అండర్-19 ఆసియా కప్ 2025లో భారత యువ జట్టు జైత్ర యాత్ర కొనసాగుతోంది. మంగళవారం దుబాయ్ వేదికగా మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో 315 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. 409 పరుగుల లక్ష్య చేధనలో మలేషియా 32.1 ఓవర్లలో కేవలం 93 పరుగులకే కుప్పకూలింది.
దీపేష్ దేవేంద్రన్ 5 వికెట్లతో ప్రత్యర్ది జట్టు పతనాన్ని శాసించగా.. ఉద్దవ్ మోహన్ రెండు, ఖిలాన్ పటేల్, కనిష్క్ చౌహన్ తలా వికెట్ సాధించారు. మలేషియా బ్యాటర్లలో హంజా పంగి 35 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అభిజ్ఞాన్ డబుల్ సెంచరీ..
ఇక టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ అండర్-19 జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 408 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. భారత వికెట్ కీపర్ బ్యాటర్ అభిజ్ఞాన్ కుందు అద్భుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు. 125 బంతులు ఆడిన అభిజ్ఞాన్ 17 ఫోర్లు, 9 సిక్సర్లతో 209 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
అతడితో పాటు వేదాంత్ త్రివేది (106 బంతుల్లో 90 పరుగులు), వైభవ్ సూర్యవంశీ (50 పరుగులు) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. వేదాంత్, అభిజ్ఞాన్ నాలుగో వికెట్‌కు ఏకంగా 209 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మలేషియా బౌలర్ మొహమ్మద్ అక్రమ్ ఐదు వికెట్లు పడగొట్టాడు.
చదవండి: IPL 2026: రూ.30 లక్షలతో ఎంట్రీ.. కట్ చేస్తే! ఏకంగా రూ.14.20 కోట్లు


