breaking news
Asia Cup 2025
-
రింకూ సింగ్ విధ్వంసకర సెంచరీ.. 8 సిక్స్‌లతో వీర వీహారం! వీడియో
ఆసియాకప్-2025కు ముందు టీమిండియా బ్యాటర్ రింకూ సింగ్ విధ్వంసం సృష్టించాడు. యూపీ టీ20 లీగ్-2025లో మీరట్ మావెరిక్స్ సారథ్యం వహించిన రింకూ సింగ్.. గురువారం గౌర్ గోరఖ్ పూర్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు.168 పరుగుల లక్ష్య చేధనలో ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రింకూ పత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. లక్నోలని ఎకానా స్టేడియంలో రింకూ బౌండరీల వర్షం కురిపించాడు. ఓటమి ఖాయమైన చోట ఈ లెఫ్ట్ హ్యాండర్ తన తుపాన్ ఇన్నింగ్స్‌తో అద్భుతం చేశాడు.కేవలం 48 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సింగ్.. 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 108 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. దీంతో 168 పరుగుల టార్గెట్‌ను మీరట్ మావెరిక్స్ 4 వికెట్లు కోల్పోయి చేధించింది. గోరఖ్ పూర్ బౌలర్లలో ప్రిన్స్ యాదవ్, అనికిత్ చౌదరీ, ఏ రెహమన్, విజయ్ యాదవ్ తలా వికెట్ సాధించారు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన గోరఖ్ పూర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. గోరఖ్‌పూర్ కెప్టెన్ ధ్రువ్ జురెల్(38) టాప్ స్కోరర్‌గా నిలవగా.. నిశాంత్ కుష్వాహా(37), శివమ్ శర్మ(25) రాణించారు. మీరట్ బౌలర్లలో విశాల్ చౌదరి, విజయ్ కుమార్ తలా మూడు వికెట్లు పగొట్టగా.. జీసన్ అన్సారీ రెండు వికెట్లను తీశాడు.ఇక ఇది ఇలా ఉండగా.. ఆసియాకప్‌నకు ప్రకటించిన 15 మంది సభ్యుల భారత జట్టులో రింకూ సింగ్‌కు చోటు దక్కింది. అయితే ఫామ్లేనప్పటికి రింకూకు ఛాన్స్ ఇవ్వడాన్ని చాలా మంది తప్పుబట్టారు. కానీ ఇప్పుడు తనపై విమర్శలు చేసిన వారికి రింకూ బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు.ఆసియా కప్ టీ20-2025 టోర్నమెంట్‌కు భారత జట్టుసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.చదవండి: UPT20: రింకూ సింగ్ విధ్వంసకర సెంచరీ.. 8 సిక్స్‌లతో వీర వీహారం! వీడియోChasing a target of 168, Rinku walks in at 38-4. Scores unbeaten 108 off 48. Wins the game in the 19th over. 🤯The One. The Only. RINKU SINGH! 🦁 💜pic.twitter.com/YCjQcLMcaH— KolkataKnightRiders (@KKRiders) August 21, 2025 -
Asia Cup 2025: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌కు గ్రీన్ సిగ్నల్
ఆసియా కప్-2025లో భారత్, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. పీటీఐ నివేదిక ప్రకారం.. ఖండాంతర టోర్నీలో దాయాదితో సమరానికి భారత క్రీడా మంత్రిత్వ శాఖ అనుమతిచ్చింది. బహుళ దేశాలు పాల్గొనే టోర్నీలో టీమిండియా పాక్‌తో ఆడితే ఆపబోమని స్పష్టం చేసింది. అయితే పాక్‌తో ఏ క్రీడలో అయినా ద్వైపాక్షిక సిరీస్‌లు మాత్రం ఉండవవి తేల్చి చెప్పింది. వారు తమ గడ్డపై అడుగు పెట్టడానికి కానీ.. భారత జట్టు పాక్‌లో ఆడటానికి కానీ ఎట్టి పరిస్థితుల్లో అనుమతివ్వబోమని తెలిపింది. అంతర్జాతీయ టోర్నీల్లో, తటస్థ వేదికలపై పాకిస్తాన్‌తో మ్యాచ్‌లు ఆడితే అభ్యంతరం లేదని పేర్కొంది. ఈ లెక్కన సెప్టెంబర్ 14న దుబాయ్‌లో జరుగబోయే భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు లైన్ క్లియర్ అయినట్లే.కాగా, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆసియా కప్‌లో భారత్, పాక్ మ్యాచ్‌పై అనుమానాలు ఉండేవి. ఈ టోర్నీలో టీమిండియా పాక్‌తో ఆడేందుకు భారత ప్రభుత్వం అనుమతించదని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారానికి చెక్ పెడుతూ భారత క్రీడా మంత్రిత్వ శాఖ టీమిండియాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఆసియా కప్ టోర్నీ సెప్టెంబర్ 9 నుంచి దుబాయ్, అబుదాబీ వేదికలుగా జరుగనుంది. ఈ టోర్నీలో భారత్, పాక్ ఒకే గ్రూప్‌లో (ఏ) ఉన్నాయి. టీమిండియా సెప్టెంబర్ 10న దుబాయ్ వేదికగా యూఏఈతో తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. అనంతరం సెప్టెంబర్ 14న పాకిస్తాన్‌తో.. సెప్టెంబర్ 19న ఒమన్‌తో టీమిండియా తలపడనుంది. ఈ టోర్నీ కోసం భారత జట్టును ఆగస్ట్ 19న ప్రకటించారు.ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు..సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్‌కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్‌కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్ -
Asia Cup: ‘ఆఖరి నిమిషంలో కూడా మనసు మార్చుకోవచ్చు’
ఆసియా కప్-2025 (Asia Cup)టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ దిగ్గజ పేసర్ వసీం అక్రం (Wasim Akram) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మెగా ఈవెంట్లో భారత్- పాకిస్తాన్ మ్యాచ్ ఆఖరి నిమిషంలో రద్దైనా ఆశ్చర్యపోనక్కర్లేదన్నాడు. ఏనాటికైనా పరిస్థితులు చక్కబడి దాయాదులు టెస్టు సిరీస్‌లో పోటీపడితే చూడాలని ఉందని తెలిపాడు.ఎనిమిది జట్లుఈసారి టీ20 ఫార్మాట్లో ఆసియా కప్ టోర్నీ నిర్వహించనున్నారు. భారత్ ఆతిథ్య హక్కులు దక్కించుకున్నా.. పాక్ క్రికెట్ బోర్డుతో ఒప్పందం ప్రకారం తటస్థ వేదికైన యూఏఈలో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ ఖండాంతర టోర్నీలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గనిస్తాన్‌లతో పాటు ఒమన్, హాంకాంగ్, యూఏఈ పాల్గొంటున్నాయి.అఫ్గనిస్తాన్- హాంకాంగ్ మ్యాచ్‌తో ఆసియా కప్ టోర్నీకి సెప్టెంబరు 9న తెరలేవనుండగా.. 28న ఫైనల్‌తో ముగుస్తుంది. ఇక ఈ ఈవెంట్లో చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ సెప్టెంబరు 14న తొలిసారి తలపడనున్నాయి. అన్నీ సజావుగా సాగితే మరో రెండుసార్లు దాయాదులు పరస్పరం ఢీకొట్టే అవకాశం ఉంది.అయితే, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరుదేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రీడల్లో ఏ స్థాయిలోనూ పాకిస్తాన్‌తో ఆడొద్దనే డిమాండ్లు వెల్లువెత్తాయి. కానీ.. ఆసియా కప్ టోర్నీలో పాక్‌తో మ్యాచ్‌ను బహిష్కరించే పరిస్థితి కనబడటం లేదు. ఏదేమైనా భారత ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే బీసీసీఐ ఈ విషయంలో నిర్ణయం తీసుకోనుంది.ఈ నేపథ్యంలో పాక్ లెజెండ్ వసీం అక్రం స్పందిస్తూ.. ‘‘ఆసియా కప్ షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. దీనిపై వ్యతిరేకత కూడా వస్తోంది. అయితే, పాకిస్తాన్లో మేము మాత్రం సైలైంట్‌గానే ఉన్నాము. ఆఖరి నిమిషంలో కూడా మనసు మార్చుకోవచ్చుఒకవేళ వాళ్లు మాతో మ్యాచ్ ఆడినా.. ఆడకపోయినా ఓకే. ఆఖరి నిమిషంలో వారు మనసు మార్చుకున్నా ఆట ముందుకు సాగుతూనే ఉంటుంది. అయితే, నా జీవితకాలంలో భారత్- పాకిస్తాన్ మధ్య టెస్టు సిరీస్ జరిగితే చూడాలని ఉంది’’ అని ఓ పాడ్‌కాస్ట్‌లో వ్యాఖ్యానించాడు.అదే విధంగా.. ‘‘రాజకీయాలు వేరు. వాటి గురించి నాకు తెలియదు. వాళ్లు వారి దేశం గురించి ఆలోచిస్తున్నారు. అలాగే మేము కూడా. అయితే, అంతకు మించి ఎక్కువ మాట్లాడకూడదు. ఎవరైనా సరే తమ దేశం సాధించిన విజయాల గురించి తలచుకోవడానికే ఇష్టపడతారు. అక్కడితో ఆగిపోతే అంతా బాగుంటుంది’’ అని వసీం అక్రం చెప్పుకొచ్చాడు.కాగా భారత్- పాకిస్తాన్ చివరగా ఈ ఏడాది ఫిబ్రవరిలో యూఏఈ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో ముఖాముఖి తలపడ్డాయి. దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి సెంచరీతో చెలరేగి.. టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. పాక్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందిన రోహిత్ సేన.. ఆ తర్వాత వరుస విజయాలతో చాంపియన్‌గా నిలిచింది.చదవండి: Asia Cup 2025: ‘చెత్త సెలక్షన్.. అతడంటే ఎవరికి ఇష్టమో అందరికీ తెలుసు’ -
‘నోటికొచ్చినట్లు వాగొద్దు.. టీమిండియాకు దొరికిన వజ్రం అతడు’
టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)పై గత కొన్నాళ్లుగా విమర్శల వర్షం కురుస్తోంది. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఐదింట అతడు మూడు టెస్టులు మాత్రమే ఇందుకు ప్రధాన కారణం. వర్క్‌లోడ్ మేనేజ్మెంట్ కోసమే బుమ్రా విషయంలో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ముందుగానే ప్రకటించాడు.ఆడితే ఓడటమేఅందుకు తగినట్లుగానే ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో లీడ్స్, లార్డ్స్, మాంచెస్టర్ టెస్టుల్లోనే బుమ్రా ఆడాడు. అతడు ఆడిన ఈ మ్యాచ్‌లలో రెండింట టీమిండియా ఓడింది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు బుమ్రా తనకు నచ్చినపుడు విశ్రాంతి తీసుకుని.. నచ్చినపుడు ఆడటాన్ని విమర్శించారు. మరికొందరు మాత్రం బుమ్రా ఆడితేనే టెస్టుల్లో భారత జట్టుకు ఓటమి తప్పదని ట్రోల్ చేశారు.నోటికొచ్చినట్లు వాగొద్దుఇక ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను శుబ్‌మన్ గిల్ సేన 2-2తో సమం చేసింది. తదుపరి టీమిండియా ఆసియా టీ20 కప్ టోర్నీ ఆడనుండగా.. బుమ్రా ఈ జట్టులో భాగంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ బుమ్రా విమర్శకులకు ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు.‘‘ఇంగ్లండ్‌లో బుమ్రా ఆడని మ్యాచ్‌లలోనే టీమిండియా గెలిచిందని నోటికొచ్చినట్లు మాట్లాడేవాళ్లు.. నోళ్లు తెరిచేముందు కాస్త జాగ్రత్తగా ఉండలి. బుమ్రా ఒక్కడే ఫార్మాట్లకు అతీతంగా జట్టును ఎన్నిసార్లు గెలిపించాడో మీకు తెలుసా?టీమిండియాకు దొరికిన అరుదైన వజ్రంఅతడొక మ్యాచ్ విన్నర్. టీమిండియాకు దొరికిన అరుదైన వజ్రం. అతడి గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు. అతడి కెరీర్‌పై ఒక్క మచ్చ కూడా లేదు. తనెంతో అంకితభావం గల ఆటగాడు’’ అని బుమ్రాపై కైఫ్ ప్రశంసల వర్షం కురిపించాడు.ఇక ఆసియా కప్ టోర్నీలో బుమ్రా అన్ని మ్యాచ్‌లు ఆడాల్సిన అవసరం లేదన్న కైఫ్.. ఒమన్, యూఏఈ వంటి జట్లతో ఆడేటపుడు విశ్రాంతి తీసుకోవచ్చని అభిప్రాయపడ్డాడు. ఈసారి టోర్నీ టీ20 ఫార్మాట్లో జరుగుతుంది కాబట్టి.. ఒక్కో మ్యాచ్‌లో కేవలం నాలుగు ఓవర్లే వేయాల్సి ఉన్నందున సమస్య ఉండదని పేర్కొన్నాడు.యూఏఈ వేదికగా..ఏదేమైనా భారత టీ20 జట్టులో బుమ్రా పాత్ర ముఖ్యమని.. అతడు లేని జట్టును ఊహించుకోలేమని కైఫ్ పేర్కొన్నాడు. కాగా సెప్టెంబరు 9- 28 వరకు యూఏఈ వేదికగా ఆసియా కప్-2025 టోర్నీకి షెడ్యూల్ ఖరారైంది. కాగా ఇప్పటి వరకు తన కెరీర్లో 70 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా.. 89 వికెట్లు కూల్చాడు. ఇక ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ రైటార్మ్ పేసర్ 145 మ్యాచ్‌లలో కలిపి 183 వికెట్లు కూల్చాడు.చదవండి: Asia Cup: టీమిండియాలో దక్కని చోటు: శ్రేయస్ అయ్యర్ రియాక్షన్ వైరల్ -
టీమిండియాలో దక్కని చోటు: శ్రేయస్ అయ్యర్ రియాక్షన్ వైరల్
భారత క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా ఉన్న పేరు శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer). ఈ ముంబై బ్యాటర్ నిలకడగా రాణిస్తూ.. అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నా ఆసియా కప్-2025 (Asia Cup)లో పాల్గొనే భారత జట్టులో మాత్రం అతడికి చోటు దక్కలేదు.పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ టీమ్‌లో అతడికి స్థానం ఇవ్వలేకపోయామని.. అతడు ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందేనని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) కుండబద్దలు కొట్టేశాడు. ఈ నేపథ్యంలో సెలక్టర్లు, మేనేజ్మెంట్ తీరుపై మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రేయస్ వంటి అద్భుత నైపుణ్యాలున్న ఆటగాడిని పక్కనపెట్టడం సరికాదని విమర్శిస్తున్నారు.శ్రేయస్ అందరిలా కాదుఅయితే, అభిమానులు మాత్రం ఈ విషయంపై శ్రేయస్ అయ్యర్ రియాక్షన్ కోసం ఎదురుచూస్తున్నారు. సాధారణంగా చాలా మంది క్రికెటర్లు ఇలాంటి సమయాల్లో సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా తమ ఆవేదనను పంచుకుంటూ.. అందుకు కారణమైన వారిని విమర్శిస్తారు. కానీ శ్రేయస్ మాత్రం ఇందుకు భిన్నం.కూల్‌గా, కామ్‌గా ఉంటూ.. ఆటతోనే తానేంటో నిరూపించుకుని తన విలువను చాటుకుంటాడు. ఏదేమైనా.. పైకి ఎంత గంభీరంగా కనిపించినా లోలోపల నిరాశ చెందడం సహజం. శ్రేయస్ అయ్యర్ తండ్రి సంతోశ్ అయ్యర్ ఈ మాటే అంటున్నాడు.శ్రేయస్ ఇంకేం చేయాలి?ఆసియా కప్-2025 జట్టులో తన కుమారుడికి చోటు దక్కకపోవడంపై సంతోశ్ అయ్యర్ తాజాగా స్పందించాడు. టీమిండియాకు ఎంపిక కాకపోవడం వల్ల శ్రేయస్ స్పందన ఎలా ఉందో వివరించాడు. ఈ మేరకు.. ‘‘భారత టీ20 జట్టులోకి తిరిగి రావాలంటే శ్రేయస్ ఇంకేం చేయాలో నాకైతే అర్థం కావడం లేదు.ఐపీఎల్లో గత కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఫైనల్‌కు తీసుకువెళ్లాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు టైటిల్ అందించాడు. ఈసారి పంజాబ్ కింగ్స్‌ను కూడా ఫైనల్‌కు చేర్చాడు. కెప్టెన్‌గా గొప్ప విజయాలు సాధించాడు. బ్యాటర్‌గానూ ఆకట్టుకున్నాడు.నా కుమారుడిని టీమిండియా సారథిని చేయమని నేను అడగడం లేదు. కనీసం జట్టులో చోటైనా ఇవ్వాలి కదా!.. భారత జట్టులో చోటు కోల్పోయినపుడు కూడా తన ముఖంలో ఎవరి పట్ల ఎలాంటి తిరస్కార భావం కనిపించదు.టీమిండియా స్టార్ రియాక్షన్ ఇదే‘ఇదంతా నా రాత! దీనికి నువ్వేం చేయగలవు? ఇపుడు మనమేమీ చేయలేము’ అంటాడు. ఎప్పటిలాగే ఇప్పుడూ అలాగే అన్నాడు. కూల్‌గా, కామ్‌గా ఉంటాడు. ఎవరినీ నిందించడు. కానీ లోలోపల.. జట్టుకు ఎంపిక కాలేకపోయాననే బాధ వాడిని వెంటాడుతూనే ఉంటుంది’’ అని సంతోశ్ అయ్యర్ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో పేర్కొన్నాడు.కాగా శ్రేయస్ అయ్యర్ చివరగా టీమిండియా తరఫున ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడాడు. ఈ వన్డే టోర్నీలో భారత్‌ను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. 243 పరుగులతో రాణించి భారత్ తరఫున టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఐపీఎల్-2025లో పంజాబ్‌కు ఆడిన శ్రేయస్ అయ్యర్.. 604 పరుగులతో సత్తా చాటాడు.చదవండి: Asia Cup 2025: ‘చెత్త సెలక్షన్.. అతడంటే ఎవరికి ఇష్టమో అందరికీ తెలుసు’ -
‘చెత్త సెలక్షన్.. అతడంటే ఎవరికి ఇష్టమో అందరికీ తెలుసు’
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్‌కు ఎంపిక చేసిన భారత జట్టుపై విమర్శలు కొనసాగుతున్నాయి. శుబ్‌మన్ గిల్ (Shubman Gill) వైస్ కెప్టెన్సీ, శ్రేయస్ అయ్యర్‌కు మొండిచేయి చూపడం గురించి ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయి.అదే విధంగా.. యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal), ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్‌లను కేవలం స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపిక చేయడం.. పేసర్ల విభాగంలో హర్షిత్ రాణాకు చోటు దక్కడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌ను ఉద్దేశించి నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు.ఐపీఎల్-2025లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్‌లను సెలక్టర్లు పక్కకు పెట్టడాన్ని బద్రీనాథ్ తప్పుబట్టాడు. గంభీర్ ఆశీసులు ఉండటం వల్లే హర్షిత్‌కు స్థానం దక్కిందని పరోక్షంగా కామెంట్లు చేశాడు.అతడంటే ఎవరికి ఇష్టమో అందరికీ తెలుసుఈ మేరకు.. ‘‘హర్షిత్ రాణా అంటే ఎవరికీ బాగా ఇష్టమో అందరికీ తెలుసు. అందుకే అతడికి వరుస అవకాశాలు వస్తునఆయి. ఐపీఎల్లో చెత్తగా ఆడినా అతడికి చోటిచ్చారు. ప్రసిద్ కృష్ణ ఐపీఎల్లో, ఇంగ్లండ్ సిరీస్‌లో అదరగొట్టినా ప్రధాన జట్టులో అతడికి స్థానమే లేదు.రాణా ఈ జట్టులోకి ఎలా వచ్చాడో నేను అర్థం చేసుకోగలను. కచ్చితంగా ఇదొక చెత్త సెలక్షన్. సిరాజ్, ప్రసిద్లు ఏం తప్పు చేశారు?మహ్మద్ సిరాజ్ వంటి గొప్ప బౌలర్‌ను కూడా పక్కనపెట్టాడు. ఒకవేళ వర్క్‌లోడ్ కారణంగా సిరాజ్‌కు విశ్రాంతినిచ్చారని అనుకుంటే.. ప్రసిద్ కృష్ణ ఉన్నాడు కదా! అయినా సరే హర్షిత్ రాణాకే పెద్దపీట వేశారు’’ అని బద్రీనాథ్ హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌పైకి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాడు.గంభీర్ ప్రోత్సాహంకాగా కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్‌గా ఉన్న సమయంలో ఆ జట్టులో ఉన్న హర్షిత్ రాణాను గంభీర్ ప్రోత్సహించాడు. గంభీర్ మార్గనిర్దేశనంలో రాణించిన ఈ ఢిల్లీ ఎక్స్‌ప్రెస్.. గంభీర్ టీమిండియా హెడ్‌కోచ్ అయిన తర్వాత ఏకంగా జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. టెస్టు, వన్డే, టీ20లలో అరంగేట్రం చేశాడు. అయితే, ఈ ఏడాది ఐపీఎల్లో హర్షిత్ కేవలం పదిహేను వికెట్లు మాత్రమే తీయగలిగాడు. మరోవైపు.. గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన కర్ణాటక పేసర్ ప్రసిద్... 25 వికెట్లతో చెలరేగి పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు.ఆసియా కప్ టీ20-2025 టోర్నీకి టీమిండియాసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.రిజర్వు ప్లేయర్లు: ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.చదవండి: టీమిండియా వన్డే కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్? -
'సెలక్టర్లు తప్పు చేశారు.. ఆ డేంజరస్ ప్లేయర్‌ను ఎంపిక చేయాల్సింది'
ఆసియాకప్-2025 కోసం భారత జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ మంగళవారం ప్రకటించింది. ఈ జట్టు ఎంపికపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ జట్టుకు వైస్‌కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపికచేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. అంతేకాకుండా ఈ ఖండాంత టోర్నీకి స్టార్ ప్లేయర్లు యశస్వి జైశ్వాల్, శ్రేయస్ అయ్యర్‌లను ఎంపిక చేయకపోవడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలో సెలక్షన్ కమిటీపై భారత మాజీ క్రికెటర్ మదన్ లాల్ ప్రశ్నల వర్షం కురిపించారు. జైశ్వాల్‌కు చోటు దక్కకపోవడం, హార్దిక్ పాండ్యాను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించడం తనని ఆశ్చర్యపరిచిందని మదన్ లాల్ అన్నారు.కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత భారత జట్టు వైస్ కెప్టెన్సీ నుంచి పాండ్యాను బీసీసీఐ తప్పించింది. టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్, అతడి డిప్యూటీగా అక్షర్ పటేల్‌ను అజిత్ అగార్కకర్ అండ్ కో నియమించింది. కానీ ఇప్పుడు మాత్రం సూర్యకు డిప్యూటీగా శుబ్‌మన్ గిల్‌ను ఎంపిక చేశారు. దీనిబట్టి భవిష్యత్తులో టీ20 జట్టు పగ్గాలు కూడా గిల్ చేపట్టే అవకాశముంది."యశస్వి జైశ్వాల్ లాంటి అద్భుతమైన ఆటగాడు జట్టులో లేకపోవడం చూసి నేను షాకయ్యాను. జైశూ ఆరంభం నుంచే ఫియర్ లెస్ క్రికెట్ ఆడుతాడు. అతడు టెస్టుల్లో కూడా ఇదే తరహాలో బ్యాటింగ్ చేస్తున్నారు. సెలక్టర్లు అతడికి విశ్రాంతి ఇచ్చారో లేదా కావాలనే పక్కన పెట్టారో తెలియదు. అతడిని ఆసియాకప్‌నకు ఎంపిక చేసి ఉంటే బాగుండేంది.అదేవిధంగా హార్దిక్ పాండ్యాను వైస్ కెప్టెన్‌గా ఎందుకు తొలగించారో నాకు ఇప్పటికీ ఆర్ధం కావడం లేదు. కానీ వైస్ కెప్టెన్‌గా గిల్ ఎంపిక సరైన నిర్ణయమే. ఎందుకంటే అతడు ప్రస్తుతం బాగా రాణిస్తున్నాడు. రాబోయే కాలంలో గిల్ మూడు ఫార్మాట్లలోనూ ఆడే అవకాశం ఉంది. మ్యాచ్ విన్నర్లు ప్రతీ ఫార్మాట్లోనూ ఆడాలి. ఆసియా కప్ గెలిచే అన్ని అవకాశాలు భారత్‌కు ఉన్నాయి" అని ఎఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మదన్ లాల్ పేర్కొన్నాడు.ఆసియా కప్ టీ20-2025 టోర్నమెంట్‌కు బీసీసీఐ ప్రకటించిన జట్టుసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.రిజర్వు ప్లేయర్లు: ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.చదవండి: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆటగాళ్లకు ‘అగ్ని పరీక్ష’.. ఏమిటీ బ్రోంకో టెస్టు? -
ఆసియాకప్ జట్టులో నో ఛాన్స్.. పాకిస్తాన్ కెప్టెన్ కీలక నిర్ణయం
ఆసియాకప్-2025 జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన పాకిస్తాన్ వన్డే కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL 2025)లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ తరపున ఆడేందుకు రిజ్వాన్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో ప్రకారం.. సెయింట్ కిట్స్ జట్టులో ఆఫ్ఘనిస్తాన్ స్టార్ పేసర్ ఫజల్హాక్ ఫరూఖీ స్ధానాన్ని రిజ్వాన్ భర్తీ చేయనున్నాడు. ఫరూఖీ ఆసియా కప్‌కు ముందు యూఏఈ, పాకిస్తాన్‌తో జరిగే ట్రైసిరీస్ ఆడేందుకు అఫ్గాన్ జట్టులో చేరనున్నాడు. ఈ క్రమంలోనే రిజ్వాన్‌ను సెయింట్ కిట్స్ యాజమాన్యం తమ జట్టులో తీసుకుంది. ఈ విషయంపై మరో 24 గంటల్లో అధికారికంగా ప్రకటన వెలువడనుంది. అయితే రిజ్వాన్‌కు ప్రస్తుతం వేరే కమిట్మెంట్స్ లేకపోవడంతో ఈ ఏడాది సీపీఎల్ సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండనున్నట్లు సదరు రిపోర్ట్ పేర్కొంది. కాగా సీపీఎల్‌లో ఈ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఆడనుండడం ఇదే తొలిసారి. ఇప్పటికే ఈ ఏడాది సీపీఎల్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లు ఉసామా మీర్, అబ్బాస్ అఫ్రిది. ఇమాద్ వసీం, మహ్మద్ అమీర్, నసీమ్ షా, సల్మాన్ ఇర్షాద్ వంటి స్టార్ ఆటగాళ్లు భాగమయ్యారు. ఇప్పుడు రిజ్వాన్ వారి సరసన చేరనున్నాడు. కాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తమ కాంట్రాక్ట్ ఆటగాళ్లను 12 నెలల వ్యవధిలో రెండు టీ20 లీగ్‌లలో మాత్రమే పాల్గొనడానికి అనుమతి ఇస్తుంది. రిజ్వాన్ ఇప్పుడు సీపీఎల్, ఆ తర్వాత బిగ్‌బాష్ లీగ్ 2025-26లో మెల్బోర్న్ రెనెగేడ్స్ తరపున ఆడనున్నాడు. దీంతో ఈ 12 నెలల కాలానికి రిజ్వాన్ ఫ్రాంచైజీ లీగ్‌ల కోటా పూర్తి కానుంది. రిజ్వాన్‌కు టీ20ల్లో మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు 286 టీ20లు ఆడి 43 సగటుతో 8421 పరుగులు చేశాడు. అయితే ఇటీవల కాలంలో అతడి ఫామ్ దిగజారడంతో పాక్ టీ20 జట్టులో చోటు కోల్పోయాడు. ఫ్రాంచైజీ క్రికెట్లో మెరుగ్గా రాణించి తిరిగి టీ20 జట్టులోకి రావడమే లక్ష్యంగా రిజ్వాన్ ముందుకు వెళ్తున్నాడు.చదవండి: Prithvi Shaw: తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ.. రెండో ఇన్నింగ్స్‌లో ఘోరంగా విఫలం -
టాప్-10లో ఉన్నా ఏం ప్రయోజనం.. టాప్-40లో కూడా లేని ఆటగాడికి అవకాశం
ఆసియా కప్ 2025 కోసం ప్రకటించిన భారత జట్టులో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు చోటు దక్కకపోవడం అందరినీ బాధిస్తుంది. జైస్వాల్‌ను కాదని భారత సెలెక్టర్లు శుభ్‌మన్ గిల్‌వైపు మొగ్గు చూపడం కరెక్ట్ కాదని చాలా మంది భావిస్తున్నారు. ఎందుకంటే, గిల్ అంతర్జాతీయ టీ20 ఆడి ఏడాది దాటిపోయింది. అయినా టెస్ట్ జట్టు కెప్టెన్ అని, ఆ ఫార్మాట్లలో ఇటీవల అద్భుతంగా రాణించాడని అతన్ని ఆసియా కప్ జట్టుకు ఎంపిక చేశారు. ఇంతటితో ఆగకుండా వైస్ కెప్టెన్‌ను కూడా చేశారు.జైస్వాల్ పరిస్థితి అది కాదు. ఇతగాడు గత ఏడాది కాలంగా భారత టీ20 ఫార్మాట్లో రెగ్యులర్ సభ్యుడిగా ఉన్నాడు. గత 9 ఇన్నింగ్స్‌ల్లో 3 అర్ద సెంచరీలు చేసి రాణించాడు. పైగా టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్-10లో (10) ఉన్నాడు.ఆసియా కప్ జట్టులో ఉండేందుకు ఇన్ని అర్హతలు ఉన్నా.. గిల్లా బీసీసీఐ పెద్దల అండదండలు లేకపోవడం జైస్వాల్‌కు మైనస్ అయ్యింది. అందుకే అతడికి ఆసియా కప్ జట్టులో చోటు దక్కలేదు.జైస్వాల్ @10.. గిల్ @41ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో జైస్వాల్ 10వ స్థానంలో ఉండగా.. చాలాకాలంగా పొట్టి ఫార్మాట్‌కు దూరంగా ఉన్న గిల్ 41వ స్థానంలో కొనసాగుతున్నాడు. జైస్వాల్-గిల్ మధ్య ఈ ర్యాంకింగ్స్ వ్యత్యాసం చూసిన తర్వాత కొందరు భారత అభిమానులు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. టాప్-10లో ఉన్నా ఏం ప్రయోజనం.. టాప్-40లో కూడా లేని ఆటగాడికి అవకాశం దక్కిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ర్యాంకింగ్స్ విషయంలో గిల్‌తో పోలిస్తే జైస్వాల్‌కు ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే.. టెస్ట్‌ల్లో, టీ20ల్లో టాప్-10 ఉన్న ఏకైక బ్యాటర్ జైస్వాల్ ఒక్కడే. టీ20 ర్యాంకింగ్స్‌లో 10వ స్థానంలో ఉన్న జైస్వాల్.. టెస్ట్‌ల్లో 5వ స్థానంలో ఉన్నాడు. గిల్ విషయానికొస్తే.. వన్డేల్లో నంబర్ వన్‌గా కొనసాగుతున్న ఇతగాడు, టెస్ట్‌ల్లో 13వ స్థానంలో ఉన్నాడు. -
Asia Cup: అద్భుతమైన ఎంపిక: సెలక్టర్లపై గావస్కర్ ప్రశంసలు
టీమిండియా సెలక్టర్లపై భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) ప్రశంసలు కురిపించాడు. టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)ను తిరిగి టీ20 జట్టులోకి పిలిపించి గొప్ప పనిచేశారని కొనియాడాడు. టీమిండియా టీ20 భవిష్యత్ కెప్టెన్‌గా గిల్ చుట్టూ ఇప్పటి నుంచే జట్టును తయారు చేయాలని సూచించాడు.అక్షర్‌ను తప్పించి గిల్‌కు వైస్ కెప్టెన్సీఆసియా కప్-2025 టోర్నమెంట్‌కు బీసీసీఐ మంగళవారం తమ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా కొనసాగించిన యాజమాన్యం.. అక్షర్ పటేల్ (Axar Patel)ను మాత్రం వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించింది. అంతర్జాతీయ టీ20లకు ఏడాది కాలంగా దూరంగా ఉన్న టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో అక్షర్ స్థానాన్ని భర్తీ చేసింది.గొప్ప, అద్భుతమైన ఎంపికఈ నేపథ్యంలో గిల్‌ను వైస్ కెప్టెన్ చేయడంపై బీసీసీఐ తీరుపై విమర్శలు వస్తుండగా.. సునిల్ గావస్కర్ మాత్రం భిన్నంగా స్పందించాడు. ‘‘దాదాపు రెండు వారాల క్రితం.. ఇంగ్లండ్ గడ్డ మీద అతడు 750కి పైగా పరుగులు సాధించాడు.అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అలాంటి ఆటగాడిని ఎలా విస్మరించగలరు. అంతేకాదు.. అతడికి వైస్ కెప్టెన్సీ కూడా ఇచ్చారు. దీనిని బట్టి అతడే భవిష్యత్తులో టీ20 జట్టుకు కెప్టెన్ అవుతాడని స్పష్టం చేశారు. నా దృష్టిలో ఇది చాలా చాలా గొప్ప, అద్భుతమైన ఎంపిక’’ అంటూ సెలక్టర్లపై ప్రశంసల జల్లు కురిపించాడు గావస్కర్.టీ20 భవిష్యత్ సారథిఈ సందర్భంగా జింబాబ్వే పర్యటనలో గిల్ టీ20 జట్టును ముందుకు నడిపించిన తీరును గావస్కర్ ప్రస్తావించాడు. ‘‘టీమిండియా 2024లో టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత జింబాబ్వే పర్యటనలో గిల్ కెప్టెన్‌గా రాణించాడు. ఇక ఇటీవల ఇంగ్లండ్‌లోనూ టెస్టు కెప్టెన్‌గా ఆకట్టుకున్నాడు.బ్యాటర్‌గానూ అత్యుత్తమ ప్రదర్శనతో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. దీనిని బట్టి అతడు ఒత్తిడిని అధిగమిస్తూ.. ఆటగాడిగానూ ఎలా రాణించగలడో మనం అర్థం చేసుకోవచ్చు. టీ20లలోనూ అతడే కెప్టెన్ అవుతాడు’’ అని గావస్కర్ గిల్‌ను కొనియాడాడు. కాగా ఈసారి టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా కప్ టోర్నీకి సెప్టెంబరు 9- 28 వరకు షెడ్యూల్ ఖరారైంది.ఆసియా కప్ టీ20-2025 టోర్నమెంట్‌కు బీసీసీఐ ప్రకటించిన జట్టుసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.రిజర్వు ప్లేయర్లు: ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.చదవండి: ‘ఆసియా కప్ ఆడకపోయినా.. వరల్డ్‌కప్ జట్టులో శ్రేయస్ తప్పక ఉంటాడు’ -
ఇదే ఫైనల్ స్క్వాడ్ కాదు.. వారికి మరో ఛాన్స్: అగార్కర్
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్లో పాల్గొనే టీమిండియా గురించి భారత క్రికెట్ వర్గాల్లో ప్రధానంగా చర్చ నడుస్తోంది. శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ను పక్కనపెట్టడంతో సెలక్టర్లపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.విమర్శలకు కారణం?అదే విధంగా.. యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal), వాషింగ్టన్ సుందర్‌లను స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపిక చేయడం.. రీఎంట్రీలో వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కు ప్రమోషన్ ఇవ్వడం చర్చకు దారితీశాయి. అంతేకాదు.. ఇటీవలి కాలంలో పెద్దగా ఆకట్టుకోని హర్షిత్ రాణా, రింకూ సింగ్, శివం దూబేలను ఆసియా కప్ జుట్టుకు ఎంపిక చేయడం కూడా విమర్శలకు తావిచ్చాయి.ఈ జట్టునే గనుక టీ20 ప్రపంచకప్ వరకు కొనసాగిస్తే టీమిండియా టైటిల్ గెలవలేదంటూ మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఘాటు విమర్శలే చేశాడు. ఈ నేపథ్యంలో జట్టు ప్రకటన సందర్భంగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.వరల్డ్‌కప్ టోర్నీకి ఇదే ఫైనల్ స్క్వాడ్ కాదువాషింగ్టన్ సుందర్ గురించి మీడియా సమావేశంలో ప్రస్తావన రాగా.. ‘‘మా ప్రణాళికల్లో సుందర్ ఎల్లప్పుడూ ఉంటాడు. అయినా.. వరల్డ్‌కప్ టోర్నీకి ఇదే ఫైనల్ స్క్వాడ్ కాదు. ప్రస్తుతం మా జట్టులో ముగ్గురు స్పిన్నర్లు ఉన్నారు. నలుగురు గనుక అవసరం ఉంటే.. సుందర్ కచ్చితంగా టీమ్‌లోకి వచ్చేవాడు.అయితే, ప్రస్తుత సమీకరణల దృష్ట్యా రింకూ సింగ్‌ను అదనపు బ్యాటర్‌గా ఎంపిక చేసుకున్నాం. జితేశ్, సంజూ వికెట్ కీపర్లుగా సేవలు అందిస్తారు. ప్రస్తుతం మాకు 15 మందిని మాత్రమే ఎంపిక చేసే అవకాశం ఉంది. ఒకవేళ 16 మందిని ఎంపిక చేయాలంటే సుందర్ ఉండేవాడు.వారికి తలుపులు తెరిచే ఉన్నాయిఇక ముందు.. వరల్డ్‌కప్ వరకు టీమిండియా 20 టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కాబట్టి ఎవరు జట్టులో ఉంటారో.. ఎవరు వెళ్లిపోతారో వారి ప్రదర్శనలపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచకప్ టోర్నీ ముగిసిన వెంటనే.. తదుపరి వరల్డ్‌కప్‌నకు జట్టును సిద్ధం చేసుకోవడం సహజం.గాయాలు, ఫామ్.. ప్రధానంగా జట్టు ఎంపికను ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఈ జట్టులో మార్పులు ఉండవచ్చు. జట్టులో ఎవరూ శాశ్వతం కాదు. 18 లేదంటే 20 మంది ఆటగాళ్లను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటాం. వారి నుంచి అత్యుత్తమ, అవసరమైన జట్టునే ఎంపిక చేస్తాం’’ అని అగార్కర్ పేర్కొన్నాడు. తద్వారా ఆసియా కప్ టోర్నీకి ఎంపిక కాని ఆటగాళ్లకు కూడా ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయని సంకేతాలు ఇచ్చాడు. ఎనిమిది జట్లుకాగా భారత్ ఆతిథ్యంలో యూఏఈ వేదికగా సెప్టెంబరు 9- 28 వరకు ఆసియా కప్ టోర్నీ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకంగా ఈసారి ఈ ఖండాంతర టోర్నీని టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గనిస్తాన్, యూఏఈ, ఒమన్, హాంకాంగ్ జట్లు ఇందులో పాల్గొంటున్నాయి.ఆసియా కప్ టీ20-2025 టోర్నీకి టీమిండియా సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.రిజర్వు ప్లేయర్లు: ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.చదవండి: నాకు ఎవరి సానుభూతి అక్కర్లేదు.. నేనేంటో నాకు తెలుసు: పృథ్వీ షా -
‘ఆసియా కప్ ఆడకపోయినా.. వరల్డ్‌కప్ జట్టులో తప్పక ఉంటాడు’
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీరుపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా విమర్శలు చేశాడు. అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్న శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ను ఆసియా కప్-2025 టోర్నమెంట్‌కు ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నించాడు. అతడు చేసిన తప్పేంటో అర్థం కావడం లేదని.. ఓ ఆటగాడిగా ఏం చేయాలో అన్నీ చేసినా ఇలా పక్కకు పెట్టడం సరికాదని మండిపడ్డాడు.మరోసారి మొండిచేయిఈసారి పొట్టి ఫార్మాట్లో నిర్వహించే ఆసియా కప్ టోర్నీకి బీసీసీఐ మంగళవారం తమ జట్టును ప్రకటించింది. టీ20 ప్రపంచకప్-2026కు సన్నాహకంగా జరిగే ఈ ఖండాంతర ఈవెంట్లో పాల్గొనే భారత జట్టులో శ్రేయస్ అయ్యర్‌కు మాత్రం చోటు దక్కలేదు.దేశవాళీ క్రికెట్‌తో పాటు.. ఐపీఎల్-2025లో పరుగుల వరద పారించినా సెలక్టర్లు ఈ ముంబై బ్యాటర్‌కు మొండిచేయి చూపారు. కనీసం స్టాండ్ బై ప్లేయర్‌గానూ శ్రేయస్‌కు చోటివ్వలేదు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా బీసీసీఐ తీరును విమర్శించాడు.ఇంతకంటే ఇంకేం చేయగలడు?‘‘ఈ జట్టులో శ్రేయస్ అయ్యర్ లేకపోవడం అతి పెద్ద చర్చనీయాంశం. ఆటగాడిగా అతడు ఇంతకంటే ఇంకేం చేయగలడు? ఇప్పటికే తనను తాను ఎన్నోసార్లు నిరూపించుకున్నాడు. ఐపీఎల్లో ఈ ఏడాది 600కు పైగా పరుగులు సాధించాడు.కెప్టెన్‌గా తన జట్టు పంజాబ్‌ను ఫైనల్‌కు తీసుకువెళ్లాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, రంజీ ట్రోఫీలో పరుగుల వరద పారించాడు. టీమిండియా తరఫున చాంపియన్స్ ట్రోఫీలో సత్తా చాటాడు. ఒక ఆటగాడిగానే కాదు.. మనిషిగా తనకు ఏమేం సాధ్యమవుతాయో.. అవన్నీ చేశాడు’’ అంటూ శ్రేయస్‌కు మద్దతుగా నిలిచిన ఆకాశ్ చోప్రా.. సెలక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.టీ20 ప్రపంచకప్ జట్టులో తప్పక ఉంటాడుఅదే విధంగా.. ‘‘ఇది ఆసియా కప్ జట్టు మాత్రమే. దీనిని వరల్డ్‌కప్ టీమ్‌గా భావించడం తొందరపాటు చర్యే అవుతుంది. ఈ రెండు ఈవెంట్లకు మధ్య 15 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు జరుగబోతున్నాయి. మరి జట్టు మొత్తం తారుమారయ్యే అవకాశం ఉన్నట్లే కదా!వన్డేల్లో నిలకడగా పరుగులు సాధిస్తూ ముందుకు సాగితే.. అతడు టీ20లలోనూ రీఎంట్రీ ఇవ్వగలడు. శ్రేయస్ అయ్యర్ ఈసారి టీ20 వరల్డ్‌కప్ ఆడే భారత జట్టులో తప్పక ఉంటాడని నాకు గట్టి నమ్మకం’’ అంటూ ఆకాశ్ చోప్రా ఆశాభావం వ్యక్తం చేశాడు.చదవండి: ఆ ముగ్గురు ఎందుకు?.. ఈ జట్టుతో వరల్డ్ కప్ గెలవలేరు: భారత మాజీ కెప్టెన్ ఫైర్ -
ఆ ముగ్గురు ఎందుకు?.. ఈ జట్టుతో కప్ గెలవలేరు: భారత మాజీ కెప్టెన్ ఫైర్
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఎంపిక చేసిన జట్టుపై టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ పెదవి విరిచాడు. రోజురోజుకు మెరుగుపడాల్సి పోయి.. జట్టు తిరోగమనంలో పయనించేలా సెలక్టర్ల నిర్ణయం ఉందంటూ విమర్శించాడు.ఇలాంటి జట్టుతో ఆసియా కప్ గెలిచే అవకాశం ఉంటుందేమో గానీ.. టీ20 ప్రపంచకప్ టోర్నీలో మాత్రం అస్సలు గెలవలేరని చిక్కా ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఆసియా కప్ ఈవెంట్‌కు బీసీసీఐ మంగళవారం తమ జట్టును ప్రకటించింది.అక్షర్‌పై ‘వేటు’.. గిల్ రీ ఎంట్రీసూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)ను కెప్టెన్‌గా కొనసాగిస్తూ.. రీఎంట్రీలో శుబ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది. దీంతో దాదాపు ఏడాది కాలంగా సూర్య డిప్యూటీగా ఉన్న అక్షర్ పటేల్ (Axar Patel)కు భంగపాటు తప్పలేదు. మరోవైపు.. సూపర్ ఫామ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్‌కు మరోసారి మొండిచేయి చూపిన సెలక్టర్లు.. యశస్వి జైస్వాల్‌ను స్టాండ్ బై ప్లేయర్‌గా మాత్రమే ఎంపిక చేశారు.సిరాజ్‌కు దక్కని చోటుఇక ఈ జట్టులో హైదరాబాదీ స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు చోటు దక్కలేదు. అయితే, యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాతో పాటు.. ఇటీవలి కాలంలో అంతగా ఆకట్టుకోని శివం దూబే, రింకూ సింగ్‌లను కూడా సెలక్టర్లు ఆసియా కప్ టోర్నీకి ఎంపిక చేశారు. ఈ పరిణామాలపై మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ స్పందించాడు.ఈ జట్టుతో వరల్డ్ కప్ గెలవలేరు‘‘ఈ జట్టుతో మనం మహా అయితే ఆసియా కప్ గెలుస్తామేమో!.. కానీ ఇదే జట్టును కొనసాగిస్తే టీ20 ప్రపంచకప్ మాత్రం గెలవలేము. మీరు ఈ జట్టును వరల్డ్‌కప్ టోర్నీకి తీసుకెళ్తారా?.. ఐసీసీ టోర్నీకి ఆరు నెలల సమయం మాత్రమే ఉంది. మరి మీ సన్నాహకాలు మాత్రం సరైన విధంగా లేవు.ఎవరైనా ముందుకు వెళ్లాలని అనుకుంటారు. కానీ మీరు జట్టును తిరోగమనంలో పయనించేలా చేస్తున్నారు. అక్షర్ పటేల్‌ను వైస్ కెప్టెన్సీ నుంచి ఎందుకు తొలగించారు?.. రింకూ సింగ్, శివం దూబే, హర్షిత్ రాణాను ఎందుకు ఎంపిక చేశారో తెలియదు.ఐపీఎల్ ప్రదర్శన మాత్రమే జాతీయ జట్టు ఎంపికకు ప్రామాణికం అని భావిస్తే.. మరి వీళ్లను ఎలా సెలక్ట్ చేసినట్లు?.. అసలు ఈ జట్టులో ఎవరు ఐదో స్థానంలో బ్యాటింగ్ చేస్తారు?ఆ ముగ్గురు ఎందుకు?వికెట్ కీపర్లుగా ఉన్న సంజూ శాంసన్, జితేశ్ శర్మ.. లేదంటే శివం దూబే, రింకూ సింగ్‌లలో ఒకరు ఐదో నంబర్ బ్యాటర్‌గా వస్తారా? సాధారణంగా హార్దిక్ పాండ్యా ఆ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. ఇక అక్షర్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయలేడు.మరి ఈ దూబేను ఎందుకు సెలక్ట్ చేశారో అర్థం కావడం లేదు. యశస్వి జైస్వాల్ అంతర్జాతీయ క్రికెట్లో, ఐపీఎల్లో అదరగొడుతున్నాడు. ఇంతకంటే ఇంకేం చేస్తే అతడిని జట్టుకు ఎంపిక చేసేవారు?’’ అంటూ చిక్కా సెలక్టర్ల తీరును ఎండగడుతూ.. ప్రశ్నల వర్షం కురిపించాడు. కాగా చివరగా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో దూబే ఐదు మ్యాచ్‌లలో కలిపి 83 పరుగులు చేయగా.. రింకూ రెండు ఇన్నింగ్స్ ఆడి 39 రన్స్ చేశాడు.చదవండి: అప్పుడు గిల్ లేడు కాబట్టే సంజూ ఓపెనర్.. కానీ ఇప్పుడు: అగార్కర్ -
Asia Cup 2025: సిరాజ్‌ను కాదని హర్షిత్ రాణా ఎంపిక.. ఫ్యాన్స్ ఆగ్రహం
ఆసియా కప్ 2025 కోసం ఎంపిక చేసిన భారత జట్టుపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కెప్టెన్‌గా సూర్యకుమార్ ఎంపికను అందరూ స్వాగతిస్తున్నప్పటికీ.. గిల్‌కు వైస్ కెప్టెన్సీ కట్టబెట్టడాన్ని మాత్రం కొందరు వ్యతిరేకిస్తున్నారు. గిల్ కోసం యశస్వి జైస్వాల్ లాంటి ఆటగాడిని తప్పించడాన్ని తప్పుబడుతున్నారు. అలాగే శ్రేయర్ అయ్యర్‌కు జరిగిన అన్యాయాన్ని కూడా నిలదీస్తున్నారు.సిరాజ్‌ను కాదని రాణా ఎంపిక.. ఫ్యాన్స్ ఆగ్రహంఆసియా కప్ జట్టు ఎంపికలో జైస్వాల్, శ్రేయస్‌తో పాటు మరో అర్హుడైన ఆటగాడికి కూడా అన్యాయం జరిగింది. గత కొంతకాలంగా ఫార్మాట్లకతీతంగా సత్తా చాటుతూ, టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న పేస్ గన్ మొహమ్మద్ సిరాజ్‌ను కూడా ఆసియా కప్‌కు ఎంపిక చేయలేదు.సిరాజ్‌ను కాదని హర్షిత్ రాణాను ఎంపిక చేయడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. ఈ విషయంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక పాత్రధారి అని ఆరోపిస్తున్నారు. అతడి ప్రోద్బలం వల్లే సిరాజ్‌ను కాదని హర్షిత్‌ను ఎంపిక చేసుంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సిరాజ్ ఎంత విలువైన బౌలరో ఇటీవల ప్రపంచం మొత్తం చూసిందని గుర్తు చేస్తున్నారు. ఇంగ్లండ్‌లో సిరాజ్ చేసిన మ్యాజిక్‌ను ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఒత్తిడి సమయాల్లో హర్షిత్‌తో పోలిస్తే సిరాజ్ అనుభవం చాలా పనికొస్తుందని అని అంటున్నారు. సిరాజ్‌ను కాదని హర్షిత్‌ను ఎంపిక చేయడం బుద్దిలేని చర్యగా అభివర్ణిస్తున్నారు.కాగా, తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో సిరాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే. అయినా సిరాజ్ ఆసియా కప్ జట్టులో స్థానం నోచుకోలేదు. సిరాజ్‌ను కాదని భారత సెలెక్టర్లు హర్షిత్ రాణాకు అవకాశం ఇచ్చారు.సిరాజ్‌కు టీ20 ఫార్మాట్లో మంచి ట్రాక్ రికార్డు ఉన్నా సెలెక్టర్లు ఎందుకు పక్కకు పెట్టారో తెలియడం లేదు. సిరాజ్ తాజా ఐపీఎల్ సీజన్లోనూ గుజరాత్ తరఫున మంచిగా పెర్ఫార్మ్ చేశాడు. హర్షిత్‌తో పోలిస్తే సిరాజ్ అన్ని విషయాల్లో చాలా మెరుగ్గా ఉన్నాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో సన్నిహిత సంబంధాలు ఉండటం చేత హర్షిత్‌కు ఆసియా కప్ బెర్త్ దక్కిందని ప్రచారం జరుగుతుంది. గంభీర్ ఐపీఎల్లో కేకేఆర్ మెంటార్‌గా ఉన్నప్పుడు హర్షిత్ ఆ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఆ సాన్నిహిత్యం కారణంగానే గంభీర్ హెడ్ కోచ్ కాగానే హర్షిత్‌కు టీమిండియా బెర్త్ దక్కింది.ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు..సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్‌కీపర్), బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్, సంజు శాంసన్ (వికెట్‌కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్స్టాండ్ బై ప్లేయర్లు: ప్రసిద్ద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, ధృవ్ జురెల్, రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్ -
Ind Vs Pak మ్యాచ్ గురించి అగార్కర్‌కు ప్రశ్న.. బీసీసీఐ రియాక్షన్ ఇదే
క్రికెట్ ప్రేమికులకు మరోసారి మజా అందించేందుకు ఆసియా కప్ (Asia Cup 2025) టోర్నమెంట్ సిద్ధంగా ఉంది. యూఏఈ వేదికగా ఈసారి పొట్టి ఫార్మాట్లో నిర్వహణకు సెప్టెంబరు 9- 28 వరకు షెడ్యూల్ ఖరారైంది. ఇక ఈ ఖండాంతర టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి.ఆరోజే భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్!గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ తలపడనుండగా.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ పోటీపడనున్నాయి. ఒకే గ్రూపులో ఉన్న దాయాదులు భారత్- పాక్ (India vs Pakistan) జట్లు ఈ టోర్నీ లీగ్ దశలో సెప్టెంబరు 14న తొలిసారి తలపడతాయి. ఆ తర్వాత సూపర్ 4, ఫైనల్ కలుపుకొని మరో రెండుసార్లు పరస్పరం ఢీకొట్టే అవకాశం లేకపోలేదు.ఆ మ్యాచ్ రద్దుఅయితే, ప్రస్తుతం ఇరుదేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారత్- పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్న చర్చ జరుగుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్‌తో క్రీడల్లోనూ ఎలాంటి బంధం కొనసాగించవద్దనే డిమాండ్లు పెరిగాయి. ఇటీవల వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్లోనూ ఇండియా చాంపియన్స్.. పాకిస్తాన్‌తో ఆడేందుకు విముఖత చూపింది.లీగ్, సెమీ ఫైనల్ మ్యాచ్‌ను బహిష్కరించి.. దేశమే తమకు ముఖ్యమని మాజీ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు తేల్చిచెప్పింది. అయితే, ఆసియా కప్ టోర్నీలో మాత్రం చిరకాల ప్రత్యర్థులు కచ్చితంగా ముఖాముఖి పోటీపడే సంకేతాలు కనిపిస్తున్నాయి.ఈ విషయం గురించి టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌కు తాజాగా ప్రశ్న ఎదురైంది. ఆసియా కప్-2025 టోర్నీ కోసం మంగళవారం భారత జట్టును ప్రకటించారు. ఈ సందర్భంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి అగార్కర్ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు.అగార్కర్‌కు ప్రశ్న.. బీసీసీఐ రియాక్షన్ ఇదేఈ క్రమంలో ఓ విలేఖరి.. ‘‘సెప్టెంబరు 14న ఆసియా కప్ టోర్నీలో బిగ్ మ్యాచ్ ఉంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్. ఇరుదేశాల మధ్య గత రెండు నెలలుగా ఏం జరుగుతుందో మనకి తెలుసు. మరి ఈ మ్యాచ్ విషయంలో మీ వైఖరి ఏమిటి?’’ అని ప్రశ్నించారు.ఇందుకు అగార్కర్ బదులిచ్చేందుకు సిద్ధమవుతుండగా.. బీసీసీఐ మీడియా మేనేజర్ అతడికి అడ్డుపడ్డారు. ‘‘ఆగండి.. కాస్త ఆగండి. జట్టు ఎంపిక గురించిన ప్రశ్నలు మాత్రమే అడగండి’’ అంటూ సమాధానం దాటవేసేలా చేశారు. దీంతో మరోసారి భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.ఆసియా కప్ టీ20-2025 టోర్నీకి బీసీసీఐ ప్రకటించిన జట్టుసూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.రిజర్వు ప్లేయర్లు: ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్. చదవండి: Asia Cup 2025: అందుకే శ్రేయస్‌ను సెలక్ట్ చేయలేదు: కుండబద్దలు కొట్టిన అగార్కర్ -
సంజూ కాదు!.. ఆసియా కప్ ఓపెనర్‌గా అతడు ఫిక్స్: అగార్కర్
ఆసియా కప్-2025 టోర్నమెంట్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తమ జట్టును ఖరారు చేసింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఈ మెగా ఈవెంట్ ఆడబోయే జట్టును మంగళవారం ప్రకటించింది.కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్.. ఆసియా కప్ ఆడబోయే భారత జట్టులోని సభ్యుల పేర్లు వెల్లడించాడు. ఈ ఖండాంతర టోర్నీతో టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill).. టీమిండియా తరఫున టీ20లలో పునరాగమనం చేయనున్నాడు.ఓపెనింగ్ జోడీ ఎవరు?అంతేకాదు.. సూర్యకు డిప్యూటీగా గిల్ ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో ఆసియా కప్‌లో టీమిండియా ఓపెనింగ్ జోడీ ఎవరన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా గిల్ ఏడాది కాలంగా అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉండగా.. అభిషేక్ శర్మతో కలిసి సంజూ శాంసన్ భారత ఇన్నింగ్స్ ఆరంభించాడు.అయితే, ప్రస్తుత ఆసియా కప్ జట్టులో సంజూకు చోటు దక్కినా.. గిల్ రాకతో ఓపెనర్‌గా అతడిపై వేటు పడటం ఖాయమే కనిపిస్తోంది. కేవలం వికెట్ కీపర్ బ్యాటర్‌గా మాత్రమే అతడి పేరును పరిశీలనలోకి తీసుకుంటారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. మరో ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ను స్టాండ్ బై ప్లేయర్‌గా మాత్రమే ఎంపిక చేయడంతో సంజూకు కాస్త ప్రమాదం తప్పినట్లే విశ్లేషకులు అంటున్నారు.అప్పుడు గిల్ లేడు కాబట్టే సంజూ ఓపెనర్ఈ పరిణామాల నేపథ్యంలో ఆసియా కప్-2025లో భారత ఓపెనింగ్ జోడీ ఎవరన్న అంశంపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు. ‘‘శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ లేరు కాబట్టి సంజూ శాంసన్ ఓపెనర్‌గా వచ్చాడు.అలాగే అభిషేక్ శర్మ కూడా!.. అయితే, ఓపెనర్‌గా అభిషేక్ అద్భుత ప్రదర్శనలు ఇచ్చాడు. పార్ట్‌టైమ్ స్పిన్నర్‌గానూ పనికివస్తాడు. ఇక అభిషేక్ శర్మకు జోడీగా ఇప్పుడు ఇద్దరు ఓపెనర్లు ఉన్నారు.అక్కడకు వెళ్లాకే నిర్ణయంశుబ్మన్ గిల్, సంజూ శాంసన్.. ఈ ఇద్దరూ మంచి ఓపెనింగ్ బ్యాటర్లు.అయితే, దుబాయ్‌లో ఓపెనర్‌గా ఎవరు వస్తారని అక్కడే నిర్ణయిస్తాం. ఇక గిల్ అంతకు ముందు కూడా వైస్ కెప్టెన్‌గా జట్టులో ఉన్నాడు. ఇప్పుడు తిరిగి వచ్చాడు. ఇందులో ఎలాంటి సమస్య లేదు’’ అని అగార్కర్ పేర్కొన్నాడు.ఈ క్రమంలో అభిషేక్ శర్మను మొదటి ప్రాధాన్య ఓపెనర్‌గా చెప్పిన అగార్కర్.. గిల్ రాకతో సంజూపై ఓపెనర్‌గా వేటు పడక తప్పదనే సంకేతాలు ఇచ్చాడు. కాగా ఆసియా కప్-2025కి ఎంపిక చేసిన భారత జట్టులో శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కలేదు. దీంతో సెలక్టర్లపై తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది.చదవండి: Asia Cup 2025: అందుకే శ్రేయస్‌ను సెలక్ట్ చేయలేదు: కుండబద్దలు కొట్టిన అగార్కర్ -
అందుకే అక్షర్‌ను తప్పించి.. వైస్ కెప్టెన్‌గా గిల్: సూర్యకుమార్ యాదవ్
టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill).. అంతర్జాతీయ టీ20లలో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్ ఆడబోయే భారత టీ20 జట్టుకు అతడు ఎంపికయ్యాడు. అంతేకాదు.. పొట్టి ఫార్మాట్లో జరిగే ఈ ఖండాంతర ఈవెంట్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు గిల్ డిప్యూటీగా వ్యవహరించనున్నాడు.ఏడాది కాలంగా దూరంకాగా 2024 జూలైలో శ్రీలంక పర్యటన సందర్భంగా గిల్ చివరగా టీ20లలో టీమిండియాకు ఆడాడు. నాడు సూర్య కెప్టెన్సీలో ఓపెనర్‌గా వచ్చిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 39 పరుగులు చేశాడు. అనంతరం.. దాదాపు ఏడాది కాలంగా భారత టీ20 జట్టుకు దూరంగా ఉన్న గిల్.. మెగా టోర్నీ నేపథ్యంలో అకస్మాత్తుగా జట్టులోకి రావడమే కాకుండా.. వైస్ కెప్టెన్‌గానూ ఎంపిక కావడం గమనార్హం.అక్షర్ పటేల్‌ను తప్పించి..ఇన్నాళ్లు టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న అక్షర్ పటేల్‌ను తప్పించి.. గిల్‌ను సూర్య డిప్యూటీగా నియమించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఆసియా కప్ జట్టు ప్రకటన సందర్భంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఈ విషయంపై స్పందించాడు. అందుకే వైస్ కెప్టెన్‌గా గిల్‘‘టీ20 ప్రపంచకప్-2024లో గెలిచిన తర్వాత టీమిండియా శ్రీలంకలో టీ20 సిరీస్ ఆడినపుడు నేను కెప్టెన్‌గా ఉంటే.. గిల్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. నిజానికి టీ20 ప్రపంచకప్-2026 కోసం కొత్త సైకిల్‌ను మేము అప్పుడే ఆరంభించాము.అయితే, ఆ తర్వాత వరుస టెస్టు సిరీస్‌లతో గిల్ బిజీ అయ్యాడు. అందుకే టీమిండియా తరఫున టీ20 మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. అంతేకాదు.. చాంపియన్స్ ట్రోఫీతోనూ మరింత బిజీ అయిపోయాడు.అందుకే టీ20లకు కాస్త దూరమయ్యాడు. అతడు తిరిగి జట్టులోకి రావడం సంతోషంగా ఉంది’’ అని సూర్యకుమార్ యాదవ్ మీడియా సమావేశంలో పేర్కొన్నాడు. కాగా రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 రిటైర్మెంట్ తర్వాత సూర్య టీమిండియా టీ20 పగ్గాలు చేపట్టగా.. టెస్టులకు వీడ్కోలు పలికిన నేపథ్యంలో ఇటీవలే గిల్ టెస్టు జట్టు సారథి అయ్యాడు.ఇక ఇప్పటికే వన్డేల్లోనూ వైస్ కెప్టెన్‌గా ఉన్న గిల్.. టీ20లలోనూ రీఎంట్రీ ఇవ్వడంతో అతడిని ఆల్ ఫార్మాట్ ఫ్యూచర్ కెప్టెన్‌గా తీర్చిదిద్దేందుకు సిద్ధమైనట్లు బీసీసీఐ సంకేతాలు ఇచ్చినట్లయింది. కాగా సెప్టెంబరు 9- 28 వరకు యూఏఈ వేదికగా ఆసియా కప్ -2025 టోర్నీ జరుగనుంది.ఐపీఎల్లో అదరగొట్టాడుఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ గడ్డ మీద ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ సందర్భంగా శుబ్‌మన్ గిల్ టీమిండియా టెస్టు కెప్టెన్‌గా తన ప్రయాణం మొదలుపెట్టాడు. బ్యాటర్‌గా 754 పరుగులతో ఇరగదీసిన గిల్.. ఎడ్జ్‌బాస్టన్‌లో తొలిసారి భారత్‌కు టెస్టు విజయం అందించాడు. అంతేకాదు.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసి సత్తా చాటాడు.అయితే, అంతర్జాతీయ టీ20లలో గిల్ ఇప్పటి వరకు 21 మ్యాచ్‌లు ఆడి 139.28 స్ట్రైక్‌రేటుతో 578 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ (126) ఉంది. ఇక ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన గిల్.. 15 మ్యాచ్‌లలో కలిపి 650 పరుగులు సాధించాడు. గుజరాత్‌ను ప్లే ఆఫ్స్ చేర్చినా టైటిల్ మాత్రం అందించలేకపోయాడు.చదవండి: Asia Cup 2025: అందుకే శ్రేయస్‌ను సెలక్ట్ చేయలేదు: కుండబద్దలు కొట్టిన అగార్కర్#ShubmanGill is back in T20Is! 😳Here's what skipper #SuryakumarYadav has to say about his inclusion as a vice-captain! 🗣Watch the Press Conference Now 👉 https://t.co/kwwh4UUSWe pic.twitter.com/OiX06F3995— Star Sports (@StarSportsIndia) August 19, 2025 -
అందుకే శ్రేయస్ అయ్యర్‌ను సెలక్ట్ చేయలేదు: కుండబద్దలు కొట్టిన అగార్కర్
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీరుపై టీమిండియా అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పక్షపాత ధోరణి వీడాలంటూ సోషల్ మీడియా వేదికగా సెలక్టర్లకు హితవు పలుకుతున్నారు. కాగా ఈసారి టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా కప్-2025 (Asia Cup)కి బీసీసీఐ మంగళవారం తమ జట్టును ప్రకటించింది.సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)ను టీ20 జట్టు సారథిగా కొనసాగించిన యాజమాన్యం.. వైస్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్‌ను తప్పించింది. టీమిండియా టెస్టు సారథి శుబ్‌మన్ గిల్‌ను అతడి స్థానంలో సూర్యకు డిప్యూటీగా నియమించింది.శ్రేయస్ అయ్యర్‌కు మొండిచేయిచాన్నాళ్లుగా టీ20లలో టీమిండియాకు దూరంగా ఉన్న గిల్‌కు ప్రమోషన్ ఇచ్చిన బీసీసీఐ.. మిడిలార్డర్ స్టార్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)కు మాత్రం మరోసారి మొండిచేయి చూపింది. పదిహేను మంది సభ్యులతో కూడిన ఆసియా కప్ జట్టులో ఈ ముంబై బ్యాటర్‌కు చోటు దక్కలేదు.పడిలేచిన కెరటంలా.. కనీసం స్టాండ్ బై ప్లేయర్ల జాబితాలోనూ అయ్యర్‌కు స్థానం కల్పించలేదు. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ అభిమానులు బీసీసీఐ తీరును విమర్శిస్తున్నారు. కాగా ఈ ముంబై బ్యాటర్ క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డాడనే కారణంగా బీసీసీఐ గతంలో అతడిని సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పించింది.అయితే, మళ్లీ దేశవాళీ క్రికెట్ ద్వారా తనను తాను నిరూపించుకున్న శ్రేయస్.. 2024లో ముంబై రంజీ ట్రోఫీ టైటిల్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టైటిల్ గెలిచిన జట్టులోనూ అతడు సభ్యుడు. వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.అంతేకాదు.. ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా వ్యవహరించి.. ట్రోఫీ అందించాడు. ఇరానీ కప్-2024 గెలిచిన జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు. ఈ క్రమంలో మళ్లీ బీసీసీఐ నుంచి పిలుపు అందుకున్న శ్రేయస్.. సెంట్రల్ కాంట్రాక్టు తిరిగి దక్కించుకోవడంతో పాటు.. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు.చాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్రఅనంతరం.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో 243 పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచి.. భారత్ టైటిల్ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్‌ను రూ. 26.75 కోట్లకు కొని కెప్టెన్‌ను చేసింది.ఐపీఎల్‌లోనూ సత్తా చాటిఈ క్రమంలో బ్యాటర్‌గా, సారథిగా శ్రేయస్ అయ్యర్ అదరగొట్టాడు. ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్‌లో ఏకంగా 604 పరుగులు సాధించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. పంజాబ్‌ను ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. పొట్టి ఫార్మాట్లో మరోసారి ఈ మేర సత్తా చాటాడు. కానీ బీసీసీఐ మాత్రం ఆసియా కప్ ఆడే జట్టులో అతడికి చోటు ఇవ్వకపోవడం గమనార్హం.కుండబద్దలు కొట్టిన అగార్కర్ఈ విషయం గురించి జట్టు ప్రకటన సందర్భంగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘‘శ్రేయస్ అయ్యర్. జట్టుకు ఎంపిక కాకపోవడంలో అతడి తప్పేం లేదు. అలాగే మా తప్పు కూడా ఏమీ లేదు.అతడు ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. అయినా.. ఎవరి స్థానంలో అతడిని తీసుకురావాలో మీరే చెప్పండి?’’ అని అగార్కర్ మీడియా సమావేశంలో ఎదురు ప్రశ్నించాడు. జట్టులో పదిహేను మందికి మాత్రమే స్థానం ఉందని.. కాబట్టి శ్రేయస్ అయ్యర్‌ను తీసుకోలేకపోయామని స్పష్టం చేశాడు.ఆసియా కప్ టీ20-2025 టోర్నీకి భారత జట్టు సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.రిజర్వు ప్లేయర్లు: ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.చదవండి: ‘శుబ్‌మన్ గిల్ కాదు!.. రోహిత్ తర్వాత వన్డే కెప్టెన్‌గా అతడే ఉండాలి’The wait is over! 🇮🇳#TeamIndia’s squad for Asia Cup 2025 is out, and it’s stacked! 💥Let the journey to T20 WC 2026 begin! #AsiaCup🤩Press Conference Live Now 👉 https://t.co/kwwh4UUSWe #AsiaCup2025 pic.twitter.com/zonMDTvmHO— Star Sports (@StarSportsIndia) August 19, 2025 -
ఆసియా కప్‌కు భారత జట్టు ప్రకటన.. వైస్ కెప్టెన్‌గా గిల్
ఆసియా కప్ 2025 కోసం 15 మంది సభ్యుల భారత జట్టును ఇవాళ (ఆగస్ట్ 19) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ కొనసాగగా.. టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కొత్తగా వైస్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఈ జట్టులో స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు చోటు దక్కలేదు. వికెట్‌కీపర్ బ్యాటర్లుగా సంజూ శాంసన్, జితేశ్ శర్మ చోటు దక్కించుకున్నారు. ప్రసిద్ద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, ధృవ్ జురెల్, రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్ స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపికయ్యారు. ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు..సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్‌కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్‌కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్గిల్ రీఎంట్రీ.. వైస్ కెప్టెన్గాఇటీవలే టెస్ట్ జట్టు కెప్టెన్‌గా ఎంపికైన శుభ్‌మన్ గిల్.. టీ20 జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. గిల్ వన్డే జట్టుకు కూడా వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. టీమిండియా ఆడిన గత టీ20 సిరీస్‌కు (ఇంగ్లండ్) దూరంగా ఉన్న గిల్.. ఆసియా కప్‌తో పొట్టి ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. గిల్.. సంజూ శాంసన్, అభిషేక్ శర్మతో ఓపెనర్ స్థానం కోసం పోటీపడతాడు. ఓపెనర్లుగా ఎవరు బరిలోకి దిగుతారనే విషయాన్ని కెప్టెన్, కోచ్ నిర్ణయిస్తారని చీఫ్ సెలెక్టర్ అగార్కర్ చెప్పాడు. వారిద్దరిని ఎంపిక చేయలేకపోయాం.. దురదృష్టకరంఆసియా కప్ కోసం ఎంపిక చేసిన రెగ్యులర్ జట్టులో యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ లాంటి టాలెంటెడ్ ఆటగాళ్లకు చోటు దక్కకపోవడం దురదృష్టకరమని భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అభిప్రాయపడ్డాడు. వీరిద్దరూ నాణ్యమైన ఆటగాళ్లే అయినప్పటికీ.. జట్టులో చోటు కల్పించలేకపోయామని విచారం వ్యక్తం చేశాడు. అభిషేక్ శర్మ బ్యాట్‌తో అద్భుతంగా రాణిస్తుండటంతో పాటు బౌలింగ్ కూడా చేయగలడన్న కారణం చేత అతనివైపే మొగ్గుచూపినట్లు చెప్పుకొచ్చాడు. జైస్వాల్, శ్రేయస్ జట్టుకు ఎంపిక కాకపోవడంలో వారి వైపు నుంచి ఎలాంటి సమస్య లేదని, అలాగని ఈ విషయంలో మేము కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపాడు.కాగా, 8 జట్టు పాల్గొనే ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఖండాంతర టోర్నీ అబుదాబీ, దుబాయ్ వేదికలుగా జరుగనుంది. ఈ టోర్నీలో భారత్ సెప్టెంబర్ 10న తమ తొలి మ్యాచ్ (యూఏఈతో) ఆడనుంది. సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగనుంది. భారత్, పాక్‌ల మధ్య నెలకొన్న సమస్యల కారణంగా ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అన్నది ఆసక్తికంగా మారింది. -
Asia Cup 2025: భారత జట్టు ప్రకటన ఆలస్యం.. కారణమిదే?
ఆసియాకప్-2025కు భారత జట్టు ప్రకటన కాస్త ఆలస్యం కానుంది. వాస్తవానికి మంగళవారం మధ్యాహ్నం 1:30 గంటలకు విలేకరుల సమావేశంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్, టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాల్గోవల్సింది.కానీ ముంబైలో భారీ వర్షాల కారణంగా వీరిద్దరి ప్రెస్కాన్ఫరెన్స్ ఆలస్యమ్యే అవకాశం ఉందని బీసీసీఐ మీడియా సంస్థలకు సమాచారమిచ్చినట్లు హిందూస్తాన్ టైమ్స్ తమ కథనంలో పేర్కొంది. కాగా ముంబైలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి.అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. దీంతో ముంబై వ్యాప్తంగా పాఠశాలకు సెలవులు ప్రకటించారు. అంతేకాకుండా అనేక కార్యక్రమాలు రద్దు చేయబడ్డాయి. ఒకవేళ వర్షం తగ్గుముఖం పట్టకపోతే అగార్కర్, సూర్య వర్చవల్‌గా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశముంది.ఆసియాకప్‌కు 15 మంది సభ్యులతో కూడిన జట్టును సెలక్షన్ కమిటీ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ జట్టులో టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌కు చోటు దక్కుతుందా లేదా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓపెనింగ్ స్లాట్ కోసం సంజూ శాంసన్, యశస్వి జైశ్వాల్, అభిషేక్ శర్మల నుంచి గిల్‌కు తీవ్రమైన పోటీ ఉంది. అయితే ఈ జట్టులో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను సెలక్టర్లు చేర్చినట్లు తెలుస్తోంది. అతడితో పాటు రియాన్ పరాగ్‌కు చోటు కల్పించినట్లు సమాచారం.ఆసియాకప్-2025కు భారత జట్టు(అంచనా): సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సామ్సన్, జైస్వాల్, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అర్ష్ దీప్ సింగ్, జితేశ్ శర్మ.చదవండి: KBC 2025: ఐపీఎల్‌పై రూ. 7.50 లక్షల ప్రశ్న.. సమాధానం మీకు తెలుసా? -
Asia Cup 2025: 'ఏ జట్టునైనా ఓడిస్తాము.. ఆసియాకప్ టైటిల్ మాదే'
ఆసియాకప్-2025కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఎనిమిది జట్ల మధ్య జరిగే ఈ మెగా టోర్నీకి మరో 20 రోజుల్లో తెరలేవనుంది. సెప్టెంబర్ 9న జరిగే తొలి మ్యాచ్‌లో అబుదాబి వేదికగా బంగ్లాదేశ్, హాంకాంగ్ జట్లు తలపడనున్నాయి.అయితే ఈ మెగా ఈవెంట్ ఆరంభానికి ముందు బంగ్లాదేశ్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ జాకర్ అలీ అనిక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది ఆసియాకప్ ఛాంపియన్స్‌గా నిలవడమే తమ లక్ష్యమని జాకర్ తెలిపాడు. కాగా బంగ్లా టైగర్స్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆసియాకప్ టైటిల్‌ను సొంతం చేసుకోలేదు. ఇంతకుముందు మూడు సార్లు ఫైనల్‌కు చేరినప్పటికి.. ప్రతీసారి తుది మెట్టుపై బంగ్లా జట్లు బోల్తా పడింది. 2012లో పాకిస్తాన్, 2016, 2018 ఫైనల్లో భారత్‌పై బంగ్లా ఓటమి చవిచూసింది. కానీ ఈసారి మాత్రం ఎలాగైనా గెలిచి తమ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాలని బంగ్లా వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే 20 మంది సభ్యులతో కూడా తమ ప్రాథిమిక జట్టును బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అంతేకాకుండా యూఏఈలో ఒక ప్రత్యేక క్యాంపును కూడా బంగ్లాదేశ్ ఏర్పాటు చేయనుంది. కెప్టెన్ లిట్టన్ దాస్ నేతృత్వంలో బంగ్లాదేశ్ ఇటీవల శ్రీలంక, పాకిస్తాన్లతో టీ20 సిరీస్‌లను సొంతం చేసుకుంది."టైటిలే లక్ష్యంగా ఈ ఏడాది ఆసియాకప్ బరిలోకి దిగనున్నాము. ఈసారి ఛాంపియన్స్‌గా నిలుస్తామన్న నమ్మకం డ్రెస్సింగ్ రూమ్‌లోని ప్రతి ఒక్కరికి ఉంది. మా జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. ప్రతీ ఒక్కరూ తీవ్రంగా శ్రమిస్తున్నారు.ఏ విషయాన్ని మేము తేలికగా తీసుకోవడం లేదు. ఈ టోర్నీ కోసం మాకు ఎటువంటి ప్రణాళికలు లేవు. ఏ జట్టుతో ఆడినా మా బ్రాండ్ ఆఫ్ క్రికెట్‌ను కొనసాగించాలనకుంటున్నాము. ఈ ఈవెంట్లో మెరుగైన ప్రదర్శన చేసేందుకు అన్ని విధాల సిద్దమవుతున్నాము" అని విలేకరుల సమావేశంలో అలీ పేర్కొన్నాడు. అయితే టోర్నీ ఆరంభానికి ముందే ఆతి విశ్వాసం ప్రదర్శిస్తున్న అలీని నెటిజన్లు ట్రోలు చేస్తున్నారు. గెలిచి మాట్లాడాలని క్రికెట్ అభిమానులు అతడికి కౌంటరిస్తున్నారు. కాగా ఈ టోర్నీలో గ్రూప్-బిలో శ్రీలంక, హాంకాంగ్, ఒమన్‌లతో పాటు బంగ్లాదేశ్ ఉంది.ఆసియాకప్-2025 బంగ్లాదేశ్ ప్రిలిమినరీ జట్టులిట్టన్ దాస్ (కెప్టెన్), తాంజిద్ హసన్ తమీమ్, ఎండి నయీమ్ షేక్, సౌమ్య సర్కార్, మహ్మద్ పర్వేజ్ హోస్సేన్ ఎమోన్, తౌహిద్ హృదయ్, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, షమీమ్ హుస్సేన్, నజ్ముల్ హోస్సేన్, రిషాద్ హొస్సేన్, షాక్ మహేదీ హసన్, తన్వీర్ ఇస్లాం,నసుమ్ అహ్మద్, హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ సాకిబ్, సైఫుద్దీన్, నహిద్ రానా, ముస్తాఫిజుర్ రెహమాన్, షోరీఫుల్ ఇస్లాం, సయ్యద్ ఖలీద్ అహ్మద్, నూరుల్ హసన్ సోహన్, మహిదుల్ ఇస్లాం భుయాన్ అంకోన్, మహ్మద్ సైఫ్ హసన్.చదవండి: Asia Cup 2025: 'ఆసియాకప్‌లో భారత్- పాక్ మ్యాచ్ జరగదు' -
Asia Cup 2025: 'ఆసియాకప్‌లో భారత్- పాక్ మ్యాచ్ జరగదు'
ఆసియాకప్-2025 సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం భారత జట్టును బీసీసీఐ ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కకర్ మంగళవారం(ఆగస్టు 19) ప్రకటించనున్నారు. టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 10న యూఏఈతో తలపడనుంది. అనంతరం సెప్టెంబర్ 14న దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో భారత్ అమీతుమీ తెల్చుకోనుంది.అయితే పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత నెలకొన్న ఉద్రిక్తల కారణంగా పాక్‌తో మ్యాచ్‌ను భారత్ బహిష్కరించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ జాబితాలోకి టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్ చేరాడు. ఈ ఖండాంతర టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్ జరగదని జాదవ్ థీమా వ్యక్తం చేశాడు. "ఆసియాకప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌ను భారత జట్టు బహిష్కరించాలి. భారత్ ఆడదనే నమ్మకం నాకు ఉంది. పాకిస్తాన్‌తో ఎక్కడ ఆడినా టీమిండియానే గెలుస్తోంది. ఈ విషయం పాక్ జట్టుకు కూడా తెలుసు. కానీ ఈ మ్యాచ్ మాత్రం జరగకూడదు" అని ఏఎన్ఐతో జాదవ్ పేర్కొన్నాడు.అంతకుముందు దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లను బాయ్‌కట్ చేయాలని బీసీసీఐని కోరాడు. కాగా ఇటీవల జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో పాకిస్తాన్‌తో ఆడేందుకు ఇండియా ఛాంపియన్స్ నిరాకరించింది. లీగ్ స్టేజీలో ఓ మ్యాచ్‌తో పాటు సెమీ ఫైనల్స్‌ను కూడా యువీ సారథ్యంలోని భారత్ బాయ్‌కట్ చేసింది. అయితే ఆసియాకప్‌లో మాత్రం పాక్-భారత్ జట్లు తలపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డబ్ల్యూసీఎల్ అనేది ప్రైవేట్ లీగ్ కావడంతో ఇండియా పాకిస్తాన్‌తో మ్యాచ్‌ను బహిష్కరించింది.కానీ ఈ ఖండాంతర టోర్నీ ఆసియాక్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరగనుంది కాబట్టి పాక్‌తో భారత్ కచ్చితంగా తలపడతుందనే చెప్పాలి. ఒకవేళ పాక్‌తో మ్యాచ్‌ను టీమిండియా బాయ్‌కట్ చేస్తే బ్రాడ్కాస్టర్లకు భారీ నష్టం వాటిల్లనుంది.ఆసియాకప్‌కు భారత జట్టు(అంచనా): సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సామ్సన్, జైస్వాల్, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అర్ష్ దీప్ సింగ్, జితేశ్ శర్మ.చదవండి: ఆ క్షణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను: ఇంగ్లండ్ స్పిన్నర్ -
గిల్‌కు చోటు దక్కేనా!
కెప్టెన్సీలో ఆడిన గత 20 టి20ల్లో 17 గెలిచి జోరు మీదుంది. ఈ అన్ని మ్యాచ్‌లకు వేర్వేరు కారణాలతో శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ దూరమయ్యారు. మరోవైపు ఈ ఏడాది జట్టు 5 టి20లు మాత్రమే ఆడింది. నిజానికి వీటిలో ప్రదర్శనను బట్టి చూస్తే భారత జట్టులో పెద్దగా మార్పులకు ఆస్కారం లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. టెస్టు కెపె్టన్‌గా రాణించి అన్ని ఫార్మాట్లకు నాయకుడిగా పరిగణనలోకి తీసుకుంటున్న గిల్‌తో పాటు ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్ కూడా టి20 రేసులోకి వచ్చారు. దీనికి తోడు ఐపీఎల్లో ఆటను గుర్తిస్తే శ్రేయస్ అయ్యర్‌కు కూడా అవకాశం ఉంది. ఇలాంటి స్థితిలో ఆసియా కప్ కోసం సెలక్టర్లు ఎలాంటి జట్టును ప్రకటిస్తారనేది ఆసక్తికరం. న్యూఢిల్లీ: ఆసియా కప్ టి20 క్రికెట్ టోరీ్నలో పాల్గొనే భారత జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ నేడు ప్రకటించనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే స్వదేశంలో టి20 వరల్డ్ కప్ కూడా ఉన్న నేపథ్యంలో ఇదే జట్టును అప్పటి వరకు సన్నద్ధం చేసే ఆలోచనతో సెలక్టర్లు ఉన్నారు. సెపె్టంబర్ 9 నుంచి 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఆసియా కప్ జరుగుతుంది. 15 మంది సభ్యులతో టీమ్‌ను ఎంపిక చేయాల్సి ఉండగా... ఇటీవల యువ ఆటగాళ్లు తమకు లభించిన అన్ని అవకాశాలు సద్వినియోగం చేసుకోవడంతో జట్టులో చోటుపై గట్టి పోటీ నెలకొంది. తిలక్ వర్మకు పోటీ! ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజు సామ్సన్ తమ ఆటతో స్థానాలు సుస్థిరం చేసుకున్నారు. ఇంగ్లండ్‌తో భారత్ ఆడిన చివరి టి20 సిరీస్‌లో అభిషేక్ 219.68 స్ట్రయిక్‌రేట్‌తో 279 పరుగులు చేసి టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌లో సామ్సన్ కాస్త తడబడినా... అంతకుముందు దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లపై చెలరేగి ఐదు ఇన్నింగ్స్‌లలో మూడు సెంచరీలు సాధించాడు. ఈ స్థితిలో గిల్, జైస్వాల్‌ను తీసుకొచ్చి కూర్పును చెడగొడతారా అనేది సందేహమే. రిజర్వ్ ఓపెనర్‌గా జైస్వాల్‌ను గానీ, గిల్‌ను కానీ తీసుకొస్తే సామ్సన్ను పక్కన పెట్టక తప్పదు. మూడో స్థానంలో హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ దక్షిణాఫ్రికాపై రెండు సెంచరీలు సహా 280 పరుగులు చేసి కుదురుకున్నాడు. అయితే ఐపీఎల్లో అతను ఆకట్టుకోలేకపోగా, ఇక్కడే శ్రేయస్ అయ్యర్ నుంచి పోటీ ఎదురవుతోంది. ఈ సీజన్లో 600కు పైగా పరుగులు చేసిన శ్రేయస్ సవాల్ విసురుతున్నాడు. నాలుగులో సూర్యకుమార్ ఖాయం కాగా, వరల్డ్ కప్ విజయం సహా గత రెండేళ్లుగా ఐదో స్థానాన్ని శివమ్ దూబే సొంతం చేసుకున్నాడు. హార్దిక్ పాండ్యా స్థానానికి ఢోకా లేకపోగా, ఏడో స్థానం కోసం రింకూ సింగ్ పోటీ పడుతున్నాడు. చివర్లో దూకుడుగా ఆడే ప్రయత్నంలోనే అయినా గత కొన్ని మ్యాచ్‌లలో రింకూ నుంచి ఆశించిన ప్రదర్శన రాలేదు. కొత్తగా ఒక అదనపు ఆల్‌రౌండర్ ఉంటే మేలని భావిస్తే ముందుగా రింకూ స్థానమే ప్రశ్నార్ధకంగా మారనుంది. బుమ్రా ఖాయం... స్పిన్నర్లుగా అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఖాయం. ఆల్‌రౌండర్‌గా అక్షర్ ఎంతో విలువైన ఆటగాడు కాగా, ఇంగ్లండ్‌తో సిరీస్‌లో 14 వికెట్లతో వరుణ్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. గాయంతో వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత ఈ ఫార్మాట్లో ఆడని కుల్దీప్ కోలుకొని చాంపియన్స్ ట్రోఫీలో సత్తా చాటాడు. అతను టి20 టీమ్‌లోకి రావడం లాంఛనమే. మరో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అనుకుంటే వాషింగ్టన్ సుందర్ అందరికంటే ముందున్నాడు. అతని తాజా ఫామ్ కూడా అనుకూలం కానుంది. మూడో పేసర్‌గా హార్దిక్ ఉన్నాడు కాబట్టి రెగ్యులర్ పేసర్లుగా బుమ్రా, అర్‡్షదీప్ల స్థానాలకు ఢోకా లేదు. మరో పేసర్‌గా ప్రసిధ్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్ అందుబాటులో ఉన్నా... వీరి ఎంపిక సందేహమే. కొంత విశ్రాంతి తీసుకొని టెస్టు క్రికెట్‌పైనే పూర్తిగా దృష్టి పెట్టాలని వీరిద్దరికి సెలక్టర్లు సూచించే అవకాశాలే ఎక్కువ. ఇంగ్లండ్‌తో ఆడిన తర్వాత ఐపీఎల్లో ఘోరంగా విఫలమైన మొహమ్మద్ షమీ అంతర్జాతీయ టి20 కెరీర్ ఇక ముగిసినట్లుగానే భావించవచ్చు. గాయం వల్ల నితీశ్ కుమార్ రెడ్డి అందుబాటులో లేడు. రెండో వికెట్ కీపర్‌గా ఐపీఎల్లో ఆకట్టుకున్న జితేశ్ శర్మను సెలక్టర్లు ఎంపిక చేయవచ్చు. జట్టులోకి ఎంపికయ్యే అవకాశం ఉన్న 15 మంది సభ్యులు (అంచనా): సూర్యకుమార్ (కెపె్టన్), అభిషేక్ శర్మ, సామ్సన్, జైస్వాల్, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అర్ష్ దీప్ సింగ్, జితేశ్ శర్మ. -
గర్జించిన రింకూ సింగ్.. విధ్వంసకర బ్యాటర్లో ఈ కోణం కూడా ఉందా..!
టీమిండియా టీ20 స్పెషలిస్ట్ రింకూ సింగ్‌లో కొత్త కోణం బయటపడింది. ఈ విధ్వంసకర మిడిలార్డర్ బ్యాటర్.. స్వరాష్ట్రంలో జరుగుతున్న యూపీ టీ20 లీగ్‌లో బౌలర్ అవతారమెత్తాడు. అవతారమెత్తడమే కాకుండా ఈ విభాగంలోనూ సత్తా చాటాడు.ఈ లీగ్‌లో మీరట్ మెవరిక్స్కు ఆడుతున్న రింకూ.. ఇవాళ (ఆగస్ట్ 18) కాన్పూర్ స్ట్రయికర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 ఓవర్లు స్పిన్ బౌలింగ్ వేసి ఆదర్శ్ సింగ్ అనే బ్యాటర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ వికెట్ తీశాక రింకూ తీవ్ర ఉద్వేగానికి లోనై గర్జించసాగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది.King Rinku @rinkusingh235 rattles the stumps on his first ball! The Captain announces his arrival. #UPT20League #ANAXUPT20League #KhiladiYahanBantaHai #MMvsKS pic.twitter.com/mLwjJWVRSw— UP T20 League (@t20uttarpradesh) August 17, 2025రింకూలోని బౌలింగ్ నైపుణ్యాన్ని చూసి టీమిండియా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత జట్టుకు మరో ఆల్‌రౌండర్ దొరికాడంటూ సంబరపడిపోతున్నారు.కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం బ్యాటింగ్‌నే నమ్ముకుంటే టీమిండియాలో చోటు దక్కడం కష్టంగా మారింది. ఆటగాళ్లంతా అదనంగా మరో విభాగంలో (బ్యాటర్లైతే బౌలింగ్ లేదా వికెట్‌కీపింగ్, బౌలర్లైతే బ్యాటింగ్) సత్తా చాటితేనే ప్లేయింగ్ ఎలెవెన్‌లో చోటు దక్కే అవకాశం ఉంది.ఈ విషయాన్ని రింకూ గ్రహించినట్లున్నాడు. కేవలం బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపిస్తే సరిపోదు, అదనంగా మరో టాలెంట్‌ను జోడించుకోవాలని భావించి బంతి పట్టాడు. ఈ క్రమంలో తొలి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించాడు. ఆసియా కప్ జట్టులో చోటు ప్రశ్నార్థకమైన వేల రింకూ తనలోని బౌలింగ్ టాలెంట్‌ను బయటికి తీసి సెలెక్టర్లను ఇంప్రెస్ చేశాడు.బౌలర్‌గా రాణించినా ఆసియా కప్ జట్టులో రింకూకు చోటు దక్కుతుందని చెప్పలేని పరిస్థితి. ఖండాంతర టోర్నీకి ముందు 15 బెర్త్‌ల కోసం 20 మంది పోటీపడుతున్నారు. లోయరార్డర్లో ఓ బెర్త్ కోసం రింకూ సింగ్, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. రింకూతో పోలిస్తే రియాన్ పరాగ్, సుందర్ మెరుగైన బౌలర్లు. వారితో పోటీలో రింకూ ఏమేరకు నెగ్గుకొస్తాడో చూడాలి.మ్యాచ్ విషయానికొస్తే.. రింకూ జట్టు మీరట్ కార్పూర్ జట్టుపై 86 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన మీరట్.. మాధవ్ కౌశిక్ (31 బంతుల్లో 95) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో రింకూకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. అనంతరం ఛేదనలో కాన్పూర్ జట్టు తడబడింది. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 9 వికెట్లు కోల్పోయి 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. -
ఆసియా కప్-2025: టీమిండియాలో అతడి కంటే మొనగాడెవడు?
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) గురించి భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టులో అతడి కంటే మొనగాడు మరొకరు లేరని.. ఆసియా కప్-2025 టోర్నమెంట్లో శ్రేయస్‌ను తప్పక ఆడించాలని మేనేజ్మెంట్కు సూచించాడు. కాగా సెప్టెంబరు 9- 28 మధ్య ఆసియా కప్ టీ20 టోర్నీ జరుగనుంది.ఈ క్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మంగళవారం జట్టును ప్రకటించే అవకాశం ఉంది. అయితే, ఈ జట్టులో శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కకపోవచ్చనే కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.టీమిండియాలో అతడి కంటే మొనగాడెవడు?‘‘శ్రేయస్ అయ్యర్ గురించి కచ్చితంగా చర్చ జరగాలి. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో మధ్య ఓవర్లలో శ్రేయస్ అయ్యర్ కంటే గొప్పగా ఆడిన మొనగాడు లేడు. ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెడతాడు. కావాలనుకున్నపుడు బౌండరీలు బాదుతాడు.అంతేకాదు.. మరో ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌గా ఒత్తిడి పడకుండా తానే అంతా చూసుకుంటాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్‌లోనూ శ్రేయస్ అదరగొట్టాడు. ఎన్నో అంచనాలు, ఒత్తిళ్ల నడుమ.. తన కెరీర్లోనే అత్యుత్తమ ఐపీఎల్ ఆడాడు.వాళ్లంతా అలాగే వచ్చారు కదా!భారత టీ20 జట్టును ఐపీఎల్ ప్రదర్శనల ద్వారానే ఎంపిక చేస్తున్నారు కదా! వరుణ్ చక్రవర్తి, రింకూ సింగ్, హర్షిత్ రాణా, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్.. ఇలా అందరూ అలా జట్టులోకి వచ్చిన వాళ్లే. కాబట్టి శ్రేయస్ అయ్యర్ కూడా ఆసియా కప్ టీ20 టోర్నీలో ఆడేందుకు అర్హుడు అవుతాడు.ఇక ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తిలక్ వర్మను తప్పించినట్లయితే.. శ్రేయస్ అయ్యర్ మూడు లేదంటే నాలుగో స్థానంలో సరిగ్గా ఫిట్ అవుతాడు. ఒకవేళ శ్రేయస్‌ను ఐదో స్థానంలో ఆడిస్తే.. టీ20 క్రికెట్లో అది లోయర్ ఆర్డర్ లాంటిదే’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.ఐపీఎల్లో ధనాధన్.. ఫటాఫట్కాగా ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా జట్టుకు టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్‌ను.. మెగా వేలానికి ముందు ఆ ఫ్రాంఛైజీ వదులుకుంది. ఈ క్రమంలో ఈ ముంబై బ్యాటర్ వేలంలోకి రాగా.. పంజాబ్ కింగ్స్ రికార్డు స్థాయిలో రూ. 26.75 కోట్లకు అయ్యర్‌ను కొనుగోలు చేసి సారథిగా నియమించింది.ఇక ఈ సీజన్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన శ్రేయస్ అయ్యర్ ఇటు బ్యాటర్‌గా.. అటు కెప్టెన్‌గా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 17 మ్యాచ్‌లలో కలిపి 604 పరుగులు చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. పంజాబ్‌ను ఫైనల్‌కు చేర్చాడు. అయితే, టైటిల్ పోరులో ఆర్సీబీ చేతిలో ఆరు పరుగుల తేడాతో ఓడటంతో శ్రేయస్, పంజాబ్‌కు భంగపాటు తప్పలేదు.చదవండి: ఆసియా కప్- 2025: అభిషేక్ శర్మకు జోడీగా.. వైభవ్ సూర్యవంశీ ఉండాలి: మాజీ కెప్టెన్ -
Asia Cup: గిల్, శ్రేయస్‌కు అగార్కర్ నో!.. అతడికి లైన్ క్లియర్!
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో ఆడే భారత జట్టులో.. టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) చోటు దక్కించుకుంటాడా? లేదా?.. భారత క్రికెట్ వర్గాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్. గతేడాది జూలైలో గిల్ టీమిండియా తరఫున టీ20 మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత అతడు వన్డే, టెస్టులకు మాత్రమే పరిమితమయ్యాడు.మరోవైపు.. యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)కు కూడా టెస్టుల్లోనే పెద్దపీట వేసింది మేనేజ్మెంట్. ఈ క్రమంలో అతడు కూడా గిల్ మాదిరి గతేడాదే చివరగా టీ20లలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.అదరగొట్టిన అభిషేక్- సంజూఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా గెలిచిన తర్వాత.. రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి స్థానంలో అభిషేక్ శర్మ- సంజూ శాంసన్ (Sanju Samson) ఓపెనింగ్ జోడీగా వచ్చి అదరగొట్టారు. గత కొన్నాళ్లుగా ఓపెనర్లుగా జట్టులో పాతుకుపోయారు. అయితే, ఈసారి టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకాల్లో భాగంగా ఆసియా కప్ టోర్నీని పొట్టి ఫార్మాట్లో నిర్వహించనున్నారు.ఈ క్రమంలో ఈ ఖండాంతర టోర్నీకి భారత జట్టు ఎంపిక ఆసక్తికరంగా మారింది. గిల్, జైసూలను తిరిగి టీ20 జట్టులోకి పిలిపించాలని హర్భజన్ సింగ్ వంటి మాజీ క్రికెటర్లు మేనేజ్మెంట్కు సూచిస్తుండగా.. మరికొందరు మాత్రం అభిషేక్- సంజూ జోడీకి ఓటు వేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. క్రిక్‌బజ్ కథనం ప్రకారం.. శుబ్‌మన్ గిల్‌ను ఆసియా టీ20 కప్ టోర్నీలో ఆడించేందుకు సెలక్షన్ కమిటీ విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ టోర్నీకి ఎంపిక చేసే జట్టులో గిల్‌కు చోటివ్వద్దని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ భావిస్తున్నట్లు సమాచారం.గిల్‌కు అగార్కర్ నో!.. అతడికి లైన్ క్లియర్!ఓపెనింగ్ జోడీగా అభిషేక్- సంజూ రిథమ్‌లో ఉన్నారు కాబట్టి వారినే కొనసాగించాలని అగార్కర్ భావిస్తున్నాడట. గిల్‌ను జట్టులోకి తీసుకుంటే తుదిజట్టు కూర్పు క్లిష్టతరంగా మారుతుందని.. అయితే, యశస్వి జైస్వాల్‌ను మాత్రం బ్యాకప్ ఓపెనర్‌గా తీసుకోవాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.గౌతీ రంగంలోకి దిగితే మాత్రంఅయితే, ఒకవేళ హెడ్‌కోచ్ గౌతం గంభీర్.. గిల్‌ను జట్టులో చేర్చాలని పట్టుబడితే మాత్రం.. అగార్కర్ అందుకు అంగీకరించే అవకాశం ఉంది. మరోవైపు.. దేశీ టోర్నీలు, ఐపీఎల్-2025లో అదరగొట్టిన శ్రేయస్ అయ్యర్‌కు కూడా అగార్కర్ మొండిచేయి చూపే అవకాశం ఉన్నట్లు సమాచారం.తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్‌లను ఈ టోర్నీకి తప్పక ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మిడిలార్డర్లో శివం దూబే, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్ స్థానం కోసం పోటీపడుతున్నారు.సిరాజ్, షమీలకు మొండిచేయిఇక పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా ఆసియా కప్ టోర్నీకి ఫిట్నెస్ సాధించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీనియర్లు మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీలకు ఈ జట్టులో చోటు దక్కడం సాధ్యం కాకపోవచ్చు. బుమ్రా పేస్ దళంలో యువ బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రసిద్ కృష్ణ తప్పక స్థానం దక్కించుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా ఆసియా కప్-2025 టోర్నీకి బీసీసీఐ.. మంగళవారం (ఆగష్టు 19) తమ జట్టును ప్రకటించే అవకాశం ఉంది. అప్పుడే ఈ అంశంపై స్పష్టత వస్తుంది.చదవండి: ఆసియా కప్- 2025: అభిషేక్ శర్మకు జోడీగా.. వైభవ్ సూర్యవంశీ ఉండాలి: మాజీ కెప్టెన్ -
‘ఆసియా కప్- 2025: టీమిండియా ఓపెనర్‌గా వైభవ్ సూర్యవంశీ!’
ఆసియా కప్-2025 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓపెనర్‌గా అభిషేక్ శర్మ (Abhishek Sharma)ను కొనసాగించాలన్న చిక్కా.. సంజూ శాంసన్ (Sanju Samson)ను మాత్రం పక్కనపెట్టాలని సూచించాడు. అభిషేక్‌కు జోడీగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ వైపే తాను మొగ్గుచూపుతానని పేర్కొన్నాడు.ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఆసియా కప్ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తుండగా.. తటస్థ వేదికైన యూఏఈలో మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మెగా ఈవెంట్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మంగళవారం (ఆగష్టు 19) తమ జట్టును ప్రకటించే అవకాశం ఉంది.అందుకే సంజూ వద్దుఈ నేపథ్యంలో క్రిష్ణమాచారి శ్రీకాంత్ సోషల్ మీడియా వేదికగా భారత జట్టు ఓపెనింగ్ జోడీ గురించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘ఇటీవల ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై టీ20 సిరీస్‌లో సంజూ శాంసన్ షార్ట్ బాల్స్ ఎదుర్కోవడంలో ఇబ్బందిపడ్డాడు.ప్రత్యర్థి జట్టు అతడి బలహీనతను క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి సంజూతో ఓపెనింగ్ చేయిస్తే టీమిండియాకు కష్టమే. ఒకవేళ నేనే గనుక సెలక్టర్ అయితే.. ఓపెనర్‌గా అభిషేక్ శర్మకే నా మొదటి ప్రాధాన్యం.వైభవ్ సూర్యవంశీ ఉండాలిఅతడికి జోడీగా నేనైతే వైభవ్ సూర్యవంశీ లేదంటే సాయి సుదర్శన్‌ను ఎంపిక చేస్తాను. నిజానికి టీ20 ప్రపంచకప్-2026 ఆడబోయే 15 మంది సభ్యుల భారత జట్టులోనూ నేను వైభవ్ సూర్యవంశీని చేరుస్తాను. అతడు అంత అద్భుతంగా ఆడుతున్నాడు’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ పేర్కొన్నాడు.అదే విధంగా.. ‘‘ఐపీఎల్-2025లో సాయి సుదర్శన్ ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. అలాగే యశస్వి జైస్వాల్ కూడా రాణించాడు. అందుకే.. అభిషేక్‌కు జోడీగా వైభవ్‌తో పాటు సాయి, జైస్వాల్‌ల పేర్లను కూడా నేను పరిశీలనలోకి తీసుకుంటా.వికెట్ కీపర్‌గా మాత్రం సంజూకు చోటుఇది పోటాపోటీ ప్రపంచం. సంజూ శాంసన్‌కు ఈ జట్టులో ఓపెనర్‌గా అవకాశం దక్కకపోవచ్చు. కానీ వికెట్ కీపర్‌గా సంజూ జట్టులో ఉండే అవకాశం ఉంది. అతడికి బ్యాకప్‌గా జితేశ్ శర్మను తీసుకుంటే బెటర్.ఇక శ్రేయస్ అయ్యర్ కూడా తప్పక టీ20 జట్టులోకి తిరిగి రావాలి. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్‌ల అవసరం జట్టుకు ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు’’ అంటూ క్రిష్ణమాచారి శ్రీకాంత్ తన అభిప్రాయాలు వెల్లడించాడు. సంజూ ప్రదర్శన ఇలాకాగా సంజూ శాంసన్ గతేడాది అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అంతర్జాతీయ టీ20లలో మూడు శతకాలతో పాటు.. ఓ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు.అయితే, స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో మాత్రం ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి 51 పరుగులు మాత్రమే చేయగలిగాడు సంజూ. మరోవైపు.. అభిషేక్ శర్మ 279 పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా నిలవడంతో పాటు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి దూసుకువెళ్లాడు. ఇక 14 ఏళ్ల బిహారీ ప్లేయర్ వైభవ్ ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాల్స్ తరఫున.. అదే విధంగా.. ఇంగ్లండ్‌లో భారత అండర్-19 జట్టు తరఫున దుమ్ములేపిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 9- 28 వరకు ఆసియా కప్ టోర్నీ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: ‘కోహ్లి కాదు!.. వాళ్లిద్దరికి బౌలింగ్ చేయడం కష్టం.. సచిన్ స్మార్ట్’ -
టీమిండియాకు గుడ్ న్యూస్.. ప్రత్యర్ధులకు బ్యాడ్ న్యూస్
ఆసియాకప్-2025కు ముందు టీమిండియాకు ఓ అదరిపోయే వార్త అందింది. స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆసియాకప్‌లో ఆడేందుకు సిద్దంగా ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే బుమ్రా తన నిర్ణయాన్ని సెలక్టర్లు తెలియజేసినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తమ కథనంలో పేర్కొంది.ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో తలపడేందుకు ఇంగ్లండ్‌కు వెళ్లిన బుమ్రా కేవలం మూడు మ్యాచ్‌ల మాత్రమే ఆడాడు. ఆ తర్వాత ఆఖరి టెస్టుకు ముందు బుమ్రాను జట్టు నుంచి బీసీసీఐ రిలీజ్ చేసింది. మూడు మ్యాచ్‌లలో బుమ్రా తన ప్రదర్శనతో ఆకట్టకున్నప్పటికి ఫిట్నెస్ పరంగా మాత్రం కాస్త ఇబ్బంది పడుతూ కన్పించాడు.దీంతో ఆక్టోబర్‌లో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని బుమ్రాకు సెలక్టర్లు విశ్రాంతి ఇస్తారని వార్తలు వినిపించాయి. కానీ ఆసియాకప్‌కు ముందు దాదాపు ఏభై రోజులు విశ్రాంతి లభించడంతో బుమ్రా తిరిగి టీ20 ఫార్మాట్లో ఆడేందుకు సిద్దమయ్యాడు."ఆసియా కప్ జట్టు ఎంపికకు తాను అందుబాటులో ఉంటానని బుమ్రా బుమ్రా సెలెక్టర్లకు తెలియజేశాడు. వచ్చే వారం జరిగే సమావేశంలో సెలక్షన్ కమిటీ ఈ విషయంపై చర్చించనున్నారని" ఓ బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. బుమ్రా చివరగా టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ తరపున పొట్టి క్రికెట్లో ఆడాడు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ ఏడు పరుగుల తేడాతో గెలిచింది. ఈ స్పీడ్ స్టార్ కేవలం 18 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు.ఆసియాకప్-2025కు భారత జట్టు(అంచనా)సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, అక్షర్ పటేల్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, జితేశ్ శర్మచదవండి: ఆసియాకప్ రేసులో గిల్ కంటే అతడే ముందున్నాడు: అశ్విన్ -
ఆసియాకప్ రేసులో గిల్ కంటే అతడే ముందున్నాడు: అశ్విన్
ఆసియాకప్-2025 టీ20 టోర్నీ సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మార్క్యూ ఈవెంట్ కోసం భారత జట్టును అజిత్ అగర్కార్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశముంది.అయితే ఈ టోర్నీకి భారత జట్టులో యవ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు చోటు ఇవ్వాలని లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ సూచించాడు. కాగా టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టాక టీ20 ఫార్మాట్లో ఓపెనర్లగా అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ కొనసాగుతున్నారు.చాలా టీ20 మ్యాచ్‌లకు జైశ్వాల్‌కు విశ్రాంతి ఇచ్చారు. ఇప్పుడు ఆసియాకప్‌నకు జైశ్వాల్‌తో పాటు మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ కూడా ఉన్నాడు. దీంతో భారత జట్టులో ఎవరికి చోటు దక్కుతుందన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది."ఆసియాకప్ జట్టు ఎంపిక గురించి కొన్ని చర్చలు జరుగుతున్నాయి. టీ20 ప్రపంచకప్‌లో యశస్వి జైస్వాల్ బ్యాకప్ ఓపెనర్‌గా ఉన్నందున, శుబ్‌మన్ గిల్‌ను టీ20 ప్రణాళికలకు సరిపోతాడా లేదా అన్నది ఇప్పుడు అందరి మనస్సులను తొలుస్తున్న ప్రశ్న.నావరకు అయితే సెలక్టర్లు గిల్ కంటే జైశ్వాల్‌కే తొలి ప్రధాన్యత ఇస్తారని అనుకుంటున్నాను. రోహిత్ శర్మ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆ స్దానంలో జైశ్వాల్ ఆటోమేటిక్‌గా లభిస్తుంది. అభిషేక్ శర్మ స్దానానికి ఎటువంటి ఢోకా లేదు. ఇప్పుడంతా మరో ఓపెనర్ కోసమే చర్చ. శుబ్‌మన్ గిల్ అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అదేవిధంగా సంజూ శాంసన్ కూడా ఓపెనర్‌గా అద్బుతంగా రాణించాడు. కాబట్టి సెలెక్టర్లకు కష్టమైన పరిస్థితి" అని ఎక్స్‌ప్రెస్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అశ్విన్ పేర్కొన్నాడు.చదవండి: Asia Cup 2025: పాక్-భారత్ మ్యాచ్‌కు భారీ డిమాండ్.. 10 సెకన్లకు రూ.16 లక్షలు! -
ఆసియాకప్‌లో టీమిండియాపై విజయం మాదే: పాక్ క్రికెట్ డైరక్టర్
ఆసియాకప్-2025 కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తొలి అడుగు వేసింది. ఈ మెగా టోర్నీకి 17 మంది సభ్యులతో కూడిన జట్టును పీసీబీ ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా సల్మాన్ అలీ అఘా ఎంపికయ్యాడు. అదేవిధంగా స్టార్ ప్లేయర్లు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లపై సెలక్టర్లు వేటు వేశారు.అయితే జట్టు ప్రకటన అనంతరం విలేకరుల సమావేశంలో పాల్గోన్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు హై-పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ ఆకిబ్ జావేద్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆసియాకప్‌లో భారత జట్టును ఓడించే సత్తా పాక్‌కు ఉందని జావేద్ అభిప్రాయపడ్డాడు. జట్టులోని ప్రతీ ఆటగాడు టీమిండియా విసిరే సవాల్‌కు సిద్ధంగా ఉన్నారని ఈ పాక్ మాజీ పేసర్ తెలిపాడు. కాగా పాకిస్తాన్‌పై టీ20ల్లో భారత్‌కు అద్బుతమైన రికార్డు ఉంది. కానీ పాక్ జట్టు మాత్రం ఆసియా కప్-2022లో విజయాన్ని పునరావృతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు ఇరు జట్లు 13 మ్యాచ్‌లలో ముఖాముఖి తలపడగా.. భారత్ తొమ్మిది మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, పాకిస్తాన్ మూడు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. పాక్ చివరగా దుబాయ్‌లో జరిగిన 2022 ఆసియా కప్ సూపర్ ఫోర్లో భారత్‌పై టీ20 విజయం సాధించింది."పాకిస్తాన్ టీ20 జట్టు టీమిండియాను ఓడించగలదు. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే భారీ అంచనాలు ఉంటాయి. కానీ మేము ఎంపిక చేసిన ఈ 17 మంది సభ్యుల జట్టు ఏ టీమ్‌నైనా ఓడించగలదు. అయితే వారిపై మేము ఎటువంటి ఒత్తిడి తీసుకురావడం లేదు.ఈ జట్టుపై నాకు చాలా నమ్మకం ఉంది. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లను మేము పూర్తిగా పక్కన పెట్టలేదు. ప్రస్తుత ప్రదర్శనల ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేశాము. సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, ఫఖార్ జమాన్ వంటి ఆటగాళ్లు అద్బుతంగా రాణిస్తున్నారు. అందుకే వారిని జట్టులో కొనసాగించాము. సైమ్ తన రీ ఎంట్రీలో కాస్త ఇబ్బంది పడ్డాడు. కానీ ఆ తర్వాత తన రిథమ్‌ను అందుకున్నాడు. ప్రతీ ప్లేయర్‌కు జట్టులోకి తిరిగొచ్చేందు ఎల్లప్పుడూ తలపులు తెరిచే ఉంటాయి. ఎవరు మెరుగైన ప్రదర్శన చేస్తే వారు ఖచ్చితంగా జట్టులో ఉంటారు. వారే పాక్ తరపున ఆడటానికి అర్హులు" జావేద్ పేర్కొన్నాడు.ఆసియా కప్-2025 కోసం పాక్ జట్టు..సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫకర్ జమాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్ (వికెట్-కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీమ్ జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, షాహీన్ అఫ్రిది, సుఫ్యాన్ మొకిమ్చదవండి: Asia Cup 2025: పాక్-భారత్ మ్యాచ్‌కు భారీ డిమాండ్.. 10 సెకన్లకు రూ.16 లక్షలు! -
పాక్-భారత్ మ్యాచ్‌కు భారీ డిమాండ్.. 10 సెకన్లకు రూ.16 లక్షలు!
వరల్డ్ క్రికెట్లో బిగ్గెస్ట్ రైవలరీలలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఒకటి. ఈ దాయాదుల పోరును వీక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు వెయ్యి కళ్లుతో ఎదురుచూస్తుంటున్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయాల ఉద్రిక్తల కారణంగా రెండు జట్లు కేవలం ఐసీసీ, ఏసీసీ ఈవెంట్లు మాత్రమే తలపడతున్నాయి.దీంతో ఈ చిరకాల ప్రత్యర్ధుల పోరు రోజున యావత్తు క్రికెట్ ప్రపంచం టీవీలకు అతుక్కుపోతారు. అయితే అభిమానుల నిరీక్షణకు తెరదించే సమయం అసన్నమవుతోంది. ఈ చిరకాల ప్రత్యర్ధిలు మరోసారి అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమవుతున్నారు.ఆసియాకప్-2025లో భాగంగా సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా పాక్-భారత్ జట్లు తలపడనున్నాయి. అయితే భారత్-పాక్ మ్యాచ్‌కు ఉన్న క్రేజును సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా (SPNI) భారీగా క్యాష్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఆసియాకప్‌లో భారత్ ఆడే మ్యాచ్‌ల సమయంలో పది సెకన్ల సెకన్ల ప్రకటనకు రూ. 14 నుంచి 16 లక్షలు సోనీ నెట్వర్క్ నిర్ణయించినట్లు సమాచారం. భారత్-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్‌కు కూడా ఇదే ధర వర్తించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కాగా సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా 2031 వరకు ఆసియా కప్ మీడియా హక్కులను 170 మిలియన్ డాలర్ల(భారత కరెన్సీలో వెయ్యి కోట్ల పైగా)కు సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో మ్యాచ్‌లు సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌తో పాటు సోనీ లివ్‌లో యాప్‌లో కూడా ప్రసారం కానున్నాయి.ఇక 8 మ్యాచ్‌లు పాల్గోనే ఈ మెగా ఈవెంట్ సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఆసియాకప్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికే తమ జట్టును ప్రకటించగా.. బీసీసీఐ ఒకట్రెండు రోజుల్లో భారత జట్టును వెల్లడించనుంది.ఆసియా కప్-2025 కోసం పాక్ జట్టు..సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫకర్ జమాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్ (వికెట్-కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీమ్ జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, షాహీన్ అఫ్రిది, సుఫ్యాన్ మొకిమ్ఆసియాకప్-2025కు భారత జట్టు(అంచనా)సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, అక్షర్ పటేల్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, జితేశ్ శర్మ -
ఆసియాకప్ కోసం టీమిండియా మాస్టర్ ప్లాన్
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఆసియాకప్ టీ20 టోర్నీకి మరో 22 రోజుల్లో తెరలేవనుంది. సెప్టెంబర్ 9న ప్రారంభం కానున్న ఈ మెగా ఈవెంట్ తొలి మ్యాచ్‌లో అబుదాబి వేదికగా అఫ్గానిస్తాన్, హాంకాంగ్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.ఈ ఆసియా జెయింట్స్ పోరు కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఆగస్టు 19న ప్రకటించే అవకాశముంది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ అనంతరం భారత జట్టుకు ఒక నెల పాటు విరామం లభించింది. వాస్తవానికి ఈ ఏడాది ఆగస్టులో బంగ్లాదేశ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల్లో టీమిండియా తలపడాల్సిండేది.కానీ ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడంతో ఈ సిరీస్ తాత్కాలికంగా వాయిదా పడింది. దీంతో భారత ఆటగాళ్లకు లాంగ్ బ్రేక్ దొరికింది. ఈ క్రమంలో టీమిండియా మెనెజ్‌మెంట్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఆసియాకప్‌నకు ముందు సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు యూఏఈలో ఒక ప్రత్యేక శిబిరాన్ని చేయనుంది. ఇందుకోసం టీమిండియా నాలుగు రోజుల ముందే యూఏఈ గడ్డపై అడుగుపెట్టనుంది. అయితే తొలుత ఆసియాకప్‌కు సిద్దం కావడానికి బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఒక క్యాంప్ ఏర్పాటు చేయాలని బీసీసీఐ సూచించినట్లు సమాచారం.కానీ టీమ్ మెనెజ్‌మెంట్ మాత్రం యూఏఈ పరిస్థితులు అలవాటు పడేందుకు అక్కడకి వెళ్లి తమ శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అయితే ఈ స్పెషల్ క్యాంపు చాలా మంది భారత ఆటగాళ్లకు ఉపయోగపడనుంది.ఐపీఎల్-2025 తర్వాత సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ వంటి ఆటగాళ్లకు మ్యాచ్ ప్రాక్టీస్ లోపించింది. అటువంటి వారు ఈ క్యాంపును సన్నాహాకంగా ఉపయోగించుకోవచ్చు. ఇక దాయాది పాకిస్తాన్ కూడా ఈ మెగా టోర్నీకి తమ సన్నాహాకాలను ప్రారంభించనుంది. అయితే భారత్‌కు భిన్నంగా పాక్ జట్టు అఫ్గాన్-యూఏఈలతో ట్రై సిరీస్ ఆడనుంది.అంతేకాకుండా మెన్ ఇన్ గ్రీన్ ఐసీసీ ఆకాడమీలో నాలుగు రోజుల పాటు ఒక ప్రత్యేక క్యాంపును నిర్వహించనుంది. ఈ టోర్నీ కోసం పీసీబీ తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో స్టార్ ప్లేయర్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజంలకు చోటు దక్కలేదు. ఈ ఆసియా జెయింట్స్ పోరులో పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా వ్యవహరించనున్నాడు.చదవండి: వాళ్ళేమి తోపు ఆటగాళ్లు కాదు.. సెలక్టర్లు మంచి పనిచేశారు: పాక్ మాజీ కెప్టెన్ -
వాళ్ళేమి తోపు ఆటగాళ్లు కాదు.. సెలక్టర్లు మంచి పనిచేశారు: పాక్ మాజీ కెప్టెన్
ఆసియాకప్-2025కు 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆదివారం ప్రకటించింది. ఈ జట్టులో స్టార్ ప్లేయర్లు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లకు చోటు దక్కలేదు. గతంలో కెప్టెన్లగా వ్యవహరించిన ఈ ఇద్దరి సీనియర్ ఆటగాళ్లు ఇప్పుడు ఏకంగా జట్టులోనే చోటు కోల్పోయారు.పేలవ ఫామ్ కారణంగా వారిద్దరిని సెలక్టర్లు పక్కన పెట్టారు. ఇటీవల కాలంలో బాబర్, రిజ్వాన్‌లు పాల్గోని మల్టీ నేషన్ టోర్నమెంట్ ఆసియాకప్ కానుంది. ఫామ్‌తో సంబంధం లేకుండా ఐసీసీ ఈవెంట్లు, ఆసియాకప్ టోర్నీల్లో ఆడేందుకు వారిద్దరికి పీసీబీ సెలక్టర్లు అవకాశమిచ్చేవారు. కానీ ఈసారి మాత్రం వహాబ్ రియాజ్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ వేటు వేసింది. ఇక బాబర్, రిజ్వాన్‌లను సెలక్టర్లు పక్కన పెట్టడానికి గల కారణాలను పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొహమ్మద్ హఫీజ్ వెల్లడించాడు. టీ20 క్రికెట్లో 'సంప్రదాయ శైలి' బ్యాటింగ్‌కు స్వస్తి పలికేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని హాఫీజ్ అన్నాడు. టీ20ల్లో 2022 ఏడాది నుంచి మహ్మద్ రిజ్వాన్ స్ట్రైక్ రేట్ 122.26, బాబర్ స్ట్రైక్ రేట్ 127.34లగా ఉంది. టెస్టు హోదా కలిగి ఉన్న జట్లలో అత్యల్ప స్ట్రైక్ రేట్ కలిగి ఉన్న ఓపెనర్లు వీరిద్దరే."బాబర్ ఆజం, రిజ్వాన్‌లను కీలక ఆటగాళ్లు అని పిలవడం ముందు ఆపేయండి. ఇది చాలా తప్పు. వారిద్దరూ ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్లో ముఖ్యమైన ఆటగాళ్లు కాదు. పాకిస్తాన్‌కు విజయాలు అందించే వాళ్లు కీలక ప్లేయర్లు అవుతారు. సెలక్టర్లు సరైన నిర్ణయం తీసుకున్నారు.గత రెండు సంవత్సరాలుగా సల్మాన్ అలీ అఘా, సైమ్ అయూబ్, హసన్ నవాజ్ వంటి ఆటగాళ్లు నిలకడగా రాణిస్తున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ జట్టులో మ్యాచ్ విన్నర్లగా ఉన్నది వారే. కానీ వారి గురించి మనం మాట్లాడుకోవడం లేదు" అని ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అదేవిధంగా స్టార్ పేసర్లు షాహీన్ షా అఫ్రిది, నసీం షా గురించి హాఫీజ్ మాట్లాడాడు.షాహీన్ షా అఫ్రిది, నసీం షా ఇద్దరూ మైదానంలో పూర్తిగా నిబద్ధతతో ఉండాలి. అలా లేకపోతే సానుకూల ఫలితాలు సాధించలేరు. వారిద్దరూ గత కొంత కాలంగా పాకిస్తాన్‌కు విన్నింగ్ ప్రదర్శనలను అందించలేకపోతున్నారు. కాగా ఆసియాకప్ జట్టులో షాహీన్ అఫ్రిదికి చోటు దక్కగా నసీం షాకు సెలక్టర్లు మొండి చేయి చూపించారు.ఆసియా కప్-2025 కోసం పాక్ జట్టు..సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫకర్ జమాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్ (వికెట్-కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీమ్ జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, షాహీన్ అఫ్రిది, సుఫ్యాన్ మొకిమ్ -
ఆసియా కప్‌కు పాక్ జట్టు ప్రకటన.. అనుకున్నదే జరిగింది..!
యూఏఈ వేదికగా త్వరలో జరుగనున్న ఆసియా కప్ 2025 కోసం పాకిస్తాన్ జట్టును ఇవాళ (ఆగస్ట్ 17) ప్రకటించారు. ఈ జట్టులో అందరూ ఊహించినట్లుగానే స్టార్ ఆటగాళ్లుగా చెప్పుకునే బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్‌లకు చోటు దక్కలేదు. సల్మాన్ అలీ అఘా కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. వేటు పడుతుందని భావించిన మరో స్టార్ షాహీన్ అఫ్రిది జట్టులో చోటు దక్కించుకోగలిగాడు.పాక్ సెలెక్టర్లు యువ ఆటగాళ్లకు పెద్ద పీఠ వేశారు. రిజ్వాన్ స్థానంలో మహ్మద్ హరీస్ వికెట్‌కీపర్‌గా ఎంపికయ్యాడు. ఫకర్ జమాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ లాంటి గుర్తింపు ఉన్న ఆటగాళ్లు ఈ జట్టులో చోటు దక్కింది.పాక్ సెలెక్టర్లు ఇదే జట్టుకు ఆసియా కప్‌కు ముందు యూఏఈలోనే జరిగే ట్రై సిరీస్‌కు కూడా ఎంపిక చేశారు. ఆగస్ట్ 29 నుంచి సెప్టెంబర్ 7 వరకు జరిగే ఈ ట్రై సిరీస్‌లో పాక్‌తో పాటు ఆతిథ్య జట్టు యూఏఈ, ఆఫ్ఘనిస్తాన్ పాల్గొంటున్నాయి. ఈ టోర్నీ ముగిసిన వెంటనే ఆసియా కప్ ప్రారంభమవుతుంది (సెప్టెంబర్ 9-28 వరకు). ఈ ఖండాంతర టోర్నీలో 8 జట్లు పాల్గొంటాయి. పాక్, భారత్.. ఒమన్, యూఏఈతో కలిసి ఒకే గ్రూప్‌లో (ఏ) ఉన్నాయి.ఆసియా కప్‌లో భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ సెప్టెంబర్ 14న దుబాయ్‌లో జరుగనుంది. ఈ టోర్నీలో ఇరు జట్ల మధ్య మరో రెండు మ్యాచ్‌లకు కూడా ఆస్కారం ఉంది. అయితే ఈ టోర్నీలో భారత్ పాల్గొంటుందా లేదా అన్నదే ప్రస్తుతం ప్రశ్నార్థకంగా ఉంది. పహల్గాం దాడి తర్వాతి పరిణామాల్లో భారత్ పాక్‌ను అన్ని విషయాల్లో వెలి వేసింది. క్రికెట్ సహా అన్ని రంగాల్లో పాక్‌ను బహిష్కరించింది.ఇటీవల వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ క్రికెట్ టోర్నీలో భారత్ పాక్‌తో మ్యాచ్‌లను బాయ్‌కాట్ చేసింది. ఆసియా కప్‌లోనూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చని అంచనా. భారతీయులంతా పాక్‌తో ఏ విషయంలోనూ సంబంధాలు కోరుకోవడం లేదు. ట్రై సిరీస్, ఆసియా కప్-2025 కోసం పాక్ జట్టు..సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫకర్ జమాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్ (వికెట్-కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీమ్ జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, షాహీన్ అఫ్రిది, సుఫ్యాన్ మొకిమ్ -
టీమిండియాకు గుడ్ న్యూస్.. కెప్టెన్ సాబ్ ఫుల్ ఫిట్
ఆసియాకప్-2025కు ముందు టీమిండియాకు ఓ గుడ్‌న్యూస్ అందింది. భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. ప్రస్తుతం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉన్న సూర్యకుమార్ తన ఫిట్నెస్ పరీక్షను క్లియర్ చేశాడు. ఈ విషయాన్ని సూర్య అభిమానులతో పంచుకున్నాడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్, ముంబై టీ20 లీగ్ తర్వాత సూర్యకుమార్ తన స్పోర్ట్స్ హెర్నియా గాయానికి జర్మనీలో శస్త్ర చికిత్స చేయించుకున్నాడు.అనంతరం భారత్‌కు తిరిగొచ్చిన ఈ ముంబైకర్ కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నాడు. అయితే ఈ ఏడాది ఆగస్టులో బంగ్లాదేశ్ పర్యటనకు సూర్యకుమార్ దూరం కానున్నాడని వార్తలు వచ్చాయి. కానీ టీమిండియా బంగ్లా టూర్ వాయిదా పడడంతో ఈ నెల ఆరంభంలో సూర్యకుమార్ బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) చేరాడు. ఈ నెల ఆరంభం నుంచి అక్కడే ఉన్న సూర్య తన ఫిట్నెస్ను తిరిగి పొందేందుకు తీవ్రంగా శ్రమించాడు. "కుడివైపు పొత్తికడుపు దిగువన స్పోర్ట్స్ హెర్నియాకు శస్త్రచికిత్స తర్వాత నేను పూర్తిగా కోలుకున్నాను. ఈ విషయాన్ని మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నాను" అని ఓ ప్రకటనలో సూర్య భాయ్ పేర్కొన్నాడు. కాగా ఆసియాకప్ కోసం భారత జట్టును ఆగస్టు 19న ప్రకటించే అవకాశముంది. అనంతరం బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విలేకరుల సమావేశంలో పాల్గోనున్నారు. ఇక ఈ ఖండంతార టోర్నీ సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. భారత్ తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 10న యూఏఈతో తలపడనుంది.ఆసియాకప్-2025కు భారత జట్టు(అంచనా)సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, అక్షర్ పటేల్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, జితేశ్ శర్మ -
Asia Cup: జైస్వాల్ కాదు!.. బ్యాకప్ ఓపెనర్‌గా అతడే సరైనోడు!
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్ నేపథ్యంలో భారత జట్టు కూర్పు గురించి టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ (Mohammed Kaif) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఖండాంతర టోర్నీలో ఓపెనర్లుగా సంజూ శాంసన్ (Sanju Samson), అభిషేక్ శర్మను కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు. అదే విధంగా.. వికెట్ కీపర్లలోనూ మొదటి ప్రాధాన్యంగా తన ఓటు సంజూకేనని స్పష్టం చేశాడు.గిల్, జైసూ రీ ఎంట్రీ పక్కా!కాగా యూఏఈ వేదికగా సెప్టెంబరు 9- 28 వరకు ఆసియా కప్ టోర్నీ జరుగనుంది. ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఈ ఈవెంట్‌కు ఆగష్టు 19న బీసీసీఐ తమ జట్టును ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్, ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ల టీ20 రీఎంట్రీపై చర్చ భారత క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.హర్భజన్ సింగ్ వంటి మాజీ క్రికెటర్లు గిల్, జైసూలను తిరిగి జట్టులోకి తీసుకురావాలని సూచిస్తుండగా.. కైఫ్ మాత్రం భిన్నంగా స్పందించాడు. గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న సంజూ- అభిషేక్ శర్మలనే ఓపెనింగ్ జోడీనే కొనసాగించాలని పేర్కొన్నాడు.జైస్వాల్ కాదు!.. బ్యాకప్ ఓపెనర్‌గా అతడే సరైనోడు!అయితే, వీరికి బ్యాకప్ ఓపెనర్‌గా గిల్‌ను ఎంపిక చేస్తే బాగుంటుందని కైఫ్ అభిప్రాయపడ్డాడు. ‘‘జైస్వాల్, గిల్.. వీరిద్దరిలో ఎవరో ఒకరికి మాత్రమే ఆసియా కప్ జట్టులో చోటు దక్కే వీలుంది. నేనైతే శుబ్‌మన్ గిల్ వైపే మొగ్గుచూపుతాను.ఇంగ్లండ్‌లో కెప్టెన్‌గా గిల్ రాణించాడు. 750 పరుగులు కూడా చేశాడు. అంతేకాదు.. ఐపీఎల్‌లోనూ అతడు మెరుగ్గా రాణించాడు. అయితే, తుదిజట్టులో కాకపోయినా.. బ్యాకప్ ఓపెనర్‌గానైనా గిల్ పేరు ఆసియా కప్ జట్టులో ఉంటుంది.జితేశ్ శర్మకు నా ఓటునిజానికి ఓపెనింగ్ స్లాట్ కోసం గిల్- జైస్వాల్ మధ్య తీవ్రమైన పోటీ ఉంది. అయితే, ఇద్దరిలో ఒక్కరికే ఛాన్స్ ఉంటుంది కాబట్టి.. గిల్ సరైన ఆప్షన్ అవుతాడు. ఇక బ్యాకప్ వికెట్ కీపర్ విషయానికి వస్తే.. జితేశ్ శర్మకు నా ఓటు.ఈ ఏడాది ఐపీఎల్లో ఆర్సీబీ ఫైనల్ చేరి టైటిల్ గెలవడంలో జితేశ్ పాత్ర కూడా కీలకం. కాబట్టి ఆసియా కప్ టోర్నీలో సంజూ ప్రధాన వికెట్ కీపర్‌గా ఉంటే.. జితేశ్ అతడికి బ్యాకప్‌గా ఉండాలి’’ అని మహ్మద్ కైఫ్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. అదే విధంగా.. ఆసియ కప్-2025లో భారత తుదిజట్టును కూడా కైఫ్ ఈ సందర్భంగా ఎంచుకున్నాడు. ఇక బ్యాకప్ ప్లేయర్లుగా వరుణ్ చక్రవర్తి, శుబ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్, జితేశ్ శర్మలను కైఫ్ తన జట్టుకు ఎంపిక చేసుకున్నాడు.ఆసియా కప్-2025లో కైఫ్ ఎంచుకున్న భారత తుదిజట్టు ఇదేసంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా. చదవండి: సంజూ శాంసన్ మెరుపు ఇన్నింగ్స్.. టీమిండియా సెలక్టర్లకు వార్నింగ్! -
ఆసియా కప్-2025 జట్టు ఇదే: సంజూ, రింకూ, తిలక్‌లకు నో ఛాన్స్!
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ముగించుకున్న భారత క్రికెట్ జట్టు తదుపరి ఆసియా కప్-2025 (Asia Cup)కి సన్నద్ధం కానుంది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 9- 28 మధ్య టీ20 ఫార్మాట్లో ఈ టోర్నమెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆగష్టు ఆఖరి వారంలో జట్టును ప్రకటించే అవకాశం ఉంది.గిల్, జైసూ, శ్రేయస్ రైట్ రైట్ఈ నేపథ్యంలో.. వరల్డ్‌కప్ చాంపియన్, టీమిండియా దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసియా కప్ టోర్నీకి తన జట్టును ప్రకటించాడు. రెగ్యులర్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌నే సారథిగా కొనసాగించాలన్న భజ్జీ.. టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gil)తో పాటు యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)ను కూడా ఈ టోర్నీలో ఆడించాలని బీసీసీఐకి సూచించాడు.సంజూ వద్దు.. రిషభ్ ముద్దుఅదే విధంగా.. వీరితో పాటు శ్రేయస్ అయ్యర్‌ను కూడా తిరిగి టీ20 జట్టులోకి తీసుకుంటే బాగుంటుందని భజ్జీ అభిప్రాయపడ్డాడు. ఇక ఏడాది కాలంగా టీ20 ఫార్మాట్లో టీమిండియా ఓపెనర్, వికెట్ కీపర్‌గా ప్రధాన పాత్ర పోషిస్తున్న సంజూ శాంసన్‌ను భజ్జీ పక్కనపెట్టాడు. వికెట్ కీపర్ బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ మంచి ఆప్షన్ అని.. అయితే, తాను మాత్రం రిషభ్ పంత్‌కే ఓటు వేస్తానని హర్భజన్ సింగ్ స్పష్టం చేశాడు.రియాన్ పరాగ్‌కు చోటు.. రింకూకు మొండిచేయిఇక పేస్ దళంలో నాయకుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్‌లకు భజ్జీ స్థానం ఇచ్చాడు. అదే విధంగా ఆల్‌రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రియాన్ పరాగ్‌లను హర్భజన్ ఎంపిక చేశాడు. ఇక చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు కూడా భజ్జీ తన జట్టులో చోటిచ్చాడు.ఓపెనర్‌గా అభిషేక్ శర్మను కొనసాగించాలన్న భజ్జీ.. అతడికి జోడీగా సంజూను కాదని యశస్వి జైస్వాల్‌ను ఎంచుకున్నాడు. ఇక మూడో స్థానంలో తిలక్ వర్మను కాదని శుబ్‌మన్ గిల్‌కు ఓటేశాడు. ఇక నయా ఫినిషర్‌గా పేరొందిన రింకూ సింగ్‌కు కూడా భజ్జీ మొండిచేయి చూపాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ హర్భజన్ సింగ్ ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నాడు.కాగా కఠినమైన సౌతాఫ్రికా పిచ్‌లపై వరుస శతకాలు బాదిన కేరళ బ్యాటర్ సంజూ శాంసన్, హైదరాబాదీ తిలక్ వర్మలను భజ్జీ పక్కన పెట్టడంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వస్తున్నాయి. గిల్, జైసూల టీమిండియా టీ20 రీ ఎంట్రీ కోసం సౌత్ ప్లేయర్లపై వేటు వేయాలనడం సరికాదని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.ఆసియా కప్-2025కి హర్భజన్ సింగ్ ఎంచుకున్న భారత జట్టుయశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, రిషభ్ పంత్/కేఎల్ రాహుల్, రియాన్ పరాగ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.చదవండి: సంజూ శాంసన్ మెరుపు ఇన్నింగ్స్.. టీమిండియా సెలక్టర్లకు వార్నింగ్! -
సంజూ శాంసన్ మెరుపు ఇన్నింగ్స్.. టీమిండియా సెలక్టర్లకు వార్నింగ్!
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్‌కు ముందు టీమిండియా స్టార్ సంజూ శాంసన్ (Sanju Samson) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మెరుపు హాఫ్ సెంచరీతో రాణించి.. సెలక్టర్లకు తానూ రేసులో ఉన్నానంటూ బ్యాట్ ద్వారానే సందేశం ఇచ్చాడు. కాగా ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఆసియా కప్ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తుండగా.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో ఒప్పందం దృష్ట్యా తటస్థ వేదికైన యూఏఈలో మ్యాచ్‌లు జరుగనున్నాయి.సెలక్టర్లకు సవాల్అయితే, ఈ మెగా ఈవెంట్‌కు ఎంపిక చేసే భారత జట్టుకు సంజూ శాంసన్‌ను ఎంపిక చేస్తారా? లేదంటే.. ఓపెనర్ యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్లను పిలిపించి.. ఈ కేరళ బ్యాటర్‌పై వేటు వేస్తారా? అన్న చర్చ జరుగుతోంది. ఇలాంటి సందేహాల నడుమ సంజూ శాంసన్ తనదైన శైలిలో సెలక్టర్లకు సవాల్ విసిరాడు.ప్రెసిడెంట్స్ ఎలెవన్ vs సెక్రటరీ ఎలెవన్కాగా కేరళ క్రికెట్ లీగ్ సీజన్-2 సెప్టెంబరులో ప్రారంభం కానుంది. అయితే, ఈ టోర్నీకి ముందు గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో కేరళ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ ఎలెవన్- కేరళ క్రికెట్ అసోసియేషన్ సెక్రెటరీ ఎలెవన్ మధ్య శుక్రవారం ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది.గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జరిగిన ఈ మ్యాచ్‌లో సంజూ సెక్రటరీ ఎలెవన్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఇక ఈ పోరులో సచిన్ బేబీ కెప్టెన్సీలోని ప్రెసిడెంట్ ఎలెవన్ తొలుత బ్యాటింగ్ చేసింది.రోహన్ కన్నుమ్మల్ (29 బంతుల్లో 60), అభిజిత్ ప్రవీణ్ (18 బంతుల్లో 47) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడగా.. ప్రెసిడెంట్ ఎలెవన్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.విష్ణు విధ్వంసం.. సంజూ మెరుపు హాఫ్ సెంచరీఇక లక్ష్య ఛేదనలో విష్ణు వినోద్ విధ్వంసకర ఇన్నింగ్స్ (29 బంతుల్లో 69)తో విరుచుకుపడగా.. సంజూ శాంసన్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. 36 బంతుల్లో 54 పరుగులతో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ అలరించాడు. ఈ క్రమంలో మరో రెండు బంతులు మిగిలి ఉండగానే సెక్రటరీ ఎలెవన్ లక్ష్యాన్ని ఛేదించి జయభేరి మోగించింది.ఆసియా కప్-2025 టోర్నీకి భారత జట్టు ప్రకటనకు సమయం ఆసన్నమైన వేళ సంజూ ఈ మేరకు బ్యాట్‌తో రాణించడం పట్ల అతడి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా సెప్టెంబరు 9- 28 మధ్య యూఏఈ వేదికగా ఆసియా కప్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే.అత్యధికంగా మూడు శతకాలుకాగా సంజూ అంతర్జాతీయ టీ20లలో ఇప్పటికే మూడు శతకాలు బాదాడు. తద్వారా రోహిత్ శర్మ (5), సూర్యకుమార్ యాదవ్ (4) తర్వాత టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో మొత్తంగా 152కు పైగా స్ట్రైక్‌రేటుతో 861 పరుగులు సాధించాడు.చదవండి: ENG vs SA: వన్డే, టీ20లకు ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. ఆ సిరీస్‌కు కెప్టెన్‌గా జేకబ్ -
ఆసియాకప్ టోర్నీకి ముందు గంభీర్ ప్రత్యేక పూజలు
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను సమంగా ముగించి ఊపిరి పీల్చుకున్న టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్‌కు ఆసియాకప్-2025 రూపంలో మరో సవాలు ఎదురుకానుంది. ఈ ఖండాంతర టోర్నీ సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది.ఈ మెగా ఈవెంట్ కోసం భారత జట్టును ఆగస్టు 19న బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించనుంది. అనంతరం చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, గౌతమ్ గంభీర్ విలేకరుల సమావేశంలో పాల్గోనే అవకాశముంది. అయితే ఈ టోర్నమెంట్ ఆరంభానికి ముందు గౌతమ్ గంభీర్ మధ్యప్రదేశ్‌లోని శ్రీ మహాకాళ జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శించాడు. గంభీర్ శుక్రవారం మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయంలో జరిగిన 'భస్మ ఆరతి'కి తన భార్య, కుమార్తెలతో కలిసి హాజరయ్యారు. ఈ ఆలయంలో గంభీర్ కొన్ని ప్రత్యేక పూజలు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా గంభీర్ ఇంగ్లండ్ టూర్‌కు ముందు అస్సాంలోని ప్రఖ్యాత కామాఖ్య ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించాడు. ఇక ఈ ఏడాది ఆసియాకప్‌లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 10న దుబాయ్ వేదికగా యూఏఈతో తలపడనుంది. అనంతం సెప్టెంబర్ 14న దాయాది పాకిస్తాన్‌తో తాడో పేడో తెల్చుకోనుంది.ఆసియాకప్-2025కు భారత జట్టు(అంచనా)సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, అక్షర్ పటేల్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, జితేశ్ శర్మచదవండి: గౌరవ మిలిటరీ ర్యాంకులు పొందిన క్రికెటర్లు వీరే!.. సచిన్ ఒక్కడే ప్రత్యేకం -
Asia Cup 2025: వారిని కాదని గిల్‌ను ఎంపిక చేస్తారా.. జైస్వాల్, శ్రేయస్ పరిస్థితి ఏంటి..?
త్వరలో ప్రారంభం కానున్న ఆసియా కప్ కోసం భారత జట్టును మరి కొద్ది రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. జట్టు ప్రకటనకు ముందు సెలెక్టర్లు పెద్ద సైజు కసరత్తే చేస్తున్నారు. ఆటగాళ్ల ఎంపిక రొటీన్ ప్రక్రియలా లేదు. 15 బెర్త్‌ల కోసం 20 మంది అర్హులు పోటీపడుతున్నారు. ఎవరిని ఎంపిక చేయాలో, ఎవరిని వదిలేయాలో తెలీక సెలెక్టర్లు తలలు పట్టుకున్నారు.సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్, మొహమ్మద్ షమీ లాంటి టీ20 స్టార్లతో ఇప్పటికే జట్టు పటిష్టంగా ఉండగా.. కొత్తగా శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, మొహమ్మద్ సిరాజ్, బుమ్రా, వాషింగ్టన్ సుందర్ లాంటి ఆటగాళ్లను అకామడేట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో వీరంతా (శ్రేయస్ మినహా) ఆకాశమే హద్దుగా చెలరేగారు. వీరి ఫామ్‌ను బట్టి ఆసియా కప్‌కు తప్పక ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరంతా ఆసియా కప్ ఆడేందుకు సంసిద్దత కూడా వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇదివరకే సెట్ అయిన ఆటగాళ్లను కదిలిస్తారా లేక టెస్ట్ హీరోలను ఎంపిక చేస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంలో సెలెక్టర్లు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.టెస్ట్ జట్టు కెప్టెన్ గిల్, అతని గుజరాత్ టైటాన్స్ సహచరుడు కూడా అయిన సిరాజ్‌ను అకామడేట్ చేయడం వారి ముందున్న ప్రధాన సమస్య. గిల్‌ను ప్లేయింగ్ ఎలెవెన్‌లోకి తేవాలంటే సెట్ అయిన ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మలలో ఎవరో ఒకరిని కదిలించాలి. జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఇది ఆమోదయోగ్యమైంది కాదు. ఒకవేళ కదిలించినా అది పెద్ద సాహసమే అవుతుంది.అలాగని గిల్‌ను పక్కకు పెట్టే పరిస్థితి కూడా లేదు. ఓపెనింగ్ కాకుండా వేరే ఏదైన స్థానంలో అయిన ఆడిద్దామా అంటే ఎక్కడా ఖాళీలు లేవు. బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం సెట్ అయిపోయింది. వన్ డౌన్లో తిలక్ వర్మ, నాలుగో స్థానంలో సూర్యకుమార్, ఆతర్వాత దూబే, హార్దిక్, రింకూ ఇలా బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం ఆక్రమించబడింది. వీరిలో ఏ ఒక్కరినీ కదిలించే పరిస్థితి లేదు. వీరు ఇటీవలికాలంలో అద్భుతంగా రాణించి జట్టుకు చిరస్మరణీయ విజయాలు అందించారు. పొట్టి ఫార్మాట్లో వీరందరికి తిరుగులేని కూడా రికార్డు ఉంది. ర్యాంకింగ్స్‌లో కూడా వీరు టాప్‌లో ఉన్నారు. వీరిని జట్టులో కొనసాగించడం సమంజసమే అయినప్పటికీ.. అంతే అర్హత కలిగిన గిల్, జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ లాంటి ఆటగాళ్లను కూడా కాదనలేని పరిస్థితి. ఈ తల నొప్పులు బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితం కాలేదు. బౌలింగ్ విభాగంలోనూ ఉన్నాయి. అయితే తీవ్రత బ్యాటింగ్‌లో ఉన్నంత లేదు. షమీ స్థానంలో బుమ్రా ఎంట్రీకి ఎలాంటి సమస్య లేనప్పటికీ.. కొత్తగా సిరాజ్‌ను అకామడేట్ చేయడమే సమస్య. అర్షదీప్, బుమ్రా ఫస్ట్ ఛాయిస్ పేసర్లు కాగా.. మూడో పేసర్ స్థానం కోసం సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, షమీ పోటీపడుతున్నారు. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన వాషింగ్టన్ సుందర్‌కు అకామడేట్ చేయడం కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఇబ్బందిగానే ఉంది.ఇన్ని తలనొప్పుల మధ్య సెలెక్టర్లు ఎవరెవరిని ఎంపిక చేస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది. ఆగస్ట్ 19న జట్టును ప్రకటించే అవకాశం ఉంది. -
జపాన్‌లో టీమిండియా కెప్టెన్.. ఆకస్మిక పర్యటనపై అనుమానాలు..?
ఆసియా కప్-2025 కోసం భారత జట్టును మరో రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. అంతా సజావుగా సాగితే ఒకటి రెండు మార్పులు మినహా అంతా అనుకుంటున్న జట్టే యూఏఈకి (ఆసియా కప్ వేదిక) వెళ్లనుంది. ఈ పరిస్థితుల్లో రెవ్‌స్పోర్ట్స్ అనే ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్‌కు చెందిన రోహిత్ జుగ్లన్ అనే జర్నలిస్ట్ బాంబును పేల్చాడు.ఆసియా కప్ సెలెక్షన్‌కు ముందు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జపాన్‌లో ఉన్నాడని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. స్కై జపాన్ను ఎందుకు వెళ్లాడో చెప్పని జుగ్లన్.. అతను ఆసియా కప్ ఆడతాడా లేదా అన్న అనుమానులు మాత్రం వ్యక్తం చేశాడు. టీమిండియాను బీసీసీఐ కార్యకలాపాలను దగ్గర ఫాలో అయ్యే జుగ్లన్ ఈ పోస్ట్ చేయడంతో టీమిండియాలో ఏదో జరుగుతుందని అభిమానులు చర్చించుకుంటున్నారు.Things were looking good till yesterday in every report for a player or 2 but there could be a last minute change for Asia cup sqaud Captain Surya is in Japan for couple of days Lets wait for the captain and a last call #AsiaCup2025— Rohit Juglan (@rohitjuglan) August 13, 2025అసలే గత కొద్ది రోజులుగా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌నే భారత టీ20 కెప్టెన్‌గానూ నియమించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. చాలా మంది మాజీలు కూడా ఈ వాదనను సమర్దిస్తున్నారు. గిల్ టెస్ట్ కెప్టెన్‌గా తన తొలి పర్యటనలోనే (ఇంగ్లండ్) విజయవంతం కావడంతో అతనికి మద్దతు పెరిగింది. ఈ పరిస్థితుల్లో స్కై విదేశాలకు వెళ్లడం అనుమానాలకు తావిస్తుంది.వాస్తవంగా మేజర్ టోర్నీలకు జట్టు ఎంపిక సమయంలో కెప్టెన్లు కూడా సెలెక్టర్లతో డిస్కషన్స్‌లో పాల్గొంటారు. అయితే స్కై కెప్టెన్ అయినప్పటి నుంచి ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ కనిపించలేదు. బీసీసీఐ పెద్దలు స్కైను తాత్కాలిక కెప్టెన్ అనుకున్నారో ఏమో కానీ అతనికి అంత సీన్ ఇవ్వలేదు. స్కై కూడా వరుస విజయాలు సాధించినా ఎప్పుడూ కెప్టెన్లా(ఆఫ్ ద ఫీల్డ్) ప్రవర్తించలేదు.తాజా పరిస్థితులను బట్టి చూస్తే స్కై కెప్టెన్సీకి కాలం చెల్లినట్లు కనిపిస్తుంది. ఆసియా కప్‌కు గిల్‌నే కెప్టెన్‌గా ఎంపిక చేసి, స్కైను సాధారణ ఆటగాడిగా కొనసాగమని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది తెలిసే స్కై ఆసియా కప్ నుంచి తప్పుకోవాలని చూస్తున్నట్లు వినికిడి. గిల్‌ను కొందరు బీసీసీఐ పెద్దలు ఆల్ ఫార్మాట్ కెప్టెన్‌గా ప్రమోట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. రోహిత్ రిటైరయ్యాక వన్డే పగ్గాలు కూడా గిల్కేనని సంకేతాలు అందాయి. మిగిలింది టీ20 కెప్టెన్సీ. దీన్ని కూడా గిల్‌కే కట్టబెడితే ఓ పని అయిపోతుందని బీసీసీఐలో ఓ కోఠరీ యత్నిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో స్కై బలపశువు కావచ్చు. -
టీమిండియా మాతో ఆడకపోవడమే మంచింది.. ఆ చావుదెబ్బను ఊహించలేము: పాక్ మాజీ
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ ఇటీవల The Game Plan అనే యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్ 2025లో భారత్ తమతో ఆడకపోతేనే మంచిదని అభిప్రాయపడ్డాడు. ఇటీవల వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో భారత్ తమతో మ్యాచ్‌లను ఎలాగైతే బాయ్‌కాట్ చేసిందో ఆసియా కప్‌లోనూ అలాగే చేస్తే బాగుంటుందని అన్నాడు.ఒకవేళ భారత్ ఆసియా కప్‌లో తమతో మ్యాచ్‌లు ఆడేందుకు ముందుకు వస్తే మాత్రం వారు కొట్టే చావుదెబ్బను ఊహించలేమని తెలిపాడు. ఇలా జరగకూడదని దేవుడిని ప్రార్దిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.బాసిత్ అలీ చేసిన ఈ వ్యాఖ్యలు పాక్ అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. బాసిత్ వ్యాఖ్యలపై పాక్ మీడియా కూడా దుమ్మెత్తిపోస్తుంది. మరోవైపు భారత అభిమానులు మాత్రం బాసిత్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారు. కరెక్ట్‌గా చెప్పాడంటూ సోషల్‌మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. తాజాగా పాక్ విండీస్ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న తర్వాత బాసిత్ ఈ వ్యాఖ్యలు చేశాడు. విండీస్‌తో జరిగిన చివరి వన్డేలో పాక్ 92 పరుగులకే ఆలౌటై, 202 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ ఓటమితో పాక్ విండీస్‌కు 35 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్‌ను కోల్పోయింది.ఈ ఓటమి తర్వాత బాసిత్ అలీ పాక్ జట్టుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇలాంటి జట్టుతో భారత్ లాంటి పటిష్ట జట్టును ఎప్పుడు ఓడించాలంటూ కామెంట్లు చేశాడు.కాగా, యూఏఈ వేదికగా టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా కప్-2025లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ సెప్టెంబర్ 14న జరగనుంది. ఈ టోర్నీలో ఇరు జట్ల మధ్య మరిన్ని మ్యాచ్‌లు జరిగే ఆస్కారం కూడా ఉంది. దీనికి ముందు పాక్‌తో ఆడేందుకు భారత ప్రభుత్వం సమ్మతించాలి. పాక్‌తో ఆడే విషయమై భారత క్రీడాభిమానులు, క్రికెట్ విశ్లేషకులు, మాజీలు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు క్రికెట్ వేరు, దేశ సమస్య వేరని అంటుంటే.. మరికొందరు మాత్రం నీచ బుద్ది ఉన్న పాక్‌తో క్రికెటే కాకుండా ఏ ఆట ఆడకూడదని భీష్మించుకూర్చున్నారు. -
Asia Cup 2025: సంజూ శాంసన్‌కు నో ఛాన్స్..? ఆర్సీబీ స్టార్‌కు చోటు?
ఆసియాకప్-2025 టోర్నీకి సమయం అసన్నమవుతోంది. ఈ మెగా ఈవెంట్ సెప్టెంబర్ 9న నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. ఈ ఖండాంతర టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గోనున్నాయి. భారత క్రికెట్ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదాలో బరిలోకి దిగనుంది.ఈ ఆసియా సింహాల పోరు కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ వచ్చే వారం ప్రకటించనుంది. అయితే ఈ 18 మంది సభ్యుల జట్టులో ఎవరికి చోటు దక్కుతుందా అని అందరూ ఆతృతగా ఎదరుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్ దీప్ దాస్‌గుప్తా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆసియాకప్ కోసం భారత జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు చోటు దక్కడం కష్టమేనని అతడు అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్లో అతడి కంటే మెరుగ్గా రాణించిన వికెట్ కీపర్లు ఉన్నారని ఆయన అన్నారు.కాగా గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంజూ శాంసన్ టీ20ల్లో అదరగొట్టాడు. శాంసన్ 16 ఇన్నింగ్స్‌లలో 34.78 సగటుతో 487 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. కానీ బలమైన ఇంగ్లండ్ జట్టుపై మాత్రం ఈ కేరళ ఆటగాడు బ్యాట్ ఝూళిపించలేకపోయాడు. ఐదు ఇన్నింగ్స్‌లలో కేవలం 51 పరుగులు మాత్రమే చేశాడు. అందులో మూడు సింగిల్ డిజిట్ స్కోర్లు ఉన్నాయి."సంజూ శాంసన్ ఇటీవల కాలంలో టీ20ల్లో అద్బుతంగా రాణించాడు. కానీ స్వదేశంలో ఇంగ్లండ్‌తో పూర్తి స్దాయి జట్టుతో ఆడినప్పుడు శాంసన్ ఇబ్బంది పడ్డాడు. సూర్యకుమార్ నాయకత్వంలో భారత్ తమ ప్రధాన జట్టులో ఆడిన ఏకైక సిరీస్ అది. అక్కడ అతడు ఆకట్టుకోలేకపోయాడు. అతడు ఆసియాకప్‌నకు ఎంపికయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఓపెనర్‌గా అభిశర్మ ఎలానూ ఉంటాడు. మరో ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌ను ఎంపిక చేయాలని భావిస్తున్నాను. అతడికి టీ20ల్లో మంచి రికార్డుతో పాటు అనుభవం ఉంది. ఇప్పుడు వికెట్ కీపర్ స్లాట్ కోసం జితేష్ శర్మ, సంజూ శాంసన్ల మధ్య పోటీ నెలకొంది. జితేష్‌కు మిడిల్ ఆర్డర్లో అనుభవం ఉంది. అంతేకాకుండా అతడు మంచి ఫినిషింగ్ కూడా అందించగలడు. ఐపీఎల్లో ఆర్సీబీ తరపున తన సత్తా ఎంటో జితేష్ చూపించాడు. ఒకవేళ శాంసన్ ఎంపికైనా తుది జట్టులో చోటు దక్కడం కష్టమే" అని దాస్‌గుప్తా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. -
మీకు ఆటే ముఖ్యమా?: బీసీసీఐ తీరుపై హర్భజన్ ఆగ్రహం
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీరుపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మండిపడ్డాడు. దేశం కంటే మీకు ఆటే ముఖ్యమా అంటూ బోర్డు పెద్దల్ని ప్రశ్నించాడు. క్రికెట్ కంటే సైనికుల త్యాగం ఎంతో గొప్పదని.. కాబట్టి ఇప్పటికైనా ఆసియా కప్-2025 (Asia Cup) విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించాడు.పాక్‌తో మ్యాచ్ బహిష్కరించిన ఇండియా చాంపియన్స్ఇటీవల పహల్గామ్లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి అమాయక పర్యాటకుల ప్రాణాలు పొట్టనబెట్టుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో తీవ్రంగా స్పందించిన భారత సైన్యం.. ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఇందుకు పాక్ సైన్యం ప్రతిస్పందించగా.. దాయాదికి కూడా గట్టిగానే బుద్ధి చెప్పింది.ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు నెలకొనగా.. ఇటీవల జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) టోర్నీలో భారత ఆటగాళ్లు పాకిస్తాన్ (IND vs PAK)తో మ్యాచ్‌ను బహిష్కరించారు. సెమీ ఫైనల్లో దాయాదితో పోటీ పడాల్సి ఉండగా.. తమకు అన్నింటికంటే దేశమే ముఖ్యమని శిఖర్ ధావన్, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ వంటి మాజీ క్రికెటర్లు ఈ మ్యాచ్ నుంచి కూడా నిష్క్రమించారు.ఆసియా కప్‌లో మాత్రం దాయాదితో పోరుకు సై!అయితే, ఆసియా కప్ టీ20 టోర్నీ-2025లో మాత్రం భారత్- పాకిస్తాన్ ఒకే గ్రూపులో ఉండటంతో పాటు.. అత్యధికంగా మూడుసార్లు ముఖాముఖి పోటీ పడే అవకాశం ఉన్నట్లు షెడ్యూల్ ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ తీరుపై మాజీ క్రికెటర్లు, అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మీకు ఆటే ముఖ్యమా?పాకిస్తాన్‌తో టీమిండియా మ్యాచ్‌లను బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ముందుగా నిర్ణయించిన ప్రకారం మ్యాచ్‌లు యథావిధిగా సాగనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ స్పందించాడు. ‘‘వారికి (బీసీసీఐ) ఏది ముఖ్యమో.. ఏది ప్రాధాన్యం లేని విషయమో అర్థం కావడం లేదు.సరిహద్దులో నిలబడి ప్రాణాలకు తెగించి దేశాన్ని కాపాడే సైనికుల కుటుంబాలు.. తరచూ వారిని చూడలేవు. ఒక్కోసారి సైనికులు తమ ప్రాణాలనే త్యాగం చేయాల్సి వస్తుంది. వాళ్లు ఎప్పటికీ ఇంటికి తిరిగా రాలేరు కూడా!వారి త్యాగమే ఎంతో గొప్పదిఅందరి కంటే వారి త్యాగమే ఎంతో గొప్పది. వారితో పోలిస్తే ఇలాంటివి చాలా చిన్న విషయాలు. వారి కోసం మనం ఒక్క క్రికెట్ మ్యాచ్‌ను వదులుకోలేమా? మన ప్రభుత్వం కూడా ‘హింస- త్యాగం’ ఒకేచోట ఉండలేవని చెప్తోంది.కొంత మంది సరిహద్దులో యుద్ధం చేస్తున్నపుడు.. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నపుడు.. మనం మాత్రం వెళ్లి వాళ్లతో క్రికెట్ ఆడటమా?.. సమస్య పరిష్కారమయ్యేంత వరకు క్రికెట్ అనేది చిన్న విషయంలా చూడాలి. దేశ ప్రయోజనాలే మనకు ప్రథమ ప్రాధాన్యం కావాలి.మనకు ఏ గుర్తింపు వచ్చినా.. అది దేశం కారణంగానేనని గుర్తుపెట్టుకోండి. మీరొక ఆటగాడు లేదంటే నటుడు.. ఎవరైనా కానీవండి. దేశం కంటే ఎవరూ గొప్పవారు కాదు. దేశం తరఫున తప్పక నిర్వర్తించాల్సిన విధులను విస్మరించకూడదు’’ అంటూ భజ్జీ బీసీసీఐ తీరును ఎండగట్టాడు. చదవండి: Shai Hope: వన్డే క్రికెట్ చరిత్రలో మోస్ట్ అండర్ రేటెడ్ బ్యాటర్ -
ఆసియా కప్ 2025కు టీమిండియా ఇదే..?
త్వరలో జరుగనున్న ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును మరికొద్ది రోజుల్లో అధికారికంగా ప్రకటిస్తారు. అయితే ఈలోపే జట్టు ఇలా ఉండబోతుందంటూ సోషల్‌మీడియాలో ప్రచారం మొదలైంది. పీటీఐ సోర్సస్ ప్రకారం.. టీమిండియాలో చెప్పుకోదగ్గ మార్పులేమీ లేవు. చాలా గ్యాప్ తర్వాత బుమ్రా పొట్టి ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ కొనసాగనున్నాడు. అతని డిప్యూటీ (వైస్ కెప్టెన్) విషయంలో మాత్రం బీసీసీఐ ముల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తుంది. అక్షర్‌ను కొనసాగించాలా లేదా శుభ్‌మన్ గిల్‌కు బాధ్యతలు అప్పజెప్పాలా అన్న సందిగ్దంలో ఉన్నట్లు సమాచారం. ఓ పేసర్ బెర్త్ కోసం హర్షిత్ రాణా, ప్రసిద్ద్ కృష్ణ మధ్య పోటీ ఉన్నట్లు తెలుస్తుంది. రెండో వికెట్‌కీపర్‌గా జితేశ్ శర్మ, ధృవ్ జురెల్ పోటీ పడుతున్నారు.టాప్-5గా అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఎంపిక కావడం ఖరారైపోయింది. ఇదే జరిగితే గిల్ స్థానం ఎక్కడ అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. టెస్ట్ జట్టుకు కెప్టెన్ అయిన గిల్‌ను జట్టులోకి తీసుకొని ఖాళీగా కూర్చోబెట్టే పరిస్థితి లేదు. అలాగని తప్పించనూ లేరు. గిల్‌ను తుది జట్టులోకి తప్పక తీసుకోవాలని భావిస్తే టాపార్డర్ డిస్టర్బ్ అయ్యే ప్రమాదం ఉంది.భారత్ చివరిగా ఆడిన ఇంగ్లండ్ సిరీస్‌లో టాపార్డర్ విశేషంగా రాణించింది. ముఖ్యంగా ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఓ హాఫ్ సెంచరీతో పాటు విధ్వంసకర శతకం బాదాడు. తిలక్ వర్మ, హార్దిక్ తలో హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించారు. సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ తడబడినా మరో అవకాశం ఇవ్వక తప్పదు.ఆల్‌రౌండర్ల కోటాలో శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ తప్పక తుది జట్టులో ఉంటారు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ కొనసాగుతారు. స్పెషలిస్ట్ పేసర్‌గా అర్షదీప్ స్థానం పక్కా. రింకూ సింగ్ స్థానమే ప్రశ్నార్థకంగా మారింది. గత సిరీస్‌లో అతను చెప్పుకోదగ్గ ప్రదర్శన ఒక్కటీ చేయలేదు. పైగా జట్టులో ఆల్‌రౌండర్ల హవా కూడా పెరగడంతో రింకూ స్థానం గల్లంతయ్యే ప్రమాదం ఉంది.ఆసియా కప్-2025 కోసం భారత జట్టు (పీటీఐ సోర్సస్ ప్రకారం)..సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, అక్షర్ పటేల్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా/ప్రసిద్ద్ కృష్ణ, జితేశ్ శర్మ/ధృవ్ జురెల్ -
శ్రేయస్ అయ్యర్ పాస్.. ఫిట్నెస్ టెస్టుకు హార్దిక్ పాండ్యా
ఆసియాకప్-2025 ముందు భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన ఫిట్నెస్ను పరీక్షించుకోనున్నాడు. తాజాగా పాండ్యా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో చేరాడు. ఈ మెగా టోర్నీ ముంగిట చాలా మంది భారత ఆటగాళ్లు సీవోఎకు క్యూ కట్టారు. టీమిండియా వైట్‌బాల్ సెటాప్‌లో భాగమైన పాండ్యా.. ఐపీఎల్-2025 ముగిసిన తర్వాత దాదాపు రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకున్నాడు. గత నెల రోజుల నుంచి తన శిక్షణ ప్రారంభించాడు. ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం.. పాండ్యా ఆగస్టు 11, 12 తేదీల్లో తన ఫిట్నెస్ టెస్టు చేసుకోనున్నాడు. ఈ బరోడా ఆల్‌రౌండర్ ఆదివారం తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఎన్సీఎకి ఒక చిన్న ట్రిప్ అనే క్యాప్షన్‌తో స్టోరీని షేర్ చేశాడు.అయ్యర్ పాస్..మరోవైపు ఎన్సీఎలో ఉన్న భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తన ఫిట్నెస్ పరీక్షను జూలై 27-29 పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అతడు ఆసియాకప్-2025తో తిరిగి టీ20 జట్టులోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మిడిల్ ఆర్డర్లో అనుభవం ఉన్న బ్యాటర్ జట్టుకు అవసరమని సెలకర్లు భావిస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్-2025లో అయ్యర్ అద్బుతంగా రాణించిడంతో అతడికి తిరిగి పిలుపునిచ్చేందుకు సెలక్టర్లు సిద్దమైనట్లు వినికిడి. ఇక టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరోవారంలో తన పూర్తి ఫిట్నెస్ను పొందనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.ఇక ఈ ఖండాంతర టోర్నీ సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. భారత్ తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 10న దుబాయ్ వేదికగా హాంకాంగ్‌తో తలపడనుంది. అనంతరం సెప్టెంబర్ 14న చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో టీమిండియా అమీతుమీ తెల్చుకోనుంది.చదవండి: 'అతడొక టాలెంటెడ్ ప్లేయర్.. చేజేతులా కెరీర్ నాశనం చేసుకున్నాడు -
భారత స్టార్ ప్లేయర్‌కు షాక్.. శుబ్‌మన్ గిల్‌కు ప్రమోషన్..!
ఆసియాకప్-2025 సెప్టెంబర్ 9 నుంచి యూఈఏ వేదికగా ప్రారంభం కానుంది. 8 జట్లు పాల్గోనే ఈ మెగా టోర్నీకి యూఏఈలోని దుబాయ్, అబుదాబిలు ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ మెగా ఈవెంట్‌కు భారత జట్టును బీసీసీఐ వచ్చే వారం ప్రకటించే అవకాశముంది. ఇప్పటికే అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ జట్టు ఎంపికపై కసరత్తలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.సూర్యకుమార్ ఫిట్..?గత నెలలో స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ చేయించుకున్న టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టోర్నీ ఆరంభ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధించనున్నాడు. దీంతో ఈ ఏడాది ఆసియాకప్‌లో భారత జట్టుకు సూర్యనే సారథ్యం వహించనున్నాడు. అయితే ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టును అద్భుతంగా నడిపించిన టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌కు ప్రమోషన్ ఇచ్చేందుకు సెలక్టర్లు సిద్దమైనట్లు సమాచారం. గిల్‌ను భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా నియమించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆసియాకప్‌లో సూర్యకు డిప్యూటీగా గిల్ వ్యవహరించే సూచనలు కన్నిస్తున్నాయి.అక్షర్‌కు షాక్..?కాగా ప్రస్తుతం భారత టీ20 జట్టు కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఉన్నాడు. రోహిత్ శర్మ టీ20ల నుంచి తప్పుకొన్న తర్వాత సూర్య కెప్టెన్‌గా, అక్షర్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అయితే ఏడాది తిరగక ముందే అక్షర్‌పై వేటు వేసేందుకు బీసీసీఐ సిద్దమైంది. గిల్‌ను ఆల్‌ఫార్మాట్ కెప్టెన్‌గా చేసేందుకు బీసీసీఐ యోచిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. గిల్ ప్రస్తుతం వన్డేల్లో రోహిత్ శర్మ డిప్యూటీగా ఉన్నాడు. ఒకవేళ హిట్‌మ్యాన్ వన్డేల నుంచి తప్పుకొంటే 50 ఓవర్ల ఫార్మాట్లో కూడా ఈ పంజాబీ బ్యాటర్ భారత జట్టును నడిపించే అవకాశముంది. కాగా గిల్ చివరగా భారత తరపున టీ20ల్లో గతేడాది శ్రీలంకపై ఆడాడు. కానీ ఐపీఎల్లో మాత్రం దుమ్ములేపాడు. ఐపీఎల్-2025 సీజన్లో 650 పరుగులతో గుజరాత్ తరపున లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు.చదవండి: మహేశ్ బాబు మరదలితో సచిన్ ప్రేమ?!.. టెండుల్కర్ ఏమన్నాడంటే.. -
ఆసియాకప్ గెలిచేది ఆ జట్టే: సౌరవ్ గంగూలీ
ఆసియాకప్-2025 సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 8 జట్లు పాల్గోనే ఈ టోర్నీ దుబాయ్, అబుదాబి వేదికలగా జరగనుంది. ఈ మెగా ఈవెంట్ కోసం తమ ఆస్తశాస్త్రాలను ఆయా జట్లు సిద్దం చేసుకుంటున్నాయి. ఇప్పటికే అఫ్గానిస్తాన్, బంగ్లా క్రికెట్ బోర్డులు తమ ప్రిలిమిరీ జట్లను సైతం ప్రకటించాయి. బీసీసీఐ కూడా భారత జట్టు ఆగస్టు మూడో వారంలో ప్రకటించనుంది. కాగా భారత క్రికెట్ జట్టు ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ తర్వాత పొట్టి ఫార్మాట్లో ఆడడం ఇదే తొలిసారి. దాదాపు ఎనిమిది నెలల తర్వాత టీ20 సిరీస్ ఆడుతున్నప్పటికి సూర్య అండ్ కోపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆసియాకప్ విజేతగా టీమిండియా నిలుస్తుందని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జోస్యం చెప్పాడు.భారత క్రికెట్ జట్టుకు టీ20 ఫార్మాట్లో సుదీర్ఘమైన విరామం లభించింది. ఐపీఎల్ తర్వాత ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం ఇంగ్లండ్ వెళ్లారు. ఇప్పుడు ఆసియాకప్ టీ20 టోర్నీలో పాల్గోనున్నారు. భారత జట్టు ప్రస్తుతం చాలా పటిష్టంగా ఉంది.మెన్ ఇన్ బ్లూ రెడ్ బాల్ క్రికెట్లోనే కాదు వైట్‌బాల్ క్రికెట్లో కూడా చాలా బలంగా ఉన్నారు. కాబట్టి భారత్ టైటిల్ దక్కించుకుంటుందని భావిస్తున్నారు. దుబాయ్ లాంటి మంచి పిచ్‌లపై భారత్‌ను ఓడించడం చాలా కష్టం అని గంగూలీ పీటీఐతో పేర్కొన్నాడు. కాగా భారత్ తమ ఆసియాకప్ ప్రయాణాన్ని సెప్టెంబర్ 10న హాంకాంగ్ మ్యాచ్‌తో ప్రారంభించనుంది.చదవండి: SA vs AUS: చెలరేగిన హాజిల్‌వుడ్, డేవిడ్.. సౌతాఫ్రికాపై ఆసీస్ ఘన విజయం -
ఆసియాకప్-2025కు శుబ్‌మన్ గిల్ దూరం!?
ఆసియాకప్-2025కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరో నెల రోజుల్లో యూఏఈ వేదికగా ఈ మెగా టోర్నీ షూరూ కానుంది. సెప్టెంబర్ 9న అబుదాబి వేదికగా తొలి మ్యాచ్‌లో హాంకాంగ్, అఫ్గానిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ ఆసియా సింహాల పోరు కోసం బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డులు తమ ప్రాథిమిక జట్లను ప్రకటించాయి.బీసీసీఐ సెలక్షన్ కమిటీ కూడా వచ్చే వారం భారత జట్టును ప్రకటించే అవకాశముంది. అయితే ఈ టోర్నీ కోసం భారత జట్టులో టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను చేర్చాలా వద్దా అని సెలక్టర్లు తర్జబర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. వెస్టిండీస్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌ను దృష్టిలో ఉంచుకుని గిల్‌కు విశ్రాంతి ఇవ్వాలని అజిత్ అగార్కర్ అండ్ కో భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కాగా ఆసియాకప్ ముగిసిన నాలుగు రోజులకే భారత్-వెస్టిండీస్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఆసియాకప్‌నకు గిల్‌కు విశ్రాంతి ఇచ్చి టీ20 వరల్డ్ కప్-2026లో అతడిని ఆడించాలని సెలక్టర్లు యోచిస్తున్నట్లు ది టెలిగ్రాఫ్ తమ కథనంలో పేర్కొంది.కాగా గిల్ వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు ముందు దులీప్ ట్రోఫీ-2025లో ఆడనున్నాడు. నార్త్‌జోన్ కెప్టెన్‌గా శుబ్‌మన్ వ్యవహరించనున్నాడు. కాగా గిల్ ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కెప్టెన్‌గా, వ్యక్తిగత ప్రదర్శనంగా పరంగా ఆకట్టుకున్నాడు.ఐదు మ్యాచ్‌లలో 75.40 సగటుతో 754 పరుగులు చేసి గిల్ ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. ఇక ఆసియాకప్‌లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 10న దుబాయ్ వేదికగా యూఏఈతో తలపడనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 14న దాయాది పాకిస్తాన్‌తో మెన్ ఇన్ బ్లూ అమీతుమీ తెల్చుకోనుంది.చదవండి: శుబ్‌మన్ గిల్ జెర్సీ కోసం పోటీ.. ఎన్ని లక్షలకు అమ్ముడుపోయిందంటే? -
సాయి సుదర్శన్‌కు మరోసారి మొండిచేయి.. ప్లాన్ ఏంటి?
టీమిండియా స్టార్ సాయి సుదర్శన్‌కు మరో దేశవాళీ టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. దులిప్ ట్రోఫీ (Duleep Trophy)-2025 జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌కు బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్లో ఆడే జట్టులోనూ స్థానం దక్కలేదు.తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (TNCA) తాజాగా ఈ దేశీ టోర్నమెంట్‌కు టీఎన్‌సీఏ ఎలెవన్, టీఎన్‌సీఏ ప్రెసిడెంట్స్ ఎలెవన్ పేరిట రెండు జట్లు ప్రకటించింది. అయితే, ఇందులో ఏ జట్టులోనూ సాయి సుదర్శన్ (Sai Sudharsan) పేరు లేదు.అంతకు ముందు సౌత్‌జోన్ జట్టులోనూ సాయి సుదర్శన్‌కు చోటు దక్కలేదు. దులిప్ ట్రోఫీ ఆడే ఈ జట్టులో సాయితో పాటు.. టీమిండియా స్టార్లు వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ కృష్ణ పేర్లు కూడా కనిపించలేదు.ఐపీఎల్లో అదరగొట్టాడుకాగా చెన్నైకి చెందిన సాయి సుదర్శన్ ఈ ఏడాది ఐపీఎల్లో అదరగొట్టాడు. టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆడిన పద్నాలుగు మ్యాచ్‌లలో కలిపి 54కు పైగా సగటుతో 759 పరుగులు సాధించాడు.తద్వారా ఐపీఎల్-2025లో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచి.. ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. అతడి ఖాతాలో ఓ సెంచరీతో పాటు ఆరు అర్ధ శతకాలు కూడా ఉన్నాయి. ఈ మేరకు అద్భుత ప్రదర్శనతో టీమిండియా సెలక్టర్లను ఆకట్టుకున్న సాయి సుదర్శన్.. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్ సందర్భంగా టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో ఆడిన సాయి ఆరంభంలోనే డకౌట్ అయి నిరాశపరిచాడు. ఆ తర్వాత ఈ వన్‌డౌన్ బ్యాటర్‌పై వేటు వేసిన యాజమాన్యం తిరిగి నాలుగు, ఐదో టెస్టుల్లో ఆడించింది. ఈ సిరీస్‌లో సాయి సాధించిన పరుగులు వరుసగా.. 0, 30, 61, 0, 38, 11.ప్లాన్ అదేనా?ఇంగ్లండ్ పర్యటనలో ఈ మేర ఒక్క హాఫ్ సెంచరీ మినహా 23 ఏళ్ల సాయి సుదర్శన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో దేశీ ఫస్ట్‌క్లాస్ టోర్నీలకు అతడు దూరం కావడం గమనార్హం. అయితే, ఈసారి టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా కప్-2025లో సాయి సుదర్శన్‌కు సెలక్టర్లు ఆడే అవకాశం ఇవ్వొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే అతడికి కొన్నాళ్లు విశ్రాంతినిచ్చినట్లు తెలుస్తోంది.మరోవైపు.. టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సహా అర్ష్‌దీప్ సింగ్, శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, హర్షిత్ రాణా, తిలక్ వర్మ తదితరులు దులిప్ ట్రోఫీ-2025 ఆడేందుకు సిద్ధమయ్యారు.బుచ్చిబాబు టోర్నమెంట్‌కు టీఎన్‌సీఏ ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టు:ఆర్.సాయి కిషోర్ (కెప్టెన్.), సి. ఆండ్రీ సిద్దార్థ్ సి (వైస్ కెప్టెన్.), బి. ఇంద్రజిత్, విజయ్ శంకర్, ఎం. షారుక్ ఖాన్, ఆర్. విమల్ కుమార్, ఎస్. రాధాకృష్ణన్, ఎస్. లోకేశ్వర్, జి. అజితేష్, జె. హేంచుదేశన్, ఎం. సిద్ధార్థ్, ఆర్.ఎస్. అంబరీష్, సి.వి. అచ్యుత్, హెచ్. త్రిలోక్ నాగ్, పి. శరవణ కుమార్, కె. అభినవ్.బుచ్చిబాబు టోర్నమెంట్ టీఎన్‌సీఏ ఎలెవన్ప్రదోష్ రంజన్ పాల్ (కెప్టెన్), బూపతి వైష్ణ కుమార్ (వైస్ కెప్టెన్), బి. సచిన్, తుషార్ రహేజా, కిరణ్ కార్తికేయన్, ఎస్. మహమ్మద్ అలీ, ఎస్. రితిక్ ఈశ్వరన్, ఎస్.ఆర్. అతీష్, ఎస్. లక్షయ్ జైన్, డీటీ చంద్రశేఖర్, పి. విద్యుత్, ఆర్. సోను యాదవ్, డి. దీపేష్, జె. ప్రేమ్ కుమార్, ఎ. ఎసక్కిముత్తు, టీడీ లోకేష్ రాజ్.చదవండి: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన షాహిన్ ఆఫ్రిది -
IND vs WI: టీమిండియాకు భారీ షాక్!
ఇంగ్లండ్‌తో ఆఖరి టెస్టులో సత్తా చాటి.. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- tendulkar Trophy) సిరీస్‌ను సమం చేసింది టీమిండియా. రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు లేకుండానే విదేశీ గడ్డ మీద సత్తా చాటింది. యువ నాయకుడు శుబ్‌మన్ గిల్ సారథ్యంలో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకున్న భారత్ తదుపరి ఆసియా కప్-2025 ఆడనుంది.శుభవార్త.. ఓ చేదు వార్త కూడా..ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఈ టోర్నమెంట్‌కు ఆగష్టు చివరి వారంలో బీసీసీఐ (BCCI) జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఈ ఈవెంట్ తర్వాత సొంతగడ్డపై వెస్టిండీస్‌తో టెస్టులు ఆడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు ఒకే సమయంలో శుభవార్త.. ఓ చేదు వార్త అందాయి.ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా గాయపడిన వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌కు సర్జరీ అవసరం లేదని వైద్యులు చెప్పినట్లు సమాచారం. అయితే, పూర్తిగా కోలుకోవడానికి ఆరు వారాల పాటు విశ్రాంతి మాత్రం అవసరం అని చెప్పినట్లు తెలుస్తోంది.విండీస్‌తో రెండు టెస్టులుఈ నేపథ్యంలో రిషభ్ పంత్ ఆసియా కప్-2025తో పాటు వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు కూడా దూరం కానున్నాడు. కాగా యూఏఈ వేదికగా ఆసియా కప్ టోర్నీ సెప్టెంబరు 8- 28 వరకు జరుగనుండగా.. స్వదేశంలో విండీస్‌తో అక్టోబరు 2- 14 వరకు టీమిండియా రెండు టెస్టులు ఆడనుంది. అహ్మదాబాద్, ఢిల్లీ ఇందుకు వేదికలుకాగా ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన ఐదు టెస్టుల సిరీస్‌లో రిషభ్ పంత్ అదరగొట్టాడు. లీడ్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లోనూ శతకాలు బాదిన ఈ లెఫ్టాండర్.. ఓవరాల్‌గా 479 పరుగులు సాధించాడు.గాయంతోనే..అయితే, మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ సందర్భంగా క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రివర్స్ స్కూప్షాట్కు యత్నించిన పంత్.. విఫలమయ్యాడు. ఈ క్రమంలో బంతి కుడికాలికి తగలగా పాదం ఉబ్బింది. అనంతరం బొటనవేలు ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. అయినా సరే.. పంత్ మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని అవుటయ్యాడు. ఈ మ్యాచ్‌ను టీమిండియా డ్రా చేసుకోవడంలో తన వంతు పాత్ర పోషించాడు.చదవండి: ప్రతోడు సచిన్, కోహ్లి అవుతారా?.. వాళ్ల ఫోన్లు కూడా ఎత్తను: టీమిండియా పేసర్ -
అతడొక ఆల్ ఫార్మాట్ ప్లేయర్.. ఆసియాకప్‌లో ఆడాల్సిందే: గంగూలీ
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టంతా ఆసియాకప్-2025పై పడింది. ఆసియాకప్‌నకు భారత జట్టులో ఎవరికి చోటు దక్కుతుంది? ఐపీఎల్లో రాణించిన ఆటగాళ్లను సెలక్టర్లు ఎంపిక చేస్తారా? అన్న చర్చలు క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం జరుగుతున్నాయి.ఈ మెగా టోర్నీ సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. ఈ టోర్నీ కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఆగస్టు మూడో వారంలో ప్రకటించే అవకాశముంది. ఈ క్రమంలో భారత సెలక్టర్లకు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక సూచన చేశాడు.ముఖేష్‌కు ఛాన్స్ ఇవ్వాల్సిందే?బెంగాల్ పేసర్ ముఖేష్ కుమార్‌ను ఆసియాకప్‌నకు ఎంపిక చేయాలని దాదా సలహాఇచ్చాడు. కాగా ముఖేష్ కుమార్ రెండు సంవత్సరాల కిందట భారత జట్టులోకి అరంగేట్రం చేశాడు. ఈ కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలర్ దాదాపు ఏడాది పాటు మూడు ఫార్మాట్లలోనూ టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.ఆ తర్వాత ఫామ్ కోల్పోవడంతో జట్టుకు ముఖేష్ దూరమయ్యాడు. అతడు చివరగా భారత్ తరపున గతేడాది జూలైలో ఆడాడు. ఆ తర్వాత ఈ ఏడాది ఐపీఎల్‌లోనూ ముఖేష్ ఆకట్టుకోలేకపోయాడు. కానీ అతడి వద్ద అద్బుతమైన స్కిల్స్ ఉన్నాయని, అతడికి మరో ఛాన్స్ ఇవ్వాల్సిందేనని గంగూలీ మాత్రం సపోర్ట్‌గా నిలిచాడు."ఆసియాకప్‌లో ముఖేష్ కుమార్ ఖచ్చితంగా ఆడాలి. అతడు అద్భుతమైన ఫాస్ట్ బౌలర్. యూఏఈ కండీషన్స్ అతడికి సరిగ్గా సరిపోతాయి. దేశవాళీ క్రికెట్లో కూడా నిలకడగా రాణిస్తున్నాడు. అతడు జట్టులోకి పునరాగమనం చేసేందుకు ఆర్హుడు. ముఖేష్‌కు అన్ని ఫార్మాట్లలోనూ రాణించే సత్తా ఉంది. అతడికంటూ ఒక సమయం వస్తుంది. అందుకు కాస్త ఓపిక పట్టాలి" అని ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ పేర్కొన్నాడు.కాగా ముఖేష్ ఇప్పటివరకు భారత తరపున 17 టీ20లు ఆడి 20 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో అతడి పేరిట 36 వికెట్లు ఉన్నాయి. ఇక ఇది ఇలా ఉండగా.. టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్, యశస్వి జైశ్వాల్ తిరిగి టీ20 జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ సైతం తన ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాడు. టోర్నీ ఆరంభ సమయానికి సూర్య పూర్తి ఫిట్నెస్ సాధించే అవకాశముందిచదవండి: Asia Cup: అతడు భేష్.. ఇతడు ఓకే.. టీమిండియా సెలక్టర్లకు తలనొప్పి! -
Asia Cup: కెప్టెన్‌గా గిల్!.. సంజూ అవుట్?.. అతడి రీఎంట్రీ?
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకున్న టీమిండియా తదుపరి మెగా టోర్నమెంట్లో పాల్గొననుంది. సుదీర్ఘ విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆసియా కప్-2025 (Asia Cup 2025)కు భారత ఆటగాళ్లు సన్నద్ధం కానున్నారు. ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఈ ఈవెంట్‌కు ఆతిథ్య జట్టు భారత్ అయినా.. తటస్థ వేదిక యూఏఈలో మ్యాచ్‌లు జరుగనున్నాయి.సెప్టెంబరు 9- 28 వరకు ఆసియా కప్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆగష్టు ఆఖరి వారంలో తమ జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఎంపికపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.కెప్టెన్‌గా అతడు?!కాగా భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఈ మెగా టోర్నీ ఆడతాడా లేదా అన్న అంశంపై సందిగ్దం నెలకొంది. స్పోర్ట్స్ హెర్నియాకు సర్జరీ చేయించుకున్న సూర్య.. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అయితే, ఆసియా కప్ నాటికి అతడు పూర్తి స్థాయిలో మ్యాచ్ ఫిట్నెస్ సాధిస్తాడా? లేదా అన్నది తేలాల్సి ఉంది.ఈ నేపథ్యంలో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ టీమిండియా పగ్గాలు చేపట్టే అవకాశం కనిపిస్తున్నా.. శుబ్‌మన్ గిల్ రాకతో ఇది సాధ్యం కాదనిపిస్తోంది. టీమిండియా టెస్టు కెప్టెన్‌గా ఇంగ్లండ్ గడ్డ మీద ఇరగదీసిన గిల్.. అంతకు ముందు ఐపీఎల్-2025లోనూ గుజరాత్ టైటాన్స్ సారథిగా సత్తా చాటాడు.ఈ క్రమంలో ఐపీఎల్, ఇంగ్లండ్‌లో ప్రదర్శన ఆధారంగా గిల్ టీ20 జట్టులోకి తిరిగి వస్తే.. అతడే కెప్టెన్ అవుతాడని చెప్పవచ్చు. మరోవైపు.. టైటాన్స్ జట్టులో గిల్ సహచర ఓపెనర్, అత్యధిక పరుగుల వీరుడు (759) సాయి సుదర్శన్ కూడా రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.అభిషేక్ ఓకే.. సంజూ పరిస్థితి ఏంటి?ఒకవేళ వీరిద్దరు ఓపెనర్లుగా ఖరారైతే.. ఇన్నాళ్లుగా టీమిండియా టీ20 విజయాల్లో కీలక పాత్ర పోషించిన సంజూ శాంసన్, అభిషేక్ శర్మల పరిస్థితి సంకటంలో పడుతుంది. మరోవైపు.. యశస్వి జైస్వాల్ నుంచి కూడా వీరికి ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో అభిషేక్ కాస్త సేఫ్‌గానే ఉన్నా.. ఫిట్నెస్ సమస్యలతో సతమతమైన సంజూకు మాత్రం చోటు దక్కడం కష్టమే అనిపిస్తోంది.ప్లస్‌లూ.. మైనస్లూఅయితే, వికెట్ కీపర్‌గా సంజూకు ఉన్న అదనపు అర్హత అతడికి కాస్త ఊరట కలిగించే అంశం. ఏదేమైనా జైసూ వైపు సెలక్టర్లు మొగ్గుచూపితే మాత్రం సంజూకు కష్టాలు తప్పవు. టీ20 ప్రపంచకప్-2026 నాటికి జట్టును సన్నద్ధం చేయాలని భావిస్తే జైసూకే సెలక్టర్లు ఓటు వేయొచ్చు.కానీ.. గత రెండేళ్ల కాలంలో టీమిండియా తరఫున మూడు సెంచరీలు, ఒక అర్ధ శతకం బాదిన సంజూకు తుదిజట్టులో చోటివ్వకుంటే మాత్రం విమర్శలు తప్పవు. అయితే, 21 ఇన్నింగ్స్‌లో అతడు ఐదుసార్లు డకౌట్ కావడం, ఐదుసార్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కావడం కూడా గమనించాల్సిన విషయం.ఇక వికెట్ కీపర్‌గానూ జితేశ్ శర్మ, ధ్రువ్ జురెల్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్‌ల రూపంలో సంజూకు పోటీ ఎక్కువగానే ఉంది. పంత్ గాయపడ్డాడు కాబట్టి అతడిని పక్కనపెట్టినా మిగతా వాళ్లు మాత్రం కచ్చితంగా రేసులో ఉంటారు.శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ? ఈ టోర్నీలో సంజూతో పాటు సెలక్టర్లకు తలనొప్పి తెప్పించే మరో ఆటగాడు ఎవరైనా ఉన్నారా అంటే.. అది.. శ్రేయస్ అయ్యర్. టెస్టులు, టీ20ల నుంచి టీమిండియా సెలక్టర్లు అతడిని పక్కనపెట్టినా దేశీ క్రికెట్, ఐపీఎల్లో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ దుమ్ములేపుతున్నాడు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(వన్డే)ని టీమిండియా గెలవడంలో కీలక పాత్ర పోషించిన శ్రేయస్ అయ్యర్.. ఐపీఎల్-2025లోనూ అదరగొట్టాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా ఎంపికైన ఈ కాస్ట్లీ ప్లేయర్ (రూ. 26.75 కోట్లు) ఇటు సారథిగా.. అటు బ్యాటర్‌గా ఆకట్టుకున్నాడు.17 మ్యాచ్‌లలో కలిపి 604 పరుగులు సాధించిన శ్రేయస్ అయ్యర్.. పంజాబ్‌ను ఫైనల్‌కు తీసుకువెళ్లాడు. అయితే, ఆరు పరుగుల తేడాతో ఆర్సీబీ చేతిలో ఓడటంతో ఈసారి ట్రోఫీని మిస్సయ్యాడు. కాగా గతేడాది అతడు కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా టైటిల్ అందించిన విషయం తెలిసిందే.గత 12నెలల కాలంలో 25 ఇన్నింగ్స్‌లో శ్రేయస్ అయ్యర్ 949 పరుగులు సాధించడం.. అతడి నిలకడైన ఆటకు నిదర్శనం. మరి ఈసారైనా శ్రేయస్‌కు టీ20 జట్టు తలుపులు తెరవకపోతే సెలక్టర్లపై విమర్శలు రావడం సహజం.చదవండి: బీసీసీఐ వేటు!.. నా ఫ్యామిలీ లాంటిది అంటూ భావోద్వేగం -
Asia Cup 2025: ఆసియా కప్‌లో గిల్, జైస్వాల్!
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో ‘డ్రా’గా ముగిసిన టెస్టు సిరీస్ తర్వాత భారత జట్టు వచ్చే నెలలో ఆసియా కప్ టి20 టోర్నీలో బరిలోకి దిగనుంది. సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా ఈ టోర్నీ జరుగుతుంది. ఇది ముగిసిన తర్వాత అక్టోబర్ 2 నుంచి వెస్టిండీస్‌తో తొలి టెస్టులో టీమిండియా తలపడుతుంది. అయితే వారం రోజుల్లోపే టెస్టు సిరీస్ ఉన్నా సరే... టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో పాటు ఓపెనర్ యశస్వి జైస్వాల్‌లను ఆసియా కప్‌కు ఎంపిక చేయాలని సెలక్టర్లు భావిస్తున్నారు. బిజీ షెడ్యూల్ కారణంగా గత కొన్ని టి20లనుంచి గిల్, జైస్వాల్‌లకు విశ్రాంతినిచ్చారు. ఆ సమయంలో సంజు సామ్సన్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా చెలరేగిపోయారు. అయితే తాజా ఫామ్, ఐపీఎల్లో ప్రదర్శనను బట్టి చూస్తే గిల్, జైస్వాల్‌లను టి20 టీమ్‌లోకి తీసుకొచ్చే ఆలోచన ఉంది. ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన మరో బ్యాటర్ సాయి సుదర్శన్ పేరు కూడా టీమ్ పరిశీలనలో ఉంది. సుదర్శన్ భారత్ తరఫున 3 వన్డేలు, ఏకైక టి20 మ్యాచ్ ఆడాడు. ఈ ముగ్గురినీ తీసుకుంటే టాప్–3 కోసం ప్రత్యామ్నాయం అందుబాటులో ఉంటుందనేది సెలక్టర్ల భావన. ఆసియా కప్‌కు 17 మందితో టీమ్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది కాబట్టి అదనపు ఆటగాళ్లను ఎంపిక చేయడంలో సమస్య రాకపోవచ్చు. ఆ తర్వాత ఆరు నెలల్లో టి20 వరల్డ్ కప్ కూడా జరగనున్న నేపథ్యంలో ‘కోర్ గ్రూప్’లో సభ్యులుగా అందరి ఆటను సెలక్టర్లు పరిశీలించే అవకాశం ఉంది. మరోవైపు బుమ్రా, సిరాజ్‌ల విషయంలో టోర్నీకి ముంద ఫిట్నెస్ను పరిశీలించే తుది నిర్ణయం తీసుకుంటారు. -
Asia Cup 2025: అఫ్గానిస్తాన్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రషీద్ ఖాన్
ఆసియాకప్-2025 కోసం అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు తమ సన్నాహాకాలను ప్రారంభించింది. ఈ మెగా టోర్నీ కోసం 22 మంది సభ్యులతో కూడిన తమ ప్రాథమిక జట్టును అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా స్పిన్ మాంత్రికుడు రషీద్ ఖాన్ ఎంపికయ్యాడు.మహ్మద్ నబీ, కరీం జనత్, గుల్బీద్దన్ నైబ్ వంటి సీనియర్ ఆటగాళ్లు ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. అదేవిధంగా అబ్దుల్లా అహ్మద్జాయ్, బషీర్ అహ్మద్, వఫియుల్లా తారఖిల్ వంటి యువ సంచలనాలకు అఫ్గాన్ సెలక్టర్లు అవకాశమిచ్చారు.కాగా ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు అఫ్గానిస్తాన్ జట్టు షార్జా వేదికగా యూఏఈ, పాకిస్తాన్లతో ట్రై సిరీస్ ఆడనుంది. అంతకంటే ముందు యూఏఈకు అఫ్గాన్ జట్టు వెళ్లనుంది. అక్కడ రెండు వారాల పాటు స్పెషల్ ట్రైనింగ్ క్యాంపులో అఫ్గాన్ జట్టు పాల్గోనుంది.ఆ తర్వాత ఆసియాకప్‌నకు కోసం 15 మంది సభ్యుల ప్రధాన జట్టును ఏసీబీ ఖరారు చేయనుంది. కాగా అఫ్గాన్-యూఏఈ- పాక్ ట్రైసిరీస్ ఆగస్టు 29న ప్రారంభమై.. సెప్టెంబర్ 7న ముగియనుంది. అనంతరం సెప్టెంబర్ 9 నుంచి ఆసియాకప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో అఫ్గాన్ తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 9న అబుదాబి వేదికగా హాంకాంగ్‌తో తలపడనుంది.అఫ్గానిస్తాన్ జట్టు: రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సెదిఖుల్లా అటల్, వఫివుల్లా తారఖిల్, ఇబ్రహీం జద్రాన్, దర్విష్ రసూలీ, మొహమ్మద్ ఇషాక్, రషీద్ ఖాన్ (కెప్టెన్), మహ్మద్ నబీ, నంగ్యాల్ ఖరోటీ, షరాఫుద్దీన్ అష్రఫ్, కరీం జనత్, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బాదిన్ నాయబ్, ముజీబ్ జద్రాన్, అమీర్ హంజా గజన్ఫర్, నూర్ అహ్మద్,ఫజల్ హక్ ఫరూఖీ, నవీన్-ఉల్-హక్, ఫరీద్ మాలిక్, సలీమ్ సఫీ, అబ్దుల్లా అహ్మద్జాయ్, బషీర్ అహ్మద్. -
టీమిండియాపై గెలవడం అంత ఈజీ కాదు: పాక్ మాజీ కెప్టెన్
ఇంగ్లండ్ పర్యటనను విజయవంతంగా ముగించిన టీమిండియా.. ఇక ఆసియాకప్-2025కు సిద్దం కానుంది. ఈ ఖండాంతర మెగా టోర్నీ సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. ఈ ఆసియా సింహాల పోరు కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ త్వరలోనే ప్రకటించనుంది. భారత్ తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 10న దుబాయ్ వేదికగా తలపడనుంది.ఆ తర్వాత సెప్టెంబర్ 14న అదే దుబాయ్ అంతర్జాతీయ మైదానంలో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తాడోపేడో తెల్చుకోనుంది. పెహాల్గమ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలని కొంతమంది అంటుంటే.. మరి కొంతమంది దాయాదిని చిత్తు ప్రతీకారం తీర్చుకోవాలని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికి క్రికెట్ ప్రపంచంలో పాకిస్తాన్-భారత్ మ్యాచ్ ఉన్న క్రేజే వేరు. దాయాదుల పోరు రోజును అభిమానులు టీవీలకు అతుక్కుపోవాల్సిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ జట్టుపై మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాతో పోలిస్తే తమ జట్టు చాలా బలహీనంగా ఉందని, ఇటీవలే పాక్ ప్రదర్శనలపై అతడు ఆందోళన వ్యక్తం చేశాడు. పాకిస్తాన్ ప్రస్తుతం విండీస్ పర్యటనలో ఉంది. ఆతిథ్య జట్టుతో టీ20 సిరీస్‌ను పాక్ 2-1 తేడాతో సొంతం చేసుకుంది. కానీ అంతకుముందు బంగ్లాదేశ్‌తో సిరీస్‌ను మాత్రం 1-2 తేడాతో మెన్ ఇన్ గ్రీన్ కోల్పోయింది."ఆసియాకప్‌లో బలమైన భారత జట్టుతో తలపడడం పాకిస్తాన్‌కు అంత సులువు కాదు. మా జట్టు ప్రస్తుతం నిలకడగా రాణించలేకపోతుంది. ఎప్పుడు లేని విధంగా బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ను కోల్పోయింది. పాక్ జట్టు ప్రదర్శన ఎలా ఉందో ఈ సిరీస్ ఫలితం బట్టి ఆర్ధం చేసుకోవచ్చు.ఆ తర్వాత వెస్టిండీస్‌లో కూడా ఓ మ్యాచ్ ఓడిపోయారు. సల్మాన్ అలీ అఘా కెప్టెన్‌గా సరైనోడే. కానీ మూడు ఫార్మాట్లలో జట్టును నడిపించడం అంత ఈజీ కాదు. మా దగ్గర అద్బుతమైన ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. కానీ వారిని సరిగ్గా ఉపయోగించుకోవడంలో పాక్ క్రికెట్ బోర్డు విఫలమవుతోంది" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లతీఫ్ పేర్కొన్నాడు.చదవండి: ఇక్కడున్నా బిర్యానీ తక్కువే.. ఆ ఫుడ్ అసలే తినడు: సిరాజ్ సోదరుడు -
ఇంగ్లండ్‌తో సిరీస్ ముగిసింది.. టీమిండియా తదుపరి షెడ్యూల్ ఇదే..!
ఇంగ్లండ్‌లో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెండూల్కర్-ఆండర్సన్ టెస్ట్ సిరీస్ నిన్నటితో (ఆగస్ట్ 5) ముగిసింది. ఈ సిరీస్ వీరోచితమైన పోరాటాల తర్వాత 2-2తో సమమైంది. చివరిదైన ఐదో టెస్ట్ హోరాహోరీగా సాగి అభిమానులకు కావాల్సినంత మజాను అందజేసింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఇంగ్లండ్‌ను 6 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది.నువ్వా-నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా తదుపరి ఆడబోయే మ్యాచ్‌లపై ఒక్కసారిగా హైప్ పెరిగిపోయింది. టీమిండియా మళ్లీ ఎప్పుడు బరిలోకి దిగుతుందని ఫ్యాన్స్ శోధించడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది టీమిండియా తదుపరి షెడ్యూల్‌ను మీ ముందుంచుతున్నాము.టెండూల్కర్-ఆండర్సన్ టెస్ట్ సిరీస్ తర్వాత టీమిండియా నెలకు పైగా బ్రేక్ తీసుకుంటుంది. తదుపరి మ్యాచ్‌ను వచ్చే నెల 10న ఆసియా కప్‌లో భాగంగా యూఏఈతో ఆడనుంది. ఈసారి ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో అబుదాబీ, దుబాయ్‌ల్లో జరుగనుంది. ఈ ఖండాంతర టోర్నీలో భారత్ రెండో మ్యాచ్‌ను చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 14న దుబాయ్‌లో జరుగనుంది. అనంతరం భారత్ సెప్టెంబర్ 19న ఒమన్‌తో అబుదాబీలో పోటీపడనుంది. ఆసియా కప్ గ్రూప్ దశలో భారత్ ఈ మూడు మ్యాచ్‌లు ఆడనుంది.ఆసియా కప్ సూపర్-4 స్టేజీలో మ్యాచ్‌లు (భారత్ గ్రూప్-ఏలో ఉంది)B1 vs B2 - 20 సెప్టెంబర్ 2025, దుబాయ్A1 vs A2 - 21 సెప్టెంబర్ 2025, దుబాయ్A2 vs B1 - 23 సెప్టెంబర్ 2025, అబుదాబిA1 vs B2 - 24 సెప్టెంబర్ 2025, దుబాయ్A2 vs B2 - 25 సెప్టెంబర్ 2025, దుబాయ్A1 vs B1 - 26 సెప్టెంబర్ 2025, దుబాయ్సెప్టెంబర్ 28- ఫైనల్ (దుబాయ్)భారత్ వర్సెస్ వెస్టిండీస్ (స్వదేశంలో)అక్టోబర్ 2-6: తొలి టెస్ట్, అహ్మదాబాద్అక్టోబర్ 10-14: రెండో టెస్ట్, ఢిల్లీభారత్ వర్సెస్ ఆస్ట్రేలియా (ఆస్ట్రేలియాలో)అక్టోబర్ 19: తొలి వన్డే, పెర్త్‌అక్టోబర్ 23: రెండో వన్డే, అడిలైడ్‌అక్టోబర్ 25: మూడో వన్డే, సిడ్నీఅక్టోబర్ 29: మొదటి టీ20 కాన్‌బెర్రాఅక్టోబర్ 31: రెండో టీ20, మెల్‌బోర్న్‌నవంబర్ 2: మూడో టీ20, హోబర్ట్‌నవంబర్ 6: నాలుగో టీ20, కర్రారానవంబర్ 8: ఐదో టీ20, బ్రిస్బేన్భారత్ వర్సెస్ సౌతాఫ్రికా (స్వదేశంలో)నవంబర్ 14-18: తొలి టెస్ట్, కోల్కతానవంబర్ 22-26: రెండో టెస్ట్, గౌహతినవంబర్ 30: తొలి వన్డే, రాంచీడిసెంబర్ 3: రెండో వన్డే, రాయ్పూర్డిసెంబర్ 6: మూడో వన్డే, వైజాగ్డిసెంబర్ 9: తొలి టీ20, కటక్డిసెంబర్ 11: రెండో టీ20, చండీఘడ్డిసెంబర్ 14: మూడో టీ20, ధర్మశాలడిసెంబర్ 17:నాలుగో టీ20, లక్నోడిసెంబర్ 19: ఐదో టీ20, అహ్మదాబాద్ -
ఆసియాకప్-2025కు బంగ్లాదేశ్ జట్టు ప్రకటన
ఆసియాకప్-2025 కోసం బంగ్లాదేశ్క్రికెట్ బోర్డు 25 మంది సభ్యులతో కూడిన తమ ప్రాథమిక జట్టును ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా లిట్టన్ దాస్ ఎంపికయ్యాడు. సీనియర్, యువ ఆటగాళ్లతో కూడిన జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. అదేవిధంగా గత రెండేళ్లగా జట్టుకు దూరం ఉంటున్న వికెట్ కీపర్ బ్యాటర్ నూరల్ హసన్‌కు బంగ్లా సెలక్టర్లు తిరిగి పిలపునిచ్చారు.నూరల్ చివరగా బంగ్లాదేశ్ తరపున 2022లో టీ20 మ్యాచ్ ఆడాడు. అంతేకాకుండా పాకిస్తాన్ సిరీస్‌లో భాగం కాని నజ్ముల్ హుస్సేన్ శాంటో, సౌమ్య సర్కార్ కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.కాగా ఆసియాకప్‌నకు ముందు బంగ్లాదేశ్ స్వదేశంలో నెదర్లాండ్స్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. అలాగే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ అగ్రశ్రేణి క్రికెటర్ల కోసం మీర్పూర్లో స్పెషల్ టైనింగ్ క్యాంపు ఏర్పాటు చేసింది. ఆగస్టు 15 నుంచి బంగ్లా ఆటగాళ్ల స్పెషల్ ట్రైనింగ్ ప్రారంభం కానుంది. కాగా ఈ ఏడాది ఆసియాకప్ సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో బంగ్లాదేశ్ తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 11న అబుదాబి వేదికగా హాంకాంగ్‌తో తలపడనుంది.ఆసియాకప్‌నకు బంగ్లాదేశ్ జట్టులిట్టన్ దాస్ (కెప్టెన్), తాంజిద్ హసన్ తమీమ్, ఎండి నయీమ్ షేక్, సౌమ్య సర్కార్, మహ్మద్ పర్వేజ్ హోస్సేన్ ఎమోన్, తౌహిద్ హృదయ్, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, షమీమ్ హుస్సేన్, నజ్ముల్ హోస్సేన్, రిషాద్ హొస్సేన్, షాక్ మహేదీ హసన్, తన్వీర్ ఇస్లాం,నసుమ్ అహ్మద్, హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ సాకిబ్, సైఫుద్దీన్, నహిద్ రానా, ముస్తాఫిజుర్ రెహమాన్, షోరీఫుల్ ఇస్లాం, సయ్యద్ ఖలీద్ అహ్మద్, నూరుల్ హసన్ సోహన్, మహిదుల్ ఇస్లాం భుయాన్ అంకోన్, మహ్మద్ సైఫ్ హసన్. -
సూర్య భాయ్ వచ్చేస్తున్నాడు..!
ఆసియా కప్-2025కు ముందు టీమిండియాకు శుభవార్త అందింది. టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఖండాంతర టోర్నీకి సిద్దమయ్యాడు. స్కై కొద్ది రోజుల కిందట మ్యూనిచ్‌లో స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ చేయించుకున్నాడు. సర్జరీ విజయవంతం కావడంతో అతను ఎన్సీఏలో రిపోర్ట్ చేశాడు. ఆసియా కప్ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు ఎన్సీఏలో తగు చర్యలు చేపట్డాడు.ఎన్సీఏలో రిపోర్ట్ చేయడం వల్ల స్కైను దులీప్ ట్రోఫీ కోసం పరిగణలోకి తీసుకోలేదు. వెస్ట్ జోన్ సెలెక్టర్లు స్కై అందుబాటులో లేకపోవడంతో శార్దూల్ ఠాకూర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ జట్టులో ముంబై స్టార్లు, టీమిండియా ప్లేయర్లు యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, షమ్స్ ములానీ, తనుశ్ కోటియన్, తుషార్ దేశ్‌పాండే ఉన్నారు.కాగా, ఆసియా కప్ పూర్తి షెడ్యూల్ ఇటీవలే విడుదలైంది. ఈ టోర్నీని సెప్టెంబర్ 9-28 మధ్య తేదీల్లో యూఏఈ వేదికగా నిర్వహించనున్నారు. ఈ టోర్నీలో సూర్యకుమార్ యాదవ్ భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాల్సి ఉంది. స్కై ఈ ఏడాది ఐపీఎల్లో చివరిసారి బ్యాట్ పట్టాడు. ఆతర్వాత అతను శస్త్ర చికిత్స నిమిత్తం మ్యూనిచ్కు వెళ్లాడు.శ్రేయస్ కూడా..!మరో టీమిండియా బ్యాటర్ కూడా ఇటీవలే ఎన్‌సీఏని సందర్శించాడు. రొటీన్ ఫిట్నెస్ పరీక్షల్లో భాగంగా శ్రేయస్ అయ్యర్ ఎన్సీఏకి వచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం శ్రేయస్ పూర్తి ఫిట్నెస్ సాధించి దులీప్ ట్రోఫీకి అందుబాటులో ఉన్నాడు. దులీప్ ట్రోఫీ ఆగస్ట్ 28 నుంచి ప్రారంభం కానుంది. వెస్ట్ జోన్ సెప్టెంబర్ 4న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. -
ఆసియాకప్ పూర్తి షెడ్యూల్ విడుదల.. భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడంటే?
ఆసియాకప్-2025 వేదికలు ఖరారు అయ్యాయి. ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేసిన ఆసియా క్రికెట్ కౌన్సిల్.. తాజాగా మ్యాచ్‌లు జరిగే వేదికలను ప్రకటించింది. ఈ మెగా టోర్నమెంట్ యూఏఈలోని అబుదాబి, దుబాయ్ వేదికలగా జరగనున్నట్లు ఏసీసీ వెల్లడించింది.ఈ ఆసియాకప్‌లో 11 మ్యాచ్‌లు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, మరో 8 మ్యాచ్‌లు అబుదాబి ఇంటర్ననేషనల్ మైదానంలో జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్‌కు దుబాయ్ ఆతిథ్యమివ్వనుంది. అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 14న జరగనుంది.ఈ మెగా టోర్నమెంట్ సెప్టెంబర్ 9న ప్రారంభమై 28న ముగియనుంది. తొలి మ్యాచ్‌లో దుబాయ్ వేదికగా అఫ్గానిస్తాన్, హాంకాంగ్ జట్లు తలపడనున్నాయి. ఇక ఇది ఇలా ఉండగా.. వాస్తవానికి ఈ ఏడాది ఆసియాకప్‌కు భారత్ ఆతిథ్యమివ్వాల్సింది.కానీ భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఈ ఈవెంట్‌ను యూఏఈలో నిర్వహించాలని ఏసీసీ నిర్ణయించింది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గోనున్నాయి. ఈ జట్లను మొత్తం రెండు గ్రూపులుగా విభజించారు.ఏ గ్రూప్‌లో ఎవరు?గ్రూప్ ఎ: భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్గ్రూప్ బి: శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్, హాంకాంగ్ఆసియా కప్‌లో టీమిండియా షెడ్యూల్..10 సెప్టెంబర్: భారత్ - యూఏఈ (దుబాయ్)14 సెప్టెంబర్: భారత్ - పాకిస్తాన్ (దుబాయ్)19 సెప్టెంబర్: భారత్ - ఒమన్ (అబుదాబీ)ఈ టోర్నీ కోసం భారత జట్టును బీసీసీఐ త్వరలోనే ప్రకటించే అవకాశముంది. అయితే ఈ ఆసియా జెయింట్స్ పోరుకు టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.చదవండి: IND vs ENG: టీమిండియాతో ఐదో టెస్టు.. 123 ఏళ్ల చరిత్రను ఇంగ్లండ్ తిరగరాస్తుందా? -
Ind Vs Pak: ‘సైనికుల రక్తం, భారతీయుల కంటే డబ్బే ముఖ్యమా?’
