‘రాయలసీమకు చంద్రబాబు మరణశాసనం’ | Ysrcp Mla Tatiparthi Chandrasekhar Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

‘రాయలసీమకు చంద్రబాబు మరణశాసనం’

Feb 26 2026 7:59 PM | Updated on Feb 26 2026 8:13 PM

Ysrcp Mla Tatiparthi Chandrasekhar Comments On Chandrababu

సాక్షి, తాడేపల్లి: తనపై ఉన్న అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి సీఎం చంద్రబాబు రాయలసీమ ప్రాజెక్టులకు ఉరి బిగిస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ మండిపడ్డారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు చేసుకున్న చీకటి ఒప్పందాలను ఎండగట్టారు. తెలంగాణలో తనపై ఉన్న కేసులను కొట్టేయించుకోవడం కోసమే చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అటకెక్కించారని చంద్రశేఖర్ ఆరోపించారు.

తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా అక్కడి సీఎం చెప్పిన మాటలపై చంద్రబాబు ఎందుకు వివరణ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రాయలసీమను శాశ్వతంగా కరువులో ఉంచి, తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ‘బ్రీఫ్డ్ మీ బ్రదర్’తో లాలూచీ పడ్డారని మండిపడ్డారు.తెలంగాణ రోజుకు 8 టీఎంసీల నీటిని తోడుకుపోతుంటే, ఏపీకి కేవలం 0.63 టీఎంసీల సామర్థ్యం మాత్రమే ఉండటం చంద్రబాబు అసమర్థతకు నిదర్శనమన్నారు. పగలు ప్రజల ముందు బీజేపీతో బంధం ఉన్నట్టు నటిస్తూ, రాత్రికి కాంగ్రెస్‌తో ‘హాట్ లైన్’ చర్చలు జరపడం బాబు నైజమన్న చంద్రశేఖర్.. ఏపీలో కాంగ్రెస్‌తో విరోధులుగా ఉంటూ, తెలంగాణలో మాత్రం ఆ పార్టీతోనే అంటకాగుతున్నారని దుయ్యబట్టారు.

ఓటుకు నోటు కేసు పత్రాలు తగలబడ్డాయన్న వార్తల వెనుక ఉన్న మర్మమేమిటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు వెలిగొండ ప్రాజెక్టు పనులపై చంద్రబాబు ‘క్యాట్ వాక్’లు చేస్తూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలిగొండ ప్రాజెక్టు ఘనత వైయస్సార్ కుటుంబానిదేనని... చంద్రబాబుది శంకుస్థాపనల డ్రామా మాత్రమేనని స్పష్టం చేశారు. రాయలసీమలో ఏ ప్రాజెక్టు చూసినా వైఎస్సార్, వైఎస్‌ జగన్ కృషి కనిపిస్తుందని చంద్రశేఖర్ తెలిపారు.

పుట్టిన గడ్డ  సీమకైనా, పిల్లనిచ్చిన మామకైనా వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని.. ఇప్పటికైనా తన స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేయవద్దని చంద్రశేఖర్ హితవు పలికారు. మరోవైపు రాష్ట్ర చరిత్రలో శాసనసభ వ్యవహారాలకు నేడు ఒక దుర్దినమని, మండలి చైర్మన్ సంతకాన్నే ఫోర్జరీ చేసే స్థాయికి కూటమి ప్రభుత్వం దిగజారిందని విమర్శించారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే..

ఇద్దరు నాయుడుల నాటకాలు..
సీఎం, నీటిపారుదలశాఖ మంత్రి ఇద్దరు నాయుడు బ్రదర్స్ కలిసి.. ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద నాటకాలు ఆడుతున్నారు. వెలిగొండ ప్రాజెక్టు సందర్శనలో చంద్రబాబు నానా తంటాలు పడుతూ క్యాట్‌ వాక్‌లు చేస్తున్నాడు. జీవితంలో నిజాలే చెప్పని చంద్రబాబు.. తాను ఎప్పుడూ అబద్దాలు చెప్పనంటూ పెద్ద అబద్దం చెప్పారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల ఉపయోగం లేదని కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. పక్క రాష్ట్రం రోజుకూ 8 టీఎంసీల నీటిని తోడుకుని పోతూ.. ప్రాజెక్టులు నిర్మించుకుంటుంటే, మరోవైపు పైనున్న కర్ణాటక నీ హయాంలో నిర్మించిన ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తును మరింత పెంటుకుంటూ.. అదనంగా 120 టీఎంసీల నీటిని వాడుకుంటోంది.

