తిలక్‌ ఆట అద్భుతం.. భారత్‌ విజయంపై వైఎస్‌ జగన్‌ ప్రశంసలు | YS Jagan congratulations to Indian cricket team | Sakshi
Sakshi News home page

తిలక్‌ ఆట అసాధారణం.. భారత్‌ విజయంపై వైఎస్‌ జగన్‌ ప్రశంసలు

Sep 29 2025 7:33 AM | Updated on Sep 29 2025 8:38 AM

YS Jagan congratulations to Indian cricket team

సాక్షి, తాడేపల్లి: ఆసియా కప్‌ ఫైనల్‌ (Aisa Cup Final 2025)లో అద్భుత విజయం సాధించిన భారత జట్టుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌(YS Jagan) అభినందనలు తెలిపారు. పాకిస్తాన్‌పై విజయం దేశం మొత్తాన్ని గర్వపడేలా చేసిందని ప్రశంసలు కురిపించారు.

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘ఆసియా కప్ 2025 ఫైనల్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌‌పై అద్వితీయ విజయం సాధించిన మన క్రికెట్ జట్టుకు హృదయపూర్వక అభినందనలు. మీ అసాధారణ నైపుణ్యం, అంకితభావం.. జట్టు కృషి మొత్తం దేశాన్ని గర్వపడేలా చేశాయి. ఫైనల్‌లో కీలక ప్రదర్శన, సీరిస్‌లో అద్భుత ప్రతిభ కనబరించిన తెలుగు స్టార్ ప్లేయర్‌ తిలక్‌ వర్మకు(Tilak Varma) ప్రత్యేక అభినందనలు. వర్మ ప్రదర్శన నిజంగా ప్రశంసనీయం’ అని కొనియాడారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement