సాక్షి, తాడేపల్లి: నల్లజర్ల పోలీసు బాధితులు తాజాగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఘటన అనంతర పరిణామాలను బాధితులు.. వైఎస్ జగన్ కు వివరించారు. పోలీసులు తమను బెదిరించడం, థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, నడిరోడ్డుపై నడిపించిన తీరును కార్యకర్తలు వైఎస్ జగన్ తెలిపారు.
అనంతరం పార్టీ కార్యకర్తలతో వైఎస్ జగన్ మాట్లాడారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్.. కేడర్ ఎవరూ భయపడవద్దు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అక్రమ కేసులు, వేధింపులపై పార్టీ తరఫున న్యాయ సహాయం అందిస్తాం. చట్టాన్ని చేతిలోకి తీసుకుని పోలీసులు వ్యవహరించిన తీరు కరెక్ట్ కాదు. అక్రమ కేసులు పెట్టిన వారు భవిష్యత్‌లో చట్టప్రకారం తప్పకుండా శిక్ష అనుభవిస్తారు అని హామీ ఇచ్చారు.

ఇదిలా ఉండగా.. వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ కార్యకర్తలు ఆయన ఫ్లెక్సీ వద్ద పొట్టేలు బలి ఇచ్చారంటూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. అనంతరం వారిపై దారుణంగా కొట్టిన పోలీసులు నడిరోడ్డుపై నడిపించారు.