తెలంగాణ  రాష్ట్రం 8 టీఎంసీలు రోజూ తీసుకుంటుంటే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్న నీటి సామర్ధ్యం  0.63 టీఎంసీలు మాత్రమే.  ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉంటుందా?. వాటర్ బోర్డు వ్యతిరేకించినా, పక్క రాష్ట్రం కాదన్న వైయస్సార్సీపీ హాయంలో రూ.990 కోట్లు ఖర్చుపెట్టి రాయలసీమ ఎత్తిపోతల పనులు కొనసాగిస్తే.. చంద్రబాబు ప్రభుత్వం ఆ పనులను ముందుకు తీసుకెళ్లడానికి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోంది. మీ స్వార్ధం కోసం రాయలసీమ భవిష్యత్తును తాకట్టు పెట్టే ప్రయత్నం చేయడం దుర్మార్గం.

పిల్లనిచ్చిన మామైనా- జన్మనిచ్చిన సీమైకైనా వెన్నుపోటే..
ఇవాళ శ్రీశైలంలో 795 అడుగులు నీటిమట్టం ఉంటే మచ్చుమర్రి ద్వారా మనం 0.33 టీఎంసీల నీటిని వాడుకుంటున్నాం. రెండోది 834 అడుగుల నీరున్నప్పుడు మాల్యాల దగ్గర 0.3 టీఎంసీలు మాత్రమే తీసుకునే పరిస్ధితి ఉంది. ఇంకా మీరు సిగ్గుపడరా? ఇన్నేళ్లు సీఎంగా పనిచేసిన మీరు జన్మనిచ్చిన రాయలసీమకు ఏం చేయలేదన్న బాధ్యత మీకు లేదా? కనీస ఇంగితం పనిచేయ లేదా? మీ స్వార్థరాజకీయాలు కోసం పిల్లనిచ్చిన మామైనా, జన్మనిచ్చిన రాయలసీమైనా మీకు ఒక్కటే. వెన్నుపోటు తప్పదు. ఇదే మీ స్వార్థరాజకీయం. మీ వైఖరిపై కచ్చితంగా వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుంది.

40 ఏళ్ల నుంచి ఉన్న తెలుగుగంగకు నిధులు కేటాయించి పనులు చేశారా? 3 టీఎంసీల నీళ్లు తీసుకుంటే.. రాయలసీమతో పాటు నెల్లూరు కూడా సస్యశ్యామలం అవుతుంది. దాన్ని కూడా మోసం చేశారు. రాయలసీమ నుంచి హంద్రీనీవా కాలువ పనుల్లోనూ మోసమే. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 18 కిలోమీటర్ల మేర 15వేల క్యూసెక్కుల సామర్ధ్యం పెంచడం కోసం రూ.500 కోట్లు ఖర్చు చేసాం. 

రెండోది శ్రీశైలం కుడి గట్టు కాలుల కింది 30వేల క్యూసెక్కులు పెంచాం. తెలుగుగంగకు రూ.500 కోట్లు ఖర్చు చేసి, హంద్రీనీవా కాలువ వెడల్పు పెంచాం. నిప్పుల వాగు ద్వారా నెల్లూరుకు 30 వేల క్యూసెక్కులు వెళ్లేలా పనులు ప్రారంభించారు. మరోవైపు హంద్రీనీవా సుజల స్రవంతి సామర్ధ్యాన్ని 2వేల క్యూసెక్కుల నుంచి 6,300 క్యూసెక్కులకు పెంచేలా పనులు ప్రారంభించిన వైఎస్‌ జగన్ వాటిని త్వరిత గతిన పూర్తి చేసే కార్యక్రమం చేపట్టారు. అవుకు 2 టన్నెల్స్ ద్వారా దాదాపు  రూ.260 కోట్లు ఖర్చు చేసి 20వేల క్యూసెక్కుల నీళ్లని పంపించగలిగాం. మూడో టన్నెల్ పనులుకు కూడా వైఎస్‌ జగన్ ప్రభుత్వ హయాంలోనే మొదలుపెట్టాం.

