.తాత్కాలిక కెప్టెన్‌గా ఆ తర్వాత కూడా జట్టుతో కొనసాగిన ఈ రైటార్మ్ పేసర్.. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా మరోసారి గాయపడ్డాడు. కంగారూ దేశ టూర్లో భాగంగా తొలి టెస్టుకు, ఆఖరి టెస్టుకు బుమ్రా తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ క్రమంలో చివరిదైన ఐదో టెస్టులో భాగంగా వెన్నునొప్పితో విలవిల్లాడిన బుమ్రా ఆస్పత్రికి వెళ్లి స్కానింగ్ చేయించుకున్నాడు.ఇక ఈ టూర్ ముగించుకుని భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత కూడా బుమ్రా కోలుకోలేదు. ఫిట్నెస్ సాధించని కారణంగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 మొత్తానికి దూరమయ్యాడు. ఈ పరిణామాల నేపథ్యంలో కివీస్ మాజీ పేసర్ షేన్ బాండ్ మాట్లాడుతూ... ‘‘అతడొక విలువైన బౌలర్. వచ్చే వరల్డ్‌కప్‌లో అతడి పాత్ర కీలకం.అయితే, త్వరలోనే టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడబోతోంది. నేను గనుక టీమిండియా మేనేజ్మెంట్ స్థానంలో ఉంటే.. అతడిని వరుసగా రెండు టెస్టుల్లో ఆడించను. ఐపీఎల్ తర్వాత వెనువెంటనే వరుస టెస్టులు ఆడించడం పెద్ద రిస్క్.అదే జరిగితే బుమ్రా కెరీర్ ముగిసినట్లేఅలా కాకుండా మధ్యలో కాస్త విశ్రాంతినిస్తే అతడు ఫిట్‌గా ఉండేందుకు అవకాశం ఉంది. మిగతా ఫార్మాట్లలోనూ ఆడగలుగుతాడు. జట్టులోని ప్రధాన, అత్యుత్తమ బౌలర్ ప్రతిసారి గాయం వల్ల ప్రతిష్టాత్మక ఈవెంట్లకు దూరం కావడం మంచిదికాదు.ఒకవేళ అతడు మరోసారి ఇదే తరహాలో గాయపడితే మాత్రం.. కెరీర్‌కే ఎండ్‌కార్డ్ పడే ప్రమాదం ఉంది. కాబట్టి అతడిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకేచోట పదే పదే గాయమైతే సర్జరీ చేసినా ఉపయోగం ఉండదు’’ అని టీమిండియా యాజమాన్యాన్ని హెచ్చరించాడు. ఈ మేరకు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో షేన్ బాండ్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.కాగా చివరగా ఆసీస్‌తో టెస్టుల్లో టీమిండియా తరఫున బరిలోకి దిగిన బుమ్రా.. ఐదు మ్యాచ్‌లలో కలిపి 32 వికెట్లు తీశాడు. అయితే, ఈ సిరీస్‌లో భారత్ 3-1తో కంగారూల చేతిలో ఓడిపోయింది. ఇదిలా ఉంటే.. బుమ్రా లేకుండానే టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. దుబాయ్‌లో ఐదుగురు స్పిన్నర్లతో రంగంలోకి దిగి విజేతగా అవతరించింది. ఇక బుమ్రా ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ ఆరంభ మ్యాచ్‌లకు అతడు దూరమయ్యే ఛాన్స్ ఉంది.చదవండి: IND vs ENG: గంభీర్ మాస్టర్ ప్లాన్.. ఇంత వరకు ఏ కోచ్ చేయని విధంగా.. -
శుబ్‌మన్ గిల్‌కు ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు.. బుమ్రా రికార్డు బ్రేక్!
టీమిండియా స్టార్ క్రికెటర్ శుబ్‌మన్ గిల్ ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’(ICC Player of the Month) అవార్డు గెలుచుకున్నాడు. ఫిబ్రవరి నెలకు గానూ ఈ పురస్కారానికి అతడు ఎంపికయ్యాడు. తద్వారా ఇప్పటి వరకు అత్యధికసార్లు ఈ ప్రతిష్టాత్మక అవార్డు గెలిచిన తొలి భారత క్రికెటర్‌గా గిల్ నిలిచాడు.ట్రోఫీ గెలిచిన టీమిండియా..కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భారత యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ అదరగొట్టిన విషయం తెలిసిందే. గత నెల 19న పాకిస్తాన్లో మొదలైన ఈ మెగా వన్డే టోర్నమెంట్.. దుబాయ్‌లో మార్చి 9న టీమిండియా- న్యూజిలాండ్ మధ్య ఫైనల్‌తో ముగిసింది. ఇక ఈ ఈవెంట్లో రోహిత్ సేన తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే ఆడింది.గిల్ అదరగొట్టాడుగ్రూప్ దశలో వరుసగా మూడు గెలిచి సెమీస్ చేరిన భారత్.. అనంతరం సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో కివీస్ జట్టును నాలుగు వికెట్ల తేడాతో ఓడించి చాంపియన్‌గా నిలిచింది. ఐదు మ్యాచ్‌లలోనూ అజేయంగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది.భారత్ ఈ ఘనత సాధించడంలో గిల్ది కూడా కీలక పాత్ర. ఈ టోర్నీలో బంగ్లాదేశ్‌పై 101 పరుగులు సాధించిన గిల్.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 46 పరుగులు చేశాడు. అంతకు ముందు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్(India vs England)లోనూ గిల్ అదరగొట్టాడు. మూడు మ్యాచ్‌లలో వరుసగా 87, 60, 112 పరుగులు సాధించాడు.వారిని ఓడించిఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఫిబ్రవరి నెలకు నామినేట్ అయ్యాడు గిల్. ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ స్టీవ్ స్మిత్, న్యూజిలాండ్ స్టార్ గ్లెన్ ఫిలిప్స్ కూడా ఈ అవార్డు కోసం పోటీపడ్డారు. వారిద్దరిని ఓడించి అత్యధిక ఓట్లతో గిల్ విజేతగా నిలిచాడు.బుమ్రా రికార్డు బ్రేక్ఇక గిల్ ఈ అవార్డు గెలవడం ఇది మూడోసారి. 2023 జనవరి, సెప్టెంబర్ నెలలకు గానూ గిల్ గతంలో ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా నిలిచాడు. అంతకు ముందు భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా రెండుసార్లు ఈ పురస్కారం పొందాడు. అయితే, గిల్ ఇప్పుడు బుమ్రాను అధిగమించి ఈ జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు.ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులు అందుకున్న భారత క్రికెటర్లు వీరే👉శుబ్‌మన్ గిల్- మూడుసార్లు👉జస్ప్రీత్ బుమ్రా- రెండుసార్లు👉రిషభ్ పంత్- ఒకసారి👉రవిచంద్రన్ అశ్విన్- ఒకసారి👉భువనేశ్వర్ కుమార్- ఒకసారి👉శ్రేయస్ అయ్యర్- ఒకసారి👉విరాట్ కోహ్లి- ఒకసారి👉యశస్వి జైస్వాల్- ఒకసారి.టాప్‌లోనే గిల్మరోవైపు.. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో గిల్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ మూడో ర్యాంకు సాధించాడు. మరోవైపు.. విరాట్ కోహ్లి ఐదో స్థానంలో నిలిచాడు.చదవండి: IND vs ENG: గంభీర్ మాస్టర్ ప్లాన్.. ఇంత వరకు ఏ కోచ్ చేయని విధంగా.. -
చాంపియన్స్ ట్రోఫీతో బుమ్రా భార్య సంజనా.. రోహిత్ శర్మతో ముచ్చట్లు (ఫోటోలు)
-
IPL 2025: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్..
ఐపీఎల్-2025(IPL-2025) ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్(Mumbai Indians)కు భారీ షాక్ తగలింది. ఆ జట్టు స్టార్ పేసర్, టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) గాయం కారణంగా ఐపీఎల్ ఫస్ట్ హాఫ్ సీజన్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. బుమ్రా ప్రస్తుతం వెన్ను గాయంతో బాధపడుతున్నాడు.ఈ క్రమంలోనే కీలకమైన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సైతం బుమ్రా దూరమయ్యాడు. బుమ్రా ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందుతున్నాడు. అతడు తన పూర్తి ఫిట్నెస్ సాధించడానికి రెండు నుంచి మూడు వారాల సమయం పట్టనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ భారత స్పీడ్ స్టార్ ఏప్రిల్‌లో ముంబై ఇండియన్స్ శిబిరంలో చేరే అవకాశం ఉంది."బుమ్రా వేగంగా కోలుకుంటున్నాడు. అతడి మెడికల్ రిపోర్ట్స్ బాగానే ఉన్నాయి. అతడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో తిరిగి తన బౌలింగ్ ప్రాక్టీస్‌ను ప్రారంభించాడు. అయితే ఐపీఎల్లో బౌలింగ్ చేసే ఫిట్నెస్ మాత్రం ఇంకా సాధించలేదు. ఏప్రిల్ మొదటి వారంలో బుమ్రా తిరిగి మైదానంలో అడుగుపెట్టే అవకాశముంది. అది కూడా మేము కచ్చితంగా చెప్పలేము. మా వైద్య బృందం అతడిపై క్రమంగా వర్క్‌లోడ్ పెంచుతుంది.అతడు ఎటువంటి అసౌకర్యం లేకుండా బౌలింగ్ చేయగలిగితేనే వైద్య బృందం క్లియరన్స్ ఇస్తోంది. అప్పటివరకు అతడు సీఓఈలోనే ఉండనున్నాడని" బీసీసీఐ అధికారి ఒకరు టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 23న చెన్నైసూపర్ కింగ్స్‌తో తలపడనుంది. హార్దిక్ కూడా..ఈ మ్యాచ్‌కు ముంబై రెగ్యూలర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సైతం దూరం కానున్నాడు. గతేడాది సీజన్లో స్లో ఓవర్ రేటు కారణంగా పాండ్యాపై ఒక్క మ్యాచ్ నిషేధం పడింది. హార్దిక్ గత సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో మూడోసారి స్లో ఓవర్ రేట్‌కు కారణమయ్యాడు.దీంతో వరుసగా మూడు సార్లు స్లో ఓవరేట్‌ను మెయింటేన్ చేయడంతో ఐపీఎల్ నిర్వహకులు అతడిపై ఆడకుండా ఒక్క మ్యాచ్ నిషేదం విధించారు. ఆ బ్యాన్‌ను పాండ్యా ఈ ఏడాది సీజన్లో ఎదుర్కొన్నాడు. తొలి మ్యాచ్‌కు బెంచ్‌కే పరిమితం కానున్నాడు. కాగా గతేడాది సీజన్లో ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శనతో లీగ్ స్టేజికే పరిమితమైన సంగతి తెలిసిందే.చదవండి: BCCI: శుబ్‌మన్ గిల్‌కు ప్రమోషన్.. ఏకంగా రూ. 7 కోట్ల జీతం!? -
రెండు టోపీలు... రెండు ట్రోఫీలు
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇదివరకే ప్రకటించిన అవార్డుల్ని ఆదివారం భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అందుకున్నాడు. 2024 క్యాలెండర్ ఇయర్‌కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్లో విశేష ప్రదర్శన కనబరిచిన ఈ భారత సీనియర్ పేసర్ పురుషుల క్రికెట్లో నాలుగు అవార్డులకు ఎంపికయ్యాడు. ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’... ‘టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ వ్యక్తిగత అవార్డులు కాగా... 2024 ప్రదర్శన ఆధారంగా అన్ని దేశాల నుంచి ఆటగాళ్లతో ఐసీసీ జట్లను ఎంపిక చేసింది. ఐసీసీ ప్రకటించిన టి20, టెస్టు జట్లలోనూ బుమ్రా ఉన్నాడు. దీంతో ‘టి20 టీమ్ ఆఫ్ ద ఇయర్’... ‘టెస్టు టీమ్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారాలల్లో భాగంగా ఐసీసీ ప్రత్యేకమైన రెండు టోపీలను అందజేసింది. వ్యక్తిగత అవార్డులుగా రెండు ట్రోఫీలను బహూకరించింది. ప్రస్తుతం వెన్నుగాయంతో ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి దూరమైన ఈ ‘పేస్ ఎక్స్‌ప్రెస్’ అవార్డు స్వీకరించేందుకే దుబాయ్‌కి వచ్చాడు. ఉదయం మ్యాచ్‌కు ముందు తుది కసరత్తులో ఉన్న తమ జట్టు సహచరులతో ఆత్మీయంగా భేటీ అయ్యాక దాయాదుల మ్యాచ్ ఆరంభానికి ముందు అవార్డులు అందుకున్నాడు. ప్రేక్షకులంతా చప్పట్లతో అభినందనలు తెలిపారు. గతేడాది టెస్టుల్లో కేవలం 13 మ్యాచ్‌లే ఆడిన 31 ఏళ్ల బుమ్రా 71 వికెట్లు పడగొట్టడం విశేషం. ఓ క్యాలెండర్ ఇయర్లో 70 పైచిలుకు వికెట్లు తీసిన నాలుగో భారత బౌలర్‌గా ఘనతకెక్కాడు. అతనికంటే ముందువరుసలో దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్, లెజెండ్ స్పిన్నర్లు అనిల్ కుంబ్లే, అశి్వన్ ఉన్నారు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 19 వికెట్లు తీసిన బుమ్రా... ఆ్రస్టేలియాలో జరిగిన ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో 32 వికెట్లు తీశాడు. అంటే కేవలం రెండే రెండు జట్లతో జరిగిన ముఖాముఖి సిరీస్‌ల్లోనే 51 వికెట్లు పడగొట్టడం విశేషం. -
CT 2025: బుమ్రా స్థానంలో అతడే సరైనోడు: రిక్కీ పాంటింగ్
జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)లేకుండానే భారత క్రికెట్ జట్టు చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడనుంది. వెన్నునొప్పి కారణంగా అతడు ఈ మెగా టోర్నీ మొత్తానికి దూరం కాగా.. యువ బౌలర్ హర్షిత్ రాణా(Harshit Rana) జట్టులోకి వచ్చాడు. అయితే, ప్రధాన పేసర్ బుమ్రా లేని లోటును మాత్రం ఎవరూ తీర్చలేరంటున్నాడు ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్(Ricky Ponting).కానీ బుమ్రా స్థానాన్ని భర్తీ చేయగల సత్తా మాత్రం అర్ష్‌దీప్ సింగ్‌కు ఉందని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచ స్థాయి ఫాస్ట్ బౌలర్ అయిన బుమ్రాకు అర్ష్ నైపుణ్యాలు ఏమీ తీసిపోవని.. టీమిండియా బౌలింగ్ విభాగానికి అతడు ప్రధాన బలం కాబోతున్నాడని పేర్కొన్నాడు. కాగా బుధవారం(ఫిబ్రవరి 19) నుంచి చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుండగా.. టీమిండియా గురువారం తమ తొలి మ్యాచ్ ఆడనుంది.దుబాయ్ వేదికగా మొదట బంగ్లాదేశ్‌తో తలపడనున్న రోహిత్ సేన.. తదుపరి ఫిబ్రవరి 23న పాకిస్తాన్, మార్చి 2న న్యూజిలాండ్ జట్లను ఢీకొట్టనుంది. ఈ నేపథ్యంలో ఈ ఐసీసీ ఈవెంట్లో భారత తుదిజట్టులో ఆడబోయే పేసర్ల గురించి ఆసీస్ బ్యాటింగ్ దిగ్గజం రిక్కీ పాంటింగ్ ఐసీసీ రివ్యూ షోలో భాగంగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.‘‘బుమ్రా స్థానాన్ని నేనైతే అర్ష్‌దీప్ సింగ్‌తోనే భర్తీ చేస్తాను. టీ20 క్రికెట్లో అతడి ఆట తీరు ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఇక అర్ష్ నైపుణ్యాల విషయానికొస్తే.. బుమ్రా మాదిరే అతడు కూడా కొత్త బంతితో ఆరంభ ఓవర్లలో అద్భుతం చేయగలడు.అంతేకాదు.. డెత్ ఓవర్లలోనూ రాణించగలడు. ఏదేమైనా టీమిండియా బుమ్రా సేవలను కోల్పోవడం నష్టదాయకమే. అయితే, అర్ష్ బుమ్రా లేని లోటును కొంతవరకైనా తీర్చగలడు. ఇక హర్షిత్ రాణా కూడా ప్రతిభావంతుడైన ఫాస్ట్‌బౌలర్ అనడంలో సందేహం లేదు.అయితే, ఆరంభంలో రాణించినంత గొప్పగా.. ఆఖరి ఓవర్లలో అతడు రాణించలేకపోవచ్చు. అర్ష్‌దీప్ మాదిరి నైపుణ్యాలు అతడికి లేవు. అందుకే నా ఓటు అర్ష్కే’’ అని రిక్కీ పాంటింగ్ తెలిపాడు. కాగా లెఫ్టార్మ్ పేసర్ అయిన అర్ష్‌దీప్ సింగ్‌కు ఇప్పటి వరకు కేవలం తొమ్మిది వన్డేలు ఆడిన అనుభవం మాత్రమే ఉండగా.. హర్షిత్ రైనా ఇటీవలే అరంగేట్రం చేశాడు.ఇక అర్ష్‌దీప్ అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకు 14 వికెట్లు తీయగా.. అతడి లిస్ట్-‘ఎ’ గణాంకాలు మాత్రం మెరుగ్గా ఉన్నాయి. 33 మ్యాచ్‌లలో కలిపి అతడు 55 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే..అంతర్జాతీయ టీ20లలో మాత్రం 26 ఏళ్ల అర్ష్‌దీప్‌నకు గొప్ప రికార్డు ఉంది. 63 మ్యాచ్‌లు ఆడి 99 వికెట్లు కూల్చిన అతడు.. టీమిండియా తరఫున టీ20లలో అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్నాడు.మరోవైపు హర్షిత్ రాణా టీమిండియా తరఫున ఇప్పటి వరకు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడి ఆయా ఫార్మాట్లలో వరుసగా 4, 6, 3 వికెట్లు తీశాడు. ఇక చాంపియన్స్ ట్రోఫీ ఆడబోయే భారత పేస్ దళంలో అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా రూపంలో మరో ఇద్దరు యువ పేసర్లతో పాటు సీనియర్ పేసర్ మహ్మద్ షమీ కూడా అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.చదవండి: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు భారత తుదిజట్టు ఇదే! రోహిత్ కోరుకుంటేనే అతడికి ఛాన్స్ -
డబ్బులేదు.. మూడేళ్లపాటు మ్యాగీ తిని బతికాడు.. ఇప్పుడు అతడే..: నీతా అంబానీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ద్వారా వెలుగులోకి వచ్చి టీమిండియా స్టార్లుగా ఎదిగారు హార్దిక్ పాండ్యా(Hardik Pandya), జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah). క్రికెట్ ప్రపంచంలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని సత్తా చాటుతున్నారు. అయితే, ఈ ఇద్దరిలో దాగున్న అద్భుత నైపుణ్యాలను తెరమీదకు తెచ్చింది మాత్రం ముంబై ఇండియన్స్ యాజమాన్యం అని చెప్పవచ్చు.అంతేకాదు పాండ్యా, బుమ్రా సాధారణ ఆటగాళ్ల నుంచి సూపర్స్టార్లుగా ఎదగడంలో ఈ ఐపీఎల్ ఫ్రాంఛైజీదే కీలక పాత్ర. ఇక ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్‌బౌలర్‌గా వెలుగొందుతుండగా.. హార్దిక్ పాండ్యా సైతం టీమిండియా కీలక ప్లేయర్‌గా జట్టులో సుస్థిర స్థానం సంపాదించాడు. అంతేకాదు.. ముంబై ఇండియన్స్ కెప్టెన్ స్థాయికీ చేరుకున్నాడు.ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ యజమాని, భారత కుబేరుడు ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ(Nita Ambani) పాండ్యా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన హార్దిక్ పాండ్యా, అతడి అన్న కృనాల్ పాండ్యాలో తాము ఆట పట్ల అంకిత భావాన్ని గుర్తించి అవకాశం ఇచ్చామని.. ఈరోజు వాళ్లు ఉన్నతస్థాయికి చేరుకోవడం సంతోషంగా ఉందన్నారు.అరుదైన గౌరవంకాగా రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీకి అరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే. దార్శనిక నాయకత్వం, సమాజానికి చేసిన అసాధారణ సేవకు గుర్తింపుగా మసాచుసెట్స్ విశిష్ట గవర్నర్ ప్రశంసాపత్రాన్ని ఆమెకు ప్రదానం చేసింది. ఈ సందర్భంగా బోస్టన్‌లో మాట్లాడిన నీతా అంబానీ హార్దిక్ పాండ్యా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.‘‘ఐపీఎల్లో మాకు ఫిక్స్డ్ బడ్జెట్ ఉంటుంది. ఒక్కో ఫ్రాంఛైజీ ఇంతే ఖర్చు పెట్టాలనే నిబంధన ఉంటుంది. అయితే, మేము ఆ డబ్బును కొత్త మార్గాల్లో ఖర్చుచేయాలనుకున్నాం. ప్రతిభ ఉన్న ఆటగాళ్లను వెలికితీయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్లాం.బక్కపల్చగా, పొడుగ్గా ఉన్న ఇద్దరు యువకులుముఖ్యంగా రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు జరిగినప్పుడు నేను ప్రత్యేకంగా అక్కడికి వెళ్లేదాన్ని. నాతో పాటు మా స్కౌట్ బృందం కూడా ఉండేది. ప్రతి దేశవాళీ మ్యాచ్‌ను నిశితంగా గమనించేవాళ్లం. మా స్కౌట్ క్యాంపులో భాగంగా బక్కపల్చగా, పొడుగ్గా ఉన్న ఇద్దరు యువ ఆటగాళ్లను చూశాం.మ్యాగీ మాత్రమే తిని బతికారునేను వెళ్లి వాళ్లతో మాట్లాడాను. తాము గత మూడేళ్లుగా కేవలం మ్యాగీ మాత్రమే తిని బతుకుతున్నామని అప్పుడు వాళ్లు చెప్పారు. తమ దగ్గర డబ్బు లేదని అందుకే నూడుల్స్‌తో కడుపు నింపుకొంటున్నామని అన్నారు. అయితే, అప్పుడు నాకు వారిలో ఆట పట్ల ఉన్న నిబద్ధత.. ఏదో సాధించాలన్న బలమైన తపన కనిపించాయి.ఆ ఇద్దరు.. సోదరులు.. వారు మరెవరో కాదు.. హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా. 2015లో నేను హార్దిక్ పాండ్యా కోసం రూ. 10 లక్షలు ఖర్చుచేసి వేలంలో అతడిని కొనుక్కున్నా. ఇప్పుడు అతడు ముంబై ఇండియన్స్‌కు గర్వకారణమైన కెప్టెన్’’ అని నీతా అంబానీ హార్దిక్ పాండ్యా నైపుణ్యాలపై ప్రశంసలు కురిపించారు.మరో ఆణిముత్యం.. అతడే ఓ చరిత్రఇక ఆ మరుసటి ఏడాది.. తమకు మరో ఆణిముత్యం దొరికిందన్న నీతా అంబానీ.. ‘‘ఓ యువ క్రికెటర్. అతడి బాడీ లాంగ్వేజ్ భిన్నంగా ఉంది. అతడు బౌలింగ్ చేస్తే చూడాలని అక్కడ కూర్చున్నాం. తానేంటో అతడు బంతితోనే నిరూపించుకున్నాడు. అతడు బుమ్రా. ఇక ఆ తర్వాత జరిగిందంతా ఓ చరిత్ర’’ అంటూ జస్ప్రీత్ బుమ్రాను ఆకాశానికెత్తారు. ఇక తిలక్ వర్మను కూడా తాము ఏరికోరి ఎంచుకున్నామన్న నీతా అంబానీ.. టీమిండియాకు ముంబై ఇండియన్స్ ఓ నర్సరీ లాంటిదంటూ తమ ఫ్రాంఛైజీపై ప్రశంసలు కురిపించారు.ఐపీఎల్ 2025లో పాల్గొనే ముంబై ఇండియన్స్ జట్టుహార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, నమన్ ధిర్, బెవాన్ జాకబ్స్, రాజ్ బవా, విల్ జాక్స్, విజ్ఞేశ్ పుతుర్, సత్యనారాయణ రాజు, మిచెల్ సాంట్నర్, అర్జున్ టెండూల్కర్, ర్యాన్ రికెల్టన్, రాబిన్ మింజ్, కృష్ణణ్ శ్రీజిత్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వని కుమార్, రీస్ టాప్లే, లిజాడ్ విలియమ్స్, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్ ఉర్ రెహ్మాన్.#WATCH | Boston, US: Reliance Foundation Founder-Chairperson Nita Ambani tells how she scouted for new talent for the Mumbai Indians team and included Hardik Pandya, Krunal Pandya, Jasprit Bumrah and Tilak Varma in the teamShe says, "In IPL, we all have a fixed budget, so every… pic.twitter.com/v0HriPJH8T— ANI (@ANI) February 17, 2025 -
రోహిత్ శర్మకు బిగ్ షాక్.. టీమిండియా కెప్టెన్‌గా స్టార్ ప్లేయర్?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohitsharma) టెస్టు భవిష్యత్తు ప్రశ్నర్థకంగా మారింది. గతేడాదిగా టెస్టు క్రికెట్లో రోహిత్ శర్మ దారుణమైన ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. అటు కెప్టెన్‌గా, ఇటు బ్యాటింగ్ పరంగా రోహిత్ పూర్తిగా తేలిపోతున్నాడు. గతేడాది ఆఖరిలో స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు వైట్‌వాష్‌కు గురైంది.స్వదేశంలో ప్రత్యర్ధి చేతిలో మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ వైట్‌వాష్ కావడం ఇదే మొదటి సారి. ఆ తర్వాత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోనూ రోహిత్ తీరు మారలేదు. తొలి టెస్టుకు వ్యక్తిగత కారణాలతో దూరమైన హిట్‌మ్యాన్.. ఆ తర్వాతి మ్యాచ్‌లకు అందుబాటులోకి వచ్చాడు. తొలి టెస్టులో విజయం సాధించిన భారత్.. రోహిత్ వచ్చాక వరుసగా మూడు మ్యాచ్‌లలో ఓటమి చవిచూసింది.ఈ మూడు మ్యాచ్‌లలోనూ రోహిత్ తీవ్ర నిరాశపరిచాడు. దీంతో ఆఖరి టెస్టుకు భారత కెప్టెన్ తనంతంట తనే జట్టు నుంచి తప్పుకున్నాడు. అనంతరం స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్ పర్వాలేదన్పించాడు. తొలి వన్డేలో విఫలమైన ఈ ముంబైకర్.. ఆ తర్వాతి రెండో వన్డేలో మాత్రం విధ్వంసకర శతకంతో చెలరేగాడుఅయితే ఆ జోరును మూడో వన్డేలో కొనసాగించలేకపోయాడు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు రోహిత్ సిద్దమవుతున్నాడు. ఈ మెగా టోర్నీ తర్వాత శర్మ భవిష్యత్తుపై ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది. ఏదేమైనప్పటికి టెస్టుల్లో మాత్రం రోహిత్ కెరీర్ ముగిసినట్లేనని తాజా రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.కెప్టెన్‌గా బుమ్రా..?ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు హిట్‌మ్యాన్‌ను ఎంపిక చేసే అవకాశం లేదని పిటిఐ తమ నివేదికలో పేర్కొంది. అతడి స్ధానంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprith Bumrah)కు జట్టు పగ్గాలను అప్పగించాలని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు సమాచారం.కాగా బుమ్రా ప్రస్తుతం గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి సైతం అతడు దూరమయ్యాడు. బుమ్రా తిరిగి ఐపీఎల్-2025తో తిరిగి మైదానంలో అడుగపెట్టే అవకాశముంది. కాగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో బుమ్రా రెండు పర్యాయాలు భారత జట్టుకు నాయకత్వం వహించాడు.పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బుమ్రా సారథ్యంలోని భారత జట్టు 295 పరుగుల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. బుమ్రా మరోసారి సిడ్నీలో జరిగిన ఆఖరి టెస్టులో భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే ఈ మ్యాచ్‌లో బుమ్రా గాయం కారణంగా మధ్యలోనే వైదొలగడంతో టీమిండియా ఓటమి చవిచూసింది.ఒకే ఒక హాఫ్ సెంచరీ..గత 15 టెస్టు ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ 164 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో ఒక అర్ధ సెంచరీ ఉంది. రోహిత్ గత 15 ఇన్నింగ్స్‌లో వరుసగా 6, 5, 23, 8, 2, 52, 0, 8, 18, 11, 3, 6, 10 పరుగులు చేశాడు. చివరగా మెల్బోర్న్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 3 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 9 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. ఈ ఏడాది 14 టెస్టులాడిన రోహిత్.. 26 ఇన్నింగ్స్‌లో 24.76 సగటుతో 619 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, మరో రెండు హాఫ్ సెంచరీలున్నాయి.చదవండి: రోహిత్, కోహ్లితో పాటు అతడికి ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ: భారత మాజీ క్రికెటర్ -
ఇదేమీ టీ20 ఫార్మాట్ కాదు: టీమిండియాకు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ వార్నింగ్
ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) లేకుండానే టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) బరిలో దిగనుంది. వెన్నునొప్పి నుంచి కోలుకోని కారణంగా ఈ పేస్ గుర్రం ఐసీసీ టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. అయితే, ఈ వన్డే ఫార్మాట్ ఈవెంట్లో బుమ్రా లేని లోటు టీమిండియాపై కచ్చితంగా ప్రభావం చూపిస్తుందంటున్నాడు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్.ప్రపంచ స్థాయి బౌలర్ అయిన బుమ్రా స్థానాన్ని వేరొక ఆటగాడు భర్తీ చేయడం అంత సులువేమీ కాదని అభిప్రాయపడ్డాడు. ఈ సందర్భంగా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్(Arshdeep Singh)ను ఉద్దేశించి డేవిడ్ లాయిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వన్డేల్లో అంతగా అనుభవం లేని అర్ష్‌దీప్.. నేరుగా ఐసీసీ టోర్నీలో అడుగుపెట్టి అద్భుతాలు చేస్తాడని ఊహించలేమన్నాడు.సిరాజ్‌ను కాదనికాగా ఫిట్నెస్ సమస్యల కారణంగా బుమ్రా దూరమవుతాడని ముందుగానే ఊహించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).. పేస్ దళంలో సీనియర్ మహ్మద్ షమీతో పాటు అర్ష్‌దీప్ సింగ్‌కు చోటిచ్చింది. అయితే, మరో సీనియర్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌పై మాత్రం నమ్మకం ఉంచలేకపోయింది.సిరాజ్‌ను కాదని అర్ష్‌దీప్‌ను ఐసీసీ ఈవెంట్‌కు ఎంపిక చేయడానికి గల కారణాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే వెల్లడించాడు కూడా. ఆరంభంలో కొత్త బంతితో ప్రభావం చూపుతున్న సిరాజ్.. డెత్ ఓవర్లలో మాత్రం రాణించలేకపోతున్నాడని పేర్కొన్న సిరాజ్.. అర్ష్‌దీప్ మాత్రం రెండు సందర్భాల్లోనూ మ్యాజిక్ చేయగలడని పేర్కొన్నాడు. అందుకే తాము ఈ యువ పేసర్ వైపు మొగ్గు చూపినట్లు తెలిపాడు.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కోచ్ డేవిడ్ లాయిడ్ మాట్లాడుతూ.. ‘‘ఒకరు జట్టులో లేకపోవడం వల్ల మరొకరికి చోటు దక్కడం నిజంగా ఓ గొప్ప అవకాశమే. అయితే, బుమ్రా ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్. అతడు జట్టులో లేకుంటే కచ్చితంగా ఆ ప్రభావం ఉంటుంది.ఇదేమీ టీ20 ఫార్మాట్ కాదుఇక అర్ష్‌దీప్ విషయానికి వస్తే.. టీ20లకు, వన్డే ఫార్మాట్ భిన్నంగా ఉంటుంది. నాలుగు ఓవర్లు వేయడానికి.. పది ఓవర్ల బౌలింగ్‌కు కచ్చితంగా తేడా ఉంటుంది. ఇలా వచ్చి అలా వెళ్లిపోవడానికి ఇది టీ20 కాదు. వరుస ఓవర్లు, దీర్ఘమైన స్పెల్స్ వేయాల్సి ఉంటుంది. అయితే, అర్ష్‌దీప్‌నకు అలాంటి అనుభవం లేదు’’ అని పేర్కొన్నాడు.కాగా అంతర్జాతీయ టీ20లలో అర్ష్‌దీప్ సింగ్ భారత్ తరఫున అత్యధిక వికెట్లు వీరుడిగా కొనసాగుతున్నాడు. అతడి ఖాతాలో ఇప్పటి వరకు 99 వికెట్లు ఉన్నాయి. అయితే, ఇప్పటి వరకు టీమిండియా తరఫున కేవలం తొమ్మిది వన్డేలు మాత్రమే ఆడిన ఈ లెఫ్టార్మ్ పేసర్ పద్నాలుగు వికెట్లు తీయగలిగాడు. తొమ్మిది వన్డేలు ఆడిఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో పాల్గొన్న అర్ష్‌దీప్ సింగ్ ఆఖరిదైన అహ్మదాబాద్ మ్యాచ్‌లో ఆడాడు. ఈ వన్డేలో ఐదు ఓవర్లు బౌల్ చేసిన అర్ష్.. 33 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది. ఈ టోర్నీలో టీమిండియా తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడుతుంది. ఇక ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్.. వన్డే ప్రపంచకప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, భారత్, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక అర్హత సాధించాయి. కాగా బుమ్రా స్థానంలో యువ పేసర్ హర్షిత్ రాణా చాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి వచ్చాడు.చదవండి: CT 2025: సురేశ్ రైనా ఎంచుకున్న భారత తుదిజట్టు... వరల్డ్‌కప్ వీరులకు నో ఛాన్స్! -
CT 2025: సీన్ రివర్స్.. బ్యాటింగ్ ఓకే.. బుమ్రా లేని లోటు తీరేనా?
ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌కు ముందు ఇంగ్లండ్‌తో నిర్వహించిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ద్వారా భారత్ బ్యాటింగ్‌పై ఇటీవల రేకెత్తిన అనేక ప్రశ్నల కి సమాధానం లభించింది. ఈ సిరీస్ తో భారత్ బ్యాటింగ్ ఇబ్బందులు మాత్రం తొలిగినట్టే కనిపిస్తున్నాయి. ఇంతకుముందు కటక్ లో జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు.ఇక బుధవారం అహ్మదాబాద్‌లో జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 55 బంతుల్లో 52 పరుగులు సాధించి తన ఫామ్ పై వస్తున్న విమర్శలకు అడ్డుకట్ట వేసాడు. ఇక ఓపెనర్‌గా వచ్చిన యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ కూడా సెంచరీ సాధించడంతో భారత్ బ్యాటింగ్ మళ్ళీ గతంలో లాగా పటిష్టంగా కనిపిస్తోంది. కోహ్లీ రికార్డ్ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కి వ్యతిరేకంగా అంతర్జాతీయ క్రికెట్లో 4,000 పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డ్ కూడా సాధించాడు. ఇంగ్లండ్‌పై 4,000 పరుగుల మైలురాయిని అధిగమించిన ఆరో బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ ఘనత వహించాడు. ఇంగ్లాండ్‌పై అన్ని ఫార్మాట్లలో కలిపి 87వ మ్యాచ్ లలో ఎనిమిది సెంచరీలు, 23 అర్ధ సెంచరీలు, 41.23 సగటు తో కోహ్లీ ఈ ఘనత సాధించాడు.ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మాన్ ఇంగ్లండ్‌పై 37 టెస్ట్ మ్యాచ్‌ల్లో 5,028 పరుగులు సాధించి తో ఈ పట్టిక లో అగ్రస్థానంలో ఉన్నాడు. తర్వాత ఆస్ట్రేలియా కి చెందిన అలన్ బోర్డర్ (124 ఇన్నింగ్స్‌లలో 4850), స్టీవ్ స్మిత్ (114 ఇన్నింగ్స్‌లలో 4815), వెస్టిండీస్ బ్యాటర్ వివియన్ రిచర్డ్స్ (84 ఇన్నింగ్స్‌లలో 4488), ఆస్ట్రేలియాకే చెందిన రికీ పాంటింగ్ (99 ఇన్నింగ్స్‌లలో 4141) వరుసగా తర్వాత స్థానాలలో ఉన్నారు. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలోనూ అంతకుముందు స్వదేశంలో జరిగిన శ్రీలంక, న్యూజిలాండ్ లతో జరిగిన సిరీస్ లలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ పేలవంగా ఆడటంతో వీరిద్దరి ఫామ్‌పై పలు విమర్శలు చెలరేగాయి. కానీ ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్ లో వీరిద్దరూ కూడా పరుగులు సాధించడంతో భారత్ జట్టు మేనేజిమెంట్ ఊపిరి పీల్చుకుంది.బుమ్రా లేని భారత్ బౌలింగ్ అయితే బ్యాటింగ్ విషయం పర్వాలేదనిపించినా ప్రస్తుతం బౌలింగ్ పెద్ద సమస్య గా పరిణమించే ప్రమాదముంది. భారత్ ప్రధాన బౌలర్ వెన్ను నొప్పి కారణంగా ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకొన్నాడు. జనవరిలో ఆస్ట్రేలియా తో జరిగిన సిడ్నీ టెస్ట్ సమయంలో మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ నుంచి వైదొలిగిన బుమ్రా ఇంకా పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను కూడా తాత్కాలిక జట్టు నుంచి తొలగించారు అతని స్థానంలో ఇటీవల కాలంలో నిలకడగ రాణిస్తున్న స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని ఎంపిక చేశారు. బుమ్రా తాజాగా బెంగళూరులో తీయించుకున్న స్కాన్లలో తీవ్రమైన ఇబ్బంది కనిపించక పోయినప్పటికీ, పూర్తి స్థాయిలో కోలుకోడానికి రెండు వారాలు పట్టే అవకాశం ఉన్నందున అతనికి మరింత విశ్రాంతి ఇవ్వాలని మేనేజిమెంట్ నిర్ణయించింది. గాయం కారణంగా బుమ్రా దూరమవుతున్న రెండవ ఐసీసీ టోర్నమెంట్ ఇది. గతంలో వెన్నునొప్పి కి ఆస్ట్రేలియాలో జరిగిన శస్త్రచికిత్స కారణంగా 2022 టి20 ప్రపంచ కప్ నుంచి కూడా బుమ్రా వైదొలిగిన విషయం తెలిసిందే.స్పిన్నర్ల పైనే భారం బుమ్రా స్థానంలో హర్షిత్ రాణా ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ సిరీస్‌లో వన్డే అరంగేట్రం చేశాడు. జనవరిలో ఛాంపియన్స్ ట్రోఫీ మరియు ఇంగ్లండ్ సిరీస్ కోసం తాత్కాలిక జట్టును ప్రకటించినప్పుడు, ఇంగ్లండ్ వన్డేలకు బుమ్రాకు పూర్తిగా కోలుకోని కారణంగా రాణాని జట్టులోకి ఎంపిక చేశారు. గాయం నుంచి కోలుకొని మళ్ళీ జట్టులోకి వచ్చిన మహమ్మద్ షమీ కూడా ఇంకా పూర్తి స్థాయి ఫామ్ సాధించలేక పోతున్నాడన్న విషయం, ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న సిరీస్ లో తేటతెల్లమైంది.ఇక వీరిద్దరి తర్వాత మూడవ అత్యంత సీనియర్ పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్‌ని ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత జట్టు నుంచి తప్పించడం తో భారత్ పేస్ బౌలింగ్ షమీ , అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా ల పై ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పేస్ బౌలింగ్ కన్నా, స్పిన్నర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి ల పైనే ఎక్కువ భారం పడే అవకాశం ఉంది. -
ఛాంపియన్స్ ట్రోఫీకి గాయాల బెడద.. ఒక్కొక్కరుగా దూరమవుతున్న స్టార్ పేసర్లు
ఛాంపియన్స్ ట్రోఫీకి (Champions Trophy-2025) గాయాల బెడద పట్టుకుంది. మెగా టోర్నీకి స్టార్ పేసర్లు ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు. ఇప్పటికే అన్రిచ్ నోర్జే, కెమరూన్ గ్రీన్, మిచెల్ మార్ష్, పాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్, క్రిస్ వోక్స్, లోకీ ఫెర్గూసన్, గెరాల్డ్ కొయెట్జీ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం కాగా.. తాజాగా జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah), మిచెల్ స్టార్క్ (Mitchell Starc) వైదొలిగారు.వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్లంతా దూరమైతే మెగా టోర్నీ కళ తప్పే ప్రమాదముంది. అన్ని జట్ల కంటే గాయాల సమస్య ఆస్ట్రేలియాను (Australia) ఎక్కువగా వేధిస్తుంది. ఆ జట్టులో ఏకంగా ఐదుగురు స్టార్ ఆటగాళ్లు గాయపడ్డారు. ఒకరు (Marcus Stoinis) ఏకంగా వన్డే క్రికెట్‌కే రిటైర్మెంట్ ప్రకటించారు. జట్టులో సగానికి పైగా రెగ్యులర్ ఆటగాళ్లు దూరం కావడం ఆస్ట్రేలియా విజయావకాశాలను దెబ్బతీస్తుంది. అసలే గత రెండు ఎడిషన్లలో ఆస్ట్రేలియాకు మంచి ట్రాక్ రికార్డు లేదు. 2013, 2017 ఎడిషన్లలో ఆ జట్టు ఒక్క మ్యాచ్ కూడా నెగ్గలేదు.పేలవ బ్యాక్‌గ్రౌండ్ కలిగిన ఆస్ట్రేలియా, అనుభవం లేని జట్టుతో బరిలోకి దిగి ఏ మేరకు విజయాలు సాధిస్తుందో వేచి చూడాలి. ప్రస్తుత ఎడిషన్‌లో ఆస్ట్రేలియాకు స్టీవ్ స్మిత్ సారథ్యం వహించనున్నాడు. ఆసీస్ సెలెక్టర్లు కీలక ఆటగాళ్లకు ప్రత్యామ్నాయాలను ప్రకటించారు. బెన్ డ్వార్షుయిష్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, స్పెన్సర్ జాన్సన్, తన్వీర్ సంఘా, సీన్ అబాట్ కొత్తగా జట్టులోకి వచ్చారు. వీరికంతా అనుభవం అంతంతమాత్రమే.బుమ్రాకు ప్రత్యామ్నాయంగా హర్షిత్ రాణాబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా గాయపడిన జస్ప్రీత్ బుమ్రాకు ప్రత్యామ్నాయంగా హర్షిత్ రాణాను ఎంపిక చేశారు భారత సెలెక్టర్లు. హర్షిత్ ఇటీవలే వన్డే అరంగ్రేటం చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో మహ్మద్ షమీ ఒక్కడే అనుభవజ్ఞుడు. అర్షదీప్ సింగ్ ఉన్నా, అతను ఆడింది కేవలం 8 వన్డేలే. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ముందుగా ప్రకటించిన జట్టులో భారత్ మరో మార్పు చేసింది. యశస్వి జైస్వాల్ స్థానంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి జట్టులోకి వచ్చాడు.ఆఫ్ఘనిస్తాన్నూ వదలని గాయాల సమస్యఛాంపియన్స్ ట్రోఫీకి ముందు గాయాల సమస్య ఆఫ్ఘనిస్తాన్‌ను కూడా వదల్లేదు. గాయం కారణంగా ఆ జట్టు స్పిన్ సంచలనం అల్లా ఘజన్ఫర్ మెగా టోర్నీకి దూరమయ్యాడు. 18 ఏళ్ల ఘజన్ఫర్ గత నెలలో జింబాబ్వేతో జరిగిన సిరీస్ సందర్భంగా గాయపడ్డాడు. ఘజన్ఫర్కు వెన్నుపూసలో పగుళ్లు వచ్చినట్లు డాక్టర్లు నిర్దారించారు. దీని కారణంగా ఘజన్‌ఫన్ నాలుగు నెలలు క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఘజన్ఫర్ ఐపీఎల్ 2025లో పాల్గొనేది కూడా అనుమానమే అని తెలుస్తుంది.ఇటీవల ముగిసిన ఐపీఎల్ మెగా వేలంలో ముంబై ఇండియన్స్ ఘజన్‌ఫర్‌ను రూ. 4.8 కోట్లకు సొంతం చేసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఘజన్ఫర్కు ప్రత్యామ్నాయంగా నంగేయాలియా ఖరోటేను ఎంపిక చేశారు ఆఫ్ఘన్ సెలెక్టర్లు.కాగా, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరుగనున్నాయి. మిగతా మ్యాచ్‌లకు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 19న జరిగే టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడతాయి. అనంతరం ఫిబ్రవరి 20న జరిగే మ్యాచ్‌లో భారత్, బంగ్లాదేశ్‌ను ఢీకొంటుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగనుంది.ఈ టోర్నీలో ఆసీస్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు గ్రూప్-బిలో ఉండగా.. గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు పోటీపడతాయి. -
చాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా దూరం... జట్టులోకి హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి
ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత జట్టుకు గట్టి దెబ్బ తగిలింది. టాప్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ఈ ఐసీసీ ఈవెంట్‌కు దూరమయ్యాడు. వెన్ను గాయంతో బాధపడుతున్న అతను పూర్తిగా కోలుకోలేదు. జాతీయ క్రికెట్ అకాడమీలో రీహాబిలిటేషన్ అనంతరం అతని ఫిట్‌నెస్‌పై వైద్యులు బీసీసీఐకి నివేదిక అందించారు. ఇందులో గాయం తీవ్రతపై వివరాలు లేకున్నా... ఇప్పుడు బౌలింగ్ చేసే స్థితిలో లేడని మాత్రం స్పష్టమైంది. బుమ్రా ఆడటంపై చాలా రోజులుగా సందేహాలు ఉన్నా... ఇప్పుడు మాత్రమే బోర్డు దీనిని అధికారికంగా ధ్రువీకరించింది. బుమ్రా స్థానంలో హర్షిత్ రాణాను సెలక్టర్లు ఎంపిక చేశారు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని కూడా 15 మంది సభ్యుల చాంపియన్స్ ట్రోఫీ టీమ్‌లోకి తీసుకున్నారు. వరుణ్ కోసం యశస్వి జైస్వాల్‌ను టీమ్ నుంచి తప్పించారు. స్థిరమైన ఓపెనర్లుగా రోహిత్, గిల్ ఉండటంతో జైస్వాల్‌పై వేటు వేయాల్సి వచి్చంది. అయితే నాన్ ట్రావెలింగ్ సబ్స్టిట్యూట్లుగా జైస్వాల్, సిరాజ్, శివమ్ దూబేలను ఎంపిక చేశారు. వీరు అవసరమైతేనే దుబాయ్‌కు ప్రయాణిస్తారు. -
బుమ్రాపై నేడు తుది నిర్ణయం.. చాంపియన్స్ ట్రోఫీ తుది జట్ల ఖరారుకు నేడు ఆఖరి రోజు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీలో (Champions Trophy) భారత స్టార్ పేసర్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Burah) ఆడతాడా లేదా అనేది నేడు తేలిపోతుంది. అతని ఫిట్నెస్ నివేదికను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ సెలక్టర్లు మంగళవారం నిర్ణయం తీసుకుంటారు. వెన్ను నొప్పితో బాధపడుతున్న బుమ్రాకు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఇటీవలే స్కానింగ్ జరిగింది. దీనిపై డాక్టర్లు ఇచ్చే నివేదికను పరిశీలించిన అనంతరం సెలక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు. జనవరిలో ఆ్రస్టేలియాతో సిడ్నీతో జరిగిన చివరి టెస్టు తర్వాత బుమ్రా మళ్లీ బరిలోకి దిగలేదు. ఆ మ్యాచ్‌లోనూ నొప్పి కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయనే లేదు. అతను కనీసం ఐదు వారాల పాటు బౌలింగ్‌కు దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు. ప్రకటించిన 15 మంది సభ్యుల భారత జట్టులో బుమ్రా కూడా ఉన్నాడు. అయితే స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే చివరి వన్డేలో (బుధవారం) ఆడి అతను తన ఫిట్నెస్ నిరూపించుకుంటాడని భావించారు. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తే బుమ్రా ఈ మ్యాచ్ కూడా ఆడటం సందేహమే. చాంపియన్స్ ట్రోఫీ కోసం ఇప్పటికే ప్రకటించిన జట్టులో మార్పులు చేసుకునేందుకు 11వ తేదీ వరకు అవకాశం ఉంది. బుమ్రా సిద్దంగా లేకపోతే ఢిల్లీ పేసర్ హర్షిత్ రాణాకు (Harshit Rana) టీమ్‌లో స్థానం లభించవచ్చు. తాజాగా ఇంగ్లండ్‌తో సిరీస్‌లో రాణా తొలి రెండు వన్డేల్లో బరిలోకి దిగాడు. -
బుమ్రా ఫిట్‌గా ఉన్నాడా!
బెంగళూరు: ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీలో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ఆడే అవకాశాలపై సందిగ్ధత వీడనుంది. వెన్ను నొప్పికి చికిత్స తీసుకుంటూ జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఉన్న బుమ్రా ఫిట్‌నెస్‌పై నేడు స్పష్టత రానుంది. అతనికి అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన వైద్య బృందం శనివారం బీసీసీఐకి తమ నివేదికను అందజేస్తుంది. ఇందులో బుమ్రా గాయం తీవ్రత, చికిత్సతో పాటు మ్యాచ్ ఫిట్‌నెస్‌కు సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి. ప్రస్తుతానికి భారత పేసర్ బెంగళూరులోనే ఉండనున్నాడు. నివేదికను అందుకున్న తర్వాత బోర్డు అధికారులు బుమ్రాను ఆడించే విషయంపై భారత టీమ్ మేనేజ్మెంట్తో చర్చించే అవకాశం ఉంది. జనవరిలో సిడ్నీ టెస్టు అనంతరం ఆ్రస్టేలియా నుంచి తిరిగొచ్చిన తర్వాత బుమ్రా గాయానికి స్కానింగ్ తీశారు. వెన్ను నొప్పి కారణంగానే ఆ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్‌కు దిగలేదు. నాడు ఆ రిపోర్టులను న్యూజిలాండ్‌కు చెందిన ప్రముఖ క్రీడా వైద్యుడు డాక్టర్ రోవన్ షూటెన్కు చూపించారు. అతని పర్యవేక్షణలోనే చికిత్స కొనసాగింది కాబట్టి ఇప్పుడు కూడా రోవన్ అభిప్రాయం కీలకం కానుంది. చాంపియన్స్ ట్రోఫీ కోసం ఇప్పటికే ప్రకటించిన జట్టులో మార్పులు చేసుకునేందుకు ఈ నెల 12 వరకు గడువు ఉంది. బుమ్రా పూర్తిగా కోలుకోకపోతే అతని స్థానంలో భారత జట్టు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి లేదా పేసర్ హర్షిత్ రాణాలలో ఒకరిని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. మార్చి 1న బీసీసీఐ ఎస్జీఎం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంయుక్త కార్యదర్శి పదవి కోసం ఆసక్తికర పోటీ సాగుతోంది. బోర్డులో ఇప్పటికే తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న ముగ్గురు సీనియర్ సభ్యులు ఈ పదవిపై ఆసక్తి చూపిస్తున్నారు. అవిషేక్ దాల్మియా (బెంగాల్ సంఘం), రోహన్ జైట్లీ (ఢిల్లీ సంఘం), సంజయ్ నాయక్ (ముంబై సంఘం)లలో ఒకరికి ఈ అవకాశం దక్కనుంది. అయితే కార్యదర్శి, కోశాధికారి ఎంపిక తరహాలోనే ఈ పదవికి కూడా ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా ఎంపిక చేసేందుకు బోర్డు ప్రయత్నిస్తోంది. నిబంధనల ప్రకారం సంయుక్త కార్యదర్శి ఎంపిక కోసం మార్చి 1న ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం) నిర్వహించనుంది. దీనికి సంబంధించి అన్ని రాష్ట్ర సంఘాలకు నోటీసులు పంపించారు. ఇప్పటి వరకు సంయుక్త కార్యదర్శిగా ఉన్న దేవ్జిత్ సైకియా కార్యదర్శిగా ఎన్నిక కావడంతో ఈ పదవికి ఖాళీ ఏర్పడింది. -
'బుమ్రా దూరమైతే అతడికి ఛాన్స్ ఇవ్వండి.. అద్భుతాలు సృష్టిస్తాడు'
టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) గాయం కారణంగా ఆటకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో గాయపడ్డ బుమ్రా.. స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు దూరమయ్యాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకున్నప్పటికి అతడి ఆడేది అనుమానమే. బుమ్రా ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో రీహాబిలిటేషన్‌లో ఉన్నాడు.కనీసం ఎంతవరకు కోలుకున్నాడనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. . ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా టీమ్ మెనెజ్‌మెంట్‌కు కీలక సూచనలు చేశాడు. బుమ్రాకు బ్యాకప్‌గా యవ పేసర్ హర్షిత్ రాణా(Harshit Rana)కు పరిగణలోకి తీసుకోవాలని, ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో అతడికి ఛాన్స్ ఇవ్వాలని చోప్రా అభిప్రాయపడ్డాడు. కాగా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికైన హర్షిత్ రాణా.. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. ఇప్పటికే టీ20ల్లో అరంగేట్రం చేసిన రాణా, ఇంగ్లండ్ సిరీస్‌తో వన్డేల్లో కూడా అడుగుపెట్టే ఛాన్స్ ఉంది."బుమ్రా గాయంపై ఎటువంటి అప్డేట్ లేదు. పూర్తిగా ఇంగ్లండ్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అంతేకాకుండా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో మహ్మద్ సిరాజ్ కూడా లేడు. దీంతో హర్షిత్ రాణాను ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్దం చేయండి. ఇంగ్లండ్‌తో వన్డేల్లో అతడిని ఆడించేందుకు ప్రయత్నించండి. అదేవిధంగా అర్ష్‌దీప్ సింగ్ ఇప్పటివరకు కేవలం 8 వన్డేలు మాత్రమే ఆడాడు. అతడికి వన్డేల్లో ఎక్కువగా అనుభవం లేదు. మరోవైపు మహ్మద్ షమీ తన రీఎంట్రీలో అంత రిథమ్‌లో కన్పించడం లేదు. ఇంగ్లండ్‌తో ఆఖరి టీ20లో అతడు మూడు వికెట్లు పడగొట్టనప్పటికి భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.ఒకవేళ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైతే భారత జట్టులో కేవలం ఇద్దరు పేసర్లు మాత్రమే మిగిలనున్నారు. ఇది జట్టుకు మంచిది కాదు. కాబట్టి బుమ్రా బ్యాకప్‌గా రాణాను సిద్దం చేయండి. అతడు అద్బుతాలు సృష్టిస్తాడు" అంటూ చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.కాగా రాణా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20లో అరంగేట్రం చేశాడు. ఈ యువ పేసర్ శివమ్ దూబే స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబరిచాడు. తన టీ20 అరంగేట్రంలో వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. ఐపీఎల్‌తో పాటు దేశవాళీ క్రికెట్లో కూడా రాణాకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ క్రమంలోనే రాణాను మూడవ పేసర్‌గా ఉపయోగించాలని చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇక ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ గురువారం నుంచి మొదలు కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి వన్డే నాగ్‌పూర్ వేదికగా జరగనుంది. అదేవిధంగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది.జట్లుభారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజాఇంగ్లండ్: హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జోరూట్, జాకోబ్ బెతెల్, లియామ్ లివింగ్‌స్టోన్, బ్రైడన్ కార్స్, జేమీ ఓవర్టన్, జోస్ బట్లర్, జేమీ స్మిత్, ఫిలిప్ సాల్ట్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, సకీబ్ మహ్మూద్, మార్క్ వుడ్.చదవండి: ‘చాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్ కెప్టెన్సీకి నేను సిద్ధం’ -
Jasprit Bumrah: ‘విజయావకాశాలు 35% తగ్గుతాయి’
దుబాయ్: భారత స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనడం ఇంకా సందేహంగానే ఉంది. ఆ్రస్టేలియాతో చివరి టెస్టులో వెన్నునొప్పితో రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయని బుమ్రా ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో రీహాబిలిటేషన్‌లో ఉన్నాడు. అతను ఎంతవరకు కోలుకున్నాడనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఇంగ్లండ్‌తో చివరి వన్డే ఆడి తన ఫిట్నెస్ను నిరూపించుకుంటాడని చెబుతున్నా దానిపైనా సందేహాలు ఉన్నాయి. భారత జట్టుకు సంబంధించి అతని బౌలింగ్ విలువ ఎంత అమూల్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతను చాంపియన్స్ ట్రోఫీకి దూరమైతే టీమిండియా బలహీనంగా మారిపోవచ్చు. మాజీ ఆటగాడు రవిశాస్త్రి కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. బుమ్రా గైర్హాజరు చాలా ప్రభావం చూపిస్తుందని అతను వ్యాఖ్యానించాడు. ‘బుమ్రా ఫిట్‌గా లేకపోతే భారత జట్టు విజయావకాశాలు చాలా తగ్గిపోతాయి. సరిగ్గా చెప్పాలంటే 30–35 శాతం వరకు గెలుపుపై ప్రభావం పడుతుంది. అతను పూర్తి ఫిట్‌గా ఉండి బరిలోకి దిగితే ఆట స్వరూపమే మారిపోతుంది. ముఖ్యంగా చివరి ఓవర్లలో అతను కచ్చితంగా చెలరేగి గెలిపించగలడు. అయితే బుమ్రాను ఆడించే విషయంలో తొందర పడవద్దు. లేకపోతే గాయం తీవ్రత మరింత పెరిగిపోతుంది. కెరీర్ కీలక దశలో ఉన్న అతను రాబోయే రోజుల్లో ఎంతో ఆడాల్సి ఉంది. అలాంటివాడిని ఒక్కసారిగా పిలిపించి గెలిపించమని కోరడం సరైంది కాదు. బుమ్రా చాలా విలువైనవాడు.అతనిపై అంచనాలూ భారీగా ఉంటాయి. వచ్చి రాగానే చెలరేగిపోవాని అంతా కోరుకుంటారు. నాకు తెలిసి గాయంనుంచి కోలుకొని వచ్చి అలా ఆడటం సాధ్యం కాదు’ అని రవిశాస్త్రి విశ్లేషించాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో మొహమ్మద్ షమీపై అందరి దృష్టీ ఉంటుందని...అతని ఫిట్‌నెస్‌కు కూడా ఇది పరీక్ష కానుందని కూడా భారత మాజీ కోచ్ అభిప్రాయ పడ్డాడు. -
CT 2025: వరుణ్ చక్రవర్తి రేసులో ఉన్నాడు: రోహిత్ శర్మ
టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ఇప్పట్లో మైదానంలో దిగే పరిస్థితి కనిపించడం లేదు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) నాటికి కూడా అతడు అందుబాటులోకి వస్తాడా? లేదా అన్న విషయంపై కూడా సందిగ్దం నెలకొంది. కాగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో అంతా తానై పేస్ దళ బాధ్యతలు మోసిన బుమ్రా.. ఆఖరిదైన సిడ్నీ టెస్టు సందర్భంగా వెన్నునొప్పి(Back Spasm)తో బాధపడ్డాడు. మ్యాచ్ మధ్యలోనే ఆస్పత్రికి వెళ్లిన బుమ్రా.. వైద్య పరీక్షల అనంతరం మళ్లీ జట్టుతో చేరాడు. కానీ.. బౌలింగ్ మాత్రం చేయలేకపోయాడు. ఈ క్రమంలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు అతడు దూరమయ్యాడు. అయితే, చాంపియన్స్ ట్రోఫీ జట్టులో మాత్రం భారత క్రికెట్ నియంత్రణ మండలి అతడికి ఫిట్నెస్ ఆధారంగా చోటు కల్పించింది.స్పందించిన రోహిత్ శర్మకానీ ఇప్పటికీ బుమ్రా పూర్తి స్థాయిలో కోలుకోలేదని వార్తలు వస్తుండగా.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ విషయంపై స్పందించాడు. ఇంగ్లండ్‌తో గురువారం నాటి తొలి వన్డేకు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బుమ్రా స్కానింగ్ రిపోర్టుల కోసం మేము ఎదురుచూస్తున్నాం.మరికొన్ని రోజుల్లో వైద్య బృందం వద్దకు నివేదిక వస్తుంది. ఆ తర్వాతే బుమ్రా ఫిట్‌గా ఉన్నాడా? లేదా అన్న అంశంపై స్పష్టత వస్తుంది. ఒకవేళ అతడు ఫిట్నెస్ సాధిస్తే ఇంగ్లండ్‌తో ఆఖరి వన్డేకు అందుబాటులోకి వస్తాడు’’ అని రోహిత్ శర్మ తెలిపాడు.వరుణ్ పోటీలో ఉంటాడుఅదే విధంగా.. తొలిసారిగా వన్డే జట్టుకు ఎంపికైన వరుణ్ చక్రవర్తి గురించి కూడా రోహిత్ శర్మ ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడు చాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి వచ్చే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చాడు.‘‘టీ20 సిరీస్‌లో అతడు తన బౌలింగ్‌లో వైవిధ్యాన్ని చూపించాడు. పొట్టి ఫార్మాట్‌కు వన్డేలకు తేడా ఉంటుందని తెలుసు. అయితే, తాను ఏం చేయగలనో వరుణ్ నిరూపించాడు. అందుకే అతడిని కూడా మా ఆప్షన్లలో చేర్చుకున్నాం.ఈ సిరీస్ ద్వారా అతడి బౌలింగ్ సామర్థ్యాలు, నైపుణ్యాలను క్షుణ్ణంగా గమనించే అవకాశం వచ్చిందని అనుకుంటున్నాం. అతడిని తుదిజట్టులోకి తీసుకుంటామా? లేదా అన్నది ఇప్పుడే చెప్పలేను. అయితే, కచ్చితంగా అతడు మాత్రం పోటీలో ఉంటాడు’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.కాగా ఇటీవల ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఐదు మ్యాచ్‌లలో కలిపి పద్నాలుగు వికెట్లు కూల్చి టీమిండియా విజయాల్లో ప్రధాన పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా అందుకున్నాడు. ఈ క్రమంలో వన్డే జట్టులోనూ అతడిని చేర్చారు. ఇదిలా ఉంటే.. 33 ఏళ్ల వరుణ్ చక్రవర్తి ఇంత వరకు వన్డేల్లో అరంగేట్రం చేయలేదు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 18 టీ20 మ్యాచ్‌లు ఆడి.. మొత్తంగా 33 వికెట్లు తీశాడు. ఇక.. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో మార్పులకు ఫిబ్రవరి 12 వరకు సమయం ఉంది. కాబట్టి ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ తర్వాత వరుణ్ ఈ మెగా టోర్నీకి ఎంపికవుతాడా? లేదా అన్న విషయం తేలుతుంది. ప్రస్తుతానికి అతడు ట్రావెలింగ్ రిజర్వు ప్లేయర్ల లిస్టులో ఉన్నాడు. చదవండి: Ind vs Eng: తొలి వన్డేకు ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. వెటరన్ ప్లేయర్ రీఎంట్రీ -
BCCI Naman Awards 2025: అవార్డుల ప్రదానోత్సం.. విజేతల పూర్తి జాబితా
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నమన్ అవార్డుల(BCCI Naman Awards 2025) వేడుక శనివారం ముంబైలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా భారత క్రికెట్ దిగ్గజం, శతక శతకాల ధీరుడు సచిన్ టెండుల్కర్(Sachin Tendulkar)ను బీసీసీఐ జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించింది. అదే విధంగా.. గతేడాది అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్రికెటర్లకు ఈ సందర్భంగా పురస్కారాలు అందజేశారు. పురుషుల ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ విభాగంలో పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)కు అవార్డు దక్కింది. అన్ని ఫార్మాట్లలోనూ గతేడాది అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన బుమ్రాకు బీసీసీఐ ‘పాలీ ఉమ్రిగర్ బెస్ట్ క్రికెటర్’ అవార్డు అందజేసింది.అదే విధంగా.. మహిళల క్రికెట్లో స్మృతి మంధానకు ‘పాలీ ఉమ్రిగర్ బెస్ట్ క్రికెటర్' దక్కింది. ఇక భారత లెజెండరీ స్పిన్నర్, ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన రవిచంద్రన్ అశ్విన్‌ను ప్రత్యేక పురస్కారంతో బీసీసీఐ సత్కరించింది. మూడు ఫార్మాట్లలో కలిపి 765 వికెట్లు తీసిన అశూ సేవలకు గుర్తింపుగా అవార్డు అందజేసింది.ఇక ఈ అవార్డుల ప్రదానోత్సవంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే ఈ ఈవెంట్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో మొత్తంగా 26 మంది క్రికెటర్లు పురస్కారాలు అందుకున్నారు.బీసీసీఐ నమన్ అవార్డులు-2025: విజేతల పూర్తి జాబితా1. జగ్మోహన్ దాల్మియా ట్రోఫీ: 2023-24 ఉత్తమ మహిళా క్రికెటర్ (జూనియర్ డొమెస్టిక్) [పతకం] - ఈశ్వరి అవసరే2. జగ్మోహన్ దాల్మియా ట్రోఫీ: 2023-24 ఉత్తమ మహిళా క్రికెటర్ (సీనియర్ డొమెస్టిక్) (సీనియర్ మహిళల వన్డే) [పతకం] - ప్రియా మిశ్రా3. జగ్మోహన్ దాల్మియా ట్రోఫీ: 2023-24లో విజయ్ మర్చంట్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ (అండర్-16) [పతకం] - హేమచుదేశన్ జగన్నాథన్4. జగ్మోహన్ దాల్మియా ట్రోఫీ: 2023-24లో విజయ్ మర్చంట్ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు (U-16) [పతకం] - లక్ష్య రాయచందనీ5. M. A. చిదంబరం ట్రోఫీ: 2023-24లో కూచ్ బెహార్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్(U-19) [పతకం] - విష్ణు భరద్వాజ్6. M. A. చిదంబరం ట్రోఫీ: 2023-24లో కూచ్ బెహార్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ (U-19) [పతకం] - కావ్య టియోటియా7. M. A. చిదంబరం ట్రోఫీ: 2023-24లో కల్నల్ CK నాయుడు ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్ (U-23) - ప్లేట్ గ్రూప్ [పతకం] - నీజెఖో రూపేయో8. M. A. చిదంబరం ట్రోఫీ: 2023-24లో కల్నల్ CK నాయుడు ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ (U-23) - ఎలైట్ గ్రూప్ [పతకం] - పి. విద్యుత్9. M. A. చిదంబరం ట్రోఫీ: 2023-24లో కల్నల్ CK నాయుడు ట్రోఫీలో అత్యధిక పరుగులు (U-23) - ప్లేట్ గ్రూప్ [పతకం] - హేమ్ చెత్రి10. M. A. చిదంబరం ట్రోఫీ: 2023-24లో కల్నల్ CK నాయుడు ట్రోఫీలో అత్యధిక పరుగులు (U-23) - ఎలైట్ గ్రూప్ [పతకం] - అనీష్ కేవీ11. మాధవరావు సింధియా అవార్డు: 2023-24లో రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ - ప్లేట్ గ్రూప్ [పతకం] - మోహిత్ జంగ్రా12. మాధవరావు సింధియా అవార్డు: 2023-24లో రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ - ఎలైట్ గ్రూప్ [పతకం] - తనయ్ త్యాగరాజన్13. మాధవరావు సింధియా అవార్డు: 2023-24లో రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు - ప్లేట్ గ్రూప్ [పతకం] - అగ్ని చోప్రా14. మాధవరావు సింధియా అవార్డ్: 2023-24లో రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు - ఎలైట్ గ్రూప్ [పతకం] - రికీ భుయ్15. దేశీయ పరిమిత ఓవర్ల పోటీలలో ఉత్తమ ఆల్ రౌండర్‌గా లాలా అమర్నాథ్ అవార్డు, 2023-24 [పతకం] - శశాంక్ సింగ్16. రంజీ ట్రోఫీ 2023-24 లో ఉత్తమ ఆల్ రౌండర్‌గా లాలా అమర్నాథ్ అవార్డు [పతకం]- తనుష్ కోటియన్17. దేశీయ క్రికెట్లో ఉత్తమ అంపైర్, 2023-24 [ట్రోఫీ] - అక్షయ్ టోట్రే18. 2023-24 బీసీసీఐ దేశీయ టోర్నమెంట్లలో అత్యుత్తమ ప్రదర్శన - ముంబై క్రికెట్ అసోసియేషన్19. 2023-24 మహిళల వన్డేలలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ [పతకం] - దీప్తి శర్మ20. 2023-24 మహిళల వన్డేలలో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ [పతకం] - స్మృతి మంధాన21. ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం - మహిళలు [ట్రోఫీ] - ఆశా శోభన22. ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం - పురుషులు [ట్రోఫీ] - సర్ఫరాజ్ ఖాన్23. ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ - మహిళలు [ట్రోఫీ] - స్మృతి మంధాన24. పాలీ ఉమ్రిగర్ అవార్డు: ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ - పురుషులు [ట్రోఫీ] - జస్ప్రీత్ బుమ్రా25. బీసీసీఐ ప్రత్యేక అవార్డు [షీల్డ్] - రవిచంద్రన్ అశ్విన్26. కల్నల్ CK నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు [షీల్డ్] - సచిన్ టెండూల్కర్. -
చాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి హర్షిత్ రాణా వస్తాడు!
టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా(Harshit Rana)పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్(Kamran Akmal) ప్రశంసలు కురిపించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ అరంగేట్రంలోనే అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడని.. అతడికి మంచి భవిష్యత్తు ఉందని పేర్కొన్నాడు. ఇదే జోరు కొనసాగిస్తే.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో(ICC Champions Trophy)నూ హర్షిత్ ఆడవచ్చని అంచనా వేశాడు.కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న హర్షిత్ రాణా.. గతేడాది ఆ జట్టు చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. నాడు కోల్‌కతా మెంటార్‌గా ఉన్న గౌతం గంభీర్ టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత హర్షిత్‌కు జాతీయజట్టులో త్వరగానే అవకాశం వచ్చింది.ఆసీస్‌లో అరంగేట్రంఇటీవల ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా హర్షిత్ రాణా టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. పెర్త్ టెస్టులో నాలుగు వికెట్లతో మెరిశాడు. అయితే, అంతకంటే ముందే పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపికైనా తుదిజట్టులో మాత్రం ఆడే అవకాశం రాలేదు.కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చికానీ అనూహ్యంగా ఇంగ్లండ్‌తో నాలుగో టీ20 సందర్భంగా హర్షిత్ రాణా టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్లో అడుగుపెట్టాడు. శివం దూబేకు కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి.. నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి మూడు వికెట్లు కూల్చాడు. హార్డ్ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్(9)తో పాటు జాకొబ్ బెతల్(6) రూపంలో కీలక వికెట్లు తీసిన ఈ రైటార్మ్ పేసర్ జేమీ ఓవర్టన్(19)ను కూడా అవుట్ చేశాడు.‘కంకషన్ సబ్‌స్టిట్యూట్’ వివాదం సంగతి పక్కనపెడితే... కీలక సమయంలో కీలక వికెట్లు తీయడం ద్వారా టీమిండియా విజయంలో ప్రధాన పాత్ర పోషించిన హర్షిత్ రాణాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రన్ అక్మల్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.చాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి వచ్చినా ఆశ్చర్యం లేదు‘‘హర్షిత్ రాణా బౌలింగ్ చేసిన తీరు అద్భుతం. ఒకవేళ బుమ్రా గనుక ఫిట్‌గా లేకపోతే.. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో అతడికి చోటు దక్కడం ఖాయం. పేస్‌లో వైవిధ్యం చూపడంతో పాటు.. మూడు వికెట్లు తీసిన తీరు ఆకట్టుకుంది’’ అని కమ్రన్ అక్మల్ పేర్కొన్నాడు.అదే విధంగా స్పిన్నర్ రవి బిష్ణోయి గురించి మాట్లాడుతూ.. ‘‘రవి బిష్ణోయి, వరుణ్ చక్రవర్తి అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అదరగొడుతున్నారు. వీరిద్దరు గనుక చాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఉంటే టీమిండియా స్పిన్ విభాగం మరింత పటిష్టంగా ఉండేది’’ అని కమ్రన్ అక్మల్ అభిప్రాయపడ్డాడు.మరోవైపు.. పాకిస్తాన్ మరో మాజీ క్రికెటర్ బసిత్ అలీ సైతం రవి బిష్ణోయి ప్రదర్శనను ప్రశంసించాడు. వికెట్లు తీయకపోయినా పొదుపుగా బౌలింగ్ చేస్తున్న తీరు ఎంతో బాగుందని కొనియాడాడు. గత మ్యాచ్‌లో తప్పులను సరిదిద్దుకుని నాలుగో టీ20లో రాణించాడని పేర్కొన్నాడు.బుమ్రాకు వెన్నునొప్పికాగా టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి కారణంగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో టీ20, వన్డే సిరీస్‌లకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వన్డే సిరీస్‌లో అతడికి ప్రత్యామ్నాయంగా హర్షిత్ రాణాను టీమిండియా సెలక్టర్లు ఎంపిక చేశారు.అయితే, చాంపియన్స్ ట్రోఫీ జట్టులో మాత్రం బుమ్రాకు ఫిట్నెస్ ఆధారంగా చోటిచ్చారు. ఒకవేళ టోర్నీ నాటికి బుమ్రా పూర్తి ఫిట్‌గా లేకుంటే.. అతడి స్థానంలో మహ్మద్ సిరాజ్‌కు చాన్స్ ఉంటుందని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. అయితే, కమ్రన్ అక్మల్ మాత్రం హర్షిత్ రాణా పేరును తెరమీదకు తెచ్చాడు.టీ20 సిరీస్ మనదేఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 3-1తో కైవసం చేసుకుంది. కోల్‌కతా, చెన్నైలలో విజయం సాధించిన సూర్యకుమార్ సేన.. రాజ్‌కోట్‌లో మాత్రం విఫలమైంది. అయితే, పుణెలో జరిగిన నాలుగో టీ20లో జయకేతనం ఎగురవేసి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ గెలిచింది. ఇరుజట్ల మధ్య ఆదివారం ఆఖరి టీ20 జరుగుతుంది.చదవండి: హర్షిత్ బదులు అతడిని పంపాల్సింది.. ఇదేం పద్ధతి?: భారత మాజీ క్రికెటర్ ఫైర్ -
సచిన్‌కు ‘లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు'.. బెస్ట్ ప్లేయర్లగా బుమ్రా, మంధాన
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు ‘జీవిత సాఫల్య’ పురస్కారం అందజేయనుంది. క్రికెట్లో దేశానికి అందించిన విశేష సేవలకు గుర్తింపుగా భారత తొలి కెప్టెన్ కల్నల్ సీకే నాయుడు పేరుమీదుగా 1994 నుంచి ఈ ‘లైఫ్‌టైమ్ అచీవ్మెంట్’ అవార్డును బోర్డు వార్షిక పురస్కారాల్లో ప్రదానం చేస్తున్నారు. నేడు బోర్డు నిర్వహించే కార్యక్రమంలో 51 ఏళ్ల సచిన్‌కు ఈ అవార్డు బహూకరిస్తారు. రెండు దశాబ్దాల పైచిలుకు భారత క్రికెట్‌కు వెన్నెముకగా నిలిచిన బ్యాటింగ్ తురుపుముక్క సచిన్ సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్లో 664 మ్యాచ్‌లాడాడు. 200 టెస్టుల్లో 15, 291 పరుగులు, 51 శతకాలు... 463 వన్డేల్లో 18,426 పరుగులు, 49 సెంచరీలు సాధించాడు. ఈ రెండు ఫార్మాట్లో కలిపి 100 సెంచరీలు బాదిన ఏకైక బ్యాటర్‌గా క్రికెట్ పుటల్లోకెక్కాడు.బుమ్రాకు పాలీ ఉమ్రిగర్..అదేవిధంగా గతేడాది అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాను ‘పాలీ ఉమ్రిగర్ బెస్ట్ క్రికెటర్’ అవార్డుతో బీసీసీఐ సత్కరించనుంది. 2024 ఏడాదిలో ఫార్మాట్‌తో సంబంధం లేకుండా బుమ్రా అదరగొట్టాడు. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో అయితే బుమ్రా దుమ్ములేపాడు.గతేడాది 13 టెస్టుల్లో ఆడిన బుమ్రా 14.92 సగటుతో 71 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియాతో జరిగిన అయిదు టెస్టుల సిరీస్‌లో భారత స్పీడ్ స్టార్ 32 వికెట్లతో సత్తాచాటాడు. అదేవిధంగా టీ20 వరల్డ్‌కప్-2024ను భారత్ సొంతం చేసుకోవడంలో బుమ్రాది కీలక పాత్ర.మొత్తంగా 15 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. 2024కు గాను ఐసీసీ బెస్ట్ క్రికెటర్ అవార్డుకు బుమ్రా ఎంపికైన సంగతి తెలిసిందే. అలాగే ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్‌ది ఈయర్ అవార్డు కూడా బుమ్రా సొంతం చేసుకున్నాడు.మరోవైపు మహిళల్లో స్మృతి మంధానకు ‘పాలీ ఉమ్రిగర్ బెస్ట్ క్రికెటర్' అవార్డు వరించింది. గతేడాది 50 ఓవర్ల ఫార్మాట్లో 743 పరుగులు చేసింది. 2024లో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసినందుకు గాను ఈ ప్రతిష్టాత్మకు అవార్డును ఆమె అందుకోనుంది. ఈ అవార్డులను బీసీసీఐ శనివారం ప్రధానం చేయనుంది.చదవండి: పాండ్యా, దూబే మెరుపులు.. సిరీస్ టీమిండియా వశం -
CT: బుమ్రా, కోహ్లి కాదు!.. టీమిండియా ‘ఎక్స్’ ఫ్యాక్టర్ అతడే: డివిలియర్స్
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) టోర్నీలో 2000 సంవత్సరంలో తొలిసారి ఫైనల్‌కు చేరింది టీమిండియా. అయితే, కెన్యాలో నాటి తుదిపోరులో న్యూజిలాండ్ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 2002లోశ్రీలంకతో కలిసి సంయుక్త విజేతగా నిలిచింది. అనంతరం మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni) సారథ్యంలో 2013లో మరోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించిన భారత జట్టు... ఈసారి ఆఖరి గండాన్ని అధిగమించింది.ఐదు పరుగుల తేడాతో గెలుపొందిసౌతాఫ్రికా వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో నరాలు తెగే ఉత్కంఠ నడుమ కేవలం ఐదు పరుగుల తేడాతో గెలుపొంది.. టైటిల్‌ను సోలోగా సొంతం చేసుకుంది. ఆ తర్వాత మళ్లీ నాలుగేళ్లకు ఫైనల్‌కు చేరినా.. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో ఓటమిపాలై(India vs Pakistan).. ట్రోఫీని చేజార్చుకుంది. ఈ క్రమంలో మరోసారి ఈ మెగా టోర్నీలో భారత్ విజేతగా నిలిచే అవకాశం ముంగిట నిలిచింది.నాడు ఆ ఆరుగురు2017 తర్వాత.. దాదాపు ఎనిమిదేళ్ల అనంతరం నిర్వహిస్తున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్‌లో టీమిండియా ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగుతోంది. పాకిస్తాన్- దుబాయ్ వేదికలుగా ఫిబ్రవరి 19 నుంచి మొదలుకానున్న ఈ మెగా ఈవెంట్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఇప్పటికే జట్టును ప్రకటించింది. 2017 నాటి జట్టులో ఓపెనింగ్ బ్యాటర్‌గా ఉన్న రోహిత్ శర్మ ఈసారి కెప్టెన్ హోదాలో బరిలోకి దిగనునున్నాడు.మరోవైపు.. ఆనాటి సారథి విరాట్ కోహ్లితో పాటు.. ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా.. పేస్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ కూడా తాజా జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఎక్స్’ ఫ్యాక్టర్ అతడేఈసారి టీమిండియా ‘ఎక్స్’ ఫ్యాక్టర్ ఎవరన్న అంశంపై అభిప్రాయాలు పంచుకుంటూ.. ఈ ఆరుగురిలో ఒక్కరి పేరు కూడా చెప్పలేదు. వీరికి బదులుగా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై డివిలియర్స్ నమ్మకం ఉంచాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానల్లో మాట్లాడుతూ.. ‘‘ఈసారి భారత జట్టులో ‘ఎక్స్’ ఫ్యాక్టర్‌గా కుల్దీప్ యాదవ్ మారబోతున్నాడని అనిపిస్తోంది.ఎందుకంటే.. టీమిండియా దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడుబోతోంది. అక్కడి పిచ్‌లు స్పిన్నర్లకు కాస్త అనుకూలంగా ఉంటాయి. కాబట్టి కుల్దీప్ ఈసారి ఇండియా తరఫున అందరికంటే మెరుగ్గా ఆడి.. ఫలితాలను ప్రభావితం చేయగలడు’’ అని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. మ్యాచ్‌ను మలుపుతిప్పగల సత్తా అతడికి ఉందని పేర్కొన్నాడు.గాయం కారణంగాకాగా కుల్దీప్ యాదవ్ గత కొంతకాలంగా టీమిండియాకు దూరంగా ఉన్నాడు. ఎడమ గజ్జలో నొప్పి కారణంగా సుదీర్ఘకాలంగా ఇబ్బంది పడుతున్న ఈ స్పిన్ బౌలర్.. జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్నట్లు సమాచారం. గాయం కారణంగానే అతడు ఇటీవల ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలోనూ పాల్గొనలేకపోయాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా కుల్దీప్ యాదవ్ టీమిండియా తరఫున పునరాగమనం చేసే అవకాశం ఉంది.ఐసీసీ చాంపియన్స్ ట్రోపీ-2025కి భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, యశస్వి జైస్వాల్, కుల్దీప్ యాదవ్.చదవండి: మరో డీఎస్పీ!.. పోలీస్ ఉద్యోగంలో చేరిన భారత క్రికెటర్ -
2024 ఐసీసీ అవార్డుల విజేతలు వీరే..!
2024 ఐసీసీ అవార్డుల ప్రకటన ప్రక్రియ జనవరి 24న మొదలై, ఇవాల్టితో (జనవరి 28) ముగిసింది. మూడు ఫార్మాట్లలో పురుషులు, మహిళల విభాగాల్లో వ్యక్తిగత అవార్డులతో పాటు టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను రివీల్ చేశారు. గతేడాదికి సంబంధించి మొత్తం 12 వ్యక్తిగత అవార్డులు, 5 ఐదు టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు ప్రకటించబడ్డాయి.వ్యక్తిగత విభాగాల్లో ఐసీసీ అవార్డులు (2024)..ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ (సర్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ)-జస్ప్రీత్ బుమ్రా (నామినీలు-హ్యారీ బ్రూక్, ట్రవిస్ హెడ్, జో రూట్)ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ (రేచల్ హెహోయ్ ఫ్లింట్ ట్రోఫీ)-మేలీ కెర్ (నామినీలు-చమారీ ఆటపట్టు, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, లారా వోల్వార్డ్ట్)ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-జస్ప్రీత్ బుమ్రా (నామినీలు-హ్యారీ బ్రూక్, కమిందు మెండిస్, జో రూట్)ఐసీసీ వుమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-స్మృతి మంధన (నామినీలు-చమారీ ఆటపట్టు, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, లారా వోల్వార్డ్ట్)ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్- అజ్మతుల్లా ఒమర్జాయ్ (నామినీలు- వనిందు హసరంగ, కుసాల్ మెండిస్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్)ఐసీసీ ఎమర్జింగ్ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-అన్నెరీ డెర్క్సెన్ (నామినీలు-సస్కియా హోర్లీ, శ్రేయాంక పాటిల్, ఫ్రేయా సర్జెంట్)ఐసీసీ ఎమర్జింగ్ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-కమిందు మెండిస్ (నామినీలు-సైమ్ అయూబ్, గస్ అట్కిన్సన్, షమార్ జోసఫ్)ఐసీసీ వుమెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-ఈషా ఓఝాఐసీసీ మెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-గెర్హార్డ్ ఎరాస్మస్ఐసీసీ అంపైర్ ఆఫ్ ద ఇయర్-రిచర్డ్ ఇల్లింగ్వర్త్ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-అర్షదీప్ సింగ్ (నామినీలు-బాబర్ ఆజమ్, ట్రవిస్ హెడ్, సికందర్ రజా)ఐసీసీ వుమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-మేలీ కెర్ (నామినీలు- చమారీ ఆటపట్టు, ఓర్లా ప్రెండర్‌గాస్ట్, లారా వోల్వార్డ్ట్)ఫార్మాట్ల వారీగా టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు..ఐసీసీ మెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024: రోహిత్ శర్మ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, ఫిల్ సాల్ట్, బాబర్ ఆజం, నికోలస్ పూరన్ (వికెట్‌కీపర్), సికందర్ రజా, హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, వనిందు హసరంగా, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.ఐసీసీ వుమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024: లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), స్మృతి మంధాన, చమరి అతపత్తు, హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, మెలీ కెర్, రిచా ఘోష్ (వికెట్‌కీపర్), మరిజాన్ కప్ప్, ఓర్లా ప్రెండర్‌గాస్ట్, దీప్తి శర్మ, సదియా ఇక్బాల్.ఐసీసీ మెన్స్ టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024: యశస్వి జైస్వాల్, బెన్ డకెట్, కేన్ విలియమ్సన్, జో రూట్, హ్యారీ బ్రూక్, కమిందు మెండిస్, జామీ స్మిత్ (వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా, పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), మాట్ హెన్రీ, జస్ప్రీత్ బుమ్రా.ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024: సైమ్ అయూబ్, రహ్మానుల్లా గుర్బాజ్, పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (వికెట్‌కీపర్), చరిత్ అసలంక (కెప్టెన్), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, వనిందు హసరంగ, షాహీన్ షా అఫ్రిది, హరిస్ రౌఫ్, అల్లా ఘజన్ఫర్.ఐసీసీ వుమెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024: స్మృతి మంధాన, లారా వోల్వార్డ్ (కెప్టెన్), చమర్తి అథపత్తు, హేలీ మాథ్యూస్, మారిజాన్ కాప్, ఆష్లీ గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్, అమీ జోన్స్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, కేట్ క్రాస్. -
ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా బుమ్రా
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా మరో ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డును గెలుచుకున్నాడు. 31 ఏళ్ల ఈ ఫాస్ట్ బౌలింగ్ సంచలనం, ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-2024 అవార్డుకు (సర్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ) ఎంపికయ్యాడు. గతేడాది ఫార్మాట్లకతీతంగా రాణించినందుకు గానూ బుమ్రాను ఈ అవార్డు వరించింది. ఈ అవార్డు గెలుచుకున్న తొలి భారత పేసర్ బుమ్రానే. ఓవరాల్‌గా ఈ అవార్డు గెలుచుకున్న ఐదో భారత క్రికెటర్ బుమ్రా. బుమ్రాకు ముందు రాహుల్ ద్రవిడ్ (2004), సచిన్ టెండూల్కర్ (2010), రవిచంద్రన్ అశ్విన్ (2016), విరాట్ కోహ్లి (2017, 2018) ఈ అవార్డులు గెలుచుకున్నారు. 2024 ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కోసం ట్రవిస్ హెడ్, జో రూట్, హ్యారీ బ్రూక్ బుమ్రాతో పోటీపడ్డారు. ఈ అవార్డు గెలవడానికి ముందు బుమ్రా ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు-2024 కూడా గెలుచుకున్నాడు. బుమ్రా గతేడాది టెస్ట్‌ల్లో విశేషంగా రాణించాడు (13 మ్యాచ్‌ల్లో 71 వికెట్లు). ప్రస్తుతం ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ బౌలర్‌గా కొనసాగుతున్న బుమ్రా.. భారత్ తరఫున అత్యధిక రేటింగ్ పాయింట్స్ సాధించిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. బుమ్రా గతేడాది 907 రేటింగ్ పాయింట్స్‌ను సాధించాడు. టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కోసం బుమ్రాతో పాటు హ్యారీ బ్రూక్, జో రూట్, కమిందు మెండిస్ పోటీ పడ్డారు.2024 ఐసీసీ అవార్డులుఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ (సర్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ)-జస్ప్రీత్ బుమ్రాఐసీసీ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ (రేచల్ హెహోయ్ ఫ్లింట్ ట్రోఫీ)-మేలీ కెర్ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-జస్ప్రీత్ బుమ్రాఐసీసీ వుమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-స్మృతి మంధనఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్- అజ్మతుల్లా ఒమర్జాయ్ ఐసీసీ ఎమర్జింగ్ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-అన్నెరీ డెర్క్సెన్ఐసీసీ ఎమర్జింగ్ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-కమిందు మెండిస్ఐసీసీ వుమెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-ఈషా ఓఝాఐసీసీ మెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-గెర్హార్డ్ ఎరాస్మస్ఐసీసీ అంపైర్ ఆఫ్ ద ఇయర్-రిచర్డ్ ఇల్లింగ్వర్త్ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-అర్షదీప్ సింగ్ఐసీసీ వుమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-మేలీ కెర్ఐసీసీ మెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024: రోహిత్ శర్మ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, ఫిల్ సాల్ట్, బాబర్ ఆజం, నికోలస్ పూరన్ (వికెట్‌కీపర్), సికందర్ రజా, హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, వనిందు హసరంగా, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.ఐసీసీ వుమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024: లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), స్మృతి మంధాన, చమరి అతపత్తు, హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, మెలీ కెర్, రిచా ఘోష్ (వికెట్‌కీపర్), మరిజాన్ కప్ప్, ఓర్లా ప్రెండర్‌గాస్ట్, దీప్తి శర్మ, సదియా ఇక్బాల్.ఐసీసీ మెన్స్ టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024: యశస్వి జైస్వాల్, బెన్ డకెట్, కేన్ విలియమ్సన్, జో రూట్, హ్యారీ బ్రూక్, కమిందు మెండిస్, జామీ స్మిత్ (వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా, పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), మాట్ హెన్రీ, జస్ప్రీత్ బుమ్రా.ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024: సైమ్ అయూబ్, రహ్మానుల్లా గుర్బాజ్, పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (వికెట్‌కీపర్), చరిత్ అసలంక (కెప్టెన్), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, వనిందు హసరంగా, షాహీన్ షా అఫ్రిది, హరిస్ రౌఫ్, అల్లా ఘజన్ఫర్.ఐసీసీ వుమెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024: స్మృతి మంధాన, లారా వోల్వార్డ్ (కెప్టెన్), చమర్తి అథపత్తు, హేలీ మాథ్యూస్, మారిజాన్ కాప్, ఆష్లీ గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్, అమీ జోన్స్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, కేట్ క్రాస్. -
అరుదైన గౌరవంగా భావిస్తున్నాను.. ఈ అవార్డు వారికి అంకితం: బుమ్రా
టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) 2024 సంవత్సరానికి గాను ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. గతేడాది అద్బుతమైన ప్రదర్శన చేసినందుకు బుమ్రాకు ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరిచింది. 2024 ఏడాదిలో బుమ్రా 13 టెస్టులు ఆడి ఏకంగా 71 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.ఒక ఏడాది కాలంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే సరసన నిలిచాడు. అంతేకాకుండా గతేడాది అత్యధిక టెస్టు వికెట్లు తీసింది కూడా బుమ్రానే కావడం గమనార్హం.తద్వారా జో రూట్ (ఇంగ్లండ్), కమిందు మెండిస్ (శ్రీలంక), హ్యారీ బ్రూక్ (ఇంగ్లండ్)లను వెనక్కినెట్టి మరి బుమ్రా ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇక అవార్డుకు ఎంపికైన తర్వాత తొలిసారి బుమ్రా స్పందించాడు. ఐసీసీ ప్రతిష్టాత్మకు అవార్డు తనకు వరించడం చాలా సంతోషంగా ఉందని జస్ప్రీత్ తెలిపాడు."ఐసీసీ పురుషుల టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపిక కావడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. టెస్ట్ క్రికెట్ ఎల్లప్పుడూ నా హృదయానికి దగ్గరగా ఉండే ఫార్మాట్. అటువంటి ఫార్మాట్లో ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకోవడం నాకు చాలా ప్రత్యేకం.ఈ అవార్డును నాకు మద్దతుగా నిలిచిన నా సహచరులు, కోచ్‌లు, అభిమానులకు అంకితమివ్వాలనుకుంటున్నారు. వీరిందరి సహకారం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం ఎల్లప్పుడూ ప్రత్యేకమే. ఈ నూతన ఉత్సాహంతో రాబోయే రోజుల్లో మరింత మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తున్నాను" అని బుమ్రా ఐసీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్న తొలి భారత్ ఫాస్ట్ బౌలర్ బుమ్రానే కావడం విశేషం. ఓవరాల్‌గా ఈ అవార్డు అందుకున్న ఆరో భారత క్రికెటర్‌గా బుమ్రా నిలిచాడు. బుమ్రా కంటే ముందు రాహుల్ ద్రవిడ్ (2004), గౌతమ్ గంభీర్ (2009), వీరేంద్ర సెహ్వాగ్ (2010), రవిచంద్రన్ అశ్విన్ (2016), విరాట్ కోహ్లీ (2018) ఈ అవార్డు అందుకున్నారు. మరోవైపు భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన 2024 ఏడాదికి గాను వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకుంది.చదవండి: #Virat Kohli: 12 ఏళ్ల తర్వాత రంజీల్లో ఆడనున్న కోహ్లి.. రేపే జట్టులోకి ఎంట్రీ? -
ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా బుమ్రా
-
టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా జస్ప్రీత్ బుమ్రా
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా 2024 సంవత్సరానికి గానూ ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ విషయాన్ని ఐసీసీ ఇవాళ (జనవరి 27) ప్రకటించింది. గతేడాది టెస్ట్‌ల్లో విశేషంగా రాణించినందుకు గానూ బుమ్రాను టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వరించింది. బుమ్రా గతేడాది టెస్ట్‌ల్లో 14.92 సగటున 71 వికెట్లు తీశాడు. గతేడాది టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ బుమ్రానే.గతేడాది టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో బుమ్రా దరిదాపుల్లో ఎవరూ లేరు. బుమ్రా తర్వాత ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్ అత్యధిక వికెట్లు సాధించాడు. అట్కిన్సన్ గతేడాది 11 మ్యాచ్‌ల్లో 52 వికెట్లు తీశాడు. ఈ జాబితాలో బుమ్రా, అట్కిన్సన్ తర్వాత షోయబ్ బషీర్ (49), మ్యాట్ హెన్రీ (48), రవీంద్ర జడేజా (48) ఉన్నారు.బుమ్రా టెస్ట్‌ల్లో తన అసమాన ప్రదర్శనతో నంబర్ వన్ ర్యాంక్ బౌలర్‌గానూ నిలిచాడు. భారత్ తరఫున అత్యధిక రేటింగ్ పాయింట్లు పొందిన బౌలర్‌గా బుమ్రా రికార్డు నెలకొల్పాడు. బుమ్రా గతేడాది సౌతాఫ్రికా, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలపై అనేక సంచలన వికెట్ టేకింగ్ స్పెల్స్ వేశాడు. ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా పట్టపగ్గాల్లేకుండా విరుచుకుపడ్డాడు. ఈ సిరీస్‌లో బుమ్రా లీడింగ్ వికెట్‌టేకర్‌గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు సొంతం చేసుకున్నాడు.ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-2024 అవార్డు కోసం బుమ్రాతో పాటు హ్యారీ బ్రూక్, జో రూట్, కమిందు మెండిస్ పోటీపడ్డారు. అంతిమంగా ఈ ప్రతిష్టాత్మక అవార్డు బుమ్రానే వరించింది. 2018లో కోహ్లి తర్వాత ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్న మొదటి భారత క్రికెటర్ బుమ్రానే.మరోవైపు ఇవాళ ప్రకటించిన మరో ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డును భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధన గెలుచుకుంది. మంధన గతేడాది (2024) ఐసీసీ వుమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపికైంది. మంధన గతేడాది 13 వన్డేల్లో నాలుగు సెంచరీల సాయంతో 57.86 సగటున, 95.15 స్ట్రయిక్‌రేట్‌తో 747 పరుగులు చేసింది. తద్వారా గతేడాది లీడింగ్ రన్ స్కోరర్‌గానూ నిలిచింది. గతేడాది దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు చేసిన మంధన.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లపై తలో సెంచరీ చేసింది. ఐసీసీ వుమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024 అవార్డు కోసం మంధనతో పాటు లారా వోల్వార్డ్ట్, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, చమారీ ఆటపట్టు పోటీపడ్డారు.ఇవాళే ప్రకటించిన ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-2024 అవార్డును ఆఫ్ఘనిస్తాన్ యువ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ గెలుచుకున్నాడు. ఒమర్జాయ్ గతేడాది 14 వన్డేల్లో 417 పరుగులు చేసి, 17 వికెట్లు పడగొట్టాడు. ఒమర్జాయ్ బ్యాటింగ్ సగటు గతేడాది 52.12గా ఉంది. ఒమర్జాయ్ ప్రదర్శనల కారణంగా ఆఫ్ఘనిస్తాన్ గతేడాది ఆడిన ఐదు వన్డే సిరీస్‌ల్లో నాలుగింట జయకేతనం ఎగురవేసింది. మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-2024 అవార్డు కోసం ఒమర్జాయ్తో పాటు కుసాల్ మెండిస్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, వనిందు హసరంగ పోటీపడ్డారు.ఇప్పటివరకు ప్రకటించిన ఐసీసీ అవార్డులు (2024)..ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-జస్ప్రీత్ బుమ్రాఐసీసీ వుమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-స్మృతి మంధనఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్- అజ్మతుల్లా ఒమర్జాయ్ ఐసీసీ ఎమర్జింగ్ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-అన్నెరీ డెర్క్సెన్ఐసీసీ ఎమర్జింగ్ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-కమిందు మెండిస్ఐసీసీ వుమెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-ఈషా ఓఝాఐసీసీ మెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-గెర్హార్డ్ ఎరాస్మస్ఐసీసీ అంపైర్ ఆఫ్ ద ఇయర్-రిచర్డ్ ఇల్లింగ్వర్త్ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-అర్షదీప్ సింగ్ఐసీసీ వుమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-మేలీ కెర్ -
చాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి సిరాజ్! కారణం ఇదే!
చాంపియన్స్ ట్రోఫీ-2025 భారత జట్టులో మహ్మద్ సిరాజ్(Mohammed Siraj)కు చోటు దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని.. భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఈ ఐసీసీ టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) ప్రకటించిన జట్టులో ఒకే ఒక్క పేసర్ పూర్తి ఫిట్‌గా ఉండటం ఇందుకు కారణమని పేర్కొన్నాడు. మిగతా ఇద్దరు ఫాస్ట్ బౌలర్ల ఫిట్‌నెస్‌పై స్పష్టత రావడం లేదు కాబట్టి.. సిరాజ్ మియా దుబాయ్ ఫ్లైట్ ఎక్కడం ఖాయంగానే కనిపిస్తుందని పేర్కొన్నాడు. కాగా పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుండగా.. టీమిండియా తమ మ్యాచ్‌లన్నీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఆడనుంది. హైదరాబాదీ పేసర్‌కు దక్కని చోటుఈ నేపథ్యంలో జనవరి 18న బీసీసీఐ ఈ మెగా ఈవెంట్‌కు తమ జట్టును ప్రకటించగా.. ఇందులో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు మాత్రం చోటు దక్కలేదు. పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)తో పాటు మరో సీనియర్ పేసర్ మహ్మద్ షమీని ఎంపిక చేసిన సెలక్టర్లు.. యువ తరంగం, పొట్టి ఫార్మాట్లో భారత్ తరఫున అత్యధిక వికెట్ల వీరుడిగా ఉన్న అర్ష్‌దీప్ సింగ్‌కు కూడా స్థానం ఇచ్చారు. అందుకే పక్కన పెట్టామన్న కెప్టెన్ఈ విషయం గురించి జట్టు ప్రకటన సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘బుమ్రా పూర్తి ఫిట్‌గా ఉంటాడో లేదో తెలియదు. ఇక షమీతో పాటు అర్ష్‌దీప్ కొత్త బంతితో రాణించగలడు. అంతేకాదు.. డెత్ ఓవర్లలోనూ బాగా బౌలింగ్ చేయగలడు. అయితే, సిరాజ్ మాత్రం ఆరంభంలో చూపినంత ప్రభావం ఆఖర్లో చూపలేకపోతున్నాడు. అందుకే అతడిని పక్కనపెట్టాల్సి వచ్చింది’’ అని వివరణ ఇచ్చాడు.వైల్డ్ కార్డ్ ఎంట్రీఅయితే, తాజా పరిస్థితులు చూస్తుంటే సిరాజ్‌కు చాంపియన్స్ ట్రోఫీ జట్టులో వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. టోర్నీ నాటికి బుమ్రా వంద శాతం ఫిట్నెస్ సాధించే సూచనలు కనిపించడం లేదు. అదే విధంగా.. షమీ కూడా ఇంత వరకు రీఎంట్రీ ఇవ్వలేదు. జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఇంగ్లండ్‌తో తొలి రెండు టీ20లకు అతడు దూరమైనా.. నెట్స్‌లో కుంటుతూ బౌలింగ్ చేసిన దృశ్యాలు అభిమానులను కలవరపెడుతున్నాయి.సిరాజ్‌కు చోటు పక్కాఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘షమీ గురించి కాసేపు పక్కనపెడతాం. బుమ్రా గురించి మాత్రం ఇప్పటికీ స్పష్టమైన సమాచారం రావడం లేదు. ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టులో ఒక్క పేసర్ మాత్రమే ఫిట్‌గా ఉన్నాడు.మిగతా ఇద్దరు(బుమ్రా, షమీ) సంగతి తెలియదు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు జట్టుకు దూరమైతే.. ఆటోమేటిక్‌గా సిరాజ్ జట్టులోకి వచ్చేస్తాడు. కాబట్టి సిరాజ్ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలి. బాగా ప్రాక్టీస్ చేయాలి.చాంపియన్స్ ట్రోఫీలో ఆడబోతున్నానని భావించి పూర్తి ఫిట్‌గా.. అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉండాలి. గాయం నుంచి కోలుకున్న తర్వాత షమీ ఇప్పటి వరకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. ఇక బుమ్రా ఒక్క వన్డేలోనూ భాగం కాలేదు. కాబట్టి సిరాజ్‌కు గనుక చాంపియన్స్ ట్రోఫీలో ఆడే అవకాశం వస్తే నాకైతే సంతోషమే’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీకి ప్రకటించిన ప్రాథమిక జట్టులో మార్పులు చేసుకునేందుకు ఫిబ్రవరి 12 వరకు అవకాశం ఉంది.చదవండి: పరాయి స్త్రీలను తాకను.. ఇంత పొగరు పనికిరాదు! -
BCCI: బుమ్రా ఆడతాడా?.. రిస్క్ వద్దు!.. ఆ డాక్టర్ చేతిలోనే అంతా..
టీమిండియా స్టార్ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో అంతా తానై ముందుండి నడిపించిన ఈ పేస్ దళ నాయకుడు ఆఖర్లో గాయపడిన విషయం తెలిసిందే. కంగారూ దేశ పర్యటనలో చివరిదైన సిడ్నీ టెస్టు సందర్భంగా బుమ్రా వెన్నునొప్పితో విలవిల్లాడాడు. మూడు వారాలుగా విశ్రాంతిమ్యాచ్ మధ్యలోనే మైదానం వీడిన ఈ రైటార్మ్ ఫాస్ట్ బౌలర్.. స్కానింగ్ అనంతరం జట్టుతో చేరినా మళ్లీ బంతితో బరిలోకి దిగలేకపోయాడు. ఈ క్రమంలో స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. బుమ్రా ఆటకు దూరమై ఇప్పటికే మూడు వారాలు గడిచిపోయింది. అయితే, అతడి ఫిట్నెస్ గురించి ఇంత వరకు స్పష్టత రాలేదు.ఇప్పటికే స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్(India vs England)కు దూరమైన బుమ్రా.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 నాటికైనా జట్టుతో చేరాలని టీమిండియా యాజమాన్యం ఆశిస్తోంది. ఈ మెగా టోర్నీ నాటికి అతడు ఫిట్‌గా మారతాడనే ఆశాభావంతోనే జట్టుకు ఎంపిక చేసింది. ఒకవేళ బుమ్రా గనుక ఈ ఐసీసీ ఈవెంట్‌కు దూరమైతే.. జట్టుపై ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుంది. అందుకే.. అతడి విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఎలాంటి రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా లేదు.న్యూజిలాండ్ స్పెషలిస్టుతో సంప్రదింపులుఇందులో భాగంగా.. ఇప్పటికే బీసీసీఐ వైద్య బృందం ఎప్పటికప్పుడు బుమ్రా పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. అంతేకాదు.. వెన్నునొప్పి తీవ్రత, దాని తాలుకు ప్రభావాన్ని అంచనా వేసేందుకు న్యూజిలాండ్ స్పెషలిస్టు డాక్టర్ రొవాన్ షోటన్తో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.అదొక అద్భుతమని తెలుసుఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘బీసీసీఐ వైద్య బృందం షోటన్తో కాంటాక్టులో ఉంది. బుమ్రాను స్వయంగా అక్కడికి పంపాలని బోర్డు భావించింది. అయితే, ఇంత వరకు అది కార్యరూపం దాల్చలేదు. తనకు విధించిన గడువులోగా బుమ్రా గనుక వందశాతం ఫిట్నెస్ సాధిస్తే అదొక అద్భుతమని సెలక్టర్లకు కూడా తెలుసు.అదే జరగాలని యాజమాన్యం కోరుకుంటోంది కూడా! అందుకే బుమ్రా స్కానింగ్ రిపోర్టులను షోటన్కు పంపించి.. ఫీడ్‌బ్యాక్ తీసుకుంటోంది. ఏదేమైనా.. బుమ్రా వీలైనంత త్వరగా జట్టుతో చేరితే బాగుంటుందని బోర్డు భావిస్తోంది. అతడు కూడా ఇదే ఆలోచనతో ఉన్నాడు’’ అని పేర్కొన్నాయి. కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది.ఫిబ్రవరి 12 వరకు అవకాశంఈ నేపథ్యంలో జనవరి 18న బీసీసీఐ తమ ప్రాథమిక జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో బుమ్రాకు కూడా చోటు దక్కింది. అయితే, ఫిట్నెస్ ఆధారంగానే అతడి విషయంలో తుది నిర్ణయం ఉంటుందని.. జట్టు ప్రకటన సందర్భంగా టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు.ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో మార్పులు చేసుకునేందుకు ఫిబ్రవరి 12 వరకు అవకాశం ఉంది. కాగా భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లడం లేదు. తటస్థ వేదికైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో తమ మ్యాచ్‌లు ఆడనుంది. తొలి మ్యాచ్‌లో భాగంగా ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. అనంతరం ఫిబ్రవరి 23న దాయాది పాకిస్తాన్‌ను ఢీకొట్టనున్న రోహిత్ సేన.. మార్చి 2న న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆడుతుంది. చదవండి: షమీ రీఎంట్రీ.. మళ్లీ వాయిదా?!.. గంభీర్‌తో సమస్యా? -
ICC టీ20 జట్టు ప్రకటన: కెప్టెన్‌గా రోహిత్, నో కోహ్లి! భారత్ నుంచి నలుగురు
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)- 2024(ICC Mens T20I Team of the Year) ఏడాదికి గానూ పురుషుల అత్యుత్తమ టీ20 జట్టును ప్రకటించింది. పొట్టి ఫార్మాట్లో గతేడాది అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న పదకొండు మంది ఆటగాళ్ల పేర్లను శనివారం వెల్లడించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా టీమిండియా సారథి రోహిత్ శర్మ(Rohit Sharma) ఎంపికయ్యాడు.ఇక హిట్‌మ్యాన్‌తో పాటు మరో ముగ్గురు భారత స్టార్ క్రికెటర్లకు ఈ టీమ్‌లో చోటు దక్కింది. అయితే, ఇందులో విరాట్ కోహ్లి(Virat Kohli) మాత్రం లేకపోవడం గమనార్హం. మరోవైపు.. ఈ జట్టులో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఆస్ట్రేలియా విధ్వంసకర వీరుడు ట్రవిస్ హెడ్ ఎంపిక కాగా.. వన్‌డౌన్‌లో ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ చోటు దక్కించుకున్నాడు.ఇక మిడిలార్డర్లో నాలుగో స్థానంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం, ఐదో నంబర్ బ్యాటర్‌గా, వికెట్ కీపర్ కోటాలో వెస్టిండీస్ స్టార్ నికోలస్ పూరన్ స్థానం సంపాదించాడు. ఏడో స్థానంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఎంపిక కాగా.. అఫ్గనిస్తాన్ మేటి స్పిన్నర్ రషీద్ ఖాన్, శ్రీలంక స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగకు కూడా ఈ జట్టులో చోటు దక్కింది. పేస్ దళంలో టీమిండియా ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు యువ ఆటగాడు అర్ష్‌దీప్ సింగ్ స్థానం సంపాదించుకున్నారు. రోహిత్ రిటైర్మెంట్టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 2024లో 11 అంతర్జాతీయ టీ20లు ఆడి 378 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం ఉంది. స్ట్రైక్‌రేటు 160.16. తన అద్భుత నాయకత్వ లక్షణాలతో టీమిండియాను వరల్డ్‌కప్-2024 చాంపియన్‌గా నిలిపాడు. దాదాపు పదమూడేళ్ల తర్వాత మరోసారి టీమిండియాకు ఐసీసీ ట్రోఫీని అందించాడు.నో కోహ్లిఈ మెగా టోర్నీలో భారత్ జగజ్జేతగా నిలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. రోహిత్‌తో పాటు ఈ ఈవెంట్లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన విరాట్ కోహ్లికి మాత్రం ఈ జట్టులో చోటు దక్కలేదు. ఇక రోహిత్, కోహ్లిలతో పాటు రవీంద్ర జడేజా కూడా వెస్టిండీస్‌లో సౌతాఫ్రికాతో ఫైనల్ ముగిసిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించారు.ఇక గతేడాది ట్రవిస్ హెడ్ 15 టీ20లలో కలిపి 539 పరుగులు చేయగా.. ఫిల్ సాల్ట్ 17 మ్యాచ్‌లు ఆడి 467 రన్స్ చేశాడు. బాబర్ ఆజం 24 మ్యాచ్‌లలో కలిపి 734 పరుగులతో రాణించాడు. నికోలస్ పూరన్ 21 మ్యాచ్‌లలో భాగమై 464 పరుగులు చేశాడు. ఇక జింబాబ్వే తరఫున ఎప్పటిలాగానే గతేడాది కూడా సికిందర్ రజా అదరగొట్టాడు. 24 మ్యాచ్‌లు ఆడి 573 పరుగులు చేశాడు.హార్దిక్ పాండ్యాది కీలక పాత్రటీమిండియా ఈసారి వరల్డ్‌కప్ గెలవడంలో భారత పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాది కీలక పాత్ర. ఇక ఓవరాల్‌గా గతేడాది అతడు 17 మ్యాచ్‌లలో కలిపి 352 పరుగులు చేయడంతో పాటు 16 వికెట్లు తీశాడు.ఇక రషీద్ ఖాన్ 14 మ్యాచ్‌లు ఆడి 31 వికెట్లు తీశాడు. అత్యుత్తమంగా 4/14తో రాణించాడు. వనిందు హసరంగ 20 మ్యాచ్‌లలో కలిపి 179 పరుగులు చేయడంతో పాటు 38 వికెట్లు పడగొట్టాడు. జస్ప్రీత్ బుమ్రా 8 మ్యాచ్‌లు మాత్రమే ఆడినా 3/7 అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసి.. 15 వికెట్లు కూల్చాడు. మరోవైపు.. మరో టీమిండియా స్టార్ అర్ష్‌దీప్ సింగ్ 18 మ్యాచ్‌లు ఆడి 36 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 4/9. ఇతడు సాధించిన 36 వికెట్లలో పదిహేడు వరల్డ్‌కప్-2024 టోర్నీలో తీసినవే. తద్వారా నాటి మెగా ఈవెంట్లో సెకండ్ లీడింగ్వికెట్ టేకర్గానిలిచాడు.ఐసీసీ మెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్-2024రోహిత్ శర్మ(కెప్టెన్- ఇండియా),ట్రవిస్ హెడ్(ఆస్ట్రేలియా), ఫిల్ సాల్ట్(ఇంగ్లండ్), బాబర్ ఆజం(పాకిస్తాన్), నికోలస్ పూరన్(వికెట్ కీపర్- వెస్టిండీస్), సికందర్ రజా(జింబాబ్వే), హార్దిక్ పాండ్యా(ఇండియా), రషీద్ ఖాన్(అఫ్గనిస్తాన్), వనిందు హసరంగ(శ్రీలంక), జస్ప్రీత్ బుమ్రా(ఇండియా), అర్ష్‌దీప్ సింగ్(ఇండియా). -
ICC టెస్టు జట్టు ప్రకటన.. భారత్ నుంచి ముగ్గురు.. కెప్టెన్ ఎవరంటే?
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) 2024 ఏడాదికిగానూ పురుషుల అత్యుత్తమ టెస్టు(ICC Men’s Test Team of the Year 2024) జట్టును శుక్రవారం ప్రకటించింది. ఇందులో టీమిండియా నుంచి ముగ్గురు ఆటగాళ్లు చోటు దక్కించుకోగా.. ఇంగ్లండ్ నుంచి అత్యధికంగా నలుగురికి స్థానం దక్కింది. ఇక ఈ జట్టుకు ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సారథిగా ఎంపికయ్యాడు.ఐసీసీ మెన్స్ టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్-2024లో ఓపెనర్లుగా టీమిండియా స్టార్ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal)- ఇంగ్లండ్ ప్లేయర్ బెన్ డకెట్ చోటు దక్కించుకోగా.. వన్డే బ్యాటర్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్(Kane Williamson) స్థానం సంపాదించాడు.లంక నుంచి అతడుఇక మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో ఇంగ్లండ్ మాజీ సారథి, టెస్టు క్రికెట్ వీరుడు జో రూట్‌ను ఐసీసీ ఎంపిక చేసింది. ఐదో స్థానంలో ఇంగ్లండ్ నూతన వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్.. ఆరో స్థానంలో శ్రీలంక శతకాల ధీరుడు కమిందు మెండిస్ చోటు దక్కించుకున్నారు. ఇక వికెట్ కీపర్‌గా ఇంగ్లండ్ యువ క్రికెటర్ జేమీ స్మిత్ ఎంపిక కాగా.. ఆల్‌రౌండర్‌గా టీమిండియా స్పిన్ స్టార్ రవీంద్ర జడేజాకు స్థానం దక్కింది. ఇక ఈ జట్టులో ఏకంగా ముగ్గురు పేసర్లకు ఐసీసీ చోటిచ్చింది. కెప్టెన్ కమిన్స్‌తో పాటు.. న్యూజిలాండ్ రైటార్మ్ బౌలర్ మ్యాట్ హెన్రీ.. టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఈ జాబితాలో ఉన్నారు. కోహ్లి- రోహిత్‌లకు దక్కని చోటుఇటీవలి కాలంలో వరుస వైఫల్యాల కారణంగా టీమిండియా ప్రధాన బ్యాటర్లు విరాట్ కోహ్లి- రోహిత్ శర్మకు ఈ జట్టులో చోటు దక్కలేదు. అయితే, రోహిత్ ఓపెనింగ్ జోడీ యశస్వి జైస్వాల్ మాత్రం గతేడాది అత్యుత్తమంగా రాణించాడు.జైసూ, బుమ్రా హిట్ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్‌లో భారీ శతకం(161) బాదడం అతడి ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మూడు ఫార్మాట్లలో కలిపి 2024లో జైసూ 1771 పరుగులు సాధించాడు. ఇక బుమ్రా సైతం బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో అత్యధికంగా 32 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు.మరోవైపు.. జడేజా సైతం స్థాయికి తగ్గట్లుగా రాణించి.. ఈ జట్టుకు ఎంపికయ్యాడు. ఇదిలా ఉంటే... ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్-2024ను కూడా శుక్రవారం ప్రకటించారు. ఇందులో టీమిండియా నుంచి ఒక్కరికి కూడా స్థానం దక్కకపోవడం గమనార్హం. ఈ జట్టులో శ్రీలంక క్రికెటర్లు హవా చూపించారు.ఐసీసీ మెన్స్ టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్- 2024యశస్వి జైస్వాల్, బెన్ డకెట్, కేన్ విలియమ్సన్, జో రూట్, హ్యారీ బ్రూక్, కమిందు మెండిస్, జేమీ స్మిత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మ్యాట్ హెన్రీ, జస్ప్రీత్ బుమ్రా.ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్- 2024: చరిత్ అసలంక (శ్రీలంక- కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్(అఫ్గనిస్తాన్), పాతుమ్ నిసాంక(శ్రీలంక), కుశాల్ మెండిస్ (శ్రీలంక- వికెట్‌కీపర్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్(వెస్టిండీస్), అజ్మతుల్లా ఒమర్జాయ్(అఫ్గనిస్తాన్), వనిందు హసరంగ(శ్రీలంక), షాహీన్ షా అఫ్రిది(పాకిస్తాన్), హరీస్ రౌఫ్(పాకిస్తాన్), అల్లా ఘజన్ఫర్(అఫ్గనిస్తాన్).చదవండి: రోహిత్, కోహ్లి పరుగుల వరద పారించడం ఖాయం: ఇర్ఫాన్ పఠాన్ -
‘మెల్బోర్న్’ జ్ఞాపకాలు షేర్ చేసిన సంజనా.. బుమ్రాకు స్పెషల్! (ఫొటోలు)
-
బుమ్రా, భువనేశ్వర్‌ను దాటేసిన హార్దిక్ పాండ్యా..
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya ) ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో భారత బౌలర్‌గా పాండ్యా రికార్డులకెక్కాడు. బుధవారం కోల్‌కతా వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో రెండు వికెట్లు పడగొట్టిన హార్దిక్.. ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. హార్దిక్ ఇప్పటివరకు 111 మ్యాచ్‌లు ఆడి 91 వికెట్లు పడగొట్టాడు.ఈ క్రమంలో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్‌లను హార్దిక్ అధిగమించాడు. బుమ్రా 70 మ్యాచ్‌ల్లో 89 వికెట్లు పడగొట్టగా.. భువనేశ్వర్ 87 మ్యాచ్‌ల్లో 90 వికెట్లు పడగొట్టాడు. ఇక అరుదైన ఘనత సాధించిన జాబితాలో టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అగ్రస్ధానంలో ఉన్నాడు.అర్ష్‌దీప్ 61 మ్యాచ్‌ల్లో 97 వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్ సైతం ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లోనే ఈ ఘనత సాధించడం గమనార్హం. అర్ష్‌దీప్ తర్వాత స్ధానంలో స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్(96) ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పర్యాటక ఇంగ్లండ్‌ను 7 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది.తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ జోస్ బట్లర్(44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు తీశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 12.5 ఓవర్లలోనే చేధించింది. భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. కేవలం 34 బంతుల్లో 5 ఫోర్లు,8 సిక్స్‌లతో 79 పరుగులు చేసి భారత్‌కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 జనవరి 25న చెన్నై వేదికగా జరగనుంది.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన అభిషేక్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా -
NADA: బుమ్రా, సూర్య, పంత్, సంజూ శాంసన్.. ఇంకా..
జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా)లో కొత్తగా 14 మంది క్రికెటర్ల పేర్లు చేరాయి. ‘నాడా’ పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా తయారు చేసే రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్ (ఆర్టీపీ)– 2025 జాబితాలో భారత టి20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, టాప్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. వీరితో పాటు బీసీసీఐ కాంట్రాక్ట్ క్రికెటర్లు శుబ్‌మన్ గిల్(Shubman Gill), రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal), అర్ష్‌దీప్ సింగ్, సంజు శాంసన్, తిలక్ వర్మ(Tilak Varma) పేర్లు కూడా జత చేరాయి.ఇక ముగ్గురు మహిళా క్రికెటర్లు షఫాలీ వర్మ, దీప్తి శర్మ, రేణుకా సింగ్ పేర్లను కూడా ‘ఆర్టీపీ’లో చేర్చారు. ‘నాడా’ నిబంధనల ప్రకారం ఈ ఏడాదిలో ఏ సమయంలోనైనా వీరి శాంపిల్స్‌ను అధికారులు సేకరిస్తారు. డోపింగ్ పరీక్షలకు హాజరు కాకపోతేతాము ‘ఎప్పుడు, ఎక్కడ’ ఉంటామో చెబుతూ అధికారుల కోసం ఆటగాళ్లు అందుబాటులో ఉండాలి. తమ చిరునామా, ప్రాక్టీస్, ప్రయాణాలు, మ్యాచ్‌ల షెడ్యూల్వంటి వివరాలు కూడా వారు అందజేయాల్సి ఉంటుంది.కాగా డోపింగ్ పరీక్షలకు హాజరు కాకపోతే దానికి సదరు ఆటగాడే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఏడాది కాలంలో ఏదైనా కారణంతో మూడుసార్లు ఇలాగే జరిగితే డోపింగ్ నిబంధనల ఉల్లంఘన కింద ‘నాడా’ చర్యలు తీసుకుంటుంది. 2019 నుంచే ‘నాడా’ పరిధిలోకి క్రికెటర్లు రాగా... ఓవరాల్‌గా అన్ని క్రీడాంశాల్లో కలిపి ప్రస్తుతం 227 మంది భారత ప్లేయర్లు ఈ జాబితాలో ఉన్నారు.మరిన్నిక్రీడా వార్తలుఆసియా మిక్స్డ్ బ్యాడ్మింటన్ టోర్నీకి భారత జట్టు ప్రకటన న్యూఢిల్లీ: ఆసియా బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. ఫిబ్రవరి 11 నుంచి 16 వరకు చైనాలో జరగనున్న ఈ టోర్నీలో భారత్ నుంచి 14 మంది షట్లర్లు పాల్గొంటారు. రెండు ఒలింపిక్ పతకాలు నెగ్గిన స్టార్ పీవీ సింధుతోపాటు పారిస్ ఒలింపిక్స్‌లో పోటీపడ్డ లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణయ్ ఈ ప్రతిష్టాత్మక టోరీ్నలో ఆడతారు. 2023లో దుబాయ్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో భారత జట్టు కాంస్య పతకం నెగ్గింది.ఈసారి అంతకంటే మెరుగైన ప్రదర్శన చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) కార్యదర్శి సంజయ్ మిశ్రా తెలిపారు. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్, మహిళల సింగిల్స్‌లో సింధు, మాళవిక బరిలోకి దిగుతారు’ అని వెల్లడించారు. పురుషుల జట్టు: లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణయ్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, ధ్రువ్ కపిల, ఎంఆర్ అర్జున్, సతీశ్ కుమార్. మహిళల జట్టు: సింధు, మాళవిక బన్సోద్, గాయత్రి గోపీచంద్, ట్రెసా జాలీ, అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టో, ఆద్య. సహజ శుభారంభంబెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ100 మహిళల టోర్నీలో భారత రెండో ర్యాంకర్, తెలంగాణ అమ్మాయి సహజ యామలపల్లి శుభారంభం చేసింది. బుధవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 315వ ర్యాంకర్ సహజ 6–3, 3–6, 6–0తో ప్రపంచ 182వ ర్యాంకర్ యురికో మియజకి (జపాన్)పై సంచలన విజయం సాధించింది.2 గంటల 14 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సహజ తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసింది. హైదరాబాద్‌కే చెందిన మరో క్రీడాకారిణి భమిడిపాటి శ్రీవల్లి రషి్మక 0–6, 0–6తో ప్రపంచ 155వ ర్యాంకర్ సారా బెజ్లెక్ (చెక్ రిపబ్లిక్) చేతిలో 45 నిమిషాల్లో ఓడిపోయింది. మరో మ్యాచ్‌లో భారత నంబర్‌వన్ అంకిత రైనా 7–6 (7/2), 7–6 (7/4)తో దరియా కుదషోవా (రష్యా)పై గెలిచింది. -
టాప్‌లో బుమ్రా, జడేజా.. దిగజారిన రోహిత్ శర్మ ర్యాంక్
ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(jasprith Bumrah) హవా కొనసాగుతున్నాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో బుమ్రా 904 పాయింట్లతో తన అగ్రస్ధానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 సిరీస్‌లో బుమ్రా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.మొత్తం 5 టెస్టుల్లో 13.06 సగటుతో 32 వికెట్లు సాధించి ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా బుమ్రా నిలిచాడు. ఈ క్రమంలోనే తన టెస్టు రేటింగ్ పాయింట్స్‌ను బుమ్రా మెరుగుపరుచుకున్నాడు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్‌లో బుమ్రా తర్వాత స్ధానాల్లో వరుసగా ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్(841), సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ(837) కొనసాగుతున్నారు.మరోవైపు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా(Ravindra jadeja) తన అగ్రస్ధానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. జడేజా ఖాతాలో ప్రస్తుతం 400 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో జడేజా పర్వాలేదన్పించాడు. మిగితా ప్లేయర్లతో పోలిస్తే కాస్త మెరుగ్గానే కన్పించాడు.ఈ సిరీస్‌లో మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడిన జడ్డూ.. 27 సగటుతో 135 పరుగులు చేశాడు. జడేజా తర్వాత స్ధానాల్లో ప్రోటీస్ ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్ (294), బంగ్లా ప్లేయర్ మెహిదీ హసన్ (294) నిలిచారు. ఇక బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికి వస్తే.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma) ర్యాంక్ మరింత దిగజారింది.రోహిత్ ఒక స్ధానం దిగజారి 43వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. బీజీటీ సిరీస్‌లో రోహిత్ తీవ్ర నిరాశపరిచాడు. కాగా బీజీటీ సిరీస్‌లో రోహిత్ శర్మ తీవ్ర నిరాశపరిచాడు. అటు కెప్టెన్సీ, ఇటు బ్యాటింగ్ పరంగా రోహిత్ శర్మ పూర్తిగా తేలిపోయాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. రోహిత్ తన ఫామ్‌ను తిరిగి పొందేందుకు పదేళ్ల తర్వాత రంజీల్లో ఆడనున్నాడు.చదవండి: Ind vs Eng: అతడికి ఇదే చివరి అవకాశం.. ఊపిరి కూడా ఆడనివ్వడు! -
టీమిండియా అభిమానుల కళ్లన్నీ అతడి పైనే!
ప్రస్తుతం భారత క్రికెట్ అభిమానులందరి దృష్టి పేస్ బౌలర్ మహ్మద్ షమీ(Mohammed Shami) మీదే ఉంది. దాదాపు పద్నాలుగు నెలల విరామం తర్వాత టీమిండియాలోకి వచ్చిన షమీ త్వరలో జరగనున్న ఇంగ్లండ్ సిరీస్‌తో పునరాగమనం చేయనున్నాడు. అనంతరం ప్రతిష్టాత్మకమైన చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ కోసం సిద్ధం కానున్నాడు. ఎడమ మోకాలిపై పట్టీతోనే ప్రాక్టీస్ఈ నేపథ్యంలో ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఆదివారం కసరత్తు ప్రారంభించాడు. జనవరి 22 నుండి ఇంగ్లండ్‌తో(India vs England) జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో షమీ తొలుత పాల్గొంటాడు. ఇటీవలే గాయం నుంచి కోలుకున్న 34 ఏళ్ళ షమీ తన ఎడమ మోకాలిపై పట్టీతోనే ప్రాక్టీస్ పిచ్‌లపై తన బౌలింగ్ కసరత్తు ప్రారంభించడం గమనార్హం. మొదట కొద్దిగా మెల్లిగా బౌలింగ్ చేసినప్పటికీ క్రమంగా తన వేగాన్నిపెంచి.. తన రిథమ్ సాధించేందుకు ప్రయత్నించాడు. షమీ చివరిసారిగా అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన 2023 ప్రపంచ కప్ ఫైనల్ లో టీమిండియాకి ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత చీలమండ గాయం కారణంగా శస్త్రచికిత్స జరగడంతో భారత్ జట్టుకు దూరమయ్యాడు.బుమ్రా ఫిట్‌నెస్‌పై ఆందోళన భారత్ జట్టు ప్రధాన బౌలర్ అయినా జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) వెన్నునొప్పి కారణంగా ఇటీవల జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్ట్ మధ్యలో తప్పుకొన్న విషయం తెలిసిందే. ఈ కారణంగా చాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా పాల్గొనడంపై అనిశ్చితి కొనసాగుతుండటంతో ఎంతో అనుభవజ్ఞుడైన షమీ పునరాగమనం భారత్ జట్టుకి ఎంతో కీలకం. బుమ్రా ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి రిపోర్ట్ చేయాలనీ టీం మేనేజ్మెంట్ కోరింది.అక్కడ అతని ఫిట్నెస్ను వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. ఇంగ్లండ్‌తో జరగనున్న సిరీస్‌లోని మొదటి రెండు వన్డేలకు బుమ్రా అందుబాటులో ఉండే అవకాశం లేదు. అయితే మూడో వన్డేకి బుమ్రా జట్టులో చేరే అవకాశం ఉందని, చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో బుమ్రా పాల్గొంటాడని, భారత్ జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఇటీవల వెల్లడించాడు.అర్ష్‌దీప్ సింగ్‌కు అంతటి అనుభవం లేదుఅయితే బుమ్రా సకాలంలో కోలుకోలేని పక్షం లో షమీ పైనే భారత్ జట్టు భారం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం మహమ్మద్ సిరాజ్ కూడా జట్టులో లేనందున పెద్దగా అనుభవం లేని అర్ష్‌దీప్ సింగ్ పై జట్టు నుంచి పెద్దగా ఆశించడం కష్టమే. 2015లో ఆస్ట్రేలియా జరిగిన ప్రపంచ కప్ టోర్నమెంట్ లో భారత్ జట్టు సెమీఫైనల్ కి చేరడంలో కీలక పాత్ర వహించిన షమీ పాత, కొత్త బంతుల్తో నిర్దిష్టమైన లైన్ వేయడంలో మంచి దిట్ట.కొద్దిగా అనుకూలించే పిచ్‌లపై చెలరేగిపోయే షమీని ఎదుర్కోవడం బ్యాటర్లకు ఆషామాషీ విషయం కాదు. ప్రస్తుతం అద్భుత ఫామ్ తో ఉన్న బుమ్రాకి షమీ తోడైతే భారత్ బౌలింగ్ ప్రత్యర్థి జట్లకు పెద్ద సవాలుగా తయారవుతుందనడంలో సందేహం లేదు. గత కొద్ది కాలంగా భారత్ స్వదేశంలో మాత్రమే కాకా విదేశాల్లో కూడా విజయాలు సాధించడంలో బుమ్రా, షమీ కీలక పాత్ర పోషించారనడంలో సందేహం లేదు.షమీ లేని లోటు కనిపించిందిఇక ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా పర్యటన లో షమీ లేని లోటు భారత్ జట్టులో స్పష్టంగా కనిపించింది. బుమ్రా వొంటి చేత్తో తొలి టెస్ట్ గెలిపించినా అతనికి మరో వైపు నుంచి సహకారం కొరవడింది. సిరాజ్ అడపా దడపా మెరుపులు మెరిపించినా, కీలకమైన సమయాల్లో వికెట్లు సాధించడంలో విఫలమయ్యాడు. ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడంలో కూడా సిరాజ్ ఆశించిన రీతిలో రాణించలేదు.ఈ కారణంగానే బుమ్రా జట్టు భారమంతా భుజానికెత్తుకుని విపరీతంగా శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని ఫలితంగానే బుమ్రా చివరి టెస్ట్ మధ్యలో వెన్ను నొప్పితో వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం షమీ పైనే భారత్ జట్టు ఆశలు పెట్టుకుంది. అయితే షమీ పూర్తిగా కోలుకున్నాడా లేదా? బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ సమయానికి పూర్తి ఫిటెనెస్ సాధిస్తాడా లేదా అన్న అంశాలపైనే భారత్ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.చదవండి: ‘అతడి కథ ముగిసిపోయింది.. ఇకపై టీమిండియాలో చోటు ఉండదు’ -
అందుకే సిరాజ్‌ను ఎంపిక చేయలేదు: రోహిత్ శర్మ
అభిమానుల నిరీక్షణకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఎట్టకేలకు శనివారం తెరదించింది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025తో పాటు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియా(Champions Trophy India Squad)ను ప్రకటించింది. ఇక మెగా టోర్నీకి రోహిత్ శర్మ(Rohit Sharma) కెప్టెన్‌గా కొనసాగనుండగా.. శుబ్‌మన్ గిల్(Shubman Gill) అతడి డిప్యూటీగా ఎంపికయ్యాడు.బుమ్రా గాయంపై రాని స్పష్టతఅంతేకాదు.. ఈ ఓపెనింగ్ జోడీకి బ్యాకప్‌గా యశస్వి జైస్వాల్ తొలిసారిగా వన్డే జట్టులోనూ చోటు సంపాదించుకున్నాడు. అయితే, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం గురించి మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆఖరిదైన సిడ్నీ టెస్టు సందర్భంగా అతడు వెన్నునొప్పితో బాధపడిన విషయం తెలిసిందే.అయితే, చాంపియన్స్ ట్రోఫీ నాటికి బుమ్రా అందుబాటులోకి వస్తాడని సెలక్టర్లు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అతడిని ఐసీసీ ఈవెంట్‌కు ఎంపిక చేశారు. కానీ హైదరాబాదీ స్టార్ మహ్మద్ సిరాజ్‌కు మాత్రం ఈ జట్టులో స్థానం దక్కలేదు.వన్డే వరల్డ్‌కప్-2023లో లీడింగ్ వికెట్(24 వికెట్లు) టేకర్‌గా నిలిచిన మహ్మద్ షమీతో పాటు అర్ష్‌దీప్ సింగ్ కూడా చోటు దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో జట్టును ప్రకటిస్తున్న సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మకు సిరాజ్ గురించి ప్రశ్న ఎదురైంది.అందుకే సిరాజ్‌ను ఎంపిక చేయలేదుఇందుకు స్పందిస్తూ.. ‘‘బుమ్రా ఈ టోర్నీలో ఆడతాడా? లేదా? అన్న విషయంపై స్పష్టత లేదు. కాబట్టి కొత్త బంతితో, పాత బంతితోనూ ఫలితాలు రాబట్టగల పేసర్ల వైపే మొగ్గుచూపాలని భావించాం. బుమ్రా మిస్సవుతాడని కచ్చితంగా చెప్పలేం.కానీ ఏం జరిగినా అందుకు సిద్ధంగా ఉండాలి. అందుకే అర్ష్‌దీప్ సింగ్‌ను ఎంపిక చేసుకున్నాం. కొత్త బంతితో షమీ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో అందరికీ తెలుసు. అయితే, న్యూ బాల్ లేకపోతే సిరాజ్ తన స్థాయికి తగ్గట్లుగా రాణించలేడు. అందుకే అతడిని ఎంపిక చేయలేదు’’ అని రోహిత్ శర్మ వివరించాడు.సీమ్ ఆల్‌రౌండర్లు లేరుఇక చాంపియన్స్ ట్రోఫీ జట్టులో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు ఎక్కువగా ఉండటం గురించి రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘దురదృష్టవశాత్తూ మనకు ఎక్కువగా సీమ్ ఆల్‌రౌండర్లు లేరు. కాబట్టి బ్యాటింగ్ ఆర్డర్ డెప్త్‌గా ఉండాలనే ఉద్దేశంతో ఉన్నంతలో స్పిన్ ఆల్‌రౌండర్లనే ఎంపిక చేసుకున్నాం’’ అని తెలిపాడు.కాగా స్పిన్ విభాగంలో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌తో పాటు ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ చోటు దక్కించుకున్నారు. మరోవైపు.. సీమ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు.. అతడికి బ్యాకప్‌గా ట్రావెలింగ్ రిజర్వ్స్లో యువ సంచలనం, తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డికి చోటిచ్చారు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి బీసీసీఐ ప్రకటించిన జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా(ఫిట్నెస్ ఆధారంగా) మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా.ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డిచదవండి: Ind vs Eng: టీ20, వన్డే సిరీస్‌లకు భారత్, ఇంగ్లండ్ జట్లు ఇవే -
CT 2025: భారత జట్టు ప్రకటన.. సిరాజ్‌కు దక్కని చోటు.. నితీశ్ రెడ్డికి ఛాన్స్!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తమ జట్టును ప్రకటించింది. ఈ మెగా టోర్నీలో భాగమయ్యే ఆటగాళ్ల పేర్ల((India Squad For Champions Trophy 2025)ను శనివారం వెల్లడించింది.సిరాజ్, సంజూకు మొండిచేయిటీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)తో కలిసి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్(Ajit Agarkar) జట్టు వివరాలను మీడియాకు తెలిపాడు. ఈ టోర్నీలో రోహిత్ శర్మకు డిప్యూటీగా శుబ్‌మన్ గిల్ వ్యవహరించనున్నాడు. అదే విధంగా.. యశస్వి జైస్వాల్ తొలిసారిగా వన్డే జట్టులో చోటు దక్కించుకోగా.. హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు మాత్రం సెలక్టర్లు మొండిచేయి చూపారు. అయితే, తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డికి మాత్రం ట్రావెలింగ్ రిజర్వ్స్లో చోటు దక్కింది. పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు బ్యాకప్‌గా అతడిని ఎంపిక చేశారు.బుమ్రా ఫిట్నెస్ సాధిస్తాడా? మరోవైపు.. స్పిన్నర్ల విభాగంలో కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ చోటు దక్కించుకున్నారు. ఇక ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ ఆధారంగా ఈ టోర్నీలో ఆడేది లేనిది తేలుతుంది. పేసర్ల విభాగంలో షమీతో పాటు అర్ష్‌దీప్ సింగ్ స్థానం సంపాదించాడు. అయితే, అందరూ ఊహించినట్లుగా సంజూ శాంసన్‌కు మాత్రం ఈసారి ఈ జట్టులో చోటు దక్కలేదు.కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ ఆరంభం కానుంది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా అక్కడి వెళ్లకుండా తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడుతుంది. ఇందుకు ఐసీసీని బీసీసీఐ ఒప్పించగా.. ఐసీసీ జోక్యంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఈ మేరకు హైబ్రిడ్ విధానానికి అంగీకరించింది.ఎనిమిది జట్లుఇక ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్ ఈ ఐసీసీ ఈవెంట్‌కు నేరుగా అర్హత సాధించగా.. భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్-2023లో అదరగొట్టిన ఏడు జట్లు తమ ప్రదర్శన ఆధారంగా చోటు దక్కించుకున్నాయి. వరల్డ్‌కప్ చాంపియన్ ఆస్ట్రేలియా, రన్నరప్ టీమిండియాలతో పాటు.. న్యూజిలాండ్, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ ఈ మెగా టోర్నీకి క్వాలిఫై అయ్యాయి.వన్డే ఫార్మాట్లో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో ఈ ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-‘ఎ’లో భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా.. గ్రూప్-‘బి’లో ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ ఉన్నాయి.ఈ టోర్నమెంట్లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 20న ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక చిరకాల ప్రత్యర్థులైన టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగనుంది. ఇక చాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు టీమిండియా స్వదేశంలో ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడనుంది. జనవరి 22 నుంచి ఇరుజట్ల మధ్య తొలి టీ20తో మెగా సమరం మొదలుకానుంది. జనవరి 22, 25, 28, 31, ఫిబ్రవరి 2వ తేదీల్లో ఐదు టీ20లు.. ఫిబ్రవరి 6, 9, 12 తేదీల్లో మూడు వన్డేల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ టీమిండియా- ఇంగ్లండ్‌కు ఈ వన్డే సిరీస్ ద్వారా చాంపియన్స్ ట్రోఫీకి ముందు మంచి ప్రాక్టీస్ లభించనుంది. ఇక ఇంగ్లండ్‌తో వన్డేలలో కూడా ఇదే జట్టు ఆడనుండగా.. బుమ్రా స్థానంలో హర్షిత్ రాణా టీమ్‌లోకి వస్తాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనబోయే భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా(ఫిట్నెస్ ఆధారంగా) మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్.ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డిచాంపియన్స్ ట్రోఫీలో భారత్ షెడ్యూల్ ఇదేఫిబ్రవరి 20, 2025 (దుబాయ్)- బంగ్లాదేశ్ vs భారత్ఫిబ్రవరి 23, 2025 (దుబాయ్)- పాకిస్తాన్ vs భారత్మార్చి 2, 2025 (దుబాయ్) న్యూజిలాండ్ vs భారత్. -
అతడి కెరీర్‌ను నాశనం చేస్తారా?: భారత మాజీ క్రికెటర్ ఫైర్
ఇటీవల జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టోర్నమెంట్లో భారత్ ౩-1 తేడాతో ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటన సందర్భంగా భారత్ డ్రెస్సింగ్ రూమ్ లో విభేదాలు తలెత్తినట్టు దుమారం చెలరేగింది. భారత్ జట్టు సుదీర్ఘ విదేశీ పర్యటనకు వెళ్ళిన సమయంలో ఇలాంటి వార్తలు రావడం సహజమే.అదీ భారత్ జట్టు వరసగా పరాజయం పాలవడం, కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli) వంటి అగ్రశ్రేణి బ్యాటర్లు పేలవమైన ఫామ్‌తో విఫలం కావడం, చివరి మ్యాచ్ నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ స్వయంగా తప్పుకోవడంతో ఈ ఆరోపణలకు మరింత బలం చేకూరింది. అయితే టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో విభేదాలు తలెత్తినట్టు వచ్చిన వార్తలు బయటికి పొక్కడానికి.. ఒక యువ క్రికెటర్ కారణమని ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir).. స్వయంగా భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కి తెలియజేసాడని కూడా వార్తలు వచ్చాయి.కానీ.. నిజంగా గంభీర్ ఈ విషయాన్నీ బీసీసీఐకి తెలియజేసాడా అంటే.. దీని గురించి బీసీసీఐ అధికారులు ఎక్కడా అధికారిక ప్రకటన చేయలేదు. మరి భారత డ్రెస్సింగ్ రూమ్ నుండి ఇలాంటి లీకులకు భాద్యులు ఎవరు? ఈ విషయాన్నీ బీసీసీఐ స్పష్టం చేయాలి. గంభీర్ పేలవమైన రికార్డుగౌతమ్ గంభీర్‌ను భారత్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా నియమించిన తర్వాత నుంచి భారత్ జట్టు వరుసగా పరాజయాల్ని చవిచూస్తోంది. గత జూలైలో శ్రీలంక జట్టు భారత్ పర్యటనకు రావడానికి ముందు గంభీర్‌ను హెడ్‌కోచ్‌గా నియమించారు. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ లో భారత్ 3-0 విజయంతో గంభీర్ కోచ్‌గా తన ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అయితే ఆ తరువాత శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో 0-2తో భారత్ జట్టు ఓటమి చవిచూసింది. ఆ తరువాత బంగ్లాదేశ్‌పై 2-0 టెస్ట్ సిరీస్ విజయంతో జట్టు కొద్దిగా పుంజుకున్నట్టు కనిపించినా న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌ను 0-3 తో కోల్పోయింది. ఇటీవల ఆస్ట్రేలియాలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టోర్నమెంట్లో 3-1 తేడాతో భారత్ పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో సిడ్నీలో జరిగిన చివరి టెస్ట్‌కు ముందు గంభీర్ సీనియర్ ఆటగాళ్లను మందలించాడని వార్తలు వచ్చాయి.అయితే ఇప్పుడు భారత్ మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కొత్త వివాదాన్ని రేకెత్తించాడు. ఈ లీకులు భారత్ జట్టు నుంచి మాత్రమే కాక భారత్ బోర్డు నుంచి కూడా వస్తున్నాయని చోప్రా ఎత్తి చూపడమే కాక ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరించాడు. అతడి కెరీర్ నాశనం చేస్తారా? లీకులకు బాధ్యులు ఎవరు?తన యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేసిన వీడియోలో, ఆకాష్ చోప్రా మాట్లాడుతూ.. లీకుల ఆధారంగా వచ్చే కథనాలు ఒక ఆటగాడి కెరీర్‌కు హాని కలిగిస్తాయని పేర్కొన్నాడు. యువ ఆటగాడి భవిష్యత్తును ప్రమాదంలో పడేసే లీక్ అయిన వాదనలను వ్యాప్తి చేయకుండా ఉండాలని అతను బీసీసీఐని, క్రికెట్ అభిమానుల్ని కోరాడు."ఇలాంటి లీకులు ఒక యువ ఆటగాడి క్రికెట్ కెరీర్ ను ప్రమాదంలో పడేశాయి. ఈ లీకులు వాస్తవమే అని మరో లీకు ద్వారా నిర్ధారణ చేస్తున్నారు. ఇది ఆ అతగాడి కెరీర్ కు ఎంత ప్రమాదమో ఆలోచించారా" అని ప్రశ్నించాడు. బుమ్రా మంచి పనిచేశాడుఅదే వీడియోలో జస్ప్రీత్ బుమ్రా కు సంబంధించిన మరో సంఘటనని చోప్రా ఉదహరించాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్ట్ లో మొదటి ఇన్నింగ్స్ చివర్లో, మళ్ళీ రెండవ ఇన్నింగ్స్‌లో బుమ్రా వెన్నునొప్పి కారణంగా బౌలింగ్ చేయలేకపోయాడు.అయితే బుమ్రా తనకు బెడ్ రెస్ట్ కావాలని డాక్టర్లు సలహా ఇచ్చారని అప్పుడు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు సరికాదని బుమ్రా స్వయంగా ట్వీట్ చేయడం ద్వారా ఖండించాడని చోప్రా ఎత్తి చూపాడు. బుమ్రా ఈ ట్వీట్ చేయని పక్షంలో దాన్ని నిజమని నమ్మేవారు. ఇలాంటి వార్తలను జట్టుతో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరూ ఖండించాలి అని చోప్రా సూచించాడు.బీసీసీఐ జాగ్రత్త పడాలిఅయితే భారత్ జట్టు బ్యాటింగ్ కోచ్ గా సీతాన్షు కోటక్ నియమించబోతున్నారని కూడా వార్త బీసీసీఐ అధికారిక ప్రకటనకు ముందే మీడియా లో రావడాన్ని ఇక్కడ ఉదహరించాడు. మీడియాకు ఈ వార్త తెలియకముందే బీసీసీఐ ముందస్తుగా వ్యవహరించి వారి నియామకాలను ముందుగానే ప్రకటించాలని చోప్రా సూచించాడు. "భారత జట్టు బ్యాటింగ్ కోచ్‌గా సీతాన్షు కోటక్ నియమిస్తున్నారనేది పెద్ద వార్త. ఈ విషయాన్నీ బీసీసీఐ అధికారికంగా ప్రకటించవచ్చు కదా. మీరు ముందస్తుగా చెప్పడం ప్రారంభిస్తే.. లీకులకు స్వస్తి చెప్పే అవకాశం ఉంటుంది’’ అని చోప్రా సూచించాడు. మరి బోర్డు అధికారులు ఈ విషయాన్ని గ్రహిస్తారో లేదో చూడాలి.చదవండి: ఫామ్‌లో ఉన్నా కరుణ్ నాయర్‌ను సెలక్ట్ చేయరు.. ఎందుకంటే: డీకే -
టీమిండియాకు బ్యాడ్‌న్యూస్!
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)కి ముందు టీమిండియాకు చేదువార్త!.. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ఈ ఐసీసీ టోర్నీ మొత్తానికి దూరం కానున్నట్లు తెలుస్తోంది. వెన్నునొప్పి కారణంగా మరికొంత కాలం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మెగా ఈవెంట్‌కు అతడు అందుబాటులోకి రావడం కష్టమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు.అంతా తానై నడిపించిన బుమ్రాఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో జస్ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ పితృత్వ సెలవుల కారణంగా తొలి టెస్టుకు దూరం కాగా బుమ్రా సారథ్య బాధ్యతలు చేపట్టాడు. పెర్త్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో బౌలర్‌గా, కెప్టెన్‌గా రాణించి టీమిండియాకు 295 పరుగుల భారీ తేడాతో విజయం అందించాడు.ఇక ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో.. ఫామ్‌లేమి దృష్ట్యా రోహిత్ శర్మ ఆఖరిదైన సిడ్నీ మ్యాచ్‌కు దూరం కాగా బుమ్రా మరోసారి జట్టు పగ్గాలు తీసుకున్నాడు. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా అతడు వెన్నునొప్పితో విలవిల్లాడాడు. ఈ క్రమంలో ఆస్పత్రికి తీసుకువెళ్లి స్కానింగ్ చేయించుకున్న తర్వాత బుమ్రా మళ్లీ మైదానంలో దిగి బౌలింగ్ చేశాడు. 32 వికెట్లతో కానీ దురదృష్టవశాత్తూ జట్టును గెలిపించలేకపోయాడు. ఈ క్రమంలో 3-1 తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన టీమిండియా.. పదేళ్ల తర్వాత ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కోల్పోయింది. ఏదేమైనా అద్బుత ప్రదర్శనతో ఈ సిరీస్‌లో అదరగొట్టిన బుమ్రా 32 వికెట్లతో లీడింగ్ వికెట్‌టేకర్‌గా నిలిచాడు.ఇదిలా ఉంటే.. టీమిండియా తదుపరి ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై టీ20, వన్డేలు ఆడనుంది. అనంతరం ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనాల్సి ఉంది. అయితే, బుమ్రా వెన్నునొప్పి నుంచి ఇంకా కోలుకోలేనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతడు ఇంగ్లండ్‌తో వన్డేలతో పాటు.. చాంపియన్స్ ట్రోఫీ లీగ్ మ్యాచ్‌లకు కూడా దూరమవుతాడని తొలుత వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. అతడు నాకౌట్ దశకు కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది.బెడ్ రెస్ట్ అవసరం‘‘బుమ్రా వచ్చేవారం బీసీసీఐకి చెందిన, బెంగళూరులో ఉన్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రిపోర్టు చేయాల్సి ఉంది. అయితే, ఇప్పటి వరకు అందుకు సంబంధించిన తేదీ ఖరారు కాలేదు. అతడు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. కండరాల నొప్పితో పాటు వాపు కూడా ఉంది.కాబట్టి వైద్యులు అతడిని ఇంటి వద్ద బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు. ఇది నిజంగా జట్టుకు ఎదురుదెబ్బలాంటిదే. డిస్క్ బాహ్య పొర ఉబ్బినట్లు తేలినా, కండరాల వాపు ఎక్కువగా ఉన్నా మరింత కష్టమే. అతడొక విలువైన ఆటగాడు. కాబట్టి అతడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మేనేజ్మెంట్పై ఉంది’’ అని బీసీసీఐ సన్నిహిత వర్గాలు అన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది.అవే కీలకంఅదే విధంగా.. టీమిండియా మాజీ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ రాంజీ శ్రీనివాసన్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘ఎడిమా(శరీర కణజాలాల్లో ఫ్లూయిడ్స్) ఫామ్ అయితే.. వాపు వస్తుంది. అయితే, గాయం, నొప్పి తీవ్రత ఆధారంగా ఓ వ్యక్తి ఎన్నిరోజులు విశ్రాంతి తీసుకోవాలనే అంశాన్ని నిర్ణయిస్తారు. ఆ వ్యక్తి శరీరతత్వం, వైద్యుల పర్యవేక్షణ, వాడే మందులు.. అన్నీ ఇందులో కీలకం’’ అని పేర్కొన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. కాగా ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది.చదవండి: అందుకే ఐదు సెంచరీలు కొట్టినా అతడిని పక్కన పెడుతున్నారా?: భజ్జీ -
అతడు ‘జట్టు’లో లేకుంటే.. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ మనదే: అశ్విన్
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ‘గేమ్ ఛేంజర్’ ఎవరన్న అంశంపై తన అభిప్రాయాలు పంచుకుంటూ.. ఓ స్టార్ పేసర్ పేరు చెప్పాడు. అతడు గనుక ఆస్ట్రేలియా జట్టులో లేకపోయి ఉంటే.. ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని భారత్ కైవసం చేసుకునేదని ఈ మాజీ ఆల్‌రౌండర్ అభిప్రాయపడ్డాడు. 3-1తో గెలిచి పదేళ్ల తర్వాతఏదేమైనా ఈసారి బీజీటీ ఆద్యంతం ఆసక్తిగా, పోటాపోటీగా సాగిందని అశూ హర్షం వ్యక్తం చేశాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophyబీజీటీ)లో భాగంగా భారత క్రికెట్ జట్టు ఇటీవల ఆస్ట్రేలియా గడ్డపై ఐదు టెస్టులు ఆడిన విషయం తెలిసిందే. పెర్త్‌లో గెలుపొంది శుభారంభం అందుకున్న టీమిండియా.. ఆ తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయింది. అడిలైడ్‌లో పింక్ బాల్ టెస్టులో ఓడి.. అనంతరం బ్రిస్బేన్‌లో మూడో టెస్టు డ్రా చేసుకున్న భారత్.. మెల్బోర్న్, సిడ్నీల్లో మాత్రం చేతులెత్తేసింది.తద్వారా రోహిత్ సేనను 3-1తో ఓడించిన కమిన్స్ బృందం.. పదేళ్ల తర్వాత బీజీటీని సొంతం చేసుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వైఫల్యం కారణంగానే టీమిండియాకు ఇంతటి ఘోర పరాభవం ఎదురైంది. ఇక బ్రిస్బేన్ టెస్టు తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్.. తాజాగా ఈ సిరీస్ గురించి మాట్లాడుతూ.. ఆసీస్ పేసర్ స్కాట్ బోలాండ్‌పై ప్రశంసలు కురిపించాడు.అతడు లేకుంటే.. ట్రోఫీ మనమే గెలిచేవాళ్లం‘‘ప్యాట్ కమిన్స్(Pat Cummins)కు ఇదొక గొప్ప సిరీస్ అని చాలా మంది అంటున్నారు. నిజానికి ఈ పేస్ బౌలర్ ఎడమచేతి వాటం బ్యాటర్లను ఎదుర్కోవడంలో చాలాసార్లు ఇబ్బంది పడ్డాడు. అయితే, అదృష్టవశాత్తూ స్కాట్ బోలాండ్ జట్టులోకి రావడం ఆస్ట్రేలియాకు కలిసి వచ్చింది. ఒకవేళ బోలాండ్ గనుక ఈ సిరీస్‌లో ఆడకపోయి ఉంటే.. టీమిండియానే ట్రోఫీ గెలిచేది.అయితే, ఇక్కడ నేను జోష్ హాజిల్‌వుడ్ నైపుణ్యాలను తక్కువ చేసి మాట్లాడటం లేదు. అతడు కూడా అద్భుతమైన బౌలర్. అయితే, భారత్‌తో సిరీస్‌లో మాత్రం హాజిల్‌వుడ్‌ను కొనసాగిస్తే.. విజయం మనదే అయ్యేది. అయితే, బోలాండ్ మనల్ని అడ్డుకున్నాడు. ముఖ్యంగా లెఫ్డాండర్లకు రౌండ్ ది వికెట్ బౌలింగ్ చేయడం ప్రభావం చూపింది’’ అని అశ్విన్ పేర్కొన్నాడు. కాగా గాయం కారణంగా జోష్ హాజిల్‌వుడ్ దూరం కాగా.. అతడి స్థానంలో నాలుగో టెస్టు నుంచి బోలాండ్ బరిలోకి దిగాడు. ఈ సిరీస్‌లో ఆడింది కేవలం రెండు టెస్టులే ఆడినా 16 వికెట్లు పడగొట్టి.. సిరీస్‌లో మూడో లీడింగ్ వికెట్ టేకర్‌గా బోలాండ్ నిలిచాడు. భారత కీలక బ్యాటర్ విరాట్ కోహ్లిని అనేకసార్లు అవుట్ చేసి.. టీమిండియాను దెబ్బకొట్టాడు. తద్వారా ఆసీస్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అత్యధిక వికెట్ల వీరుడిగా బుమ్రాఇదిలా ఉంటే.. టీమిండియా పేస్ దళనాయకుడు జస్ప్రీత్ బుమ్రా బీజీటీ 2024-25లో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. ఐదు టెస్టుల్లో కలిపి 32 వికెట్లు పడగొట్టి.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. అదే విధంగా.. ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్(డిసెంబరు)గా కూడా బుమ్రా ఎంపికయ్యాడు. ఇక ఆస్ట్రేలియాతో పెర్త్‌లో జరిగిన తొలి టెస్టుకు రోహిత్ శర్మ దూరం కాగా.. బుమ్రా సారథ్యం వహించి భారీ విజయం అందించాడు. ఆఖరిదైన సిడ్నీ టెస్టు నుంచి రోహిత్ తప్పుకోగా.. మరోసారి కెప్టెన్సీ చేపట్టిన బుమ్రా.. ఈసారి మాత్రం గెలిపించలేకపోయాడు.చదవండి: పాకిస్తాన్‌కు వెళ్లనున్న రోహిత్ శర్మ!.. కారణం?పంత్ క్లారిటీ ఇచ్చాడు... కానీ కోహ్లి మాత్రం ఇలా: డీడీసీఏ ఆగ్రహం -
టీమిండియా యువ బౌలర్‌కు వెన్నునొప్పి.. మరో పేసర్ అవుట్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో సత్తా చాటి.. టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన భారత క్రికెటర్లు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ప్రతిభ నిరూపించుకోవడం ద్వారా యువకులు అంతర్జాతీయ టీ20లలోనూ ఆడే అవకాశం దక్కించుకుంటున్నారు. నయా పేస్ సంచలనం మయాంక్ యాదవ్ కూడా ఆ కోవకు చెందిన వాడే. ఈ ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ గతేడాది ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చాడు.అరేంగేట్ర మ్యాచ్లోనేలక్నో సూపర్ జెయింట్స్ తరఫున అరేంగేట్ర మ్యాచ్‌లోనే మయాంక్ యాదవ్.. తన పేస్ పదనుతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. గంటకు 155.8 కిలో మీటర్ల వేగంతో బంతిని విసిరి టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు ఈ స్పీడ్‌స్టర్. అయితే, కేవలం నాలుగు మ్యాచ్‌లు ఆడిన తర్వాత గాయం కారణంగా.. ఐపీఎల్-2024 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో సత్తా చాటిఅనంతరం.. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందిన మయాంక్ యాదవ్.. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా భారత జట్టుకు ఎంపికయ్యాడు. బంగ్లాతో మూడు మ్యాచ్‌లలోనూ ఆడిన ఈ రైటార్మ్ ఫాస్ట్ బౌలర్.. మొత్తంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు.అయితే, ఆ తర్వాత మళ్లీ గాయం తిరగబెట్టడంతో మయాంక్ యాదవ్ టీమిండియాకు దూరమయ్యాడు. సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లలేకపోయాడు. అయితే, ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై జరుగనున్న టీ20 సిరీస్‌కైనా ఎంపికవుతాడని భావిస్తే.. ఈసారి కూడా గాయం అతడికి అడ్డంకిగా మారింది. వెన్నునొప్పితో బాధపడుతున్న మయాంక్ యాదవ్ ఇంకా కోలుకోలేదని సమాచారం.వెన్నునొప్పి వేధిస్తోందిఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘అతడిని వెన్నునొప్పి వేధిస్తోంది. కాబట్టి ఇంగ్లండ్‌తో సిరీస్ నాటికి ఫిట్నెస్ సాధించకపోవచ్చు. సెకండ్ లెగ్‌లో భాగంగా జనవరి 23 నుంచి సౌరాష్ట్రతో మ్యాచ్ ఆడనున్న ఢిల్లీ రంజీ జట్టులో కూడా మయాంక్ పేరు లేకపోవడం గమనించే ఉంటారు’’ అని పేర్కొన్నాయి.కాగా జనవరి 22 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్ కూడా ఈ సిరీస్‌కు దూరం కానున్నారు. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీతో తీరికలేకుండా గడిపిన ఈ ఇద్దరు ఫాస్ట్‌బౌలర్లు కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుని.. ఇంగ్లండ్‌తో వన్డేలకు మాత్రం తిరిగి రానున్నట్లు సమాచారం. మరో సీనియర్ పేసర్ మహ్మద్ షమీ కూడా అప్పుడే రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక బుమ్రా, సిరాజ్, షమీ గైర్హాజరీలో అర్ష్‌దీప్ సింగ్ టీ20 సిరీస్‌లో పేస్ దళాన్ని ముందుకు నడిపించనున్నట్లు సమాచారం.భారత్ వర్సెస్ ఇంగ్లండ్.. టీ20 సిరీస్, వన్డే షెడ్యూల్టీ20లుతొలి టీ20- జనవరి 22- కోల్కతారెండో టీ20- జనవరి 25- చెన్నైమూడో టీ20- జనవరి 28- రాజ్కోట్నాలుగో టీ20- జనవరి 31- పుణెఐదో టీ20- ఫిబ్రవరి 2- ముంబైవన్డేలుతొలి వన్డే- ఫిబ్రవరి 6- నాగ్పూర్రెండో వన్డే- ఫిబ్రవరి 9- కటక్మూడో వన్డే- ఫిబ్రవరి 12- అహ్మదాబాద్.చదవండి: స్టీవ్ స్మిత్ ఊచకోత.. విధ్వంసకర శతకం.. ‘బిగ్’ రికార్డ్! -
టీమిండియా తదుపరి కెప్టెన్ అతడే!
టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)పై భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ప్రశంసలు కురిపించాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ)లో ఈ రైటార్మ్ బౌలర్ అద్భుత ప్రదర్శన కనబరిచాడని కొనియాడాడు. కెప్టెన్‌గానూ బుమ్రా జట్టును ముందుకు నడిపించిన తీరు తనను ఆకట్టుకుందన్నాడు. ఆటగాళ్లపై ఒత్తిడి పడకుండా పరిణతి గల నాయకుడిగా మెప్పించాడని పేర్కొన్నాడు.ఇటు బౌలర్‌గా.. అటు కెప్టెన్‌గా రాణించికాగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, తొలి టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) పితృత్వ సెలవుల కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో వైస్ కెప్టెన్ బుమ్రా సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఇటు బౌలర్‌గా.. అటు కెప్టెన్‌గా రాణించి పెర్త్‌లో టీమిండియాకు 295 పరుగుల తేడాతో ఆసీస్‌పై ఘన విజయం అందించాడు.వెన్నునొప్పి వేధిస్తున్నాఆ తర్వాత మరో మూడు టెస్టులకు సారథిగా వ్యవహరించిన రోహిత్ శర్మ.. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా వైఫల్యం చెందినందున ఆఖరి టెస్టు నుంచి తప్పుకొన్నాడు. జట్టు ప్రయోజనాల కోసం విశ్రాంతి పేరిట తానే స్వయంగా దూరంగా ఉన్నాడు. ఫలితంగా మరోసారి పగ్గాలు బుమ్రా చేతికి వచ్చాయి. సిడ్నీలో జరిగిన ఈ మ్యాచ్‌లో జట్టును గెలిపించేందుకు అతడు గట్టిగానే శ్రమించాడు.పేస్ దళ భారాన్ని మొత్తం తానే మోశాడు. ఈ క్రమంలో వెన్నునొప్పి రావడంతో ఆస్పత్రికి వెళ్లి వచ్చి మరీ బరిలోకి దిగాడు. అయినప్పటికీ సిడ్నీలో ఓటమిపాలైన టీమిండియా 1-3తో ఓటమిపాలై.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)ని ఆసీస్‌కు చేజార్చుకుంది. అయితే, జట్టు ప్రదర్శన ఎలా ఉన్నా బుమ్రాకు మాత్రం ఈ టూర్లో మంచి మార్కులే పడ్డాయి. ఐదు టెస్టుల్లో కలిపి మొత్తం 32 వికెట్లు పడగొట్టిన ఈ రైటార్మ్ పేసర్.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు.నాయకుడిగా మంచి పేరుఈ పరిణామాల నేపథ్యంలో సునిల్ గావస్కర్ బుమ్రాను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీమిండియా తదుపరి కెప్టెన్ అతడే!.. నా అభిప్రాయం ప్రకారం కచ్చితంగా అతడే పగ్గాలు చేపడతాడు. జట్టును ముందుండి నడిపించడంలో బుమ్రా తనకంటూ ప్రత్యేకశైలిని ఏర్పరచుకున్నాడు.నాయకుడిగా అతడికి మంచి పేరు వచ్చింది. సారథిగా ఉన్నా సహచర ఆటగాళ్లపై ఒత్తిడి పెంచేరకం కాదు. కొన్నిసార్లు కెప్టెన్లు తామే ఒత్తిడిలో కూరుకుపోయి.. పక్కవాళ్లనూ అందులోకి నెట్టేస్తారు. కానీ బుమ్రా ఏ దశలోనూ అలా చేయలేదు. తనపని తాను చేసుకుంటూనే.. జట్టులో ఎవరి విధి ఏమిటో అర్థమయ్యేలా చక్కగా తెలియజెప్పాడు.నిజంగా అతడొక అద్భుతంఈ క్రమంలో ఎవరిపైనా అతడు ఒత్తిడి పెట్టలేదు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లను డీల్ చేసిన విధానం బాగుంది. వ్యక్తిగతంగా అద్భుత ప్రదర్శన కనబరుస్తూనే.. సహచరులకు అన్ని వేళలా మార్గదర్శనం చేశాడు. నిజంగా అతడొక అద్భుతం. అందుకే టీమిండియా తదుపరి టెస్టు కెప్టెన్ అతడే అని నేను బలంగా నమ్ముతున్నాను’’ అని గావస్కర్ 7క్రికెట్‌తో పేర్కొన్నాడు.కాగా ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లో ఘోర ఓటమిని చవిచూసిన టీమిండియా.. తదుపరి స్వదేశంలో ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఐదు టీ20, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. అయితే, గాయం కారణంగా బుమ్రా ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌లకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 19న మొదలయ్యే చాంపియన్స్ ట్రోఫీ నాటికి అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.చదవండి: ‘గంభీర్ ఒక మోసగాడు.. గెలిస్తే క్రెడిట్ నాదే అంటాడు.. కానీ’ -
అన్ని ఫార్మాట్లలో బుమ్రానే బెస్ట్ బౌలర్: ఆసీస్ మాజీ కెప్టెన్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25ను టీమిండియా కోల్పోయినప్పటికి.. పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా తన అద్బుత ప్రదర్శనతో ప్రత్యర్ధిలను సైతం ఆకట్టుకున్నాడు. పెర్త్ నుంచి సిడ్నీ వరకు మొత్తం 5 టెస్టుల్లోనూ బుమ్రా సత్తాచాటాడు. ఈ సిరీస్‌లో చాలా సందర్భాల్లో బుమ్రా తన పేస్ బౌలింగ్‌తో ఆసీస్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు.బుమ్రా మొత్తం 5 టెస్టుల్లో 13.06 సగటుతో 32 వికెట్లు సాధించి ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. బుమ్రా మరో రెండు వికెట్లు సాధించి ఉంటే, ఆస్ట్రేలియాలో ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన పర్యాటక బౌలర్‌గా రికార్డులెక్కెవాడు.ప్రస్తుతం ఈ రికార్డు ఇంగ్లండ్ బౌలింగ్ దిగ్గజం సిడ్నీ బర్న్స్ పేరిట ఉంది. బర్న్స్ 1911-12 సిరీస్‌లో ఏకంగా 34 వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో జస్ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖల్ క్లార్క్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆల్ ఫార్మాట్లలో బుమ్రాను మించిన బౌలర్ లేడని క్లార్క్ కొనియాడాడు."బోర్డర్- గావస్కర్ ట్రోఫీ తర్వాత బుమ్రా ప్రదర్శన గురించి నేను ఆలోచించాను. నా వరకు అయితే అన్ని ఫార్మాట్లలో బుమ్రానే అత్యుత్తమ బౌలర్. చాలా మంది గొప్ప ఫాస్ట్ బౌలర్లు నాకు తెలుసు. కర్ట్లీ ఆంబ్రోస్, గ్లెన్ మెక్‌గ్రాత్ దిగ్గజ బౌలర్లు ఉన్నా, వారు టీ20 క్రికెట్ ఆడలేదు.కాబట్టి బుమ్రాను ఆల్‌ఫార్మాట్ బెస్ట్ బౌలర్‌గా ఎంచుకున్నాను. ఆడే ఫార్మాట్, కండీషన్స్‌తో సంబంధం లేకుండా బుమ్రా అద్బుతంగా రాణించగలడు. అదే అతడి అత్యుత్తమ బౌలర్‌గా మార్చింది. సిడ్నీ టెస్టులో భారత్ మరో 20 పరుగులు ఎక్కువగా చేసి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేది.బుమ్రా జట్టులో ఉంటే సిడ్నీ టెస్టు భారత్ గెలుస్తుందని నేను అనుకున్నాను. జట్టులోని ఇతర బౌలర్ల కంటే బుమ్రా చాలా బెటర్‌గా ఉన్నాడు" అని క్లార్క్ ఈఎస్పీఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా బుమ్రా ప్రస్తుతం వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. అతడు నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నాడు. బుమ్రా తిరిగి మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025తో మైదానంలో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: ఆస్ట్రేలియాకు భారీ షాక్!.. చాంపియన్స్ ట్రోఫీకి కమిన్స్ దూరం? -
బుమ్రా చాంపియన్స్ ట్రోఫీకి డౌటే.. కానీ: పాక్ మాజీ క్రికెటర్
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం వెన్ను గాయంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో ఐదో టెస్టు సందర్భంగా అతడి గాయం తిరగబెట్టింది. వెంటనే బుమ్రాను ఆట మధ్యలోనే స్కానింగ్‌కు తరలించారు.ఈ క్రమంలో అతడు రెండు ఇన్నింగ్స్ మొత్తానికి దూరమయ్యాడు. కీలకమైన మ్యాచ్‌లో బుమ్రా బౌలింగ్ చేయలేకపోయాడు. అయితే ఛాంపియన్స్ ట్రోపీ 2025కు ముందు బుమ్రా గాయం భారత సెలక్టర్లను తెగ ఆందోళన కలిగిస్తోంది. అస్సలు ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ఆడుతాడా? లేదా అని అభిమానులు సైతం టెన్షన్ పడుతున్నారు. కాగా బుమ్రా గాయంపై ఇంకా స్పష్టత రాలేదు.అతడి గాయం తీవ్రత ఏ స్ధాయిలో ఉందో కూడా తెలియదు. ఒకవేళ అతడి గాయం గ్రేడ్ 1 కేటగిరీలో ఉంటే, ఈ స్టార్ పేసర్ దాదాపు 5 నుంచి ఆరు వారాల పాటు ఆటకు దూరం ఉండాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అతడు ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ మ్యాచ్‌లను కోల్పోవలసి ఉంటుంది.అయితే బీసీసీఐ మాత్రం బమ్రా గాయంపై ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గోనే ఆయా దేశ క్రికెట్ బోర్డులు తమ జట్ల వివరాలను జనవరి 12 నాటికి ఐసీసీకి సమర్పించాలి. దీంతో బుమ్రా గాయంపై ఒకట్రెండు రోజుల్లో అప్డేట్ వచ్చే అవకాశముంది.ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ఆడేది అనుమానమే అని అలీ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. బుమ్రా గాయంపై ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో అతడు ఆడే అవకాశాలు కేవలం 10 శాతం మాత్రమే ఉన్నాయని తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.కాగా జస్ప్రీత్ భారత జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ బుమ్రా అదరగొట్టాడు. మొత్తం 5 మ్యాచ్‌లో 32 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా జస్ప్రీత్ నిలిచాడు. ఈ సిరీస్‌లో మొత్తం 150 ఓవర్లకు పైగా బౌలింగ్ చేయడం విశేషం.టాప్‌లోనే బుమ్రా..ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్ మండలి టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత పేసర్ బుమ్రా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇప్పటికే 907 రేటింగ్ పాయింట్లతో భారత్ నుంచి అత్యుత్తమ రేటింగ్ సాధించిన బౌలర్‌గా నిలిచిన బుమ్రా... ఇప్పుడు మరో పాయింట్ సాధించి 908 పాయింట్లతో నంబర్‌వన్‌గా నిలిచాడు.ఈ జాబితాలో కమిన్స్ (841) రెండో స్థానంలో కొనసాగుతుండగా... భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా ఒక స్థానం మెరుగుపర్చుకొని 9వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో యశస్వి జైస్వాల్ తన 4వ స్థానాన్ని నిలబెట్టుకోగా... సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో మెరుపు అర్ధసెంచరీ సాధించిన రిషభ్ పంత్ మూడు స్థానాలు ఎగబాకి 9వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. టెస్టు ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో జడేజా నంబర్‌వన్‌గానే కొనసాగుతున్నాడు.చదవండి: SL vs AUS: ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్.. -
‘బుమ్రాను కెప్టెన్ చేయొద్దు.. కేఎల్ రాహుల్ బెటర్ ఆప్షన్’
టెస్టుల్లో టీమిండియా తదుపరి కెప్టెన్ ఎవరు?... ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు పేలవ ప్రదర్శన, రోహిత్ శర్మ(Rohit Sharma) వైఫల్యం నేపథ్యంలో ఈ ప్రశ్న తెర మీదకు వచ్చింది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు కంగారూ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా ఓటమిభారంతో ఇంటిబాట పట్టింది.దాదాపు పదేళ్ల తర్వాత ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌ను భారత జట్టు ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది. ఇక ఆసీస్‌తో తొలి టెస్టుకు వ్యక్తిగత కారణాల దృష్ట్యా తొలి టెస్టుకు దూరంగా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ.. ఆఖరిదైన సిడ్నీ టెస్టు నుంచి తనంతట తానుగా తప్పుకొన్నాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగా జట్టుకు భారంగా మారడం ఇష్టం లేక తుదిజట్టు నుంచి స్వయంగా వైదొలిగాడు. నాయకుడిగా బుమ్రా సఫలం!ఈ రెండు సందర్భాల్లోనూ పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించాడు. పెర్త్‌లో 295 పరుగుల తేడాతో భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన అతడు.. ఐదో టెస్టులో మాత్రం జట్టును గట్టెక్కించలేకపోయాడు. అయితే, సిరీస్ ఆసాంతం జట్టు భారాన్ని తన భుజాలపై మోసిన బుమ్రా.. ప్రస్తుతం వెన్నునొప్పితో బాధపడుతున్నాడు.గాయం వల్ల జట్టుకు దూరమయ్యే పరిస్థితిఫలితంగా సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో టీ20, వన్డేలతో పాటు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీకి కూడా బుమ్రా దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే.. ఆసీస్ పర్యటన తర్వాత రోహిత్ శర్మ టెస్టు రిటైర్మెంట్ గురించి ప్రచారం ఊపందుకుంది. అతడి వారసుడిగా బుమ్రా పగ్గాలు చేపడతాడని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.బుమ్రాకు కెప్టెన్సీ ఇవ్వవద్దుఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ మాత్రం భిన్నంగా స్పందించాడు. బుమ్రాను టెస్టు కెప్టెన్ చేయవద్దని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి అతడు విజ్ఞప్తి చేశాడు. ‘‘జస్ప్రీత్ బుమ్రా సమీప భవిష్యత్తులో కెప్టెన్సీ చేపట్టబోతున్నాడా? రోహిత్ శర్మ వారసుడిగా అతడిని ఎంపిక చేయడం సరైన నిర్ణయం కాదు.ఎందుకంటే.. జట్టు భారం మొత్తాన్ని మోస్తూ.. టీమ్ కోసం ప్రాణం పెట్టి మరీ పోరాడగల ఏకైక బౌలర్ అతడే. మిగతా పేసర్ల నుంచి అతడికి పెద్దగా సహాయం అందడం లేదు. కాబట్టి బుమ్రాపైనే అధిక భారం పడుతోంది. అందుకే అతడు గాయపడుతున్నాడు.పంత్ లేదంటే రాహుల్ బెటర్అందుకు తోడు కెప్టెన్సీ భారం పడితే ఇంకా కష్టం. కాబట్టి బుమ్రాను అస్సలు కెప్టెన్‌గా నియమించవద్దు. అతడికి బదులు బ్యాటర్‌ను సారథిగా ఎంపిక చేస్తే బాగుంటుంది. రిషభ్ పంత్ లేదంటే.. కేఎల్ రాహుల్‌ను టెస్టులకు కెప్టెన్ చేయాలి. వాళ్లిద్దరికీ ఐపీఎల్లో సారథులుగా పనిచేసిన అనుభవం ఉంది. వాళ్లిద్దరిలో ఒకరిని ఎంపిక చేయడం సరైన నిర్ణయం అనిపించుకుంటుంది’’ అని మహ్మద్ కైఫ్ చెప్పుకొచ్చాడు.అలా చేస్తే తిప్పలు తప్పవు‘‘బుమ్రాను పూర్తి స్థాయి కెప్టెన్‌గా నియమించే ముందు బీసీసీఐ ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. అతడు ఫిట్‌గా ఉండి.. వికెట్లు తీయడంపై దృష్టి సారిస్తే బాగుంటుంది. అంతేకానీ.. నాయకత్వ భారం కూడా మోపితే గాయాల బెడద వేధించడం ఖాయం. తన అద్భుతమైన కెరీర్‌కు అంతరాయం ఏర్పడుతుంది. కాబట్టి.. బంగారు గుడ్లు పెట్టే బాతును చంపకండి’’ అని కైఫ్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయం పంచుకున్నాడు.చదవండి: BCCI: గంభీర్‌పై వేటు?.. రోహిత్, కోహ్లిలు మాత్రం అప్పటిదాకా..! -
టాప్-10లోకి రిషబ్ పంత్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా వికెట్‌కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ (Rishabh Pant) మూడు స్థానాలు మెరుగుపర్చుకున్నాడు. పంత్ 12వ స్థానం నుంచి తొమ్మిదో స్థానానికి ఎగబాకాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన చివరి టెస్ట్‌లో పంత్ మెరుపు అర్ద శతకం బాదాడు. ఈ ప్రదర్శన కారణంగానే పంత్ ర్యాంకింగ్ మెరుగుపడింది. బ్యాటర్ల టాప్-10లో పంత్ ఒక్కడే వికెట్‌కీపర్ బ్యాటర్‌గా ఉన్నాడు. భారత్ నుంచి పంత్‌తో పాటు యశస్వి జైస్వాల్ టాప్-10లో ఉన్నాడు. జైస్వాల్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లు జో రూట్, హ్యారీ బ్రూక్ మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా.. న్యూజిలాండ్ మాజీ సారధి కేన్ విలియమ్సన్, ఆసీస్ విధ్వంసకర బ్యాటర్ ట్రవిస్ హెడ్ మూడు, ఐదు స్థానాల్లో నిలిచాడు. తాజాగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా మూడు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి ఎగబాకగా.. లంక ప్లేయర్ కమిందు మెండిస్ ఓ స్థానం మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి చేరాడు. భారత్‌తో జరిగిన చివరి టెస్ట్‌లో ఆశించినంతగా రాణించిన లేకపోయిన ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఓ స్థానం కోల్పోయి ఎనిమిదో స్థానానికి పడిపోయాడు. తాజాగా సౌతాఫ్రికా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీలు చేసిన పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని 12వ ప్లేస్‌కు చేరగా.. జింబాబ్వే జరిగిన రెండో టెస్ట్‌లో సూపర్ సెంచరీ చేసిన ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రహ్మత్ షా 26 స్థానాలు మెరుగుపర్చుకుని 26వ స్థానానికి చేరాడు. జింబాబ్వే ఆటగాడు క్రెయిగ్ ఎర్విన్ 10 స్థానాలు మెరుగపర్చుకుని 37వ స్థానానికి చేరగా.. సౌతాఫ్రికాపై సెంచరీ చేసిన పాక్ కెప్టెన్ షాన్ మసూద్ 12 స్థానాలు మెరుగుపర్చుకుని 45వ ప్లేస్‌కు చేరాడు. పాక్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో భారీ డబుల్ సెంచరీతో విరుచుకుపడిన దక్షిణాఫ్రికా ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ ఏకంగా 48 స్థానాలు మెరుగుపర్చుకుని 55వ స్థానానికి చేరాడు. బ్యాటర్ల టాప్-100 ర్యాంకింగ్స్‌లో ఇవే చెప్పుకోదగ్గ మార్పులు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్స్ సాధించి (908) అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా సారధి కమిన్స్, సౌతాఫ్రికా పేసర్ రబాడ తలో స్థానం మెరుగుపర్చుకుని రెండు, మూడు స్థానాలకు చేరారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరిగిన చివరి టెస్ట్‌లో 10 వికెట్లు తీసిన ఆసీస్ పేసర్ స్కాట్ బోలాండ్ ఏకంగా 29 స్థానాలు మెరుగుపర్చుకుని 10వ స్థానానికి చేరాడు. జింబాబ్వేతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 11 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 54వ స్థానానికి ఎగబాకాడు. భారత్ నుంచి బుమ్రాతో పాటు రవీంద్ర జడేజా టాప్-10 బౌలర్ల జాబితాలో ఉన్నాడు. జడ్డూ తొమ్మిదో స్థానానికి ఎగబాకాడు. ఆసీస్‌తో జరిగిన చివరి టెస్ట్‌లో అద్భుతంగా రాణించిన భారత పేసర్ ప్రసిద్ద్ కృష్ణ 42 స్థానాలు మెరుగుపర్చుకుని 93వ స్థానానికి చేరాడు.ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సౌతాఫ్రికా ఆటగాడు మార్కో జన్సెన్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని రెండో స్థానానికి చేరాడు. -
టీమిండియాకు భారీ షాక్.. ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా దూరం!
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ గాయం కారణంగా బుమ్రా ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయలేదు. సిడ్నీ టెస్టు రెండో రోజు ఆటలో కాస్త ఆసౌక్యరంగా కన్పించిన బుమ్రాను వెంటనే స్కానింగ్ తరలించారు.కానీ ఇప్పటివరకు బుమ్రా గాయం ఏ దశలో ఉందన్నది బీసీసీఐ గానీ టీమ్‌మెనెజ్‌మెంట్ క్లారిటీ ఇవ్వలేదు. ఏదేమైనప్పటికీ జస్ప్రీత్ గాయం కాస్త తీవ్రమైనదిగానే అన్పిస్తోంది. అతడి గాయం అంత సీరియస్ కాకపోతే అతడు కచ్చితంగా కీలకమైన సిడ్నీ టెస్టులో బౌలింగ్ చేసేవాడు.ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం..!కాగా జస్ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియా నుంచి గురువారం భారత్‌కు చేరుకోనున్నాడు. స్వదేశానికి వచ్చాక గతం(2022)లో న్యూజిలాండ్‌లో తనకి శస్త్ర చికిత్స చేసిన వైద్యుడిని సంప్రదించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ స్టార్ పేసర్ ఏన్సీలో బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉండనున్నట్లు వినికిడి.కాగా బుమ్రా గాయం గాయం గ్రేడ్ 1 కేటగిరీలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే అతడు నాలుగు నుంచి ఐదు వారాల ఆటకు దూరం కాక తప్పదు. ఆ తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టాలంటే ఏన్సీఎ వైద్య బృందం క్లియరెన్స్ కచ్చితంగా కావాలి.ఈ క్రమంలో అతడు ఇంగ్లండ్‌తో వైట్‌బాల్ సిరీస్‌లతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీలో లీగ్ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశముంటుంది. ఈ మెగా టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న దాయాది పాకిస్తాన్‌తో తలపడనుంది.ఒకవేళ గ్రూపు స్టేజి మ్యాచ్‌లకు బుమ్రా దూరమైతే భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. అయితే బీసీసీఐ ఇంకా బుమ్రా గాయం తీవ్రతను ఇంకా నిర్ధారించలేదు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీకి మరో స్టార్‌పేసర్ మహ్మద్ షమీ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.షమీ ప్రస్తుతం విజయ్‌హజారే ట్రోఫీలో బెంగాల్ తరపున ఆడుతున్నాడు. షమీ గతేడాదిగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అతడు ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు భారత జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ బెంగాల్ స్పీడ్ స్టార్ ఇంగ్లండ్‌తో జరిగే వన్డేల్లో ఆడనున్నట్లు వార్తలు విన్పిస్తున్నాయి.ఆసీస్ గడ్డపై అదుర్స్..బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో బుమ్రా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ సిరీస్‌ను భారత్ కోల్పోయినప్పటికీ తన ప్రదర్శనతో ప్రత్యర్ధిని సైతం ఆకట్టుకున్నాడు. మొత్తం 5 మ్యాచ్‌లో 32 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా జస్ప్రీత్ నిలిచాడు. ఈ సిరీస్‌లో మొత్తం 150 ఓవర్లకు పైగా బౌలింగ్ చేయడం విశేషం.చదవండి: అశ్విన్ రిటైర్మెంట్కు కారణమిదే?.. ఆసీస్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు -
బుమ్రా వరల్డ్‌క్లాస్ బౌలర్.. కోహ్లి చాలా మంచోడు
అరంగేట్రంలోనే అద్భుత అర్ధ శతకంతో దుమ్ములేపాడు ఆస్ట్రేలియా యువ సంచలనం సామ్ కొన్‌స్టాస్(Sam Konstas). బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియాతో మెల్బోర్న్ టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు ఈ టీనేజర్. వెటరన్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజాకు ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగి.. తొలి మ్యాచ్‌లో 60 పరుగులతో సత్తా చాటాడు.అనంతరం.. సిడ్నీ టెస్టులోనూ సామ్ కొన్‌స్టాస్ మెరుగ్గా రాణించాడు. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 45 పరుగులు చేశాడు. అయితే, భారత్‌తో ఆఖరిదైన ఈ టెస్టు మ్యాచ్‌లో కొన్‌స్టాస్.. టీమిండియా తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)తో వాగ్వాదానికి దిగాడు. సిడ్నీలో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి.. మొదటి రోజు ఆటలో భాగంగా 185 పరుగులకు ఆలౌట్ అయింది.బుమ్రాతో గొడవ పడిన కొన్స్టాస్అదే రోజు ఆస్ట్రేలియా బ్యాటింగ్ మొదలుపెట్టగా.. బుమ్రా బౌలింగ్ అటాక్ ఆరంభించాడు. ఈ క్రమంలో తొలిరోజు ఆటలో.. ఆఖరి బంతి వేసే సమయానికి ఖవాజా తనకు కాస్త సమయం కావాలని అడగ్గా.. బుమ్రా విసుక్కున్నాడు. ఈ క్రమంలో నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న కొన్‌స్టాస్ బుమ్రాతో గొడవకు సిద్ధమయ్యాడు. ఇందుకు బుమ్రా కూడా గట్టిగానే బదులివ్వగా.. అంపైర్ జోక్యం చేసుకుని ఇద్దరికీ నచ్చజెప్పాడు.టైమ్ వేస్ట్ చేయాలని చూశానుఅయితే, ఆఖరి బాల్‌కు ఖవాజా వికెట్ పడగొట్టిన బుమ్రా... కొన్‌స్టాస్ వైపు చూస్తూ వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. టీమిండియా ఆటగాళ్లంతా కూడా కొన్‌స్టాస్‌ను ఇక వెళ్లు అన్నట్లుగా సైగ చేస్తూ చుట్టుముట్టారు. తాజాగా ఈ ఘటనపై స్పందించిన కొన్‌స్టాస్.. ‘‘నాకు ప్రత్యర్థులతో పోటీ పడటం అంటే ఇష్టం.అయితే, టీమిండియాతో సిరీస్ నాకెన్నో విషయాలు నేర్పించింది. నిజానికి ఆరోజు నేను బుమ్రా సమయం వృథా చేయాలని ప్రయత్నించాను. టీమిండియాకు మరో ఓవర్ వేసే అవకాశం ఇవ్వకూడదని భావించాను. కానీ.. ఆఖరికి అతడే పైచేయి సాధించాడు.బుమ్రా వరల్డ్‌క్లాస్ బౌలర్ఏదేమైనా అతడొక ప్రపంచ స్థాయి బౌలర్. ఈ సిరీస్‌లో ఏకంగా 32 వికెట్లు తీశాడు’’ అని బుమ్రా నైపుణ్యాలను కొనియాడాడు. అదే విధంగా.. మెల్బోర్న్ టెస్టు సందర్భంగా విరాట్ కోహ్లి(Virat Kohli)తో గొడవ గురించి ప్రస్తావనకు రాగా.. ‘‘మ్యాచ్ పూర్తైన తర్వాత నేను కోహ్లితో మాట్లాడాను. నాకు అతడే ఆదర్శం అని చెప్పాను.నా ఆరాధ్య క్రికెటర్‌కు ప్రత్యర్థిగా బరిలో దిగడం నిజంగా నాకు దక్కిన గౌరవం. అతడు చాలా నిరాడంబరంగా ఉంటాడు. మంచి వ్యక్తి. అతడు నాకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. శ్రీలంక పర్యటనకు గనుక ఎంపికైతే బాగా ఆడాలని నన్ను విష్ చేశాడు’’ అని 19 ఏళ్ల సామ్ కొన్‌స్టాస్ చెప్పుకొచ్చాడు. కాగా దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. జూనియర్ రిక్కీ పాంటింగ్‌గా పేరొందాడు.ఫైనల్‌కు ఆసీస్.. టీమిండియా ఇంటికిఇదిలా ఉంటే.. ఆసీస్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 1-3తో చేజార్చుకుంది. తద్వారా పదేళ్ల తర్వాత తొలిసారి కంగారూ జట్టు బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అంతేకాదు.. టీమిండియాను వెనక్కినెట్టి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించింది. టైటిల్ పోరులో సౌతాఫ్రికాతో ఆసీస్ తలపడనుంది. ఇక టీమిండియా తదుపరి స్వదేశంలో ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. ఇందులో భాగంగా ఐదు టీ20లు, మూడు వన్డేల్లో ఇంగ్లిష్ జట్టుతో తలపడనుంది. -
IPL 2025: ప్రధాన ఆటగాళ్లకు ముంబై ఇండియన్స్ స్ట్రాంగ్ వార్నింగ్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్(Mumbai Indians) గతేడాది ఘోర పరాభవాన్ని చవిచూసింది. పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం నాలుగే గెలిచి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. స్టార్ ప్లేయర్లు ఉన్నా పేలవ ప్రదర్శనతో చతికిలపడి అవమానభారంతో లీగ్ దశలోనే నిష్క్రమించింది.అయితే, ఈ దుస్థితికి యాజమాన్యమే కారణమని ముంబై ఇండియన్స్ అభిమానులే విమర్శల వర్షం కురిపించారు. ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు అంబానీల సారథ్యంలోని ముంబై జట్టు.. తమ కెప్టెన్‌ను మార్చడమే ఇందుకు ప్రధాన కారణం. ముంబై ఫ్రాంఛైజీకి ఘనమైన చరిత్ర ఉంది. రోహిత్ శర్మ సారథ్యంలోక్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక సార్లు ట్రోఫీ గెలిచిన జట్టుగా ముంబై నిలిచింది. రోహిత్ శర్మ(Rohit Sharma) సారథ్యంలో ఏకంగా ఐదుసార్లు టైటిల్ సాధించి.. ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. అయితే, గత సీజన్ ఆరంభానికి ముందు రోహిత్‌ను కెప్టెన్‌గా తప్పించిన మేనేజ్మెంట్..అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకుని మరీ.. పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగించింది.పాండ్యాకు అవమానాలురోహిత్ శర్మ ఫ్యాన్స్‌తో పాటు.. ముంబై జట్టు అభిమానులు కూడా ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోయారు. దీంతో హార్దిక్ పాండ్యా మైదానంలోకి రాగానే అతడిని కించపరిచేలా పెద్ద ఎత్తున గోల చేశారు. ముంబై సొంత గ్రౌండ్ వాంఖడేలోనూ హార్దిక్‌కు ఇలాంటి చేదు అనుభవాలు తప్పలేదు. రోహిత్ కూడా అభిమానులను వారించకుండా మిన్నకుండిపోవడం అనుమానాలకు తావిచ్చింది.రోహిత్ టీమ్ వర్సెస్ హార్దిక్ అనేలాహార్దిక్ పాండ్యాను కెప్టెన్‌ను చేయడం రోహిత్ శర్మకు ఇష్టం లేదనే ప్రచారం జరిగింది. రోహిత్‌తో పాటు.. అతడి తర్వాత కెప్టెన్ పదవిని ఆశించిన జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్‌లకు కూడా హార్దిక్‌తో పొసగడం లేదనే వార్తలు గుప్పుమన్నాయి. ఫలితంగా ముంబై ఇండియన్స్ డ్రెసింగ్‌రూమ్‌లో విభేదాలు తలెత్తాయంటూ వదంతులు వ్యాపించాయి. అయితే, మైదానంలో రోహిత్, బుమ్రా, సూర్య ఒక జట్టుగా కనిపించడం.. హార్దిక్ పాండ్యా ఒంటరిగా ఉండటం వీటికి బలాన్ని చేకూర్చాయి.ఫలితంగా వరుస ఓటముల రూపంలో ముంబై ఇండియన్స్ భారీ మూల్యమే చెల్లించింది. అయితే, ఈసారి మాత్రం అలాంటి పొరపాటును పునరావృతం చేయకూడదని ముంబై యాజమాన్యం భావిస్తోందట. ప్రధాన ఆటగాళ్లకు ముంబై ఇండియన్స్ స్ట్రాంగ్ వార్నింగ్!ఇందుకోసం ఇటీవలే ప్రత్యేకంగా ఓ సమావేశం కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీని మనస్ఫూర్తిగా అంగీకరించాలని.. అతడికి అన్ని వేళలా అండగా నిలవాలని జట్టులోని ప్రధాన ఆటగాళ్లతో మేనేజ్మెంట్ పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి.అదే విధంగా.. ఆటగాళ్లంతా కలిసికట్టుగా ఉండి.. జట్టు ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యంగా పనిచేయాలని గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. హార్దిక్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా అతడిని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించినట్లు సమాచారం.కాగా తనను కెప్టెన్‌గా తప్పించిన ముంబై ఇండియన్స్‌తో రోహిత్ శర్మ బంధం తెంచుకుంటాడనే ప్రచారం జరుగగా.. అతడు మాత్రం అనూహ్య రీతిలో అదే ఫ్రాంఛైజీతో కొనసాగేందుకు నిర్ణయించుకున్నాడు.రోహిత్ మళ్లీ ముంబైతోనే..ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు ముంబై రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో రోహిత్ కూడా ఉండటం విశేషం. జస్ప్రీత్ బుమ్రా(రూ. 18 కోట్లు), సూర్యకుమార్ యాదవ్(రూ. 16.35 కోట్లు),హార్దిక్ పాండ్యా(రూ. 16.35 కోట్లు), రోహిత్ శర్మ(రూ. రూ. 16.30 కోట్లు), తిలక్ వర్మ(రూ. 8 కోట్లు)లను ముంబై అట్టిపెట్టుకుంది. కాగా గత సీజన్ ఆఖరి మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా.. హార్దిక్ పాండ్యాకు భారీ షాక్ తగిలింది. ఐపీఎల్-2025లో మొదటి మ్యాచ్ ఆడకుండా అతడిపై నిషేధం పడింది.చదవండి: ఆసీస్‌తో టెస్టుల్లో అతడిని ఆడించాల్సింది.. ద్రవిడ్ ఉన్నంత వరకు.. : భజ్జీ -
ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ అయిన పేసు గుర్రం
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ అయ్యాడు. బుమ్రా డిసెంబర్ నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినీగా ఎంపికయ్యాడు. బుమ్రాతో పాటు ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్, సౌతాఫ్రికా సీమర్ డేన్ పాటర్సన్ కూడా మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యారు. డిసెంబర్ నెలలో ప్రదర్శనల ఆధారంగా ఐసీసీ ఈ ముగ్గురిని నామినేట్ చేసింది. బుమ్రా ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ కావడం ఇది వరుసగా రెండో సారి. నవంబర్ నెలలోనూ బుమ్రా ఈ అవార్డుకు నామినేట్ అయ్యాడు. నవంబర్ నెలలో బుమ్రా ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును గెలుచుకున్నాడు.మహిళల ప్లేయర్ ఆఫ్ ద మంత్ (డిసెంబర్) నామినీస్ విషయానికొస్తే.. ఈ అవార్డుకు పురుషుల నామినీస్ లాగానే భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లకు చెందిన ఆటగాళ్లు ఎంపికయ్యారు. భారత్ నుంచి స్మృతి మంధన, సౌతాఫ్రికా నుంచి నొన్కులులేకో మ్లాబా, ఆస్ట్రేలియా నుంచి అన్నాబెల్ సదర్‌ల్యాండ్ ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డుకు నామినేట్ అయ్యారు. డిసెంబర్ నెలలో ఈ ముగ్గురు అద్భుతంగా రాణించారు.జస్ప్రీత్ బుమ్రా: పేసు గుర్రం బుమ్రా డిసెంబర్ నెలలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ నెలలో అతనాడిన మూడు టెస్ట్ మ్యాచ్‌ల్లో (ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో) 22 వికెట్లు తీశాడు. ఇదే నెలలో బుమ్రా అత్యధిక రేటింగ్ పాయింట్లు (907) సాధించిన భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.పాట్ కమిన్స్: ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ డిసెంబర్ నెలలో మూడు టెస్ట్ మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శనలు నమోదు చేశాడు. కమిన్స్ ఈ నెలలో 17 వికెట్లు తీయడంతో పాటు అత్యతం కీలకమైన 144 పరుగులు తీశాడు. కమిన్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనల కారణంగా డిసెంబర్లో జరిగిన మూడు టెస్ట్‌ల్లో ఆసీస్ భారత్‌ను ఓడించింది.డేన్ పాటర్సన్: ఈ సౌతాఫ్రికన్ పేసర్ తొలిసారి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. డిసెంబర్ నెలలో పాటర్సన్ రెండు టెస్ట్‌ల్లో 13 వికెట్లు తీశాడు. పాటర్సన్ ప్రదర్శనల కారణంగా సౌతాఫ్రికా తొలిసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు చేరుకుంది.స్మృతి మంధన: మంధన డిసెంబర్ నెలలో ఆడిన పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల్లో సూపర్ ఫామ్‌ను కనబర్చి 463 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాలో జరిగిన వన్డేలో మంధన సూపర్ సెంచరీ చేసింది. అనంతరం స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌ల్లో మంధన వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు చేసింది.మ్లాబా: డిసెంబర్ నెలలో ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో మ్లాబా చెలరేగిపోయింది. ఈ మ్యాచ్‌లో ఆమె 10 వికెట్ల ప్రదర్శన నమోదు చేసింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రికెటర్ రికార్డు సృష్టించింది. ఇదే నెలలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేల్లోనూ మ్లాబా రాణించింది.అన్నాబెల్ సదర్‌ల్యాండ్: 23 ఏళ్ల ఈ ఆసీస్ ఆల్‌రౌండర్ డిసెంబర్ నెలలో బంతితో, బ్యాట్‌తో అద్బుతంగా రాణించింది. ఈ నెలలో సదర్‌ల్యాండ్ ఏడు వికెట్లు తీయడంతో పాటు రెండు సెంచరీలు (భారత్, న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేల్లో) చేసింది. -
BGT: ఆస్ట్రేలియా నిజంగానే గొప్పగా ఆడిందా?
ఆద్యంతం ఆసక్తి రేపిన భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌ను రోహిత్ సేన 1-3తో ఓడి పరాజయంతో ముగించింది. తద్వారా పదేళ్ల తర్వాత కంగారూ జట్టు బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar)ని తమ సొంతం చేసుకుంది. అయితే, స్వదేశంలో ఆస్ట్రేలియా క్రికెటర్ల అద్భుత ప్రదర్శన కారణంగానే ఇది సాధ్యమైందా? అంటే.. నిజంగా లేదనే చెప్పాలి. భారత్ బ్యాటర్ల తప్పిదాల వల్లే ఆసీస్ జట్టుకు సుదీర్ఘ విరామం తర్వాత ఈ విజయం దక్కిందని చెప్పక తప్పదు.ఈ సిరీస్ లో భారత్ తరుఫున పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఒక్కడు మాత్రమే అద్భుతంగా ఆడాడు. నిజానికి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ సైతం ఈ విషయాన్నిఅంగీకరించరు. వాస్తవానికి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ బుమ్రా ని ఎదుర్కొనడానికి భయపడ్డారనేది చేదు నిజం.'బుమ్రా వేరే గ్రహం నుంచి వచ్చాడా?'మెల్బోర్న్ టెస్టు అనంతరం ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్ సైతం బుమ్రా పై ప్రశంసలు కురిపించడం విశేషం. "బుమ్రా ఒక్కడూ వేరే గ్రహం నుంచి వచ్చినట్టు ఆడుతున్నాడు" అని గిల్‌క్రిస్ట్ వ్యాఖ్యానించాడు. గిల్‌క్రిస్ట్ మాత్రమే కాకుండా అనేక మంది ఇతర మాజీ ఆస్ట్రేలియన్ క్రికెటర్ల సైతం బుమ్రాని ప్రశంసలతో ముంచెత్తారు. బుమ్రాని వాళ్ళు వెస్టిండీస్ దిగ్గజాలతో పోల్చడం విశేషం. ఆదివారం సిడ్నీలో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ లో బుమ్రా మైదానంలోకి రాకపోవడంతో భారత్ ఓటమి ఖాయమైపోయింది. ఈ మ్యాచ్ కి ముందు బుమ్రా హావభావాలను భారత్ ఆటగాళ్లకన్నా ఆస్ట్రేలియా క్రికెటర్లు, వాళ్ళ అభిమానులు, కామెంటేటర్లు ఎక్కువగా నిశితంగా పరిశీలించాలంటే అతని ప్రాముఖ్యమేమిటో అర్ధమౌతుంది.ముఖ్యంగా మెల్బోర్న్లో నాలుగో రోజు బుమ్రా భారత్ ని గెలిపించేందుకు బాగా శ్రమించడంతో అతని శరీరం తట్టుకోలేకపోయింది. దీని ఫలితంగా, ఈ సిరీస్‌లో ఏకంగా 32 వికెట్లు సాధించి.. ఆస్ట్రేలియాలో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా రికార్డ్ నెలకొల్పినప్పటికీ భారత్ పరాజయంతో వెనుదిరగాల్సి వచ్చింది.ఆస్ట్రేలియా బ్యాటర్ల ప్రతిభ అంతంతమాత్రమేఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా బ్యాట్సమెన్ మెరుగ్గా ఆడారనడం సరికాదు. అయితే ఆస్ట్రేలియా బ్యాటర్ల ప్రతిభ కన్నా భారత్ బ్యాటింగ్ లైనప్‌లో అస్థిరత వారిని గెలిపించిందంటే సబబుగా ఉంటుందేమో. ఈ సిరీస్ లో భారత్ బ్యాటర్ల టాప్ ఆర్డర్ (1 నుండి 7) వరకు సగటు 24.67తో పోలిస్తే.. ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ సగటు 28.79 మాత్రమే. టీమిండియా బ్యాటర్ల రెండు సెంచరీలు, ఆరు అర్ధసెంచరీలతో పోలిస్తే.. ఇక్కడ ఆస్ట్రేలియా బ్యాటర్ల నాలుగు సెంచరీలు, ఎనిమిది అర్ధసెంచరీలతో కాస్త పైచేయి సాధించారు.ఇక తొమ్మిదో స్థానం నుంచి పదకొండో స్థానాల బ్యాటర్ల ఆట తీరును పరిగణనలోకి తీసుకుంటే.. భారత్ సగటు 9.64తో కాగా ఆస్ట్రేలియా సగటు 15గా నమోదైంది. ఇక ఈ సిరీస్‌లో బుమ్రా తర్వాత మరో సానుకూలాంశం యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్. అతడు 43.44 సగటుతో 391 పరుగులు సాధించి ఈ సిరీస్‌లో భారత్ తరఫున అత్యుత్తమ బ్యాటర్‌గా నిలిచాడు. కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి అడపాదడపా మెరుపులు మెరిపించారు కానీ నిలకడగా రాణించలేదు.ఇక రిషబ్ పంత్ చివరి మ్యాచ్ లో అబ్బురపరిచాడు. అయితే, ఈ సిరీస్‌లో టీమిండియా తరఫున ప్రధానంగా వైఫల్యం చెందినది మాత్రం కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అని చెప్పక తప్పదు.రోహిత్ శర్మ అయిదు ఇన్నింగ్స్‌లలో 6.20 సగటు కేవలం 31 పరుగులు సాధించగా, కోహ్లీ ఎనిమిది ఇన్నింగ్స్ ల్లో 23.75 సగటుతో 190 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ కూడా ఉండటం విశేషం.మేనేజ్మెంట్ తప్పిదాలు కూడామొత్తం మీద భారత్ బ్యాటర్ల వైఫల్యం.. టీమ్ మేనేజ్మెంట్ తప్పిదాలే టీమిండియా కొంపముంచాయని చెప్పవచ్చు. ముఖ్యంగా మెల్బోర్న్ నాలుగో రోజు ఆటముగిసేలోగా ఆస్ట్రేలియా బ్యాటర్లని ఆలౌట్ చేయడంలో వైఫల్యం.. అదే రోజు యశస్వి జైస్వాల్ వరుసగా క్యాచ్‌లు జారవిడవడం తీవ్ర ప్రభావం చూపింది. ఇక మెల్బోర్న్లో గెలుపొంది ఆధిక్యం సంపాదించిన ఆస్ట్రేలియా.. అదే ఆత్మవిశ్వాసం తో సిడ్నీలో గెలిచి పదేళ్ల తర్వాత సిరీస్ దక్కించుకుంది. -
Jasprit Bumrah: భయం పుట్టించాడు!
‘ఆటగాళ్లు గాయపడాలని ఎవరూ కోరుకోరు... కానీ ఇలాంటి పిచ్‌పై అతడిని ఎదుర్కోవడం అంటే మాకు ఒక పీడకలగా మారి ఉండేది... అతను బౌలింగ్‌కు దిగడం లేదని తెలిసిన వెంటనే మాకు ఇక్కడ గెలిచే అవకాశం ఉందని అర్థమైంది’... ఒక బౌలర్ గురించి ప్రత్యర్థి బ్యాటర్ ఇలాంటి మాట చెబుతున్నాడంటే సదరు బౌలర్ ఆ బ్యాటర్‌పై, జట్టులోని ఇతర ఆటగాళ్లపై చూపించిన ప్రభావం ఏమిటో అర్థమవుతుంది. ‘మీ గుండెల్లో నిద్రపోతా’ అంటూ సినిమాల్లో వినిపించే రొటీన్ డైలాగ్‌ను నిజంగానే అన్వయిస్తే ఎలా ఉంటుందో ఈ వ్యాఖ్య చూపించింది! అంతటి పదునైన బౌలింగ్‌తో భారత పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియాపై చెలరేగిపోయాడు. ఈ ఒక్క సిరీస్‌లోనే ఎన్నో ఘనతలను లిఖించుకున్న అతను అప్పుడే ‘ఆల్‌టైమ్ గ్రేట్’లలో ఒకడిగా మారాడంటే అతిశయోక్తి కాదు. బుమ్రా బౌలింగ్‌లో బెదిరిపోయిన తీరు గురించి ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా స్వయంగా చెప్పుకున్నాడు. ఈ సిరీస్‌లో బుమ్రా బౌలింగ్‌లో 112 బంతులు ఎదుర్కొన్న ఖ్వాజా 33 పరుగులే చేసి 6 సార్లు అవుటయ్యాడంటే అతను ఎంతగా ఇబ్బంది పడ్డాడో అర్థమవుతుంది. బుమ్రా లేని సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో స్వేచ్ఛగా ఆడి అతను 45 బంతుల్లో 41 పరుగులు సాధించాడు. అయితే ఖ్వాజా మాత్రమే కాదు... ప్రతీ ఆసీస్ బ్యాటర్ అతని బౌలింగ్ బారిన పడినవారే. మెక్‌స్వీనీ, హెడ్ చెరో 4 సార్లు బుమ్రా బౌలింగ్‌లో అవుట్ కాగా... టాప్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ 3 సార్లు వెనుదిరిగాడు. అయితే క్లీన్ బౌల్డ్ లేదా ఎల్బీడబ్ల్యూ. లేదంటే కాస్త డ్రైవ్ కోసం ప్రయత్నిస్తే కీపర్‌కు లేదా స్లిప్‌లో క్యాచ్! ఒక్క బ్యాటర్ కూడా ఒక్కసారైనా నేరుగా షాట్ ఆడే సాహసమే చేయలేదు. ఫలితంగా కేవలం 13.06 సగటుతో ఏకంగా 32 వికెట్లు తీసి బుమ్రా సిరీస్‌ను ముగించాడు. అతని బౌలింగ్ లేకపోతే భారత్ 0–4తో లేదా 0–5తో కూడా ఓడేదేమో! అసాధారణ ప్రదర్శన... ఇన్నింగ్స్ మొదలు కాగానే చెలరేగిపోయి శుభారంభాలు అందించాల్సి వచ్చినా... నిలదొక్కుకుంటున్న మిడిలార్డర్‌ను పడగొట్టాలన్నా... కీలక భాగస్వామ్యాలను విడదీయాలన్నా బుమ్రా వల్లే సాధ్యమైంది. సిరీస్ ఆసాంతం ఇది సాగింది. ప్రతిష్టాత్మక సిరీస్‌లో ప్రత్యర్థి గడ్డపై తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌటైన తర్వాత ఏ జట్టయినా గెలుపు గురించి ఆలోచించగలదా! కానీ బుమ్రా దానిని సాధ్యం చేసి చూపించాడు. అతని దెబ్బకు ఐదు వికెట్లు సమర్పించుకున్న ఆసీస్ ఆ టెస్టులో మళ్లీ కోలుకోలేకపోయింది. తర్వాతి మూడు టెస్టుల్లోనూ అక్కడక్కడా భారత జట్టు మ్యాచ్‌పై ఆశలు పెంచుకోగలిగిందంటే బుమ్రానే కారణం. సిరీస్‌లో 908 బంతులేసిన బుమ్రా ఒక్కడే 32 వికెట్లు తీయగా, మిగిలిన భారత బౌలర్లంతా కలిపి 2814 బంతుల్లో 48 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగారు. అతని సగటు 13.06 కాగా, మిగిలిన బౌలర్ల సగటు 34.82 చూస్తేనే తేడా ఏమిటో అర్థమవుతుంది. 20కంటే తక్కువ సగటుతో 200 వికెట్లు మైలురాయిని దాటిన బుమ్రా... ఎందరో గొప్ప బౌలర్లకు సాధ్యంకాని ఈ అరుదైన ఘనతను అందుకొని దిగ్గజాల సరసన నిలవగలిగాడు. విదేశీ గడ్డపై ఒక సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా కూడా అతను నిలిచాడు. భరించలేనంత భారాన్ని మోసి... ప్రధాన బ్యాటర్లపై నమ్మకం లేక లోయర్ ఆర్డర్లో అదనపు పరుగుల కోసం భారత టీమ్ మేనేజ్మెంట్ ఎంచుకున్న బౌలింగ్ ఆల్‌రౌండర్ వ్యూహం బుమ్రాపై భారాన్ని అమితంగా పెంచేసింది. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ వరకు కూడా ఇతర పేసర్లు సిరాజ్, ఆకాశ్‌దీప్ ఆశించిన రీతిలో ప్రభావం చూపలేకపోయారు. బ్యాటింగ్ బలం కోసం మరో ప్రధాన పేస్ బౌలర్‌ను ఆడించలేని స్థితి. దాంతో బాధ్యత మొత్తం బుమ్రా భుజాలపైనే పడింది. చివరకు అది కీలక సమయంలో జట్టునే దెబ్బ కొట్టింది. బౌలింగ్ భారం ఎక్కువై అతను వెన్ను నొప్పితో తప్పుకోవాల్సి వచ్చింది. సిరీస్ మొత్తంలో పచ్చికతో పేస్‌కు అత్యంత అనుకూలంగా కనిపించిన సిడ్నీ పిచ్‌పై రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్ చేయకపోవడమే భారత్ విజయావకాశాలను దెబ్బ తీసిందనేది వాస్తవం. సిరీస్‌లో బుమ్రా ఏకంగా 151.2 ఓవర్లుబౌలింగ్ చేశాడు. భారత్ వేసిన ఓవర్లలో ఇది 24.4 శాతం కాగా... భారత్ పడగొట్టి మొత్తం వికెట్లతో 40 శాతం బుమ్రానే పడగొట్టడం విశేషం. ‘బుమ్రాలాంటి అరుదైన ఆటగాడిపై భారం వేయకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అతను చాలా ఎక్కువగా బౌలింగ్ చేశాడు. కానీ అతను అద్భుత ఫామ్‌తో చెలరేగిపోతున్న సమయంలో దానిని సమర్థంగా వాడుకోవడం కూడా జట్టుకు అవసరం’ అంటూ రోహిత్ శర్మ అప్పటికే తమ ప్రధాన పేసర్ పరిస్థితి గురించి చెప్పేశాడు. ఎంత కాలం ఆటకు దూరం? బుమ్రా వెన్ను నొప్పి తీవ్రత ఎంత అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. భారత్‌కు వచి్చన తర్వాతే అతని పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియవచ్చు. గ్రేడ్–1 గాయం లేదా గ్రేడ్–2 అయినా సరే గరిష్టంగా 6 వారాల్లో కోలుకునే అవకాశం ఉంది. అయితే అంతకుమించి ఉంటే మాత్రం సమస్యే. కనీసం మూడు నెలల తర్వాత గానీ సాధారణ స్థితికి వచ్చే అవకాశం లేదు. తర్వాత టెస్టు మ్యాచ్ కోసం జూన్ వరకు సమయం ఉండగా... ఫిబ్రవరి–మార్చి సమయంలోనే భారత్ ముందు చాంపియన్స్ ట్రోఫీ రూపంలో ప్రతిష్టాత్మక టోర్నీ ఉంది. ఇతర సిరీస్‌లను పక్కన పెట్టినా ఈ మెగా టోర్నీలో అతను ఆడటం జట్టుకు ఎంతో అవసరం. అయితే దానికి ముందు సన్నాహకంగా భారత్‌లోనే ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్ కూడా ఆడతాడా అనేది చర్చనీయాంశం. –సాక్షి క్రీడా విభాగం -
CT 2025: శుబ్‌మన్ గిల్‌పై ‘వేటు’?.. అతడికి ప్రమోషన్?