ముంబై: మహారాష్ట్ర శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది భారత క్రికెట్ బోర్డు బీసీసీఐ (BCCI), భారత ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసియాకప్‌లో భాగంగా భారత్, పాకిస్తాన్ (IND vs PAK) మధ్య మ్యాచ్ నేపథ్యంలో బీసీసీఐపై ప్రియాంక విరుచుకుపడ్డారు. భారత సైనికుల ప్రాణాలు, ప్రజల రక్తం కంటే.. బీసీసీఐకి డబ్బే ముఖ్యమా అని ప్రశ్నిస్తూ సంచలన విమర్శలు చేశారు. దీంతో, ఆమె వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.ఆసియాకప్‌లో భారత్, పాక్ మ్యాచ్ విషయమై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ప్రియాంక.. ‘బ్లాక్‌బస్టర్ ఫిక్సర్.. సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా భారత్-పాక్ మ్యాచ్‌ను షెడ్యూల్ చేశారు. అలాగే, మళ్లీ సూపర్ ఫోర్, ఫైనల్స్‌లో కూడా దాయాదులు తలపడే అవకాశం ఉంది. ఇది న్యాయమేనా?. భారత సైనికుల రక్తం, త్యాగం.. భారతీయుల ఆత్మాభిమానం కంటే బీసీసీఐకి డబ్బే ముఖ్యమైనప్పుడు ఇలాంటివి ఉంటాయి. బీసీసీఐ సంపాదించాలనుకుంటున్నది రక్తపు సొమ్ము మాత్రమే కాదు.. వినాశకరమైన డబ్బు. ఆపరేషన్ సిందూర్ విషయంలో భారత ప్రభుత్వం సిగ్గుపడాలి’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. దీంతో, ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పలువురు నెటిజన్లు ఆమెకు మద్దుతు ఇస్తూ కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.“Blockbuster Fixture: India vs Pakistan scheduled for 14 September, 2025 with potential rematches during Super Four and Final”When money is more important than the blood of our fellow Indians and our men in uniform. Shame on GoI for being a hypocrite on Operation Sindoor. And… pic.twitter.com/AJG4xruesB— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) August 3, 2025ఇదిలా ఉండగా.. జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ విషయంలో భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. పహల్గాం ఎఫెక్ట్ ఇరుదేశాల క్రీడా సంబంధాలపైనా పడింది. ఇటీవల వరల్డ్ ఛాంపియన్షిప్ లెజెండ్స్ టోర్నీలోనూ పాక్ ఛాంపియన్స్‌తో ఆడేందుకు భారత్ నిరాకరించింది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ రద్దైంది. ఆసియాకప్‌లో కూడా భారత్-పాక్ మ్యాచ్‌లను నిర్వహించాలనుకోవడంపైనా విమర్శలు వచ్చాయి. ఈ సమయంలోనే ఆసియాకప్ షెడ్యూల్ విడుదల కావడంతో పలువరు నెటిజన్లు బీసీసీఐ తీరుపై విమర్శలు చేస్తున్నారు. అయితే, పహల్గాం దాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్ టార్గెట్‌గా సోషల్ మీడియా ఖాతాలు, క్రికెటర్ల యూట్యూబ్ చానెల్స్ సైతం బ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. -
Asia Cup 2025: టీమిండియాకు భారీ షాక్..!?
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్ నుంచి స్వదేశానికి వచ్చేయనున్నాడు. వర్క్‌లోడ్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ఆఖరి టెస్టుకు దూరమైన బుమ్రాను జట్టు నుంచి బీసీసీఐ విడుదల చేసింది. భారత్‌కు చేరుకున్నాక బుమ్రా దాదాపు నెల రోజుల పైనా విశ్రాంతి తీసుకోనున్నాడు.అతడు తిరిగి మళ్లీ సెప్టెంబర్‌లో మైదానంలో అడుగుపెట్టే అవకాశముంది. అయితే బుమ్రా విషయంలో సెలక్టర్లకు, టీమ్ మెనెజ్‌మెంట్‌కు మరోక చిక్కు వచ్చి పడింది. బుమ్రాను ఆసియా కప్(టీ20 ఫార్మాట్)లో ఆడించాలా లేదా వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేయాలో సెలక్టర్లకు ఆర్ధం కావడం లేదు.ఎందుకంటే ఆసియాకప్ సెప్టెంబర్ 9న ప్రారంభమై సెప్టెంబర్ 29న ముగుస్తుంది. అక్కడికి నాలుగు రోజుల తర్వాత అక్టోబర్ 2-6 వరకు భారత జట్టు వెస్టిండీస్‌తో అహ్మదాబాద్ వేదికగా తొలి టెస్టులో ఆడనుంది. ఒకవేళ భారత్ ఫైనల్‌కు చేరి, వెంటనే విండీస్‌తో తొలి టెస్టులో బుమ్రా ఆడాలంటే అది ఆసాధ్యమనే చెప్పుకోవాలి.బుమ్రా ప్రస్తుతం అంత ఫిట్‌గా లేడు. ఇంగ్లండ్ టూర్లో కూడా కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడాడు. ఇప్పుడు ఇదే సెలక్టర్లకు, టీమ్ మెనెజ్‌మెంట్ తలనొప్పిగా మారింది. తాజాగా ఇదే విషయంపై ఓ బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు.బుమ్రా దూరం?"బుమ్రా ఆసియాకప్‌లో ఆడి.. ఒకవేళ బారత్ ఫైనల్‌కు చేరితే అతడు అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగే తొలి టెస్టుకు దూరంగా ఉండాల్సిందే. ఎందుకంటే అతడు తన వర్క్‌లోడ్‌ను మెనెజ్ చేయలేడు. అతడిని ఆసియాకప్‌లో ఆడించాలా లేదా వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేయాలా అన్నది సెలక్టర్లు నిర్ణయం తీసుకుంటారు.అంతేకాకుండా నవంబర్‌లో దక్షిణాఫ్రికాతో రెండు టెస్టులు ఆడాల్సి వచ్చింది. కాబట్టి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. వారిద్దరికి ఇది ఒక సవాల్‌గా మారనుంది" అని బీసీసీఐ అధికారి పేర్కొన్నారు.కాగా వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో సిరీస్‌లు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరగనున్నాయి. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ ప్రస్తుతం నాలుగో స్దానంలో ఉంది. కాబట్టి ఈ రెండు సిరీస్‌లు టీమిండియాకు కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో బుమ్రాను ఆసియాకప్‌నకు బదులుగా విండీస్, ప్రోటీస్ సిరీస్‌లో ఆడించే అవకాశముంది.చదవండి: IPL 2026: గైక్వాడ్‌పై వేటు.. సీఎస్కే కెప్టెన్‌గా టీమిండియా స్టార్! అతడిపై కూడా కన్ను? -
BCCI: బుమ్రాను రిలీజ్ చేసిన బీసీసీఐ.. అప్డేటెడ్ జట్టు ఇదే
టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)ను ఐదో టెస్టు జట్టు నుంచి రిలీజ్ చేశారు. ఇందుకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ఇంగ్లండ్‌తో ఓవల్ టెస్టు రెండో రోజు ఆట సందర్భంగా బీసీసీఐ ఈ మేరకు తమ నిర్ణయాన్ని వెల్లడించింది.ఇక జట్టును వీడిన బుమ్రాకు సెప్టెంబరులో జరిగే ఆసియా కప్-2025 (Asia Cup) వరకు సుదీర్ఘ కాలం విశ్రాంతి లభించనుంది. కాగా టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. స్టోక్స్ బృందంతో ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడుతోంది.ఓవల్ టెస్టులో గెలిస్తేనే సమంఈ క్రమంలో ఇంగ్లండ్ గిల్ సేనపై 2-1తో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ఆఖరిదైన ఓవల్ టెస్టులో గెలిస్తేనే టీమిండియా సిరీస్‌ను కనీసం డ్రా చేసుకోగలుగుతుంది. అయితే, పనిభారం తగ్గించే క్రమంలో ప్రధాన పేసర్ బుమ్రాను ఇంగ్లండ్‌లో కేవలం మూడు టెస్టుల్లోనే ఆడిస్తామని మేనేజ్మెంట్ ముందుగానే ప్రకటించింది.అందుకు తగ్గట్లుగానే లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో ఆడిన బుమ్రా.. ఎడ్జ్‌బాస్టన్‌లో విశ్రాంతి తీసుకున్నాడు. లార్డ్స్ టెస్టుతో తిరిగి వచ్చి.. వెంటనే మాంచెస్టర్ టెస్టు కూడా ఆడాడు. అయితే, కీలకమైన ఐదో టెస్టులో ఆడతాడని భావించినా.. ఫిట్నెస్ సమస్యల దృష్ట్యా యాజమాన్యం అతడికి రెస్ట్ ఇచ్చింది. తాజాగా జట్టు నుంచి రిలీజ్ చేసింది. కాగా ఇంగ్లండ్‌తో ఆడిన మూడు టెస్టుల్లో ఈ రైటార్మ్ పేసర్ ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి 119.4 ఓవర్లు బౌలింగ్ చేసి.. 14 వికెట్లు కూల్చాడు.ఇంగ్లండ్‌తో ఐదో టెస్టుకు భారత జట్టు (అప్డేటెడ్)శుభమన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, కుల్దీప్ యాదవ్, అన్షుల్ కాంబోజ్, అర్ష్‌దీప్ సింగ్, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్).ఆసియా కప్ నాటికి తిరిగి వస్తాడా?ఆసియాకప్ పురుషుల క్రికెట్ టోర్నమెంట్ ఈ ఏడాది సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నిర్వహించనున్నట్లు.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చైర్మన్ మొహసిన్ నఖ్వీ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రణాళిక ప్రకారం భారత్, పాకిస్తాన్ మధ్య సెప్టెంబరు 14న గ్రూప్ దశ మ్యాచ్, 21న ‘సూపర్ ఫోర్’ మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది.ఈ టోర్నీలో మొత్తం 19 మ్యాచ్‌లు జరగనుండగా... దుబాయ్, అబుదాబిలో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. యూఏఈ, ఒమాన్, పాకిస్తాన్‌తో కలిసి భారత్ గ్రూప్ ‘ఎ’ నుంచి బరిలోకి దిగనుండగా... శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, హాంకాంగ్ గ్రూప్ ‘బి’లో పోటీపడనున్నాయి.ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వాల్సి ఉండగా... సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ కేవలం తటస్థ వేదికల్లోనే తలపడాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించనున్నారు. ప్రసారదారులతో ఏసీసీ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూప్ నుంచి పోటీపడనున్నాయి. దీంతో గ్రూప్ స్థాయిలో, ‘సూపర్ ఫోర్’ దశతో పాటు ఫైనల్లో ఇరు జట్లు పోటీపడే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది భారత్, శ్రీలంక వేదికగా ఐసీసీ టి20 ప్రపంచకప్ జరగనుండటంతో... ఆసియాకప్‌ను అదే ఫార్మాట్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మెగా టోర్నీ నాటికి బుమ్రా తిరిగి వస్తాడో లేదో చూడాలి. చదవండి: ENG VS IND 5th Test: అట్కిన్సన్ విజృంభణ.. కుప్పకూలిన టీమిండియా -
ఆసియాకప్-2025కు జస్ప్రీత్ బుమ్రా దూరం! అతడు కూడా?
ఆసియాకప్-2025 నిర్వహణపై సందిగ్ధం వీడిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీకి సంబంధించిన అధికారిక షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఇటీవలే విడుదల చేసింది. ఈ మెగా ఈవెంట్ యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు ఆసియా కప్ 2025 జరగనుంది.వాస్తవానికి ఈ టోర్నీ భారత్ వేదికగా జరగాల్సింది. కానీ భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఈ ఈవెంట్‌ను యూఏఈలో నిర్వహించాలని ఏసీసీ నిర్ణయించింది. అయితే ఈ ఏడాది ఆసియాకప్‌నకు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉండటంపై అనుమానాలు నెలకొన్నాయి.బుమ్రా ప్రస్తుతం ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. వర్క్‌లోడ్ మెనెజ్‌మెంట్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ఆఖరి టెస్టుకు బుమ్రాకు టీమ్ మెనెజ్‌మెంట్ విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో కూడా బుమ్రా అంత ఫిట్‌గా కన్పించలేదు.దీంతో అతడు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటాడా లేదా ఆసియాకప్‌లో ఆడుతాడా? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. అయితే ఆసియాకప్‌కు నెల రోజులకు పైగా సమయం ఉండడంతో బుమ్రా తన పూర్తి ఫిట్నెస్ సాధించే అవకాశముంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు."జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్‌పై మరోసారి అనుమానాలు నెలకొన్నాయి. అతడు ఐదో టెస్టులో ఆడకపోతే ఆసియాకప్‌కు కచ్చితంగా అతడు అందుబాటులో ఉండాలి. ఎందుకంటే అతడికి నెలకు పైగా విశ్రాంతి లభిస్తోంది.ఈ టోర్నీకి సెలక్టర్లు ఎలాంటి జట్టును ఎంపిక చేస్తారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు మహ్మద్ షమీ కూడా ఆసియాకప్‌నకు దూరంగా ఉండే అవకాశముంది. ఎందుకంటే షమీ ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్తో లేడు. అతడి ఫిట్నెస్ను పరీక్షించడానికి, ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నద్దం చేసేందుకు టీ20ల్లో ఆడించారు.కానీ అతడు మెరుగ్గా రాణించలేకపోయాడు. ఆ తర్వాత ఐపీఎల్లో కూడా నామమాత్రపు ప్రదర్శన కనబరిచాడు. నావరకు అయితే షమీని భారత టీ20 జట్టులో ఆడించడమే ఆసాధ్యమే అని తన యూట్యూబ్ ఛానల్లో చోప్రా పేర్కొన్నాడు.చదవండి: AUS vs IND: ఆస్ట్రేలియా టూర్‌కు భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి చోటు -
ఆసియా కప్‌కు ముందు హాంగ్‌కాంగ్ జట్టు కీలక నియామకం
త్వరలో ప్రారంభం కానున్న ఆసియా కప్‌కు ముందు హాంగ్‌కాంగ్ క్రికెట్ కీలక నియామకం చేపట్టింది. వారి జట్టుకు శ్రీలంక మాజీ ఓపెనర్ కౌశల్ సిల్వను హెడ్ కోచ్‌గా నియమించింది. డాషింగ్ వికెట్ కీపర్ బ్యాటర్ అయిన కౌశల్ 2011-18 మధ్యలో శ్రీలంక తరఫున 39 టెస్ట్‌లు ఆడి 3 సెంచరీలు, 12 అర్ద సెంచరీల సాయంతో 2099 పరుగులు చేశాడు. అలాగే వికెట్ కీపింగ్‌లో 34 క్యాచ్‌లు, ఓ స్టంపింగ్ చేశాడు.39 ఏళ్ల కౌశల్ గతంలో శ్రీలంక, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దేశాల్లో కోచింగ్ బాధ్యతలు నిర్వహించాడు. అంతర్జాతీయంగా అతనికి ఇదే తొలి కమిట్మెంట్. ఆసియా కప్‌కు ముందు కౌశల్ ముందు పలు ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి. హాంగ్‌కాంగ్ బౌలింగ్ దళం నిర్మించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది. అలాగే యువ ప్రతిభను గుర్తించి ఆసియా కప్ కోసం జట్టును సిద్ధం చేయాల్సి ఉంది.హాంగ్‌కాంగ్ ఈ ఎడిషన్ ఆసియా కప్‌కు అర్హత సాధించిన ఎనిమిది జట్లలో ఒకటి. ఆ జట్టు క్వాలిఫయర్ పోటీల ద్వారా ఖండాంతర టోర్నీకి అర్హత సాధించింది. సెప్టెంబర్ 19 నుంచి టీ20 ఫార్మాట్లో జరుగబోయే ఈ టోర్నీలో హాంగ్‌కాంగ్ సహా ఆఫ్ఘనిస్తాన్, యూఏఈ, భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఒమన్ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీకి సంబంధించి వేదికలు ఇంకా ఖరారు కాలేదు. హాంగ్‌కాంగ్ టోర్నీ తొలి మ్యాచ్‌లోనే ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడుతుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ సెప్టెంబర్ 14న జరుగనుంది. -
‘పాక్‌తో మ్యాచ్ ఆడాలి’!.. గంగూలీపై అభిమానుల ఆగ్రహం
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly)పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదా నుంచి ఇలాంటి వ్యాఖ్యలు ఊహించలేదని వాపోతున్నారు. అసలేం జరిగిందంటే.. ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్‌కు ఇటీవలే షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే.కుదిరితే మూడుసార్లుఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఈ మెగా ఈవెంట్లో భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూపులో ఉన్నాయి. ఇరుజట్లు సెప్టెంబరు 14న దుబాయ్‌లో ముఖాముఖి తలపడనున్నాయి. ఆసియా క్రికెట్ మండలి (ACC) ప్రసారకర్తలతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సూపర్ ఫోర్ దశలో ఇరుజట్లు మరోసారి పరస్పరం ఢీకొట్టే అవకాశం ఉంది. అంతా సవ్యంగా సాగి.. మెరుగైన ప్రదర్శన కనబరిస్తే సెప్టెంబరు 28 నాటి ఫైనల్లోనూ దాయాదులు పోటీపడతాయి. నిజానికి ఈ టోర్నీ ఆతిథ్య హక్కులు భారత్‌వి. అయితే, అంతకుముందు పాక్ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణ హక్కులు దక్కించుకోగా.. టీమిండియాను అక్కడికి పంపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిరాకరించింది. తటస్థ వేదికపైనేభద్రతా కారణాల దృష్ట్యా పాక్‌కు వెళ్లలేమని ఐసీసీకి తేల్చిచెప్పింది. ఈ క్రమంలో దుబాయ్ వేదికగా ఈ టోర్నీ జరుగగా.. టీమిండియా చాంపియన్‌గా నిలిచింది.అయితే, నాటి చర్చల ప్రకారం 2027 వరకు భారత్- పాక్ ఏ టోర్నీ ఆతిథ్య హక్కులు దక్కించుకున్నా తటస్థ వేదికపైనే ఆడాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో ఇందుకు అంగీకరించాయి. కానీ.. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో మరోసారి పరిస్థితులు శ్రుతిమించాయి.పాక్‌కు బుద్ధి చెప్పిన భారత సైన్యంప్రశాంతమైన పహల్గామ్ లోయలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి అమాయక పర్యాటకులను పొట్టనబెట్టుకున్నారు. ఇందుకు ప్రతిగా భారత సైన్యం పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. అయితే, ఉగ్రవాదులపై జరిపిన దాడులకు పాక్ సైన్యం స్పందిస్తూ.. ప్రతిదాడికి దిగగా.. ఇండియన్ ఆర్మీ గట్టిగా బుద్ధిచెప్పింది.ఈ నేపథ్యంలో ఇకపై పాకిస్తాన్‌తో ఎటువంటి సంబంధాలు పెట్టుకోకూడదని.. క్రీడల్లోనూ బంధం తెంచుకోవాలనే డిమాండ్లు వచ్చాయి. ఈ విషయంపై గంగూలీ గతంలో స్పందిస్తూ.. ఈ డిమాండ్లకు మద్దతు తెలిపాడు. అయితే, తాజాగా మరోసారి ఆసియా కప్-2025 నేపథ్యంలో ఇందుకు సంబంధించి ప్రశ్న ఎదురుకాగా దాదా భిన్నంగా స్పందించాడు.పాక్‌తో మ్యాచ్.. ఆటలు కొనసాగాలి‘‘ఇరుజట్లు పరస్పరం పోటీపడటంలో నాకెలాంటి ఇబ్బందీ లేదు. ప్రణాళిక ప్రకారం క్రీడలు కొనసాగాలి. అదే సమయంలో పహల్గామ్ వంటి ఘటనలను అరికట్టాలి. అయితే, ఆటలు మాత్రం కొనసాగుతూనే ఉండాలి. ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయాలి. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు భారత్ పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. కాబట్టి క్రీడలు కొనసాగించడంలో తప్పులేదు’’ అని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. నెటిజన్లు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఇటీవల ప్రపంచ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్-2025 సీజన్లో భాగంగా ఇండియా- పాకిస్తాన్‌తో తలపడాల్సి ఉండగా.. విమర్శల నేపథ్యంలో మ్యాచ్ రద్దైపోయింది. ఇండియా చాంపియన్స్ జట్టులో భాగమైన శిఖర్ ధావన్, సురేశ్ రైనా తదితరులు పాక్‌తో ఆడేందుకు విముఖత వ్యక్తం చేయడంతో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఆసియా కప్ వంటి కీలక టోర్నీలో బీసీసీఐ.. దాయాదితో ముఖాముఖి పోరు నాటికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి!చదవండి: Asia Cup 2025: పూర్తి షెడ్యూల్ విడుదల.. భారత్- పాక్ మ్యాచ్‌లు ఎప్పుడంటే? #WATCH | Kolkata: On India-Pakistan placed in the same group in the Asia Cup, former Indian cricketer Saurav Ganguly says, "I am okay. The sport must go on. At the same time Pahalgam should not happen, but the sport must go on. Terrorism must not happen; it needs to be stopped.… pic.twitter.com/Qrs17KOKrN— ANI (@ANI) July 27, 2025 -
Asia Cup: పూర్తి షెడ్యూల్ విడుదల.. భారత్- పాక్ మ్యాచ్‌ల తేదీలివే!
Asia Cup 2025: ఆసియా కప్-2025 నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే టోర్నమెంట్‌కు సంబంధించి ఆసియా క్రికెట్ మండలి (ACC) శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 9- 28 వరకు ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించనున్నారు.మూడుసార్లు ఢీకొట్టే అవకాశం!చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ (India vs Pakistan) జట్లు సెప్టెంబరు 14న పరస్పరం తలపడనున్నాయి. దాయాదులు రెండూ ఒకే గ్రూపులో ఉన్నాయి కాబట్టి సూపర్ ఫోర్ దశలో మరోసారి అంటే.. సెప్టెంబరు 21న ఢీకొట్టే వీలుంది. ఒకవేళ ఇరుజట్లు ఫైనల్ చేరితో సెప్టెంబరు 28న మరోసారి ముఖాముఖి పోటీపడతాయి.గ్రూప్- ఎ నుంచి ఇండియా, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ పోటీపడనుండగా.. శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ గ్రూప్-బి నుంచి తలపడతాయి. దుబాయ్, అబుదాది వేదికలుగా ఈ 19 మ్యాచ్‌ల టోర్నమెంట్‌ను నిర్వహించనున్నారు.బీసీసీఐపై విమర్శలుకాగా ఆసియా కప్ టీ20 టోర్నీకి ఈసారి భారత్ వేదిక. అయితే, ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం గతంలో మాదిరి ఈసారి కూడా తటస్థ వేదికపై టోర్నీని నిర్వహించనున్నారు. అయితే, పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌తో అన్ని స్థాయిల్లోనూ క్రీడల్లోనూ బంధం తెంచుకోవాలనే డిమాండ్లు వచ్చాయి. బీసీసీఐ సైతం దాయాదితో పోటీ పడేందుకు సుముఖంగా లేమని వెల్లడించింది.కానీ.. తాజా షెడ్యూల్ ప్రకారం చిరకాల ప్రత్యర్థితో టీమిండియా తలపడనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ తీరుపై విమర్శలు వస్తున్నాయి. కాగా ఇటీవల వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్‌లో పాక్‌తో మ్యాచ్ ఆడేందుకు ఇండియా చాంపియన్స్ నిరాకరించింది. దీంతో ఇరుజట్ల మధ్య మ్యాచ్ రద్దు కాగా.. చెరో పాయింట్ వచ్చింది.లీగ్ దశ షెడ్యూల్👉సెప్టెంబరు 9: అఫ్గనిస్తాన్ వర్సెస్ హాంగ్‌కాంగ్👉సెప్టెంబరు 10: ఇండియా వర్సెస్ యూఏఈ👉సెప్టెంబరు 11: బంగ్లాదేశ్ వర్సెస్ హాంగ్‌కాంగ్👉సెప్టెంబరు 12: పాకిస్తాన్ వర్సెస్ ఒమన్👉సెప్టెంబరు 13: బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక👉సెప్టెంబరు 14: ఇండియా వర్సెస్ పాకిస్తాన్👉సెప్టెంబరు 15: యూఏఈ వర్సెస్ ఒమన్👉సెప్టెంబరు 15:శ్రీలంక వర్సెస్ హాంగ్‌కాంగ్👉సెప్టెంబరు 17: పాకిస్తాన్ వర్సెస్ యూఏఈ👉సెప్టెంబరు 18: శ్రీలంక వర్సెస్ అఫ్గనిస్తాన్👉సెప్టెంబరు 19: ఇండియా వర్సెస్ ఒమన్సూపర్ 4 దశ👉సెప్టెంబరు 20: గ్రూప్- బి టాపర్ వర్సెస్ రెండో స్థానంలో ఉన్న జట్టు (B1 Vs B2)👉సెప్టెంబరు 21: గ్రూప్-ఎ టాపర్ వర్సెస్ రెండో స్థానంలో ఉన్న జట్టు (A1 vs A2)👉సెప్టెంబరు 23: A2 vs B1👉సెప్టెంబరు 24: A1 vs B2👉సెప్టెంబరు 25: A2 vs B2👉సెప్టెంబరు 26: A1 vs B1👉సెప్టెంబరు 28: ఫైనల్.చదవండి: IND vs AUS: ధావన్ ధనాధన్.. పఠాన్ విధ్వంసం.. యువీ మాత్రం విఫలం -
Ind vs Pak: ఆసియా కప్-2025.. భారత్-పాక్ మ్యాచ్ ఆరోజే!
ఆసియా కప్-2025 నిర్వహణకు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరులో టోర్నమెంట్ నిర్వహించేందుకు ఆసియా క్రికెట్ మండలి (ACC) ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి జూలై మొదటి వారంలోనే షెడ్యూల్ విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కాగా భారత్- పాకిస్తాన్ (India vs Pakistan) మధ్య ఇటీవలి ఉద్రిక్తతల నేపథ్యంలో ఆసియా కప్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్న విషయం తెలిసిందే. కశ్మీర్‌లోని పహల్గామ్లో ఉగ్రవాదులు అమాయక పర్యాటకులను కాల్చి చంపగా.. ఇందుకు ప్రతిగా భారత సైన్యం పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట దాడులు చేసింది.ఈ క్రమంలో పాకిస్తాన్ సైన్యం ఎదురుదాడికి తెగబడగా.. భారత ఆర్మీ ధీటుగా బదులిచ్చింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. అయితే, సింధు జలాల ఒప్పందం రద్దు సహా పాక్‌పై భారత్ కఠిన చర్యలకు ఉపక్రమించిన నేపథ్యంలో దాయాది కాల్పుల విరమణకు అంగీకరించింది. దీంతో ప్రస్తుతం పరిస్థితులు చక్కబడ్డాయి.అయితే, ఆసియా కప్‌లో భారత్- పాకిస్తాన్ కలిసి ఆడతాయా లేదా అన్న సందేహాల నడుమ.. టైమ్స్ ఆఫ్ ఇండియా ఆసక్తికర కథనం ప్రచురించింది. భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీని ముందుగా నిర్ణయించినట్లుగా తటస్థ వేదికైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో నిర్వహించనున్నట్లు తెలిపింది.భారత్- పాక్ మ్యాచ్ ఆరోజేఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించనున్న ఆసియా కప్.. సెప్టెంబరు 5న ఆరంభం కానున్నట్లు పేర్కొంది. అదే విధంగా.. గ్రూప్ దశలో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్- పాక్ తొలుత సెప్టెంబరు 7న ముఖాముఖి తలపడనున్నట్లు వెల్లడించింది. ఇక 2022, 2023 మాదిరే ఈసారి కూడా గ్రూప్ దశ తర్వాత సూపర్ ఫోర్ ఫార్మాట్లోనే టోర్నీని నిర్వహించనున్నట్లు సమాచారం.ఒకవేళ భారత్‌తో పాటు పాకిస్తాన్ కూడా సూపర్ ఫోర్కు అర్హత సాధిస్తే సెప్టెంబరు 14న మరోసారి దాయాదులు పరస్పరం ఢీకొట్టనున్నాయి. అన్నీ సజావుగా సాగి ఇరు జట్లు ఫైనల్ చేరితే సెప్టెంబరు 21న మరోసారి హై వోల్టేజీ మ్యాచ్ చూసేందుకు అభిమానులకు అవకాశం లభిస్తుంది.మూడుసార్లు పోటీ పడే అవకాశం!అయితే, ప్రస్తుత ఫామ్ దృష్ట్యా పాక్ గ్రూప్ దశ దాటడమే కష్టంగా కనిపిస్తోంది. ఏదేమైనా దాయాదులు ఈ టోర్నీలో మూడుసార్లు ముఖాముఖి పోటీ పడే అవకాశాలు మాత్రం లేకపోలేదు. కాగా ఆసియా కప్-2025లో మొత్తంగా ఆరు జట్లు తలపడనున్నాయి. టీ20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్‌లతో పాటు ఏసీసీ మెన్స్ ప్రీమియర్ కప్‌లో అగ్రస్థానంలో నిలిచిన యూఏఈ కూడా టైటిల్ కోసం పోటీపడనుంది.తటస్థ వేదిక కాబట్టికాగా పాకిస్తాన్‌తో కలిసి ఆడకూడదని టీమిండియా భావించగా.. ఏసీసీ సమావేశంలో భాగంగా ఆతిథ్య హోదాలో ఆడేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సుముఖంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల బ్రాడ్కాస్టన్ సోనీ స్పోర్ట్స్ విడుదల చేసిన పోస్టర్లో పాక్ కెప్టెన్ కనబడకపోవడంతో.. ఈ టోర్నీ నుంచి పాక్ తప్పుకొందనే సంకేతాలు వచ్చాయి. ఇక ఈ కథనాల్లో ఏది నిజమో తేలాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే!చదవండి: ఇంగ్లండ్ గడ్డపై ఇరగదీస్తున్న ఇషాన్ కిషన్, తిలక్ వర్మ