రాయలసీమ ప్రాజెక్టులన్నీ వైఎస్‌ జగన్ హయాంలోనే..
27 టీఎంసీల సామర్ధ్యమున్న గండికోట రిజర్వాయరు పనుల్లో రూ.1000 కోట్లు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ బకాయిలు పెట్టి పారిపోయిన చంద్రబాబు... ఇవాళ వెలిగొండ ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ ఇవ్వలేదని సిగ్గులేకుండా వైయస్.జగన్ ని విమర్శిస్తున్నాడు. గండికోట ఆర్ అండ్ ఆర్ పూర్తి ఆర్ అండ్ ఆర్ వైయస్.జగన్ హయాంలో రూ.1000 కోట్లు చెల్లించే ప్రాజెక్టు ప్రారంభించారు. చిత్రావతి ఆర్ అండ్ ఆర్ రూ.280 కోట్లు ఇచ్చిన తర్వాతే 10 టీఎంసీలు నింపగలిగాం. బ్రహ్మంసాగర్ ప్రాజెక్టులో కూడా లీకేజీ పనులు రూ.90 కోట్లతో పూర్తి చేసి 17 టీఎంసీల నీటిని నింపాం.

వెలిగొండ ప్రాజెక్టూ వైఎస్సార్‌సీపీ ఘనతే..
వెలిగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడినప్పుడల్లా ప్యాకేజీ ఇవ్వకుండా వైయస్. జగన్ ప్రాజెక్టుని జాతికి అంకితం ఇచ్చారని చెబుతున్నాడు. అసలు నీ హాయంలో ఏడుసార్లు పోలవరం ప్రాజెక్టుని జాతికి అంకితం చేసిన ఘన చరిత్ర నీదే చంద్రబాబూ. వెలిగొండను మేం ఆ విధంగా చేయలేదు. 2021 జనవరి 13  నాటికి వైయస్.జగన్ ప్రభుత్వంలో ఒక టన్నెల్ పూర్తి చేస్తే.. 2024 ఫిబ్రవరి నాటికి రెండో టన్నెల్ పూర్తి చేశాం. ఒక మిషన్ నిల్చిపోయిన ప్రాంతం తప్ప మిగిలిన పనంతా పూర్తి అయింది. మొదటి, రెండు టన్నెల్‌లను కలిపి జూన్‌లో నీరు విదుదల చేయడానికి మార్చి 6న వైఎస్‌ జగన్ వెలిగొండ ప్రాజెక్టు దగ్గరకి వచ్చారు. శ్రీశైలంలో 841 అడుగులు నీటిమట్టం ఉండదు కాబట్టి... జూన్‌లో వచ్చే నీటిని విడుదల చేస్తామని చెబుతూ.. రూ.950 కోట్ల ఆర్ అండ్ ఆర్ బాకీ ఉన్నాం. ఆ బకాయిలను జూన్ నాటికి చెల్లించి.. జూన్ నాటికి ఆ నీటిని నల్లమల సాగర్ కి తరలిస్తామని చెప్పారు.

ఆ రోజు వైఎస్‌ జగన్ రెండు టన్నెల్స్‌ని, నల్లమల సాగర్‌ని జాతికి అంకితం చేశారు. కానీ చంద్రబాబు మాత్రం తాను వచ్చిన ప్రతిసారీ అబద్దాలు చెప్పడం అలవాటు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలల్లో చేసిన పని కేవలం 2 కిలోమీటర్ల లైనింగ్ వర్క్ మాత్రమే. రూ.4వేల కోట్లు పెట్టుబడి పెడితే తప్ప వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కాదన్న మీరు జూన్ 2026లో ఎలా నీళ్లిస్తామని చెప్పారు. కారణం వెలిగొండ ప్రాజెక్టుకు నీళ్లు రావాలంటే శ్రీశైలంలో 840 అడగులు ఉండాలి అది జూన్ లోనే సాధ్యమవుతుంది కాబట్టి, మా హయంలో రెండు టన్నెల్స్ పూర్తి అయ్యాయి కాబట్టి.. మీకు నీళ్లివ్వడం సాధ్యమవుతుంది.

ఇదే పని ఆరోజు మేం 2025లో చెబితే.. ఇవాల్టికి మీరు ఆ పని చేయలేకపోయారు. ఫీడర్ కెనాల్ తవ్వలేదు.. రెండో కెనాల్ లో కోర్టు కేసుల వల్ల ఉండిపోయిన మిషన్ ను కోర్టు కేసుల వల్ల... డిస్ మెంటల్ చేయలేదు. మరి ఎలా నీళ్లు వదులుతున్నారు. రెండేళ్లలో మీరు రెండు దఫాలుగా రూ.200, రూ.350 కోట్లు కేటాయిస్తే.. రెండేళ్లు కలిపి కేవలం రూ.400 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. రూ.4 వేల కోట్లు అవసరం అని చెప్పిన మీరు రెండేళ్లలో కేవలం రూ.400 కోట్లే ఎలా ఖర్చు చేయగలిగారు. అటం ఆరోజు వైఎస్‌ జగన్ ప్రాజెక్టు పనులు పూర్తి చేయడం వల్లే మీకు ఇధి సాధ్యమైంది.