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) సిరీస్‌లో చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది టీమిండియా. ముఖ్యంగా బ్యాటింగ్ వైఫల్యం కారణంగా దాదాపు దశాబ్దం తర్వాత ఈ టెస్టు సిరీస్‌ను ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది. కంగారూ గడ్డపై 3-1తో ఓడి రిక్తహస్తాలతో స్వదేశానికి పయనమైంది.బౌలర్‌గా, కెప్టెన్‌గా రాణించిఇక ఆసీస్‌తో ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో టీమిండియా కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా గెలిచిందంటే అందుకు కారణం జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)నే. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) గైర్హాజరీలో ఈ ఫాస్ట్‌బౌలర్ భారత జట్టును ముందుకు నడిపించాడు. పేసర్‌గా, కెప్టెన్‌గా రాణించి ఆసీస్ గడ్డపై టీమిండియాకు అతిపెద్ద టెస్టు విజయం(295 పరుగుల తేడాతో) అందించాడు.వెన్నునొప్పి వేధించినాఅయితే, ఆ తర్వాత రోహిత్ శర్మ తిరిగి వచ్చినా టీమిండియా ఇదే జోరును కొనసాగించలేకపోయింది. బ్యాటర్‌గా, సారథిగా రోహిత్ విఫలం కావడం తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో ఆఖరిదైన ఐదో టెస్టు నుంచి అతడు స్వచ్చందంగా తప్పుకోగా.. బుమ్రా మరోసారి పగ్గాలు చేపట్టాడు. వెన్నునొప్పి వేధించినా జట్టును గెలిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశాడు.కానీ సిడ్నీ వేదికగా జరిగిన ఐదో టెస్టులో టీమిండియాకు భంగపాటు తప్పలేదు. మ్యాచ్‌తో పాటు సిరీస్‌లోనూ ఓటమిని చవిచూసింది. బుమ్రా లేకపోయి ఉంటే.. టీమిండియా ఆసీస్ చేతిలో 5-0తో వైట్‌వాష్‌కు గురయ్యేదని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ వ్యాఖ్యానించాడంటే.. ఈ సిరీస్‌లో అతడి ప్రాధాన్యం ఎంతటితో అర్థం చేసుకోవచ్చు.పూర్తిస్థాయి టెస్టు కెప్టెన్‌గా?ఈ నేపథ్యంలో ఇప్పటికే పేస్ దళ నాయకుడిగా ఉన్న బుమ్రా.. త్వరలోనే పూర్తిస్థాయి టెస్టు కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టనున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మరో ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. వన్డేల్లోనూ రోహిత్ వారసుడిగా బుమ్రా ఎంపికయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.గిల్‌పై వేటు.. బుమ్రాకు ప్రమోషన్?ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 సందర్భంగా రోహిత్ శర్మకు బుమ్రా డిప్యూటీగా వ్యవహరించనున్నట్లు సమాచారం. కాగా శ్రీలంక పర్యటన 2024 సందర్భంగా వన్డే, టీ20లలో యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ). అయితే, ఏదేని కారణాల వల్ల రోహిత్ దూరమైతే.. గిల్ ఇప్పటికప్పుడు కెప్టెన్‌గా వ్యవహరించే పరిణతి సాధించలేదని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అందుకే బుమ్రాను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయాలనే యోచనలో యాజమాన్యం ఉన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది. ఇదిలా ఉంటే.. సిడ్నీ టెస్టు నుంచి రోహిత్ శర్మ తప్పుకొన్న తర్వాత.. వన్డే కెప్టెన్సీకి అతడు దూరం కానున్నాడనే వదంతులు వచ్చాయి. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించనున్నారనే ఊహాగానాలు వినిపించాయి.ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్లుకాగా చాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు టీమిండియా సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడనుంది. ఇందులో భాగంగా ఐదు టీ20లు, మూడు వన్డేల్లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. అయితే, ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు బుమ్రా దూరంగా ఉండనున్నట్లు సమాచారం. వెన్నునొప్పి కారణంగా అతడు విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ-2025 మొదలుకానుంది. పాకిస్తాన్ ఈ మెగా వన్డే టోర్నీకి ఆతిథ్యం ఇస్తుండగా.. టీమిండియా మ్యాచ్‌లు మాత్రం తటస్థ వేదికైన దుబాయ్‌లో జరుగుతాయి. హైవోల్టేజీ పోరు భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగనుంది.చదవండి: 13 నిమిషాల్లోనే ఖేల్ ఖతం.. రషీద్ ఖాన్ మాయాజాలం.. అఫ్గన్ సరికొత్త చరిత్ర -
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్.. మనసు మార్చుకున్న రోహిత్, కోహ్లి!?
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన భారత జట్టు స్వదేశంలో మరో కీలక పోరుకు సిద్దమైంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు ముందు టీమిండియా సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో వైట్ బాల్ సిరీస్‌లలో తలపడనుంది. 5 టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లో పర్యాటక జట్టుతో భారత్ ఆడనుంది. జనవరి 22న కోల్‌కతా వేదికగా జరగనున్న తొలి టీ20తో ఇంగ్లీష్ జట్టు భారత పర్యటన ప్రారంభం కానుంది.అయితే ఈ సిరీస్‌లకు టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దూరం కానున్నాడు. ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్న బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని సెలక్టర్లు భావించినట్లు తెలుస్తోంది. అతడు నేరుగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడనున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు ధ్రువీకరించారు.జస్ప్రీత్ బుమ్రా గత కొంత కాలంగా విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడుతున్నాడు. కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అతడికి విశ్రాంతి అవసరం. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అతడు మళ్లీ ఐపీఎల్ కూడా ఆడనున్నాడు. కాబట్టి జస్ప్రీత్పై వర్క్‌లోడ్ తగ్గించాలని నిర్ణయించాము. అతడు ప్రస్తుతం టీ20లపై దృష్టి సారించడం లేదు. దీంతో ఇంగ్లండ్‌తో వైట్‌బాల్ సిరీస్‌లకు బుమ్రాకు రెస్ట్ ఇవ్వనున్నామని సదరు బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు.వన్డేల్లో ఆడనున్న రోహిత్-కోహ్లిఇక ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి ఆడనున్నారు. తొలుత వీరు విశ్రాంతి తీసుకుంటారని వార్తలు వినిపించినప్పటికి, ఛాంపియన్స్ ట్రోఫీ దృష్ట్యా ఈ సీనియర్ ద్వయం ఇంగ్లండ్‌తో వన్డేల్లో ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఈ ఇద్దరు దిగ్గజాలు ప్రస్తుతం పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో రోకో నిరాశపరిచారు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో ఆడి తమ రిథమ్‌ను పొందాలని కెప్టెన్, మాజీ కెప్టెన్ ఇద్దరూ భావిస్తున్నారు. అదేవిధంగా ఈ వన్డే సిరీస్‌తో వెటరన్ పేసర్ మహ్మద్ షమీ, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.చదవండి: గంభీర్ ఇప్పటికైనా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి: టీమిండియా దిగ్గజం -
చాలా బాధగా ఉంది.. కానీ కొన్నిసార్లు తప్పదు: జస్ప్రీత్ బుమ్రా
ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా ఘోర పరాజయంతో ముగించింది. సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరిగిన ఐదో టెస్టులో 6 వికెట్ల తేడాతో భారత్ ఓటమి చవిచూసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 3-1 తేడాతో టీమిండియా కోల్పోయింది.162 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత జట్టు డిఫెండ్ చేసుకోలేకపోయింది.మూడో రోజు ఆటకు స్టాండింగ్ కెప్టెన్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) గాయం కారణంగా దూరమయ్యాడు. దీంతో భారత బౌలింగ్ యూనిట్ తేలిపోయింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ కేవలం 27 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ఇక ఈ ఓటమిపై టీమిండియా తత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా స్పందించాడు. ఈ సిరీస్‌లో ఓడిపోయినప్పటికి తమ జట్టు అద్బుతమైన పోరాట పటిమ కనబరిచందని బుమ్రా చెప్పుకొచ్చాడు."కీలక మ్యాచ్‌లో ఓడిపోవడం తీవ్ర నిరాశపరిచింది. అంతేకాకుండా గాయంతో రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయకపోవడం కాస్త అసహనానికి గురి చేసింది. కానీ కొన్నిసార్లు మన శరీరానికి ప్రధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది.మన శరీరంతో మనం పోరాడలేం.ఈ సిరీస్‌లోనే బాగా బౌలింగ్‌కు అనుకూలించిన వికెట్‌పై బౌలింగ్ చేసే అవకాశాన్ని కోల్పవడం బాధగా ఉంది. మొదటి ఇన్నింగ్స్ నా సెకెండ్ స్పెల్ సమయంలోనే కాస్త అసౌకర్యంగా అనిపించింది. దీంతో మా కుర్రాళ్లతో చర్చించి బయటకు వెళ్లిపోయాను. మొదటి ఇన్నింగ్స్‌లో కూడా ఒక బౌలర్ లోటుతోనే ఆడాము. అయినప్పటకి మిగితా బౌలర్లు బాధ్యత తీసుకుని అద్బుతంగా రాణించారు. ఈ రోజు ఉదయం కూడా మా బౌలర్లతో మాట్లాడి వారిలో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశాను. ఆఖరి ఇన్నింగ్స్‌లో కూడా అదనపు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది అని వారితో చెప్పాను. ఏదమైనప్పటికి ఆస్ట్రేలియాకు మేము గట్టిపోటీ ఇచ్చాము. సిరీస్ మొత్తం హోరాహోరీగా సాగింది. ఈ సిరీస్ ఏకపక్షంగా సాగలేదు. మేము ఆఖరి వరకు అద్బుతంగా పోరాడాము. టెస్టు క్రికెట్ అంటే ఇలానే ఉంటుంది.గేమ్‌లో ఉండాలంటే ప్రత్యర్ధిపై ఒత్తిడికి గురిచేయడం, పరిస్థితికి అనుగుణంగా ఆడటం వంటివి చాలా ముఖ్యమైనవి. ఈ సిరీస్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాము. భవిష్యత్తులో అవి కచ్చితంగా ఉపయోగపడతాయి. మా జట్టులో చాలా మంది కుర్రాళ్లు ఆస్ట్రేలియా పర్యటనకు రావడం ఇదే తొలిసారి.వారు కూడా లా అనుభవాన్ని పొందారు. ఈ సిరీస్‌తో టీమ్‌లో టాలెంట్ ఉన్న ఆటగాళ్లు ఉన్నారని ప్రపంచానికి చూపించాము. కుర్రాళ్లు గెలవలేదని నిరాశతో ఉన్నారు. కానీ ఈ ఓటమిని నుంచి చాలా గుణపాఠాలు నేర్చుకుంటారు. ఇక విజేతగా నిలిచిన ఆస్ట్రేలియాకు అభినందనలు. వారు కూడా అద్బుతంగా పోరాడరని" పోస్ట్‌మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో బుమ్రా పేర్కొన్నాడు. He was devastating at times, so it's no surprise to see Jasprit Bumrah named the NRMA Insurance Player of the Series. #AUSvIND pic.twitter.com/7qFlYcjD2d— cricket.com.au (@cricketcomau) January 5, 2025 -
అసలేం చేస్తున్నారు.. అది క్షమించరాని నేరం: గవాస్కర్
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టెస్టులో 6 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి చవిచూసింది. 162 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 27 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఆసీస్ చేధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1 తేడాతో కంగారులు సొంతం చేసుకున్నారు. కాగా టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) గాయం కారణంగా మూడో రోజు ఫీల్డింగ్‌కు దిగలేదు. బుమ్రా లేని లోటు భారత బౌలింగ్ ఎటాక్‌లో స్పష్టంగా కన్పించింది.తొలి రెండో ఓవర్లలోనే భారత పేసర్లు ఏకంగా 26 పరుగులు సమర్పించుకున్నారు. అందులో 12 పరుగులు ఎక్స్‌ట్రాస్ రూపంలో వచ్చినవే కావడం గమనార్హం. ముఖ్యంగా భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తన రిథమ్‌ను కోల్పోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సిరాజ్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు.తొలి ఓవర్ వేసిన సిరాజ్ 13 పరుగులిచ్చాడు. ఈ నేపథ్యంలో సిరాజ్‌పై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ విమర్శల వర్షం కురిపించాడు. స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకోవడంలో భారత బౌలర్ల తీరు నిరాశకు గురిచేసిందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు."తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ అద్బుతమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేశాడు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం తన రిథమ్‌ను కోల్పోయాడు. చాలా అదనపు పరుగులు సమర్పించుకున్నాడు. మొత్తం 15 ఎక్స్‌ట్రాలు ఇవ్వడం ఆమోదయోగ్యం కాదు. ఈ స్థాయిలో ఆడుతున్నప్పుడు బౌలర్లు నో బాల్స్‌ను నియంత్రించగలగాలి.నో బాల్స్ వేయడం క్షమించరాని నేరం. ప్రొఫెషనల్ క్రికెటర్లు ఎప్పుడూ నో బాల్స్ వేయకూడదు. కొన్ని సార్లు నో బాల్‌లు, వైడ్లే గెలుపోటములు నిర్ణయిస్తాయి. మన వేగంగా బౌలింగ్ చేయడానికి ప్రయత్నించి వైడ్లు వేస్తున్నారు. కొంచెం లైన్ లెంగ్త్‌పై దృష్టి పెట్టాలి" అని గవాస్కర్ పేర్కొన్నాడు.చదవండి: Jasprit Bumrah: 3 ఐపీఎల్ సీజన్లకు సరిపడా ఓవర్లు వేశాడు.. ఆ ఒక్కడిపైనే భారం! -
BGT: మూడు ఐపీఎల్ సీజన్లకు సరిపడా ఓవర్లు ఒక్కడే వేశాడు!
జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)... ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. దిగ్గజ క్రికెటర్ల నుంచి అభిమానుల వరకు అందరూ ఇదే మాట చెబుతారనడంలో సందేహం లేదు. గత కొన్నేళ్లుగా టీమిండియా పేస్ దళ నాయకుడిగా కొనసాగుతున్న బుమ్రా.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) 2024-25 సిరీస్‌లోనూ భారమంతా తానే మోస్తున్నాడు. గట్టెక్కించగలిగే వీరుడు బుమ్రాఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టులో సారథిగా భారత్‌కు భారీ విజయం అందించిన బుమ్రా.. సిడ్నీ టెస్టు సందర్భంగా మరోసారి సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఈ నేపథ్యంలో టీమిండియా అభిమానులంతా బుమ్రా నామసర్మణ చేస్తున్నారు. ఆసీస్‌తో ఆఖరి టెస్టు గండాన్ని గట్టెక్కించగలిగే వీరుడు బుమ్రా మాత్రమే అని విశ్వసిస్తున్నారు. నిజానికి.. స్వదేశంలో జరిగే సిరీస్‌లలో టీమిండియా స్పిన్నర్లదే పైచేయి గా నిలుస్తుంది. కానీ విదేశీ గడ్డపై జరిగే సిరీస్‌లలో అక్కడి పిచ్‌లకు అనుగుణంగా పేస్ బౌలర్లు ప్రధాన పాత్ర వహిస్తారు. అయితే ఇక్కడే టీమిండియా మేనేజ్మెంట్ ముందు చూపుతూ వ్యవహరించడంలో విఫలమైందని చెప్పవచ్చు.షమీ ఉంటే బుమ్రాపై భారం తగ్గేదిఆస్ట్రేలియా వంటి ఎంతో ప్రాముఖ్యం గల సిరీస్ ముందుగా పేస్ బౌలర్లని పదును పెట్టడంలో బోర్డు వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. సీనియర్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీకి గాయంతో దూరం కావడం భారత్ జట్టుకు ప్రధాన సమస్యగా మారింది. షమీ ఎంతో అనుభవజ్ఞుడు. పైగా ఆస్ట్రేలియాలో గతంలో రాణించి తన నైపుణ్యాన్ని నిరూపించుకున్నాడు. షమీ అండగా ఉన్నట్లయితే బుమ్రా పై ఇంతటి ఒత్తిడి ఉండేది కాదన్నది వాస్తవం.గతంలో బుమ్రాతో పాటు భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్ వంటి బౌలర్లు జట్టులో ఉన్నప్పుడు భారత్ పేస్ బౌలింగ్ పటిష్టంగా ఉండేది. మహమ్మద్ సిరాజ్ చాల కాలంగా జట్టులో ఉన్నప్పటికీ, నిలకడగా రాణించడం లో విఫలమయ్యాడనే చెప్పాలి.యువ బౌలర్లకు సరైన మార్గదర్శకత్వం ఏది?ఈ నేపధ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఎంతోమంది యువ బౌలర్లు రంగ ప్రవేశం చేస్తున్నప్పటికీ వారికి సరైన తర్ఫీదు ఇవ్వడంలోనూ.. సీనియర్ బౌలర్లు గాయాల బారిన పడకుండా వారిని సరైన విధంగా మేనేజ్ చేయడంలో భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు విఫలమైంది. ఐపీఎల్ పుణ్యమా అని భారత్ క్రికెట్‌కు ప్రస్తుతం పేస్ బౌలర్ల కొరత లేదు. కానీ ఉన్నవారికి సరైన తర్ఫీదు ఇచ్చి వారు అంతర్జాతీయ టెస్టు క్రికెట్ లో రాణించే విధంగా తీర్చిదిద్దడం కచ్చితంగా బోర్డుదే బాధ్యత. ఇటీవల కాలంలో ఉమ్రాన్ మాలిక్, మయాంక్ యాదవ్, నవదీప్ సైనీ, శార్దూల ఠాకూర్, అర్షదీప్ సింగ్, వరుణ్ ఆరోన్, టి నటరాజన్ వంటి అనేక మంది యువ బౌలర్లు ఐపీఎల్ క్రికెట్ లో రాణిస్తున్నారు. వారికి భారత్ క్రికెట్ జట్టు అవసరాలకి అనుగుణంగా సరైన రీతిలో తర్ఫీదు ఇస్తే బాగుంటుంది.వాళ్లకు అనుభవం తక్కువఇక తాజా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌కు బుమ్రా, సిరాజ్‌లతో పాటు ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా కూడా ఎంపికయ్యారు. అయితే, ఈ ముగ్గురూ అదనపు పేసర్లుగా అందుబాటులో ఉన్నప్పటికీ బుమ్రా, సిరాజ్‌లపైనే భారం పడింది. అయితే, సిరాజ్ నిలకడలేమి కారణంగా బుమ్రా ఒక్కడే బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది.నిజానికి.. బుమ్రా ఈ సిరీస్ లో సంచలనం సృష్టించాడు. ఒంటి చేత్తో తొలి టెస్టులో భారత జట్టుకి విజయం చేకూర్చాడు. ఈ సిరీస్‌లో ఇంతవరకు 12.64 సగటుతో 32 వికెట్లు పడగొట్టి, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డ్ నెలకొల్పాడు.మూడు మార్లు ఐదు కన్నా ఎక్కువ వికెట్లు తీసుకున్నాడు. 1977-78 ఆస్ట్రేలియా పర్యటనలో బిషన్ సింగ్ బేడీ 31 వికెట్ల రికార్డును బుమ్రా ఈ టెస్ట్ మ్యాచ్‌లో అధిగమించడం విశేషం. అయితే, ఆఖరిదైన సిడ్నీ టెస్టులో భాగంగా శనివారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా బుమ్రా గాయపడ్డాడు. అయితే, మైదానం నుంచి నిష్క్రమించే ముందు బుమ్రా కీలకమైన ఆస్ట్రేలియన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌ని అవుట్ చేయడం ద్వారా ఈ రికార్డు నెలకొల్పాడు.చివరి ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్‌పై అనిశ్చితి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (SCG)లో జరుగుతున్న ఐదవ మరియు చివరి టెస్టులో రెండో రోజు ఆటలో అసౌకర్యానికి గురైన బుమ్రా మ్యాచ్ మధ్యలో వైదొలిగాడు. బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు తెలిసింది. మ్యాచ్ అనంతరం పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ మాట్లాడుతూ బుమ్రా పరిస్థితిపై వివరణ ఇచ్చాడు. బుమ్రా పరిస్థితిని భారత వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తోందని పేర్కొన్నాడు. "జస్ప్రీత్ బుమ్రాకు వెన్నునొప్పి ఉంది. వైద్య బృందం అతడిని పర్యవేక్షిస్తోంది" అని వ్యాఖ్యానించాడు.3 ఐపీఎల్ సీజన్లకు సరిపడా ఓవర్లు వేశాడునిజానికి 2024 నుంచి ఇప్పటి దాకా(జనవరి 4) టెస్టుల్లో అత్యధిక బంతులు బౌల్ చేసింది బుమ్రానే. ఏకంగా 367 ఓవర్లు అంటే.. 2202 బాల్స్ వేసింది అతడే!.. ఈ విషయంలో బుమ్రా తర్వాతి స్థానంలో ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్(1852 బాల్స్) ఉన్నాడు.ఇక బుమ్రా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఇప్పటి వరకు 908 బంతులు వేశాడు. అంటే 151.2 ఓవర్లు అన్నమాట. ఇది ఐపీఎల్ మూడు సీజన్లలో ఒక బౌలర్ వేసే ఓవర్లకు దాదాపు సమానం. ఐపీఎల్లో 14 లీగ్ మ్యాచ్‌లు ఆడి.. ప్రతి మ్యాచ్‌లోనూ నాలుగు ఓవర్ల కోటాను బౌలర్ పూర్తి చేశాడంటే.. మూడు సీజన్లు కలిపి అతడి ఖాతాలో 168 ఓవర్లు జమవుతాయి. అదే.. 13 మ్యాచ్‌లు ఆడితే 156 ఓవర్లు. అదీ సంగతి. ఇంతటి భారం పడితే ఏ పేసర్ అయినా గాయపడకుండా ఉంటాడా? ఇందుకు బోర్డు బాధ్యత వహించనక్కర్లేదా?!చదవండి: నిజమైన నాయకుడు.. అసలైన లెజెండ్: సురేశ్ రైనా -
నిజమైన నాయకుడు.. అసలైన లెజెండ్: సురేశ్ రైనా
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)పై భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా(Suresh Raina) ప్రశంసలు కురిపించాడు. నిజమైన, దిగ్గజ నాయకుడు అంటూ హిట్‌మ్యాన్‌ను కొనియాడాడు. జట్టు ప్రయోజనాల కోసం తనంతట తానుగా తప్పుకోగలిగిన నిస్వార్థపరుడంటూ రోహిత్ శర్మకు కితాబులిచ్చాడు.ఐదు టెస్టుల సిరీస్స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టుల్లో 3-0తో వైట్‌వాష్‌కు గురైన రోహిత్ సేన.. తదుపరి ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో భాగంగా కంగారూ జట్టుతో ఐదు టెస్టులు ఆడుతోంది. అయితే, పెర్త్‌లో జరిగిన తొలి టెస్టుకు పితృత్వ సెలవుల కారణంగా రోహిత్ శర్మ దూరం కాగా.. అతడి స్థానంలో జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) కెప్టెన్‌గా వ్యవహరించాడు.ఈ మ్యాచ్‌లో టీమిండియా 295 పరుగుల భారీ తేడాతో గెలిచింది. అయితే, రెండో టెస్టు నుంచి జట్టుతో చేరిన రోహిత్ శర్మ.. బ్యాటర్‌గా, సారథిగా విఫలమయ్యాడు. అడిలైడ్, బ్రిస్బేన్, మెల్బోర్న్ టెస్టుల్లో కలిపి కేవలం 31 పరుగులే చేసిన రోహిత్.. వీటిలో ఒక్క మ్యాచ్‌లోనూ టీమిండియాను గెలిపించలేకపోయాడు. ఫలితంగా సిరీస్‌లో భారత జట్టు 1-2తో వెనుకబడింది.చావో రేవో తేల్చుకునేందుకుఈ క్రమంలో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగే ఐదో టెస్టులో టీమిండియా తప్పక గెలవాల్సిన స్థితిలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తేనే సిరీస్‌ను డ్రా చేసుకోవడం సహా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్-2025 అవకాశాలను భారత్ సజీవం చేసుకోగలుగుతుంది.ఇంతటి కీలక మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నాడు. సిడ్నీలో జరిగే ఆఖరి టెస్టులో బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఫామ్‌లేమి దృష్ట్యా స్వయంగా తుదిజట్టు నుంచి తప్పుకొని.. శుబ్‌మన్ గిల్‌కు లైన్ క్లియర్ చేశాడు. ఈ విషయం గురించి తాత్కాలిక కెప్టెన్ బుమ్రా మాట్లాడుతూ.. జట్టు ప్రయోజనాల కోసమే రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పాడు.డ్రింక్స్ బ్రేక్ సమయంలో ఇక జట్టులో స్థానం లేకపోయినా.. సిడ్నీ టెస్టు రెండో రోజు ఆటలో భాగంగా రోహిత్ శర్మ డగౌట్లో చురుగ్గా కనిపించాడు. డ్రింక్స్ బ్రేక్ సమయంలో ఆటగాళ్ల దగ్గరికి వచ్చి వ్యూహాల గురించి చర్చించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను సురేశ్ రైనా షేర్ చేస్తూ.. రోహిత్ శర్మ వ్యక్తిత్వాన్ని కొనియాడాడు.నిజమైన నాయకుడు.. అసలైన లెజెండ్‘‘తన నిజాయితీ, నిస్వార్థగుణం ద్వారా నాయకుడంటే ఎలా ఉండాలో రోహిత్ శర్మ నిరూపిస్తున్నాడు. వ్యక్తిగతంగా కఠిన సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలోనూ.. జట్టు విజయానికే అతడు మొదటి ప్రాధాన్యం ఇచ్చాడు. అవసరమైన సమయంలో స్వయంగా తానే తప్పుకొన్నాడు.టీమిండియా జోరుఈ టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ భారత జట్టు సక్సెస్ కోసం కనబరుస్తున్న అంకిత భావం చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఆటలో అతడొక నిజమైన దిగ్గజం’’ అని సురేశ్ రైనా రోహిత్ శర్మను ప్రశంసించాడు. ఇదిలా ఉంటే.. సిడ్నీ టెస్టులో టీమిండియా జోరు కనబరుస్తోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బుమ్రా సేన.. తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌట్ అయింది.ఈ క్రమంలో ఆసీస్‌ను మొదటి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే కట్టడి చేసింది. భారత బౌలర్లలో ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, నితీశ్ రెడ్డి చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.ఇక శనివారం నాటి రెండో రోజు పూర్తయ్యేసరికి తమ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌తో కలిపి ఆసీస్ కంటే 145 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. మూడో రోజు గనుక కాస్త ఓపికగా ఆడి.. కనీసం మరో వంద పరుగులు జమచేస్తే ఆతిథ్య జట్టు ముందు మెరుగైన లక్ష్యం ఉంచగలుగుతుంది. రెండో రోజు ఆట ముగిసేసరికి క్రీజులో ఉన్న స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా(8*), వాషింగ్టన్ సుందర్(6*)లపైనే టీమిండియా ఆశలు పెట్టుకుంది.చదవండి: IND Vs AUS: 'టెస్టు క్రికెట్ చరిత్రలోనే పంత్ ఒక అద్బుతం'Rohit Sharma exemplifies leadership through honesty and selflessness. Despite personal challenges, he prioritizes team success, stepping aside when necessary. His leadership in the current Test series reflects his unwavering dedication to India’s success. A true legend of the… pic.twitter.com/L3rPlMlRT6— Suresh Raina🇮🇳 (@ImRaina) January 4, 2025 -
Bumrah-Konstas: పిచ్చి పనులు మానుకోండి: రోహిత్ శర్మ ఫైర్
టీమిండియా ఆటగాళ్లు మైదానంలో ఎంతో హుందాగా ఉంటారని కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) అన్నాడు. కానీ అదే పనిగా సహనాన్ని పరీక్షిస్తే మాత్రం ప్రత్యర్థులకు చేదు అనుభవం తప్పదని పేర్కొన్నాడు. తమ జోలికి వచ్చిన వాళ్లకు సరైన రీతిలో బదులివ్వడంలో ఎలాంటి తప్పులేదని బుమ్రా సేనను సమర్థించాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా భారత జట్టు ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడుతున్న విషయం తెలిసిందే.ఈ సిరీస్‌లో ఇప్పటికి రెండు మ్యాచ్‌లు ఓడిపోయి, ఒక టెస్టు డ్రా చేసుకున్న టీమిండియా.. 1-2తో వెనుకబడి ఉంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం సిడ్నీ వేదికగా ఆఖరిదైన ఐదో టెస్టు మొదలైంది. గెలిస్తేనే కనీసం డ్రాఇందులో గెలిస్తేనే టీమిండియా సిరీస్‌ను కనీసం డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, ఫామ్‌లేమి, వరుస ఓటముల నేపథ్యంలో రోహిత్ శర్మ విశ్రాంతి పేరిట తనంతట తానే సిడ్నీ టెస్టు నుంచి తప్పుకొన్నాడు.ఈ నేపథ్యంలో పెర్త్‌లో తొలి టెస్టుకు టీమిండియాకు సారథ్యం వహించిన జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) మరోసారి పగ్గాలు చేపట్టాడు. ఇక ఐదో టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి రోజు ఆటలో భాగంగా 185 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయింది. రిషభ్ పంత్(40), రవీంద్ర జడేజా(26), జస్ప్రీత్ బుమ్రా(22), శుబ్‌మన్ గిల్(20) రాణించారు.బుమ్రాపైకి దూసుకు వచ్చిన ఆసీస్ బ్యాటర్ఈ క్రమంలో తొలిరోజే ఆస్ట్రేలియా బ్యాటింగ్ మొదలుపెట్టగా యువ ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్(Sam Konstas) కాస్త అతి చేశాడు. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొనే సమయంలో కాస్త ఆగమని చెప్పాడు. ఇందుకు బుమ్రా కాస్త అసహనంగా కదలగా.. కొన్‌స్టాస్ ఏంటీ అన్నట్లుగా బుమ్రా వైపు దూసుకువచ్చాడు. దీంతో బుమ్రా కూడా బదులిచ్చేందుకు సిద్ధం కాగా.. అంపైర్ జోక్యం చేసుకుని నచ్చజెప్పాడు.అనంతరం బౌలింగ్ చేసిన బుమ్రా ఖవాజా వికెట్ తీసి .. కొన్‌స్టాస్‌తో.. ‘‘చూశావా? నాతో పెట్టుకుంటే ఎలా ఉంటదో?’’ అన్నట్లు తన ముఖకవళికల ద్వారా మనసులోని భావాలను కాస్త దూకుడుగానే వ్యక్తం చేశాడు. అలా ఆఖరి బంతికి వికెట్ తీసి టీమిండియా తొలిరోజు ఆట ముగించింది.ఈ ఘటనపై రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా స్పందించాడు. బ్రాడ్కాస్టర్లతో మాట్లాడుతున్న సమయంలో బుమ్రా- కొన్‌స్టాస్ గురించి ప్రస్తావన రాగా.. ‘‘మా వాళ్లు నిర్ణీత సమయం వరకు ఓపికపడతారు. కానీ సహనాన్ని పరీక్షించాలని చూస్తే మాత్రం ఊరుకోరు.పిచ్చి పనులు మానుకోండిఅనవసరంగా గొడవ పెట్టుకోవాలని చూస్తే.. అంతే ధీటుగా బదులిస్తారు. మేము ఇక్కడకు వచ్చింది క్రికెట్ ఆడటానికి మాత్రమే’’ అని బుమ్రా చర్యను సమర్థించాడు. అంతేకాదు.. ‘‘దయచేసి ఇలా చెత్తగా వ్యవహరించకండి. పిచ్చి పనులు మానుకోండి. ఇలాంటివి చూడటానికి అస్సలు బాగోదు’’ అంటూ కంగారూలకు రోహిత్ కౌంటర్ ఇచ్చాడు.అదే విధంగా.. ‘‘మా వాళ్లు క్లాసీగా ఉంటారు. ఆటపైనే వారి దృష్టి మొత్తం కేంద్రీకృతమై ఉంటుంది. ఇక శుక్రవారం ఆస్ట్రేలియాపై ఒత్తిడి పెంచడంలో సఫలమై వికెట్ తీయడం సంతోషకరం’’ అని రోహిత్ శర్మ తమ జట్టును అభినందించాడు. చదవండి: CT 2025: వన్డే కెప్టెన్‌గా రోహిత్ అవుట్!.. టీమిండియా కొత్త సారథిగా అతడే! -
చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. 46 ఏళ్ల రికార్డు బద్దలు
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా స్టాండింగ్ కెప్టెన్, పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) తన అద్బుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టులోనూ బుమ్రా సత్తాచాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో రెండు కీలక వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను మరోసారి దెబ్బతీశాడు.అయితే గాయం కారణంగా బుమ్రా మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 10 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. తొడ కండరాల పట్టేయడంతో ఆట మధ్యలోనే బుమ్రా మైదానాన్ని వీడాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఆసీస్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌ను ఔట్ చేసిన బుమ్రా ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.46 ఏళ్ల రికార్డు బద్దలు..ఆస్ట్రేలియా గడ్డపై ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా బుమ్రా చరిత్ర సృష్టించాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో బుమ్రా ఇప్పటివరకు 32 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత స్పిన్ దిగ్గజం బిషన్ సింగ్ బేడీ పేరిట ఉండేది.1977/78 సీజన్లో ఆసీస్‌తో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌లో బేడీ 31 వికెట్లు తీశాడు. తాజా మ్యాచ్‌తో బేడీ 46 ఏళ్ల ఆల్‌టైమ్ రికార్డును బుమ్రా బ్రేక్ చేశాడు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 181 పరుగులకు ఆలౌటైంది. భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.చదవండి: రిటైర్మెంట్పై రోహిత్ శర్మ కీలక ప్రకటన.. -
టీమిండియాకు భారీ షాక్.. ఆస్పత్రికి జస్ప్రీత్ బుమ్రా
సిడ్నీ టెస్టులో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టాండింగ్ కెప్టెన్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డాడు. రెండో రోజు ఆటలో బుమ్రా తొడ కండరాలు పట్టేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆట మధ్యలోనే మైదానాన్ని వీడాడు.అంతేకాకుండా ప్రాక్టీస్ జెర్సీ ధరించి స్కానింగ్ కోసం సిబ్బందితో కలిసి స్కానింగ్ కోసం ఆస్పత్రికి జస్ప్రీత్ వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో భారత అభిమానుల ఆందోళన నెలకొంది.ఒకవేళ స్కానింగ్ రిపోర్ట్‌లో అతడి గాయం తీవ్రమైనదిగా తేలితే భారత్‌కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. అతడి గైర్హజరీలో విరాట్ కోహ్లి స్టాండింగ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. రెండో రోజు ఆట ఆరంభంలోనే లబుషేన్ వికెట్ పడగొట్టి భారత్‌కు బుమ్రా అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా కేవలం 10 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు.ఆసీస్ 181కు ఆలౌట్..ఇక సిడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 181 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలా మూడు వికెట్లతో సత్తాచాటగా.. జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి చెరో రెండు వికెట్లు పడగొట్టారు.ఇక ఆసీస్ బ్యాటర్లలో వెబ్‌స్టర్(57) టాప్ స్కోరర్‌గా నిలవగా.. స్మిత్(33), సామ్ కొన్‌స్టాస్(23) పరుగులతో రాణించారు. అంతకుముందు టీమిండియా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.చదవండి: రిటైర్మెంట్పై రోహిత్ శర్మ కీలక ప్రకటన.. -
India vs Aus 5th test: ముగిసిన రెండో రోజు ఆట.. 145 పరుగుల లీడ్‌లో భారత్
India vs Aus 5th test day 2 live updates and highlights: సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది.ముగిసిన రెండో రోజు ఆట.. 145 పరుగుల లీడ్‌లో భారత్సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. భారత్ ప్రస్తుతం 145 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. క్రీజులో రవీంద్ర జడేజా(8), వాషింగ్టన్ సుందర్(6) నాటౌట్‌గా ఉన్నారు.అంతకుముందు రిషబ్ పంత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 31 బంతుల్లోనే 61 పరుగులు చేసి పంత్ ఔటయ్యాడు. ఇక ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ 4 వికెట్లు పడగొట్టగా.. కమ్మిన్స్, వెబ్‌స్టర్ తలా వికెట్ సాధించారు. కాగా ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే ఆలౌటైంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియానితీశ్ రెడ్డి(21 బంతుల్లో 4) రూపంలో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. బోలాండ్ బౌలింగ్‌లో కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చి నితీశ్ పెవిలియన్ చేరాడు. వాషింగ్టన్ సుందర్ క్రీజులోకి రాగా.. జడేజా రెండు పరుగులతో ఉన్నాడు. భారత్ స్కోరు: 129/6 (27.4). ఆసీస్ కంటే 133 పరుగుల ఆధిక్యంలో టీమిండియా.రిషబ్ పంత్ ఔట్..రిషబ్ పంత్ ధనధాన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. కేవలం 31 బంతుల్లోనే 61 పరుగులు చేసిన పంత్.. ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 23 ఓవర్లకు భారత్ స్కోర్ 125-5. క్రీజులో జడేజా(2), నితీశ్ కుమార్ రెడ్డి(1) ఉన్నారు. భారత్ ప్రస్తుతం 129 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ..టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ దూకుడుగా ఆడుతున్నాడు. కేవలం 29 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. పంత్ 61 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 22 ఓవర్లకు భారత్ స్కోర్: 124/2. టీమిండియా ప్రస్తుతం 128 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.దూకుడుగా ఆడుతున్న పంత్..టీమిండియా వరుస క్రమంలో వికెట్లు పడతున్నప్పటికి రిషబ్ పంత్ మాత్రం దూకుడుగా ఆడుతున్నాడు. కేవలం 18 బంతుల్లోనే 34 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. 19 ఓవర్లకు భారత్ స్కోర్: 97/4. భారత్ ప్రస్తుతం 101 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.భారత్ నాలుగో వికెట్ డౌన్..శుబ్‌మన్ గిల్ రూపంలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన గిల్..వెబ్‌స్టర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి రవీంద్ర జడేజా వచ్చాడు. 16 ఓవర్లకు భారత్ స్కోర్: 78/4భారత్ మూడో వికెట్ డౌన్.. కోహ్లి ఔట్టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మరోసారి నిరాశపరిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 6 పరుగులు మాత్రమే చేసి కోహ్లి ఔటయ్యాడు. స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో ఆఫ్ సైడ్ బంతిని వెంటాడి మరి కోహ్లి ఔటయ్యాడు. 14 ఓవర్లకు భారత్ స్కోర్ 68/3. క్రీజులో గిల్(13), రిషబ్ పంత్(7) పరుగులతో ఉన్నారు.రెండో వికెట్ కోల్పోయిన టీమిండియాబోలాండ్ మరోసారి టీమిండియాను దెబ్బకొట్టాడు. తొలుత ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను బౌల్డ్ చేసిన ఈ పేస్ బౌలర్.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్(22)ను కూడా పెవిలియన్‌కు పంపాడు. ఫలితంగా టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. స్టాండ్ ఇన్ కెప్టెన్ విరాట్ కోహ్లి క్రీజులోకి వచ్చాడు. భారత్ స్కోరు: 47/2 (9.5). గిల్ ఐదు పరుగులతో ఉన్నాడు.తొలి వికెట్ కోల్పోయిన భారత్కేఎల్ రాహుల్ రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. టీమిండియా స్కోరు: 42/1 (7.3). శుబ్‌మన్ గిల్ క్రీజులోకి వచ్చాడు. జైస్వాల్ 22 పరుగులతో ఉన్నాడు.ఆరు ఓవర్లు పూర్తయ్యేసరికి టీమిండియా స్కోరు: 36/0 (6)జైస్వాల్ 21, కేఎల్ రాహుల్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.జైశ్వాల్ ఆన్ ఫైర్.. ఒకే ఓవర్లో 16 పరుగులుభారత్ తమ రెండో ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించాడు. మిచెల్ స్టార్క్ వేసిన తొలి ఓవర్లో జైశ్వాల్ ఏకంగా 16 పరుగులు రాబట్టాడు.181 పరుగులకు ఆసీస్ ఆలౌట్..సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా బౌలర్లు నిప్పులు చెరిగారు. భారత బౌలర్ల దాటికి ఆసీస్ తమ తొన్నింగ్స్‌లో 181 పరుగులకు కుప్పకూలింది. 9/1 ఓవర్ నైట్‌స్కోర్‌తో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆస్ట్రేలియా.. అదనంగా 172 పరుగులు జోడించి తమ ఇన్నింగ్స్‌ను ముగించింది.భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగుల ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలా మూడు వికెట్లతో సత్తాచాటగా.. జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఆసీస్ బ్యాటర్లలో వెబ్‌స్టర్(57) టాప్ స్కోరర్‌గా నిలవగా.. స్మిత్(33), సామ్ కొన్‌స్టాస్(23) పరుగులతో రాణించారు.ఆసీస్ తొమ్మిదో వికెట్ డౌన్.. వెబ్‌స్టర్ ఔట్ఆస్ట్రేలియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 57 పరుగులు చేసిన వెబ్‌స్టర్.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో జైశ్వాల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 48 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 170/9ఆసీస్ ఎనిమిదో వికెట్ డౌన్.. ఆస్ట్రేలియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన స్టార్క్.. నితీశ్‌కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆసీస్ ఏడో వికెట్ డౌన్..ప్యాట్ కమ్మిన్స్ రూపంలో ఆస్ట్రేలియా ఏడో వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన కమ్మిన్స్.. నితీశ్‌కుమార్ రెడ్డి బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి మిచెల్ స్టార్క్ వచ్చాడు. 46 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 163/7. ప్రస్తుతం క్రీజులో వెబ్‌స్టర్(56 నాటౌట్), స్టార్క్(1) ఉన్నారు.ఆరో వికెట్ డౌన్.. క్యారీ ఔట్ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన అలెక్స్ క్యారీ.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ వచ్చాడు.నిలకడగా ఆడుతున్న వెబ్‌స్టర్, క్యారీ..లంచ్ బ్రేక్ అనంతరం వెబ్‌స్టర్, క్యారీ నిలకడగా ఆడుతున్నారు. 36 ఓవర్లు ముగిసే 5 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. వెబ్‌స్టర్(37), క్యారీ(5) ఉన్నారు.లంచ్ బ్రేక్‌కు ఆసీస్ స్కోరంతంటే?రెండో రోజు లంచ్ విరామానికి ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది. క్రీజులో వెబ్‌స్టర్(28), క్యారీ(4) పరుగులతో ఉన్నారు.ఐదో వికెట్ డౌన్..ఆస్ట్రేలియా స్టీవ్ స్మిత్ రూపంలో ఐదో వికెట్ కోల్పోయింది. 33 పరుగులు చేసిన స్మిత్.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి అలెక్స్ క్యారీ వచ్చాడు.సిరాజ్ ఆన్ ఫైర్..మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరుగుతున్నాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను దెబ్బ తీశాడు. 12 ఓవర్ వేసిన సిరాజ్ రెండో బంతికి సామ్ కాన్స్టాస్ను ఔట్ చేయగా.. ఐదో బంతికి డేంజరస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ను పెవిలియన్‌కు పంపాడు. 12 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 39/4. క్రీజులో వెబ్‌స్టర్(0), స్మిత్(4) ఉన్నారు.ఆసీస్ రెండో వికెట్ డౌన్..రెండో రోజు ఆట ఆరంభంలోనే ఆసీస్‌కు బిగ్ షాక్ తగిలింది. మార్నస్ లబుషేన్ రూపంలో ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన లబుషేన్.. బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 25/2. క్రీజులో సామ్ కాన్స్టాస్(18), స్మిత్(4) ఉన్నారు.రెండో రోజు ఆట ఆరంభం..సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. భారత బౌలింగ్ ఎటాక్‌ను మహ్మద్ సిరాజ్ ప్రారంభించాడు. తొలి రోజు ఆట మగిసే సమయానికి ఆసీస్ వికెట్ కోల్పోయి 9 పరుగులు చేసింది. -
భేష్.. ప్రాణం పెట్టి మరీ ఆడాడు: పంత్‌పై ప్రశంసలు
టీమిండియా స్టార్ రిషభ్ పంత్‌పై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసలు కురిపించాడు. ప్రాణం పెట్టి మరీ సిడ్నీ టెస్టులో జట్టును పటిష్ట స్థితిలో నిలిపేందుకు కృషి చేశాడని కొనియాడాడు. పదునైన బంతులు శరీరానికి గాయం చేస్తున్నా పట్టుదలగా నిలబడ్డ తీరు ప్రశంసనీయమని పేర్కొన్నాడు.చావో రేవోకాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియాతో టీమిండియా ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే 1-2తో వెనుకబడి ఉన్న భారత్.. చావో రేవో తేల్చుకునేందుకు సిడ్నీ వేదికగా శుక్రవారం ఆఖరిదైన ఐదో టెస్టు మొదలుపెట్టింది.ప్రఖ్యాత సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) సారథ్యంలో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే, ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు త్వరత్వరగానే పెవిలియన్ చేరారు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(10), కేఎల్ రాహుల్(4) పూర్తిగా విఫలం కాగా.. శుబ్‌మన్ గిల్(20) ఫర్వాలేదనిపించాడు.;పంత్ పోరాటంఅయితే, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి(17) మాత్రం మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ క్రమంలో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్(Rishabh Pant).. రవీంద్ర జడేజాతో కలిసి పోరాడే ప్రయత్నం చేశాడు. ఆసీస్ బౌలర్ల నుంచి దూసుకువస్తున్న బంతుల కారణంగా శరీరానికి గాయాలవుతున్నా.. పట్టుదలగా నిలబడ్డాడు. మొత్తంగా 98 బంతులు ఎదుర్కొన్న పంత్ మూడు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 40 పరుగులు చేశాడు.అయితే, దురదృష్టవశాత్తూ స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో కమిన్స్‌కు క్యాచ్ ఇవ్వడంతో పంత్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. మిగిలిన వాళ్లలో జడ్డూ 26 పరుగులు చేయగా.. నితీశ్ రెడ్డి డకౌట్ అయ్యాడు. వాషింగ్టన్ సుందర్ 14, ప్రసిద్ కృష్ణ 3, కెప్టెన్ బుమ్రా 22, సిరాజ్ 3* పరుగులు చేశారు. ఫలితంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌట్ అయింది.అనంతరం ఆసీస్ బ్యాటింగ్‌కు దిగి ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి కేవలం తొమ్మిది పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ.. పంత్ పోరాట పటిమను ప్రశంసించాడు. ప్రాణాన్ని పణంగా పెట్టి మరీ ఆడాడు‘‘రిషభ్ పంత్ ఆట గురించి మనం చాలానే మాట్లాడేశాం. అయితే, ఐదో టెస్టులో మాత్రం అతడి అద్భుత, కీలకమైన ఇన్నింగ్స్‌ను కొనియాడకతప్పదు. అలాంటి పరిస్థితుల్లో అంతసేపు బ్యాటింగ్ చేయడం సులువుకాదు. భారత బ్యాటర్లలో ఒక్కరూ కనీసం 30 పరుగుల మార్కును చేరుకోలేదు. పంత్ ఒక్కడు మాత్రం 40 రన్స్‌తో టాప్ స్కోరర్ అయ్యాడు. పదే పదే బంతులు అతడి శరీరానికి తగిలాయి.అయినా.. సరే పంత్ వెనక్కి తగ్గలేదు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి మరీ ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పటికే అతడిపై మానసికంగా ఒత్తిడి ఉంది. ఈ రోజు మ్యాచ్‌లో శరీరం కూడా గాయపడింది. అయినా అద్బుతంగా పోరాడాడు. అత్యద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు’’ అని ఇర్ఫాన్ పఠాన్ కొనియాడాడు. రోహిత్ దూరంకాగా ఆసీస్‌తో తొలి నాలుగు టెస్టుల్లో పంత్ నిరాశపరిచాడు. కుదురుకుంటాడనుకున్న సమయంలో నిర్లక్ష్యపు రీతిలో వికెట్ పారేసుకుని విమర్శలు మూటగట్టుకున్నాడు. అయితే, సిడ్నీ టెస్టులో మాత్రం అద్భుత పోరాటం కనబరిచాడు. ఈ మ్యాచ్‌కు విశ్రాంతి పేరిట రోహిత్ శర్మ దూరంగా ఉండగా.. బుమ్రా సారథ్యం వహిస్తున్నాడు.చదవండి: CT 2025: వన్డే కెప్టెన్‌గా రోహిత్ అవుట్!.. టీమిండియా కొత్త సారథిగా అతడే! -
కొన్‌స్టాస్ ఓవరాక్షన్.. వైల్డ్ ఫైర్‌లా బుమ్రా!.. నాతోనే పెట్టుకుంటావా..?
టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్టు తొలిరోజు ఆట రసవత్తరంగా సాగింది. నువ్వా- నేనా అన్నట్లుగా ఇరుజట్ల క్రికెటర్లు పోటీపడ్డారు. అయితే, ఆట ముగిసే సమయంలో ఆఖరి బంతికి చోటు చేసుకున్న పరిణామాలు టీమిండియా అభిమానులకు మాంచి కిక్కిచ్చాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..?!బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy) 2024-25లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఆసీస్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెర్త్‌లో బుమ్రా కెప్టెన్సీలో గెలిచిన టీమిండియా.. అనంతరం రోహిత్ శర్మ సారథ్యంలో అడిలైడ్‌లో ఓడిపోయి.. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టును డ్రా చేసుకుంది.రోహిత్ లేకుండానేఅయితే, మెల్బోర్న్ టెస్టులో కనీసం డ్రా చేసుకునే అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోలేక ఓటమిని మూటగట్టుకుంది. ఈ క్రమంలో బ్యాటర్‌గా, కెప్టెన్‌గా విఫలమైన రోహిత్ శర్మ(ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి 31 రన్స్) ఆఖరిదైన సిడ్నీ టెస్టు నుంచి తప్పుకొన్నాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తున్నాడు.ఇక ఆసీస్‌తో శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బుమ్రా.. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, టాపార్డర్ విఫలమైన కారణంగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేయలేకపోయింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(10), కేఎల్ రాహుల్(4)తో పాటు శుబ్‌మన్ గిల్(20), విరాట్ కోహ్లి(17) నిరాశపరిచారు.పంత్ పోరాటం.. బుమ్రా మెరుపులుమిడిలార్డర్లో రిషభ్ పంత్(40), రవీంద్ర జడేజా(26) రాణించగా.. నితీశ్ రెడ్డి(0) పూర్తిగా విఫలమయ్యాడు. ఇక వాషింగ్టన్ సుందర్(14), ప్రసిద్ కృష్ణ(3) కూడా స్వల్ప స్కోర్లకే వెనుదిరగగా.. పదో స్థానంలో వచ్చిన బుమ్రా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా 17 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 22 పరుగులు సాధించాడు.185 పరుగులకు ఆలౌట్ఇక బుమ్రా మెరుపుల కారణంగానే టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగుల మేర గౌరవప్రదమైన స్కోరు చేసి ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ నాలుగు, మిచెల్ స్టార్క్ మూడు, ప్యాట్ కమిన్స్ రెండేసి వికెట్లు కూల్చగా.. నాథన్ లియాన్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.కొన్‌స్టాస్ ఓవరాక్షన్ఈ క్రమంలో తొలిరోజు ఆటలోనే తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది. సిడ్నీలో శుక్రవారం నాటి ఆట పూర్తయ్యేసరికి మూడు ఓవర్లలో వికెట్ నష్టానికి తొమ్మిది పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే, ఆట ముగిసే సమయంలో ఆఖరి బంతి పడటానికి ముందు ఆసీస్ యువ ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్(Sam Konstas) ఓవరాక్షన్ చేశాడు.బుమ్రా బౌలింగ్‌కు వస్తున్న సమయంలో క్రీజులో ఉన్న మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కాస్త ఆగమన్నట్లుగా సైగ చేయగా.. బుమ్రా కాస్త అసహనం వ్యక్తం చేశాడు. దీంతో నాన్- స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న కొన్‌స్టాస్ బుమ్రాను చూస్తూ ఏదో అనగా అతడు సీరియస్ అయ్యాడు. వైల్డ్ ఫైర్‌లా బుమ్రా.. ఓ రేంజ్లో టీమిండియా సంబరాలుఈ క్రమంలో కొన్‌స్టాస్ అతి చేస్తూ బుమ్రా వైపు రాగా.. బుమ్రా కూడా అంతే ధీటుగా బదులిచ్చాడు. దీంతో అంపైర్ జోక్యం చేసుకుని ఇద్దరికీ నచ్చజెప్పాడు. అయితే, ఈ సంఘటన జరిగిన వెంటనే తన అద్భుత బంతితో ఖవాజా(2)ను అవుట్ చేశాడు. బుమ్రా బౌలింగ్‌లో ఖవాజా ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో ఉన్న కేఎల్ రాహుల్ క్యాచ్ పట్టగానే టీమిండియా సంబరాల్లో మునిగిపోయింది. ‘‘నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది’’ అన్నట్లుగా బుమ్రా కొన్‌స్టాస్ వైపునకు రాగా.. అక్కడే ఉన్న యువ పేసర్ ప్రసిద్ కృష్ణ కూడా కొన్‌స్టాస్‌కు కౌంటర్ ఇచ్చాడు. దీంతో ముఖం మాడ్చుకున్న 19 ఏళ్ల ఈ టీనేజర్ ఆట ముగిసిన నేపథ్యంలో నిరాశగా మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆఖరి బంతికి అద్భుతం చేశావు భయ్యా అంటూ టీమిండియా ఫ్యాన్స్ బుమ్రాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా కొన్‌స్టాస్‌కు ఇలాంటి ఓవరాక్షన్ కొత్తేం కాదు. మెల్బోర్న్లో తన అరంగేట్ర టెస్టులో కోహ్లితో గొడవ పెట్టుకున్న కొన్‌స్టాస్‌కు.. బుమ్రా తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చాడు. ఈసారి తనతో నేరుగా పెట్టుకున్నందుకు.. ఆసీస్‌ను దెబ్బతీసేలా వికెట్‌తో బదులిచ్చాడు.చదవండి: CT 2025: వన్డే కెప్టెన్‌గా రోహిత్ అవుట్!.. టీమిండియా కొత్త సారథిగా అతడే!Fiery scenes in the final over at the SCG! How's that for a finish to Day One 👀#AUSvIND pic.twitter.com/BAAjrFKvnQ— cricket.com.au (@cricketcomau) January 3, 2025 -
సిడ్నీ టెస్టుకు భారత తుదిజట్టు ఇదే! అతడి ఎంట్రీ ఫిక్స్!
ఆస్ట్రేలియాతో ఐదో టెస్టు నేపథ్యంలో భారత తుదిజట్టులో రెండు మార్పులు చేటుచేసుకున్నట్లు సమాచారం. కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) విశ్రాంతి పేరిట ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండాలని భావించగా.. శుబ్‌మన్ గిల్‌కు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. ఆకాశ్ దీప్ స్థానంలో యువ పేసర్మరోవైపు.. ఆకాశ్ దీప్ గాయం కారణంగా జట్టుకు దూరం కాగా.. ఓ యువ పేసర్ ఏడాది కాలం తర్వాత పునరాగమనం చేయనున్నట్లు సమాచారం. అదే విధంగా రోహిత్ శర్మ గైర్హాజరీలో ప్రధాన పేసర్, వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి సారథ్య బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత నాలుగు పర్యాయాలుగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కైవసం చేసుకున్న భారత జట్టు.. ఈసారి మాత్రం అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోతోంది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) విఫలం కావడం తీవ్ర ప్రభావం చూపుతోంది. కోహ్లి, రోహిత్ విఫలంఆసీస్తో ఐదు టెస్టుల్లో భాగంగా ఇప్పటికి నాలుగు పూర్తి కాగా.. తొలి మ్యాచ్‌లో శతకం సాధించడం మినహా కోహ్లి పెద్దగా రాణించలేకపోతున్నాడు. ముఖ్యంగా ఆఫ్ సైడ్ బంతుల్ని ఎదుర్కొనే క్రమంలో పదే పదే తప్పుల్ని పునరావృతం చేస్తూ వికెట్ పారేసుకుంటున్నాడు.మరోవైపు.. రోహిత్ సారథిగా, బ్యాటర్‌గా విఫలమవుతున్నాడు. అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టుతో జట్టులోకి వచ్చిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి మరీ దారుణంగా31 పరుగులే చేశాడు. ఇక అతడి సారథ్యంలో రెండో టెస్టులో ఓడిన భారత్, బ్రిస్బేన్ టెస్టును డ్రాగా ముగించగలిగింది. అయితే, మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్టులో మాత్రం 184 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది.సిడ్నీ టెస్టు నుంచి వైదొలిగిన రోహిత్!ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించే సమయం ఆసన్నమైందని.. అతడు వెంటనే తప్పుకొని యువకులకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఆసీస్‌తో ఆఖరి టెస్టు ముగిసిన తర్వాత రోహిత్ తన నిర్ణయాన్ని వెల్లడిస్తాడనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో తనకు తానుగా సిడ్నీ టెస్టు నుంచి వైదొలగాలని అతడు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో యశస్వి జైస్వాల్‌తో ఓపెనింగ్ జోడీగా కేఎల్ రాహుల్ మరోసారి బరిలోకి దిగనుండగా.. శుబ్‌మన్ గిల్(Shubhman Gill) మూడో స్థానంలో ఆడనున్నట్లు సమాచారం. అదే విధంగా గాయపడిన పేసర్ ఆకాశ్ దీప్ స్థానంలో ప్రసిద్ కృష్ణ తుదిజట్టుకు ఎంపికైనట్లు తెలుస్తోంది. రెండే మార్పులుఈ రెండు మార్పులు మినహా.. పాత జట్టుతోనే భారత్ సిడ్నీ టెస్టుకు సన్నద్ధమైనట్లు సమాచారం. కాగా శుక్రవారం నుంచి మంగళవారం(జనవరి 3-7) వరకు ఆసీస్- భారత్ మధ్య ఐదో టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది. ఇందులో గెలిస్తేనే టీమిండియా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకోగలుగుతుంది. అదే విధంగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025 అవకాశాలు కూడా సజీవంగా ఉంటాయి.ఆస్ట్రేలియాతో సిడ్నీ టెస్టుకు భారత తుదిజట్టు(అంచనా)యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.చదవండి: కెప్టెన్ కంటే బెటర్.. అతడిని మాత్రం తప్పించకండి: భారత మాజీ క్రికెటర్ -
రోహిత్, బుమ్రా కాదు!.. సిడ్నీ టెస్టులో టీమిండియా కెప్టెన్ అతడే!
ఆస్ట్రేలియాతో టీమిండియా ఆఖరి టెస్టుకు సమయం ఆసన్నమైంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో శుక్రవారం ఈ మ్యాచ్ మొదలుకానుంది. ఇందుకోసం ఇరుజట్లు ఇప్పటికే పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాయి. సిడ్నీలో గెలిచి ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకోవాలని భారత్ భావిస్తోంది.మరోవైపు.. ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)ని తామే కైవసం చేసుకోవాలని ఆసీస్ పట్టుదలగా ఉన్నాయి. ఫలితంగా భారత్- ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్టు మరింత రసవత్తరంగా మారనుంది. అయితే, ఈ కీలక టెస్టుకు ముందు టీమిండియా డ్రెసింగ్‌రూమ్‌లో విభేదాలు తలెత్తాయనే వార్తలు అభిమానులను కలవరపెడుతున్నాయి.హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌తో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)కు సమన్వయం కుదరడం లేదని.. అదే విధంగా ఆటగాళ్ల తీరు పట్ల కోచ్ అసంతృప్తితో ఉన్నాడనే వదంతులు వచ్చాయి. అయితే, గౌతీ మాత్రం ఇవన్నీ అబద్దాలేనని కొట్టిపారేశాడు. అయినప్పటికీ, టీమిండియా కెప్టెన్ మార్పు అంశం మీద మాత్రం ఊహాగానాలు ఆగటం లేదు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదో టెస్టుకు ముందు కెప్టెన్‌గా రోహిత్‌పై వేటు పడనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అతడి గైర్హాజరీలో పెర్త్‌లో టీమిండియాను గెలిపించిన జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) పగ్గాలు చేపట్టడం లాంఛనమేనని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే, బెంగాల్ మాజీ క్రికెటర్, ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడిన శ్రీవత్స్ గోస్వామి మాత్రం భిన్నంగా స్పందించాడు.సిడ్నీ టెస్టులో టీమిండియా కెప్టెన్ అతడే!‘‘టీమిండియాలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే.. సిడ్నీ టెస్టులో గిల్ కెప్టెన్‌గా వ్యవహరించునున్నాడని అనిపిస్తోంది. తదుపరి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ సైకిల్ కోసం మేనేజ్మెంట్ ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదెంతో ఆసక్తికరంగా ఉంది’’ అని శ్రీవత్స్ ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.సరైన నాయకుడు బుమ్రానేఅయితే, మెజారిటీ మంది నెటిజన్లు మాత్రం శ్రీవత్స్ అభిప్రాయంతో విభేదిస్తున్నారు. గిల్‌కు తుదిజట్టులోనే చోటు దక్కనపుడు కెప్టెన్ ఎలా అవుతాడని ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్తులో గిల్‌కు పగ్గాలు ఇచ్చే అవకాశం ఉందని.. ఇప్పుడు మాత్రం బుమ్రాకు సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీమిండియాకు ప్రస్తుత పరిస్థితుల్లో బుమ్రానే సరైన నాయకుడు అని పేర్కొంటున్నారు. ఏదేమైనా శుక్రవారం సిడ్నీ టెస్టు మొదలైన తర్వాతే ఈ ఊహాగానాలకు చెక్ పడుతుంది.ఇదిలా ఉంటే.. ఐదు టెస్టులు ఆడేందుకు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న టీమిండియాకు సానుకూల ఫలితాలు రావడం లేదు. పెర్త్‌లో గెలిచిన భారత జట్టు.. అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టులో వర్షం వల్ల డ్రాతో గట్టెక్కగలిగింది. అయితే, మెల్బోర్న్ వేదికగా నాలుగో టెస్టులో మాత్రం ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది.రోహిత్ వైఫల్యాల వల్లే ఇలాఈ బాక్సింగ్ డే టెస్టులో ఆతిథ్య ఆసీస్ చేతిలో 184 పరుగుల తేడాతో చిత్తుగా ఓడి.. సిరీస్‌లో 1-2తో వెనుకబడింది. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ సారథిగా, బ్యాటర్‌గా విఫలం అవుతుండటంతో అతడు వెంటనే రాజీనామా చేసి.. రిటైర్మెంట్ ప్రకటించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్త కెప్టెన్ అంశం తెరమీదకు వచ్చింది.చదవండి: లవ్ యూ కాంబ్లీ.. త్వరలోనే వచ్చి కలుస్తా: టీమిండియా దిగ్గజం భరోసా -
రోహిత్ శర్మపై వేటు.. భారత కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా!?
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma) గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సారథిగా, బ్యాటర్‌గా రోహిత్ తీవ్ర నిరాశపరుస్తున్నాడు. తొలి టెస్టుకు వ్యక్తిగత కారణాలతో దూరమైన హిట్‌మ్యాన్.. రెండో టెస్టు నుంచి అందుబాటులోకి వచ్చాడు.కానీ తన కెప్టెన్సీ మార్క్‌ను మాత్రం చూపించలేకపోయాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు రోహిత్ 5 ఇన్నింగ్స్‌లు ఆడి కేవలం 21 పరుగులు మాత్రమే చేశాడు. అటు కెప్టెన్‌గా అడిలైడ్, మెల్బోర్న్లో రోహిత్ ఘోర ఓటములను చవిచూశాడు. అంతకుముందు న్యూజిలాండ్ సిరీస్‌లోనూ రోహిత్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. అతడి సారథ్యంలోని టీమిండియా కివీస్ చేతిలో 3-0 తేడాతో వైట్‌వాష్‌కు గురైంది. ఇప్పుడు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోనూ అదే తీరును కనబరుస్తుండండంతో రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలనే డిమాండ్లు వస్తున్నాయి.రోహిత్ శర్మపై వేటు..ఈ క్రమంలో సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరగనన్న ఆఖరి టెస్టుకు రోహిత్ శర్మను పక్కన పెట్టాలని భారత జట్టు మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా సిడ్నీ టెస్టుకు ముందు విలేకరుల సమావేశంలో పాల్గోన్న భారత హెడ్ కోచ్ గౌతం గంభీర్‌కు ఇదే ప్రశ్న ఎదురైంది.సిడ్నీ టెస్టులో రోహిత్ ఆడనున్నాడా? అని ఓవిలేకరి ప్రశ్నించాడు. అందుకుకు బదులుగా" రేపు(శుక్రవారం) ఉయదం పిచ్ చూసిన తర్వాత మా ప్లేయింగ్ ఎలెవన్‌పై నిర్ణయం తీసుకుంటామని" గంభీర్ సమాధనమిచ్చాడు. కాగా ఐదో టెస్టుకు ముందు రోహిత్ శర్మపై వేటు పడడం దాదాపు ఖాయమైనట్లగా అన్పిస్తోంది.ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో పాల్గోకపోవడం, స్లిప్ క్యాచింగ్ ప్రాక్టీస్‌లో కూడా రోహిత్ పాల్గోకపోవడం ఈ వార్తలకు మరింత ఊతమిస్తోంది. అంతేకాకుండా ప్రాక్టీస్ సెషన్లో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాతో భారత చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, గంభీర్‌లు సుదీర్ఘంగా చర్చించారు. దీంతో సిడ్నీ టెస్టులో భారత జట్టు పగ్గాలు బుమ్రా చేపట్టే సూచనలు కన్పిస్తున్నాయి. ఒకవేళ రోహిత్ దూరమైతే శుబ్‌మన్ గిల్ తిరిగి తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.చదవండి: IND vs AUS: భారత డ్రెస్సింగ్ రూమ్‌లో విభేదాలు.. క్లారిటీ ఇచ్చిన గంభీర్ -
బుమ్రా లేకుంటే వార్ వన్ సైడే: గ్లెన్ మెక్‌గ్రాత్
భారత జట్టులో జస్ప్రీత్ బుమ్రా లేకుండా ‘బోర్డర్–గావస్కర్’ సిరీస్ ఏకపక్షంగా సాగేదని ఆస్ట్రేలియా పేస్ దిగ్గజం మెక్‌గ్రాత్ పేర్కొన్నాడు. పరిస్థితులను అర్థం చేసుకొని అందుకు తగ్గట్లు ప్రణాళికలు రచించడంలో బుమ్రా బుర్ర చురుకైందని మెక్‌గ్రాత్ కితాబిచ్చాడు.ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటి వరకు నాలుగు టెస్టులు ముగియగా... టీమిండియా 1–2తో వెనుకబడి ఉంది. ఈ సిరీస్‌లో భారత బ్యాటర్లు విఫలమైనా... బుమ్రా ఒంటి చేత్తో జట్టును పోటీలో నిలిపాడని మెక్‌గ్రాత్ ప్రశంసించాడు. ‘బుమ్రా లేకుండా సిరీస్ మరింత ఏకపక్షం అయ్యేది. అతడు టీమిండియాకు ప్రధాన బలం. అతడి బౌలింగ్‌కు నేను పెద్ద అభిమానిని. భారత జట్టు అతడిని జాగ్రత్తగా చూసుకోవాలి.భారత్‌లో క్రికెట్‌కు చాలా క్రేజ్ ఉంది. గత 12 ఏళ్లుగా ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ తరఫున భారత్‌లో పనిచేస్తున్నా. మా సంస్థ ద్వారా ప్రసిధ్ కృష్ణ, యశస్వి జైస్వాల్ వంటి వాళ్లు ఎందరో లబ్ధి పొందారు. క్రికెట్లోని అన్నీ ఫార్మాట్లలో టెస్టులే అత్యుత్తమం. మెల్బోర్న్ టెస్టును ఐదు రోజుల్లో కలిపి 3,70,000 మంది వీక్షించడం ఆనందాన్నిచి్చంది. ఇది టెస్టు క్రికెట్‌కున్న ఆదరణను వెల్లడిస్తుంది’ అని మెక్‌గ్రాత్ అన్నాడు.చదవండి: బుమ్రా ఎడమ చేత్తో బౌలింగ్ చేయాలని చట్టం తెస్తాం -
బుమ్రా ఎడమ చేత్తో బౌలింగ్ చేయాలని చట్టం తెస్తాం
సిడ్నీ: టీమిండియా మేటి పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఆ్రస్టేలియా ప్రధానమంత్రి ఆంటోనీ ఆల్బనీస్ ఆకాశానికెత్తారు. ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీలో నాలుగు మ్యాచ్‌లాడి 30 వికెట్లు పడగొట్టిన బుమ్రా... ఇకపై ఎడమ చేత్తో బౌలింగ్ చేసేలా చట్టం తీసుకొస్తామని ఆల్బనీస్ చమత్కరించారు. ‘బుమ్రా ఎడమ చేత్తో బౌలింగ్ చేయాలి. లేదా రనప్ తగ్గించుకోవాలి. ఈ మేరకు చట్టం తీసుకొస్తాం. అతడు బౌలింగ్‌కు వచి్చన ప్రతిసారి చూసేందుకు ఎంతో ముచ్చటగా ఉంటుంది’ అని ఆల్బనీస్ పేర్కొన్నారు. సిడ్నీ వేదికగా శుక్రవారం నుంచి భారత్, ఆ్రస్టేలియా మధ్య చివరి టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇరు జట్ల ఆటగాళ్లకు బుధవారం ఆ్రస్టేలియా ప్రధాని ఆల్బనీస్ ఆతిథ్యమిచ్చారు. ‘భారత్, ఆ్రస్టేలియా జట్లు ఇప్పటికే ఎంతో మజానిచ్చాయి. శుక్రవారం నుంచి చివరి టెస్టు ప్రారంభం కానుంది. మెక్‌గ్రాత్ ఫౌండేషన్ కృషితో సిడ్నీ మైదానం గులాబీ రంగు సంతరించుకోనుంది’ అని ఆల్బనీస్ సామాజిక మాధ్యమాల్లో ఒక లేఖ విడుదల చేశారు. ఆస్ట్రేలియా మాజీ పేసర్ మెక్‌గ్రాత్ భార్య 2008లో రొమ్ము క్యాన్సర్ బారిన పడి మృతి చెందగా... అప్పటి నుంచి ఈ వ్యాధిపై మరింత అవగాహన పెంచేందుకు తన ఫౌండేషన్ తరఫున మెక్‌గ్రాత్ తీవ్రంగా కృషి చేస్తున్నాడు. ఇందులో భాగంగానే చివరి టెస్టులో భారత్, ఆ్రస్టేలియా జట్లు గులాబీ క్యాప్‌లు ధరించి బరిలోకి దిగనున్నాయి. ప్రధానితో భేటీ అనంతరం టీమిండియా హెడ్‌కోచ్ గంభీర్ మాట్లాడుతూ... ‘ఆ్రస్టేలియా అందమైన దేశం. కానీ ఇక్కడ పర్యటించడం చాలా కష్టం. అభిమానుల నుంచి మంచి మద్దతు లభించింది. సిరీస్‌లో మరో టెస్టు మిగిలుంది. దీంట్లో కూడా ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తాం’ అని అన్నాడు. ఆ్రస్టేలియా సారథి కమిన్స్ మాట్లాడుతూ... ‘మెల్బోర్న్ టెస్టును ఎప్పటికీ మరవలేం. ఐదు రోజుల పాటు హోరాహోరీగా సాగిన పోరులో విజయం సంతృప్తినిచి్చంది. సిరీస్ గెలవాలనే లక్ష్యంతో చివరి టెస్టు బరిలోకి దిగుతాం’అని పేర్కొన్నాడు. -
ఆస్ట్రేలియాతో చివరి టెస్ట్.. ఆల్‌టైమ్ రికార్డుపై కన్నేసిన బుమ్రా
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగే చివరి టెస్ట్ మ్యాచ్ సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి ప్రారంభం కానుంది. సిరీస్ ఫలితాన్ని డిసైడ్ చేసే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాను ఓ ఆల్‌టైమ్ రికార్డు ఊరిస్తుంది. సిడ్నీ టెస్ట్‌లో బుమ్రా మరో ఆరు వికెట్లు తీస్తే.. ఓ ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పుతాడు.ప్రస్తుతం ఈ రికార్డు స్పిన్ దిగ్గజం బీఎస్ చంద్రశేఖర్ పేరిట ఉంది. చంద్రశేఖర్ 1972-73లో సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 35 వికెట్లు తీశారు. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా ఇప్పటివరకు ఆడిన నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల్లో 12.83 సగటున 30 వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడు ఐదు వికెట్లు ఘనతలు ఉండగా..రెండు నాలుగు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి.ఓ ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు..1. బీఎస్ చంద్రశేఖర్ - 35 (ఇంగ్లండ్‌పై)2. వినూ మన్కడ్ - 34 (ఇంగ్లండ్‌పై)3. శుభాష్చంద్ర గుప్తా - 34 (న్యూజిలాండ్‌పై)4. రవిచంద్రన్ అశ్విన్ - 32 (ఇంగ్లాండ్‌పై)5. హర్భజన్ సింగ్ - 32 (ఆస్ట్రేలియాపై)6 .కపిల్ దేవ్ - 32 (పాకిస్థాన్‌పై)7. రవిచంద్రన్ అశ్విన్ - 31 (దక్షిణాఫ్రికాపై)8. బిషన్ సింగ్ బేడీ - 31 (ఆస్ట్రేలియాపై)9. జస్ప్రీత్ బుమ్రా - 30 (ఆస్ట్రేలియాపై)కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో నాలుగు టెస్ట్‌ల అనంతరం ఆస్ట్రేలియా 2-1 ఆధిక్యంలో ఉంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. ఆతర్వాత అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ డ్రా కాగా.. తాజాగా మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఆసీస్ 184 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. -
చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో బుమ్రా 907 రేటింగ్ పాయింట్లు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బుమ్రాకు ముందు అత్యధిక రేటింగ్ పాయింట్లు కలిగిన భారత బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు. యాష్ 2016లో 904 రేటింగ్ పాయింట్లు సాధించాడు. తాజాగా బుమ్రా అశ్విన్ రికార్డును బద్దలు కొట్టి భారత్ తరఫున ఆల్‌టైమ్ గ్రేట్ రికార్డును నెలకొల్పాడు.టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన బౌలర్ల జాబితాలో ఇంగ్లండ్ సీమర్లు సిడ్నీ బార్న్స్ (932), జార్జ్ లోమన్ (931), పాక్ మాజీ పేసర్ ఇమ్రాన్ ఖాన్ (922), శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీథరన్ (920) మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నారు. తాజాగా 907 రేటింగ్ పాయింట్లు సాధించిన బుమ్రా అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన బౌలర్ల జాబితాలో ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ డెరిక్ అండర్వుడ్తో కలిసి సంయుక్తంగా 17వ స్థానంలో ఉన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నాలుగు మ్యాచ్‌ల్లో 30 వికెట్లు పడగొట్టిన బుమ్రా తన రేటింగ్ పాయింట్లను గణనీయంగా పెంచుకుని టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఎవరికీ అందనంత ఎత్తుకు వెళ్లిపోయాడు.తాజా ర్యాంకింగ్స్‌లో బుమ్రా తర్వాతి స్థానంలో జోష్ హాజిల్‌వుడ్ (843) ఉన్నాడు. బుమ్రాకు హాజిల్‌వుడ్‌కు మధ్య 64 రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం ఉంది. బుమ్రా, హాజిల్‌వుడ్ తర్వాతి స్థానాల్లో కమిన్స్ (837), రబాడ (832), మార్కో జన్సెన్ (803), మ్యాట్ హెన్రీ (782), నాథన్ లియోన్ (772), ప్రభాత్ జయసూర్య (768), నౌమన్ అలీ (751), రవీంద్ర జడేజా (750) ఉన్నారు.బ్యాటింగ్‌లో విరాట్ టాప్ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన భారత బ్యాటర్‌గా విరాట్ కోహ్లి చలామణి అవుతున్నాడు. విరాట్ కోహ్లి 2018లో 937 రేటింగ్ పాయింట్లు సాధించాడు. భారత్ తరఫున ఏ ఇతర బ్యాటర్ ఇన్ని రేటింగ్ పాయింట్లు సాధించలేదు.నాలుగో స్థానానికి ఎగబాకిన జైస్వాల్ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఆసీస్‌తో నాలుగో టెస్ట్‌లో రెండు భారీ అర్ద సెంచరీలు చేసిన జైస్వాల్ తన రేటింగ్ పాయింట్లను 854 పాయింట్లకు పెంచుకున్నాడు. ఇంగ్లండ్ స్టార్ జో రూట్ (895) నంబర్ వన్ టెస్ట్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. హ్యారీ బ్రూక్ (876), కేన్ విలియమ్సన్ (867), జైస్వాల్, ట్రవిస్ హెడ్ (780) టాప్-5 టెస్ట్ బ్యాటర్లుగా కొనసాగుతున్నారు. జైస్వాల్ టెస్ట్‌ల్లో నంబర్ వన్ స్థానానికి చేరుకునేందుకు మరో 41 పాయింట్ల దూరంలో ఉన్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో భారత్ తరఫున జైస్వాల్ ఒక్కడే టాప్-10లో ఉన్నాడు. భారత స్టార్ బ్యాటర్లు రిషబ్ పంత్ 12, శుభ్‌మన్ గిల్ 20, విరాట్ కోహ్లి 24, రోహిత్ శర్మ 40 స్థానాల్లో నిలిచారు. -
రోహిత్, కోహ్లి, బుమ్రాకు విశ్రాంతి..?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో టీమిండియా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి కల్పిస్తారని ప్రచారం జరుగుతుంది. వర్క్ లోడ్ కారణంగా బుమ్రాను పక్కకు పెట్టాలని భావిస్తున్న సెలెక్టర్లు.. ఫామ్‌లో లేని రోహిత్, విరాట్లను విశ్రాంతి పేరుతో తప్పిస్తారని తెలుస్తుంది. జరుగుతున్న ప్రచారాన్ని బట్టి చూస్తే రోహిత్, కోహ్లి ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేది కూడా అనుమానంగానే కనిపిస్తుంది. వాస్తవానికి ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా ఉంది. అలాంటి ఈ సిరీస్‌కే రోహిత్, కోహ్లిలకు రెస్ట్ ఇస్తే ఛాంపియన్స్ ట్రోఫీలో ఎలా ఆడిస్తారని అనుమానాలు వస్తున్నాయి. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ముగిసిన ఎనిమిది రోజుల గ్యాప్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది. ఈ మెగా టోర్నీలో ఆడకముందు ఫామ్‌లో లేని రోహిత్, కోహ్లి ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ఆడాలి. ఈ ఇద్దరు వన్డేలు ఆడి చాలాకాలం అవుతుంది. రోహిత్, కోహ్లి ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటే టీమిండియాకే నష్టం వాటిల్లుతుంది. టెస్ట్‌ల్లో ప్రస్తుతం రోహిత్, కోహ్లి మెడపై కత్తి వేలాడుతుంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే వీరిద్దరినీ వన్డేల నుంచి కూడా తప్పిస్తారేమో అనిపిస్తుంది.కాగా, భారత టెస్ట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఐదు మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా 1-2 తేడాతో వెనుకపడి ఉంది. భారత్-ఆస్ట్రేలియా మధ్య చివరిదైన ఐదో టెస్ట్ జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా ప్రారంభం కానుంది. రోహిత్, కోహ్లి, బుమ్రా ప్రస్తుతం భారత టెస్ట్ జట్టులో భాగంగా ఉన్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉంటే రోహిత్, కోహ్లి దారుణంగా విఫలమవుతున్నారు. బుమ్రా ఇప్పటివరకు ఆడిన నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల్లో 30 వికెట్లు తీసి సిరీస్‌లో లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. ప్రస్తుతం బుమ్రాపై ఉన్న వర్క్ లోడ్‌ను బట్టి చూస్తే అతనికి విశ్రాంతినివ్వడం సమంజసమే అనిపిస్తుంది. ఫామ్‌లో లేక జట్టుకు భారమైన రోహిత్, కోహ్లిలను తదుపరి సిరీస్ ఆడించరంటే అది పరోక్షంగా తప్పించడమే అనుకోవాలి.బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అనంతరం భారత్ జనవరి 22 నుంచి ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడుతుంది. ఐదు టీ20లు, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ఇంగ్లండ్ భారత్‌లో పర్యటిస్తుంది.ఇంగ్లండ్ టూర్ ఆఫ్ ఇండియా షెడ్యూల్జనవరి 22- తొలి టీ20 (కోల్‌కతా)జనవరి 25- రెండో టీ20 (చెన్నై)జనవరి 28- మూడో టీ20 (రాజ్‌కోట్)జనవరి 31- నాలుగో టీ20 (పూణే)ఫిబ్రవరి 2- ఐదో టీ20 (ముంబై)ఫిబ్రవరి 6- తొలి వన్డే (నాగ్‌పూర్)ఫిబ్రవరి 9- రెండో వన్డే (కటక్)ఫిబ్రవరి 12- మూడో వన్డే (అహ్మదాబాద్)ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ అనంతరం భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ (వన్డేలు) ఆడుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత మ్యాచ్‌లు మినహా మిగతా మ్యాచ్‌లన్నీ పాకిస్తాన్లో జరుగుతాయి. మెగా టోర్నీలో భారత ఆడే మ్యాచ్‌లు దుబాయ్‌లో జరుగుతాయి.ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా షెడ్యూల్ ఇలా ఉండబోతుంది.ఫిబ్రవరి 20- ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ (దుబాయ్)ఫిబ్రవరి 23- ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (దుబాయ్)మార్చి 2- ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (దుబాయ్)గ్రూప్ దశలో ఫలితాల ఆధారంగా ఛాంపియన్స్ ట్రోఫీలో తదుపరి మ్యాచ్‌లు (సెమీస్, ఫైనల్) ఉంటాయి. -
నితీశ్ రెడ్డికి అరుదైన గౌరవం.. బీసీసీఐ వీడియో వైరల్
టీమిండియా నయా సంచలనం, ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy)కి అరుదైన గౌరవం దక్కింది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్(Melbourne Cricket Ground) హానర్స్ బోర్డులో అతడికి చోటు లభించింది. భారత జట్టు వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా కూడా మరోసారి ఈ గౌరవం దక్కించుకోగా.. ఈ ఇద్దరి పేర్లను బోర్డుపై చేర్చుతున్న సమయంలో నితీశ్ రెడ్డి ఉద్వేగానికి లోనయ్యాడు.వీడియో షేర్ చేసిన బీసీసీఐఈ ప్రత్యేకమైన క్షణాలను ఫోన్ కెమెరాలో బంధిస్తూ మధురజ్ఞాపకాలను పోగు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘‘ఐదు వికెట్ల హాల్... ప్రత్యేకమైన సెంచరీ... వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)తో పాటు నితీశ్ కుమార్ రెడ్డి పేర్లు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ హానర్స్ బోర్డులో చేరిన వేళ’’ అంటూ క్యాప్షన్ జతచేసింది.కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లింది. తొలి టెస్టులో భారత్, రెండో టెస్టులో ఆసీస్ గెలుపొందగా.. మూడో టెస్టు డ్రా అయింది. ఈ క్రమంలో మెల్బోర్న్ వేదికగా నాలుగో టెస్టు జరిగింది.రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి విఫలమైన చోట ఈ బాక్సింగ్ డే మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ సందర్భంగా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి శతకంతో చెలరేగాడు. సీనియర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి విఫలమైన చోట 114 పరుగులతో దుమ్ములేపాడు. చిన్న వయసులోనే ఎంసీజీలో శతకంతద్వారా ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎంసీజీ)లో అత్యంత పిన్న వయసులో భారత్ తరఫున శతకం బాదిన క్రికెటర్‌గా.. 21 ఏళ్ల నితీశ్ రెడ్డి చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ హానర్స్ బోర్డులో నితీశ్ రెడ్డి పేరును లిఖించారు. బుమ్రా మరోసారిఇక ఇదే టెస్టులో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ సందర్భంగా జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగిన విషయం తెలిసిందే. సామ్ కొన్‌స్టాస్(8), ట్రవిస్ హెడ్(1), మిచెల్ మార్ష్(0), అలెక్స్ క్యారీ(2), నాథన్ లియాన్(41) వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ నేపథ్యంలో ఐదు వికెట్ల ప్రదర్శన(5/57) నమోదు చేసినందుకు గానూ బుమ్రా పేరు కూడా హానర్స్ బోర్డులో రాశారు. కాగా 2018లోనూ బుమ్రా ఇలాంటి ఘనత సాధించి.. తొలిసారి హానర్స్ బోర్డులోకెక్కాడు. ఇక 2020లో అజింక్య రహానే 112 పరుగులు చేసి తన పేరు(మొత్తంగా రెండుసార్లు)ను లిఖించుకున్నాడు. అంతకు ముందు టీమిండియా బ్యాటర్లు సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ విరాట్ కోహ్లి, ఛతేశ్వర్ పుజారా తదితరులు కూడా ఈ గౌరవం దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. మెల్బోర్న్ టెస్టులో టీమిండియా ఆసీస్ చేతిలో 184 పరుగుల తేడాతో భారీ పరాజయాన్ని చవిచూసింది. ఆఖరి టెస్టు గెలిస్తేనేఫలితంగా ఆస్ట్రేలియా 2-1తో ఆధిక్యంలోకి వెళ్లడంతో పాటు.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ అవకాశాలను మెరుగుపరచుకుంది. ఇక ఇరుజట్ల మధ్య సిడ్నీ వేదికగా జనవరి 3న ఈ సిరీస్‌లో చివరిదైన ఐదో టెస్టు మొదలుకానుంది. ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవడంతో పాటు.. శ్రీలంకతో సిరీస్‌లో ఆసీస్ టెస్టు ఫలితాలపై భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి.చదవండి: Rohit On Pant Batting: నిర్లక్ష్యపు షాట్లతో భారీ మూల్యం.. అతడికి నేనేం చెప్పగలను Magnificent 5️⃣-wicket haul 🤝 Special Maiden 💯Vice Captain Jasprit Bumrah and Nitish Kumar Reddy's names are etched on the Honours Board of Melbourne Cricket Ground ✍️ 👏#TeamIndia | #AUSvIND | @Jaspritbumrah93 | @NKReddy07 pic.twitter.com/4tat5F0N6e— BCCI (@BCCI) December 31, 2024 -
అత్యుత్తమ టెస్టు జట్టు కెప్టెన్‌గా బుమ్రా.. భారత్ నుంచి మరొకరికి చోటు
క్రికెట్ ఆస్ట్రేలియా 2024 ఏడాదికి గానూ అత్యుత్తమ టెస్టు క్రికెట్ జట్టు( Cricket Australia's Test team of 2024)ను ప్రకటించింది. ఈ టీమ్‌కు టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)ను కెప్టెన్‌గా ఎంచుకున్న క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ).. కేవలం ఇద్దరు ఆస్ట్రేలియా ఆటగాళ్లకు మాత్రమే చోటిచ్చింది.భారత్ నుంచి మరొకరికి చోటుకాగా 2024లో టెస్టుల్లో సూపర్ ఫామ్‌లో ఉన్న పదకొండు మంది ఆటగాళ్ల పేర్లతో సీఏ ఈ జాబితాను మంగళవారం విడుదల చేసింది. ఈ జట్టుకు ఓపెనర్లుగా టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal)- ఇంగ్లండ్ స్టార్ బెన్ డకెట్ ఉండగా.. జో రూట్(Joe Root) వన్‌డౌన్ బ్యాటర్‌గా ఎంపికయ్యాడు.లంక ఆటగాడికి స్థానంఇక నాలుగో స్థానంలో న్యూజిలాండ్ స్టార్ రచిన్ రవీంద్ర.. వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఇంగ్లండ్ యువ తార హ్యారీ బ్రూక్, శ్రీలంక క్రికెటర్ కమిందు మెండిస్ చోటు దక్కించుకున్నారు. ఇక వికెట్ కీపర్ కోటాలో ఆస్ట్రేలియాకు చెందిన అలెక్స్ క్యారీ స్థానం సంపాదించగా.. ఫాస్ట్ బౌలర్ల విభాగంలో న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ, భారత స్టార్ బుమ్రా, ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ ఎంపికయ్యారు. ఏకైక స్పిన్నర్‌గా కేశవ్ మహరాజ్ ఈ జట్టులో స్థానం దక్కించుకున్నాడు.క్రికెట్ ఆస్ట్రేలియా 2024కు గానూ ఎంచుకున్న అత్యుత్తమ టెస్టు జట్టుయశస్వి జైస్వాల్(భారత్), బెన్ డకెట్(ఇంగ్లండ్), జో రూట్(ఇంగ్లండ్), రచిన్ రవీంద్ర(న్యూజిలాండ్), హ్యారీ బ్రూక్ (ఇంగ్లండ్), కమిందు మెండిస్(శ్రీలంక), అలెక్స్ క్యారీ(ఆస్ట్రేలియా), మ్యాచ్ హెన్రీ(న్యూజిలాండ్), జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్- భారత్), జోష్ హాజిల్‌వుడ్(ఆస్ట్రేలియా), కేశవ్ మహరాజ్(సౌతాఫ్రికా).2024లో ఈ ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉందంటే?యశస్వి జైస్వాల్ఈ ఏడాదిలో 15 టెస్టులాడి 1478 పరుగులు చేశాడు. ఇందులో మూడు శతకాలు ఉనఆయి. అత్యధిక స్కోరు 214బెన్ డకెట్బెన్ డకెట్ 2024లో 17 టెస్టు మ్యాచ్‌లు ఆడి 1149 రన్స్ సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోరు 153.జో రూట్ఇంగ్లండ్ వెటరన్ స్టార్ జో రూట్ ఈ సంవత్సరం 17 టెస్టుల్లో ఆడి 1556 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా ఆరు శతకాలు, ఓ డబుల్ సెంచరీ ఉన్నాయి. హయ్యస్ట్ స్కోరు 262.రచిన్ రవీంద్రకివీస్ యువ సంచలనం రచిన్ రవీంద్ర ఈ ఏడాది 12 టెస్టు మ్యాచ్‌లలో కలిపి.. 984 రన్స్ చేశాడు. అత్యధిక స్కోరు: 249.హ్యారీ బ్రూక్ఇంగ్లండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ 2024లో 12 టెస్టుల్లో కలిపి 1100 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు శతకాలతో పాటు.. ఓ ట్రిపుల్ సెంచరీ కూడా ఉంది. అత్యధిక స్కోరు 317.కమిందు మెండిస్శ్రీలంక తరఫున ఈ ఏడాది అద్భుత ఫామ్ కనబరిచిన కమిందు మెండిస్ 9 టెస్టులు ఆడి.. 1049 రన్స్ చేశాడు. ఇందులో ఐదు శతకాలు ఉండగా.. హయ్యస్ట్ స్కోరు: 182.అలెక్స్ క్యారీఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ 2024లో తొమ్మిది టెస్టులు ఆడాడు. 42 డిస్మిసల్స్లో భాగం కావడంతో పాటు.. నాలుగు స్టంపౌట్లు చేశాడు. అదే విధంగా.. మూడు అర్ధ శతకాల సాయంతో 440 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 98.మ్యాట్ హెన్రీకివీస్ పేసర్ మ్యాచ్ హెన్రీ ఈ ఏడాది తొమ్మిది టెస్టులాడి 48 వికెట్లు కూల్చాడు. అత్యుత్తమ గణాంకాలు 7-67.జస్ప్రీత్ బుమ్రాటీమిండియా వైస్ కెప్టెన్ 2024లో పదమూడు టెస్టు మ్యాచ్‌లు ఆడి ఏకంగా 71 వికెట్లు కూల్చాడు. అత్యుత్తమ గణాంకాలు 6-45. భారత్ తరఫున అత్యంత వేగంగా 200 టెస్టు వికెట్ల క్లబ్లో చేరిన ఫాస్ట్‌బౌలర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఆసీస్‌తో తొలి టెస్టుకు సారథ్యం వహించి.. భారత్‌ను 275 పరుగుల తేడాతో గెలిపించాడు. జోష్ హాజిల్వుడ్ఆసీస్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ ఈ సంవత్సరం 15 టెస్టు మ్యాచ్‌లలో కలిపి 35 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ గణాంకాలు 5-31.కేశవ్ మహరాజ్సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ ఈ ఏడాది 15 టెస్టుల్లో పాల్గొని 35 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 5-59. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్లో సౌతాఫ్రికా ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు.చదవండి: టెస్టులకు రోహిత్ శర్మ గుడ్‌బై!?.. ప్రకటనకు రంగం సిద్ధం! -
టెస్టులకు రోహిత్ శర్మ గుడ్‌బై!?.. ప్రకటనకు రంగం సిద్ధం!
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్(Test Retirement) ప్రకటించనున్నాడా? ఆస్ట్రేలియాతో సిడ్నీ మ్యాచ్ తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడించనున్నాడా? అంటే క్రికెట్ వర్గాల్లో అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. సారథిగా, బ్యాటర్‌గా రోహిత్ శర్మ విఫలంకాగా సారథిగా, బ్యాటర్‌గా రోహిత్ శర్మ ఇటీవల గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్‌కు గురైన రోహిత్ సేన.. ఆస్ట్రేలియాలోనూ విఫలమవుతోంది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా పెర్త్ టెస్టులో జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో గెలుపొందిన టీమిండియా.. రోహిత్ కెప్టెన్సీలో అడిలైడ్, బ్రిస్బేన్, మెల్బోర్న్ టెస్టుల్లో తీవ్రంగా నిరాశపరిచింది.కెప్టెన్‌గానూ, బ్యాటర్‌గానూ రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. ముఖ్యంగా తాజాగా ముగిసిన మెల్బోర్న్ టెస్టులో రోహిత్(3, 9) తన రెగ్యులర్ స్థానంలో ఓపెనర్‌గా వచ్చినా.. ఆకట్టుకోలేకపోయాడు. పట్టుమని పది పరుగులు చేయకుండానే అవుటయ్యాడు.త్వరగా రిటైర్ పోవాలంటూఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా 184 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ కెప్టెన్సీ, బ్యాటింగ్ తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. త్వరగా రిటైర్ పోవాలంటూ హిట్‌మ్యాన్‌కు సూచనలు వస్తున్నాయి. అయితే, ఆసీస్‌తో ఆఖరిదైన సిడ్నీ టెస్టు ముగిసిన తర్వాత ఈ విషయమై నిర్ణయం తీసుకునేందుకు రోహిత్ సిద్ధమైనట్లు సమాచారం.టెస్టులకు గుడ్‌బై!?.. ప్రకటనకు రంగం సిద్ధం!ఇప్పటికే తన రిటైర్మెంట్ గురించి సెలక్టర్లు, బీసీసీఐ నాయకత్వంతో చర్చించిన రోహిత్ శర్మ.. సిడ్నీ టెస్టులో ఓడితే తన మనసులోని మాటను వెల్లడించనున్నాడట. ఒకవేళ ఆ మ్యాచ్‌లో గెలిచి.. టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ చేరే అవకాశాలు ఉంటే మాత్రం.. ఆ మెగా మ్యాచ్ వరకు సారథిగా కొనసాగాలని భావిస్తున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది.ఏదేమైనా సిడ్నీ టెస్టుతో రోహిత్ శర్మ టెస్టు క్రికెట్ భవితవ్యంపై ఒక అంచనాకు రావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ రోహిత్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటిస్తే అతడి స్థానంలో జస్ప్రీత్ బుమ్రా పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. గణాంకాలు ఇవీకాగా టెస్టుల్లో గత పదకొండు ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ నమోదు చేసిన స్కోర్లు ఇవే 2, 52, 0, 8, 18, 11, 3, 6, 10, 3, 9. రోహిత్ శర్మ బ్యాటింగ్ తీరు ఎలా ఉందో చెప్పడానికి ఈ గణాంకాలు చాలు. అయితే, ఏ ఆటగాడికైనా గడ్డు దశ అనేది ఉంటుంది. కానీ.. 37 ఏళ్ల రోహిత్ వికెట్ పారేసుకున్న తీరు కారణంగానే అతడి రిటైర్మెంట్పై చర్చలు ఎక్కువయ్యాయి.టీమిండియాకు చేదు అనుభవాలుఇక ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య సిడ్నీ వేదికగా ఆఖరి టెస్టు జరుగనుంది. జనవరి 3-7 వరకు ఈ మ్యాచ్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇదిలా ఉంటే.. పెర్త్‌లో భారత్ 275 పరుగులతో గెలవగా.. అడిలైడ్‌లో ఆసీస్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం వల్ల బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టు డ్రా కాగా.. మెల్బోర్న్లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో ఆతిథ్య ఆసీస్ 184 పరుగుల తేడాతో రోహిత్ సేనను చిత్తు చేసింది. తద్వారా 2-1తో ఆధిక్యంలోకి వెళ్లడంతో పాటు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ అవకాశాలను సజీవం చేసుకుంది. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024 తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.చదవండి: 2025లో టీమిండియా షెడ్యూల్ ఇదే..! -
టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-2024 నామినీస్ వీరే.. జైస్వాల్‌కు నో ఛాన్స్
టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024 నామినీస్ జాబితాను ఐసీసీ ఇవాళ (డిసెంబర్ 30) విడుదల చేసింది. ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు ఈ జాబితాలో చోటు దక్కింది. బ్యాటింగ్ విభాగంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు జో రూట్, హ్యారీ బ్రూక్.. శ్రీలంక ఆటగాడు కమిందు మెండిస్ నామినేట్ కాగా.. బౌలింగ్ విభాగం నుంచి జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే నామినేట్ అయ్యాడు. టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024 అవార్డుకు నామినేట్ కాకపోవడం గమనార్హం. జైస్వాల్ (29 ఇన్నింగ్స్‌ల్లో 1478 పరుగులు) ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. జైస్వాల్ కాకుండా అతని కంటే తక్కువ పరుగులు చేసిన కమిందు మెండిస్, హ్యారీ బ్రూక్ ఐసీసీ అవార్డుకు నామినేట్ కావడం విశేషం.రూట్: టెస్ట్‌ల్లో ఈ ఏడాది రూట్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. రూట్ ఈ ఏడాది 31 ఇన్నింగ్స్‌ల్లో 1556 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. రూట్ ఓ క్యాలెండర్ ఇయర్లో 1000 పరుగులు దాటడం ఇది ఐదో సారి. రూట్ ఈ ఏడాది ఆరు శతకాలు, ఐదు హాఫ్ సెంచరీలు సాధించాడు. రూట్ బౌలింగ్‌లోనూ రాణించి నాలుగు వికెట్లు పడగొట్టాడు. రూట్ ఈ ఏడాదే తన అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ను సాధించాడు. ముల్తాన్ టెస్ట్‌లో రూట్ పాక్‌పై డబుల్ సెంచరీ (262) చేశాడు. బుమ్రా: బుమ్రా ఈ ఏడాది ఏ ఇతర బౌలర్ చేయనటువంటి అద్భుత ప్రదర్శన చేశాడు. బుమ్రా ఈ ఏడాది 13 టెస్ట్‌ల్లో 14.92 సగటున 71 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో బుమ్రా టాప్‌లో ఉండగా.. అతని దరిదాపుల్లో ఏ బౌలర్ లేడు. ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్ బుమ్రా తర్వాత అత్యధికంగా 52 వికెట్లు పడగొట్టాడు. ఆతర్వాతి స్థానాల్లో సిరాజ్ (35), కమిన్స్ (37), సౌధీ (17) ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా 4 మ్యాచ్‌ల్లో 30 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు.బ్రూక్: బ్రూక్ ఈ ఏడాది అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. బ్రూక్ ఈ ఏడాది 20 ఇన్నింగ్స్‌ల్లో నాలుగు సెంచరీలు, మూడు అర్ద సెంచరీల సాయంతో 1100 పరుగులు చేశాడు. బ్రూక్ ముల్తాన్ టెస్ట్‌లో పాక్‌పై ట్రిపుల్ సెంచరీ (317) చేశాడు. బ్రూక్ ఈ ఏడాది చేసిన పరుగుల్లో అత్యధిక శాతం విదేశాల్లో చేసినవే కావడం విశేషం. బ్రూక్ ఈ ఏడాది ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో కొద్ది కాలం పాటు నంబర్ వన్ బ్యాటర్‌గానూ కొనసాగాడు.కమిందు మెండిస్: శ్రీలంక యువ ఆటగాడు కమిందు మెండిస్ ఈ ఏడాది టెస్ట్‌ల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కమిందు ఐదో స్థానంలో నిలిచాడు. కమిందు ఈ ఏడాది 16 ఇన్నింగ్స్‌ల్లో 74.92 సగటున 1049 పరుగులు చేశాడు. -
చరిత్ర సృష్టించిన బుమ్రా.. కపిల్ దేవ్ అల్‌టైమ్ రికార్డు బ్రేక్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో సైతం బుమ్రా నిప్పుల చేరిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ 4 వికెట్లతో సత్తాచాటాడు. ట్రావిస్ హెడ్, అలెక్స్ క్యారీ, మిచెల్ మార్ష్ వంటి కీలక వికెట్లను పడగొట్టి భారత్‌ను తిరిగి గేమ్‌లోకి తీసుకువచ్చాడు.ఈ క్రమంలో బుమ్రా ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత ఫాస్ట్ బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. బుమ్రా ఇప్పటివరకు ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడి 26 వికెట్లు పడగొట్టాడు.ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్(25) పేరిట ఉండేది. 1991-92లో ఆస్ట్రేలియాలో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో మొత్తం 25 వికెట్లు పడగొట్టాడు.తాజా మ్యాచ్‌తో కపిల్ దేవ్ అల్‌టైమ్ రికార్డును బుమ్రా బ్రేక్ చేశాడు. అదే విధంగా ఈ మ్యాచ్‌లో బుమ్రా తన 200 వికెట్ల మైలురాయిని కూడా అందుకున్నాడు.ఇక మ్యాచ్ విషయాని వస్తే.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా 333 పరుగుల ఆధిక్యం సాధించింది. ప్రస్తుతం క్రీజులో నాథన్ లియోన్(41 నాటౌట్), స్కాట్ బోలాండ్(10 నాటౌట్) ఉన్నారు.చదవండి: టీ20 క్రికెటర్ ఆఫ్ దియర్-2024 నామినీస్ వీరే.. బుమ్రాకు నో ఛాన్స్ -
IND VS AUS 4th TEST: డబుల్ సెంచరీ పూర్తి చేసిన బుమ్రా.. వరల్డ్ రికార్డు
భారత పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా టెస్ట్‌ల్లో 200 వికెట్ల క్లబ్లో చేరాడు. ఆసీస్‌తో నాలుగో టెస్ట్‌లో (రెండో ఇన్నింగ్స్) ట్రవిస్ హెడ్ వికెట్ పడగొట్టడం ద్వారా బుమ్రా ఈ అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్‌ల్లో 20 కంటే తక్కువ సగటుతో (19.38) 200 వికెట్లు పూర్తి చేసిన తొలి బౌలర్‌గా బుమ్రా వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. అలాగే భారత్ తరఫున అత్యంత వేగంగా (బంతుల పరంగా) 200 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.భారత్ తరఫున అత్యంత వేగంగా 200 వికెట్ల క్లబ్లో చేరిన బౌలర్లు..జస్ప్రీత్ బుమ్రా 8484మొహమ్మద్ షమీ 9896అశ్విన్ 10248కపిల్ దేవ్ 11066రవీంద్ర జడేజా 11989అత్యుత్తమ బౌలింగ్ సగటు (Min 200 వికెట్లు)బుమ్రా 19.38మాల్కమ్ మార్షల్ 20.94జోయల్ గార్నర్ 20.97కర్ట్లీ ఆంబ్రోస్ 20.99అతి తక్కువ బంతుల్లో 200 వికెట్లు తీసిన బౌలర్లు..వకార్ యూనిస్ 7725డేల్ స్టెయిన్ 7848రబాడ 8154బుమ్రా 8484మాల్కమ్ మార్షల్ 9234- బుమ్రా తన 200 టెస్ట్ వికెట్ల మార్కును 44వ మ్యాచ్‌లో అందుకున్నాడు. కమిన్స్, రబాడ కూడా ఈ మైలురాయిని 44వ మ్యాచ్‌లోనే చేరుకున్నారు.- మ్యాచ్‌ల పరంగా అశ్విన్ (38) మాత్రమే బుమ్రా (44) కంటే వేగంగా 200 వికెట్ల క్లబ్లో చేరాడు.మ్యాచ్ విషయానికొస్తే.. నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన బుమ్రా.. రెండో ఇన్నింగ్స్‌లో ఇప్పటికే నాలుగు వికెట్లు తీశాడు. ఈ ఇన్నింగ్స్‌లో బుమ్రా.. కొన్‌స్టాస్, హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీలను ఔట్ చేశాడు. ప్రస్తుతం ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది. ఆ జట్టు ఆధిక్యం 207 పరుగులుగా ఉంది. లబూషేన్ (48), కమిన్స్ (5) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా 4, సిరాజ్ 2 వికెట్లు పడగొట్టారు.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 82, రోహిత్ శర్మ 3, కేఎల్ రాహుల్ 24, విరాట్ కోహ్లి 36, ఆకాశ్‌దీప్ 0, రిషబ్ పంత్ 28, రవీంద్ర జడేజా 17, నితీశ్ రెడ్డి 114, వాషింగ్టన్ సుందర్ 50, బుమ్రా 0 పరుగులకు ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలాండ్, లయోన్ తలో 3 వికెట్లు పడగొట్టారు.దీనికి ముందు ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (140) సెంచరీతో సత్తా చాటగా.. సామ్ కొన్‌స్టాస్ (60), ఉస్మాన్ ఖ్వాజా (57), లబూషేన్ (72), కమిన్స్ (49), అలెక్స్ క్యారీ (31) రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా 4, రవీంద్ర జడేజా 3, ఆకాశ్‌దీప్ 2, సుందర్ ఓ వికెట్ పడగొట్టారు. -
యాక్షన్‌కు రియాక్షన్.. కొన్‌స్టాస్‌కు ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసిన బుమ్రా
బాక్సింగ్ డే టెస్ట్‌లో వాతావరణం వేడెక్కుతుంది. ఆసీస్ ఆటగాళ్ల ఓవరాక్షన్‌కు భారత ఆటగాళ్లు ధీటుగా సమాధానం చెబుతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటింగ్ చేస్తుండగా ఆసీస్ యువ ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్ బాగా అతి చేశాడు. స్టాండ్స్‌లో తమ అభిమానులను రెచ్చగొడుతూ భారత ఆటగాళ్లపై ఉసిగొల్పాడు. కొన్‌స్టాస్ చేసిన ఈ అతి చర్యకు భారత పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా ధీటుగా బదులిచ్చాడు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో కొన్‌స్టాస్‌కు బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం బుమ్రా కొన్‌స్టాస్‌ను ఇమిటేట్ చేస్తూ తనదైన శైలిలో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఈ తంతుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.Never mess with Virat Kohli and Indians pic.twitter.com/n2RXItIq2v— ` (@chixxsays) December 29, 2024కాగా, బుమ్రాకు వ్యక్తిగతంగా కూడా కొన్‌స్టాస్‌పై అసంతృప్తి ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో కొన్‌స్టాస్ బుమ్రాను ఎడాపెడా వాయించాడు. దీనికి బదులుగా బుమ్రా సెకెండ్ ఇన్నింగ్స్‌లో అద్భుతమైన బంతితో కొన్‌స్టాస్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. Jasprit Bumrah's triumphant payoff celebration lights up the MCG after taking Sam Konstas' wicket 🙌 pic.twitter.com/2yd5JvWLbZ— CricTracker (@Cricketracker) December 29, 2024మ్యాచ్ విషయానికొస్తే.. నితీశ్ సూపర్ సెంచరీ అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌటైంది. అనంతరం సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 43 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. కొన్‌స్టాస్‌ను (8) బుమ్రా.. ఖ్వాజాను (21) సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశారు. లబూషేన్ (20), స్టీవ్ స్మిత్ (2) క్రీజ్‌లో ఉన్నారు. నాలుగో రోజు లంచ్ విరామం సమయానికి ఆసీస్ స్కోర్ 53/2గా ఉంది. 105 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్ కలుపుకుని ప్రస్తుతం ఆసీస్ 158 పరుగుల ఆధిక్యంలో ఉంది.భారత తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 82, రోహిత్ శర్మ 3, కేఎల్ రాహుల్ 24, విరాట్ కోహ్లి 36, ఆకాశ్‌దీప్ 0, రిషబ్ పంత్ 28, రవీంద్ర జడేజా 17, నితీశ్ రెడ్డి 114, వాషింగ్టన్ సుందర్ 50, బుమ్రా 0 పరుగులకు ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలాండ్, లయోన్ తలో 3 వికెట్లు పడగొట్టారు.అంతకుముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (140) సెంచరీతో సత్తా చాటగా.. సామ్ కొన్‌స్టాస్ (60), ఉస్మాన్ ఖ్వాజా (57), లబూషేన్ (72), కమిన్స్ (49), అలెక్స్ క్యారీ (31) రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా 4, రవీంద్ర జడేజా 3, ఆకాశ్‌దీప్ 2, సుందర్ ఓ వికెట్ పడగొట్టారు. -
బుమ్రా బౌలింగ్‌లో చితక్కొట్టాడు.. సెహ్వాగ్‌ను గుర్తుచేస్తున్నాడు: భారత మాజీ క్రికెటర్
ఆస్ట్రేలియా యువ ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్(Sam Konstas)పై టీమిండియా మాజీ హెడ్‌కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. పందొమ్మిదేళ్ల ఈ యువ సంచలనం అద్భుత ఆట తీరుతో తనకు వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag)ను గుర్తుచేశాడని పేర్కొన్నాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లలో ఒకడైన జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) బౌలింగ్‌లోనూ చితక్కొట్టిన ఇలాంటి బ్యాటర్‌ను తాను చూడలేదంటూ కొన్‌స్టాస్‌ను రవిశాస్త్రి ఆకాశానికెత్తాడు.మెస్వీనీ స్థానంలోబోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియా సొంతగడ్డపై భారత్‌తో ఐదు టెస్టులు ఆడుతోంది. పెర్త్‌లో జరిగిన మొదటి మ్యాచ్ సందర్భంగా నాథన్ మెక్‌స్వీనీ ఆసీస్ తరఫున అరంగేట్రం చేయగా.. అడిలైడ్, బ్రిస్బేన్ టెస్టుల తర్వాత అతడిపై వేటు పడింది. వరుస ఇన్నింగ్స్‌లో విఫలమైన మెక్‌స్వీనీ స్థానంలో క్రికెట్ ఆస్ట్రేలియా సామ్ కొన్‌స్టాస్‌కు పిలుపునిచ్చింది.ఊహించని రీతిలో దంచికొట్టాడుఈ క్రమంలో మెల్బోర్న్లో గురువారం మొదలైన బాక్సింగ్ డే టెస్టు సందర్భంగా పందొమ్మిదేళ్ల ఈ కుర్రాడు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఆరంభంలో భారత బౌలర్లకు ఎదుర్కొనేందుకు కాస్త సమయం తీసుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆ తర్వాత ఊహించని రీతిలో దంచికొట్టాడు.బుమ్రాకే చుక్కలు చూపించాడుముఖ్యంగా బుమ్రాను కొన్‌స్టాస్ ఎదుర్కొన్న తీరు విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. 2021 సిడ్నీ టెస్టులో చివరిసారిగా బుమ్రా బౌలింగ్‌లో ఆసీస్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ సిక్స్ కొట్టగా... మూడేళ్ల తర్వాత మెల్బోర్న్ టెస్టులో మళ్లీ కొన్‌స్టాస్ రివర్స్ స్కూప్ ద్వారా సిక్స్ బాదాడు. తద్వారా తన బ్యాటింగ్ పవరేంటో చూపించాడు. మొత్తంగా 65 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లు, రెండు సిక్స్‌ల సాయంతో 60 పరుగులు సాధించాడు.ఈ నేపథ్యంలో రవిశాస్త్రి సామ్ కొన్‌స్టాస్ ఆట తీరును తనదైన శైలిలో విశ్లేషించాడు. ‘‘కేవలం టెస్టులే కాదు.. వన్డే, టీ20లలోనూ బుమ్రాను ఇలా ట్రీట్ చేసిన బ్యాటర్‌ను చూడలేదు. విధ్వంసకర షాట్లు ఆడటంలో అతడు తన స్వాగ్‌ను చూపించాడు. క్రికెట్ నిబంధనలనే మార్చేసేలా అతడి ఆట ఉందనడం అతిశయోక్తి కాదు.వీరేంద్ర సెహ్వాగ్ గుర్తుకు వచ్చాడుఒకానొక సమయంలో కొన్‌స్టాస్‌ను కట్టడి చేసేందుకు తమ వద్ద ప్రణాళికలు లేక టీమిండియా బిక్క ముఖం వేసినట్లు కనిపించింది. ఆరంభంలో అతడు రెండు షాట్లు మిస్ చేసినపుడు కనిపించిన ఆనందం.. కాసేపట్లోనే ఆవిరైంది. అతడు హిట్టింగ్ మొదలుపెట్టగానే నాకు వీరేంద్ర సెహ్వాగ్ జ్ఞప్తికి వచ్చాడు.క్రీజులో కుదురుకున్నాక వీరూ ఎంతగా వినోదం పంచుతాడో.. కొన్‌స్టాస్ కూడా అలాగే చేశాడు. ఆసీస్ జట్టులో కొన్‌స్టాస్ గనుక తన స్థానం సుస్థిరం చేసుకుంటే భవిష్యత్తులో అతడికి తిరుగు ఉండదు’’ అని కొన్‌స్టాస్‌పై రవిశాస్త్రి ప్రశంసల జల్లు కురిపించాడు. కాగా భారత లెఫ్టార్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా బౌలింగ్‌లో కొన్‌స్టాస్ లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే.చదవండి: విశ్రాంతి కాదు.. నిర్దాక్షిణ్యంగా అతడిపై వేటు వేయండి.. అప్పుడైనా..: టీమిండియా దిగ్గజంWHAT ARE WE SEEING! Sam Konstas just whipped Jasprit Bumrah for six 😱#AUSvIND | #PlayOfTheDay | @nrmainsurance pic.twitter.com/ZuNdtCncLO— cricket.com.au (@cricketcomau) December 26, 2024 -
చెప్పి మరీ.. అతడిపై వేటు వేయండి: టీమిండియా దిగ్గజం
టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్(Mohammed Siraj)ను ఉద్దేశించి భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ఘాటు విమర్శలు చేశాడు. అతడిపై నిర్దాక్షిణ్యంగా వేటు వేయాలని యాజమాన్యానికి సూచించాడు. విశ్రాంతి పేరిట పక్కన పెడుతున్నామని చెబితే సరిపోదని.. జట్టు నుంచి తప్పిస్తున్నామని స్పష్టంగా చెప్పాలంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు.ఆసీస్‌తో 1-1తో సమంగా టీమిండియాబోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy) ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన భారత జట్టు.. పెర్త్‌లో గెలుపొంది శుభారంభం చేసింది. అయితే, అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టులో ఓటమి చెందిన రోహిత్ సేన.. బ్రిస్బేన్‌లో మూడో టెస్టును డ్రా చేసుకుంది. దీంతో ప్రస్తుతం ఆసీస్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో 1-1తో సమంగా ఉంది.బుమ్రాపై అదనపు భారం మోపుతున్న సిరాజ్? అయితే, ఈ సిరీస్‌లో భారత పేసర్ సిరాజ్ ఇప్పటి వరకు ఏడు ఇన్నింగ్స్‌లో కలిపి పదమూడు వికెట్లు తీశాడు. కానీ కొత్త బంతితో మ్యాజిక్ చేయలేకపోతున్న ఈ హైదరాబాదీ బౌలర్.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై అదనపు భారం మోపుతున్నాడనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కీలక సమయంలో సిరాజ్ వికెట్లు తీయకపోవడంతో బుమ్రాపై పనిభారం ఎక్కువవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.వేటు వేస్తున్నామని స్పష్టంగా చెప్పండిఈ నేపథ్యంలో కామెంటేటర్ సునిల్ గావస్కర్(Sunil Gavaskar Comments) మాట్లాడుతూ.. ‘‘సిరాజ్‌కు బ్రేక్ ఇవ్వాలి. నా ఉద్దేశం.. విశ్రాంతి పేరిట పక్కన పెట్టాలని కాదు. ‘నీ ఆట తీరు బాగాలేదు. కాబట్టి నిన్ను జట్టు నుంచి తప్పిస్తున్నాం’ అని స్పష్టంగా అతడికి చెప్పాలి.కొన్నిసార్లు ఆటగాళ్ల పట్ల కాస్త పరుషంగా వ్యవహరించడంలో తప్పులేదు. ఎందుకంటే.. విశ్రాంతినిస్తున్నామని చెబితే.. వాళ్లు మరోలా ఊహించుకుంటారు. కాబట్టి వేటు వేస్తున్నామని వారికి తెలిసేలా చేయాలి.సిరాజ్ స్థానంలో వారిని తీసుకోండి అప్పుడే వారిలో కసి పెరుగుతుంది. కచ్చితంగా ఆట తీరును మెరుగుపరచుకుంటారు’’ అని పేర్కొన్నాడు. జట్టులో మార్పులు చేయాలనుకుంటే.. సిరాజ్‌ను తప్పించి ప్రసిద్ కృష్ణ లేదంటే హర్షిత్ రాణాను పిలిపించాలని గావస్కర్ ఈ సందర్భగా సూచించాడు. బుమ్రాకు వారు సపోర్టుగా ఉంటారని పేర్కొన్నాడు. బాక్సింగ్ డే టెస్టులో రెండో రోజూ ఆసీస్దేకాగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య గురువారం బాక్సింగ్ డే టెస్టు మొదలైంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసే సరికి ఆసీస్ పటిష్ట స్థితిలోనే ఉంది.తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగుల మేర భారీ స్కోరు సాధించిన కంగారూ జట్టు.. శుక్రవారం నాటి ఆట పూర్తయ్యేసరికి సగం వికెట్లు తీసి భారత్‌ను దెబ్బకొట్టింది. ఆసీస్ బౌలర్లలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్, మరో పేసర్ స్కాట్ బోలాండ్ చెరో రెండు వికెట్లు తీయగా.. 46 ఓవర్లలో టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(82) రనౌట్ కావడంతో భారత్‌కు గట్టి షాక్ తగిలింది.చదవండి: కోహ్లికి అవమానం.. ఇంత నీచంగా ప్రవర్తిసారా?.. తగ్గేదేలే అంటూ దూసుకొచ్చిన కింగ్ -
కోహ్లితో గొడవ.. ఆసీస్ యువ ఓపెనర్ స్పందన ఇదే
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లితో జరిగిన వాగ్వాదం(Virat Kohli- Sam Konstas Altercation)పై ఆస్ట్రేలియా యువ ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్ స్పందించాడు. ఆటలో ఇలాంటివి సహజమేనని పేర్కొన్నాడు. అయితే, భావోద్వేగాలు అదుపులో లేకపోవడం వల్లే తామిద్దరం అలా గొడవపడ్డామని తెలిపాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా భారత జట్టు ఆసీస్‌తో ఐదు టెస్టులు ఆడుతోంది.అరంగేట్రంలోనే అదుర్స్ఇప్పటి వరకు మూడు టెస్టులు జరుగగా ఇరుజట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ఈ క్రమంలో భారత్- ఆసీస్ మధ్య మెల్బోర్న్లో గురువారం నాలుగో టెస్టు మొదలైంది. ఈ మ్యాచ్ సందర్భంగా 19 ఏళ్ల సామ్ కొన్‌స్టాస్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. దూకుడైన ఆటతో తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు.ముఖ్యంగా టీమిండియా పేస్ దళ నాయకుడు, ప్రపంచంలోనే అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడైన జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)ను సామ్ ఎదుర్కొన్న తీరు విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. టీ20 తరహాలో దంచికొట్టిన సామ్ కొన్‌స్టాస్ 65 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 60 పరుగులు సాధించాడు. అరంగేట్రంలోనే హాఫ్ సెంచరీలు బాది పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు.అయితే, సామ్ కొన్‌స్టాస్ ఏకాగ్రతను దెబ్బతీసే క్రమంలో విరాట్ కోహ్లి వ్యవహరించిన తీరు విమర్శలకు తావిచ్చింది. దూకుడు మీదున్న సామ్‌కు భుజాలు తాకిస్తూ కోహ్లి కాస్త దుందుడుకుగా ప్రవర్తించినట్లు కనిపించింది. సామ్ కూడా అతడికి అంతే గట్టిగా బదులివ్వగా వాగ్వాదం జరిగింది. ఇంతలో ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా, అంపైర్ జోక్యం చేసుకుని ఇద్దరినీ శాంతపరిచారు.కోహ్లికి ఐసీసీ షాక్ఇక ఈ ఘటన నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి విరాట్ కోహ్లికి షాకిచ్చింది. మ్యాచ్ ఫీజులో ఇరవై శాతం మేర కోత విధించింది. ఇదిలా ఉంటే.. తన అభిమాన క్రికెటర్‌తో గొడవపై సామ్ కొన్‌స్టాస్ స్పందించిన తీరు క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకుంది.నేను గ్లోవ్స్ సరిచేసుకుంటున్నారవీంద్ర జడేజా బౌలింగ్‌లో తాను అవుటైన తర్వాత.. కోహ్లితో గొడవ గురించి సామ్ కొన్‌స్టాస్ మాట్లాడుతూ.. ‘‘ఆ సమయంలో మేమిద్దరం భావోద్వేగంలో మునిగిపోయి ఉన్నామేమో!.. అప్పుడు నేను గ్లోవ్స్ సరిచేసుకుంటున్నా. ఆ సమయంలో అతడు వస్తున్నట్లు గమనించలేకపోయా. అయినా క్రికెట్లో ఇవన్నీ సహజమే’’ అని 7క్రికెట్‌తో వ్యాఖ్యానించాడు. కాగా కోహ్లి తన అభిమాన క్రికెటర్ అని సామ్ గతంలో చెప్పిన విషయం తెలిసిందే.బుమ్రా వరల్డ్‌క్లాస్ బౌలర్అదే విధంగా తన ప్రణాళికల గురించి ప్రస్తావన రాగా.. ‘‘బుమ్రా వరల్డ్‌క్లాస్ బౌలర్. అయితే, అతడిపై ఒత్తిడి పెంచగలిగితేనే నేను పైచేయి సాధించగలనని తెలుసు. అందుకే దూకుడుగా ఆడుతూ.. అతడిని డిఫెన్స్‌లో పడేలా చేశాను. నిజానికి మ్యాచ్‌కు ముందు నేనేమీ ప్రత్యేక ప్రణాళికలు రచించుకోలేదు’’ అని సామ్ కొన్‌స్టాస్ పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. బాక్సింగ్ డే టెస్టులో తొలిరోజు ఆట పూర్తయ్యేసరికి 86 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి ఆసీస్ 311 పరుగులు చేసింది. భారత బౌలర్లు బుమ్రా మూడు, ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ తీశారు.చదవండి: గల్లీ క్రికెట్ ఆడుతున్నావా?.. చెప్పింది చెయ్: రోహిత్ శర్మ ఫైర్The man of the moment 👊Sam Konstas chats with @copes9 about his first Test innings...And everything else that happened during it as well #AUSvIND pic.twitter.com/v7hhwMWgtB— 7Cricket (@7Cricket) December 26, 2024