
టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా మరోసారి తన మార్క్ చూపించాడు. ఆసియాకప్-2025లో భాగంగా యూఏఈతో జరుగుతున్న మ్యాచ్‌లో అద్బుతమైన యార్కర్‌తో మెరిశాడు. అతడి వేసిన బంతికి యూఏఈ బ్యాటర్ అలీషన్ షరాఫు వద్ద సమాధానమే లేకుండా పోయింది.
యూఏఈ ఇన్నింగ్స్ 4వ ఓవర్ వేసిన బుమ్రా.. నాలుగో డెలివరీని అలీషన్‌కు సూపర్ యార్కర్‌గా సంధించాడు. అలీషన్ షరాఫు తన బ్యాట్‌ను కిందకు దించే లోపు బంతి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. దెబ్బకు యూఏఈ బ్యాటర్ బిత్తర పోయాడు. దీంతో అలీషన్(17 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 22) ధానాదన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
కాగా వర్క్‌లోడ్ మెనెజ్‌మెంట్‌లో భాగంగా ఇంగ్లండ్ పర్యటనలో మధ్యలోనే వచ్చేసిన బుమ్రాకు ఇదే తొలి మ్యాచ్. అయితే యూఏఈతో మ్యాచ్‌కు బుమ్రాకు విశ్రాంతి ఇస్తారని వార్తలు వచ్చాయి. కానీ టీమ్‌మెనెజ్‌మెంట్ బుమ్రాకు మొదటి మ్యాచ్‌లో ఆడించి యువ పేసర్ అర్ష్‌దీప్‌ను బెంచ్‌కే పరిమితం చేసింది. ఈ మ్యాచ్‌లో మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా.. 19 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు.
ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ 13.1 ఓవర్లలో కేవలం 57 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి పతనాన్ని శాసించాడు. అతడితో పాటు శివమ్ దూబే మూడు, అక్షర్ పటేల్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి తలా వికెట్ సాధించాడు. యూఏఈ బ్యాటర్లలో అలీషన్ షరాఫు(22) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.
Jasprit Bumrah and knocking stumps over — name a better combo 💥
Watch #DPWORLDASIACUP2025 - LIVE on #SonyLIV & #SonySportsNetwork TV Channels 📺#AsiaCup #INDvUAE pic.twitter.com/q3wrec57d2— Sony LIV (@SonyLIV) September 10, 2025