కానీ చంద్రబాబు మాత్రం పత్రికల్లో 1996 మార్చిలో వెలిగొండ పనులకు శ్రీకారం చుట్టామని ప్రచారం చేసుకుంటూ... ప్రాజెక్టు ఫీజబులిటీ రిపోర్టు మాత్రం 2001లో ఇచ్చారని నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. వైయస్.రాజశేఖర్ రెడ్డి  అన్ని అనుమతులు తెచ్చి.. రూ.500 కోట్లతో పనులు ప్రారంభించారు. అంటే మీ హయాంలో ఏ పనీ జరగలేదని అర్ధం అవుతుంది. 9 సంవత్సరాల సీఎంగా ఉండి.. పశ్చిమ ప్రకాశం వాసుల కలల కొండ వెలిగొండ ప్రాజెక్టుకు ఉరలేసింది నువ్వు కాదా చంద్రబాబూ?

తట్టెడు మట్టి కూడా తీయని చంద్రబాబు ప్రభుత్వం..
రూ.3543 కోట్లు వెచ్చించిన వైఎస్సార్ 2004లో అన్ని అనుమతులు తెచ్చి 3వేల క్యూసెక్కుల కెపాసిటీ ఉన్న ఒక టన్నెల్ ని 11.5 కిలోమీటర్లు, 8వేల క్యూసెక్కుల సామర్ధ్యమున్న మరో టన్నెల్ ని దాదాపు 6 కిలోమీటర్లు పూర్తి చేశారు. రెండూ కలిపి రోజుకు ఒక టీఎంసీ సామర్ధ్యంతో నిర్మించారు. నల్లమలసాగర్ సామర్ధ్యం 53.5 టీఎంసీలు కాగా.. శ్రీశైలంలో 45 రోజుల పాటు మాత్రమే 845 అడుగులపైన నీటి నిల్వ ఉంటుంది.

రోజుకొక టీఎంసీ తరలిస్తేనే 53 టీఎంసీలు నిల్వ సాధ్యం. ఇందుకు అవసరమైన సొరంగాల తవ్వకం పూర్తైంది. వెలిగొండలో ఇంకా చేయాల్సింది తీగలేరు కెనాల్, గొట్టేపాడు కాలువ, ప్రధాన కాలులను పూర్తి చేయాలి. ఎర్రగొండపాలెనికి నీరు రావాలంటే తీగలేరు కెనాల్ పూర్తి చేయాలి. ఒక తట్టెడు మట్టి కూడా తీయకుండానే మేమేం చేశామని చెప్పుకుంటున్నారు.

నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో 30 మండలాల ప్రజల 15.25 లక్షల మంది తాగునీటి అవసరాలు తీర్చే ఈ ప్రాజెక్టుపై చంద్రబాబు ఇలాంటి బాగోతాలు చేయడం సిగ్గుచేటని చంద్రశేఖర్ మండిపడ్డారు. ఐరన్ రాడ్లకు రిబ్బన్లు కట్టి కటింగ్‌లు చేసిన చరిత్ర చంద్రబాబు సొంతమైతే.. బాధ్యతతో ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం చేసిన చరిత్ర వైయస్సార్ దని స్పష్టం చేశారు. ఇప్పటికైనా పగలు బీజేపీతో సంసారం, రాత్రి కాంగ్రెస్‌తో ప్రేమాయణం చేస్తూ... రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేయొద్దని సూచించారు.

పాత్రికేయుల ప్రశ్నలకు బదులిస్తూ...
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై  టీటీపీ నాయకుడే కేసు వేసినా మేం పనులు ఆపకుండా రూ.990 కోట్లు ఖర్చు చేశాం. తెలంగాణాలో ఒక ప్రభుత్వ కార్యాలయంలో ఫైల్స్ తగలబడ్డాయి. అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇవన్నీ టీటీపీ స్వార్ధ రాజకీయం కోసమే జరుగుతున్నాయి. రాయలసీమ ప్రాంత ప్రజలకు భరోసానిచ్చేలా.. ఎత్తిపోతల నుంచి రోజుకు 3 టీఎంసీలు తరలిస్తే 101 టీఎంసీలు ఎత్తిపోతల దగ్గర నుంచి తీసుకునే హక్కు మనకు ఉంది. 20 ఏళ్లలో ఎప్పుడూ 101 టీఎంసీల నీటిని వాడుకున్న చరిత్ర ఏపీకి లేదు.

తెలంగాణా రాష్ట్రం 8 టీఎంసీలను 770 అడుగుల నుంచి 800 అడుగుల లూపే తీసుకెళ్తున్న మాట వాస్తవం కాదా? ఏపీలో అతిపెద్ద భూభాగమున్నా.. 834 అడుగుల వరకు 0.3 టీఎంసీల మాత్రమే మనం తీసుకెళ్లగలం. మరి ఈ సోయ ప్రభుత్వానికి లేదా? తెలంగాణాతో ఎందుకు లాలూచీ పడుతున్నారు. చర్చను సజావుగా జరపకుండా అడిగిన ప్రశ్నలకు బదులివ్వకుండా సభను ఎందుకు తప్పదోవ పట్టిస్తున్నారు. ? అడిగిన ప్రశ్నలకు ఎందుకు బదులివ్వడం లేదని నిలదీశారు.

రాష్ట్ర చరిత్రలో శాసనసభ వ్యవహారాలలో ఇవాల ఒక దుర్దినం. మండలి  చైర్మన్ గారి సంతకాన్నే ఫోర్జరీ చేయడం దురదృష్టకరం.  తనకు సంబంధం లేదని చైర్మన్ గారు చెబుతున్నారు.  లఘు చర్చకు అనుమతించిన తర్వాత ముందే ప్రభుత్వం ప్రకటన ఎలా ఇస్తుంది?  చర్చకు అనుమతించిన తర్వాత స్టేట్ మెంట్ ఇవ్వడానికి అనుమతి ఇచ్చినట్లు ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ ఒక పేపర్ చూపించారు. చైర్మన్‌ నేను ఇవ్వలేదని చెబుతుంటే.. పది మంది మంత్రులు పేపర్ చూస్తూ ఛైర్మన్ పోడియం చుట్టుముట్టారు.  అంటే దొంగలు ఎవరు? ఆయన హక్కులకి కూడా భంగం కలిగించడం కాదా? తాను సంతకం చేయడం లేదని చెబుతున్నా.. ఉందని వాదిస్తున్నారంటే తప్పు ఎవరు చేసినట్లు? ఇది  రాజ్యంగ విరుద్దమైన పరిణామమని మండిపడ్డారు.

చర్చకు మా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ అడిగితే చైర్మన్ అనుమతిచ్చారు. ఆయన స్టేట్ మెంట్ చదువుతుంటే ఆ విజువల్స్, వీడియో ఆడియో బయటకు రాదు.. కానీ మంత్రి పయ్యావుల కేశవ్ అర్ధరాత్రి అయినా చర్చిస్తామన్న వీడియో మాత్రమే బయటకు విడుదల చేశారు. చర్చ జరగక ముందే మంత్రులు ఎందుకు పోడియం చుట్టుముట్టారు. కావాలనే చేస్తున్నారని చైర్మన్ చెప్పినా వినలేదు. కూటమి నేతలు అధికార మదాన్ని ప్రదర్శించారు. చర్చ జరిగితే చంద్రబాబు కుటుంబానికే నష్టం కాబట్టి అధికార పార్టీ చర్చ నుంచి నుంచి పారిపోయిందే అధికార పార్టీ. రూ.321 నెయ్యి రేటు ఉంటే.. ఇందాపూర్ రూ.658 కి కట్టబెట్టడానికి మాత్రమే టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ఒక స్కామ్ కోసం తీసుకొచ్చిన స్కీమే కల్తీ లడ్డూ అని తేల్చి చెప్పారు.

అధికార పార్టీ చీకటి దందాలు, లూఠీ వ్యాపారాలు, ఆర్దిక లావాదేవీలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.. పక్క రాష్ట్రం ఉపముఖ్యమంత్రి చనిపోతే ఆ లింకులు కూడా హెరిటేజ్ కంపెనీకే బయటపడుతుంటే మా కంపనీ హెరిటేజ్ ఫైనాన్స్ చేస్తుంది.. ఆ విమానం కూలిపోతుందని కలగన్నామా అని చెబుతున్నాడు. వీఎస్ ఆర్ విమానాల్లో మీరే జల్సాలు చేస్తున్నారు. విమానయానశాఖా మంత్రి మీ పార్టీ నేత. చనిపోయిన ఎన్సీపీ ఎమ్మెల్యేలు కుట్ర ఉందని దుమ్మెత్తి పోస్తున్నారు. దాన్ని ఖండించకపోగా లోకేష్ కామెడీ చేస్తున్నాడని మండిపడ్డారు. దేశంలో ఎక్కడ అవినీతి జరిగినా ఆ లింకులు చంద్రబాబు దగ్గరకు వస్తున్నాయని తేల్చి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement